ZEE5
-
వికటకవి.. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్: అజయ్ అరసాడ
మా ఇంట్లో అత్తలు, అక్క వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను. ముందు గిటార్ నేర్చుకోవాలనుకున్నాను. అందుకని శరత్ మాస్టర్ దగ్గర రెండున్నర నెలల పాటు బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత నాకు నేనుగా సొంతంగా ప్లే చేస్తూ నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్‌కి పనిచేయడం వల్లే నాకు సినిమా చాన్స్ లభించింది’ అన్నారు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఆయన సంగీతం అందించిన వెబ్ సిరీస్ వికటకవి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ట్ ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సంగీత దర్శకుడు అజయ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నేను పుట్టి పెరిగిదంతా వైజాగ్‌లోనే. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా 2011 నుంచి 2018వరకు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.→ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూన్న సమయంలో షార్ట్ ఫిల్మ్స్‌కు వర్క్ చేసేవాడిని. ఇలా చేయటం వల్ల నాకు మంచి ప్రాక్టీస్ దొరికినట్లయ్యింది. ఈ క్రమంలో ప్రదీప్ అద్వైత్ నన్ను జగన్నాటకం డైరెక్టర్ ప్రదీప్‌కు పరిచయం చేశారు. నేను అంతకు ముందు చేసిన ఓ ముప్పై సెకన్ల మ్యూజిక్ బిట్ విని నాకు జగన్నాటకం మూవీలో చాన్స్ ఇచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలోకి నా తొలి అడుగు పడింది.→ నా చిన్ననాటి స్నేహితుడు.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల నన్ను గూఢచారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వర్క్ చేయమని అడగటంతో వర్క్ చేశాను. ఆ తర్వాత క్షీర సాగర మథనం, నేడే విడుదల, మిస్సింగ్, శ్రీరంగనీతులు సినిమాలకు వర్క్ చేశాను. సేవ్ ది టైగర్స్ సీజన్1, సీజన్2లకు సంగీతాన్ని అందించాను. రీసెంట్గా వికటకవి సిరీస్‌కు వర్క్ చేశాను.→ నేను సంగీతాన్నందించిన మిస్సింగ్ మూవీలో ఓ బీజీఎం బిట్ నిర్మాత బన్నీవాస్‌కి బాగా నచ్చింది. అందుకే నాకు ఆయ్ మూవీకి వర్క్‌చేసే చాన్స్ ఇచ్చాడు. ముందుగా ఓ స్పెషల్ సాంగ్ కోసం పని చేయమని చెప్పారు. నేను కంపోజ్ చేసిన సాంగ్ బాగా నచ్చడంతో ఆ సినిమా మొత్తానికి మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చాడు. ఆయ్ వంటి కామెడీ మూవీకి బీజీఎం చేయటం మామూలు విషయం కాదు. అయితే సినిమా హిట్ అయినప్పుడు పడ్డ కష్టమంతా మరచిపోయాను.→ ఆయ్ సినిమాకు వర్క్ చేసేటప్పుడే వికటకవి సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ చేశాను. ఆయ్ రిలీజ్ తర్వాత మరో మూడు ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేశాను. వికటకవికి వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. నేను డైరెక్టర్స్ టెక్నిషియన్.. వాళ్లకి కావాల్సిన ఔట్పుట్ ఇవ్వటమే నా ప్రయారిటీ.. అది ఏ జోనర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయటానికి సిద్ధమే.→ ప్రస్తుతం త్రీరోజెస్ సీజన్ 2తో పాటు ఆహాలో మరో రెండు వెబ్ సిరీస్‌లకు వర్క్ చేస్తున్నాను. కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాను. -
ఓటీటీలో విజయ్ సేతుపతి సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న తాజా చిత్రం విడుదల-2 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుతలై(విడుదల) మూవీకి కొనసాగింపుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే, తాజాగా జీ5 ఓటీటీ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సీక్వెల్ రిలీజ్‌కు ముందు 'విడుదల-1' సినిమాను జీ5 ఓటీటీలో ఉచితంగా చూడొచ్చని తెలిపింది.విడుదల పార్ట్ 1 సినిమా 2003లో థియేటర్లో సందడి చేసింది. ఆపై జీ5 ఓటీటీలో రిలీజైన ఈ భారీ యాక్షన్ డ్రామా మూవీ వంద మిలియన్లకుపైగానే వ్యూస్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు జీ5 సబ్స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే ఈ చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. అయితే, పార్ట్-2 విడుదల నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీని ఉచితంగానే చూడొచ్చని ప్రకటన వచ్చింది. ఈ అవకాశం డిసెంబర్ 20 వరకు మాత్రమే ఉంటుంది. తెలుగు, తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది.పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన విడుదల పార్ట్-1 సినిమా సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ప్రధానపాత్రలలో కనిపించారు. అయితే, పార్ట్-2లో మాత్రం మంజు వారియర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సీక్వెల్లో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
OTT: తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
తెలంగాణ నేపథ్యంలో ఓటీటీ కోసం మొదటిసారి ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్‌గా 'వికటకవి' అనే టైటిల్‌తో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. సుమారు నాలుగు దశాబ్ధాలుగా పట్టి పీడించే శాపానికి సంబంధించిన కథతో 'వికటకవి' వెబ్ సిరీస్ ఉన్నట్లు సమాచారం.'వికటకవి' తెలుగు వెబ్ సిరీసులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ యాసతో, హైదారాబాద్ విలీనం తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనలతో చాలా గ్రిప్పింగ్‌గా కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.స్వాతంత్య్రం రాక మునుపు మన దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణకు చెందిన అమరగిరి ప్రాంతం ఒకటి. రైటర్ తేజ డిఫరెంట్ కథను చెప్పాలనుకున్నప్పుడు తన మైండ్‌లో వచ్చిన ఐడియానే ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్న క్రమంలో కొన్నాళ్లలో ఆ ప్రాంతంలోని ఒక ఊరు మునిగిపోతుంది.. ఈ బ్యాక్ డ్రాప్ కథతో వికటకవి అనే ఫిక్షనల్ పాయింట్‌ను మేకర్స్ తీసుకున్నారు. -
ఓటీటీలో నాన్న సినిమా.. అధికారిక ప్రకటన
యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. గత నెలలో దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎందుకనో ప్రేక్షకులు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తండ్రీకొడుకుల అనుబంధం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాని నవంబర్ 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే ఈ వీకెండ్లో వచ్చేస్తుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' విషయానికొస్తే.. చిన్నతనంలో తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), కొన్ని పరిస్థితుల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి చిన్నప్పుడే దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతున్న ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ మంచిగా చూసుకోడు. ఓ రోజు పెంచిన తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయలు జానికి అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే కథ.(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
పిల్లలను మెప్పించే 'హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్' సినిమా
చిన్న పిల్లలకు గీతలు గీయడమన్నా, బొమ్మలు వేయడమన్నా ఎంతో ఇష్టం. పూర్వం బలపాలు, పెన్సిళ్లు వాడేవాళ్ళు. ఇప్పటి జెనరేషన్ క్రేయాన్స్ వాడుతున్నారు. పిల్లలు ఒక్కోసారి పిచ్చి గీతలు గీస్తారు. ఒక్కోసారి పేరు లేని ఆకారాలను వేస్తారు. ఏది గీసినా, రాసినా వాటికి జీవమొస్తే..? అన్న చిలిపి ఆలోచన హాలీవుడ్ దర్శకుడు కార్లోస్‌కు వచ్చింది. ఇంకేముంది ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘ అనే సినిమాను రూపొందించాడు. కథాపరంగా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్’లో హెరాల్డ్ అనే బాలుడు ఓ పుస్తకంలోని పాత్ర. అతనితో పాటు మూస్, పోర్క్పైన్ అనే మరో రెండు పాత్రలు ఉంటాయి. హెరాల్డ్ తన మానాన తాను ఉండగా బయటి ప్రపంచంలో అతనికి తెలిసిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోతాడు. దాంతో హెరాల్డ్ ఆ వృద్ధుణ్ణి వెతకడానికి పర్పుల్ క్రేయాన్‌తో ఓ తలుపు బొమ్మ గీసి పుస్తకంలో నుంచి మానవ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతనితో పాటు తోడుగా మూస్, పోర్క్పైన్ కూడా బయటకు వస్తాయి. ఇక అక్కడ నుండి మానవ ప్రపంచంలో అతడు ఏది గీస్తే అది నిజమైపోయి కథను నడిపిస్తుంది. హెరాల్డ్ ఆ ముసలివాడిని కనుగొంటాడా, మానవ ప్రపంచంలో తన మాయాజాలంతో ఎదుర్కోన్న ఇబ్బందులేంటి అన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో కారు బొమ్మ, హెలికాప్టర్ బొమ్మ ఇలా ఏది క్రేయాన్‌తో గీసినా అది నిజంగా అయిపోవడం పిల్లలకు బాగా నచ్చుతుంది. విజువల్‌గా గ్రాఫిక్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళను ఆకట్టుకుంటాయి. పండుగ సెలవలకు పిల్లలతో పాటు పెద్దలు కూడా సరదాగా చూడగలిగిన సినిమా ‘హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్‘. వర్త్ టు వాచ్ ఇట్. అమెజాన్ ప్రైమ్‌తో పాటు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. – ఇంటూరు హరికృష్ణ -
OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘రఘు తాత’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ భూమి పై జీవన ఉనికికి భాష అనేది ఆయువు. ప్రస్తుత ప్రపంచంలో 7000కు పైచిలుకు భాషలు ఉండగా వాటిలో 200 నుండి 300 వరకు అధికారికంగా గుర్తించబడ్డాయి. కానీ ఈ భాషల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయి... జరుగుతున్నాయి కూడా. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు సుమన్ కుమార్ ఇటీవల ‘రఘు తాత’ చిత్రాన్ని రూపొందించారు. (చదవండి: సత్యం సుందరం మూవీ రివ్యూ)తీసుకున్న పాయింట్ సీరియస్ అయినా చక్కటి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించారు దర్శకుడు. సినిమాలోని పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఈ సినిమాలో నాయకురాలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కీర్తీ సురేష్ నటించారు. తన అద్భుతమైన నటనా ప్రతిభతో ఈ సినిమాలోని ప్రధాన పాత్ర అయిన కయల్విళి పాండియన్ పాత్రకు ప్రాణం పోశారు కీర్తీ సురేష్. మరో ప్రధాన పాత్ర అయిన రఘు తాత పాత్రలో యం.యస్. భాస్కర్ ఇమిడియారు. (చదవండి: ‘దేవర మూవీ రివ్యూ)ఇక కథాంశానికొస్తే... కయల్విళి పాండియన్ మద్రాస్ సెంట్రల్ బ్యాంక్‌లో క్లర్కు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూనే కా పాండియన్ అనే కలం పేరుతో రచనలు కూడా చేస్తుంటుంది. అంతేనా హిందీ భాష వద్దు, మన భాష ముద్దు అనే పేరుతో ఉద్యమాలు చేస్తూ సమాజంలో భాషాభివృద్ధికి చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర వహిస్తుంది. కయల్విళికి ఓ తాత ఉంటాడు. ఆయనే రఘు తాత. కయల్ చేసే ఉద్యమమంతా రఘు తాత నుండి వచ్చిందే. అంతవరకు కథ బాగున్నా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తన బ్యాంక్ ప్రమోషన్ కోసం హిందీ పరీక్ష దొంగతనంగా రాయవలసి వస్తుంది. ఓ పక్క హిందీ ఉద్యమం చేస్తూ మరో పక్క హిందీ పరీక్ష రాయడం కయల్విళి పెళ్ళిలో అందరికీ తెలిసిపోతుంది. అసలు కయల్ హిందీ పరీక్ష ఎందుకు రాయాల్సి వచ్చింది ? రాసినది అందరికీ తెలిసిన తరువాత తన పెళ్ళిలో ఏం జరిగింది? ఇలాంటివన్నీ జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘రఘు తాత’లోనే చూడాలి. కొసమెరుపేంటంటే... ఈ సినిమా మాతృక తమిళం, పోరాటం చేసింది హిందీ భాషపై, కానీ మనం మాత్రం మన తెలుగు భాషలో ఈ సినిమా చూడడం. ఎందుకంటే భాష ఏదైనా భావం ముఖ్యం కాబట్టి.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో హిట్ సిరీస్.. తెలుగు వర్షన్ విడుదల
'గ్యారా గ్యారా' సిరీస్ ఇప్పటికే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన మూవీకి మంచి ఆధరణ లభించింది. ఈ క్రమంలో జీ5 ఓటీటీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.కొరియన్ డ్రామా హిట్ సినిమా 'సిగ్నల్' స్ఫూర్తితో గ్యారా గ్యారా వెబ్ సిరీస్ నిర్మించారు. హిందీలో ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9 నుంచి జీ5 ఓటీటీలో హిందీ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా సెప్టెంబర్ 20 నుంచి తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.ధర్మ ప్రొడక్షన్స్, సిఖియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన 'గ్యారా గ్యారా' వెబ్ సిరీస్‌ను ఉమేష్ బిస్త్ డైరెక్ట్ చేశారు. ఇందులో కృతికా కామ్రా, రాఘవ్ జుయల్, ధైర్య కార్వా, ఆకాశ్ దీక్షిత్ నటించారు. 8 ఎపిసోడ్లతో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠతతో సాగుతుందని ప్రేక్షకుల నుంచి ఆధరణ లభిస్తుంది. ఇక నుంచి తెలుగు వర్షన్ గ్యారా గ్యారా చూసేయండి. -
ఓటీటీలో హారర్ మూవీ.. నిద్రలేని రాత్రి కోసం సిద్ధమా?
బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అరుళ్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డీమాంటి కాలనీ 2. ఇది 2015లో వచ్చిన హిట్ మూవీ డీమాంటి కాలనీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాట ఆగస్టు 15న విడుదలై దాదాపు రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో అదే నెల 23న తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జీ5లో తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.సినిమా విషయానికి వస్తే..క్యాన్సర్‌తో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను డెబీ (ప్రియ భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతడిని క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి ఆత్మహత్య వెనక కారణం తెలియక మానసికంగా సతమతమవుతుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని, ఈ తరహాలోనే పలువురూ మరణించారని తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? వరుస చావులకు చెక్ పెట్టేందుకు ఆమె ఏం చేసింది? ఈ పుస్తకానికి, డిమాంటి కాలనీకి ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by ZEE5 Tamil (@zee5tamil) చదవండి: హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్ -
డైరెక్ట్‌గా ఓటీటీకి శోభిత ధూళిపాళ్ల చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్కినేని హీరో నాగచైతన్యతో ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత ధూళిపాళ్ల నటించిన తాజా చిత్రం 'లవ్, సితార'. ఈ సినిమాను వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు.చైతూతో ఎంగేజ్మెంట్టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్యతో శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్లో పంచుకున్నారు.A tale of love, heartbreak, and self-discovery! Watch #LoveSitara, premiering on 27th September, only on #ZEE5. #LoveSitaraOnZEE5 pic.twitter.com/zHGnSUmUmr— ZEE5 (@ZEE5India) September 10, 2024 -
డైరెక్ట్‌గా ఓటీటీకి కీర్తి సురేశ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రఘుతాత. ఈ మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో టాలీవుడ్లో విడుదల కాలేదు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రఘు తాత అందుబాటులోకి రానుంది. ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకోగా.. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ట్విటర్ వేదికగా పంచుకుంది.ఆగష్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలతో ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కీర్తి సురేశ్ హిందీకి వ్యతిరేకంగా పోరాడే మహిళ పాత్ర పోషించింది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు నిర్ణయం తీసుకుందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది. Kayal is coming to your home for blasting entertainment!😂🔥 #RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada. @KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh pic.twitter.com/XY1fO7HT55— ZEE5 Telugu (@ZEE5Telugu) September 9, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ జానర్ సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లు సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. అందువల్లే క్రైమ్ జానర్లో ఎక్కువగా వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.విలక్షణ నటుడు కెకె మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ముర్షిద్. ఈ సిరీస్‌లో ఆయన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈనెల 30 నుంచే జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా.. కెకె మీనన్ ఈ మధ్యే శేఖర్ హోమ్ అనే మరో సిరీస్‌లోనూ కనిపించారు. అంతేకాకుండా ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో తనూజ్ వీర్వానీ, వేదికా భండారీ, అనంగ్ దేశాయ్, జాకిర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు.Dushmanon ke liye bura waqt bankar, 20 saal baad, Bambai ka raja - Murshid Pathan apni takht par laut raha hai! 👑🔥#Murshid premieres 30th August, only on #ZEE5. Trailer out now! #MurshidOnZEE5 pic.twitter.com/mlh1I8skXS— ZEE5 (@ZEE5India) August 20, 2024 -
కీర్తి సురేష్ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు. ఆమె నటించిన కొత్త సినిమా రఘు తాత ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందన ప్రచారం జరుగుతుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న తమిళ్ వర్షన్ విడుదల అయింది.రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రఘు తాత మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను జీ5 మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 14న ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత సినిమా ఉంది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాలో కీర్తి పోరాడుతుంది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు పూనుకుంటుంది అనేది సినిమా. -
ఓటీటీలో మరో క్రేజీ టైమ్ ట్రావెల్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
థియేటర్లలో ఎలాంటి సినిమాలొచ్చినా చూస్తారు కానీ ఓటీటీల్లో మాత్రం చాలావరకు థ్రిల్లర్స్‌ని చూసేందుకు జనాలు ఇష్టపడతారు. అందుకు తగ్గట్లే అన్ని భాషల్లోని దర్శకులు డిఫరెంట్ స్టోరీలతో మూవీస్ తీస్తుంటారు. అలా టైమ్ ట్రావెల్ అనేది మంచి కాన్సెప్ట్. హాలీవుడ్లో ఈ తరహావి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు హిందీలోనూ ఇలాంటి ఓ క్రేజీ వెబ్ సిరీస్‌ని రెడీ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి మరీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)గ్యారా గ్యారా (11:11) పేరుతో తీసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. 1990లోని ఓ పోలీస్, 2001లోని అంటే భవిష్యత్ కాలంలోని పోలీస్తో వాకీ టాకీ ద్వారా మాట్లాడుతుంటాడు. ఇది కూడా ప్రతిరోజు రాత్రి 11 గంటల 11 నిమిషాలకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇలానే వీళ్లు మర్డర్ మిస్టరీలని పరిష్కరిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎదుర్కొంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇలా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన వాటిలో 'డార్క్' అనే వెబ్ సిరీస్ నం.1 అని చెప్పొచ్చు. 'గ్యారా గ్యారా' ట్రైలర్ చూస్తుంటే.. 'డార్క్' సిరీస్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఇది తీశారా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నట్లు 'గ్యారా గ్యారా' కూడా 1990, 2001, 2016 టైమ్ లైన్స్‌లో జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 9 నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ మర్డర్ మిస్టరీ.. టాప్‌లో ట్రెండింగ్!
అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా చిత్రం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది.ఓటీటీలో విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రకటించిన రేటింగ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది.దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమాలు/వెబ్ సిరీస్ జాబితాలో సిట్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 2.8 మిలియన్ల వీక్షకులతో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకోవడంపై దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్‌గా అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారు. ఎంతో ఛాలెంజింగ్ కారెక్టర్ అయినా చక్కగా నటించి మెప్పించారు. గ్రే షేడ్స్‌తో అరవింద్ కృష్ణ అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన నటించిన ఓ సూపర్ హీరో చిత్రం “ఎ మాస్టర్‌పీస్” త్వరలోనే విడుదల కానుంది. -
ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది.. ఇంత దూరం వస్తాననుకోలేదు!
నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘రౌతు కా రాజ్’. ఆనంద్ సుర్పూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. ఇంకా ‘సాక్షి’తో నవాజుద్దీన్ పంచుకున్న విశేషాలు. → హీరో పాత్ర, అతను ఓ కేసును పరిశోధన చేసే విధానం... ఈ రెండూ ‘రౌతు కా రాజ్’లో వీక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. సినిమాలోని మర్డర్ మిస్టరీ, గ్రామీణ నేపథ్యం ఆసక్తికరంగా, సహజత్వంతో ఉంటుంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చిందంటే ఈ ఫలితం నా ఒక్కడిదే కాదు... దర్శకుడు, ఇందులో భాగమైన నటీనటులు అందరి భాగస్వామ్యం వల్లే సాధ్యమైంది. → నేను ప్రధానంగా లీడ్ రోల్స్‌లోనే నటిస్తున్నాను. ఏదైనా కథ, అందులోని పాత్ర ఎగ్జైట్ చేసినప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. కథలోని నా పాత్రకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలనుకుంటాను. ఆ లక్షణాలకు నా నటన తోడైనప్పుడు ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఆడియన్స్‌ను మెప్పించే క్రమంలో నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నా ఓకే. నటుడుగా నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇండస్ట్రీలో ఇంత దూరం వస్తానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. → ప్రస్తుతం కస్టమ్ ఆఫీసర్‌గా ఓ సినిమా, సెక్షన్ 108 మూవీలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. దక్షిణాదిలో రజనీకాంత్‌గారి ‘పేటా’, వెంకటేశ్‌గారి ‘సైంధవ్’ సినిమాలో నటించాను. మళ్లీ దక్షిణాది సినిమాలు చేయాలని ఉంది. కథలు వింటున్నాను. ఇక యాక్టింగ్ కాకుండా వ్యవసాయం అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా మా ఊరు వెళ్లిపోయి (ఉత్తరప్రదేశ్‌లోని బుడానా) వ్యవసాయం చేస్తుంటాను. -
వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
టాలీవుడ్ భామ అంజలి ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో అభిమానులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌తో ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వస్తోంది. అంజలి లీడ్ రోల్లో వస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. ముకేశ్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందించిన ఈ సిరీస్‌ను జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో వస్తోన్న సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. 'మంచోడు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా..? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడమే..' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో అంజలి వేశ్యపాత్రలో కనిపించనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. Thrilled to Launch the trailer for #BahishkaranaOnZee5! Always was impressed with the director @iamprajapathi with his work in BiggBoss and now this!!Anjali looking good bringing strength and depth to her character Pushpa!!https://t.co/ewhjAwzSFD@yoursanjali @ZEE5Telugu…— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 10, 2024 -
మరోసారి వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన నటి అంజలి. ఇటీవల విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో మెప్పించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.అంజలి ప్రస్తుతం మరోసారి అలాంటి విభిన్నమైన పాత్రతో అభిమానులను పలకరించనున్నారు. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ గురించి అంజలి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.అంజలి మాట్లాడుతూ..'పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాత్ర చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి సమాజంలో అసమానతలను ఎదుర్కొనే స్త్రీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ అని.. ఇందులో ఆమె చేసిన ప్రయాణం, వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, బేబీ చైత్ర కీలక పాత్రలు పోషించారు.A tale of misused power and enraged beauty.Get ready for #Bahishkarana on 19th July#BahishkaranaOnZee5 @PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @yoursanjali @AnanyaNagalla @RavindraVijay1 @prasannadop @SidharthSadasi1 pic.twitter.com/bvtplrLhgV— ZEE5 Telugu (@ZEE5Telugu) July 4, 2024 -
నేరుగా ఓటీటీకి హారర్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో హారర్, కామెడీ చిత్రాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఇలాంటి కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. తాజాగా అలాంటి చిత్రం ద్వారా అలరించేందుకు వస్తోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. కకుడా అనే మూవీతో అభిమానులను పలకరించునుంది. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, సాక్విబ్ సలీమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్ కామెడీ కథాంశంతో మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోట్దర్ ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. జూలై 12వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. తాజా పోస్టర్ చూస్తే దెయ్యం ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది సోనాక్షి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ తారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. Purushon Ke Hit Mein Jaari ⚠️- #Kakuda aa raha hai ‘12 July’ ko, toh ghar pe rahein aur theek 7:15 baje, darwaza khula rakhna naa bhoolein. 👻Kyunki #AbMardKhatreMeinHai, #Kakuda only on #ZEE5#KakudaOnZEE5 pic.twitter.com/wzHOVtE4j8— ZEE5 (@ZEE5India) June 21, 2024 -
వీకెండ్లో సినిమాల జాతర.. ఒక్క రోజే ఏకంగా పది చిత్రాలు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇప్పుడిప్పుడే ఎన్నికల హడావుడి ముగిసింది. శుక్రవారం వస్తోందంటే చాలు బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీలపై అందరి దృష్టి ఉంటుంది. కొత్త సినిమాలు ఏం వస్తున్నాయో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎప్పటిలాగే ఈ వీకెండ్లో కొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేసేందుకు వస్తున్నాయి.హన్సిక నటించిన 105 మినిట్స్, మిరల్ లాంటి సినిమాలు ఓటీటీకి రానున్నాయి. వీటితో పాటు తమిళ, మలయాళ చిత్రాలు, పలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. మీకిష్టమైన చిత్రాలు ఓటీటీలో చూసేయండి.నెట్ఫ్లిక్స్హైరార్కీ- (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 07హిట్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జూన్ 07ఫెర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 07ఆహా105 మినిట్స్- (తెలుగు హారర్ మూవీ)- జూన్ 07మిరల్-(తెలుగు సినిమా)- జూన్ 07బూమర్ అంకుల్(తమిళ సినిమా)- జూన్ 07సోని లివ్వర్షంగాలక్కు శేషం- (మలయాళ సినిమా)- జూన్ 07గుల్లక్ 4- హిందీ (వెబ్ సిరీస్)- జూన్ 07జియో సినిమాబ్లాక్ ఔట్ (హిందీ మూవీ) - జూన్ 07ద ఎండ్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 08బుక్ మై షోఎబిగైల్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 07 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గంగం గణేశా, కార్తికేయ భజేవాయువేగం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. గతవారంలో అంతా చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ సారి మాత్రం కాస్తా ఇంట్రెస్టింగ్ పెంచేస్తున్నాయి.మరోవైపు ఓటీటీల్లోనూ సినిమాల సందడి చేయనున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు త్వరలోనే ముగియనున్నాయి. సమ్మర్‌ను క్యాష్ చేసుకునేందుకు రిలీజైన సినిమాలను కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. ఈ వీకెండ్లో మీరు ఓటీటీల్లో చూసేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. నెట్‌ఫ్లిక్స్ ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31 రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31 లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01అమెజాన్ ప్రైమ్బుజ్జి అండ్ భైరవ(యానిమేటేడ్ సిరీస్)- మే 31హాట్‌స్టార్ జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31జియో సినిమా దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31 లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31 ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31 ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01జీ5 హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31సైనా ప్లే పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31ఆహాప్రాజెక్ట్- జెడ్- మే 31 -
ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది. తమ చిత్రానికి మంచి ఆదరణ వస్తుండటంతో దర్శకుడు విజయ భాస్కర్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.విజయ భాస్కర్ రెడ్డి.. 'కడప జిల్లాలోనే పుట్టి పెరిగా. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. మాది ఉమ్మడి కుటుంబం. రైతుల కష్టం నాకు తెలుసు. మా నాన్న పడ్డ కష్టాలు మేం పడకూడదని ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ తరువాత హైద్రాబాద్‌కు వచ్చా. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశాను. ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చాను. అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా చేసి సిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నా. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేదు. కానీ మా పెద్దన్న నాకు అండగా నిలిచారు. ఆయన వల్లే పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.' అని అన్నారు.అనంతరం మాట్లాడుతూ.. 'నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ కథను వెబ్ సిరీస్ కంటే సినిమా తీస్తేనే బాగుంటుందని అన్నారు. నాగి రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్ కలిసి ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు.ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ అద్భుతంగా నటించారు. ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. నటాషా చక్కగా నటించారు. అందరి సహకారంతోనే ఈ మూవీని బాగా తీయగలిగా. ఓటీటీ కంటెంట్ కాబట్టి.. ముందు నుంచి కూడా మేం ఓటీటీ కోసమే ప్రయత్నాలు చేశాం.సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో పార్ట్, మూడో పార్ట్ ఎప్పుడు? అని అంతా అడుగుతున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం మా చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. -
డైరెక్ట్‌గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిట్. ఈ సినిమాను ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించగా..విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజగా ఈ మూవీ ట్రైలర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను విశ్వక్ సేన్ అభినందించారు.చిత్ర ట్రైలర్ చూస్తుంటే.. మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ కేసును ఎలా చేధించారనే సస్పెన్స్ కోణంలో ఈ సినిమా ఉండబోతోంది. ట్రైలర్ చివర్లో పోలీసాఫీసర్‌గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇవాల్టి నుంచే ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది అదాశర్మ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో హార్ట్ అటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. అదా శర్మను మాత్రం స్టార్ హీరోయిన్గా చేయలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు లేడి ఓరియెంటెండ్ చిత్రాల్లో నటించినా.. ఫేమ్ రాలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ది కేరళ స్టోరీ’తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు అదా శర్మను పాన్ ఇండియా హీరోయిన్గా మార్చేసింది. అదే జోష్‌లో ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తోసేన్తోనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే సినిమా చేసింది. ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకొని అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువ చూపించారని, సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. విడుదల తర్వాత ప్లాప్ టాక్ రావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మే 17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సంస్థ ఎక్స్(ట్విటర్) వేదికగా తెలియజేస్తూ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇందులో అదాశర్మ మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్గా నటించింది. An internal war that has the country divided into two fractions. Watch the gruesome story of Naxal violence.#Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/IUFXrNnkqq— ZEE5 (@ZEE5India) May 8, 2024 -
ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రిలీజ్
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం 'యస్. ఐ. టి'. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) పేరుతో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.యంగ్ ఇండియా సినిమాతో హీరోగా పరిచయమైన అరవింద్ కృష్ణ ఇప్పటికే ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి వంటి చిన్న చిత్రాల్లో మెప్పించాడు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో మెరిశాడు. తాజాగా 'యస్. ఐ. టి' (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రం ద్వారా వస్తున్నాడు. వి.బి.ఆర్. (VBR) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.