tournament
-
హైదరాబాద్, రాజస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
జైపూర్: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒక విజయం, 2 ఓటములు, ఒక ‘డ్రా’తో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానానికి చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 36/0తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.హిమతేజ (176 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... తన్మయ్ అగర్వాల్ (126 బంతుల్లో 79; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో మెరిశాడు. అభిరత్ రెడ్డి (46; 7 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రాకు అంగీకరించారు. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేయగా... రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన రాజస్తాన్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టుకు ఒక పాయింట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీ బాదిన రాజస్తాన్ బ్యాటర్ శుభమ్ గర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు లభించింది.స్కోరు వివరాలు:హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్ 425; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) అజయ్ సింగ్ 79; అభిరత్ రెడ్డి (సి) కునాల్ సింగ్ రాథోడ్ 46; రోహిత్ రాయుడు (సి) కునాల్ సింగ్ రాథోడ్ (బి) అనికేత్ చౌధరి 0; హిమతేజ (నాటౌట్) 101; రాహుల్ సింగ్ (నాటౌట్) 47; ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (65 ఓవర్లలో 3 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–56, 2–57, 3–196, బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 22–0–84–1, దీపక్ హుడా 6–2–17–0, మహిపాల్ లొమ్రోర్ 18–0–86–0, అరాఫత్ ఖాన్ 5–1–18–1, అనికేత్ చౌధరి 6–0–18–1, అభిజీత్ తోమర్ 6–0–39–0 -
మహిళల హాకీ ఇండియా లీగ్ వేలం... ఉదిత దుహాన్‌కు రూ. 32 లక్షలు
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) మహిళల టోర్నమెంట్‌కు సంబంధించి మంగళవారం వేలం కార్యక్రమం జరిగింది. భారత జట్టు డిఫెండర్ ఉదిత దుహాన్‌కు అత్యధికంగా రూ. 32 లక్షలు లభించాయి. శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు ఉదితను కొనుగోలు చేసింది. ఉదిత తర్వాత రెండో అత్యధిక మొత్తం నెదర్లాండ్స్ డ్రాగ్ ఫ్లికర్ యిబ్బీ జాన్సన్‌కు దక్కింది. ఒడిశా వారియర్స్ జట్టు రూ. 29 లక్షలకు యిబ్బీ జాన్సన్‌ను సొంతం చేసుకుంది. భారత జట్టు సభ్యులు లాల్రెమ్సియామి (రూ. 25 లక్షలు; శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్), సునెలితా టొప్పో (రూ. 24 లక్షలు; ఢిల్లీ ఎస్జీ పైపర్స్), సంగీత కుమారి (రూ. 22 లక్షలు; ఢిల్లీ ఎస్జీ పైపర్స్)లకు కూడా పెద్ద మొత్తమే లభించింది. భారత సీనియర్ జట్టు కెపె్టన్ సలీమా టెటెను ఒడిశా వారియర్స్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఇషిక (రూ. 16 లక్షలు), నేహా గోయల్ (రూ. 10 లక్షలు)లను కూడా ఒడిశా వారియర్స్ కొనుగోలు చేసింది. సూర్మా హాకీ క్లబ్ భారత మాజీ కెప్టెన్ సవితా పూనియా (రూ. 20 లక్షలు), షర్మిలా దేవి (రూ. 10 లక్షలు), నిక్కీ ప్రధాన్ (రూ. 12 లక్షలు)లను దక్కించుకుంది. హెచ్ఐఎల్ టోర్నీ డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాంచీ, రౌర్కెలాలలో జరుగుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల 50 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 3–2తో ఒయుత్సెసెగ్ యెసుగెన్ (మంగోలియా)పై నెగ్గింది. ఈ బౌట్లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ప్రతీ రౌండ్లోనూ పంచ్‌లతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. చివరకు విజయం నిఖత్నే వరించింది. అయితే మరో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ బౌట్లో ఊహించని రీతిలో అనర్హతకు గురై వెనుదిరిగింది. 75 కేజీల విభాగంలో ఓ రూర్కే ఆయిఫే (ఐర్లాండ్)తో తలపడుతుండగా లవ్లీనా రిఫరీ మూడో హెచ్చరికకు గురైంది. దీంతో మూడో రౌండ్ పూర్తవకముందే డిస్క్వాలిఫైతో బౌట్ నుంచి నిరాశగా ని్రష్కమించింది. 57 కేజీల కేటగిరీలో సాక్షి చౌదరి 5–0తో సెల్మౌని చాహిర (అల్జీరియా)పై ఏకపక్ష విజయం సాధించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ (54 కేజీలు)కు ప్రిక్వార్టర్స్‌లో 2–3తో ఫే నియ (ఐర్లాండ్) చేతిలో చుక్కెదురైంది. -
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద మెగా టోర్నీ ’ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్‌షిప్ టోర్నీ షురూ
లక్డీకాపూల్: తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లోని గేమ్‌పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగే ఈ టోరీ్నలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్‌పాయింట్‌తో కలిసి తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని అగ్రశ్రేణి జూనియర్ ప్లేయర్లు తనుజ్ రెడ్డి పులి, అర్నా ద్వివేది, సాన్వి శ్రీతో పాటు పురుషుల, మహిళల టాప్ ర్యాంకర్లు రోహన్ ఆర్యగోండి, ఐశ్వర్య పయ్యన్ బరిలో ఉన్నారు. బాలుర అండర్–11, అండర్–13, అండర్–15, బాలికల అండర్–13, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పురుషుల 35, 45 వయో విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. శనివారం క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ జరుగనున్నాయి. రాష్ట్రానికి చెందిన స్క్వాష్ క్రీడాకారులకు గొప్ప వేదిక అయిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్‌ను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు టోర్నమెంట్ చైర్మన్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఏజ్ గ్రూప్ పోటీల్లో అగ్ర ఆటగాళ్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి టోర్నమెంట్లో బలమైన పోటీ ఉంటుందన్నారు. -
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు వేళాయె...
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ సమరానికి నేడు తెరలేవనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ మెరుపులతో టి20లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్, రన్నరప్ బెజవాడ టైగర్స్ల మధ్య బుధవారం జరిగే పోరుతో రెండో సీజన్ మొదలవుతుంది. ప్రతి రోజు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 27న టైటిల్ పోరు నిర్వహిస్తారు. పోటీలన్నీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే జరుగుతాయి. తొలి సీజన్లో ఆఖరి మెట్టుపై తడబడి టైటిల్ కోల్పోయిన బెజవాడ టైగర్స్ ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హిట్టర్ రికీ భుయ్పై గంపెడాశలు పెట్టుకున్న ఈ ఫ్రాంచైజీ రూ.8.10 లక్షలతో అతన్ని రిటెయిన్ చేసుకుంది. ఏపీఎల్‌లో ఇదే అత్యధిక మొత్తం కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నిరూపించుకున్న ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లు కూడా ఈ లీగ్‌లో ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విహారి రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూ. 6.60 లక్షలతో కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టులో అతనిదే అత్యధిక పారితోషికం. భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున స్టార్‌గా బరిలో ఉన్నాడు. అతన్ని రూ. 6 లక్షలకు లయన్స్ కొనుగోలు చేసింది. వీళ్లతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అకాడమీలలో రాణించిన కుర్రాళ్లు ఈ లీగ్‌తో ఏసీఏ సెలక్టర్ల కంట పడాలని ఆశిస్తున్నారు. ‘మన ఆంధ్ర–మన ఏపీఎల్’ అనే నినాదంతో పూర్తిగా స్థానిక కుర్రాళ్లకే అవకాశమిచ్చిన ఈ లీగ్‌ను చూసే ప్రేక్షకులకు కూడా నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారు. ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. విజేతగా నిలిచిన క్రికెట్ అభిమానులకు ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియాల మధ్య నవంబర్ 23న జరిగే టి20 మ్యాచ్ టికెట్లను ఉచితంగా బహుకరించనున్నారు. -
పవర్‌గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్‌గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్‌గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్‌కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్‌గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో సీఎం కప్ పోటీలు
తిరుపతి అర్బన్: తిరుపతి నగరంలో సోమవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి వి. మురళీకృష్ణ ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 4700 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీతోపాటు పలు కళాశాలల్లోనూ పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 8గంటల నుంచే క్రీడలు ప్రారంభమవుతాయని వివరించారు. ఆ మేరకు క్రీడాకారులకు అవసరం అయిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
కార్ల్‌సన్‌కు ‘చెక్’
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు 4–2తో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. ఒక మ్యాచ్ నాలుగు గేములుగా జరిగే ఈ టోర్నీలో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో 2–2తో సమమైంది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు బ్లిట్జ్‌లో రెండు టైబ్రేక్స్ను నిర్వహించగా రెండు గేముల్లోనూ ప్రజ్ఞానందే గెలిచాడు. అయితే ఓవరాల్‌గా నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ 16 మ్యాచ్ పాయింట్లతో టోర్నీ విజేతగా నిలువగా, భారత టీనేజ్ సంచలనం 15 పాయింట్లతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మేటి ర్యాంకింగ్ ఆటగాళ్లను కంగుతినిపించిన భారత ఆటగాడికి 5, 6వ రౌండ్ గేమ్‌ల్లో ఎదురైన ఓటములు ప్రతికూలమయ్యాయి. -
కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఉత్కంఠ విజయం
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం కాలికట్ హీరోస్తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–2 (15–13, 12–15, 15–10, 12–15, 15–13) సెట్ల తేడాతో గెలిచింది. కోల్‌కతా కెప్టెన్ అశ్వల్ రాయ్ అద్భుత ప్రదర్శనతో తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు టార్పెడోస్ జట్టుతో కొచ్చి బ్లూ స్పైకర్స్ తలపడుతుంది. -
JIO: ఇ గేమింగ్ టోర్నమెంట్.. భారీ క్యాష్‌ప్రైజ్
MEDIATEK AND JIO GAMING MASTERS 2.0: గేమర్లకు శుభవార్త తెలిపింది జియో నెట్వర్క్! ఇండియాలో ఇ గేమ్స్ ఆడే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ జియో, చిప్సెట్ల తయారీ సంస్థ మీడియాటెక్‌లు సంయుక్తంగా గేమింగ్ మాస్టర్ 2.ఓ పేరుతో ఆలిండియా రేంజ్లో గేమింగ్ పోటీలను నిర్వహిస్తున్నాయి. క్యాష్ ప్రైజ్ గేమింగ్ మాస్టర్ 2.ఓ పోటీలో పాల్గొనే ప్రొఫెషనల్ గేమర్స్, ఇ గేమింగ్‌లో ఉత్సాహం ఉన్నవారి కోసం భారీ క్యాష్ ప్రైజులు రెడీగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం రూ. 12.50 లక్షల వరకు ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సిరీస్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. రిజిస్ట్రేషన్లు గేమింగ్ మాస్టర్ 2.ఓకి సంబంధించి రిజిస్ట్రేషన్లు నవంబరు 12 నుంచి ప్రారంభం అవుతాయి. వెబ్‌పోర్టల్ https://play.jiogames.comకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గేమింగ్ మాస్టర్ 2.ఓ టోర్నమెంట్ నవంబరు 23 నుంచి జనవరి 10 వరకు జరుగుతాయి. జియో యూజర్లు, జియో నాన్ యూజర్లు ఈ గేమింగ్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. ఎటువంటి పార్టిసిపేషన్ ఫీజు లేదు. ఇలా చూడొచ్చు గేమింగ్‌మాస్టర్ 2.ఓలో జరిగే అన్ని గేమ్స్‌ని ఆసక్తి ఉన్న వారు జియోగేమ్స్ వాచ్, జియోటీవీ హెచ్డీ ఈస్పోర్ట్స్ ఛానల్, ఫేస్బుక్ గేమింగ్, జియోగేమ్స్ యూట్యూబ్ ఛాన్సల్‌లో చూడవచ్చు. మీడియాటెక్ జియో రాకతో ఇండియాలో ఇంటర్నెట్ యూసేజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో ప్రముఖ మొబైల్ నెట్వర్క్ కంపెనీగా జియో సుస్థిర స్థానం దక్కించుకుంది. మరోవైపు మీడియాటెక్ ప్రాసెసర్‌తో ఇండియాలో అనేక మొబైల్ ఫోన్లు తయారయ్యాయి. ముఖ్యంగా మీడియా టెక్ అందిస్తోన్న హెలియో జీ సిరీస్ చిప్సెట్లపై గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. కాగా 5జీ నెట్‌వర్క్‌పై మరింత సమర్థంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మీడియాటెక్ సంస్థ డైమెన్సిటీ 5జీ పేరుతో సరికొత్త చిప్సెట్లను అందుబాటులోకి తెచ్చింది. -
జార్జియాలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
అట్లాంటా : జార్జియాలోని కమ్మింగ్ సిటీలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జార్జియాలోని అట్లాంటా రిక్రియేషన్ క్లబ్లో ఈ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో 11 నుంచి 19 ఏళ్ల వయస్సు వారికి పోటీలు నిర్వహిస్తున్నారు. కోవిడ సంక్షోభం తర్వాత జరుగుతున్న మొదటి జాతీయ స్థాయి టోర్నమెంట్ ఇదే. అట్లాంటా రిక్రియేషన్ క్లబ్ అనేది ఉత్తర అట్లాంటా జార్జియన్లకు ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ ప్లే మరియు కోచింగ్ అరేనాతో సేవలందించే ప్రీమియం సౌకర్యం. ఇక్కడ జరుగుతున్న పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 160 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. -
హృదయ విదారకం: పిచ్‌పైనే కుప్పకూలిన క్రికెటర్
పుణె: ఆరోగ్యంతోనే ఉంటే క్రీడల్లో ఆడాలి. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ వంటి ఆటల్లో జాగ్రత్తగా పాల్గొనాలి. లేకపోతే దారుణ పరిస్థితులు వస్తాయి. తాజాగా ఓ క్రికెటర్ క్రీజులో ఉండగానే కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు వచ్చి చూడగానే మృతిచెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. దీంతో తోటి ఆటగాళ్లంతా విషాదంలో మునిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పుణేలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాట్స్‌మన్ బంతిని కొట్టగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా ఫీల్డర్ చేతిలోకి బంతి రావడంతో వెనుతిరిగారు. అయితే నాన్-స్ట్రైక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్‌మెన్ బాబు నల్వాడే వెనక్కి తిరిగొచ్చేసి నిలబడ్డాడు. ఈ సమయంలో కొద్దిసేపటి తర్వాత బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని చూసిన ఎంపైర్ ఆటగాళ్లను పిలిచారు. వారు వచ్చి చూసేసరికి నల్వాడే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో హృదయాలను పిండేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఉండి ఆ కొద్దిసేపటికి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఏమైందో అర్థంకాక అందరూ కంగారుపడ్డారు. వెంటనే అతడిని దగ్గర్లోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. అయితే గుండెపోటు కారణంగానే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. फलंदाजी करताना मैदानावरच आला हार्ट अटॅक... पुणे जिल्ह्यातील स्थानिक क्रिकेटपटूचा उपचारापुर्वीच मृत्यू... अंगावर काटा आणणारा व्हायरल व्हिडिओ... pic.twitter.com/fHuvTSygrb — Pranali Kodre (@Pranali_k18) February 17, 2021 గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ -
ఒక్క కరోనా కేసు.. ఆరు టోర్నీల మ్యాచ్‌లు వాయిదా
మెల్బోర్న్: ప్రపంచ వ్యాప్తంగా మొదటి నుంచి ఇప్పటిదాకా కఠినమైన కరోనా వైరస్ ప్రొటోకాల్ పాటిస్తున్న దేశమేదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే! ఒక్క కరోనా కేసు నమోదైనా సరే పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. బుధవారం నమోదైన ఒక్క కరోనా కేసు ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా మెల్బోర్న్లో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఆరు టోర్నీలు జరుగుతున్నాయి. మెల్బోర్న్లో ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్లో ఓ కార్మికుడికి కోవిడ్–19 సోకినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఆ హోటల్లో బస చేసిన ఆటగాళ్లు గురువారం ఈ టోర్నీలలో ఆడే మ్యాచ్‌లన్నీ వాయిదా వేశారు. అతనితో కాంటాక్టులో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించారు. మళ్లీ వారందరికీ పరీక్షలు చేసి నెగెటివ్ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. -
‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కాగడ వెలిగించి టోర్నమెంట్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 9 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నమెంట్లో 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి. (చదవండి: సీఎం జగన్ బర్త్‌డే: 20వేల మందితో భారీ ర్యాలీ) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తిలో వజ్ర సంకల్పం ఉండాలని..దీనికి నిదర్శనం సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఆయన ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. యువశక్తి అంతా ఈ రోజు ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ లో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొన్నారు. అత్యత్తమ ప్రతిభ కనబరిచి గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి సచిన్, ధోనీ లాంటి వారు ఎదిగారని తెలిపారు. ప్రతి ఏడాది ఇదే స్థాయిలో అన్ని క్రీడలు బాట్మింటన్, కబడ్డీ, టెన్నిస్ అన్ని రంగాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. -
గ్రీకు వీరుడు
లండన్: అంతర్జాతీయ టెన్నిస్‌లోకి వేగంగా దూసుకొచ్చిన గ్రీస్ యువ సంచలనం స్టెఫనోస్ సిట్సిపాస్ ప్రతిష్టాత్మక విజయంతో సత్తా చాటాడు. వరల్డ్ టాప్–8 ఆటగాళ్లు పాల్గొన్న సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సిట్సిపాస్ విజేతగా నిలిచాడు. కెరీర్లో ఇప్పటి వరకు ఇంకా ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా నెగ్గకపోయినా... దిగ్గజ ఆటగాళ్లను దాటి అతను ఈ ఏడాది చివరి టోర్నీ అయిన ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ సిట్సిపాస్ 2 గంటల 35 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–6 (7/4) స్కోరుతో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 21 ఏళ్ల 3 నెలల వయసులో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన సిట్సిపాస్... 2001 (నాడు 20 ఏళ్ల లీటన్ హెవిట్) తర్వాత అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్స్ చేరిన తొలి సీజన్లోనే సిట్సిపాస్ విజేతగా నిలవడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఫైనల్ పోరులో తొలి సెట్ సుదీర్ఘ ర్యాలీలతో సాగింది. ఇద్దరి మధ్య సాగిన హోరాహోరీ పోరుతో సెట్ టైబ్రేక్‌కు చేరింది. ఇక్కడ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌లతో దాడి చేసిన థీమ్ దూసుకుపోయాడు. 5–6 వద్ద సిట్సిపాస్ ఒక సెట్ పాయింట్‌ను కాపాడుకోగలిగినా, ఆ తర్వాత థీమ్ పదునైన సర్వీస్‌ను రిటర్న్ చేయలేక సెట్ కోల్పోయాడు. అయితే సిట్సిపాస్ రెండో సెట్లో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న అనం తరం చక్కటి వాలీ, ఫోర్ హ్యాండ్ విన్నర్లతో ‘డబుల్ బ్రేక్’ సాధించాడు. ఈ ఒక్క సెట్లోనే అతను 10 విన్నర్లు కొట్టడం విశేషం. తుది ఫలితం మూడో సెట్‌కు చేరిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పోటా పోటీగా తలపడ్డారు. ముందుగా 1–1తో స్కోరు సాగగా, బ్యాక్‌హ్యాండ్ విఫలం కావడంతో ఒత్తిడికి లోనైన థీమ్ 1–3తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే వరుసగా మూడు గేమ్ లు గెలుచుకొని 4–3తో ముందంజలో నిలిచాడు. కానీ స్కోరు మళ్లీ టైబ్రేక్‌కు చేరింది. ఇక్క డా 4–0తో సిట్సిపాస్ ఆధిక్యంలో నిలిచిన తర్వాత స్కోరు మళ్లీ 4–4తో సమమైంది. ఈ దశలో ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా సిట్సిపాస్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. తొలి సెట్ ఓడిన తర్వాత ఒక ఆటగాడు టైటిల్ సాధించడం 2005 (నల్బందియన్–అర్జెంటీనా) తర్వాత ఇదే మొదటిసారి. సిట్సిపాస్‌కు 26 లక్షల 56 వేల డాలర్లు (రూ.19 కోట్ల 8 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్థానం...ప్రశంసనీయం సాక్షి క్రీడావిభాగం: రెండేళ్ల క్రితం ఇటలీలోని మిలాన్‌లో జరిగిన నెక్ట్స్ జనరేషన్ ఏటీపీ ఫైనల్స్‌ను సిట్సిపాస్ ప్రేక్షకుడిగా చూశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ అండర్–21 ఆటగాళ్ల కోసం ఏటీపీ కొత్తగా ప్రవేశపెట్టిన టోర్నీ అది. సరిగ్గా ఏడాది తర్వాత అదే టోర్నీలో బరిలోకి దిగిన అతను విజేతగా నిలిచాడు. ఇప్పుడు మరో సంవత్సరం తిరిగేలోగా అసలైన ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను చేజిక్కించుకొని సగర్వంగా నిలిచాడు. ఈ గ్రీక్ ఆటగాడి ప్రస్థానం ఎంత వేగంగా సాగిందో తాజా ఫలితంతో అర్థమవుతుంది. 2018లో జనరేషన్ నెక్ట్స్ ట్రోఫీ నెగ్గాక రాబోయే ఏడాది కోసం అతను తనకంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడు. అందులో ఏటీపీ ఫైనల్స్‌లో ఆడాలనేది తన కల అంటూ చాలా సార్లు అతను చెప్పుకున్నాడు. గత నెలలో షాంఘై ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఓడించిన తర్వాత అతనికి ఫైనల్స్‌లో చోటు ఖాయమైంది. సీజన్ చివరి టోర్నీకి అర్హత సాధించడమే కాదు సిట్సిపాస్ చాంపియన్‌గా కూడా నిలవడం విశేషం. 2016లో జూనియర్ వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్నప్పుడు ఇదే టోర్నీకి స్పేరింగ్ (ప్రాక్టీస్) పార్ట్నర్గా కూడా సిట్సిపాస్ వచ్చాడు. నాడు తనతో కలిసి ఆడిన థీమ్‌పైనే ఆదివారం ఫైనల్లో అతను గెలుపొందాడు. 2019 సిట్సిపాస్‌కు అద్భుతంగా సాగింది. టాప్–10లో ఉన్న ఆటగాళ్లలో 9 మందిపై అతను విజయాలు సాధించడం చెప్పుకోదగ్గ ఘనత. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించడంతో ఈ గ్రీస్ ఆటగాడిపై అందరి దృష్టీ పడింది. తాజా ఏటీపీ ఫైనల్స్ గ్రూప్ విభాగంలో మెద్వెదేవ్, జ్వెరేవ్లపై నెగ్గి నాదల్ చేతిలో ఓడిపోయాడు. అయితే సెమీస్‌లో ఫెడరర్‌పై సాధించిన చక్కటి విజయం అతనికి ఊపు తెచ్చింది. తమ దేశ ప్రధాని కిరియాకొస్ మిట్సొటకిస్ స్వయంగా మ్యాచ్‌కు హాజరై ప్రోత్సహిస్తుండగా అదే జోరులో టైటిల్ కూడా గెలుచుకున్నాడు. రాబోయే 2020లో సిట్సిపాస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టగలడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ 6వ ర్యాంక్‌తో అతను ఈ ఏడాదిని ముగిస్తున్నాడు. తాజా ఫామ్ చూస్తే అంతర్జాతీయ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేయగల సామర్థ్యం అతనిలో ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు 7 ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్ సిట్సిపాస్. గతంలో దిమిత్రోవ్ (బల్గేరియా–2017లో), అలెక్స్ కొరెత్యా (స్పెయిన్–1998లో), జాన్ మెకన్రో (అమెరికా– 1978లో), గిలెర్మో విలాస్ (అర్జెంటీనా–1974లో), ఇలీ నస్టాసే (రొమేనియా–1971లో), స్టాన్ స్మిత్ (అమెరికా–1970లో) ఈ ఘనత సాధించారు. 2 వరుసగా నాలుగేళ్లు ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో కొత్త ప్లేయర్ విజేతగా నిలువడం ఇది రెండోసారి. ఆండీ ముర్రే (2016), దిమిత్రోవ్ (2017), జ్వెరెవ్ (2018) గత మూడేళ్లలో చాంపియన్స్‌గా నిలిచారు. 1988 నుంచి 1991 మధ్య ఇలాగే జరిగింది. గతంలో బోరిస్ బెకర్ (1988), స్టెఫాన్ ఎడ్బర్గ్ (1989), ఆండ్రీ అగస్సీ (1990), పీట్ సంప్రాస్ (1991) ఈ టైటిల్స్‌ను గెలిచారు. రెండో సెట్లో నేను అంత బాగా ఎలా ఆడగలిగానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. బహుశా తుది ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఆడటం వల్ల అలాంటి ప్రదర్శన వచ్చిందేమో. అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్స్ ఆరంభంలో నా ఆటపై నేనే అసహనానికి గురయ్యాను. బ్రేక్ పాయింట్లు కోల్పోయాను. సర్వీస్ నిలబెట్టుకోలేకపోయాను. టై బ్రేక్ దాకా వెళ్లాల్సి వచ్చింది. అయితే చివరకు అత్యుత్తమంగా నిలవడం సంతోషం. ప్రేక్షకులు నాకు మద్దతు పలకడం కూడా నాలో ఉత్సాహాన్ని పెంచింది. ఈ ట్రోఫీని అందుకోవడం చాలా గర్వంగా అనిపిస్తోంది. – సిట్సిపాస్ -
మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో సాక్షి
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బెలారస్లో శనివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం సెమీఫైనల్లో సాక్షి 6–2తో ఎల్మీరా గంబరోవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 7–2తో లైస్ న్యూన్స్ ఒలివీరా (బ్రెజిల్)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మరియానా సస్తిన్ (హంగేరి)తో సాక్షి తలపడుతుంది. -
అమెరికాలోని ఫ్లోరిడాలో భారీ కాల్పులు
-
ఫ్లోరిడాలో భారీ కాల్పులు
జాక్సన్విల్లే: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్ నగరాన్ని ఆదివారం తుపాకీ కాల్పులు వణికించాయి. జాక్సన్విల్ ల్యాండింగ్ ప్రాంతంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక అనుమానితుడు మరణించాడు. ‘ప్రజలు జాక్సన్విల్ ల్యాండింగ్ ప్రాంతానికి దూరంగా ఉండండి. ప్రస్తుతం అక్కడికి వెళ్లడం సురక్షితం కాదు’ అని స్థానిక పోలీసు అధికారి ఒక ట్వీట్లో హెచ్చరించారు. మ్యాడెన్ వీడియోగేమ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ప్రాంతంలో కాల్పులు జరిగాయని దాని నిర్వాహకులు ఒక ట్వీట్లో తెలిపారు. సెయింట్ జాన్స్ నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతం వినోద కార్యక్రమాలకు పేరుగాంచింది. -
జాతీయస్థాయి హాకీ టోర్నీ ప్రారంభం
తొలిరోజు ఆతిథ్య ‘అనంత’ జట్టు విజయంతో బోణీ అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత క్రీడా మైదానంలో సోమవారం సాయంత్రం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఫస్ట్ ఇన్విటేషన్ హాకీ అకాడమీస్ చాంపియన్ షిప్ - 2017 టోర్నీ ప్రారంభమైంది. హాకీ ఇండియా పర్యవేక్షణలో జూన్ మూడో తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్లో ఢిల్లీ, ఎర్నాకులం, ఊటీ, చెన్నై, తిరుచ్చి, కోవెల్పట్టీ, గుంటూరు, ధర్మవరం, అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్లు పాల్గొంటున్నాయి. మొదటి మ్యాచ్ అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, ఎమ్మిటీ హాకీ అకాడమీ (ఎర్నాకులం) జట్లు తలపడ్డాయి. మొదట ఎమ్మిటీ జట్టు గోల్ సాధించి ముందంజలో ఉండగా తర్వాత అనంతపురం జట్టు పుంజుకుని మొదటి హాఫ్‌లో ఏకంగా 4–1 గోల్స్ సాధించింది. అనంతరం సెకండ్ హాఫ్‌లోను 3 గోల్స్ సాధించి అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు 7–1తో విజయం సాధించింది. జట్టులో సాయికుమార్ ఏకంగా 4 గోల్స్ సాధించి విజయాన్నందించాడు.›రెండవ మ్యాచ్‌లో ధర్మవరం, ఊటీ జట్లు తలపడగా ఊటీ జట్టు 3–1తో విజయం సాధించింది. క్రీడలను ఆస్వాదించండి క్రీడాకారులు క్రీడలను ఆస్వాదించాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సూచించారు. సోమవారం సాయంత్రం అనంత క్రీడా గ్రామంలో టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయనతోపాటు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ దామోదర్, ఎస్కేయూ మాజీ వీసీ రామకృష్ణారెడ్డి, టోర్నీ డైరెక్టర్ డాన్నీకెన్నీ, ఆడిటర్ వేణుగోపాల్‌రెడ్డి, సప్తగిరి క్యాంఫర్ హనీఫ్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ సభ్యులు సూర్యప్రకాష్, గోపీనాథ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జాతీయస్థాయి టోర్నీని అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఘని, ట్రెజరర్ బాబయ్య, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, పీఈటీ నాగరాజు, కోచ్‌లు లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్, చౌడేశ్వరప్రసాద్, వైద్యులు సయ్యద్ హుస్సేన్, ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడోరోజు 8 మ్యాచ్‌లు
భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ వైద్య విద్యాలయం ఆధ్వర్యంలో రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న అంతర్ వైద్యకళాశాలల క్రికెట్ పోటీల్లో మూడో రోజైన బుధవారం వివిధ కళాశాలల జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలలో 8 జట్లు ఇంటిబాట పట్టాయి. రంగరాయ మెడికల్ కళాశాల పీడీ డాక్టర్ స్పర్జన్ రాజు పోటీలను పర్యవేక్షిస్తున్నారు. మూడో రోజు పోటీలను రంగరాయ ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రారంభించారు. మూడోరోజు విజేతలు వీరే మమత డెంటల్ కళాశాల( కర్నూలు)పై రంగరాయ వైద్య కళాశాల (కాకినాడ), నారాయణ మెడికల్ కాలేజ్ (నెల్లూరు) పై ఆశ్రం వైద్య కళాశాల( ఏలూరు), కోనసీమ మెడికల్ కళాశాల (అమలాపురం)పై కాటూరి మెడికల్ కాలేజ్ ( గుంటూరు), సీకేఎస్ తేజ డెంటల్‌కాలేజ్ తిరుపతిపై గుంటూరు మెడికల్ కళాశాల, నిమ్రా మెడికల్ కళాశాల (విజయవాడ)పై శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల (తిరుపతి), ప్రభుత్వ డెంటల్ కళాశాల విజయవాడపై ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల విశాఖ పట్నం, లెనోరా డెంటల్ కాలేజ్(రాజానగరం)పై ఉస్మానియా మెడికల్ కళాశాల (హైదరాబాద్)లు, రిమ్స్ కాకతీయ మెడికల్ కళాశాల వరంగల్‌పై రిమ్స్ కడప విజయం సాధించాయి. రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు స్పర్జన్‌రాజు పేర్కొన్నారు. -
అంతర్‌వైద్య కళాశాలల క్రికెట్ పోటీలు ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రా నుంచి పాల్గొన్న 42 జట్లు భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతర్ వైద్యకళాశాలల పురుషుల క్రికెట్ పోటీలు సోమవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, రంగరాయమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రారంభించారు. రెండు రాష్ట్రాల వైద్యకళాశాలల క్రికెట్ పోటీలను ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దక్షిణ భారత క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ పోటీలకు ఉభయ రాష్ట్రాలకు చెందిన 42 జట్లు పాల్గొన్నాయని రంగరాయ మెడికల్ కళాశాల అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలిరోజు 42 జట్లకు 18 జట్లకు మాత్రమే క్రీడా పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన తొమ్మిది జట్లు క్వార్టర్ దశకు చేరాయి. క్రీడాకారులకు, పీడీలకు వసతి, భోజన సౌకర్యాన్ని రాంకోసాలో ఏర్పాటు చేశారు. అనంతరం పతకావిష్కరణ, బెలూన్లను గాలిలో వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కే స్పర్జన్‌రాజు,, డీఎస్పీ పల్లపు రాజు, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ) శాంతిరామ్ మెడికల్ కళాశాల(నం«ధ్యాల)పై గెలిచారు. టీఈస్ఐఎంఎస్(కుప్పం) మమత వైద్యకళాశాల (ఖమ్మం)పై, రంగరాయ మెడికల కళాశాల(కాకినాడ) వీఎస్ఎల్ డెంటల్ కళాశాల (రాజమండ్రి)పై, ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖ) ఫాతిమా మెడికల్ కళాశాల(కర్నూల్ )పై, డాక్టర్ పికిమ్స్(గన్నవరం) వైద్యకళాశాల ఎంఎన్ఆర్( హైదరాబాద్)పై, డాక్టర్ సుధానాగేశ్వరరావు(గన్నవరం) సెయింట్ జోషప్ డెంటల్ కళాశాల(ఏలూరు)పై, మమత డెంటల్ కళాశాల(ఖమ్మం) సిబార్ డెంటల్ కళాశాల(గుంటూరు)పై గెలిచారు. నారాయణ మెడికల్ కళాశాల(నెల్లూరు) ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల (నెల్లూరు)పై గెలిచారు. ఆశ్రమ్ మెడికల్ కళాశాల (ఏలూరు)గాయత్రి మెడికల్ కళాశాల(విశాఖ)పై గెలిచారు. -
అంతర్‌వైద్య కళాశాలల క్రికెట్ పోటీలు ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రా నుంచి పాల్గొన్న 42 జట్లు భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతర్ వైద్యకళాశాలల పురుషుల క్రికెట్ పోటీలు సోమవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, రంగరాయమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రారంభించారు. రెండు రాష్ట్రాల వైద్యకళాశాలల క్రికెట్ పోటీలను ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దక్షిణ భారత క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ పోటీలకు ఉభయ రాష్ట్రాలకు చెందిన 42 జట్లు పాల్గొన్నాయని రంగరాయ మెడికల్ కళాశాల అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలిరోజు 42 జట్లకు 18 జట్లకు మాత్రమే క్రీడా పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన తొమ్మిది జట్లు క్వార్టర్ దశకు చేరాయి. క్రీడాకారులకు, పీడీలకు వసతి, భోజన సౌకర్యాన్ని రాంకోసాలో ఏర్పాటు చేశారు. అనంతరం పతకావిష్కరణ, బెలూన్లను గాలిలో వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కే స్పర్జన్‌రాజు,, డీఎస్పీ పల్లపు రాజు, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ) శాంతిరామ్ మెడికల్ కళాశాల(నం«ధ్యాల)పై గెలిచారు. టీఈస్ఐఎంఎస్(కుప్పం) మమత వైద్యకళాశాల (ఖమ్మం)పై, రంగరాయ మెడికల కళాశాల(కాకినాడ) వీఎస్ఎల్ డెంటల్ కళాశాల (రాజమండ్రి)పై, ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖ) ఫాతిమా మెడికల్ కళాశాల(కర్నూల్ )పై, డాక్టర్ పికిమ్స్(గన్నవరం) వైద్యకళాశాల ఎంఎన్ఆర్( హైదరాబాద్)పై, డాక్టర్ సుధానాగేశ్వరరావు(గన్నవరం) సెయింట్ జోషప్ డెంటల్ కళాశాల(ఏలూరు)పై, మమత డెంటల్ కళాశాల(ఖమ్మం) సిబార్ డెంటల్ కళాశాల(గుంటూరు)పై గెలిచారు. నారాయణ మెడికల్ కళాశాల(నెల్లూరు) ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల (నెల్లూరు)పై గెలిచారు. ఆశ్రమ్ మెడికల్ కళాశాల (ఏలూరు)గాయత్రి మెడికల్ కళాశాల(విశాఖ)పై గెలిచారు. -
క్రికెట్ టోర్నీ ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత క్రీడా మైదానంలో ఆదివారం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్మారక ఉద్యోగుల క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. మొత్తం 22 జట్లు పాల్గొంటున్నాయి. తొలిరోజు ఎనిమిది జట్లు తలపడ్డాయి. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షులు పగడాల మల్లికార్జున, కార్యదర్శి బీఆర్ ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పోటీలు ప్రతి ఆదివారం అనంత క్రీడా మైదానం, నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షులు జొన్నా జయప్రకాష్, ఆర్డీటీ ఏడీ నాగప్ప, సభ్యులు మధుసూదన్ ఆచారి, అలీ పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. = గుంతకల్లు రైల్వేస్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుంతకల్లు రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేశారు. జట్టులో శ్రీకాంత్‌రెడ్డి 61, శివ 54 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. జట్టులో జగన్ 48 పరుగులు సాధించాడు. = రెండవ మ్యాచ్ ఏపీ ట్రాన్స్‌కో, ఇరిగేషన్ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఏపీ ట్రాన్స్ కో జట్టు 174 పరుగులు చేసింది. జట్టులో రమణ 66 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇరిగేషన్ జట్టు 145 పరుగులు చేసింది. జట్టులో కిషోర్ 55 పరుగులు సాధించాడు. = మూడవ మ్యాచ్‌లో ఎలక్ట్రిక్, రిలయన్స్ జట్లు తలపడ్డాయి. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎలక్ట్రిక్ జట్టు 132 పరుగులు సాధించింది. జట్టులో దినేష్ 42 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రిలయన్స్ జట్టు 129 పరుగులు చేసింది. జట్టులో యోగి 35 పరుగులు సాధించాడు. = చివరి మ్యాచ్ టీచర్స్, సాంఘిక సంక్షేమ శాఖ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీచర్స్ జట్టు 165 పరుగులు చేసింది. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ జట్టు 65 పరుగులకే కుప్పకూలింది.