train accedent
-
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగిలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా సమీపంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగిలు పట్టాలు తప్పాయి. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నల్పూర్ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే.. ఈ ఘనటలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.‘‘శనివారం ఉదయం 5.31 గంటలకు ఖరగ్‌పూర్ డివిజన్లోని నల్పూర్ స్టేషన్ గుండా వెళుతుండగా 22850 సికింద్రాబాద్-షాలిమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పార్శిల్ వ్యాన్, రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు’’ అని సౌత్ ఈస్టర్న్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. రైలు మధ్య నుంచి బయటి పట్టాలపైకి మారుతున్న సమయంలో పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్ నుంచి వైద్య సహాయం కోసం సహాయ రైళ్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారుల తెలిపారు.Four coaches of Secunderabad-Shalimar Express took an unexpected derail in Nalpur, near Howrah. @AshwiniVaishnaw, you might wanna check if your trains are following Google Maps... Enough is enough! Maybe it’s time for you to take the exit route too. Please Resign!! pic.twitter.com/Xvp1WAvMb1— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) November 9, 2024చదవండి: మణిపూర్‌ను మంటల్లోకి నెట్టేసింది -
పట్టాలు తప్పిన హౌరా–ముంబై రైలు
జంషెడ్పూర్/రాంచీ/చాయ్‌బసా/కోల్‌కతా: జార్ఖండ్‌లోని సెరాయ్‌కెరా–ఖర్సావాన్ జిల్లాలో హౌరా–ముంబై మెయిల్ రైలు పట్టాలు తప్పింది. 18 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. జంషెడ్పూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని బారాబంబూ స్టేషన్ దగ్గర్లోని పోటోబెబా గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి సమీపంలోనే గూడ్సు రైలు ఒకటి పట్టాలు తప్పిందని, రెండు ఘటనలు ఒకేసారి జరిగాయా అనేది తేల్చాల్సి ఉందని సౌత్‌ఈస్ట్‌రైల్వే అధికార ప్రతినిధి ఓం ప్రకాశ్ చరణ్ చెప్పారు. అయితే ఆగిఉన్న గూడ్సు రైలును హౌరా–ముంబై రైలు ఢీకొట్టిందని వెస్ట్ సింఘ్భమ్ డెప్యూటీ కమిషనర్ కుల్దీప్ చౌదరి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.1 లక్ష ఇవ్వనున్నారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటన జరిగిన రైల్వే మార్గం గుండా వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. -
జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ఇద్దరి మృతి
రాంచీ: జార్ఖండ్‌లో హౌరా-సీఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మందికి గాయాలు కాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ డివిజన్లో అర్ధరాత్రి 3గం. దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో ప్రయాణికులకు సంబంధించినవి 16 బోగీలు, ఒకటి పవర్ కార్ బోగీ, మరోకటి పాంట్రీ బోగీ అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమదానికి గల కచ్చితమై కారణం తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. #WATCH | Jharkhand: Train No. 12810 Howara-CSMT Express derailed near Chakradharpur, between Rajkharswan West Outer and Barabamboo in Chakradharpur division at around 3:45 am.Two people have lost their lives so far.(Visuals from the spot) pic.twitter.com/zYvhUHI9cV— ANI (@ANI) July 30, 2024Train no.12810 Howrah -CSMT Mail got accident in Jharkhand near Tatanagar. pic.twitter.com/6mQyUBeIWT— Santu1213 (@santu_1213) July 30, 2024 -
అమృత్సర్: రైల్లో మంటలు.. ప్రయాణికుల హహాకారాలు
పంజాబ్‌లోని అమృత్సర్ రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో అమృత్సర్-హౌరా మెయిల్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు డ్రైవర్‌కు సమాచారం అందించడంతో వెంటనే రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైలులో మంటలు చెలరేగాయని తెలియగానే కొందరు ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగిపోయారు.ఈ నేపధ్యంలో ఓ మహిళా ప్రయాణికురాలికి కాలికి గాయమైంది. దీంతో అధికారులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. మంటలు చెలరేగిన కంపార్ట్మెంట్ను రైలు నుంచి వేరు చేశాక, మిగిలిన రైలును అధికారులు గమ్యస్థానానికి తరలించారు. కాగా ఇటీవల మధ్యప్రదేశ్‌లోని విదిశాలో జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. వెంటనే భద్రతా సిబ్బంది రైలును ఆపి, మంటలను అదుపులోకి తెచ్చారు. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన ట్రైన్.. ‘అన్‌స్టాపబుల్’
ప్రస్తుతం సోషల్‌మీడియాలో దేశవ్యాప్తంగా ఒక వార్త వైరల్ అవుతుంది. డ్రైవర్ లేకుండానే కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు గూడ్స్ రైలు పరుగులు తీసింది. గంటకు సుమారు 80 కిలామీటర్ల వేగంతో దూసుకెళ్లింది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. దీంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్‌పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదీ సంగతి.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అన్‌స్టాపబుల్ పేరుతో సినిమా .. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కథ ఇలాంటి సంఘటనతో ముందే ఒక సినిమా వచ్చిందని తెలుసా.. అన్‌స్టాపబుల్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా అచ్చు ఇలానే జరుగుతుంది. ఎంతో ఉత్కంఠతో సాగే ఈ సినిమా 2010లో విడుదల అయింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా టోనీ స్కాట్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సినిమా కథ మొత్తం ఒక ట్రైన్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం జరిగిన సంఘటన మాదిరే.. అన్‌స్టాపబుల్ సినిమా కథ ఉంటుంది. ఇందులో కూడా ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పొరపాటు వల్ల ట్రాక్ నుంచి కదిలిన ట్రైన్ ఆటోమెటిక్‌గా వెళ్లిపోతుంది. ఆ ట్రైన్లో ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. ఏ మాత్రం పొరపాటు జరిగితే భారీ విధ్వంసం జరగడం ఖాయం. లోకో పైలట్ లేకుండానే వేగం పెంచుకుంటూ గంటకు 100 కిలోమీటర్లతో దూసుకెళ్తుంది. ఆ సమయంలో ఎదురుగా 150 మంది పిల్లలతో ఒక ట్రైన్ వస్తుంది. ఇలాంటి సమయంలో ఆ విద్యార్థులు ఎలా బయటపడ్డారు..? అనే సీన్స్ నరాలు తెగె ఉత్కంఠతను పెంచుతాయి. ఆ తర్వాత ట్రాక్‌పై ప్రమాదానికి గురైన ఒక లారి పడి ఉంటుంది.. అప్పుడేం జరుగుతుంది..? అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ఈ ఘటన దాటిన తర్వాత 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్ వేగం తగ్గించుకోవాలి కానీ అందులో లోకో పైలట్ లేడు.. వేగం తగ్గకపోతే విధ్వంసమే.. ఆ సమయంలో డైరెక్టర్ మలుపు తిప్పిన ట్విస్ట్ ఏంటి..? చివరకు టన్నుల కొద్ది కెమికల్స్‌తో ఉన్న ఆ ట్రైన్‌ను ఎలా ఆపారు.. ఆ సమయంలో జరిగిన సీన్స్ తలుచుకుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రాణాలతో చెలగాటం లెక్క ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. చూడకుంటే చూసేయండి మిమ్మల్ని మరో ప్రపంచంలోకి పక్కాగ తీసుకెళ్తుంది. ఫైనల్ ట్విస్ట్ ఎమిటంటే ఇది రియల్ సంఘటన అని కొన్ని అమెరికన్ పత్రికలు ప్రచురించాయి. 78 km without driver. Goods train ran over: Forgot to start and apply handbrake; Train reached Punjab from Jammu, stopped by placing wooden stopper#Train pic.twitter.com/dDIj7G78py — Dushyant Kumar (@DushyantKrRawat) February 25, 2024 -
పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. విషాద ఘటన!
మహబూబ్‌నగర్: రైలు పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. అకస్మాతుగా రైలు రావడంతో బైక్ పూర్తిగా ధ్వంసమై దంపతులు ప్రాణాలతో బయటపడిన సంఘటన బుధవారం డోకూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరూర్‌కి చెందిన అశోక్ తన భార్యకు వైద్యం నిమిత్తం డోకూర్‌కు వచ్చాడు. గ్రామంలో ఉన్న రైల్వే గేట్ వద్ద వారం రోజుల కిందట రైల్వే అధికారులు అండర్‌పాస్ నిర్మాణం చేపట్టి ప్రయాణికుల రాకపోకలకు ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియకపోవడంతో గతంలో ఉన్న మార్గంలో వచ్చిన అశోక్ తన ద్విచక్రవాహనాన్ని (అండర్‌పాస్ నిర్మాణం పక్క నుంచి) పట్టాల పైనుంచి దాటిస్తున్న క్రమంలో అకస్మాతుగా రైలు వచ్చింది. దీంతో పట్టాలపై బైక్‌ను వదిలేసి పక్కకు తప్పుకొన్నాడు. ఈ సంఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా.. దంపతులు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. బైక్ రైలు ముందు భాగంలో చిక్కుకపోవడంతో లోకోపైలెట్ రైలును నిలిపివేశాడు. స్థానిక సిబ్బంది సాయంతో రైలు కింద చిక్కుకున్న బైక్‌ను తొలగించిన అనంతరం రైలు ముందుకు కదిలింది. ఈ సంఘటనతో రైలు దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇవి చదవండి: వివాహిత మృతి! భర్తే వేధించి, పురుగుల మందు తాగించాడని.. -
గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే..
ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులో మంటలు చెలరేగి, మూడు బోగీలు దగ్ధమయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలియజేశారు. కాగా గడచిన పదేళ్లలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా, వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం! 2012: మే 22న ఆంధ్రప్రదేశ్‌లో హంపి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు, హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నాయి. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతోపాటు, ఒక బోగీలో మంటలు చెలరేగడంతో దాదాపు 25 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2014: మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లోని ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2016: నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పడంతో, 150 మంది ప్రయాణికులు మృతి చెందారు. 150 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2017: ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. 2017: ఆగస్ట్ 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మృతి చెందారు. 60 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2022: జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ ప్రాంతంలో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. 2023: జూన్ 2న ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 291 మంది మృతి చెందారు. 1,1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే.. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి.. కుడి చేతిపై పచ్చబొట్టు
బాలానగర్: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (35) మృతిచెందిన ఘటన బాలానగర్ రైల్వేస్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి కుడి చేయిపై హితేష్ అనే పచ్చబొట్టు ఉందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
రైలు ఢీకొని తల్లీకూతుళ్లు మృతి
నెల్లూరు(క్రైమ్): మూత్ర విసర్జనకు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకూతుళ్లు రైలు ఢీకొనడంతో మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన ఆత్మకూరు బస్టాండు సమీపంలో రైలు పట్టాలపై ఆదివారం సాయంత్రం జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఫాతిమా అలియాస్ ఫాతిమున్నీసా(60)కు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహమైంది. పెద్ద కుమార్తె మెహరున్నీసా శింగరాయకొండ, చిన్నకుమార్తె గౌసియా(35) కందుకూరులో ఉంటున్నారు. రొట్టెల పండగకు తల్లీకూతుళ్లు కలిసి ఆదివారం పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకొచ్చారు. దర్గాను సందర్శించుకుని హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో మెహరున్నీసా రైల్వేస్టేషన్లో ఉండగా ఫాతిమున్నీసా, గౌసియా మూత్రవిసర్జన చేసేందుకు రైలుపట్టాల వెంబడి ఆత్మకూరు బస్టాండ్ వైపు వెళ్లారు. రైల్వే బ్రిడ్జి సమీపంలోకి వచ్చేసరికి నిజాముద్దీన్ వెళ్తున్న రైలు వారిని ఢీకొంది. ఫాతిమున్నీసా అక్కడికక్కడే మృతి చెందగా గౌసియా రోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు 108 సాయంతో చికిత్స నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గౌసియా మృతి చెందింది. తల్లి, చెల్లెలు మృతితో మెహరున్నీసా కన్నీటిపర్యంతమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటనా స్థలాన్ని రైల్వే ఎస్సై ఎన్.హరిచందన పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు నెల్లూరుకు బయలు దేరారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. పికెట్ ఏర్పాటు గతంలోనూ ఇదే ప్రాంతంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. రైల్వే పోలీసులు గస్తీని ఏర్పాటు చేసి అటువైపు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రయాణికులు పెడచెవిన పెట్టి రైలు పట్టాలపై రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ఆదివారం తల్లీకూతుళ్లు రైలుపట్టాలపై వెళుతుండగా, అటుగా వెళుతున్న వారు వారిస్తుండగానే రైలు వారిని ఢీకొంది. దీంతో రైల్వే పోలీసులు అక్కడ పికెట్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులు అటుగా వెళ్లకుండా చర్యలు చేపట్టారు. -
రైలు కిందపడియువకుడి ఆత్మహత్య
మహబూబ్‌నగర్: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్భర్ కథనం ప్రకారం..మహబూబ్‌నగర్‌లోని బండ్లగేరికి చెందిన సయ్యద్ ముజఫర్(22) శనివారం పట్టణంలోని వీరన్నపేట సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తలతో పాటు కాళ్లు, చేతులు పూర్తిగా తెగిపోవడంతో గుర్తించలేనివిధంగా మారింది. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగానికి తరలించారు. అయితే మృతి చెందిన యువకుడు డిగ్రీ పూర్తి చేసి తండ్రితో పాటు ఇటుకల వ్యా పారం చేస్తున్నాడు. మృతుడి కుటుంబసభ్యు లు సయ్యద్ ముజఫర్ మృతిపై అనుమానం ఉందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
‘సమతా’కు తప్పిన ముప్పు.. ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పార్వతీపురం టౌన్: పార్వతీపురం గుండా వెళ్తున్న సమతా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయన్న విషయం పార్వతీపురం పట్టణమంతా వ్యాపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం టౌన్–పార్వతీపురం స్టేషన్ల మధ్యలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు చేపట్టిన మెగాబ్లాక్ పనులు పూర్తి చేసిన రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాయంత్రం 5 గంటల సమయంలో లైన్స్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో రావాల్సిన నిజాముధ్దీన్– విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్ మరికొద్ది సేపటిలో 3వ నంబర్ ఫ్లాట్‌ఫారం మీదికి రానున్నదని రాత్రి 7.20 గంటలకు పార్వతీపురం స్టేషన్లో అనౌన్స్ చేశారు. పది నిమిషాల్లో హారన్ కొడుతూ 7.30 గంటలకు సమతా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ మాత్రమే 3వ నంబర్ ప్లాట్ ఫాం మీదికి వచ్చింది. విడిపోయిన బోగీలలో వెనక బోగిలో ఉన్న గార్డ్ ఈ విషయాన్ని గమనించి ఇంజిన్ లేకున్నా కదులుతున్న బోగీలను ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆపడంతో బోగీలన్నీ పార్వతీపురం టౌన్–పార్వతీపురం స్టేషన్ల మధ్యలో ఆగిపోయాయి. ఇంజిన్ లేకుండా బోగీలన్నీ సుమారు అరకిలోమీటరు వరకు ప్రయాణించాయి. గార్డు అప్రమత్తం కావడం వల్ల పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. మెగాబ్లాక్లో భాగంగా చేపట్టిన మెయింటనెన్స్ పనుల్లో ఎక్కడో ఒకచోట కపిలింగ్ ఊడిపోవడం వల్ల ఇంజిన్ నుంచి బోగీలు వేరు పడ్డాయని టెక్నీషియన్లు తెలిపారు. తర్వాత ఇంజిన్‌ను వెనక్కి తీసుకువెళ్లి టెక్నీషియన్లు కపిలింగ్ వేయడంతో రాత్రి 9 గంటల సమయంలో పార్వతీపురం స్టేషన్ నుంచి గంటన్నర ఆలస్యంగా సమతా ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం బయలుదేరింది. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
టెక్కలి రూరల్: విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ రైల్వే గేటు వద్ద పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం గూడ్స్ రైలు విశాఖపట్నం నుంచి నౌపడా మీదుగా భువనేశ్వర్ వైపు వెళ్తుండగా ఆ సమాచారం తెలియని గేట్‌మ్యాన్ గేటు వెయలేదు. ఈ విషయాన్ని గుర్తించిన గూడ్స్ డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. హారన్ వేయడంతో అప్రమత్తమైన గేట్ మ్యాన్ హుటాహూటిన గేటు వేశారు. దీంతో రైలు అక్కడి నుంచి వెళ్లింది. గూడ్స్ డ్రైవర్ గుర్తించకపోతే పెనుప్రమాదం జరిగి ఉండేదని వాహనదారులు చెబుతున్నారు. -
పట్టాలు తప్పిన ఊటీ టాయ్ ట్రైన్
సాక్షి, చైన్నె: నీలగిరి కొండల్లో ప్రయాణించే ఊటీ టాయ్ ట్రైన్ గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. రెండు బోగీలు ట్రాక్ నుంచి బయటకు వచ్చేశాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రయాణికులను కొండ మార్గం గుండా ప్రత్యేక బస్సుల్లో మేట్టుపాళయానికి తరలించారు. నీలగిరి జిల్లాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఊటి. ఇక్కడకు రోడ్డు మార్గంలో కన్నా, రైలు మార్గంలో పయనం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బ్రిటీషు హయాంలో మేట్టు పాళయం నుంచి కున్నూరు వరకు తొలుత ఈ రైలు సేవలకు శ్రీకారం చుట్టారు. తదుపరి దశల వారీగా విస్తరించి చివరకు ఊటీ వరకు ఈ రైలు సేవలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కొండలు, లోయల మధ్య సాగే ఈ ప్రయాణంలో 208 మలుపులు, 250 వంతెనలు, 16 సొరంగ మార్గాలు, 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు ప్రయాణం నిమిత్తం ముందుగా రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం ఓ రైలు మేట్టు పాళయం నుంచి ఊటీకి బయలు దేరుతుంది. మరో రైలు ఊటీ నుంచి మేట్టుపాళయంకు బయలు దేరుతుంది. ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం కున్నూరు రైల్వే స్టేషన్‌ను దాటి వంద మీటర్లు పయనించిన ఈ రైలు హఠాత్తుగా పట్టాలు తప్పింది. వెనుక ఉన్న రెండు బోగీలు పూర్తిగా ట్రాక్ నుంచి కిందకు వచ్చేశాయి. డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అందులోని ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రయాణికులను కొండ మార్గంలో ప్రత్యేక బస్సులను రప్పించి మేట్టుపాళయంకు తరలించారు. వర్షం పడుతుండడం వల్లే రైలు బోగీలు జారి ట్రాక్ నుంచి బయటకు వచ్చి ఉంటాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ సకాలంలో రైలును ఆపి వేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. కాస్త ముందుకు వెళ్లి ఉంటే బోగీలు లోయలో పడి పెను ప్రమాదం సంభవించేదని భావిస్తున్నారు. -
ఒడిశా రైలు ప్రమాదం: పశ్చిమ బెంగాల్ యువకుని మృతదేహం బీహార్‌కు..
ఒడిశాలోని బాలాసోర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఇక్కడ ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుని, వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో పలు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. పలువురు అనాథలుగా మారారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుమారుని మృతదేహం తీసుకువచ్చేందుకు ఒడిశా వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన కుమారుని మృతదేహం మాయమయ్యిందని ఆరోపిస్తున్నాడు. తన కుమారుని మృతదేహాన్ని ఎవరో తమవారిదేనని చెప్పడంతో అధికారులు ఆ మృతదేహాన్ని బీహార్ తరలించారన్నారు. శివనాథ్ కుమారుడు విపుల్ రాయ్ ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో 288 మంది మృత్యువాతపడగా, వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. శివనాథ్ మాట్లాడుతూ తన కుమారుడు పశ్చిమ బెంగాల్‌లోని తమ ఇంటికి వస్తుండగా, ఈ రైలు ప్రమాదంలో బలయ్యాడని తెలిపారు. ప్రయాణ సమయంలో తన కుమారుడు తల్లితో.. కొద్దిసేపట్లో హౌరా వస్తున్నానని చెప్పాడన్నారు. అయితే ఇప్పుడు అతను తరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్నారు. టీవీలో కుమారుని మృతదేహాన్ని గుర్తించి, దానిని తీసుకువెళ్లేందుకు భువనేశ్వర్ వచ్చానని తెలిపారు. కళింగ ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో తన కుమారుని మృతదేహం ఉందని తెలిసి అక్కడకు వెళ్లగా, అక్కడి హెల్ప్ డెస్క్ బృందం తన కుమారుని మృతదేహం వేరెవరో తమవారిదేనని చెప్పడంతో వారితో పాటు బీహార్ పంపించామన్నారు. తన పరిస్థితి గురించి అధికారులకు చెప్పగా ఆ మృతదేహానికి డీఎన్ఏ టెస్టు నిర్వహించి, ఎవరిదో తెలుసుకుని రిపోర్టు అందజేస్తామని, దీనికి ఏడు రోజులు పడుతుందని తెలిపారన్నారు. తాను టీవీలో కుమారుని మృతదేహం చూడగానే వెంటనే ఇక్కడకు వచ్చానని, ఇంతలోనే మృతదేహం ఇలా మాయం అవుతుందని అనుకోలేదన్నారు. చదవండి: బాడీ నంబరు 151, 156, 174.. -
ఒడిశా రైలు ప్రమాదం: 40 మృతదేహాలపై కనిపించని గాయాలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కోరమండల్ నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాలలో 40 మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవు. వీరంతా ప్రమాదం అనంతరం ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపడిన కారణంగా విద్యుదాఘాతానికి గురై మరణించి ఉంటారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జీఆర్పీ సబ్- ఇన్స్పెక్టర్ పాపు కుమార్ నాయక్ పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రమాదం అనంతరం ఓవర్‌హెడ్ ఎల్టీ(లో టెన్షన్) లైన్ తాకిన కారణంగా పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి గురై మృతిచెంది ఉంటారని తెలిపారు. పోలీసు అధికారులు అందించిన వివరాల ప్రకారం బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ జూన్ 2న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలను ఢీకొంది. ఈ కారణంగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి గురై మృతి చెంది ఉంటారని భావిస్తున్నామన్నారు. మృతులలో 40 మందికి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, వీరంతా విద్యుదాఘాతానికి గురై మృతి చెంది ఉండవచ్చన్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో చీప్ ఆపరేషన్ మేనేజర్‌గా రిటైర్ అయిన పూర్ణచంద్ర మిశ్రా మాట్లాడుతూ ప్రమాదం జరిగిన దరిమిలా విద్యుత్ తీగలు బోగీలను తాకి ఉంటాయన్నారు. కాగా దుర్ఘటన జరిగిన ఆరు గంటల తరువాత సబ్ డివిజినల్ రైల్వే పోలీస్ ఆఫీసర్ ఆప్ కటక్ రంజిత్ నాయక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం దర్యాప్తు జరగనుంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం..3 నెలల ముందుగానే హెచ్చరిక -
వందేభారత్ పరుగులు.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ల నుంచి వాంగ్మూలం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన మార్గంలో ప్రభావితమైన రైలు రవాణా సేవలు పునః ప్రారంభించారు. ఈ ప్రక్రియలో అనుబంధ యంత్రాంగాలు అవిశ్రాంతంగా కృషి చేసి స్వల్ప వ్యవధిలో సహాయక, పునరుద్ధరణ చర్యలు పూర్తి చేయడం సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాయి. ఈ ప్రమాదం పట్ల నిష్పక్షపాత విచారణకు రైల్వేశాఖ నిర్ణయించింది. మరోవైపు నిబంధనల మేరకు ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రత కమిషనర్(సీఆర్ఎస్) బహనాగా ప్రమాద ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. మూడు రోజుల తర్వాత రైల్వే భద్రత కమిషనర్ శైలేష్‌కుమార్ పాఠక్ కారణాన్ని తెలుసుకోవడానికి స్వతంత్ర దర్యాప్తులో భాగంగా పరిశీలించారు. రైల్వేస్టేషన్ సిగ్నల్, కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడారు. స్వతంత్ర విచారణ నివేదిక ఆధారంగా చట్టబద్ధమైన దర్యాప్తు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఘటనపై రైల్వేశాఖ సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం.. బహనాగా రైలు ప్రమాదం కారణంగా రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా కోల్‌కతాకు వెళ్లాలనుకునే ప్రజలకు ఒడిశా ఉచిత బస్సు సేవలను అందిస్తోంది. పూరీ నుంచి 20 బస్సులు, భువనేశ్వర్ నుంచి 23, కటక్ నుంచి 16 బస్సులు ఆదివారం రాత్రి 11.30 గంటలకు కోల్‌కతాకు బయలుదేరాయి. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఆరోగ్యశాఖ మృతదేహంతో బంధువులను రవాణా చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ సన్నాహాల కోసం 58 అంబులెన్స్, డీబీసీ వాహనాలను మొహరించారు. అలాగే బహనాగా రైలు దుర్ఘటన ప్రభావంతో పూరీ, భువనేశ్వర్, కటక్ నుంచి కోల్‌కతాకు ప్రయాణించే ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించేందుకు ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్ఆర్టీసీ) కొన్ని మార్గాల్లో బస్సు సేవలను రద్దు చేసింది. రైల్వేమంత్రి ఉత్సాహం.. ప్రమాదంతో బహనాగా బజార్ స్టేషన్లో చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు కోచ్‌లను పూర్తిగా తొలగించి, పట్టాలను పునర్నిర్మించారు. రైళ్ల రవాణాకు పటిష్టత నిర్థారించిన మేరకు రాకపోకలకు అనుమతించారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం విశేషం. రైలు ప్రమాదం జరిగిన 51గంటల అనంతరం ప్రభావిత మార్గంలో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఘోరమైన దుర్ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి.. అమాంతంగా రంగంలోకి దిగారు. పట్టాల పునర్నిర్మాణం, పటిష్టతతో తొలుత నడిచిన గూడ్స్ రైలు సిబ్బందికి చేయి ఊపుతూ, సురక్షితమైన ప్రయాణం కోసం ఘటనా స్థలంలో ప్రార్థించారు. వైజాగ్ ఓడరేవు నుంచి రూర్కెలా స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గుతో కూడిన గూడ్స్‌రైలు ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలుత పట్టాలెక్కి పరుగులు తీసింది. ఆచూకీ తెలియని మృతదేహాల తరలింపు అగమ్య గోచరంగా పరిణమిస్తోంది. ఈ విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. శక్తివంతమైన సాంకేతిక కంటైనర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది. ఈ మేరకు పారాదీప్ పోర్టు వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. స్థానిక ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆరోగ్యసేవా కేంద్రాల్లో కూడ మృతదేహాలు దీర్ఘకాలం తాజాగా ఉంచే సౌకర్యాలు అందుబాటులో లేనందున ఈ పరిస్థితి తలెత్తింది. పారాదీప్ నుంచి 5శక్తివంతమైన కంటైనర్లను తీసుకు వచ్చి, స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో తాత్కాలికంగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో కంటైనర్‌లో 40 నుంచి 50 వరకు మృతదేహాలను భద్ర పరిచేందుకు వీలఅవుతుంది. వీటిలో 2నెలల వరకు మృతదేహాలు తాజాగా ఉంటాయని భావిస్తున్నారు. 2 దశాబ్దాల విపత్తు నిర్వహణ అనుభవంతో రాష్ట్రప్రభుత్వం మరో మైలురాయిని ఆవిష్కరించే దిశలో అడుగులు వేయడం ప్రధానంగా చెప్పవచ్చు. రాత్రికి రాత్రి స్థానికులు గాడాంధకార చీకటిలో సెల్ఫోన్ల కాంతిలో బాధితులను హుటాహుటిన రక్షించేందుకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన తొలి సహాయక బృందంగా నిలవడం దీనికి తార్కాణం. సత్వర చికిత్స కోసం రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా యువత ముందుకు రావడం మానవీయతకు అద్దం పట్టింది. వీరి సత్వర సహాయక చర్యలే సమారు 1,200మంది గాయపడిన ప్రయాణికుల ప్రాణాలను రక్షించగలదని పరిశ్రమల శాఖ కార్యదర్శి హేమంత్ శర్మ ప్రశంసించారు. గుర్తింపే పెను సవాల్..! కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన తదనంతర కార్యాచరణ పెను సవాల్‌గా మారింది. పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులు 1, 2 రోజల్లో పూర్తిస్థాయిలో పూర్తికావడం ఖాయం. అయితే సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వేవర్గాలు చేస్తున్న ప్రకటనలు వాస్తవ దూరంగా ఉన్నాయి. బాధితులు, మృతుల సంఖ్య ఖరారు చేయడంలో అటు రైల్వే, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుక్షణం మార్పుచేర్పులు చేస్తునే ఉంది. గుట్టలుగా పడి ఉన్న మృతదేహాల్లో సజీవంగా ఉన్న బాధిత యువకుడిని అతని తండ్రి గుర్తించాడనే వార్త దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. మరోవైపు మృతులను గుర్తించడంలో బంధువర్గాలు తల్లడిల్లుతున్నారు. ఒకే మృతదేహానికి ఇద్దరు, ముగ్గురు బంధువులు తమదిగా పేర్కొంటూ ముందుకు వస్తున్న విచారకర పరిస్థితులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఇటువంటి సందిగ్ధత తలెత్తిన పరిస్థితుల్లో ఆచూకీ లభించని మృతదేహాలుగా పరిగణించి యంత్రాంగం ఊగిసలాడిస్తోంది. మృతదేహాలను అయిన వారికి అప్పగించడంలో అత్యంత జాగరూకత ప్రదర్శిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడం అనివార్యమయ్యే అవకాశం ఉంటుందని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్‌అమృత కులంగా తెలిపారు. ఇప్పటి వరకు 170 మృతదేహాలను గుర్తించగా, దాదాపు 50కి పైగా ఆచూకీ తేలనవిగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా స్పష్టం చేశారు. నిర్ణీత ప్రక్రియ అనంతరం గమ్యస్థానానికి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వ ఖర్చులతో పలు ప్రాంతాల్లో గమ్యస్థానం వరకు బంధువర్గాలతో మృతదేహాలను వాహనాలు ఇతరేతర అనుకూల రవాణా మాధ్యమాల్లో ఉచితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరణ ధ్రువీకరణ పత్రాలు త్వరలో కుటుంబాలకు ఎలక్ట్రానిక్ లేదా పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు వివరించారు. వందేభారత్ పరుగులు.. గూడ్సు రైలు రవాణాతో పునరుద్ధరణ పటిష్టత ఖరారు కావడంతో ప్రయాణికుల రైళ్ల రవాణాకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో కూడిన పూరీ ఎక్స్‌ప్రెస్(12837)ను తొలుత నడిపించారు. పునరుద్ధరించిన ట్రాక్‌లపై సోమవారం ఉదయం 9.30 గంటలకు హౌరా–పూరీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బహనాగా బజార్ స్టేషన్‌ను సురక్షితంగా దాటింది. ఘటనా స్థలంలో మొదటి సెమీ హైస్పీడ్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యక్షంగా హాజరై, చేతులుపుతూ లోకోపైలట్లను ఉత్సాహ పరిచారని అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు రవాణా పునరుద్ధరించారు. 28 రైళ్లు ఇప్పటికే అప్ అండ్ డౌన్ లైన్లను దాటాయి. నియంత్రిత వేగంతో ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సోమవారం 2 ప్రయాణికుల రైలుసేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. వీటిలో పూరీ–పాట్నా(18449) బైద్యనాథం ఎక్స్‌ప్రెస్, ఖుర్దారోడ్–ఖరగ్‌పూర్(18022) ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. -
ఒడిశా రైలు ప్రమాదం.. 3 నెలల ముందుగానే హెచ్చరిక
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికిగల కారణాలు దర్యాప్తు రిపోర్టు వచ్చిన తరువాత వెల్లడికానున్నాయి. అయితే ఈ విషయమై ఒక అధికారి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో ఆ రైల్వే అధికారి రాబోయే ప్రమాదాన్ని 3 నెలల ముందుగానే ఊహించి, ఉన్నతాధికారులకు తెలియజేశారు. సిగ్నల్ సిస్టమ్‌లోని లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. హరిశంకర్ వర్మ అనే ఈ రైల్వే అధికారి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విధులు నిర్వహిస్తున్నారు. దీనికి ముందు ఆయన పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేశారు. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో దక్షిణ పశ్చిమ రైల్వేలో రైలు మరో లైనులో వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌లాకింగ్ కోసం తయారు చేసిన సిస్టమ్‌ను బైపాస్‌గా మార్చినపుడు లొకేషన్ బాక్సులో జరిగిన గడబిడ గురించి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆయన రైల్వే బోర్డుకు తెలియజేశారు. అలాగే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, రైలు బయలుదేరిన తరువాత డిస్పాచ్ రూట్ మారిపోతున్నదని పేర్కొన్నారు. సిగ్నల్‌కు సంబంధించిన కీలకమైన పనులు కింది ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని, దీనివలన అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం విషయానికి వస్తే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రైన్ నంబర్12481 కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహన్‌గా బాజార్ స్టేషన్‌కు చెందిన మెయిన్ లైన్లోవెళుతోంది. ఇంతలో అది పట్టాలు తప్పి లూప్లైన్లో నిలిచివున్న గూడ్సు రైలును ఢీకొంది. ఆ సమయంలో రైలు ఫుల్ స్పీడులో ఉంది. ఫలితంగా ఆ రైలుకు సంబంధించిన 21 కోచ్‌లు పట్టాలు తప్పాయి. మూడు కోచ్‌లు డౌన్‌లైన్‌లోకి చేరుకున్నాయి. నిజానికి బహన్‌గా బాజార్ స్టేషన్లో ఈ ట్రైన్‌కు స్టాపేజీ లేదు. అందుకే ఈ రైలు స్పీడుగా వెళ్లి గూడ్సును ఢీకొన్నప్పుడు దాని మూడు కోచ్‌లో డౌన్‌లైన్‌లోకి చేరుకోగా.. అటువైపుగా వస్తున్న యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలపై ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదం భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌కు సుమారు 171 కిలోమీటర్లు, ఖగర్‌పూర్ రైల్వేస్టేషన్‌కు సుమారు 166 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలోని బహన్‌గా బాజార్ స్టేషన్ వద్ద జరిగింది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: అయినవారి ఆచూకీ తెలియక.. -
బాలాసోర్ రైలు ప్రమాదం: ‘కూతురి మొండితనమే ప్రాణాలు నిలబెట్టింది’
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. ప్రమాదంలో కొందరు ఇంటిలోనివారిని కోల్పోగా, మరికొందరు క్షతగాత్రులుగా మిగిలారు. దీనికి భిన్నంగా కొందరు విచిత్ర పరిస్థితుల్లో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అటువంటి కథనం ఒకటి వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే తన 8 ఏళ్ల కుమార్తెతో పాటు ఒక తండ్రి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కటక్ వెళ్లేందుకు బయలుదేరారు. వారు కరగ్‌పూర్‌లో రైలు ఎక్కారు. వారికి థర్డ్ ఏసీలో సీటు రిజర్వ్ అయ్యింది. అయితే వారికి కిటికీ దగ్గరి సీటు లభ్యం కాలేదు. అయితే కుమార్తె తనకు కిటికీ దగ్గరి సీటు కావాలని మొండిపట్టు పట్టింది. తండ్రి ఎంత నచ్చజెప్పినా ఆ చిన్నారి మాట వినలేదు. దీంతో ఆ తండ్రి టీసీని సంప్రదించి, కిటికీ దగ్గరి సీటు కావాలని రిక్వస్ట్ చేశారు. దీనికి టీసీ సమాధానమిస్తూ మీరు మరో ప్రయాణికుని అడిగి వారి సీటు అడ్జెస్ట్ చేసుకోండని సలహా ఇచ్చారు. దీంతో ఆ తండ్రి మరో కోచ్‌లోని ఇద్దరు ప్రయాణికులను రిక్వస్ట్ చేయడంతో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఆ తండ్రీకుమారులు ఆ రెండు సీట్లలో కూర్చున్నారు. కొద్దిసేపటికి వారు ప్రయాణిస్తున్న రైలు బాలాసోర్ చేరుకున్నంతలోనే ప్రమాదానికి గురయ్యింది. ఆ తండ్రీకూతుర్లు కూర్చున్న కోచ్‌కు ఈ ప్రమాదంలో ఏమీకాలేదు. అయితే అంతకుమందు వారికి కేటాయించిన సీట్లు కలిగిన బోగీ తునాతునకలైపోయింది. ఆ బోగీలోని చాలామంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బారి నుంచి బయటపడిన ఆ తండ్రి పేరు ఎంకే దేవ్. అయిన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె మొండితనం వలనే ఈరోజు తాము ప్రాణాలతో బయటపడగలిగామన్నారు. కాగా అతని కుమార్తె చేతికి స్వల్పగాయమయ్యింది. ఆ చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ‘ ట్రైన్ టాయిలెట్లో ఉన్నాను... ఒక్క కుదుపుతో..’ -
చురుగ్గా.. పునరుద్ధరణ
భువనేశ్వర్: బహనాగా బజార్ రైల్వేస్టేషన్ ప్రాంతం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యక్షంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపునకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ నేపథ్యంలో సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించింది. మృతులు, క్షతగాత్రులకు పరిహారం చెల్లింపు చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. లెక్క తేలింది.. రైల్వేశాఖ సమాచారం ఆధారంగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య శనివారం రాత్రి 288గా ప్రకటించారు. దుర్ఘటనకు గురైన చిట్టచివరి బోగీ పునరుద్ధరించిన తర్వాత లెక్కించిన మేరకు తుది వివరాలను దాఖలు చేసినట్లు రైల్వేశాఖ పేర్కొంది. అయితే ఆదివారం ఉదయం వరకు అంచెలంచెలుగా అందిన మృతదేహాలను ఒకటికి రెండు సార్లు లెక్కించడంతో మృతుల సంఖ్య 261గా ప్రకటించాం. రైల్వేశాఖ మృతుల సంఖ్య 288గా పేర్కొనడంతో రాష్ట్రప్రభుత్వం ఇదే సంఖ్యను ప్రకటించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో ఒక్కో మృతదేహం రెండుసార్లు చొప్పన లెక్కించడంతో గణాంకాల్లో గందరగోళం చోటు చేసుకుందని వివరించారు. ఆస్పత్రులకు మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన మేరకు లెక్కించడంతో తాజా మృతుల సంఖ్య 275గా తేలిందన్నారు. జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా ఈ సంఖ్యని ధ్రువీకరించారని తెలిపారు. ఇక మృతుల సంఖ్యలో తేడాలు చోటు చేసుకునే అవకాశం లేదన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయి.. మృతదేహాలు, బాధితుల గుర్తింపు ముగిసినందున ఇకపై వ్యత్యాసం ఉండదని వివరించారు. అలాగే ఆదివారం సాయంత్రానికి 78 మృతదేహాలను బంధువులకు అప్పగించడం పూర్తయ్యిందని సీఎస్ వెల్లడించారు. మరో 10 మృతదేహాల గుర్తించామని, అప్పగింత ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ లెక్కన సమగ్రంగా 88 మృతదేహాలను గుర్తించగా.. 17 మృతదేహాలు బాలాసోర్‌కు, మిగిలిన వాటిని భువనేశ్వర్‌లోని మార్చరీకి తరలించినట్లు ప్రకటించారు. రాయగడ: బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి బీజేడీ జిల్లా శ్రేణులు శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని గాంధీపార్క్ వద్ద శనినవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రి జగన్నాథ సరక, బీజేడీ జిల్లా అధ్యక్షుడు సుధీర్ దాస్, ఎస్డీసీ చైర్పర్సన్ అనసూయ మాఝి తదితరులు పాల్గొన్నారను. ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. యువ, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న బాధిత ప్రయాణీకుల పూర్తి వివారలను అందుబాటులోకి తెచ్చారు. పలు వెబ్సైట్లలో వీటిని అప్లోడ్ చేశారు. వివరాలతో బాధితుల ఫొటోల్ని జోడించడం విశేషం. ఈ వివరాల వినియోగం పట్ల ప్రత్యేక ఆంక్షలు విధించారు. srcodisha.nic.in, bmc. gov.in అలాగే osdma.org వెబ్సైట్లో ఫొటోలు, ప్రాథమిక వివరాలు పొందుపరిచారు. ఆంక్షలు.. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతుల ఫొటోలు బంధువర్గాలు గుర్తించేందుకు మాత్రమే పరిమితం. ప్రమాదంలో తీవ్రత దృష్ట్యా పోస్ట్ చేసిన చిత్రాలు కలవర పరుస్తున్నాయి. పిల్లలు ఈ చిత్రాలను చూడకుండా నివారించాలని ఆంక్షలు జారీ చేశారు. ఈ సమాచారం వినియోగంలో వీక్షకులు విచక్షణతో సద్వినియోగ పరచుకోవాలి. రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్(ఎస్ఆర్సి) ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మీడియా/వ్యక్తిగతం/సంస్థలు మొదలైనవి వెబ్సైట్లో ఈ చిత్రాల ప్రచురణ తదితర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. బీఎంసీ హెల్ప్‌లైన్ నంబర్–1929 ఈ దిగువ ప్రాంతాల ప్రవేశ ద్వారాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ● కటక్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రి. ● భువనేశ్వర్ రైల్వేస్టేషన్, బరముండా బస్‌స్టాండ్, విమానాశ్రయం. కంట్రోల్ రూమ్ భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్(బీఎంసీ) కార్యాలయం ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితుల బంధువర్గాలు ఆస్పత్రి లేదా మార్చురీకి వెళ్లేందుకు సహాయ సహకారాలు అందజేయడంలో ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. ఈ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు. ప్రత్యేక రైలు.. 12841 అప్ షాలీమార్–చైన్నె కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో మధ్యాహ్నం 1 గంటకు భద్రక్ నుంచి చైన్నెకి ప్రత్యేక రైలు బయల్దేరింది. ఇది కటక్, భువనేశ్వర్ ఖుర్దారోడ్ మీదుగా నడుస్తుంది. ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, బంధువులు ఈ రైలు సేవను పొందవచ్చని రైల్వేమంత్రి వైష్ణవ్ తెలిపారు. ఘటనా స్థలం పునరుద్ధరణ పనుల్లో 1000మంది సిబ్బంది అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, 7 పొక్లెయినర్లు, 2 యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, 4 రైల్వే, రోడ్ క్రేన్లు పునరుద్ధరణ పనుల్లో వినియోగిస్తున్నట్లు వివరించారు. భద్రంగా తరలింపు.. దుర్ఘటనలో దుర్మరణం పాలైన మృతదేహాలను గౌరవ ప్రదంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎస్ ప్రదీప్ జెనా తెలిపారు. ఘటనా స్థలం నుంచి పలు చోట్ల అందుబాటులో ఉన్న శవాగారాలకు తరలించడంలో అందుబాటులో ఉన్న మాధ్యమాలను పరిశీలించిన మేరకు అంబులెన్సుల్లో తరలించడం శ్రేయోదాయకంగా భావిస్తున్నామన్నారు. ట్రక్కులు లేదా ప్రత్యేక రైలు ద్వారా తరలించేందుకు సైతం యోచిస్తున్నామని ప్రకటించారు. రైలులో రవాణాకు కేబినెట్ కార్యదర్శి అనుమతి లభించిందని, అయితే గౌరవప్రదంగా ఉండదని భావించి అంబులెన్సుల్లో తరలించామన్నారు. ఒక్కో అంబులెన్స్‌లో 2చొప్పున 85 వాహనాల్లో భువనేశ్వర్‌కు చేరవేశామని వివరించారు. రూ.3.22 కోట్ల పరిహారం చెల్లింపు బాధితులు, కుటుంబాలకు ముందుగా ప్రకటించిన పరిహారం వెంటనే అందేలా చర్యలు చేపడుతున్నామని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు. మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాల బాధితులకు రూ.50వేలు చొప్పున చెల్లింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రైల్వేశాఖ 285 కేసుల్లో రూ.3.22 కోట్లు చెల్లించింది. ఇందులో 11 మరణాలు, 50 తీవ్రమైన గాయాలు, 224 సాధారణ గాయాల బాధితులు ఉన్నారు. సొరో, ఖరగ్‌పూర్, బాలాసోర్, ఖంటపడా, భద్రక్, కటక్, భువనేశ్వర్ తదితర 7 ప్రాంతాల్లో చెల్లింపులకు ప్రత్యేక కేంద్రాలు పని చేస్తున్నాయి. మృతులకు రూ.5 లక్షలు: సీఎం దుర్ఘటనలో దుర్మరణం పాలైన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబీకులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. వీటిని వీలయినంత త్వరలో బాధిత కుటుంబాలకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే పంపిణీ చేసేందుకు యోచిస్తున్నారు. ప్రధానితో మాటామంతీ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడి, తాజా పరిస్థితులు రైలు ప్రమాద బాధితుల చికిత్స గురించి వివరించారు. గాయపడిన ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు వివిధ ఆస్పత్రుల్లో అన్ని చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. వైద్యులు, వైద్య విద్యార్థులు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు తమవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు వైద్యులు, విద్యార్థులు, సామాన్యులు ముందుకు వస్తున్నారని ప్రధానికి వివరించారు. కొరాపుట్: బాలేశ్వర్ రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్, మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు అక్కడే మకాం వేశారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో ఉన్న అత్యంత నాణ్యమైన టెక్నాలజీ వినియోగించారు. వందల సంఖ్యలో రైల్వే కార్మికులు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరూ మంత్రులు భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రతాప్ జెన్నా మీడియా మాట్లాడుతూ మెత్తం 275మంది మృతులు తుది ప్రకటన చేశారు. ప్రతి మృతదేహాన్ని రాష్ట్ర ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. బంధువులకు అప్పగించని మృతదేహాలను అన్ని ఆస్పత్రుల నుంచి భువనేశ్వర్‌కు రప్పిస్తున్నామన్నాని తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మృతులు ఉన్నా.. వారి బంధువులు వస్తే డెత్ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. మృతదేహాలను ఫొటోలు తీసి, ప్రదర్శనగా ఉంచారు. బాధిత కుటుంబం సభ్యులు ఫొటో గుర్తించిన వెంటనే అధికారులు ఆ ఫొటో నంబర్ చూసి బాధితులను మృతదేహం ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. వెనువెంటనే తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. అందుకే.. అంత వేగంగా.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి విశ్రాంతి లేకుండా అక్కడే మకాం వేశారు. పగలు, రాత్రీ తేడా లేకుండా పరుగులు పెడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయాన రైల్వేమంత్రే ఘటన స్థలంలో తిష్ట వేయడంతో ఆ శాఖలో ఉన్నతాధికారులెవరూ అక్కడి నుంచి కదల్లేకపోయారు. ఈ నేపథ్యంలో శిథిలమైన బోగీలులను తరచూ సందర్శిస్తూ, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపు పూర్తయినప్పటికీ కొన్ని బోగీల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో పూర్తిస్థాయిలో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు చెట్ల కిందే సేద తీరుతున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ ఉచిత బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి ఈ పరిహరాన్ని బస్సు యజమానులకు చెల్లిస్తామన్నారు. ఈ బస్సులు బాలేశ్వర్, పూరీ, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. 76బస్సుల్లో 3,800మంది.. దుర్ఘటన కారణంగా రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పూరీ, భువనేశ్వర్, కటక్ నుంచి కోల్‌కతాకు ఉచిత బస్సు సేవలను ప్రకటించారు. మొత్తం ఖర్చు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భరించనున్నారు. అలాగే బాలేశ్వర్ మార్గంలో సాధారణ రైలు సేవలను పునరుద్ధరించే వరకు ఈ సౌకర్యం కొనసాగుతుంది. ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేసేందుకు కటక్ నుంచి చండీఖోల్, భద్రక్, బాలాసోర్ వరకు ఉచిత బస్సు సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 76బస్సుల్లో సుమారు 3,800మంది ప్రభావిత ప్రయాణికులను కటక్ రైల్వేస్టేషన్ నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించారు. నేటి నుంచి సీఆర్ఎస్ విచారణ.. బహనాగా బజార్ స్టేషన్ వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంపై రైల్వే భద్రత(ఆగ్నేయ సర్కిల్) కమిషనర్ సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఖరగ్‌పూర్‌లోని సౌత్ ఇనిస్టిట్యూట్‌లో కమిషనర్ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు శాఖాపరమైన విచారణ జరుపుతారని రైల్వేవర్గాలు ఆదివారం తెలిపాయి. షాలీమార్–చైన్నె సెంట్రల్ కోరమండల్(12841) ఎక్స్‌ప్రెస్, ఎస్ఎంవీటీ బెంగళూర్–హౌరా(12864) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించి సోమవారం ఉదయం 9 గంటలకు విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రైలు వినియోగదారులు, స్థానిక ప్రజా, ఇతర సంస్థలు ప్రమాదానికి సంబంధించిన ఏదైనా సమాచారానికి సంబంధించి కమిషన్ ముందు ప్రవేశ పెట్టవచ్చని సూచించారు. ఈ దుర్ఘటనలో 275మంది ప్రయాణికులు మరణించగా, 1,175 మంది గాయపడ్డారు. ఎస్సీబీని సందర్శించిన కేంద్రమంత్రులు.. రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల చికిత్స, యోగక్షేమాలను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సీనియర్ వైద్యులు, అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు సరైన చికిత్స అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రతి ప్రాణాన్ని రక్షించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ గాయపడిన వారికి చికిత్స చేయడంలో సహాయ పడేందుకు ఢిల్లీలోని మూడు ప్రీమియర్ ఆస్పత్రుల నుంచి వైద్య నిపుణులు, అత్యాధునిక పరికరాలు, మందులు తెప్పించామని తెలిపారు. 100మందికి పైగా రోగులకు క్రిటికల్ కేర్ అవసరమని గుర్తించామన్నారు. అంతకుముందు ఆయన భువనేశ్వర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల నిర్వహణ వ్యవస్థను పరిశీలించారు. -
Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది?
ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడమే కారణమని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనిపై గతంలో కాగ్ విడుదల చేసిన రైల్వే ఆడిట్ రిపోర్ట్ తెరపైకి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రైల్వే ఆడిట్ రిపోర్టును గత ఏడాది సెప్టెంబర్‌లోనే పార్లమెంట్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విడుదల చేసింది. రైల్వే ట్రాక్‌లలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి లోటుపాట్లను సవరించే అంశంపై విస్తుపోయే అంశాలను కాగ్ నివేదికలో పేర్కొంది. విస్తుపోయే నిజాలు.. 2017-21 మధ్య మొత్తం 1,127 రైలు ప్రమాదాల్లో 289 ప్రమాదాలు ట్రాక్‌ల పునరుద్ధరణకు సంబంధించినవేనని కాగ్ నివేదిక పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణాలు, ప్రమాద ప్రదేశాల తనిఖీలు 30- 100 శాతం తగ్గాయి. 2017 నుంచి 2021 మార్చి వరకు 422 రైలు ప్రమాదాలు ఇంజనీరింగ్ సమస్యల కారణంగా జరిగాయి. అందులో 275 ప్రమాద ఘటనలు ఆపరేటింగ్ విభాగంలో లోపాల కారణంగా జరిగాయి. ట్రాక్‌లపై పాయింట్లను తప్పుగా గుర్తించారు. ప్రధానంగా 171 ప్రమాద కేసులు నిర్వహణ లోపాల కారణంగా జరిగాయి. 156 కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు విస్తుపోయే విషయాలను కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వేగంగా రైలు నడపడం కూడా ప్రమాద ఘటనలకు ప్రధాన కారణం అని నివేదిక వెల్లడించింది. నిధుల తగ్గింపు.. 63 శాతం ప్రమాద ఘటనల్లో నిర్ణీత గడువులోగా విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 49 శాతం కేసుల్లో ఆ నివేదికలను ఆమోదించడంలోనే ఆలస్యం జరిగింది. 2017-18 నుంచి ఐదేళ్లలో దాదాపు రూ. ఒక లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌ను అందుకున్న రైల్వే శాఖ.. వ్యయం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిదులు సరైన మోతాదుల్లో కేటాయించలేదు.. అంతేకాకుండా కేటాయించిన దానిలో పూర్తిగా ఖర్చు చేయలేదని నివేదిక వెల్లడించింది. రైల్వే ట్రాక్‌ల నిర్వహణను సకాలంలో చేయాలని కాగ్ తెలిపింది. మెరుగైన సాంకేతికతను ఉపయోగించాలని కోరింది. ఇలా అయితేనే రైలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:లూప్ లైన్లో ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా -
ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
-
రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చు: మమతా బెనర్జీ
సాక్షి, పశ్చిమ బెంగాల్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. దీని గురించి కేంద్రం సత్వరమే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని అన్నారు మమత. ఈ మేరకు మమతా ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. బెంగాల్ తరుఫున క్షతగాత్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
రెండు నెలల కిందటే వివాహం.. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది...
ఆ నవ వధువు కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఆ కుటుంబంలోని ఆనందమంతా ఆవిరైపోయింది. చదువు, ఉద్యోగం, వివాహం అంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన ఆ యువకుడి జీవితం అక్కడితోనే ముగిసిపోయింది. కొల్లవానిపేట రైల్వేగేటు వద్ద కాపు కాచిన మృత్యుదేవత నవ వరుడిని తనతో తీసుకెళ్లిపోయింది. రెండు నెలల కిందటే వివాహం చేసుకున్న ఆ యువకుడి మృతితో కుటుంబం తల్లడిల్లిపోయింది. నరసన్నపేట: చక్కగా చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. మరో ఉద్యోగినితో వివాహం జరిగింది. ఇక జీవితమంతా హాయిగా కలిసి బతక వచ్చని ఆశ పడిన ఆ వధూవరులపై విధి పగబట్టింది. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది. నరసన్నపేట మండలం కామేశ్వరిపేటలో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మట్ట సోమేశ్వరరావు (28) కొల్లవానిపేట రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం 10.20 గంటల సమయంలో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు నిమిషాల్లో కామేశ్వరిపేట చేరుకుంటాడనగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని బలగకు చెందిన మట్ట శ్యామలరావు కుమారుడు సోమేశ్వరరావు చక్కగా చదువుకున్నాడు. సచివాలయంలో ఇంజినీరింగ్ సహాయకుడిగా ఉద్యోగం వచ్చింది. మంచి సంబంధం రావడంతో రెండు నెలల కిందటే వివాహం చేశారు. ఆమె కూడా రణస్థలం మండలంలోని సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ లాగానే సోమేశ్వరరావు బుధవారం తన బండిపై కామేశ్వరిపేటలోని సచివాలయానికి బయల్దేరాడు. దారిలో కొల్లవానిపేట వద్ద గేటు వేశారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు సోమేశ్వరరావు ప్రాణాలు తీశాయి. గేటు లేవడంతోనే.. సరిగ్గా ఉదయం 10.16కు కొల్లవానిపేట గేటు వేసి ఉంది. రెండు వైపులా వాహనాలు నిలిచి ఉన్నాయి. ఆమదాలవలస నుంచి తిలారు వైపునకు గూడ్స్ ట్రైన్ వెళ్లింది. ఆ రైలు వెళ్లగానే గేటు లేచింది. దీంతో కొల్లవానిపేట నుంచి ఒక కారు, ఆటో గేటు లోపలికి వచ్చాయి. సోమేశ్వరరావు కూడా తన బండితో ముందుకు కదిలాడు. అంతే.. అదే ట్రాక్‌పై ఊహించని వేగంతో వచ్చిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సోమేశ్వరరావును అమాంతం ఢీకొట్టింది. ఆ ధాటికి అతడి శరీరం తునాతునకలైంది. రైలు పట్టాలన్నీ రక్తంతో తడిచిపోయాయి. క్యారేజీ, హెల్మెట్ ఇలా ఆ యన వస్తువులన్నీ చాలాదూరం ఎగిరిపడ్డాయి. అయితే తమ కళ్ల ముందే ప్రమాదం జరగడంతో గే టు వద్ద ఉన్న వాహనదారులు నిశ్చేష్టులైపోయారు. రెప్పపాటులో తాము ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రత్యక్ష సాక్షులు వేళాల రమేష్, ఆర్.రామకృష్ణ, పుల్లట వెంకటరమణ తెలిపారు. ఆటోలో పది మంది, కారులో నలుగురు ఉన్నారని, వెంట్రుక వాసిలో వీరు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. కన్నీరుమున్నీరు.. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇలా దుర్మరణం పాలవ్వడంతో మృతుని తల్లిదండ్రులు శ్యామలరావు, సరస్వతిలు కన్నీరుమున్నీరయ్యారు. అతని సోదరి గౌతమి కూడా తల్లడిల్లిపోయింది. సోమేశ్వరరావు భార్య జయశ్రీ వేదన చూసి అంతా కన్నీరుపెట్టుకున్నారు. నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు.. ఈ ప్రమాదంలో సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని ఆమదాలవలస రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆమదాలవలస స్టేషన్ మాస్టర్ రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఏ ఎస్ఐ చిట్టిబాబు, హెచ్‌సీ మధుసూదనరావు వచ్చా రు. రైల్వేగేట్‌మెన్ మధుపర్ మిశ్రో నుంచి వివరణ తీసుకున్నామని, ప్రమాదవశాత్తు జరిగినట్లు కేసు నమోదు చేశామన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ సోమేశ్వరరావు మృతిపై నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, ఎంపీడీఓ మదుసూదనరావు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు మోహనరావు, ఉదయ భాస్కర్, పంచాయ తీ కార్యదర్శుల సంఘం మండల విభాగం అధ్యక్షు డు ముకుందరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు దివ్య, కామేశ్వరిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు వాకముళ్లు చక్రధర్, జోగినాయుడులు సంతాపం వ్యక్తం చేశారు. -
రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కళ్లు మూసి తెరిచే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది ఓ మహిళ. ట్రైన్ వచ్చేది గమనించక.. తన సామగ్రితో పట్టాలు దాటి మళ్లీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనే ట్రైన్ దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ ఈ దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు.‘ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో.. స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ज़िंदगी आपकी है. फ़ैसला आपका है. pic.twitter.com/eMrl65FiCj — Awanish Sharan (@AwanishSharan) July 19, 2022 ఇలాంటి సాహసాలకు పాల్పొడొద్దని, అది అంత మంచిది కాదని ప్రజలకు సూచించారు ఐఏఎస్ అధికారి. నెటిజన్లు సైతం ఆ మహిళ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివితక్కువ ప్రయాణికులు అంటూ ఓ వ్యక్తి పేర్కొన్నారు. సొంత జీవితాన్ని ప్రమాదంలో పడేసే ఆత్రుత ఎందుకు? అంటూ మరో వ్యక్తి ప్రశ్నించాడు. మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ వీడియో రెండు లక్షలకు పైగా మంది చూశారు. అయితే.. ఇది ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇదీ చదవండి: ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!