Annamayya
-
ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి
మదనపల్లె : ఇంజినీరింగ్ విద్యార్థిని కొందరు వ్యక్తులు అటకాయించి దాడి చేసిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. వలసపల్లె పంచాయతీ అరవవాండ్లపల్లెకు చెందిన మల్లికార్జున కుమారుడు రెడ్డికౌశిక్(21) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్ష రాసేందుకు అంగళ్లు సమీపంలోని విశ్వం కాలేజీకి వెళ్లాడు. పరీక్ష అనంతరం ద్విచక్రవాహనంలో స్నేహితులైన రఘు(21), వీరారెడ్డి(21)లతో కలిసి స్వగ్రామానికి వెళుతుండగా, మదనపల్లె సమీపంలోని అమ్మచెరువుమిట్ట వద్ద కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు. అయితే అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని రెడ్డికౌశిక్ వెళ్లిపోవడంతో మూడు ద్విచక్రవాహనాల్లో దాదాపు 10మంది వ్యక్తులు వెంబడించారు. బైపాస్‌రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రెడ్డికౌశిక్ ద్విచక్రవాహనాన్ని అడ్డగించారు. అడ్డగించిన వారిలో కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన హేమంత్, అతడి సోదరుడు వినయ్ ఉన్నారు. తమ చెల్లికి అసభ్యంగా ఎందుకు మెసేజ్ చేశావంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పేలోగానే, కర్రలతో రెడ్డికౌశిక్, అతడి స్నేహితులపై దాడి చేశారు. దాడిలో రెడ్డికౌశిక్ గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి ద్విచక్రవాహనంలో పారిపోయి, తల్లిదండ్రులకు విషయం తెలిపి, జిల్లా ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. దాడి ఘటనపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిని హేమంత్, వినయ్‌ల తండ్రి రమేష్ దగ్గర నుంచి చూస్తూ ప్రోత్సహించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా రెండు నెలల క్రితం తనపై దాడికి పాల్పడ్డారని తెలిపాడు. -
స్థల సేకరణకు రైతులు సహకరించాలి
కలికిరి(వాల్మీకిపురం) : హైవే రోడ్డు పార్కింగ్ స్థల సేకరణకు రైతులు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ కోరారు. మండల పరిధిలోని విఠలం గ్రామంలో హైవే రోడ్డు పక్కన హైవే సైడ్ అమెనిటీస్ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభ్యంతరాలను స్వీకరించారు. ఇప్పటికే హైవేకి పొలాలు ఇచ్చామని, మిగిలిన కొద్దిపాటి పొలాలు కూడా హైవే సైడ్ అమెనిటీస్ నిమిత్తం ప్రభుత్వం తీసుకుంటే పూర్తిగా భూములు కోల్పోతామని కొందరు రైతులు జేసీకి మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా నష్టపరిహారం చెల్లింపు ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నారు. సేకరించిన స్థలానికి హైవే అధికారులు లేదా కాంట్రాక్టరు ప్రహరీ నిర్మిస్తే చుట్టు పక్కల భూములకు దారి సమస్య ఏర్పడుతుందని రైతులు తెలిపారు. అయితే వాల్మీకిపురం మండల పరిధిలో హైవే సైడులో ప్రభుత్వ భూమి ఉంటే గుర్తించాలని తహసీల్దారు, మండల సర్వేయరును ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దారు పామిలేటి, డిప్యూటీ తహసీల్దార్ వెంకటస్వామి, మండల సర్వేయర్ పూర్ణచంద్ర, ఆర్ఐ సుగుణ, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల దొంగలు అరెస్టు
రాజంపేట : రాజంపేట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, నందలూరు మండలాల పరిధిలో వ్యవసాయ పొలాల్లో వరుసగా ట్రాన్స్ఫార్మర్లు, వైర్ల దొంగతనాలకు పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు మన్నూరు సీఐ ఎస్ఎం అలీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితులను రాజంపేట–రాయచోటి రోడ్డులోని బ్రాహ్మణపల్లె సమీపంలో 33 కేవీ సబ్‌స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ లగిడి ఈశ్వరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అరెస్టయిన వారిలో పాకం శ్రీనివాసులు(మన్నూరు), బత్తల హరిప్రసాద్(శంకరాపురం, గుండ్లూరు), భూదేవల శ్రీనివాసులు(ఎగువగడ్డ, రాజంపేటటౌన్), మనుబోలు గణేష్(బలిజపల్లె, రాజంపేట టౌన్), కంభంపాటి వెంకటరమణ(గడ్డివీధి, రాజంపేట టౌన్), చెంచు వెంకటేశ్ (బోయనపల్లె), జ్యోతిప్రసాద్(గుండ్లూరు) ఉన్నారని తెలిపారు. వీరంతా జల్సాలకు అలవాటుపడి ట్రాన్స్ఫార్మర్ల దొంగలయ్యారన్నారు. మన్నూరు పోలీసు స్టేషన్ పరిధిలో 22 ట్రాన్స్ఫార్మర్లు, రాజంపేట అర్బన్ పరిధిలో 2 ట్రాన్స్ఫార్మర్లు, రైల్వేకోడూరు పరిధిలో 2 ట్రాన్స్ఫార్మర్లు, ఓబులవారిపల్లె పరిధిలో 1 ట్రాన్స్పార్మర్, నందలూరు పరిధిలో 1 ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురయ్యారన్నారు. నిందితుల నుంచి రూ.2 లక్షల 5వేలు విలువ కలిగిన 200 కేజీల కాపర్ వైరు, రూ.25 వేలు విలువ కలిగిన ఐదు సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్ఐ నాగేశ్వరరావు, ఏఎస్ఐలు పాల్గొన్నారు. -
బంగారు షాపులపై వాణిజ్య పన్నుల శాఖ దాడులు
బి.కొత్తకోట : బి.కొత్తకోటలోని బంగారు దుకాణాలపై రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికార బృందాలు బుధవారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేశాయి. కడప, తిరుపతి, మదనపల్లె నుంచి వచ్చిన పన్నులశాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి దుకాణాలపై దాడులు జరిపి తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఇటీవల రశీదులు లేకుండా బ్లాక్‌లో బంగారు, వెండిని బెంగళూరు నుంచి తరలించి దుకాణాలకు విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సోదాలు చేపట్టారు. మదనపల్లెతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఏసీటీఓ, డీసీటీఓ, సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. సోదాలను మూడు దుకాణాల్లో చేపట్టగానే మిగిలిన దుకాణాలు మూతపడ్డాయి. బంగారాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాటికి బిల్లులు ఉన్నాయా లేవా, తెచ్చిన బంగారాన్ని విక్రయించిన రశీదులు, వాటికి పన్నుల చెల్లింపు, ఇతర రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ల దాఖలు, ఇన్వాయిస్లపై ఆరా తీస్తున్నారు. దుకాణాల్లో సోదాలు చేసిన అధికారులు వారి ఇళ్లలోనూ సోదాలు చేశారు. కాగా గత 20 ఏళ్లుగా బి.కొత్తకోటలో బంగారు దుకాణాలు చిల్లర దుకాణాల్లా వెలుస్తున్నాయి. బంగారు నగల వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు కూడా నగల దుకాణాలను ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ రోజుకు కనీసం రూ.2 కోట్లకుపైగా నగల వ్యాపారం జరుగుతున్నట్టు చెబుతున్నారు. -
సిద్దవరంలో 150 మామిడి చెట్లు నరికివేత
పెనగలూరు : మండలంలోని సిద్దవరం రెవెన్యూ గ్రామంలో కొండా రామలక్షుమ్మ అనే మహిళకు చెందిన 150 మామిడి చెట్లను తిరుమలరాజుపేట హరిజనవాడకు చెందిన హరిబాబు సోమవారం నరికేవేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని సిద్దవరం రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 407లో కొండా రామల్క్షుమ్మకు 5 ఎకరాల పొలం ఉంది. ఇందులో ఆమె ఎన్ఆర్ఈజీఎస్ బ్లాక్ ప్లాంటేషన్‌లో భాగంగా 2022 ఆగస్టులో మామిడి సాగు ప్రారంభించింది. 2023 నవంబర్ వరకు ఉపాధి పథకం కింద ఆమెకు లబ్ధి చేకూరింది. అనంతరం పలువురు ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అనే విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో ఆమెకు ఎలాంటి లబ్ధి అందలేదు. ఇదిలా ఉండగా తిరుమలరాజుపేటకు చెందిన హరిబాబు ఆ గ్రామ దళితులకు ఇళ్ల పట్టాలు కావాలంటూ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాడు. దీంతో సర్వే నంబర్.407లో తాను సాగు చేసుకుంటున్న భూమిలోని మామిడి చెట్లను తిరుమలరాజుపేటకు చెందిన హరిబాబు మరికొందరితో నరికివేశాడని బాధితురాలు ఆమె బంధువు లేబాక శ్రీనివాసురెడ్డితో కలిసి పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి విచారణ చేస్తున్నట్టు తెలిపారు. వీరబల్లిలో.. వీరబల్లి : మండలంలోని వీరబల్లి పంచాయతీ గొర్లపల్లికి చెందిన జక్కల వెంకటరమణకు సంబంధించిన భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు మామిడి చెట్లు నరికారంటూ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భూమిలో ఉన్న ఏడాది కాలం వయస్సు గల 60 మామిడి చెట్లను నరికి వేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎస్ఐ మోహన్ నాయక్ తన సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
రెవెన్యూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటాం
రాయచోటి (జగదాంబసెంటర్) : రెవెన్యూ ఉద్యోగులకు ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పి.నరసింహకుమార్ అన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలోని జిల్లాలోని గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)ల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి బ్రహ్మయ్య రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ జగశెట్టి సతీష్, జాయింట్ సెక్రటరీ రాఘవేంద్ర, వెంకటరమణలు రెగ్యులర్ వీఆర్ఏలతోపాటు రిక్రూట్మెంట్ వీఆర్ఏలను కలుపుకుని ఎన్నికలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ఆర్.చండ్రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్.శంకరయ్య, జిల్లా సహా అధ్యక్షులుగా వై.రెడ్డిశేఖర్లను ఎన్నుకున్నారు. అదే విధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా బాలాజీ, నాగేశ్వర, రామలింగారెడ్డి, శ్రీనివాసులు, జిల్లా ట్రెజరర్‌గా భారతి, జిల్లా జాయింట్ సెక్రటరీలుగా నరేష్, బుడాన్బాషా, రామాంజులమ్మ, అనిల్‌కుమార్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికై న కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. -
నష్టపరిహారం కోసం కొత్త బైపాస్ బాధితుల ధర్నా
కురబలకోట : మండలంలోని అంగళ్లు నుంచి కనసానివారిపల్లె మీదుగా వెళుతున్న హైవే బైపాస్‌పై భూ బాధితులు నష్టపరిహారం కోసం బుధవారం ధర్నా నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు ఉంచి విశ్వం కళాశాల సమీంలో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఏడాది క్రితం కొత్త బైపాస్ కోసం సర్వే నంబరు 132,133లో భూములతో పాటు బోర్లు పోయాయన్నారు. రోడ్డు పనులు పూర్తయినా వాటికి ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీంతో వారు కొత్త బైపాస్‌పై వాహనాల రాకపోకలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు తపస్విని, ఆర్ఐ బాల సుబ్రమణ్యం బాధిత రైతులతో మాట్లాడారు. ప్రతిపాదనలు వెళ్లాయని వచ్చే నెలాఖరులోగా నష్టపరిహారం సొమ్ము అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. సర్వేయర్ భువనేశ్వరి, ఆర్అండ్బీ హైవే జేఈ పి. మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీ నీవా భూమిని అమ్మేశారు.!
కురబలకోట : భూ అక్రమార్కులు మండలంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఏమాత్రం ప్రభుత్వ భూమి కన్పించినా అప్పనంగా కొట్టేశారు. ప్లాట్లు విభజించి అమ్మి సొమ్ము చేసుకున్నారు. మండలంలోని అంగళ్లు వద్ద హంద్రీనీవా పంప్ హౌస్ పక్కన హంద్రీనీవా కాలువకు సంబంధించి సర్వే నంబరు 220/2బీలో ఎకరా 60 సెంట్లు భూమి ఖాళీగా ఉండేది. రియల్టర్ల కన్ను పడింది. ఏకంగా ప్లాట్లు చేసి అమ్మేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు హెచ్ఎన్ఎస్ అధికారులు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో చెప్పకనే చెబుతోంది. చివరకు ఆలస్యంగా మేల్కొని రెవెన్యూకు ఇటీవల ఫిర్యాదు చేయడంతో బండారం కాస్తా బయటపడింది. సర్వే నిర్వహించి హంద్రీనీవా భూమిగా రెవెన్యూ నిగ్గు తేల్చింది. దీని విలువ ఇప్పుడు రూ. 5 కోట్లు దాకా ఉంది. రెవెన్యూ అధికారులు హెచ్ఎన్ఎస్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బుధవారం ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని ఆక్రమిస్తే శిక్ష తప్పదని హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. హంద్రీ నీవా కాలువకు సంబంధించిన ఈ భూమిలో ఎవ్వరూ ప్రవేశించరాదని తహశీల్దారు తపస్విని తేల్చి చెప్పారు. అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అక్రమార్కుల నుండి ఈ ప్లాట్లను కొన్నవారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్లాటు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా విక్రయించారు. నమ్మి కొన్న బాధితుల గోడు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. భూ కబ్జా చేసి అమ్మి సొమ్ము చేసుకున్న అక్రమార్కుల కోసం బాధితులు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా మండలంలో ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఉన్నా, అమ్మి సొమ్ము చేసుకుని ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తహశీల్దారు తపస్విని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆలస్యంగా మేల్కొన్న హెచ్ఎన్ఎస్ అధికారులు పక్కాగా లెక్క తేల్చిన రెవెన్యూ రూ.5 కోట్లు విలువైన భూమి తిరిగి స్వాధీనం హెచ్చరిక బోర్డు ఏర్పాటు -
13 మంది కోడిపందెం రాయుళ్ల అరెస్టు
కేవీపల్లె : మండలంలోని మఠంపల్లె పంచాయతీ పరిధిలో కోడిపందెం ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 27,250 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. తమకు అందిన సమాచారంతో దాడి నిర్వహించామన్నారు. అదుపు తప్పి లారీ బోల్తా పీలేరు రూరల్ : అదుపు తప్పి లారీ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం మండలంలోని కావలిపల్లె పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అమరరాజా బ్యాటరీల లోడుతో చిత్తూరు నుంచి లక్నోకు వెళుతున్న లారీ కావలిపల్లె పంచాయతీ పరిధిలో పీలేరు – సుండుపల్లె రోడ్డు వంక వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురేంద్ర (42) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ఒంటిమిట్ట : మండలంలోని గొల్లపల్లి ఇసుక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 15 ట్రాక్టర్లను ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఒంటిమిట్ట తహసీల్దార్ రమణమ్మ తెలిపిన వివరాల మేరకు తమకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మండల పరిధిలోని గొల్లపల్లి ఇసుక క్వారీలో ఎలాంటి రశీదులు లేకుండా ఇసుకను లోడ్ చేసుకొని రవాణాకు సిద్ధంగా ఉన్న కడపకు చెందిన15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. ఎంఈఓ సస్పెన్షన్‌పై విచారణఓబులవారిపల్లె : గతంలో ఓబులవారిపల్లె ఎంఈఓగా పనిచేసిన పద్మజ సస్పెన్షన్‌పై బుధవారం నంద్యాల డిప్యూటీ డీఈఓ మహ్మద్ బేగ్ విచారణ చేపట్టారు. పాఠ్యపుస్తకాలు, విద్యాసామగ్రి అవకతవకలపై గతంలో ఎంఈఓ పద్మజను సస్పెండ్ చేశారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని విచారణ జరపాలని కోరడంతో ఉన్నతాధికారులు డిప్యూటీ డీఈఓ మహమ్మద్ బేగ్‌ను విచారణకు పంపించారు. మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో విచారించారు. విచారణ కోరిన ఎంఈఓను పక్కన కూర్చోబెట్టుకుని విచారణ చేయడం పట్ల పలువురు ప్రధానోపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. విచారణ విషయాలను బయటకు వెల్లడించకుండా అధికారులు వెళ్లిపోయారు. -
13 మంది కోడిపందెం రాయుళ్ల అరెస్టు
కేవీపల్లె : మండలంలోని మఠంపల్లె పంచాయతీ పరిధిలో కోడిపందెం ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 27,250 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. తమకు అందిన సమాచారంతో దాడి నిర్వహించామన్నారు. అదుపు తప్పి లారీ బోల్తా పీలేరు రూరల్ : అదుపు తప్పి లారీ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం మండలంలోని కావలిపల్లె పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అమరరాజా బ్యాటరీల లోడుతో చిత్తూరు నుంచి లక్నోకు వెళుతున్న లారీ కావలిపల్లె పంచాయతీ పరిధిలో పీలేరు – సుండుపల్లె రోడ్డు వంక వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురేంద్ర (42) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ఒంటిమిట్ట : మండలంలోని గొల్లపల్లి ఇసుక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 15 ట్రాక్టర్లను ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఒంటిమిట్ట తహసీల్దార్ రమణమ్మ తెలిపిన వివరాల మేరకు తమకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మండల పరిధిలోని గొల్లపల్లి ఇసుక క్వారీలో ఎలాంటి రశీదులు లేకుండా ఇసుకను లోడ్ చేసుకొని రవాణాకు సిద్ధంగా ఉన్న కడపకు చెందిన15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. ఎంఈఓ సస్పెన్షన్‌పై విచారణఓబులవారిపల్లె : గతంలో ఓబులవారిపల్లె ఎంఈఓగా పనిచేసిన పద్మజ సస్పెన్షన్‌పై బుధవారం నంద్యాల డిప్యూటీ డీఈఓ మహ్మద్ బేగ్ విచారణ చేపట్టారు. పాఠ్యపుస్తకాలు, విద్యాసామగ్రి అవకతవకలపై గతంలో ఎంఈఓ పద్మజను సస్పెండ్ చేశారు. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని విచారణ జరపాలని కోరడంతో ఉన్నతాధికారులు డిప్యూటీ డీఈఓ మహమ్మద్ బేగ్‌ను విచారణకు పంపించారు. మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో విచారించారు. విచారణ కోరిన ఎంఈఓను పక్కన కూర్చోబెట్టుకుని విచారణ చేయడం పట్ల పలువురు ప్రధానోపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. విచారణ విషయాలను బయటకు వెల్లడించకుండా అధికారులు వెళ్లిపోయారు. -
యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలి
రాయచోటి అర్బన్ : జిల్లాలో వీఓఏ (యానిమేటర్లు) తొలగింపు కార్యక్రమాన్ని ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వెలుగు యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాణెమ్మ, జి.రెడ్డెప్ప ప్రభుత్వాన్ని కోరారు. యానిమేటర్ల తొలగింపును నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో రాజకీయ వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. కనీస నిబంధనలు, పద్ధతులు పాటించకుండా తమను తొలగిస్తుంటే సెర్ప్, డీఆర్డీఏ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు, ఏపీ వెలుగు యానిమేటర్ల సంఘం నాయకులు సుబ్రమణ్యం, క్రిష్ణమ్మ, పరంజ్యోతి, రమణారెడ్డి, శ్వేత, సుమతి, నిర్మల, రాజగోపాల్, నాగసుబ్బయ్య, శ్రీరామిరెడ్డి, పవన్ పాల్గొన్నారు. -
యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలి
రాయచోటి అర్బన్ : జిల్లాలో వీఓఏ (యానిమేటర్లు) తొలగింపు కార్యక్రమాన్ని ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వెలుగు యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాణెమ్మ, జి.రెడ్డెప్ప ప్రభుత్వాన్ని కోరారు. యానిమేటర్ల తొలగింపును నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో రాజకీయ వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. కనీస నిబంధనలు, పద్ధతులు పాటించకుండా తమను తొలగిస్తుంటే సెర్ప్, డీఆర్డీఏ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు, ఏపీ వెలుగు యానిమేటర్ల సంఘం నాయకులు సుబ్రమణ్యం, క్రిష్ణమ్మ, పరంజ్యోతి, రమణారెడ్డి, శ్వేత, సుమతి, నిర్మల, రాజగోపాల్, నాగసుబ్బయ్య, శ్రీరామిరెడ్డి, పవన్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలాల్లో టీడీపీ నాయకుల కక్కుర్తి
మదనపల్లె : కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, ప్రభుత్వ స్థలం నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించినా, తమకు ముడుపులు అందాయి. చూసీ చూడనట్లు వెళ్లండంటూ అధికారులనే బెదిరిస్తున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా పట్టణంలోని 35వ వార్డులోని కోళ్లబైలు కాలనీలో హోంగార్డు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇతని స్థలానికి ఆనుకుని, పక్కనే సర్వే నంబర్.15లో ప్రభుత్వ స్థలం ఉంది. హోంగార్డు కొనుగోలు చేసిన స్థలం తక్కువ విస్తీర్ణం కావడంతో, పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. స్థానిక టీడీపీ నాయకులను సంప్రదించాడు. వారు స్థలానికి రేటు కట్టి అతడి నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారు. అయితే..హోంగార్డు ఎలాగూ డబ్బులు ఇచ్చాం కదా అని...15 అడుగుల స్థలం కాకుండా మరో 20 అడుగుల పొడుగు, వెడల్పుతో ఫిల్లర్లు వేసి నిర్మాణం చేపట్టాడు. తమకు ముడుపులు చెల్లించిన స్థలం కంటే అదనంగా ఆక్రమించుకోవడంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు..రెవెన్యూ అధికారులకు ఉప్పందించారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణ జరిగిపోతోందంటూ హైరానా చేశారు. దీంతో అధికారులు స్థలాన్ని సర్వేచేసి, ఇది ప్రభుత్వ స్థలమని పునాదుల మీద పెయింట్‌తో రాసి అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సిందిగా హోంగార్డును ఆదేశించారు. దీంతో హోంగార్డు తిరిగి తమ్ముళ్లకు అదనపు ముడుపులు చెల్లించడంతో ఆక్రమణకు అంగీకరించారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకడంతో తమ్ముళ్ల కక్కుర్తికి, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. స్థానికులు హోంగార్డు ప్రభుత్వ స్థల ఆక్రమణపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. డబ్బులు తీసుకుని ఆక్రమణలకు వత్తాసు 20 అడుగుల స్థలాన్ని ఆక్రమించిన హోంగార్డు -
రైతులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేయాలి
రాయచోటి అర్బన్ : అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే అందజేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సీపీఐ నాయకులతో కలిసి డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లె మండలంలోని పింఛా జలాశయం మరమ్మతు పనులను వేగవంతం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వెలిగల్లు జలాశయం కాలువ పనులను వూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్.నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధీర్, నాయకులు మురళి, జ్యోతి పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న ఐషర్ వాహనం
చిన్నమండెం : కూలి పనులు ముగించుకుని మూడు చక్రాల ఆటోలో వెళ్తున్న కూలీలకు ఐషర్ వాహనం రూపంలో రోడ్డు ప్రమాదం జరగ్గా ఒకరు మృతి చెందారు. 12 మంది గాయపడిన సంఘటన చిన్నమండెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చిన్నమండెం మండలం కలిబండకు చెందిన దాదాపు 12 మంది కూలీలు బెస్తపల్లిలో టమాటా పని కోసం ఉదయం వచ్చి పని ముగించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. బెస్తపల్లె రోడ్డు క్రాస్, డాబా దగ్గరికి వచ్చేసరికి చిన్నమండెం నుంచి మదనపల్లి వైపు కోళ్లను తీసుకెళ్తున్న ఐషర్ వాహనం ఆటోను ఢీకొంది. బాలక లక్ష్మీదేవి(48) అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన లక్ష్మీదేవికి ఒక కుమారుడు ఉండగా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఒకే గ్రామానికి చెందిన 12 మంది రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కలిబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను రాయచోటికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నమండెం ఎస్ఐ సుధాకర్ తెలిపారు.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు -
వ్యాధుల నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం
రాయచోటి అర్బన్: వ్యాధుల నిర్థారణలో ల్యాబ్‌టెక్నీషియన్లే కీలకమని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ కొండయ్య అన్నారు. బుధవారం స్థానిక ఎన్జీఓ సభాభవనంలో ల్యాబ్టెక్నీషియన్లకు ఒక్కరోజు రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ పోగ్రాం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డెంగీ, షుగర్, మలేరియా, టైఫాయిడ్, హెచ్బి1 ఇతర రకాల పరీక్షలన్ని నిర్వహించి అప్పటికప్పుడే ఫలితాలను అందజేయాలన్నారు. కడప మలేరియా అధికారిణి మనోహరమ్మ మాట్లాడుతూ ల్యాబ్టెక్నీషియన్లు రికార్డులన్నింటినీ ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. ట్రైనింగ్ అధికారిణి లక్ష్మిసుభద్ర, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఒక్కరోజు శిక్షణకు హాజరైన ల్యాబ్టెక్నీషియన్లకు గురువారం నుండి మూడు విడతలుగా అర్బన్‌హెల్త్ సెంటర్లో ప్రాక్టికల్ వర్క్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో మలేరియా సబ్యూనిట్ అధికారులు ప్రసాద్‌యాదవ్, జయరామయ్య, జయంద్ర, ఖలీల్, ముజీబ్, దాస్, శ్రీను, కృష్ణమ్మలతో పాటు పలువురు ల్యాబ్టెక్నీషియన్లు పాల్గొన్నారు. -
వ్యాధుల నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం
రాయచోటి అర్బన్: వ్యాధుల నిర్థారణలో ల్యాబ్‌టెక్నీషియన్లే కీలకమని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ కొండయ్య అన్నారు. బుధవారం స్థానిక ఎన్జీఓ సభాభవనంలో ల్యాబ్టెక్నీషియన్లకు ఒక్కరోజు రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ పోగ్రాం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డెంగీ, షుగర్, మలేరియా, టైఫాయిడ్, హెచ్బి1 ఇతర రకాల పరీక్షలన్ని నిర్వహించి అప్పటికప్పుడే ఫలితాలను అందజేయాలన్నారు. కడప మలేరియా అధికారిణి మనోహరమ్మ మాట్లాడుతూ ల్యాబ్టెక్నీషియన్లు రికార్డులన్నింటినీ ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. ట్రైనింగ్ అధికారిణి లక్ష్మిసుభద్ర, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఒక్కరోజు శిక్షణకు హాజరైన ల్యాబ్టెక్నీషియన్లకు గురువారం నుండి మూడు విడతలుగా అర్బన్‌హెల్త్ సెంటర్లో ప్రాక్టికల్ వర్క్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో మలేరియా సబ్యూనిట్ అధికారులు ప్రసాద్‌యాదవ్, జయరామయ్య, జయంద్ర, ఖలీల్, ముజీబ్, దాస్, శ్రీను, కృష్ణమ్మలతో పాటు పలువురు ల్యాబ్టెక్నీషియన్లు పాల్గొన్నారు. -
ప్రమాదంలో గాయపడిన ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి మృతి
మదనపల్లె : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మదనపల్లెలో జరిగింది. తమిళనాడు దిండిగల్ జిల్లా పెరియకోటకు చెందిన ఆర్ముగం కుమారుడు మారిముత్తు(33) పట్టణంలోని దేవతానగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఇతడికి స్నేహతో వివాహం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా ఈనెల 17న ఫైనాన్స్ కంపెనీ వసూళ్లకు వెళ్లి, ద్విచక్రవాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా, మదనపల్లె బైపాస్‌రోడ్డులోని రాయల్ అరేబియా హోటల్ ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గమనించిన స్థానికులు గాయపడిన మారిముత్తును ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అయితే అక్కడ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. బుధవారం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య స్నేహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. -
ఘనంగా జులూస్
కడప కల్చరల్: ఐదు రోజులపాటు జరిగిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ బుధవారం రాత్రి నగరోత్సవాన్ని కడప నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఫకీర్లు, ఇతర శిష్య గణాలతో కలిసి పీఠాధిపతి పెద్దదర్గా నుంచి పెన్నానది అటువైపు తీరాన గల గండి వాటర్ వర్క్స్ కొండ గుహల వద్దకు వెళ్లి జెండా ప్రతిష్ఠించి ఫాతెహా నిర్వహించారు. తర్వాత ఆ ప్రాంతంలో హజరత్ మస్తాన్‌స్వామి స్మారకంగా అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అక్కడి నుంచి ఊరేగింపుగా కడప నగరానికి తిరిగి వచ్చారు. పలు వాహనాలలో ఆయన శిష్యులు, ప్రముఖులు ఆయన వెంట వాహనాలలో ఊరేగింపులో పాల్గొన్నారు. రాత్రి మాసాపేటలోని హజరత్ మై అల్లా దర్గా షరీఫ్ వద్ద నుంచి పీఠాధిపతి ఫకీర్లు, సంఘ ప్రతినిధులతో కనుల పండువగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై నగరంలో ఊరేగింపుగా బయలుదేరారు. ముస్లిమేతరులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అడుగడుగునా యువకుల బృందాలు ఆయనకు స్వాగతం పలికి ఆశీస్సులు పొందారు. ఆయనను దర్శించుకునేందుకు భక్తులు వెల్లువెత్తారు. నగరంలోని పలు ముఖ్య కూడళ్ల ద్వారా సాగిన ఈ ఊరేగింపులో అడుగడుగునా యువత బ్యాండు మేళాల సంగీతానికి యువకులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ నృత్యాలు చేశారు. ఊరేగింపు తెల్లవారుజామున తిరిగి దర్గాకు చేరింది. -
దత్తత పొందడం ఒక వరం
రాయచోటి టౌన్: దత్తత పొందడం ఒక వరంలాంటిదని శిశుగృహ మేనేజర్ ఆర్. సుప్రియ అన్నారు. బుధవారం రాయచోటి రాజుల కాలనీలోని మండల సమాఖ్య భవనంలో జిల్లా శిశుగృహం ప్రత్యేక దత్తత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ దత్తత మాసోత్సవం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 0–6 సంవత్సరాల మధ్య ఉండి అనాథలుగా మారిన చిన్న పిల్లలను దత్తత చట్టపరంగా ఇస్తామన్నారు. అలాంటి పిల్లలను దత్తత తీసుకొన్న వారు వారి ఆలనా – పాలన చూసుకొంటారని తెలిపారు. అలాగే ఎక్కడైనా అనాథలుగా మారిన పిల్లలు ఉన్నట్లు కానీ, తమకు పిల్లలు వద్దు అని, వదిలించుకోవాలనుకునే ఆలోచన ఉన్న వారు ఎవరైనా 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే అనధికారికంగా దత్తత తీసుకొన్నట్లు తెలిసినా ఈ నంబర్‌కు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం పీవో –ఎన్ఐసీ బి. వెంకటరవికుమార్, ఏపీఎంఎం. శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 24న రాష్ట్రస్థాయి ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్ కడప స్పోర్ట్స్: కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఫంక్షన్హాల్లో ఈనెల 24వ తేదీ రాష్ట్రస్థాయి ఓపన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి బి. అనీస్దర్బారీ తెలిపారు. టోర్నీ విజేతలకు రూ.53 వేల మేర నగదు బహుమతులు, ట్రోఫీ లు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం, సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 83412 55151 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
క్షేత్రస్థ్ధాయిలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించాలి
రామాపురం: ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్, మ్యుటేషన్లు, చుక్కల భూములు, ఇతర రెవిన్యూ సేవలు, అపార్ ఐడీ జనరేషన్, హౌసింగ్ జియో ట్యాగింగ్, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ తదితర అంశాలలో రెవిన్యూ , ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్‌పై అధికారులతో సమీక్షించి, పనుల్లో వేగం పెంచాలని, పురోగతిని మెరుగుపరచాలన్నారు. ఎన్పీసీఎల్తో బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్‌పై సమీక్షిస్తూ గువ్వలచెరువు, సరస్వతిపల్లె, బైరెడ్డిగారిపల్లెలో ప్రగతి బాగుందన్నారు. మండలంలో గృహ నిర్మాణాల పురోగతిని మెరుగుపరచాలని.. రుణాలు అవసరమైతే మంజూరు చేయాలని డీఆర్డీఏ ఏపీఎంలను ఆదేశించారు. ఇసుక రీచ్‌లపై పర్యవేక్షణ ఉండాలని తహశీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఇంజినీర్లను ఆదేశించారు. పల్లె పండుగ కార్యక్రమంలో పనులు పూర్తి చేయాలన్నారు. పిల్లల హాజరు అప్లోడ్ చేయాలి మండలంలోని సూర్యనారాయణపురం మండల పరిషత ప్రాథమిక పాఠశాల ఆవరణలో గల అంగన్వాడీ ప్రీ ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పిల్లల రోజువారి హాజరు నోట్ క్యామ్‌లో అప్లోడ్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ రోడ్ల పరిశీలన.. కడప – రాయచోటి ప్రధాన రహదారిలో చిట్లూరు వద్ద ప్రధాన రహదారి నుండి ఆదర్శ పాఠశాల వరకు రూ.14 లక్షల అంచనాతో నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్డును పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి మందుల కొరతపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ● కార్యక్రమంలో డ్వామా, హౌసింగ్, డీఆర్డీఏ పీడీలు వెంకటరత్నం, శివయ్య, సత్యనారాయణ, తహశీల్దార్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చామకూరి సర్వేరాళ్లపై బొమ్మలు తొలగించాలిలక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి మండలంలోని గుడ్లవారిపల్లి గ్రామంలో సర్వే రాళ్లపై వైఎస్ జగన్ బొమ్మలు, అక్షరాలు చెరిపి వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ చామకూరి శ్రీధర్ బుధవారం పరిశీలించారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఆయన లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్, మ్యుటేషన్లు, చుక్కల భూములు, రెవె న్యూ సేవలు, అపార్ ఐడీ జనరేషన్, హౌసింగ్, జియో ట్యాగింగ్, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ తదితర అంశాలలో రెవెన్యూ అధికారులతో, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో సమీ క్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులలో పురోగతి సాధించాలన్నారు. విద్యార్థుల అపార్ ఐడీ నమోదులో వేగం పెంచాలన్నారు. ఆధార్ కేంద్రాలను తహశీల్దార్, ఎంపీడీఓలు తనిఖీ చేయాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా, హౌసింగ్, డీఆర్డీఏ పీడీలు వెంకటరత్నం, శివయ్య, సత్యనారాయణ, తహశీల్దార్, ఎంపీడీఓ, అధికారులు పాల్గొన్నారు. -
●ఆర్బీసీదీ ఇదే కథ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా దక్షిణ ప్రాంత కరువు రైతులకు శాశ్వత సాగు, తాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేసి రైతుల తల రాతను మార్చేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా రెండోదశ అంతర్భాగంగా కొత్త పథకాలను చేపట్టారు. వాటికి నిధులు కూడా ఇచ్చారు. ఈ పనులన్నీ గాడిలో పడుతున్న సమయంలో అధికారం మారి టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో రైతుల తలరాత మళ్లీ మొదటికి వచ్చినట్టయ్యింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులోని పథకాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. వాటి జోలికి వెళ్లవద్దని, ఆ పనుల సంగతి మరచిపోండని తెగేసి చెప్పేసింది. దీంతో అధికార యంత్రాంగం ప్రాజెక్టు మొత్తానికి పుంగనూరు ఉపకాలువ లైనింగ్ పనిపైనే దృష్టి పెట్టి పనిచేస్తోంది. మంజూరైన ఉప కాలువలు, రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటరీ పనులన్నింటికీ సర్వేలు పూర్తయ్యాయి. నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకాలు ప్రశ్నార్థకంగా మారాయి. రూ.359 కోట్లతో రిజర్వాయర్ పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం చెర్లోపల్లె ఎగువతోటపల్లె వద్ద ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పట్లో సిద్ధమైంది. పనులకు సంబంధించి స్టేజ్–1 పనులైన సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. హంద్రీ – నీవా నుంచి కృష్ణా జలాలను రిజర్వాయర్‌కు మళ్లించేలా రూపకల్పన జరిగింది. ఎగువతోటపల్లె వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ నుంచి కృష్ణా జలాలను తరలిస్తారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక దీనికింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వాయల్పాడు, గుర్రంకొండ మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీటిని అందించే ప్రణాళిక చేశారు. దీనితోపాటే హరిహరాదుల చెరువుకు 35 ఎంసీఎఫ్‌టీ, రామానాయిని చెరువుకు 35 ఎంసీఎఫ్‌టీల నీటిని మళ్లించాలని కూడా ప్రణాళికలో పెట్టారు. స్టేజ్–1 పనులు పూర్తికావడంతో రూ.359 కోట్లతో పని చేపట్టేందుకు పాలనాపరమైన అనుమతి వచ్చే సమయంలో ప్రభుత్వం మారడంతో రిజర్వాయర్‌పై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ పీలేరు నియోజకవర్గం కేవిపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవా ఉపకాలువ ప్రారంభం అవుతుంది. ఇది చిత్తూరుజిల్లాలోని పులిచెర్ల మండలం కమ్మపల్లె మీదుగా సాగుతుంది. కమ్మపల్లె వద్ద 54.350 కిలోమీటర్ నుంచి రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభించి 20కిలోమీటర్ల మేర మట్టికాలువను తవ్వుతారు. కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించడంతోపాటు రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, పులిచర్ల మండలాల్లోని 25వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని ప్రణాళిక చేశారు. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను నీవా కాలువ నుంచి మళ్లించి తరలిస్తారు. ఈ పనులు చేపట్టేందుకు వీలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక కోసం రూ.59.22 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో సర్వే పూర్తిచేయగా 24 చెరువులకు కృష్ణా జలాలు తరలించి, దానికింద 2,580 ఎకరాల ఆయకట్టు సాగులోకి తేచ్చేలా ప్రతిపాదించారు. దీనికి రూ.73.43 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ పథకంపై రైతాంగం ఆశలు పెట్టుకుంది. బాహుదాకు కృష్ణా జలాలు ఇస్తారో లేదో..? మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలంలోని బాహుదా రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనుల్లో భాగంగా ఈ నీటిని తరలించే పనులను కలిపారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 173.00 నుంచి పిల్లకాలువను తవ్వి బాహుదా ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను తరలిస్తారు. దీనితోపాటుగా వాయల్పాడు మండలంలో పాలమంద డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. వాయల్పాడు ఉపకాలువ కిలోమీటర్ 23.500 వద్ద నుంచి పిల్లకాలువ తవ్వి 2,100 ఎకరాలకు సాగునీటిని అందించేలా గత ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం ఈ పథకాల స్థితి అచేతనావస్థలో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టదలచినవి అన్న కారణంగా నిలిపివేస్తారా.. ముందుకు తీసుకెళ్తారా అన్నది వేచి చూడాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రొంపిచర్ల డ్రిస్టిబ్యూటరీ, రామసముద్రం ఉపకాలువ పనులకు రూ.1.63 కోట్లతో సర్వే పూర్తి రూ.359 కోట్లతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పాలమంద డిస్ట్రిబ్యూటరీకి, బాహుదాకు కృష్ణా జలాలు ఈ పథకాలను పక్కన పెట్టిన టీడీపీ ప్రభుత్వం మదనపల్లె నియోజకవర్గం నుంచి పుంగనూరు ఉప కాలువ సాగే సుగాలిమిట్ట వద్ద 183.3 కిలోమీటర్ వద్ద నుంచి రామసముద్రం ఉపకాలువ (ఆర్బీసీ) పనులు మొదలుపెట్టి..ఇక్కడి నుంచి 750 మీటర్ల దూరంలో నీటిని ఎత్తిపోసేందుకు ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రామసముద్రం దాక 28 కిలోమీటర్ల ఉపకాలువను తవ్వించి కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించారు. ఇది పూర్తయితే ఆర్బీసీ కింద 60 చెరువులకు సాగునీరు, 84వేల మంది జనాభాకు తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగానే రామసముద్రం వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించి తాగునీటి అవసరాలు తీర్చేలా గ్రామాలకు సరఫరా చేయాలన్నది ప్రణాళిక. ఈ పనులు చేపట్టడం కోసం కాలువ సర్వే, సమగ్ర నివేదిక సమర్పించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.03కోట్లను మంజూరు చేయగా టెండర్ నిర్వహించి సర్వే సంస్థకు అప్పగించగా సమగ్ర సర్వే పూర్తయి నివేదిక ప్రభుత్వానికి చేరింది. రామసముద్రానికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. -
23 నుంచి రాష్ట్ర జట్టు ఎంపికకు సన్నాహాలు
మదనపల్లె సిటీ: 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ అంతర్ జిల్లాల నెట్‌బాల్ అండర్–17 బాలికల టోర్నమెంటుకు రాష్ట్ర జట్టు ఎంపిక ప్రక్రియ ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వసంత, టోర్నమెంటు ఆర్గనైజింగ్ చైర్మన్ ఆంజనేయులు తెలిపారు. ఈ టోర్నమెంటుకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల బాలికలు పాల్గొంటారన్నారు. ఇందులో రాష్ట్ర జట్టును ఎంపిక చేసి జాతీయ నెట్‌బాల్ పోటీలకు పంపనున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించాలి రాయచోటి టౌన్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం రాయచోటి డైట్ కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కేంద్రంలో కొత్తగా నేర్చుకున్న విషయాలను తరగతి గదిలో విద్యార్థులకు బోధించాలని చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత మనందరిదీ రాయచోటి టౌన్: బాలల హక్కులను కాపాడే బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలో జిల్లా సీ్త్ర , శిక్షసంక్షేమశాఖ, సాధికారిత కార్యాలయం నుంచి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా సీ్త్ర, శిశుసంక్షేమశాఖ అధికారులు, పోలీసులు, అధికారులతో కలసి ర్యాలీ నిర్వహించారు. బాలల హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు తెలపాలని అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి వినోద్‌కుమార్, ఐసీడీఎస్ నోడల్ అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. చేనేత క్లస్టర్ ప్రహరీ పనుల పరిశీలన సిద్దవటం: మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీలోని ఎస్కేఆర్ నగర్‌లోని చేనేత క్లస్టర్ ప్రహరీ పనులను బుధవారం హౌసింగ్ పీడీ రాజారత్నం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆన్లైన్ టెండర్ ద్వారా రూ. 49 లక్షలకు బద్వేల్‌కు చెందిన ఓబుల్‌రెడ్డి పనులు చేయడానికి టెండర్ దక్కించుకున్నారన్నారు. చేనేత క్లస్టర్ చుట్టూ ప్రహరీ, బిల్డింగ్ పనులు, టాయిలెట్ గదులు, మెయిన్టెనెన్స్ పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. స్థానిక కమిటీ సభ్యుడు గంజి సుబ్బరాయుడు, హౌసింగ్ ఏఈ చెన్నయ్య పాల్గొన్నారు. ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు నందలూరు: ప్రకృతి సేద్యం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకొని మంచి దిగుబడులను పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ పేర్కొన్నారు. మండలంలోని లేబాక మంగమాంబపురంలో బుధవారం పొలం పిలు స్తోంది కార్యక్రమం నిర్వహించారు. పంటల బీమా గురించి రైతులకు తెలియజేశారు. రాజంపేట సహాయక వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు మాట్లాడుతూ మామిడిలో తేనె మంచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. మండల వ్యవసాయ అధికారి మల్లి కార్జున, జెడ్బీఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
108లో సమ్మె సైరన్
మదనపల్లె సిటీ: ఆపద్బాంధవులుగా పేరొందిన 108 సిబ్బంది ఆపదలో పడ్డారు. అరకొర వేతనాలతో కంటి మీద కనుకు లేకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న వారు కూటమి ప్రభుత్వం తీరుతో కలవరం చెందుతున్నారు. 108 సర్వీసుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం వేస్తున్న అడుగులు వారిలో ఆందోళనకు కారణమైంది. విధిలేని స్థితిలో ఉద్యోగ భద్రత కోసం పోరుబాటకు సిద్ధమయ్యారు. నిరసన తెలిపినా స్పందించని సర్కారు: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 108 సిబ్బంది ఒక రోజు నిరసన చేపట్టారు. వినతులు ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందించకపోవడంతో ఈనెల 25 నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వె వెళుతునట్లు ప్రకటించారు. ఇప్పటికే ముందస్తు నోటీసు సైతం ఉన్నతాధికారులకు అందజేశారు. – జిల్లాలో ప్రతి నెలా మొత్తం మీద 3,500 నుంచి 4 వేల వరకు అత్యవసర కేసుల నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 108 సిబ్బంది సమ్మెలోకి వెళితే అత్యవసర సమయంలో రోగులను తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉండవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇవీ డిమాండ్లు: ● 108 సర్వీసులోని ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులుగా గుర్తించి నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి. ● జీవో నెంబర్.49ను పునరుద్ధరించాలి. పైలెట్ గ్రాట్యుటీ, ఎర్నడ్లీవు అమౌంట్ (ఆర్జిత సెలవు మొత్తం), వార్షిక ఇంక్రిమెంటును చెల్లించాలి. ● ప్రతి నెలా జీతాలు 5వ తేదీలోపు చెల్లింపులు జరగాలి. 108లో షిప్టుల పద్ధతిని అమలు చేయాలి. ● వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టే నియామకాల్లో సర్వీసుకు అనుగుణంగా వెయిటేజ్ మార్కులు అందించాలి. ● విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి మరణించిన తర్వాత బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలు ఇవ్వాలి. మావి న్యాయమైన కోర్కెలే: అత్యవసర సర్వీసుల్లో పని చేస్తున్న మేము విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నామనే సంతోషంతో కష్టాన్ని మరిచిపోతున్నాం. మా కుటుంబాల జీవనం సాఫీగా సాగాలంటే పనికి తగ్గ జీతం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. –ఎస్వీ రమణ, 108 ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు 25 నుంచి సమ్మెలోకి... మా ఇబ్బందులు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర యూని యన్ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చాం. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తుందనే ఆశిస్తున్నాం. –రెడ్డి జస్వంత్, 108 ఎంప్లాయిస్ యూనియన్ మదనపల్లె డివిజన్ అధ్యక్షుడు 108 సిబ్బంది సమస్యలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఈనెల 25 నుంచి సమ్మెలోకి ఆందోళన చెందుతున్న ప్రజలు -
హామీలు అమలు చేయరా..?
కేవీపల్లె : సూపర్‌సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అవి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తీతవగుంటపల్లె పంచాయతీ ఇర్రివాండ్లపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఇర్రి చిన్నయ్యనాయుడు కుటుంబ సభ్యులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. అలాగే నూతనకాల్వ పంచాయతీ కురవపల్లెలో పార్టీ నాయకుడు చామంచుల నాగరాజ తండ్రి చామంచుల లక్ష్మయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మించిన వారు మరెవరూ ఉండరని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణా రెడ్డి, నాయకులు సి.కె. యర్రమరెడ్డి, జయరామచంద్రయ్య, వెంకటసిద్ధులు, రామకొండారెడ్డి, కోర్టు సుబ్బారెడ్డి, ఆనందరెడ్డి, సతీష్‌రెడ్డి, సిద్ధయ్య, రాంప్రసాద్‌నాయుడు, రత్నాకర్‌రెడ్డి, పి. ద్వారకనాథరెడ్డి, ప్రభార్‌రెడ్డి, హరిబాబు, రెడ్డెప్పరెడ్డి, యర్రమరెడ్డి, నాగేశ్వర, గౌస్, బాలకృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.