win
-
గెలిచి నిలిచిన గాయత్రి–ట్రెసా జోడీ
హాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ తొలి విజయం నమోదు చేసుకుంది. మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి–ట్రెసా జంట తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ జోడీ చేతిలో ఓడినా... రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన పోరులో గాయత్రి –ట్రెసా ద్వయం 21–19, 21–19తో ప్రపంచ ఆరో ర్యాంక్ పియర్లీ టాన్–థీనా మరళీధరన్ (మలేసియా) జంటపై గెలుపొందింది. సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మన అమ్మాయిలు... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌ల్లో విజృంభించారు. 46 నిమిషాల పాటు సాగిన పోరులో మలేసియా జోడీ ఒక దశలో వరుసగా 6 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చే ప్రయత్నం చేయగా... భారత జంట కీలక సమయాల్లో విజృంభించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఆధిక్యం చేతులు మారుతూ సాగినా... చివరకు గాయత్రి–ట్రెసా జంటనే విజయం వరించింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన చైనా జంట 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత జట్టు ఒక పాయింట్‌తో రెండో స్థానంలో ఉంది. భారత షట్లర్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే నేడు జరిగే గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్‌లో నామీ మసుయమా–చిహారు షిడా (జపాన్)పై విజయం సాధించాల్సి ఉంటుంది. -
భారత్ పై ఆస్ట్రేలియా విజయం
-
‘మహా’ పోరు: అధికారం పీఠం దక్కించుకునేదెవరు?
సాక్షి ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ మహాయుతి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబరు 23వ తేదీ (శనివారం) వెలుపడను న్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌షాహీ, రిపబ్లిక్ , చాణక్య, పోల్‌డైరీ వంటి అనేక సంస్ధలు ఎగ్జిట్‌పోల్ సర్వేలు నిర్వహించాయి. మహాయుతిదే మళ్లీ అధికార పీఠమని కొన్ని సర్వేలు వెల్లడించగా, మరి కొన్ని సర్వేలు మాత్రం మహావికాస్ ఆఘాడి కూటమి అ«ధికారంలో రానుందని పేర్కొన్నాయి. మహా వికాస్ ఆఘా డీకి 124 నుంచి 156 స్థానాలు లభించనున్నాయని, మహాయుతి కూటమికి 129 నుంచి 150 స్థానాలు, ఇతరులు 10 స్థానా ల్లో గెలిచే అవకాశముందని లోక్‌షాహీ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. ఇదిలాఉండగా మహాయుతికి 137 నుంచి 157 స్థానాలు, మహావికాస్ ఆఘాడీకి 126 నుంచి 146 స్థానాలు లభించే అవకాశాలున్నాయని రిపబ్లిక్ సర్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారపీఠమెక్కేదెవరన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు గెలుపు మీద ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.#WATCH | Delhi | On Shiva Sena (UBT)'s claim that they (MVA) will secure 160 seats in Maharashtra elections, Union Minister Giriraj Singh says, “The election results will be out by this time tomorrow. They (Shiv Sena) are nervous, that’s why they are making such claims.” pic.twitter.com/oQhlxkevZm— ANI (@ANI) November 22, 2024 -
రికార్డు: తొలిసారి అమెరికా సెనేట్‌కు ట్రాన్స్‌జెండర్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికల రిజల్ట్స్ కూడా బుధవారం(నవంబర్ 6) వెలువడుతున్నాయి. డెలవేర్‌లోని ఎట్ లార్జ్హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సెనేట్‌కు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు.దీంతో సారా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డులకెక్కారు.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్ 3తో,సారా మెక్‌బ్రైడ్ పోటీపడ్డారు.ఈ ఎన్నికలో సారాకు 95శాతం ఓట్లు పోలవగా వేలెన్కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.తాను ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.కాగా,సారా మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్ల డాలర్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2010 నుంచి డెలవేర్ డెమోక్రాట్లకు కంచుకోటగా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు -
PKL 11: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ శుభారంభం సత్తా చాటిన గౌరవ్ ఖత్రి
హైదరాబాద్, అక్టోబర్ 19: డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో శుభారంభం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతూ పది పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. శనివారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పల్టాన్ 35–25 తో స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. తన ఉడుం పట్టుతో ప్రత్యర్థులను నిలువరించిన డిఫెండర్ గౌరవ్ ఖత్రి 7 పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందర్ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా.. పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, అమన్ నాలుగేసి పాయింట్లు రాబట్టారు. హర్యానా స్టీలర్స్ జట్టులో శివం పతారె, శంకర్ మిశ్రా ఐదు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.. ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా షాడ్లోయి (4), రైడర్ వినయ్ పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఆట ఆరంభంలో ఇరు జట్లూ వరుస పాయింట్లతో పోటాపోటీగా తలపడ్డాయి. 6–6తో స్కోరు సమంగా ఉన్న దశలో పుణెరి పల్టాన్ వేగం పెంచింది. రైడింగ్‌లో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ 13వ నిమిషంలోనే హర్యానా స్టీలర్స్‌ను ఆలౌట్ చేసి 13–7తో ఆధిక్యం సాధించింది. శివం పతారే డుబ్కి స్కిల్ చూపెడుతూ రెండు పాయింట్లు తీసుకురావడంతో స్టీలర్స్9–13తో పుంజుకునేలా కనిపించింది. కానీ, పంకజ్ మోహితే మూడు పాయింట్ల సూపర్ రైడ్ చేయడంతో పుణెరి తన ఆధిక్యాన్ని 18–10కి పెంచుకుంది. పుణెరి రైడర్ మోహిత్ గోయత్‌ను చియానే చేసిన సూపర్ ట్యాకిల్ చేసి రెండు పాయింట్టు రాబట్టినా పల్టాన్ 19–13 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో భాగంలో డిఫెండర్ చియనే సత్తా చాటినా రైడింగ్‌లో హర్యానా అంతగా ఆకట్టుకోలేక వెనుకబడింది. పుణెరి డిఫెండర్ ఖత్రి వరుసగా విజయ్, శివం పతారేను ట్యాకిల్ చేశాడు. చివరి నిమిషాల్లో ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అయితే, హర్యానా ఆఖరి రైడ్‌లో శంకర్ మిశ్రా మూడు టచ్ పాయింట్లు సహా నాలుగు పాయింట్లతో సూపర్ రైడ్ చేయడంతో హర్యానా తన ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించుకుంది. ఆదివారం రాత్రి జరిగే తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్–జైపూర్ పింక్ పాంథర్స్ తలపడాయి. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్–బెంగళూరు బుల్స్ పోటీ పడతాయి. -
యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా సబలెంక (ఫోటోలు)
-
‘2028లో పసిడి సాధించాలి’
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజెలెస్ విశ్వక్రీడల్లో పసిడి పతకం నెగ్గాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పారిస్ క్రీడల్లో కాంస్యం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టును బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించగా.. గురువారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ప్లేయర్లను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరు కొనసాగిస్తూ లాస్ ఏంజెలెస్‌లో స్వర్ణం సాధించాలి’ అని ఆకాంక్షించారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా... హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడంలో నవీన్ పట్నాయక్ పాత్ర ఎంతో ఉందని ప్లేయర్లు కొనియాడారు.ఆటగాళ్ల అవసరాలను తీర్చుతూ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సుమిత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుమిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కమల’ వికాసం సాధ్యమే: లిచ్‌మాన్
వాషింగ్టన్: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను దాదాపు ఖచి్చతంగా ఊహించి చెప్పిన అలాన్ లిచ్‌మాన్ మరోమారు తన విశ్లేషణను వెల్లడించారు. తాజా ఎన్నికల ప్రచార సరళి, అమెరికా ఓటర్ల మనోభావాలను లెక్కలోకి తీసుకుంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే నెలలో డెమొక్రటిక్ కన్వెన్షన్ తర్వాతే తన తుది అంచనాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ 1981 ఏడాదిలో ‘గెలుపునకు 13 సూత్రాలు’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనా వేస్తానని ఆయన చెప్పారు. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ గెలుస్తారన్న జోస్యాలు నిజమవడంతో 2024లో గెలుపుపై ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. -
Iran election 2024: మతవాద పాలనకు ఎదురుదెబ్బ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదులదే పైచేయి అయింది. కరడుగట్టిన మతవాది సయీద్ జలిలిపై మితవాది, సంస్కరణాభిలాషి మసూద్ పెజెష్కియాన్ ఘనవిజయం సాధించారు. జూన్ 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. దాంతో విజేతను తేల్చేందుకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జలిలి, పెజెష్కియాన్ మధ్య శుక్రవారం తిరిగి ఎన్నిక అనివార్యమైంది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. పోలైన దాదాపు 3 కోట్ల ఓట్లలో పెజెష్కియాన్‌కు 1.64 కోట్లు వచ్చాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అనుచరునిగా పేరుబడ్డ జలిలి 1.35 కోట్ల ఓట్లు మాత్రమే సాధించారు. దేశ తొమ్మిదో అధ్యక్షునిగా పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌పై దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న మతవాద కూటమికి ఈ ఫలితాలు గట్టి షాకివ్వడమే గాక సంస్కరణవాదుల్లో జోష్ నింపాయి. నిజానికి ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు శుక్రవారం రాత్రి దాకా జరిగిన ఓటింగ్‌లో అనూహ్యంగా భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. దాంతో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. తద్వారా ఖమేనీ ఏకపక్ష పోకడలపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫలితాల వెల్లడి మొదలవుతూనే రాజధాని టెహ్రాన్, పశి్చమ ఇరాన్‌లోని పెజెష్కియాన్ సొంత నగరం తబ్రీజ్తో పాటు దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు భారీగా వీధుల్లోకి వచ్చి డ్యాన్సుల సంబరాలు చేసుకున్నారు. దేశాన్ని కాపాడేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో బూత్‌లకు తరలారంటూ నినాదాలు చేశారు. పెజెష్కియాన్ ఎన్నికల నినాదమైన ‘సేవ్ ఇరాన్’ సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దేశంలో మెజారిటీలపై మైనారిటీల పెత్తనానికి మొత్తానికి తెర పడ్డట్టేనంటూ సంస్కరణవాదులు సంబరపడుతున్నారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మేలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల ఫలితాలను ఖమేనీ లాంఛనంగా ఆమోదముద్ర వేశాక 30 రోజుల్లో పెజెష్కియాన్ బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు.పోలింగ్ శాతం పెరగడం వెనక... → నిజానికి ఏళ్లుగా తామెదుర్కొంటున్న పలు కీలక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఇరానీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. → ఖమేనీ యంత్రాంగం తీరుకు నిరసనగా ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మూకుమ్మడిగా బహిష్కరించారు. దాంతో తొలి రౌండ్లో దేశ చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 40 శాతం పోలింగ్ నమోదైంది. → అత్యంత మితవాదిగా పేరొందిన పెజెష్కియాన్ అనూహ్యంగా తుది పోరులో బరిలో నిలవడంతో ఆయనకు మద్దతుగా వారంతా భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలారు. → పోలింగ్‌కు ముందు నుంచీ పెజెష్కియాన్ ప్రచార సరళికి, ‘సేవ్ ఇరాన్’ నినాదానికి దేశ యువత బాగా ఆకర్షితులయ్యారు. దాంతో ఆయన ర్యాలీలకు, సభలకు జనం పోటెత్తారు. → ఇస్లామిక్ పాలనకు తెర పడాల్సిందేనని యువతతో పాటు విద్యావంతులు కూడా తొలిసారిగా బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కరడుగట్టిన మతవాది అయిన జలిలి ఇరాన్‌ను ఎప్పటికీ ఏకం చేయలేరని మైకుల సాక్షిగా చెప్పుకొచ్చారు. → జలిలిని ఓడించడం ద్వారా నిరంకుశ మతవాద పాలనకు వ్యతిరేకంగా ఇరానీలు స్పష్టమైన తీర్పు వెలువరించారు. → ఖమేనీ మతవాద పాలన, హిజాబ్‌ను తప్పనిసరి వంటి కఠినతరమైన సామాజిక నిబంధనలు, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను ఎత్తేసేలా అంతర్జాతీయ సమాజంతో చర్చలకు ముందుకు రాని పోకడలపైనా ప్రజలు తమ వ్యతిరేకతను ఓటు రూపంలో స్పష్టంగా వ్యక్తం చేశారంటున్నారు.హార్ట్ సర్జన్‌పై ఆశలెన్నో...! 69 ఏళ్ల పెజెష్కియాన్‌కు హార్ట్ సర్జన్‌గా దేశవ్యాప్తంగా అపారమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయన ఇరాక్–ఇరాన్ యుద్ధంలో పాల్గొన్న వార్ వెటరన్ కూడా. 16 ఏళ్లుగా పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా, నాలుగేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. ఆయన భార్య కారు ప్రమాదంలో చనిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్‌గా పిల్లలను అన్నీ తానై పెంచారు. మతపరమైన మైనారిటీ అయిన అజెరీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం ఈ ఎన్నికల్లో పెజెష్కియాన్‌కు మరింత కలిసొచి్చంది. ప్రచారం పొడవునా కూతురిని వెంట ఉంచుకోవడం ద్వారా మహిళలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు భారీగా ఓటేశారు. సవాళ్ల స్వాగతం... లెక్కలేనన్ని సమస్యలు పెజెష్కియాన్‌కు స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉంది. ఇరుగుపొరుగుతో సంబంధాలు దారుణంగా దిగజారాయి. యెమన్, లెబనాన్ గుండా ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు ఇరాన్ అన్నివిధాలా సాయపడుతూ అంతర్జాతీయ సమాజం నుంచి మరింత ఆగ్రహం చవిచూస్తోంది. ఆ క్రమంలో గత ఫిబ్రవరిలో అమెరికాతో, అనంతరం ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ముంగిటి దాకా వెళ్లొచి్చంది. ఈ రుగ్మతలకు పెజెష్కియాన్ ఎలాంటి వైద్యం చేస్తారో చూడాలి. అయితే ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. దేశ ప్రగతి కోసం ప్రత్యర్థులతో కూడా కలిసి పని చేస్తానని ఫలితాల అనంతరం ప్రకటించారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. ఇది మనమంతా సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం. నేను మిమ్మల్ని ఏకాకులను చేయను. మీరూ నన్ను ఏకాకిని చేయొద్దు’’ అంటూ పిలుపునిచ్చారు. తద్వారా అందరినీ కలుపుకుని పోతానంటూ అతివాద వర్గానికి స్పష్టమైన సందేశమిచ్చారు. అదే సమయంలో, ‘ఇరాన్ ఇరానీలందరిదీ’ అంటూ పునరుద్ఘాటించడం ద్వారా ప్రజల సంక్షేమానికే ప్రథమ తాంబూలమని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు సర్వం సహా చక్రవర్తి అయిన ఖమేనీతో అధ్యక్షునిగా ఆయన సంబంధాలు ఏ మేరకు సజావుగా సాగుతాయన్నది ఆసక్తికరం. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా. దేశ ప్రగతి కోసం పెజెష్కియాన్‌కు మనమంతా దన్నుగా నిలవాల్సిన అవసరముంది.– ఫలితాల అనంతరం సయీద్ జలిలి – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్‌పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
భారత మహిళల భారీ విజయం
చెన్నై: ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కినా దక్షిణాఫ్రికా మహిళల జట్టు పరాజయాన్ని మాత్రం తప్పించుకోలేకపోయింది. భారత బౌలర్లు మరోసారి సమయోచితంగా రాణించడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వొల్వార్ట్ (314 బంతుల్లో 122; 16 ఫోర్లు) పట్టుదలతో పోరాడి తమ జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించింది. మ్యాచ్ చివరిరోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 232/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 154.4 ఓవర్లలో 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు శుభ సతీశ్ (13 నాటౌట్; 1 ఫోర్), షఫాలీ వర్మ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇబ్బంది పడకుండా 9.2 ఓవర్లలో 37 పరుగులు సాధించి భారత్‌కు 10 వికెట్లతో విజయాన్ని అందించారు. అంతకుముందు ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 93తో ఆట కొనసాగించిన లౌరా సెంచరీని పూర్తి చేసుకుంది. అనంతరం లౌరాను రాజేశ్వరి గైక్వాడ్ అవుట్ చేశాక దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన నదినె డి క్లెర్క్ (185 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్‌గా వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత టెస్టు చరిత్రలో 10 వికెట్లతో విజయం ఇది రెండోది మాత్రమే. 2002లో దక్షిణాఫ్రికాపైనే భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. సంక్షిప్త స్కోర్లు భారత్ తొలి ఇన్నింగ్స్: 603/6 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 266 ఆలౌట్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 373 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 37/0 (9.2 ఓవర్లలో). -
2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్’ రెహమాన్ స్పెషల్ సాంగ్ వైరల్
హోరాహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకోవడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ అపురూపమైన సందర్భాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కూడా సంబరంగా జరుపుకున్నారు. అంతేకాదు మెన్ ఇన్ బ్లూకి ఒక అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏఆర్ రెహమాన్ బ్లూ ఇన్ మెన్‌కి అభినందనలుత తెలుపుతూ 'టీమ్ ఇండియా హై హమ్' పేరుతో ప్రత్యేక గీతాన్ని బహుమతిగా అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాంగ్‌ను తొలుత అజయ్ దేవగన్ 'మైదాన్' కోసం కంపోజ్ చేశారట. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా అజయ్ దేవగన్ హీరోగా 'మైదాన్' మూవీకోసం 'టీమ్ ఇండియా హై హమ్'ఒరిజినల్ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ , నకుల్ అభ్యంకర్ పాడారు.కాగా జూన్29న ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి, బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నసంగతి తెలిసిందే. -
గణిత మేధావి.. తెలివితో 14 సార్లు లాటరీ గెలిచి..
లెక్కలు అనగానే చాలామందికి బాల్యం నుంచే భయం ఏర్పడుతుంది. అంకెలను చూసే సరికి కొంతమందిలో వణుకు పుడుతుంది. అయితే గణితం సాయంతో పలు విషయాల్లో విజయం సాధించవచ్చని తెలిస్తే వారిలోని భయం తొలగిపోతుంది. రొమేనియాకు చెందిన ఒక గణిత మేధావి లెక్కలతో లాటరీలలోని లాజిక్కును పట్టేసి, ఏకంగా 14 సార్లు లాటరీ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.డైలీ స్టార్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం రొమేనియా నివాసి స్టెఫాన్ మాండెల్ గణిత శాస్త్రజ్ఞుడు. అతని జీతం భారత కరెన్సీతో పోలిస్తే ఏడు వేలు. అది అతని కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. దీంతో స్టెఫాన్ మాండెల్ తన జీవితాన్ని తక్షణం మార్చుకోవాలని, గణితాన్ని తెలివిగా ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అంకెలను ఉపయోగించి ఒక సూత్రాన్ని సిద్ధం చేశాడు. దాని సాయంతో లాటరీలను గెలుచుకుంటూ వచ్చాడు.స్టెఫాన్ స్వయంగా ప్రత్యేక అల్గారిథమ్‌ను సృష్టించాడు. పలు పరిశోధనలు సాగించిన అనంతరం ‘సంఖ్యల ఎంపిక’కు అల్గారిథమ్‌ను సిద్ధం చేశాడు. దానికి ‘కాంబినేటోరియల్ కండెన్సేషన్’ అనే పేరు పెట్టాడు. తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు జాక్‌పాట్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని స్టెఫాన్ కనుగొన్నాడు. దీంతో లాటరీని దక్కించుకునేందుకు అధికంగా లాటరీ టిక్కెట్లు కొని జాక్‌పాట్ గెలిచేందుకు వివిధ కాంబినేషన్లను సిద్ధం చేసేవారు. ఇది క్లిక్ అవడంతో స్టెఫాన్ లాటరీలను సొంతం చేసుకుంటూ వచ్చాడు.తరువాత స్టెఫాన్ లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో చేరినవారు స్టెఫాన్ సూచనలతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలా వారు గెలుపు అవకాశాలను పెంచుకుంటారు. ఈ సిండికేట్‌కు లాటరీలో వచ్చే భారీ మొత్తాన్ని సభ్యులంతా పంచుకునేవారు. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో స్టెఫాన్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.స్టెఫాన్ మాండెల్ తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా మొత్తం 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. తరువాతి కాలంలో యూకేలోనూ తన లాటరీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే అతని సిండికేట్‌పై దర్యాప్తు సంస్థల కన్నుపడింది. దీంతో పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించారు. దీంతకితోడు స్టెఫాన్‌పై పలు కేసులు నమోదు కావడంతో న్యాయపోరాటం కోసం లెక్కకు మించినంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో తాను కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకుని 1995లో తాను దివాలా తీసినట్లు స్టెఫాన్ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం స్టెఫాన్ తన స్నేహితులతో పాటు వనాటు ద్వీపంలో నివసిస్తున్నాడు. యూనిలాడ్ నివేదిక ప్రకారం స్టెఫాన్ 1960-70ల కాలంలోనే లాటరీలలో రూ. 200 కోట్లకుపైగా మొత్తాన్ని గెలుచుకున్నాడు. -
Priyanka Gandhi: మీ చెల్లెల్ని అయినందుకు గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ వెనక్కి తగ్గరని, సత్యం కోసం పోరాటాన్ని ఆపబోరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రశంసించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్‌కు బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడూ తలెత్తుకొని ఉంటారు. ఎవరేం చెప్పినా, ఏం చేసినా, ఎన్నిక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ అంకితభావాన్ని ఎవరెంతగా సందేహించినా మీరు మీపై విశ్వాసం కోల్పోరు. కోపం, విద్వేషం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీరు చాలా ధైర్యవంతులు. మీ చెల్లెల్ని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ప్రియాంక పోస్టు చేశారు. -
అరుణాచల్‌లో బీజేపీ
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలకు గాను ఏకంగా 46 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడింది. 10 స్థానాలు ముందే ఏకగ్రీవంగా బీజేపీ సొంతం కావడంతో ఏప్రిల్ 19న మిగతా 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 5, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) 2 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు సాధించగా ఈసారి మరో ఐదు పెరగడం విశేషం. ఏకగ్రీవంగా నెగ్గిన వారిలో సీఎం పెమా ఖండూ కూడా ఉన్నారు. అభివృద్ధి రాజకీయాలకు పట్టం: మోదీ అరుణాచల్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. బీజేపీకి మరోసారి విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం మరింత ఉత్సాహంగా, నూతన శక్తితో పని చేస్తామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషితోనే ఈ విజయం సాధ్యమైంది’’ అని అన్నారు. సంగీతాభిమాని...అరుణాచల్‌లో బీజేపీని వరుసగా మూడోసారి గెలుపు బాటన నడిపిన నాయకుడిగా పెమా ఖండూ పేరు మార్మోగిపోతోంది. క్రీడలు, సంగీతం పట్ల అమితాసక్తి ఉన్న ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2000లో కాంగ్రెస్‌లో చేరిన ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ప్రాతినిధ్యం వహించిన ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. నబామ్ తుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2016 జనవరిలో రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ మద్దతిచి్చన కల్హోపుల్ ప్రభుత్వంలో మరోసారి మంత్రి అయ్యారు. సుప్రీంకోర్టు జోక్యంతో తుకీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. తుకీ రాజీనామాతో 2016లో ఖండూ 37 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు. 2019లో రెండోసారి సీఎం అయి ఐదేళ్లూ కొనసాగారు. తాజాగా మరోసారి విజయం దక్కించుకున్నారు. బౌద్ధ మతస్థుడైన పెమా ఖండూ మోన్పా గిరిజన తెగకు చెందినవారు. తండ్రి డోర్జీ 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. -
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి పట్టం? కారణాలివే?
2024 లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే అందరి చూపు జూన్ 4న వెలువడనున్న తుది ఫలితాలపైనే ఉంది. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలవనుంది. బీజేపీకి 22-26 సీట్లు వస్తాయని తేలింది. టీఎంసీ 14-18 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ 1-2 సీట్లతో సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. పశ్చి బెంగాల్లో బీజేపీ ఆధిక్యతకు కారణాలివేనంటూ పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో హిందూ ఓటర్లు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారట. దీనికి రుజువుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు కనిపిస్తాయి. మమత ప్రభుత్వం ఒక వర్గానికి చెందినవారిని ప్రోత్సహిస్తూ, హిందువులను అణచివేస్తున్నదనే ఆరోపణలున్నాయి.సందేశ్‌ఖాలీ బసిర్హత్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్‌ను కార్నర్ చేసింది. నిందితుడు షాజహాన్ షేక్‌కు టీఎంసీతో సంబంధం ఉందని, అందుకే అతని అరెస్టులో జాప్యంపై జాప్యం చేసిందని బీజేపీ దుమ్మెత్తిపోసింది.బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయి. దీనిని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. రామ నవమి సందర్భంగా ఊరేగింపుపై రాళ్లు రువ్వడం విషయంలో మమత ప్రభుత్వం మౌనం వహించడాన్ని పలువురు తప్పుబట్టారు. మమతా బెనర్జీపై ప్రజల్లో ఆగ్రహం పెరగడానికి ఇదే ప్రధాన కారణమంటారు.ఈ ఏడాది బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామమందిరంతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధం ఉండటంతో బెంగాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు ర్యాలీలు నిర్వహించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి తరువాత, ఆపార్టీ బెంగాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దాని ఫలితంగా ఈ రోజు బీజేపీ బెంగాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.బెంగాల్లో అవినీతి, ఉపాధి లేకపోవడం, ఫ్యాక్టరీల మూసివేత, శాంతిభద్రతల సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో ప్రజల్లో అధికార ప్రభుత్వంపై ఆగ్రహం ఏర్పడింది. ఇది కూడా బీజేపీకి ఓట్లు పడేలా చేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. -
కంగనా ఇక మండీ క్వీన్?
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గుచూపాయి. రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యతను ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ మధ్య భారీ పోటీ ఏర్పడింది. అయితే ఫలితాల్లో కంగనా రనౌత్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి నుంచి పది మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ మండీ కిరీటం కంగనాకే దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. కాంగ్రా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి రాజీవ్, కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రాలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ స్థానం నుంచి పది మంది అభ్యర్థులు పోటీకి దిగారు.హమీర్పూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి సత్పాల్ సింగ్ రైజాదా మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ స్థానంలో మొత్తం 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సిమ్లా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి సురేశ్ కుమార్, కాంగ్రెస్ నుంచి వినోద్ సుల్తాన్‌పురి తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం సాధించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ఈ నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. -
కాంగ్రెస్ ఖాతాలో రాయ్‌బరేలీ? రాహుల్‌కు పట్టం?
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్‌లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుండి విజయం సాధించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తన సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీని కాపాడుకోవడంలో విజయం సాధించనుంది. అలాగే మంచి ఆధిక్యతనూ దక్కించుకోనున్నదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి.రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ ఈ సీటు కాంగ్రెస్‌కే దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపొందిన ఏకైక స్థానం రాయ్‌బరేలీ. సోనియా గాంధీ ఇక్కడ నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలిచారు. రాయ్‌బరేలీ మినహా యూపీలోని మరే సీటులోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అయితే అదేసమయంలో కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించారు. సోనియా గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన కుమారుడు రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపాలని సోనియా ముందుగానే నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ తన కుమారుడిని రాయ్ బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన ఈ ప్రకటన ఓటర్లను ఆకట్టుకుంటుందని కాంగ్రెస్ భావించింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అంచనాలకు ఊతమిస్తున్నాయి.రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. 1951-52లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానం కాదు. అప్పట్లో రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్‌లను కలిపి ఒక సీటు ఉండేది. తొలి ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1957లో రాయ్‌బరేలీ ప్రత్యేక స్థానంగా మారడంతో ఫిరోజ్ గాంధీ ఈ స్థానం నుంచి తరిగి పోటీ చేసి, విజయం సాధించి పార్లమెంటుకు చేరుకున్నారు. ఇందిరా గాంధీ వరుసగా నాలుగు సార్లు ఇక్కడ నుండి ఎంపీ అయ్యారు. మొదటి లోక్‌సభ ఎన్నికల నుండి 2019లో జరిగిన ఎన్నికల వరకు మొత్తం 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఈ స్థానం నుండి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి ఓడిపోయిన సందర్భాలు మూడు మాత్రమే ఉన్నాయి. -
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ పాకిస్తాన్లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.‘పాకిస్తాన్లో రాహుల్‌గాంధీ చాలా పాపులర్. ఒకవేళ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్‌గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్‌ను పాకిస్థాన్‌లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. రాహుల్‌గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
బీజేపీ 400 లక్ష్యానికి ఈ 32 సీట్లు కీలకం!
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవైపు బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమి.. బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తే, వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేసినట్లవుతుంది. నెహ్రూ 1951–52, 1957, 1962లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కమలదళం 2019లో తొలిసారిగా గెలిచిన 32 లోక్‌సభ స్థానాలను తిరిగి గెలుచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కీలకమైన సీట్లలో పశ్చిమ బెంగాల్ నుంచి 16, హర్యానా నుంచి 3, కర్ణాటక నుంచి 3, ఒడిశా నుంచి 3, తెలంగాణ నుంచి 2, త్రిపుర నుంచి 2 సీట్లు ఉన్నాయి. ఒక సీటు అస్సాం నుండి, ఒక సీటు మహారాష్ట్ర నుండి, ఒక సీటు మణిపూర్ నుండి కూడా గెలుచుకోవాల్సివుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా 16 సీట్లు గెలుచుకుంది. అలాగే హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్తక్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే విధంగా కర్ణాటకలోని చామరాజనగర్, చిక్కబల్లాపూర్, కోలార్ స్థానాలను కూడా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ మొదటిసారి మూడు స్థానాలను గెలుచుకుంది. 2019లో తొలిసారిగా తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్‌లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది త్రిపుర పశ్చిమ, త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ తన ఖాతా తెరవడంలో విజయం సాధించింది. 2019లో తొలిసారిగా అసోంలో బీజేపీ 9 సీట్లు గెలుచుకుంది. 2019లో తొలిసారిగా మహారాష్ట్రలో మాధాలో బీజేపీ విజయం సాధించింది. ఇన్నర్ మణిపూర్ సీటును గెలుచుకోవడం ద్వారా, బీజేపీ 2019లో మొదటిసారి మణిపూర్‌లో తన ఖాతాను తెరిచింది. -
అరుణాచల్‌లో బీజేపీకి తొలి విజయం?.. ఐదుగురు ఏకగ్రీవం?
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని సమాచారం. మార్చి 26, బుధవారం నామినేషన్‌కు చివరి తేదీ అని, అయితే రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ, 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసినట్లు అధికారి తెలిపారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలుస్తారా లేదా అనేది నిర్ణయిస్తామని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌తో సహా ఐదుగురు అభ్యర్థులు ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచారని బీజేపీ పేర్కొంది. వీరు పోటీ చేస్తున్న చోట నుంచి చివరి రోజు వరకు ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తేజీ నేచా పేర్కొన్నారు. -
నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం!
ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్నదైన, అత్యధిక జనాభా కలిగిన దేశం. ఒకప్పుడు నేరాలు, అవినీతి, హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ దేశం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అధ్యక్షుడు నయూబ్ బకెలే దేశ అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీటిని నయూబ్ బుకెలే చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు పొందారు. గణనీయంగా తగ్గిన భద్రతా ముప్పు ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది. తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని ‘న్యూ ఐడియాస్ పార్టీ’ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్‌లోని సెంట్రల్ స్క్వేర్‌లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు. ‘న్యూ ఐడియాస్ పార్టీ’ పాలన 42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. దేశ శాసనసభలో మొత్తం 60 స్థానాలను గెలుచుకున్న బుకెలేకి చెందిన ‘న్యూ ఐడియాస్ పార్టీ’ దేశాన్ని మరోమారు పాలించనుంది. ఈ ఎన్నికల తర్వాత దేశంలో బుకెలే ప్రభావం మరింతగా పెరిగింది. సాల్వడార్ చరిత్రలో బుకెలే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా ఎదిగారని విశ్లేషకులు చెబుతుంటారు. అసురక్షితం నుంచి సురక్షితానికి.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది’ అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. ఒకే వారంలో 80 మంది హత్య ఒక నివేదిక ప్రకారం బుకెలే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎల్ సాల్వడార్లో హత్యల రేటు గణనీయంగా తగ్గింది. ‘మారా సాల్వత్రుచా గ్యాంగ్’ (ఎంఎస్-13)సభ్యులు దేశంలో పెద్ద సంఖ్యలో హత్యలు సాగిస్తూ వచ్చారు. 2022 మార్చి లో ఒకే వారంలో వీరు 80 మందిని హత్య చేశారు. బుకెలే ప్రభుత్వం నేరస్తుల ముఠాతో సంబంధం ఉన్న 75 వేల మందిని అరెస్టు చేసింది. El Salvador's President Nayib Bukele, who has described himself as the 'World's coolest dictator,' is all but certain to be re-elected in a presidential bid for another five-year term https://t.co/t7X5vV5VLq pic.twitter.com/1LmIt9aaVV — Reuters (@Reuters) January 30, 2024 70 శాతం మేరకు తగ్గిన హత్యల రేటు పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగిన తర్వాత ఎల్ సాల్వడార్‌లోని క్రిమినల్ ముఠాల వెన్ను విరిగినట్లయ్యింది. ఈ చర్య ఫలితంగా 2022లో హత్యలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయి. అయితే 2023 నాటికి దేశంలో అత్యధిక ఖైదు రేటు నమోదు కావడంతో ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. భద్రతా దళాల చర్యల అనంతరం 2023లో ఎల్ సాల్వడార్లో హత్యల రేటు 70 శాతం మేరకు తగ్గి, అది ఒక లక్షకు 2.4 శాతానికి చేరింది. ఈ సంఖ్య లాటిన్ అమెరికాలోని చాలా దేశాల కంటే అతి స్వల్పం నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాటం 2019లో ఎల్ సాల్వడార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న బుకెలే దేశంలో చోటుచేసుకున్న నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాడతానని వాగ్దానం చేశారు. తన మద్దతుదారులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి, విమర్శకులను ట్రోల్ చేయడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంగంగా ఉపయోగించుకున్నారు. బుకెల్ తరచూ బేస్ బాల్ క్యాప్, లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరిస్తారు. సెల్ఫీలు, మీమ్లను అమితంగా ఇష్టపడతారు. President Bukele takes a victory lap after El Salvador becomes the safest nation in the Western hemisphere He then tells foreign critics to go stuff it pic.twitter.com/iBNEPooXcP — Jack-of-all-trades (@Upliftingvision) February 13, 2024 -
South Africa Under-19: అర్షిన్ సెంచరీ: అజేయంగా భారత్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అమెరికాతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 201 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్ దశను అజేయంగా ముగించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్షిన్ కులకర్ణి (108; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అనంతరం అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడిపోయింది. మంగళవారం జరిగే ‘సూపర్ సిక్స్’ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడతుంది. -
Australia v West Indies: విండీస్ సంచలనం
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్‌కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్ దెబ్బకు 12వ డే/నైట్ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్‌గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్‌నైట్ స్కోరు 60/2తో బరిలోకి దిగింది. ఒకదశలో ఆసీస్ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్ గ్రీన్ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్ హెడ్ (0)ను షామర్ జోసెఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఒకవైపు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్ బ్యాటర్లను షామర్ పెవిలియన్‌కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్ జోసెఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. షామర్ ఈ సిరీస్‌లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 289/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్ (50.5 ఓవర్లలో) (స్టీవ్ స్మిత్ 91 నాటౌట్, గ్రీన్ 42, స్టార్క్ 21, షామర్ జోసెఫ్ 7/68).