Funday
-
మంత్రదండంలాంటి ఉంగరం..!
ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ రింగులు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో చాలా రకాలు శరీర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి యాప్ ద్వారా అప్రమత్తం చేస్తాయి. తాజాగా చైనాకు చెందిన ‘టు ఆల్ టెక్’ తయారు చేసిన ‘ఎల్–రింగ్2’ అనే ఈ ఉంగరం దాదాపు మంత్రదండం మాదిరిగానే పనిచేస్తుంది. ఇది వెనువెంటనే అనువాదం చేస్తుంది. లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు వంటివి ఉపయోగించేటప్పుడు ఇది ఎయిర్ మౌస్లా ఉపయోగపడుతుంది. మాటలను ఎంపిక చేసుకున్న భాషలోని అక్షరాల్లోకి మారుస్తుంది. ప్రపంచంలోని ప్రధాన భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచ్, చైనీస్, జపానీస్, కొరియన్, జర్మన్, స్పానిష్, అరబిక్, పోర్చుగీస్, ఇటాలియన్ భాషల్లో ఇది తక్షణ అనువాద సేవలను అందిస్తుంది. ఇది జెశ్చర్ మోడ్‌లో కూడా పనిచేస్తుంది. అరచేతి ద్వారా చేసే పదహారు రకాల సంజ్ఞలకు అనుగుణంగా ఇది కర్సర్ కదలికలను నియంత్రిస్తుంది. దీనిని ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్, విండోస్, హార్మొనీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా వాడుకోవచ్చు. ఈ ఉంగరంతో పాటు ఇచ్చే పెట్టె చార్జింగ్ చేసుకోవడానికి, రకరకాల మోడ్స్‌ను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. పెట్టెతో కలిపి దీని బరువు 33 గ్రాములు. ఉంగరం బరువు 2.8 గ్రాములు. దీని ధర 99 డాలర్లు (రూ.8,354) మాత్రమే! (చదవండి: అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!) -
అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!
ఇది అత్యంత ప్రాచీనమైన కోటల్లో ఒకటి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఉన్న ఈ కోట పేరు శిశుపాలగడ. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్ది నాటి కోట ఇది. ఈ కోట, దాని చుట్టు ఏర్పడిన నగరానికి చెందిన శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. అశోకుడు కళింగ యుద్ధం చేసేనాటికి ముందు దాదాపు క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది కాలంలో ఈ నగరం అద్భుతంగా వర్ధిల్లినట్లు ఇక్కడ దొరికిన ఆధారాల వల్ల తెలుస్తోంది. మౌర్యుల కాలానికి ముందు నిర్మించిన ఈ కోట ఆనాటి కాలంలోని ఏథెన్స్ నగరానికి మించి ఉండేదని చరిత్రకారులు ఎం.ఎల్.స్మిత్, ఆర్.మహంతి తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. అప్పట్లో శిశుపాలగడ జనాభా దాదాపు పాతికవేల వరకు ఉంటే, అదేకాలంలో ఏథెన్స్ జనాభా పదివేల వరకు మాత్రమే ఉండేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడి చారిత్రక ఆధారాలను పరిరక్షిస్తున్నారు. (చదవండి: రోబో చిత్రానికి రూ.9 కోట్లు) -
రోబో చిత్రానికి రూ.9 కోట్లు
ఫొటోలో కనిపిస్తున్న ఈ రోబో పేరు ఐ–డా. ఈ రోబో కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ ఆర్టిస్ట్. పైగా ఈ ఏఐ రోబో గీసిన చిత్రం ఇటీవల జరిగిన వేలంలో భారీ మొత్తానికి అమ్ముడైంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయాలకు చెందిన ఏఐ పరిశోధకులు తయారు చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబో చూడటానికి అందమైన అమ్మాయిలా ఉంటుంది. దీని కళ్లలో కెమెరాలను అమర్చారు. ఇది ఏఐ అల్గారిథమ్స్, రోబోటిక్ చేతులను ఉపయోగించి చిత్రాలను గీస్తుంది. ఈ రోబో ఇటీవల కృత్రిమ మేధా పితామహులలో ఒకరిగా పేరొందిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త అలాన్ ట్యూరింగ్ చిత్రాన్ని గీసింది. ఈ చిత్రం ఇటీవలే జరిగిన సోత్బీస్ డిజిటల్ ఆర్ట్ సేల్ వేలంలో 10,84,800 డాలర్లు ధర పలికింది. (సుమారు రూ. 9.15 కోట్లు). హ్యూమనాయిడ్ రోబో ఆర్టిస్ట్ ఐ–డా గీసిన ఈ చిత్రాన్ని, పేరు గోప్యంగా ఉంచిన ఒక అమెరికన్ వ్యక్తి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: అవయవ దానకర్ణులమవుదాం...!) -
జన్నత్ జుబైర్ రహమానీ
యాక్ట్రెస్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె హోమ్ టౌన్ ముంబై. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మ్యూజిక్ వీడియోస్‌లో కూడా పర్ఫార్మ్ చేసింది. 2017లో తన పేరుతోనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసింది. వ్లాగ్స్, మేకప్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్‌కు దాదాపు యాభై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లిప్ సింక్ వీడియోలతో జన్నత్ టిక్‌టాక్‌లోనూ పాపులర్ అయింది. మన దగ్గర టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ అందులో ఫేమస్ అయిపోయింది. ఆమె ఇన్స్టాకి దాదాపు అయిదుకోట్లకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు. తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కి తెలియజేయడానికి "Jannat Zubair Rahmani Official" అనే యాప్‌నీ లాంచ్ చేసింది జన్నత్. ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకుంది. -
బాలల జీవన మందిరం
పోగూరి చంద్రబాబు, తిరుపతి సిటీ అమ్మ, నాన్నల అండతో.. ఆప్యాయతానురాగాల నీడన .. కుటుంబ బలంతో జీవితానికి బాట వేసుకునే అవకాశం ఉండటం నిజంగానే అదృష్టం!అమ్మ, నాన్నల్లేని అనాథలకూ అలాంటి అదృష్టాన్ని కల్పిస్తోంది ఎస్వీ బాలమందిరం! తిరుపతి, భవానీనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరం.. నా అన్నవారు లేని బాలలకు, సింగిల్ పేరెంట్ పిల్లలకు తానున్నానంటూ ఆశ్రయమిచ్చి ఆదుకుంటోంది! ప్రేమ, వాత్సల్యాలను పంచుతూ.. విద్యాబుద్ధులు అందించి వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతోంది. అందులో విద్యనభ్యసించిన పిల్లలు నేడు దేశ, విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంజినీర్లు, డాక్టర్లుగా రాణిస్తున్నారు. వ్యాపారవేత్తలుగానూ ఎదిగారు. టీటీడీలో నాలుగో తరగతి ఉద్యోగాల నుంచి సూపరింటెండెంట్, డీఈఓ స్థాయి వరకు విధులు నిర్వహిస్తున్నారు. అనాథాశ్రమం నుంచి ఎస్వీ బాలమందిరంగా..టీటీడీ తొలి ఈఓ అన్నారావు 1943లో టీటీడీ అనాథాశ్రమ పాఠశాలను ప్రారంభించారు. ఆదిలోనే ఇది నాటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ దృష్టిని ఆకట్టుకుంది. ఆయన 1962లో బడిని సందర్శించి ‘చిల్డ్రన్స్ ఆఫ్ లార్డ్ వేంకటేశ్వర’ అని పిలవడంతో అదికాస్త ఎస్వీ బాలమందిరంగా మారింది. 2005 నుంచి సుమారు 500 మంది అనాథ పిల్లలు బాలమందిరంలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిని అధికారులు శ్రీవారి పిల్లలుగానే భావిస్తూ సేవలు అందిస్తున్నారు. బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా..మాది శ్రీకాళహస్తి, తొట్టంబేడు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. మా అవ్వ నన్ను ఎస్వీ బాలమందిరంలో చేర్పించింది. అది అమ్మ, నాన్న లేని లోటును తీర్చడమే కాకుండా చక్కగా చదువు చెప్పించింది. భరతనాట్యంలోనూ ట్రైనింగ్ ఇప్పించింది. ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ అన్నీ టీటీడీ అధికారుల అండదండలతోనే పూర్తి చేశాను. ప్రస్తుతం బెంగళూరు కోటక్ మహీంద్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. – బి గుర్రమ్మక్వాలిటీ మేనేజర్‌గా..మాది చిత్తూరు జిల్లాలోని మోర్దాన్ పల్లి. నాకు ఊహ తెలియని వయసులో నాన్న చనిపోయాడు. నాన్న పోవడంతో అమ్మ మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. నాకో అన్న. కూలీ పనులకు వెళ్లేవాడు. నన్ను మా మేనమామ ఎస్వీ బాలమందిరంలో చేర్పించారు. పది వరకు అక్కడే చదివాను. డిగ్రీ తర్వాత మయాన్మార్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ రావడంతో వెళ్లాను. ఆ వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌తో బెంగళూరులో క్వాలిటీ మేనేజర్‌గా ఆఫర్ రావడంతో తిరిగొచ్చేసి అందులో జాయిన్ అయ్యాను. – రాజేష్మేనేజర్గా..మా స్వస్థలం తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు. చిన్నతనంలోనే అమ్మ, నాన్న దూరమయ్యారు. మా అమ్మమ్మ నన్ను ఎస్వీ బాలమందిరంలో చేర్పించింది. పదవ తరగతి వరకు అక్కడే ఉన్నాను. వారి సహకారంతోనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఎంబీఏ చేశాను. ఇప్పుడు యూఎస్ఏలో ఓ ఎమ్ఎన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. – జి.ఇంద్రజయూరాలజిస్ట్గా..శ్రీకాళహస్తి మండలం, పల్లాం మా సొంతూరు. నా చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. నాకో అన్న. మా బాబాయ్ హెల్ప్‌తో ఎస్వీ బాలమందిరంలో చేరాను. టెన్త్ క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. ఎమ్సెట్లో ఫ్రీ సీట్ సాధించాను. కర్నూలు మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ తర్వాత యూరాలజీలో స్పెషలైజేషన్ చేశాను. ప్రస్తుతం నెల్లూరులోని ఓ పేరొందిన హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మాలాంటి ఎంతో మందిని ఆదరించి మంచి భవిష్యత్తును ప్రసాదించిన ఎస్వీ బాల మందిరానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – డాక్టర్ వై. యువరాజుఆంట్రపెన్యూర్గా.. మా సొంతూరు రెడ్డిగుంట. మేం ముగ్గురం పిల్లలం. నా తొమ్మిదేళ్ల వయస్సులో అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోయారు. మమ్మల్ని మా బంధువులు ఎస్వీ బాలమందిరంలో చేర్చారు. ఎంబీఏ చేశాను. వ్యాపారవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతో తమ్ముడితో కలసి ఐస్‌క్రీమ్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభించాను. చెన్నై కేంద్రంగా ఎమ్ అండ్ ఎమ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఐస్‌క్రీమ్ షాపులు, ఔట్లెట్స్ ఉన్నాయి.హెయిర్ సెలూ¯Œ లనూ నడుపుతున్నాం. సుమారు వందమందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాం. బాలమందిరంలోని పదిమంది స్నేహితులకూ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం! ఆ బడి మాకు అమ్మలాంటిది. – వి లోకేష్ -
హై రిస్క్ ప్రెగ్నెన్సీ?!
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండో నెల. తొలి చూలు. బరువు 110 కేజీలు ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలా కాకుండా ఏమి చెయ్యాలి. కొన్ని మందులు రాశారు. అవి వాడొచ్చా? – మనీషా, బెంగళూరుకాళ్లల్లోని డీప్ వీన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే చాన్స్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)అంటారు. ఈ క్లాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. ఇవి కొంతమందికి ఊపిరితిత్తులు, గుండెలోకీ మూవ్ అవుతుంటాయి. బ్లడ్ థిక్ కావడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఇతరత్రా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెమ్మదిగా రక్తప్రసరణ జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే, రక్తం చిక్కనవుతుంది. జనరల్ సర్జరీ తర్వాత కూడా శరీరంలో ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా.. కొంతమందికి ప్రెగ్నెన్సీ తొలి వారల్లోనే బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకంటే ఎక్కువ, వయసు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, వ్యక్తిగతæ లేదా ఫ్యామిలీ హిస్టరీలో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ ఉన్నవారు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నవారు, సివియర్ వెరికోస్ వీన్స్ ఉన్నవారు, బెడ్ రెస్ట్‌లో ఉన్నవారికి ఈ రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కాలులో నొప్పి , వాపు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి వంటివి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాలి. లంగ్ స్కాన్, లోయర్ లింబ్ డాప్లర్ స్కాన్ ద్వారా క్లాట్స్ని కనిపెడ్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించి.. కాళ్లల్లో క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఒకే చోట కూర్చోకుండా, గంటకు ఒకసారి అయిదు నిమిషాలు వాకింగ్ చేయాలి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా మోకాళ్లు, కాళ్లు కదుపుతూ ఉండాలి. తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. రిస్క్ జోన్లోఉన్నవారికి వీటితో పాటు రిస్క్ అసెస్మెంట్ చేసి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ థిన్ కావడానికి ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఅనేవి ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు. డైలీ తీసుకోవాలి. వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీటి వలన బ్లడ్ క్లాట్ రిస్క్ బాగా తగ్గుతుంది. ఇవి గర్భస్థ శిశువుకేమీ ప్రమాదం కలిగించవు. -
మీరే ఆదర్శం.. మీ మద్దతే ముఖ్యం!
టీనేజ్ అనేది టీనేజర్లకే కాదు తల్లిదండ్రులకు కూడా సవాలే! వాళ్ల ఎదుగుదలను చూసి సంతోషం, గర్వం ఒకవైపు... వాళ్లతో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలి, దారి తప్పకుండా ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలు మరోవైపు. ఓపెన్నెస్– పరిమితుల మధ్య, అధికారం– సహానుభూతి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా గొడవలు తప్పవు. అందుకే ఈ వయసులో తల్లిదండ్రుల మద్దతు వారి అభివృద్ధినెలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. కమ్యూనికేషన్ డైనమిక్స్ఢ స్వతంత్రం కోసం తపిస్తారు. అదే సమయంలో వాళ్ల తల్లిదండ్రులు తమ అదుపు తప్పకూడదని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పేరెంట్స్ చెప్పే మాటలను టీనేజర్లు పట్టించుకోరు. అది తమను తిరస్కరించినట్లుగా భావిస్తారు. ఇదే ఘర్షణలకు కారణమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు జడ్జిమెంట్ లేకుండా వినడం అవసరం. అప్పుడే తల్లిదండ్రులు తమను అర్థం చేసుకున్నారని ఫీలవుతారు. వివాదాలు సహజం..కౌమారంలో తమదైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి స్వేచ్ఛ, స్వతంత్రాలను ప్రదర్శించడం అవసరమని టీనేజర్లు భావిస్తారు. ఈ క్రమంలో హెయిర్ స్టయిల్ నుంచి డ్రెస్సింగ్ స్టయిల్ వరకు, సిద్ధాంతాల నుంచి లైఫ్ స్టయిల్ వరకు, స్నేహాల నుంచి నైటవుట్ల వరకు తరాల మధ్య అంతరాలు ఉంటాయి. మరోవైపు పిల్లలు చేయిదాటిపోతున్నారని పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. వారి ప్రవర్తనను కట్టడి చేయాలని ప్రయత్నిస్తుంటారు. కఠిన నియమాలు అమలు చేయాలని చూస్తుంటారు. ఈ విషయంలో టీనేజర్లు, పేరెంట్స్ మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇది సహజం. ఇందులో ఆందోళన పడాల్సిన పనిలేదు. భావజాల ఘర్షణలు..కౌమారంలో భావజాలం పరిపూర్ణంగా అభివృద్ధి చెందదు. టీనేజర్లు తీవ్రమైన భావజాలానికి సులువుగా ఆకర్షితులవుతారు. తమ భావాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సరైన పద్ధతులు ఇంకా వారికి తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు కోపం లేదా అసహనాన్ని ప్రదర్శించడం వల్ల వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పిల్లలు అసహనం చూపినప్పుడు తల్లిదండ్రులు కూడా అసహనం చూపకుండా శాంతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. టీనేజర్లతో కలిసి కూర్చుని, చర్చించి హద్దులను నిర్ణయించాలి. అది వారిలో బాధ్యతను పెంచుతుంది. మీ మద్దతే వారి ఆత్మవిశ్వాసం... తల్లిదండ్రుల మద్దతు టీనేజర్లలో ఆత్మవిశ్వాసం, సహనాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వయస్సులో పీర్ ప్రెషర్, అకడమిక్ ప్రెషర్ లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు వారి భావాలను, ఆలోచనలను అంగీకరిస్తూ మద్దతు ఇవ్వడం ద్వారా టీనేజర్లు భద్రత, నమ్మకం పొందుతారు, తద్వారా వారు ఈ సవాళ్లను అధిగమించడానికి తగిన ధైర్యాన్ని తెచ్చుకుంటారు. పరిశోధనల ప్రకారం తల్లిదండ్రుల మద్దతు గట్టిగా ఉన్న కౌమారులు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.మీరే ఆదర్శం... టీనేజర్లు తమ తల్లిదండ్రులను అనుకరించడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రులు గౌరవమర్యాదలు, జాగ్రత్త, సానుకూల దృక్పథం, నైతికత, పట్టుదలను ప్రదర్శించడం ద్వారా వారికి శక్తిమంతమైన ఉదాహరణలుగా నిలుస్తారు. టీనేజర్లు ఆ విలువలను చూసి, వాటిని తామూ అమలు చేస్తూ సవాళ్లను ఎదుర్కొనే విధానంలో పాజిటివ్‌గా ఉంటారు.బంధం బలపడాలంటే... ⇒ కలిసి భోంచేయడం, షికారుకు వెళ్లడం, సినిమాలు చూడటం వంటి మామూలు పనులు చేయండి. ఇది ఒత్తిడిలేని పరస్పర బంధానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ⇒ఎప్పుడూ చదువు, కెరీర్ గురించే మాట్లాడకుండా, అప్పుడప్పుడూ వారి ప్రపంచంపై ఆసక్తి చూపండి. వారికి నచ్చిన సినిమాలు, మ్యూజిక్ బ్యాండ్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం ద్వారా తరాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించవచ్చు. ⇒ఎప్పుడూ వారి గదిలోకి దూరిపోకుండా, వారి స్పేస్, ప్రైవసీని గౌరవించండి. అది వారు అటానమీని అభివృద్ధి చేసుకోవడానికి అవసరం. ⇒ఏదైనా గొడవ వచ్చినప్పుడు కోపంతో తిట్టకుండా, తప్పు పట్టకుండా... ‘నీ ప్రవర్తనకు నేను బాధపడుతున్నాను’ లాంటి ‘ఐ స్టేట్మెంట్స్ వాడండి. అది డిఫెన్సివ్ నెస్‌ను తగ్గిస్తుంది. ⇒వారు చేసిన పొరపాట్లను పక్కకు నెట్టేసి, వారి విలువను, ప్రేమను గుర్తుచేసేలా మాట్లాడండి. దాంతో మీరు వారిని అంగీకరించారనే భద్రతను పొందుతారు. -
Mystery: షార్ట్ కుటుంబాన్ని చంపినదెవరు?
ఉదయం తొమ్మిదయ్యేసరికి క్రిస్ థాంప్సన్ తన ఓనర్ మైకేల్ షార్ట్ కోసం రోడ్డుపక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు. పదే పదే టైమ్ చూసుకుంటున్నాడు. ఎంతసేపటికీ మైకేల్ రాకపోయేసరికి, ‘ఇదేంటి? తొమ్మిదికల్లా క్రిస్టియన్స్‌బర్గ్‌లో డెలివరీకి బయలుదేరదామన్న మనిషి ఇంకా రాలేదు? ఇల్లు దగ్గరే కదా, వెళ్లి చూద్దాం’ అనుకుని మైకేల్ ఇంటి వైపు అడుగులేశాడు క్రిస్.క్రిస్ వెళ్లేసరికి మైకేల్ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. హాల్లో కాస్త దూరంలో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించిన తన ఓనర్ని మొదట ‘సార్.. సార్!’ అని బయట నుంచే పిలిచాడు. ఎంత పిలిచినా ఇంట్లో ఎవరూ పలుకకపోయేసరికి, దగ్గరకు వెళ్లి లేపుదామన్నట్లు ఇంటి లోపలికి అడుగులేశాడు. సోఫా దగ్గరకు వెళ్లేసరికి మైకేల్ ప్రాణాలతో లేడు. అతడి నుదుటిపైన తుపాకీతో కాల్చిన గాయం క్రిస్‌ని గజగజ వణికించేసింది. పైగా ఇల్లంతా ఆవహించిన నిశ్శబ్దం అతడ్ని మరింతగా భయపెట్టింది. వెంటనే బయటికి పరుగుతీసి, పోలీసులకు సమాచారమందించాడు.క్రైమ్ టేప్స్ చుట్టి, ఇల్లంతా తమ అధీనంలోకి తెచ్చుకున్న పోలీసులు. ఆ ఇంట్లో మైకేల్ మృతదేహంతో పాటు మరో శవాన్ని గుర్తించారు. అది మైకేల్ భార్య మేరీ షార్ట్ది. ఆమెను కూడా పైన బెడ్రూమ్లో నిద్రలో ఉండగానే ఎవరో కాల్చి చంపేశారు. అంటే ఒకేరాత్రి జంట హత్యలు జరిగాయి. మరి కిల్లర్ ఎవరు? అనే దిశగా విచారణ మొదలైంది. ఆ సమయంలో అధికారులకు క్రిస్ కీలక సాక్షిగా మారాడు.‘మైకేల్ సార్‌ది మొబైల్ హోమ్ మూవింగ్ బిజినెస్. నాలానే చాలామంది వర్కర్స్ అతని దగ్గర పనిచేస్తున్నారు. ముందురోజు రాత్రి పది దాటే వరకూ డెలివరీ పని మీద సార్ నాతోనే ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే తొమ్మిదికిక్రిస్టియన్స్బర్గ్లో డెలివరీకి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు. ఎప్పుడూ పది నిమిషాలు ముందుండే మనిషి ఎంతకూ రాకపోయేసరికి డౌట్ వచ్చి ఇంటికి వెళ్లాను’ అని క్రిస్ చెప్పాడు. నిజానికి మైకేల్ శవాన్ని మొదటిగా చూసిన వ్యక్తి, మైకేల్ సజీవంగా ఉన్నప్పుడు చివరిసారిగా చూసిన వ్యక్తి క్రిస్ మాత్రమే!‘అసలు రాత్రికి రాత్రి మైకేల్ ఇంట్లో ఏమైంది?’ అనే ప్రశ్నతో పోలీసులు తలలు పగలగొట్టుకుంటుంటే.. మైకేల్, మేరీల బంధువులంతా ‘జెన్నిఫర్ ఎక్కడ?’ అని ప్రశ్నించారు. విచారణ అధికారులంతా తెల్లబోయారు. వారి నుంచి ‘జెన్నిఫర్ ఎవరు?’ అనే ప్రశ్న అప్రయత్నంగానే వచ్చింది.జెన్నిఫర్.. మైకేల్, మేరీల ఏకైక కుమార్తె. తొమ్మిదేళ్ల పాప. లేకలేక పుట్టిన సంతానం. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే తెలివైన పిల్ల. ‘జంట హత్యల తర్వాత పాప కనిపించడం లేదంటే, కిల్లర్ టార్గెట్ జెన్నిఫర్‌ని ఎత్తుకెళ్లడమేనా?’ అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.నిజానికి ఆ రాత్రి మైకేల్ పది దాటాక ఇంటికి వెళ్లాడని క్రిస్ చెప్పాడు. అదే రాత్రి పదిన్నరకు మేరీ డిన్నర్ ఐటమ్స్ కొని ఇంటికి తీసుకెళ్లిందని ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ దుకాణదారుడు చెప్పాడు. ‘సాధారణంగా రాత్రి సమయంలో తన గురక కారణంగా మేరీ నిద్ర చెడిపోకూడదని చాలాసార్లు అదే సోఫాలో నిద్రపోతుంటాడట మైకేల్. పైన బెడ్రూమ్లో మేరీ నిద్రపోతుంది. ఆ రాత్రి అదే జరిగినట్లుంది’ అని క్లారిటీ ఇచ్చింది మేరీ సోదరి.ఇంట్లో అంతా నిద్రపోయాక దుండగుడు.. మైకేల్, మేరీలను చాలా సులభంగా చంపి, పాపను ఎత్తుకుపోయాడనేది అప్పటికే స్పష్టమైంది. అంటే బహుశా ఆ కిల్లర్ ఆ ఇంటికి అతిథిగా వచ్చి ఉంటాడా? ఆ దంపతులకు సుపరిచితుడేనా? ఇలా చాలా అనుమానాలు తలెత్తాయి.మైకేల్ ఇంటి సమీపంలో ఆ రాత్రి ఎప్పుడూ చూడని తెల్లటి కారు ఒకటి చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు. అదే తెల్లటి కారులో మరునాడు తెల్లవారుజామున (మృతదేహాలను చూసిన రోజు) 40 ఏళ్ల అపరిచిత వ్యక్తి వెళ్లడం చూశామని మరికొందరు ఇరుగు పొరుగువారు చెప్పారు. దాంతో కిల్లర్ ఊహాచిత్రాన్ని గీయించే పనిలో పడ్డారు అధికారులు. పాప కోసం దగ్గర్లోని అడవిని, చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు.2002 ఆగస్ట్ 15న వర్జీనియా, హెన్రీ కౌంటీలో జరిగిన ఈ ఉదంతం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్యలు జరిగిన ఆరు వారాల తర్వాత మైకేల్ ఇంటికి సుమారు 35 మైళ్ల దూరంలో ఉన్న స్టోన్ విల్ క్రీక్ అనే ప్రాంతంలోని అల్బర్ట్ అనే వ్యక్తి ఇంటి ముందు కుళ్లిన దవడ భాగం దొరికింది. మొదట దాన్ని గమనించిన అల్బర్ట్ ఫ్యామిలీ ఏదో జంతు కళేబరాన్ని కుక్కలు తెచ్చి పడేసి ఉంటాయని భావించారు. పరిశీలనగా చూస్తే అది పిల్లల దవడ అని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎన్ఏ టెస్ట్‌లో అది జెన్నిఫర్దని తేలింది. వెంటనే మృతదేహం కోసం సమీపంలో వెతికించారు. పాడుబడిన ఒక వంతెన కింద కుళ్లిపోయిన పాప శవం కనిపించింది. అయితే స్టో¯Œ విల్ క్రీక్కి గతంలో మైకేల్ చాలా మొబైల్ హోమ్స్ డెలివరీ చేశాడని తేలింది. పైగా అక్కడ చాలామంది డీలర్స్‌తో అతడికి స్నేహ సంబంధాలున్నాయి.పాప మృతదేహం దొరికిన చోట క్షుణ్ణంగా పరిశోధన చేసినా, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. అయితే ఆ విచారణలో గ్యారిసన్ బౌమన్ అనే ఒక నేరచరిత కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి సరైన ఆధారాలు లేకపోవడంతో అతణ్ణి విడిచిపెట్టారు. రాత్రికి రాత్రి ఎవరైనా సీరియల్ కిల్లర్ రహస్యంగా ఇంట్లోకి దూరి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? లేక నిజంగానే ఆ క్రూరుడు పథకం ప్రకారం మైకేల్ ఫ్యామిలీని మోసం చేసి మట్టుపెట్టాడా? అనేది తేలలేదు. దాంతో ఇరవై రెండేళ్లు గడచిపోయినా ఈ ఉదంతం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
వామదేవుడి వృత్తాంతం
పూర్వం పరిక్షితుడు అనే రాజు అయోధ్యను పరిపాలించేవాడు. ఒకనాడు అతడు గుర్రమెక్కి వేట కోసం అడవికి వెళ్లాడు. అనేక మృగాలను వేటాడాడు. గుర్రం అలసిపోవడంతో, దానిని మేతకు విడిచిపెట్టాడు. అందమైన అడవి పరిసరాలను పరిశీలిస్తూ అలా ముందుకు నడవసాగాడు. ఒకచోట అతడికి ఒక అందగత్తె కనిపించింది. ఆమెను చూడగానే రాజు మనసు పారేసుకున్నాడు. ఆమె కూడా అతడిని చూసి, నర్మగర్భంగా నవ్వుతూ తన వలపును ప్రకటించింది.పరిక్షితుడు ఆమెను ‘సుందరీ! నువ్వెవరివి? క్రూరమృగాలు తిరిగే అడవిలో ఎందుకిలా ఒంటరిగా సంచరిస్తున్నావు?’ అని అడిగాడు.‘రాజా! నా పేరు సుశోభన. నా తండ్రి అనుమతితో వరాన్వేషణ కోసం బయలుదేరాను. మార్గమధ్యంలో ఈ అడవి ఎదురైంది’ అని బదులిచ్చింది. ‘సుందరీ! నా పేరు పరిక్షితుడు. ఇక్కడకు దగ్గరలోని అయోధ్యకు రాజును. నీకు అభ్యంతరం లేకుంటే, నిన్ను పెళ్లాడతాను’ అంటూ మనసులోని మాటను తెలిపాడు.‘రాజా! నీతో పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నన్ను జలక్రీడల కోసం మాత్రం ఎన్నడూ నిర్బంధించనంటేనే పెళ్లికి సిద్ధపడగలను’ అంటూ షరతు విధించింది. ఆమె షరతుకు పరిక్షితుడు అంగీకరించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని, హాయిగా జీవించసాగారు. ఒకరోజు ఉద్యానవనంలో భార్యతో సల్లాపాలాడుతుండగా, పరిక్షితుడి శరీరం చెమటతో తడిసింది. కాసేపు జలక్రీడలాడి సేదదీరాలని తలచి, ఉద్యానవనంలో ఉన్న కొలనులోకి దిగాడు. అందులో ఈదులాడుతూ, తనతో జలకాలాడాలంటూ భార్యను పిలిచాడు. ఆమె నవ్వుతూ వచ్చి, కొలనులోకి దిగి, వెంటనే అదృశ్యమైపోయింది. అనుకోని ఈ పరిణామానికి పరిక్షితుడు దిగ్భ్రాంతుడయ్యాడు. భార్య కోసం కొలనంతా గాలించాడు. ఆమె కనిపించలేదు. భటులను పురమాయించి, కొలనులోని నీటినంతటినీ తోడి పోయించాడు. కొలను అడుగున కప్పలు తప్ప మరేమీ కనిపించలేదు. కప్పలే తన భార్యను తినేసి ఉంటాయని భావించిన పరిక్షితుడు కప్పలపై కోపం పెంచుకున్నాడు. రాజ్యంలోని కప్పలన్నింటినీ వెదికి చంపమంటూ భటులను ఆదేశించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు రాజ్యంలోని నీటితావులన్నీ గాలించి, కప్పలను వెదికి చంపి కుప్పలుగా పోయడం ప్రారంభించారు. కప్పలపై పరిక్షితుడి కక్ష విపరీతంగా మారుతుండటంతో కప్పలరాజు అయిన ఆయువు ఒక మహర్షి రూపంలో వచ్చి, కప్పల మీద ద్వేషానికి కారణమేమిటని అతడిని అడిగాడు. తన ప్రియురాలిని అదృశ్యం చేయడం వల్లనే కప్పలను చంపుతున్నానని పరిక్షితుడు బదులిచ్చాడు. అప్పుడు కప్పలరాజు ఆయువు తన నిజరూపంలో పరిక్షితుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. పరిక్షితుడు ప్రేమించిన సుశోభన తన కూతురేనని చెప్పి, ఆమెను రప్పించి అప్పగించాడు. ఆమె ఎందరో రాజులను తన వలపుతో మోసం చేసిందని, అందువల్ల ఆమెకు పుట్టే కొడుకులు మోసగాళ్లవుతారని శపించాడు. కూతురికి హితవు చెప్పి వెళ్లిపోయాడు. పరిక్షితుడు, సుశోభనలకు శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పెద్దవాడైన శలుడికి రాజ్యం అప్పగించి, పరిక్షితుడు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు. శలుడు ఒకనాడు బంగారు రథంపై అడవికి వేటకు వెళ్లాడు. ఒక లేడి కనిపిస్తే, దానిని బాణంతో కొట్టాడు. బాణం దెబ్బతిన్న లేడి పరుగు లంకించుకుంది. శలుడు ఆ లేడి వెనుకనే రథాన్ని పరుగు తీయించాడు. లేడి వేగాన్ని రథాశ్వాలు అందుకోలేక పోయాయి. శలుడు విసుగు వ్యక్తం చేశాడు. ‘రాజా! వామ్యజాతి అశ్వాలైతే రథాన్ని అద్భుతమైన వేగంతో ఉరుకులెత్తించగలవు. వామ్యజాతి అశ్వాలు ఈ ప్రాంతంలో వామదేవుడు అనే మహర్షి వద్ద ఉన్నాయి’ అని చెప్పాడు రథసారథి. శలుడు రథాన్ని వామదేవుడి ఆశ్రమానికి మళ్లించమని ఆదేశించాడు. ఆశ్రమం చేరుకోగానే, శలుడు రథం దిగి, నేరుగా ఆశ్రమం లోపలకు వెళ్లాడు. వామదేవుడికి నమస్కరించి, వామ్యజాతి అశ్వాలను తనకు ఇవ్వమని కోరాడు. పని పూర్తయిన తర్వాత తిరిగి తనకు ఇచ్చేయాలనే షరతు మీద వామదేవుడు ఆ అశ్వాలను శలుడికి అప్పగించాడు. శలుడు వాటిని తన రథానికి పూన్చి, వేటాడాడు. వేట పూర్తయ్యాక ఆ అశ్వాలను వామదేవుడికి అప్పగించకుండా, తన కోటకు తోలుకుపోయాడు. నెల్లాళ్లు గడిచినా అశ్వాలను ఇవ్వకపోవడంతో వామదేవుడు అశ్వాలను అడిగి తెమ్మని తన శిష్యుల్లో ఆత్రేయుడనే వాడిని శలుడి వద్దకు పంపాడు. అశ్వాలను ఇవ్వను పొమ్మనడంతో ఆత్రేయుడు గురువు వద్దకు వచ్చి, జరిగిన సంగతి చెప్పాడు. ఈసారి వామదేవుడు స్వయంగా వెళ్లాడు. ‘రాజా! మాట నిలబెట్టుకో! పరద్రవ్యాపహరణం పాపహేతువు అవుతుంది’ అని హెచ్చరించాడు. శలుడు అతడి మాటలు పట్టించుకోకుండా, ‘బ్రాహ్మణులకు అశ్వాలు ఎందుకు? కావాలంటే, గోవులు, ఎద్దులు గాని, కంచరగాడిదలు గాని రెట్టింపు సంఖ్యలో ఇస్తాను’ అన్నాడు. ‘విప్రుల సొమ్ము అపహరించడమే కాకుండా, దానికి బదులుగా మరొకటి ఇస్తాననడం దురహంకారం’ అన్నాడు వామదేవుడు. అహం దెబ్బతినడంతో శలుడు మండిపడ్డాడు. ‘ఈ మునిని బంధించి శూలాలతో పొడిచి చంపండి’ అని ఆదేశించాడు. వామదేవుడికి కోపం కట్టలు తెంచుకుంది. అతడి మంత్ర ప్రభావంతో వేలాది మంది రాక్షసులు పుట్టుకొచ్చారు. వారు శలుడిపైకి లంఘించి, అతణ్ణి చంపేశారు. శలుడి తర్వాత అతడి తమ్ముడు నలుడు రాజయ్యాడు. కొన్నాళ్లయ్యాక వామదేవుడు మళ్లీ వెళ్లి తన గుర్రాలను తిరిగి ఇచ్చేయమని అడిగాడు. వామదేవుడిని విషబాణంతో చంపడానికి ధనుస్సు తీసుకుని, బాణాన్ని ఎక్కుపెట్టాడు. వామదేవుడి మంత్రప్రభావంతో అతడి చేతులు స్తంభించిపోయాయి. నలుడు నివ్వెరపోయాడు. వామదేవుడి ముందు తలవంచి, క్షమాపణలు కోరాడు. వామదేవుడు ప్రసన్నుడై, అతడిని స్తంభన నుంచి విముక్తుణ్ణి చేశాడు. నలుడు వామదేవుడి అశ్వాలను తిరిగి అప్పగించాడు. వామదేవుడు వాటితో తన ఆశ్రమానికి వెళ్లాడు.∙సాంఖ్యాయన -
జుంబారే మొంబాసా!
కార్నివాల్ అంటే బ్రెజిల్లో జరిగే రియో కార్నివాల్ ఎక్కువమందికి గుర్తుకొస్తుంది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో కూడా దాదాపుగా అదే స్థాయి కార్నివాల్ ఏటా జరుగుతుంది. కెన్యా తీర నగరమైన మొంబాసాలో ఏటా నవంబర్ నెలలో నెల పొడవునా కార్నివాల్ సందడిగా జరుగుతుంది. ఈ నెల్లాళ్లూ మొంబాసా నగరంలోని వీథులన్నీ రకరకాల ఊరేగింపులతో, సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలతో కోలాహలంగా కనిపిస్తాయి. తూర్పు ఆఫ్రికాలో జరిగే అతిపెద్ద సాంస్కృతిక వేడుక ఇది. తూర్పు ఆఫ్రికాలోని సాంస్కృతిక భిన్నత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే వేడుకగా సాగే ఈ కార్నివాల్లో ప్రతిరోజూ సంప్రదాయ వేషధారణలతో నృత్య సంగీతాలతో జరిగే ఊరేగింపులు ఉంటాయి. బహిరంగ వేదికల మీద నృత్య, సంగీత ప్రదర్శనలు ఉంటాయి. కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు జరుగుతాయి. తూర్పు ఆఫ్రికా సంప్రదాయ సంగీత రీతులైన ‘బెంగా’, ‘తారబ్’, సంప్రదాయ నృత్యరీతులైన ‘చకాచా’, ‘గిరియామా’ ప్రదర్శనలతో పాటు, స్థానిక మత్స్యకారులు చేసే వివిధ సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వాహిలి, మిజికెందా, తైటా తెగల ప్రజలు ఎక్కువగా ఈ ప్రదర్శనలు చేస్తారు. ఈ కార్నివాల్లో కొత్తతరం యువతీ యువకులు హిప్ హాప్, ఆఫ్రో ఫ్యూజన్ వంటి ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు. మొంబాసా కార్నివాల్ స్థానిక చేతివృత్తుల వారికి ప్రధాన వేదికగా నిలుస్తుంది. హస్తకళా నైపుణ్యంతో వారు తయారు చేసిన సంప్రదాయ వస్తువుల అమ్మకాల కోసం ప్రధాన కూడళ్లలోను, ప్రత్యేక మైదానాల్లోను తాత్కాలికంగా దుకాణాలతో ప్రదర్శనశాలలు ఏర్పాటవుతాయి. దేశ విదేశాల నుంచి ఈ కార్నివాల్‌ను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడి చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులను జ్ఞాపికలుగా కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. ఈ ప్రదర్శనశాలలోనే ఆఫ్రికన్ సంప్రదాయ వంటకాలు, విదేశీ వంటకాలతో ఆహారశాలలు కూడా ఏర్పాటవుతాయి. కార్నివాల్ జరిగే నెల్లాళ్లూ విందు వినోదాలు, కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు, శిక్షణ శిబిరాలు, సాంస్కృతిక పరిరక్షణపై చర్చా కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి. -
యువ కథ: ది ప్రపోజల్
డియర్ రియా! ఆఫ్టర్ మచ్ థాట్ ఐ హావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ కెన్ నాట్ సస్టెయిన్ దిస్ ఫీలింగ్ వెరీ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు బి యువర్ పార్టనర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్‌స్టాలో మేసేజ్ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి. ఒక చిన్న మేసేజ్కే ‘యస్’ చెపుతుందని కాదు. కానీ ఒక చిన్న ‘నో’కి కూడా నోచుకోలేకపోయాననే బాధ. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియలేదు కానీ చేసేశాను. ఎలాగైతేనేం తనకి విషయం అర్థం అయితే చాలు. అసలు ఈ మెసేజెస్, కాల్స్‌లో ప్రపోజ్ చేయడం ఏంటి? డైరెక్ట్‌గా చెప్పేస్తే ఏదోఒక సమాధానం వచ్చేది కదా! ఆ ధైర్యమే ఉంటే ఇన్నిరోజులు ఎందుకు ఆలోచిస్తా. ఎప్పుడో చెప్పేసే వాడిని కదా! నన్ను నేను తిట్టుకుంటూ తనని ఆఫీస్‌లో ఎలా ఫేస్ చేయాలో అని భయపడుతూ ఆఫీస్ బాట పట్టాను. బెంగళూరులోని మా ఆఫీస్‌లో రియా నా కొలీగ్. కన్నడ కంటెంట్ రైటర్. నేను తెలుగులో పని చేస్తున్నాను. తనది బళ్ళారి కావడం వలన తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు తనతో పరిచయం తక్కువే. ఆఫీస్‌లో తను మాట్లాడని, తనతో మాట్లాడనివారు ఎవ్వరూ ఉండరు ఒక్క నేను తప్ప. నేను మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదు. తనతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బ్రో అని సంబోధిస్తుంది. తన నుండి ఆ పిలుపుకి నోచుకోకపోవడమే ఉత్తమమని ఆల్మోస్ట్ దూరంగానే ఉంటాను. ఎంత దూరంగా అంటే నా ఎదురు క్యాబిన్ తనదే అయ్యి ప్రతీ అయిదు నిమిషాలకొకసారి గత్యంతరం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత. అయినా సరే నేను మాట్లాడకపోగా తనకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. గడుస్తుంది కాలం తనని చూస్తూ, తన పలుకులను వింటూ, తన ఊహలతో జీవనం గడుపుతూ. ఆ గ్రిల్డ్ చికెన్ తింటూ నేను వేసిన ‘స్నాప్’ చూసి మరుసటి రోజు రెస్టరెంట్ చిరునామా వాకబు చేసింది. నేను లోకేషన్‌తో పాటు టేస్ట్ కూడా షేర్ చేశాను. నోట్లో లాలాజలపాతాలు పొంగాయో ఏమో కానీ ఉన్నపాటున లేచి ‘వెళదాం పదా’ అంటూ నిలబడింది. నన్ను మించిన భోజన ప్రియురాలు కాబోలు అనుకుంటూ వెళదాం అన్నట్టుగా లేచాను. ఈ తంతంతా తెలుగు రాకపోయినా వింటున్న రాజ్దీప్కి ఎంత అర్థం అయ్యిందో గాని ‘నేనూ వస్తా’ అంటూ కదిలాడు. అలా ముగ్గురం నడుచుకుంటూ రెస్టరెంట్‌కి వెళ్ళి ఆర్డర్‌కి ముందు ముచ్చట్లు తిన్నాం. ఆ తర్వాత తనని పీజీ దగ్గర డ్రాప్ చేయడానికి నేను, రాజ్‌దీప్ తీసుకెళుతూ ఉంటే తను మరిన్ని ముచ్చట్లు తినిపించింది. ఎంత బాగా మాట్లాడుతుందో.. ఒక్కోపదాన్ని పేర్చినట్టు, ఆ పదాలు తన నోటి నుండి రావడానికి పోటీ పడుతున్నట్టు.. భాషే కాదు, వ్యక్తీకరణ కూడా సరళంగానే ఉంది. మాటల మధ్యలో రాజ్‌దీప్ ‘అర్జున్ కుక్స్ వెల్’ అని చెప్తే ‘నిజమా విచ్ ఐటెమ్స్ డు యు కుక్ వెల్’ అని అడిగింది. ‘అదీ ఇదీ అని ఏం లేదు అన్నీ చేస్తా’నని బదులిచ్చాను. ‘నీ వైఫ్ చాలా లక్కీ’ అంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అన్నాను. ‘సారీ, ఫ్యూచర్’ అని జోడించింది. ఆ లక్ నీకు ఇస్తున్నానని మనసులో అనుకోబోయి బయటకు అనేశాను ఏమరపాటుగా. నడుస్తున్నది కాస్త ఆగి ఒక్క క్షణం నా వైపు చూసి ‘ముఖద్ మేలే హొడిత్తిని నన్మగ్నే’ అంది కన్నడాలో. నాకు అర్థం కాకపోలేదు. తను ఆ మాట అంటున్నప్పుడు తన ముఖంలో ముసిముసిగా తొణుకుతున్న నవ్వుని గమనించాను. మా మధ్య పెద్దగా మాట పరిచయం లేకపోయినప్పటికీ ఉన్న ముఖ పరిచయంతోనే ఏదో తెలియని బంధం ఏర్పడిందేమోనన్న భావన నాలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావనే లేకపోతే ఈరోజు ఈ క్షణం తనతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడినే కాదేమో! తనతో వేసిన ఆ కొన్ని అడుగులలో నాకు అవసరమైన ఏడు అడుగులను తన అడుగుల్లోనే జాగ్రత్తగా వేస్తూ తన పీజీ దగ్గరకు చేరాము. తనకి ఒక బై చెప్పి, సీ యూ టుమారో అంటూ నేనూ, రాజ్‌దీప్ మా ఫ్లాట్‌కి మేము బయలుదేరాము. ఫ్లాట్‌కి వచ్చి స్నానం చేసి బెడ్ మీద వాలగానే గుండెల్లో ఏదో అలజడి. ఆమెతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మదిని పదేపదే ఢీకొడుతున్నాయి. మా పరిచయం కాస్త స్నేహంగా మారుతుందేమోననే ఆలోచన నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అలా జరిగితే ఆమెకున్న స్నేహితుల్లో నేను ఒకడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక స్నేహితుడిగా ప్రేమను తెలియజేయడం కన్నా ప్రేమికుడిగా ప్రేమను వ్యక్తపరచడం మేలనిపించింది. ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఆ క్షణాన నా మస్తిష్కానికి అంతకన్నా ఉన్నతమైన ఆలోచన తట్టలేదు. ఏదో తట్టినట్టుగా తటాలున టెర్రస్ పైకి వెళ్ళాను. అప్పటికే టైమ్ అర్ధరాత్రి. ఒకటీ యాభై అవుతోంది. కొద్దిసేపు భూగోళాన్ని విడిచి ఆకాశానికేసి చూస్తూ నక్షత్రాల సోయగాల్ని ఆస్వాదిస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి టైమ్ ట్రావెలింగ్ చేసినట్లు అనిపించింది. దాదాపు రెండు దశబ్దాల కాలం ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది. ఆరవ తరగతిలో అనుకుంటా ఊరికి దూరంగా హాస్టల్లో చేర్పించారు. అప్పుడు మొదలైన జీవనపోరాటం ఇప్పుడు ఈరోజు ఈ మహానగరంలో జాబ్ చేస్తూ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి, ట్రాఫిక్ ని జయించి ఫ్లాట్‌కి వచ్చేసరికి రాత్రి అవుతుంది. అప్పుడప్పుడూ టెర్రస్ మీదకు వచ్చినా.. ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ తిరగడం మినహాయించి అంత నిశితంగా ఆకాశానికేసి చూసింది లేదు. ఇప్పుడు ఇలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకుని ఒక్కో నక్షత్రాన్ని జాగ్రత్తగా లెక్కపెట్టిన క్షణాలు గుర్తొచ్చాయి. అదేంటో ఎన్ని అంకెలు జత చేసినా లెక్క తేలేదికాదు. అలసిపోయి ఆదమరిచి నిద్రపోవడం తప్ప ఏనాడూ లెక్క పూర్తి చేసింది లేదు. చుక్క రాలిపడుతున్నప్పుడు మనసులో కోరుకున్నది నిజమైపోతుందని నాయనమ్మ చెప్పిన కథలు మనసులోనే నాటుకుపోయాయి. రియా పట్ల నా ప్రేమ సత్యమైతే, తన ప్రేమను పొందగలను అనేది నా నమ్మకం. ఆ వేళ ఆకాశంలో చుక్కలేవీ రాలి పడటం లేదు. నిలిచి ఉన్న చుక్కలే నా ప్రేమను నిలబడతాయని అనుకున్నాను. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమీ తెలియకపోయినా పెట్టని ఆ సుముహూర్తాన రెండోపొద్దు జామున రెండుగంటల ముప్ఫై ఆరు నిమిషాలకు మేసేజ్ చేశాను. ఏంటో ఈ భావన! భయమో, ఆత్రమో తెలియడం లేదు. రెండుగటలయింది ఆఫీస్‌కి వచ్చి. కానీ తనవైపు తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారే చెమటని ఏసీ కూడా నియంత్రించలేకపోతోంది. ఇదంతా గమనించింది కాబోలు వచ్చి పక్కన కూర్చుంది. గుండె వేగం కాంతితో పాటు పయనిస్తున్నట్లు ఉంది. ఏమీ మాట్లాడకపోయినా నా వైపే చూస్తుందన్న విషయం నాకు అర్థమవుతోంది. మెల్లిగా తన అరచేతిని నా చేతిమీద పెట్టింది. ఎన్ని హిమపాతాలను తోడు తెచ్చుకుందో కానీ ఆ స్పర్శ నా శరీరాన్నే కాదు నా హృదయాన్ని కూడా చల్లబరిచింది. మెల్లిగా తనవైపు తిరిగాను. ‘డు యు థింక్ ఇట్ వాజ్ ఎ ప్రపోజల్?’ అన్నది సున్నితంగా. నాకు నోట మాట రాలేదు. బలవంతంగా గొంతు పెకల్చి ‘ఐ యామ్ సారీ ఫర్ దట్’ అని చెప్పాను. ‘ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు’ అదే సున్నితమైన స్వరంతో. నేను మౌనం దాల్చాను. ‘చూడూ.. ఈ ఫీలింగ్స్, ప్రేమ, వ్యక్తీకరణ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని నేను నమ్ముతాను. వాటి కొరకే జీవించాలి, ఆ భావాలే జీవితాన్ని నడిపిస్తాయి అంటే నమ్మను. నీ ప్రేమను గౌరవిస్తాను. నా మీద నీకున్న ప్రేమకి నా మనసు అంగీకారం తెలిపితే నిన్ను నమ్మి ఎంత దూరమైనా వస్తాను. కానీ ఆ ప్రయాణంలో నా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం ఇష్టపడను. నిన్న పుట్టి ఈరోజు మరణించే ప్రేమలను నేను నమ్మను. నీకు ప్రేమ పుట్టినంత సులభంగా నాకూ పుట్టాలనుకోకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమను ప్లాన్ చేయలేను దానంతట అది జరిగిపోవాలి. ముందు మనిద్దరికిద్దరం అర్థమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థంలేని భావోద్వేగాలతో అనుక్షణం నేను చస్తూ నిన్ను చంపుతూ బతకడం నాకిష్టం లేదు. మనమింకా అర్థం చేసుకునేంత దూరం ప్రయాణించలేదు. ఓపికతో ఉండు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతుంది!’‘నాది ప్రశ్న కాదు ప్రేమ’ అనాలోచితంగా అనేశాను. ‘నాకు ప్రేమ అనేదే పెద్ద ప్రశ్న! దానికి సమాధానం అన్వేషించడానికి నేనిప్పుడు సిద్ధమవ్వాలేమో!’ అంటూ కుర్చీలో నుంచి లేచి తన క్యాబిన్ వైపు అడుగులు వేసింది. ఈ అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా దానికేమన్నా గడువు ఉంటుందా. ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావజాలాలు.. ఇవన్నీ నిరంతరం మారేవే కదా. వీటన్నిటి సమాహారమే కదా మనిషి అంటే. కాలానుగుణ మార్పుల వల్ల కోతకు గురవ్వని మనిషి ఎవరైనా ఉంటారా! మనం మన గతాన్ని తవ్వి చూసుకున్న ప్రతిసారీ మనకు మనమే ఒక నూతన వ్యక్తిగా పరిచయమవుతాం. అలాంటిది ఈ రోజు ఉన్న నన్ను తన భవిష్యత్ మొత్తానికి ఆపాదించుకుని చూసుకోవడం, దానినే అర్థం చేసుకున్నానని భ్రమపడటం హాస్యాస్పదం కాదా? మనిషి మస్తిష్కంలో పొరలు పొరలుగా దాగున్న స్వభావాన్ని, అవే లక్షణాలు కలిగిన మరొకరు తెలుసుకోగలరా. ఒకవేళ ప్రయత్నించినా అది అంత సులభమా. ఇవన్నీ తనతో మాట్లాడలేను. తన కోసం ‘ఎన్సెఫలాటోస్ వూడి’ అనే చెట్టులాగా ఎదురుచూడటం తప్ప నాకు మరొక ప్రత్యామ్నాయం లేదు. మేము జంటగా కోల్పోతున్న ఈ క్షణం గురించి బాధ తప్ప మరో ఆలోచన లేదు. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమి తెలియకపోయినా.. -
ఈవారం కథ: మ్యావ్
తలెత్తి చూసేసరికి ఎదురుగా కనిపించాడు వాడు! నన్ను చూడగానే తత్తరపడ్డాడు. ‘పాడు పిల్లి’ అంటూ ఏవో బూతులు గొణుక్కుంటూ లోపలికి పోయాడు. ఇప్పుడు కాళ్ళు కడుక్కుని కాసేపు ఇంట్లో కూర్చుని వస్తాడు కాబోలు! అసలు పిల్లి ఎదురొస్తే ఈ ఛాందసులు ఎందుకు ఇంతగా భయపడి చస్తారో నాకు ఎప్పుడూ అర్థం కాదు. వీళ్ళని చూసి జాలిపడ్డం తప్ప ఏం చేయలేం!వాడి సంగతి వదిలేసి కలుగు దగ్గరకు వెళ్లి కాచుకు కూర్చున్నాను. ‘ఈరోజు నా చేతిలో ఈ ఎలుకగాడి పని సఫా! ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు’ అనుకున్నాను. ఏమాత్రం శబ్దం చెయ్యకుండా కామ్‌గా వున్నాను. అదను కోసం వేచి చూస్తున్నాను. ఈ ఎలుకగాడు ఏ టైముకి బైటకు వస్తున్నాడో ముందుగానే రెక్కీ నిర్వహించాను. ఆఫీసులకు అందరూ బైల్దేరి పోగానే వీడు బైటకొస్తున్నాడు. ఆ టైములో ఆడవాళ్ళు ఇంకా పనుల బిజీలోనే వుంటారు. కేరేజీలు కట్టి ఇచ్చాక తీరిగ్గా మిగిలిన పనులు చక్కబెట్టుకుంటూ వుంటారు. ఆ టైములో వాళ్ళు వంటగదిని వదిలి బైటకు వస్తారు. అదే సరైన సమయం. ఆ సమయంలో వంటగదిలోకి జొరబడగలిగితే వీడికి ఏదో తిండి దొరుకుతుంది. అదీ వాడి ప్లాన్! కానీ నా ప్లాన్ నాకుంది. సరిగ్గా ఆ సమయంలోనే వాడి కలుగు దగ్గరకు పోయి గప్ చుప్‌గా కూర్చున్నాను. నేను ఊహించినట్టే ఎలుకగాడు బైటికి వస్తున్న చప్పుడయింది. నేను అలర్టయ్యాను. వాడి దుంపతెగ.. తల బైటికి పెట్టి నన్ను చూసేసి వెంటనే మళ్ళీ కలుగులోకి తుర్రుమన్నాడు! నేను అప్పటికీ పంజా విసిరాను. కానీ ఏముంది? పంజాకి మట్టి తగిలింది.. ఎలుకగాడు తప్పించుకున్నాడు! ఇంక ఈరోజుకి వాడు నాకు దొరకడు. నేను ఇక్కణ్ణుంచి వెళ్తే తప్ప వాడు లోపల్నుంచి బైటకు రాడు! నాకు పిచ్చి కోపం వచ్చింది. అంతే కాదు, ఇంకో ఊహ కూడా వచ్చింది. వచ్చేటప్పుడు ఆ దరిద్రపుగొట్టు మొహం గాడు ఎదురుపడ్డం వల్లే ఇలా జరిగిందేమో? నేను ఎదురుపడ్డం వల్ల వాడికేమీ జరిగుండదు కానీ నాకు మాత్రం నా తిండి చేజారిపోయింది. అంటే నేను ఎదురుపడ్డం వల్ల వాడికి నష్టం కాదు, వాడు ఎదురుపడ్డం వల్ల నాకే దరిద్రం! ఇలా ఆలోచించుకుంటూ మళ్ళీ ‘ఛా.. ఇదేమిటి మరీ నేను మనుషుల్లా ఆలోచిస్తున్నాను? వాళ్ళ అజ్ఞానపు ఆలోచనా తీరు నాకు తగులుకుంటోందేమిటి? వాడి వల్ల నాకెందుకు నష్టం జరుగుతుంది? ఈ ఎలుకగాడు మరీ స్మార్ట్ అవడం వల్లే నాకు తిండి దొరకలేదు.. అంతే!’ అనుకున్నాను. నిరాశగా వీధిలోంచి వెళ్తూ వుంటే సుబ్బారాయుడు కన్పించాడు. ఈ సుబ్బారాయుడ్ని అందరూ ‘పిల్లికి కూడా బిచ్చం పెట్టడు’ అంటారు. అతను పరమ పిసినారి అని చెప్పడానికి మధ్యలో మా పేరెందుకు వాడుకుంటారో నాకర్థం కాదు. అసలు మాకు బిచ్చం పెట్టకపోతే పోనీ గానీ వున్నంతలో వాడు మంచి బట్ట కట్టి, మంచి తిండి తింటే చాలు! కానీ దానిక్కూడా ఎంతో ఆలోచిస్తాడు వాడు. అసలు ఈ మనుషులు తరతరాలకి సరిపడా దాచుకోవాలని ఎందుకంత తాపత్రయపడతారో అర్థం కాదు. మమ్మల్ని చూసి ఎప్పుడు నేర్చుకుంటారో ఏమిటో?! ఏ జంతువైనా సరే.. తన పిల్లలు కాస్త ఎదిగేవరకు, స్వయంగా ఆహారం సంపాదించుకునే వరకూ మాత్రమే వాటిని పోషిస్తుంది. తర్వాత వాటి తిండి అవే సంపాదించుకోవలసిందే! మనుషుల్లో మాత్రం తాతలు, తండ్రులు సంపాదిస్తే జల్సాగా ఖర్చు చేస్తూ కష్టపడకుండా హాయిగా బతికేవారు బోలెడు మంది కనిపిస్తారు. ఏదో ఆలోచించుకుంటూ నా బసకు వెళ్తున్నాను. పక్క వీధి చివర ఒక పాడుబడిన ఇల్లుంది. అందులోనే నా నివాసం! ఎదురుగా ఒక సరుకుల వ్యాన్ వెనకాల ఫుల్ లోడ్‌తో వస్తోంది. ఎవరివో ఇంటి సామాన్లు తీసుకెళ్తున్నారు. ఇటువైపు నుంచి ఏదో ఆటో వస్తుండటంతో ఆ ఇరుకుదారిలో వ్యాన్ని ఒక పక్కకు తీసి ఆపారు. డ్రైవర్ పక్కన రామాంజనేయులు గారు కూర్చున్నారు. ఆయన ఇల్లు మారుతున్నారని నాకర్థమైంది. ‘ఈ ఇల్లు మారడమంత దరిద్రం మరొకటి లేదు. ఇంకాస్త పెద్ద ఇల్లు చూసుకుందాం అని మావాళ్ళు ఒకటే పోరుపెట్ట బట్టి మారక తప్పడం లేదు.. గొప్ప యాతన ఇది!’ ధుమధుమలాడుతూ అన్నాడాయన. అసలీ మనుషులకు అన్నీ సమస్యగానే కనిపిస్తాయి. చక్కగా అన్ని గదులతో అమరివున్న ఇంట్లో వున్నా కూడా వారికి సంతృప్తి వుండదు. అలాగని ఇల్లు మారడం కూడా వాళ్లకి పెద్ద సమస్యే! ఏ విషయాన్నైనా భూతద్దంలో పెట్టి చూసి ఏవో లోటుపాట్లు ఎంచుతారు. మరి ఇల్లే లేని మా పరిస్థితి ఏమిటి? మా జాతిలో పిల్లలు చిన్నవిగా వున్నప్పుడు వాటిని సురక్షితంగా వుంచడానికి ఆ తల్లి ఎన్ని పాట్లు పడుతుందో, ఎన్నిసార్లు స్థలాన్ని మారుస్తుందో నాకు తెలుసు. వెళ్ళేదారిలో అదృష్టవశాత్తు కాస్త తినదగిన ఆహారం ఏదో దొరికింది. దాంతో అది తిని నా బసకు వెళ్లాను. కడుపు నిండా తిండి దొరకడంతో కంటి నిండా నిద్రొచ్చింది. పడుకుని లేచేసరికి బైట ఏవో మాటలు వినబడుతున్నాయ్. బైటికి వచ్చాను. ఎదురింటి అరుగు మీద ఎవరో ఇద్దరు కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ‘గేదెను కొనడానికి సంతకు ఎళ్ళినోడివి నీతో పాటు ఆ శంకుగాణ్ణి ఎందుకు తీసుకెళ్ళావ్? ఆడితో పెమాదం! ఎక్కువకి బేరమాడి కొనిపించేస్తాడు. నిజానికి అక్కడి మారు బేరగాళ్ళతో ఈడికి లాలూచీలు వున్నాయి. బేరం సెట్ చేసినందుకు తర్వాతెళ్లి ఆళ్ళ దగ్గర కమీషన్ లాగుతాడు. నాక్కూడా తెలీదు గానీ మొన్న నేను మా తమ్ముడింట్లో కార్యానికి గొర్రెపోతుల్ని కొనడానికెళ్తే పిలవకపోయినా నాతో పాటు తోడొస్తానని వొచ్చాడు. పోతుల్ని కొని ఇంటికి తెచ్చాక తెలిసింది ఈడి నిర్వాకం. అక్కడ నన్ను ఎరిగిన మనిషొకడు తర్వాత కనిపించి ఈడి విషయం సెప్పాడు. ఎప్పుడూ ఈణ్ణి ఎంటబెట్టుకు రావొద్దని కూడా సెప్పాడు’ అందులో ఒకడు పక్కవాడితో అన్నాడు.‘అయితే నేను కూడా మోసపోయానేమో.. ఎక్కువ ఇచ్చేస్తున్నానని అనిపించింది గానీ వీడే పక్కనుంచి మంచి బేరం.. మంచి గేదె.. ఇంతకంటే తక్కువకి రాదు అని ఊదరగొట్టి కొనిపించాడు. అసలు సంగతి ఇదా?’ పక్కవాడు కోపం, ఉక్రోషం కలిసినట్టుగా అన్నాడు.‘మరింకేటనుకున్నావ్.. నన్నయినా అడిగావు గాదు.. నీకు తోడు వద్దును కదా.. పెళ్ళికి ఎళ్తూ పిల్లిని సంకనబెట్టుకు ఎళ్లినట్టు ఆణ్ణి తీసుకెళ్ళావ్’ అన్నాడు మొదటివాడు. చెప్పొద్దూ.. వాళ్ళ సంభాషణ వింటున్న నాకు ఒళ్ళు మండిపోయింది. వెళ్లి ఆ సామెత చెప్పిన వాణ్ణి గోళ్ళతో రక్కేద్దునా.. అనిపించింది. ఎవడో ఏదో వెధవపని చేస్తే మధ్యలో మమ్మల్నెందుకు తీసుకువస్తారు? బాగా అనువైపోయాం వీళ్ళకి!చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయాను. కాసేపయ్యాక కాలు నిలవక మళ్ళీ బైటికొచ్చాను. ఎదురింటి అరుగు మీద కూర్చున్న వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అప్పుడే కనుచీకటి పడుతోంది. వీధి లైట్లు వేసినట్టున్నారు. అవి గుడ్డిగా వెలుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక బక్కచిక్కిన ముసలి వ్యక్తి ఎదురింట్లోకి వెళ్ళడం గమనించాను. ఆ ఇంట్లో వుండే సుబ్బారాయుడు ఏదో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. మంచి ఉద్యోగమంటే నా ఉద్దేశం అందర్నీ తన చుట్టూ తిప్పుకునే ఉద్యోగం! అతను పెన్షన్లు మంజూరు చెయ్యడం, రిటైరైన వారి పాత బకాయిలు విడుదల చెయ్యడం లాంటి పనులు చూసే సీట్లో వున్నట్టున్నాడు. అందువల్ల పాపం ముసలీ.. ముతకా అతని చుట్టూ తిరిగి, అతను అడిగిన డబ్బులు సమర్పించుకుని తొందరగా తమ పని చేసిపెట్టమని వేడుకుంటారు. ఈ వేళప్పుడు అతని ఇంటికి వచ్చేవారంతా అలాంటివారే! ఈ ముసలాయన కూడా అలాంటి బాపతే లాగుంది. దర్శనం ఇచ్చే దేవుడిలాగా బైట వున్న పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చుని వున్నాడు సుబ్బారాయుడు. ఈ బక్కచిక్కిన శాల్తీ కూడా అతని ముందు నిలబడి ఏదో విన్నవించుకుని, ఆపైన మరేదో సమర్పించుకుని దణ్ణాలు పెడుతూ బైటపడ్డాడు. ఈ సుబ్బారాయుడు రోజూ ఉదయాన్నే పెద్ద గొంతేసుకుని అవేవో స్తోత్రాలు చదువుతూ దేవుణ్ణి తెగ పూజిస్తాడు. అవన్నీ నాకు వినబడుతూనే వుంటాయి. సాయంత్రమయితే తనే ఇలా వరాలిచ్చే దేవుడి అవతారమెత్తుతాడు. ఇక్కడ ఎవడి డ్యూటీ వాడు చెయ్యడానికి కూడా లంచాలు కావాలి! పైగా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ అవినీతిపరుల్లో చాలామంది గొప్ప దైవభక్తులు! తాము చేసే వెధవ పనులు దేవుడు చూడ్డం లేదులే అనుకుంటారో ఏమిటో తెలీదు. వాళ్ళు చేసే పూజలు భగవంతుడు చూసి సంతృప్తి చెంది వరాలిస్తాడనీ, ఈ తప్పుడు పనుల్ని మాత్రం పట్టించుకోడనీ వాళ్ళ నమ్మకం! పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడ్డం లేదని అనుకుంటుందని మామీద సెటైర్లు వేస్తారు. కానీ ఇలాంటి వాళ్లకి ఆ సామెత సరిగ్గా సరిపోతుంది. వీళ్ళు ఏదో ఒకరోజు దెబ్బతినిపోకుండా వుంటారా? అని కసిగా అనుకున్నాను. కానీ అంతలోనే పిల్లి శాపనార్థాలకు కూడా ఫలితం వుంటుందా? అనే మాట గుర్తొచ్చి నాకే నవ్వొచ్చింది. మర్నాడు ఉదయం మామూలుగానే ఆహారవేటకు బైల్దేరుతుండగా పక్కవీధిలో వుండే నల్లపిల్లిగాడు వచ్చి నా ఎదురుగా నిలుచున్నాడు. వాడెందుకు నా డెన్‌కు వచ్చాడో నాకస్సలు అర్థం కాలేదు. ‘ఏంటి మావా ఇలా వచ్చావ్? నీది రాజభోగం కదా.. ఆ వీధి గుండా వెళ్ళేటప్పుడు గేటు లోపలున్న నిన్ను చూస్తుంటాను. కనీసం ఎవరినీ పట్టించుకోవు. అయినా మాలాంటి వీధి పిల్లులంటే నీకెందుకు లెక్కుంటుందిలే.. ఎంతైనా నువ్వు పెంపుడు పిల్లివి కదా! ఇంతకీ ఇక్కడికెందుకు వచ్చావు?’ కాస్త ఆశ్చర్యంతోనూ, కొంత అసూయతోనూ అడిగాను.వాడు విషాదంగా నవ్వి ‘ఏం చెప్పమంటావు మావా.. నా యజమాని నన్ను చాలా బాగా చూసుకునేవాడు. బైట పిల్లులతో అస్సలు కలవనిచ్చేవాడు కాదు. చిన్నపిల్లగా వుండగా బుజ్జిగా వున్న నన్ను చూసి ముచ్చట పడి తెచ్చుకున్నాడు. వాడు కూడా మన వూరి నల్లరాయి కొండలాగా కారునలుపుగా వుండడం కారణమేమో తెలీదు గానీ నా నల్లరంగంటే వాడికి మహా ఇష్టం. కానీ ఇప్పుడు ఆ నల్లరంగే నా కొంపముంచింది. ఎవడో తలకుమాసినవాడు నల్లపిల్లి ఇంట్లో వుంటే అరిష్టం అని చెప్పాడట! అంతేకాదు.. నల్లపిల్లుల్ని మంత్రగత్తెలు పెంచుకుంటారు అని కూడా చెప్పాడట. అంతే! మా యజమాని నన్ను వున్నపళంగా బైటికి గెంటేశాడు!’ విచారంగా చెప్పాడు.మనుషులు మరీ ఇంత మూర్ఖుల్లాగా ఎందుకుంటారో నాకెప్పటికీ అర్థం కాదు. అయినా ఈ నల్లపిల్లిగాడిని ఎదురుగా చూస్తూండేసరికి మళ్ళీ వాడి పూర్వపు ప్రవర్తన గుర్తొచ్చి మంటెక్కింది.‘వీడి తస్సాదియ్యా.. వీడు ఎంత పోజు కొట్టేవాడు? బాగా అయిందిలే..’ అనుకున్నాను. కానీ ఎంతైనా సాటి పిల్లే కదా అని జాలి కలిగింది. ఈ మనుషులు ఎంత తొందరగా బంధాల్ని తెంచుకుంటారు? అనిపించింది. ‘సరే. చేసేదేముంది? నువ్వూ ఇక్కడే వుండు. దొరికిందేదో తిని బతుకుదాం’ అన్నాను.ఆ నల్లపిల్లిగాడు అప్పట్నుంచి నా డెన్లోనే వుంటున్నాడు. వాడు అంతవరకూ పెంపుడు పిల్లిగా వుండటం వలన ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం రాలేదు. వాడు వున్న ఇంట్లో ఎలుకలు కూడా లేకపోవడం వల్ల వేటాడాల్సిన పని లేకపోయింది. దాంతో వాడు వేటాడటంలో నైపుణ్యాన్ని కూడా కోల్పోయాడు. అందువలన వాడికి నేనే ఆహారం సంపాదించి పెట్టాల్సివచ్చింది. సరే.. పోనీ అని నేను కూడా వాడిని బాగానే చూసుకుంటున్నాను. వేటాడటం, ఆహార సంపాదనలో వాడు కాస్త రాటుదేలేవరకూ నేనే అండగా వుంటానని కూడా మాటిచ్చాను.కానీ ఏం లాభం? నేను ఆశ్రయమివ్వడం కాదు గానీ వాడు నాకే ఎసరు పెట్టే పని చేశాడు. నాకెంతో ప్రియమైన నా డాళింగ్ పిల్లికి వాడు లైనెయ్యడం మొదలుపెట్టాడు. నా డాళింగ్ పిల్లి ఎదురింట్లోనే వుంటుంది. అది ఎదురింటి వాళ్లకి ప్రియమైన పెంపుడు పిల్లి! అసలు ఈ దిక్కుమాలిన ఇంట్లో ఏమీ సౌకర్యంగా లేకపోయినా ఇక్కడ వుంటున్నది ఎదురింట్లో వుంటున్న నా డాళింగ్ పిల్లి కోసమే! ఈ నల్లపిల్లి గాడొచ్చి మొత్తం సీన్ రివర్స్ చేశాడు. ఒళ్ళంతా తెల్లగా మెరిసిపోయే వెంట్రుకలతో, లేతాకు పచ్చని కళ్ళతో ఎంతో అందంగా వుండే నా డాళింగ్ పిల్లి ఇప్పుడు వాడి మాయలో పడింది. వాడి వైపే కులుకులొలికిస్తూ చూస్తోంది. నల్లపిల్లి గాడు నిన్న మొన్నటి వరకూ పెంపుడు పిల్లే కదా.. బహుశా పెంపుడు పిల్లులకు ఒకేరకమైన అభిరుచులు, ఆలోచనలు వుంటాయేమో మరి?!నల్లపిల్లిగాడంటే నాకు ద్వేషం మొదలైంది. ఇప్పుడు వాడి ఆహారం వరకూ వాడే తిప్పలు పడుతున్నాడు. ఆ పని అవగానే అవతల నా డాళింగ్ పిల్లి గేటు లోపల తచ్చాడుతుంటే వీడు బైట నిల్చుని దానికి సైట్ కొడుతున్నాడు. నాకు లోపల్నుంచి ఉక్రోషం తన్నుకొస్తోంది. అంతకుముందు మా చూపులు కలిసేవి గానీ ఈ నల్లపిల్లిగాడు సీన్లోకి వచ్చిందగ్గర్నుంచీ నా డాళింగ్ పిల్లి నావైపు చూడ్డమే మానేసింది. నాలాంటి కేరాఫ్ ఫ్లాట్ ఫామ్ గాడికి నా డాళింగ్ పిల్లి మనసులో చోటు లేదేమో! అయినా ఇప్పుడు నల్లపిల్లి గాడు కూడా పెంపుడు పిల్లి కాదు కదా.. నా దగ్గరే పడి వుంటున్నాడు. ఏదేమైనా ఈ విషయం నా గుండెను రగిలిస్తోంది. తప్పకుండా ఏదో ఒకటి చేసి నా డాళింగ్ పిల్లి ప్రేమను సొంతం చేసుకోవాలి.. ఈ నల్లపిల్లి గాడిని ఎలాగైనా నా దారి నుంచి తప్పించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను.ఆలోచించగా ఒక మంచి పథకం తట్టింది. రోజూ సాయంత్రం నా డాళింగ్ పిల్లిని బైట లాన్లో వదులుతారు. అది స్వేచ్ఛగా అక్కడ తిరుగుతుంది. ఆ టైములోనే ఈ నల్లపిల్లిగాడు అక్కడక్కడే గేటు బైట తచ్చాడుతాడు. మళ్ళీ ఆ పిల్లి ఇంటి లోపలికి వెళ్లిపోయాకే మా నల్లపిల్లిగాడు తిరిగి మా ఇంటికొస్తాడు. ఆ వచ్చేదారిలో బాట పక్కనే ఒక పెద్ద కాలువ వుంది. వర్షాకాలం కావడం మూలాన అది పొంగి ప్రవహిస్తోంది. నల్లపిల్లిగాడు వచ్చేటప్పుడు నేను సరిగ్గా మధ్యలో వున్న చెట్టు పక్కనే నక్కి నిల్చుంటాను. వాడు నన్ను గమనించలేడు. నా దగ్గరికి రాగానే అదాటున వాడి మీద పడి కాలవలోకి తోసేస్తాను. అందులో పడి కొట్టుకుపోతాడు. అక్కడితో వాడి పీడ నాకు విరగడవుతుంది. ఈ ఆలోచన వచ్చిన దగ్గర్నుంచీ నాకు ఒకటే ఆత్రుతగానూ, కొంత ఆందోళనగానూ వుంది. ఆందోళన అంటే మరేం లేదు.. నేను అనుకున్నది సరిగ్గా జరుగుతుందా? లేదా? అని! ఆ సాయంత్రం చెట్టు పక్కన నిల్చున్నాను. నా గుండె కొట్టుకునే చప్పుడు నాకే వినిపిస్తోంది. అప్పుడప్పుడూ దారి వైపు తొంగి చూస్తున్నాను. కాసేపయ్యేసరికి నల్లపిల్లిగాడు ఎదురుగా వస్తూ కనిపించాడు. నేను అలర్టయ్యాను. వాడు నోటితో ఏదో గిన్నె కరుచుకుని వస్తున్నాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ తొంగిచూశాను. సరిగ్గా అప్పుడే నల్లపిల్లిగాడు నన్ను చూసేశాడు. గిన్నె కిందన దించి ‘మావా.. ఇలారా’ అని కేకేశాడు. చేసేదేమీలేక వాడి దగ్గరకు వెళ్లాను. ‘రాణీ లేదూ.. ఏం చేసిందనుకున్నావ్?’ ఉత్సాహంగా అన్నాడు. రాణి అంటే నా డాళింగ్ పిల్లి పేరు.‘ఏం చేసింది?’ నిరాసక్తంగా అడిగాను‘దానికి పెట్టిన తిండి గిన్నెను నోట కరుచుకుని గేటు కింద నుంచి నాకు అందించింది. నన్ను తినమంది. నేనేం చేశాననుకున్నావ్? వెంటనే ఆ గిన్నెను నోట కరుచుకుని చక్కా వచ్చాను. చూశావా.. చిన్న చిన్న చేపలు! ఇలాంటివి మనకెక్కడ దొరుకుతాయి? అందుకే నీకోసమే ఎత్తుకొచ్చాను. నేను తిండి సంపాదించుకోలేనప్పుడు నువ్వే నాకు తిండి పెట్టి బతికించావు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను మావా.. అందుకే ఈ తిండి నీకోసమే తీసుకొచ్చాను.. తిను..’ నావంకే ఆప్యాయంగా చూస్తూ అన్నాడు నల్లపిల్లిగాడు. నా బుర్ర తిరిగిపోయింది. అరె.. వీణ్ణి నేను ఎంత అపార్థం చేసుకున్నాను? కాలవలో తోసి చంపాలనుకున్నాను. నేనసలు పిల్లినేనా? నేను కూడా మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నానేమిటి? అయినా నేను రాణికి లైన్ వేస్తున్నట్టు వీడికి తెలీదు కదా! అంచేత వాడి పాట్లేవో వాడు పడుతున్నాడు. అందులో తప్పేముంది? నేనే అనవసరంగా ఏదేదో ఆలోచించి వాడి మీద కక్ష పెంచుకున్నాను. ఛీ.. ఛీ.. నాదీ ఒక జంతువు జన్మేనా? మనిషి కంటే దిగజారిపోయాను! నామీద నాకే అసహ్యం వేస్తోంది.‘ఏవిటి మావా అలా వుండిపోయావ్? తిను మావా..’ మళ్ళీ అన్నాడు వాడు.‘కాదులే.. ఇవి మనిద్దరం కలిసి తిందాం. మన స్నేహానికి గుర్తుగా ఈ చేపలవిందు చేసుకుందాం’ అన్నాను. వాడు సంతోషంగా తలూపాడు. ఇద్దరం కలిసి ఆ చేపల్ని ఇష్టంగా తింటున్న సమయంలో నేను మరోసారి గుర్తు చేసుకున్నాను, నేను మనిషిని కాదు.. పిల్లిని! ఇక ఎప్పటికీ మనుషుల్లాగా ఆలోచించకూడదు అని!∙ -
ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ!
‘ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, ముఖమే మనసుకు ప్రతిబింబం అన్నమాట! అలాగే, ఇల్లు కుటుంబ సభ్యుల మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఒద్దికగా సర్దుకుంటే, ఇల్లే స్వర్గసీమలా ఉంటుంది. చిందర వందరగా ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యులు గందరగోళంగా ఉంటారు. ఇంటిని ఒద్దికగా సర్దుకోవడం ఒక కళ. ఇంటి నిండా రకరకాల పనులు చేయడానికి మనుషులు ఉంటారు కాబట్టి సంపన్నుల ఇళ్లు మాత్రమే చక్కగా ఉంటాయి అనుకుంటే పొరపాటే! మనసుంటే, సామాన్యులు కూడా ఇంటిని శుభ్రంగా, చూడచక్కగా తీర్చిదిద్దు కోగలుగుతారు. ఇంటిని చూడముచ్చటగా తీర్చిదిద్దుకునే పద్ధతులపై జపానీస్ యువతి మేరీ కొండో చెబుతున్న పాఠాలు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. మేరీ కొండో ముద్దుపేరు ‘కోన్‌మారీ’. ఇల్లు సర్దుకోవడంలో ఈమె సూచించిన పద్ధతి ‘కోన్‌మారీ’ పద్ధతిగా ప్రసిద్ధికెక్కింది. కోన్‌మారీ కథ, ఆమె పద్ధతి కమామిషూ తెలుసుకుందాం..జపాన్‌లోని ఒసాకా నగరంలో పుట్టిన మేరీ కొండోకు ఇంటిని చక్కగా సర్దుకోవడం అంటే ఐదేళ్ల వయసు నుంచే ఇష్టమైన వ్యాపకంగా ఉండేది. ఆ వయసు పిల్లలు బొమ్మలతో ఆటలాడుతుంటే, ఆమె మాత్రం ఇల్లు సర్దడంలో తలమునకలుగా ఉండేది. అప్పట్లో జపాన్ మాత్రమే కాదు, పలు ఇతర దేశాల్లోనూ చైనీస్ వాస్తు పద్ధతి ‘ఫెంగ్ షుయి’ వేలంవెర్రిగా ఉండేది. ఇంచుమించుగా ‘ఫెంగ్ షుయి’లాంటి ‘ఫు సుయి’ అనే పురాతన పద్ధతి జపాన్‌లో వాడుకలో ఉంది. ఇంటి అలంకరణలో మేరీ కొండో తల్లి ‘ఫు సుయి’ పద్ధతులు అనుసరించేది. చిన్నారి కొండో అదంతా గమనిస్తూ ఉండేది. ఊహ తెలిసి, కొంత ఎదిగిన తర్వాత ఇంటిని ఒద్దికగా సర్దుకోవడానికి, అందంగా తీర్చిదిద్దుకోవడానికి కేవలం ‘ఫెంగ్ షుయి’, ‘ఫు సుయి’ వంటి పద్ధతులు సరిపోవని గుర్తించింది. ఇంటిని మరింత ఒద్దికగా, చూడముచ్చటగా సర్దుకోవడంలో తనదైన శైలిలో ప్రయోగాలు మొదలుపెట్టి, అద్భుతమైన ఫలితాలను సాధించింది. అలా మొదలైందిమేరీ కొండో చిన్నప్పటి నుంచి తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని చాలా ఇళ్లను గమనిస్తూ వచ్చేది. ఇల్లు సర్దుకోవడంలో తన ఇంటి చుట్టుపక్కల జనాలు అనుసరించే పద్ధతులను నిశితంగా పరిశీలించేది. ‘ఫెంగ్ షుయి’, ‘ఫు సుయి’ పద్ధతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ అలంకరించిన ఇళ్లను కూడా చూసేది. ఇవన్నీ చూసినా, ఆమెకు వాటిలో ఏదో లోపం ఉన్నట్లే అనిపించేది. తన ఇంట్లోనే తల్లికి చేదోడుగా ఇంటిని చక్కగా సర్దుకోవడంలో రకరకాల ప్రయోగాలు చేసేది. జూనియర్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంటర్వెల్లో పిల్లలంతా ఆడుకోవడానికి బయట మైదానంలోకి వెళితే, మేరీ కొండో మాత్రం తరగతి గదిలోని పుస్తకాల షెల్ఫులను చక్కగా సర్దిపెట్టేది. ఆమె పనికి టీచర్ల ప్రశంసలు లభించేవి. తాను ఉన్న పరిసరాలను శుభ్రంగా, చూడచక్కగా సర్దుకోవడం అప్పట్లోనే ఆమెకు వ్యామోహంగా మారింది. ఒకనాడు స్కూల్లోని పుస్తకాల షెల్ఫులను నిర్విరామంగా సర్దుతుండగా, విశ్రాంతి లేకపోవడం వల్ల స్పృహతప్పి పడిపోయింది. రెండు గంటల తర్వాత ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. ఈ సంఘటనే తన జీవితాన్ని మలుపు తిప్పిందని మేరీ కొండో చెబుతుంది. ‘ఆ రోజు పుస్తకాల షెల్ఫులు సర్దుతుండగా, స్పృహ తప్పిపోయాను. రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాను. ఏం జరిగిందో అర్థంకావడానికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. ఇల్లు, స్కూలు సర్దుకోవడంలో నేను అప్పటి వరకు చేస్తూ వచ్చిన పొరపాటు నాకు తెలిసి వచ్చింది. అప్పటి వరకు పనికిరానివి పారేస్తూ, కొద్దిపాటి వస్తువులను చూడముచ్చటగా కనిపించేలా సర్దుతూ వచ్చేదాన్ని. ఆ తర్వాత నా పద్ధతిని మార్చుకున్నాను. పారవేయాల్సిన వస్తువుల పనిపట్టడం బదులుగా, అట్టే పెట్టుకోవలసిన వస్తువులను ఎలా సర్దుకోవాలనే దానిపై దృష్టిపెట్టడం మొదలుపెట్టాను. మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఇచ్చే వస్తువులను కంటికి ఇంపుగా కనిపించేలా సర్దుకోవడం ప్రారంభించాను’ అని చెబుతుందామె. బడి చదువు పూర్తయ్యాక మేరీ కొండో టోక్యో విమెన్స్ క్రిస్టియన్ యూనివర్సిటీలో సోషియాలజీ చదువుకుంది. ఆ తర్వాత ఒక షింటో ఆలయంలో అటెండెంట్‌గా ఐదేళ్ల పాటు సేవలందించింది. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక పూర్తి స్థాయిలో ఇల్లు, బడి, ఆఫీసు వంటివి చక్కగా సర్దుకునే పద్ధతులపై సలహాలు, సూచనలు ఇవ్వడాన్నే వృత్తిగా మార్చుకుంది.సంతోషాల వెలుగుమేరీ కొండో వస్తువులను చక్కగా సర్దుకోవడంలో కనిపెట్టిన పద్ధతి ‘కోన్‌మారీ’గా పేరు పొందింది. జపానీస్ భాషలో ‘కోన్‌మారీ’ అంటే సంతోషాల వెలుగు అని అర్థం. వస్తువులను త్వరగా, చూడముచ్చటగా, పరిపూర్ణంగా ఎలా సర్దుకోవాలో చెప్పే ఈ పద్ధతికి జపాన్‌లోనే కాకుండా, మరో ముప్పయి దేశాలలో అనతికాలంలోనే జనాదరణ పెరిగింది. ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మన పరిసరాల్లో మన సంతోషాన్ని పెంచే వస్తువులను చూడముచ్చటగా సర్దుకోవడం, మనకు ఏమాత్రం సంతోషం కలిగించని వాటిని వదుల్చుకోవడమే ‘కోన్‌మారీ’ పద్ధతి. ‘కోనామారీ’కి ఆదరణ పెరగడంతో మేరీ కొండోపై పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు దృష్టి సారించాయి. కొన్ని చానళ్లు ఆమెతో ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. ఇంకొన్ని ఆమెతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి రేటింగులను పెంచుకున్నాయి. ఒక టీవీ చానల్లో ప్రసారమైన ‘స్పార్కింగ్ జాయ్ విత్ మేరీ కొండో’ కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ లభించింది. వస్తువులను సర్దుకోవడంపై మేరీ కొండో ఇప్పటి వరకు ఆరు పుస్తకాలు రాసింది. అవి చాలా భాషల్లోకి అనువాదం పొందాయి. లక్షలాది కాపీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. షింటో బోధనల స్ఫూర్తితో తాను ‘కోన్‌మారీ’ పద్ధతికి రూపకల్పన చేసినట్లు మేరీ కొండో చెబుతుంది. ‘కోన్‌మారీ’ పద్ధతి చాలా సరళమైనది. ఇంట్లోని వస్తువులను రకాల వారీగా విభజించుకోవడం ఇందులోని మొదటి ప్రక్రియ. అంటే, దుస్తులు, పుస్తకాలు, కాగితాలు, పాత్రలు, డబ్బాలు– ఇలా ఒక్కోరకం వస్తువులను ఎంపిక చేసుకుని, ముందుగా ఒకచోట పోగు పెట్టాలి. తర్వాత వాటిలో మనకు పనికొచ్చే వాటిని, మనకు సంతోషం కలిగించే వాటిని ఏరుకుని, వాటిని పొందికగా సర్దుకోవాలి. పనికిరాని వాటిని పారేయాలి. ఇంతే! ఈ పని చేస్తే చాలు, ఇంటి తీరుతెన్నులే మారిపోతాయి. ఇంట్లోకి అడుగుపెడుతూనే ప్రశాంతంగా అనిపిస్తుంది. జపాన్ నుంచి అమెరికాకుమేరీ కొండో ఒసాకోలోనే పనిచేసే కవాహరా తకుమిని 2012లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కవాహరా ఒసాకోలోని ఒక కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేసేవాడు. ‘కోన్‌మారీ’కి ఆదరణ పెరిగి మేరీ కొండో కెరీర్ నిలదొక్కుకున్నాక కవాహరా ఉద్యోగం మానేసి, భార్యకు పూర్తిస్థాయి మేనేజర్‌గా మారాడు. తర్వాత ఈ దంపతులు ‘కోన్‌మారీ’ మీడియా సంస్థను నెలకొల్పారు. కవాహరా మీడియా సంస్థకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, మేరీ కొండో సంస్థకు చెందిన సృజనాత్మక వ్యవహారాలను చూసుకుంటోంది. సంస్థను మరింతగా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ దంపతులు అమెరికా చేరుకున్నారు. తొలుత శాన్ఫ్రాన్సిస్కోలో కొన్నాళ్లు ఉన్నాక, తర్వాత లాస్ ఏంజెలెస్‌కు మకాం మార్చి, ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. అమెరికాకు తరలిపోయిన తర్వాత ‘కోన్‌మారీ’కి పాశ్చాత్య ప్రపంచంలో ఆదరణ బాగా పెరిగింది. మేరీ కొండో ‘యూట్యూబ్’లోను, ‘ఇన్స్టాగ్రామ్’లోను పెడుతున్న వీడియోలకు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘కోన్‌మారీ’ పద్ధతిలో ఇల్లు సర్దుకోవడం చాలా సులువు. ఈ పద్ధతిలో ఒద్దికగా ఇంటిని సర్దుకున్నట్లయితే, ఇల్లే కదా స్వర్గసీమ అన్నట్లుగా ఉంటుంది.కోన్‌మారీ చిట్కాలుఒక టీవీ కార్యక్రమంలోమేరీ కొండో చెప్పిన చిట్కాలు ఇవి:⇒ఇల్లు ఎలా ఉంటే ఇంట్లో సౌకర్యంగా, సంతోషంగా ఉండటం సాధ్యమవుతుందో ఊహించండి. మీ ఊహలను అమలు పెట్టడానికి ప్రయత్నించండి.⇒ఇంట్లో ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వని వస్తువులు పడి ఉంటే, వాటిని వదుల్చుకోండి. దానివల్ల కొంత చోటు ఖాళీగా మిగులుతుంది. ఇల్లు విశాలంగా ఉన్నట్లు అనిపిస్తుంది.⇒ప్రతి వస్తువుకు దానిదైన చోటును నిర్దేశించుకోండి. ఆ వస్తువు అక్కడే ఉండేలా సర్దుకోండి.⇒అలాగని తక్కువ చోటులో ఎక్కువ దుస్తులను పట్టించాలనే ప్రయత్నంలో వాటిని కుక్కేయకండి. వాటిని జాగ్రత్తగా మడతపెట్టి, తిరిగి సులువుగా వాడుకునేలా సర్దుకోండి.⇒బాగా సంతోషాన్ని ఇచ్చే వస్తువులను ఇంట్లోకి అడుగుపెడుతూనే కనిపించేలా పొందికగా సర్దుకోండి.⇒నిలువుగా ఎక్కువ అరలతో ఉండే వార్డ్‌రోబ్‌లలో మడతపెట్టిన దుస్తులను సర్దిపెట్టుకోండి. దానివల్ల చాలా చోటు కలిసొస్తుంది.⇒గోడలకు ఫొటో ఫ్రేములు, చిత్రపటాలు అతిగా వేలాడదీయకండి. పూలకుండీలను ఇరుకిరుకు మూలల్లో ఉంచకండి. -
మ్యాజిక్ స్టయిల్
ప్రతిభ ఉన్న చోటికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి నిదర్శనం స్టయిలిస్ట్ రిద్ధి మెహతా! తన మ్యాజిక్ స్టయిలింగ్‌తో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరిట్‌గా మారిన ఆమె గురించి కొన్ని వివరాలు..ముంబైలో పుట్టిపెరిగిన రిద్ధికి చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఉండేది. ఆ మక్కువనే కెరీర్‌గా మలుచుకోవాలని కాలేజ్ డేస్‌లో నిర్ణయించుకుంది. డిగ్రీ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి, లండన్‌కి వెళ్లి ఫ్యాషన్ కోర్సు చేసింది. ముంబైకి తిరిగొచ్చి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమీ పటేల్ దగ్గర ఇంటర్న్‌గా చేరింది. ఫ్యాషన్ ప్రపంచంలో అమీకి మంచి పేరు ఉంది. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ అమీ ఫేవరిట్! అందుకే ఆమె దగ్గర ఇంటర్న్‌గా వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంది రిద్ధి. పనిలో మెలకువలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్ స్టయిలింగ్ తీరుతెన్నులనూ బాగా గమనించింది. తనలోని సృజనకు ఆ పరిశీలనను జోడించి ప్రతిభను ప్రదర్శించి, సెలబ్రిటీల దృష్టిలో పడింది. అప్పుడే నటి ప్రియంకా చోప్రా పెళ్లిలో, రిద్ధికి అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా చాన్స్ దొరికింది. పలువురు బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు సింప్లీ సూపర్బ్ దుస్తులు, వెరీ లైట్ ఆభరణాలతో గ్రాండ్ లుక్‌ని తెచ్చి..పెళ్లంటే భారీ దుస్తులు, బరువైన నగలే అనుకున్న వారి అభిప్రాయాన్ని మార్చేసింది. తన స్టయిలింగ్‌తో మ్యాజిక్ చేసింది. అభినందనలు అందుకుంది. తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి వేడుకలకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా ఎంచుకున్నారు. అలా అమీ దగ్గర పనిచేస్తూనే రిద్ధి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా చాన్సెస్ పొందింది. బాలీవుడ్లో తన స్థానాన్ని పదిలపరచుకుంది. కంఫర్ట్‌తో పాటు గ్రాండ్ లుక్ నిచ్చే రిద్ధి డిజైన్స్, స్టయిలింగ్‌ను మెచ్చి ఆలియా భట్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్యా పాండే, సారా అలీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్స్ ఆమెను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఇంకెందరో వర్ధమాన నటీనటులను స్టయిలిష్ స్టార్స్‌గా తీర్చిదిద్దుతోంది రిద్ధి. -
ఆకాశంలో సగమంతా గాయమే
ప్రకృతి అంటేనే వైవిధ్యం.. అందులో భాగమే స్త్రీ.. పురుషులు! దానర్థం ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అని కాదు! ఒకరి మీద ఒకరి ఆధిపత్యం ఉండాలనీ కాదు!ఇద్దరూ సమానమే అని, ప్రగతికి ఇద్దరి శక్తియుక్తులూ అవసరమే అని! దీన్ని చాటడానికి, వైవిధ్యం అంటే వివక్ష అని అపార్థం చేసుకున్న ప్రపంచాన్ని చైతన్యపరచడానికి యూఎన్ఓ ప్రతి ఏడు నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్) దినంగా పరిగణిస్తోంది.స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ శక్తి, స్త్రీ సాధికారత, స్త్రీ–పురుష సమానత్వం.. ఎట్సెట్రా చెప్పుకోవడానికి, వినడానికి, రాసుకోవడానికి, చర్చించడానికి బాగుంటాయి! డిక్షనరీలో అర్థాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి!నిజ జీవితంలో మాత్రం.. ఇంటి నుంచి ఆన్లైన్ దాకా మహిళలపై జరుగుతున్న శారీరక, భావోద్వేగ, మాటల దాడులెన్నో కనిపిస్తాయి. అసలు మహిళల విషయంలో ప్రపంచంలోని ఏ దేశమూ పర్ఫెక్ట్గా లేదని తేలింది ‘విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ (డబ్ల్యూపీఎస్)’ సర్వేలో! మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో డబ్ల్యూపీఎస్ 177 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది. అందులో ఏ దేశమూ వందకు వంద మార్కులు తెచ్చుకోలేదు. ఉన్నదాంట్లో చూస్తే మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో మెరుగైన దేశంగా డెన్మార్క్‌కు మొదటి స్థానం వచ్చింది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లండ్, స్వీడన్, ఫిన్లండ్, లక్సంబర్గ్, ఐస్లండ్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లండ్స్, న్యూజీలండ్ దేశాలు ఉన్నాయి. ఆ జాబితాలో మన దేశం 128వ స్థానంలో నిలిచింది! గత ఏడేళ్లతో పోల్చుకుంటే మనం 20 స్థానాలు ఎగబాకి కాస్త మెరుగుపడ్డాం. అట్టడుగున అఫ్గానిస్థాన్ కనిపించింది. ఇక మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక కూడా మహిళలపై హింస (డొమెస్టిక్ వయొలెన్స్ వగైరా) ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెబుతోంది. అందుకు ఉదాహరణలను చూడండి.. ‘నాకిష్టం లేదు అని చెబితే ఆ మాటను రెస్పెక్ట్ చేయాలి కదా! ఆయన కోరికకు మానసికంగా నేను రెడీగా ఉన్నానా.. లేదా అని పట్టదా? నేనేం యంత్రాన్ని కాను కదా..! భర్తయినంత మాత్రాన భరించాల్సిందేనా.. అర్థం చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదా!’‘ఆ విషయంలో నన్ను మా ఆయన ఇబ్బంది పెట్టని రోజు లేదు. ఇంట్లో కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు తిరుగుతుంటారు. ఎంత సిగ్గుగా ఉంటుంది! అవేవీ ఆయనకు పట్టవు. అరవైకి దగ్గర పడుతున్న నాలో ముందసలు అంత శక్తి, ఉత్సాహం ఉండాలి కదా.. గ్రహించడు ఎందుకు! ఆయన చెప్పినట్టు వినట్లేదని ఎంత వేధిస్తున్నాడో! ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి..?!‘మా ఇంట్లో నాకన్నిటికీ రిస్ట్రిక్షన్సే! నాకు జీన్స్, క్రాప్ టాప్స్ అంటే ఇష్టం. వేసుకుంటే బాయ్స్ కామెంట్ చేస్తారని మా అన్నయ్య వేసుకోనివ్వడు. కాలేజ్‌లో, రోడ్డున పోయేవాడు ఎవడు కామెంట్ చేసినా వాళ్లను వదిలేసి నన్ను తిడతాడు, ఇంట్లో వాళ్లతో తిట్టిస్తాడు. నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం. కానీ మా అన్నయ్య వల్ల మామూలు బీఎస్సీలో చేరాల్సి వచ్చింది!’‘మా అమ్మాయి మంచి అథ్లెట్. కోచింగ్‌కి పంపించాలని ఇంట్లో యుద్ధమే చేశా. కానీ ఆ టైమ్‌లోనే స్పోర్ట్స్ ఫీల్డ్‌లో మహామహులు వినేశ్ ఫోగట్, సాక్షి లాంటి వాళ్లకు జరిగినవి చూసి.. అమ్మో అమ్మాయి అథ్లెట్ కాకపోయినా పర్లేదు, వేధింపులతో రోడ్డెక్కకుండా ఉంటే చాలు అనుకుని గమ్మునుండిపోయాను!’‘నా సీనియర్ మేల్ కొలీగ్ హెరాస్మెంట్ భరించలేక మేనేజర్‌కి రిపోర్ట్ చేశాను. అతను నాదే తప్పన్నట్టు బిహేవ్ చేశాడు. దాంతో నా సీనియర్ కొలీగ్ మరింత రెచ్చిపోయాడు. ఇంట్లో తలనొప్పులు చాలవన్నట్టు ఆఫీస్‌లో కూడా ఏం పెట్టుకుంటాను? అందుకే మంచి శాలరీ డ్రా చేస్తున్నా, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక జాబ్‌కి రిజైన్ చేశాను!’ఇవికాక బాల్యవివాహాలు, బాడీషేమింగ్స్, ట్రోలింగ్స్, డీప్‌ఫేక్స్, జడ్జిమెంట్స్, వరకట్న వేధింపుల నుంచి నిర్భయ, దిశ, హత్రాస్.. కోల్కత్తా డాక్టర్ హత్యాచార సంఘటనల దాకా.. ఒకటి మరువకముందే మరొకటి కళ్ల ముందే జరుగుతున్న దారుణాలు ఎన్నని! ఇలాంటివన్నిటినీ మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా.. ఆన్లైన్లో ఎప్పుడైనా.. మహిళలు, బాలికల మీద ఏ రూపంలో హింస కనిపించినా గళమెత్తాలని చాటుతోంది యుఎన్ఓ! అందుకే ఏటా నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమె¯Œ అండ్ గర్ల్స్) దినంగా జరుపుతోంది. పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. మన దగ్గరున్న మహిళా చట్టాలు...గృహహింస చట్టం.. 2005, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం.. 2013, పోక్సో (ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) యాక్ట్.. 2012, బాల్యవివాహాల నిషేధ చట్టం.. 2006, మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం.. 1986, వరకట్న నిషేధ చట్టం..1961, మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం.. 1956, రేప్ కేసులకు 376 ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 67, పెళ్లి పేరుతో మహిళను మోసగిస్తే 69 బీఎన్నెస్, పెళ్లయిన ఏడేళ్లలోపు మహిళ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. 304బి ఐపీసీ (80, బీఎన్నెస్), పలురకాల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 354 ఐపీసీ (74 – 78 బీఎన్నెస్), మహిళ మర్యాదకు భంగం వాటిల్లితే 509 ఐపీసీ (79 బీఎన్నెస్) మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు మహిళల భద్రత, రక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో దిశ, షీ టీమ్స్, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్‌క్రైమ్ పోర్టల్, వన్ స్టాప్ సెంటర్స్ వంటివీ అందుబాటులో ఉన్నాయి.గృహహింస అంటే..గృహహింస అంటే కేవలం పెళ్లైన స్త్రీలపై జరిగేదే అనే అపోహ ఉంది. కానీ, ఈ చట్టం ప్రకారం.. తండ్రి మొదలు అన్న, తమ్ముడు, సహచరుడు, భర్త వరకు ఎవరైనా మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే వారిపై గృహహింస కింద కేసు పెట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ ఆరోగ్యానికి, వ్యక్తిగత భద్రతకు, స్వేచ్ఛకు మానసికంగా, శారీరకంగా, లైంగికంగా, ఆర్థికంగా ఎటువంటి భంగం కలిగించినా సదరు పురుషుడికి చట్టపరమైన శిక్ష ఉంటుంది. జైలు శిక్ష ఉండదు కానీ, ఆర్థిక పరిహారం, ప్రత్యేక వసతి, ఆ పురుషుడి నుంచి రక్షణ ఆదేశాలు లభిస్తాయి. మన దేశంలో భర్త పెట్టే లైంగిక హింసకు క్రిమినల్ చట్టంలో శిక్షలు లేనప్పటికీ, గృహహింస చట్టం కింద మాత్రం బాధితులకు ఉపశమనం దొరుకుతోంది. దీనికి, 498ఏ (85 బీఎన్నెస్)కి సంబంధం లేదు. గృహహింస కింద కేసు వేయాలి అంటే, స్త్రీ – శిశు సంక్షేమ అధికారుల దగ్గర కానీ, మేజిస్ట్రేట్ దగ్గర కానీ దరఖాస్తు చేసుకోవాలి. 498ఏ ఫిర్యాదును పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి.మన దేశంలో స్త్రీలపై హింసకు గల కారణాలు.. మూలం పురుషాధిపత్య భావజాలమే! టీవీ, సినిమా, సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో మహిళను సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా చూపించడం, నిరక్షరాస్యత, మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, తమ రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం (సీసీటీవీ కెమెరాలు, వీథి లైట్లు, పబ్లిక్ టాయిలెట్లు వగైరా) లేకపోవడం, సురక్షితమైన రవాణా సౌకర్యాలు తగినన్ని లేకపోవడం లాంటివన్నీ కారణాలే అని చెబుతున్నారు నిపుణులు.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)లో దేశంలోని 30 శాతం మహిళలు (15– 49 ఏళ్ల మధ్య) శారీరక, లైంగిక లేదా గృహహింసకు గురవుతున్నారని తేలింది.ఈ ‘డే’ వెనుక చరిత్రకరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్కి 1930ల నుంచి 1960ల దాకా రఫైల్ త్రూహీయో(Rafael Trujillo) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనొక నియంత. హింసకు ప్రతిరూపం. క్రూరత్వానికి పరాకాష్ట. అతని పాలనలో డొమినికన్ రిపబ్లిక్ అట్టుడికింది. తన దారికి అడ్డొచ్చిన వాళ్లందరినీ జైళ్లల్లో పెట్టి.. ఊచకోత కోశాడు. మానవ హక్కులను కాలరాశాడు. జాత్యహంకార ధోరణితో డొమినికన్ రిపబ్లిక్లో ఉంటున్న వేలాది హైతీయుల మీద సామూహిక హత్యకాండకు పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిలను వెదికి తెచ్చిపెట్టేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించాడు. ఆడవాళ్లను విలాస వస్తువులుగా చూశాడు. ఈ నియంత హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ మీరాబాల్ సిస్టర్స్‌గా పేరొందిన పాట్రియా, మినర్వా, మారియా థెరీసా అనే ముగ్గురు అక్కచెల్లెళ్లు అజ్ఞాత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విషయం తెలిసి రఫైల్ ఆ ముగ్గురినీ బెదిరించాడు. వాళ్లు బెదరలేదు. దాంతో తరచుగా వాళ్లను అరెస్ట్ చేయిస్తూ.. వేధించేవాడు. అయినా వాళ్లు వెనక్కి తగ్గక ఆ నియంత క్రూరత్వాన్ని వివరిస్తూ, అతని చేతుల్లో మరణించిన వారి పేరు మీద కరపత్రాలను పంచసాగారు. దాంతో ఒకరోజు రఫైల్ తన మనుషుల చేత ఆ ముగ్గురినీ చంపించి, వాళ్ల జీప్‌లోనే పెట్టి, జీప్‌కి యాక్సిడెంట్ చేయించి.. దాన్నొక రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు నమ్మలేదు. అది రఫైల్ చేయించిన హత్యే అని గ్రహించి, ఆ నియంత మీద తిరగబడి అతణ్ణి చంపేశారు. అలా దాదాపు మూడు దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజాస్వామ్యానికి, స్త్రీవాదానికి చిహ్నంగా నిలిచిన ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లను డొమినికన్ రిపబ్లిక్ ప్రజలు "Las Mariposas.. ద బటర్‌ఫ్లైస్’గా స్మరించుకుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’కి లోగోగా బటర్ఫ్లైనే నిర్ణయించింది యూఎన్ఓ! ‘మీరాబాల్ సిస్టర్స్’ హత్య తర్వాత వాళ్ల మరో సోదరి డిడే.. తన సోదరీమణుల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించింది. మహిళల మీద జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, మహిళా హక్కుల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. ఆ మీరాబాల్ సిస్టర్స్ గౌరవార్థమే యూఎన్ఓ 1999లో నవంబర్ 25ను ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’ గా గుర్తించి, ఏటా నిర్వహించాలని ప్రకటించింది. మహిళల మీద జరుగుతున్న హింస, అణచివేతలను వ్యతిరేకించాలని, నిర్భయంగా ఎదిరించాలని, హింసలేని, శాంతియుత, సంతోషకరమైన జీవితం ప్రతి మహిళ హక్కని ఎలుగెత్తిన ఈ సోదరీమణులను టైమ్స్.. 2020లో ‘హండ్రెడ్ విమెన్ ఆఫ్ ద ఇయర్’ సంచికలో చేర్చింది. పాఠ్యాంశం చేయాలికాలం మారినట్టే హింస కూడా మారుతోంది. స్త్రీల మీద కనిపించే హింస కన్నా కనపడని హింస ఎక్కువైంది. దానికి సామాజిక మాధ్యమాలు వేదికయ్యాయి. ఈ సైబర్‌క్రైమ్ ట్రోలింగ్ వద్దే ఆగడంలేదు. మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు పోర్న్ సైట్లల్లో పెట్టడం వరకు వెళుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలలో కూడా తగిన మార్పులు చేయడం అత్యంతవసరం. మరోవైపు స్త్రీల భద్రత కోసం ప్రస్తుతమున్న చట్టాల మీద చైతన్యమూ కల్పించాలి. సెక్సువల్ ఎడ్యుకేషన్‌ను ఎలా అయితే తప్పనిసరి చేశారో, అలాగే స్త్రీల మీద జరుగుతున్న హింస, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న చట్టాలు వంటివాటి పైనా స్కూల్ స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. జెండర్ సెన్సిటివిటీని ఒక పాఠ్యాంశం చేయాలి. లేకపోతే ఎప్పటిలాగే స్త్రీల మీద హింస నార్మలైజ్ అవుతుంది.దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల 70 వేలకు పైగా గృహహింస కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్ల సంఖ్య కేవలం 3,637 మాత్రమే. ఇందులో 2,655 మంది అడిషనల్ చార్జ్లోని వాళ్లే! చాలా రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులే అడిషనల్ చార్జ్‌లో ఉన్నారు.పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. -
జాగ్రఫీ బోధించే గ్లోబ్..!
పెద్దలకు, పిల్లలకు నచ్చే ఆట బొమ్మలు చాలా అరుదు. అలాంటి వాటిలో ఈ ఆర్బూట్ ఎర్త్ ఒకటి. ఇదొక గ్లోబ్ బొమ్మ మాత్రమే కాదు, వర్చువల్ వరల్డ్ జాగ్రఫీ టీచర్ కూడా! ఈ గ్లోబ్‌ను ఐప్యాడ్‌కు లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాడాలి. ఈ బొమ్మ ప్యాకేజీ బాక్స్‌లో మొత్తం పది అంగుళాల ఇంటరాక్టివ్ ఏఆర్ వరల్డ్ గ్లోబ్, పాస్‌పోర్ట్, వివిధ స్టాంప్స్, దేశాల జెండాలు, జంతువుల స్టిక్కర్లలతో పాటు ఒక హెల్ప్ గైడ్ ఉంటుంది. గ్లోబ్‌ను యాప్ ద్వారా ఐప్యాడ్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని, ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నయినా ఎంచుకుంటే, అప్పుడు అది పూర్తి యానిమేషన్ చిత్రాలతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలన్నింటినీ చూపిస్తుంది. ఇందులో జాగ్రఫీకి సంబంధించిన చిన్న చిన్న టాస్క్‌లు కూడా ఉంటాయి. వాటిని ఈ గ్లోబ్‌తో పాటు ఇచ్చే స్టాంపులు, స్టిక్కర్లతో పూర్తి చేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశాన్ని అయినా ఇట్టే గుర్తుపట్టేలా చిన్నారులకు నేర్పిస్తుంది ఈ గ్లోబ్. మూడు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలకు ఇదొక మంచి బహుమతి. దీని ధర రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. వివిధ ఆన్లైన్ స్టోర్స్‌లలో దొరుకుతుంది. (చదవండి: ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!) -
ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!
చాలామంది తమ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎక్కువగా రేజర్‌ను వాడుతుంటారు. దాని వల్ల చర్మం మొద్దుబారడం, వెంట్రుకలు బిరుసెక్కడం, మరింత దట్టంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చిత్రంలోని మెషిన్ ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెడుతుంది.ఈ హైపవర్ హెయిర్ రిమూవల్ డివైస్ ఎల్ఈడీ లైట్ థెరపీని కూడా అందిస్తుంది. ఈ ఎపిలేటర్ మెషిన్ మృదువుగా, నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అందిస్తుంది. వెంట్రుకలను తొలగించే సమయంలో చల్లదనాన్ని అందిస్తుంది. వెంట్రుకలు తొలగిన తర్వాత దురద పుట్టడం, మంట కలగడం వంటి ఇబ్బందులను రానివ్వదు. ఫ్లాష్, మోడ్, లెవల్స్ వంటి ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి ముందువైపు ఉంటాయి. చిత్రంలో చూపిన విధంగా చర్మానికి ఆనించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ సాయంతో వెంట్రుకలు తొలగించుకుంటే గీతలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. కాళ్లు, చేతులు, నడుము, పొట్ట, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ ఇలా చర్మంపై పలుభాగాల్లో వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు. దీని వాడకంతో అవాంఛిత రోమాలున్న చర్మం కాలక్రమేణా మృదువుగా మారుతుంది. రోలర్ అటాచ్మెంట్, ఎల్ఈడీ అటాచ్మెంట్, స్పాట్ అటాచ్మెంట్, ఏసీ అడాప్టర్‌తో ఈ మెషిన్ లభిస్తుంది. దాంతో ఇది యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీన్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!
చిన్నపిల్లలకు కథలు చెబుతుంటే, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. దీనికోసం చాలామంది తల్లిదండ్రులు మొబైల్లో వారికి కావాల్సినవి పెట్టి పడుకోబెడుతుంటారు. ఇది చాలా ప్రమాదం. పైగా కొన్ని పరిశోధనలు నిద్రపోవడానికి ముందు అరగంట సమయం పిల్లల మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని నిర్ధారించాయి. మొబైల్ వల్ల పిల్లల నిద్రకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ‘మై లిటిల్ మార్ఫీ’నీ రూపొందించారు. ఇందులో చిన్నారుల ప్రశాంతమైన నిద్ర కోసం 128 కథలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే 32 రకాల ధ్యానాలు, పిల్లి, కుక్క, ఏనుగు వంటి 16 జంతువుల ధ్వనులు, సముద్ర కెరటాలు, గాలి, నీటి తుంపరలు, మంటల చిటపట శబ్దాలతో పాటు ‘మై లిటిల్ మార్ఫీ’ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన 16 శ్రావ్యమైన సంగీత స్వరకల్పనలు ఉన్నాయి. ఇవే కాకుండా, ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో రికార్డ్ చేసిన ప్రకృతి శబ్దాలున్నాయి. ఇలా మొత్తం మై లిటిల్ మార్ఫీ 192 సెషన్లను 5 థీమ్‌లుగా విభజించింది. పడుకునే ముందు మన కిష్టమైన సెషన్ , ఆ సెషన్ వ్యవధిని ఎంచుకుంటే చాలు. అది వింటూ హాయిగా నిద్ర పోవచ్చు. చిన్నారులకే కాదు ఈ పరికరం అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఇందులో అద్భుతమైన నాణ్యతతో వాయిస్ రికార్డింగ్ చేసుకునే వీలుండటం విశేషం. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు మూడు గంటల పాటు పనిచేస్తుంది. అంటే మొత్తం ఎనిమిది కథలు, పదహారు పాటల వరకు వినొచ్చు. ధర 8 వేల నుంచి 9 వేల రూపాయల వరకు ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్‌కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్‌తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
ప్రకృతి సాగుతో ప్రపంచ దృష్టికి..
అది కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామం. ఒక మారుమూల పల్లె. అదిప్పుడు చరిత్రకెక్కుతోంది. పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుని, ఈ ఊరు చేపట్టిన సేంద్రియ సాగు విధానాలు రైతు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. పాడిపంట అనే పదానికి అసలైన అర్థం చెబుతున్నారు ఇక్కడి రైతులు. రసాయనాల వల్ల కలుషితమవుతున్న సాగు నేలకు పునర్జీవం తీసుకొస్తున్నారు. ఆ ఊరి పురుషులు పొలాలను పర్యావరణహితంగా మారుస్తుంటే.. మహిళలు ఇంటి పరిసరాలను పచ్చదనంతో నింపి అటు ఆదాయానికి, ఇటు ఆరోగ్యానికి లోటు లేకుండా చేస్తున్నారు. దేశానికే ఇంకా చెప్పాలంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్వం ఈ గ్రామాన్ని దుర్గా ఊడ, దుర్గా వాహిని అనే పేర్లతో పిలిచేవారు. ప్రాచీన కవి పుల్ల కవి 15వ శతాబ్దంలో ఇక్కడ నివసించారన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనకు సంబంధించిన స్మారక చిహ్నాలు, భవనాలు కనిపిస్తాయిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొట్టి మిర్చి విత్తన తయారీ నుంచి అంతా ఇక్కడే పండిస్తారు. ఈ ఊళ్లో 50 శాతానికి పైగా ప్రజలకు వ్యవసాయమే ఆధారం. రైతులు తాము వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. భారతీయ రైల్వే, సాఫ్ట్వేర్, బ్యాకింగ్, టీచింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, చార్టర్డ్ అకౌటెంట్లు, ఇంజినీర్లు ఉన్నారు. అతి పురాతన ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు గ్రామ దేవత వేగుళ్లమ్మ ఆలయం, మసీదు, చర్చిలతో మతసామరస్యానికి పెట్టింది పేరుగా ఉంది ఈ ఊరు. కరోనా చూపించిన దారిదుర్గాడలో ఎటు చూసినా పచ్చని పొలాలే. ప్రతి ఇంటా గోవులు దర్శనమిస్తాయి. ధాన్యం నుంచి కూరగాయలు, పళ్లు అన్నీ తామే పండించుకుంటూ ఆదాయాన్నే కాదు ఆరోగ్యాన్నీ పెంచుకుంటున్నారు. ఇక్కడ నదులు, కాలువలు లేకపోవడంతో భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడే సాగు సాగుతోంది. సన్నకారు రైతులే ఎక్కువ. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మామిడికాయ పచ్చళ్లు, కూరగాయలు, మిర్చి వ్యాపారాలూ అధికమే! అయితే కరోనా ముందు వరకు ఇక్కడ రసాయన ఎరువులనే వాడేవారు. కరోనా వల్ల సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం, ఆం్ర«ధప్రదేశ్లో అప్పుడున్న ప్రభుత్వమూ సేంద్రియ సాగుకు పెద్దపీట వేయడంతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిందీ ఊరు. తొలుత ఒక ఇంట్లో మొదలైన ఈ ఉద్యమం అనతి కాలంలోనే పల్లె అంతా విస్తరించింది. సేంద్రియ ఎరువుల ద్రావణాల తయారీ ఇక్కడ ఓ కుటీరపరిశ్రమగా మారిపోయింది. ఏటీఎం విధానంలో సాగువ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న భరోసా లేదు. ప్రకృతి దయ.. రైతుల ప్రాప్తం అన్నట్టు ఉంటుంది. దుక్కి దున్నిన నాటి నుంచి పంట కోసి, ధాన్యాన్ని ఎండబెట్టి మార్కెట్‌కి తీసుకెళ్లే వరకు ఆదాయం ఉండదు. ఈలోపు ప్రకృతి కన్నెర్రజేస్తే అంతే సంగతులు. అందుకే వ్యవసాయం గాలిలో దీపం లాంటిది అంటారు. అలాకాకుండా నారు వేసిన పదిహేను రోజుల నుంచి రోజూ ఆదాయాన్ని పొందే మార్గాన్ని పట్టుకున్నారు దుర్గాడ రైతులు. దాన్నే ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ సాగు అంటున్నారు. ఇందులో ప్రకృతి వ్యవసాయ శాఖాధికారుల చేత శిక్షణ తీసుకున్నారు. కొంత నేలను సిద్ధం చేసుకుని అందులో ఒకేసారి.. కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు.. పూలు ఇలా 30 రకాలను వేస్తారు. పదిహేను రోజుల తర్వాత నుంచి ఏదో ఒక కాయగూరో.. ఆకు కూరో.. దుంపలో.. పూలో.. కోతకు వచ్చేస్తాయి. దాంతో ప్రతిరోజూ వాటిని కోసి అమ్ముతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. అలా ఏటీఎం సాగు పద్ధతిలో రోజూ ఆదాయాన్ని ఆర్జిస్తూ జనాలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. దీనికయ్యే పెట్టుబడి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే! దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ సాగు మీదే పెట్టుబడిగా పెడుతున్నారు చాలామంది రైతులు. కోసిన పంట స్థానంలో మళ్లీ విత్తనాలు వేస్తూ! ఇలా కాలంతో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి, నిత్యాదాయం.. వైవిధ్యమైన పంటలుగా సాగుతోంది ఏటీఎం పద్ధతి.చేపలతో చేలకు వైద్యం..వ్యర్థ పదార్థాలతో పంటకు బలాన్నిచ్చే రసాయనాలను తయారు చేయడంలో దుర్గాడ రైతులకు సాటి,పోటీ లేదు. మత్స్యకారులు పక్కన పడేసిన కుళ్లిపోయిన చేపలతో చేలకు చేవనిచ్చే మీనామృతాన్ని తయారు చేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేసే ఈ మీనామృతం కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. దీనిని మొక్కల ఎదుగుదలకు, పూత, పిందె బలంగా మారడానికి వాడుతున్నారు. ఎకరానికి ఒక లీటరు సరిపోతుంది. దీన్ని తయారీదారులు లీటరు రూ.120 ధరకు విక్రయిస్తున్నారు. పురుగులు, తెగుళ్లపై యుద్ధంపంటలపై దాడి చేసే పురుగులు, తెగుళ్లపై నీమాస్త్రం, బ్రహ్మాస్త్రాలతో ఇక్కడి రైతులు యుద్ధం చేస్తున్నారు. ఆ అస్త్రాలన్నీ ఆకులు అలములే! నీమాస్త్రంతో చిన్న చిన్న పురుగులు చనిపోతే, బ్రహ్మాస్త్రంతో ఎంతటి తెగులైనా, పురుగైనా పరారవుతుంది. అంతేకాదు ఉల్లి, మిరప, మజ్జిగ, బెల్లం, గోమూత్రం వంటి వాటితో కషాయాలనూ తయారుచేస్తూ పలు ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ఇలా పర్యావరణహితమైన ప్రయోగాలు, ప్రయత్నాలతో నిరంతర ఆదాయాన్ని గడిస్తూ ప్రకృతి సాగులో ప్రపంచానికి స్ఫూర్తి పంచుతోందీ గ్రామం. వ్యవసాయ పాఠశాలగా దుర్గాడ గ్రామం ప్రకృతి సాగుకు పాఠశాలగా మారింది. వ్యవసాయ శాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను బ్యాచులుగా విభజించి.. వ్యవసాయ క్షేత్రాలు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాల్లోని రైతులతో వారికి ప్రకృతి సాగులో శిక్షణనిప్పిస్తున్నారు.గోమయంతో ప్రమిదల తయారీ..గోమూత్రంతో కషాయాలు, గోమయంతో ఘన జీవామృతంలాంటి ఔషధాలు తయారు చేస్తున్న దుర్గాడ రైతులు దేశీ ఆవుపేడతో ప్రమిదలు ధూప్‌స్టిక్స్ వంటివీ తయారుచేసి విక్రయిస్తున్నారు. ఈ ప్రమిదలలో ఆవునేతితో దీపం వెలిగిస్తే పరిసరాల్లో క్రిమి కీటకాలు నశిస్తాయి. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉందంటున్నారు.తయారవుతున్న సేంద్రియ ఎరువులుబీజామృతం, జీవామృతం, మీనామృతం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, చిల్లి స్పెషల్ కషాయం మొదలైనవి.పండిస్తున్న పంటలు ఉల్లి, బురియా మిర్చి (పొట్టి మిర్చి, చిన్న రౌండ్ బెల్ రకం మిర్చి), చెరకు, కొబ్బరి, ఆయిల్ పామ్, మామిడి, బొప్పాయి, మినప, పెసర, శనగ, అరటి, వరి, కూరగాయలు, పుచ్చ, నువ్వులు, మునగ మొదలైనవి.మా ఇంటి పంట పదిళ్లకు వంటమా పెరట్లోని ఒక సెంటు స్థలంలో ఏటీఎం పద్ధతిలో 20 రకాల కూరగాయలు, పండ్ల సాగు మొదలుపెట్టాను. నాట్లేసిన పదిహేను రోజుల నుంచి ఫలసాయం మొదలైంది. ఖర్చు తగ్గడం, నా ఆదాయానికి గ్యారంటీ ఉండటం, మా ఇంటి పంట చుట్టుపక్కల పదిళ్లకు వంట అవటం చూసి మా ఊళ్లోని చాలామంది మహిళలు నాలా ఇంటి పంటను మొదలుపెట్టారు. – ఆకుల కనక సూర్యలక్ష్మి, రైతు, దుర్గాడ.ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాను..ప్రకృతి వ్యవసాయం మీదున్న ఆసక్తితో ఆరెకరాల పొలంలో సేంద్రియ సాగు స్టార్ట్ చేశాను. ఒకపక్క వ్యవసాయం చేస్తూనే ఇంటర్ పూర్తి చేశాను. నా పొలంలోని సేంద్రియ సాగు ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాను. వీటికి మంచి గిరాకీ ఉంది. – జీలకర్ర భాను, యువ రైతు, దుర్గాడపరిశీలిస్తున్నారు.. తెలుసుకుంటున్నారుగత ఐదేళ్లలో ఇక్కడ ప్రకృతి సాగు బాగా పెరిగింది. ఇక్కడి రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు, విదేశీ రైతులు దుర్గాడకు వచ్చి ప్రకృతి సాగును పరిశీలిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, ద్రావణాల తయారీని తెలుసుకుంటున్నారు. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖాధికారి, కాకినాడ -
బుల్లీయింగ్... సైబర్ బుల్లీయింగ్...
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది. కాదేదీ అనర్హం..బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది. టీనేజ్లోనే ఎందుకు ఎక్కువ?టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు. నివారణ వ్యూహాలుబుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.2. పాస్‌వర్డ్స్‌ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.3. మీ టీన్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. 6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి. 8. బుల్లీయింగ్ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి. 9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి. 11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.తీవ్ర ప్రభావం..బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. 2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది.3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు. 6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. -
Archa Mehta: ఎక్స్పరిమెంటలిస్ట్
సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటే ఫ్యాషన్ డిజైనర్లందరికీ పండుగ! ఆయన సినిమా విడుదల తర్వాత చిన్న చిన్న బోటీక్ ఓనర్స్ నుంచి టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ దాకా అందరూ ఆ చిత్రం రిఫరెన్స్‌తో కొత్త కలెక్షన్స్‌ను విడుదల చేస్తారు. అలాంటిది కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా తొలి అవకాశమే సంజయ్ లీలా భన్సాలీ మూవీలో వస్తే.. అదృష్టమే అనుకుంటారు! అలాంటి చాన్స్ దక్కించుకున్న అదృష్టవంతురాలే ఇక్కడ పరిచయమవుతున్న స్టయిలిస్ట్ అర్చా మెహతా!అర్చా మెహతా స్వస్థలం ఢిల్లీ. కెరీర్ విషయంలో తండ్రి ఏం చెప్తే అదే అనుకొని, ఇంటర్ అయిపోగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది. కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో భాగమైన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నది. అప్పుడు గ్రహించింది తన అసలు ప్యాషన్ ఫ్యాషనే అని! ఆ విషయాన్ని తండ్రితోనూ చెప్పింది. కూతురి ఇష్టాన్ని గుర్తిస్తూ ఆయన వెంటనే అర్చాను ఇంజినీరింగ్ మాన్పించి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం లండన్ పంపించాడు. అక్కడ ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు స్టయిలింగ్ గురించి కూడా తెలుసుకుంది. కోర్స్ పూర్తవగానే అక్కడే సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. తర్వాత ముంబై చేరింది. వెంటనే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా’కి అసిస్టెంట్ స్టయిలిస్ట్, అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అది పనిలో అనుభవాన్నే కాదు.. టాలీవుడ్లో ఎంట్రీనీ కల్పించింది. ‘హార్ట్ ఎటాక్’ మూవీలో అగ్రతారలకు స్టయిలిస్ట్‌గా! అందులో ఆమె కేవలం కాస్ట్యూమ్స్ మీదే కాదు స్కార్ఫ్‌లు, యాక్ససరీస్, ఆఖరకు పచ్చబొట్టు లాంటి వాటిపైనా దృష్టి పెట్టి స్టయిలింగ్ చేసింది. తక్కువ ఎక్స్‌పోజింగ్‌తో ట్రెండీ లుక్ ఇచ్చినందుకు హీరోయిన్స్ ఆదా శర్మ మెప్పును కూడా పొందింది. అప్పటి నుంచి అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఆ స్కిల్‌కి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఫిదా అయ్యారు. ఆ జాబితాలో కీర్తీ సురేశ్, మృణాల్ ఠాకుర్, కృతీ శెట్టీ, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్, సంయుక్తా మీనన్, కళ్యాణీ ప్రియదర్శన్, కేథరిన్ త్రెసా, హన్సిక, మెహ్రీన్, ప్రణీత, దిశా పాట్నీ, నుస్రత్ భరూచా ఎట్సెట్రా ఉన్నారు. వాళ్లంతా అర్చాను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఈ హీరోయిన్స్‌కే కాదు శర్వానంద్, నితిన్ లాంటి హీరోలకూ ఆమె స్టయిలింగ్ చేస్తోంది. ∙దీపిక కొండి -
ఈవారం కథ: ధర్మం
వచ్చే పోయే జనాలతో, బస్సులతో బస్టాండ్ సందడిగా ఉంది. ఎండ చుర్రున కొడుతోంది. వైజాగ్ వెళ్లవలసిన బస్ కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాను. ‘ప్రయాణికులకు గమనిక’ అంటూ ఒకపక్క అనౌన్స్మెంట్, మరోపక్క టీవీలో ప్రకటనల హోరు. కలగాపులగంగా సంభాషణల జోరు. మొత్తానికి అక్కడ అంతా జాతరలా ఉంది. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లా ఉంది. విరిగిపోయిన కడలి అలల సద్దులా ఉంది. ‘అయ్యా! ఆకలేస్తుందయ్యా.. ధర్మం సేయండయ్యా’ హృదయ విదారకమైన వేదన విని తలతిప్పి చూశాను.సుమారుగా ఓ ముప్పై, ముప్పయి ఐదు సంవత్సరాలు ఉంటాయేమో ఆమెకు. జుట్టంతా తైలసంస్కారం లేక రేగిపోయి చిందర వందరగా ఉంది. మాసిపోయి, అక్కడక్కడ చిరుగులున్న చీర, స్నానం చేసి ఎన్నాళ్లయిందో అనేలా శరీరం మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. కళ్ళలో దీనత్వం, జోడించిన చేతుల్లో వినయం. ‘అయ్యా, ఆకలేస్తుందయ్యా’ నాభిలోంచి వస్తున్న ఆ చిన్న అరుపు గుండెను పట్టి పిండేస్తుంది అనడంలో సందేహమే లేదు. ‘అయ్యా ..’ మరోసారి ఆ బిచ్చగత్తె ప్రార్థనకు ఆలోచనలు ఆపి, ప్యాంట్ వెనుక జేబులో చెయ్యి పెట్టి చేతికి దొరికిన నాణెం తీసి ఆమె చేతిలో వేశాను. ఆమె ఆ నాణెం వైపు చూసి ‘వద్దయ్యా! ఆకలేస్తుందయ్యా, తినడానికి ఏమైనా పెట్టండయ్యా’ నా కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది.నా హృదయం ఒక్కసారిగా భారమయ్యింది. ఒక మనిషి మరో మనిషి కాళ్ళు పట్టుకోవడం అంటే ఎంత కష్టం వచ్చుండాలి. ఆత్మాభిమానం చంపుకోవాలి కదా.బస్టాండ్‌లో పక్కనే ఉన్న హోటల్‌పై నా దృష్టి పడింది. ‘పదమ్మా, టిఫిన్ కొనిస్తా’నంటూ దారి తీశాను. ‘టిఫిన్ వద్దయ్యా’ మెల్లగా, నీరసంగా అందామె. ‘మయూరోటల్లో బిర్యానీ కావాలేమో మేస్టారూ..’ ఆ పక్కనే బెంచిపై కూర్చొని మమ్మల్నే గమనిస్తున్న ఆసామి పెద్దగా నవ్వుతూ అన్నాడు. ఆయన మాటలకు కిసుక్కున నవ్వారు మరికొందరు.ఆ ఆసామి మాటలకు ఆమె తల మరింతగా భూమిలోనికి వంగిపోయింది.నాకు చాలా బాధేసింది. సాయం చెయ్యకపోయినా ఫర్వాలేదు గాని, ఇలా వెటకారం చేసే వారంటేనే నాకు ఒళ్ళు మంట. సగటు మనిషిని కదా. కోపం నాలోనే అణచుకొని ‘ఏం కావాలో చెప్పమ్మా’ ఆప్యాయంగా అడిగాను.బస్ కోసం వేచి ఉన్న జనాలకు ఇదో కాలక్షేప వ్యవహారం అయ్యింది. మన గురించి కాకుండా పక్కవారి బాగోగులు, యోగక్షేమాలు, ఏం చేస్తున్నారో? నవ్వుతున్నారా? అయితే ఎలా ఏడిపించాలి? ఏడిస్తే, నిజంగానే ఏడుస్తున్నారా? అనే ఆరాటం లేకపోతే మనం మనలా ఎలా ఉంటాం? ‘బిస్కట్టులు కావాలయ్యా’ మొహమాటం ఆమె కోరికలో.‘పదమ్మా కొంటాను..’నా మాటలకు ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. దీనుల ముఖంలో ఆ వెలుగు చూస్తే నాకు తెలియని ఆనందం, మనసు నిండా తృప్తీ! చుట్టూ ఉన్న కొంతమంది జనాల కళ్ళల్లో మెచ్చుకోలు. అదే నాకు తెలియని మత్తునిస్తుంది.అంతమంది అక్కడ ఉండగా ఒక ముష్టిదానికి నేనొక్కడినే దానం చెయ్యాలి అనుకోవడం నా మంచి మనసుకు తార్కాణం అని అక్కడ ఉండేవారు గుర్తించే ఉంటారు కదా. ఎందుకు గుర్తించరు? తప్పకుండా గుర్తిస్తారు. ఆమె ఆ పక్కనే ఉన్న షాప్ దగ్గర ఆగింది.‘ఆ ఐదు రూపాయల బిస్కట్ ప్యాకెట్ ఇవ్వండి’ షాపతన్ని అడిగాను.ఆమె ముఖంలో వెలుగు ఒక్కసారిగా తగ్గిపోవడం చూసి, ఆకలి ఎక్కువగా ఉంటే ఆ చిన్న బిస్కట్ ప్యాకెట్ ఏమూలకు సరిపోతుంది అనిపించింది.‘అది వద్దు, ఆ పది రూపాయలది ఇవ్వండి’ పది రూపాయలు నోటు అందిస్తూ ఆమె వైపు చూశాను.ఆమె ముఖం ఇంకా దిగులుగా ఉండటం చూసి ‘ఏం కావాలమ్మా నీకు?’ తెలియకుండానే విసుగు నాలో.చెయ్యెత్తి చూపించింది ఆమె. షాపతను నేను అడగకుండానే ఆ బిస్కట్ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.‘ఇంకో పదివ్వండి సార్, ఆ ప్యాకెట్ ఇరవై రూపాయలు.’పాపం ఆ ప్యాకెట్ తినాలని ఆశ గాబోలు అనుకుంటూ మరో పది అందించి ‘తినమ్మా, పాపం ఎప్పుడు తిన్నావో ఏమిటో..’ నా జాలి గుండె మాటలు. చెప్పాకదా నా మనసు వెన్న అని. ‘ఊహూ, అటెల్లి తింటాను’ ఆమె బస్టాండ్ వెనుక వైపు చూపించి అటు నడవసాగింది.బహుశా ఆమె పిల్లలు అక్కడ ఉండి ఉంటారు గాబోలు. తనకు ఆకలేస్తున్నా తినకుండా పిల్లల కోసం తీసుకెళ్ళడం నన్ను కుదిపివేసింది. అందుకే అంటారు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదని! పిల్లలు చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? ఆ ప్యాకెట్ వారికి ఏం సరిపోతుంది? ఆలోచనలతో పాటు కుతూహలం వెంటరాగా ఆమె వెళ్ళిన దిశకు వ్యతిరేక దిశలో బస్టాండ్ వెనుక వైపు వెళ్ళాను.జనసంచారం పెద్దగా లేకపోవడం వలన గాబోలు అక్కడంతా చెత్త చెత్తగా ఉంది. ముక్కు బద్దలవుతున్న వాసనలు. పిల్లల జాడ ఎక్కడా కనబడలేదు. ఆమెకు కనబడకుండా ఒక చెట్టు చాటు నుండి చూడసాగాను. గోడ వెనక్కి వచ్చిన ఆమె అటూ ఇటూ చూసి ఒక్కసారిగా తన చీరను కాస్తా పైకి లేపింది.సిగ్గుతో తలతిప్పుకొని అక్కడ నుండి రాబోయాను. కానీ నా కళ్ళకు ఏదో అసహజంగా అనిపించి తలతిప్పి చూశాను. ఆమె చీర కింద లంగాపై సంచుల్లాంటివి వేలాడుతున్నాయి. వాటినిండా బిస్కట్ ప్యాకెట్లు. నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.నేనిచ్చిన ప్యాకెట్‌ని కూడా వాటిలో పెట్టింది. చీరను కిందకి దించి సర్దుకొని అటువైపు ఆగి ఉన్న బస్సుల వద్దకు నడవసాగింది. బహుశా నాలాంటి బకరాని వెతకడానికి గాబోలు. ఉండేలు దెబ్బతిన్న కాకిపిల్లలా విలవిలలాడిపోయాను. ఇంత చదువుకొని కూడా అంత సులభంగా ఎలా వెధవనయ్యానో?గుండె మండిపోతుండగా ఆమెను నిలదిద్దామనేంత ఆవేశం వచ్చింది. చెడామడా కడిగేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, అటువంటి వారితో గొడవపడటం సభ్యత కాదు, తన పాపానికి తనే పోతుందని తిట్టుకున్నాను. గుండెమంటతో నోరు ఎండిపోయినట్లు అనిపిస్తే, ఆ బిస్కట్ల షాప్ దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కున్నాను.‘రాములమ్మ మీలాంటి మెతకోరిని చూసి, నవరసాలు ఒలికించి నా షాప్‌లో బిస్కట్ ప్యాకెట్లు పెద్దవి కొనిపిస్తుంది. సాయంత్రమయ్యేసరికి ఆ బిస్కట్ ప్యాకెట్లను నాకే సగం ధరకు అమ్మేస్తుంది.’ మనసు ఇంకా ఉడికిపోసాగింది. ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారా? షాపతను నన్ను చూసి జాలి పడుతున్నట్లు అనిపించింది. ఎదుటివారిపై జాలి చూపడం నాకు అత్యంత ఇష్టమైనది. కానీ నన్ను చూసి జాలి పడితే భరించలేను. ఆయన పెదవులపై ఎందుకనో కాస్త నవ్వు విరిసింది అసంకల్పితంగా. ‘ఎందుకు నవ్వుతున్నారు?’ ఆగలేక అడిగేశాను అప్పటికే మనసు కుతకుతలాడుతోంది మోసపోయాను అన్న భావనతో.‘ఏం లేద్సార్, మీరు రాములమ్మను అనుసరిస్తూ వెళ్ళడం గమనించాను. అక్కడ ఏం చూసుంటారో ఊహిస్తే నవ్వొచ్చింది అంతే. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. అందుకే చనువుగా నవ్వాను.’నిర్ఘాంత పోయాను. ఓహో ఆ మోసగత్తే పేరు రాములమ్మన్నమాట. ‘అంటే మీకు ముందే తెలుసా ఇలా చేస్తుందని’ విస్మయం నాలో.‘రాములమ్మ మీలాంటి మెతకోరిని చూసి, నవరసాలు ఒలికించి నా షాప్‌లో బిస్కట్ ప్యాకెట్లు పెద్దవి కొనిపిస్తుంది. సాయంత్రమయ్యేసరికి ఆ బిస్కట్ ప్యాకెట్లను నాకే సగం ధరకు అమ్మేస్తుంది.’మనసు ఇంకా ఉడికిపోసాగింది. ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారా?నా ముఖంలో మారుతున్న రంగులను అణచుకుంటూ ‘మా దగ్గర డబ్బులే అడగొచ్చుకదా. ఎందుకిలా డొంకతిరుగుడు బిస్కట్ల వ్యవహారం?’ ఏదో తెలియని కుతూహలం నాతో అడిగించింది.చిన్న నవ్వు నవ్వి ‘మళ్ళేమైనా అంటే మీకు పుసుక్కున కోపం ఒచ్చేస్తాది గానీ మీరు ముష్టి వేస్తే రూపాయో, రెండ్రూపాయలో వేస్తారు. మహా అయితే ఐదు వేస్తారు. అంతేకదా..!’మౌనంగా తలూపాను.‘సాయంత్రం అయ్యేసరికి కనీసం పదిహేను, ఇరవై ప్యాకెట్లయినా నాదగ్గర మార్చుకొని రెండొందల వరకు తీసుకొని వెళ్తుంది. మధ్య మధ్యలో చిల్లర వేసేవారు ఎలాగూ ఉంటారు.’అంటే రూపాయికి రూపాయి లాభం. ఎంత దగా! పది రూపాయలకు కొని, ఇరవై రూపాయలకు అమ్మడం. ఛ! ఈ ప్రపంచంలోని మోసం అంతా ఈ బస్టాండ్‌లోనే ఉందనిపించింది. అంతలోనే నాకొక సందేహం తలెత్తింది.. అడగనా వద్దా? అనే సంశయంలో ఉండగానే..‘ఏదో అడగాలని తెగ మొగమాటం పడిపోతున్నారు. అడిగేయండి, పర్లేదు’ అభయం ఇచ్చాడా నవ్వులరేడు. ‘మరేం లేదు, మీరే అమ్మి, మీరే కొనడం వలన మీకేంటి లాభం? తర్వాతవి అమ్ముడవకపోతే?’ సంశయిస్తూనే అడిగేశాను. ఒక్కసారిగా మౌనం వహించాడతను. అతని కళ్ళల్లోకి చూస్తున్న నా ముఖాన్ని ఒకసారి పరిశీలించి, అటూ ఇటూ చూసి ‘మీరెవ్వరికీ చెప్పనంటే చెప్తాను’ లోగొంతుతో అన్నాడు.‘ఇక్కడ జరిగిందంతా ఇప్పుడే మర్చిపోతాను’ మాట ఇచ్చాను. ‘ఇంకేటీ లేదు. అవన్నీ పాడయిపోయిన బిస్కట్ ప్యాకెట్లు. అదేలెండి ఎక్స్పైర్ అయిపోయినవి. ఎట్లాగూ బయటపడేయ్యాలి. అవే రాములమ్మకు ఇస్తాను. వేరేవారికి అమ్మను. ఆ ప్యాకెట్లు తను ఎట్లాగూ తినదు, నాకే తిరిగిస్తుంది. ఆ ప్యాకెట్లు ప్రతిరోజూ నాకు డబ్బులు తెస్తున్నాయి. ఈ విషయం రాములమ్మకు కూడా తెలియదు.’విస్తుపోయాను.. కంటికి కనబడకుండా పన్నిన వల తెలిసి! ఏ బిజినెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీల్లో కూడా నేర్పని పాఠం. వ్యాపారంలో మెలకువలు ఉంటాయని తెలుసు గాని, ఒక చిన్న బస్టాండ్‌లో, అతి చిన్న దుకాణంలో, పెద్దగా చదువుకోని వ్యక్తి అంత చక్కగా ఆర్థిక వలనేయగలడు అని ఊహించలేదు. రాగాలాపన ఆపి, మరో డైలాగ్ చెప్పేలోపల ‘వన్స్ మోర్’ గట్టిగా వినబడిన ప్రేక్షకుల అరుపులకు పాడిన పద్యమే మరోసారి శ్రుతి తగ్గకుండా పాడటం ప్రారంభించాను.పద్యం ఆపగానే ‘ శ్రీకృష్ణుని పాత్రధారుని అభినందిస్తూ కనకారావు గారు పదిరూపాయలు చదివించారు. వారికి, వారి కుటుంబానికి ఆ పైడితల్లెమ్మ దీవెనలు అందివ్వాలి’ మైక్‌లో ఆర్గనైజర్ కంఠం వినయంగా పలికింది. నా ఆలోచనలను చెదరగొడుతూ అతని మాటలు వినిపించాయి. ‘మరోమాట సార్, పాపం రాములమ్మ భర్త రోగంతో మంచాన పడితే, పిల్లలతో పాటుగా మొగుడ్ని కూడా చంటిబిడ్డలా సాకుతూ, కుటుంబ పోషణ కోసం ఇలా చేస్తోంది. అందుకే నేను కూడా నావంతుగా ఇలా సాయపడుతున్నాను..’షాపతని మాటలు నన్ను ఆవేశంలోంచి ఆలోచనలోకి పడేశాయి. ఆర్థిక మోసానికి మానవత్వపు పూత.గీతా రహస్యం బోధించిన వాడిలా చిద్విలాసంగా నవ్వాడు షాపతను.∙∙ ‘బావా! ఎప్పుడు వచ్చితీవి? సుఖులే బ్రాతల్, సుతుల్, చుట్టముల్?నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మున్నీలున్ సుఖోపేతులే?’తన్మయత్వంతో తారస్థాయిలో రాగాలాపన చేస్తున్నాను. తలపై నెమలి పింఛంతో కిరీటం, ముఖానికి, మెడకు చిక్కని నీలపు రంగు మేకప్‌తో, మెడలో పూలహారంతో చేతిలో ముచ్చటైన పిల్లనగ్రోవితో మేకప్‌లో అచ్చం కృష్ణుడిలా ఉంటానని అందరూ అంటారు. నా గొంతు నాకొక వరం. మేకప్‌లో నన్ను చూసినవాళ్ళు నన్ను ఫలానా అని గుర్తుపట్టడం కష్టం. అంతగా కృష్ణుని పాత్రలో ఒదిగి పోతాను అని మా నాటకబృందం కితాబు. వందలమంది ప్రేక్షకులు నాటకంలో లీనమయి ఉన్నారు. మా వూరు పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈ ఏడాది కూడా బుర్రకథలు, హరికథలు, నాటకాలు జరుగుతున్నాయి. రాగాలాపన ఆపి, మరో డైలాగ్ చెప్పేలోపల ‘వన్స్ మోర్’ గట్టిగా వినబడిన ప్రేక్షకుల అరుపులకు పాడిన పద్యమే మరోసారి శ్రుతి తగ్గకుండా పాడటం ప్రారంభించాను.పద్యం ఆపగానే ‘ శ్రీకృష్ణుని పాత్రధారుని అభినందిస్తూ కనకారావు గారు పదిరూపాయలు చదివించారు. వారికి, వారి కుటుంబానికి ఆ పైడితల్లెమ్మ దీవెనలు అందివ్వాలి’ మైక్‌లో ఆర్గనైజర్ కంఠం వినయంగా పలికింది.మరో ఇద్దరు ముగ్గురు చెరో పది, ఇరవై రూపాయలు కానుకగా అందించారు. ప్రేక్షకుల చప్పట్లు, అభినందనల మధ్య రెట్టించిన ఉత్సాహంతో, ఉవ్వెత్తునలేచిన కడలి తరంగంలా పాత్రలో లీనమయిపోయా. నాటకం రసవత్తరంగా సాగుతోంది. ‘మా మధ్యమ పాండవుని విక్రమంబు ఎట్టిదంటిరేని..’‘జెండాపై కపిరాజు ముందు సిత వాజి శ్రేణియుం గూర్చి నేదండంబున్ గొని తోలు స్యందనము మీదన్ ..’రాగం ఆపగానే ఆర్గనైజర్ గారి కంఠం మైకులో వినిపించసాగింది. ‘శ్రీకృష్ణుని పాత్రధారిని ఆశీర్వదిస్తూ కళాభిమానులందరి తరుపున అని చెప్పమంటూ మంచి మనసుగల ఒక తల్లి వంద రూపాయలను బహుమతిగా ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ చల్లని తల్లి పైడితల్లెమ్మ కరుణతో చూడాలని కోరుకుంటున్నాము.’నాకొక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. అందరూ పదులు, ఇరవైలు చదివిస్తుంటే ఒక్కసారిగా వందరూపాయలు చదివిస్తూ కూడా తన పేరు చెప్పకోకుండా అందరి తరుపున అన్న ఆ గొప్ప వ్యక్తి ఎవరా? అని చూశాను.ఫ్లడ్ లైట్ల వెలుగులు నా కంటికి అడ్డం పడ్డాయి. చెయ్యి అడ్డుపెట్టుకొని మరీ చూశాను. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను.. ఆర్గనైజర్‌కు డబ్బులు అందించిన ఆమెను చూసి! ఆ మధ్య బస్టాండ్‌లో నన్ను మోసం చేసిన బిచ్చగత్తే రాములమ్మ. ముష్టి ఎత్తి కుటుంబ పోషణకు సంపాదించిన డబ్బును, కళాపోషణకు ఇస్తూ, కనీసం తన పేరు కూడా చెప్పని ఆ నిరాడంబరత నా వీపున ఛెళ్ళున కొరడా దెబ్బ వేసింది. నాలో నాకే తెలియని మానసిక సంఘర్షణ. వృత్తికి, ప్రవృత్తికి మధ్యగల తేడాను, స్పష్టతను, నిర్మలత్వాన్ని, సున్నితత్వాన్ని , కళాపోషణను, కళారాధనను తెలుసుకోగలిగాను.తెలియకుండానే నా కన్నులు చెమ్మగిల్లుతుండగా రెండు చేతులు జోడించి ఆమెకు వందనం చేశాను. -
యువ కథ: చినుకుల అలజడి
జయరాం, తనకు కాబోయే అల్లుడు ప్రవీణ్ పక్కనే నిలబడి మాట్లాడతా వుండాడు.‘రేయ్ చిన్నోడా, ఇప్పుడేలరా ఈ పెండ్లిసూపులు. ఒకేసారి లగ్నపత్రిక రాయించుకోని ఒచ్చేద్దామంటే ఇనవు’ ప్రవీణ్ నవ్వతా ‘నా కోసరం గాదు. నీ ముద్దుల కూతురు ఉంది కదా, ఆయమ్మ ఆగిత్యమే’ అన్నాడు. ‘చిన్నప్పట్నించి అనుకున్న సంబంధానికి మళ్లీ పెళ్లిచూపులేంట్రా. ఏంటో ఈకాలం పిల్లలు’ అన్నాడు.దూరంగా ఉండి ఈ మాటలన్నీ వింటోంది శిరీష. ప్రవీణ్ మాటలకి కోపమొచ్చేసింది ఆమెకు. కానీ అది సమయం సందర్భం కాదని ఏం మాట్లాడకుండా గమ్మునే ఉండిపోయింది.అరగంటలో పెండ్లిచూపుల కార్యక్రమం అంతా అయింది. వచ్చే మంగళవారం లగ్నపత్రిక రాయించుకొద్దాం అని రెండు కుటుంబాలు అనుకునేశాయి. ఇద్దరూ ఉండేది అదే ఊళ్లో. జరగాలి కాబట్టి జరిపించినట్టుగా ఉంది తంతు.‘ఎల్దాం పదండి’ అంటా అమ్మాయి తరుపువాళ్లు బయల్దేరతా ఉంటే శిరీష ‘మీరు బొండి, నాకు పవిగాడితో కాస్త పాతబాకీల ముచ్చట ఉంది. తేల్చుకొనొస్తా’ అనింది. శిరీషకు ఎప్పుడూ ఎవురూ అడ్డు జెప్పింది లేదు. అట్లే కానియ్యమని బయల్దేరి పోయినారు. ప్రవీణ్ మిద్దె మీద ఎండబెట్టిన మిరక్కాయలని గోతాంలో ఏస్తాన్నాడు. వానొస్తాదని నమ్మకమొచ్చేలా ఇంకోసారి ఎక్కడో పిడుగు పడిన శబ్దం వినపడింది. ఎండ కూడా తన పెగ్గి తగ్గించుకుంటాంది.‘అత్తా.. పవీ ఏడా’ అనడిగింది శిరీష నవ్వతా. అత్త కూడా నవ్వతా పైకి చూపెట్టింది. మూటగట్టిన మిరక్కాయల గోతాంని లోపలికేసి కిందకు దిగిన ప్రవీణ్ చెయ్యి కడుక్కుని తుడుచుకుందామని అట్టా ఇట్టా చూశ్నాడు. శిరీష అగుపడ్నాది. దగ్గరకెళ్ళి చీర కొంగు బట్కోని తుడుసుకోబోయినాడు, శిరీష వెంటనే వెనక్కి జరిగి – ‘రేయ్.. కొత్త చీరరా’ అనింది. ప్రవీణ్ రెండు చేతులూ ఏసేసరికి చేతుల తడి నడుముకు తగిలింది. శిరీష వెంటనే ప్రవీణ్‌ను ఎనక్కి తోసేసి, ‘మండుతాది వాయ్’ అనింది కోపంగా. ‘లాస్టు మూడు నెలలుగా నాకు మండినట్టా?’ అనేసి బాల్కనీ వైపుగా నడిచి అక్కడ అలానే కింద కూర్చుండిపోయినాడు. ‘అబ్బా .. మళ్ళీ మొదలు పెట్నావా?’ అంటూ పక్కనే ఒచ్చి కూర్చొనింది శిరీష.ప్రవీణ్ తలవంచుకున్నాడు. వోని గెడ్డం పట్టుకొని పైకి లేపింది. వోని కండ్లు ఎర్రగా నరాలు తేలేసి ఉన్నాయ్. ‘దీనికి ఎందుకురా పవీ ఏడవడం? ఏమన్నా అంటే ఇట్టా ఆడపిల్లలా ఏడుస్తావ్..’ అనేసి కండ్లు తుడిచింది శిరీష. ‘ఏం, ఆడపిండ్లోల్లే ఏడసాల్నా? మొగపిండ్లోల్లు యాడ్సకూడదు అని యాడైనా రాసుండాదా ఏం..?’ అన్నాడు ప్రవీణ్ కండ్లు తుడుసుకుంటా. శిరీష నవ్వి ‘సర్లే , మళ్ళీ ఏడుద్దువులే గానీ, ఈ మూడు నెలలు ఎట్లున్నావ్రా నాతో మాట్లాడకుండా, నన్ను సూడకుండా?’ అనింది. ‘అదేమంత కష్టం కాదులేమే, నువ్వే మళ్లీ పలకరిస్తావ్ అని నాకు దెల్సు. అందుకే ఆ నమ్మకంతోనే ఉన్నా’ అన్నాడు ప్రవీణ్. ‘ఉద్యోగం మానేశ్నావంట ? ఏంది కత?’ ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.‘అక్కడ టౌన్లో ఉండబుద్ధి గాట్లేదు మే. ఆ ప్రైవేట్ స్కూల్లో టీచరు ఉద్యోగం నావల్ల కాదు ఇంక. ఈసారి డీఎస్సీ నోటిఫికేషన్ పడనియ్. అప్పటిదాకా నువ్వున్నావ్‌గా, ఏం చూస్కోవా నన్ను?’ ‘నేను చూసుకుంటాలే గానీ, ఈలోపు నీ చేయి కంట్రోల్లో లేకుంటే ఇరగ్గొట్టి పొయ్యిలో పెడతా.’‘మరెట్టాగే? ఇంకెన్నాళ్ళు ఇట్టా దూరంగా ఉండాల నీతో?’‘రేయ్ తిక్క సన్నాసీ.. వయసు శానా ఆట్లే ఆడమంటాది. కొన్నిదినాలు ఆగు, పెండ్లైపోనీ’అని గట్టిగా ఒక ముద్దిచ్చి ఆడ నుంచి ఇంటికి బోయింది శిరీష.మూడు నెలల క్రితం శిరీష ఇంటికి వెళ్లిన ప్రవీణ్ ఏకాంతం చూసి చనువు చూపించబోయాడు. లాగిపెట్టి కొట్టింది. పద్ధతి ప్రకారం ఉండకపోతే పెళ్లీగిళ్లీ జాన్తానై అంది. ‘అసలు మూడు నెలలు కనపడకుండా వినపడకుండా నిష్టగా ఉంటేనే పెళ్లి’ అంది. ఆ మాటను అంత పట్టింపుతో అనకపోయినా ప్రవీణ్ సీరియస్‌గా తీసుకున్నాడు. ఇద్దరి వైఖరిలో మార్పు గమనించి పెద్దవాళ్లు ఇది ఎటుపోయి ఎటొస్తుందోనని పెళ్లికి వేగం తెచ్చారు. అది కూడా జనం కోసం జరిపించాల్సిన ఒక తంతే. ప్రవీణ్, శిరీష మానసికంగా ఎప్పుడో భార్యాభర్తలు. ఆ రేతిరి మిద్దె మీద చాప ఏస్కొని అటూ ఇటూ దొర్లుతున్నాడు ప్రవీణ్. నిద్ర పట్టక కింద వీధిలో కొచ్చి సిగరెట్ వెలిగించినాడు. శిరీష గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మొబైల్ చూస్కున్నాడు. గీత నుంచి మళ్ళీ మెసేజ్– ‘మేల్కొనే ఉన్నావా?’ అని. దాన్ని పట్టించుకోకుండా ‘డార్లింగ్’ అని ఉన్న నంబర్‌కి డయల్ చేశాడు.నిద్ర మత్తులో ఫోన్ ఎత్తినాది శిరీష. ‘ఏంది పవీ ఈ టైములో ఫోను’ ‘నిద్రపట్టట్లే మే’ ‘పడుకుంటే అదే వస్తాదిలే. పడుకో పవీ’ అంటూ ఫోన్ పెట్టేశ్నాది శిరీష. ఇంతలో గీత నుంచి మళ్ళీ మేసేజ్– ‘పడుకునేశ్నావా’ అని. ‘లేదు’ వెంటనే ఫోన్ రింగయ్యింది. గీత నుంచి ఫోన్.‘హలో’ అన్నాడు ప్రవీణ్. ‘ఏం చేస్తున్నావ్?’ ‘ఏం జెయ్యట్లా. నిద్రపట్టకపోతే అలా బయటకొచ్చినా’ ‘బయటికి అంటే మీ ఇంటి ముందుకా ?’‘అవును. అయినా యాడైతే నీకు తేడా ఏముందే, నువ్వుండేది బెంగుళూరులో గదా’‘రామాలయం వీధి వైపు నడుస్తున్నావా?’‘అవును. అంత కరెక్టుగా ఎట్టా జెప్పినావ్?’‘ఇంకొంచెం ముందుకి నడువు అలాగే’ అట్టాగే ముందుకి పోయిన ప్రవీణ్‌కి ఎదురుగా చెయ్యి ఊపుతూ ఎవరో కనబడ్డారు. ఈ టైంలో ఎవరా అని చూస్తే గీత! ‘ఒసేయ్, నువ్వేందే ఈడ ? బెంగుళూరు నుంచి ఎప్పుడొచ్చినావ్?’ అన్నాడు. ‘సాయంత్రం ఒచ్చినాన్లే గానీ, దా ఇక్కడ చలిగా ఉంది లోపలికెళ్దాం.’ ‘ఈ టైంలో ఎందుకులేమే, తెల్లార్నంక మాట్లాడుకుందాం’ అన్నాడు ప్రవీణ్. ‘అబ్బా, ఏంగాదు రా ప్రవీణ్’ అంటూ బలవంతంగా లోపలికి లాక్కెళ్ళింది గీత. ప్రవీణ్ ఇల్లంతా చూస్తూంటే ‘ఎవరూ లేరు. అందురూ పెండ్లికి ఎలబారిపోయినారు. నువ్వూ నేనే ఉండాం’ అనేసి సోఫాలో కూర్చునింది. బయట వర్షం మొదలైంది. మెల్లగా ఊపందుకుంది. ‘ఈ రేతిరికి వాన ఇంకా గెట్టిగా పడేట్టుగా ఉండాది మేయ్. ఇంకా పెరిగే లోపు నేను ఇంటికెళ్ళిపోతా’ అన్నాడు ప్రవీణ్.‘సర్లే ఎల్దువులే గానీ, కాసేపు ఉండు ప్రవీణ్’ అనింది. ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకునింది. ప్రవీణ్ గుండె వేగం ఆ పిల్లకి కూడా తెలుస్తాంది.‘నువ్వంటే చిన్నప్పట్నుంచీ ఇష్టంరా ప్రవీణ్. కానీ నీకేమో ఆ శిరీష అంటే పిచ్చి. అందుకే ఎప్పుడూ జెప్పలా నీకు. కానీ నువ్వు కావాలి’ గీత కండ్లు మూసుకునింది. మొహాన్ని మొహానికి దగ్గిరగా తెచ్చాడు ప్రవీణ్. పెదాల మీద ముద్దు పెడతాడు అనుకునింది. అయితే ప్రవీణ్ నుదిటి మీద ముద్దు పెట్టాడు. ‘ఇట్టా చేయడం తప్పు మేయ్’అన్నాడు. వెంటనే కండ్లు తెరిచేశ్నాది గీత. ‘నా శిరీషకు నేను అన్యాయం చేయలేను. ఈ వయసులో మనందరికీ ఒకేలా ఉంటుంది. అదే మాట శిరీషతో అంటే– ఉంటుంది. నాకూ ఉంటుంది. కాని ఆగాలి కదా అని ఆగడం నేర్పింది. నీకూ అదే మాట చెప్తున్నా. వయసు ఆడించినట్టు మనం ఆడకూడదు’ అనేసి పైకి లేచాడు.‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్. గీత ఏం మాట్లాడకుండా నిలబడింది. కండ్లు తుడుచుకొని, ‘నాదే తప్పు. మీ మధ్య దూరుండకూడదు. పెండ్లెప్పుడు అనుకుంటా ఉండారు?’ అనడిగింది.‘రెండు నెలల్లో. కానీ అంత దూరం మంచిది కాదనిపిస్తాంది’ అంటూ నవ్వినాడు ప్రవీణ్. గీత కూడా నవ్వింది. ‘సరే మేయ్ నేను పోతా’ అనేసి వానలోనే తడ్సుకుంటా ఇంటికి పోయి మిద్దె మీదకెల్నాడు ప్రవీణ్. అక్కడ చాప, దిండు రెండూ తడిసి ముద్దయిపోయున్నాయి. మరుసటి రోజు పొద్దున్నే శిరీష వొచ్చినాది. ఆరేసున్న బొంత, చాప, ఎండబెట్టిన దిండు అన్నిటినీ చూస్తూ నిలబడింది. ‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్.‘ఇది. ఈ కంట్రోల్ ఉండాల్ననేరా మూడు నెలలు నన్ను కల్సొద్దు అని కండిషన్ బెట్టి కూర్సోబెట్టింది. కానీ నిన్ను నమ్మినా, ఈ వయసును నేను నమ్మలేను పవీ’ అంది. ‘మరేం చేద్దాం?’ అన్నాడు ప్రవీణ్. వారం తర్వాత ప్రవీణ్, శిరీషల పెండ్లి ఘనంగా జరిగింది.ఆ రేతిరి, దాదాపు ఒంటిగంట ప్రాంతంలో.. ‘ఏంది పవీ, ఇంకా ఒంటి గంట కూడా కాలేదు. అప్పుడే పడుకుంటే ఎట్టా?’‘అట్టా కాదు లెమ్మే, నాకు నిద్దొరస్తాంది’ అన్నాడు ప్రవీణ్. శిరీష నవ్వతా అనింది ‘నాకు రాట్లేదు’ -
టెస్టులు.. స్కాన్.. ఉంటాయా?
నాకు 35 ఏళ్లు. యూరిన్ టెస్ట్‌లో గర్భవతి అని తెలిసింది. మూడు నెలల తర్వాత డాక్టర్‌ను సంప్రదించమని సలహా ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. అందాకా ఆగొచ్చా? ఇప్పుడేమైనా టెస్టులు, స్కాన్స్ ఉంటాయా? సూచించగలరు. – వాసవి, ఆదిలాబాద్ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని కలవటం మంచిది. 30 ఏళ్లు దాటాక ప్రెగ్నెన్సీ వస్తే కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. థైరాయిడ్, బీపీ, సుగర్ టెస్ట్లైతే వెంటనే చేయించుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. రోజూ ఫోలిక్ యాసిడ్, మల్టీ విటమిన్ మాత్రలను వేసుకోవాలి. మీ లాస్ట్ పీరియడ్ తేదీ నుంచి రెండు నెలలకి వయబిలిటీ స్కాన్ అని.. ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఇందులో గర్భసంచిలో సరైన ప్లేస్లోనే పిండం ఫామ్ అయిందా.. లేదా? పిండం వయసు, ఎదుగుదల ఆరోగ్యంగా ఉందా.. లేదా? వంటివన్నీ తెలుస్తాయి. కొన్నిసార్లు ట్యూబల్ ప్రెగ్నెన్సీ వంటి కాంప్లికేటెడ్ పరిస్థితులు ఉంటాయి. అలాంటి కండిషన్‌ని ఈ స్కాన్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు జెనెటిక్ లేదా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని గుర్తించేందుకు 3వ నెలలో కొన్నిరకాల రక్తపరీక్షలు, స్కానింగ్‌ని చేయాల్సి ఉంటుంది. వీటిని చేయించుకునే తేదీని కూడా ఫస్ట్ స్కాన్లోనే కన్ఫర్మ్ చేస్తారు. ఈ స్కాన్‌ను ఇంటర్నల్/ఎక్స్టర్నల్ రెండు విధాలుగా చేస్తారు. ఇందులో బిడ్డ సైజు, హార్ట్ బీట్ తెలుస్తాయి. అండాశయాల్లో ఏమైనా సిస్ట్స్ ఉన్నాయా అని కూడా చూస్తారు. పిండానికి రక్తప్రసరణ సరిగా ఉందా? ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. 8–9 వారాల్లో ట్విన్ ప్రెగ్నెన్సీని కనిపెట్టొచ్చు. మూడవ నెల నిండిన తర్వాత చేసే ఎన్టీ స్కాన్ ( (Nuchal Translucency)లో డౌన్‌సిండ్రోమ్ లాంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా తెలుస్తాయి. దీంతోపాటు ఇంకా టీ18, టీ13 అనే సమస్యలనూ గుర్తించే వీలుంటుంది. డెలివరీ అయ్యే సుమారు తేదీ కూడా ఈ స్కాన్లోనే తెలుస్తుంది. ఈ ఎన్టీ స్కాన్‌ను 12–13 వారాల మధ్య చేస్తారు. ఈ టెస్ట్‌లో ఒకవేళ ఏదైనా సమస్య కనపడితే తదుపరి ఏ డాక్టర్ని కలవాలి, చెకప్స్, హై రిస్క్ అబ్‌స్టెట్రీషియన్ కేర్ వంటివి సూచిస్తారు. తొలి మూడు నెలల్లోనే బిడ్డకు అవయవాలన్నీ ఏర్పడటం మొదలవుతుంది కాబట్టి తీసుకోవలసిన పోషకాహారం, జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో ఒకవేళ బిడ్డకేవైనా ఎదుగుదల సమస్యలు కనిపిస్తే వేసుకోవలసిన మాత్రలు, తీసుకోవలసిన ఇంజెక్షన్స్‌ను ప్రిస్క్రైబ్ చేస్తారు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. నాకు 37 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. పీరియడ్స్‌లో విపరీతమైన పెయిన్ ఉంటుంది. రొటీన్ స్కాన్‌లో లో అడినోమయోసిస్ అని తేలింది. వేరే పరీక్షలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. తెలిసిన డాక్టర్ చూసి, గర్భసంచి తొలగించాలని చెప్పారు. వేరే మార్గం లేదా?– ప్రదీప్తి, విజయనగరంపీరియడ్స్లో పెయిన్ తప్ప ఇతర ఇబ్బందులేమీ లేవంటున్నారు. కాబట్టి మేజర్ సర్జరీ అవసరం లేదు. నెలసరిలో నొప్పి తగ్గేందుకు కొన్ని మందులు వాడొచ్చు. అడినోమయోసిస్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. గర్భసంచిలో ఉండే టిష్యూ గర్భసంచి గోడలోకి వెళ్లి నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం అవటం, పొత్తి కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటివి ఉంటాయి. సాధారణమైన పెయిన్ కిల్లర్ మాత్రలతో నొప్పి తగ్గకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఇంట్రాటెరైనా డివైస్ – MIRENA లాంటివి నొప్పిని, బ్లీడింగ్నీ తగ్గిస్తాయి. మీరు డాక్టర్ని సంప్రదిస్తే.. పరీక్షించి.. మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో, ఏది మంచిదో చెబుతారు. అడినోమయోసిస్ అనేది దానికదే తగ్గే అవకాశం తక్కువ. అందుకని ఏడాదికోసారి స్కాన్ చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. మెనోపాజ్ వయసుకి హార్మోన్లు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ఇదీ తగ్గిపోవచ్చు. ఆల్రెడీ పిల్లలున్న వారు MIRENA కాయిల్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. హిస్టరెక్టమీ లాంటి మేజర్ సర్జరీని నివారించవచ్చు. కేవలం నొప్పి, అధిక రక్తస్రావం మాత్రమే ఉన్నవారికి (థైరాయిడ్, హై బీపీ, సుగర్ లాంటి సమస్యలేవీ లేకపోతే) ఈ కాయిల్ లేదా మాత్రలతో త్వరగానే రిలీఫ్ వస్తుంది. అలాగే మీ ఏజ్ గ్రూప్ వాళ్లు తప్పకుండా పాప్ స్మియర్ అనే సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకసారి అన్ని పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్‌తో గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. సరైన చికిత్సను సూచిస్తారు.