kesineni nani
-
మద్యం కేసులో కేశినేని చిన్ని దంపతులను విచారించాలి
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య జానకీలక్ష్మిపై సత్వరం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సీఎం చంద్రబాబును కోరారు. ఈ కేసులో సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వ్యాపార సంస్థల్లో కేశినేని చిన్ని దంపతులు భాగస్వాములని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం రాసిన లేఖను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులని ఆయన తెలిపారు. ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ కావడంతోపాటు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@ wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హమని చెప్పారు. కేశినేని చిన్ని హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారన్నారు. దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని గ్లోబల్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టు కేశినేని నాని తెలిపారు. ఈ కంపెనీలు భారీఎత్తున నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయన్నారు. రాజ్ కేసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీలక్ష్మి భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీగా అక్రమ నిధులు విదేశాలకు తరలించారని తెలిపారు. తక్షణం కేశినేని చిన్ని దంపతులపై విచారణ చేపట్టి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందనే విషయాన్ని నిరూపించుకోవాలన్నారు. కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీల పేర్లను కేశినేని నాని ఆ లేఖలో పేర్కొన్నారు. -
ఉర్సా కంపెనీ పెట్టింది దోచుకోవడానికే : కేశినేని నాని
-
బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
సాక్షి,విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.కేశినేని నానిపై కేసు నమోదు చేయండి అంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కేశినేని నాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తనని అరెస్ట్ చేయండి అంటూ వచ్చిన కథనంపై స్పందించారు. ‘బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు. బాబు "చార్లెస్ శోభ రాజ్ "నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ ,మోసాలు బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు . pic.twitter.com/ER4CR2jpBF— Kesineni Nani (@kesineni_nani) April 27, 2025 నా పోరాటం ఆగదుఅంతకుముందు.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని.. కేశినేని నానిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ మేరకు చిన్ని.. కేశినేని నానికి లీగల్ నోటీసు పంపించారు. ఆ లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
కేశినేని నానిపై పరువు నష్టం దావా.. టీడీపీ ఎంపీ చిన్నికి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిరూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. చిన్ని పంపించిన లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.‘‘విజయవాడ ప్రజలు నాకు పది ఏళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. నేను ప్రజలతో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయతీతో ఉంటాను. సీఎంకు రాసిన లేఖలోని ప్రతీ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు. విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి.. నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను’’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుంది. భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, అక్రమాలపై ఆరోపణలు, ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశిస్తాం. కానీ బెదిరింపులు కాదు. నేను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశాను. నేని దేనికోసం నిలబడ్డానో నాకు తెలుసు. నేను భయంతో కాదు.. వాస్తవాలతో స్పందిస్తాను.. రాజీ పడను. సత్యం బెదిరింపులకు భయపడదు.. నేను కూడా భయపడను’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
వరుస ట్వీట్లతో TDP MPకేశినేని చిన్నిని టెన్షన్ పెడుతున్న కేశినేని నాని
-
ఉర్సా వెనుక డీల్ ను బయటపెట్టిన మాజీ ఎంపీ కేశినేని నాని
-
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా తలిపారు."ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.Respected @ncbn garu,I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025 -
పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
బెజవాడ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటారు. అటువంటి కంచుకోటలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందనే ధీమా కనిపిస్తోంది. టీడీపీ అడ్డాలో ఫ్యాన్ గిర్రున తిరిగి పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బెజవాడలో జరిగిన రాజకీయాలు.. పోలింగ్ జరిగిన తీరు చూశాక కచ్చితంగా సైకిల్ పార్టీ ఓటమి ఖాయం అంటున్నారు విశ్లేషకులు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఓ లుక్కేద్దాం.తెలుగుదేశం అడ్డాలో పాగా వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు, పన్నిన వ్యూహాలు ఫలించాయంటున్నారు. విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని ఈ సారి వైఎస్సార్ సిపి గెలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక విజయవాడ ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. 2004, 2009 ఎన్నికలలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హవాతో విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ మళ్ళీ టీడీపీ గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని గెలుచుకోలేకపోయింది.తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటును టిడిపి గెలుచుకుంది. 1984, 1991 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాధ్రీశ్వరావు విజయవాడ ఎంపీగా గెలుపొందారు. మరలా 2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ విజయవాడ ఎంపీ సీటును దక్కించుకుంది. ఈ రెండుసార్లు కేశినేని నాని టీడీపీ ఎంపీగా గెలిచారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేసి పరాజయం చెందారు. అదేవిధంగా 2019లో రాష్ట్రం అంతటా ఫ్యాన్ గాలి బలంగా వీచినా..విజయవాడ ఎంపీ సీటు మాత్రం వైఎస్ఆర్సీపీకి దక్కలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సిపికి విజయవాడ పార్లమెంట్ పరిధిలో 44.36 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నానికి...వైఎస్సార్ సిపి అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌కు మధ్య ఒక శాతంలోపే ఓట్ల తేడా ఉండటం విశేషం. టిడిపి అభ్యర్ధి వైఎస్సార్ సిపిపై కేవలం 8726 ఓట్లతోనే గెలిచారు. దాదాపు గెలుచుకునే పరిస్ధితి వరకు వచ్చి కేవలం తొమ్మది వేల లోపు ఓట్ల తేడాతోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చెందారు. గతానుభవాలతో ఈసారి విజయవాడను దక్కించుకోవడానికి వైఎస్సార్ సిపి ముందునుంచి గట్టి ప్రయత్నమే చేసింది. సిఎం వైఎస్ జగన్ పాలన నచ్చి సిట్టింగ్ ఎంపి కేశినేని నాని టిడిపికి రాజీనామా చేసి వైఎస్సార్ సిపిలో చేరారు. చేరిన మొదట రోజు నుంచి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ గట్టిగానే ప్రచారం చేశారు. ఇక టిడిపి తరపున నాని సోదరుడు కేశినేని చిన్ని బరిలో నిలిచారు.విజయవాడ పార్లమెంట్ పరిధిలో 2014 ఎన్నికల్లో 77.28 శాతం పోలింగ్ నమోదు అయితే, 2019 నాటికి పోలింగ్ 78.94 శాతానికి పెరిగింది. గత ఎన్నికలలో పెరిగిన పోలింగ్ శాతం వైఎస్సార్ సిపికే అనుకూలించింది. 2014 నాటికి టిడిపికి..వైఎస్సార్ సిపికి మధ్య ఆరు శాతం పైన ఓట్ల తేడా ఉంటే, 2019 నాటికి తేడా ఒక శాతం కంటే తక్కువకి దిగి వచ్చింది. ఈ సారి పోలింగ్ శాతం 79.36 శాతం నమోదైంది. ఈ సారి పెరిగిన పోలింగ్ శాతం కూడా వైఎస్సార్ సిపికే కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ఏడు శాతం పోలింగ్ పెరగడం విశేషం. 2014 ఎన్నికలలో 65.87 శాతం పోలింగ్ నమోదు అయితే ఈ ఎన్నికలలో ఏకంగా 72.96 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే విజయవాడ తూర్పులో ఆరు శాతం, నందిగామలో దాదాపు నాలుగు శాతం పెరగడం విశేషం.ఈ ఎన్నికలలో మహిళా ఓటర్లు భారీగా పెరగడం కూడా వైఎస్సార్ సిపికే అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పోల్చుకంటే దాదాపు 27 వేల మంది మహిళా ఓటర్లు అదనంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందడం వల్లే పోలింగ్ పెరిగిందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ స్ధానంలో ఈ సారి వైఎస్సార్ సిపి పాగా వేయడం ఖాయమని చెబుతున్నారు. కేశినేని బ్రదర్స్ మధ్య జరిగిన పోరులో గెలుపెవరిదనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతుండగా...గెలుపుపై వైఎస్సార్ సిపి మాత్రం ధీమాగా ఉంది. కేశినేని నాని బరిలో గట్టి అభ్యర్ధిగా ఉండటం కూడా వైఎస్సార్ సిపికి కలిసొచ్చిందంటున్నారు. -
కేశినేని నాని ఎన్నికల ప్రచారం
-
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
-
బాబును నమ్మే ప్రసక్తే లేదు..
-
చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
-
సుద్దపూస సుజనా ఒక బ్యాంకు దొంగ..!
-
సుజనా చౌదరి అఫిడవిట్ పై అనుమానాలు..కేశినేని నాని డిమాండ్
-
నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే..
-
ప్రచారం లో దూసుకుపోతున్న కేశినేని నాని కూతురు
-
ఎన్నికల తర్వాత బీజేపీ చేతిలోకి టీడీపీ: కేశినేని నాని
-
సుజనా చౌదరి వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారు
-
సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన కేశినేని నాని
-
సీఎం జగన్ విజయవాడ ఘటన...బోండా ఉమా హస్తం
-
సీఎం జగన్ పై దాడి...కేశినేని నాని క్లారిటీ..
-
సీఎం వైఎస్ జగన్ తోనే సంక్షేమ పాలన :కేశినేని నాని
-
ప్యాకేజీ అందుకుని బీజేపీకి సీటు అమ్మేశాడు: కేశినేని నాని
-
టీడీపీ కుట్రలు: పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారు: కేశినేని నాని
-
వాలంటీర్లపై ‘పచ్చ’ కుట్ర.. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు, పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయించడం దురదృష్టకరమన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఈసీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడతారు: ఎంపీ కేశినేని పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారన్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం. ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్‌తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా.. తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు. వృద్ధుల ఉసురు పోసుకున్న చంద్రబాబు: వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే కానీ పెన్షన్లు వచ్చేవి కాదు. ఈ కుట్రకు కారణం చంద్రబాబే. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది. సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
బాబుపై కేశినేని నాని కామెంట్స్...
-
దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ ఫోన్ ట్యాపింగ్: కేశినేని నాని
-
చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకే అలవాటని.. ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఆయనేనంటూ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. శనివారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, గతంలో తన ఫోన్‌ను మోదీ ట్యాపింగ్ చేయించారని చంద్రబాబు ఆరోపించాడు.. ఇప్పుడు అదే మోదీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించండి. నా ఫోన్‌ని 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేసుకున్న నాకేం భయం లేదు. సీఎం జగన్‌కి, నాకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాప్ చేయడానికి కానిస్టేబుల్ని పంపిస్తారా.?. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు’’ అని కేశినేని పేర్కొన్నారు. ‘‘విజయవాడ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి. ఆయన భూ కబ్జాలు, చీటింగ్, నేర చరిత్రలపై త్వరలో పుస్తకాలు వస్తాయి. విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే. లోఫర్లు, చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇచ్చింది. దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయ్యింది. 100 కోట్లకి చంద్రబాబు ఆ సీటు అమ్మేశాడని దేవినేని ఉమానే చెప్పారు’’ అని ఎంపీ కేశినేని నాని అన్నారు. -
బాబు పవన్ ను దారుణంగా మోసం చేస్తున్నాడు: కేశినేని నాని
-
చంద్రబాబులో కనపడని అపరిచితుడు ఉన్నాడు..బాబుపై కేశినేని సెటైర్లు
-
మంగళగిరిలో కొడుకునే దద్దమ్మని చేసాడు..
-
జగన్ బెస్ట్ సీఎం: కేసినేని నాని
-
టీడీపీ నేతలకు కేశినేని నాని కీలక సూచన
-
ఏపీలో వార్ వన్ సైడ్: ఎంపీ కేశినేని
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు పచ్చి మోసగాడంటూ దుయ్యబట్టారు ఎంపీ కేశినేని నాని. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ స్థాపించారన్నారు. మూడు రోజుల నుంచి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాసిన చంద్రబాబు.. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. ‘‘ఎంత మంది కలిసొచ్చినా సీఎం జగన్‌ను ఓడించడం కల.. సీఎం జగన్ 175కి 175కి సాధించడం ఖాయం. జగన్ దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.. పవన్ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని లోకేష్ దగ్గర తాకట్టు పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వార్ వన్ సైడే’’ అని కేశినేని తేల్చి చెప్పారు. -
మోడీపై నాడు బూతులు నేడు భజనలు
-
చంద్రబాబు భారీ ప్లాన్ బయటపెట్టిన కేశినేని
-
చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు, లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారన్న కేశినేని.. 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడని, కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడంటూ వ్యాఖ్యానించారు. ‘‘అప్పట్లో నాతో మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు. 2019లో వైఎస్ జగన్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు. ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది. కేంద్రం నుంచి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ, అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఎన్డీఏ నుంచి ఎందుకు బయటికి వచ్చాడో. తిరిగి ఎన్డీఏతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి’’ అంటూ కేశినేని చురకలు అంటించారు. ‘‘అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి?. ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా?. రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా? అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా? చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు?.తాను, తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే చంద్రబాబు భయం. టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు. టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం కలే. ఎన్నికలయ్యాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతాడు’’ అంటూ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై విజయసాయిరెడ్డి ట్వీట్ -
మోసాల బాబూ.. డ్రామాలు ఇక ఆపు: కేశినేని నాని
-
మోసాల బాబూ.. డ్రామాలు ఇక ఆపు: కేశినేని నాని
సాక్షి, విజయవాడ: అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చించేందుకు తాను సిద్దమంటూ సవాల్ విసిరారు ఎంపీ కేశినేని నాని. గొల్లపూడిలోని మౌలానగర్‌లో డా.వైఎస్సార్ మైనారిటీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాటు ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మైలవరం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి సర్నాల తిరుపతిరావు, మైలవరం నియోజకవర్గ పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ, గొల్లపూడికి దేవినేని ఉమా, వసంత చేసిందేమీ లేదన్నారు. వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తాను ఒక్కసారి కూడా ఎలాంటి శంకుస్థాపన కార్యక్రమాలకు రాలేదన్నారు. 15 లక్షల జనాభా ఉన్న విజయవాడకు చంద్రబాబు వంద కోట్లు కూడా ఇవ్వలేదని, ఫ్లైఓవర్లు.. రోడ్లకు కూడా తానే ఎంపీగా డబ్బులు తెచ్చానని కేశినేని అన్నారు. ‘‘గొల్లపూడికి సీఎం జగన్ రూ. 210 కోట్ల సంక్షేమాన్ని అందించారు. 40 వేల మంది ఉన్న గొల్లపూడిని రూ. 60 కోట్లతో తలశిల రఘురాం అభివృద్ది చేశారు. చంద్రబాబుకు మైనార్టీలంటే పడదు. చంద్రబాబు వంటి మోసగాడిని నమ్మొద్దు. బీజేపీతో చంద్రబాబు ఆడుతున్న నాటకాలను మైనార్టీలంతా గమనించాలి. 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టా. ఆ రోజు ప్రధాని మోదీని తిట్టాడు.. ఇప్పుడు మళ్లీ ఆయన చుట్టూ తిరుగుతున్నాడు’’ అంటూ కేశినేని నాని దుయ్యబట్టారు. ఓట్ల కోసం మైనార్టీలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడో అందరికీ చెప్పాలి. నా అమరావతి అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క సెక్రటేరియట్ కట్టలేకపోయాడు. సీఎం జగన్ 30 వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో సచివాలయాలు కట్టించారు. 175కి 175 స్థానాలు వైఎస్సార్సీపీ గెలవడం ఖాయం’’ అని కేశినేని నాని చెప్పారు. -
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని విమర్శలు
-
పార్లమెంట్‌లోకి స్లిప్పులు పంపిన చరిత్ర బాబుది: కేశినేని నాని
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడని మండిపడ్డారు ఎంపీ కేశినేని నాని. అయినా బాబును రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు వచ్చాడో.. మళ్లీ ఎందుకు వెళ్తున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ కేశినేని నాని గురువారం మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు తానే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టానని చెప్పారు. పార్లమెంటులో సభ్యులు ఏం మాట్లాడాలనేది చంద్రబాబు స్లిప్పులు రాసి పంపించేవాడని ప్రస్తావించారు. ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మళ్ళీ ప్యాకేజీ వద్దంటూ స్పెషల్ కేటగిరి కావాలంటూ రివర్స్ అయ్యాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే ఆలోచనతో కాంగ్రెస్‌తో బాబు కలిశాడని దుయ్యబట్టారు. పనికిరాని కొడుకు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసి తాను ప్రధాని కావాలనేది చంద్రబాబు దురాలోచన అని ఆరోపించారు. అందుకే అప్పట్లో ఆత్మ పోరాట దీక్షల పేరుతో ప్రధానమంత్రి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల డబ్బులతో ప్రత్యేక విమానంలో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరిగాడని గుర్తుచేశారు. ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుని బొక్క బోర్లా పడినట్లు తెలిపారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా కరుణాకటాక్షాల కోసం ఎన్డీయే కూటమిలో చేరటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. చదవండి: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం కుమార్తె! -
కాలకేయులను తిరువూరు నుంచి తరిమికొట్టండి: కేశినేని
-
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై కేశినేని ఫైర్
-
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై కేశినేని ఫైర్
-
చంద్రబాబుతో చర్చకు సిద్ధం.. కేశినేని నాని సవాల్
సాక్షి, విజయవాడ: కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘2009లో పంచలూడగొడతానన్నాడు.. ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు. వైఎస్ జగన్ పెట్టిన అభ్యర్ధులపై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు. గ్లాసు గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలు. పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్ధుల్ని చంద్రబాబే ఓడిస్తాడు’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ కంచుకోట. అభ్యర్ధి షేక్ ఆసిఫ్. అభ్యర్ధిని మారుస్తారనేది అపోహలు పెట్టుకోవద్దు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం. నేను మొదటిసారి ఎంపీగా గెలిచినపుడు 13 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది. రెండో సారి ఎంపీగా గెలిచినపుడు 9 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది. ఈసారి కూడా గెలుపు మనదే. పశ్చిమ నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్.. సీఎం జగన్ సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు.’’ అని కేశినేని అన్నారు. ‘‘ఓసీ మేయర్ సీటులో బీసీ మహిళను కూర్చోబెట్టిన ఘనత సీఎం జగన్‌ది. కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు. సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో వైఎస్ జగన్ నంబర్ వన్ లీడర్. కరోనా సమయంలోనూ ఇచ్చిన మాటను తప్పకుండా పని చేసిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్. సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారు. చంద్రబాబు వంద కోట్లైనా విజయవాడకు ఇచ్చాడా’’ అంటూ కేశినేని నిలదీశారు. ‘‘డ్రైనేజ్ వ్యవస్థ కోసం 400 కోట్లు తెస్తే.. ఆ నిధులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. నా పలుకుబడి ఉపయోగించి నిధులు తెచ్చినవే. చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం. రియల్ ఎస్టేట్ వ్యాపాపరం కోసం 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాడు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కోర్టు తప్ప ఐదేళ్లలో నువ్వు కట్టిందేంటి. నేను వైసీపీలోకి వచ్చాక 100కు పైగా సచివాలయాలు ప్రారంభించా. అమరావతి కోసం చంద్రబాబు 3వేల కోట్లైనా ఖర్చు చేశాడా అని ప్రశ్నిస్తున్నా. ప్రతీ గ్రామానికి ఒక సచివాలయం కట్టి జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. 80 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టిస్తున్న వ్యక్తి సీఎం జగన్’’ అని ఎంపీ కేశినేని కొనియాడారు. సీఎం జగన్ చేసిన సంక్షేమాన్ని చెప్పుకోవడంలో మనం వెనకబడ్డాం. చంద్రబాబు ఏం చేశాడో.. ఈ ఐదేళ్లలో సీఎం జగన్ ఏం చేశారో ప్రజలకు మనం వివరించాలి. అభివృద్ధి అంటే బిల్డింగ్లు, హోటళ్లు కాదు. మానవ అభివృద్ధే అసలైన అభివృద్ధి. చంద్రబాబు, రామోజీరావుకు జగన్ చేసే అభివృద్ధి కనిపించదు. చంద్రబాబును సీఎంగా చేసుకోవడమే ‘ఈనాడు’ లక్ష్యం. సామాన్యులను పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత సీఎం జగన్‌ది. విజయవాడ వెస్ట్, మైలవరం, తిరువూరులో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాం’’ అని కేశినేని పేర్కొన్నారు. ఇదీ చదవండి: అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి నిండా ముంచేశాడు -
ఏ మోహం పెట్టుకుని వసంత టీడీపీలోకి వెళ్తున్నారు: కేశినేని నాని
-
విజయవాడ ఎంపీ కేశినేని నానితో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
లోకేష్‌కి డబ్బు యావ చంద్రబాబు ఊరకుక్కల్ని తయారు చేశాడు..
-
ఎంపీ కేశినేని నానితో స్ట్రయిట్ టాక్
-
చంద్రబాబు, పవన్ కు చుక్కలు చూపించిన కేశినేని
-
బాబుకు బిగ్ షాక్ టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై !
-
2014లో నమ్మి గెలిపిస్తే చంద్రబాబు ప్రజలను మోసం చేశారు
-
సీఎం వైఎస్ జగన్ నియమించిన తిరుపతిరావే మైలవరం అభ్యర్థి
-
తట్ట బుట్ట సర్దుకోవడం ఖాయం
-
చంద్రబాబు, టీడీపీపై ఎంపీ కేశినేని నాని విమర్శలు
-
లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని సంచలన కామెంట్స్
-
టికెట్లు అమ్ముకొని టీడీపీ ఆఫీస్ కి తాళం వేసి తెలంగాణకు పరార్
-
"అరే..పిచ్చోడా..నీ రెడ్ బుక్ మడిచి.."
-
మళ్లీ జగనే సీఎం..ఎల్లో మీడియాని నమ్మొద్దు..చంద్రబాబుపై కేశినేని నాని ఫైర్
-
నా దగ్గర డబ్బులు లేవని సీటు వేరేవాళ్లకు అమ్మేశాడు పప్పుగాడు..
-
‘టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు.. ఆ పార్టీ పని అయిపోయింది’
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని, చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆయన తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం వినగడపలో కట్లేరు బ్రిడ్జి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. చంద్రబాబు, ఆయన పనికిమాలిన కొడుకు కలలు కంటున్నారని మండిపడ్డారు. టీడీపీ పార్టీ పని అయిపోయిందని, అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ సీట్లను అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారని దుయ్యబట్టారు. 2024 ఎన్నికలవ్వగానే మేలో ఫలితాలొస్తాయని, ఫలితాలు రాగానే చంద్రబాబు, లోకేష్ వాళ్ల సొంత రాష్ట్రం తెలంగాణ పోవడం ఖాయమని మండిపడ్డారు. టీడీపీ పార్టీ ఈనాడు,ఆంధ్రజ్యోతి,టీవీ5, సోషల్ మీడియా మీదే ఆధారపడిందని, టీడీపీ పార్టీకి గ్రౌండ్ లెవల్లో పనిచేసే వారియర్స్ ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. తన చిన్నప్పుడు ఎన్టీఆర్ సభల్లో చూసినంత జనం ‘సిద్ధం’ సభలో చూశానని తెలిపారు. గుడివాడలో చంద్రబాబు సభ పెడితే 3 వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట్లాడేసరికి ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోయారని, చంద్రబాబుకు అమెరికా నుంచి పార్టీ ఫండ్ ఇవ్వడానికి కమ్మోళ్లు కొంతమంది ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరని, సీఎం జగన్మోహన్రెడ్డి పేదల కోసం పనిచేసే వ్యక్తి అని గుర్తుచేశారు. ధనికుల కోసం.. పనికిమాలిన కొడుకు కోసం.. పనిచేసే వ్యక్తి చంద్రబాబ అని ధ్వజమెత్తారు. వాళ్లు బాగా సంపాదించి కొనుకున్న రోల్స్ రాయిల్స్ కార్లలో తిరగాలి కాబట్టి.. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతికి నున్నటి రోడ్ల కోసం చంద్రబాబు తపనపడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలని ప్రజలు కేశినేని పిలునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కేసుపెడతారని అర్ధరాత్రి తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి వచ్చాడని విమర్శించారు. ఇప్పుడు జగనన్న దెబ్బకు ఏపీ నుంచి తెలంగాణ పారిపోవడం ఖాయమని అన్నారు. కట్లేరు బ్రిడ్జి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి అని ఎంపీ కేశినేని నాని గుర్తుచేశారు. కట్లేరు బ్రిడ్జి కోసం ప్రజలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్వామిదాస్ వైఎస్సార్సీపీలో చేరగానే కట్లేరు బ్రిడ్జి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. సీఎం జగన్ తక్షణమే స్పందించి రూ. 25 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పారు. సంక్రాంతి లోగా బ్రిడ్జిని పూర్తిచేస్తామని అన్నారు. తిరువూరులో 25వేల మెజార్టీతో స్వామిదాస్ చరిత్ర సృష్టించడం ఖాయమని అన్నారు. -
దెందులూరు బహిరంగ సభలో కేశినేని నాని
-
సిద్ధం సభలో బాబు,కొడుకును ఆటాడుకున్న కేశినేని నాని
-
దేవినేని అవినాష్ పై కేశినేని ప్రశంసలు
-
విజయవాడ మొత్తం తిరిగా..రోడ్లు ఎలా ఉన్నాయంటే: కేశినేని
-
నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి: కేశినేని నాని ఫైర్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ధనికుల పక్షపాతి అని సీరియస్ కామెంట్స్ చేశారు కేశినేని నాని. నారా లోకేష్ పనికిమాలిన వ్యక్తి.. అలాంటి వ్యక్తిని మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు. కాగా, కేశినేని నాని గురువారం నాలుగో విడత వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్షపాతి. సీఎం జగన్ విజయవాడ నగరంలోనే రూ.325కోట్లు రుణమాఫీ చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసిన చూపించిన నాయకుడు సీఎం జగన్. అదే చంద్రబాబు.. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం అని చెప్పి శంకుస్థాపన కూడా చేయలేదు. రాష్ట్రంలోని పిల్లలందరూ అంబేద్కర్‌లా చదువుకోవాలని కాంక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. కానీ, చంద్రబాబు మాత్రం ధనికుల పక్షపాతి. పనికిమాలిన వ్యక్తిని, తన కొడుకు నారా లోకేష్‌ను మంత్రిని చేశాడు. మీడియా మేనేజ్మెంట్ చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేశాడు చంద్రబాబుకు ఇప్పటికీ ఆంధ్రాలో సొంత ఇల్లు లేదు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నేను ఉంటేనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలిచాడు. నేను లేకపోతే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జీరో. 25వేల మెజారిటీతో అవినాష్ గెలవబోతున్నాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
లోకేష్ పై కేశినేని సెటైర్లు
-
పక్కన ఒక ఊరకుక్కని పెట్టుకున్నాడు: కేశినేని
-
చంద్రబాబుపై కేశినేని నాని సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి గణనీయమైన అభివృద్ధి చేశారని కితాబిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మంగళవారం విజయవాడ పార్లమెంటరీ వైఎస్సార్సీపీ సమన్వయకర్త హోదాలో తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. చంద్రబాబు తన దగ్గర కొన్ని ఊర కుక్కల్ని పెట్టుకున్నారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లను విమర్శించడమే వాళ్ల పని. ఎవరిని ఎక్కువగా తిడితే వాళ్లకు పదవులు ఇస్తారు. అలాంటి వాళ్లే నన్ను చెప్పుతో కొడతా అన్నారు. ఆ మాటలు ప్రజలందరికీ తెలుసు. ఇలాంటివాళ్లు సమాజానికి మంచి చేస్తున్నారా? లేదా? అనేది చంద్రబాబు, నారా లోకేష్‌లనే అడగాలి. అందుకే అలాంటి వాళ్ల మాటల్ని పట్టించుకోను. ‘‘నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. నారావారిపల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఓడాక.. తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు’’ అని నాని సెటైర్లు వేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 5వేల కోట్లతో ఎలక్షన్ ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అందులో కమిషన్లు బాగా మిగులుతాయని హడావిడిగా చేశారు. ఏ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు అని ఆరోపించారు ఎంపీ నాని. -
చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్ సవాల్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్ సవాల్ విసిరారు. చంద్రబాబుకు తన మీద గెలిచే దమ్ముందా అని కామెంట్స్ చేశారు. అలాగే, నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, కేశినేని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలో అంబేద్కర్ ఉన్నారు, నేను ఉన్నాను. నాని మీద నేను గెలుస్తా అంటూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. నేను మూడు లక్షల ఓట్లతో గెలుస్తున్నా. కాల్ మనీ గాళ్లు కాదు బస్తీమే సవాల్.. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబే నాపై పోటీచేయాలి. నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. జనవరి మూడో తేదీ చంద్రబాబు నాయుడికి తిరువూరు నియోజకవర్గం సమాధి కట్టింది. #Siddham విజయవాడ MP అభ్యర్థి Kesineni Nani గారు ఈరోజు maa vurilo జరిగిన సమావేశంలో pic.twitter.com/Ut5ubb6Scq — Nagarjuna Jupudi (@NagarjunaJupud1) January 28, 2024 చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివి. దానికి మూల కారణం తిరువూరు సంఘటనే. ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మూసుకున్నా అవమానాలు పడ్డాను. సీఎం జగన్ మమ్మల్ని ఆలింగనం చేసుకుని మీలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండాలని ఆహ్వానించారు. కొడుకు లోకేష్‌ను సీఎం చేయాలనే అజెండాతో చంద్రబాబు పని చేస్తున్నాడు. 33వేల ఎకరాలు రైతుల వద్ద తీసుకుని మోసగించాడు. అందుకే సొంతిల్లు కూడా కట్టలేదు. చంద్రబాబు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నాడు. సీఎం జగన్ నిజమైన అంబేద్కర్‌వాది. కొన్ని మీడియా సంస్థలు ఏపీ అభివృద్ధి జరగలేదంటూ గొంతు చించుకుంటున్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే అదే మానవ అభివృద్ధి. మళ్లీ సీఎం జగన్ గెలిస్తేనే పేదవాళ్లందరూ సంతోషంగా ఉంటారు. చంద్రబాబు గెలిస్తే ధనికులు హ్యాపీగా ఉంటారు. సీఎం జగన్‌ను మొదటగా స్వామిదాస్ అడిగింది ఒక్కటే వినగడప కట్టలేరు బ్రిడ్జి. రూ.26కోట్ల వ్యయంతో ఫిబ్రవరి మూడో తేదీన కట్టలేరు బ్రిడ్జికు శంఖుస్థాపన చేయబోతున్నాం. స్వామిదాస్ పక్కా లోకల్.. మనకు అన్ని చేసిపెట్టే వ్యక్తి సీఎం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు దమ్ముందా ?..కేశినేని ఛాలెంజ్..
-
‘చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో జనవరి 3నే పునాది పడిందని విజయవాడ పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని నాని అన్నారు. తిరువూరు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘తిరువూరులో నాపై, స్వామిదాస్‌పైకి లోకేష్ గూండాలను పంపాడు. చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు. సీఎం జగన్ పేదవాడిని ధనికుడిని చేశారు. నా భావజాలం, సీఎం జగన్ భావజాలం ఒక్కటే.. ముక్కు సూటితనం. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి నిజమైన అంబేద్కర్ వాదిగా సీఎం జగన్ నిలిచారు’’ అని కేశినేని ప్రశంసించారు. ‘‘చంద్రబాబుకు రోడ్లు కావాలి.. ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలి. సీఎం జగన్‌కు పేదవాడి కడుపుమంట తీర్చి వారిని ధనికుల్ని చేయడం కావాలి. లోకేష్ కోసం చంద్రబాబు అమరావతి నిర్మించాడు. చంద్రబాబు 100 కోట్లు కూడా విజయవాడ అభివృద్దికి ఇవ్వలేదు. తిరువూరులో స్వామి దాస్‌ను 20వేల ఓట్ల మెజారిటీతో గెలుపించుకోవాలి. త్వరలోనే కట్టలేరు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం’’ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. -
చంద్రబాబు,లోకేష్ కి కేశినేని నాని మాస్ వార్నింగ్..!
-
100 శాతం ఖాళీ చేస్తా: కేశినేని నాని
-
బ్రోకర్ గాళ్ళకు సమాధానం చెప్పను... కేశినేని చిన్నికి స్ట్రాంగ్ కౌంటర్
-
టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని
సాక్షి, విజయవాడ: కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్సార్సీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్.. తన కంటే చాలా తక్కువని అన్నారు. కాల్ మనీ కార్యకలాపాలకు పాల్పడేవాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానిలో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. చదవండి: అంబేద్కర్‌ను పచ్చ మీడియా అవమానించింది: ఆర్కే. రోజా -
ఎన్టీఆర్, వైఎస్ఆర్ బాటలో సీఎం జగన్
-
కేశినేని భవన్లో ఎన్టీఆర్‌కు నివాళుల్పరించిన కేశినేని నాని
-
చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరు: కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్ విగ్రహమని అన్నారు ఎంపీ కేశినేని నాని. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరంటూ నాని వార్నింగ్ ఇచ్చారు. కాగా, కేశినేని నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారు. సీఎం జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారు. అంటరానితనం, కుల వివక్షపైన అంబేద్కర్ పోరాటం చేశారు. పేదలను ఉన్నత స్థాయితో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్. ఆరోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారు. సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడి బొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే మీరు తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఈ సందర్బంగా ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని సెటైరికల్ పంచ్ విసిరారు. అలాగే, రేపు ఎన్నికల బాక్స్‌లు తెరిచాక 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
Kesineni Nani: ఉంటే ఉండండి.. పొతే పోండి..
రెండేళ్లుగా తనను పార్టీలో కుదురుగా ఉండనివ్వకుండా ఇబ్బందులు పెడుతూ వస్తున్న తెలుగుదేశాన్ని వీడిన కేశినేని నాని ఇప్పుడు తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనను కాదని తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కేశినేని నానిని ఇప్పటికే వైఎస్సార్సీపీ పార్టీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించగా ఇప్పటికే ఆయన తన పనులు మొదలు పెట్టారు. కేడర్‌తో సమావేశం కావడం, వారిని తనవెంట నడిపించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరోవైపు ఆయన తన పరిధిలోని విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలతోబాటు తిరువూరు, మైలవరం.. నందిగామ.. జగ్గయ్యపేటల్లోని తన కేడర్‌తో కూడా భేటీలు నిర్వహిస్తూ ఎప్పటిలా తనకు మద్దతుఇవ్వాల్సిందిగా కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఆయనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. కేశినేని నాని తన ప్రధాన అనుచరులు.. నాయకులతో కూడిన వాట్సాప్ గ్రూపులో మొన్న ఆయన తరఫున ఒక మెసేజ్ పోస్ట్ చేసారు. కేశినేని నాని ఇకపై వైఎస్సార్సీపీతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో ఆయన ఆలోచలను.. నిర్ణయాలు.. అడుగుల గమనాన్ని అంగీకరించి, ఆమోదించేవాళ్ళు మాత్రమే ఆ వాట్సాప్ గ్రూపులో ఉండాలని, ఆయన ఆలోచనలు, నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్ళు సదరు గ్రూపు నుంచి వెళ్లిపోవచ్చని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే నాని అలా టీడీపీని వీడి వైఎస్సార్సీపీ వెంట నడవడాన్ని అంగీకరించాలని వాళ్లు గ్రూపు నుంచి వెళ్లిపోవాలని అందులో తేల్చి చెప్పేశారు. అయితే, అలా చెప్పినప్పటికీ ఒక్కరు కూడా గ్రూపు నుంచి వెళ్లలేదని తెలుస్తోంది. అంటే వారంతా నాని నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లే అని తెలుస్తోంది. ఇది కాకుండా ఇంకా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున కేశినేని నాని వెంట వైఎస్సార్సీపీ వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన సైతం తన బలాన్ని.. బలగాన్ని నిరూపించుకుని ఎన్నికల్లో తన పట్టును రుజువు చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వాస్తవానికి కేశినేని నాని వెంట తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతోబాటు ఇంకా పెద్ద సంఖ్యలో గ్రామ, మండల స్థాయి నాయకులూ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తామంతా ఈసారి ఐక్యంగా కదులుతామని, నాని మొన్న చెప్పినట్లు జిల్లాలో 60 శాతం వరకూ టీడీపీ కేడర్‌ను తమ వెంట తీసుకుపోతామని వారు అంటున్నారు. రెండుసార్లు గెలిచిన నాని ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ సామాజికవర్గంలో కూడా ఆలోచన మొదలైంది. మళ్ళీ వచ్చేది జగన్.. గెలిచేది జగన్ అని వారు భావిస్తున్నారు. దీంతో ఎన్టీయార్ జిల్లాలో ఈసారి తెలుగుదేశానికి గట్టి దెబ్బ తప్పదు అని తెలుస్తోంది. - సిమ్మాదిరప్పన్న -
చంద్రబాబు మెడ పట్టుకుని గెంటేస్తే: కేశినేని నాని
-
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై దేవినేని అవినాష్ ప్రశంసలు
-
సీఎం జగన్ కి కేశినేని నాని కానుక
-
ఆ పిట్టల దొర గాడికి నేను సమాధానం చెప్పాలా
-
ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్
-
విజయవాడను చంద్రబాబు స్మశానం చేశాడు: కేశినేని నాని
-
లోకేష్‌ని సీఎం చేయడమే బాబు లక్ష్యం: కేశినేని నాని
-
లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్
సాక్షి, విజయవాడ: వచ్చే ఎన్నికల్లో టీడీపీ 50 స్థానాల్లో కూడా గెలిచి పరిస్థితి లేదు అని తన సర్వేల్లో తేలిందన్నారు ఎంపీ కేశినేని నాని. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్‌ను కూడా చంద్రబాబు మోసం చేస్తారని నాని తెలిపారు. కాగా, ఎంపీ కేశినేని నాని విజయవాడలోని ఆటోనగర్‌లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ..‘నాకు విజయవాడ అంటే పిచ్చి.. ఆటోనగర్ అంటే ప్రాణం. నేను ఆటోనగర్ తీసేస్తున్నాని ప్రచారం చేశారు. బాండ్ లేకుండా రెండు ఎకరాలు నేను రాసిచ్చాను. దాని విలువ రూ. 100కోట్లు. నిస్వార్దంగా చేసిన పని ఇప్పుడు ఆటోనగర్‌కి ఉపయోగపడుతోంది. దేశంలోనే ఎక్కువగా కార్మికులు పనిచేసే ప్రాంతం ఆటోనగర్. కార్మికుల ఆరోగ్యానికే పెద్దపీట. ఆటోనగర్ అభివృద్ధికి కేశినేని కుటుంబం కట్టుబడి ఉంది. నన్ను ఎంపీగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి జగన్‌కు గిఫ్ట్ ఇస్తాను. టీడీపీ నన్ను పార్టీ నుంచి గెంటేసింది. లోకేష్‌ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యం. లోకేష్‌ను సీఎం చేయడం కోసం రేపు పవన్‌ను కూడా చంద్రబాబు మోసగిస్తారు. విజయవాడను స్మశానం చేశాడు చంద్రబాబు. విజయవాడపై చంద్రబాబుకు చిన్నచూపు. 33వేల ఏకరాలతో రైతులను మోసం చేశారు. 30 ఏళ్లు అయినా రాజధాని నిర్మాణం పూర్తి అవ్వదు అని నేను నాడే చెప్పాను. భూ మాఫియాకి టీడీపీ నేతలు తెర లేపారు. రాజధాని విషయంలో చంద్రబాబు స్వార్థం పూరితంగా వ్యవహరించారు. మంచి చేసేవాళ్లు.. మంచివాళ్ళు కొందరే ఉంటారు. సమర్థత కూడా కావాలి. సీఎం నుండి నిధులు తెచ్చే సమర్థత అవినాష్‌ది. తూర్పు నియోజకవర్గానికి కేశినేని, దేవినేని రక్షణగా ఉంటాం. మా కాంబినేషన్ అంటే డబుల్ రిటైనింగ్ వాల్. మా ఇద్దరి వల్ల రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు వస్తాయి. ఎందుకు చెబుతున్నానో విజయవాడ ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
కేశినేని నానికి చంద్రబాబుకి గొడవేంటంటే..!
-
ఇది ఆరంభం మాత్రమే.. కేశినేని నాని ట్వీట్
సాక్షి, విజయవాడ: ఇది ఆరంభం మాత్రమేనంటూ టీడీపీకి చురకలు అంటించారు కేశినేని నాని. వైఎస్సార్సీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు ఆయన ఎక్స్(ట్విట్టర్) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని అవమానించిన వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటూ స్వామిదాసును ఉద్దేశించి కేశినేని ట్వీట్ చేశారు. కాగా, ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారాయన. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని.. ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరని తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన ఆయన సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు. ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు. దాదాపుగా 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు. టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు. Congratulations my dear Swamy Das and Sudha Rani. This is just a beginning we shall teach a lesson to everyone who has humiliated us. pic.twitter.com/i4aQt3nH46 — Kesineni Nani (@kesineni_nani) January 11, 2024 -
సొంత తమ్ముడితోనే నన్ను కొట్టించాడు: కేశినేని నాని
-
సీఎం జగన్ ఎంత మంచోడంటే.. కేశినేని ఎమోషనల్
-
పనికిరాని బాబు.. పచ్చి మోసగాడు
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు పచ్చి మోసగాడు.. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని తెలిసి కూడా విజయవాడపై ప్రేమ, నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నా..’’ అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వ్యాఖ్యానించారు. టీడీపీలో ఎన్నో అవమానాలను ఓర్చుకున్నానని, ఇక భరించలేక బయటికి వచ్చేయాలని నిర్ణయించున్నట్లు తెలిపారు. ‘సీఎం జగన్ పేదల పక్షపాతి. ఆయన విధానాలు నాకు నచ్చాయి. సీఎం జగన్ వెనుక నడవాలని నిర్ణయించుకున్నా. పార్టీ కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తా..’ అని పేర్కొన్నారు. తాను నైతిక విలువలు పాటించే వ్యక్తినని, టీడీపీకి రాజీనామాతోపాటు ఎంపీ పదవికి రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో పంపుతానన్నారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరతానని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలసిన అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. సీఎంను మర్యాద పూర్వకంగానే కలిశానని చెప్పారు. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. నాతో నెల జీతాలు ఇప్పించారు.. పేదలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట నడవాలని నిర్ణయించున్నట్లు ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడితో ప్రెస్‌మీట్ పెట్టించి తనను దూషించారని, చెప్పు తీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గొట్టంగాడు అని దారుణంగా అవమానించినా భరించానన్నారు. ‘ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని నా భుజస్కందాలపై నడిపించా. పార్టీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కనపెట్టా. చంద్రబాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను నా భుజాలపై మోశా. కొందరికి నెలవారీ జీతాలు ఇవ్వమని చంద్రబాబు చెబితే డబ్బులు ఖర్చు పెట్టా. తొమ్మిదేళ్లుగా పార్టీలో ఉంటే నేను చేసిన తప్పేమిటో కనీసం చెప్పాలి కదా?’ అని ఎంపీ కేశినేని పేర్కొన్నారు. బొండా భార్యను నిలబెడితే ప్రమాదం.. ‘విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బొండా ఉమ భార్యను నిలబెడితే చాలా ప్రమాదం. నీ కుమార్తెను పోటీ చేయించు అని చంద్రబాబు నాతో అన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే నిర్ణయించారు. ఆయన మూడు రోజులు అడిగితేనే ముందుకొచ్చాం. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలా మంది హితవు చెప్పినా వినకుండా పార్టీలో కొనసాగా’ అని కేశినేని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కార్యక్రమాలకు హాజరు కానివ్వలేదు ‘చంద్రబాబు పచ్చి మోసగాడని ప్రపంచానికి తెలుసు. ఇంత దగా చేస్తాడనుకోలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకు నేను హాజరు కావాలి. కానీ సీఎం కార్యక్రమాలకు చంద్రబాబు నన్ను హాజరు కానివ్వలేదు. చంద్రబాబు ఏపీకి పనికి రాని వ్యక్తి. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా. నా రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్సీపీలో చేరుతా’ అని ఎంపీ కేశినేని చెప్పారు. బెజవాడ, గుంటూరు నిజం.. అమరావతి ఓ కల ‘నాకు విజయవాడ అంటే ప్రాణం. విజయవాడ కోసం చంద్రబాబు రూ.100 కోట్లైనా ఇచ్చాడా? కానీ విజయవాడ కోసం నేను ఎంతో చేశా. షాజహాన్ తాజ్‌మహల్ కడితే నేను అమరావతి కడతానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పారు. విజయవాడ, గుంటూరు మాత్రమే నిజం.. అమరావతి ఒక కలే. అది భ్రమరావతి. అక్కడంతా రియల్ ఎస్టేట్’ అని కేశినేని నాని పేర్కొన్నారు. లోకేశ్.. ఆఫ్ట్రాల్ ‘టీడీపీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు ఉంటుంది. చివరకు నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో, రౌడీలతో కొట్టించాలని లోకేశ్ ఎందుకు ప్రయత్నించారు? లోకేశ్ అనే వ్యక్తి ఆ్రఫ్టాల్..! చంద్రబాబు కుమారుడిగా మినహాయిస్తే ఆయనకు ఎలాంటి అర్హతా లేదు. అతడికి పార్టీ అన్నీ ఇచ్చినా ఓడిపోయాడు. నేను నా సొంత వనరులతో గెలిచా. అలాంటిది అతడి వద్ద మోకరిల్లాలంటే సాధ్యం కాదు’ అని కేశినేని స్పష్టం చేశారు. కేశినేని బాటలో క్యాడర్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడటంతో నగర పరిధిలో పార్టీ క్యాడర్ ఆయన వెంట నడిచేందుకు సిద్ధమైంది. విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మూడు నియోజకవర్గాల్లోనూ కేశినేని నానికి బలమైన క్యాడర్ ఉంది. నానికి మద్దతుగా వారంతా వైఎస్సార్సీపీలో చేరనున్నారు. టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు క్యాడర్‌ను పట్టించుకోరన్నది బహిరంగ రహస్యమే! లోకేశ్ వ్యవహార శైలితో పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలసిన సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ కీలక నేతలంతా అక్కడే ఉండటం ఇకపై వారంతా సమన్వయంతో పని చేస్తారనే సానుకూల సంకేతాలను పంపింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఎంపీ కేశినేని నానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి జగ్గయ్యపేట, తిరువూరు వరకు బలమైన అనుచర గణం ఉంది. ప్రధానంగా వారంతా దేవినేని ఉమా బాధితులే కావడం గమనార్హం. గ్రామాల్లో కేశినేని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ స్థాయి నేతలతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు తదితరులకు కేశినేని నానితో మొదటి నుంచి సత్సంబంధాలున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా వారు కలసి పని చేయడాన్ని అన్ని వర్గాలు ప్రశంసించాయి. తాజా పరిణామాలు తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయనున్నాయి. కాగా, చంద్రబాబు పచ్చి మోసగాడని, ఈ రాష్ట్రానికి పనికి రాని వ్యక్తి అని ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. బాబు మోసాలను బహిర్గతం చేస్తూ కేశినేని మాట్లాడిన మాటలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కేశినేని పార్టీని వీడటం ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
టీడీపీకి కేశినేని నాని రాజీనామా
సాక్షి, విజయవాడ: టీడీపీ పార్టీకి కేశినేని గుడ్ బై చెప్పారు. టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాని ప్రకటించారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ఇప్పటికే కేశినేని తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అంతకుముందు సీఎం జగన్‌తో భేటీ అయిన కేశినేని నాని.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. బాబు రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవబోతుందని చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రయాణం చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. వైఎస్ జగన్ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు కానీ మరీ ఇంత పచ్చిమోసగాడు, దగా చేస్తాడని తెలీదని నిప్పులు చెరిగారు. రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్సీపీలో చేరుతానని తెలిపారు. చదవండి: అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన’ -
లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని నాని రాజీనామా
సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అంతకముందు కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మోసగాడని విమర్శించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన బాబు.. రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శౠతం టీడీపీ ఖాళీ కాబోతోందని అన్నారు. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. -
చంద్రబాబు వల్ల నా ఆస్తులు అమ్ముకున్నా..!
-
ఏం పీకావని నీ పాదయాత్రకు రావాలి: కేశినేని నాని
-
సీఎం క్యాంప్ ఆఫీసుకు కేశినేని నాని
-
చంద్రబాబు మోసగాడని తెలుసు, కానీ..: కేశినేని నాని
సాక్షి, గుంటూరు: విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడితో ప్రెస్‌మీట్ పెట్టించి తనను తిట్టించారని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చెప్పుతీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందిచలేదని వాపోయారు. తనను గొట్టంగాడు అన్న భరించానని పేర్కొన్నారు. టీడీపీ గెలిచేది లేదని గతంలో చాలామంది నాకు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని నా భుజస్కందాలపై నడిపించా. పార్టీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కనపెట్టా. సొంత వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యమని పని చేశా. టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలు వదులుకున్నా. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజంపై మోశానని, పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డా అని నాని తెలిపారు. విజయవాడ మేయర్‌గా అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబాబే నిర్ణయించారని.. ఆయన మూడు రోజులు అడిగితేనే శ్వేత ముందుకొచ్చిందని తెలిపారు. ఆ తర్వాతే ప్రెస్‌మీట్ పెట్టించి తనను బాబు తిట్టించారని గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలే తనను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదు. నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా పార్టీ నుంచి కనీస మద్దతురాలేదు. నన్ను చాలా రకాలుగా అవమానించారు. టీడీపీలో ఉంటూ ఇంకా ఎన్ని భరించాలి. ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని అప్పుడే చంద్రబాబుతో చెప్పాను. వద్దు నువ్వు ఉండాల్సిందే అని బాబు నాతో చెప్పారు. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలామందే చెప్పారు. చాలా మంది చెప్పినా కూడా నేను టీడీపీలోనే కొనసాగాను. నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు. నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశాడు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు. మరీ ఇంత పచ్చిమోసగాడు, దగా చేస్తాడని తెలీదు. ఎంపీగా సీఎం కార్యక్రమాలకు నేను అటెండ్ కావాలి అది ప్రోటోకాల్. నా విషయంలో టీడీపీ ప్రొటోకాల్ మరిచిపోయింది. సీఎం కార్యక్రమాలకు బాబు నన్ను హాజరు కానివ్వలేదు. చంద్రబాబు ఏపీకి పనికీ రాని వ్యక్తి. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా. నా రాజీనామా అమోదం పొందగానే వైఎస్సార్సీపీలో చేరుతా. విజయవాడ అంటే ప్రాణం ఏమైనా చేస్తా. 2014 నుచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూ. 100 కోట్లైనా ఇచ్చాడా. విజయవాడ కోసం నేను చేశా. షాజహాన్ తాజ్‌మహాల్ కట్టాడు, నేను అమరావతి కడతానని బాబు గొప్పలు చేశారు. విజయవాడ ఒక రియాలిటీ, అమరావతి ఒక కల. నేను బాబును ఎప్పుడూ టికెట్ అడగలేదు.. ఇప్పుడు సీఎం జగన్‌ను కూడా అడగను. ఇప్పుడు జగన్‌తో ప్రయాణం చేయాలనుకుంటున్నా. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవబోతుంది.’ అని చెప్పారు. -
సీఎం జగన్‌తో కేశినేని నాని భేటీ
-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో విజయవాడ ఎంపీ కేశినేని నాని సమావేశం (ఫొటోలు)
-
సీఎం క్యాంప్ ఆఫీసుకు కేశినేని నాని
-
సీఎం జగన్‌తో ముగిసిన కేశినేని నాని భేటీ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు. కాగా విజయవాడ ఎంపీ అయిన కేశినేని టీడీపీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ అయిన ఆమె తన పదవికి రాజీనామా సమర్పించారు. చదవండి: ఈ ఏడుపంతా.. మోసాల బాబు కోసమే కదా! -
కేశినేని భవనంపై చంద్రబాబు, టీడీపీ ఫ్లెక్సీ ఔట్
-
కేశినేని నాని రాజీనామాపై కొడాలి నాని రియాక్షన్
-
శ్వేత టీడీపీకి రాజీనామా చేయడానికి అసలు కారణం పై క్లారిటీ ఇచ్చిన దేవులపల్లి అమర్
-
వృద్దాప్యంలో ఉన్నారు కదా! రామోజీ కళ్లకు కాస్త మసక వచ్చి ఉండొచ్చు..
పదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన వ్యక్తి పెద్దవాడవుతాడా? లేక ఒక క్రికెటర్‌గా ఉండి రిటైరైన వ్యక్తి పెద్ద వ్యక్తి అవుతారా? ఎవరైనా ఏమంటాం. ఒక రాజకీయ వేత్తగా రెండుసార్లు ఎంపీగా గెలిచారంటేనే అతనికి ప్రజాభిమానం ఉందనే కదా! దేశంలో చట్టాలు చేసే అత్యున్నత చట్టసభలో ఉండడం కన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది. రాజకీయాలలో అదే కదా ఎవరైనా కోరుకునేది. క్రికెటర్‌గా రాణించడం మంచి విషయమే. కాదనం. ఆయన రాజకీయాలలోకి వచ్చి ప్రజాదరణ పొందితే అది వేరే సంగతి. పదేళ్లు ఎంపీగా ఉన్న నేత చిన్నవాడట ఒక పార్టీలో చేరి వారం రోజులకే మనసు మార్చుకున్న వ్యక్తి చాలా పెద్దవాడట. పదేళ్లుగా ఎంపీగా ఉన్న నేత చాలా చిన్నవాడట. ఇది ఈనాడు మీడియా అధిపతి రామోజీరావు చిత్రీకరణ. తెలుగుదేశం పార్టీకి ఏది అనుకూలం అయితే అదే కరెక్ట్ అనేంత పతనావస్తకు ఈనాడు మీడియా చేరింది. క్రికెటర్ అంబటి రాయుడు కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అంతకుముందు ఏపీలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు, ఇతర సంస్థలలో జరుగుతున్న అభివృద్దిని చూసి మెచ్చుకున్నారు. వాటికి ఆకర్షితులై ఆయన పార్టీలో చేరానన్నారు. తదుపరి ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నానని ప్రకటించారు. అంతే! మోసపూరిత కథనాలతో తప్పుడు కథనాలు ఈనాడు మీడియాకు కోతికి కొబ్బరికాయ దొరికిన చందం అయిపోయింది. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో అచ్చేసి ఆనందపడింది. పైగా దీనికి వంచన అంటూ మరో ముక్తాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఈయనను వంచించేశారట. ఇలాంటి మోసపూరిత కథనాలు రాసి ప్రజలను తప్పుదారి పట్టించాలని ఈనాడు ఎంత నీచంగా ప్రయత్నిస్తోందో అర్ధం అవుతుంది. ఏబీఎన్‌తో పోటీ పడి నిసిగ్గుగా మద్దతు పదేళ్లపాటు ఎంపీగా ఉన్న కేశినేని అటు ఎంపీ పదవికి, ఇటు తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెబితే మాత్రం దానిని చాలా చిన్న విషయంగా పది లైన్ల వార్తగా ఇచ్చి సరిపెట్టుకుంది. అంటే దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. ఈనాడు మీడియా ఆంద్రజ్యోతితో పోటీ పడి తెలుగుదేశం పార్టీకి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తోందనే కదా!అదేమీ కొత్త విషయం కాకపోయినా, ఒకటికి రెండుసార్లు ఈ విషయం చెప్పి వక్కాణించవలసి వస్తోంది. కేశినేని నాని 2014లో మొదటిసారి విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ వేవ్‌ను కూడా తట్టుకుని నిలబడి స్వల్ప ఆధిక్యంతో అయినా గెలవగలిగారు. కేశినేని కుటుంబంలో లోకేష్ చిచ్చు అలాంటి వ్యక్తి తన కుటుంబంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిచ్చుపెట్టారని అంటున్నారు. తన సోదరుడు చిన్నిని లోకేష్ ఎంకరేజ్ చేసి డబ్బు ఖర్చు పెట్టించి, తనకు పోటీగా తయారు చేశారని, అందుకే తనకు టికెట్ లేదని చంద్రబాబు ప్రకటించారని అంటున్నారు. ఇవేవి ఎల్లో మీడియాకు విశేషాలు కావు. టీడీపీలో చంద్రబాబు పెత్తనం కన్నా లోకేష్‌దే ఎక్కువ ఆధిపత్యం అని ఈ ఘటన తెలియచేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 2014-19 కాలంలో తన కొడుకు లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా నియమించారు. ఆ తర్వాత ప్రభుత్వంలో అంతా తానై లోకేష్ చక్రం తిప్పారు. జోక్యం చేసుకోవద్దని స్థానిక ఎంపీకే చెబుతారా? చంద్రబాబు చాలా సందర్భాలలో నిస్సహాయంగా చూస్తు ఉండిపోయారని కొందరు అంటారు. అంతేకాక, తనవద్ద ఎవరైనా పనులకు వస్తే లోకేష్‌ను కలిశావా అని అడిగేవారని కూడా కొందరు చెబుతారు. అంటే దాని అర్ధం తెలుసుకదా! ఈ నేపథ్యంలో లోకేష్ తన సొంత టీమ్‌ను తయారు చేసుకుంటున్నారన్నమాట. ముఖ్యమంత్రి జగన్ వాళ్లను కలవలేదు. వీళ్లను కలవలేదు అని ఎల్లో మీడియా వారు తప్పుడు ప్రచారం చేస్తుంటారు? కనీసం కేశినేని నానిని పిలిచి టికెట్ విషయం ఎందుకు చర్చించలేదని మాత్రం కథనం ఇవ్వరు. అదేదో పరాయి వ్యక్తికి చెప్పినట్లు నలుగురు మనుషులను పంపించి టికెట్ ఇవ్వడం లేదని నానికి చెప్పిస్తారా? తిరువూరు సభ ఏర్పాట్లలో జోక్యం చేసుకోవద్దని స్థానిక ఎంపీకే చెబుతారా? పైగా తెల్లవారి లేస్తే ప్రజాస్వామ్యం అని ఒకటే సోది చెబుతారు! ఎంపీ రాజీనీమా పెద్ద వార్త కాదా? చంద్రబాబు ఎవరికైనా టిక్కెట్లు ఇవ్వకపోతే అదేదో పార్టీ ప్రయోజనాల కోసం. వేరే పార్టీవారు అదే పని చేస్తే అన్యాయం, వంచన చేసినట్లట! దీనిని ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా భుజాన వేసుకుని తప్పుడు ప్రచారం చేస్తుంటాయి. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తే అది పెద్ద వార్తకాదని ఈ దిక్కుమాలిన మీడియా అబిప్రాయం. అసలు రాజకీయాలలోకి దాదాపు రాని, కేవలం వారం రోజుల వ్యవధిలో తప్పుకుంటే మాత్రం అది వంచన అని, ఇంకేవో రాసిపారేశారు. ఈనాడు చెత్తరాతలు అంబటి రాయుడుకు గుంటూరు టికెట్ ఇస్తానని జగన్ చెప్పారని, ఇప్పుడు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీచేమంటున్నారని ఇది మోసం అని ఈనాడు చెత్తరాతలు రాసింది. పార్టీ అవసరాల కోసం ఒకవేళ టికెట్ మార్చుకుంటే అది వంచన అవుతుందా? అదే పార్టీ ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలిచిన కేశినేని నాని ఇంటిలో స్వయంగా చంద్రబాబో లేక లోకేషో చిచ్చు పెడితే అది మోసం కాదా? నాని ఇప్పుడు తన కార్యాయలం నుంచి టీడీపీ జెండాలు కూడా పీకేశారట. అయినా ఎల్లో మీడియా దానిని వార్తగా ఇవ్వదు. నోరు మూసేసుకుంది. అంబటి రాయుడు స్టోరీని అడ్డుపెట్టుకుని ఇంతకు ముందు రాసిన విషయాలనే మళ్లీ, మళ్లీ రాసి పాఠకులను విసిగించింది. ఈ మద్యకాలంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ కార్యకలాపాలకు అంటిముట్టనట్లు ఉంటున్నారని చెబుతున్నారు. అయినా అవేవి ఈనాడు రామోజీరావు కళ్లకు వార్తలు కావు. ఎంతైనా వృద్దాప్యంలో ఉన్నారు కదా! రామోజీరావు కళ్లకు కాస్త మసక వచ్చి ఉండవచ్చు. వివరణ ఇవ్వని అనైతిక పరిస్థితి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అంబటి రాయుడు ఊపీఎల్ పోటీలలో ఆడడానికి ఎంపికయ్యారు. వారు ఏ రాజకీయపార్టీలలో ఉండకూడదట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీంతో ఈనాడు మీడియాకు నోరు పడిపోయినంత పనైంది. తాను రాసింది తప్పుడు వార్త అని తెలిసినా కనీసం వివరణ కూడా ఇవ్వని అనైతిక పరిస్థితికి ఈనాడు మీడియా వెళ్లింది. నెల్లూరు నుంచి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రబాకరరెడ్డి పోటీచేయడం లేదని, ఆయన టీడీపీ వైపు చూస్తున్నారంటూ ఒకటే ప్రచారం చేసింది. అన్నిసార్లు రాస్తే నమ్మకపోతారా అన్నది వారి గోబెల్స్ ఆలోచన అన్నమాట. తీరా వేమిరెడ్డి తానే నెల్లూరునుంచి వైఎస్సార్సీపీ నుంచి పోటీచేస్తున్నానని స్పష్టంగా చెప్పారు. ఎన్నిసార్లు వీరు వదంతులు సృష్టిస్తారు? పైగా ఆయన ఒక మాట అన్నారు. ఎన్నిసార్లు వీరు వదంతులు సృష్టిస్తారు! తనకు విసుగువచ్చి పదే, పదే జవాబు ఇవ్వడం మానివేశానని అన్నారు. ఈనాడు తదితర ఎల్లో మీడియా అంత అసహ్యంగా మారాయనే కదా ఆయన వ్యాఖ్యల సారాంశం. వైఎస్సార్సీపీ తమ అభ్యర్దులను మార్చినా వ్యతిరేక ప్రచారమే. మార్చకపోయినా దుష్ప్రచారమే. చంద్రబాబు కాంగ్రెస్ వారితో కలిసి మంతనాలు జరిపితే అది వ్యూహం. అదే వేరే వారు చేస్తే కుట్ర. కేశినేని నాని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారట. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. టీడీపీ జెండాలు పీకేస్తే ఎందుకు రాయలేదు ఎవరైన వైఎస్సార్సీపీ నేతను పార్టీ అధిష్టానం ఏదైనా అంశంపై ప్రశ్నిస్తే ఇంకేముంది.. ఇదేనే ప్రజాస్వామ్యం అని ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రశ్నిస్తూ నీచంగా కథనాలు ఇస్తాయి. కేశినేని నాని తన ఆఫీస్ వద్ద టీడీపీ జెండాలు పీకేశారట. మరి దానికి టీడీపీ జెండా పీకేశారని ఈనాడు మీడియా ఎందుకు రాయలేదు? అంటే టీడీపీపై వల్లమానిన ప్రేమ. తన స్వార్ధ వ్యాపార రాజకీయం కోసం రామోజీరావు ఎంతకైనా దిగజారుతున్నారు. ఆంద్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మించడానికి యత్నించారు. రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ జగన్ ఫోన్ చేసి పలకరించలేదని చెప్పించారు. ఓకే. ఇదే రాధాకృష్ణ అంతకుముందు ఒకసారి రేవంత్‌కు జగన్ ఫోన్ చేయడానికి ప్రయత్నించారని, కాని రేవంత్ సిద్దపడలేదని రాసిందే. మరి దాని గురించి ఏమంటారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్దం అంటే వారికే తెలియాలి. రాజకీయవర్గాలలో ఒక ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ చేసి తన వద్దకు ఇంటర్వ్యూ నిమిత్తం రప్పించుకున్నారని అంటున్నారు. తొలుత రేవంత్ ఒక టీవీ చానల్‌కు వెళితే మిగిలిన చానళ్లు కూడా అడుగుతాయని అనుకుని వద్దని చెప్పారట. కాని రాధాకృష్ణ బ్లాక్ మెయిల్‌కు తట్టుకోలేక ఇంటర్వ్యూ ఇచ్చారట. సహజంగానే రాదాకృష్ణ మానసికి పరిస్థితిని బట్టి అది నిజమేనేమో అనిపిస్తుంది. అదే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరు కదా! అందుకే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల ఏడుపు అని అనుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
నారా లోకేష్‌కు పొలిటికల్ పంచ్.. టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా
సాక్షి, విజయవాడ: టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు. ఈ సందర్బంగా కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్‌గా నేను రాజీనామా చేశాను. రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టీడీపీకి రాజీనామా చేస్తాను. మేము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదు. టీడీపీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు మేము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు. పార్టీకి తర్వాత కేశినేని నాని కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తారు. గౌరవం లేని చోట మేము పనిచేయలేము. కేశినేని నాని, నేను ప్రజల తరుపున పోరాటం చేస్తాము. గత సంవత్సరం కాలం నుంచి టీడీపీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కృష్ణాజిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నాము. మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడలో ముగ్గురు నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మేము బయటకి వెళ్తున్నము.. పార్టీ నుంచి మాతో వచ్చే వాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటాము. తిరువూరు సభకి కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్ అడిగారు. ఆయన పార్లమెంట్ నియోజవర్గంలో ఆయనకు సంబంధం ఏంటి అని అడగడం లోకేష్ తెలివితేటలకు నిదర్శనం. కేశినేని నాని మూడోసారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారు’ అని కామెంట్స్ చేశారు. ఇక, అంతకుముందు కేశినేని శ్వేత, టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. కాగా, వీరి రాజీనామాలతో టీడీపీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. రాజీనామాల నేపథ్యంలో విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. అందరికీ నమస్కారం 🙏🏼 ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది . pic.twitter.com/gANCVCKrZJ — Kesineni Nani (@kesineni_nani) January 7, 2024 -
రాజీనామాకి ముందు..కేశినేని శ్వేత సంచలన నిర్ణయం
-
టీడీపీ కి కేశినేని నాని కుమార్తె గుడ్ బై
-
Kesineni Swetha: టీడీపీకి మరో షాక్.. ట్విస్ట్ ఇచ్చిన కేశినేని శ్వేత
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని తెలిపారు. వివరాల ప్రకారం.. విజయవాడలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేశినేని శ్వేత టీడీపీకి రాజీనామా చేయనున్నారు. కాగా, శ్వేత ప్రస్తుతం విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. అయితే, కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో తన కూతురు శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శ్వేత తన రాజీనామా లేఖను అందజేస్తుందన్నారు. కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుందని ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు. అందరికీ నమస్కారం 🙏🏼 ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది . pic.twitter.com/gANCVCKrZJ — Kesineni Nani (@kesineni_nani) January 7, 2024 కేశినేని నాని ఫైర్.. ఇదిలా ఉండగా.. కేశినేని నాని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ జెండాలను పీకేసినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. దీంతో ఆయన టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకొన్నట్లుగా అర్థం అవుతోంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం రాత్రి కేశినేని నానితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. తిరువూరు సభకు రావాలని అధిష్టానం దూతగా కోరినట్లు తెలిసింది. అయితే ఆయన ససేమిరా అంటూ తిరస్కరించారని సమాచారం. ఆదివారం సైతం తన రాజీనామాపై స్పందించారు. రాజీనామా చేస్తామని చెప్పాక కచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. దీనిని బట్టి ఎంపీ కేశినేని నాని పూర్తిగా టీడీపీ నుంచి వెళ్లిపోవటానికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తిరువూరు సభలో సీటు కేటాయించినా.. తిరువూరు సభలో టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. తిరువూరు సభలో ముందు వరుసలో ఎంపీ కేశినేని నానికి సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో సైతం ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ ఫొటోలు వేశారు. ఈ విషయం ఎంపీ కేశినేని నాని దృష్టికి మీడియా తీసుకెళ్తే.. ‘నాకు ప్రొటోకాల్ ఇచ్చామని, పాటిస్తున్నామని చెప్పుకోవటానికి బ్యానర్లలో ఫొటోలు వేశారు. గతంలో ప్రొటోకాల్ పాటించలేదే’ అని ప్రశ్నించారు. -
టీడీపీకి మరో బిగ్ షాక్
-
విజయవాడలో టీడీపీ జెండా పీకేసిన కేశినేని నాని
-
సారీ రాలేను.. చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ఏపీ టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, చంద్రబాబు నిర్ణయంతో కేశినేని నాని టీడీపీకి ఝలక్ ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుంచి టీడీపీ జెండాను తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉండటం విశేషం. ఇదిలా ఉండగా.. చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. చంద్రబాబు సభపై తెలుగు తమ్ముల్లు ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు సభను పట్టించుకోలేదు. రా కదలిరా అంటూ వైన్ షాపుల వద్దకు టీడీపీ శ్రేణులు వెళ్లిపోయారు. టీడీపీ కేడర్ మందేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, కాసేపట్లో సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే, సభలో మాత్రం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. జనసమీకరణ కోసం టీడీపీ నేతల నానా కష్టాలు పడుతున్నారు. -
డబ్బులుంటేనే టీడీపీలో సీట్ల కేటాయింపు..బాబుపై కేశినేని ఫైర్..
-
నేను పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి అసలు కారణం.. !
-
టార్గెట్ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు. కొందరు వ్యక్తులు తన కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే, త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పకొచ్చారు. ఇందుకోసం లోక్‌సభ స్పీకర్ అనుమతి కూడా తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా, కేశినేని నాని శనివారం చందర్లపాడు మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేశినేని నాని మాట్లాడుతూ.. టీడీపీకి రాజీనామా చేస్తున్నాను. లోక్‌సభ స్పీకర్ అనుమతి కూడా కోరాను. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను. రాజీనామా అనంతరం టార్గెట్ చేసేందుకు మా వాళ్లు ఏం చేయమంటే అదే చేస్తాను. ఇందులో నా సొంత నిర్ణయం ఉండదు. నేను ఏం చేసినా పారదర్శకంగా ఉంటుంది. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెల్లవారుజామున పోస్టులో పెడుతున్నాను. దాన్ని మీడియా ఫాల్ అవ్వండి. రోజూ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఇక్కడి ప్రాంతం, ప్రజల కోసం పనిచేశాను. ప్రజలను, నాతో ఉన్న వాళ్ళను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేను అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. కేశినేని నాని సంచలన నిర్ణయం -
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా: ఎంపీ కేశినేని నాని
-
చంద్రబాబుకు బిగ్ షాక్.. కేశినేని నాని సంచలన నిర్ణయం
సాక్షి, విజయవాడ: టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని గట్టి షాక్ ఇచ్చారు. లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. కాగా, కేశినేని నాని ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు నాయుడు.. పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను’ అని పోస్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG — Kesineni Nani (@kesineni_nani) January 5, 2024 అంతకుముందు, కేశినేని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది నేను టీడీపీ పార్టీకి ఓనర్‌ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. తినబోతూ రుచులెందుకు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఇండిపెండెంట్‌గా గెలుస్తా.. నేను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్దమనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా. నాదగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడో సారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్ నేను మంచి స్నేహితులం. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పనిచేయలేదు కదా’ అని కామెంట్స్ చేశారు. -
కేశినేని నాని సంచలన నిర్ణయం
-
కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. అలాగని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు అని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తనను దూరం పెడుతున్న పరిణామాలపై శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ►తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది నేను టీడీపీ పార్టీకి ఓనర్ ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. తినబోతూ రుచులెందుకు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది.. అని అన్నారాయన. ►ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ►నేను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్దమనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా. నాదగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు అని కేశినేని నాని వివరించారు. ►నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడవ సారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్ నేను మంచి స్నేహితులం. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పనిచేయలేదు కదా అని కేశినేని నాని అన్నారు. -
కేశినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్
-
విజయవాడ ఎంపీ కేశినేని నానికి షాక్
-
చంద్రబాబుకు చెక్!.. కేశినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, విజయవాడ: టీడీపీలో కోల్డ్‌వార్ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంతో పచ్చ పార్టీలో ముసలం చోటుచేసుకుంది. ఇక, టీడీపీ హైకమాండ్ నిర్ణయంపై తాజాగా కేశినేని నాని స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తినబోతూ రుచులెందుకు అంటూ సెటైర్లు వేశారు. దీంతో, ఆయన కామెంట్స్ టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. అటు, టీడీపీ నేతలను సైతం టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. అయితే, టీడీపీ హైకమాండ్ నిర్ణయం తర్వాత నాని కేశినేనిభవన్కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాలో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘నేను పార్టీలో కొనసాగాలో వద్దో నా అభిమానులు, కార్యకర్తలు నిర్ణయిస్తారు. తినబోతూ రుచులు ఎందుకు?. నన్ను తిరువూరు సభకు రావొద్దని చెప్పారు. నేను వెళ్తే మళ్లీ గొడవలు మొదలవుతాయి. నేను ఇండిపెండెంట్‌గా అయినా గెలుస్తా. ఫిబ్రవరి మొదటి వారంలో నా నిర్ణయం ప్రకటిస్తా. వెన్నుపోటు పొడిస్తే ఇంకా పెద్ద పదవిలో ఉండేవాడిని. నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు. కేశినేని నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కేడర్ ఎదురుచూస్తోంది. ఒక్కొక్కరుగా నా అభిమానులు ఇక్కడికి వస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, అంతకుముందు కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్ నియమించింది. అలాగే, కేశినాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. -
కేశినేనికి చంద్రబాబు భారీ షాక్...
-
టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. నానికి చంద్రబాబు గట్టి షాకిచ్చాడు. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్ నియమించింది. అలాగే, కేశినాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
బాహాబాహీకి దిగిన కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలు
-
AP: నన్ను గొట్టంగాడన్నా భరించా: కేశినేని నాని
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ పొలిట్‌బ్యూరోలో ఉన్న ఓ వ్యక్తి తనను గొట్టంగాడని అన్నా భరించానని, పార్టీ కోసమే ఓపికపడుతున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గతంలోనూ తాను చాలా అవమానాలు పడ్డానన్నారు. తిరువూరు నియోజకవర్గంలో బుధవారం టీడీపీ సమన్వయ సమావేశంలో గొడవ తర్వాత నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ మీటింగ్ జరిగిన ప్రదేశాన్ని ఆ పార్టీ నాయకులు పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేశారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ నాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పుతీసుకుని కొడతా అన్నాడు. క్యారెక్టర్ లెస్ ఫెలో అన్న ఆ వ్యక్తి మాటలపైనా పార్టీ నుంచి కనీసం ఎవరూ స్పందించలేదు. నన్ను అవమానించినా పార్టీ కోసం భరించా. నేను ఏరోజూ పార్టీలో వర్గాలను ప్రోత్సహించలేదు. ఏడాదిన్నర నుంచి పార్టీలో కుంపటి నడుస్తోంది...ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి సంఘర్షణలు జరుగుతాయనే నేను పార్టీ కార్యకమాలకు దూరంగా ఉంటున్నా. తిరువూరు టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్ పూజకు పనికిరాని పువ్వు. గతంలోనే చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పా. కేశినేని చిన్నికి పార్టీకి ఏం సంబంధం. అతనేమైనా పార్టీలో ఎంపీనా... ఎమ్మెల్యేనా. తిరువూరు ఇంఛార్జ్ పార్టీలో క్యాడర్ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. అందుకే మా క్యాడర్ నుంచి రియాక్షన్ వచ్చింది. కొంతమంది వ్యక్తులు తమకు బాధ్యతలు అప్పగించారని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. నేను రెండు సార్లు ఎంపీగా గెలిచా. రతన్ టాటా స్థాయి వ్యక్తిని నేను. బెజవాడ పేరు చెడగొట్టకూడదనే ఓపిక పట్టా. రాబోయే పరిణామాలు దేవుడు ..ప్రజలే చూసుకుంటారు’అని నాని అన్నారు. స్పందించిన చిన్ని తిరువూరు ఘటనపై కేశినేని చిన్ని స్పందించారు. తిరువూరు ప్రజలకు క్షమాపణలు చెబుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే.. ఇవాళ జరిగిన తిరువూరు గొడవను అధిష్టానం చూసుకుంటుందని అన్నారాయన. ఇదీచదవండి..రణరంగంగా నాని వర్సెస్ చిన్ని -
రణరంగంగా నాని వర్సెస్ చిన్ని.. జనసైనిక్స్ ఆగ్రహం!
ఎన్టీఆర్, సాక్షి: అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగానే తీవ్రస్థాయిలో బయటపడింది. బుధవారం తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని-కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ క్రమంలో.. అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు. ఈ పరస్సర దాడిలో ఎస్సై సతీష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సమన్వయ భేటీ జరగ్గా.. దానికి జనసేన కార్యకర్తలు సైతం హజరయ్యారు. అయితే అక్కడ కేశినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు. అయితే అందులో పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండడంతో జనసైనికులు నొచ్చుకున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్‌ఛార్జి దత్తుపై నాని వర్గీయుల దాడి చేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సర్దుమణగలేదు. చివరకు ఎస్సై తలకు గాయం కావడంతో.. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుండానే టీడీపీ ముఖ్యనేతలు అక్కడి నుంచి జారుకున్నారు. -
టీడీపీలో దుమారం రేపిన కేశినేని నాని వ్యాఖ్యలు
విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో మరోసారి దుమారం రేపాయి. తన సోదరుడు చిన్నాతో పాటు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారు. ఓ వైపు తనతో పాటు తన వర్గాన్ని ప్రమోట్ చేసుకుంటూ సొంత పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజవర్గంలో తన కుమార్తె శ్వేత పోటీ చేయడం లేదని చెప్పారు. కొన్ని కబంధ హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గానికి విముక్తి చేయడానికే తాను ఇంఛార్జ్‌గా వచ్చానని తెలిపారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని తాను సహించనని కేశినేని నాని హెచ్చరించారు. మేం ఏలుకుంటాం.. దోచుకుంటాం అంటే ఊరుకునేది లేదన్నారు. తాను ఎవరి చీకటి వ్యాపారాల్లో వాటాదారుడిని కాదని అన్నారు. అందుకే వాళ్లతో తనకు పడదని చెప్పారు. తాను వెళ్లిపోతే విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు దోచుకోవచ్చనేదే వారి అజెండా అని తీవ్రంగా విమర్శించారు. తాను తినను.. ఎవ్వరీని తిననివ్వను.. అనేదే వాళ్ల బాధని పరోక్షంగా విమర్శలు చేశారు. కేశినేని నాని అనే వ్యక్తి ఎంపీగా లేకపోతేనే వాళ్లకు సంతోషమని అన్నారు. చదవండి: Tuni TDP Clashes: తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ -
‘కాల్‌మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించేవాళ్లు బీసీలు కాదు’
బెజవాడలో తెలుగుదేశం బజారున పడింది. పార్టీ ముఖ్యనేతలు రోడ్డున పడి టికెట్ల కోసం విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబు పెంచి పోషించిన ముఠాలే ఈ వైపరీత్యాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం పార్టీలో చంద్రబాబు ఒక వర్గం, లోకేష్ మరో వర్గం నడుపుతున్నారు. టికెట్ల విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయం అని చెప్పినా.. నాయకులంతా లోకేష్ చుట్టే తిరుగుతున్నారు. ఈ పరిస్థితే.. పార్టీలో చిక్కులు తెచ్చి పెడుతోంది. విజయవాడ: మరోసారి సైకిల్ పార్టీ పంచాయతీ రోడ్డెక్కింది. సొంతపార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్న బుద్ధా వెంకన్నను టార్గెట్ చేస్తూ ఎంపీ కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుద్ధా వెంకన్న విజయవాడ ఎంపీ టికెట్ ఈసారి తనదేనని ధీమాలో ఉన్న సమయంలో ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం సొంతపార్టీలో అగ్గికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ను ఆహ్వానిస్తున్నా ‘విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ను నేను ఆహ్వానిస్తున్నా. కాల్‌మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించేవాళ్లు బీసీలు కాదు. నీతి, నిజాయితీ, మచ్చలేని వ్యక్తులే అసలైన బీసీలు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్, గూండాగిరి చేసేవాళ్లు బీసీల కిందరారు. భూకబ్జాలు చేసేవాళ్లు, జనాలను హింసించిన వాళ్లు బీసీలు కాదు. పార్టీకోసం కష్టపడిన నిఖార్సైన బీసీలు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి టిక్కెట్లిస్తే సంతోషిస్తా. నిరుపేదలైనా కాళ్లకు దండం పెడతాం’ అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు. విజయవాడ టీడీపీ ఎంపీ సీటుపై ముసలం విజయవాడ ఎంపీ టికెట్‌ను బీసీలకు ఇవ్వాలనే డిమాండ్‌ను బీసీ సంఘాలు తెరపైకి తీసుకొచ్చాయి. ఇక్కడ ఏ పార్టీ పోటీ నుంచి ఆభ్యర్థి అయినా బీసీ నేతే ఉండాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్‌ను బుద్ధా వెంకన్న ఆశిస్తున్న సందర్భంలో ఇలా కేశినేని నాని.. వ్యాఖ్యానించడం ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాల తీవ్రతకు అద్దం పడుతోంది. తన సీటుకే ఎసరు పెడుతుండటంతో కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలను చేయడం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. బీసీలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఆహ్వానిస్తున్నా అంటూనే సదరు అభ్యర్థి బాధ్యత తానే తీసుకుంటానని కూడా కేశినేని నాని వ్యాఖ్యానించడంతో బుద్ధా వెంకన్న చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టాలనేది కేశినేని ప్లాన్‌లో భాగమేనా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
టీడీపీ ఎంపీ సీటుపై బుద్దా వెంకన్నపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
-
విజయవాడ టీడీపీ ఎంపీ సీటుపై ముసలం
-
కేశినేని తిరుగుబాటు..?
-
టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. పచ్చ బ్యాచ్‌కు చుక్కలే!
రౌండప్ చేసి ఇబ్బంది పెడితే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను అంటాడు మహేష్ బాబు ఓ సినిమాలో. ఇప్పుడు బెజవాడ ఎంపీ కేశినాని కూడా మహేష్ బాబులా తయారయ్యాడు.. కన్ఫ్యూజన్లో దొరికిన వాళ్ళందర్నీ కెలుక్కుంటూ పోతున్నాడు. అవును బెజవాడ పండుగాడు కేశినేని నానితో అదే పెద్ద తిరకాసు.. ఆయన మానాన ఆయన్ను వదిలేస్తే పర్లేదు. విజయవాడ ఎంపీగా తన పనేదో తాను చేసుకుని పోయే రకం. అందరితో పులిహోరా కలుపుకుని పోయే రకం కాకున్నాపెద్దగా ఎవర్నీ ఇబ్బంది పెట్టే తత్త్వం లేకుండా ఉన్నంతలో అలా సాగిపోయే టైప్ నాయకుడు. అలాంటి మనిషిని కేవలం తనకు అలవిమాలిన చంచాగిరి చేయడం లేదని, సొంతంగా, వ్యక్తిగతంగా ఇమేజి బిల్డప్ చేసుకుని వెళ్తున్నాడు అనే కారణం చూపించి తన అనుయాయులు.. ప్రజల్లో ఇమేజి లేని వాళ్ళను పోగేసి చుట్టూరా రౌండప్ చేసి ఆయన్ను తరచూ డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్నారు. విజయవాడ లోకసభ నియోజకవర్గం పరిధిలోని విజయవాడ వెస్ట్ (జలీల్ ఖాన్- బుద్ధా వెంకన్న) సెంట్రల్ (బోండా ఉమా) విజయవాడ ఈస్ట్ (గద్దె రామ్మోహన్) ఇంకా సిటీ పక్కనున్న నందిగామ (తంగిరాల సౌమ్య) నియోజకవర్గాల్లో నానికి ఇబ్బందులు కలిగించేలా చంద్రబాబు ఏర్పాట్లు చేసేసారు. ఈ నాయకులంతా పనిగట్టుకుని ఓ వర్గంలా ఏర్పడి సిట్టింగ్ ఎంపీకి ఇబ్బందులు కలిగించడమే లక్ష్యంగా పని చేస్తుంటారు. నగరంలో ఉంటున్న కేశినేని నానిని కాదని హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకుంటున్న ఆయనను తమ్ముడు చిన్నిని విజయవాడ తీసుకొచ్చి ఆయనకు వ్యతిరేకంగా.. పోటీగా నాయకుడిగా తయారు చేస్తున్నారు. అయినా లెక్క చేయని నాని తన కుమార్తే శ్వేతను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని చూస్తున్నారు. అసలు తండ్రికే విజయవాడలో చోటులేకుండా చేద్దాం అనుకున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు ఆయన కూతుర్ని రానిస్తారా? ఖచ్చితంగా రానివ్వరు.. అలాగని నా రాత ఇంతే.. నా ప్రాప్తం ఇంతే అని ఊరుకునే రకం కాదు నాని. తనను ఇబ్బంది పెడుతున్న ఎవరూ నిద్రపోరాదు అనే కాన్సెప్ట్ మీద ఉంటూ విజయవాడ, చుట్టూ ఉన్న నియోజకవర్గాలను కెలుక్కుంటూ పోతున్నారు. మొన్న నందిగామ వైస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కబుర్లు, కుశల ప్రశ్నలు అయ్యాక ఆయన్ను మెచ్చుకుంటూ రెండు మాటలు చెప్పేసి నందిగామ టీడీపీలోకి ఓ నిప్పు పుల్ల విసిరేశారు. అదిప్పుడు రాజుకుంది. విజయవాడ తెలుగదేశం రాజకీయాలు రోడ్డున పడ్డాయి.గొట్టం గాళ్ళు అందరూ బయటకు వచ్చారు.@JaiTDP @IamBondaUma @kesineni_nani pic.twitter.com/kH8zKmLv9l— varra Raveendra reddy (@varra1987) June 9, 2023 వాస్తవానికి నందిగామ మొదటి నుంచీ కమ్మల ప్రాబల్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం. దేవినేని వెంకట రమణ , ఆయన సోదరుడు దేవినేని ఉమా (ఇద్దరూ టీడీపీలో మంత్రులుగా చేసారు). కానీ ఆ తరువాత అది ఎస్పీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో అక్కడ గతంలో టీడీపీ నుంచి తంగిరాల ప్రభాకర్ (2014-2019) గెలుపొందారు. ఆయన అకాలమరణంతో ఆయన కుమార్తె సౌమ్యను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా చేశారు. ఆ తరువాత 2019లో మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా(వైఎస్సార్సీపీ) గెలిచారు. అయితే, ఇప్పుడు నాని అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేతో రాసుకుపూసుకు తిరగడంతో టీడీపీ ఇంచార్జ్ సౌమ్యకు చిరాకు.. చికాకు కలిగింది. దీంతో ఆమె తన అనుచరులతో పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో నానిని నైతికత లేని నాయకుడిగా పేర్కొంటూ పోస్టులు పెట్టిస్తున్నారు. ఇక నాని వర్గం.. ముదురు టెంకలు ఉన్న విజయవాడనే కెలికేసారు.. సౌమ్యను వదులుతారా..? అదే జోరుతో ఆమెను సైతం ట్రోల్ చేస్తూ పోతున్నారు. మొత్తానికి నాని దెబ్బకు నందిగామ టీడీపీలో నిప్పు రవ్వలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: తొంగి చూసినట్లే ఈనాడు రాతలు!..మరి వాటికీ సమాధానాలు చెప్పొచ్చుగా? -
పార్లమెంట్ పరిధిలో ఉన్న గొట్టంగాళ్ల కోసం నేను పనిచేస్తున్నా..
-
టీడీపీ అధిష్టానంపై కేశినేని నాని ఫైర్
-
టీడీపీ అధిష్టానంపై మరోసారి కేశినేని నాని ఫైర్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని నాని మరోసారి మండిపడ్డారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని, విజయవాడ టీడీపీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా పిలవలేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ పరిధిలో గొట్టం గాళ్ల కోసం కూడా తాను పనిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయి’’ అని పేర్కొన్నారు. ‘‘వేరే పార్టీ ఆఫర్లు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నాకు 100 శాతం మండితే అపుడు దానిపై ఆలోచిస్తా. అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో నాకు తెలియదు. బాబు ఢిల్లీ వెళ్తున్నారు రావాలని చంద్రబాబు పీఏ ఫోన్ చేస్తే వెళ్లాను’’ అని కేశినేని అన్నారు. చదవండి: బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు? మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు టార్గెట్‌గా నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నన్ను మున్సిపల్ ఎన్నికల సమయంలో గొట్టంగాడు, చెప్పుతో కొడతా అన్నారు. అలాంటి గొట్టం గాళ్ల ఫోటోలు కూడా కేశినేని భవన్ బిల్డింగ్ ఫోటో మీద వేశాం. పార్టీ పేరుతో ఉన్న కేశినేని భవన్ నుంచి బెజవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవ చేస్తున్నా. నేను ఇక్కడ నుంచి పని చేస్తున్నా ఇంకా నేను ఎందుకు స్పందించాలి’’ అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు. -
బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు?
ఆయనో సీనియర్ ఎంపీ. పార్టీ అధినేత దగ్గర్నుంచి.. ముఖ్యనేతల వరకూ అందరికీ కొరకరాని కొయ్యగా మారారు. దీంతో నిన్నా.. మొన్నటి వరకూ అందరూ కలిసి ఆయన్ను టార్గెట్ చేశారు. ఎంపీకి తెలియకుండానే ఆయనకు ఎర్త్ పెట్టే ప్లాన్లు అమలుచేస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయనే రివర్స్ ఎటాక్ చేస్తుండటంతో పచ్చ పార్టీలో కలవరం మొదలైందట. ఇంతకీ సైకిల్ పార్టీ అధినేతని.. ఆ పార్టీ నేతలను కంగారు పెడుతున్న ఆ ఎంపీ ఎవరు? బెజవాడ రాజకీయాల్లో తనకు తాను ఓ బ్రాండ్ గా చెప్పుకునే వ్యక్తి ఎంపీ కేశినేని నాని. రెండోసారి ఎంపీగా గెలిచినప్పటినుంచీ పార్టీ అధినేతతో, కొందరు లోకల్ లీడర్లతో కేశినేనికి గ్యాప్ ఏర్పడిందనే టాక్ నడిచింది. దీంతో నానికి సీటు గల్లంతయ్యేలా అక్కడి నాయకులు, పార్టీ అధినేత చంద్రబాబు కూడా పావులు కదుపుతున్నారు. కొన్నాళ్ల పాటు సహించిన కేశినేని నాని.. సైలెంట్‌గా ఉంటే ఇక తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారనే ఆలోచనతో రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కేశినేని నాని తీరుతో సొంత పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయిందట. ఇటీవల కాలంలో ఏ ఇద్దరు తెలుగు తమ్ముళ్లను కదిపినా కేశినేని వ్యవహారశైలి పైనే గుసగుసలాడుకుంటున్నారని చెబుతున్నారు. ఎంపీ తీరు నచ్చని చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టాలనే ఆలోచనలో భాగంగా అతని సోదరుడు కేశినేని శివనాధ్ అలియాస్ చిన్నిని తెరపైకి తెచ్చారని టాక్. పెద్దబాబు, చినబాబు మద్దతు ఉండటంతో ఇక కేశినేని చిన్ని సొంత అన్నకే పోటీగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధినాయకుల మద్దతుతో ఎంపీ వర్గాన్నంతా తన వైపు లాగేసుకుంటూ వస్తున్నారట. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ వస్తున్న నాని కామ్ గా ఉంటే తన సీట్‌కు ఎసరు పెట్టేస్తారనే ఫీలింగ్ కి వచ్చి.. కొద్దిరోజులుగా పార్టీ నేతలతో పాటు అధినేతను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారని బెజవాడ తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తన పంచ్ డైలాగ్ లతో నేరుగా పార్టీకి, అధినేతకు ఝలక్ ఇచ్చారని పార్టీ నాయకులే చెబుతున్నారు. లోఫర్లకు , డాఫర్లకు టిక్కెట్లివ్వొద్దని పార్టీ అధినేతకి నేరుగా సూచించారు. ఈ కామెంట్స్ తన సోదరుడు కేశినేని శివనాధ్ ను ఉద్ధేశించే చేశాడని బెజవాడలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు పచ్చ పార్టీని మరింత ఇరుకున పెట్టేలా మారాయట. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేశినేని నాని.. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును ప్రశంసించారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడి పనితీరు బాగుందంటూ కితాబిచ్చారు. అభివృద్ధి విషయంలో తాను భేదాలను చూడనని, పార్టీ ఫీలింగ్ కేవలం ఎన్నికలప్పుడే అని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొండితోక బ్రదర్స్‌పై పదే పదే విమర్శలు చేస్తున్న నందిగామ టీడీపీ నేతలకు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. నందిగామతో సరిపెట్టకుండా.. తాజాగా మైలవరంలోనూ కేశినేని నాని తన పంచ్ డైలాగ్ లతో పార్టీ నేతలను కంగారు పెడుతున్నారు. చదవండి: వక్రీకరణ రాతల్లో ఈనాడును కొట్టేవారు లేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తనకంటూ ఓ ట్రాక్ రికార్డ్ ఉందని..ఈసారి బెజవాడ ఎంపీ టిక్కెట్‌ను ఏ పిట్టలదొరకు ఇచ్చినా తననేం చేయలేరంటూ కామెంట్ చేశారట. తన అభిప్రాయాలతో ఏకీభవించేవారితో కలిసి నడిచేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని.. ప్రజలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలిచే సత్తా తనకుందంటూ బాంబ్ పేల్చారట. కేశినేని నాని చేసిన ఇండిపెండెంట్ కామెంట్స్‌పై బెజవాడ దేశంలో ఓ రేంజ్లో చర్చ సాగుతోందట. నాని పార్టీ నేతలను అలర్ట్ చేశారా.. లేక టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాననే సంకేతాలిచ్చారా అనే విషయం అర్థం కాక కొందరు నేతలు తల బాదుకుంటున్నారట. బెజవాడ ఎంపీ పచ్చ పార్టీ అధినేత చంద్రబాబుకు ముందు ముందు ఇంకెన్ని సిత్రాలు చూపిస్తారో? -సత్యానందరెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్ చదవండి: కోడెలకు అన్యాయం చేస్తున్నారు -
టీడీపీలేదు తొక్కాలేదు..అంటున్న కేశినేని !
-
మరోసారి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి కేశినేని నాని పరోక్షంగా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. ఎంపీగా టీడీపీ ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. తను ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజలు కోరుకుంటే గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు భయం లేదని కేశినేని నాని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో పార్టీలతో సంబంధం లేదని అన్నారు. ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకేనని పేర్కొన్నారు. కాగా టీడీపీ తరపున విజయవాడ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు ఎంపీ కేశినేని నాని. అయితే 2019లో రెండోసారి గెలిచిన తరువాత ఆయనకు పార్టీకి మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని సమయం దొరికినప్పుడల్లా తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల -
తిరువూరులో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు : ఎమ్మెల్యే రక్షణనిధి
-
బెజవాడ టీడీపీకి ఏమైంది?.. మళ్లీ కొత్త రగడ!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉందంటే ఉందని అనుకోవడమే గాని.. అక్కడ 1983 తర్వాత పచ్చ జెండా ఎగిరింది లేదు. వామపక్షాలతో పొత్తు కుదిరినపుడు గెలిస్తే సీపీఐ అభ్యర్థి.. లేదంటే అప్పట్లో కాంగ్రెస్ నేతలు గెలిచేవారు. గత రెండుసార్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండానే పశ్చిమలో ఎగురుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇప్పుడు పచ్చ పార్టీలో పంచాయతీ నడుస్తోంది. పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ కేశినేని నానితో లోకల్ లీడర్లకు అసలు పడటంలేదు. చాన్నాళ్లుగా ఈ గొడవ పచ్చ పార్టీలో నడుస్తూనే ఉంది. రాబోయే ఎన్నికల్లో బెజవాడ వెస్ట్ టిక్కెట్ అభ్యర్థి విషయంలో ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబును కలవడంపై ఇప్పుడు కొత్తగా రగడ మొదలైందట. 1983 తర్వాత పశ్చిమ సీటును మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ జెండా ఈసారి ఎలాగైనా ఎగరేయాలని చంద్రబాబు కలగంటున్నారట. తమ్ముళ్లే కుమ్మేసుకుంటున్నారు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి కేశినేనికి బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో పడటంలేదని టాక్. వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయి... మూడున్నరేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయట పశ్చిమ పార్టీలో పరిస్థితులు. కొన్నాళ్లుగా తన సోదరుడు కేశినేని శివనాధ్ పార్టీలో యాక్టివ్ కావడంతో కేశినేని నాని ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ అధినేత తనకు అధికారం ఇవ్వడంతో ఈ సెగ్మెంట్లో దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. నాని ట్రావెల్స్‌కు స్టాప్ లేదా? తనతో ఒకప్పుడు టచ్ లో ఉన్న నేతలందరినీ కలుపుకుని పోతూ ఇటీవల వరుసగా కార్యక్రమాలు చేస్తూ హడావిడి చేస్తున్నారట కేశినేని నాని. ఈ క్రమంలో వయోభారంతో మొన్నటి వరకూ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న జలీల్ ఖాన్ సైతం ప్రస్తుతం యాక్టివ్ అయ్యారు. జలీల్‌ఖాన్ ఇప్పుడు కేశినేని నాని వెంట తిరుగుతుండటంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మూలన ఉన్న నేత బయటకు రావడం వరకు బానే ఉంది. అయితే తాజాగా కేశినేని నాని తన అనుచరుడైన ఎం.కె.బేగ్ ను వెంటబెట్టుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లడంతో పశ్చిమ టీడీపీలో కొత్త చిచ్చు రాజేసిందట. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు వెళ్లిన కేశినేని నాని ఈసారి పశ్చిమ టిక్కెట్టు ఎం.కె. బేగ్ కు ఇవ్వాలంటూ చంద్రబాబును కోరినట్లు సమాచారం. చదవండి: ఏది నిజం ?: సీబీఐ నుంచి రామోజీ ‘లై’వ్ రిపోర్టింగ్ నాలుగో కృష్ణుడి ఎంట్రీ ఈ విషయం బయటికి తెలియడంతో ఇప్పుడు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో పాటు జలీల్ ఖాన్ కూడా నాని పై గుర్రుగా ఉన్నారట. గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా తన కుటుంబానికే సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న జలీల్ ఖాన్ కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదట. విదేశాల్లో ఉంటూ ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి హడావిడి చేసే ఎం.కె.బేగ్ కు టిక్కెట్ ఇవ్వాలని నాని అడగటంపై లోలోన ఉడికిపోతున్నారట. నిన్న మొన్నటి వరకూ కేశినేని నాని అంటే పీకల్లోతు కోపం ఉన్న బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాల సరసన ఇప్పుడు జలీల్ ఖాన్ కూడా చేరిపోయారన్న చర్చ జరుగుతోంది. ఇక వెస్ట్ తమ్ముళ్లు మాత్రం ఇప్పటికి ముగ్గురు కృష్ణులు అయిపోయారు ... ఇక నాలుగో కృష్ణుడు వచ్చాడంటూ సెటైర్లు వేసుకుంటున్నారట. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
విజయవాడ పశ్చిమలో టీడీపీ నాలుగు స్తంభాలాట
సాక్షి, కృష్ణా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అధినేత మరో నాయకుడికి రంగప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నాయకులతో మూడుముక్కలాట ఆడిస్తున్న చంద్రబాబు.. తాజాగా నాలుగు స్తంభాలాటకు తెరతీయిస్తున్నారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని)కు పశ్చిమ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి అక్కడి నాయకుల మధ్య పొగ ఆరనీయకుండా నిప్పు రాజేస్తూనే ఉన్న బాబు తాజాగా ఎం.ఎస్. బేగ్‌ను రంగంలోకి దించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా కేశినేని, బేగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను వెంటపెట్టుకెళ్లి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించారు. ఈ సందర్భంగా బేగ్‌కు బాబు బలమైన హామీ ఇచ్చారనే చర్చ నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో జరుగుతోంది. ఎంపీ కేశినేని నానికి పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు ఓ వర్గంగా వ్యవహరిస్తూ ఎంపీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నది బహిరంగ రహస్యమే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పతాకస్థాయికి చేరిన రగడ ఎప్పటికప్పుడు రగులుకుంటూనే ఉంది. ఇటీవలే కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపే వారు, భూ కబ్జాదారులు, రౌడీలు నగరంలో నాయకులుగా చెలామణి అవుతామంటే ససేమిరా అంగీకరించేది లేదంటూ బుద్దా, మీరా, బొండా తదితర నేతలను ఉద్దేశించి ఎంపీ పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కేశినేని వైపే మొగ్గుచూపుతుండేవారు. కొన్ని నెలల కిందట ఎంకే బేగ్ కార్యాలయాన్ని నాని ప్రారంభించినప్పటి నుంచి జలీల్‌ఖాన్ కూడా ఎంపీ పట్ల గుర్రుగా ఉంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో జలీల్ కుమార్తె షబానాఖాతూన్ టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పర్యాయం కూడా తమ కుటుంబానికే టికెట్టు దక్కుతుందనే ఆశలో ఉన్న జలీల్‌ఖాన్‌కు ఆదివారం నాటి పరిణామాలు మింగుడుపడనీయడం లేదని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. నాలుగు పర్యాయాలు పోటీ చేసినా.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, జనరల్ అభ్యర్థిగా ఎం.ఎస్.బేగ్ తండ్రి ఎం.కె. బేగ్ 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో పోటీచేసి మూడు పర్యాయాలు సీపీఐ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. 1989లో మాత్రమే బేగ్ విజయం సాధించారు. చంద్రబాబును కలిసిన బేగ్.. విదేశాల్లో ఉంటూ రాజకీయాల్లో తనవంతు ప్రయత్నాలు ఎన్నికల వేళ కొనసాగిస్తుంటారనే గుర్తింపు ఉంది. గత ఎన్నికలప్పుడు కూడా విభిన్న పార్టీల నుంచి టికెట్‌ను ఆశించినట్లు స్థానిక నాయకులు గుర్తు చేస్తున్నారు. -
పచ్చపార్టీలో గ్రూపు రాజకీయాలు.. అధినేత ఆందోళన!
అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రం.. అందులోనూ గ్రూప్ రాజకీయాలు.. వర్గ విభేదాలు. పాతాళానికి పడిపోయిన పార్టీతో అధినేత ఆందోళన చెదుతుంటే.. వ్యక్తిగత ఆరోపణలతో నేతలు రోడ్డెక్కుతున్నారు. ఆ జిల్లా.. ఈ జిల్లా అని కాదు.. అన్ని చోట్లా టీడీపీ పరిస్థితి ఇలానే ఉంది. పచ్చపార్టీ నేతలు గ్రూప్‌లు కట్టి మరీ కొట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.. విభేదాలతో టీడీపీ నాయకులు రోడ్డెక్కుతున్నారు.. ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. నేతలు కలహాలతో పార్టీ పరువు బజారున పెడుతున్నారు. పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి నేతలు నువ్వు ఎంత అంటే నువ్వు ఎంతని ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చక్కదిద్ద లేక నాయకులకు సర్ది చెప్పలేక చంద్రబాబు చివరికి నిస్సహాయుడిగా మిగిలిపోతున్నారు. ఒకప్పుడు పార్టీ కేడర్‌ను కంటిచూపుతో శాసించిన చంద్రబాబు మాటను ఇప్పుడు ఎవరూ లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదు.. మీ దారి మీదే మా దారి మాదే అన్నట్లు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.. పార్టీ కంటే వర్గ ప్రయోజనాలే ముఖ్యమనే ధోరణిలో పచ్చనేతల తీరు ఉంది. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, బుద్ధ వెంకన్న రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఒక వర్గం పై మరొక వర్గం నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ గాళ్లకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత నిస్తున్నారని నాని మీడియా ముందు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.. కొంతమంది పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.. పార్టీ కోసం ఎవరూ పనిచేయడం లేదని, మీడియా ముందు కెమెరాలకు ఫోజులు ఇస్తుంటారని నాని మండిపడ్డారు.. చివరకు తమ స్వార్థం కోసం తమ కుటుంబ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని కొంతమంది ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.. నాని కామెంట్స్‌పై బుద్దా వెంకన్న కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తమను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొంతమంది వ్యవహరిస్తున్నారని నానిని ఉద్దేశించి మాట్లాడారు.. బీసీలను పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.. అటు విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాస రావుల మధ్య వైరం మరోసారి మొదలైంది. ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయ్యారు.. ఎన్నికల సమీపిస్తుండడంతో మళ్లీ గంటా యాక్టీవ్ అయ్యారు.. గంటాపై మరోసారి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో రెచ్చిపోయారు.. గంటా ఎవడండి లక్షల్లో ఒకడు అంటూ ఆవేశంగా మాట్లాడారు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంట్లో దాక్కొని ఎన్నికలు వస్తుండడంతో మళ్లీ పుట్టలో పాముల్లా బయటకు వస్తున్నారని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడని వాడు ఏం నాయకుడని గంటాను ప్రశ్నించారు. గంటా కూడా అయ్యన్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చేందుకు తన అనుచరులతో సిద్ధమవుతున్నారట. తాను సొంత కుటుంబ సభ్యులకి అయ్యన్నలా వెన్నుపోటు పోడవలేదని అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని కొడుకుల కోసం సీట్లు అడగలేదని గంటా వర్గం అయ్యన్నపై విమర్శలు చేస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నాయకులు ఎక్కడికక్కడ గ్రూపులుగా విడిపోయి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే అంతంత మాత్రమంగా ఉన్న టీడీపీని ఈ గ్రూపు రాజకీయాలు మరింత పాతాళానికి తొక్కేస్తాయని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చంద్రబాబుకు పార్టీ మీద రోజురోజుకీ పట్టు సడలిపోతుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ కేడర్ నుంచి వ్యక్తమవుతోంది. -
వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు పార్టీలతో పనిలేదని.. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. చంద్రబాబు టికట్ ఇవ్వకుంటే ఏమవుతుంది అంటూ ప్రశ్నించారు. ఈమేరకు ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని. నన్ను.. నా పర్సనాల్టీని డీగ్రేడ్ చేయాలని చూడొద్దు. నన్ను డీ-గ్రేడ్ చేయాలని చూస్తే.. అంతగా నా పర్సనాల్టీ పెరుగుతుంది. 2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవి. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో నేను టీడీపీలో చేరాను. నేను 2013లో టీడీపీలో చేరాకే వైసీపీలోకి వలసలు ఆగాయి. టాటా ట్రస్టుతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాను అని చెప్పారు. కేశినేని చిన్నిపై సెటైర్లు తన సోదరుడు కేశినేని చిన్నిపై ఎంపీ నాని సెటైర్లు వేశారు. వంద చీరలు.. పది ట్రై సైకిళ్లు పంచి కొందరు దానకర్ణుడిలాగా కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ దాన కర్ణుల చరిత్రేంటో..? ఎక్కడి నుంచి ఊడిపడ్డారో చరిత్ర చూడండి అని కోరారు. 'ఎన్నికలనగానే వస్తారు.. ఫౌండేషన్ అంటారు.. సేవా కార్యక్రమాలంటారు. వీరికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయో ఇన్వెస్టిగేట్ చేయండి. పార్టీలో పేదోళ్లకు డబ్బులిస్తారు.. జిందాబాద్‌లు.. జైజైలు కొట్టించుకుంటారు.. ఇదేనా రాజకీయం. ఓ చిన్న మాట కోసం నా వ్యాపారాలు వదిలేసుకున్నా. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, సెంట్రల్ ఇండియాలో బస్సుల వ్యాపారంలో నేను కింగ్. ఎంపీగా మాట్లాడుతున్నారా..? ఆపరేటర్‌గా మాట్లాడుతున్నారా..? అన్నందుకు నేను వ్యాపారం వదిలేసుకున్నాను. లోఫర్లు.. ల్యాండ్ గ్రాబర్లు వచ్చి ఏదో చేస్తే.. ప్రొజెక్షన్ ఇస్తున్నారు అని మండిపడ్డారు. -
టీడీపీపై కేశినేని నాని హాట్ కామెంట్స్
-
టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుల మధ్య మరోసారి వార్
-
Viajayawada: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
‘‘క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సీటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తా... కానీ భూకబ్జాదారులు, దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్లు, చార్లెస్ శోభరాజ్ లు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లు, కాల్‌మనీ సెక్స్ రాకెట్, పేకాట క్లబ్‌లు, నడిపేవారికి మద్దతు ఇవ్వను’’... ఇవన్నీ ఎన్టీఆర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు... సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ రోజు టీడీపీలో సంకుల సమరం ఊపందుకుంది. కొన్నేళ్లుగా ఆధిష్టానం తీరుపై మండిపడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈసారి ఏకంగా టికెట్ల పంచాయితీనే తెరపైకి తెచ్చారు. తన తమ్ముడు కేశినేని చిన్నితో పాటు, మరో ముగ్గురు, నలుగురికి టికెట్లు ఇవ్వటానికి వీల్లేదని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ జాబితాలో మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా, విజయవాడ పశ్చిమ నియోజక వర్గ నేత బుద్ధా వెంకన్న, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉండటం గమనార్హం. తద్వారా విజయవాడలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కేశినేని నాని చెప్పడం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇటీవల మైలవరంలో దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్లు చేశారు. ఆయనతో పాటు కొంతమంది పార్టీకి దూరంగా ఉండి కొత్తవారికి అవకాశం ఇస్తే బెటరనే కామెంట్లు చేశారు. నాలుగు సార్లు గెలిచానని విర్రవీగొద్దని దేవినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్టు ఇస్తే ఓడిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ వేడి తగ్గక ముందే తీవ్రస్థాయిలో తన తమ్ముడు చిన్నితో పాటు, మరో నలుగురికి పార్టీ టికెట్లు ఇవ్వవద్దంటూ అధిష్టానం పెద్దలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ప్రత్యర్థుల మీద, అధిష్టానం మీద ఆఫ్ ద రికార్డుగా కాకుండా ఆన్ రికార్డుగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వటం ప్రస్తుతం ఆ పారీ్టలో చర్చనీయాంశంగా మారింది. లోకేష్‌కు కౌంటర్ స్టేట్మెంట్? తాను విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి పోటీచేస్తానని బుద్ధా వెంకన్న ప్రకటించిన కొన్ని రోజులకే ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇవ్వడం ప్రా«ధాన్యత సంతరించుకొంది. లోకేష్ అండతోనే బుద్ధా వెంకన్న ఆ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయం తెలిసి కూడా బుద్ధా వెంకన్నకు టికెట్టు ఇవ్వటానికి వీల్లేదని చెప్పడం, మరోవైపు తన తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తున్న లోకేష్‌కు పరోక్షంగా కేశినేని నాని కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టయింది. తనకో క్లారిటీ ఉందని కరప్షన్ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, జీవితంలో ఎవరినీ మోసం చేయలేదని కేశినేని నాని చంద్రబాబుకు సైతం పరోక్షంగా చురకలంటించారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో టీడీపీని స్థాపించారని, ఆ ఆశయంతో పనిచేసేవారు చేయొచ్చునని, కాదని ఇలాంటి వారికి సీట్లు ఇస్తే పారీ్టకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీని ప్రక్షాళన చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేయడం పార్టీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పక్కా వ్యూహంతోనే... పక్కా వ్యూహంతోనే ఎంపీ కేశినేని నాని పార్టీపై తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు, లోకేష్ నుంచి కనీసం ప్రతిస్పందన లేకుండా పోయింది. లోకేష్ అండతో హడావుడి చేస్తున్న ఆ నలుగురు కూడా కిమ్మనకుండా ఉండటం గమనార్హం. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఎంపీ కేశినేని నాని ఈ దాడిని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో పార్టీలో నేతల మధ్య మరింత అంతరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను బట్టి టీడీపీలో మున్ముందు వర్గపోరు మరింత బజారున పడే అవకాశాలు స్పష్టంగా కనిసిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుల మధ్య మరోసారి వార్