train journey
-
రూ.30 లక్షల జీతం.. ట్రైన్లోనే ప్రయాణం: ఓ టెకీ సమాధానం ఇదే
సాధారణంగా లక్షల జీతం తీసుకునే చాలామంది రైలు ప్రయాణం కంటే.. విమాన ప్రయాణాన్నే ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం ఎంత సంపాధించినా ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడుతుంటారు. దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు.చిరాగ్ దేశ్‌ముఖ్.. ట్రైన్ జర్నీలో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న & ఏడాదికి రూ. 30 లక్షల జీతం తీసుకునే వ్యక్తిని కలిశారు. సంవత్సరానికి ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు, ఎందుకు ట్రైన్ జర్నీ చేస్తున్నావు అనే ప్రశ్న వేశారు. దీనికి ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ సమాధానమిస్తూ.. తన చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో ఒక రైలు ప్రయాణంలో, ఓ వ్యక్తి పరిచయమయ్యారు. ఆ వ్యక్తి అన్నయ్య కారణంగా నాకు జాబ్ వచ్చింది అని చెప్పారు. ఆ సమయంలో ఎప్పుడూ ట్రైన్ జర్నీ చేయాలని నిర్ణయించుకున్నా అని వివరించారు.ఈ విషయాన్నే చిరాగ్ దేశ్‌ముఖ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో కొందరు ట్రైన్ జర్నీ చాలా సరదాగా ఉంటుందని అన్నారు. తెలియని వ్యక్తులతో కూడా పరిచయం ఏర్పడుతుంది. విమాన ప్రయాణంలో ఈ అవకాశం ఉండదు. విమానంలో అందరూ బిజీగా ఉంటారని కొందరు అన్నారు.Funny story !!!!Today, I was traveling by train and met a guy who works as a software developer at a big company, earning over 30 lakhs a year. I asked him, "With that kind of money, why aren't you flying instead of taking the train?Thread... pic.twitter.com/GH5yssTtLT— Chirag Deshmukh (@Geekychiraag) August 20, 2024 -
ఉక్రెయిన్‌లో మోదీ ప్రయాణించే లగ్జరీ రైలు విశేషాలివే..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెలలో యుద్ధ భూమి ఉక్రెయిన్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మోదీ భేటీ కానున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా.. ప్రధాని మోదీ రైలులో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధానికి చేరుకోనున్నారు. అదే అత్యంత సురక్షితమైన రైలే కాకుండా విలాసవంతమైన రైలుగా పేరొందిన ‘ట్రైన్ ఫోర్స్ వన్ ’లో మోదీ ప్రయాణించనున్నారు.రైలు ప్రత్యేకతలుఇది సౌకర్యవంతమైన, అత్యున్నత స్థాయి ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది సాధారణ రైలు కాదు. అత్యంత భద్రతతో కూడుకొని ఉంది. విలాసవంతమైన క్యాబిన్లు ఉన్నాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది కూడా ఉంటుంది. అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ఈ లగ్జరీ రైలును నిర్వహించడం అంత సులువు కాదు. అందుకే వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.యుద్దంలో దెబ్బతిన్న మార్గాల గుండా 10 గంటలు ప్రయాణించి కీవ్ చేరుకోనున్నారు. తిరుగు ప్రయాణంలోనూ మరో 10 గంటలు ప్రయాణించనున్నారు. దీంతో మొత్తం 20 గంటలపాటు ఈ రైలులో గడపనున్నారు. ఈ లగ్జరీ రైలులో గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటి ప్రపంచ నాయకులు సైతం ప్రయాణంచారు.కాగా గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం అంశంపై మోదీ, జెలెస్కీ నేతలు చర్చించనున్నారు. అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ కీవ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ కంటే ముందు ప్రధాని ఆగష్టు 21న పోలండ్‌లో పర్యటించనున్నారు. -
జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
చివరి నిమిషంలో ఊరు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? లేదంటే వీరే ప్రాంతంలో మీకు అత్యవసర పనిబడిందా? ఇందుకోసం మీరు ముందస్తుగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోలేదా? చింతించకండి. ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్‌లో కొత్త సదుపాయాన్ని కల్పించింది.పలు కారణాల వల్ల చివరి నిమిషంలో ప్రయాణికులు వారు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. మరి ఆ టికెట్లు వృధాగా పోతున్నాయి. అందుకే రైలు ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.అయితే స్లీపర్, 3ఏసీ, 2ఏసీ, 1ఏసీలో సీట్లు ఖాళీగా ఉంటే.. జర్నీకి ఐదు నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరి ఈ భోగీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు ఆన్లైన్ చార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి ..ట్రైన్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత గెట్ ట్రైన్ చార్ట్ కనిపిస్తుంది. ఇందులో ట్రైన్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ సీట్లు ఉన్నాయని తెలుస్తే బుక్ చేసుకోవచ్చు. -
రైలులో మహిళతో అనుచిత ప్రవర్తన.. ఆమె ఏం చేసిందంటే?
ఢిల్లీ: దేశంలో ఏదో ఒక చోట మహిళలు, యువతుల పట్ల కొందరు పొకిరీలు ఏదో ఒక చోట వేధింపులను గురి చేస్తూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చిన కొందరు మాత్రం తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు. అయితే, తాజాగా రైలు ప్రయాణంలో తనను వేధించిన ఓ వ్యక్తికి మహిళ తగిన బుద్ధి చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రైలు ప్రయాణంలో ఓ మహిళaతో మరో ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తి ఆమె పక్కనే కూర్చోని మహిళను అసభ్యకరంగా తాకాడు. దీంతో, ఆ మహిళ ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే తన చెప్పుతో ఆ వ్యక్తి చెంపపై పలుసార్లు కొట్టింది. అతడి జుట్టు పట్టుకుని తలపై బాదింది. ఆవేశంలో అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై కూడా చెప్పుతో కొట్టింది. Kalesh b/w a Lady and a Guy inside Indian Railways over this guy was misbehaving with her pic.twitter.com/JO9g16RVDZ — Ghar Ke Kalesh (@gharkekalesh) November 24, 2023 దీంతో, ఆమె దాడిని తట్టుకోలేని అతడు సీటు నుంచి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ సీటు పైకి ఎక్కిన మహిళ ఆ వ్యక్తిని మరోసారి చెప్పుతో కొట్టింది. మిగతా ప్రయాణికులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె లెక్కచేయలేదు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త!
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్సీటీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణంలో ప్యాసింజర్లు కోరుకున్న ఆహారాన్ని అందించేలా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’తో జత కట్టింది. దీంతో ప్రయాణికులు రైల్వే ప్రయాణంలో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్‌ను ముందే బుక్ చేసుకుంటే నిర్ధేశించిన రైల్వే స్టేషన్లో ఆహారాన్ని అందించనుంది. ప్రస్తుతం, ఈ సౌకర్యం ఐదు స్టేషన్లకే పరిమితం చేసింది. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద ప్రస్తుతం ఢిల్లీతోపాటు ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో జొమాటో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఐఆర్సీటీసీ ప్రత్యేక సర్వీసులు, ఆఫర్లను అందిస్తుంది. ప్రత్యేకించి నవరాత్రోత్సవాల్లో ఉపవాసం ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘థాలీ’ని అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఐఆర్సీటీసీతో ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో జొమాటో షేర్ రూ.115 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. అయితే మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి జొమాటో షేర్ రూ.113.20 వద్ద ముగిసింది. ఐఆర్సీటీసీ స్టాక్ రెండు శాతం నష్టాలతో రూ.700 వద్ద ట్రేడయి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.48 శాతం నష్టంతో రూ.704 వద్ద స్థిర పడింది. -
అప్పుడే రైళ్లన్నీ ఫుల్!
హైదరాబాద్: ఇక రైలు ప్రయాణం ‘ప్రత్యేకమే’. మరో నాలుగు నెలల వరకు రెగ్యులర్ రైళ్లలో ప్రయాణం చేయడం దాదాపు అసాధ్యంగా మారింది. దసరా, సంక్రాంతి పండుగల దృష్ట్యా ఇప్పటికే అన్ని ప్రధాన మార్గాల్లో రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో బుకింగ్‌లకు కూడా అవకాశం లేకుండా ‘నో రూమ్’ కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లేందుకు నగరవాసులకు ప్రత్యేక రైళ్లే ప్రత్యామ్నాయంగా మారాయి. రెగ్యులర్ రైళ్లలో సాధారణ చార్జీలపైన రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండగా, ప్రత్యేక రైళ్లు అన్నింటిలోనూ 20 శాతం వరకు అదనపు చార్జీలను విధించారు. దీంతో ఈ సారి పండుగ ప్రయాణం మరింత ‘ప్రియం’గా మారనుంది. భారీగా వెయిటింగ్ .... జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ జాబితా 150 నుంచి 250 వరకు చేరింది. వచ్చే ఏడాది జనవరి 30వ తేదీ వరకు చాలా రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంది. సాధారణంగా ప్రయాణానికి మూడు నెలలు ముందుగానే బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉండడంతో దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లేవాళ్లు ఇప్పటికే రిజర్వేషన్లు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ, ఒడిశా, బెంగళూరు, తిరుపతి, కాకినాడ, నర్సాపూర్, నాగర్సోల్, పట్నా, దానాపూర్, జైపూర్, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. గౌతమి, గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, తదితర రైళ్లకు రానున్న నాలుగు నెలల వరకు వెయిటింగ్ లిస్ట్ పైనే రిజర్వేషన్లు బుక్ చేసుకోవడం గమనార్హం. సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్ క్లాస్ కోసం కూడా భారీ పోటీ ఉంది. పండుగలప్పుడే కాదు.. సెలవులొచ్చినా రద్దీనే సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి సుమారు 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. పండుగలు, వరుస సెలవులు, వీకెండ్స్ వంటి ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. గతంలో సంక్రాంతికి మాత్రమే ఎక్కువ మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లేవారు. కానీ ఇప్పుడు నాలుగు రోజులు వరుసగా సెలవులొస్తే ఎక్కడికై నా వెళ్లేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. సెలవు రోజుల్లో సుమారు 30 వేల మందికి పైగా అదనంగా ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. ఆర్టీసీలో అలా...రైల్వేలో ఇలా... ఆర్టీసీల్లో ప్రత్యేక చార్జీలను ఉపసంహరించారు. గతంలో దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పర్వదినాల్లో 50 శాతం అదనపు చార్జీలు విధించేవారు. దీంతో ప్రయాణికులు రైళ్లకే ఎక్కువగా మొగ్గుచూపేవారు. బస్సు చార్జీల కంటే రైలు చార్జీలు చాలా తక్కువ కావడమే ఇందుకు కారణం. కానీ ప్రస్తుతం ఆర్టీసీల్లో ఎలాంటి అదనపు చార్జీలు విధించడం లేదు. పైగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణించే వారికి 10శాతం వరకు రాయితీ లభిస్తోంది. ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. కానీ రైలు ప్రయాణం అందుకు భిన్నంగా మారింది. రెగ్యులర్ రైళ్లలో ప్రయాణం చేసేందుకు అవకాశం లేదు. దీంతో తత్కాల్ చార్జీలపైన ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లు భారంగా మారాయి. ప్యాసింజర్ రైళ్లు తగ్గుముఖం.. మరోవైపు సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా అందుబాటులో ఉండే ప్యాసింజర్ రైళ్లను చాలా వరకు తగ్గించారు. మౌలిక సదుపాయాల కల్పన పేరిట హైదరాబాద్ నుంచి వరంగల్, కాజీపేట్, భద్రాచలం, విజయవాడ, కర్నూలు, తదితర ప్రాంతాలకు నడిచే సుమారు 22 రైళ్లు గత 3 నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
రాహుల్ జన్‌కీ బాత్.. ఈసారి రైలులో..
రాయ్‌పూర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ మధ్య జనాల మధ్య కనిపించడం సాధారణంగా మారింది. తాజాగా ఆయన రైలులో ఒక సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. సోమవారం బిలాస్పూర్ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లే ట్రైన్లో ప్రయాణించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి పల్స్ తెలుసుకోవడంతో పాటు.. సమస్యల్ని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. రైలు ప్రయాణ సేవలు ఎలా ఉన్నాయి? ప్రయాణంలో భాగంగా సాధారణ ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా? తదితర విషయాలపై రాహుల్ గాంధీ ప్రయాణికులతో ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది. రాహుల్ గాంధీ ట్రైన్లో ప్రయాణించిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో ఆయన స్లీపర్ కోచ్‌లో ప్రయాణికుల మధ్య నడుచుకుంటూ కనిపించారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. यात्रा जारी है... 🚆 📍 छत्तीसगढ़ pic.twitter.com/K2QKa3MieT — Congress (@INCIndia) September 25, 2023 -
మొన్న రైల్వే కూలీ.. నేడు ప్యాసింజర్.. సర్ప్రైజ్ చేసిన రాహుల్ గాంధీ
రాయ్‌పూర్: దేశంలో ఈ ఏడాది చివరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి దూసుకెళ్తూ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్యాసింజర్ రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా పార్టీ నేతలతో కలిసి రైలులో ప్రయాణించారు. సాధారణ వ్యక్తిలా ట్రైన్లో ప్రయాణిస్తూ అందరినీ పలకరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు రాహుల్‌తో ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడ్డారు. మరోవైపు, ఇటీవలే రాహుల్ గాంధీ రైల్వే కూలీ అవతారమెత్తిన విషయం తెలిసిందే. Rahul Gandhi Did It Again#RahulGandhi's simplicity is revealed again and again. Today's Train Journey is touching Four points. First, #RahulGandhi realizes how far the standard of #IndianRailways has Fallen in the last 10 years. Second, #RahulGandhi interacted with the… pic.twitter.com/9HSYzptmwC — তন্ময় l T͞anmoy l (@tanmoyofc) September 25, 2023 ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఎర్రని చొక్కా ధరించి నెత్తిన లగేజ్ పెట్టుకుని మోశారు. రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే కనిపించి అభిమానులను అలరించారు. రైల్వే కూలీల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ చిరునవ్వులు చిందుతూ రైల్వే కూలీలా మూటలు మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar ISBT in Delhi, wears porter dress and badge... pic.twitter.com/Pzwouwx2Wn — Saurabh Raj (@sraj57454) September 21, 2023 ఇక, అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన గృహ నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల గణన నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గడిచిన కొన్ని నెలల్లో రాష్ట్రంలో 2,600 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH | Delhi: Congress MP Rahul Gandhi visits Anand Vihar ISBT, speaks with the porters and also wears their uniform and carries the load pic.twitter.com/6rtpMnUmVc — ANI (@ANI) September 21, 2023 ఇది కూడా చదవండి: భారత్‌ను ముక్కలు చేసేందుకు ప్లాన్.. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా.. -
రైలులో మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ అప్పగింత
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):రైలు ప్రయాణంలో రూ. 40వేలు నగదుతో పాటుగా రూ. 6.5 లక్షల బంగారు ఆభరణాలు ఉన్న మహిళ హ్యాండ్ బ్యాగును విధుల్లో ఉన్న టీటీఐ గుర్తించి విచారణ అనంతరం బాధితులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. విజయవాడ డివిజన్‌కు చెందిన టీటీఐ జి.లక్ష్మయ్య ఈ నెల 18న ఎల్టీటీ–విశాఖపట్నం రైలులో ఎస్–1, బీ–4,5,6 కోచ్‌లలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉదయం 5.10 గంటలకు రైలు భీమవరం టౌన్ దాటిన తరువాత బీ6 కోచ్‌లో బెర్త్‌లు తనిఖీలు చేస్తుండగా బెర్త్ నంబర్ 26 పక్కన డైనింగ్ టేబుల్‌పై మహిళ హ్యాండ్ బ్యాగు ఉండటాన్ని గుర్తించారు. దీనిపై తోటి ప్రయాణికులను విచారించగా భీమవరంలో స్టేషన్లో దిగిన కుటుంబానిదిగా తెలిపారు. దీంతో విషయాన్ని ఆయన విజయవాడ కమర్షియల్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. బ్యాగులోని ఫోన్ రింగ్ అవుతుండటంతో తోటి ప్రయాణికుల సమక్షంలో మాట్లాడగా హ్యాండ్ బ్యాగు ట్రైన్లో మర్చిపోయినట్లు బాధితురాలు తెలిపింది. కోచ్‌లోని ప్రయాణికుల సమక్షంలో బ్యాగులో ఏముందో నిర్ధారించాల్సిందిగా తెలపడంతో అందులో రూ. 40 వేల నగదు, రూ. 6.50 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పడంతో అవి సరిగా ఉండటంతో బ్యాగు బాధితురాలిదేనని నిర్ధారించారు. ఆమె అభ్యర్ధన మేరకు రాజమండ్రిలో తన సోదరుడికి అప్పగించాలని టీటీఐని కోరటంతో విషయం రాజమండ్రి కమర్షియల్ కంట్రోలర్‌కు, స్టేషన్ ఆఫీసర్‌కు, జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైలు రాజమండ్రిలో ఆగిన తరువాత జీఆర్పీ పోలీసులు బాధితురాలి సోదరుడి నుంచి వివరాలు సేకరించి బ్యాగును అందజేశారు. విధుల్లో చిత్తశుద్ది, అంకితభావంతో వ్యవహరించి రైలు ప్రయాణికురాలి నష్టాన్ని నివారించిన టీటీఐ లక్ష్మయ్యను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు. కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్‌లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్‌తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్‌తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. రైలులోనే ఎందుకు? గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్‌లో పుతిన్‌తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్‌కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం ఆమోదిస్తే.. త్వరలో
జంతు ప్రేమికులకు ఊరట కల్పించేలా కేంద్రం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంపుడు జంతువులను రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లేందుకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వెసలు బాటు కల్పించనుంది. ఇందుకోసం టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రైలు ప్రయాణంలో జర్నీ చేయాల్సి వస్తే మూగ జీవాలతో ఇబ్బందే. ఈ సమస్యను నివారించేందుకు రైల్వే శాఖ సరికొత్త విధానంతో ముందుకొస్తోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ పెంపుడు జంతువులకు కూడా టికెట్లను అమ్మనుంది. చదవండి👉 ఫోన్లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ ‘యాప్’ వాడితే ఇక అంతే సంగతులు ప్రస్తుతం, ప్రయాణికులు పెంపుడు జంతువుల్ని వెంట తీసుకొని వెళ్లాలంటే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లు, క్యాబిన్లు లేదా కూపేలను బుక్ చేసుకోవాలి. ఇందు కోసం ప్రయాణం రోజున ప్లాట్‌ఫామ్‌లోని పార్శిల్ బుకింగ్ కౌంటర్లను సంప్రదించి టికెట్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది. అనంతరం, ప్రయాణికులు తమ పెంపుడు జంతువులను బాక్స్‌లలో ఉంచి ట్రైన్లలోని సెకండ్ క్లాస్ లగేజీ, బ్రేక్ వ్యాన్లలో తీసుకొని వెళ్తున్నారు. ఈ విధానం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేలా ఐఆర్సీటీసీ వెబ్సైట్లలో జంతువులకు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ట్రైన్లలో జంతువులకు టికెట్లను బుక్ చేసే అధికారాన్ని టీటీఈలకు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో జంతువులను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని రైల్వే బోర్డు cris (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)ని కోరినట్లు ది స్టేట్స్‌మన్ నివేదిక వెల్లడించింది. గార్డు కోసం కేటాయించిన ఎస్ఎల్ఆర్ కోచ్‌లో జంతువులను ఉంచుతారు. జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులకు రైలు స్టాపేజ్‌లలో నీరు, ఆహారం మొదలైనవాటిని అందించవచ్చు. అయితే ఆన్లైన్లో జంతువుల టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కొన్ని షరతులు విధించనుంది. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి. 👉ప్రయాణికుల టిక్కెట్ తప్పనిసరిగా ధృవీకరించాలి 👉ప్రయాణికుడు టిక్కెట్‌ను రద్దు చేస్తే, జంతువులకు బుక్ చేసిన టిక్కెట్ వాపసు ఇవ్వబడదు. 👉ట్రైన్ రద్దయినా లేదా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, మూగజీవాల కోసం బుక్ చేసుకున్న టికెట్ రుసుము తిరిగి పొందలేరు. ప్రయాణీకుల టిక్కెట్ మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది. 👉గుర్రాలు, ఆవులు, గేదెలు మొదలైన పెద్ద పెద్ద పెంపుడు జంతువులను గూడ్స్ రైళ్లలో బుక్ చేసి రవాణా చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. 👉ప్రయాణంలో మూగజీవాలకు సంరక్షణకు ఒక వ్యక్తి ఉండాలి. 👉జంతువులకు ఏదైనా నష్టం జరిగితే యజమాని బాధ్యత వహిస్తాడు. వాటికి రైల్వేశాఖ బాధ్యత వహించదు. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
కేంద్ర రైల్వే శాఖ బొద్దింకలు, ఎలుకల్ని పర్యవేక్షిస్తుందా? ప్రశ్నించిన ప్రయాణికుడు
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)ను ప్రారంభించింది. కంట్రోల్ సెంటర్ పని తీరును వివరిస్తూ వాటి ఫోటోల్ని విడుదల చేసింది. అయితే ఆ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా రైలు ప్రయాణాల్లో తలెత్తుతున్న అసౌకర్యాలను ఎత్తిచూపుతున్నారు. ఓ నెటిజన్ ఓసీసీ వ్యవస్థపై వెటకారంగా స్పందించాడు. రైళ్లలో ఎలుకలు, బొద్దింకల్ని ఓసీసీ సెంటర్ పర్యవేక్షిస్తుందా? అని ప్రశ్నించాడు. అందుకు కేంద్ర రైల్వే శాఖ ఊహించని విధంగా స్పందించింది. రైల్వే మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌లోని 1,506 కి.మీ వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణ పనులను ముమ్మరం చేస్తుంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిర్మిస్తున్న కారిడార్ల ద్వారా అతివేగంతో ప్రయాణించే గూడ్స్ రైళ్ల కదలికల్ని పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. అయితే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఓసీసీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అనేక మంది ఫేస్బుక్ యూజర్లు రైళ్లలో సౌకర్యాలను మెరుగుపరచడం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు భారతదేశంలో రైలు ప్రయాణ అసౌకర్యాలను ఎత్తిచూపారు. రైళ్లలో కనిపించే ఎలుకలు, బొద్దింకలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుందా? అంటూ ఓ యూజర్ ప్రశ్నించారు. దీంతో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఊహించని విధంగా అతని ప్రయాణ వివరాలు, మొబైల్ నంబర్ చెప్పాలని కోరింది.మీ అభ్యంతరాలను నేరుగా railmadad.indianrailways.gov.inలో ఫిర్యాదు చేయోచ్చని లేదంటే సత్వర పరిష్కారం కోసం 139కి డయల్ చేయాలని పేర్కొంది. ‘‘రాకెట్ సెంటర్ లాగా ఉంది. అద్భుతం. గో ఇండియా అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఆపరేషన్ కంట్రోల్ సెంటర్.. ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కమాండ్ సెంటర్’’తో పోల్చారు. కాగా, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీని, మహారాష్ట్రలోని నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టుతో కలుపుతుంది. -
గుడ్‌న్యూస్.. రైల్వే ప్రయాణికులకు పండగే.. ఇకపై క్షణాల్లోనే
ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం ఈ - వ్యాలెట్ పేరుతో అధునాతనమైన సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవల్ని వినియోగించుకోవడం ద్వారా ప్రయాణికులు ఎలాంటి సందర్భాలలోనైనా సులభంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. త్వరలో స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్. పండగలు.. పబ్బాలు..పెళ్లిళ్లు.. శుభకార్యాలకు ఊరెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఇతర అత్యవసర సమయాల్లో ట్రైన్లలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇందుకోసం రోజులు .. నెలల ముందే నుంచే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే తలకు మించిన భారం. ఒక్కోసారి టికెట్ బుక్ చేసుకొని పేమెంట్ చేసే సమయంలో సర్వర్ డౌన్ అవుతుంది. బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. ఆ డబ్బులు తిరిగి మన అకౌంట్‌కు ఎప్పుడు డిపాజిట్ అవుతాయో? లేదో తెలియదు. ఈలోగా ఇంకో టికెట్ బుక్ చేసుకోవాలంటే.. మళ్లీ కొంత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఇదిగో..! ఈ తరహా సమస్యల పరిష్కార మార్గంగా ఐఆర్సీటీసీ ఈ - వ్యాలెట్ సేవల్ని ప్రయాణికులకు అందిస్తుంది. ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్ సేవల వినియోగం ద్వారా రద్దీ సమయాల్లో ట్రైన్ టికెట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు. బ్యాంకుల సర్వర్, రైల్వే సేవల్లో అంతరాయం వంటి సందర్భాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణం రద్దుతో.. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ డబ్బులు మరుసటి రోజు ఈ వ్యాలెట్‌లో డిపాజిట్ అవుతాయి. ఇందుకోసం ప్రయాణికులు చేయాల్సిందల్లా ఈ-వ్యాలెట్‌లో లాగిన్ అవ్వడమే. ఈ లాగిన్ సేవలు మూడేళ్ల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్న ప్రతిసారి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. ఐఆర్సీటీసీ ఈ వ్యాలెట్‌లో (Irctc E-wallet) ఇలా లాగిన్ అవ్వాలి ♦ఐఆర్సీటీసీ వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ♦అందులో ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ♦రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పాన్ - ఆధార్ నెంబర్‌తో వెరిఫై చేసుకోవాలి ♦మీ ప్రొఫైల్ వెరిఫికేషన్ విజయవంతం అయితే మీరు డైరెక్ట్‌గా ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్ రిజిస్ట్రేషన్‌లోకి వెళతారు. ♦ఐఆర్సీటీసీ వ్యాలెట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 చెల్లించాలి ♦ఈ ప్రాసెస్ పూర్తయితే వ్యాలెట్ రిజిస్ట్రేషన్ లాగ్ అవుట్ అవుతుంది. ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్లోకి డబ్బుల్ని ఎలా డిపాజిట్ చేయాలి ♦ఐఆర్సీటీసీ అకౌంట్లో లాగిన్ అవ్వాలి ♦లాగిన్ అనంతరం మీరు ఐఆర్సీటీసీ ఈ-వ్యాలెట్ డిపాజిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦అక్కడ రూ.100 నుంచి రూ.10 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ♦మీకు కావాల్సిన మనీని రూ.100, రూ.500 ఇలా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగ్‌పై క్లిక్ చేసి మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో సదరు బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ♦ఆ మని కేవలం ఐఆర్సీటీసీ ఈ - వ్యాలెట్‌లో ఉంటాయి. విత్ డ్రా చేసుకొని వినియోగించుకునేందుకు వీలు లేదు. కేవలం ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేందుకు మాత్రమే ఆ డబ్బుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. ♦విజయవంతంగా డిపాజిట్ చేయడం పూర్తయితే ఐఆర్సీటీసీ ఈ - వాలెట్లో మీరు ఎంత డిపాజిట్ చేశారో డిపాజిట్ హిస్టరీలో కనిపిస్తుంది. ♦ఇక ఈ- వ్యాలెట్‌లో డబ్బుల్ని డిపాజిట్ చేసిన తర్వాత ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సిల్ అయితే ఆ మరుసటి రోజే మీ డబ్బులు మీ ఈ - వ్యాలెట్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్! -
రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే!
రాత్రిపూట రైళ్లలో నిద్రించే వారికి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవలు ఈ సమయంలో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ఐఆర్టీసీ (IRCTC) కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చిన్న మార్పులను నిబంధనలను పాటించకపోతే ప్యాసింజర్లు ఇబ్బందుల్లో పడినట్లే. అవేంటో ఓ సారి తెలుసుకుందాం! కొత్త నిబంధనలు ఇవే మీ కంపార్ట్మెంట్ లేదా కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, తోటి ప్యాసింజర్లు ఫోన్ కాల్లో గట్టిగా మాట్లాడటం, లేదా పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, లేదా బిగ్గరగా అరవడం లాంటివి చేస్తుంటారు. గతంలో మన రైల్వే ప్రయాణంలో ఇలాంటి ఘటనలు చూసే ఉంటాం కూడా. అయితే ప్యాసింజర్లు ఎదర్కుంటున్న ఈ సమస్యకు రైల్వే శాఖ చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. రైలులో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి నిద్రకు భంగం కలగకుండా, ప్రయాణంలో ప్రశాంతంగా నిద్రించేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఇకపై రైలులో ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. వాటి ప్రకారం ఆ ప్రయాణంలో ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడడం, పెద్దగా సంగీతం వినడం, అరవడం లాంటివి కూడా చేయకూడదు. మొత్తానికి తోటి ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకూడదు. ఒక వేళ ఎవరైన ఈ రూల్స్‌ని పాటించకపోతే ప్రయాణికులెవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దీని పరిష్కరించాల్సిన బాధ్యత రైలులో ఉన్న సిబ్బందిపైనే ఉంటుంది. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
సాధారణ ప్రయాణికుడిలా మోదీ.. టికెట్ కొని మెట్రో జర్నీ
ముంబై: దేశంలో మరో వందే భారత్ రైలు కూత పెట్టింది. జెండా ఊపి రైలును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ల మధ్య సేవలందించనుంది ఈ ట్రైన్. నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ.. ఆరో వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది, ప్రయాణికులతో ముచ్చటించారు మోదీ. దేశంలో సేవలు ప్రారంభించిన ఆరో వందే భారత్ రైలు ఇది. సాధారణ ప్రయాణికుడిలా మోదీ.. నాగ్‌పూర్‌లో రూ.8650 కోట్లతో నిర్మించిన మెట్రో ఫేస్ 1ని ప్రారంభించారు ప్రధాని. అనంతరం ఒక సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి.. ఫ్రీడం పార్క్ నుంచి ఖప్రీ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులతో పాటు జర్నీ చేస్తూ వారితో ముచ్చటించారు. అనంతరం రూ.6700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మెట్రో ఫేస్ 2కు శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు స్వాగతం పలికారు. నాగ్‌పూర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం, నాగ్‌పూర్, అజని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. Maharashtra | Prime Minister Narendra Modi flags off the Vande Bharat Express train between Nagpur and Bilaspur, at Nagpur railway station. CM Eknath Shinde also present pic.twitter.com/7457ZaZQOG — ANI (@ANI) December 11, 2022 ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా? -
లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం.. కే–ఆర్ (కోరాపుట్–రాయగడ) రైల్వే లైన్ వాల్తేర్ డివిజన్‌కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్ ఓర్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్‌ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్ – రాయగడ (కే–ఆర్) లైన్‌ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్ 31న ప్రారంభించారు. కోరాపుట్ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్ స్టీల్‌ప్లాంట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌లకు అసవరమైన ఐరన్‌ఓర్‌ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి ఈ మార్గంలో అల్యూమినా పౌడర్ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్ అండ్ ఫెర్రో అల్లాయ్), హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్ పూర్తి చేయనున్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... ఆంధ్రా, ఒడిశా సదరన్ డివిజన్లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్ ఫాల్స్ తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం కోరాపుట్‌లో రాణి డుడుమ వాటర్‌ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం గుప్తేశ్వర గుహలు డియోమలి హిల్స్ కూడా కోరాపుట్ ప్రాంతంలోనే ఉన్నాయి. కోరాపుట్లోనే కోలాబ్ రిజర్వాయర్ కూడా ఉంది. గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్‌కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్ రైల్వే స్టేషన్. అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్ డివిజన్ కోరాపుట్–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్ డివిజన్‌కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా వచ్చిన అనూప్‌కుమార్ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్ కోచ్‌ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్ స్పెషల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు) 20 ఏళ్ల తరువాత ప్రెస్‌టూర్... దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్టూర్ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. – అనూప్ కుమార్ సత్పతి, డీఆర్ఎం అద్భుతంగా ఉంది మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్కోచ్లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్ డివిజన్ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. – కె హరిత, డివిజనల్ మేనేజర్, ఏపీ టూరిజం -
రైల్వే ప్యాసింజర్లకు ఇది తెలుసా.. రిజర్వేషన్ టికెట్ లేకపోయిన ప్రయాణించవచ్చు!
ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తోంది ఇండియన్ రైల్వేస్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తు రైల్వే శాఖ ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో అందిస్తూ ప్రయాణికులకు పెద్ద పీట వేస్తూ దూసుకోపోతోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న కొందరు అకస్మాత్తుగా ప్రయాణించవలసి రిజర్వేషన్ టికెట్ దొరకకపోవచ్చు. అటువంటి సమయంలో వారికి రిజర్వేషన్ టికెట్ దొరకపోవచ్చు. అయినా ఏం ఫర్వాలేదు రిజర్వేషన్ టికెట్ లేకున్నా ప్యాసింజర్లు వారి గమ్యస్థానానికి ఇలా ప్రయాణించవచ్చు. ఎలా అంటారా? ప్లాట్‌ఫాం టికెట్‌తో ప్రయాణం ఎలా.. ప్యాసింజర్ తన వద్ద రిజర్వేషన్ టికెట్ లేదని కంగారుపడాల్సిన పనిలేదు. అటువంటి పరిస్థితుల్లో సదరు ప్రయాణికుడు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించవచ్చు. అయితే మీరు వెంటనే టికెట్ కలెక్టర్ (TTE) సంప్రదించాల్సి ఉంటుంది. ఆపై మీ గమ్యస్థానాన్ని అతనికి చెప్పి అందుకు తగ్గ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు టిక్కెట్ తీసుకుని ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ రూల్స్ కూడా తెలుసుకోండి.. రిజర్వేషన్ లేకుండా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకున్న ప్యాసింజర్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. రైలులో ఒక్కోసారి రద్దీ కారణంగా బెర్త్ మాత్రమే కాదు సీటు ఖాళీగా లేని సందర్భాలు బోలెడు ఉంటాయి. అటువంటి సమయంలో టీటీఈ ప్రయాణికుడికి రిజర్వ్ సీటు ఇవ్వలేకపోవచ్చు. కానీ, ప్యాసింజర్ ప్రయాణాన్ని మాత్రం ఆపలేరు. అటువంటి సమయంలో మీరు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ టికెట్ లేకుండా రిజరేషన్ బోగీలో ప్రయాణించాలనుకుంటే .. రూ. 250 అపరాధ రుసుముతో (ఫైన్) పాటు ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఛార్జీని చెల్లించాలి. ఆపై టీటీఈ నుంచి సంబంధిత టికెట్ తీసుకోవాలి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? రైల్వే ప్రయాణికులకు శుభవార్త
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ట్రైన్ జర్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో డబ్బులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రయాణికుల సౌకర్యార్ధం.. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్న ట్రైన్ టికెట్‌ను ఇతర కుటుంబ సభ్యులకు బదిలీ చేసేలా ఐఆర్సీటీసీ వెసలుబాటు కల్పించింది. టికెట్ కన్ఫర్మ్ అయినవారు..వారి టికెట్ టికెట్‌ను కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 24గంటల ముందే అప్లయ్ చేయాలి. ఇక్కడ ప్రయాణికులు గమనించాల్సిన విషయం ఏంటంటే.. క్యాన్సిల్ అయ్యే టికెట్‌ను ఒక్కసారి మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంది. టికెట్‌ను ట్రాన్స్ ఫర్ చేయాలంటే కన్ఫర్మ్ టికెట్ ప్రింటవుట్ తీసుకోవాలి. ఎవరికైతే టికెట్‌ను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు, లేదంటే ఓటర్ ఐడి ఉండాలి. రైల్వే స్టేషన్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్‌ను బదిలీ చేయమని కోరుతూ అప్లయ్ చేయాలి. -
ట్రైన్లో మహిళకు వేధింపులు.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు!
భోపాల్: రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఓ మహిళను వేధించారనే కారణంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైన ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో గురువారం జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సునీల్ సరాఫ్(కోట్మా నియోజకవర్గం), సిద్దార్థ కుశ్వాహా(సాట్నా నియోజకవర్గం)లు రేవాంచల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏసీ కోచ్‌లో గురువారం ప్రయాణం చేశారు. మద్యం మత్తులో వారు కర్నీ స్టేషన్లో ట్రైన్ ఎక్కారు. అదే కోచ్‌లో ఓ మహిళ తన శిశువుతో ప్రయాణం చేస్తోంది. ఎమ్మెల్యేలు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారి ప్రవర్తనపై భర్తకు ఫోన్ ద్వారా తెలియజేసింది. ఏసీ కోచ్‌లో ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ రైల్వే శాఖ, రైల్వే పోలీసులకు ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు బాధితురాలి భర్త. ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు ట్రైన్‌లోకి వెళ్లి మహిళ బెర్త్‌ను మార్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ఎల్ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? -
వైరల్: ట్రైన్లో సీట్ దొరకలేదు.. ఏం పర్లేదు, ఇలా హాయిగా పడుకోవచ్చు
వీకెండ్స్‌లో, పండుగ సమయాల్లో రైలు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నెల రోజుల ముందు టికెన్ రిజర్వేషన్ చేసుకుంటే గానీ సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఇక అకస్మికంగా ఊరేళ్లాలనుకుంటే బస్సులో సీట్ దొరుకుతుందేమో కానీ రైల్లో అయితే కష్టం. జనరల్ టికెట్ తీసుకొని నిల్చొని ప్రయాణం చేయాల్సిందే. మనలో చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ వ్యక్తి మాత్రం ఇబ్బందులను దాటుకొని వినూత్న ఆలోచన చేశాడు. రైలులో తనకంటూ ప్రతేక సీట్‌ను ఏర్పాటు చేసుకొని హాయిగా పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల క్రితం మీమ్స్ పేజ్ షేర్ చేసింది. చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా? ‘భారతీయుల తెలివితో మీరెప్పుడూ సరిపోలేరు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూవ్స్, వేలల్లో లైకులు వచ్చి చేరుతున్నాయి. దీనిలో అసలేముందంటే.. రైలులో కోచ్ పూర్తిగా నిండిపోవడంతో ఓ వ్యక్తికి సీట్ దొరకలేదు. అయితే రాత్రి పడుకోడానికి అతనికి నేల తప్ప మరెక్కడ చోటు లేకపోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తికి అద్భుతమైన ఆలోచన తట్టింది. తన దగ్గరున్న బెడ్‌షీట్‌ను తీసుకొని ఒక చివర లగేజ్ హోల్డర్‌కు, మరో సీటుకు కలిపి గట్టిగా కట్టాడు. దీంతో కోచ్ మధ్యలో ఊయల లాగా ఏర్పడింది. వెంటనే పెక్కి ఎక్కి ఆ ఊయలలో హాయిగా పడుకుంటాడు. చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!! View this post on Instagram A post shared by MEMES.BKS🤟🙂 (@memes.bks) దీనిని చూసిన తోటి ప్రయాణికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. అతడి తెలివిని తలుచుకొని నవ్వుకుంటారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇలా అయితే ట్రైన్ టికెట్ కూడా అవసరం లేదు. ఇతనికి తెలివి బాగా ఉంది. ఇలా పడుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. ఇంకోసారి ట్రైన్లో వెళ్లేటప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. -
వైరల్: నక్క తోక తొక్కిన కుక్క ! వీఐపీలా..
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులంటే ముఖ్యంగా కుక్కనే ఎక్కువ మంది పెంచుకుంటారు. ఆ జాబితాలో కొందరు వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు. కొందరు వీటిని అల్లారు ముద్దుగా కూడా పెంచుకునే వాళ్లు ఉన్నారు. ఇటీవల తన పెంపుడు కుక్క కోసం ఓ మహిళ ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: Funny Video: ఏయ్ నిన్నే.. పిలుస్తుంటే పట్టించుకోవా.. పంతం నెగ్గించుకున్న పిల్ల ఏనుగు ) తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం రైలులోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేశాడు. అంతేనా ఆ పెట్ డాగ్ రైలు జర్నీపై ఓ వీడియోని చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణీకుడు లాబ్రడార్లు, బాక్సర్లు వంటి చిన్న లేదా పెద్ద కుక్కలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. కానీ పెంపుడు జంతువులు మాత్రం ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో మాత్రమే ప్రయాణించడానికి వీలుంది. మరొక నిబంధన ఏమిటంటే తమ పెంపుడు జంతువుల కోసం సదరు వ్యక్తి రైలులోని మొత్తం కంపార్ట్మెంట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న కుక్క పిల్లలు అయితే వాటి కోసం కొన్ని కంపార్ట్మెంట్లలో బాక్స్‌లు ఉంటాయి. వాటికి ఆహారం యజమానులే తెచ్చుకోవాల్సి ఉంటుంది. View this post on Instagram A post shared by Rio (@alabnamed_rio) చదవండి: చాట్ అమ్ముతూ కేజ్రీవాల్ !.. తీరా చూస్తే అసలు కథ వేరే.. -
రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్
పాట్నా: బిహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీనికి ఆయన లోదుస్తులు ధరించి రైలులో తిరగమే కారణం. ఈ ఘటన గురువారం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసకుంది. అసలేం జరిగిందంటే.. జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏసీ బోగిలో ప్రయాణించారు. అయితే ఈ రైలు ఉత్తర ప్రదేశ్‌లోని దిల్‌నగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో ఎమ్మెల్యే తన దుస్తులు తీసేసి కేవలం లోదుస్తులు(బనియన్,అండర్వేర్)తో వాష్‌రూమ్‌కు వెళ్లారు. అయితే అదే కంపార్ట్మెంట్లో బిహార్‌కు చెందిన ప్రహ్లద్ పాశ్వాన్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యే అవతారం చూసిన ఆ వ్యక్తి మండల్ వేషాధారణపై అ్యభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో మండల్ ఆ వ్యక్తితో వాదనకు దిగాడు. అక్కడితో ఆగకుండా ఇతర ప్రయాణికులను సైతం దూషించాడు. కాగా మండల్ ప్రయాణికులను కొట్టేందుకు ప్రయత్నించాడని, వారు ఎమ్మెల్యే ప్రవర్తనపై మండిపడటంతో కాల్చి వేస్తామని కూడా బెదిరించాడని పాశ్వాన్ ఆరోపించారు. అయితే అతను బిహార్ ఎమ్మెల్యే అని తనకు తెలీయదని పేర్కొన్నారు. చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్ ఇదంతా జరిగిన తర్వాత ప్రయాణికులు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మండల్‌ను రైలులోని మరో కోచ్‌కు మార్చారు. అయితే చివరికి గోపాల్ మండల్ తన చర్యలను సమర్థించుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కడుపు నొప్పి ఉందని అందులే కేవలం లోదుస్తులు ధరించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే లోదుస్తులు ధరించిన ఫోటోలు, వివరణ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే అతన్ని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘అండర్ వేర్లో తిరుగుతుంటే కడుపు నొప్పి తగ్గుతుందని మాకు తెలియదే’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. గోపాల్ మండల్ స్నేహితుడు కునాల్ సింగ్ మాట్లాడుతూ.. మండల్ డయాబెటిస్ పేషెంట్ అని, ఏదో "అత్యవసర పని మీదసం ఢిల్లీ వెళ్తున్నాడని పేర్కొన్నాడు. మండల్ అధిక బరువు కారణంగా బట్టలతో వాష్‌రూమ్‌కు వెళ్లలేకపోయాడని అందుకే లుంగీ మీద వాష్‌రూమ్ ఉపయోగించాలనుకున్నట్లు తెలిపాడు. ‘రైలు ఎక్కిన తర్వాత, గోపాల్ వాష్‌రూమ్‌కు వెళ్లాలనుకున్నాడు. తొందరపాటులో తన లోదుస్తుల్లో వెళ్లాడు. అప్పుడే ఓ ప్యాసింజర్ మండల్‌తో మాట్లాడాడు. దీనికి మండల్ బదులేమి ఇవ్వకుండా వాష్‌రూమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్యాసింజర్‌తో మాట్లాడారు "అని కునాల్ సింగ్ చెప్పారు. #WATCH I was only wearing the undergarments as my stomach was upset during the journey: Gopal Mandal, JDU MLA, who was seen in undergarments while travelling from Patna to New Delhi on Tejas Rajdhani Express train yesterday pic.twitter.com/VBOKMtkNTq — ANI (@ANI) September 3, 2021 -
15ఏళ్ల తర్వాత రాష్ట్రపతి కోవింద్ రైలు ప్రయాణం
-
రైల్వే అధికారుల రాజభోగం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రైల్వే అధికారుల ప్రయాణం అత్యంత ఖరీదు వ్యవహారంగా మారింది. కోవిడ్ ఆంక్షల దృష్ట్యా రెగ్యులర్ రైళ్లను, ప్యాసింజర్ రైళ్లను పక్కన పెట్టి సామాన్య ప్రయాణికులకు రైల్వే సేవలను దూరం చేసిన అధికారులు తాము మాత్రం విలాసవంతమైన సెలూన్ కోచ్‌లలో విహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు తనిఖీల్లో భాగంగా తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం ఈ సెలూన్లను వినియోగిస్తుండగా .. మరికొందరు ఎలాంటి తనిఖీలు లేకుండానే వీటిని వినియోగించుకుంటున్నట్లు సమాచారం. రాజసాన్ని, విలాసాన్ని ప్రతిబింబించే సెలూన్ కోచ్‌లను ఉన్నతాధికారులు తమ అధికారిక పర్యటనల కోసం వినియోగించుకొనే అవకాశం ఉన్నప్పటికీ ‘హోమ్ ఆన్ వీల్స్’ పేరిట ప్రయాణికులకు సైతం వాటిని అందుబాటులోకి తేవాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. పెళ్లిళ్లు, వేడుకలు, ఇంటిల్లిపాది కలిసి వెళ్లే పర్యటనల కోసం ప్రయాణికులు ఐఆర్సీటీసీ ద్వారా సెలూన్లను రిజర్వ్ చేసుకొనే సదుపాయం ఉంది. బ్రిటీష్ కాలం నుంచి ఇటీవల వరకు అధికారులకే పరిమితమైన సెలూన్లను మొదటిసారి ప్రయాణికుల వినియోగింలోకి తెచ్చారు. కానీ ఒకవైపు కోవిడ్ ఉధృతి, మరోవైపు సెలూన్ ప్యాకేజీలపైన పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ప్రయాణికుల వినియోగంలోకి రాలేదు. రైల్వేపై ఆర్ధిక భారం రైళ్ల నిర్వహణ, వనరుల వినియోగంలో పారదర్శకతను పాటించే అధికారులు సెలూన్ ప్రయాణాల పేరిట మాత్రం రూ.లక్షల్లో ఖర్చు చేయడం గమనార్హం. ఒక ఉన్నతాధికారి ఒకసారి సెలూన్ జర్నీ చేసేందుకు అయ్యే ఖర్చుతో విమానంలో ఎగ్జిక్యూటీవ్ జర్నీ చేయవచ్చునని కార్మిక సంఘం నాయకుడొకరు విస్మయం వ్యక్తం చేశారు. ఏసీ బోగీ అయిన ఈ సెలూన్లో రెండు బెడ్ రూమ్‌లు, ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, మరో నలుగురు ప్రయాణం చేసేందుకు వీలుగా పడకలు ఉంటాయి. సకల సదుపాయాలు ఉన్న ఈ బోగీ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. ఆర్పీఎఫ్ భద్రత ఎలాగూ ఉంటుంది. వెరసి ఒక సెలూన్ వినియోగానికి గంటకు రూ.2,500 చొప్పున నిర్వహణ భారం పడుతుంది. సిబ్బంది ట్రావెలింగ్ అలవెన్సులు, ఇతరత్రా ఖర్చులన్నీ అదనం. హైదరాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, కర్నూలు, విశాఖ, షిర్డీ, ఊటీ, ఢిల్లీ తదితర ప్రాంతాలకు రెగ్యులర్‌గా రాకపోకలు సాగిస్తున్నారు. ‘రాయల్’ జర్నీ కోసమేనా... బ్రిటీష్ కాలం నుంచి రైల్వే అధికారులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. జనరల్ మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులకు పనిచేసే నగరంలో బంగళాలతో పాటు బంగళా ఫ్యూన్లను ఏర్పాటు చేశారు. అలాగే ఈ తరహా సకల సదుపాయాలు కలిగిన విలాసవంతమైన సెలూన్లను అందుబాటులో ఉంచారు. రాయల్ సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రత్యేక సదుపాయాలపైన రైల్వేశాఖ ఆంక్షలు విధించింది. కానీ కొంతమంది అధికారులు వీటిని ఖాతరు చేయడం లేదు. రైళ్ల రాకపోకల్లో జాప్యం సెలూన్ కోచ్‌లను ప్రధాన రైళ్లకు అటాచ్ చేయడంతో పాటు డిటాచ్ చేసే సమయంలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటుంది. అలాగే సెలూన్ల కోసం కేటాయించిన ప్లాట్‌ఫామ్‌లపైన రైళ్లను నిలిపేందుకు అవకాశం ఉండదు. దీంతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుంది. సెలూన్తో బయలుదేరే రైళ్లు అరగంట నుంచి ముప్పావు గంట వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ‘సికింద్రాబాద్ స్టేషన్లో వారానికి రెండు, మూడు సెలూన్లు కనిపిస్తాయి. ఆ సెలూన్ల అటాచ్మెంట్, డిటాచ్మెంట్ సేవలతో పాటు సదరు అధికారి వెళ్లిపోయే వరకు మొత్తం యంత్రాంగమంతా ఆయన సేవలోనే నిమగ్నమైపోతుంది. దీంతో సాధారణ రైళ్ల నిర్వహణ లో జాప్యం జరుగుతుంది’ అని ఒక సీనియర్ లొకోపైలెట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
రైలు ప్రయాణంలో కోవిడ్ ముప్పు ఎంతంటే..
లండన్: చుక్‌చుక్ రైలు వస్తోంది. దూరం దూరం జరగండి అనే అంటున్నారు శాస్త్రవేత్తలు. కోవిడ్ నేపథ్యంలో రైలు ప్రయాణం భద్రమని హెచ్చరిస్తున్నారు. రైలు ప్రయాణంలో కరోనా సోకే ముప్పు ఎంత ఉందో శాస్త్రీయంగా అంచనాలు వేశారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తో పాటు యూకేకి చెందిన కొన్ని యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ప్రయాణికుల మధ్య ఉన్న దూరం, ఎంత సేపు కలిసి ప్రయాణం చేస్తారు ? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం నిర్వహించారు. ► రైలు ప్రయాణికులు ఎంత దగ్గరగా కూర్చున్నారన్న దానిని బట్టి వైరస్ వ్యాప్తి రేటు 0.32%గా ఉంటుంది. ► కోవిడ్ రోగి పక్కనే కూర్చొని ప్రయాణం చేస్తే సగటున వైరస్ వ్యాప్తి 3.5% ఉంటుంది. ► రోగితో పాటుగా ఒకే వరుసలో కూర్చొని ప్రయాణం చేస్తే వైరస్ సోకడానికి 1.5% అవకాశం ఉంది. ► కోవిడ్ రోగి ఖాళీ చేసిన సీటులో మరొక ఆరోగ్యవంతుడు వచ్చి కూర్చుంటే 0.75% రేటుతో వైరస్ వ్యాప్తి చెందుతుంది. ► బోగీలో ఉండే మొత్తం ప్రయాణికుల సంఖ్యను బట్టి వారు ప్రయాణించే సమయాన్ని బట్టి ప్రతీ గంటకి వైరస్ సోకే ముప్పు 1.3% పెరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు ఎలా ? ఒక గంటసేపు కలిసి ప్రయాణం చేస్తే ఇద్దరు ప్రయాణికుల మధ్య దూరం ఒక మీటర్ కంటే ఎక్కువ ఉండాలని, అదే రెండు గంటల ప్రయాణమైతే 2.5 మీటర్ల కంటే ఎక్కువ దూరం పాటించాలని యూకేలోని సౌతాంప్టన్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త షెంగ్జీ లాయ్ అన్నారు. రైలు ప్రయాణానికి ముందు టెంపరేచర్ చెకింగ్ తప్పనిసరిగా చేయాలని ఆయన సూచించారు