News
-
బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం! మంత్రి కొండా సురేఖ
వరంగల్: బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీగార్డెన్, రైల్వే గేట్ శాంతినగర్‌లోని రాజశ్రీగార్డెన్‌లో రెవెన్యూశాఖ, సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, విద్యార్థికి 4జీ మొబైల్, దివ్యాంగులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాల ప్రజల మొహా ల్లో చిరునవ్వులు చూడటమే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు ఇక్బాల్ అహ్మద్, బండి నాగేశ్వర్రావు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, కార్పొరేటర్లు, నేతలు కొత్తపెల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రులు, అప్రూవల్, మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ రిపోర్ట్‌పై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతృ, శిశుమరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణులు ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న వెంటనే వారికి నిరంతరం సేవలందించాలని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్‌రావు, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ నిర్మల పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆ రెండింటి డీఎన్ఏ ఒక్కటే -
'వెన్నెలమ్మ.. వచ్చిందమ్మా..' గుట్ట నుంచి గద్దెపైకి వరాల తల్లిరాక!
వరంగల్: కన్నెపల్లి నుంచి వెన్నెలమ్మ తరలిరాగా.. భక్తజనం పారవశ్యంలో ఓలలాడారు. శివసత్తుల పూనకాలు.. భక్తుల శిగాలతో కన్నెపల్లి ఆలయ ప్రాంగణం మారుమోగింది. జై..సారలమ్మ.. అంటూ భక్తులు గద్దెల వరకు తోడువచ్చారు. మేడారం శ్రీ సమ్మక్క– సారలమ్మ మహాజాతరలో ప్రథమ ఘట్టం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మకు దారిపొడవునా భక్తులు నీరాజనం పలికారు. గుడిలో సాయంత్రం 6 గంటలనుంచి సారలమ్మ తరలివచ్చే తంతు ప్రారంభమైంది. సుమారు గంటన్నరపాటు ఆలయంలో ఒకవైపు కాకవంశీయుల ఆటపాటలతో సందడిగా మారింది. ఇంటినుంచి పూజాసామగ్రితో ఆడపడుచులతో కలిసి ఆలయానికి చేరుకున్న ప్రధాన వడ్డె కాక సారయ్య ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. పూజారి హారతివ్వగా.. కొద్దిసేపటి తరువాత మరో పూజారి బూర ఊదారు. బుధవారం రాత్రి 7.40 గంటలకు ప్రధాన పూజారి కాక సారయ్య.. సారలమ్మను చేతిలో పట్టుకోగా.. హనుమాన్జెండాతో బయటకు తీసుకువచ్చారు. హనుమంతుడి నీడలో రావడం అమ్మవారి అభయంగా ఉంటుందని విశ్వాసం. అమ్మవారి గుడి ముందు పెళ్లికాని కన్నెపిల్లలు, యువకులు, అనారోగ్యం, సమస్యలతో బాధపడుతున్న భక్తులు వరం పట్టారు. నేలపై పడుకున్నవారి పైనుంచి సారలమ్మ వెళ్తే శుభం కలుగుతుందని విశ్వాసం. అక్కడినుంచి మేడారం బయలుదేరారు. కన్నెపల్లిలోని కాక వంశీయులు ఆడబిడ్డల ఇళ్లవద్దకు సారలమ్మ తరలివెళ్లగా వారు మంగళహారతులు ఇచ్చి నీళ్లు ఆరబోశారు. ఎర్రనీళ్లతో దిష్టితీసి కొబ్బరికాయలను కొట్టారు. తల్లివస్తుందని తెలుసుకున్న భక్తులు విడిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరి పసుపు, కుంకుమలను ఎదురుచల్లారు. నాలుగంచెల రోప్‌పార్టీని దాటుకొని వడ్డెలు, పూజారులను తాకాలనే అతృతతో ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వడ్డె సారయ్య.. జంపన్నవాగులో అమ్మవారి కాళ్లుకడిగి మేడారం చేరుకున్నారు. తల్లి సమ్మక్క గుడికి చేరి దర్శించుకోవడానికి ముందుగానే..అప్పటికే సమ్మక్క గుడి వద్దకు చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మ గద్దెలపై కొలువుదీరింది. అమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును వారి వారి గద్దెలపై పూజారులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. సారలమ్మను ప్రతిష్ఠించే సమయంలో గద్దెల దర్శనాలను గంటపాటు నిలిపివేశారు. ఈ క్రమంలో మూడుమార్లు విద్యుత్ లైట్లను నిలిపివేసి మళ్లీ ఆన్‌చేశారు. పోలీసుల భారీ బందోబస్తు.. కన్నెపల్లి నుంచి సారలమ్మను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గద్దెలపైకి తీసుకువచ్చారు. సారలమ్మ గద్దైపె కొలువుదీరడానికి ముందే పోలీసులు నాలుగు రోప్‌పార్టీలు ఏర్పాటు చేసి వాటి మధ్యలో కన్నెపల్లి ఆదివాసీ యువకులు పూజారులతో కలిసి తల్లిని గద్దైపెకి తీసుకొచ్చారు. రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ సారలమ్మను జంపన్నవాగు నీటిలో నుంచి తీసుకురావడం ఆనవాయితీ. ఉదయం ఎస్పీలు శబరీష్, గాష్‌ఆలం, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో జంగిల్ డ్రెస్‌తో కూడిన బలగాల మధ్య రోప్ పార్టీ సాగింది. దగ్గరుండి తరలించిన మంత్రి సారలమ్మను తీసుకురావడానికి రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కన్నెపల్లి గుడికి చేరుకున్నారు. అక్కడ పూజాక్రతువును స్వయంగా పరిశీలించి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సారలమ్మను తీసుకువచ్చారు. కిక్కిరిసిన జనం ఎటు చూసినా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మంగళవారం రాత్రి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం రాత్రివరకు మేడారం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయాయి. జంపన్నవాగు వద్ద ఇసుకేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు చేరడానికి కాలినడకన వస్తుండడంతో ఒక్క వాహనం కూడా ముందుకు కదలలేని పరిస్థిత నెలకొంది. రెడ్డిగూడెం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వనదేవతలను దర్శించుకునేందు కు గద్దెల ప్రాంగణంలో పెద్ద ఎత్తున బారులుదీరా రు. వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ నెలకొంది. మూడు కిలోమీటర్లకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లుల దర్శనం, జంపన్నవాగుకు దారి, ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లపై అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సమాచారాన్ని మైకుల్లో తెలుపుతూ తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. తాడ్వాయి: వరాల తల్లి సమ్మక్క నేడు(గురువారం) చిలకలగుట్ట పైనుంచి గద్దెకు చేరే ఘడియలు ఆసన్నమయ్యాయి. వనం నుంచి జనంలోకి సమ్మక్క రానుంది. ఈ సందర్భంగా వరాల తల్లికి స్వాగతం పలికేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మవారి రాకకు ముందుగా సమ్మక్క పూజారులు గుడిలో శక్తిపీఠాన్ని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి రహస్య క్రతువు చేపడతారు. అనంతరం గుడి నుంచి పూజా సామగ్రి తీసుకువచ్చి గద్దె అలికి కంకవనాలను కట్టి కుంకుమ, పసుపులతో అలంకరిస్తారు.. ఏకాంతంలో నిర్వహించే ఈ ప్రక్రియ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వరు. అలాగే మేడారంలోని ఆడపడుచులు, ఆదివాసీ కుటుంబాలు, పూజారులు, వడ్డెలు సైతం సమ్మక్క రాకకు ఆహ్వానంగా వారి ఇళ్లను ముగ్గులతో అలంకరిస్తారు. ఇదిలా ఉండగా.. పోలీసులు, రోప్‌పార్టీ సిబ్బంది చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రిహార్సల్స్ చేశారు. అమ్మవారు వచ్చే దారికి ఇరువైపులా బారికేడ్లు అమర్చిన పోలీసులు బుధవారం నుంచి బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి ఆగమనం కోసం కోటి మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ -
18 వేల అడుగుల ఎత్తులో.. మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో..
నిజామాబాద్: ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మహ్మద్ షాదుల్ ఎత్తైన మంచు పర్వతంపై తన స్వగ్రామం పేరును ప్రదర్శించి మమకారం చాటుకున్నారు. షాదుల్ రెండ్రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని లదాఖ్‌లో గల 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం అన్నాసాగర్ పేరుతో ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. గ్రామస్తులు షాదుల్‌ను అభినందించారు. ఇవి చదవండి: ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్! -
ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం!
బాపట్ల: సాధారణ ఎన్నికలు అత్యంత పారదర్శకతతో నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఫొటోలు డబల్ ఎంట్రీలు, మృతుల ఓట్లు తొలగింపులో నిర్లిప్తంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించలేదని వస్తున్న ఆరోపణలను సుమోటోగా స్వీకరించి విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులపై 2,08,740 దరఖాస్తులు అందినట్లు వివరించారు. వాటిలో 32,056 దరఖాస్తులను తిరస్కరించగా, 906 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, మిగిలినవన్నీ పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో ప్రతిరోజు 500 దరఖాస్తులు ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా సుమారుగా 500 దరఖాస్తులు నమోదు అవుతున్నాయని చెప్పారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అన్ని సూచనలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు ముందు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సవరణ చేసిన తుది జాబితా ప్రచురిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు వాటిని అందిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల చిరునామాల మార్పు అంశాన్ని నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ అనుమతుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకే పోలింగ్ కేంద్రంలో 1,500ల మందికి మించి ఓటర్లు ఉంటే అలాంటి ప్రాంతాల్లో ఓటర్ల సౌలభ్యం కొరకు రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ, కలెక్టరేట్ ఏఓ కృష్ణకాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ నాయకులు మాల్యాద్రి, షేక్ మహమ్మద్ గౌస్ బాషా, రామకృష్ణ, డి.రవి, జి.నాగరాజు, ఏ బాలాజీరెడ్డి, ఎన్.కోటేశ్వరరావు, పాల్గొన్నారు. -
క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేలా.. ‘ఆడుదాం ఆంధ్ర’
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కబడ్డీ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకటరెడ్డి) అన్నారు. బుధవారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి విశాఖపట్నంలో మంగళవారం రాత్రి ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారన్నారు. కబడ్డీలో రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను మరింత తీర్చిదిద్దాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కు బాధ్యత అప్పగించారన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్‌లో భాగంగా ప్రో కబడ్డీ క్యాంప్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమన్, బాలకృష్ణారెడ్డిలను, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కోచింగ్ క్యాంపునకు సంధ్య, సతీష్‌లను అప్పగించారన్నారు. దానికి కట్టుబడి వారిని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రో కబడ్డీ తరహా ఆంధ్ర కబడ్డీ లీగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్, వైజాగ్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పొన్నం ప్రకటనతో పరేషాన్..!
కరీంనగర్: ఇప్పటికే భూ ఆక్రమణల విచారణతో అతలాకుతమవుతున్న నగరపాలకసంస్థకు పులిమీద పుట్రలా స్మార్ట్‌సిటీ విచారణ వచ్చి పడనుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్మార్ట్‌సిటీ నిధులతో నగర రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరగడం తెలిసిందే. ఈ పనుల్లో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారంటూ గతంలోనే అనేక ఫిర్యాదులు వెల్లువెతాయి. తాజాగా స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో అధికారుల్లో గుబులు మొదలైంది. నగరపాలక అధికారుల్లో గుబులు.. స్మార్ట్‌సిటీ పనులపై విచారణ అంటేనే అధికారుల్లో వణుకుపుడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మార్ట్‌సిటీ పనుల్లో అక్రమాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తొలుత హౌసింగ్‌బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపినప్పటికీ, పూర్తిస్థాయిలో మాత్రం దృష్టి పెట్ట లేదు. కేవలం వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగానే విచారణ సాగినట్లు సమాచారం. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్మార్ట్‌సిటీ అక్రమాలపై విచారణ జరిపిస్తామని మరోసారి వెల్లడించడం హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తం పనులపై విచారణ జరిపితే, చాలా విషయాలు బయటకు రానున్నాయి. దీంతో సాంకేతికంగా బాధ్యులుగా తేలే చాన్స్ నగరపాలకసంస్థ అధికారులకే ఉండడంతో, ఈ విచారణ వారి మెడకు చుట్టుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే భూ ఆక్రమణలకు సంబంధించి నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగం అధికారుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తుండగా, మరో వైపు స్మార్ట్‌సిటీ పనులపైనా విచారణ జరిగితే కొంతమంది ఇంజినీరింగ్ అధికారుల అక్రమాల బాగోతం బయటపడనుంది. మరికొద్ది రోజుల్లో విచారణపై స్పష్టత రానుంది. రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి స్మార్ట్‌సిటీ జాబితాలో చోటులభించడంతో కరీంనగర్ నగరపాలకసంస్థకు నిధుల వరద వచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో రూ.వెయ్యి కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.740 కోట్లు విడుదల కాగా, ఇందులో రూ.539 కోట్లు చెల్లించారు. మరో రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, స్మార్ట్ వీధిదీపాలు, నిర్మాణం దాదాపు పూర్తయింది. కొన్ని కూడళ్ల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఇక కమాండ్ కంట్రోల్, లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలు, పార్క్‌లు తదితర అభివృద్ధి పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇష్టారీతిన అంచనాలు.. రూ.వందలకోట్లతో చేపట్టిన స్మార్ట్‌సిటీ పనుల్లో కొంతమంది నగరపాలకసంస్థ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా గతంలో బల్దియాలో అంతా తానై వ్యవహరించిన ఓ ఇంజినీరింగ్ అధికారి కనుసన్నల్లో చేసిన అంచనాలే తప్పినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలను ఇష్టారీతిన పెంచి, స్మార్ట్‌సిటీ నిధులను కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించినట్లు అభియోగాలున్నాయి. రూ.50 లక్షలతో పూర్తయే జంక్షన్ పనికి, రూ.కోటికి పైగా బిల్లు చేసిన వైనం నగరపాలకసంస్థ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణంలోనూ అంచనాలు, బిల్లులపై అనేక ఆరోపణలు వచ్చాయి. లెస్ క్వాలిటీ.. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తమ లాభాల కోసం అంచనాలు భారీగా పెంచినప్పటికీ, చేసిన పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో వాటి మనుగడ కష్టంగా మారింది. కలెక్టరేట్ రోడ్డు, హౌసింగ్‌బోర్డు కాలనీ, అంబేడ్కర్ స్టేడియం, టవర్‌సర్కిల్ తదితర ప్రాంతాల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. సీసీరోడ్డు కుంగిపోగా, డ్రైనేజీలు నిర్మాణంలోనే కూలిపోయాయి. ఫుట్పాత్లైతే చెప్పాల్సిన అవసరం లేదు. నగరంలో ఫుట్‌పాత్‌లపై వేసిన టైల్స్ 90 శాతం సక్రమంగా లేవు. టవర్‌సర్కిల్ వద్ద డ్రైనేజీల నుంచి ఫుట్‌పాత్‌ల మీదుగా వచ్చే వరదనీళ్లు ఫౌంటేన్ల మాదిరిగా మారాయి. కూడళ్లకు వినియోగించిన మెటీరియల్ కూడా నాసిరకం వాడారనే ఆరోపణలున్నాయి. ఎక్కడో ఒకటి అరా తప్ప దాదాపు అన్ని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే ఫిర్యాదులున్నాయి. ఇవి చదవండి: మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి -
అనుమతిస్తారా.. చావమంటారా?
కరీంనగర్: ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకుండా గ్రామ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఓ మహిళ గ్రామపంచాయతీ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మొలంగూరు గ్రామపంచాయతీ ఎదుట శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పూస శివకుమారి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదు నెలలుగా గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగింది. కార్యదర్శి అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. శుక్రవారం ఇంటికోసం అనుమతి ఇవ్వాలని కార్యదర్శితో వాదనకు దిగింది. ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడ ఉన్న కొందరు ఆమెను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది శివకుమారి నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయమై కార్యదర్శి మమతను వివరణ కోరగా శివకుమారి గురువారమే ఇంటిపత్రాలు అందించిందని తెలిపారు. అనుమతి ఇచ్చేందుకు 15రోజుల సమయం పడుతుందని చెప్పినప్పటికీ వినిపించుకోలేదని వివరించారు. ఇవి చదవండి: అంతా ఆయన చెబితేనే చేశా.. -
చర్చకు తేవాల్సిన అంశాలెన్నో..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా అంశాలు అసెంబ్లీలో చర్చకు రావాలని జిల్లావాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల ఔటర్ రింగు రోడ్డు పనులకు 2017 అక్టోబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూరల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్కు స్థలంలోనే శిలాఫలకం వేశారు. నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర పెండింగ్ పడింది. వరంగల్ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉండగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే. వరంగల్ నగరాభివృద్ధితో పాటు వరంగల్, వరంగల్ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల శివారు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మడికొండలో మూడు నక్షత్రాల హోటల్‌తో స హా, హైదరాబాద్‌లోని హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ సమావేశ, వాణిజ్య ప్రదర్శనల కేంద్రం (వైటెక్స్) నిర్మించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని పీపీపీ మోడ్‌లో నిర్మించి నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది. నిధులిస్తేనే ఇవన్నీ జరిగేది. జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు కొత్త జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పాలనపరంగా ఇంకా కుదుటపడేందుకు వసతులు కల్పించాలి. ఉమ్మడి వరంగల్‌లో పలు ప్రాజెక్టులు, పథకాలపై స్పష్టత ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరడం లేదు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 700 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది. మరో 200 నుంచి 400 ఎకరాల భూసేకరణ అవసరమని, గత ప్ర భుత్వం సేకరించి ఇస్తామన్నా సాధ్యం కాలేదు. ఇదివరకే మట్టి నమూనా పరీక్షలు కూడా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు రెండేళ్లుగా భూకేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు కాకతీయ పట్ట ణాభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి మూడేళ్ల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారైన నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటు, సౌకర్యాల కల్పనకు గత ప్రభుత్వం రూ.574 కోట్లను మంజూరు చేసి రూ.174 కోట్లు విడుదల చేసింది. ఆమేరకు పలు మౌలిక వసతులు కల్పించగా.. మరో రూ.400 కోట్లు రావాల్సి ఉంది. పార్కులో కొన్ని ప్రాంతాల్లో రహదారులను నిర్మించి, విద్యుత్ సరఫరా కోసం ఉపకేంద్రాన్ని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా 12 ఎంఎల్డీ సామర్థ్యం గల వ్యవస్థను ఇంకా నిర్మించుకోవాల్సి ఉంది. మొత్తం 1200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నిధులు, అన్ని రకాల వసతులు తీర్చుదిద్దుకుంటే మరికొన్ని వస్త్ర పరిశ్రమలు వచ్చే వీలుంది. భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తి చేయాలి. ములుగు జిల్లాలో ములు గు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పా టు, గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలంటే పెద్దమొత్తంలో బడ్జెట్లో నిధులు రాబట్టాలి. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
గ్రామపాలనపై.. ప్రత్యేకాధికారులకు సవాల్!
ఖమ్మం: ఓ మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ) ఇప్పటికే మండలంలోని 18 గ్రామపంచాయతీలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈనెల 2 నుంచి ప్రత్యేక పాలనను తీసుకొచ్చింది. దీంతో సదరు అధికారికి మూడు పంచాయతీల బాధ్యతలు కేటాయించారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా పర్యవేక్షిస్తున్న ఆయన మళ్లీ మూడు పంచాయతీల బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇలా ప్రత్యేక అధికారులుగా నియమితులైన ప్రతీ అధికారికి రెండు చోట్ల బాధ్యతలు నిర్వర్తించడం సవాల్‌గానే మారిందని చెబుతున్నారు. రెండు నుంచి మూడు జీపీలు.. గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఇటీవల ముగియగా.. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాలోని 1,070 గ్రామపంచాయతీలకు గాను మొత్తంగా 396 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషలాఫీసర్లుగా బాధ్యతలు కేటాయించారు. భద్రాద్రి జిల్లాలో 481 గ్రామపంచాయతీలకు 218 మంది, ఖమ్మం జిల్లాలో 589 గ్రామాలకు 178 మంది అధికారులను నియమించారు. వీరిలో ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగు పంచాయతీల చొప్పున బాధ్యతలను అప్పగించారు. అయితే, ఈ అధికారులందరూ వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలకమైన అధికారులే. దీంతో అటు మాతృశాఖ, ఇటు పంచాయతీల విధులు నిర్వర్తిస్తూ సమన్యాయం చేయాల్సి ఉంటుంది. కానీ శాఖాపరమైన పనులతో ఒత్తిడి ఎదుర్కొంటున్న వీరికి పంచాయతీల అదనపు బాధ్యతలు అప్పగించడంపై ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పల్లె పాలనతో సంబంధం లేని శాఖలు! ప్రభుత్వం గతంలో మాదిరి పంచాయతీరాజ్‌శాఖ నుంచే కాకుండా ఇతర శాఖల అధికారులను సైతం గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులుగా నియమించింది. గ్రామపాలనకు సంబంధం లేని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ, జలవనరుల శాఖ, మున్సిపల్, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, ఉద్యానవన, పశుసంవర్థక, విద్యాశాఖ తదితర శాఖల అధికారులు ఇందులో ఉన్నారు. అనుభవం లేని అధికారులు ఈ బాధ్యతలను నిర్వహించాలంటే కొంత సవాలేనని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేశాక పంచాయతీల బాధ్యతలు మరింతగా పెరిగాయి. దీని ప్రకారం ప్రజలకు మెరుగైన పాలన అందాలంటే క్రమం తప్పకుండా గ్రామపంచాయతీని సందర్శించి రోజువారీ పనులను పర్యవేక్షించాలి. అలాంటప్పుడు మాతృశాఖలో విధులు నిర్వర్తించడం ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈనేపథ్యాన మంగళవారం భద్రాద్రి, ఖమ్మం కలెక్టరేట్లలో పల్లె పాలన, బాధ్యతలపై స్పెషలాఫీసర్లకు శిక్షణ నిర్వహించి కొంత మేర అవగాహన కల్పించారు. అనేక బాధ్యతలు.. జీపీల ప్రత్యేకాధికారులు రెండు నెలలకోసారి గ్రామసభలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రధానంగా పల్లెల్లో పచ్చదనాన్ని పెంచడానికి నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటించి సంరక్షించటం, ఉపాధి పనులు, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలి. అలాగే, గ్రామాల్లో సీజనల్ వ్యాధుల కట్టడి, సిబ్బందికి జీతభత్యాలు, పన్నుల వసూళ్లు, విష జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వంటివి కీలకంగా ఉంటాయి. పలు ఇతర శాఖల్లో పనిచేస్తూ ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ మేరకు విజయవంతం అవుతారో తేలాలంటే కొన్నిరోజులు వేచిచూడాల్సిందే. ఇవి కూడా చదవండి: చర్చకు తేవాల్సిన అంశాలెన్నో.. -
మూడేళ్లుగా ముందుకుసాగని పథకం.. విత్తనోత్పత్తికి అంతరాయం!
రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) అందించి నాణ్యమైన విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇక లేకుండా పోయింది. మూడేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వానాకాలానికి సంబంధించి 5.80లక్షలు ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు ఉంటాయి. యాసంగికి సంబంధించిన వివిధ రకాల పంటలు 3.5లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. సిద్దిపేట జిల్లాను విత్తన హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ప్రతిసారి ఏదో పంటను ఎంచుకొని ఈ పథకం అమలు చేసేవారు. ఏటా జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలానికి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, యాసంగిలో శనగ పంటల్లో విత్తనోత్పత్తి చేసేవారు. దీని ద్వారా రైతులకు 50శాతం సబ్సిడీపై మూల విత్తనం అందిస్తారు. పరిశోధనా స్థానాల నుంచి నేరుగా వచ్చే వీటి వల్ల విత్తనోత్పత్తికి అవకాశముంటుంది. విత్తనాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ విత్తనం వేసింది మొదలు.. పంట చేతికొచ్చేసరికి మూడుసార్లు శిక్షణ అందించి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి బాటలు వేసేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవడం, లేదా ప్రభుత్వమే విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి మార్కెటింగ్ చేసేవారు. కొంత కాలం ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. క్రమేపి ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాక మొగ్గుబడిగా సాగింది. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యాత ప్రమాణాలు కలిగి ఉన్నాయా? లేదా అనే విషయం తెలియక కొనుగోలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు ఆసక్తి చూపలేదు. కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే విషయంలో వ్యవసాయ శాఖ చొరవ చూపలేదు. మరీ మూడేళ్ల నుంచి అయితే పథకం ఊసే కరువైంది. ఫలితంగా ఆసక్తి ఉన్న రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను కూడా అందలేదు. దీనిని బట్టి చూస్తే ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆశలు.. కొత్త ప్రభుత్వం చొరవ చూపితేనే ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశముంది. ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తన సబ్సిడీతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను సబ్సిడీపై అందించాల్సి ఉంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా రైతులకు ఒప్పందం కుదిరిస్తే.. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించి భారీ ప్రయోజనం జరిగే అవకాశముంది. ఇవేకాకుండా ఆత్మకమిటీల పనితీరు మెరుగుపరచడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకాలను సైతం పునరుద్ధరించాల్సి ఉంది. ఇవి చదవండి: కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం! -
దరఖాస్తులపై ఫిబ్రవరిలో ఇంటింటా సర్వే
కరీంనగర్: ప్రజాపాలనలో వేటికెన్ని అర్జీలొచ్చాయో లెక్క తేలింది. జిల్లాలో ఆన్లైన్ ప్రక్రియ ఇటీవలే ముగియగా మహాలక్ష్మి పథకానికి అత్యధిక అర్జీలు వచ్చాయని స్పష్టమవుతోంది. గత నెల 28 నుంచి ఈ నెల 6వరకు గ్రామాల్లో, పట్టణాల్లో రోజూవారీగా అర్జీలు స్వీకరించగా వెల్లువలా దరఖాస్తులు వచ్చిన సంగతి విదితమే. సదరు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ పూర్తవగా ఇక క్షేత్రస్థాయి పరిశీలన మిగిలింది. తస్మాత్ జాగ్రత్త లక్షల మంది అర్జీలు ఇచ్చిన క్రమంలో ఆరు గ్యారంటీల సాకుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతున్నట్లు సమాచారముందని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచితులు పంపించే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని, ఓటీపీలను చెప్పవద్దని చెబుతు మోసానికి గురైతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. ఫిబ్రవరిలో క్షేత్రస్థాయి పరిశీలన అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తవగా ఫిబ్రవరిలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనుంది. అనర్హులను ఏరివేసి అర్హులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకమవటంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇందులో సభ్యులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందించటమే లక్ష్యంగా సబ్ కమిటీ పనిచేయనుంది. సదరు కమిటీ గైడ్‌లైన్స్ ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో గ్రామాలు: 313, మున్సిపాలిటీలు: 5, వచ్చిన అర్జీలు: 3,22,264 (రేషన్ కార్డులకు కలిపి), గ్యారంటీలకు వచ్చిన అర్జీలు: 3,21,246, మొత్తంగా కవరైన నివాసాలు: 3,12,186 ఆన్‌లైన్‌తో తేలిన లెక్క ఇదీ.. రూ.2500కు వచ్చిన అర్జీలు: 2,26,401 రూ.500కు గ్యాస్‌కు: 2,77,292 ఇందిరమ్మ ఇండ్లకు: 2,17,180 గృహజ్యోతికి: 2,35,091 రైతు భరోసాకు: 1,02,172 రైతు కూలీలకు: 1,11,187 -
ఐదేళ్లకే అబ్బురపరుస్తున్న హిమాన్షు! కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో..
ఆదిలాబాద్: భైంసా పట్టణానికి చెందిన జిలకరి హిమాన్షు ఐదేళ్ల వయసుకే అబ్బురపరుస్తున్నాడు. వయసుకు మించి ప్రతిభతో రాణిస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు. భైంసా పట్టణానికి చెందిన జిలకరి రాజేశ్వర్–రజిత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా వీరికి ఇద్దరు సంతానం. పెద్దవాడైన హిమాన్షు ప్రస్తుతం గుజిరిగల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, సెకండ్ల వ్యవధిలో అన్ని రాష్ట్రాలు–రాజధానుల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాక తోటి పిల్లలు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అని నేర్చుకుంటుంటే తను మాత్రం ఆంగ్ల అక్షరాలతో పురాణ పురుషుల పేర్లు కంఠస్తంగా చెబుతుండడంతో ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏ ఫర్ అర్జున, బి ఫర్ బలరామ అంటూ జెడ్ ఫర్ జాంబవంత వరకు పురాణ పురుషుల పేర్లు పొల్లు పోకుండా చెబుతున్నాడు. తల్లిదండ్రులు సైతం తమ కుమారుడి ప్రతిభ చూసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఇవి చదవండి: వసుధైక కుటుంబం.. ఐదు తరాల అనుబంధం -
Sakshi Whatsapp Channel: ఫాలో సాక్షి @ వాట్సాప్
వాట్సాప్ వాడుతున్నారు కదా.. ఓ అడుగు ముందుకేయండి. ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే మీకు నచ్చిన కంటెంట్‌ను, మీకు అనుకూలమైన సమయంలో, మీకు నచ్చినట్టుగా చూడొచ్చన్నమాట. దీనికోసం మీరు లోతుగా సెర్చ్ చేయాల్సిన పనే లేదు. మీ ఛాయిస్ .. వాట్సాప్ ఛానల్ వాట్సాప్ అంటే మెసెజ్‌లు, ఫోటోలు, వీడియోలే కాదు. గ్రూప్‌లు వచ్చినా.. చాలా లిమిటేషన్స్. కొత్తగా వచ్చిన ఫీచరే వాట్సాప్ ఛానెల్. దీని ద్వారా మీకు నచ్చిన మీడియాను ఎంచుకుని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాలో ఎలాగైతే ఎంపిక చేసుకుంటున్నామో.. అలాగే ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ కనిపించవు. సాక్షి వాట్సాప్ ఛానల్ ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం, సమకాలీన రాజకీయాలు, విశ్లేషణలు, పిక్టోగ్రాఫ్స్ వివరణలు, లేటేస్ట్ అప్డేట్స్ ఒకటేంటీ.. కావాల్సిన ముఖ్యమైన సమాచారన్నంతా.. వేగంగా మీ ముందుంచుతోంది సాక్షి. తెలుగు ప్రజలు కోరుకునే న్యూస్‌ను అత్యుత్తమ స్థాయిలో ఎంపిక చేసి సాక్షి వాట్సాప్ ఛానల్ మీకందిస్తోంది. ఫాలో అవ్వండిలా.. వాట్సప్‌లో మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి... Chats, Updates, Calls. వీటిలో Updates క్లిక్ చేయండి. స్టేటస్లు దాని దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. మీకు Find Channel ఫైండ్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్ చేస్తే Sakshi Telugu News మీకు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ప్లస్ (+) సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానెల్‌ను ఫాలో కావొచ్చు. లేదా కింద కనిపిస్తోన్న QR కోడ్ స్కాన్ చేస్తే నేరుగా చేరొచ్చు. ప్రయోజనాలేంటీ? ఒక సారి ఫాలో అయితే అప్డేట్స్ వాటంతటే అవి కనిపిస్తాయి నోటిఫికేషన్స్ తరహాలో మిమ్మల్ని ఎక్కడా చికాకు పెట్టవు మీకు నచ్చిన సమయంలోనే లింకు క్లిక్ చేసి చూడొచ్చు లేటేస్ట్ అప్డేట్స్ క్షణాల్లో అందుకోవచ్చు వార్తలపై ఎమోజీ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు మీ వ్యక్తిగత సమాచారం ఎవరికీ కనిపించదు మీ ఫోటో, నెంబర్ కూడా కనిపించవు -
సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్'
నిర్మల్: సంక్రాంతి అంటే రంగవల్లులకు పేరు. అయితే ఆ సంక్రాంతి ముగ్గులో విభిన్నతను ప్రదర్శించాలనుకున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన చిత్రకారుడు అడ్డిగ శ్రావణ్ కుమార్.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత వయసు ప్రమేయం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు బానిసగా మారుతున్నారు. అధికసమయాన్ని వీటికే వెచ్చిస్తున్నారు. ఇదే అంశాన్ని స్థానిక మంజులాపూర్ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్ తన ఇంటిముందు స్వయంగా వేసిన ముగ్గులో సందేశం రూపంలో అందించాడు. రోడ్డుపై వచ్చిపోయే వారు సందర్శించేలా ‘‘డోంట్ బి అడిక్టెడ్’’ అంటూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గులో పలు సామాజిక మాధ్యమాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాడు. ఫేస్బుక్, ఇంస్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, జిమెయిల్, గూగుల్ క్రోమ్ వంటి పలు ఇంటర్నెట్ సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ వాటికే అడిక్ట్ అవుతున్న తీరును ఇలా సృజనాత్మకంగా ప్రదర్శించడం పలువురిని ఆలోచింపజేస్తోంది. చాలామంది విభిన్నరీతిలో ఇచ్చిన సందేశాన్ని ప్రశంసిస్తున్నారు. ఇవి కూడా చదవండి: సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ? -
కస్టం మిల్లింగ్ కహానీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా నుంచి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్‌ను మిల్లర్లు ఇప్పటివరకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. జిల్లాలోని మొత్తం 62 పారాబాయిల్డ్, 218 ముడిరైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యానికి సంబంధించి కస్టం మి ల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 వానాకాలం సీజన్లో జిల్లాలోని మిల్లర్లకు 6,03,872 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధాన్యానికి గాను మిల్లర్లు 4,09,535 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే 3,87,529 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 22,005 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన సీఎంఆర్ పెండింగ్ ఉంది. ► 2022–23 యాసంగి సీజన్ విషయానికి వస్తే 6,35,190 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 4,32,264 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1,22,980 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. ఇంకా 3,09,284 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ ఇవ్వాల్సింది పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఇష్టం మిల్లర్లు కొందరు ఇష్టం వచ్చినట్లు మొండికేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,31,289 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్ర భుత్వం ఈ నెలాఖరులోగా మొత్తం సీఎంఆర్ ఇవ్వాలని గడువు పొడిగించింది. అయితే మిల్ల ర్లు మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధాన్యం మాఫియా.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన భారీ అక్రమం ఇటీవల బయటకొచ్చింది. బోధన్‌లోని మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే నాలుగు రైస్‌మిల్లులకు 2021–22 యాసంగి, 2022–23 వా నాకాలం సీజన్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్) కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. మిల్లింగ్ చేసి మిగిలిన సీఎంఆర్ బియ్యం ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పాడు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్(ఎడపల్లి), ఆర్‌కామ్ ఇండస్ట్రీస్(వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్(వర్ని), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఇందులో ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, ఆర్‌కామ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఎఆర్) మాత్రమే పౌరసరఫరాల శాఖకు ఇచ్చారు. ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26వేల మెట్రిక్ ట న్నుల సీఎంఆర్ బి య్యాన్ని ఇవ్వాలని పౌ రసరఫరాల శాఖ అధికారులు అడుగగా, షకీల్ మిల్లుల నుంచి తమకు బియ్యం రాలేదని చెబుతుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చినట్లు నలుగురు మిల్లర్లు చెబుతుండడం విశేషం. ఈ విషయమై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రైస్‌మిల్లుల్లో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలు, అవినీతి అక్రమాలు బహిర్గతం చేయడానికి ఏకకాలంలో కేంద్ర విజిలెన్స్ విచారణ చేప ట్టాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీఎంఆర్ ఇవ్వకపోతే కఠిన చర్యలు ప్రభుత్వానికి తిరిగివ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్‌ను మిల్లర్లు తక్షణమే ఇవ్వకపోతే కఠినచర్యలు తీసుకుంటాం. కొందరు మిల్లర్ల వైఖరి కారణంగా ప్రభుత్వానికి, రైతుల కు, ఇతర మిల్లర్లకు చెడ్డపేరు వస్తోంది. కొందరు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా బయట ప్రాంతాల్లో అమ్ముకున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయి. – సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే -
ఈ ఏడాది ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఆశలు..
ఖమ్మం: ఈ ఏడాది ఖరీఫ్‌లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు అకాల వర్షాలు, తుపాన్‌తో రైతులు పంటలను నష్టపోయారు. ఇక రబీలో ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు లేక పంటలు లక్ష్యం మేర సాగయ్యే పరిస్థితి కనిపించక అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. అలాగే, ఉద్యోగ, ఉపాధి కోసం నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ఇటీవల ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యాన త్వరలోనే తమకు ఫలాలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారు. సూర్యుడు మకరంలోకి చేరుతూ వెలుగులను విరజిమ్మే కాలం నుంచి తమ జీవితాల్లోనూ వెలుగులు ప్రసరించాలని అంతా కోరుకుంటున్నారు. కష్టనష్టాలు, ఒడిదుడుకుల మధ్య సాగిన బతుకులు ఈ పండుగ నుంచి మారాలని కోటి ఆశలతో ఆకాంక్షిస్తున్నారు. ఇవి చదవండి: కస్టం మిల్లింగ్ కహానీ.. -
కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ!
మల్కాజ్గిరి: గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ కుషాయిగూడలో జరిగింది. కాటమయ్య ఆలయ సన్నిధిలోని మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు గౌడ న్యాయవాదులు హాజరయ్యారు. స్వామి వివేకానందుడి పిలుపునిచ్చిన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యత, గౌడ కుల అభివృద్ధి, యువజన ప్రగతి గురించి కూలంకుషంగా చర్చించారు. న్యాయవాదులే నడుం కట్టాలి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించినట్టే.. బీసీల ఐక్యత, రాజ్యాధికారం కోసం కూడా గౌడ లాయర్లు ముందుకు రావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. పలువురు గౌడ న్యాయవాదులు హాజరయిన ఈ సమావేశంలో.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో మెజార్టీలు బీసీలేనని, అయినా వారికి ఎలాంటి పదవులు రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల బీసీ నాయకులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొందరు బీసీ నేతలు చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కుట్రల వల్ల ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాపరంగా భారీగా ఉన్న బీసీలు ఏకీకృతం కావాలని, గౌడ ప్రజలు ఎక్కువ ఉన్న చోట నాయకత్వం పెరగాలని పిలుపునిచ్చారు. చారిత్రక ఆధారాలతో క్యాలండర్ గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని గౌడ జాతీయ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ ప్రత్యేకంగా రూపొందించిన కౌండిన్య క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పురాణాల్లో కౌండిన్య ప్రస్తావన, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట, నాయకత్వ పటిమ, ప్రస్తుత పరిస్థితులను క్యాలెండర్లో వివరించారు. ఈ సమ్మేళన కార్యక్రమాన్ని గులారి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించగా.. అతిథులుగా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, మల్కాజిగిరి బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, రవికాంత్ గౌడ్, అజయ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు గులారి మల్లేశం గౌడ్, దేవరాజ్ గౌడ్ కార్యక్రమ నిర్వహణ సభ్యులు నవీన్ గౌడ్, గిరిధర్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివ గౌడు, ఇంకా సీనియర్ న్యాయవాదులు అరుణ్ గౌడ్, నరేష్ బాబు గౌడ్, సుధీర్ బాబు గౌడ్, గౌడ హాస్టల్ మెంబర్ పాండాల శివ గౌడ్, కెనరా బాంక్ సీనియర్ లీగల్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రఘుపతి గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా -
ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55)మంగళవారం కోల్‌కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు. 2019 నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఆయన బాధపడుతు న్నారు. గత నెలలో గుండెపోటుకు గురైన ఖాన్ అప్పటి నుంచి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఖాన్ మంగళవారం మధ్యాహ్నం 3.45కు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాంపూర్–సహస్వాన్ ఘరానా సంప్రదాయానికి చెందిన ఖాన్ ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ ముని మనవడు. యూపీలోని బదౌన్‌కు చెందిన ఖాన్ కుటుంబం ఆయనకు పదేళ్ల వయస్సులో 1980లో కోల్‌కతాకు వలస వచ్చింది. సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి ఖాన్ కుటుంబసభ్యులను ఓదార్చారు. రషీద్ ఖాన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఇలా ఉండగా, ఖాన్ 11 ఏళ్ల వయస్సులోనే 1994లో మొట్టమొదటి కచేరీలో పాల్గొని, సంగీత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాంపూర్ సహస్వాన్ సంప్రదాయ గానా నికి చిట్ట చివరి దిగ్గజంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ‘విలంబిత్ ఖయాల్’ శైలిలో మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను ఆయన గాత్రం అలరిస్తోంది. మై నేమ్ ఈజ్ ఖాన్, జబ్ వుయ్ మెట్, ఇసాక్, మంటో, మౌసమ్ తదితర చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా ఉన్నారు. ఆయన్ను కేంద్రం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో గౌరవించింది. -
ఆ ఊళ్లో కిడ్నీలు ఫెయిల్! భయాందోళనలో గ్రామస్తులు..
ఆదిలాబాద్: భీంపూర్ మండలంలోని గుబిడిపల్లిని కిడ్నీ సంబంధిత వ్యాధి వేధిస్తోంది. రెండేళ్ల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందగా పలువురు వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు, 300కు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. గ్రామస్తులంతా వ్యవసాయంతో పాటు కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాము తాగుతున్న నీటివల్లనా? లేక ఆహారపు అలవాట్లా? ఇతర కారణాల చేత కిడ్నీ వ్యాధులు సోకుతున్నాయో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులంతా గ్రామ సమీపంలోని బోరుబావి నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు నీటికి క్లోరైడ్ పరీక్షలు నిర్వహించగా సాధారణంగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది గ్రామానికి సమీపంలో ఉన్న కప్పర్ల, జామిడి నుంచి మినరల్ వాటర్‌ను సైతం ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఆరుగురు మృతి రెండేళ్ల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఆరుగురు కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన తొడస ం దాదారావు, గంగమ్మ, రామన్న, డి.ఇస్తారి, దేవ మ్మ, లలితకు కిడ్నీ సంబంధిత వ్యాధి సోకి మృతి చెందగా పలువురు వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలోని ఆశమ్మ, భూమన్న నిత్యం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. గ్రామానికి సరైన రోడ్డు, వాహన సౌకర్యం లేకపోవడంతో ప్రత్యేకంగా ఆటో కు రూ.500 చెల్లించి ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వైద్యశాఖ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వైద్యశాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించి వ్యాధికి గల కారణాలు తెలియజేస్తే వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంది. ఈ చిత్రంలో తన పిల్లలతో కనిపిస్తున్న మహిళ పేరు పెంటపర్తి సంగీత. వీరిది భీంపూర్ మండలంలోని గుబిడిపల్లి. ఈమె భర్త సంతోష్ పదేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎలాంటి పనులు చేయలేకపోవడంతో అన్నీతానై కుటుంబానికి అండగా నిలిచింది. ఈక్రమంలో డయాలసిస్ సైతం అవసరం ఉండటంతో రెండు రోజులకోసారి ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో సంతోష్ పదిహేను రోజుల క్రితం మృతి చెందాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో పిల్లలను ఎలా పెంచేదని సంగీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామాన్ని సందర్శిస్తాం గుబిడిపల్లిలో కిడ్నీ సంబంధిత వ్యాధి అధికంగా వస్తుందని ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. కిడ్నీ వ్యాధి సోకడానికి గల కారణాలు తెలుసుకునేందుకు గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తాం. గ్రామస్తుల ఆహారపు అలవాట్లతో పాటు తాగే నీటిని పరీక్ష చేస్తే కిడ్నీ వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. – నిఖిల్ రాజ్, వైద్యాధికారి, భీంపూర్ -
సమ్మక్క– సారలమ్మకు జాతరకు వెళ్తూ కోడిపుంజు ఇలా..
ప్రస్తుతం సమ్మక్క– సారలమ్మ జాతర సీజన్ సందర్భంగా వరంగల్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులు కూడా కిక్కిరిసి పోతున్నాయి. వరంగల్ నుంచి వేములవాడ వెళ్లిన ఓ బస్సు అక్కడ ప్రయాణికులను దింపి కరీంనగర్ బస్టాండుకు వచ్చింది. అందులో ఓ కోడిపుంజును డ్రైవర్ గుర్తించాడు. బస్సులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోగా.. ఒక సంచిలో ఈ కోడి పుంజు కనిపించింది. దీంతో తప్పిపోయిన ఆ కోడిని డ్రైవర్ కంట్రోలర్‌కు అప్పగించాడు. ఆయన ఇలా ఓ జాలీలో బంధించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారిస్తారా
గత ఏడాదిలో పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థి సంఘాల ఆందోళన చేయగా వీసీ.. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కొట్టించారన్న ఆరోపణలతో దీక్షలు కొనసాగించారు. అప్పటి ప్రతిపక్ష నేతలు పరామర్శించి మద్దతు పలికారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా దీక్ష శిబిరం సందర్శించి విద్యార్థులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఽఽధికారంలోకి వచ్చాక వీసీ రమేశ్‌పై విచారణ కమిటీని వేయిస్తానని, పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించడం దారుణమని వీసీ, రిజిస్ట్రార్లపై మండిపడ్డారు. తాజాగా పలువురు సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారు. యూనివర్సిటీ పరిస్థితిపై ఆయన ఆరా తీస్తారా.. లేదా అన్నది వేచి చూడాలి. -
పెట్రోల్ బంకుల్లో ఈ సేవలుండాల్సిందే..! లేదంటే..
కరీంనగర్: 'కరీంనగర్‌కు చెందిన శ్రీధర్ కమాన్‌కు సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్ పోసుకుని, బైక్ టైర్లో గాలి నింపాలని అక్కడి సిబ్బందిని కోరగా.. ఇక్కడ అలాంటివేమీ ఉండవని, గాలి పంపు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. చాలాబంకుల్లో గాలి నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో ఉన్నాయి. గాలే కాదు.. చాలా బంకుల్లో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కానరావడం లేదు.' పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలకు అనుచితంగా వ్యవహరిస్తున్నారా అయితే ఇది మీ కోసమే. బంకుల్లో టైర్లలో గాలి, తాగునీరు, మూత్రశాలలు, ఫోన్ సౌకర్యం తదితర సేవలు ఉచితం. వీటిపై అవగాహన లేకపోవడంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే అదనపు వ్యయం భారంగా మారుతోంది. చిల్లరే కదా అనుకుంటే నెలకు రూ.కోట్లలోనే సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. మనం చెల్లించే డబ్బులే.. డీజిల్ అయినా పెట్రోలైనా లీటరుపై మనం పెట్రోలు బంక్‌కు 4 నుంచి 6 పైసలు కేవలం మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కోసం చెల్లిస్తున్నాం. ప్రతీ బంకులో టాయిలెట్, మంచినీరు, ఎయిర్ ఫ్రీగా అందించాలి. ఇలా అందిస్తేనే పెట్రోల్ బంకు నిర్వహణకు అనుమతి దొరుకుతుంది. చాలామంది ప్రయాణంలో ఉన్నవారు టాయిలెట్ అర్జంట్ అయినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ కోసమో.. నిర్మానుష్య ప్రదేశాల కోసమో వెతుకుతారు. కానీ పెట్రోల్ బంకుకు వెళ్లరు. ఇక మీద ఎమర్జెన్సీ టైంలో దర్జాగా బంక్‌లకు వెళ్లండి. అది మన హక్కు. సగటున ఒక బంకులో రోజుకు 10 వేల లీటర్ల చమురు అమ్మితే.. టాయిలెట్ మెయింటనెన్స్ కాస్ట్ కింద ఆ బంకుకు వచ్చే ఆదాయం రోజుకు రూ.600 అంటే నెలకు రూ.18వేలు. జిల్లాలో ఉన్న అన్ని బంకుల్లో కలిపి వాహనదారులు రోజువారీగా చెల్లిస్తున్న మొత్తం రూ.14లక్షలకు పైనే. ఈ డబ్బుతో టాయిలెట్, మంచినీరు అందించాల్సిన బాధ్యత ఆయా బంక్‌లదే. పెట్రోల్ పంపుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందుకోసం ఆర్వోయంత్రం, వాటర్ కూలర్, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాలి. ఏ బంకుల్లోనైనా తాగునీటి వసతి లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛభారత్‌లో భాగంగా అన్ని పెట్రోలు, డీజిల్ బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో చరవాణి వినియోగించుకునే సదుపాయం పంపుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ద మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పనిలేదు. ఏదైనా పెట్రోలు పంపును సందర్శించడం ద్వారా మీరు ఏ నంబర్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. వాహన టైర్లలో గాలి నింపడానికి, గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు ఓ వ్యక్తిని అందుబాటులో ఉంచాలి. ఈ సౌకర్యం పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఇటీవల గాలికి ప్రత్యామ్నాయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ప్రతి బంకులో ఫిర్యాదు పెటె్ట్ లేదా రిజిష్టరు అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయొ చ్చు. ప్రఽథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతీ బంకు వద్ద ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. చమురు నాణ్యత, ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోలు, డీజిల్ నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునేందుకు ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. వాటి ద్వారా నాణ్యతను పరీక్షించుకునే హక్కు మనకు ఉంటుంది. పెట్రోలు బంకుల్లో సంస్థ పేరు, యజమాని పేరు, సంప్రదింపుల నంబర్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. పంపు యజమాని వాటిని ప్రజలకు కనిపించే విధంగా బంకుల ఎదుట ఏర్పాటు చేయాలి. పెట్రోలు బంకుల్లో బంకులు తెరిచే, మూసివేసే వేళలు తప్పనిసరిగా రాసి ఉంచాలి. పెట్రోలు, డీజిల్ తీసుకున్న తరువాత వినియోగదారులు వాటికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా పొందాలి. ఇలా ఫిర్యాదు చేయండి పెట్రోలు బంకుల్లో వినియోగదారులకు అందించాల్సిన సౌకర్యాలను నిర్వాహకులు విస్మరిస్తే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్‌ను సంప్రదించడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. బంకులో కచ్చితంగా ఉండాల్సిన ఫిర్యాదు రిజిష్టరులో లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. లేదంటే సంబంధిత చమురు సంస్థ సేల్స్ మేనేజర్ పేరు, చరవాణి నంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ అందుబాటులో లేనట్లైతే సంబంధిత తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు. -
ని‘వేదనలు..’ ప్రజావాణికి వినతుల వెల్లువ*
ఆదిలాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి ఈ వారం వినతులు వెల్లువెత్తాయి. తమ ఆవేదనను ఉన్నతాధికారులకు నివేదించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు శ్యామాలాదేవి, ఖుష్బూగుప్తాతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీ లను సంబంధిత శాఖ అధికారులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. అలాగే గ్రీవెన్స్‌కు జిల్లాస్థాయి అధికారులంతా తప్పనిసరిగా హాజరువాలన్నారు. కాగా అర్జీల స్వీకరణ సమయంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించడంతో బాఽధితులు గంటన్నర పాటు బయటే ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వచ్చింది. అర్జీల స్వీకరణ సమయంలో సమావేశాల నిర్వహణ ఏంటంటూ పలువురు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం అందిన అర్జీల్లో అత్యధికంగా ఆసరా పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, స్వయం ఉపాధి కల్పన, రుణాల మంజూరు వంటివి ఉన్నాయి. బాధితుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. రెండేళ్లుగా వేతనాల్లేవ్.. మేమంతా జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 15 ఏళ్లుగా ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నాం. వేతనాలు తక్కువే అయినా మా పిల్లలనే ఉద్దేశంతో బాధ్యతగా సేవలందిస్తున్నాం. అలాంటి మా కు రెండేళ్లుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించట్లేదు. ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలోఎంపికయ్యాం. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో మమ్మల్ని విధులకు రావద్దని అధికారులు చెబు తున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోగా ఉపాధి దూరం చేసే పరిస్థితి నెలకొంది. మమ్ముల్ని యథావిధిగా కొనసాగిస్తూ వేతనాలు చెల్లించాలి. – ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలు బోర్లకు అడ్డుపడుతున్నరు మేమంతా ఆదివాసీ గిరిజన రైతులం. గిరి వికాసం పథకం కింద మా వ్యవసాయ భూములకు బోరుబావి,త్రీఫేజ్ విద్యుత్ మంజూరైంది. కరెంట్ సౌకర్యం కల్పించగా.. బోరుబావులు వేసుకుందామంటే అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నరు. గ్రామంలోకి మిషన్లను రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు. బోరు బావుల తవ్వకానికి అనుమతిచ్చి యాసంగి పంటల సాగుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. – గిరిజై గ్రామస్తులు, బజార్హత్నూర్ పట్టా చేయడం లేదు నా భర్త గుండెన ఎల్లన్న పేరిట ఆ దిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌లో గల సర్వేనంబర్ 47/2/9లో 1.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టిన. ఐదేళ్లుగా ఆఫీస్ చుట్టూ నా నలుగురు బిడ్డలతో కలిసి తిరుగుతూనే ఉన్నా. అయినా అధికారులెవరు కనికరించట్లేదు. దయచేసి విచారణ జరిపించి నా పేరిట పట్టా చేసి ఆదుకోవాలని కోరుతున్నా.– గుండెన రాంబాయి, ఆదిలాబాద్ షెడ్లు కేటాయించాలి మేమంతా చిరు వ్యాపారులం. పట్టణంలోని రోడ్లపై వివిధ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. పట్టణంలోని డైట్ కళాశాల వద్ద గల షెడ్లను మేము ఏర్పాటు చేసుకుంటే మున్సిపల్ అధికారులు ఇటీవల తొలగించారు. దీంతో ఉపాధికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బల్దియా నిర్మించే షెడ్లను కేటాయించి ఆదుకోవాలని కలెక్టర్‌కు విన్నవించాం. – చిరు వ్యాపారులు, ఆదిలాబాద్ అనుమతి లేదని కూల్చేశారు సర్వేనంబర్ 170లోని ప్లాట్ నంబర్ 428లో రేకుల ఇల్లు నిర్మించుకున్న. గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కూడా కట్టిన. కానీ ఇంటికి బల్దియా నుంచి అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు నా ఇంటిని కూల్చివేశారు. ఎన్నో ఇళ్లు అనుమతి లేకుండా నిర్మించినవి ఉన్నప్పటికి కేవలం నా ఒక్క ఇంటిని మాత్రమే కూల్చివేసి నష్టం చేశారు. దీనిపై విచారించి నాకు న్యాయం చేయాలి. – బత్తుల రాములు, మావల. -
‘పార్లమెంట్’ హీట్! బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు..
కరీంనగర్: లోక్‌సభ సమరానికి రాజకీయ పార్టీలు సైఅంటున్నాయి. విజయబావుటా ఎగురవేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. కరీంనగర్ లోక్‌సభ సీటును కై వసం చేసుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో సభలు.. సమావేశాలకు రెడీ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయబావుట ఎగురవేసింది. కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కరీంనగర్, హుజూరా బాద్‌లో బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలోకి బీజేపీ.. బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌కుమా ర్ తిరిగి పోటీ చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ శ్రేణులు ఇప్పటికే పలుచోట్ల వాల్‌రైటింగ్, పోస్టర్లు వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నా రు. గతనెల చివరి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో అమిత్‌షా సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని సంకేతం ఇవ్వడంతో బండి సంజయ్ క్యాడర్‌ను కదనరంగంలోకి దించారు. అయోధ్య శ్రీరాముడి అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ప్రజ ల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శక్తికేంద్రాల ఇన్చార్జిలను ట్రైనప్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు. వికసిత్ భారత్‌తో ప్రజలతో మమే కం అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మానకొండూరు మండలం కొండపల్కల గ్రామంలో జరిగే ‘వికసిత్ భారత్’లో పాల్గొననున్నారు. జోష్‌లో ‘కాంగ్రెస్’.. పదేళ్ల తర్వాత అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ ఊపుతో ముందుకెళ్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న ఉత్సాహంతో పార్లమెంట్ సీటునూ గెలుచుకోవాలని చూస్తోంది. హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండటం, గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో అధిష్టానం లోక్‌సభ ఇన్చార్జిగా నియమించింది. దీంతో ఆ పార్టీ లీడర్లు బీజేపీ, బీఆర్ఎస్లను ఎదుర్కొనేందుకు క్యాడర్‌ను రెడీచేస్తున్నా రు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు బిజీబిజీగా ఉన్నారు. గత అభివృద్ధి, కాంగ్రెస్ హమీలపై ప్రజల్లోకి బీఆర్ఎస్.. పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వందరోజుల్లో ఆరు గ్యారంటీల అమలు తదితరాలు ఎండగట్టేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచిన మూడు సీట్లతో పాటు మిగతా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీ ఇచ్చామని గుర్తుచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇవి చదవండి: నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన్నెం రంజిత్‌యాదవ్? -
బైక్ ఆఫ్ అవడంతో బైక్ సీటు తెరిచి చూస్తే.. ఒక్కసారిగా షాక్!
మహబూబ్‌నగర్: బైక్ ఆఫ్ అయితుందని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లిన యువకులకు సీటు కింద పాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన బాలు, వినయ్ అక్కడే ఓ పరిశ్రమలో పని చేసేవారు. కంపెనీ పని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో కర్నూల్ వద్ద బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నారు. అడ్డాకుల సమీపంలోకి రాగానే బైక్ ఆఫ్ అయితుండటంతో స్థానికంగా ఉన్న మెకానిక్ దగ్గరికి వచ్చారు. దాన్ని బాగు చేసే క్రమంలో బైక్ సీటు తీయగా దాని కింద పాము కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత యువకులంతా కలిసి దాన్ని బయటకు తీసి చంపేశారు. ఇవి చదవండి: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్!