Health
-
స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!
వాతావరణం మారుతోంది. ఇప్పుడే ఎండ... అంతలోనే చిటపట చినుకులు... రాత్రి అయేసరికి చలి.. ఈ పరిస్థితులలో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి చాలామందికి సర్వసాధారణం. మన రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా ఉన్నంతవరకు మనల్ని ఏ రుగ్మతా ఏమీ బాధపెట్టలేదు. అయితే అలా మన ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. అవి మన వంటింట్లో సులువుగా దొరికే సహజసిద్ధమైనవైతే మరీ మంచిది. అలాంటి చిట్కాలేమిటో చూద్దాం...పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోగానే ఆమ్లా, చియా సీడ్స్ వాటర్ తాగితే చాలామంచిది. ఈ జ్యూస్ తాగితే జీవక్రియలు సక్రమంగా జరగడం తోపాటు ఒంటికి సరిపడా సీ విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగుతుంటే కొద్దిరోజుల తర్వాత చర్మం పట్టులా నిగారించడంతోపాటు వాపులు, నొప్పులు తగ్గి, శరీరం తేలిక పడుతుంది. తిన్న ఆహారం చక్కగా ఒంటికి పడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సుగర్ స్థాయులు అదుపులో ఉంటాయి. లివర్ పనితీరు బాగుంటుంది. కండరాలు దృఢపడతాయి. ఈ జ్యూస్ తయారీకి కావలసిందల్లా ముందుగా రెండు టీస్పూన్ల చియాసీడ్స్‌ను రాత్రిపూట నానబెట్టుకుని ఉంచుకోవాలి. పొద్దున లేవగానే చక్కగా కడిగి తరిగిన రెండు ఉసిరి కాయలను గింజలు తీసి రోటిలో వేసి దంచండి లేదా జ్యూసర్ లో అరగ్లాసు నీళ్లు కలుపుకుని రసం తీసి, వడ కట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చియా సీడ్స్‌ను కలుపుకుంటే సరి! డ్రింక్ రెడీ!!(చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!) -
యంత్రంలా మారిన మనిషి
అరుణ్‌కుమార్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. డ్యూటీకి వెళ్లిన తర్వాత నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు. కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సమయం దొరికేది కాదు. దీంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడు. క్రమేణా అతని పనిపై ప్రభావం చూపింది. అధిక సమయం కార్యాలయంలోనే ఉంటున్నా తాను చేయాల్సిన పనులను పూర్తి చేయలేక పోతున్నాడు. ఇలా ఎంతో మంది కార్పోరేట్ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిని తొలిదశలో గుర్తించకపోవడంతో రాను రాను తీవ్రమైన డిప్రెషన్‌కు దారి తీస్తున్నట్లు పేర్కొంటున్నారు.రమేష్ విజయవాడ నగరంలోని ఓ కార్పొరేట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పనితీరును మెచ్చిన యాజమాన్యం ఏడాది కిందట మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు. అప్పటి నుంచి కొన్ని టార్గెట్లు అప్పగించి వాటిని రీచ్ అవ్వాలనే ఆదేశాలు ఇచ్చారు. దీంతో తన టీమ్‌తో పనిచేయించేందుకు నిమిషం ఖాళీ లేకుండా బిజీగా ఉండేవారు. ఈ తరుణంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోను కావడంతో ఆ ప్రభావం పనిపై పడింది. యాజమాన్యం ఇచ్చిన టార్గెట్లు రీచ్ కాలేకపోయాడు. దీంతో డిప్రెషన్‌కు లోనయ్యారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. తమకు తెలియకుండానే డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఆ ఫలితంగా ఎక్కువ సేపు కార్యాలయంలోనే ఉన్నా ఉత్పాదక శక్తి తగ్గిపోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో మనిషి యంత్రంలా మారిపోయాడు. తాము పనిచేసే సంస్థ ఇచ్చిన, తాము ఎంచుకున్న టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చేదాకా సెల్ఫోన్లలో మాట్లాడటానికే కాలం సరిపోతుంది. నలుగురిలో కలిసి చెప్పుకునే ముచ్చట్లు లేవు, కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. రోజు రోజుకు మానసిక పరిస్థితి దిగజారడం, ఉత్పాదక శక్తి తగ్గిపోతుండటంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పనిచేసే ప్రాంతంలో మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనే నినాదంతో జరుపుకోనున్నారు.రిలాక్సేషన్‌పై దృష్టి పెట్టాలి....👉 పనిచేసే చోట ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా రిలాక్సేషన్‌పై దృష్టి పెట్టాలి👉 ప్రతి రెండు గంటలకు ఒకసారి రిలాక్స్ అయ్యేందుకు సమయం ఇవ్వాలి.👉 పనిలో ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగులు వ్యాయామం యోగా, మెడిటేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.👉 కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి.👉 కొన్ని చోట్ల టాయిలెట్‌కు వెళ్లెందుకు కూడా సమయం ఉండటం లేదని ఇటీవల సర్వేలు చెప్పాయి. అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలి.👉 మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేలా కార్యాలయాల్లో చర్యలు తీసుకోవాలి.👉 పది నిమిషాలు మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తే అది ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడుతుందనే విషయాన్ని గ్రహించాలి.👉 వారానికి ఒకసారైనా రిలాక్సేషన్ కోసం ఆత్మీయ బంధువులు, మిత్రులను కలవడం ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.👉 చేసే పనిని ప్రణాళిక బద్దంగా విభజించి చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలిశారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. ముఖ్యంగా పనిచేసే ప్రాంతంలో మానసిక ఒత్తిళ్లు కారణంగా ఉత్పాదకతపై ప్రభా వం చూపుతుంది. డ్యూటీ సమయంలో ఉద్యోగుల రిలాక్సేషన్‌పై యాజమాన్యాలు దృష్టి పెట్టాలి. పని చేసేటప్పుడు రిలాక్సేషన్ కోసం కొంత సమయం కేటాయించాలి. మనస్సు ప్రశాంతంగా ఉండేలా వాతావరణం కల్పించాలి.–డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్, మానసిక వైద్య నిపుణులుపర్సనల్ లైఫ్‌పై ప్రభావంపనిచేసే చోట ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు పర్సనల్ లైఫ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగానికి, కుటుంబాన్ని బ్యా లెన్స్ చేసుకోలేక పోతున్నారు. దాంపత్య జీవితంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు ఇటీవల సర్వేల్లో తేలింది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. వారు మనుషుల్లా కాకుండా నిర్దేశించిన పనిని పూర్తి చేసే రోబోల్లా మారుతున్నారు.– డాక్టర్ గర్రే శంకరావు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
ఈ మెంటల్ ఎక్సర్‌సైజ్‌తో మంచి నిద్ర షురూ..!
ప్రస్తుత జీవన విధానంలో మంచి నిద్ర అనేది కరువైపోయింది. దీన్ని కూడా మనం కొనుక్కునే స్థితికి వచ్చేశాం. అంతలా మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లకు పరిమితమైపోతున్నాం. ఆఫీసుల్లో గంటలకొద్ది కంప్యూర్ల ముంగిట కూర్చొవడం..తీరా ఇంటికొస్తే మొబైల్ స్క్రీన్‌కి అతుక్కుపోవడం తదితర కారణాలతో రెప్పవాలదే..అంటూ రాత్రంతా జాగారం అయిపోతుంది. ఇందుకోసం ఎన్నో పయత్నాలు చేసి అలిసి, విసిగిపోయి ఉంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వమని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు మంచి నిద్ర కోసం ఏం చేయాలో కూడా సూచించారు. అవేంటో సవివరంగా చూద్దామా..!.రాత్రిపూట నిద్రపోదామనుకుంటే బుర్రలో ఆలోచనలు నిరంతర ప్రవాహంలో ఒకదాని వెనుక ఒకటిగా వివిధ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కొందరూ యోగాతో నియంత్రించగలగినా..మరికొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. "మొదట నిద్రకు ఉపకరించే ముందు.. మంచి నిద్ర కావాలంటే మెదడు ఎలాంటి ఆలోచనలు లేని ప్రశాంత స్థితిలో ఉంటేనే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌నే సాగిస్తున్నారు.ఈ క్రమంలో ఆటో పోట్లు సహజం. అది అందరికీ కామన్ అనేది గుర్తించుకోండి. కాబట్టి మనమే పెద్ద ప్రాబ్లమ్‌లో లేం అనేది విస్మరించొద్దు. నాకు మాత్రమే ఇలా..అనే బాధను దూరం పెట్టేయాలి. ఆ తర్వాత ఈ మెంటల్ ఈ ఎక్సర్‌సైజ్‌ని ఫాలో అవ్వండి". అని చెబుతున్నారు నిపుణులు. ఏంటి వ్యాయామం అనుకోకండి. ఏం లేదు ఆలోచనలకు స్వస్తి చెప్పేలా..కాగ్నిటివ్ షఫులింగ్ అనే మెంటల్ ఎక్సర్‌సైజ్‌ని అనుసరించడని చెబుతున్నారు. ఏంటిదీ అంటే..మెదడు ఒక విషయంపై ఏకాగ్రతతో పనిచేసేలా చేయడం లాంటిది. ఒక రకంగా మెదడు మేతలాంటి ఫజిల్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్‌లో ఏదోక ఒక వర్డ్‌ని అనుకోవాలి అందులో అక్షరంతో వచ్చే పలు పదాలు గుర్తు తెచ్చుకోవాలి అవన్ని ఓ వరుస క్రమంలో చెబుతుండాలి. ఈ మానసిక శ్రమ ఒక విధమైన అలసటకు గురై తెలియకుండానే గాఢనిద్రకు ఉపకరిస్తుంది. మొదట్లో సమయం తీసుకున్న రోజులు గడుస్తున్న కొద్ది మంచి మార్పు, చక్కటి ఫలితం పొందుతారని చెబుతున్నారు నిపుణులు. అలాగే దీంతోపాటు నిద్ర రాకుండా చేస్తున్న ఆహారం, భౌతిక కార్యకలాపాలను నివారించాలని సూచించారు. ముఖ్యంగా అవేంటంటే..నిద్రవేళకు ముందు కెఫిన్ నివారించడంనిర్ణిత సమయానికి నిద్రించడంసిగరెట్లు వంటి చెడు అలవాట్లు దూరం చేసుకోవడం.సాయం సమయాల్లో వ్యాయామం చేయడంమద్యానికి దూరంగా ఉండటం.టెలివిజన్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి శబ్దం లేదా వెలుతురు వంటివి రాకుండా జాగ్రత్త పడటంయోగా, ధ్యానం వంటివి సాధన చేయడంతదితరాలతో ఆలోచనలు నియంత్రించడమే కాకుండా మంచి నిద్ర పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి.(చదవండి: నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!) -
నౌకాసనం: లైఫ్ బోట్ బ్యాలెన్సింగ్..!
శరీర బలాన్ని బ్యాలెన్స్ చేసే ఈ ఆసనాన్ని బోట్ ఆసన అని కూడా అంటారు. ఈ ఆసనం శక్తిని పెంచుతుంది. అలసటను పోగొడుతుంది. తొడలను బలోపేతం చేయడం ద్వారా ఎక్కువసేపు కూర్చొని చేసే పనుల వల్ల కలిగే సమస్యలను నిరోధిస్తుంది. నౌకాసనాన్ని సాధన చేయాలనుకునేవారు.. ముందుగా మ్యాట్ పైన కాళ్లను ముందుకు చాపి విశ్రాంతిగా కూర్చోవాలి. తుంటి భాగానికి ఇరువైపులా చేతులను నిటారుగా ఉంచాలి. తల నుంచి వెన్నుభాగాన్ని కొద్దిగా వెనక్కి వంచాలి. ఇలాంటప్పుడు హిప్ భాగంపై బరువును బ్యాలన్స్ చేసుకునేలా చూసుకోవాలి. శ్వాస వదులుతూ మోకాళ్లను, పాదాలను నేల నుండి పైకి ఎత్తాలి. ముందు మోకాళ్లు వంగి ఉంటాయి. నెమ్మదిగా నిటారుగా ఉంచే స్థాయికి తీసుకురావాలి. కంటి చూపు స్థాయికి పాదాలను పైకి లేపాలి. సాధ్యం కాక΄ోతే కొద్దిగా మోకాళ్లను వంచి, పిక్కలు, మడమల భాగాన్ని నేలకి సమాంతరంగా ఉంచాలి. భుజాలను కొద్దిగా వెనక్కి లాగి, రెండు చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. నాభి భాగాన్ని దృఢంగా ఉంచడానికి ప్రయత్నించాలిపాదం, వేళ్లను కొద్దిగా వంచి, ఈ భంగిమలో శ్వాస తీసుకొని, వదలాలి. 10 నుండి 20 సెకన్ల ΄ాటు భంగిమలో ఉండటానికి ప్రయత్నించాలి.తర్వాత సాధారణ స్థితికి చేరుకోవడానికి ముందుగా పాదాలను, చేతులను నేలపై ఉంచాలి. తర్వాత తల, వెన్నుభాగాన్ని యథాస్థితికి చేర్చాలి. ∙సాధనలో నెమ్మదిగా సమయాన్ని పెంచాలి. – జి.అనూష, యోగా గురు (చదవండి: -
పిల్లల అరచేతులు, అరికాళ్లలో దురదలా..ప్రమాదకరమా?
సాధారణంగా పిల్లల్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు... మరీ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చాక కొందరు చిన్నారుల్లో ఈ విధమైన లక్షణాలు కనిపి స్తుంటాయి. మొదట్లో అవి చాలా తీవ్రంగా కనిపించినా క్రమేపీ తగ్గిపోతాయి. ఇది చాలా సాధారణం. అలాగే ఎగ్జిమా వంటి మామూలు సమస్యలతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, స్ట్రెస్ వంటి కొన్ని సిస్టమిక్ వ్యాధులు ఉన్నప్పుడూ, ఇక సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్లతోపాటు, కొన్నిసార్లు విటమిన్ లోపాలు... ఇలాంటి కారణాల వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అంత ప్రమాదకరం కాదు గానీ... పైన పేర్కొన్న సోరియాసిస్ వంటివి మినహాయిస్తే ఇలా చర్మం ఉడి΄ోతూ కొత్త చర్మం వచ్చే ఎగ్జిమా వంటి వాటితపాటు... కొంతమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లాగా కూడా వచ్చే ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అనే కండిషన్లు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లో వాటంతట అవే పూర్తిగా తగ్గి΄ోతాయి. దాదాపుగా ఏమాత్రం ప్రమాదకరం కాదనే చెప్పవచ్చు.ఈ జాగ్రత్తలు పాటించాలి... ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు చేతులు తేమగా ఉంచుకోవడం (వెట్ సోక్స్), మాయిçశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం వంటివి చేయాలి. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) వల్ల ఉపశమనం ΄÷ందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న జాగ్రత్తల తర్వాత కూడా తగ్గక΄ోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ తీవ్రతరమవుతున్నా పీడియాట్రీషియన్ లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. ∙ చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో దురదలా? -
గౌట్ సమస్యతో బాధపడుతున్నారా? ఇవిగో ఆహార నియమాలు!
కీళ్ల మధ్య యూరిక్ యాసిడ్ రాయిగా ఏర్పడి... అందులోనూ ముఖ్యంగా బొటనవేలి ఎముకల మధ్యగానీ, మోకాలి దగ్గర గానీ రాపిడి కలిగిస్తూ ఎంతో నొప్పిని, ఇబ్బందినీ కలిగించే వ్యాధి గౌట్. గౌట్‌ను నివారించేవి లేదా వచ్చాక అనుసరించాల్సిన ఆహార నియమాలివి... మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్‌మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి. మద్యం, మాంసాహారంలో ఉండే ప్యూరిన్స్ అనే వ్యర్థ పదార్థాల వల్ల గౌట్ వస్తుంది కాబట్టి మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. స్వీట్స్, సాఫ్ట్‌డ్రింక్స్, ఆలూ ( పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పండ్లు కూరగాయలు యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్ మోతాదులను నియంత్రించేందుకు బాగా ఉపయోగపడతాయి. పొట్టు తీయని బియ్యం (బ్రౌన్ రైస్), ఓట్స్ గౌట్ నివారణకు బాగా పనిచేస్తాయి. ఆకుపచ్చరంగులో ఉండి యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉండే వెజిటబుల్స్ (ముఖ్యంగా బ్రాకలీ వంటివి) తీసుకోవడం వల్ల అవి గౌట్‌ను సమర్థంగా నివారించగలవు. కొంతమంది పిల్లల్లో అరచేతులు, అరికాళ్లలో దురదలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వచ్చి తగ్గి΄ోవడం అన్నది చాలా మామూలు విషయమే. అయితే అలా కాకుండా మరికొంతమంది పిల్లల్లోనైతే అరచేతులు లేదా అరికాళ్లలో విపరీతంగా దురద రావడంతో పాటు అక్కడి చర్మం పొరలుగా ఊడి΄ోతుంటుంది. ఇది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇలా జరగడానికి చాలా అంశాలు కారణమవుతుంటాయి. -
ప్లాస్టిక్ బౌల్స్‌లో ఆహారం ఎందుకు తినకూడదంటే..?
ఇటీవల డైనింగ్ టేబుల్స్ మీద ఉండే కిచెన్ వేర్లలో అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్‌లో కూడా ఉంటున్నాయి. అందులో వేడివేడి కూరలూ, పులుసు, అన్నం వంటి ఆహారాలు తీసి ఉంచి వడ్డిస్తూ ఉండటం చాలా మంది ఇళ్లలో కనిపించేదే. పైకి అనేక డిజైన్లతో చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్... అందులో ఉంచే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా ఈ బౌల్స్‌ను ‘మెలమైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసుల వంటి ఆహారపదార్థాలను ఇందులోకి తీయగానే ఆ వేడికి మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందనీ, దేహంలోకి ప్రవేశించే ఈ మెలమైన్ వల్ల మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అధ్యయనం నిర్వహించిన తీరిది... ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి చేసిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్‌లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతోపాటు కేన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఈ పని అస్సలు వద్దు... మెలమైన్తో చేసిన వంటపాత్రలలో వేడి ఆహారాన్ని తీయడమే చాలా ప్రమాదకరమంటే కొందరు మెలమైన్ బౌల్లో పెట్టిన ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేస్తుంటారు.ఇలా అస్సలు చేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. అనర్థాలేమిటంటే... ఈ మెలమైన్ దుష్ప్రభావాలు ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావాలపై ఉంటాయి. దాంతో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యతలలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. అలాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, వీర్య కణాల కదలికలు తగ్గడం, పురుష హార్మోన్ల స్రావం తగ్గడం వంటివి జరగవచ్చు. ఇక చాలామందిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలో తేలింది. ఈ ప్లాస్టిక్ పాత్రలలో తింటున్నవారిలో స్థూలకాయం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రొమ్ము కేన్సర్ వంటి కేన్సర్ల రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు, అల్జిమర్స్ కేసులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే కూరలు, పులుసుల వడ్డింపునకు ప్లాస్టిక్ బౌల్స్‌కు బదులు పింగాణీ బౌల్స్ మంచిదన్నది నిపుణుల మాట. ఈ పరిశోధనల ఫలితాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
అమోదయోగ్యమైన నడక ఎంత?
అన్ని వయసుల వారికీ వాకింగ్ నిర్ద్వంద్వంగా అందరికీ మేలు చేసే వ్యాయామం. పైగా అది ఎవరైనా చేయగలిగే చాలా తేలికైన ఎక్సర్సైజ్. పైగా దీనికి ఎలాంటి వ్యాయామం ఉపకరణాలూ, పరికరాలూ అక్కర్లేదు. వ్యాయామం చేయగలిగే ఏ వయసు వారైనా అలాగే మహిళలైనా, పురుషులైనా వాకింగ్ చేయాల్సిన సగటు దూరమెంతో, ఎంత నడిస్తే దేహం మీద దాని ప్రభావం పడి, మంచి ఆరోగ్యం సమకూరుతుందో లెక్కలు వేశారు యూఎస్‌కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారి సిఫార్సుల ప్రకారం రోజుకు ఎనిమిది కిలోమీటర్లు మంచిదని చెబుతున్నారు. (వాళ్ల లెక్కల ప్రకారం 5 మైళ్లు). ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు నడక గానీ లేదా ఏరోబిక్స్గానీ చేయడం మంచిది. నడర అయితే రోజుకు 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తూ వారంలో కనీసం ఐదు రోజుల పాటైనా ఈ వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే రోజులో కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నది డబ్ల్యూహెచ్‌వో లెక్క. ఏ లెక్కలు ఎలా ఉన్నా... ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గి, మంచి ఫిట్నెస్ సాధించడం కోసం అందరూ రోజూ ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడవాలని పలు ఆరోగ్య సంస్థల అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గరిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ అధ్యయనాల మాట. ఇది అందరి లెక్క అయినప్పుడు అందరూ ఇన్ని దూరాలు నడవగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా... దీనికి సమాధానమిస్తూ టీనేజ్‌లో ఉన్న పిల్లలు, యువత చాలా వేగంగా ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు దూరాలు నడవాలనీ, అయితే మధ్యవయస్కులు మొదలు కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు. మరీ ఎక్కువ వయసుతో వృద్ధాప్యంలో ఉన్నవారు మాత్రం రోజూ 2 నుంచి 4 కిలోమీటర్లు నడిస్తే చాలన్నది ఆ అధ్యయన సంస్థల సూచన. ఇక ఆరు నుంచి పదిహేడేళ్ల వరకు ఉన్న చిన్నారులు రోజుకు కనీసం 60 నిమిషాల పాటైనా వేగంతో కూడిన నడక లేదా కాస్త శ్రమ కలిగించే వ్యాయామాలు చేయాలంటున్నారు.అసలు ఎందుకు నడవాలి?ఈ ప్రశ్న వచ్చినప్పుడు నడక వల్ల కలిగే వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలే సమాధానాలుగా నిలుస్తాయంటున్నాయి ఆరోగ్య పరిశోధక సంస్థలు. నడక వల్ల ఒత్తిడి తగ్గడం, మూడ్స్ మెరుగుపడటం, శక్తిసామర్థ్యాలు పెరగడం, బరువు తగ్గడం, కండరాలు బలంగా మారడం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వాటికి అవసరమైన పోషకాలు అందడం, వాటి ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. -
ఆదమరిస్తే మరపు ఖాయం
అల్జైమర్స్ ముప్పు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ? క్రమక్రమంగా చాలా విషయాల మరపునకు దారితీసే ‘న్యూరో–డీజనరేటివ్’ వ్యాధి అల్జైమర్స్... మహిళ జ్ఞాపకశక్తి, ఆలోచన, ప్రవర్తనతీరు... ఇలా ఎన్నో అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తాము ఉన్న ఇంటి అడ్రస్‌తో సహా క్రమంగా అన్నీ మరచిపోయేలా చేసే ‘అల్జైమర్స్’ ముప్పు మహిళల్లోనే ఎక్కువ.కొన్ని పరిశీలనల ప్రకారం మొత్తం రోగుల్లో మూడింట రెండు వంతులు మహిళలే! ఎందుకిలా జరుగుతోందనే అంశంపై అధ్యయనాలు జరిగినప్పుడు చాలా అంశాలే ఇందుకు కారణమవుతున్నాయని తేలింది. ఉదాహరణకు జన్యుపరమైన, పర్యావరణ, జీవశాస్త్ర సంబంధితమైన పలు అంశాలు ఇందుకు కారణమవుతున్నట్లు గుర్తించారు. అన్నింటికంటే ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వారిలో వచ్చే హార్మోనల్ మార్పులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కీలకమైన శుభవార్త ఏమిటంటే... దీనివల్ల కలిగే దుష్ప్రభావాల నివారణ చాలావరకు సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.మెనోపాజ్ తర్వాత మెదడులో వచ్చే మార్పులు... బ్రెయిన్ ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి పలు ఇమేజింగ్ పరీక్షల తర్వాత తేలిన అంశం ఏమిటంటే... మెనోపాజ్ తర్వాత మహిళల మెదడు పనితీరు, జీవక్రియల్లో మార్పు వస్తుంది. మెదడు పనితీరు తగ్గడంతో పాటు న్యూరాన్ల మధ్య కనెక్షన్లూ తగ్గుతాయి. ఈ న్యూరాన్ కనెక్షన్ల వల్లనే ఆలోచనలూ, విషయాలు జ్ఞప్తికి రావడం, నేర్చుకునే / అభ్యాసన శక్తీ... ఇవన్నీ కలుగుతాయి. మెనోపాజ్ తర్వాత మెదడు జీవక్రియలు (మెటబాలిజమ్) తగ్గడంతో జ్ఞాపకశక్తి తగ్గుతుండటం, ఏదీ ఠక్కున గుర్తుకు రాకపోవడం వంటి అనర్థాలు కనిపిస్తుంటాయి. ఇలా జరగడాన్ని ‘బ్రెయిన్ ఫాగ్’ గా పేర్కొంటారు. మెనోపాజ్ తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు వీటిని ‘అల్జైమర్స్’ తాలూకు ముందస్తు చిహ్నాలుగా కూడా భావించవచ్చు.మరి మహిళ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమెలా? ఇప్పటవరకూ అల్జైమర్స్‌ను నివారించడానికి నిర్దిష్టమైన చర్యలు లేకపోయినా, జీవనశైలిలో కొన్న మార్పుల ద్వారా (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత) ఈ ముప్పును చాలావరకు నివారించవచ్చు. మెనోపాజ్ రాబోయే ముందర హార్మోన్ రీ–ప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)లో భాగంగా ఈస్ట్రోజెన్ ఇవ్వడం వల్ల అల్జైమర్స్ ముప్పును చాలావరకు తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మెదడుకు మేత కల్పించేలా బాగా చదవడం, రకరకాల పజిల్స్ ఛేదించడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాల సాధన, తరచూ పలువురితో కలవడం, మాట్లాడుతుండటం (సోషల్ ఇంటరాక్షన్స్) వంటివి అల్జైమర్స్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. ఊ నిత్యం తగినంత శారీరక శ్రమతో, దేహంలో కదలికలతో ఉండేవారిలో అల్జైమర్స్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అందుకే వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్), ఈత, యోగా వంటి వ్యాయామాలు అల్జైమర్స్ రిస్క్‌ను తగ్గించడమే కాకుండా ఇతరత్రా మొత్తం ఆరోగ్యానికి బాగా దోహదపడతాయి. ఊ ఆహారంలో తగినంతగా ఆకుకూరలు, కూరగాయలు, చేపలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల అవి మెదడు ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. ఊ నిద్రను దూరం చేసే కెఫిన్‌ను పరిమితంగా తీసుకుంటూ మంచి నిద్ర అలవాట్లతో కంటినిండా నిద్రపోవడం అల్జైమర్స్ ముప్పును చాలావరకు తగ్గిస్తుంది. ఊ గుండె ఆరోగ్యం బాగుంటే మెదడు ఆరోగ్యమూ బాగుంటుంది. కీలకమైన ఈ రెండు అవయవాల ఆరోగ్యాలు ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. అందుకే గుండె సంబంధిత (కార్డియో వాస్క్యులార్) సమస్యలైన హైబీపీ, డయాబెటిస్ , అధిక కొలెస్ట్రాల్ వంటి జబ్బులను అదుపులో పెట్టుకోవడం ద్వారా అల్జైమర్స్ ముప్పును చాలావరకు నివారించవచ్చు. మహిళల్లోనే ఎందుకు ఎక్కువంటే... మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ల మోతాదులు మెనోపాజ్ తర్వాత తగ్గిపోతాయి. మెదడు కణాలను, మరీ ముఖ్యంగా న్యూరాన్లకు ఈస్ట్రోజెన్ మంచి రక్షణ కల్పిస్తుంటుంది. అంతేకాదు మెదడు తాలూకు జ్ఞాపకాల సెంటర్‌గా పేర్కొనే హి΄్పోక్యాంపస్కూ ఈస్ట్రోజెన్ రక్షణ ఇస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ దేహానికీ, అందులోని అన్ని అవయవాలకూ ఏజింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది కదా. ఈస్ట్రోజెన్ స్రావాలు అకస్మాత్తుగా తగ్గగానే మెదడు ఏజింగ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అలాగే మెదడులో అమైలాయిడ్స్ అనే పాచివంటి పదార్థాలు పేరుకుపోతుంటాయి. మహిళల్లో అల్జైమర్స్ ఎక్కువగా ఉండటానికి మరో కారణమం ఏమిటంటే... పురుషులతో పోలిస్తే వారు ఎక్కువకాలం జీవిస్తారు. వాళ్ల ఆయుర్దాయం కూడా ఈ ముప్పునకు మరో కారణం. ఇక జన్యుపరమైన కారణాల విషయానికి వస్తే పురుషులతో పోలిస్తే మహిళల్లో ‘ఏపీఓఈ–ఈ4’ అనే జన్యువు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... ఈ జన్యువును కలిగి ఉన్న మహిళల్లో అల్జైమర్స్ ముప్పు పురుషుల కంటే మరింత ఎక్కువ. మామూలుగానైతే వాతావరణంలో వాయుకాలుష్యానికి కారణమయ్యే సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్ అనే ధూళి కణాల వల్ల సాధారణంగా శ్వాససంబంధిత వ్యాధులు, ఆస్తమా వంటివి పెరుగుతాయన్నది చాలామందిలో ఉండే అభి్రపాయం. కానీ వాతావరణంలో పెరిగే కొద్దిపాటి కాలుష్యం మెదడుపై ప్రభావం చూపి మతిమరపునకు దారితీయవచ్చు. గాల్లోకి వ్యాపించే కొద్దిపాటి హానికరమైన ధూళికణాలు (టాక్సిక్ పార్టికిల్స్) ఏమాత్రం పెరిగినా అవి మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలను కనీసం 16 శాతం పెంచుతాయంటున్నారు అధ్యయనవేత్తలు. అలాగే అల్జైమర్స్ ముప్పునూ 11 శాతం వరకు పెంచవచ్చునంటున్నారు. ఈ విషయాలన్నింటినీ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) అధ్యయనవేత్తలు గట్టిగా చెబుతున్నారు. నాడీవ్యవస్థకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలను నివారించాలంటే వాతావరణంలో వాయువుల నాణ్యత తగ్గకుండా చూసుకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు. ‘అడల్ట్ ఛేంజెస్ ఇన్ థాట్ – (యాక్ట్)’ అనే అధ్యయనం కోసం దాదాపు పాతికేళ్లకు పైగానే ‘కైయిసర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ వారు సేకరించిన డేటాపై ఆ మాతృసంస్థతో పాటు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ) పరిశోధకులు సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించారు. వాషింగ్టన్–సియాటెల్ప్రాంతంలోని దాదాపు 4,000 మంది పరిశీలించినప్పుడు వాళ్లలో 1,000 పైగానే డిమెన్షియా రోగులు ఉన్నట్లు తేలింది. గాలిలోని హానికరమైన ధూళులు మతిమరపునకు కారణమయ్యే డిమెన్షియా, అల్జైమర్స్ జబ్బులు పెరుగుతాయని నిర్ద్వంద్వంగా తేలింది. అధ్యయనం నిర్వహించిన వారిలో నాలుగింట ఒక వంతు మందికి (దాదాపు 25›శాతం మందిలో) డిమెన్షియా ఉండటంతో ఇది కొంత ఆందోళన కలిగించే అంశంగా పరిశోధకులు పేర్కొంటున్నారు. గాల్లోని అత్యంత సూక్ష్మమైన ధూళికణాలను ‘ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్’ అంటారు. (ఈ ధూళికణాలు ఎంత చిన్నవంటే వీటి సైజు 2.5 మైక్రోమీటర్స్ మాత్రమే. ఒక పోలిక చె΄్పాలంటే వెంట్రుకను నిలువునా 30 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత సైజుంటుందో ఈ ధూళికణాల సైజు అంత ఉంటుంది). కారు ఎగ్జాస్ట్ నుంచి వెలువడే పోగ, భవన నిర్మాణ ప్రదేశాలు, మంటలూ, పోగలు ధారాళంగా వెలువడే ప్రదేశాలు... ఇలాంటిప్రాంతాలనుంచి వెలువడే ఈ ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ వల్లనే వాతావరణం బాగా కలుషితమైపోయి డిమెన్షియా, అల్జైమర్స్ వంటి నాడీ సంబంధ వ్యాధుల ముప్పు పెరుగుతోందంటున్నారు అధ్యయనవేత్తలు. ఈ అంశాలన్నీ ఇటీవలే ‘ద జర్నల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ప్రాస్పెక్టివ్స్’లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంతో... గాల్లోని కాలుష్యపదార్థాలను, ప్రమాదకరమైన ధూళికణాలను తగ్గిస్తే అటు శ్వాసకోశ వ్యాధులైన ఆస్తమా వంటివి వాటి నుంచి విముక్తి కలగడమే కాకుండా... ఇటు నాడీ వ్యవస్థకు సంబంధించిన మతిమరపూ, అల్జైమర్స్ వంటి సమస్యలూ తగ్గుతాయని స్పష్టమవుతోంది.∙ -
Diabetes: ఎలాంటి డైట్‌తో అదుపులో ఉంచొచ్చు
నాకు ఇప్పుడు 8వ నెల. డయాబెటిస్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. మా తల్లిదండ్రులకు కూడా ఉంది. డైట్ చెయ్యమన్నారు. ఈ సమయంలో ఎలాంటి డైట్‌తో డయాబెటిస్‌ని అదుపులో ఉంచవచ్చు.– శిరీష, మెదక్గర్భధారణ సమయంలో డయాబెటిస్ అనేది ఏ నెలలో అయినా రావచ్చు. కుటుంబ నేపథ్యంలో ఉన్నా, ఊబకాయం ఉన్నా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపు చేయవచ్చు. వీటితో తగ్గనప్పుడు మందులు ఇస్తాం. బిడ్డ పరిణతి, ఎదుగుదల బాగుండాలంటే ఎప్పుడూ డయాబెటిస్ అదుపులో ఉండాలి. గర్భధారణ సమయంలో బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. ఎక్కువ బరువు పెరిగి డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. డైటీషియన్, న్యూట్రిషన్ కౌన్సెలర్లు మీ బరువు, ఎన్ని నెలలు, మీ ఇష్టాలు వంటి అంశాలను బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచిస్తారు. మీరు తీసుకునే ఆహారంలో చక్కెర పాళ్లు తక్కువ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారం ఎంచుకోవాలి. అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం– బ్రౌన్ రైస్, అన్ని రకాల గింజలతో తయారు చేసిన పాస్తా, బాస్మతీ రైస్, తృణ ధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులను తీసుకోవాలి. కొన్నిరకాల ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచవు. మాంసం, చేప, గుడ్లు, పౌల్ట్రీ, నట్స్, సీడ్స్, పప్పులు, సలాడ్స్ లాంటివి మనం తినే భోజనంలో భాగం చేసుకోవాలి. మీ ఆహారం తీసుకునేటప్పుడు ఒక్కసారే ఎక్కువ మోతాదులో కాకుండా మూడుసార్లుగా విభజించుకోండి. తీపి పదార్థాలు, కేక్స్, బిస్కట్స్, చాక్లెట్స్, పుడ్డింగ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి పూర్తిగా మానేయండి. వీటికి బదులుగా రైస్ కేక్స్, క్రిస్ప్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ క్రాకర్స్, ఓట్స్ కేక్స్, పాప్‌కార్న్ లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకసారి తినే ఆహారంలో 40గ్రాముల కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరి శరీర జీవక్రియ (మెటబాలిజమ్) ఒక్కలా ఉండదు. అందుకే 40గ్రాములతో మొదలుపెట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి రెండు గంటలకు అదుపులో ఉంటే కొంచెం పెంచుకోవచ్చు. ఎక్కువ అయితే గ్రాములను కొంచెం తగ్గించాలి. భోజనానికీ భోజనానికీ మధ్యలో ఆకలి వేస్తుందని జంక్ ఫుడ్ తినేస్తారు. అలా కాకుండా 10–15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్న చిరుతిళ్లు మాత్రమే తీసుకోవాలి. అంటే, 200 ఎంఎల్ పాలు, పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పాస్తా, ఒక గుడ్డు లాంటివి. బ్రెడ్, పాస్తా, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. నూనె ఎక్కువగా ఉన్న, వేయించిన పదార్థాలు తినకూడదు. పండ్లరసాలతో చక్కెర శాతం అధికంగా పెరుగుతుంది. అందుకే çపండ్లను నేరుగా తినాలి. గ్రీన్ ఆపిల్, నారింజ, ద్రాక్ష తినాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజుకి 2–3 సార్లు తీసుకోవాలి. 200 ఎంఎల్ పాలు, 125 గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువ తింటే పోస్ట్ మీల్ సుగర్ రాదు, అందుకే ప్రొటీన్‌ను ప్రతి ఆహారంలో చేర్చుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రతి రెండుగంటలకోసారి నీళ్లు తాగాలి. దీనితో అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. బయట దొరికే ఆహారపదార్థాలను తీసుకోవడం మానేస్తే మంచిది. సుగర్ ఫ్రీ కుకీస్ కూడా ఈ సమయంలో మంచిదికాదు. మీరు డైట్ మొదలుపెట్టిన 2వారాలకి బ్లడ్ çసుగర్ లెవెల్స్ ల్యాబ్‌లో పరిశీలిస్తారు. అదుపులో ఉంటే ప్రసవం అయ్యే వరకూ అదే డైట్‌ను తీసుకోమంటారు. ఒకవేళ 9వ నెలలో ఎక్కువ అయితే తక్కువ మోతాదు సుగర్ మందులను వాడమని చెబుతారు. క్రమం తప్పకుండా ముఖ్యంగా ఆఖరి రెండు నెలలు గైనకాలజిస్ట్ సలహాలు పాటించాలి. ప్రసవం తరువాత కూడా 95శాతం డయాబెటిస్ తగ్గిపోతుంది. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. ఈ లెవెల్ 100 ఎంజీ/డీఎల్ ఉంటే, ఒకసారి డయాబెటిస్ నిపుణులను కలవాలి. భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ రాకుండా ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధంచాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందుబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. -
రజనీకాంత్... స్టెంట్ కథ
అయోర్టిక్ అన్యురిజమ్ గురించి తెలుసుకునే ముందర అసలు అన్యురిజమ్స్ అంటే ఏమిటో చూద్దాం. బెలూన్ ఊదినప్పుడు అంతటా అది సాఫీగా సాగుతుంది. కానీ ఎక్కడైనా బెలూన్ గోడలు పలుచగా ఉన్నచోట అక్కడ అది ఉబ్బినట్లు అవుతుంది. అదే తరహాలో రక్తనాళాలు కూడా పలుచబారినచోట బలహీనంగా ఉండి ఉబ్బినట్లుగా అయిపోతాయి. ఇలా రక్తనాళాలు పరచబారి ఉబ్బినట్లుగా అయి΄ోవడాన్ని అన్యురిజమ్స్ అంటారు. ఉబ్బిన చోటను బట్టి పేరు... మెదడు, కడుపు మొదలుకొని, కాళ్లవరకూ రక్తనాళాలు ఎక్కడైనా బెలూన్లా ఉబ్బవచ్చు. ఉబ్బిన చోటును బట్టి డాక్టర్లు వాటికి పేరు పెడతారు. ఉదాహరణకు మెదడులో ఉబ్బితే సెరిబ్రల్ అన్యురిజమ్స్ లేదా మామూలుగా అన్యురిజమ్స్ అని వ్యవహరిస్తారు. కడుపు భాగంలో ఉబ్బడాన్ని ‘అబ్డామినల్ అన్యురిజమ్’ అని, ఛాతీలో జరిగితే ‘థొరాసిక్ అన్యురిజమ్’గా పేర్కొంటారు. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో ‘అయోర్టా’లోని రక్తనాళాలు ఉబ్బడం వల్ల దాన్ని అయోర్టిక్ అన్యురిజమ్గా పేర్కొంటారు. అన్యురిజమ్ ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలిలా...గొంతు బొంగురుపోవడం ∙మింగడంలో ఇబ్బంది గొంతు వాపు ఛాతీపై భాగంలో లేదా ఛాతీ వెనకాల వీపు భాగంలో నొప్పి వికారం, వాంతులు ∙గుండె వేగంగా కొట్టుకోవడం (టాకికార్డియా). నిర్ధారణ... అయోర్టిక్ అన్యురిజమ్ని గుర్తించడానికి అల్ట్రాసౌండ్ మొదటి పరీక్ష. ఇందులో అయోర్టిక్ అన్యురిజమ్ కనిపిస్తే దాన్ని నిర్ధారణ చేయడానికి సీటీ స్కాన్ గాని, ఎమ్మారై గాని, యాంజియోగ్రామ్ గాని చేస్తారు. వాటి సరైన పరిమాణం, ఎంతభాగం ఉబ్బింది అనే విషయాలు సీటీస్కాన్ లేదా ఎమ్మారైలో తెలుస్తాయి. చికిత్సలు : ∙అన్యురిజమ్ కనుగొనగానే దీనికి తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండదు. అయితే అది చిట్లిపోకుండా జాగ్రత్త కోసం రక్త΄ోటును నియంత్రణలో ఉంచేందుకు మందులు వాడతారు. అప్పటి నుంచి డాక్టర్లు అన్యురిజమ్ పెరుగుదలను తరచూ సీటీ స్కాన్ చేస్తూ గమనిస్తూ ఉంటారు. ఏడాదిలో అది 0.5 సెం.మీ. నుంచి 1 సెం.మీ. పెరిగితే, అప్పుడు దానికి రిపేరు చేయాల్సి ఉంటుంది. (సైజు ఎంతన్నది కాకుండా దాని పెరుగుదల రేటును బట్టి ఈ రిపేరు జరగాలి). ∙ఐదు సెంటీమీటర్ల లోపు ఉండే అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ కి మందులతోనే చికిత్స చేస్తారు. 5.5 సెంటీమీటర్ల పరిమాణం దాటినప్పుడు వాటికి ఆపరేషన్ గాని లేదా స్టెంట్ గాని ఉపయోగించి చికిత్స చేస్తారు. అయోర్టిక్ అన్యురిజమ్ పరిమాణం ఆరు నెలల్లో 0.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు లేదా అయోర్టిక్ అన్యురిజమ్ వల్ల లక్షణాలు కనబడుతున్నప్పుడు లేదా అన్యురిజమ్ పగిలిపోయే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. స్టెంటింగ్ విధానం: ఈ ప్రక్రియలో కాలు ద్వారా ఒక లోహపు స్టెంట్ ని అయోర్టిక్ అన్యురిజమ్ లోకి ప్రవేశపెట్టడం ద్వారా అన్యురిజమ్ చికిత్స చేస్తారు. సుమారుగా రెండు గంటలు పట్టే ఈ ప్రక్రియని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు నిర్వర్తిస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తయిన రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. తర్వాత రక్తం పల్చగా అయ్యే మందులు కొంత కాలం ΄ాటు వాడాలి. ప్రక్రియ సజావుగా సాగితే కాంప్లికేషన్ ఉండే అవకాశం బాగా తక్కువ. ప్రస్తుతం రజనీకాంత్‌కు చేసిన చికిత్స ఇదే. శస్త్రచికిత్స ఎప్పుడంటే... ∙బాధితులు భారీ బరువులెత్తడం, ఫర్నిచర్ కదపడం, ఛాతీపై బరువు పడే పని చేయడం వంటి అంశాలు అన్యురిజమ్పై ప్రభావం చూపవచ్చు. ఈ సమయాల్లోగానీ లేదా ఇతరత్రాగానీ అన్యురిజమ్ హఠాత్తుగా చిట్లితే కార్డియోథొరాసిక్ సర్జన్లు అప్పటికప్పుడు శస్త్రచికిత్స నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సను కొంతకాలం వాయిదా వేసేందుకు కూడా స్టెంటింగ్, ఆర్టిఫిషియల్ గ్రాఫ్టింగ్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను డాక్టర్లు ఎంచుకుంటారు. అంటే బాధితుల పరిస్థితిని బట్టి ఏ ప్రక్రియను అనుసరించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ∙కారణాలు... హైపర్‌టెన్షన్ (హైబీపీ) ∙రక్తనాళాల గోడలు మందంగా మారడం (అథెరోస్కి›్లరోసిస్); అలాగే రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడంవల్ల రక్తనాళం గోడపై ఒత్తిడి పడి ఉబ్బు వచ్చే అవకాశం / ముప్పు ఎక్కువ ∙వృద్ధాప్యం (వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల గోడల్లో మార్పులు వస్తూ అవి బిరుసుగా, మందంగా మారుతుంటాయి) ∙కొన్ని కనెక్టివ్ టిష్యూ జబ్బులు పోగతాగే అలవాటు (దీనివల్ల అయోర్టా గోడకు గాయమై చిట్లే ప్రమాదం ఎక్కువ) జన్యుపరమైన కారణాలతో పుట్టుకతోనే వచ్చే మార్ఫన్ లేదా ఎహ్లర్–డాన్లోస్ సిండ్రోమ్ వంటి వ్యాధుల కారణంగా.లక్షణాలు... నిజానికి తొలిదశల్లో అన్యురిజమ్స్తో ఎలాంటి లక్షణాలూ... అంటే నొప్పి, ఇతరత్రా ఇబ్బందులు కనిపించకపోవచ్చు. పలచబడిన చోట మరింత బలహీనపడుతూ, ఉబ్బిన భాగంలో ఉబ్బు మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా ఇతర ఆరోగ్యసమస్యల గురించి వెదుకుతున్నప్పుడు ఇవి అనుకోకుండా బయటపడవచ్చు. అన్యురిజమ్స్ బాగా పెరిగి, పక్కనున్న అవయవాలపై ఒత్తిడి కలిగించవచ్చు లేదా బాగా పలుచబడిపోయిన రక్తనాళం అకస్మాత్తుగా చిట్లవచ్చు. దీన్ని అయోర్టిక్ డిసెక్షన్ అంటారు. ఈ అన్యురిజమ్ పగిలి తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాపాయ పరిస్థితీ ఏర్పడవచ్చు. -
అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!
నా వయస్సు 33 సం‘‘లు. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఏడాది నుంచి పూర్తిగా మానేశాను. మాంసాహారం అంటే జంతువధ అని, వాటిని చంపడం, రక్తపాతం లాంటి దృశ్యాలు నా మనసులోకి పదే పదే రావడం వాటిని తప్పించడానికి నేను తరచు చేతులు కడగడం ఇల్లంతా శుభ్రం చేయడం, భర్తను పిల్లలను అనవసరంగా కోపగించుకోవడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. దయచేసి మీరేదైనా మార్గం చెప్పండి! – ఎ. పార్వతి,హైదరాబాద్జంతువధ గురించి ఆలోచించి, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదే. అయితే మీ ఇంట్లో మాంసాహారం వండినప్పుడు, జంతువధ, రక్తపాతం లాంటి దృశ్యాలు మీ మదిలో మెదిలి, వీటి నుండి బయట పడేందుకు, చేతులు అతిగా కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇదంతా పాపంగా భావిస్తూ, ప్రార్థనలు చేస్తూ, మనోవేదనకు గురి కావడం... ఇవన్నీ ‘ఓసీడీ’ అనే ఒక మానసిక వ్యాధి లక్షణాలు. మెదడులోని కొన్ని రసాయనిక పదార్థాల సమతుల్యం లో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి మానసిక రుగ్మత వస్తుంది. ఇదేదో మీ బలహీనత గానీ, తప్పు గానీ కానే కాదు. అలా అని మీరు బాధపడవద్దు.శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయని గుర్తించండి. ఈ ఒ.సి.డి జబ్బును పూర్తిగా నయం చేసేందుకు మంచి ఔషధాలున్నాయి. వాటితోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్, ‘ఆర్.టి.ఎమ్.ఎస్’అనే ప్రత్యేక అధునాతన పరికరాలతో చికిత్స చేసి, మీ బాధ నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తులను చేయవచ్చు. మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను వెంటనే కలవండి. ఆల్ ది బెస్ట్.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఐదేళ్ల చిన్నారికి కార్డియాక్ అరెస్టు..20 సెకన్ల పాటు..!
యూఎస్‌లోని ఐదేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్టు గురై కుప్పకూలింది. దాదాపు 20 సెకన్లపాటు గుండె ఆగిపోయింది. అయితే ఆ బాలుడి బతుకుతాడో లేదో అన్న తీవ్ర ఉత్కంఠ రేగింది. ఈక్రమంలో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం మూడు వేర్వేరు ఆస్పత్రలు తరలించారు. అయితే ఆ బాలుడి అదృష్టవశాత్తు మృత్యుంజయుడై బయటపటడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఈ ఉత్కంఠభరితమైన ఘటన యూఎస్‌లోని థీమ్ పార్క్ వాల్డ్ డిస్నీ వరల్డ్‌లో చోటు చేసుకుంది. ఐదేళ్ల ఎర్నెస్టో టాగ్లే అనే చిన్నారి రోలర్‌కోస్టర్‌ను రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతని వెనుక కూర్చొన్న ఆమెకు అతడి పల్స్‌లో ఏదో తేడా ఉన్నట్లు గమనించింది. వెంటనే ఛాతీపై తట్టడం వంటి సీఆర్పీ పనులు చేసింది అతడి తల్లి క్రిస్టీనా. ఆ రోలర్ కోస్టర్ రైడ్ ముగిసిన వెంటనే తన కొడుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆమె వెంట ఒక నర్సు, ఈఎంటీ మెషిన్ని వెంటబెట్టుకుని వెళ్లింది. ఆ సమయంలో ఎర్నెస్టో దాదాపు 20 సెకన్ల పాటు శ్వాస పీలచ్చుకోవడం లేదు అంటే.. గుండె ఆగిపోయింది. దీంతో వాళ్లు గుండె మళ్లీ సక్రమంగా కొట్టుకునేలా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్(ఈఎంటీ)ను అందించి హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆ బాలుడిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు కాటెకోలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (సీపీవీటీ)తో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. ఇది అరుదైన గుండె పరిస్థితి. దీని కారణంగా సదరు రోగికి తీవ్రమైన ఉత్సాహం లేదా కార్యకలాపాల సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం లేదా లయ తప్పడం జరుగుతుంటుంది. ప్రాణాంతకమైన ఈ అరిథ్మియాలో వచ్చే ఆకస్మిక కార్డియాక్ అరెస్టుని నివారించేలా ఒక పరికరాన్ని అతడి ఛాతీలో ఉంచారు. అయితే అన్ని నిమిషాలపాటు శ్వాస ఆగిపోయిన టైంలో అతడి గుండె, మెదడు దెబ్బతినకుండా వైద్యులు రక్షించడం విశేషం. ఈ భయానక ఘటన నుంచి తన కొడుకు ఓ యోధుడిలా తిరిగొచ్చడాని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. అంతేగాదు తన కుమారుడిని కాపాడేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "ఆ చిన్నారి శక్తి అజేయం, భయానక పరిస్థితిని నుంచి బయటపడ్డ అద్భుత వ్యక్తి". అని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..? రెండింటికి సంబంధం ఏంటీ..?) -
భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!
కొంతమందికి తలనొప్పి తరచు వేధిస్తు ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. ఎందుకు వస్తుందో తెలియదు సడెన్‌గా వచ్చి ఏ పని చెయ్యనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని నివారించాలంటే కొద్దిపాటి చిట్కాలు ఫాలో అయితే చాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో వారి మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.కంప్యూటర్‌పై పనిచేసేవారు కంటిపై ఒత్తిడి పడకుండా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించవచ్చు. అలాగే ప్రతి గంట తర్వాత కంప్యూటర్ తెరపై నుంచి చూపు తప్పించి కాసేపు రిలాక్స్ అవాలి కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన సంక్లిష్టమైన (ఇంట్రికేట్) డిజైన్లు అల్లే సమయంలో అదేపనిగా పనిచేయకుండా తరచూ బ్రేక్ తీసుకుంటుండటం మంచిది తమకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం సరికాదు కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతలపానియాలకు దూరంగా ఉండాలి ఫలానా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అ΄ోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసకోవడం సరికాదు రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల తలనొప్పులు రాకుండా నివారించవచ్చురోజూ కనీసం ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. కొన్నిసార్లు నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి తమ సౌకర్యం మేరకు నిద్రపోవడం మంచిది. ఒకవేళ ఈ సూచనల తర్వాత కూడా తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. (చదవండి: గాంధీ జయంతి 2024: భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!) -
భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!
స్వతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ జీవన విధానం క్రమ శిక్షణతో కూడిన విధంగా ఉంటుంది. ఆయన స్వాతంత్ర్య ఉద్యమం కోసం పాటుపడే క్రమంలో ఆయన అనుసరించిన విధానాలే ఖండాతరాలకు విస్తరించి విలక్షణమైన వ్యక్తిగా వేన్నోళ్ల కీర్తించాయి. మనిషి గాలి, నీరు లేకుండా ఎలా అయితే జీవించలేడో అలాగే ఆహారం కూడా అంతే ముఖ్యమని తన 'కీ టు హెల్త్ పుస్తకంలో' చెప్పాki. ఇవాళ గాంధీ జయంతి(అక్టోబర్ 02) సందర్భంగా ఆయన జీవనశైలి ఎలా ఉండేది? ఎలాంటి ఆహారం ఇష్టపడే వారు తదితరాల గురించి సవివరంగా చూద్దాం..!. గాంధీ గుజరాత్‌కి చెందిన శాకాహార కుటుంబంలో జన్మించాడు. అయితే శాకాహారం పట్ల ఆయన నిబద్ధత గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే..? న్యాయవాది విద్యార్థిగా ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో శాకాహారం దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. అంతేగాదు శాకాహార రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందో కనుక్కుని మరీ అక్కడే భోజనం చేశారు. అలాగే హెన్నీ స్టీఫెన్స్ రాసిన 'సాల్ట్ ఎ ఫ్లీ ఫర్ వెజిటేరియనిజం' పుస్తకం గాంధీని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన ఉపవాసానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. అదే నిరసనలకు ఆయుధంగా దీన్ని ఉపయోగించే వారు. ఆ సమయంలో ఆయన దినచర్యలోని ఉపవాసం ఆయనకు ఎంతగానో ఉకరించేది. ఆయన కఠిన ఆహార నియమాలు అతిథులకు ఇబ్బంది కలిగిస్తోందని కాస్త మార్పులు చేర్పులు కూడా చేశారు. అహింసవాది అయిన గాంధీ శాకాహారానికి ఇవ్వడానిక ప్రాధాన్యత ఇవ్వడానికి మరో కారణం హింసకు వ్యతిరేకి కావడం కూడా అని చెబుతుంటారు కొందరూ. అలాగే సూర్యాస్తయానికి ముందు తన చివరి భోజనాన్ని ఐదింటితో పరిమితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఇష్టపడేవారు. అలాగే పప్పులకు దూరంగా ఉండేవారు. బలహీనమైన రాజ్యంగ ఉన్నవారికి పప్పులు సరిపడవని విశ్వసిస్తూ వాటిని దూరంగా ఉంచేవారట. తన భార్య కస్తూర్బా నుంచి వ్యతిరేకత ఎదురైనా కూడా తన నియమాన్ని ఆయన కచ్చితంగా అనుసరించేవారట గాంధీ. మానవులు మాంసాహారులుగా పుట్టలేదని, ప్రకృతి ప్రసాదంగానే జీవించాలని ఆయన వాదించేవారట. మొదట్లో పాలను కూడా తాగేవారు కాదట. పాలు అంటే అంతగా ఇష్టం లేని గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో అనారోగ్యం బారిన పడటంతో వైద్యుని సలహా మేరకు మేకపాలు తీసుకోవడం ప్రారంభించారట.ఆయన తన భోజనంలో బ్రౌన్రౌస్, వివిధ పప్పులు, స్థానిక కూరగాయాలు, మేకపాలు, బెల్లం తదితరాలను తీసుకునేవారు. తినడం అనేది శరీరాన్ని పోషించడం మాత్రమే కాదు, ఆత్మను పోషించడం అని చెప్పేవారట గాంధీ. సాత్వికమైన భోజనం తీసుకుని సక్రమమైన ఆలోచనలతో న్యాయం వైపు అడుగులు వేయమని కోరేవారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏదీఏమైన గొప్ప వ్యక్తులు ఆలోచనలే కాదు వారి వ్యక్తిగత జీవన విధానం కూడా అందర్నీ ప్రభావితం చేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదూ..!(చదవండి: 'ఖాదీ'.. గాంధీ చూపిన దారే! అది నేడు ఫ్యాషన్ ఐకానిక్ ఫ్యాబ్రిక్‌గా..!) -
ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..?
తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తూ, టార్గెట్లు ఛేదించడానికి శ్రమపడుతూ ఉండే వారిలో... ఒత్తిడి తీవ్రత పెరిగినప్పుడు ఆస్తమా రావడం కొందరిలో కనిపిస్తుంది. అందుకే ఈ అంశం అటు పరిశోధనల్లో, ఇటు వైద్యవర్గాల్లో చాలావరకు ఓ చర్చనీయాంశం (డిబేటబుల్ సబ్జెక్ట్)గా ఉంది. ఏతావాతా చెప్పదగిన అంశమేమిటంటే... ఆస్తమా లేనివారిలో అధిక ఒత్తిడి కొత్తగా ఆస్తమాను కలిగించదుగానీ... అప్పటికే ఆస్తమా సమస్య ఉన్నవారిలో ఒత్తిడి అనేది ఓ ట్రిగరింగ్ ఫ్యాక్టర్‌గా పనిచేసి ఆస్తమాను ప్రేరేపించగలదు.మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే... తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేవారిలో ఆస్తమా ఎటాక్స్ చాలా తరచుగా కనిపిస్తుంటాయి. పరిశోధకులు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని చాలా సందర్భాల్లో నమోదు చేశారు. ఇదే విషయాన్ని చాలామంది ఇతర అధ్యయనవేత్తలూ రూఢి చేశారు. ఉదాహరణకు పిల్లల్లోనైతే స్కూలు పరీక్షలు, ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి రావడం, పెద్దల్లో కుటుంబాల్లో విభేదాలు, విపత్తుల్లో చిక్కుకు΄ోవడం, హింసకు లోనుకావడం వంటి సంఘటనల్లో ఒత్తిడి పెరిగితే అది ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. మొదట ఒత్తిడి అనేది యాంగ్జైటీని పెంచి అటాక్ వచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది. అంటే ఆస్తమా అటాక్‌ను ప్రేరేపించే హిస్టమైన్, ల్యూకోట్రైన్ వంటి రసాయనాలను విడుదలయ్యేలయ్యేలా చేస్తుంది. ఆ ప్రభావంతో వాయునాళాలు సన్నబారిపోతాయి. ఇక మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే... ఒత్తిడీ, యాంగ్జైటీ వంటి సమస్యలతో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు వారి పరిస్థితిని నియంత్రించడం మరింత కష్టమవుతుంది.ఒత్తిడినీ, దాంతో వచ్చే ఆస్తమానూ అరికట్టడం ఎలా...? మొదట తమకు ఒత్తిడి కలిగిస్తున్న అంశాలేవో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక సమస్యలా, కుటుంబ సభ్యులతో విభేదాలా, ఎవరూ సహాయసహకారాలు అందించకపోవడం, ఎప్పుడూ పనిలోనే ఉండాల్సి రావడం లేదా నిత్యం డెడ్‌లైన్స్‌తో సతమతమవుతుండటమా అనేది తొలుత గుర్తించాలి. సమస్యను గుర్తించాక... దాన్ని ఎదుర్కోవడమనేది తమ వల్ల అవుతుందా, ఎవరి సహాయమూ లేకుండానే సమస్యకు పరిష్కారం సాధ్యపడుతుందా లేదా ఎవరైనా వృత్తినిపుణుల సహాయం అవసరమా తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అన్ని పనులూ ఒకరే పూర్తి చేయలేరని గుర్తించాలి. తొలుత పనుల జాబితా రూపొందించి, ఎవరు చేయదగ్గపనుల్ని వారికి అప్పగించాలి. ఉదాహరణకు డెడ్‌లైన్‌లోపు ఒకరే ఆ పని చేయలేరనుకుంటే... దాన్ని విడదీసి తలా కాసింత బాధ్యత అప్పగించాలి. దీన్నే వర్క్‌ప్లేస్ స్ట్రాటజీ అంటారు. ఆఫీసు పనిచేసే సమయాల్లో ఈ వర్క్‌ప్లేస్ స్ట్రాటజీ అనుసరించాలి. అంతేకాదు... పని ఒత్తిడి అన్నది ఆఫీసులో ఒక్కరికే పరిమితమైనది కాదు... అది అక్కడ పనిచేసే అందరికీ వర్తించేదన్న విషయాన్ని గుర్తెరగాలి. దాంతో సగం ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజూ అలసట కలిగించని వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మంచి స్ట్రెస్ బస్టర్. ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ విధానాల వంటివి అనుసరించాలి. యోగా, ధ్యానం వంటివీ ప్రాక్టీస్ చేయడం స్ట్రెస్‌ను చాలావరకు తగ్గిస్తుంది. అటాక్ వచ్చినప్పుడు వాడే మందులు, అటాక్ రాకుండా నివారించే మందులు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి . రోజూ కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడితో కూడిన అటాక్ వచ్చినప్పుడు 5 – 10 నిమిషాల్లో మీరు నార్మల్ స్థితికి రాకపోతే తక్షణం తప్పనిసరిగా వైద్యుల సహాయం తీసుకోవాలి. చికిత్స : విండ్పైపులు (వాయునాళాలు) వాపునకు (ఇన్ఫ్లమేషన్కు) గురైనప్పుడు... ఆ వాపు వల్ల గాలి ప్రవహించే లోపలి దారి సన్నబారి΄ోవడంతో శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. దాంతో ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలతో ఆస్తమా కనిపిస్తుంది. ఈ లక్షణాలు తగ్గాలంటే మొదట తక్షణమే వాయునాళాలను విప్పార్చే / విస్తరింపజేసే మందులను లేదా ఇన్హేలర్స్ను వాడాలి. అదే రాకముందు లేదా వచ్చి తగ్గాక డాక్టర్ సలహా మేరకు ... ఆస్తమా రాకుండా నివారించే ప్రివెంటివ్ మందులు / ఇన్హేలర్స్ వాడాలి. ఆస్తమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించేందుకు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీ హిస్టమైన ఇంజెక్షన్స్ కూడా వాడవచ్చు.అపోహ – వాస్తవం : ఇన్హేలర్ అలవాటు అవుతుందనీ, అది మంచిది కాదనే అ΄ోహ కొంతమందికి ఉంటుంది. నిజానికి టాబ్లెట్లతో పోలిస్తే ఇన్‌హేలర్స్‌తో దేహంలోకి ప్రవేశించే మందు మోతాదు చాలా తక్కువ. దాంతో సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. అందుకే ఇన్హేలర్స్ సురక్షితమని గుర్తించాలి. ప్రివెంటివ్ మందు ఉండే ఇన్హేలర్స్ వాడుతుంటే అటాక్ రాకుండా అవి ఆస్తమాను అదుపులో ఉంచుతాయి.డాక్టర్ రవీంద్ర రెడ్డి, పల్మనాలజిస్ట్(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
ప్రపంచంలోనే తొలి 'బయోనిక్ ఐ': అంధుల పాలిట వరం ఈ ఆవిష్కరణ!
సాంకేతికతో కూడిన వైద్య విధానం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. బాధితులకు కొత్త ఆశను అందించేలా ఆధునిక వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే తాజాగా పరిశోధకులు 'బయోనిక్ ఐ'ని అభివృద్ధి చేశారు. జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్ అని పిలిచే ఈ ఆవిష్కరణ అంధత్వంతో బాధపడుతున్న లక్షలాదిమందికి కొత్త ఆశను అందిస్తోంది. అసలేంటీ ఆవిష్కరణ? ఎలా అంధులకు ఉపయోగపడుతుంది..?సాంకేతిక పుణ్యమా అని.. వైద్య విధానంలోని ప్రతి సమస్యకు పరిష్కారం క్షణాల్లో దొరుకుతుంది. ఆ దిశగానే చేసిన అధ్యయనంలో అంధత్వ చికిత్సకు సంబంధించిన కొంగొత్త ఆవిష్కరణకు నాంది పలికారు ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వారంతా ప్రపంచంలోనే తొలి బయోనిక్ కంటిని అభివృద్ధి చేశారు. దీన్ని 'జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్' అని పిలుస్తారు. అంధత్వంతో బాధపడుతున్న వారికి కంటి చూపుని ప్రసాదించేలా కొత్త ఆశను రేకెత్తిస్తుంది. సాంకేతికతో కూడిన ఈ అత్యాధునిక చికిత్స విధానం అంధత్వ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. ఈ జెన్నారిస్ వ్యవస్థ అనేది వందేళ్లుగా చేస్తున్న పరిశోధనలకు నిలువెత్తు నిదర్శనం. నిజానికి పుట్టుకతో అంధత్వంతో బాధపడుతున్నవారికి కంటి చూపుని ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే..? మనం కళ్లతో నేరుగా చూడలేం. మన కంటిలోని ఆప్టిక్ నరాలు మెదడుతో కనెక్ట్ అయ్యి ఉంటేనే ఇది సాధ్యం. ఇంతవరకు మన వైద్య విధానంలో ఈ దిశగా చికిత్స అభివృద్ధి చెందలేదు. ఎన్నాళ్లుగానో అపరిషృతంగా ఉన్నా ఆ సమస్యకు పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణతో పరిష్కరించారు. ఈ జెన్నారిస్ సిస్టమ్ ఆప్టిక్ నరాలకు బదులుగా నేరుగా మెదడుకి దృష్టి సంకేతాలను పంపుతుంది. ముందున్న చిత్రాన్ని గ్రహించేలా అనుమతిస్తుంది. అయితే దీన్ని జంతువులపై ట్రయల్స్ నిర్వహించి.. సత్ఫలితాలు వస్తే గనుక మానవులపై ట్రయల్స్‌ని విజయవంతంగా నిర్వహించేలా సన్నద్ధమవతామని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం గొర్రెలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత ప్రధాన భాగం మెదడు నమునాకు విద్యుత్ ప్రేరణ అందించేలా వైర్లెస్ ఇంప్లాట్‌ను కలిగి ఉంటుంది. ఇది మెదడు ఉపరితలానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది చిన్న పాటి విద్యుత్ పల్స్‌తో మెదడు కణాలను ఉత్తేజపరిచేలా వైర్‌లెస్‌గా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఇది కస్టమ్ డిజైన్ హెడ్కేర్ ధరించే సూక్ష్మ కెమెరాను పోలి ఉంటుంది. కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన హై రిజల్యుషన్ ఇమేజ్‌లు విజన్ ప్రాసెసర్ యూనిట్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత ఈ సంకేతాలు 11 పరికరాలకు వైర్‌లెస్‌గా ప్రసారమవుతాయి. ఇవి మెదడులో శస్త్రచికిత్స ద్వారా అమర్చిన టైల్స్ అనే పరికరానికి రిసీవ్ అవుతాయి. అవి విజువల్ కార్టెక్స్‌లోని న్యూరాన్లను ఉత్తేజపరిచి దృశ్యం కనిపించేలా చేస్తుంది. ఇది దాదాపు 100 డిగ్రీల వీక్షణ క్షేత్రాన్ని అందిస్తుంది. అంటే ఇది మానవ కన్ను పరిధితో పోలిస్తే కొంచెం తక్కువే అయిన్పటికీ.. గణనీయమైన సెన్సార్ సాంకేతికత గలిగిన ఈ పరికరం మంచి విజన్‌ని అందించడం విశేషం . (చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!
టాలీవుడ్ నటి, గాయని శృతి హాసన్ విలక్షణ నటుడు కమల హాసన్ కూమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఒకానొక సందర్భంలో శృతి తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలంటే మొదటగా ఏం చేయాలో తెలుసా అంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అవేంటంటే..అందరూ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకే జంకుతారు. ఇది ముందు పక్కన పెట్టాయాలంటోంది శృతి. ఈ పరిస్థితిని అందరూ ఏదోఒక సందర్భంలో ఎదుర్కొనే సాధారణ పరిస్థితిగా పరిగణించాలి. అప్పుడే దీనిగురించి బహిరంగంగా మాట్లాడి స్వాంతన పొందే ప్రయత్నం చేయగలుగుతాం, బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతామని చెబుతోంది. నిజానికి మానసికంగా బాధపడుతున్నాను అంటూ.. వెంటనే థెరపిస్టు లేదా కౌన్సలర్ లేదా సైక్రియాట్రిస్ట్ వద్దకు వెళ్లిపోతారు. కానీ అవేమి అవసరం లేదంటోంది శృతి. మన చుట్టు ఉన్నవాళ్లతో లేదా మనకిష్టమైన వ్యక్తులను ఆత్మీయంగా పలకరించడం, వారితో కాసేపు గడపడం వంటివి చేస్తే చాలు మానసిక స్థితి కుదుటపడుతుందని నమ్మకంగా చెబుతోంది. అందుకు ఉదాహారణగా.. మనం ఏదైన జ్వరం రాగానే ఏం చేస్తాం చెప్పండి అంటోంది. మొదటగా.. ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుని చూస్తారు. తగ్గలేదు అనగానే వైద్యుడిని సంప్రదించే యత్నం చేస్తారు. అలానే దీని విషయంలో కూడా మనంతట మనంగా ఈ మానసిక సమస్యను నయం చేసుకునే యత్నం చేయాలి. అవన్నీ ఫలించని పక్షంలో థెరఫిస్టులను ఆశ్రయించడం మంచిదని చెబుతోంది. అలాగే కొందరూ మెంటల్ స్ట్రెస్ తగ్గేందుకు సినిమాలకు వెళ్లతారు. ఓ మంచి ఫీల్‌తో హ్యాపీగా ఉండేలా చేసుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతే అయినా ఒక్కోసారి ఇది కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదని అంటోంది శృతి. చేయాల్సినవి..మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపించగానే దాన్ని పెనుభూతంలా, పెద్ద సమస్యలా చూడొద్దుఆ వ్యాధి మిమ్మల్ని తక్కువగా చేసి చూపించేది కాదు.నలుగురితో కలుపుగోలుగా మెలిగే ప్రయత్నం లేదా మాట్లాడటం వంటివి చేయండి. అలాగే మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వ్యక్తులతో సమస్యను వివరించి బయటపడేలా మద్దతు తీసుకోండి. దీంతోపాటు మానసిక ఆరోగ్య నిపుణలను సంప్రదించి..ఏం చేస్తే బెటర్ అనేది కూలంకషంగా తెలుసుకుని బయటపడే ప్రయంత్నం చేయండి.నిజానికి మానసికి ఆరోగ్య మొత్తం ఆరోగ్య శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటేనే ఏ పనైనా సునాయాసంగా చేయగలం. అందరిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోగలుగుతాం అని చెబుతోంది శృతి.(చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!) -
దడదడలాడించే వ్యాధి..! సరైన చికిత్స సైతం..
రోడ్డును తొలిచే దగ్గరో లేదా కొత్తగా ఇల్లు కట్టే చోట రాతిని బద్దలు చేయడానికి వాడే మెకానికల్ గడ్డపలుగు / గునపం లాంటివి వాడినప్పుడు అది దడదడలాడుతూ చేతులను వణికిస్తుంటుంది. ఆన్ చేసిన ట్రాక్టర్ స్టీరింగుపై చేతులు ఆన్చినా అదీ చేతుల్ని దడదడలాడిపోయేలా చేస్తుంది. ఇలాంటి పరికరాలు చాలాకాలం వాడుతూ ఉండే వృత్తుల్లో ఉన్నవాళ్లలో కొందరికి వచ్చే జబ్బు పేరే ‘వైబ్రేషన్ ఇండ్యూస్డ్ వైట్ ఫింగర్ డిసీజ్’. కేవలం అలాంటి గడ్డపలుగు మాత్రమే కాదు... పవర్ డ్రిల్స్, జాక్ హ్యామర్స్, పెద్ద పెద్ద చెట్లను నరికేసే చైన్ సాల వంటి వాటిని వాడేవారిలోనూ ఇది రావడం సహజం. ఈ జబ్బుకు ‘హ్యాండ్ ఆర్మ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (హావ్స్) అనీ, డెడ్ ఫింగర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ‘రేనాడ్స్ డిసీజ్’ అనే రక్తనాళాలలనూ, నరాలను దెబ్బతీసే ఒక కండిషన్ తాలూకు తర్వాతి రూపం (సెకండరీ ఫార్మ్) అని కూడా భావిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల్లో ‘వైట్ ఫింగర్ డిసీజ్’కు తోడ్పడే జన్యువును సైతం ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ‘వైబ్రేషన్ ఇండ్యూస్డ్ వైట్ ఫింగర్ డిసీజ్’ ప్రధానంగా వేళ్లలోని రక్తనాళాలు, నరాలు, కండరాలూ, కీళ్లతో పాటు చేతులు, మణికట్టు వంటి వాటిపై తన దుష్ప్రభావం చూపుతుంది. మొదట్లో వేళ్ల చివర్లు తిమ్మిరిగా అనిపిస్తాయి. అటు తర్వాత అవి తెల్లగా పాలియినట్లుగా అవుతాయి. జబ్బు తీవ్రత బాగా పెరిగినప్పుడు వేళ్లు వేళ్లన్నీ తెల్లగా మారిపోతాయి. అందుకే ఈ జబ్బుకు ‘వైట్ ఫింగ్ డిసీజ్’ అని పేరు. అయితే... అలా తెల్లగా మారిన కొద్దిసేపటి తర్వాత రక్తం వేళ్ల చివరికి వేగంగా ప్రవహించడం వల్ల అవి ఎర్రగా కూడా మారవచ్చు. ఒకసారి వచ్చిందంటే... ఆ తర్వాత అత్యంత త్వరలోనే తాము చేసే పనిని మానేయాల్సిన (రిటైర్ అవ్వాల్సిన) పరిస్థితి ఉంటుంది. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడుతున్నప్పటికీ... దీనికి సరైన చికిత్స అంటూ నిర్దిష్టంగా ఏదీ లేదు. అందుకే తీవ్రంగా / విపరీతంగా కంపిస్తూ పనిచేసే ఉకపరణాలతో పనిచేసేవారు తమ పని గంటలను తగ్గించుకుంటూ రావడమే ఓ మంచి నివారణ చర్య. (చదవండి: యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..? వేటిలో ఉంటాయంటే..!) -
యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే..?
వయసు పెరగడమన్నది అందరిలోనూ చాలా సహజంగా జరిగిపోతుంటుంది. చాలాకాలం పాటు యూత్‌ఫుల్‌గా కనిపించడం అందరూ కోరుకునేదే. అంతేగానీ... వయసు పెరగాలని ఎవరూ కోరుకోరు. కొందరు వయసుపరంగా చాలా పెద్దవారైనా... చాలా యూత్‌ఫుల్‌గా కనిపిస్తారు. వయసు చెప్పగానే ఆశ్చర్యపోయేంత యౌవనంతో ఉంటారు. ఇలా వయసు తగ్గి యౌవ్వనంతో కనిపించడంతో పాటు, కేన్సర్‌ను కూడా నివారించే ఆహారాన్ని కాదనుకునేవారెవరు? అలా వయసు తక్కువగా ఉన్నట్లు కనిపించేలా చేయడంతోపాటు కేన్సర్‌ను నివారించే పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి, వాటితో ఉండే ఇతర ప్రయోజనాలేమిటి అనే విషయాలను తెలుసుకుందాం. వయసు పెరగడంతో శారీరకంగా కొన్ని మార్పులు వస్తాయి. ఉదాహరణకు చర్మం కాస్త వదులైపోడం, కళ్ల కింద, నుదుటి మీద గీతల వంటివి. ఇలా వచ్చే మార్పులనే ఏజింగ్‌తో వచ్చే మార్పులంటారు. కొన్ని రకాల ఆహారాలతో ఈ ఏజింగ్ ప్రక్రియ వేగవంతవుతుంది.ఉదాహరణకు ఎక్కువ తీపి ఉండే పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ వంటి జంక్‌ఫుడ్ తీసుకునేవారిలో ఏజింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ ఏజింగ్కూ, అలాగే కొందరిలో కేన్సర్‌కు దారితీసే ఫ్రీ–ర్యాడికల్స్ అనే పదార్థాలు కారణం. ఈ ఫ్రీ–ర్యాడికల్స్‌ను సమర్థంగా అరికట్టేవే యాంటీఆక్సిడెంట్స్. దేహంలో ప్రతినిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగేటప్పుడు కొన్ని కాలుష్య పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీరాడికల్స్ అంటారు. అవి కణాలను దెబ్బతీస్తాయి. ఫ్రీ–రాడికల్స్ అన్నవి దేహంలోని ఏ కణంపై ప్రభావం చూపితే ఆ కణం జీవిత కాలం తగ్గిపోతుంది. ఆ కణం కూడా గణనీయంగా దెబ్బతింటుంది.యాంటీ ఆక్సిడెంట్స్ అంటే...? ఆహారంలోని కొన్ని పోషకాలు... ఫ్రీ రాడికల్స్‌తో చర్య జరిపి, కణాలపై వాటి ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేవే యాంటీ ఆక్సిడెంట్స్. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఫ్రీ–ర్యాడికల్స్లో ఉండే పదార్థాలు కణాల్లోని రసాయనాలతో ఆక్సిడేషన్ చర్య జరపడం ద్వారా కణాన్ని దెబ్బతీస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆ ఫ్రీ–ర్యాడికల్స్‌ను అడ్డుకుని ఆహారంలో ఉండే కొన్ని పోషకాలు ఆక్సిడేషన్ కానివ్వకుండా ఆపుతాయి. అలా ఫ్రీర్యాడికల్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. అంటే ర్యాడికల్స్ ద్వారా జరిగే ఆక్సిడేషన్ను తటస్థీకరణ (న్యూట్రలైజ్) చేస్తాయి. అందువల్ల ఫ్రీ–రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆగిపోతాయి. దాంతో ఫ్రీ–రాడికల్స్ కణాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదు. మామూలు కణం కేన్సర్ కణంగా మారడమూ ఆగిపోతుంది. అలా ఫ్రీ–రాడికల్స్ కారణంగా కణంలో ఆక్సీకరణ జరగకుండా ఆపేస్తాయి కాబట్టే ఆహార పదార్థాల్లోని ఆ పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారు.యాంటీ ఆక్సిడెంట్స్‌తో లాభాలివి.. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి జీవక్రియల ద్వారా కణంలో జరిగే విధ్వంసాన్ని (సెల్ డ్యామేజీని) ఆపేస్తాయి. సెల్ డ్యామేజ్ తగ్గడం వల్ల కణం చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సెల్ డ్యామేజీలు కాలుష్యం వల్ల, పొగతాగడం, అత్యధిక శారీరక శ్రమ, అల్ట్రావయొలెట్ కాంతి వల్ల జరుగుతుంటాయి. ఫలితంగా చర్మం ముడుతలు పడటం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ–ర్యాడికల్ వల్ల జరిగే అనర్థాలను నిరోధించడం వల్ల ఈ దుష్పరిణామాలన్నీ ఆగుతాయి లేదా తగ్గుతాయి. దాంతో చాలా కాలం పాటు వయసు పెరిగినట్లుగానే కనిపించదు. దాంతో చాలాకాలంపాటు యౌవనంగా కనిపిస్తారు. ఫ్రీ–రాడికల్స్ ఒక్కోసారి కణంలోని స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తాయి. అప్పుడా మామూలు కణం కాస్తా... కేన్సర్ కణంగా మారిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ప్రమాదాన్ని నివారిస్తాయి. పోషకాల్లోని రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్... వాటితో ప్రయోజనాలుబీటా–కెరోటిన్ అనే పోషకానికి యాంటీఆక్సిడెంట్ గుణం ఉంటుంది. ఇవి పసుప్పచ్చ, నారింజరంగులో ఉండే అన్ని పండ్లు, కూరగాయల్లో, ఆకుకూరల్లో బీటా కెరొటిన్ ఉంటుంది. ఇవి మన శరీరంలోని కణాల్లోని పైపొర (సెల్ మెంబ్రేన్)ను సురక్షితంగా కాపాడతాయి. దాంతో ఆ పొరను ఛేదించి ఏ హానికరమైన కాలుష్యాలూ కణంలోకి చేరలేవు. అందుకే పైన పేర్కొన్న రంగు పండ్లు తింటే క్యాన్సర్ నుంచి రక్షణతో పాటు కణం చాలాకాలం పాటు ఆరోగ్యంగా, యౌవనంతో ఉంటుంది. లైకోపిన్ అనే ఫైటో కెమికల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఎరుపు రంగు పిగ్మెంట్ ఉండే ఆహారాల్లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. అయితే టొమాటోలో ఇది మరీ ఎక్కువ. పుచ్చకాయలోనూ ఎక్కువే. లైకోపిన్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటమేగాక... పెద్దపేగు కేన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్ కేన్సర్‌ను నివారించడంలో లైకోపిన్ చాలా సమర్థంగా పనిచేస్తుంది. అల్లిసిన్ అనే చాలా శక్తిమంతమైన ఫైటో కెమికల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లిసిన్ రక్తంలోని కొలెస్టరాల్నూ తగ్గిస్తుంది. ఇది వెల్లుల్లి, ఉల్లిలో ఎక్కువగా ఉంటుంది.ఐసోథయనేట్స్, ఐసోఫ్లేవోన్స్ యాంటీ ఆక్సిడెంట్లు సోయా ఉత్పాదనల్లో, క్యాబేజీ, కాలిఫ్లవర్‌లలో పుష్కలంగా ఉంటాయి. అవి అనేక రకాల కేన్సర్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. యాంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ద్రాక్షలో, బెర్రీ పండ్లలో ఎక్కువ. గుండె జబ్బులను యాంథోసయనిన్ నివారిస్తుంది. ఫ్లేవనాయిడ్స్ అన్నవి చాలా చిక్కటి ముదురు రంగులో ఉండే అన్ని రకాల పండ్లలోనూ, కూరగాయల్లోనూ లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్. వాటికి ఫ్రీ–రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేసే గుణం చాలా ఎక్కువ. అందుకే వాటిల్లో సహజసిద్ధమైన క్యాన్సర్ నిరోధక గుణాలు ఎక్కువ. పుల్లగా ఉండే నిమ్మజాతి పండ్లలో లభ్యమయ్యే విటమిన్–సి కూడా చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్–ఈ కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్స్. చివరగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలను తీసుకుంటే ఒక పక్కన మంచి యౌవ్వనాన్ని చాలాకాలం పాటు కాపాడుకోవడమే కాకుండా... ఎన్నో రకాల కేన్సర్లను సమర్థంగా నివారించినట్టూ అవుతుంది. (చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
'కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా?
ఇడ్లీ అనంగానే తేలిగ్గా అరిగిపోయే వంటకం. చాలా సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం కూడా. పేషెంట్లే కాదు, సామాన్య ప్రజల వరకు అందరూ బ్రేక్‌ఫాస్ట్ మొదటగా ఈ రెసిపీకే ప్రాధాన్యత ఇస్తారు. అంతలా ఇడ్లీలు అందరి మనసులో దోచుకున్న గొప్ప ప్రసిద్ధ వంటకంగా పేరుగాంచింది. అయితే వీటిని పలు రకాలుగా చేస్తారు. ఆయా ప్రాంతాల వారీగా చేసే విధానం మారుతుంటుంది. అందులోకి ఆరోగ్య స్ప్రుహతో మరింత ఆరోగ్యవంతంగా ఆస్వాదించే వైరైటీ ఇడ్లీలు కూడా మన ఆహారంలో భాగమైపోతుండటం మరింత విశేషం. అయితే ఇడ్లీలకే కింగ్‌గా పిలిచే వెరైటీ ఇడ్లీ వంటకం గురించి విన్నారా..?.ఇడ్లీలకే రాజుగా పేరుగాంచిన ఈ వంటకం కేరళలోని పాలక్కాడ్‌లోని గ్రామానికి చెందింది. ఈ ఇడ్లీలు మనం తినే ఇడ్లీలకు చాలా విభిన్నంగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఆకృతి పరంగా పెద్దవిగానూ మల్లెపువ్వులా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తయారు చేసే విధానం కూడా అత్యంత విభిన్నంగా ఉంటుంది. పాలక్కాడ్‌లోని రామస్సేరి గ్రామం కింగ్ ఆఫ్ ఇడ్లీలకు పేరుగాంచింది. ఈ ఇడ్లీలనే తినేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి తరలి వస్తుంటారా..!. వీటిని పాన్కేక్ మాదిరిగా తయారు చేస్తారు.తయారు చేయు విధానం..మట్టికుండపై ఒక గుడ్డ కప్పి ఆవిరిపై ఉడకబెడతారు. 200 ఏళ్ల క్రితం తమిళనాడు, కాంచీపురం, తిరుపూర్, తంజావూర్ వంటి ప్రాంతాల నుంచి కొన్ని ముదలియార్ కుటుంబాలు కేరళకు రావడంతో ఈ వంటకం పుట్టుకొచ్చిందని స్థానికులు చెబుతుంటారు. వాళ్లంతా బతుకుదెరువు కోసం రామస్సేరి అనే చిన్న గ్రామానికి వచ్చి స్థిరపడటంతో ఈ వంటకం ఉనికిలోకి వచ్చిందని ఓ కథనం. ఆయా కుటుంబాల్లో మగవాళ్లంత చేనేత కార్మికులు కాగా, మహిళలు రుచికరంగా వంట చేసేవారట. అలా ఈ రామస్సేరి ఇడ్లీలు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇడ్డీని తయారు చేసేందుకు ఉపయోగించే మెష్క్లాత్ ఇడ్డీని సమానంగా ఉడికేలా చేయగా, స్లీమింగ్ కోసం ఉపయోగించే మట్టికుండా ఆ ఇడ్లీలకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. తయారీ..కావాల్సిన పదార్థాలు..కప్పుల బియ్యం (ఇడ్లీ బియ్యం మరియు ముడి బియ్యం)ఉరద్ పప్పు 1 కప్పు నీరు 1 కప్పు మెంతు గింజలు 1 స్పూన్ తగినంత ఉప్పునాలుగు గంటలు పైనే నానబెట్టిటన మినపప్పు, బియ్యం, మెంతులు కలిపి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కనీసం ఓ పది నుంచి 12 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీల్లా మట్టిప్లేటులో పెద్ద మొత్తంలో పరుచుకుని మట్టికుండపై ఉడికిస్తే.. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రామస్సేరి ఇడ్లీలు రెడీ..!.(చదవండి: -
స్క్రీన్ టైం పెరగడం వల్లా గుండెపోటు!
అమెరికా లాంటి దేశాల్లో సగటున 45 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే.. భారతదేశంలో మాత్రం అంతకంటే పదేళ్ల ముందే, అంటే 35 ఏళ్ల వయసులోనే వచ్చేస్తోంది. ఇంతకుముందు రక్తపోటు, మధుమేహం, కొలెస్టరాల్ లాంటివి ప్రధాన ముప్పు కారకాలుగా ఉంటే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం కూడా గుండెపోటుకు కారణం అవుతోంది! దీనికితోడు ఆన్లైన్లో ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద రోజూ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవడం కూడా ఇందుకు దారితీస్తోంది. ఈ సరికొత్త పరిణామాలను నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. సాయి రవిశంకర్ వివరించారు.మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ.. ఇలా ఏవైనా గానీ రోజుకు సగటున 8 నుంచి 10 గంటల వరకు చూస్తున్నారు. వీటన్నింటినీ స్క్రీన్ టైం అనే అంటారు. ఇలా ఎక్కువసేపు తెరకు అతుక్కుపోయి ఉండడం వల్ల గుండెపోటు వస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి.వివిధ ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద నుంచి పీజాలు, బర్గర్లు, ఇతర మాంసాహార వంటకాలు దాదాపు రోజూ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఎంత పెద్ద హోటల్ నుంచి తెప్పించుకున్నా, అక్కడ వాడిన వంటనూనెలు మళ్లీ మళ్లీ వాడడం వల్ల కొలెస్టరాల్ పెరిగిపోయి గుండెపోటుకు కారణమవుతోంది. ప్రపంచంలోనే ఫుడ్ ఆర్డర్లలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.వ్యాయామం అస్సలు ఉండడం లేదు. పని ఉన్నంతసేపు పని చేసుకోవడం, తర్వాత మొబైల్ లేదా టీవీ చూసుకోవడం, పడుకోవడంతోనే సరిపెట్టేస్తున్నారు. సగటున రోజుకు 45 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదారు రోజుల పాటు నడక, ఇతర వ్యాయామాలు చేస్తేనే గుండె ఆరోగ్యం బాగుంటుంది. నిశ్చల జీవనశైలి వల్ల కూడా చిన్నవయసులోనే గుండెపోటు కేసులు వస్తున్నాయి.మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా గుండెపోటుకు దారితీస్తోంది. ఉద్యోగాల పరంగా అయినా, లేదా వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల అయినా మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటోంది. దానికి తోడు రోజుకు కనీసం 7-8 గంటల మంచి నిద్ర ఉండాలి. అది లేకపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తోంది. వీటికి సిగరెట్లు కాల్చడం, వాతావరణ కాలుష్యం లాంటివి మరింత ఎక్కువగా కారణాలు అవుతున్నాయి.-డాక్టర్ ఎ. సాయి రవిశంకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి (చదవండి: టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!) -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్‌కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్‌కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్‌ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్‌ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!
గుండెకు బలం పెంచేందుకూ... టేస్టీ టేస్టీగానే తింటూ, గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పదార్థాలను తీసుకోవచ్చు. అవేంటో సవివరంగా తెలుసుకుందాం..!.టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. ∙బచ్చలి, ΄ాలకూర లాంటి ఆకుకూరలన్నీ గుండెకు మంచి బలాన్నిస్తాయి. విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల వంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్లీ పైనుంచి చక్కెర కలుపుకోకూడదు. దానిమ్మ గుండెకెంతో మేలు చేస్తుంది. యాపిల్ పండ్లు కూడా గుండెకు మంచివే. బాదంపప్పు, అక్రోటు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినవచ్చు. వాటిలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల వంటి బెర్రీజాతి పండ్లు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. చేపల్లో గుండెకు మేలు చేసే ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ çసమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అన్ని చేపలూ గుండె మేలు చేస్తాయి. అయితే సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు... అందునా సాల్మన్ఫిష్ తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది పరిమితంగా తినే డార్క్ చాక్లెట్లతో గుండెకు మేలు జరుగుతుంది. వాటితో హైబీపీ, రక్తం గట్టకట్టుకు΄ోయే రిస్క్‌లు తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీలతో గుండెకు మేలు చేకూరదు. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం గుండెకు మేలు చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. -
టెక్ మిలియనీర్ హెల్తీ స్కిన్ చిట్కాలు..!
అమెరికన్ ఎంటర్ప్రెన్యూర్ బ్రయాన్ జాన్సన్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. నిత్య యవ్వనంగా ఉండేందుకు కోట్లు ఖర్చుపెడుతున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 46ఏళ్ల ఈ టెక్ మిలియనీర్ తన జీవ సంబంధ వయసును తిప్పికొట్టి 18 ఏళ్ల కుర్రాడిలా యవ్వనంగా కనిపించాలని సప్లిమెంట్లతో కూడిన కఠిన ఆహార నియమావళిని అనుసరించేవాడు. దీన్ని తన బ్లూప్రింట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎప్పటికీ యవ్వనంగా ఉండేలా ప్రయోగానికి పూనకున్నాడు. అందుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లతో షేర్ చేసుకునేవారు. తాజగా ఆయన తన వయసు రీత్యా చర్మంలో వచ్చే మార్పులను అందుకు తీసుకోవాల్సిన చిట్కాలను గురించి వివరించాడు. అందుకోసం తాను ఏం చేస్తున్నాడో కూడా వివరించాడు. అవేంటంటే..బ్రయాన్ జాన్సన్ 46 ఏళ్ల వయసులో చర్మ సంరక్షణ గురించి అంతగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. అందువల్ల వృధాప్య లక్షణాలు వచ్చి తన చర్మం ఎలా ముడతలు పడినట్లయ్యిందో తెలిపారు. అంతేగాదు తన జీవ సంబంధమైన వయసుని తిప్పికొట్టి చర్మం కాంతిగా కనిపించేందుకు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టడం అత్యంత అవసరమని అన్నారు. వడదెబ్బ, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన బాడీ క్రీమ్‌లు వాడకపోవడం తదితర కారణాల వల్ల చర్మం తొందరగా ఆకర్షణీయతో కోల్పోతుందన్నారు. ఫలితంగా వయసు పెద్దగా కనిపించేలా చేస్తుందని అన్నారు. ప్రస్తుతం తన చర్మం మెరుగుపడి 37 ఏళ్ల వయసు వారిలా కనిపిస్తుందని కూడా చెప్పారు. అలాగే ఆరోగ్యకరమైన చర్మం కోసం కొన్ని చిట్కాలు కూడా షేర్ చేశారు. వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తదితరాలే చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయని అన్నారు. అలాగే సన్‌స్క్రీన్ లోషన్లు వంటి ఉపయోగించి చర్మ దెబ్బతినకుండా కాపాడుకోవాలని చెప్పారు. అందుకోసం తాను అనుసరిస్తున్న కఠిన ఆహార నియమావళి గురించి తెలిపారు. అలాగే ఉదయం, రాత్రి వేళలు తప్పనిసరిగా ముఖం కడగడం, మినరల్ సన్‌స్క్రీన్‌ను పూయడం, మాయిశ్చరైజర్లను వాడటం వంటివి చేస్తానని అన్నారు. చర్మం ఆరోగ్యం కోసం నియాసినామైడ్, విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్, ప్రిస్క్రిప్షన్ ట్రెటినోయిన్ వంటి నిర్దిష్ట క్రీముల వినియోగాన్ని కూడా వివరించారు. ప్రతి ఒక్కటి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నష్టాన్ని నివారిస్తాయని చెప్పారు. అలాగే చర్మసంరక్షణ ఉత్పత్తులో తరుచుగా కనిపించే ఎండోక్రైన్ డిస్రప్టర్లు మంచివి కావని, ఇది వన్యప్రాణులు, మానవుల ఆరోగ్యానికి హానికరమైనవని చెప్పుకొచ్చారు. తన చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా టిక్సెల్, సోఫ్వేవ్, యు స్కల్ప్ట్రా వంటి చికిత్సలను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మ దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. దీంతోపాటు రెడ్‌లైట్ థెరపీ, మచ్చలు లేని చర్మం కోసం అక్యుటేన్ మైక్రోడోసింగ్ వంటి వాడకం గురించి కూడా చెప్పారు జాన్సన్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.My daily protocol:Face wash morning & night.+ Sunscreen (mineral)+ Moisturize (Body and Face)+ Creams - can start with the basics such as niacinamide (morning and night), vitamin C (morning), hyaluronic acid (as desired), and tretinoin (at night, an Rx). pic.twitter.com/Qpl6hd7yc2— Bryan Johnson /dd (@bryan_johnson) September 26, 2024 (చదవండి: పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?)