News
-
రాంగ్రూట్లో వెళ్తే.. ఇకపై కేసులే!
నిజామాబాద్: వాహనాలను రాంగ్రూట్లో నడిపినా, సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ హెచ్చరించారు. నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నగరంలోని 18 చోట్ల ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని సీపీ కేటాయించారని తెలిపారు. నగరంలోని వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలన్నారు. అత్యవసరంగా ఫోన్ ఎత్తాల్సి వస్తే రోడ్డుపక్కన నిలిపి మాట్లాడాలని సూచింంచారు.మొదటి రోజు సోమవారం ఐదుచోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. మంగళవారం నుంచి 18 చోట్ల స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అమృత్ 2.0.. ఇంకెప్పుడో?
ఆదిలాబాద్: స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద రూ. 95.50 కోట్ల నిధులు విడుదల చేసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన పనులను చేపట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి కూడా ఇచ్చింది. ఈ పనుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నిధులు సైతం మంజూరయ్యాయి. అయినా పనుల ప్రారంభంపై అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.14 నెలల క్రితం నిధుల మంజూరు..రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రజలకు అవసరమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద 2023 మే 20న నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.95.50 కోట్లు కేటాయిస్తూ జీవో నంబర్ 312ను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు బల్దియా కూడా తమ వాటా చెల్లించి తాగునీటి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు జారీ చేసింది.అప్పుడే పనులు ప్రారంభించాల్సి ఉండగా టెండర్ల దాఖలకు కాంట్రాక్టర్లు ఆ సమయంలో ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. గతేడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు ఈ పనులను నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి చేపట్టేందుకు అనుమతినిచ్చింది. పనులు ప్రారంభమవుతాయని ప్రజలు సంబరపడ్డారు. అయితే ఇప్పటికి ఎలాంటి ప్రగతి లేకపోవడం గమనార్హం.టెండర్ల ప్రక్రియ పూర్తయినా..పట్టణంలోని ప్రతీ వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించాలనే ఉద్దేశంతో పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తాగునీటి సమస్య ఉన్న పట్టణంలో కొత్తగా విలీనమైన కేఆర్కే కాలనీ, భగత్‌సింగ్‌నగర్, న్యూ హౌసింగ్‌బోర్డు, రాంపూర్ వంటి కాలనీల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలతో పాటు తాగునీటి సరఫరాకు అవసరమైన పైపులైన్లు, నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఏయే కాలనీల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రస్థాయిలోనే టెండర్ల ప్రక్రియ ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వేసవిలోనూ ఆయా ఆయా కాలనీల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.త్వరలోనే ప్రారంభిస్తాం..అమృత్ 2.0 పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా పనులకు భూమి పూజ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది, పదిహేను రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – గంగాధర్, పబ్లిక్ హెల్త్, ఈఈ -
ఎంటెక్.. మెకానిక్
‘ఏది తానంతట తానై నీ దరికి రాదు.. శోధించి సాధించాలనే’ నానుడిని నిజం చేశాడీ సంతోష్. లక్షల్లో వేతనం.. లగ్జరీ జీవితం అయినా ఏదో వెలితి.. ఒకరి వద్ద పని చేయడమేంటనే ఆలోచన వెంటాడటంతో సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు.అనుకున్నదే తడువుగా చదువుకు తగిన పనినే ఎంచుకున్నాడు. మెకానిక్‌లుగా ఇంజినీరింగ్ పట్టభద్రులు లేక పోగా మెకానికల్ ఇంజినీరింగ్ విద్యతోనే వినియోగదారులకు సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నగరంలో మెకానిక్ షాపును ప్రారంభించి పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తుండగా.. తను మాత్రమే కాకుండా 20మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. – కరీంనగర్ అర్బన్స్వయంకృషే నా బలం..మొదటి నుంచి స్వయంకృషితో ఎదగాలనుకున్న. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంటెక్ పూర్తి చేసి మెకానికల్ రంగంలో రాణించాలని నిర్ణయించుకున్న. ఉద్యోగాన్ని వదిలినపుడు చాలామంది హేళన చేశారు. ఇప్పుడు వారే అభినందిస్తున్నారు. సొంతకాళ్లపై నిలబడటంతో పాటు 20మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నా. – రొక్కం సంతోష్‌రెడ్డి -
అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలంగాణ తేజం!
మహబూబాబాద్: ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా, ఆఫ్రికా పవర్‌లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ తేజం మెరిసింది. మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కురవి మండలం జగ్యా తండాకు చెందిన తేజావత్ సుకన్య సత్తా చాటింది.ఈనెల 3వ తేదీ నుంచి జరిగిన ఈ పోటీలో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. కాగా, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి తనకు సాయపడిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్‌కు, కోచ్ వీఎన్ రాజశేఖర్‌కు సుకన్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.దేనికి ధైర్యం కోల్పోకుండా క్రీడల్లో రాణిస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగా పవర్ లిఫ్టింగ్లోనే కాకుండా వెయిట్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించానన్నారు. ఇంకా పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొస్తానని తెలిపారు. -
గతుకుల రోడ్డుపై.. బతుకు బండి!
వందల సంఖ్యలో బస్సులు.. లక్షల మంది ప్రయాణికులు.. వారిని సకాలంలో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిలో నిమగ్నమవుతున్నారు. పని భారాన్ని భరిస్తూ ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మీ’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉద్యోగులపై తీవ్ర పనిఒత్తిడి పడింది. వీటన్నింటినీ తట్టుకుని నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నా.. వారి బతుకు బండి సురక్షితంగా సాగడంలేదు. ఒకవైపు తీవ్ర పనిఒత్తిడి, డబుల్ డ్యూటీలు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులు, ఇలా అనేక సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2400కు పైగా మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షా 90వేల మంది ప్రయాణించేవారు. కాగా.. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెండు లక్షల 90 వేలకు చేరింది.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 50 మంది వరకు ఉంటుంది. గతంలో సామర్థ్యానికి మించి అదనంగా 10 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించడానికి వయస్సు పైబడినవారు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు.నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట8 గంటల డ్యూటీ లేదు..డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు పని గంటల నిబంధన లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు డేడ్యూటీ చేస్తారు. కానీ ఉదయం వెళ్లిన వారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతోంది. నిజామాబాద్ – హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్లు అవుతుండగా.. నిజామాబాద్ – వరంగల్ మధ్య అప్ అండ్ డౌన్ 460 కిలోమీటర్లు పడుతుంది.దీంతో పాటు వారికి టార్గెట్ ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో కార్మికులకు పనిభారం పెరుగుతోంది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం 10 నుంచి 12 గంటల పాటు పని చేస్తున్నారు. దీంతో నిద్ర కరువై అనారోగ్యాల భారిన పడుతున్నారు. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యూనియన్లు లేకపోవడంతో డిపోలోని అధికారులు సిబ్బందికి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేయడంతో పనిఒత్తిడి పెరుగుతోంది.ప్రశ్నిస్తున్న అధికారులు..ఆర్టీసీ బస్సులకు డైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రూట్లో వెళ్లే బస్సులు కేఎంపీఎల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. డైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కేఏంపీఎల్ వచ్చేటట్లు చూడాలని సూచనలు చేస్తున్నారు. కండక్టర్లకు మహాలక్ష్మి పథకంతో పాటు టిక్కెట్లకు టార్గెట్ నిర్దేశిస్తున్నట్లు ఆరీ్టసీలో చర్చ జరుగుతోంది. దీంతో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని కండక్టర్లు వాపోతున్నారు.రెండు డ్యూటీలు చేస్తేనే స్పెషల్ ఆఫ్..ఆర్టీసీ ఉద్యోగులు లీవ్‌లు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్, డ్రైవర్లకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ ఉంటుంది. రోజంతా పనిచేస్తేనే మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే అనార్యోగం పాలైన సిబ్బంది సంబంధిత డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర సెలవులు కావాలంటే అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే. -
ప్రక్షాళన చేయాల్సిందే..
ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొందరు సిబ్బంది విభాగాల్లో అంతా తామై వ్యవహరిస్తున్నారని కేఎంసీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా వీరి పెత్తనమే ఎక్కువైందని, అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా తాము చెప్పిందే వేదం అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇక కంప్యూటర్ ఆపరేటర్లు కేటాయించిన విభాగాల్లో కాకుండా అంతా ఒకే గదిలో కూర్చుని కార్యకలాపాలు సాగిస్తున్నారనే విమర్శ ఉంది. ప్రధానంగా శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్, అకౌంట్స్, ఐటీ, ఎన్నికలు, పరిపాలన విభాగాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది పెత్తనం అధికమైందని తెలుస్తోంది. ఈనేపథ్యాన కమిషనర్‌గా విధుల్లో చేరిన అభిషేక్ అగస్త్య తొలుత కార్యాలయ ప్రక్షాళన నుంచే తన పని ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.అంతా అక్కడి నుంచే..కేఎంసీలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కొరత కారణంగా పలువురిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో కొందరికి కంప్యూటర్ ఆపరేటర్లుగా హోదా కల్పించి విభాగాలకు అప్పగించారు. ఇందులో పలువురు అధికారులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ బృందంగా ఏర్పడి కార్యాలయంలో తమకంటూ ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసుకున్నారు.రెవెన్యూ, గ్రీవెన్స్, కమిషనర్ పేషీ, సిస్టమ్ మేనేజర్ విభాగాలకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక విభాగం పేరుతో అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి కి నచ్చిన ఫైళ్లను పరిష్కరిస్తూ.. ఇతరులవి పక్కన పెడుతున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నాయి. ఏళ్ల తరబడి వీరంతా అదేవిభాగాల్లో పనిచేస్తుండడంతో అజమాయిషీ కరువవగా.. విభాగాల్లో కాకుండా అంతా ఒకేచోటకు చేరడంతో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.పాతుకుపోయారు..కేఎంసీలో రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, ఎస్టాబ్లిష్మెంట్ విభాగాల్లో ఉద్యోగులు, అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నారు. ఇటీవల కొందరి విభాగాలు మార్చినప్పటికీ ఉద్యోగుల తీరు మాత్రం మారలేదని తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు చెప్పా పెట్టకుండానే విధులకు గైర్హాజరు కావడం పరిపాటిగా మారిందని సమాచారం. ఈ నేపథ్యాన నగరాభివృద్ధి ఎంత ముఖ్య మో... కార్యాలయాన్ని ప్రక్షాళన చేయడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని కొత్త కమిషనర్ గుర్తించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.విధుల్లో చేరిన కమిషనర్ అభిషేక్ అగస్త్యఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్‌గా ఉన్న ఆయనను కమిషనర్‌గా బదిలీ చేయగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మేయర్ పునుకొల్లు నీరజను కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.ఆ తర్వాత కమిషనర్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల అధికారులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అలాగే, అకౌంట్స్ విభాగం అధికారితో సమావేశం సందర్భంగా కేఎంసీలో నిధుల నిల్వలు, పెండింగ్ బిల్లులపై చర్చించారు. మధ్యాహ్నం నగరంలోని బోనకల్ రోడ్డు, మమత రోడ్డు మార్గాల్లో కమిషనర్ అభిషేక్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రంజిత్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఏ.సంపత్‌కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈలు, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.కేఎంసీనా.. సాఫ్ట్వేర్ కంపెనీయా?కార్పొరేషన్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ల సంఖ్యను చూస్తే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని తలదన్నేలా ఉంటుంది. ఒక్కో విభాగంలో ఇద్దరి నుంచి నలుగురు, ఐదుగురు వరకు ఆపరేటర్లను నియమించగా.. వీరు పనిచేయడం కన్నా బయట తిరగడం పైనే శ్రద్ధ వహిస్తారనే విమర్శలున్నాయి. ఎక్కడా ఏ కార్యాలయంలో లేని విధంగా కేఎంసీలో 23 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించగా పలువురికి కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేదని తెలుస్తోంది.అయినా రాజకీయ పలుకుబడితో ఇతర విధుల్లో చేరి కంప్యూటర్ ఆపరేటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని సమాచారం. కాస్త పరిజ్ఞానం ఉన్న వారు అధికారులను ఏమారుస్తుంటే.. ఏ మాత్రం నైపుణ్యం లేని సిబ్బంది ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి నెట్టుకొస్తున్నారని తెలుస్తోంది. ఇంతమంది ఉన్నప్పటికీ ప్రత్యేక అవసరాల సమయాల్లో మాత్రం రోజువారీ వేతనంపై బయట నుంచి ఆపరేటర్లను తీసుకొస్తుండడం గమనార్హం. -
చదువుల మోత!
విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో బోధన ఊపందుకుంటోంది.ఈనేపథ్యాన విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లు, హాస్టళ్లకు వెళ్తున్న వారి కోసం పరుపులు, పెట్టెలు ఇతర సామగ్రి కొనుగోళ్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని బుక్‌స్టాళ్లు, ఇతర దుకాణాలు వారం ఇలా రద్దీగా కనిపించాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
పంట చేలల్లోకి వెళ్లేదారిని మూసేశారు
మాది బజార్హత్నూర్ మండలకేంద్రం. గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 137,138లలో గల స్థలం నుంచి చేలల్లోకి వెళ్లేందుకు బండ్ల బాట ఉంది. 50 ఏళ్లుగా ఈ మార్గం గుండానే మేము చేన్లకు వెళ్తున్నాం. అయితే ఈ నెల 21న 138 సర్వే నంబర్లోని ఇద్దరు వ్యక్తులు ఈ దారిని జేసీబీతో ధ్వంసం చేసి కాలువగా మార్చారు. దీంతో మాకు దారి లేకుండా పోయింది. వ్యవసాయ పనులు ప్రారంభమైనందున విత్తనాలు విత్తుకునేందుకు, ఎరువులు వేసేందుకు తీవ్ర ఇబ్బందులవుతున్నాయి. మాకు న్యాయం చేయాలని విన్నవించాం. – రైతులు, బజార్హత్నూర్ -
కోళ్ల దాణా.. బీర్ల తయారీ!
కరీంనగర్: రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. రూపం.. దారులు మారాయే తప్ప అక్రమ వ్యాపారం ఆగడం లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చెందిన ఓ బియ్యం డాన్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పొస్) ద్వారా రేషన్ తీసుకోని కార్డుదారుల సరుకు నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్టపడగా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది.కార్డుదారులు తీసుకునే బియ్యం కోళ్లకు దాణాగా మారడం ఆందోళనకర పరిణామం. పేద ప్రజల కడుపు నింపాల్సిన రేషన్‌బియ్యం కోళ్లకు ఆహారంగా.. బీర్ల తయారీకి వినియోగించడం విడ్డూరం. పీడీ యాక్టు అమలులో తాత్సారం.. కఠినంగా వ్యవహరించకపోవడం అక్రమ దందాకు వరంగా మా రింది. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారితో కొందరు అధికారుల ఉదాసీన వైఖరి, మామూళ్ల మాటున ప్రోత్సహించడం యథేచ్ఛగా దందా సాగడానికి ప్రధాన కారణం. పలువురు రేషన్ డీలర్లు కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యం ఇచ్చినట్లు ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడం, తీసుకున్న బియ్యాన్ని కార్డుదారులు దళారులకు విక్రయించడం అప్రతిహాతంగా సాగుతోంది.కిరాణా, రేషన్ దుకాణాలే అడ్డాలు..జిల్లాకేంద్రం నుంచి కుగ్రామం వరకు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం విరాజిల్లుతోంది. రేషన్ దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్(సీబీ) చూపించే వరకు బియ్యం నిల్వ చేసుకునే అవకాశముండగా సీబీలోపు పక్కదారి పట్టిస్తున్నారు. వేలిముద్ర వేసి వెళ్లినవారి బియ్యానికి ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేసుకుని లెక్కలు వేసుకున్న అనంతరం దళారులు, మిల్లర్లకు అంటగడుతున్నారు. దళారులు కొనుగోలు చేసే బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తుండగా పలువురు నేరుగా ఇతర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిరాణ దుకాణ నిర్వాహకులు కూడ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా అనుకూల సమయాల్లో దళారులకు విక్రయిస్తున్నారు.దళారులు పుట్టుకొస్తున్నారు..చోటామోటా బియ్యం డాన్లతో పాటు భారీ డాన్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గకపోవడం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వట్టి కేసులే కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దందా చేసే అక్రమార్కులపై పదుల సంఖ్యలో కేసులున్నప్పటికి కఠినశిక్షలు లేకపోవడంతో మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. పీడీయాక్టు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించినా తదనుగుణ చర్యలకు నిబంధనలు ప్రతికూలమనే కుంటిసాకులతో 6ఏ కేసులతోనే సరిపుచ్చుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. కాగా రేషన్ బియ్యం పక్కదారి పట్టించేవారెవరైనా వదిలేదిలేదని పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.అక్రమ ఆదాయానికి అనేక మార్గాలు..సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పలుదారుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ విధానం కొనసాగడం పరిపాటి. ఇదే సమయంలో పలువురు మిల్లర్లు దళారులను ఏర్పా టు చేసుకుని బియ్యం కొనుగోలు చేసి సీఎంఆర్‌గా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే తమకున్న సంబంధంతో బయటకు పొక్కకుండా చూస్తున్నారు.తినుబండారాల తయారీ కేంద్రాలకు బియ్యం తరలుతోంది. తక్కువ ధరకు లభ్యమవడంతో వీటికే మొగ్గు చూపుతున్నారు.కాలక్రమేణ టిఫిన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తుండగా సదరు కేంద్రాలకు ఇవే బియ్యం సరఫరా చేస్తున్నారు. దోశ, ఇడ్లీ, వడ ఇతర వాటిలో వీటినే కలిపేస్తుండగా పలువురు నిర్వాహకులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడిస్తున్నారు.కోళ్ల ఫారాలకు తరలింపు ఎక్కువైంది. మక్కల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది యజమానులు తక్కువ ధరకు వస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.బీర్లు తయారీ చేసే పరిశ్రమలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. గతంలో పట్టుబడిన కేసుల్లో 20కి పైగా ఇలాంటి రవాణానేనని పౌరసరఫరాలశాఖలోని ఓ అధికారి వివరించారు.సన్నరకాల దిగుబడి తక్కువగా ఉండటం సన్నబియ్యం ఆశించినస్థాయిలో లేకపోవడం రేషన్ బియ్యాన్నే ఫాలిష్ చేసి కలుపుతున్నారని సమాచారం. అనుకూల అధికారుల సహకారంతో బియ్యాన్ని మçహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడి ప్రజలు దొడ్డుబియ్యాన్ని అమితంగా ఇష్టపడుతారు. అక్కడ కిలో రూ.26–30 వరకు ధర పలుకుతుండటంతో భారీగా ఆదాయం గడిస్తున్నారు.ఇవి చదవండి: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు -
డ్రైవింగ్ స్కూళ్లలోనూ లైసెన్స్..
ఆదిలాబాద్: రహదారి భద్రత చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నూతన సంస్కరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా ఈ స్కూళ్లలో డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. మోటారు వాహన చట్టం మార్పులో భాగంగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ అంతా కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో సాగనుంది.ఈ చట్టం జూన్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ లేదు సరికదా ఇప్పటికిప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కూడా కష్టమే. రవాణా శాఖ చట్టం నిబంధన మేరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే పలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడున్న వారు ఏర్పాటుకు సముఖంగా లేరు. డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తే అనుమతి ఇస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.పారదర్శకతతో డ్రైవింగ్ ఉంటేనే..అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే డ్రైవింగ్ శిక్షణ నాణ్యమైనదిగా, సమర్థవంతమైనదిగా, పారదర్శకతతో ఉంటే లైసెన్స్‌లు ఇవ్వాలనేది రవాణా శాఖ ముఖ్యోద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే 5–ఏ సర్టిఫికేట్ల ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో రవాణా శాఖ అధికారులను పరిమితం చేస్తూ తీసుకొస్తున్న అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ప్రస్తుతం కష్టతరంగానే ఉండబోనుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా కఠిన నిబంధనలతో స్కూళ్ల ఏర్పాటు కష్టమే అంటున్నారు.మూడెకరాలు కావాల్సిందే..డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు కనీసం మూడెకరాల స్థలం కావాలి. రెండెకరాల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లు ఏర్పాటు చేయాలి. మరో ఎకరంలో శిక్షణ తరగతుల కోసం భవనం, తరగతి గదులు, ఇంటర్నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ, టీచింగ్ పరికరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందుకు పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరం. భూముల విలువ రూ.లక్షలు, రూ.కోట్లలో ఉండగా మూడెకరాల్లో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కష్టమే అంటున్నారు. అయినా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుందా అనేది అనుమానమేనని అంటున్నారు. -
అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి : మంత్రి పొన్నం
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయనకు నివాళి అర్పించారు. అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులఉమ, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో కే.మహేశ్వర్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నతానియల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది? -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
'ఉత్తర కాశీలో మా కళ్ల ఎదుటే భవనాలన్నీ కూలిపోయాయి'
-
బడులు తెరిచే నాటికి అందుబాటులోకి..
ఆదిలాబాద్: రానున్న విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫాం అందించే దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూనిఫాం కుట్టే బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించింది. ఆసక్తి, వృత్తి నైపుణ్యాలు కలిగిన సభ్యులను ఇప్పటికే ఎంపిక చేసింది. ప్రస్తుతం విద్యార్థుల కొలతలను సేకరిస్తున్నారు. విద్యాశాఖ నుంచి వస్త్రం కొనుగోలు చేసి ఇచ్చిన వెంటనే దుస్తులు కుట్టే పనిని ప్రారంభించనున్నారు. అయితే కుట్టు కూలిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం వారిని కొంత ఆందోళనకు గురి చేస్తోంది. యునిఫామ్లంతా వేసవిలోనే కుట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే జూన్లొనే విద్యార్థులకు కొత్త దుస్తులు అందనున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మొత్తం 1,200 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 84,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 42,082 మంది, బాలికలు 42,015 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందజేస్తుంది. ఇదివరకు వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు అందించే వారు. పాఠశాల ప్రారంభమై నెలలు గడిచినా చాలా మందికి అందేవి కావు. పైగా గుత్తేదారు విద్యార్థుల కొలతలు తీసుకోకుండా కుట్టడంతో సైజ్ సరిపోక ఇబ్బందిగా మరేది. ఇలాంటి పరిస్థితిని దూరం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను ఎస్ హెచ్జీలకు అప్పగించింది. ఇందుకోసం అర్హులైన ఆసక్తి గల సభ్యులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కసరత్తు షురూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. కుట్టు నైపుణ్యాలతో పాటు మిషన్ కలిగి ఉన్న 1,807 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సంబంధించిన కొలతలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాల, తరగతుల వారీగా కొలతలు తీసుకుంటున్నారు. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి వాటిని ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందించనున్నారు. అవసరమైన వస్త్రం అందిన వెంటనే వేసవి సెలవుల్లో యూనిఫాం కుట్టే ప్రక్రియను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వస్త్రం రాగానే ఐకేపీ వారికి ఇస్తాం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలను కుట్టించే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఐకేపీ సిబ్బంది విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నారు. ఆప్కో నుంచి వస్త్రం వచ్చిన వెంటనే వారికి అప్పగిస్తాం. వారు కుట్టించి విద్యార్థులకు అందిస్తారు. – సుజాత్‌ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి -
చంద్రాయపాలెం వర్సెస్ బుగ్గపాడు వర్సెస్ రుద్రాక్షపల్లి..
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్ చేసినట్లయింది. 15 ఏళ్ల నుంచి.. చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్ఎస్ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్ కట్ చేసి తిరిగి ప్లాంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది. అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏమన్నారంటే.. చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్ స్నేహలత తెలిపారు. వీఎస్ఎస్–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్ కటింగ్ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు -
కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్‌కుమార్
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లు, ట్రాన్స్‌ఫా ర్మర్లు కాలిపోతున్నాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటున ఆ పార్టీకి ఓటేస్తే రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం వీణ వంక మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మోటార్ వైండింగ్ షాపులో రిపేరు చేస్తున్న వ్యక్తితో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ మోటార్లు కాలి పోయి రిపేరుకు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో పదేళ్ల పాటు ఏనాడు ఈ పరిస్థితి రాలేదని వివరించారు. కేసీ ఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉందని, రైతులు, ప్రజలు, యువత, మేధావులు ఆలో చన చేయాలని కోరారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోని ఓ హోటల్లో చాయ్ తాగుతూ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. పవర్‌కట్ ప్రాంతాలు.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తీసివేత పనులు చేపడుతున్నందున గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ కొలుపుల రాజు తెలిపారు. 11 కేవీ తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని మాణికేశ్వరీనగర్, కార్తీకేయనగర్, విఘ్నేశ్వరనగర్, అయోధ్యనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
క్షయ.. వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వం పటిష్ట చర్యలు!
కాకినాడ: క్షయ.. నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణం మీదకు తెస్తుంది. ఈ వ్యాధికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి సీహెచ్‌సీలో టీబీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈవిధంగా జిల్లాలో మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, ఒక సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 10 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. క్షయ కేసులను గుర్తించేందుకు ప్రతి సీహెచ్‌సీలో ఎక్స్‌రే యూనిట్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 10 మంది టీబీ హెల్త్ విజిటర్లు పని చేస్తున్నారు. క్షయ వ్యాధిని నిర్ధారించేందుకు కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో రెండు సీబీ నాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో 19 ట్రూనాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని మైక్రోస్కోప్ సెంటర్‌గా మార్చి టీబీ లక్షణాలున్న వ్యక్తి నుంచి కళ్లె (ఉమ్ము) సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఆ శాంపిల్‌లో టీబీ క్రిములుంటే ఆ వ్యక్తికి డాట్ ప్రొవైడర్ ద్వారా మందులు ఇస్తూ వ్యాధిని తగ్గించేందుకు 6 నుంచి 8 నెలల పాటు చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా మందులు.. టీబీ చికిత్సకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యులు సూచించిన విధంగా నిర్ణీత కాలం మందులు వాడకపోతే అది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. దీనికి రెండేళ్ల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. టీబీ నిర్మూలనకు రూ.2 లక్షల నుంచి రూ.18 లక్షల విలువ జేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మందులు మింగించిన పర్యవేక్షకులకు (డాట్ ప్రొవైడర్‌కు) రూ. వెయ్యి నుంచి రూ.5 వేల పారితోషికం అందిస్తున్నా రు. క్షయ వ్యాధిగ్రస్తులకు నెలవారీ వైద్య ఖర్చులకు నిక్షయ పోషణ యోజన ద్వారా రూ.500 చొప్పున అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా క్షయతో బాధ పడుతున్న 1,743 మందికి గత ఏడాది ప్రతి నెలా రూ.500 చొప్పున రూ.4,19,7000 జమ చేశారు. ఆధునిక పరికరాలతో పరీక్షలు.. వ్యాధిని కచ్చితంగా నిర్ధారణ చేసే సీబీ నాట్ మెషీన్లు కాకినాడ జీజీహెచ్‌తో పాటు తాళ్లరేవు, పెద్దాపురం, పండూరుల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ఈ మెషీన్ హెచ్ఐవీ రోగులు, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, చిన్న పిల్లలల్లో క్షయ, ఎండీఆర్ టీబీని గుర్తించడంలో కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,244 మంది క్షయ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి నిక్షయ్ మిత్ర ద్వారా, దాతల సహకారంతో పోషకాహార కిట్లు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో 673 మంది నమోదు చేసుకుని రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరిలో కొంతమంది కొందరు రోగులను దత్తత తీసుకుని, మరీ వారికి కావాల్సిన పౌష్టికాహార కిట్లు అందజేస్తూండటం విశేషం. క్షయ నిర్మూలనే లక్ష్యం జిల్లాను క్షయ రహితంగా చేయడ మే లక్ష్యంగా టీబీ రోగులకు చికిత్స అందిస్తున్నాం. అదే సమయంలో నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2030 నాటికి క్షయ ముక్త భారత్ లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ జె.నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, కాకినాడ. -
నాన్న..! 'నాకు మాట్లాడాలని ఉంది'..
కరీంనగర్: ఆ కుటుంబంలో మొదటి సంతానంగా పాప జన్మించింది. ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఆ సంబరం ఏడాది తిరగకముందే ఆవిరైంది. పాపకు మాటలు రాకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆస్తులు అమ్ముకొని కొంత, దాతల సహకారంతో కొంత సొమ్ము సేకరించి కేంద్ర ప్రభుత్వ పథకంతో ఆపరేషన్ చేయించినా, లక్షల్లో ఖరీదు చేసే హియరింగ్ మిషన్ల కొనుగోలుకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాపకు మాటలు రావాలంటే మిషన్లకు, హియరింగ్ థెరపీకి రూ.11 లక్షలు అవసరముండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కూతురు తపన.. తండ్రి ఆవేదన! కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లె గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్, కావ్యశ్రీ దంపతులకు 2016లో రిషిత జన్మించింది. ఆరోగ్యంగానే ఉన్న పాప ఏడాది వయస్సు వచ్చినా మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపకు పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్య ఉన్నట్లు గుర్తించారు. స్పీచ్ థెరపీతో మాటలు వస్తాయని చెప్పడంతో 2017లో తిరుపతిలోని శ్రవణం స్వీచ్ థెరపీ ఆస్పత్రిలో ఏడాది పాటు ఉండి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో 2018లో దాతల సాయంతో రూ.1.5 లక్షలతో వినికిడి యంత్రం కొనుగోలు చేసినా పాపకు ఉపయోగపడలేదు. మళ్లీ 2019లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేస్తే నయం అవుతుందని తెలిపారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర పథకం అడిప్ స్కీం కింద అవకాశం ఉండడంతో దరఖాస్తు చేసుకున్నారు. అడిప్ స్కీం కింద తల లోపల కాక్లర్ ఇంప్లాట్ మిషన్ వేశారు. ఆపరేషన్ చేయడం ఒక ఎత్తయితే, తర్వాత హియరింగ్ మిషన్ కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ఆపరేషన్ తర్వాత ప్రతీ రెండు నెలలకోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలి. ఈ క్రమంలో చెవిలో ఇన్ఫెక్షన్ సోకడంతో 2022లో మరోసారి ఆపరేషన్ చేయించారు. ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్గా పనిచేసుకునే రాజశేఖర్ తరచూ బిడ్డను ఆసుపత్రులకు తీసుకెళ్తున్న క్రమంలో ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఊళ్లో ఉన్న ఇల్లు అమ్మినా అప్పులు తీరలేదు. ప్రస్తుతం రేకుర్తిలో ఉంటున్నారు. రిషిత మాట్లాడాలంటే కుడి చెవికి రూ.7.5 లక్షల విలువైన న్యూక్లియర్–8 మిషన్, ఎడమ చెవికి రూ.1.5 లక్షల మరో మిషన్ అవసరముంది. వీటిని కొనుగోలు చేసినా ప్రతినెలా రూ.13 వేలు వెచ్చించి రెండేళ్లపాటు స్పీచ్ థెరపీ అందించాల్సి ఉంటుంది. సుమారు రూ.11 లక్షలు ఖర్చు చేస్తే తప్ప పాప మూగ గొంతుకు మాటలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు కోసం రోదిస్తున్నాడు. పాపపై కరుణతో హృదయమున్న దాతలు సహకరించాలని వేడుకుంటున్నాడు. రాజశేఖర్‌కు సహాయం చేయాలనుకునేవారు: అకౌంట్ నంబర్ : 20343433912 ఎస్బీఐ బ్యాంకు, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0014237, ఫోన్‌పే/గూగుల్‌పే నంబర్ : 77024 88503. ఇవి చదవండి: డూప్లెక్స్ ‘ఇందిరమ్మ’! -
దశాబ్ది ఉత్సవాలు: తెలుగు సినిమా, సీరియల్స్ డబ్బింగ్ కళాకారుల సందడి!
హైదరాబాద్: శ్రీ నగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా, సీరియల్స్‌కి సంబంధించిన డబ్బింగ్ కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. DAATT అధ్యక్షుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు మాట్లాడుతూ ఇన్ని గళాలతో కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, రోజంతా బిజీగా గడిపే మా జీవితాలకు అన్ని పండగలు కలిసి ఓకే రోజు చేసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సీనియర్ నటి రోజా రమణి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వినోద్ బాల, కాదంబరి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ బంటి , DAATT కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ వర్మ, టీవీ విఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ ఆవిష్కరణ -
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే.. : మంత్రి పొన్నం
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్) లో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే ఆడేదని, ఈ ఊరు నుంచి కబడ్డీ క్రీడాకారులు పోలీసులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు మడక కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్‌లు కేడం లింగమూర్తి, బత్తిని సాయిలు, ఎంపీటీసీ భొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ రథం అందజేస్తా.. లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్, కరీంనగర్ రెనే ఆస్పత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో ప్రముఖ ఛాతీ వైద్యులు, గుండె సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వసతి కోసం కలెక్టర్, ఆర్డీఓలతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్‌కు నా తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయిలేని అనిత, వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, లయన్స్ క్లబ్ నిర్వాహకులు రాజగోపాల్రావు, కాయిత నారాయణ రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ ఉద్యోగులు శాలువా కప్పి సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించి వేతన సవరణ 21 శాతం ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చదవండి: హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్ -
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..?
కరీంనగర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించా రు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడ్‌పల్లి గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను ఆదివారం పరిశీలించా రు. ఎస్సారెస్పీ పంప్‌హౌజ్ ద్వారా సాగునీరు వ స్తుందనే ఆశతో రెండు గ్రామాల రైతులు సుమారు 1800 ఎకరాల్లో వరి సాగుచేశారని, పొట్టదశలో సా గునీరు అందక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సుందిల్ల, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల నుంచి లక్ష ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి ఉన్నా.. ప్ర భుత్వం పట్టించుకోకుండా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అక్కసుతోనే రైతులకు నీరివ్వడం లేదని ఆరోపించారు. కోపముంటే బీఆర్ఎస్ నాయకులపై తీర్చుకోవాలేగానీ రైతులపై కాదన్నారు. ప దేళ్లలో ఎన్నడూ గుంట భూమి కూడా ఎండిపోలేద ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 1800 ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరవై ఏళ్లుగా తాను ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతంలో ఏ రోజూ ఇలాంటి పరి స్థితి రాలేదన్నారు. వేంనూర్ పంప్‌హౌజ్ నుంచి నందిమేడారం రిజర్వాయర్ ద్వారా రైతులకు నీరందించి పంటలను కాపాడామని గుర్తు చేశారు. వెంటనే వేంనూర్ పంపులను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ఆయన వెంట జె డ్పీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్, ఎంపీటీసీ మల్లేశం, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఊడేనా..?
శనివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2024ఆ పథకాలు ఉండేనా..● దళితబంధు, గొర్రెల పంపిణీ అమలుపై గందరగోళం ● స్పష్టత లేకపోవడంతో అర్జీదారుల అయోమయం ● కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలుకరీంనగర్: ‘గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు పథకాలపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ, బీసీ కులవృత్తులకు చేయూత, గృహలక్ష్మి పథకాలకు ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సదరు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్త్తుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళితబంధు పథకంలో లబ్ధిపొందిన కొంత మందికి పూర్తిస్థాయిలో డబ్బులు అందకపోవడంతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాగే గొర్రెల పంపిణీకి లబ్ధిదారు వాటా కింద డీడీలు చెల్లించిన వారు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని కోరుతున్నారు. గృహలక్ష్మి పథకంతో ఓ ఇంటివారమవుతామని కలలు కన్నవారి ఆశలు అడిశయాలయ్యాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి, బీసీ చేయూత పథకాలు కొనసాగుతాయో లేదోననే సందిగ్ధంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.’ ఎన్నికల ముందే రెండోవిడత.. జిల్లాలో ఎన్నికలకు ముందే రెండో విడత దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రతీ నియోజకవర్గంలో 1,100 మందికి అవకాశం ఇచ్చారు. ప్రాధాన్యం కింద నియోజకవర్గానికి 500మంది చొప్పున ఎంపిక చేశారు. కొంతమంది పేర్లను ఆన్లైన్లో కూడా నమోదు చేశారు. మొదట రూ.3లక్షలు అందిస్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో తర్వాత చర్యలు చేపట్టలేదు. కలెక్టరేట్‌కు వచ్చి దళితబంధు మంజూరు చేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితి ఎదురుకావడంతో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఈ పథకాలు కొనసాగే అవకాశం ఉంది. గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని 2015లో ప్రారంభించారు. మొదటి విడత కింద ఎంపిక చేసినవారికి గొర్రెలు పంపిణీ చేశారు. జిల్లాలో రెండో విడత కింద 10,236 యూనిట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 718 యూనిట్లను పంపిణీ చేశా రు. మిగతావారికి 2018–19 ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేయాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల చేయలేదు. మిగిలిన 9,518 యూనిట్ల పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో 2,686 మంది వాటాగా రూ.43,750 చెల్లించి గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నట్లు జిల్లా యాదవ కుర్మ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. డీడీలు కట్టిన వారు నిత్యం పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరిగివెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అధికారులు కూడా లబ్ధిదారులకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల యూ నిట్లపై సమీక్షిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.న్యూస్రీల్వెంటనే పంపిణీ చేయాలి రెండో విడత గొర్రెల పంపిణీ కోసం గత ప్రభుత్వంలో డీడీలు కట్టి వేచి చూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా గొర్రెల పంపిణీ మాత్రం చేయడం లేదు. లబ్ధిదారులు అందినచోటల్లా అప్పులు తెచ్చి మరీ డీడీలు కట్టారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల యూనిట్లను పంపిణీ చేసి ఆదుకోవాలి. – బండి మల్లయ్యయాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ పరిధిలోని అంశం దళితబంధు పథకం లబ్ధిదారుల అంశం ప్రభుత్వ పరధిలోని వ్యవహారం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతానికి స్టేటస్‌కోలో దళితబంధు పథకం ఉంది. లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న డబ్బు విడుదలపై ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం. – నాగార్జున, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
నిమిషం నిబంధన.. పరీక్షకు ఇద్దరు దూరం
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నిమి షం నిబంధన పలువురు విద్యార్థులకు శాపంగా మారుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రమంలో బస్సులు, ఆటోలు సమయానికి లేకపోవడంతో పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారుగూడకు చెందిన ఇద్దరు ప్రథ మ సంవత్సరం విద్యార్థులు మూడు నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఆదిత్య జూని యర్ కళాశాల కేంద్రంలో వీరు పరీక్ష రాయాల్సి ఉండగా అధికారులు అనుమతించలేదు. ప్రాదే య పడినప్పటికీ ససేమిరా అనడంతో గత్యంతరం లేక ఇంటిబాట పట్టారు. కాగా, గురువారం జైనథ్ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన విద్యార్థి శివకుమార్ సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేనని మ నస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. నిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఈ నిబంధన తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 651 మంది గైర్హాజరు.. ఇంటర్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రథ మ సంవత్సర పరీక్షకు 10,461 మంది హాజరు కా వాల్సి ఉండగా 9,810 మంది హాజరయ్యారు. 651 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌విద్యార్థులు 9,344 మందికి గాను 8,792 మంది హాజరయ్యారు. 552 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,117మందికి గాను 99 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రవీందర్‌కుమార్ తెలిపారు. -
యాదాద్రిలో ఘనంగా జరుగుతున్న అమ్మవారి పూజలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను కొలిచిన ఆచార్యులు.. ప్రధానాలయంలోని ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలలో శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటితో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు. అమ్మవారి సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు అంతకుముందు హోమం నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు గజివెల్లి రఘు, దొమ్మాట సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా ఊంజలి సేవ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు.