Vijay Devarakonda
-
35 ఏళ్లు వచ్చాయి.. ఇంకా సింగిల్‌గా ఉంటానా?: విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో కోటికి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ తన రిలేషన్షిప్ స్టేటస్ బయటపెట్టాడు. తాను సింగిల్ కాదని ఒప్పేసుకున్నాడు. విజయ్ మాట్లాడుతూ.. నాకు 35 ఏళ్లు వచ్చాయి. ఇంకా సింగిల్‌గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారు.ప్రేమ గురించి తెలుసుప్రేమ విషయానికి వస్తే.. ఒకరి ప్రేమ పొందితే ఎలా ఉంటుందో తెలుసు.. ఒకర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసు. షరతుల్లేని ప్రేమ గురించి నాకు తెలియదు. నా ప్రేమ మాత్రం అంచనాలతోనే ఉంటుంది. నాది అన్‌కండిషనల్ లవ్ కాదు అని తెలిపాడు. విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అతడు రష్మిక కోసమే చెప్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రష్మికతో లవ్!కాగా విజయ్-రష్మిక చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ అది బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడటం లేదు. అయితే పండగలు, వెకేషన్స్ అప్పుడు మాత్రం ఒకే చోట ఫోటోలు దిగి వాటిని నెట్టింట్లో వదిలి తాము కలిసే ఉన్నట్లు హింట్లిస్తుంటారు.చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ప్లానింగ్ మార్చిన విజయ్
-
ఒకే ఫ్రేమ్ లో రౌడీ, రెబల్, యానిమల్.. పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే..!
-
విజయ్ దేవరకొండ 'సాహిబా'ను మీరూ చూసేయండి
టాలీవుడ్ రౌడీ బాయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. విజయ్ దేవరకొండ నటించిన మ్యూజిక్ ఆల్బమ్ పూర్తి సాంగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. 'సాహిబా' అనే పాట కోసం రాధిక మదన్‌తో కలిసి విజయ్ కనిపించారు. బాలీవుడ్లో సత్తా చాటుతున్న సింగర్ జస్లిన్ రాయల్ ఈ పాటను కంపోజ్ చేశారు.మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం విజయ్ దేవరకొండ గతంలో కూడా పనిచేశారు. సుమారు ఆరేళ్ల క్రితం 'నీ వెనకాలే నడిచి' అనే సాంగ్ కోసం ఆయన వర్క్ చేశారు. 2018లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ సాంగ్ కూడా అప్పట్లో ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు 'సాహిబా' కోసం సింగర్ జస్లిన్ రాయల్ ఫిదా చేశారు. 'హీరియే' పాటతో జస్లిన్ రాయల్ కూడా గతంలో భారీగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. -
ఆకాశంలో విహరిస్తూ ఫుడ్ ఆరగించిన టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వీడీ12 మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కేరళలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఓ ఆల్బమ్ సాంగ్‌లో వీడీ కనిపించనున్నారు. సాహిబా అనే సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్ జస్లిన్ రాయల్‌తో కలిసి పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ముంబయిలో ప్రకటించారు. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ రావడంతో విజయ్ చిల్ అవుతున్నారు. (ఇది చదవండి: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!)అయితే తాజాగా ఆయన తన ఫెవరేట్ ఫుడ్ కేఎఫ్‌సీ చికెన్ తింటూ గాల్లో ఎంజాయ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణిస్తూ గాల్లోనే ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆకాశంలో విహరిస్తూ తనకు ఇష్టమైన కేఎఫ్‌సీ ఫుడ్ తింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్
రెండురోజుల క్రితం విజయ్ మెట్లపైనుంచి జారిపడ్డారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయింది. కొందరైతో ట్రోల్స్ కూడా చేశారు. అయితే, తాజాగా విజయ దేవరకొండ ఆ వీడియోను షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏకంగా తన బ్రాండ్ దుస్తుల షాప్ ప్రమోషన్ కోసం విజయ్ ఉపయోగించాడు. ఇలా బిజినెస్‌లో కూడా తన మార్కెట్ స్ట్రాటజీని విజయ్ ఉపయోగించారు. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. తన బిజినెస్ బ్రాండ్ పేరు చెబుతూ అన్నీ 'రౌడీ' ఆలోచనలే అంటూ క్లాంప్లీమెంట్ ఇస్తున్నారు.'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ రెండురోజుల క్రితం ముంబై వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోకి మరో వీడియోను జత చేసి విజయ్ ఎడిట్ చేశారు. తాజాగా దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్ ప్రేమలో పడుతూనే ఉంటాం. తప్పకుండా మీరు కూడా రౌడీ వేర్‌తో ప్రేమలో పడతారు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తన వ్యాపారానికి పనికొచ్చేలా ఆ వీడియోను విజయ్ ఉపయోగించడం చెప్పుకోతగిన విషయం అని చెప్పవచ్చు.'రౌడీ' పేరుతో దుస్తుల బ్రాండ్‌ని విజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ స్టైల్ తనకి బాగా నచ్చిందని, 'రౌడీ' బ్రాండ్ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్ ఓ సందర్భంలో పంచుకున్నారు కూడా.. దీంతో విజయ్ కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్ చేసి విజయ్ పంపించారు కూడా. వాటికి ఫిదా అయిన బన్నీ ఆ దుస్తులు దరించి పలు ఫోటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వల్ల రౌడీ బ్రాండ్ దుస్తులు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కేరళలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ముంబయిలో సందడి చేశారు. ఓ ఈవెంట్‌కు హాజరైన విజయ్ అనుకోకుండా స్టెప్స్‌పై కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే విజయ్‌కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. విజయ్ కిందపడ్డ వెంటనే పక్కనే ఉన్నవాళ్లంతా అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత విజయ్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లారు.తొలిసారి మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్‌అయితే విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. తన కెరీర్లో మొదటిసారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో విజయ్ కనిపించనున్నారు. ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ నటిస్తోంది సాహిబా పేరుతో హిందీ వీడియో సాంగ్‌కు ఫేమస్ బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తుండగా..త్వరలోనే ఈ పాటను విడుదల కానుంది. ఈ ఈవెంట్ కోసమే విజయ్ ప్రస్తుతం ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. ఆ టాలీవుడ్ హీరో ఇంట్లోనే!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియావ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యుటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా మెప్పించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా పుష్ప-2 పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే ఈ ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. దీపాలు పళ్లెంలో పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. అంతే కాకుండా పిక్ క్రెడిట్స్ ఆనంద్ దేవరకొండ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. గతంలోనూ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఎప్పుడెళ్లినా ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోయింది. ఈ సారి కూడా దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఎక్కడా కూడా బయటికి చెప్పలేదు. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'పెళ్లి చూపులు' కోసం ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన 'పెళ్లి చూపులు' అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈమేరకు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.ప్రస్తుత సమయంలో విజయ్‌కు ఒక భారీ హిట్ తప్పనిసరి.. ఈ క్రమంలో తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి టైమ్‌లోనే విజయ్‌కి ఒక చక్కటి కథను తరుణ్‌భాస్కర్ వినిపించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఒక యాక్షన్ సినిమాను తీసేందకు ఆయన రెడీ అవుతున్నారట. వీరిద్దరి సినిమా కోసం బడ్జెట్ ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారని టాక్. అయితే, ఫైనల్‌గా విజయ్ ఈ ప్రాజెక్ట్‌పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.పెళ్లి చూపులు సినిమా తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్‌తో పాటు, రెండు నందులను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం హిందీ,తమిళ్, మలయాళంలో రీమేక్ అయింది. -
తెలుగులో ఆ రెండు సినిమాలే నా ఫేవరేట్: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవర ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించాడు. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటించారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే కేరళలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.తాజాగా హైదరాబాద్‌లో జరిగిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లిచూపులు హిట్ తర్వాత నా ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్ నుంచే.. త్రివిక్రమ్ సార్ నన్ను ఆఫీస్‌కు పిలిచి అందించారు. ఆయనను కలవడం నా జీవితంలో బిగ్ మూమెంట్ అన్నారు. నా ఫేవరేట్ సినిమాలు మహేశ్ బాబు నటించిన అతడు, ఖలేజా అని విజయ్ తెలిపారు. ఎవరైనా ఖలేజా సినిమా బాగలేదంటే వారితో గొడవపడేవాడిని అని విజయ్ దేవరకొండ అన్నారు.కాగా..వీడీ 12 తర్వాత మరో రెండు చిత్రాల్లో విజయ్ నటించనున్నారు. రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే వాటిపై ఫోకస్ పెట్టనున్నారు. వీడీ12 వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్ కానుంది. #Trivikram గారు డబ్బులతో ధైర్యం ఇచ్చారు, #Athadu & #Khaleja are my most favourite films - @TheDeverakonda #VijayDeverakonda #VD12 #LuckyBaskhar #TeluguFilmNagar pic.twitter.com/6I5vkmfkOL— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024 -
ఘనంగా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అక్టోబరులో ఆరంభం
‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 19వ శతాబ్దపు నేపథ్యంలో 1854 – 1878 టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుందని, ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటివారంలో ప్రారంభమయ్యేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
రెండు భాగాలుగా ‘వీడీ 12’.. టార్గెట్ ఫిక్స్!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూట్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. విజయ్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను నవంబరు కల్లా పూర్తి చేయాలని విజయ్ దేవరకొండ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట.(చదవండి: ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. కానీ ఇప్పుడు చెబుతున్నా) ఇందుకు తగ్గట్లుగా చిత్రయూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్‌పై ఈ దసరా పండగ సమయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పెగా కనిపిస్తారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే చాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్.. కారణం ఇదే!)అలాగే రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాల చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాల్లోని క్యారెక్టర్స్ కోసం విజయ్ మేకోవర్ కావాల్సి ఉంది. అందుకే ‘వీడీ 12’ సినిమా చిత్రీకరణను తొందరగా పూర్తి చేసి, తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెట్టాలని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్‌ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్‌తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్‌లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్‌గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
ఇకపై 'నాని అన్నా' అని పిలుస్తా: విజయ్ దేవరకొండ
సైమా అవార్డుల వేడుక (#SIIMA2024) అట్టహాసంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా, హాయ్ సినిమాలు ఎక్కువ అవార్డులు కొల్లగొట్టేశాయి. దసరా సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు గెలిచాడు. ఈ పురస్కారాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నానిని హత్తుకుని కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. కంగారుపడ్డా..'ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో మొదటిసారి నేను కీలకపాత్ర పోషించాను. ఈ సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి నాని ఆఫీస్‌కు వెళ్లాను. ఓపక్క సంతోషపడుతూనే తను ఎలా మాట్లాడతాడో అని కాస్త కంగారుపడ్డాను. కానీ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు. నానీ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇండస్ట్రీలో అందర్నీ అన్నా అని పిలుస్తుంటాను. అలా ఎందుకు పిలుస్తానో నాకే తెలియదు. కానీ నానీని మాత్రం నేను అన్నగా భావించాను, కాబట్టి ఇకనుంచి తనను నానీ అన్నా అని పిలుస్తాను. నువ్వు వరుస హిట్స్ అందుకోవడం చాలా సంతోషం. ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది' అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఫిక్స్ అయిపో..తర్వాత నాని మాట్లాడుతూ.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపన పడే వ్యక్తి విజయ్. కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు నాకు అవార్డు ఇచ్చావు. వచ్చే ఏడాది ఇదే స్టేజీపై మా గౌతమ్ తిన్ననూరి సినిమాకు నేను అవార్డు ఇస్తాను. ఇది ఫిక్స్ అయిపో అని తెలిపాడు. కాగా నాని, విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఇకనైనా గొడవలకు చెక్!కాగా నాని, విజయ్ దేవరకొండ మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు. తాజాగా హీరోల వ్యాఖ్యలతో వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్పష్టమైపోయింది. దీంతో ఇకనైనా ఫ్యాన్స్వార్కు చెక్ పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.చదవండి: 'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..' -
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
స్టార్ బ్రాండ్స్..
ప్రముఖ సినీతారలు, క్రీడాకారులు, ఫ్యాషన్ ఐకాన్స్, సింగర్స్, డ్యాన్సర్స్.. ఇలా విభిన్న రంగాల్లో సెలబ్రిటీలు తమ కళ, నైపుణ్యాలతో అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో ప్రేక్షకులతో, అభిమానులతో ఏర్పడిన ప్రత్యేక అనుబంధం వారిని సెలబ్రిటీలుగా మారుస్తుంది. ఇలా వారి వారి రంగాల్లో తారలుగా వెలుగొందుతూనే, వారికున్న ఇమేజ్, ప్రశస్తిని వ్యాపారంగానూ మార్చుకునే ట్రెండ్ గతంలోనే మొదలైంది. చాలా వరకూ సెలబ్రిటీలు వివిధ బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు మాత్రం సొంత బ్రాండ్లను ఆవిష్కరిస్తుండడం విధితమే. ఇందులో టాలీవుడ్ స్టార్లు మొదలు బాలీవుడ్ తారలు, భారతీయ క్రికెటర్లు తదితర సెలబ్రిటీలు ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. మోడ్రన్ ట్రెండ్స్, అధునాతన ఫ్యాషన్ హంగులకు ఎల్లప్పుడూ వేదికగా నిలిచే హైదరాబాద్ నగరం ఈ సెలబ్రిటీ బ్రాండ్లకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో నగర వేదికగా క్రేజ్ పొందుతోన్న కొందరు సెలబ్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందామా.. మేము సైతం.. టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మహేష్ బాబు కూడా ఈ ఓన్ బ్రాండ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు కొనసాగించారు. ‘ది హంబుల్ కో’ అనే క్లాతింగ్ బ్రాండ్‌తో మహేష్ అలరించి మధ్యలో ఆపేశారు. తన బ్రాండ్ పేరు మధ్యలో ‘ఎమ్‌బి’ అనే ఇంగ్లిష్ అక్షరాలు వచ్చేలా చూసుకున్నాడు. ఇదే కోవలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సైతం ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 విడుదలై, విజయవంతమైన సమయంలో ‘బీ ఇస్మార్ట్’ అనే బ్రాండ్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం అది అందుబాటులో లేదని సమాచారం. యూ వి కెన్.. క్యాన్సర్ నుంచి బయట పడిన అనంతరం తనలాంటి క్యాన్సర్ బాధితులకు సహకారం అందించడమే లక్ష్యంగా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ‘యూ వి కెన్( ్గౌu గ్ఛి ఇ్చn...)’ అనే ఎన్జీవోను ప్రారంభించారు. ఈ సంస్థకు ఆర్థిక వనరుల కోసం అదే పేరుతో అథ్లెటిక్ వేర్, క్యాజువల్ వేర్‌ను ఆవిష్కరించారు. క్రీడాకారులు, క్రీడా రంగానికి చెందిన వివిధ వ్యక్తులు ఈ బ్రాండ్‌ను బాగా ఆదరిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం యూవీ ఇదే సంస్థ తరపున నగరంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ‘రాన్’.. రన్ అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు ఆటలో దూకుడుతోనూ.. ఇటు మోస్ట్ ఫ్యాషనబుల్ పర్సనాలిటీతోనూ ఎప్పుడూ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా అలరిస్తుంటాడు. అయితే విరాట్ కోహ్లికి సైతం ‘రాన్’ అనే సొంత క్లాతింగ్ బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా నగరంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడి ఆదరణ గమనించిన కోహ్లి.. తన బ్రాండ్ అంబాసిడర్ ఎబీ డివీలియర్స్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించాడు. ఎబీ డివీలియర్స్ తనతో ఆర్సీబీ టీమ్ మేట్మాత్రమే కాదు, తన బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాడు. మోడ్రన్, క్లాసీ లుక్స్ ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఏ ‘ఊకో కాక’.. సింగర్‌గా గల్లీ నుంచి ప్రయాణం ప్రారంభించి ఆస్కార్ వేదిక వరకూ ఎదిగిన లోకల్ బాయ్ రాహుల్ సిప్లిగంజ్ సైతం ఈ వ్యాపారంలోకి వచ్చారు. తన వ్యక్తిత్వానికి తగ్గట్టే ‘ఊకో కాక’ అనే పేరుతో క్లాతింగ్ స్టోర్లు ప్రారంభించాడు. మధ్య తరగతి కుటుంబాలు మొదలు రిచ్ పీపుల్ వరకూ ఈ బ్రాండ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. లోకల్ ఫ్లేవర్‌తో, మాస్, ట్రెండీ లుక్స్‌తో ఈ బ్రాండ్ దూసుకుపోతోంది. సచిన్ సైతం.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఒక మతమైతే సచిన్ టెందుల్కర్ని దేవుడిలా కొలుస్తారు. అలాంటి సచిన్ సైతం ఫ్యాషన్ రంగంలో సొంత బ్రాండ్‌తో బిజినెస్ చేస్తున్నాడు. అరవింద్ ఫ్యాషన్‌తో సంయుక్తంగా జతకట్టి మగవారికి సంబంధించిన నాణ్యమైన కలెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారసత్వ వైభవాన్ని ప్రదర్శించేలా అధునాతన హంగులనూ అవసోపన పట్టిన ఈ డిజైన్స్‌కు మంచి ఆదరణ ఉంది. దీంతో పాటు సచిన్ టెందుల్కర్ స్పిన్నీ, బూస్ట్, బీఎండబ్ల్యూ వంటి వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉన్నారు. ‘అల్లూ’రిస్తూ... తెలుగు సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం పాన ఇండియా స్థాయిలో స్టైలిష్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపున్న అల్లు అర్జున్ సైతం ‘ఏఏ’ బ్రాండ్ ఆవిష్కరిస్తున్నారని పలుమార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ‘ఏఏ’ పేరుతో కొన్ని లోకల్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనర్..ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు సైతం నగరంలో ప్రత్యేకంగా స్టోర్ ఉండటం విశేషం. తన డిజైన్స్‌ను నగరంలో ప్రమోట్ చేయడం కోసం కరీనా కపూర్ వంటి బాలీవుడ్ తారలతో నగరంలో అతిపెద్ద ఫ్యాషన్ షోలను సైతం ఈ ఫ్యాషన్ ఐకాన్ నిర్వహించాడు.‘రౌడీ’ బాయ్స్..టాలీవుడ్ టు బాలీవుడ్ వరకూ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినూత్న కథాంశాలు, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో అతి తక్కువ సమయంలో టాప్ హీరోల స్థాయిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే హవాను కొనసాగిస్తూ ‘రౌడీ’ అనే ఇండియన్ స్ట్రీట్ కల్చర్ టాప్, బాటమ్ వేర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. సరికొత్త ట్రెండ్స్‌ను ఇష్టపడే యూత్ ఈ రౌడీ బ్రాండ్‌ను బాగా ఆదరిస్తున్నారు. ఈ బ్రాండ్ యాడ్స్‌లో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ సొంత బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాడు విజయ్. సినిమా ఫంక్షన్లు, టీవీ షోలలో విజయ్ తన బ్రాండ్ దుస్తులనే ధరిస్తూ హ్యండ్సమ్ లుక్స్‌తో అలరిస్తుంటారు. ఈ బ్రాండ్ ఆన్లైన్ రౌడీ క్లబ్లో లభ్యమవుతాయి.బీయింగ్ హైదరాబాదీ.. దేశ వ్యాప్తంగా ఫ్యాషన్ మార్కెట్లో బీయింగ్ హ్యూమన్ది ప్రత్యేక స్థానం. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్ కావడంతో దీనికి మంచి ఆదరణ ఉంది. 2007 నుండి సల్మాన్‌ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి బీదవారి ప్రాథమిక విద్య, వైద్యానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. 2009 నుండి బీయింగ్ హ్యూమన్ పేరుతో ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రారంభించాడు. వచ్చే ఆదాయాన్ని తన స్వచ్ఛంద సంస్థ తరపున సేవా కార్యక్రమాలకే ఖర్చుపెడుతున్నాడు. హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్‌కు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సల్మాన్‌కు నగరంతో ప్రత్యేక అనుబంధముంది. తన చెల్లి పెళ్లిని సైతం ఇక్కడే చేయడం తెలిసిందే.గ్లామర్ క్వీన్స్.. ప్రియాంక చోప్రా అనోమ్లీ బ్యాటీ ఉత్పత్తులు, దీపికా పదుకొనె ఆల్ అ»ౌట్ యూ, సమంత సాకి, అనుష్క శర్మ నుష్ వంటి బ్రాండ్లు కూడా ఇక్కడ లాభాల్లో అమ్ముడవుతున్నాయి. గ్లామర్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న ఈ తారల సొంత బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్, మింత్ర లాంటి అన్లైన్ పోర్టల్స్‌లో లభ్యమవుతుండగా.. సమంత మాత్రం సాకి.కామ్ పేరుతో సొంత ఈకామర్స్ పోర్టల్ నడుపుతోంది. టాప్‌లో.. వీరితో పాటే ధోనీ సెవెన్ బ్రాండ్, విరేంద్ర సెహా్వగ్ వీఎస్ బ్రాండ్లకు సైతం ఇక్కడ మంచి ఆదరణ ఉంది. ఈ కామర్స్ పెరిగిపోవడంతో అందిరి సెలబ్రిటీల బ్రాండ్స్ అభిమానులు ఆర్డర్ చేస్తున్నారు. -
విజయ్ దొవరకొండపై శేఖర్ కమ్ముల సంచలన కామెంట్స్
-
'అర్జున్ రెడ్డి ఫుల్ కట్ చూపించు'.. డైరెక్టర్‌ను కోరిన విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి. బాలీవుడ్ భామ షాలినీ పాండే హీరోయిన్గా నటించింది. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజై నేటికి ఏడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మూవీ స్టిల్స్ షేర్ చేశారు. అప్పుడే ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకుండా పోతున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓ రిక్వెస్ట్ చేశారు. విజయ్ తన ట్వీట్లో రాస్తూ.. 'పదో వార్షికోత్సవానికి అర్జున్‌రెడ్డి ఫుల్ కట్‌ను అందుబాటులోకి తీసుకురా. అర్జున్ రెడ్డి విడుదలై ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. ఇదంతా గత సంవత్సరంలోనే జరిగినట్లుగా అనిపిస్తోంది' అంటూ మూవీ షూటింగ్ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పదో వార్షికోత్సవానికి ఫుల్ వెర్షన్ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.కాగా.. రొమాంటిక్ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో రన్ టైమ్ దాదాపు 3 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ పలు కారణాల రీత్యా 3 గంటల 2 నిమిషాలకు కుదించారు. అభ్యంతరకర పదాలు, ముద్దు సన్నివేశాల నిడివిని తగ్గించాలని సెన్సార్ బోర్డు కట్ చెప్పింది. తెలుగులో సూపర్‌హిట్ నిలిచిన ఈ చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మగా , హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేశారు.Give the people 'The SandeepVanga #ArjunReddy full cut' for the 10 years anniversary @imvangasandeep!I cannot believe it is 7 years already, remember so many moments as if it was last year ❤️ pic.twitter.com/J8CmcByHae— Vijay Deverakonda (@TheDeverakonda) August 25, 2024 -
టాలీవుడ్ ముందుకు... కథలు వెనక్కి..!
తెలుగు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో ముందు ముందుకెళుతోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి’ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇలా వసూళ్ల పరంగా ముందుకు వెళుతున్న టాలీవుడ్ కథల పరంగా వెనక్కి వెళుతోంది. అవును... ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పదికి పైగా పీరియాడికల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 20వ శతాబ్దపు కథలతో రూపొందుతున్న ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ఓ వైపు రాజాసాబ్...మరోవైపు ఫౌజీ యుద్ధానికి సరికొత్త నిర్వచనం ఇవ్వనున్నారు ప్రభాస్. ఇందుకోసం ఈ హీరో దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటించనున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లోప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం పోస్టర్‌పై కనిపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, ‘హైదరాబాద్ చార్మినార్’, ‘ఆపరేషన్ జెడ్’, ‘పవిత్రాణాయ సాధూనాం’ వంటి అంశాలు సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికతను జోడించి ఈ సినిమా కథ తయారు చేశారట హను రాఘవపూడి. మాతృభూమి కోసం పోరాడే ఓ యోధుడి నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయం అది. అలాంటప్పుడు ఆ యుద్ధానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు ఓ యోధుడు’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఇటీవల పేర్కొన్నారు హను రాఘవపూడి. జయప్రద, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా 1990 నాటి కథేనని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ను చూపించ నున్నట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధీ కుమార్ మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఇటు డ్రాగన్... అటు దేవరఎన్టీఆర్ను ‘డ్రాగన్’గా మార్చారట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 8న ఈ సినిమాప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌పై 1969, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా, భూటాన్, కోల్‌కతా అని పేర్కొంది చిత్రయూనిట్.దీంతో 1969 నేపథ్యంలోనే ఈ సినిమా కథనం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన ఓ వాస్తవ ఘటనకు కల్పిత అంశాలను జోడించి, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తారు. రెండు భాగాలుగా ‘దేవర’ రిలీజ్ కానుంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది.పెద్ది!రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కొంచెం బరువు పెరగాలనుకుంటున్నారు. రా అండ్ రస్టిక్‌గా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.రాయలసీమ నేపథ్యంలో...హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్, రాహుల్‌ల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రాయలసీమ నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రానుంది. ఈ పీరియాడికల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే విజయ్ హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.అసాధారణ ప్రయాణంఓ సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ఇది. 1980 నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా ఉంటుంది. ఇందులో ఓ బ్యాంక్ క్యాషియర్‌గా దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.క.. సస్పెన్స్కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడికల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ డ్రామా ‘క’. దర్శకత్వ ద్వయం సుజిత్– సందీప్ తెరకెక్కిస్తున్నారు. కృష్ణగిరి పట్టణం, అక్కడ ఉన్న ఓ పోస్ట్‌మేన్, అతని జీవితంలోని మిస్టరీ ఎపిసోడ్ అంశాల నేపథ్యంలో ‘క’ సినిమా కథనం ఉంటుంది. చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘క’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నాయి.బచ్చల మల్లి ‘బచ్చల మల్లి’గా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఓ ఊరి చుట్టూ ఉంటుందని తెలిసింది. ఇందులో ట్రాక్టర్ డ్రైవర్ మల్లి పాత్రలో కనిపిస్తారు ‘అల్లరి’ నరేశ్. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ఎదురు చూపు ఓప్రాంతం ఒకతని కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు సాయి దుర్గాతేజ్. 1940 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. ‘హను–మాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్‌రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాలు పడుతున్న ఓప్రాంత వాసుల జీవితాలు ఓ వ్యక్తి రాకతో ఎలా మారతాయి? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.24 సంవత్సరాలు హీరో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ అంశాలతో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. 1958 నుంచి 1982... అంటే ఇరవై నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుంది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
'స్ట్రోమ్' వచ్చాక సంతోషం వచ్చింది.. : విజయ్ దేవరకొండ
స్ట్రోమ్ (విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క పేరు) వచ్చాక మా ఇంట్లో ఎంతో ఆనందం వచ్చిందని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. జూబ్లీహిల్స్‌లో నూతనంగా నెలకొల్పిన సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్‌ను విజయ్ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ప్రారంభించారు. మా ఇంట్లో మొదట్లో పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ మా అమ్మా నాన్నకు నచ్చజెప్పి స్ట్రోమ్ గాడిని తెచ్చుకున్నామని, ఇప్పుడు మాకంటే మా పేరెంట్స్ స్ట్రోమ్ గాడితోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ అన్నారు.షూటింగులలో ఎంతో బిజీగా ఉండి, ఒత్తిడిలో ఇంటికి రాగానే స్ట్రోమ్ గాడి అల్లరితో అంతా మర్చిపోతామన్నారు. పెట్స్‌ను పెంచడమంటే మామూలు విషయం కాదని, ఇంట్లో ఒక చిన్న బేబీని చూసినంత పని ఉంటుందని, అంత కేర్ తీసుకునే ఓపిక ఉన్న వాళ్లు మాత్రమే పెట్స్‌ను పెంచుకోవాలని సూచించారు. సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ నిర్వాహకులు సంధ్య, శ్రీరెడ్డి పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ : సెవన్ ఓక్ పెట్ హాస్పిటల్లో సందడి చేసిన విజయ్ ,ఆనంద్ దేవరకొండ (ఫొటోలు)
-
టైగర్ తో ఫైటింగ్ కి దిగుతున్న లైగర్
-
ఏకంగా సల్మాన్ ఖాన్ తో విజయ్ దేవరకొండ క్లాష్
-
Vijay Devarakonda: మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్
‘ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్’ నుంచి ఎయిర్ బస్ దాకా... ఆఫర్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్‌స్టార్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా... ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా పంచుకున్నారు.→ విజయ్‌తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్ చేసుకుంటారా? తరుణ్ భాస్కర్: మహేశ్వరి చాంబర్స్‌లో నాకో ఆఫీస్ ఉండేది. వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్‌లో థియేటర్ ఆర్టిస్ట్స్‌ని కలిసేవాడిని. అప్పుడే విజయ్‌ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్ ఫిల్మ్స్ చేసేద్దాంరా’ అని విజయ్ కాన్ఫిడెంట్‌గా అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్‌తో చేశాం. నా వల్ల విజయ్‌కి హిట్ వచ్చింది.. విజయ్ వల్ల నాకు అనే ఫీలింగ్ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్కి దక్కిన సక్సెస్ అనుకుంటాను. → మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?కోవిడ్ టైమ్‌లో విజయ్ ఫోన్ చేసి, ‘అరేయ్... మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్‌లో ఒక్కో ΄ాయింట్ ఎలా టర్న్ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం. → అప్పట్లో మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్‌ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. → మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్ నాన్న ఎలాంటి ఫిల్టర్ లేకుండా నాతో మాట్లాడతారు... టైమ్ వేస్ట్ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్‌కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు. → మీరు, విజయ్ గొడవలు పడిన సందర్భాలు... ‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్‌గా కొన్ని చెప్పేవాడు విజయ్. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్‌గా విజయ్ నాన్న సాల్వ్ చేశారు. రేయ్.. వాడు చెప్పిన మాట విను అని విజయ్‌తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్ నీది.. నా యాక్టింగ్ నాది అని ఫిక్స్ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్‌గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్ బాలీవుడ్ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్‌బ్యాక్ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. → ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్‌కి ఎమోషనల్ అయ్యాం. అప్పుడు విజయ్‌ది, నాది బ్యాడ్ సిట్యువేషన్... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్‌లో వచ్చినన్ని అప్స్ అండ్ డౌన్స్ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్ కావడంతో ఎమోషన్‌తో కన్నీళ్లు వచ్చాయి. → విజయ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు? విజయ్ నా ట్రంప్ కార్డ్. గేమ్‌లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్ కార్డ్ వాడుకుంటా. ఆ టైమ్ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్‌కి రీచ్ కావాలని ఉంది. మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. → విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండటం గురించి? విజయ్ ప్రతి సక్సెస్‌లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్ బాయ్... నా డార్లింగ్. విజయ్ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్‌కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. విజయ్ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్ అవడం గర్వంగా ఉంటుంది.మీ ఫస్ట్ సినిమాలో విజయ్‌ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్ లైఫ్‌లో విజయ్‌ని పెళ్లి కొడుకుగా చూడాలని లేదా? కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్ పర్సంట్ విజయ్‌ని ఫ్యామిలీ మేన్‌గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్ ఆ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ పక్కా ‘జెంటిల్‌మేన్’.మీ బాయ్స్‌కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? నెక్లెస్ రోడ్, మహేశ్వరి చాంబర్స్ దగ్గర చాయ్ బండి, ఆ పక్కన చైనీస్ ఫుడ్ సెంటర్. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్ కేఫ్ దగ్గర థమ్సప్ లోగోలో విజయ్ థమ్సప్ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్‌కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్ మూమెంట్. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్లో ఫుడ్ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్‌కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్‌కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్‌తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.మా కల ఒకటే– విజయ్ దేవరకొండమేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్‌కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్‌లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్‌తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్‌లో ఒక మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.– డి.జి. భవాని