టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు.
కాగా గ్రూప్-1లో టాప్‌లో ఉన్న భారత జట్టు సెయింట్ లూసియా వేదికగా సోమవారం ఆసీస్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
ఈ నేపథ్యంలో మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్నాడు. ధనాధన్ దంచికొడుతూ 19 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
హిట్‌మ్యాన్ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకుంటూ పరుగుల వరద పారించాడు. రోహిత్ శర్మ దెబ్బకు పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టానికి 60 పరుగులు సాధించింది.
ఇక మూడో ఓవర్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఏకంగా29 పరుగులు పిండుకున్నాడు రోహిత్. 6, 6, 4, 6, 0, 6తో అభిమానులకు కన్నుల పండుగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 41 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
అంతర్జాతీయ టీ20లలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా క్రికెటర్లు
12 యువరాజ్ సింగ్- 2007లో ఇంగ్లండ్ మీద
18 కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద
18 సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద
19 గౌతం గంభీర్- 2009లొ శ్రీలంక మీద
19 రోహిత్ శర్మ- 2024లో ఆస్ట్రేలియా మీద.
Comments
Please login to add a commentAdd a comment