ముక్కోటికి ముస్తాబవుతున్న శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం ముక్కోటికి ముస్తాబవుతోంది. ఈ ఏడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక క్యూలైన్ల నిర్మాణం, ఉత్తర ద్వారాల ముస్తాబు, ఆలయానికి, పరిసరాలకు విద్యుద్దీప అలంకరణలు, ఘాట్ రోడ్లలోని డివైడర్లకు రంగులు వేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు స్వామివారి ఉచిత ప్రసాదాన్ని అనివేటి మండపంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈ నెల 10న కావడంతో, 9న మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే గిరి ప్రదక్షిణకు సైతం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ పనులను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డీవీ భాస్కర్ తదితరులు పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాటు చేస్తున్నారు. గోవింద స్వాములు, స్థానికుల సౌకర్యార్ధం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కోసం రూ.500 టికెట్‌లు జ్ట్టి ఞట://ఠీఠీఠీ.్చ ఞ్ట్ఛఝ ఞ ్ఛట.్చ ఞ.జౌఠి.జీ ుఽ వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
ఆలయ ఉత్తర ద్వారాలు, పరిసరాల సుందరీకరణ పనులు
ఆన్‌లైన్‌లో రూ.500 ప్రత్యేక దర్శనం టికెట్లు
Comments
Please login to add a commentAdd a comment