V. Hanumantha Rao
-
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అంబర్‌పేట ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్యంపై సమాచారం అందాల్సి ఉంది. -
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... అసెంబ్లీకి రావాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకుని శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్.. కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులతోనూ మాట్లాడారు. తర్వాత ఆస్పత్రి బయట రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను పరామర్శించాను. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నా. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరముంది. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నా..’’అని రేవంత్ అన్నారు. కేటీఆర్, హరీశ్‌లను కలసిన పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చానని.. అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడానని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కేసీఆర్ త్వర గా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. కేసీఆర్‌కు వీహెచ్, కోదండరెడ్డి పరామర్శ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కోదండరెడ్డి పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన ఇద్దరు నేతలు కేసీఆర్‌ను కలిశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొలుత కేసీఆర్‌ను కలిసేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతించకపోవడంతో.. మాజీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్ నేతలను లోపలికి తీసుకెళ్లారు. మరో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్? సాధారణంగా తుంటి మారి్పడి సర్జరీ చేయించుకున్న అనంతరం రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ డిశ్చార్జిని కొద్దిగా పొడిగించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన బాగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ మందుల వాడకం, సులభమైన వ్యాయామాలు తప్ప మరే ప్రత్యేకమైన వైద్య సేవలూ అవసరం లేదని అంటున్నారు. దీంతో ఆయనను మరో 2, 3 రోజుల్లోనే డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పూర్తిగా కోలుకుని తన కార్యకలాపాలు య «థావిధిగా నిర్వర్తించేందుకు మరి కొన్ని వారా లు పడుతుందని వైద్యులు అంటున్నారు. -
అగ్నిప్రమాద స్పాట్లో కేటీఆర్, వీహెచ్..
-
చాకిరీ మాది... పదవులు మీకా?
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 51కి తగ్గకుండా తమకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని టీపీసీసీ బీసీ నేతల సమావేశం డిమాండ్ చేసింది. ‘అగ్రవర్ణాల నేతలకు టికెట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. వారంతా వారివారి నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు. మరి, బీసీ నేతలకు టికెట్లు ఎప్పు డు ప్రకటిస్తారు? చాకిరీ మాది..సీట్లు, పదవులు మీకా? సమీకరణల పేరుతో ప్రతీసారి ఆఖరి నిమిషంలో టికెట్లు ఇస్తున్నారు. అలాకాకుండా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలి. అప్పుడే నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పనిచేసుకునే అవకాశం లభిస్తుంది’అని సమావేశంలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు. పార్టీలోని ఏ ఒక్క సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదని, కానీ జనా భా ప్రాతిపదికన తమ కోటా సీట్లు, పార్టీ పదవులు తమ కు ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీ సీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల నేతృత్వంలో మంగళ వారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం జరిగింది. ఇందులో 100 మందికిపైగా బీసీ నేతలు పాల్గొన్నారు. 1% జనాభా లేని వారితో సమానంగా టికెట్లా? సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పార్టీలో తమ వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని అటు ఏఐసీసీ, ఇటు టీపీసీసీలను కోరారు. ప్రతి పార్లమెంటు స్థానంలో కనీసం 3 అసెంబ్లీ స్థానాల చొప్పున 51కి తగ్గకుండా మెజార్టీ కులాలకు టికెట్లు కేటా యించాలని ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 30–32 సీట్లకే బీసీలను సరిపెడుతున్నారని, ఒక్క శాతం జనాభా లేని వారితో సమానంగా టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల గురించి మాట్లాడితే తొక్కేస్తారనే భయం ఇప్పటికీ పార్టీలో ఉందని, పార్టీ పదవుల కేటాయింపులో మార్పు రావాలని చెప్పారు. జిల్లాల వారీగా సమావేశాలు దేశవ్యాప్తంగా బీసీ కులాలకు ప్రాధాన్యమివ్వాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఓబీసీల జనగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని, పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని వెల్లడించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించారు. బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్న ఆలోచనతో రాహుల్ ఓబీసీలను కించపర్చారంటూ బీజేపీ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభనిర్వహణపై మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల జనాభా, ఓట్ల వివరాలతో కూడిన నివేదికను సోనియా, రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలకు అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, పార్టీ నేతలు శ్యాంమోహన్ పాల్గొన్నారు. -
పీసీసీ అధ్యక్షుడు అందర్నీ కలుపుకొని పోవాలి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అందరినీ కలుపుకొని పోవాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) హితవు పలికారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అధిష్టానం సమీక్ష చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సమీక్ష చేసి ఓటమి కారణాలు తెలుసుకుని పార్టీని బలోపేతం చేసుకొనే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రస్తుత రిజర్వేషన్ల కారణంగా ఎక్కువ జనాభా ఉన్న ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని వీహెచ్ ఆవేదన వ్యక్తంచేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 20న ఢిల్లీలో నిర్వహించే అన్ని పార్టీల ఓబీసీ ఎంపీలతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వీహెచ్ వెల్లడించారు. చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 12 మంది రాజీనామా -
కోవర్టు రెడ్డిగా ఉంటావో.. కోమటిరెడ్డిగా ఉంటావో నీ ఇష్టం: వీహెచ్
జడ్చర్ల: ‘మునుగోడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండి మంత్రి కేటీఆర్ అన్నట్లు కోవర్టురెడ్డిలా ఉంటావో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషిచేసి కోమటిరెడ్డిలా ఉంటా వో నీ ఇష్టం’.. అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంగళవారం కోమటిరెడ్డిని కలిసిన ప్పుడు.. తమ్ముడి కోసం రాజకీయ భవిష్యత్ ను ఎందుకు పణంగా పెడుతున్నావని ప్రశ్నించినట్లు చెప్పారు. మునుగోడు ఆడబిడ్డను అందరం కలిసి గెలిపించుకుందామని వెంకట్ రెడ్డికి నచ్చజెప్పానని పేర్కొన్నారు. -
రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన వీహెచ్
-
కాంగ్రెస్‌లో కల్లోలం: వీహెచ్ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలు కలవలేదు. కానీ టీపీసీసీ ఆదేశాలను పక్కనపెట్టి సిన్హాను వీహెచ్ కలిశారు. ఆయన వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ: మంత్రి తలసాని సిన్హాను కలవబోమని ముందే టీపీసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని నిర్ణయాన్ని ఎవ్వరైనా పాటించాల్సిందేనని.. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే గోడకేసి కొడతామని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలనీయం’’ అంటూ ధ్వజమెత్తారు. మన ఇంటికి వచ్చినప్పుడే మనం కలవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. -
ఢిల్లీ పర్యటనకు నాకు ఆహ్వానం అందలేదు: వీహెచ్
-
బిహార్ ఐఏఎస్‌లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ల ఆగ్రహం
-
రేపటి నుంచి నా సంగతి ఏంటో చూపిస్తా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎల్పీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాజీ ఎంపీ వీ హనుమంతరావు భేటీ అయ్యారు. రేవంత్‌కి పీసీసీ ఇచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు నచ్చజెప్పే బాధ్యతను పొలిటికల్ అఫైర్స్ కమిటీ వీహెచ్‌కి అప్పగించింది. ఇదిలా ఉండగా శనివారం సీఎల్పీ ఆఫీస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం మొదలుపెడతా. రేపటి నుంచి నా సంగతి ఏంటో చూపిస్తా. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం- సోనియాగాంధీ నా దేవత. మా పార్టీ నేతలే అప్పుడు దయ్యం ఇప్పుడు దేవత అంటున్నారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారు. నేను జిల్లా లీడర్‌ను వాళ్లంతా పెద్ద గొప్ప లీడర్లు. ఏపీలో కాంగ్రెస్ లేదనుకుంటే 6 వేల ఓట్లు వచ్చాయి. తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లు రాలే. చదవండి: (ఇది చేతకాని ప్రభుత్వం: వైఎస్ షర్మిల) గెలుపోటములు సహజం కేసీఆర్ ఇక రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల గురించి ఆలోచన చేయాలి. కేటీఆర్ సూటు, బూటు వేసుకుంటే పెట్టుబడులు రావు. కాంగ్రెస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. కేటీఆర్ ఎందుకు రైతుల గురించి వాళ్ల కష్టాల గురించి మాట్లాడరు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం. మా ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చదవండి: (హరీశ్.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో) -
ఎంఐఎంకు ఇచ్చారు.. మాకు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ట్రాఫిక్ క్లియర్ చేసి ఆరెస్సెస్ కవాతుకు ఎలా అనుమతిచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు కర్రలతో భయానక వాతావరణం సృష్టిస్తే, దానికి పోలీసులు సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ ర్యాలీకి సంబంధించిన వీడియోను పవర్‌పాయింట్ ద్వారా మీడియాకు చూపించాడు. గాంధీభవన్‌లో శుక్రవారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఎన్నికలు, చేపట్టాల్సిన ర్యాలీ, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘తిరంగ్ యాత్ర’, ‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’కు అనుమతులివ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. 130 కోట్ల మంది భారతీయులు హిందువులేనంటూ రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నది ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదని కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక 135వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు అన్ని జిల్లాల్లో జెండావిష్కరణ చేసుకుని ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ చేరుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేశామని హైదరాబాద్‌లో కూడా ర్యాలీ చేయాలనుకున్నామన్నారు. కానీ ట్రాఫిక్ సమస్య పేరుతో అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. తాము అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మాత్రమే వెళతామంటున్నాం. కానీ అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు ఎలర్జీ అని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎంఐఎం సభకు ఎలా అనుమతి ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. మజ్లీస్, బీజేపీతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ దేశంలో హిందువులు మాత్రమే కాదు.. అన్ని మతాల వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఇది సెక్యులర్ దేశమని నొక్కి చెప్పారు. ఆర్ఎస్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎలాగైనా రేపు సేవ్ ఇండియా-సేవ్ కాన్స్టిట్యూషన్ ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. -
భట్టి ముందే బాహాబాహీ!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యాక్రమం రసాభాసగా మారింది. సీనియర్ నేత వి హనుమంతరావును అంబర్‌పేట నియోవర్గ నేత శ్రీకాంత్ అనచరులు అడ్డుకున్నారు. శ్రీకాంత్‌కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. ఆయన అనచరులు ఆందోళన చేపట్టారు. సహనం కోల్పోయిన వీహెచ్ వారిపై దుర్భాషలాడారు. దీంతో శ్రీకాంత్ అనచరులు వీహెచ్‌పైకి దూసుకెళ్లారు. అతనికి వ్యతిరేకంగా వీహెచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వీహెచ్ వర్గీయులు కూడా దూసుకురావడంతో సమావేశం రచ్చ రచ్చైంది. ఇరువర్గాల నేతలు కుర్చీలతో, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తలను సీనియర్ నేతలు శాతింపజేసే ప్రయత్నం చేశారు. సీఎల్పీనేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కను శనివారం సన్మానించేందుకు పార్టీ వర్గాలు గాంధీభవన్‌లో ఏర్పాటు చేశాయి. అయితే వీహెచ్-శ్రీకాంత్ వర్గపోరుతో ఈ సమావేశం రసాభాసగా మారింది. -
కోమటిరెడ్డి, వీహెచ్‌పై అధిష్టానం సీరియస్
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేత వి. హనుమంతరావుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా ఆగ్రహంగా ఉంది. ఎన్నికల కమిటీల కూర్పును విమర్శిస్తూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన వీరిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కోమటిరెడ్డి, వీహెచ్ వ్యవహారంపై కమిటీ చర్చించింది. కోమటిరెడ్డికి నోటీసులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కుంతియా, కమిటీల ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చాయని కమిటీ తెలిపింది. ఏఐసీసీ ఇంఛార్జ్, కమిటీల కూర్పు, కమిటీ సభ్యులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు గుర్తించామని పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మీడియా ముందు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించినా పట్టించుకోకుండా పార్టీకి నష్టం జరిగేలా చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిటీ తెలిపింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. స్పందించిన కుంతియా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియా తెలిపారు. వీరిద్దరి వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీలో చర్చ జరుగుతుందన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. కాగా, కుంతియా శనిలా దాపురించారంటూ కోమటిరెడ్డి గురువారం తీవ్రస్థాయిలో విరుకుపడ్డారు. -
‘ఇక మా గెలుపు ఎవరూ ఆపలేరు’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికిపైగా డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఇక కాంగ్రెస్ గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమవుతుందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితాతో సీఎం సెల్ఫ్‌గోల్ నెరవేర్చుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అందుకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తే 100 సీట్లు రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థుల కోసం పార్టీల్లో కొట్లాడుతానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కొడుకును సీఎం చేయడం కోసమే ముందస్తు : వీహెచ్ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ఆరోపించారు. నిజామాబాద్‌లోని కల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నారు. ‘కల్లూరు గ్రామం నుంచి మట్టిని తెచ్చి గాంధీ భవన్లో పెడతా. కేసీఆర్‌ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే గ్రామంలో చల్లుతానని శపధం చేశారు. ఎన్నికల మేనిపెస్ట్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. -
‘శ్యామల చెప్పింది నిజమైతది’
సాక్షి, హైదరాబాద్: ఉజ్జయిని అమ్మవారి బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం, పోలీసు శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగిని శ్యామలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ వి. హన్మంతరావు మద్దతు తెలిపారు. శ్యామల చెప్పింది నిజమైతదని, తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వపాలన ముగియక తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణలో సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కావాలనే నిర్వహించడంలేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. గ్రామాలకు ప్రత్యేక అధికారుల వస్తే తరిమి కొట్టండని వీహెచ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో డిక్టేకర్ రాజ్యం నడుస్తోందని, ప్రజలు ఈ ప్రభుత్వంపైన తిరగబడితే కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందని వీహెచ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు తాయిలాలే తప్ప రాజకీయంగా న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య చెప్పి, ఇప్పుడు మళ్లీ బీసీల గణన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని వీహెచ్ కోరారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయించే ఆనవాయితీ ఉందని తెలిపారు. ప్రజల్లో తిరిగే ఓపిక ఇంకా ఉందని, కాంగ్రెస్ కోసం ఒక కార్యకర్తలా పనిచేస్తానని పేర్కొన్నారు. -
శక్తి యాప్‌తో కార్యకర్తకు శక్తి
సాక్షి, హైదరాబాద్: కార్యకర్తలకు శక్తినివ్వడానికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ శక్తి యాప్‌ను క్రియేట్ చేయించారని టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. యాప్ రిజిస్ట్రేషన్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అధ్యక్షతన గాంధీభవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించడం కోసమే.. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు తెలిపారు. రాహుల్ ఆదేశాల మేరకే శక్తి యాప్ రివ్యూ మీటింగ్ కోసం చిదంబరం తెలంగాణకు వచ్చారన్నారు. ప్రతి రోజు కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాన్ని తెలియజేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌లో శక్తి యాప్ మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే యాప్‌లో లక్ష మెంబర్ షిప్ దాటిందని ఉత్తమ్ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. వీహెచ్ గరంగరం అంబర్‌పేటలో నూతి శ్రీకాంత్ అనే నేత శక్తి యాప్‌లో కార్యకర్తలను చేర్పించారని తెలిపిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను చేర్పించిన ఘనత శ్రీకాంత్ ఒక్కడికే ఇవ్వడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా కార్యకర్తలను ఎలా చేర్పిస్తావంటూ రాంమోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనతో పెట్టుకోవద్దంటూ వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. -
‘ప్రతి ఇంటికి తాళం వేయండి’
సాక్షి, హైదరాబాద్ : కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను నగర బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని కాగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతల పేరిట ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలెవరూ బయటకి రాకుండా ప్రతి ఇంటికి తాళం వేయండి ..శాంతి భద్రతలు ఇంకా బాగుంటాయని ఎద్దెవా చేశారు. పరిపూర్ణానంద స్వామి బహిష్కరణపై చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. స్వామీజీ ఎం తప్పు చేశారని ఆయనపై గుండా యాక్ట్ పెట్టారని మండిపడ్డారు. ప్రగతి భవన్ వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేడయం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ప్రతి చర్యను గవర్నర్ సమర్థించడం సరికాదన్నారు. -
బీజేపీది అక్కడో మాట, ఇక్కడో మాట: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కేంద్ర నేతలు టీఆర్ఎస్ పాలన బాగుందంటే, రాష్ట్ర నేతలేమో ప్రభుత్వంతో కొట్లాడుతు న్నారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై ద్వంద్వ వైఖరితో ఉన్న బీజేపీ నేతలు.. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనడం హాస్యాస్పదమ న్నారు. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దీనిపై ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తామన్నారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదన్నారు. -
దళితులకు రక్షణ లేదు: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఇసుక లారీలు తగలబెట్టారని, అయితే పోలీసులు ప్రమాదానికి కారణమైన నిందితులను వదిలేసి లారీలను తగలబెట్టిన దళితులను అదుపులోకి తీసుకొని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దళితులపై దాడులకు నిదర్శనమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాలు పెరిగిపోతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని పేర్కొన్నారు. దీని వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఆరోపించారు. -
మీరాకుమార్ను ఓడిస్తారా..!
కేసీఆర్‌పై వీహెచ్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్ను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించాలని సీఎం కేసీఆర్ ఎలా పనిచేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు.గురువారం ఆయన మాట్లాడుతూ మీరాకుమార్‌కు వ్యతిరేకంగా ఓటేయాలనే కేసీఆర్ నిర్ణయం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్కు విధేయుడైన రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంపై ఎంఐఎం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేస్తామంటే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. -
నరసింహన్‌తో ఒరిగిందేమీ లేదు
కేంద్ర హోం మంత్రికి వీహెచ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ నరసింహన్ వల్ల గత ఏడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదని, ఆయన పదవీ కాలం పొడిగింపును పునఃసమీక్షించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శనివారం లేఖ రాశారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉన్న నరసింహన్ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది పోయి.. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పాల్ప డుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు వంతపాడుతున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. నరసింహన్ పదవీ కాలాన్ని పొడిగిస్తే ఏపీ, తెలంగాణలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నా గవర్నర్ చర్యలు తీసుకోకపోగా.. పార్టీ ఫిరాయించిన వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు విస్మరించిందని, రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదని, మద్దతు ధర లేక ఆందోళన చేపట్టిన మిర్చి రైతులను గూండాలుగా చిత్రీకరించి జైల్లో పెడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నా గవర్నర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆలయాలు సందర్శించడానికే గవర్నర్ సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవ డం లేదన్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారన్నారు. ఆయన పదవీ కాలం పొడిగింపును సమీక్షించి.. కొత్త గవర్నర్‌ను నియమించాలని కోరారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లందరినీ వెనక్కి పిలిచి.. నరసింహన్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారని వీహెచ్ ప్రశ్నించారు. -
అమ్ముకున్నవారికీ ‘మద్దతు’ ఇవ్వాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంటను ఇప్పటికే 40శాతం దాకా రైతులు అమ్మేసుకున్నారని, వారికీ కేంద్రం అందించే ధర, బోనస్‌ను ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం కనీసం క్వింటాలు మిర్చికి రూ.10 వేలు ఇవ్వాల్సిందన్నారు. మిర్చి పంటను కొనుగోలు చేయ లేని అసమర్థత నుంచి, దృష్టి మళ్లించడానికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులను పెట్టిందని ఆరోపించారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న గవర్నర్
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరా యించిన ఎమ్మెల్యే లతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ కార్య దర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని పట్టించు కోకుండా అధికారంలో ఉన్నవారికి గవర్నర్ భజన చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించినవారిని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాం గాన్ని తూట్లు పొడవడమేనన్నారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్ని కలుస్తానని వీహెచ్ తెలిపారు. -
'ఫిరాయింపు నేతలతో ప్రమాణం చేయించొద్దు'
-
'ఫిరాయింపు నేతలతో ప్రమాణం చేయించొద్దు'
హైదరాబాద్: పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన శనివారం మెరుపు ధర్నా చేపట్టారు. వెంటనే అలర్టయిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఈ సందర్భంగా వీహెచ్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించకూడదని వీహెచ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో చేసినట్టే ఏపీలో కూడా చేస్తే గవర్నర్‌ను బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరతామని ఆయన తెలిపారు. అంతే కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యమం కూడా చేపడతామని వీహెచ్ హెచ్చరించారు. -
అధికారం తలకెక్కించుకోవద్దు
మాజీ ఎంపీ వి.హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: అధికారాన్ని తలకు ఎక్కించుకోవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ నాయకు లకు, మంత్రులకు చెబుతున్నా.. ఆ విష యాన్ని ఆయన కుమారుడు కేటీఆర్‌కు చెబితే బాగుంటుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు హితవు పలికారు. సీఎం కుమారుడైనంత మాత్రాన కేటీఆర్ ఏమైనా మాట్లాడవచ్చా అని బుధవారం ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయిం ట్ వద్ద విలేకరులతో మాట్లాడినంత మాత్రాన తనపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన వాళ్లను తరమికొట్టమని చెబుతారా అని మండి పడ్డారు. కాగా స్పీకర్ ఎస్.మధుసూదన చారితో వి.హనుమంతరావు బుధవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడకుండా పోలీసులు తనను అడ్డుకోవడం, ఆ తర్వాత దారి తీసిన పరిణామాల గురించి ఆయన వివరణనిచ్చారు. -
'కేసీఆర్.. నీ కొడుకుకు నీతులు చెప్పు'
హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకులు, మంత్రులకు సీఎం కేసీఆర్ చెబుతున్న నీతులేవో తన కుమారుడు కేటీఆర్‌కు చెబితే బాగుంటుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) వ్యాఖ్యానించారు. మంత్రులు, ఇతర నేతలు అధికారాన్ని తలకెక్కించుకోవద్దని నీతులు చెబుతున్న కేసీఆర్.. దానిని ముందు ఆయన కుమారుడు కేటీఆర్ పాటించేలా చూడాలన్నారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం కుమారుడు, మంత్రి అయినంత మాత్రాన కేటీఆర్ ఏమైనా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడినంత మాత్రాన తనపై కేసులు పెడతారా అని, తాను చేసిన పాపమేమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను తరమికొట్టాలని చెప్పడం సబబు కాదన్నారు. బీసీలకు కొత్త కమిషన్ కోసం తాను 2005 నుంచి పోరాడుతున్నానని.. క్రిమీలేయర్ వల్లనే బీసీలు నష్టపోతున్నారని, దానిని తొలగిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్నిహితుడని, ఆయన చొరవ తీసుకుని క్రిమీలేయర్‌ను ఎత్తివేయించాలన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారితో వీహెచ్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడకుండా పోలీసులు తనను అడ్డుకోవడం, ఆ తర్వాత దారితీసిన పరిణామాల గురించి ఆయన వివరణన ఇచ్చారు. సీనియర్ నాయకుడిగా, మాజీ ఎంపీగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పీకర్ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం. -
బీసీలను బిచ్చగాళ్లనుకుంటున్నారా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఇవ్వడానికి కేసీఆర్ దానకర్ణుడు.. బర్రెలు, గొర్రెలు తీసుకోవడానికి బీసీలు బిచ్చగాళ్లు అన్నట్టుగా చూస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేయదనే భయంతో బీసీలకు తాయి లాలను ఆశ చూపిస్తున్నారన్నారు. బర్రెలు, గొర్రెలు కాసుకుం టూ బీసీలు చదువుకోవద్దా అని ప్రశ్నించారు. మహిళలు ధైర్యంగా మాట్లాడాలని చెబుతున్న ఎంపీ కవిత.. ముందుగా కేబినెట్లో మహిళలకు అవకాశం ఇవ్వని కేసీఆర్‌ను ప్రశ్నించాలని సూచించారు. కేసీఆర్ ఇంటిలోనే అన్ని ఉద్యోగాలు: రవీంద్ర నాయక్ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారని మాజీ మంత్రి డి.రవీంద్రనాయక్ ఆరోపించారు. ప్రజల ను రెచ్చగొట్టి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుం బంలోనే హరీశ్, కేటీఆర్‌లకు మంత్రి పదవులిచ్చారని, కుమార్తె కవితను ఎంపీని చేశారని అన్నారు. ఈ మేరకు 22 ప్రశ్నలతో కూడిన లేఖను కేసీఆర్‌కు రాశారు. -
బీసీలకు గొర్రెలు.. మీకు పదవులా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు అని మభ్యపెట్టి రాజ్యాధికారం, పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుందా అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. బీసీ విద్యార్థులకు చదువును దూరం చేసి, ఓట్ల కోసం తాయిలాలతో కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అధిష్టాన వర్గం అనుమతిస్తే రాష్ట్రంలో బీసీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు. -
'బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం'
హైదరాబాద్: బీసీలకు అన్యాయం చేసేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కంకణం కట్టుకున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఐఐఎం, ఐఐటీలల్లో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. 60 ఏళ్లు గడిచినా బీసీల రిజర్వేషన్స్ 27 శాతం దాటడం లేదన్నారు. బీజేపీది బీసీ ఓట్ల కోసం రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ క్రిమిలేయర్ విషయం తేల్చకుండా.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని వెంకయ్య మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కూడా బీసీ ఓట్ల కోసం అప్పుడే రాజకీయాలు మెదలుపెట్టాడని మండిపడ్డారు. కాంగ్రెస్ కూడా మేలుకోవాలని, బీసీలు పార్టీ నుంచి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు. బీసీలను సమీకరించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీసీ రిజర్వేషన్స్ పై న్యాయం జరగదని, రిజర్వేషన్స్ రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ ఉద్దేశమన్నారు. ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ తో బీజేపీ సర్కార్ నడుస్తోందన్నారు. దామోదరం సంజీవయ్య జయంతిని కేసీఆర్ సర్కార్ విస్మరించిందన్నారు. ఒక్క మంత్రి గానీ, అధికారి కానీ సంజీవయ్య జయంతికి రాకపోవడం దారుణమన్నారు. దళితుడైన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని విస్మరించడం.. రాష్ట్రంలోని దళితులను అవమానించడమేనన్నారు. -
రాష్ట్రపతి పేరును ఎందుకు చేర్చారు?: హైకోర్టు
హైదరాబాద్: పలు గొడవలకు కారణమైనా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావును తొలగించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరును కూడా చేర్చారు. దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు... రాష్ట్రపతి పేరును ఎందుకు చేర్చారని పిటిషనర్ తరఫు లాయర్ ను హైకోర్టు ప్రశ్నించింది. వీసీని నియమించింది రాష్ట్రపతి కాబట్టే ఆయన పేరు కూడా చేర్చామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అభియోగానికి తగ్గట్టుగా వచ్చే సోమవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను కోరింది. కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. -
రోజాను అడ్డుకోవడం సరికాదు: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: అమరావతిలో జరుగుతున్న మహిళా సదస్సులో పాల్గొనడానికి వెళ్తున్న ఏపీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం సరికాదని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మహిళా సాధికారత పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. కేవలం ప్రచారం, ఓట్ల కోసమే చంద్రబాబు ఇలాంటి సదస్సు నిర్వహించుకుంటున్నారన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్న ఎంపీ కవిత, రాష్ట్రంలో తన తండ్రి కేసీఆర్ కేబినెట్లో మహిళలకు స్థానమెందుకు లేదో చెప్పాలన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పక్క రాష్ట్రంలోని కేబినెట్లో మహిళలు లేరనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. -
'కాపునేతకు బాబు భయపడుతున్నారు'
హైదరాబాద్: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) అన్నారు. ఇక్కడ విలేకరులతో వీహెచ్ మాట్లాడుతూ.. ఆంధ్రాలో ప్రభుత్వ పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తోందని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసనలు తెలియజేసే అవకాశం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ముద్రగడను ఒంటరి చేసి కాపు ఉద్యమాన్ని నీరుగార్చాలని ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వీహెచ్ వ్యాఖ్యానించారు. -
మద్య నిషేధాన్ని అమలు చేయాలి
వీహెచ్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హను మంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లా డుతూ.. ఖజానా నింపుకోవడానికి విచ్చల విడిగా మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆరోపించారు. మద్యం అమ్మకాలు పెరగడం వల్ల తాగుబోతులతో మహిళలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. మద్యం వల్ల యువత పక్కదారి పడుతోందన్నారు. బిహార్ తరహాలో మద్యపాన నిషేధంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని వీహెచ్ కోరారు. మద్యపాన నిషేధంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని తమ పార్టీని కోరుతానని వీహెచ్ చెప్పారు. -
విచ్చలవిడిగా వైన్‌షాపులకు అనుమతి: వీహెచ్
హైదరాబాద్: మద్యం వల్ల యువత పక్కదారి పడుతోందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు(వీహెచ్) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి విచ్చలవిడిగా వైన్‌షాపులకు అనుమతులు ఇస్తోందని ఆరోపించారు. బిహార్‌లో మద్యపాన నిషేధానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ఇది అభినందనీయమన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా మద్య నిషేధం పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ అశం పై అన్ని పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని వీహెచ్ సూచించారు. -
'తాగిన వారిని శిక్షించడమెందుకు?'
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లను ఇష్టారాజ్యంగా నడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం తాగిన వారిని ఎందుకు శిక్షిస్తోందని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు. బార్లపై నియంత్రణ అమలు చేయాలని.. అప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హరితహారంపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాటిన మొక్కలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. వాటికి కనీసం ట్రీగార్డ్సు ఏర్పాటు చే య లేదన్నారు. -
'ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి కేసీఆర్'
హైదరాబాద్ : ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కేసీఆర్ అనడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీతో కాంగ్రెస్ ఎప్పుడూ కలవదని స్పష్టం చేశారు. 2019లో టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్‌దే విజయం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలయ్యాక ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనడం హాస్యాస్పదమన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. -
పార్టీని వీడిన నేతల గురించి ఆందోళన వద్దు: వీహెచ్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. పదవీ త్యాగాలకు సిద్ధపడొద్దని జానారెడ్డికి ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నేతల గురించి ఆవేదన చెందొద్దని చెప్పారు. సీఎల్పీ నేతగా జానారెడ్డి తప్పుకుంటే కాంగ్రెస్ కేడర్ స్థైర్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆపదలో ఉన్నందున జానారెడ్డి లీడర్ గా ముందు నిలిచి పార్టీని నిలబెట్టాలని సూచించారు. రెండేళ్ల పాలనలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్ వైఫల్యాలను గ్రామగ్రామాన ఎండగట్టేందుకు కాంగ్రెస్ కేడర్ సిద్ధపడాలని వీహెచ్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్ట కోసం సీఎల్పీ పదవి వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జానారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వీహెచ్ మీడియా సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
ముద్రగడ ఇంటి వద్ద బైఠాయించిన వీహెచ్
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ల కోసం ఆమరణదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దంపతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుచెప్పారు. దీంతో ఆయన అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కాసేపటి తర్వాత పోలీసులు ఆయనను ఇంటిలోపలకు అనుమతించారు. ఆయన లోపలకు వెళ్లి ముద్రగడకు సంఘీభావం తెలిపారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాకు బయటి ప్రాంతాలు వ్యక్తులు రావొద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. పలు ప్రాంతాల నుంచి కిర్లంపూడి వస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకుంటుకున్నారు. -
ఈసీ నాగిరెడ్డిపై ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: ఎలక్షన్ కమిషన్ నాగిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గులాబీ చొక్కా వేసుకోమంటూ నాగిరెడ్డిపై రామచంద్రారెడ్డి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ నేత వి.హనుమంతురావు ఆయనను వారించారు. దాంతో వీహెచ్‌పైనా కూడా రామచంద్రారెడ్డి రుసరుసలాడినట్టు సమాచారం. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాలని వీహెచ్ ఈ సందర్భంగా సూచించినట్టు తెలిసింది. -
కునుకు పడితే.. మనసు కాస్త కుదుట పడతది!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సమయమిది. కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో నగరంలోని చింతల్ బస్తీ లో సమావేశం. ఓ వైపు ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆ మాటలు జోల పాటలా అనిపించాయో..ఇంతకంటే మంచి సమయం దొరకదనుకున్నారో వేదికపైనున్న కీలక నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, కుంతియాలు మెల్లగా ఓ కునుకు తీశారు. ఇలా కునికి పాట్లు పడితే ..ఎన్నికలయ్యాక కలత తప్పదంటూ ఓ కార్యకర్త వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
'సెలవుపై వెళ్లడం అనుమానాలు రేకిత్తిస్తోంది'
న్యూఢిల్లీ: విజయవాడ 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందన్నారు. టీడీపీ నాయకుల ఒత్తిడి వల్లే ఆయన సెలవు వెళ్లారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాల్ మనీ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ హెచ్ ఆర్సీని కోరారు. -
దిక్కుమాలిన సమ్మె అంటారా?
హైదరాబాద్: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను టీఆర్ఎస్ అడ్డుకుంటామని చెప్పడం సరికాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. అడ్డుకుంటే దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దిక్కుమాలిన సమ్మెలంటూ కరీంనగర్ లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దళితులను అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య కార్మికుల్లో ఎక్కుమంది దళితులేనని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రే... దిక్కుమాలిన సమ్మె అంటున్నారని వాపోయారు. -
'సమావేశాలు జరగనీయం'
హైదరాబాద్: 'లలిత్ గేట్'లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్, వసుంధర రాజెలను పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. వ్యాపం కుంభకోణంలో ఇరుక్కున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలన్నారు. ఈ అంశాలను తమ పార్టీ పార్లమెంట్ లో లేవనెత్తుతుందని తెలిపారు. ప్రభుత్వం సరైన స్పందన రాకుంటే సమావేశాలను జరగనీయబోమని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించేలా సీఎం కేసీఆర్ చొరవ చూపాలన్నారు. కేసీఆర్ తన భజనపరులకు చెప్పి చెత్తను తొలగించేలా స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టాలని సూచించారు. -
'బాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ'
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ అని ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో చంద్రబాబు వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ప్రజల్లోకి వెళ్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దేవాలయాలు తిరగడం మానేసి రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజధాని హైదరాబాద్ నగరంలో హార్స్ రేసింగ్ క్లబ్ లను మూయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. -
'అది తప్పో ఒప్పో పవన్ చెప్పాలి'
హైదరాబాద్: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, వసుంధర రాజే... ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై ప్రధాని మోదీ స్పందించకపోవడం సరికాదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ చేత విచారణ చేయిస్తున్న కేంద్రం... ఎన్డీఏ నేతలను ఎందుకు విచారించడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. అవినీతిని ప్రశ్నిస్తానన్న టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్... ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పో, ఒప్పో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారని విమర్శించారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని వీహెచ్ అన్నారు. -
'సత్యం స్కామ్ వెనుక చంద్రబాబు హస్తం'
హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మరణించిన నేతలపై కాకుండా సత్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. సత్యం కుంభకోణం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందేమోనన్న అనుమానాలున్నాయని అన్నారు. ఇక.. కేంద్ర మంత్రి పదవి చేపట్టాక వెంకయ్య నాయుడు ఆస్తులు పెరిగాయని వీహెచ్ ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో వెంకయ్యనాయుడు కుమార్తె భారీగా సంపాదిస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా ఆయన కుటుంబ ఆస్తులపై విచారణ జరుగుతుందని చెప్పారు. భూసేకరణ ఆర్డినెన్స్ అంశంలో బీజేపీ ప్రభుత్వంపై రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్నదాతలు ఆగ్రహజ్వాల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు నేతాజీపై నెహ్రూ నిఘా పెట్టారంటూ బీజేపీ సర్కారు నాటకమాడుతోందని విమర్శించారు. -
ఆ డబ్బును పార్టీకి ఖర్చు పెట్టండి: వీహెచ్
హైదరాబాద్: ప్రజల్లోకి వెళ్లకుండా ప్రెస్ మీట్ లకే పరిమితమవుతున్నారంటూ సొంతపార్టీ నేతలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. నరేంద్ర మోదీ సర్కారు తెచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించడంలో పార్టీ సీనియర్లు విలేకరుల సమావేశాలకే పరిమితమవ్వడం సరికాదన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని, పాదయాత్రలు చేయాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బును ఇప్పుడు పార్టీకి ఖర్చుపెట్టాలని వీహెచ్ అన్నారు. -
పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేంటి?
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్సే అని.. ఇందులో బీజేపీ పాత్ర ఏమీ లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఈనెల 20న దిగ్విజయ్ సింగ్ వస్తున్నారని తెలిపారు. పార్టీ ప్రక్షాళనపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మూడుసార్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తాను పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేంటని హనుమంతరావు ప్రశ్నించారు. -
‘బేగంపేట’కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చెన్నైలో విమానాశ్రయానికి రెండు పేర్లున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. అక్కడ అంతర్జాతీయ, దేశీయ టర్మినల్‌లు రెండూ వేర్వేరుగా ఉన్నాయి. కానీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలకు ఒకటే ద్వారం ఉంది. ఒక్క విమానాశ్రయానికి రెండు పేర్లెలా పెడతారు’’ అని ప్రశ్నించారు. -
జీవో రద్దు చేసే వరకు ఆందోళన: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ జారీ చేసిన జీవోను రద్దు చేసే వరకు పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తామని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమలేదని, రాజకీయ లబ్ధికోసమే ఆయన పేరు వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘ఎన్టీఆర్ పేరు పెడుతూ 1999లోనే నిర్ణయం జరిగిందని, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు చెబుతున్నారు. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో కింగ్‌మేకర్‌గా ఉన్న బాబు అప్పుడు పేరు ఎందుకు పెట్టలేదు’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెటిలర్లలో తన ఆధిపత్యం చూపించుకోవడానికే బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడేందుకు రాజ్యసభ చైర్మన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. -
సర్దేశాయ్పై దాడి అవమానకరం: వీహెచ్
హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. మోడీ ప్రభుత్వంలా కనిపిస్తోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టంతా పరిశ్రమలు, కార్పొరేట్ రంగాలపైనే ఉందని విమర్శించారు. పేదల గురించి మాటలు మాత్రమే చెబుతున్నారని, కార్యాచరణ మాత్రం కార్పొరేట్ సెక్టార్లకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. నల్లధనం వెలికితీతపై మోదీ మాట్లాడడం లేదన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్పై అమెరికాలో జరగడం అవమానకరమన్నారు. దీన్ని ప్రధాని మోదీ ఖండించకపోవడం సరికాదని వీహెచ్ అన్నారు. న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన మోదీ సభలో రాజ్‌దీప్ సర్దేశాయ్పై పలువురు దాడి చేశారు. -
పోలవరం ప్రాజెక్టుతో అమలాపురం మునక?
ఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు డిజైన్ ను మార్చకుండా చేపట్టినట్లయితే తెలంగాణ ప్రాంతానికే కాదు.. ప్రక్కనే ఉన్న అమలాపురం కూడా ముంపు బారిన పడుతుందని కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదని, పోలవరం డిజైన్ మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. పోలవరం పేరు చెప్పి గతంలో అవినీతి జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి గిరిజనుల సమస్యల్ని అర్ధం చేసుకోవాలన్నారు. రాజ్యసభలో పోలవరం బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన వీహెచ్.. పోలవరం ప్రాజెక్టు తాము వ్యతిరేకం కాదంటూనే, డిజైన్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అలా చేయకుండా పోలవరం ప్రాజెక్టు డిజైన్ ను యధాస్థితిలో చేపడితే అమలాపురం కూడా మునుగుతుందన్నారు. -
నేనేం చేస్తానో మీరే చూడండి: వీహెచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ్యుడు వి. హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. పోలవరం ప్రాజెక్టుపై ఆందోళన చేస్తున్న గిరిజనులు ఆయనను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో మీరు గట్టిగా అభ్యంతరాలు లేవనెత్తుతారా అని నిలదీశారు. ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో తానేం చేస్తానో చూడడంటూ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలవరం డిజైన్ మార్చి నిర్మించుకుంటే అభ్యంతరం లేదని గిరిజనులు స్పష్టం చేశారు. డిజైన్ మార్చకుండా పోలవరం నిర్మిస్తే చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. కాగా, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాజకీయ ఏజేసీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. టీజేఏసీ చైర్మన్ కోదంరామ్, సహా పలువురు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ధనస్వామ్యంలో ఓడిన ఓటరు !
ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు. కుబేరుడు గెలిచాడు. ఓడింది.. పార్టీలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అవినీతి గెలిచింది. ఓటరు మహాశయుడు తలవొంచాడు. ప్రజలు కురిపించిన ఓట్ల వాన మన్మోహన్ సింగ్-సోనియా దుష్టపాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు, అంతేగానీ మోడీపట్ల మోజుతో వేసిన ఓటు కాదు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. కాదు నరేంద్ర మోడీ గెలిచారు.... కాదు ఆర్ఎస్ఎస్ గెలిచింది. ఆ పార్టీ అగ్రనాయకులు మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయడానికి ఇష్టపడలేదు. దీనితో ఆయన ఆర్ఎస్ఎస్ను ఆశ్రయించారు. అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ సొంతంగా మెజారిటీ సీట్లు గెలవడం దేశ చరిత్రలో ఇది మొదటిసారి కాదు. రాజీవ్ గాంధీ 1984 ఎన్నికల్లోనే 400 సీట్లుపైనే గెలుచుకున్నారు. సామాన్య ప్రజలకు ముందుంది ముసళ్లపండుగ. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్లూ, వాటికి చెందిన మీడియా సంస్థలూ మోడీకి పల్లకీ మోశాయి. మన దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో ఉన్నాయి. ‘ధనమూలమిదం జగత్’ అన్నట్టు దేశంలో వీరి హవా జోరుగా నడుస్తోంది. ఇప్పుడు మోడీ గెలుపు వీరికీ, అధికార పగ్గాలు చేపట్టబోతున్న మోడీకీ అండగా నిలుస్తుంది. కాదు, శాసిస్తుంది. సామాన్యులను కాటేస్తుంది. ప్రధాని గద్దెమీద కూర్చుంటేనే నాలుగు రొట్టె ముక్కలు విసురుతాడు. అంతే. కాబోయే ప్రధానికి ఒక హెచ్చరిక. ప్రజలు కురిపించిన ఓట్ల వాన మన్మోహన్ సింగ్-సోనియా దుష్టపాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు, అంతేగానీ మోడీపట్ల మోజుతో వేసిన ఓటు కాదు. కాంగ్రెస్ పీడ వదిలిందని మురిసిపోవద్దు. కార్పొరేట్-మోడీ ఉచ్చు బిగియబోతోంది. జాతీయస్థాయిలో ఇది ప్రధాన అంశమైతే, రాష్ట్రంలో టీడీపీతో నువ్వానేనా అన్న స్థాయిలో హోరాహోరీగా పోరాడి 67 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సాధించిన విజయం ముఖ్యమైన పరిణామంగానే భావించాలి. గత రెండు మూడేళ్లలో ప్రజా సమూహాల్లో ఈదుకుంటూ వచ్చిన పార్టీకి ఈ సమూహాలను ఓటింగ్ కేంద్రాలకు తీసుకొని రాగలిగిన పార్టీ యంత్రాంగం లేదు. అంతేకాదు ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొన్న అనుభవం వైఎస్ఆర్సీపీకి లేదు. నా దృష్టిలో చంద్రబాబు విజయం కన్నా జగన్మోహన్రెడ్డి గెలుపు గొప్పది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పోల్చితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మెరుగైన ఫలితాలు సాధించడం బట్టి గ్రామాల్లో ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇక్కడ 1983 ఎన్నికల గురించి ప్రస్తావించాలి. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీ రామారావు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పార్టీ యంత్రాంగం, కిందిస్థాయిలో పనిచే సే కార్యకర్తలు, పోటీకి అవసరమయ్యే నిధులు లేకుండానే సినిమా ఇమేజ్‌తో అఖండ విజయం సాధించారు. జగన్‌కు రాజశేఖరరెడ్డి ఇమేజ్ ఉండబట్టే తొలిరౌండ్ రాష్ట్ర పర్యటనలోనే జనం కుప్పతెప్పలుగా సభలకు హాజరయ్యారు. ఆ నేపథ్యమే ప్రస్తుత విజయాలకు పునాది. ఇక్కడ ఏ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయో విశ్లేషించుకోవాలి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు. కుబేరుడు గెలిచాడు. ఓడింది.. పార్టీలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అవినీతి గెలిచింది. ఓటరు మహాశయుడు తలవొంచాడు. 2013-14 కన్నా 2014-15లో దేశ పరిస్థితి మరింత క్లిష్టతరమవుతుంది. సామాన్యుడి ఆర్థిక పరిస్థితి ఇంకా దారుణమవుతుంది. కార్పొరేట్లు మరింతగా లాభాలు దండుకుంటారు. కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఓడిపోయిందంటే అది స్వయంకృతాపరాధమే. దానికి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ నేరుగా బాధ్యత వహించాలి. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి ఆమే కారణం. మన్మోహన్ సింగ్ సౌమ్యతను అవకాశంగా తీసుకుని, ఆయన్ని కీలుబొమ్మ ప్రధానిగా మార్చి అధికారాలన్నీ చెలాయించి బొక్కబోర్లా పడ్డారు. రాష్ట్రాన్ని విభజించవొద్దని ప్రజానీకం తిరగబడినా కాదని విడదీసి, తన పార్టీని సీమాంధ్రలో తుడిచిపెట్టేశారు. ఇక తెలంగాణలో ఆ పార్టీ కుంటి గుర్రమే. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారంటే విచారించేవారెవరూ లేరు. సోనియా దేశాన్నే ముంచేస్తే, మన్మోహన్ దేశాన్ని అమెరికాకు పాదాక్రాంతం చేశారు. ఇవి ఎన్నికలు కావు. ఇదో ఓట్ల మార్కెట్. డబ్బు పంచిపెట్టడంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమశ్రేణిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పార్టీలు తెలుగు ప్రజలు తలవొంచుకునేటట్లు చేశాయంటే అందుకు విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టిన పార్టీలే బాధ్యత వహించాలి. అసలీ ధోరణిని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయే. మొట్టమొదట 1952లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రధాన ప్రత్యర్థులు. అప్పట్లో కొన్ని గ్రామాల్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేస్తారని అనుమానించినవారిని పోలింగ్ రోజున బందెలదొడ్లో బంధించి ఓటింగ్ పూర్తయిన తర్వాత విడిచిపెట్టారు. భూస్వాములు కొంతమందిని భయపెట్టి ఓట్లు వేయకుండా నిరోధించారు. ఇంతచేసినా, కమ్యూనిస్టులే కాంగ్రెస్ కన్నా ఒక సీటు అధికంగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి స్త్రీలకు వెండి కుంకుమ భరిణెలు, జాకెట్ గుడ్డలు పంచారు. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన ఎన్నికల్లో గూండాలను గూడేలపై ప్రయోగించడం, అక్కడక్కడ సారా సరఫరా, గూడెం పెద్దను నయానోభయానో లొంగదీసుకొని మొత్తం గూడెంలో ఉండే ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. ఈ చర్యల లక్ష్యం ఒక్కటే. వారి ఓట్లు కమ్యూనిస్టులకు పడకుండా చేయడమే. ఎన్నికల్లో డబ్బు వెదజల్లడం చిన్నగా ప్రారంభమై నేడు ఈ స్థాయికి చేరింది. డబ్బు ఖర్చుపెట్టి అధికారాన్ని కొనుక్కోవడం, లేదా అధికారంలో కొనసాగడం నేడు మనం చూస్తున్నామంటే దానికి కాంగ్రెస్ వేసిన పునాదే కారణం. జనం డబ్బు పుచ్చుకొన్న ఓటర్లు ఏ పార్టీ ఇచ్చిందో దానికే ఓటు వేశారంటే అది వారి నిజాయితీకి చిహ్నం. కాని నాయకులో? ప్రచారంలో ఎన్నో వాగ్దానాలు చేసి తీరా ఏరు దాటాక బోడిమల్లయ్య అన్న తరహాలో ప్రవర్తించే నేతలు సామాన్య ఓటర్ల కాలిగోటికి కూడా సరిరారు. ఇక జయాపజయాల విషయానికి వస్తే... కాంగ్రెస్‌ను ప్రజలు ఏడు నిలువుల లోతు పాతిపెడతారని అందరూ అనుకొన్న మాటే. కాంగ్రెస్ ఓటమిని ముందే పసిగట్టిన పాలకపార్టీ నేతలు కొంతమంది టీడీపీలోకి, మరికొంతమంది వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గెలుస్తానని నమ్మకం లేదు. ఆ విశ్వాసమే కనక ఉంటే అంతకముందుదాకా ఆయన ఎడాపెడా విమర్శించిన బీజేపీతో ఎందుకు చేతులు కలిపారు? కార్పొరేట్ల చేతుల్లో ఉన్న మీడియా మోడీకి బ్రహ్మరథం పడుతుంటే ఇదే అదనుగా భావించి ఆయన కూడా గోడదూకి, మోడీ గెలిచి ప్రధాని అయితే తన రొట్టె కూడా నేతిలో పడుతుందని భావించారు. అంతేకాదు బీజేపీకి పడే ఓట్లు తమ పార్టీకీ పడతాయని ఆశించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు పడ్డాయంటే అది ఆయనంటే, ఆయన తొమ్మిదేళ్ల పాలనంటే మోజుపడి కాదు. ఆ ఓటు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు పరిపాలన చూసిన తర్వాత రెండు సాధారణ(2004,2009) ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని తిరస్కరించి వైఎస్‌కే పట్టంగట్టారని గుర్తుంచుకోవాలి. ఈ ఎన్నికల్లోనే కాదు, మొదటి ఎన్నికల నాటి నుంచి ఏ పార్టీలో చూసినా ప్రచారం, పరిపాలన వ్యక్తుల చుట్టూనే పరిభ్రమిస్తోందిగానీ, పా ర్టీల చుట్టూ, విధానాల చుట్టూ కాదు. నెహ్రూ పాలించినంతకాలం మహాత్మాగాంధీ పేరుతో ప్రచారం జరిగింది. తర్వాత గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే వంశపారంపర్యంగా, వ్యక్తుల ఆధ్వర్యంలోనే ప్రచారం, పాలన కొనసాగింది. ఈ జాడ్యం ఇతర పార్టీలకూ సోకింది. పార్టీ అధ్యక్షులు నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు. ప్రధానులు, సీఎంలే సమస్తం అయ్యారు. ఇదెంత అనారోగ్యకర పరిణామమో మోడీని చూస్తే తెలుస్తుంది. - (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) వి.హనుమంతరావు -
'ఆర్.కృష్ణయ్య దారి తప్పారు'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీసీ నినాదం మోసపూరితమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి వీహెచ్ ఆరోపించారు. శనివారం వీహెచ్ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం అంటున్న చంద్రబాబు అదే నినాదాన్ని సీమాంధ్రలో ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. సీమాంధ్రలోని బీసీలు టీడీపీకి మద్దతు పలికినా వారికి సీట్లు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దాంతో బీసీలపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటితో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు మాటలతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దారి తప్పారని వీహెచ్ అన్నారు. ఆ విషయాన్ని గ్రహించాలని ఆర్.కృష్ణయ్యకు వీహెచ్ హితవు పలికారు. టీడీపీలో బీసీలకు చంద్రబాబు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వరని ఆయన గుర్తు చేశారు. గత అనుభవాలే అందుకు నిదర్శనమని వీహెచ్ ఆరోపించారు. డబ్బు, పదవులు ఎర వేసి చంద్రబాబు బీసీ నేతలను వాడుకుంటున్నారని విమర్శించారు. -
చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోంది: వీహెచ్
హైదరాబాద్: బీజేపీకీ రెండు ఓట్లు వేశానని బహిరంగంగా వెల్లడించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబుపై ఉన్న కాస్త గౌరవం పోయిందన్నారు. 9 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి బీజేపీకి రెండు ఓట్లు వేశానని బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. ఓటు ఎవరికి వేశావని తన తల్లిని అడిగినా చెప్పదన్నారు. చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోందన్నారు. బీజేపీకి ఓటు వేశానని బహిరంగంగా చెప్పడమే కాక ఎన్నికల సంఘం కార్యాలయానికి మనషుల్ని పంపిస్తారా అంటూ వీహెచ్ మండిపడ్డారు. -
'అదృష్టం ఉంటే తెలంగాణకు సీఎం అవుతా'
హైదరాబాద్: సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, అంబర్‌పేట అసెంబ్లీ అభ్యర్థి వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి బీసీ లేదా ఎస్సీలకే ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అదృష్టం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని హనుమంతరావు అన్నారు. చంద్రబాబు సంధించిన బీసీ రామబాణం డూప్లికేట్దని అంతకుముందు హనుమంతరావు కొట్టిపారేశారు. చంద్రన్న బీసీ బాణానికి ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో వస్తే బీసీని సీఎం చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విజయశాంతి, వీహెచ్ లకు అసెంబ్లీ టిక్కెట్లు
న్యూఢిల్లీ: తెలంగాణలో శాసనసభ స్థానాలకు ఖరారైన అభ్యర్థుల్లో ఇద్దరు ఎంపీలున్నారు. విజయశాంతి, వి. హన్మంతరావులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు. విజయశాంతికి మెదక్, హన్మంతరావుకు అంబర్‌పేట స్థానాలు కేటాయించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, నంది ఎల్లయ్య శాసనసభ సమరంలో నిలిచారు. యూత్ కాంగ్రెస్ కోటాలో ముగ్గురికి టికెట్లు దక్కాయి. ఆదిలాబాద్ నుంచి భార్గవ్‌దేశ్ పాండే, కల్వకుర్తి నుంచి వంశీచంద్‌రెడ్డి, భువనగిరి నుంచి పి.వెంకటేశ్వర్లు పేర్లు ఖరారు చేశారు. 111 మంది అభ్యర్థులతో తెలంగాణలో కాంగ్రెస్ ఖరారు చేసిన జాబితాలో బీసీలకు 33, మైనార్టీలకు 4, ఎస్సీలకు19, ఎస్టీలకు 9 సీట్లు కేటాయించారు. -
బీసీ రామబాణానికి హనుమన్న అడ్డు!
రామయణ కాలంలో రామభక్త హనుమాన్ తన ఆరాధ్య దైవం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాడు. సమకాలిన రాజకీయాల్లో అభినవ హనుమంతు చంద్రన్న రామబాణాన్ని గేలి చేశాడు. చంద్రన్న సంధించిన రామబాణం నకిలీదని ఎద్దేవా చేశాడు. చిత్రవిచిత్రాలకు నిలయమైన వర్తమాన రాజకీయాల్లో ఎన్నికల వేళ నాయకుల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం పీఠం ఎక్కిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఘనమై హామీయిచ్చారు. తన సంధించిన బీసీ రామబాణానికి ఎదురే లేదని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు సంధించిన బీసీ రామబాణం డూప్లికేట్దని కొట్టిపారేశారు. చంద్రన్న బీసీ బాణానికి ఓట్లు రాలవని అన్నారు. మరోవైపు చంద్రన్న సంధించిన బీసీ బాణం ఆయనకే ఎదురు తిరిగే పరిస్థితులు తలెత్తాయి. బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బాబుపై బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఆర్. కృష్ణయ్యకు సీఎం పదవి ప్రచారంపై టీడీపీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. మేం పనికిరామా అంటూ నిష్టూరమాడుతున్నారు. -
షిండేకు రక్షణగా నిలబడ్డ హనుమంతన్న
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును అనూహ్యంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను కొద్దిసేపు నిలిపివేశారు. అంతేకాకుండా తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన వారిని నియంత్రించేందుకు మార్షల్స్న ప్రయోగించింది. షిండేకు రక్షణగా నిలబడిన మార్షల్స్ ఆందోళనలు చేస్తున్న సభ్యులను అడ్డుకున్నారు. సీమాంధ్ర సభ్యులతో పాటు సీపీఎం, సమాజ్‌వాది పార్టీ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షిండేను చుట్టుముట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వి. హనుమంతరావు.. షిండేకు రక్షణగా నిలబడ్డారు. సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. -
‘విజయ యాత్ర’కు మంగళం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎవరికి వారుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను ఒకే వేదిక మీదకు తెస్తుందని భావించిన ‘విజయ యాత్ర’ ప్రారంభానికి ముందే రద్దయినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ‘విజయ యాత్ర’ చేపట్టారు. తెలంగాణవ్యాప్తంగా సాగాల్సిన ఈ యాత్ర మెదక్ జిల్లాలో ఈ నెల 6న ప్రారంభం కావాల్సి ఉంది. పదో తేదీ వరకు వివిధ నియోజకవర్గాల్లో ‘విజయ యాత్ర’ పేరిట సభలు నిర్వహించాలని నిర్ణయించారు. యాత్రకు నేతృత్వం వహిస్తున్న వి.హనుమంతరావుకు స్వాగతం పలకడంతో పాటు జిల్లాలో ఎక్కడెక్కడ సభలు నిర్వహించే బాధ్యతను జిల్లా కాం గ్రెస్ కమిటీకి అప్పగించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి పార్టీ నేతలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల భేటీకి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెం బ్లీకి హాజరు కావాలని భేటీలో నిర్ణయించారు. దీంతో వీహెచ్ జిల్లా పర్యటనకు వచ్చినా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఏర్పాట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా పర్యటన రద్దు చేసుకోవాల్సిందిగా వీహెచ్‌ను కోరేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. పట్టాలెక్కని ‘జైత్రయాత్ర’ సోనియాకు కృతజ్ఞతలు చెప్పే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గతంలోనూ జిల్లాకు ఒకటి చొప్పున ‘జైత్రయాత్ర’ పేరిట సభలు నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 22న జిల్లాలో నిర్వహించాల్సి ఉండగా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లా నేతల మధ్య సమన్వయం లోపం, జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విప్ జయప్రకాశ్‌రెడ్డి దూరం పాటిస్తుండటంతో ‘జైత్ర యాత్ర’ ఎక్కడ నిర్వహించాలో బాధ్యులకు అంతు చిక్కడం లేదు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆమోదం తెలిపితేనే జైత్రయాత్ర సభ పట్టాలెక్కే సూచన కనిపిస్తోంది. అటు జైత్రయాత్ర నిర్వహించలేకపోవడం, ఇటు విజయయాత్ర రద్దు అయినట్టు సమాచారం అందడంతో కేడర్ లో నిరుత్సాహం కనిపిస్తోంది. -
రాయల తెలంగాణపై ఎవరేమన్నారంటే...
కాంగ్రెస్ పార్టీకి నష్టమే : వీహెచ్ నార్కట్‌పల్లి న్యూస్‌లైన్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ కాకుండా, రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదిజిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్నారు. తెలంగాణ రాష్ర్టం కాకుండా, ఒకవేళ రాయల తెలంగాణ ఇస్తే తిరిగి ఉద్యమిస్తామని చెప్పారు. మేం పూర్తిగా వ్యతిరేకం : సీహెచ్. విద్యాసాగర్‌రావు నల్లగొండ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుందన్నారు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుతూ 12 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఇస్తామంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ ప్రతిపాదన ఓ బలవంతపు పెళ్లి : దాసోజు శ్రవణ్‌కుమార్ కనగల్, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ నిర్ణయం బలవంతపు పెళ్లి లాంటిదని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం కనగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు 1956లో ఆంధ్రకు, తెలంగాణకు బలవంతంగా పెళ్లి చేసి వేలాది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్.. ఇప్పుడు అదే తరహాలో రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణతో కలపాలని చూస్తుందని విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను తాము ఒప్పుకోమన్నారు. మరో మహోద్యమం తప్పదు : సీపీఐ ఎమ్మెల్యే మల్లేష్ బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : కేంద్రం రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే మరో మహోద్యమం చేపడతామని సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ రాష్ట్రం కావాలని అనంతపురం, కర్నూలు ప్రాంతాల ప్రజలు ఏనాడూ కోరలేదన్నారు. అయినా, స్వార్థపూరితంగా కొందరు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్లో రాయల తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే అడ్డుకొని తీరుతామన్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విజయయాత్ర రెండో రోజైన మంగళవారం సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్ప రాయల తెలంగాణ వద్దన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానాలు ఇచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులు ఇప్పుడు సమైక్యాంధ్రనడం సిగ్గు చేటన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ 2004లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవెందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
అమెరికా చెప్పిందే వేదం!
విశ్లేషణ: ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి రక్షణశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2005లోనే అమెరికా వెళ్లి ఈ శాఖ గురించి ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత అమెరికా మన దేశం మెడకు ఉచ్చు బిగిస్తూనే ఉంది. గగనతలం, భూఉపరితలం మీద, సమ్రుదంపై సంయుక్తంగా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా నుంచి ఆ శాఖ సీనియర్ అధికారులు వచ్చి మన దేశ ప్రధాని మెడలువంచుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అమెరికా పర్యటన ముగించు కుని తిరిగి వచ్చారో లేదో, ఆ దేశం కొంప కొల్లేరయింది. మన్మోహన్‌ది ఐరన్లెగ్గా? లేదా, మన దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొని వెళ్లి అక్కడ కలరా వ్యాధిలా అంటించి వచ్చారా? ఈ రెండూ కాదు. మరేమిటి? పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ఒక్కరోజైనా చర్చించకుండా, చివరి రోజు, ఆఖరు నిమి షంలో ఆమోదముద్ర పడిందనిపించారు. కానీ, అమెరికా వారు మన పార్లమెంటు సభ్యులకన్నా రెండాకులు ఎక్కువే చదువుకొన్నట్లున్నారు. వాళ్లు ససేమీరా, మేము వ్యతిరేకి స్తాం, నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు. బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతో వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఉన్నాయి. కింది సభలో ఒబామాకు మెజారిటీ ఉంది. పైసభలో పెత్తనం రిపబ్లిక్ పార్టీదే. ఇంతకు లడాయి ఎందుకు ఏర్పడిందంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఒక బిల్లు పెట్టి, దానికి నిధులు కేటాయించి బడ్జెట్ తయారు చేయగా దానిని రైటిస్టులైన రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. అలాగని ఒబామా లెఫ్టిస్టు ఏమీ కారు. రెండు పార్టీలూ పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థించేవే. మన దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌లోనే (వైఎస్ జమానాలో తప్ప) కొట్టుకు చావటం లేదూ? అయినా ఈ వ్యాస పరిమితుల్లో రిపబ్లికన్లదే ఐరన్ లెగ్. భారత్‌పై నిఘా నేత్రం ప్రధాని అమెరికా పర్యటనకు ముందు కొద్ది మాసాల క్రితమే ఆ దేశ నిఘా నేత్రం మన దేశం మీద పడిందని, అటు అమెరికాలో భారతదేశ కార్యాలయం నుంచి మన విదేశీ శాఖకు మధ్య, అలాగే ఉభయ దేశాల వ్యాపార సంస్థల మధ్య, రాజకీయ నాయకుల మధ్య జరిగే సంభా షణలు, ఇ-మెయిల్స్ లాంటివన్నింటినీ అమెరికా గూఢ చారి సంస్థ రహస్యంగా వింటున్నదని ఆ నిఘా వ్యవస్థలో పనిచేసిన స్నోడెన్ బాంబు పేల్చాడు. ఆ సమాచారంలో రక్షణశాఖ గురించి కూడా వివరాలున్నాయి. అంటే మన దేశ రక్షణ రహస్య సమాచారమంతా అమెరికా గుప్పిట్లో ఉందన్నమాట. బడ్జెట్ సమయంలో ఈ శాఖ మీద చర్చ నిషిద్ధం. స్వతంత్రం వచ్చినప్పుడు, రక్షణ, విదేశాంగ, కరెన్సీ సంబంధిత విషయాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనూ, మిగతా శాఖలన్నీ రాష్ట్రాల పరిధిలోనూ ఉం టాయని ప్రకటించారు. ఇప్పుడు మన రక్షణశాఖ రహ స్యాలన్నీ అమెరికాలో గూఢచారిశాఖ చేతికి చేరాక అది రహస్యమెలా అవుతుంది? మన దేశ రక్షణ గురించి మన కు తెలియదు, ఇతర దేశాలకు తెలుసు. అమెరికా పాకి స్థాన్‌ను పరోక్షంగా సమర్థిస్తూ వచ్చినప్పుడు, రహస్యాలు పాకిస్థాన్‌కు చేరవేయలేదని, లేదా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సయోధ్య ఏర్పడకుండా ఆ సమాచారాన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నదనేది తిరుగులేని సత్యం. ఇదేమీ రహస్యం కాదు. ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి రక్షణశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2005లోనే అమెరికా వెళ్లి ఈ శాఖ గురించి ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత అమెరికా మన దేశం మెడకు ఉచ్చు బిగిస్తూనే ఉంది. గగన తలం, భూఉపరితలం మీద, సమ్రుదంపై సంయుక్తంగా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా నుంచి ఆ శాఖ సీనియర్ అధికారులు వచ్చి మన దేశ ప్రధాని మెడ లువంచుతూనే ఉన్నారు. మొన్న మొన్ననే ప్రధాని అమె రికా వెళ్లి, కొత్త రక్షణ ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు. రక్షణశాఖల సమాచారాన్ని సేకరించడంలో మరో ముఖ్యై మెన కోణం భారత్-చైనా సంబంధాలు. అమెరికాకు చైనా కొరకురాని కొయ్య. ప్రపంచాధిపత్యం కోసం అది కంటు న్న కల నిజం కావాలంటే చైనాను దెబ్బతీయాలి. అమెరికా కనుసన్నల్లోనే... 1999లో ఆర్థిక సంస్కరణల పేరుతో దేశంలో ప్రవేశిం చినా, అది కేంద్ర ప్రభుత్వం వరకే పరిమితమైంది. రాష్ట్రా ల్లోకి ప్రవేశం లభించలేదు. దుర్భిణీ వేసిచూస్తే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించగా గాలం వేసి పట్టుకున్నారు. తన సమస్య పరిష్కారం అవుతుందని బ్యాంకును గట్టిగా వాటే సుకున్నారు. రాష్ట్రాల్లో ప్రవేశించడానికి అమెరికాకు (ప్రపం చ బ్యాంకు సృష్టే) అవకాశం లభించింది. కేంద్రం మీద ఉడుంపట్టును సాధించిన తర్వాత చంద్రబాబును బుట్టలో వేసుకోవడంతో, త్వరత్వరగా రాష్ట్రాలు ఆ వలలో చిక్కుకొనిపోయాయి. అప్పు చేస్తేనే అభివృద్ధి అనే పరి స్థితిని సృష్టించగా, ప్రస్తుతం దేశం, రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి. ప్రస్తుతం ఇండియా జుట్టు అమెరికా చేతుల్లో చిక్కుకొనిపోవడమే కాకుండా, పరిపా లనా యంత్రాంగాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇప్పు డు గ్రామంలో చెరువు తవ్వాలన్నా, హైదరాబాద్ నగరం లో కొన్ని బస్సులు తిరగాలన్నా కూడా ప్రపంచ బ్యాంకు ఇచ్చిన అప్పుతోనే సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మా దేశంలో ఇలా అంతర్గత విషయాల్లో తలదూర్చటం భావ్యమా అని ఒబామాను ప్రశ్నించే దమ్ము మాట అటుం చి, మన ప్రధాని కనీసం ఆ ప్రస్తావనైనా చేశారా? ఎందు కంటే సంస్కరణలు ప్రవేశపెట్టింది ఆయనే. ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన ఆంధ్రుడే. ఆయనే పీవీ నర సింహారావు. ఫలితంగా దేశం ఇవాళ ఇంతగా దిగజారడా నికి కారణం ఈ ప్రధానే. ప్రధాని భారతీయుడే కాని ఆలో చనలు, ఆచరణ అమెరికావి. ఏమి సాధించారు? అమెరికా వెళ్లి మన ప్రధాని ఒబామాతో ఏమి చర్చిం చారు? (గుసగుసలాడారంటే వాస్తవానికి దగ్గరగా ఉం టుంది) ఆ చర్చలతో దేశానికి ఏమి సాధించారని చూడ బోతే- ఒకటి కొత్త రక్షణ ఒప్పందం, రెండు గుజరాత్లో అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు. తన కల నిజం కావాలంటే చైనాను దెబ్బతీయాలి. ఇండియాను బుజ్జగించి అమెరికా సైనికస్థావరాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసుకుంటే, చైనా అడ్డు తొలగించుకోవచ్చుననే తన వ్యూహంలో భాగంగా అది ఇండియాను దువ్వు తోంది. చైనా-భారత్ సరిహద్దులో చెదురుమదురుగా జరిగే సంఘటనలను ఆసరా చేసుకుని భారత్-చైనా సంబంధాలను చెడగొట్ట డానికి అమెరికా వేసుకున్న వ్యూహంలో భాగంగానే భారత్‌తో కొత్తగా రక్షణ ఒప్పం దం చేసుకుంది. కానీ ఇటీవల ఏర్పాటైన బ్రిక్స్‌లో ఇటు మనదేశం, అటు చైనా సభ్యులు కావటం అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోతుందని ఈ శతాబ్దం ప్రారంభంలో ఆర్థిక శాస్త్ర వేత్తలు ప్రకటించారు. ప్రపం చంలో జరుగుతున్న పరిణా మాలు చూస్తే అది నిజం కాబోతుందనే నమ్మకం కలుగు తుంది. కాగా మన రక్షణ శాఖను అమెరికా నిఘా నేత్రం నుంచి తప్పించడానికి తగు చర్యలుతీసుకోకపోగా, దేశాల మధ్య అలాంటివి జరగటం మామూలేనని మన రక్షణ శాఖ మంత్రి స్పందించటం దేశ రక్షణ పట్ల ప్రభుత్వం ఎంత నిష్పూచీగా, నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. ఇంత ప్రమాదకర పరిస్థితిలో దేశం ఉండగా, ప్రధాని అమెరికాతో ఒప్పందం చేసుకొని రావటం దేశానికి వెన్నుపోటు పొడవడమే. స్నోడెన్ వెల్లడించిన విషయం నిజమా! నిజమైతే అది మంచిది కాదు అనైనా అడక్కపోవడం క్షంతవ్యం కాదు. ‘బహుళ’ ప్రయోజనమే మిన్న అమెరికా-భారత్ సంబంధాల్లో రక్షణ రంగం ఒక్కటే కాదు. ప్రపంచ బ్యాంకు విండో ద్వారా, అమెరికా చొరబ డని మంత్రిత్వశాఖ, రాష్ట్రంగాని లేవే. ఈ గొడవలన్నీ ప్రజ లకు పట్టవు. కొన్నేళ్ల క్రితం రష్యాలో జరిగిన అణు విస్ఫో టనం తర్వాత, అమెరికాలో ఈ యంత్రాలను తయారు చేసే బహుళజాతి సంస్థలకు గిరాకీ తగ్గిపోయింది. దీంతో పాటు జపాన్ విస్ఫోటనం కూడా వర్దమాన దేశాల్లో భయం పుట్టించింది. ఫలితంగా అణు విద్యుత్ కేంద్రా లను తయారు చేసే అమెరికా కార్పొరేట్ సంస్థల్లో గుబులు ప్రారంభమైంది. తమకు మార్కెట్ కల్పించాలని ఆ సం స్థలు అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తేగా, ఆ ప్రభుత్వం భారతదేశం మీద తన రాజకీయార్థిక పెత్తనాన్ని ఉపయో గించి సూత్రప్రాయంగా అంగీకరింపచేసింది. అయితే ఒక వేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే నష్టాన్ని యంత్రాలు తయారు చేసే కంపెనీలు భరించాలనే వాదన ప్రారంభ మైంది. మేము ఇంతే ఇస్తాం అని వాళ్లు, పూర్తిగా భరించాలని మన దేశం పట్టుపట్టారు. ఆ విషయమైనా ప్రధాని ఒబామాతో చర్చించారా? ప్రధాని అసలే మిత భాషి. ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన చేయక పోగా, గుజరాత్లో అణు కేంద్రం ఏర్పాటుకు అంగీకరిం చారంటే, ఆయనకు దేశ రక్షణకన్నా, బహుళ జాతి సంస్థల లాభనష్టాలు గురించే ఎక్కువ పట్టింపు. ఈయనను మళ్లీ ప్రధానిగానూ, ఆయన ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌నూ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారో, ఓడిస్తారో మీ ఇష్టం. -
దేశ దుర్గతి ‘చేతి’ చలువే
విశ్లేషణ: ప్రస్తుత పాలకుల దృష్టిలో సంస్కరణలంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్ల తర్వాత కూడా పేదరికం అంటే ఏమిటో నిర్వచించలేకపోవడం. పోషకాహార విలువలున్న భోజనాన్ని చిన్నపిల్లలకు అందజేయలేకపోవడం. నిరుద్యోగాన్ని పెంచి పోషించడం. మహిళలకు మానరక్షణ కల్పించలేకపోవడం. విదేశీ రుణాలు ఇంకా ఇంకా పెరగడం. ప్రధాని మన్మోహన్సింగ్ ఇప్ప టికే సవాలక్ష సమస్యలతో సత మతమవుతుండగా, బొగ్గు కుం భకోణానికి సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో తాజాగా మరో చక్రబంధంలో చిక్కుకు న్నారు. ఆయన వద్ద బొగ్గు మం త్రిత్వశాఖ ఉన్నప్పుడే ఎడమ చేత్తో, కుడిచేత్తో బొగ్గు గనులను అనేక ప్రైవేట్ సంస్థలకు (వీరిలో టాటాలు కూడా ఉన్నారు) దారాదత్తం చేసిన వైనం ఆ మధ్య పార్లమెం టులో చర్చకు వచ్చి నానా అభాసుపాలయ్యారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫైళ్లే మాయమయ్యాయంటే ఆయన చేతికంటుకున్న మసిని తుడిచివేయడానికి చేస్తున్న ప్రయత్నమే అది అని ఎవరైనా అనుకుంటే అది సత్య దూరం కాబోదు. కామన్వెల్త్ గేమ్స్ స్కామ్‌తో ప్రారం భమై, కాగ్ నివేదికతో మరిన్ని స్కామ్‌లు వచ్చి చేరగా, అవన్నీ ఈ తాజా స్కామ్ కాళ్ల కింద బలాదూర్. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లో ఆహార భద్రత బిల్లు, తెలంగాణ వంటి అంశాలపై రభస జరిగి ఉండక పోతే, ప్రతిపక్షం బొగ్గు ఫైళ్లు మాయమైన అంశమే ప్రధానంగా చర్చకు వచ్చి ప్రధానిని బోనులో నిలబెట్టి ఉండేది. 2009లో రెండవ విడత ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన సాధించిన ఘనకార్యాలేమిటని లెక్కవేయ బోతే చేతివేళ్లు, కాలివేళ్లు చాలేటట్లు లేవు. దేశ ఆర్థిక ద్రవ్య పరిస్థితులు మంటగలిశాయి. అన్ని రంగాల్లో మాంద్యం తాలూకు కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. పీకల దాకా ధాన్యరాసులున్నా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక వేళ తిండి గింజలు జనానికి అందుతున్నాయని అను కున్నా, పోషకాహార విలువలు లేనితనం వెంటాడుతూనే ఉంది. వ్యవసాయరంగం నాలుగు శాతం పెరుగుదల లక్ష్యంగా పెట్టుకొని రెండు పంచవర్ష ప్రణాళికలు అమలు పరచిన తర్వాత కూడా ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. వంటనూనె, పప్పుదినుసుల దిగుమతులు ఈ నాటికీ తప్పడం లేదు. తిండిగింజల ఉత్పాదకత పెరుగుదల అంతంత మాత్రమే. చైనాలో 6 టన్నులు, ఎప్పటి నుంచో పండిస్తుంటే మనం ఇంకా మూడు టన్నుల దగ్గరే లెఫ్ట్ రైట్ కొడుతున్నాం. విత్తనాల సరఫరా అమెరికన్ గుత్త సంస్థ ‘మాన్‌శాంటో’ పరమైంది. వ్యవసాయం యాంత్రికీకరణ చెందడంతో రైతు కూలీలు వలసలు పోతున్నారు. ఆహార పంటల స్థానాన్ని వ్యాపార పంటలు భర్తీ చేస్తున్నాయి. వ్యవసాయ భూములను సెజ్‌లు ఆక్రమించాయి. పంట భూములన్నీ పారిశ్రామికవేత్తల హక్కు భుక్తమవుతు న్నాయి. పరదేశీయులు, కార్పొరేట్లు భూములు కాజేసి, రైతులను కూలీలుగా మార్చేస్తున్నారు. మితిమీరిన ఎరు వుల వాడకంతో, పంట భూములు నిస్సారమైపోతున్నా యి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనే తక్కువ. ఆ తక్కువ కూడా రైతులకు అందటం లేదు. వ్యవసాయం గురించి మాటలు ఘనం, చేతలు శూన్యం. ప్రభుత్వం దృష్టి అంతా పారిశ్రామికరంగం మీదే. పోనీ ఆ రంగం ఏమైనా పచ్చగా ఉందా అని చూడ బోతే ప్రస్తుతం ఎండిపోయిన చేనులా ఉంది. పారిశ్రామి కోత్పత్తి సూచీ పూర్తిగా దిగజారిపోయింది. ఉత్పత్తి పడిపో యింది. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో షేర్లను బజారులో అమ్మకానికి పెట్టారు. దేశంలో 248 ప్రభుత్వరంగ సంస్థ లున్నాయి. వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు రూ.1,66, 849 కోట్లు. వీటి ఆదాయం రూ.1,93,903 కోట్లు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు 1991-2012 మధ్య రూ.1,13,939 కోట్ల విలువ గల షేర్లను విదేశీ, స్వదేశీ పరిశ్రమలకు అమ్మే శారు. ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చుట్టింది బీజేపీ పాలనలోనే. నష్టాలు వస్తున్నాయి. అందు చేత అమ్మేస్తున్నామంటుంది మన్మోహన్ ప్రభుత్వం. ఆ ముసుగులో లాభాలు వస్తున్న సంస్థల్లో షేర్లు కూడా అమ్మేస్తోంది. ఈ షేర్లను కొనుక్కోవడానికి బహుళజాతి సంస్థలు ఎగబడుతున్నాయి. అది సహజం. కాని అమ్మడా నికి ప్రభుత్వం అంతే ఆసక్తి చూపడం దురదృష్టకరం. అయినా అమ్మేస్తున్నదంటే సమస్తం ప్రైవేటీకరణ చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని పాల కుల తలల్లోకెక్కించింది ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల సలహాలకు తలవం చి, ప్రైవేట్ రంగం, కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహకాల పేరుతో గత మూడేళ్లలో రూ.15 లక్షల కోట్లు కుమ్మరించి నట్లు బడ్జెట్ పుస్తకాలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక, ద్రవ్య పరిస్థితులు నేలచూపు చూస్తున్న మాటవాస్తవం. కానీ వారేమీ నష్టాలతో పరిశ్రమలను నడపడం లేదు. లాభాల పెరుగుదల వేగం మాత్రమే తగ్గింది. ఒక పక్క బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గించకపోతే తమ పరిశ్రమలు వడ్డీ భారాన్ని భరించలేవని దొంగ ఏడుపులు ఏడుస్తూనే, మరోపక్క తమ దగ్గరున్న ధనంతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతు న్నారు. పరిశ్రమలను సొంతం చేసుకుంటున్నారు. దక్షిణా ఫ్రికాలో వేలాది ఎకరాల భూములను చాప చుట్టేస్తున్నా రు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఓ చిన్న ఉదాహరణ. కోస్తా తీరంలో చమురు గనుల్లో నుంచి చము రు లభ్యత తగ్గిపోతోంది, గిట్టుబాటు కావడం లేదని, ధర పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి చమురు ధరను రెట్టింపు చేయించుకుంది రిలయన్స్ సంస్థ. ఇలా లాభ పడిన తర్వాత మరో చమురు భావి లభించిందని ఆ సంస్థ ప్రకటించింది. ఇదీ కార్పొరేట్ సంస్థల దేశభక్తి! పన్నులు ఎగ్గొట్టడం, దొంగలెక్కలు సృష్టించటం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇందుకు ప్రభుత్వ నిఘా విభాగమే సాక్ష్యం. 2012-13 చివరి త్రైమాసికంలో కొన్ని అనుమానాస్పద లావాదేవీల ద్వారా రూ.2,158 కోట్ల పన్నుల మేర ఎగ్గొట్టి నట్లు ఈ ప్రభుత్వశాఖ కనిపెట్టింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) తనిఖీల్లోనే రూ.1,408 కోట్లు లెక్క ల్లోకి రాని ఆదాయాలు, ఆస్తులు బయటపడ్డాయి. కేంద్ర ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంస్థల తనిఖీల్లో మరో రూ.750 కోట్ల లావాదేవీలు వెలుగుచూశాయి. మొత్తం రూ.34,347 కోట్ల అనుమానాస్పద లావాదేవీ లను ఆర్థికశాఖ పరిశీలించింది. ఈ విధంగా ప్రభుత్వం కళ్లు కప్పి పారిశ్రామికవేత్తలు ప్రజాధనాన్ని దోచుకుంటూ, విదేశాల బాట పడుతుంటే పట్టించుకోకుండా, నిఘాను మరింత కట్టుదిట్టం చేసి ప్రభుత్వ ఖజానాకు పడిన తూట్లను మూసివేయకుండా ఆర్థిక మంత్రి నిధుల కోసం, పెట్టుబడుల కోసం జోలెపట్టుకుని దేశ దేశాలు భిక్షాటన చేయడం మన ప్రజాస్వామ్యం అసలు రూపాన్ని బట్టబ యలు చేస్తున్నది. ఇటు ప్రభుత్వం, అటు కార్పొరేట్లు జం టగా ప్రజాధనాన్ని రెండు చేతులతో దోచుకుంటున్నా యని చెప్పేందుకు ఇంతకన్నా ఏం దాఖలా కావాలి? ఖజా నాలో లోటు ఏర్పడిందనే నెపంతో పన్నులు పెంచుతు న్నారు. ధరలు పెంచడాన్ని ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూడండి. పరిశ్రమల్లో ఉత్పత్తి రెండు సంవత్సరాల నుంచి స్థం భించింది. నిరుద్యోగం పెరుగుతోంది. {దవ్యోల్బణం పెరుగుదల పది శాతానికి దరిదాపుల్లో ఉండటం. కరెంట్ అకౌంటు లోటు సుమారు 5 శాతం. పెట్టుబడులు విదేశాలకు తరలిపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో (2013) 170 మిలియన్ డాలర్లపైనే. రూపాయి విలువ వారం వారం దిగజారుతున్నది. ఎగుమతులు, దిగుమతుల మధ్య అగాథం పెరుగు తోంది. అవినీతి స్కామ్‌లు వెల్లువెత్తుతున్నాయి. {పాజెక్టుల నిర్మాణంలో మందగమనం, ఫలితంగా వ్యయం పెరుగుదల, లాభాలు పొందడంలో ఆల స్యం, రావాల్సిన ఆదాయం తరుగు. దశాబ్దాలుగా తయారీ రంగం 15-17 శాతం దగ్గర నిలిచిపోవడం. పెరుగుదల సేవల రంగానికే పరిమితం కావడం. మౌలిక వసతుల కల్పన నత్తనడక. అన్నివిధాలా పెరుగుదలకు తోడ్పడే భూసేకరణలో అమిత జాప్యం. ఉపాధి పెరుగుదల నిలిచిపోవడం. మాజీప్రధాని సలహాదారు శంకర్ ఆచార్య స్వయానా ఆవిష్కరించిన నిజాలు ఇవి. ఈ దుష్పరిణామాలన్నీ మొదటి విడత సంస్కరణల పుణ్యమే. ఈ లెక్కన గత సెప్టెంబర్‌లో ప్రారంభించిన రెండవ విడత సంస్కరణల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. సంస్కరణలు అవసరమే కానీ ఎలాంటి సంస్కర ణలు? వితంతు వివాహాలతో కందుకూరి వీరేశలింగం, భాషా సంస్కరణల ద్వారా గిడుగు, పాతతరం కాంగ్రెస్ నాయకులు సాధించిన జమీందారీ విధానం రద్దు వం టివి సంస్కరణలు అవుతాయే తప్ప ప్రపంచీకరణ ప్రక్రియలో పాలుపంచుకుంటూ చేపట్టేవి సంస్కరణలు కాజాలవు. ప్రస్తుత పాలకుల దృష్టిలో సంస్కరణలంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్ల తర్వాత కూడా పేద రికం అంటే ఏమిటో నిర్వచించలేకపోవడం. పోషకాహార విలువలున్న భోజనాన్ని చిన్నపిల్లలకు అందజేయలేకపో వడం. నిరుద్యోగాన్ని పెంచి పోషించడం. మహిళలకు మానరక్షణ కల్పించలేకపోవడం. విదేశీ రుణాలు ఇంకా ఇంకా పెరగడం. మన ఏలికలు సంస్కరణల పేర సాధిం చినవేమైనా ఉన్నాయంటే అవి ఇవే! తాజాగా ప్రవేశపెట్టబోతున్న సంస్కరణలలో కొన్ని మచ్చుకు ఇలా ఉన్నాయి. చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టు బడులకు తలుపులు బార్లా తెరవడం, రక్షణశాఖలో విదేశీ సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం చేయడం, విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి ప్రతిబంధకాలను సడలించడం, దేశంలో కార్పొరేట్ రంగం మరింతగా విస్తరించడానికి ఉన్న అవరోధాలను తొలగించడం, ప్రభుత్వరంగ పరి శ్రమల్లోకి కార్పొరేట్ రంగ ప్రవేశాన్ని వేగిరపరచడం. ఇవీ రాబోయే సంస్కరణలు కొన్ని మాత్రమే. స్వాతంత్య్రమా! నీ జాడ ఎక్కడ? ఈ ప్రశ్నకు జవాబు కోసం 2014 ఎన్నికల వరకూ వేచి ఉండాల్సిందే. తప్పదు. - వి. హనుమంతరావు సీనియర్ పాత్రికేయులు -
సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే: వి.హనుమంతరావు
సాక్షి, తిరుమల, తిరుపతి, హైదరాబాద్: కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు తిరుమల వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ఉండడానికి వీల్లేదని, ఒకవేళ ఉండాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని తిరుమలలో మీడియా ముందు వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన సమైక్యవాదులు నిరసన తెలిపేందుకు తిరుగుప్రయాణమైన వీహెచ్ వాహనాన్ని అలిపిరి వద్ద అడ్డుకున్నారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి నిరసన తెలపడానికి నిరసనకారులు ప్రయత్నిస్తుండగానే.. పోలీసులు లాఠీచార్జికి దిగారు. దాంతో ఆందోళనకారుల్లో ఒకరు వీహెచ్ వాహనంపైకి చెప్పు విసిరారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించి, వీహెచ్ వాహనాన్ని అక్కడినుంచి పంపేశారు. వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యల వల్లే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు చెప్పారు. మరోవైపు వీహెచ్ కారుపై దాడికి ఓ ప్రైవేటు న్యూస్ చానల్ సిబ్బంది ఉసిగొల్పారని పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుమలలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణ, సీమాంధ్ర అన్నదమ్ములుగా విడిపోదాం. ఒక్క ఉద్యోగులు మినహా హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు. ఆ ఉద్యోగులు కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఉండవచ్చు. రేషియో ప్రకారం ఉద్యోగులు పోయేటోళ్లు పోతారు. మిగతావారు ఉండొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్లను వెళ్లగొట్టరు. అది ఒక అపోహ మాత్రమే. వీ విల్ గివ్ ఫుల్ సపోర్ట్ దెమ్’’ అని పేర్కొన్నారు. ఎన్జీవోల ఉద్యమాన్ని రాజకీయ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. వీహెచ్ వ్యాఖ్యలను తెలుసుకున్న కొందరు సమైక్యవాదులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి నిరసన తెలపడానికి అలిపిరి టోల్‌గేటు వద్ద కాపుకాశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వీహెచ్ కారు ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో సమైక్యవాదులు కారుకు అడ్డంగా పడుకుని వీహెచ్‌ను కిందికి దిగాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆయన దిగకపోవడంతో, పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించేయత్నం చేశారు. అయినా.. వారు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి ప్రారంభించారు. అదేసమయంలో ఆందోళనకారుల్లో ఒకరు వీహెచ్ వాహనంపైకి చెప్పు విసిరారు. చివరికి పోలీసులు వీహెచ్ కారును పంపించివేశారు. ఈ ఘటనలో పది మంది ఉద్యమకారులకు, ఒక పోలీసు కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వీహెచ్ వాహనాన్ని తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద, విమానాశ్రయం వద్ద కూడా అడ్డుకునేందుకు సమైక్యవాదులు యత్నించారు. వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఉద్రిక్తత: ఎస్పీ వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్లే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. వీహెచ్ కారును అడ్డగించిన 20 మందిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నేడు రాయలసీమ బంద్‌కు పిలుపు లాఠీచార్జికి నిరసనగా ఆదివారం రాయలసీమ బంద్‌కు సమైక్యవాదులు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ శాంతియుతంగా పుష్పగుచ్ఛాలు ఇవ్వడానికి వచ్చామని, తమపై పోలీసులు అమానుషంగా దాడి చేశారని చెప్పారు. నాపై దాడి దారుణం: వీహెచ్ సమైక్యవాదులు తనపై దాడికి యత్నించడం దారుణమని ఎంపీ వీహెచ్ హైదరాబాద్‌లో పేర్కొన్నారు. కొందరు తనకు పూలు ఇచ్చి నిరసన తెలుపుతున్న సమయంలోనే వెనుక నుంచి కొందరు చెప్పులు విసిరారన్నారు. తెలంగాణపై వైఎస్సార్ జమానాలో నోరెత్తని నాయకులు ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దాడికి ప్రయత్నించింది ఎవరో తనకు తెలుసని వీహెచ్ పేర్కొన్నారు.