transport
-
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది
భిన్న జీవనం జెలజ కుటుంబం ఇంట్లో కంటే రోడ్డు మీదే ఎక్కువగా ఉంటుంది. జెలజ ట్రక్ డ్రైవర్. భర్తకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. తొలత గృహిణిగా ఉన్న జెలజ మెల్లగా డ్రైవింగ్ నేర్చుకుంది. లోడు దించేందుకు కుటుంబంతో బయలుదేరి కొత్త ప్రాంతాల వీడియో చేస్తుంది. ఆమె కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ తోలింది. కూతురు తల్లితోపాటు డ్రైవింగ్ నేర్చుకుంది. ‘పుతట్టు ట్రావెల్ వ్లోగ్’ పేరుతో ఈ కుటుంబ యానం లక్షల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించింది. ఉదాహరణకు జెలజ జీవితం ఇలా ఉంటుంది. ఆమె కేరళలోని కొట్టాయం నుంచి ప్లైవుడ్ లోడ్ తీసుకుని పూణెలో డెలివరీ చేస్తుంది. కాని ఖాళీ ట్రక్కు వెనక్కు తెస్తే నష్టం. ‘ఉల్లిపాయల లోడు కశ్మీర్లో దింపుతారా’ అని పూణెలో అడుగుతారు. ‘దింపుతాను’ అని బయలుదేరుతుంది. కశ్మీర్ చేరుకుంటుంది. అక్కడ లోడ్ దొరకదు ఒక్కోసారి. ఢిల్లీ, హర్యాణ దాకా వచ్చే లోడ్ దొరుకుతుంది. ఏదో ఒక సరుకు కేరళకు దింపే బుకింగ్ వస్తుంది. ఆ లోడు తీసుకుని కేరళ చేరుకుంటుంది. ‘కేరళలో ప్రతి సంవత్సరం జారీ అవుతున్న డ్రైవింగ్ లైసెన్స్‌లలో 40 శాతం స్త్రీలవి. టూ వీలర్లు కార్లు సరే... బస్సులు కూడా కేరళలో నడుపుతున్నారు స్త్రీలు. కాని ట్రక్కు నడిపే స్త్రీలు చాలా అరుదు. అందుకే జెలజ ను చూసి అందరూ గౌరవిస్తారు’ అంటాడు రతీష్. అతడు జెలజ భర్త. ఆమె లాంగ్ డ్రైవ్‌కి బయలుదేరితే చాలాసార్లు తోడు ఉంటాడు. ఒక్కోసారి పెద్దకూతురు, భార్య డ్రైవ్ చేస్తుంటే వారికి తోడు వస్తాడు. అతను స్వయంగా డ్రైవరు. కాని తన కుటుంబ స్త్రీలు హైవేలను జయిస్తూ ఉంటే సంతోషపడతాడు. గృహిణి నుంచి డ్రైవర్‌గా రతీష్ 2003 వరకూ ఒక సాధారణ ట్రక్ డ్రైవర్. ఆ సంవత్సరం ఆరు లక్షలు లోన్ తీసుకుని ఒక భారత్ బెంజ్ ట్రక్ కొన్నాడు. కలిసొచ్చింది. తన సోదరుడితో కలిసి ఇప్పుడు 27 నేషనల్ పర్మిట్ ట్రక్కులతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. తరచూ లాంగ్ డ్రైవ్‌కి వెళ్లే రతీష్ని జెలజ ‘నేనూ నీతో రానా కొత్తప్రాంతాలు చూడాలని ఉంది’ అనడిగింది. ‘రావచ్చు. కాని నువ్వు ట్రక్కు నడపడం నేర్చుకుంటే’ అన్నాడు రతీష్. అప్పటికి జెలజ కేవలం గృహిణి. టూ వీలర్ నడపడం కూడా రాదు. ఆమె మొదట టూ వీలర్.. ఆ తర్వాత కారు నడిపి ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. భర్తను తోడు తీసుకుని స్వయంగా ట్రక్ నడుపుతూ లోడ్ డెలివరీ చేయడం ్ప్రారంభించింది. వీడియోలు చేస్తూ ‘మాది ఉమ్మడి కుటుంబం. నా మరిది, తోటికోడలు, అత్తగారు.. అందరం కలిసి ఉంటాం. అందుకే నా ఇద్దరు పిల్లలను వదిలి ట్రక్ తీసుకుని బయలుదేరుతాను’ అంటుంది జెలజ. ఆమె పెద్ద కూతురు కూడా ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. లోడ్లు దింపే పనిలో భాగంగా పర్యటనలు కూడా ఈ కుటుంబం ట్రక్కు ద్వారా ముగిస్తారు. ‘మేఘాలయా, కోల్కటా, పోర్బందర్... ఇలా ఎన్నో కొత్తప్రాంతాలు చూశాను’ అంటుంది జెలజ.. ఎక్కడకు వెళ్లినా అక్కడి విశేషాలు వీడియోలు చేస్తూ అక్కడి సంస్కృతి, అలవాట్లు తెలియచేస్తూ ఉంటుంది. రోడ్డు పక్కన ట్రక్కు ఆపి వంట చేసుకుని తోటి డ్రైవర్లతో కలిసి తినడం ఆ వీడియోలు కనపడుతుంది. ఒకసారి అత్తగారిని తీసుకుని ఆమె ట్రక్కులోనే లాంగ్ జర్నీ చేసింది. కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ నడిపి వార్తల్లోకి ఎక్కింది జెలజ . ‘వాష్‌రూమ్‌లు ఒక్కటే ఇబ్బంది. పెట్రోల్ బంకుల్లో ఉన్నవాటిని ఉపయోగిస్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో పోలీసులు పీక్కు తింటారు మామూళ్ల కోసం. మిగిలిన రాష్ట్రాలు పర్లేదు. ఇక దొంగల భయం ఉంటుంది. కాని హైవేల మీద తిరగ్గా తిరగ్గా ఆ భయం పోయింది’ అంటుంది జెలజ. -
టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ను జాతీయ స్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలు వరించాయి. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో ఈ అవార్డులు లభించాయి. నష్టాలను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో అంతర్గతంగా చేస్తున్న కొత్త ఆవిష్కరణలకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 2022–23కుగాను తెలంగాణ ఆర్టీసీని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. నాలుగు ఫస్ట్.. ఒకటి సెకండ్.. రోడ్డు భద్రత విభాగానికి సంబంధించి మఫిసిల్ కేటగిరీ (బస్సుల సంఖ్య 4,001–7,500 ఉన్న సంస్థల పరిధి)లో ఆర్టీసీ మొదటి స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ... రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమేయం తక్కువ ఉండేలా చూడటంలో టీఎస్ఆర్టీసీ తొలి నుంచీ టాపర్‌గా ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు కారణమైన నిష్పత్తి 0.05గా ఉంది. ఇంధన పొదుపులోనూ ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరుకు తిరిగే కిలోమీటర్ల (కేఎంపీఎల్) విషయంలో ఉత్తమంగా నిలిచింది. మఫిసిల్ కేటగిరీలో 5.35 కేఎంపీఎల్‌తో మొదటి స్థానం, పట్టణ ప్రాంతాల కేటగిరీలో 4.61 కేఎంపీఎల్‌తో రెండో స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరు డీజిల్‌కు దాదాపు 5.14 కి.మీ. మేర తిరుగుతున్నాయి. ఇక సిబ్బంది సంక్షేమం, ఉత్పాదకత కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసింది. తీవ్ర గుండె సమస్యలున్న 250 మందిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తోంది. సిబ్బంది నైపుణ్యం పెరిగేలా సామూహిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి ఈ పురస్కారం లభించింది. డిజిటల్ కార్యక్రమాల అమలు విభాగంలోనూ సంస్థకు మొదటి స్థానం సాధించింది. ప్రయాణికులు, సిబ్బంది కోసం కొత్త యాప్‌లు, టికెట్ల రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు, బస్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్ తదితరాలకు ఈ పురస్కారం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ పురస్కారాలు లభించాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనగా ఉత్తమ పనితీరుతో టీఎస్ఆర్టీసీ దేశంలోని ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్‌ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్‌లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
కొలంబియా పల్లెల్లో రోజూ స్టంట్లే
-
బొమ్మ కోసం ఆర్డర్.. భారీ విగ్రహం డెలివరీ!
తల్లితండ్రులు తమ పిల్లలపై చూపే ప్రేమకు హద్దులంటూ ఉండవు. పిల్లల కోర్కెలు తీర్చేందుకు, వారి ఆశలు నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుమారునిపై తండ్రికి ఉన్న ప్రేమకు పరాకాష్ఠగా నిలిచింది ఈ ఉదాహరణ. నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఎలాగైనా తెచ్చివ్వాలని తండ్రి భావించాడు. ఈ బొమ్మ కోసం కొడుకు పట్టిన మంకుపట్టు ఆ తండ్రికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకపోగా, అదొక ఛాలెంజ్‌గా అనిపించింది. కుమారుడు కోరిన బొమ్మ అత్యంత భారీగా ఉండటంతో దానిని ఇంటికి తెచ్చేందుకు తండ్రి క్రేన్‌ను కూడా బుక్ చేయాల్సివచ్చింది. ‘మిర్రర్’ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్న్కు చెందిన ఆండ్రీ బిస్సన్ను అతని నాలుగేళ్ల కుమారుడు థియో.. తనకు డైనోసార్ బొమ్మకావాలని కోరాడు. ఆ పిల్లాడు ఆడుకునేందుకు అనువైన బొమ్మను అడిగినప్పటికీ అతని చెంతకు అత్యంత భారీ విగ్రహం చేరింది. కుమారుడు కోరిన విధంగా ఆండ్రీ బిస్సన్ ఆన్లైన్లో డైనోసార్ బొమ్మను ఆర్డర్ చేశాడు. అయితే అతను ఆర్డర్ చేసింది ఒక బొమ్మ కాదని బాగా ఎత్తుగా ఉన్న విగ్రహం అని అతనికి లేటుగా తెలిసింది. ఆండ్రీ బిస్సన్ ఈ విగ్రహాన్ని వెయ్యి యూరోలు అంటే మన కరెన్సీలో రూ. ఒక లక్షా 5 వేల మొత్తానికి కొనుగోలు చేశాడు. ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు క్రేన్ అవసరమయ్యింది. ఆన్లైన్లో అమ్యూజ్మెంట్ పార్క్ క్లియరెన్స్ సేల్‌లో ఆండ్రీ ఈ విగ్రహాన్ని కనుగోలు చేశాడు. ఈ ఉదంతం గురించి ఆండ్రీ బిస్సన్ మీడియాతో మాట్లాడుతూ ఈ బొమ్మ ఇది 3 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల వెడల్పు ఉంటుందని తాను అనుకున్నానని, అయితే, ఆ బొమ్మ ఐదు మీటర్ల ఎత్తు ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు. డెలివరీ కంపెనీ ఆండ్రీ బిస్సన్కు ఫోన్ చేసి, లారీలో విగ్రహం సరిపోదని, అది రెండు టన్నులు ఉండడంతో జేసీబీలో తీసుకొస్తున్నామని తెలిపారు. ఆ డైనోసార్ విగ్రహం చాలా బరువు ఉన్నందున అది ఆండ్రీ బిస్సన్ ఇంటికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. -
ఛత్తీస్‌గఢ్ నుంచి అయోధ్యకు.. సుగంధభరిత బియ్యం, భారీగా కూరగాయలు
ఛత్తీస్‌గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుగంధభరిత బియ్యాన్ని పంపనుంది. అలాగే ఈ ప్రాంతపు రైతులు తాము పండించిన కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. రాజధాని రాయ్‌పూర్‌లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి పాల్గొని, ఆలయ ప్రాంగణం నుంచి 300 మెట్రిక్ టన్నుల సుగంధభరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన 11 ట్రక్కులకు పచ్చజెండా చూపారు. ఇదిలావుండగా సీఎం విష్ణు దేవ్‌సాయి తన సోషల్ మీడియా ఖాతాలో ‘రాముని దర్శనం కోసం ఆతృతగా వేచిచూస్తున్నాం. జనవరి 22న అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. రాష్ట్రంలోని రైతులు వారి పొలాల్లో పండించిన 100 టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడు ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు. ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్న రాష్ట్రంలోని రైతులు అభినందనీయులు’ అని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్ రైస్‌మిల్లర్లు అయోధ్యకు సుగంధభరిత బియ్యం పంపినందుకు సీఎం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! राम काज करिबे को आतुर... आगामी 22 जनवरी को अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र जी की मूर्ति की प्राण प्रतिष्ठा होने वाली है, जिस पर हर सनातनी को गर्व है। मेरे प्रदेश के अन्नदाताओं ने भी राम काज के लिए अपने खेतों से उगाई गई 100 टन सब्जियां राम मंदिर निर्माण कार्य… pic.twitter.com/fD3OvLiod0 — Vishnu Deo Sai (@vishnudsai) January 2, 2024 -
సరుకు రవాణాల్లో ఏపీ భేష్
సులభతర సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. లాజిస్టిక్ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర వాణిజ్య శాఖ కొనియాడింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్(లీడ్స్)–2023 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సాక్షి, అమరావతి: దేశంలో సులభతర రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి 2018 నుంచి సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలు తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు విధానాలు, ప్రాజెక్టులను నివేదికలో ఉదహరించింది. లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదా ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడాన్ని అభినందించింది. భూ కేటాయింపుల్లోనూ బెస్ట్ దేశంలో ఎక్కడా లేని విధంగా చౌక సరుకు రవాణా కోసం ఏపీలో భారీ ఎత్తున మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారని లీడ్స్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌తో కలిసి విశాఖ, అనంతపురంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు పార్కులకు ప్రతిపాదనలను పంపినట్లు వివరించింది. వివిధ పారిశ్రామిక పార్కుల సమీపంలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, మచిలీపట్నం, విజయవాడ/గుంటూరు, కాకినాడల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇందుకోసం 2,500 ఎకరాలు కేటాయిస్తోందని.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో భూమిని కేటాయించలేదని నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ రంగంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వడాన్ని ప్రశంసించింది. స్మార్ట్‌పోర్ట్ కార్యక్రమం కింద పోర్టు ఆధారిత సేవలన్నీ పారదర్శకంగా, వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడాన్ని అభినందించింది. ఏపీలో అభివృద్ధి కనిపిస్తోంది మౌలికవసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనపడుతున్నాయని, వీటిని వినియోగిస్తున్న వారు ప్రభుత్వ చర్యలను కొనియాడుతున్నారని ‘లీడ్స్’ నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం.. ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో విధానం ‘స్పందన’ తీసుకురావడం వంటి విధానాల వల్ల తీరప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వసతుల కల్పన అధికంగా ఉందని.. రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఏపీ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను నిరి్మస్తుండటంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుండటాన్ని ప్రశంసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించింది. -
బుకింగ్‌లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
స్కై బస్సు సర్వీస్ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?
భారతదేశంలో స్కై బస్సు రవాణా సౌకర్యంపై మరోమారు చర్చ మొదలైంది. దేశంలో స్కై బస్సు వ్యవస్థను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్‌లో స్కై బస్సు సర్వీస్ ప్రారంభమైతే పలునగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. స్కై బస్సు సర్వీసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్కై బస్సు అనేది మెట్రో మాదిరిగానే చౌకైన, పర్యావరణ అనుకూల పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ. ఇది ఎలివేటెడ్ ట్రాక్‌ను కలిగి ఉంటుంది. స్కై బస్సులు సుమారుగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఇవి విద్యుత్ శక్తితో నడుస్తాయి. వీటి నిర్వహణకు మెట్రో కంటే తక్కువ ఖర్చు అవుతుంది. స్కై బస్ అనేది విలోమ కాన్ఫిగరేషన్ వాహనం. దీని చక్రాలు, ట్రాక్‌లు ఒక మూసివున్న కాంక్రీట్ బాక్స్ మధ్య అమరి ఉంటాయి. ఈ వ్యవస్థలో పట్టాలు తప్పడం లాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 2003లో నూతన సంవత్సర కానుకగా గోవాకు స్కై బస్సు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.100 కోట్లతో ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్ట్ మపుసా నుండి పనాజీకి అనుసంధానించాలనుకున్నారు. దీని ప్రారంభ మార్గం 10.5 కి.మీ. అయితే 2016లో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ స్కై బస్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. ఆ సమయంలో అది లాభదాయకం కాదని, ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది? -
పీపుల్స్మేనిఫెస్టో
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 3,17,32,727 మంది. వీరిలో గ్రేటర్‌ను ఆనుకొని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఓటర్లు 1,04,90,621 మంది. అంటే దాదాపు మూడోవంతు మంది ఇక్కడే ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారూ ఎందరో ఉన్నారు. నగర ప్రజల మేనిఫెస్టోను అమలు చేయడమంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమలు చేసినట్లే. – సాక్షి, హైదరాబాద్ రవాణా.. అతిపెద్ద సమస్య నగరంలోని ప్రజలే కాక ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్నవారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య రవాణా. జిల్లాల నుంచి నగర శివార్లలోకి రెండు గంటలలోపే చేరుకుంటున్నప్పటికీ, అక్కడి నుంచి నగరంలోని గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతోంది. ఇందుకు పరిష్కారంగా ఇస్నాపూర్ నుంచి షాద్‌నగర్ వరకు, యాదాద్రి నుంచి చౌటుప్పల్ వరకు.. నగరం నలువైపులా ఎటునుంచి ఎటు వెళ్లేందుకైనా మెట్రో రైలు కావాలంటున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ప్రజారవాణా పెరగాలి. ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు నిర్మించినా ట్రాఫిక్ ఇక్కట్లు తీరలేదు. ట్రాఫిక్ జామ్‌లు తప్పేలా లింక్‌రోడ్లు పెరగాలి. అన్ని రద్దీప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జీలుండాలి. వరద ముంపు తప్పాలి విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో వానొస్తే నాలాల్లో మరణాలు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి నాలాలన్నింటినీ ఆధునీకరించాలి. నాలాల మరణాలు తప్పేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. ప్రయాణ దూరాభారం తగ్గించేందుకు మూసీపై 14 వంతెనలు అందుబాటులోకి రావాలి. అపరిమిత ఇంటర్నెట్.. మొబైల్ లేనిదే చేయి విరిగినట్లుగా భావిస్తున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో అన్ని వేళలా ఉచిత ఇంటర్నెట్ ఉంటే ఎంతో మేలంటున్నారు. ప్రజలకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే సదుపాయం ఉన్నా, ఇంటర్నెట్కు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండరాదని, అందులోనూ అంతరాయాలు ఉండొద్దని బలంగా కోరుకుంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు, ఆయా ప్రాంతాల్లో రద్దీ తెలుసుకునేందుకు సింగిల్యాప్ లాంటిది కావాలని కోరుకుంటున్నవారెందరో ఉన్నారు. ఉద్యోగాలు.. సొంతిళ్లు.. ఆరోగ్య బీమా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోపాటు సొంతిళ్లు లేనివారికి నెలనెలా ఈఎంఐలతో గృహ సదుపాయం కల్పించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లేదా కనీసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని అలవెన్సులు, సకాలంలో ఉద్యోగాల భర్తీ, పేదలకు ఉచిత వైద్యంతోపాటు అవసరమైన పక్షంలో శస్త్రచికిత్సలకు ఉపకరించేలా ప్రభుత్వమే ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలంటున్నారు. 24 గంటలు స్వచ్ఛమైన నీరు కరెంటు కష్టాలు తీరినప్పటికీ నగరంలో నీటి ఇబ్బందులున్నాయి. నిర్ణీత వేళల్లో కాకుండా 24 గంటలు ఎప్పుడు నల్లా తిప్పినా తాగునీరొచ్చే సదుపాయం ఉండాలంటున్నారు ప్రజలు. -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్‌షాప్‌ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్‌షాప్‌లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
ఎక్స్‌ట్రూజన్‌పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్‌ల తయారీకి వీలుగా ఎక్స్‌ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్‌లకోసం ఎక్స్‌ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్‌కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్‌ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్‌క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!
ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్ బ్యాట్మెన్స్తో పోటీపడుతూ సెంచరీ..డబుల్ సెంచరీ.. దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో రూ. 250 స్థాయిని కూడా దాటేసింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్) నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్ హోల్‌సేలర్ సంజయ్ భగత్ “హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. కాగా ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది. -
అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబును నమ్ముకున్న ఏ ఒక్కరూ సక్రమమైన దారిలో నడిచినట్టు చరిత్రలో లేదు. అమరావతిని బాహుబలి సినిమాలో మాదిరిగా రూపొందిస్తానంటూ సింగపూర్ బృందాన్ని విజయవాడలో దింపి.. ఠక్కుఠమార విద్యలన్నీ ప్రదర్శించిన బాబు డొల్లతనం ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడుతోంది. చంద్రబాబుతో కలిసి అమరావతిని ఏదో చేస్తామని చెప్పిన సింగపూర్ బృంద నాయకుడు ఈశ్వరన్ ఇప్పుడు కీలక నేరాల్లో చిక్కుకుని పదవికి దూరమయ్యారు. ఇక్కడి సిబిఐని మేనేజ్ చేసుకుని కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు.. ఇప్పుడు సింగపూర్ లో CBIకి సమానమై CPIB ని ఈశ్వరన్ కోసం ఏ రకంగా ప్రభావితం చేస్తాడో చూడాలి. బాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అసలు రూపం ఇది ఈశ్వరన్ సింగపూర్ దేశంలో రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీగా నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు తీవ్రత ఏంటీ? ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాలేంటీ? దేశానికి ఏ రకంగా నష్టం జరిగింది? అన్న వివరాలను అక్కడి దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఒక హైప్రొఫైల్ కేసు అని, అత్యంత కీలక అంశాలతో ముడిపడి ఉన్న విషయమని సింగపూర్ వర్గాల సమాచారం. అందుకే ఈశ్వరన్ ను విచారించేందుకు అక్కడి దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానిని అనుమతి అడగ్గానే ఆయన స్పందించారు. ఈశ్వరన్ ను అధికారికంగా విచారిస్తామంటూ డైరెక్టర్ డెనిస్ టాంగ్ ప్రధాని లీ అనుమతిని కోరారు. ఈ నేపధ్యంలో తాను జూలై 6న సీపీఐబీ డైరెక్టర్‌కి సమ్మతి తెలిపానని, ఆ తర్వాత అధికారిక విచారణ జూలై 11న ప్రారంభమైందని ప్రధాన మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఈశ్వరన్‌ను ఆదేశించినట్లు ప్రధాని లీ తెలిపారు. On 5 July, Director CPIB briefed me on a case and sought my concurrence to open a formal investigation. Minister S Iswaran is assisting with investigations and will take a leave of absence. SMS Chee Hong Tat will be Acting Minister for Transport. – LHL https://t.co/0ut4SRoTfG — leehsienloong (@leehsienloong) July 12, 2023 ఎవరీ ఈశ్వరన్ అమరావతి విషయంలో ఎన్నో కొత్త విషయాలను తెరమీదికి తెచ్చారు చంద్రబాబు. అందులో ముఖ్యమైంది రైతుల భూమిని సేకరించి అభివృద్ధి చేసి మళ్లీ ఇస్తానని. ఇందులో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. మే 17, 2017న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరిపి MOUలో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అమరావతి భూములను అభివృద్ధి చేసినందుకు సింగపూర్ ప్రభుత్వానికి 58% వాటా, ఏపీ ప్రభుత్వానికి 42% వాటా ఉంటుందని బాబు చెప్పారు. ఈ సింగపూర్ కన్సార్టియానికి మంత్రి ఈశ్వరన్ నేతృత్వం వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేముంది విడతల వారీగా సింగపూర్ బృందాలు విజయవాడ రావడం, ప్రతీ నెలా సమావేశాలు పెట్టడం.. అదిగో ఇదిగో అంటూ రకరకాల ఊహాచిత్రాలను విడుదల చేయడం జరిగింది. అయిదేళ్లలో చంద్రబాబు గానీ, ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియం గానీ చేసిందేమీ లేదు. "Director of the Corrupt Practices Investigation Bureau (CPIB) briefed me on a case CPIB had uncovered... This would involve interviewing Minister S Iswaran, among others... I have instructed Minister Iswaran to take leave of absence until these investi... https://t.co/KkMSp0rhB2 — The Independent Singapore (@IndependentSG) July 12, 2023 2019లో ఏం తేలింది? 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. అదే సమయంలో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి ఒప్పందం గురించి పరిశీలించగా.. అసలు ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియానికి సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. సింగపూర్ లోని కొన్ని సంస్థలు కలిసిందే కన్సార్టియం తప్ప చంద్రబాబు అప్పటివరకు చెప్పినట్టు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని తేలింది. (చదవండి : కన్సార్టియం పేరిట బాబు అక్రమాలు ఇవి) ‘పక్షపాతం లేకుండా దర్యాప్తు’ ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరన్ మీద ఆరోపణలు రావడంతో అక్కడి దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను వెలికితీయడానికి, సత్యాన్ని నిరూపించడానికి, చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి, దృఢ సంకల్పంతో ఈ కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొంది. CBIP చేపట్టే అన్ని కేసులను పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తుందని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడే పార్టీలపై చర్య తీసుకోవడానికి వెనుకాడదని ఆ ప్రకటనలో పేర్కొంది. మరో వైపు ఈశ్వరన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా సీపీఐబీ విచారిస్తుందని ప్రధాన మంత్రి లీ సియన్ లూంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో బయటపెట్టిన ఒక కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐబీ డైరెక్టర్ తనకు సమాచారం అందించారని ప్రధాని లీ చెప్పారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఈశ్వరన్ రాజకీయ జీవితం.. మంత్రి ఈశ్వరన్ రాజకీయ జీవితం 1997లో వెస్ట్ కోస్ట్ GRCకి పార్లమెంటు సభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుండి ప్రారంభమయ్యింది. 26 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2006లో క్యాబినెట్లోకి ప్రవేశించకముందు అనేక ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీలలో సభ్యనిగా కొనసాగారు. సెప్టెంబర్ 2004 నుండి జూన్ 2006 వరకు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. మే 2021 నుండి రవాణా మంత్రిగా ఉన్నారు. మే 2018 నుండి వాణిజ్య సంబంధాల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఈశ్వరన్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలలో మంత్రి పదవులను కూడా నిర్వహించారు. మే 2011 నుండి సెప్టెంబర్ 2015 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రిగా కూడా ఉన్నారు. రాజకీయాలలో ప్రవేశించక ముందు ఈశ్వరన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు టెమాసెక్ హోల్డింగ్స్‌తో సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేశారు. ఈశ్వరన్ ను పక్కకు తప్పించడంతో ఆయన బాధ్యతలను సింగపూర్ సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ పర్యవేక్షిస్తారని ప్రధాని తెలిపారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఇది కూడా చదవండి: ‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్న చీరతో’.. -
గోవా టూ గోదావరి.. కేడీ లేడీల లిక్కర్ దందా
కైకలూరు: ఏలూరు జిల్లాలోకి గోవా మద్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కైకలూరు రైల్వేస్టేషన్లో బుధవారం ముగ్గురు మహిళల నుంచి 24 బ్యాగులలో ఏకంగా 2,949 మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.4,54,400 ఉంటుందని అంచనా. తెలంగాణ కాదు.. గోవా బెటర్ గతంలో తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకి తెచ్చేవారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణాకు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు ట్రైన్ల ద్వారా గోవా నుంచి ఏపీ రవాణా చేస్తున్నారు. వామ్మో కిలాడీ లేడీస్ బాపట్ల జిల్లా చీరాల మండలం, ఓడరేవుల గ్రామం వైఎస్సార్‌కాలనీకి చెందిన మహిళలు ఈ మద్యం రవాణాలో కీలక పాత్ర పోషిస్తోన్నారు. గతంలో వీరిపై సారా విక్రయ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొందరు ముఠాలుగా ఏర్పడి ముంబయి మీదుగా గోవాకు రైలులో చేరుకుంటున్నారు. కొన్ని రైళ్లే కన్వినీయంట్ అక్కడ మద్యం కొనుగోలు చేసి తిరిగి ముంబయి–విశాఖ ఎల్టీటీ రైలు ద్వారా ఆంధ్రాకు వస్తున్నారు. ఇలా నెలలో ముఠాలు రెండు సార్లు వెళ్లి వస్తున్నారు. గోవాలో కొనుగోలు చేసిన మద్యం సీసాలను లగేజీ బ్యాగ్‌లలో ప్యాకింగ్ చేయడానికి ప్రత్యేక ముఠా గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. గస్తీ లేని స్టేషన్ల ఎంపిక గోవా నుంచి ముంబయి, విజయవాడ మీదుగా విశాఖపట్నం ఎల్టీటీ రైలు రాత్రి వేళలో ప్రయాణిస్తోంది. ఈ రైలును అక్రమ రవాణాకు ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల మాదిరిగా నలుగురు మహిళలు వేర్వేరు బోగీలలో మద్యం సీసాల లగేజీ బ్యాగులను సీటు అడుగుభాగంలో ఉంచుతున్నారు. లగేజీ మాటున లిక్కర్ ఉదయం విజయవాడ దాటిన తర్వాత రైల్వేస్టేషన్లలో పోలీసుల గస్తీ తగ్గుతుంది. విజయవాడ స్టేషన్ తర్వాత ఎల్టీటీ ట్రైన్ గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం వంటి స్టేషన్లలో ఆగుతోంది. వీరు కై కలూరు, ఆకివీడు స్టేషన్లలో లగేజీలు దించుతున్నారు. ఎక్స్ ప్రెస్ నుంచి ప్యాసింజర్ ఆ తర్వాత పాసింజర్ రైలులో ఎక్కించి రామవరప్పాడు స్టేషన్లో దిగి అక్కడ నుంచి వాహనాల ద్వారా అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ముఠాలో సభ్యులు ఆయా స్టేషన్ల వద్ద ముందుగానే ఉంటూ ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా మహిళలకు సమాచారాన్ని అందిస్తున్నారు. లాభం ఎంతంటే.? గోవాలో ఫుల్‌బాటిల్ ధర రూ.270 ఉంటే ఇక్కడ రూ.800 నుంచి రూ.1000, క్వార్టర్ బాటిల్ రూ.26 ఉంటే ఇక్కడ రూ.150 నుంచి రూ.200కి విక్రయిస్తున్నారు. రైలులో వీరు బ్యాగులను అక్కడక్కడ సీట్ల కింద ముందుగానే సర్ధుతున్నారు. దీంతో పోలీసులు ప్రయాణికుల బ్యాగులుగా భావించి తనిఖీ చేయడం లేదు. రైల్వే పోలీసుల నిఘా లేనిచోట ముందుగానే గమనించి ఆ స్టేషనలో అక్రమ మద్యాన్ని దించుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు అడ్డుకుంటాం స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో(సెబ్) సిబ్బంది మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేస్తుంది. పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. రైలు, బస్ స్టేషన్ల వద్ద ఎవరైన అనుమానంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో మరిన్ని తనిఖీలు చేపడతాం. – ఆకుల రఘు, పట్టణ సీఐ, కై కలూరు -
చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు..
చైనా లోకల్ ఉత్పత్తులను భారత్‌లో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. చాలామంది చైనా వస్తువులకు ఎటువంటి గ్యారెంటీ ఉండదంటూ హేళన చేస్తుంటారు. అయితే చైనా టెక్నాలజీ, అధునాతన ఉత్పత్తులు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంటాయి. టెక్నాలజీ పరంగా చైనా ఎంత వేగంగా దూసుకుపోతున్నదనే విషయాన్ని అవి తెలియజేస్తుంటాయి. అధునాతన రైళ్లు అనగానే ముందుగా చైనా, జపాన్ గుర్తుకువస్తాయి. ఈ దేశాల రైళ్ల వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చైనా రైల్వే టెక్నాలజీ మరో అద్భుతాన్ని చేసి చూపింది. తాజాగా చైనా19వ అంతస్థుల నివాసిత బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే ట్రాక్‌ను రూపొందించింది. ప్రజలు ఉండే ఈ భవనం ఇప్పుడు రైల్వే స్టేషన్‌గానూ మారిపోయింది. బిల్డింగ్ మధ్య నుంచి వెళ్లే రైలు చైనా రైల్వే సిస్టం అద్భుతమైనది. ప్రపంచంలో ట్రాక్ లేకుండా రైలు నడిపిన ఘనత కూడా చైనాకే దక్కింది. హైస్పీడ్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తూ ప్రయాణికులకు చైనా మరింత ఉత్తమ సేవలు అందిస్తోంది. అందుకే కొందరు చైనా రైల్వే సేవలు ప్రపంచంలోనే అత్యుత్తమని అంటుంటారు. తాజాగా చైనా ఒక బిల్డింగ్ మధ్య నుంచి రైల్వే ట్రాక్ నిర్మించింది. ఈ బిల్డింగ్ మధ్య నుంచి రోజూ రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. 19 అంతస్థుల ఈ బిల్డింగ్‌లోని 6వ, 8వ ఫ్లోర్లపై రైల్వే ట్రాక్ నిర్మించారు. భవనం మధ్య నుంచి ట్రాక్ నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. బిల్డింగ్‌లోని వారికి ఇబ్బంది కలుగకుండా.. చైనా ఈ రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నప్పుడు ఈ మార్గంలో 19 అంతస్థుల బిల్డింగ్ అడ్డుగా నిలిచింది. అయితే రైల్వేశాఖ బిల్డింగ్ యజమానులను సంప్రదించి బిల్డింగ్ మధ్యగా ట్రాక్ వేసేందుకు అనుమతి పొందింది. అనంతరం బిల్డింగ్ మధ్య నుంచి ట్రాక్ వేశారు. ఇది ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ భవనంలో ఉంటున్నవారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఈ ట్రాక్ రూపొందించారు. ఈ ట్రాక్ వలన భవనంలో నివాసం ఉంటున్నవారికి మరో ప్రయోజనం కూడా చేకూరింది. వారికంటూ ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ ఏర్పడింది. దీంతో వారు ఇంటి నుంచి బయటకు వచ్చి, నేరుగా రైలులోనే కూర్చుని తదుపరి స్టేషన్‌కు చేరుకుంటారు. ఇక రైలు నుంచి వచ్చే శబ్ధం బిల్డింగ్‌లోని వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు సైలెన్సింగ్ టెక్నిక్ వినియోగించారు. ఇది కూడా చదవండి: ఎన్నారై డాక్టర్ చేసిన తప్పేంటి? మెడికల్ లైసెన్స్ ఎందుకు లాక్కున్నారు? -
అది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్.. ఒక సీక్రెట్ ప్లాట్ఫారం కూడా!
భూమిపై నడిచే ప్రజారవాణా వ్యవస్థలలో రైలు అత్యంత చౌకైన ప్రయాణ సాధనమని చెప్పుకోవచ్చు. ఇది ప్రయాణాలకు ఎంతో సౌలభ్యకరమైనదని కూడా అంటారు. అయితే రైలులో ప్రయాణించేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాల్సివుంటుందనే సంగతి మనకు తెలిసిందే. స్టేషన్లలోని ప్లాట్‌ఫారాల వద్దకు వచ్చి రైళ్లు ఆగుతుంటాయి. అప్పుడు ప్రయాణికులు రైలులోకి ఎక్కుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫారం విషయానికొస్తే అది మన దేశంలోనే ఉంది. కర్నాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్ (Hubballi Railway Station)లోని ప్లాట్ఫారం నంబరు-8 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం. దీని పొడవు 1507 మీటర్లు. ఇక అతిపెద్ద రైల్వే స్టేషన్ విషయానికొస్తే హౌరా జంక్షన్ ముందు వరుసలో ఉంటుంది. ఈ స్టేషన్లో మొత్తం 26 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వేస్టేషన్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (Grand Central Terminal) రైల్వేస్టేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్. దీని నిర్మాణం 1903 నుంచి 1913 మధ్యకాలంలో జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ రైల్వేస్టేషన్లో మొత్తం 44 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వేస్టేషన్లో రెండు అండర్గగ్రౌండ్ లెవెల్స్ ఉన్నాయి. దీనిలోని పైలెవెల్లో 41 ట్రాకులు, కింది లెవెల్లో 26 ట్రాకులు ఉన్నాయి. ఈ స్టేషన్ మొత్తం 48 ఎకరాల్లో నిర్మితమయ్యింది. ఈ స్టేషన్ మీదుగా ప్రతీరోజు మొత్తం 660 మెట్రో నార్త్ ట్రైన్స్ నడుస్తాయి. లక్షా 25వేల మందికి మించిన ప్రయాణికులు ప్రతీరోజూ ఈ రైళ్లలో ప్రయాణిస్తారు. ఈ రైల్వే టెర్మినల్‌లో ఒక సీక్రెట్ ప్లాట్ఫారం కూడా ఉంది.అది Waldorf Astoria హోటల్‌కు సరిగ్గా దిగువన ఉంది. నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్డ్ ఈ ప్లాట్ఫారం వినియోగించేవారని చెబుతారు. హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన దీనిని వినియోగించేవారట. ఈ సీక్రెట్ ప్లాట్ఫారం రెగ్యులర్ సర్వీసుల కోసం వినియోగించకపోవడం విశేషం. -
యూత్ పవర్ అంటే ఇదే, త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సమీప భవిష్యత్తు అంతా భారతదేశానిదే ‘ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది. దేశంలోని కార్మికులు, కర్షకులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు,’ అన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష ప్రగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు ధంఖడ్. ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. ‘ప్రస్తుత భారత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు 2030 నాటికి పెరుగుతుంది. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా సాధించాలంటే–తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలు,’ అని డాయిష్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. తన అంచనాకు కారణాలు వివరిస్తూ, ‘ప్రస్తుత దశాబ్దంలో భారత్ మంచి ప్రగతి సాధించడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి తోడవుతున్నాయి,’ అని ఈ సంస్థ వివరించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. డిజిటలైజేషన్, ఫైనాన్షియలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థ దూకుడు నగదు వాడకం స్థానంలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతో ఉత్పాదకత పెరిగింది. ఫైనాన్షియలైజేషన్ (మార్కెట్లు వంటి ఫైనాన్షియల్ సంస్థల సైజు, ప్రభావం పెరగడం) వల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. పరిశుభ్రమైన ఇంథన వినియోగం వల్ల కూడా వ్యవస్థలో సామర్ధ్యం పెరుగుతుందని డాయిష్ బ్యాంక్ అభిప్రాయపడింది. మరో ప్రోత్సాహకర అంశం ఏమంటే–ఇండియాలో పనిచేసే వయసున్న జనాభా సైజు విస్తరించడం. ప్రస్తుతం ఇలాంటి యువత సంఖ్య 2007లో చైనాలో ఉన్న స్థాయిలో ఇండియాలో ఉంది. భారత సమగ్ర జీడీపీ, తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఇదే విధంగా చైనాను పోలి ఉన్నాయి. వచ్చే పదేళ్లలో దేశంలో పనిచేసే యువతరం సంఖ్యకు అదనంగా 9 కోట్ల 80 లక్షల మంది తోడవుతారు. ప్రపంచంలో పనిచేసే జనాభా సంఖ్యలో పెరుగుదల ఒక్క ఇండియాలోనే 22 శాతంగా ఉంటుందని కూడా ఈ జర్మన్ సంస్థ అంచనావేసింది. సంతృప్తికర కొనుగోలు శక్తి ఉండే భారత మధ్య తరగతి ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం 37 కోట్ల 10 లక్షల మంది మధ్య తరగతి (మిడిల్ క్లాస్) దేశంలో వస్తు వినిమయం పెరగడానికి దోహదం చేస్తోంది. వచ్చే దశాబ్దాల్లో కూడా వినియోగం పెరగడానికి భారత మధ్య తరగతి ప్రజానీకం కారణమౌతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. భారత అభివృద్ధికి మరో కీలకాంశం ఏమంటే జేఏఎం (జన్ ధన్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్ ఫోన్) అనే మూడు ఆయుధాలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పక్కదారులు పట్టకుండా కాపాడుతున్నాయి. జేఏఎం ద్వారా నగదు బదిలీ వేగంగా, సునాయాసంగా జరుగుతున్న కారణంగా కోట్లాది మంది సామాన్య ప్రజానీకానికి మేలు చేకూరుతోంది. మౌలిక సందుపాయాల్లో అత్యంత ప్రధానమైన రహదారుల అభివృద్ధి, విస్తరణ మున్నెన్నడూ లేని విధంగా ముందుకుసాగుతున్నాయి. రహదారుల వ్యవస్థకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం వల్ల ఇప్పుడు దేశంలో రోజుకు సగటున 36 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నారు. గడచిన పది సంవత్సరాల్లో ఇండియాలో మొత్తం 73,000 కిలోమీటర్ల పొడవు గల రహదారులు నిర్మించారు. ఇటీవల కాలంలో దేశంలో విద్చుచ్ఛక్తి సరఫరా, శుభ్రమైన వంట పద్ధతులు అమలు చేయడంలో సాధించిన ప్రగతి కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి పురికొల్పుతోంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు -
రవాణా మరింత సులభతరం.. మరిన్ని గ్రామీణ రోడ్లకు మహర్దశ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా మరింత సులభతరం అవనుంది. పాడుబడిపోయిన పాత రోడ్లను పునర్నిర్మించి, ఆధునికంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంజీఎస్‌వై కింద 2,684 కిలోమీటర్ల రోడ్లను ఆధునీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో 916.22 కిలోమీటర్ల పొడవున రహదారులను పునర్నిర్మించనుంది. పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో రూ. 1066.10 కోట్లతో 115 పాడుబడిన పాత తారు రోడ్లను పునర్నిర్మించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఆ రోడ్లలో 74 పెద్ద పెద్ద బ్రిడ్జిలను కూడా నిర్మిస్తారు. వీటి మొత్తం నిడివి 6918.97 మీటర్లు (అంటే దాదాపు ఏడు కిలో మీటర్లు) ఉంటుంది. వీటిలో 22 బ్రిడ్జిలు ఒక్కొక్కటి 150 మీటర్ల పొడవుకన్నా ఎక్కువ నిడివి ఉంటాయని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఎంపవర్డ్ కమిటీ మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1,069 కిలోమీటర్ల పొడవున 131 తారు రోడ్ల పునర్నిర్మాణానికి రాష్ట్ర అధికారులు ప్రతిపాదించారు. వీటిలో 115 రోడ్ల పునర్నిర్మాణానికి ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటిలో 153.01 కిలోమీటర్ల మేర రోడ్లను 5.5 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్‌కు రూ.85.20 లక్షల ఖర్చుతో పునర్నిర్మిస్తారు. మిగిలిన రోడ్లను 3.75 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్‌కు 58.41 లక్షలతో పునర్నిర్మిస్తారు. పీఎంజీఎస్‌వై కింద ఈ రోడ్ల ఆధునీకరణకు అయ్యే ఖర్చులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ రోడ్లకు అంచనాలు ఇప్పటికే పూర్తయినందున, కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. పీఎంజీఎస్‌వై పథకంలోనే 2684 కి. మీటర్ల కొత్త రోడ్లు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 1.25 లక్షల కిలోమీటర్ల మేర పాత రోడ్ల పునర్నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ 2019లో పీఎంజీఎస్‌వై –3ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవున రోడ్ల ఆధునీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత నాలుగేళ్లలో అందులో 2,314 కిలోమీటర్ల రోడ్లకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటిలో 1804 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి తోడు పీఎంజీఎస్‌వై, ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ (నక్సల్స్, తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం) కింద గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి పలు రోడ్లను కేంద్రం మంజూరు చేసింది. వాటికి నిధులు కూడా విడుదల చేసింది. అయినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పనులు పూర్తి చేయలేదు. ఇలా పెండింగ్‌లో ఉన్న 880 కిలోమీటర్ల రహదారులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో పూర్తి చేసింది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మొత్తం 2,684 కిలోమీటర్ల రోడ్లను నిర్మించినట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తయిన పనులకు బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. -
రైలెక్కట్లేదు.. విమానం దిగట్లేదు.. ప్రజల్లో వచ్చిన మార్పుకు కారణమిదే!
విమాన ప్రయాణికుల రద్దీపెరిగినంత వేగంగా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగటం లేదు. కోవిడ్–19 కారణంగా క్షీణించిన ప్రజా రవాణా నెమ్మదిగా పుంజుకుంటున్నా.. కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి ద్రవ్యోల్బణమే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ తర్వాత ప్రయాణాల రద్దీ పెరుగుదల ఆర్థిక వృద్ధికి ప్రత్యక్ష సూచికగా నిలుస్తుందని చెబుతున్నారు. కానీ.. కోవిడ్ ముందు సాగినన్ని ప్రయాణాలు ప్రస్తుతం కనిపించటం లేదని స్పష్టం చేస్తున్నారు. కనిపించని మునుపటి మార్క్.. కరోనాకు ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,674 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 5,858 మిలియన్ల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే ప్రయాణికుల బుకింగ్ 1,816 మిలియన్లు కంటే ఎక్కువ తగ్గింది. 2022–23తో పోలిస్తే.. 2019–20 కంటే 24 శాతం తక్కువ రద్దీని సూచిస్తోంది. సబర్బన్ ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల ఉండగా.. నాన్–సబర్బన్ ప్రాంతాల్లో 29 శాతం తగ్గుదల నమోదైంది. నేషనల్ ట్రాన్స్పోర్ట్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రైల్వే 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి మార్చి (2022–23) వరకు రూ.54,733 కోట్ల రాబడి వస్తే.. గత ఆర్థిక ఏడాదిలో ఇది రూ.31,634 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే రైలు ప్రయాణాల్లో వృద్ధి కనిపిస్తున్నా.. 2019–20 కాలం నాటి గణాంకాలతో పోలిస్తే మాత్రం తక్కువగానే ఉంది. ద్రవ్యోల్బణమే కారణం ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల కారణంగా ఆయా వర్గాల ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగకపోవడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. ఎగువ, ఉన్నత ఆదాయ వర్గాల వారిపై ద్రవ్యోల్బణం పెద్దగా ప్రభావం చూపని కారణంగా.. ఆ వర్గాల వారు విమానాల్లో యథావిధిగా ప్రయాణించగలుగుతున్నారని చెబుతున్నారు. విమానాలు ఎక్కేస్తున్నారు మరోవైపు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా వృద్ధి చెందుతూ కోవిడ్ ముందునాటి స్థితికి చేరింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) నివేదిక ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన సంస్థలు 1,360 లక్షల మంది ప్రయాణికులను తరలించాయి. ఇది 2021–22లో ప్రయాణించిన 852 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే 60 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అయితే, ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల రద్దీ 2020–21 ఆర్థిక సంవ్సతరంలో 1,415 లక్షల కంటే 4 శాతం తక్కువ. ఈ ఏడాది మార్చిలో 130 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 121 లక్షలు కాగా.. మార్చి నెలలో 8 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. 2022 మార్చిలో ఇది 106 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 22 శాతం వృద్ధిలో నడుస్తోంది. అదే 2019 మార్చిలో 116 లక్షలు ఉంటే ఇప్పటి మార్చి ప్రీకోవిడ్లో చూస్తే 12 శాతం పెరుగుదల కనిపిస్తోంది. సరుకు రవాణా పెరుగుతోంది దేశంలో అత్యధికంగా ఒక ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా చేసిన సంస్థగా రైల్వే రికార్డు సృష్టించింది. జాతీయ రవాణా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. 2022–23లో 1,512 మిలియన్ టన్నుల సరుకును రైల్వే రవాణా చేసింది. 2021–22లో 1,418 మిలియన్ టన్నులు తరలించింది. ఇక్కడ 2022–23లో రైల్వే మొత్తం ఆదాయం రూ.2.44 లక్షల కోట్లు కాగా.. 2021–22లో రూ.1.91 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో ఏకంగా 27.75 శాతం వృద్ధిని సూచిస్తోంది. – సాక్షి, అమరావతి -
భారత్ నుంచి బంగ్లాకు పైప్‌లైన్ ద్వారా డీజిల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్‌కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్‌లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది. -
చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!
సాక్షి,పెనుకొండ: మండలంలోని శెట్టిపల్లికి చెందిన సిద్దయ్య టీడీపీ మండల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి, ఆయన అల్లుడు శశిభూషణ్‌కు నమ్మిన బంటు. పైకి రాజకీయ నేతగా కనిపించే సిద్దయ్య... చేసేదంతా అక్రమ దందానే. ఏళ్లుగా కర్ణాటక మద్యం అక్రమంగా జిల్లాకు తెచ్చి సొమ్ముచేసుకుంటున్నట్లు పచ్చ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్యే, అతని అల్లుడి పేర్లు చెప్పి మద్యం దందా జోరుగా సాగించాడు. అనంతపురంలో కాపురం..శెట్టిపల్లి నుంచి దందా.. అక్రమార్జనే పరమావధిగా పనిచేసిన సిద్దయ్య టీడీపీ హయాంలో అడ్డంగా సంపాదించాడు. అధికారులు ఎవరైనా దృష్టి సారిస్తే బీకే పేరు చెప్పి తప్పించుకునేవాడు. కానీ రాష్ర్టంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సిద్దయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పోలీసులకు భయపడి మకాం అనంతపురానికి మార్చాడు. అక్కడి నుంచే తన స్వగ్రామం శెట్టిపల్లిలో వ్యవహారాలు నడిపేవాడు. మూడేళ్లుగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తూ గ్రామీణుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. పగలంతా అనంతపురంలో ఖద్దరు దుస్తుల్లో కనిపించే సిద్దయ్య, రాత్రి కాగానే జిల్లా సరిహద్దులోని కర్ణాటకలోని మద్యం షాపుల్లో సరుకు కొని తన స్వగ్రామానికి తరలించేవాడు. అతను స్థానికంగా కనిపించపోవడంతో పోలీసులూ పెద్దగా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆధిపత్య పోరుతోనే... టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే సిద్దయ్య పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎవరినీ సంప్రదించకుండానే సిద్దయ్యను పార్టీ మండల కన్వీనర్‌గా ప్రకటించారు. దీంతో మండల కన్వీనర్ రేసులో ఉన్న నేతలంతా రగిలిపోయారు. కర్ణాటక మద్యం తెచ్చుకుని అమ్ముకునే సిద్దయ్యకు మండల కన్వీనర్ పోస్టు ఇవ్వడం ఏమిటని బీకేని కొందరు ప్రశ్నించారు. ఆయన పట్టించుకోకపోవడంతో పలువురు నేతలు టీడీపీకే చెందిన ఓ నాయకురాలి వర్గంలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలనూ ఎవరికి వారు నిర్వహిస్తూ ఆధిపత్య పోరు సాగించారు. పలు కార్యక్రమాల్లో సిద్దయ్యపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఉప్పందించిన ‘పచ్చ’ నేతలు.. సిద్దయ్య అక్రమ మద్యం దందా చేయడం...అలాంటి వ్యక్తికి బీకే సహకరిస్తూ మండల కన్వీనర్ పదవి ఇవ్వడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సిద్దయ్య కర్ణాటక మద్యం దందాపై పోలీసులకు పలుమార్లు ఉప్పందించినట్లు తెలుస్తోంది. అయితే మద్యం దందాలో ఆరితేరిపోయిన సిద్దయ్య... ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దయ్య తన అనుచరులతో కలిసి కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తీసుకువస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో బీకే వ్యతిరేక వర్గంలోని వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రి 12 గంటల ప్రాంతంలో మరవపల్లి సమీపంలో సిద్దయ్యతో పాటు అతని అనుచరులు పెనుకొండకు చెందిన దూదేకుల బాషా, ధర్మవరానికి చెందిన బిర్రు ప్రశాంత్‌కుమార్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కృష్ణారెడ్డిని పట్టుకున్నారు. మద్యం బాక్సులతో పాటు కారు, ద్విచక్ర వాహనం స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు కూడా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తమకు వచ్చిన పక్కా సమాచారంతోనే దాడి చేసినట్లు పేర్కొనడం విశేషం. కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలే టార్గెట్.. తన అనుచరులతో కలిసి కర్ణాటక అక్రమ మద్యం దందాను అత్యంత గుట్టుగా నిర్వహిస్తున్న సిద్దయ్య... కొత్తచెరువు–పుట్టపర్తి మండలాల్లోని పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మద్యాన్ని శెట్టిపల్లికి తీసుకువచ్చిన వెంటనే తన అనుచరులతో కలిసి గ్రామాల్లో... తమకు అనుకూలంగా ఉన్న మద్యం వ్యాపారులకు చేరవేసే వాడని తెలిసింది. తాను పెనుకొండ మండల టీడీపీ కన్వీనర్ కావడం వల్ల ఆ మండలంలో వ్యాపారం చేస్తే తెలిసిపోతుందని భావించే...పక్కన ఉన్న కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా అనంతపురం నుంచే ఫోన్ ద్వారా నడిపేవాడని తెలుస్తోంది. సంబరాల్లో మరో వర్గం.. మద్యం అక్రమ రవాణా చేస్తూ సిద్దయ్య పట్టుబడటంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు స్థానిక హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో సమావేశమై ఆనందోత్సాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోన్లలోనూ ‘సిద్దయ్య...దొరికిపోయాడు’ అని సంతోషంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ నాయకురాలికి ఫోన్లో తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. (చదవండి: సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్) -
ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్న జనం.. ఎందుకంటే!
ప్రజా రవాణా వ్యవస్థ పట్ల నగర వాసులకు ఆసక్తి సన్నగిల్లుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వేళాపాళలేకుండా రావడం, గంటలకొద్దీ వేచి చూడడం, ప్రయాణం ఆలస్యం కావడం, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో నగర వాసులు ప్రజా రవాణాకు దూరమవుతున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 46 నగరాల్లో 2 లక్షల మంది పైగా తమ అభిప్రాయాలను సర్వేలో వ్యక్తపరిచారు. 15 వేల మంది పైగా బస్సు డైవర్లు, కండక్టర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. రద్దీ ఎక్కువ.. నమ్మకం లేదు విపరీతమైన రద్దీ కారణంగా బస్సులు ఎక్కడానికి భయపడుతున్నామని 68 శాతం మంది ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వెళితే సమయానికి గమ్యస్థానానికి చేరతామన్న నమ్మకం లేదని 64 శాతం మంది చెప్పారు. భద్రత పట్ల 36 శాతం మంది ఆందోళన వెలిబుచ్చారు. బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదని 27 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ చేయాలి ప్రజా రవాణా వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరగాలని జనం కోరుకుంటున్నారు. బస్సులు ఏయే మార్గాల్లో, ఏ సమయంలో వెళుతున్నాయి.. ఎక్కెడెక్కడ ఆగుతాయనే సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండాలని 57 శాతం మంది కోరుకున్నారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారిలో 54 శాతం మంది ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. సింగిల్ జర్నీ చేసే వారిలో 53 శాతం మంది నగదు చెల్లించేందుకే ఇష్టపడుతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లలో ఎక్కువ శాతం క్యాష్ పేమెంట్లకే ఆసక్తి చూపుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లతో తంటా నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్నామని 59 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లు వాపోయారు. ట్రాఫిక్ కారణంగానే సమయానుకూలంగా బస్సులు నడపలేకపోతున్నామని చెప్పారు. ఇక బస్సు సిబ్బందిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాదాపు 50 శాతం మంది రోగాల బారిన పడుతున్నారు. 34 శాతం మంది బస్సు డ్రైవర్లకు బీమా భద్రత లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లలో 45 శాతం మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అందని ద్రాక్షగానే ఉంది. ఒత్తిడి, ఆందోళన, కీళ్లు-ఒళ్లు నొప్పులు ఎక్కువగా వేధించే సమస్యలని వెల్లడించారు. సర్వే ఎందుకంటే.. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమంలో భాగంగా ‘ట్రాన్స్‌ఫోర్ట్ ఫర్ ఆల్ చాలెంజ్’ పేరుతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ సర్వే చేపట్టింది. 2021 అక్టోబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు సర్వే నిర్వహించింది. ప్రజా రవాణా వ్యవస్థలో సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడానికి ఇదంతా చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున సమాచారం సేకరించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. సర్వేలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రెండో దశలో ప్రయత్నాలు చేస్తామన్నారు. అంకుర సంస్థలు ఏమైనా పరిష్కారాలు ఉంటే స్టార్టప్ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. (క్లిక్: కేపీహెచ్‌బీ టూ ఓఆర్ఆర్.. మెట్రో నియో పట్టాలెక్కేనా!) -
సరకు రవాణా ఖర్చులు తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ : వాటాదారులు మధ్య సహకారం, సమన్వయం, కమ్యునికేషన్లతో సరకు రవాణా ధరను 14 శాతం, 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ పిలుపునిచ్చారు. తద్వారా ఎగుమతుల్లో 50 శాతం పెరుగుదల సాధించొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో‘ క్లైమేట్ గోల్స్: టెక్నలాజికల్ రోడ్ మ్యాప్ టు నెట్ జీరో ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సమాజానికి ముఖ్యమైన మూలస్తంభాలని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు ఒక బృందంగా కలిపి పని చేస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరసం ఉందన్నారు. భారతదేశంలో యువ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ మానవశక్తితోపాటు తక్కువ కార్మిక వ్యయంతో దేశీయ మార్కెట్ ఉందన్నారు. బయో ఇథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ఆవశ్యకత వివరించారు. ఏటా 16 లక్షల కోట్ల శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి 27 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు రూపొందించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి గడ్కరీ వివరించారు. చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది! -
నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!
సాగర్ (మధ్యప్రదేశ్): కోట్లు విలువచేసే స్మార్ట్ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్‌ను నలుగురు దొంగలు లూటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా మహరాజ్‌పూర్ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. అయితే ఆ ఫోన్లన్నింటినీ 24 గంటల్లోపే పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మాత్రం పారిపోయారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన ఈ మొబైల్ ఫోన్లను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా హరియాణాలోని గురుగ్రామ్‌కు తీసుకెళ్తున్నారు. ట్రక్కును గురువారం రాత్రి నలుగురు దుండగులు అడ్డుకుని డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. నరసింగాపూర్ వద్ద అతన్ని దింపేసి ఫోన్లను కంటైనర్ నుంచి తమ ట్రక్కులోకి మార్చుకుని పారిపోయారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలికి 400 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డగించడంతో ట్రక్కును వదిలేసి పారిపోయారు. మొత్తం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్ చెప్పారు. -
ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపు.. జాగ్రత్త సుమా!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు(నాటుబళ్లు)తో ప్రయాణం చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కె.నీలకంఠం హితవు పలికారు. ఈ మేరకు నాటుబళ్లతో రాత్రి పూట ప్రయాణం చేస్తున్న రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుబళ్లతో ఇసుక తరలించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బూర్జ, పెదంకలాం, లక్ష్మీపురం, చినభోగిలి, పెదభోగిలి, సీతానగరం, తామరఖండి అంటిపేట, వెంకటాపురం, నిడగల్లు, కాశీపేట, పణుకుపేట తదితర గ్రామాల్లో నాటుబళ్లు ఉన్న రైతులు సువర్ణముఖినదిలో రేవులనుంచి రాత్రిపూట ఇసుక తరలించి విక్రయాలు చేస్తున్నారన్నారు. రాత్రిపూట నాటుబళ్ల ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటుబళ్లు ఉన్న రైతులు బళ్లకు ‘రేడియం’ స్టిక్కర్లు విధిగా వాడాలని సూచించారు. రేడియం స్టిక్కర్లు అతికించడం వల్ల రాత్రిపూట ఎదురుగా రాక పోకలు చేస్తున్న భారీ వాహనాలకు నాటుబండి వస్తున్నట్లు తెలుస్తుంద న్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులున్న చోట భారీవాహనాల డ్రైవర్లు, నాటుబళ్లతో వెళ్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. -
దేశంలోనే తొలి 'ఎలక్ట్రిక్ హైవే'.. ఆ నగరాల మధ్య నిర్మాణం!
ఢిల్లీ: దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది భారత ప్రభుత్వం. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీబస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో నిర్వహంచిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.5 లక్షల సొరంగాలను నిర్మించినట్లు తెలిపారు. 'ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నాం. ట్రాలీబస్సుల మాదిరిగానే మీరు ట్రాలీట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం.' అని తెలిపారు. అయితే.. ఈ రహదారి గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ హైవే అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ హైవే అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాహనాలకు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీబస్సులు, ట్రాలీట్రక్కులను ఉపయోగించటం ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు రవాణా సామర్థ్యం పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన. మరోవైపు.. పెట్రోల్, డీజిల్‌ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే.. అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, ఆర్టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే తమ లక్ష్యమన్నారు. వస్తు రవాణా వ్యయం చైనా, ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లోనే అధికమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
ఇన్నోవాలో రెండు ఆవుల తరలింపు
కేతేపల్లి: ఇన్నోవా కారులో రెండు ఆవులను కుక్కి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తుండగా గురువారం కేతేపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద గురువారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇన్నోవా కారులో రెండు ఆవులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.అనిల్‌రెడ్డి తెలిపారు. -
లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా ‘సహకార్’
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల రంగంలో దేశంలో ఓలా, ఉబర్ పెద్ద ఎత్తున చొచ్చుకుపోయాయి. ఇప్పుడు వీటికి పోటీగా మరో సంస్థ రాబోతోంది. లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా సహకార్ ట్యాక్సీ పేరుతో నేషనల్ టూరిజం, ట్రాన్స్పోర్ట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్‌ఎఫ్‌టీసీ) సేవలను పరిచయం చేయబోతోంది. కొరియర్ సేవల రంగంలోకి సైతం ప్రవేశించనున్నట్టు ఫెడరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ధరల కంటే చవకగా ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎన్‌ఎఫ్‌టీసీ చైర్మన్ వి.వి.పి.నాయర్ వెల్లడించారు. అధిక ప్రయోజనం డ్రైవర్లకు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించే సహకార్ ట్యాక్సీ ద్వారా కొన్నేళ్లలో 10 లక్షలకుపైగా మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్‌ఎఫ్‌టీసీ 2011 నుంచి సహకార రంగంలో సేవలు అందిస్తోంది. చదవండి: నితిన్ గడ్కారీ.. హైడ్రోజన్ ఫ్యూయల్‌పై భవీశ్ ఏమన్నాడో విన్నావా? -
ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తిపైనే ఆధారపడి ఉండదు: గోయల్
-
లక్కీ ‘పార్సిల్’: దక్షిణ మధ్య రైల్వే రికార్డు
సాక్షి, హైదరాబాద్: పార్సిళ్ల రవాణా విషయంలో చేసిన మార్పు రైల్వేకి కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో సాధారణ ప్రయాణికుల రైళ్లకు ఒకటి రెండు చొప్పున పార్సిల్ బోగీలను జత చేసేవారు. లగేజీ బుక్ చేసుకునేవారు వాటిల్లో తమ పార్సిళ్లను పంపేవారు. వ్యాపారులు బుక్ చేసిన ప్యాక్డ్ సరుకును వాటిల్లో గమ్యం చేర్చేవారు. దీనివల్ల సాలీనా రూ.80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. ఇటీవల కోవిడ్ సమయంలో ఇలాంటి సరుకు తరలింపునకు పూర్తి రైళ్లను కేటాయించారు. ఈ మార్పు వ్యాపారులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలలకే 2.56 లక్షల టన్నుల సరుకు తరలింపుతో ఏకంగా రూ.109.06 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఉత్సాహంగా మిగతా కాలానికి మరింత ఆదాయం వచ్చేలా రైల్వే అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈమేరకు తాజాగా లెక్కలు రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి రూ.108.35 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రికార్డుగా నిలిచింది. ఇప్పుడు దాన్ని కేవలం ఆరు నెలల కాలంలోనే బ్రేక్ చేయటం విశేషం. వేగంగా.. తక్కువ ఖర్చుతో.. కోవిడ్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ప్రయాణికుల రైళ్లు చాలాకాలం నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు సరుకు రవాణా రైళ్లపై అధికారులు దృష్టి సారించారు. సిమెంటు, బొగ్గు, స్టీల్ వంటి వాటి కోసం పూర్తిస్థాయి గూడ్సు రైళ్లను నడిపినట్టుగానే, ఇతర సరుకు కోసం పూర్తిస్థాయి పార్సిల్ రైళ్లను నడపాలని నిర్ణయించి వ్యాపారులతో సంప్రదింపులు చేపట్టారు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. వేగంగా, తక్కువ ఖర్చుకే గమ్యస్థానం చేరుస్తామని హామీ ఇవ్వటంతో వ్యాపారులు ముందుకొచ్చారు. పండ్లు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, పాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేశారు. ఏప్రిల్ నుంచి సెపె్టంబరు 27 వరకు 343 కిసాన్ రైళ్లను నడిపి ఉల్లిపాయలు, మామిడి పళ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు 1,08,388 టన్నుల మేర సరఫరా చేశారు. దీనివల్ల రూ.49.43 కోట్ల ఆదాయం వచ్చింది. దేశ రాజధానికి దూద్ దురంతో రైళ్ల ద్వారా 3.78 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయటం ద్వారా రూ.8.91 కోట్ల ఆదాయం సమకూరింది. కోడిగుడ్లు, బేబీ డైపర్స్, ఎంఆర్ఎఫ్ టైర్లు ఇలా చాలా పార్సిళ్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసింది. పార్సిల్ రవాణా ద్వారా రికార్డుస్థాయి ఆదాయం పొందడంలో అధికారులు చూపిన చొరవ అభినందనీయమని, భవిష్యత్తులో మరింత ఆదాయం కోసం కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా చెప్పారు. -
మూడు నెలల్లో సీఎం కేసీఆర్ ఇలాకాకు గూడ్స్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలతో గజ్వేల్‌కు ప్రయాణికుల రైలు నడపటంలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ, మరో మూడు నెలల్లో సరుకు రవాణా రైలు ప్రారంభం కాబోతోంది. ఇంతకాలం అటు సిద్దిపేట మొదలు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గాన్నే వినియోగిస్తున్నారు. ఇప్పుడు తొలిసారి రైలు మార్గం అనుసంధానం కాబోతోంది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం గజ్వేల్ వరకు రైలు మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కానీ కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను నడపటం లేదు. ఈపాటికే ప్రయాణికుల రైలు సర్వీసు గజ్వేల్ వరకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కారణంతో మొదలు కాలేదు. అయితే వీలైనంత తొందరలో గూడ్సు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. గూడ్సు షెడ్డు నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి గూడ్సు రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. సమీపంలోని ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను లారీల ద్వారా గజ్వేల్ వరకు తరలిస్తే అక్కడి నుంచి గూడ్సు రైళ్లలో వాటిని తరలించొచ్చు. గజ్వేల్ రైల్వే స్టేషన్‌ను గురువారం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎం శరత్ చంద్రాయన్ తనిఖీ చేశారు. డిప్యూటీ సీఈ (కన్స్ట్రక్షన్) సదర్మ దేవరాయ, అధికారులులతో కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం: సముద్ర జలాల్లో తిరగాల్సిన పడవ లారీ ఎక్కింది. ఇదేంటా... అని అంతా ఆశ్చర్యంగా చూశారు. సీన్ కట్ చేస్తే ఓ పడవను లారీపై జాతీయ రహదారి మీదుగా బిహార్ నుంచి కోల్‌కతా తరలిస్తున్నారు. ఈ లారీ నాతవలస జాతీయ రహదారిపై గురువారం ప్రయాణం చేయడంతో అటుగా వెళ్లే వారంతా ఆసక్తిగా తిలకించారు. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి -
వారి దోపిడీకి.. తెల్ల బోవాల్సిందే..!!
పట్నంబజారు (గుంటూరు తూర్పు): ఆంధ్ర ప్రదేశ్‌లోని జిల్లాలోని ప్రైవేటు ట్రావెల్స్ వ్యాపారులు కొందరు యథేచ్చగా ట్రాన్స్పోర్ట్ దందా సాగిస్తున్నారు. వైట్‌బోర్డు మాటున ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొండుతున్నారు. ఎల్లో బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. సొంత అవసరాల పేరుతో వాహనాలను కొనుగోలు చేసి అద్దె ట్యాక్సీలు తిప్పుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లను నియమించుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చదవండి: దారుణం: చపాతీ కర్రతో అత్తను హత్యచేసిన కోడలు అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని రోడ్డు, పర్మిట్ పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైట్‌బోర్డు పెట్టుకుని కమర్షియల్ వాహనాలు సంచరిస్తున్నాయి. ఎల్లో బోర్డు వాహనాల కంటే ఇవే అధికంగా తిరుగుతున్నాయి. పలువురు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు వైట్‌బోర్డు ముసుగులో టాక్సీలు, క్యాబ్‌లను అద్దెకు తిప్పుతున్నారు. ప్రభుత్వాన్ని రూ. కోట్లలో పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. దందా ఇలా...! ట్రాన్స్‌పోర్టు వినియోగానికి కొనుగోలు చేసిన వాహనాలకు రవాణా శాఖ ఎల్లో బోర్డుతో (మాక్సీక్యాబ్) రిజిస్టేషన్ నంబరు జారీ చేస్తుంది. అదే సొంతంగా కొనుగోలు చేస్తే.. వైట్ నెంబర్ ప్లేటు కేటాయిస్తారు. ఇందులో ఎల్లో బోర్డు వాహనానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వైట్ బోర్డు వెహికల్ అయితే రిజిస్టేషన్ సమయంలో ఒకేసారి లైఫ్‌ట్యాక్స్ చెల్లిస్తే చాలు. ఈ నిబంధనను తమకు అనువుగా మలచుకున్న ట్రావెల్స్ వ్యాపారులు వైట్ బోర్డు కింద వాహనాలు తీసుకుని ట్యాక్సీలుగా అద్దెకు తిప్పుకుంటున్నారు. ప్రధానంగా 4–1 సీటింగ్ సామర్ధ్యంతో ఉన్న వైట్ బోర్డు వాహనాలు పెద్ద సంఖ్యలో ట్యాక్సీలుగా రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో 40 వేలకు పైగా వాహనాలు వైట్ నంబర్ ప్లేటుతో తిరుగుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 2958 మాక్సీ క్యాబ్‌లు ఉన్నాయి. ట్యాక్స్ ఎగవేతకే.. ప్రైవేటు ట్రావెల్స్ వారు త్రైమాసిక పన్నుతో పాటు రోడ్డు టాక్స్, చెక్‌పోస్టుల్లో పర్మిట్ చార్జీలను తప్పించుకునేందుకే తమ వాహనాలను వైట్‌బోర్డు ముసుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొండుతున్నారు. మామూలుగా టూరిస్టు బోర్డు (టీ–బోర్డు) ఎల్లో బోర్డు వాహనాలు ఏటా రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) పొందాల్సి ఉంటుంది. అదే వైట్‌బోర్డు వాహనాలైతే రిజిస్టేషన్ అయిన తరువాత 15 ఏళ్ల వరకు ఎఫ్‌సీ అవసరం ఉండదు. ట్రావెల్స్ యజమానుల దందా కారణంగా ఏటా సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందనే తెలుస్తోంది. మొక్కుబడిగా తనిఖీలు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద తూ తూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో వైట్ బోర్డులు తగిలించుకున్న ట్యాక్సీలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. కొంత మంది అధికారులు ఎల్లో నంబర్ ప్లేటును సైతం వైట్ ప్లేటుగా మార్చుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇటీవల ఆర్డీవో, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇటువంటి వాస్తవాలు బయట పడ్డ కనీసం, అధికారుల్లో మాత్రం చలనం కరవైందనే చెప్పాలి. ఎల్లో ప్లేట్ మొదలు ఉదాహరణకు ఏపీ 39 తరువాత ‘టీ’తో మొదలయ్యే ప్రతి వాహనం ట్యాక్సీ ప్లేట్ అని స్పష్టం చేస్తోంది. అవి సైతం వైట్ ప్లేటుగా మార్చుకుని అధికారులే నేరుగా తిరుగుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ట్రావెల్స్తో మిలాఖత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రావెల్స్‌కు సంబంధించి వైట్ ప్లేట్ (ఓన్ప్లేట్) వాహనాలు తిరుగుతున్నాయని తెలిసినప్పటికీ అధికారులు మిన్నకుండి పోతున్నారనే విమర్శలు లేకపోలేదు. దీనికి సంబంధించి ఆయా డివిజన్ అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రావెల్స్ యజమానులతో పాటు, పలు బస్సుల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనేది సమాచారం. తనిఖీలు చేపడతాం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడతాం. పూర్తిస్థాయిలో ట్రావెల్స్‌పై దృష్టి సారించి, ప్రైవేట్ వాహనాలు ట్రావెలింగ్కు తిరగకుండా నిరోధిస్తాం. అయితే ప్రయాణికులు సైతం ఎల్లో ప్లేటు ఉన్న వాహనాలను మాత్రమే, ప్రయాణానికి వినియోగించాలని కోరుతున్నాం. దానివలన ప్రమాదవశాత్తూ.. ఏదైనా జరిగినా ఇన్సురెన్స్ వర్తిస్తుంది. వైట్ ప్లేటులో ఇన్సూరెన్స్ ప్రయాణికులకు వర్తించదు. అధికారులకు ఎటువంటి అవినీతికి పాల్పడినా.. సహించం. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. – ఇవ్వల మీరాప్రసాద్, డీటీసీ, గుంటూరు చదవండి: శీతాకాల అతిథులొచ్చేశాయ్! -
రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద రూ.21 కోట్లు విలువచేసే 3,400 కిలోల గంజాయిని తరలిస్తున్న ట్రక్కును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకుని జప్తుచేశారు. 141 గన్నీ సంచుల్లో సరుకు నింపి, బయటకు కనిపించకుండా టార్పాలిన్ షీట్లతో కప్పేశారు. అనుమానం రాకుండా దానిపై నర్సరీ మొక్కలను లోడ్‌చేశారు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ నుంచి అందిన సమాచారంతో ఎన్సీబీ హైదరాబాద్, బెంగళూరు బృందాలు సంయుక్తంగా దాడిచేసి ట్రక్కును పట్టుకున్నాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ట్రక్కులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన డి.షిండే, ఎంఆర్ కాంబ్లే, ఎన్.జోగ్‌దండ్‌ను అరెస్టుచేశారు. గతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో 3,992 కిలోల గంజాయిని జప్తుచేసుకుని 16 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో లభించిన సమాచారం ఆధారంగా మరో మూడు స్మగ్లర్ల నెట్‌వర్క్‌లను ఎన్సీబీ ఛేదించింది. గత ఆపరేషన్ ద్వారా లభించిన సమాచారంతోనే తాజాగా మరోసారి పట్టుకున్నట్టు ఎన్సీబీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ఓ కీలక వ్యక్తి తాజాగా పట్టుబడిన ముఠా వెనక ఉన్నట్టు ఎన్సీబీ గుర్తించింది. ముంబై, పూణె, థానెతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డ్రగ్స్ సిండికేట్ల కోసం అతడు ఈ సరుకును తరలించేందుకు ఏర్పాట్లు చేశాడని తెలిపింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని సిండికేట్ల ద్వారా కళాశాలల విద్యార్థులు, పార్టీలు, వ్యక్తులకు సరఫరా చేస్తున్నారని పేర్కొంది. -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్‌లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్‌కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్‌పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటల రవాణాపై ఆంక్షలు లేవని అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మామిడి పండ్ల కోసం 27 కిసాన్ రైళ్లను ఏర్పాటు చేశామని.. మామిడి ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదు వారాల నుంచి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మిర్చి, పసుపు, అరటి, ఆరెంజ్ పంటలకు మద్దతు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 25చోట్ల పండ్ల ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జులై 8న 2 వేల గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని పూనం మాలకొండయ్య వెల్లడించారు. చదవండి: గోదావరి జిల్లాల్లో సాగునీటి కష్టాలకు ఇక చెల్లుచీటీ! గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా -
కరోనా దెబ్బకు మారిన జీవితం
సాక్షి, తుర్కయంజాల్: కరోనా కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. బతుకు దెరువు కోసం కొత్త కొత్త పనులు చేస్తూ పూట గడుపుతున్నారు. నగరంలోని చంద్రాయణగుట్టకు చెందిన ఖాజా వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. కోవిడ్ కారణంగా గిరాకీలు లేక పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీంతో అతడికి ఏ మాత్రం అనుభవం లేని తాటి ముంజలు అమ్మడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు మాల్, మర్రిగూడెం సమీపంలోని గ్రామాలకు వెళ్లి తాటి ముంజలు తీసుకొచ్చి తుర్కయంజాల్‌లో విక్రయిస్తున్నాడు. ప్రసుత్తం చేస్తున్న పని కొత్తది అయినప్పటికీ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడటంలో తప్పులేదని తెలిపాడు. (చదవండి: ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం.. ఇదేం పాడు పని) -
‘ఎవర్ గివెన్’ చెప్పే గుణపాఠం
చరిత్రలో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలకు మౌన సాక్షిగా వున్న సూయిజ్ కెనాల్ మరోసారి వార్తల్లో కెక్కింది. మంగళవారం వేకువజామున హఠాత్తుగా విరుచుకుపడిన ఇసుక తుపానులో సరుకులతో వెళ్తున్న భారీ నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుంది. గత రెండురోజులుగా ఆ నౌక అంగుళం కూడా అటూ ఇటూ కదులుతున్న జాడ లేదు. పర్యవసానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరువంటి మహా నగరాల్లో మనం తరచుగా చూసే నరకప్రాయమైన ట్రాఫిక్ జామ్‌లను తలదన్నే రీతిలో ఇప్పుడు సూయిజ్ కెనాల్ వుంది. ‘ఎవర్ గివెన్’ మొరాయించిన సమయానికి కెనాల్లో ప్రవేశించివున్న దాదాపు 200 నౌకలు చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రాన్నీ, మధ్యధరా సముద్రాన్ని అనుసంధానించి తూర్పు, పడమరలను ఏకం చేసి, ఖండాంతర వాణిజ్యంతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో వుండాలని కలగని 1859లో ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. వాస్తవానికి ఇది అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. ప్రాచీన ఈజిప్టు రాచరిక వ్యవస్థలు క్రీస్తుపూర్వమే దీన్ని కలగన్నాయి. నెపోలియన్ సైతం ఈ కెనాల్ నిర్మిస్తే బ్రిటన్‌ని దారికి తేవొచ్చని, దానిపై పైచేయి సాధించవచ్చని ఆలోచించాడు. కానీ చివరకు ఫ్రాన్స్ ఏలుబడిలోని ఈజిప్టుకే కాలం కలిసొచ్చింది. ఒక ఫ్రాన్స్ దౌత్యవేత్త చొరవతో ఏర్పాటైన కంపెనీ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన దాదాపు 194 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను నిర్మించింది. దీనివల్ల కలిగే లాభాన్ని గుర్తించి బ్రిటన్ ఇందులో 40 శాతం వాటాను పోరుపెట్టి సాధించుకుంది. ప్రపంచంలో ఇంకా పనామా కెనాల్, వోల్గా డాన్ కెనాల్, గ్రాండ్ కెనాల్ వంటివి వున్నాయి. కానీ సూయిజ్ ప్రధాన సముద్ర మార్గాలను అనుసంధానించే మెరుగైన కెనాల్. పర్యావరణవేత్తలు కావొచ్చు, నౌకాయాన రంగ నిపుణులు కావొచ్చు... రాకాసి నౌకా నిర్మాణం జోలికిపోవద్దని చాన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు ఎదురైతే భారీ నౌకలతో చేటు తప్పదని ప్రాణ నష్టంతోపాటు సముద్ర జలాలు కాలుష్యమయమై పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. కానీ పెద్ద మొత్తంలో సరుకు పంపిణీ చేయటానికి, భారీగా ఆదాయం రాబట్టడానికి భారీ నౌకలే మేలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే వారి హెచ్చ రికలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. ఇప్పుడు ‘ఎవర్ గివెన్’ అడ్డం తిరిగిన వైనం వారి హితవచనాలను మరోసారి గుర్తుకుతెస్తోంది. 2,20,000 టన్నుల సరుకును మోసుకుపోగల సామర్థ్యం దానికుంది. అయితే ఆ నౌక పూర్తిగా కుంగిపోయే స్థితి ఏర్పడకపోవటం ఒక రకంగా అదృష్టమే. ప్రపంచ వాణిజ్యం గత రెండున్నర దశాబ్దాల్లో వందల రెట్లు విస్తరించింది. ఒకప్పుడు ఆహారం, సరుకులు, చమురు, ఖనిజాలు వంటివే ప్రధానంగా రవాణా కాగా, ఇంటర్నెట్ అందు బాటులోకి రావటంతో విశ్వవ్యాప్త వస్తు సేవలు విపరీతంగా పెరిగాయి. విమానయానం ఎంత వేగంతో కూడినదైనా, విమానాల ద్వారా సరుకు రవాణా ఎంతగా విస్తరించినా వాణిజ్యంలో ఈనాటికీ 90 శాతం వాటా సముద్ర మార్గాలదే. ఇందులో సూయిజ్ కెనాల్ ద్వారా సాగే వాణిజ్యం దాదాపు 15 శాతం. పశ్చిమాసియా నుంచి యూరప్, అమెరికాలకు... రష్యా నుంచి ఆసియా దేశాలకు ముడి చమురు రవాణా సాగుతున్నదీ ఇటునుంచే. అందుకే ఈ దిగ్బంధం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా సరుకు పంపిణీలో అస్తవ్యస్థ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళన వుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాలను విడదీసే ఈ కెనాల్... యూరప్‌కు రాకపోకలు సాగించే నౌకలు దక్షిణ అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. అందువల్ల దాదాపు ఏడువేల కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. వారం రోజుల సమయాన్ని ఆదా చేస్తోంది. రోజూ సగటున 50 నౌకలకు వరకూ ప్రయాణించే సూయిజ్ కాల్వ ఈజిప్టు ఖజానాకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం ఏటా దాదాపు 1,500 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. సూయిజ్ కెనాల్‌ను మరింత విస్తరించటానికి ఆ దేశం ఇప్పటికే పనులు ప్రారంభించింది. అదంతా మరో రెండేళ్లలో పూర్తయితే ఈజిప్టు ఆదాయం మూడింతలు పెరుగుతుంది. అంతర్జాతీయ నావికా సంస్థ(ఐఎంఓ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం నౌకాయానం వల్ల ఏటా వాతావరణంలోకి వేయి మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. ఇది ప్రపంచ వార్షిక ఉద్గారాల్లో 3.1 శాతం. 2050నాటికి ఉద్గారాలను కనీసం 50 శాతం తగ్గించుకోవాలని ఐఎంఓ కోరుతోంది. భారీ నౌకల వల్ల పొంచివుండే ఇతరత్రా ప్రమాదాల సంగతలావుంచి వాటి ఇంధన సామర్థ్యం తక్కువని ఐఎంఓ చెబుతోంది. కనీసం కొత్త సాంకేతికతలను పెంచుకుని, మెరుగైన డిజైన్లతో నౌకల్ని నిర్మిస్తే, వాటి వేగాన్ని నియంత్రణలోవుంచితే కర్బన ఉద్గారాల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది దాని సూచన. నౌకల వేగాన్ని సగటున పదిశాతం తగ్గిస్తే కర్బన ఉద్గారాలను నియంత్రించటం వీలవుతుందని సూచిస్తోంది. నౌకల వేగంపై నిరంతరం నిఘా వుంచుతూ అవి ఎక్కడ సంచరిస్తున్నాయో, వాటి వేగం, దిశ ఎలావున్నాయో తెలుసుకునే సాంకే తికతలు అందుబాటులోకొచ్చాయి. వాటిని అమర్చుకోవటాన్ని తప్పనిసరి కూడా చేశారు. 150 ఏళ్లక్రితం అందుబాటులోకొచ్చి, ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించే సూయిజ్ కెనాల్లో చోటుచేసుకున్న తాజా ఉదంతం నౌకా యానంలో ఇమిడివుండే సమస్యలను మరోసారి అందరి దృష్టికీ తెచ్చింది. -
ఇక.. గార్డులేని రైలు
సాక్షి, విశాఖపట్నం: రైలు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించే వారిలో ముందు వరసలో ఉండే గార్డుల వ్యవస్థ త్వరలోనే కనుమరుగు కానుంది. రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక వ్యవస్థ మరింత సురక్షిత రవాణాకు సాయపడనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే.. గార్డుల స్థానాన్ని భర్తీచేస్తోంది. ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వేలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం అయింది. త్వరలోనే వాల్తేరు డివిజన్లో ప్రయోగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త వ్యవస్థ సఫలీకృతమైతే గార్డులను ఇతర స్థానాల్లో భర్తీ చేయనున్నారు. రైలు పట్టాలపై సురక్షితంగా పరుగులు తీయాలంటే గార్డులు కచ్చితంగా అవసరం. సంప్రదాయంగా భారతీయ రైల్వేలో గార్డులే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వారి స్థానంలో సాంకేతికత అమలు కాబోతోంది. ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ (ఈవోటీటీ) అమలుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ఈస్ట్‌కోస్ట్ జోన్లో గతనెల ఈవోటీటీని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా.. గూడ్స్ ట్రైన్ గార్డు లేకుండా వందల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణం సాగించింది. రైలును భద్రంగా నడిపించే గార్డు నిర్వర్తించే ప్రతి బాధ్యతను ఈవోటీటీ విజయవంతంగా చేపడుతోంది. చివరి బోగీలో ఏర్పాటు రైలు చివరి బోగీలో ఈవోటీటీ పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. లోకోపైలట్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సురక్షితంగా అందిస్తుంటుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) ద్వారా ఇది పనిచేస్తుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన పరికరం ద్వారా ఎప్పటికప్పడు సమాచారం పైలట్‌కు అందుతుంది. దీనికి ఆటోమేటిక్ స్విచ్ విధానం ఉంది. ట్రాక్ వ్యవస్థలో ఏవైనా మార్పులు కనిపించినా, ఏదైనా ప్రమాదం జరగకుండా ముందే.. దూసుకుపోతున్న రైలును ఆపేలా ఎయిర్ బ్రేక్ ఈవోటీటీ అదనపు సౌకర్యం. బ్రేక్ పవర్ ప్రెజర్‌ను లోకోపైలట్ నియంత్రించేలా ఎయిర్ బ్రేక్ ఉపయోగించి రైలు ఆపవచ్చు. గూడ్స్ రవాణాపై విశాఖ నుంచి పరిశీలన తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ అత్యాధునిక వ్యవస్థను త్వరలోనే జోన్లో భాగమైన వాల్తేరు డివిజన్‌లోనూ పరిశీలించనున్నారు. గూడ్స్ రవాణాపై విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఈవోటీటీ ప్రయోగాన్ని అమలు చేస్తామని డివిజన్ అధికారులు తెలిపారు. భద్రతకు భంగం కలగకుండా, రైల్వేపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించేలా ఈవోటీటీ పరికరం తయారు చేశారని చెప్పారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే గార్డుల అవసరం ఉండదని, గార్డులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అత్యాధునిక పరికరం లోకోపైలట్ స్థైర్యానికి కొత్త ఊపిరి పోస్తుందని పేర్కొన్నారు. -
కార్గో పార్శిల్ హోం డెలివరీని ప్రారంభించిన పువ్వాడ
సాక్షి, హైదరాబాద్: కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్ పువ్వాడ తెలిపారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు. పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్పల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. అక్యూపెన్సి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా పాండమిక్‌ని మర్చిపోయి బస్సులను ఆదిరిస్తున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు కూడా పూర్తిగా నడుస్తున్నాయని, కష్టకాలంలో రూ. 200 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ మొత్తం 1200 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చేయూతనిచ్చారని తెలిపారు. కార్గో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్శిల్లు మిస్ కావడం కానీ డ్యామేజ్ కావడం లాంటివి జరగీలేదన్నారు. ప్రస్తుతం కార్గోలో ఎజెంట్స్ కూడా పెరిగారని, మరిన్ని సేవల కోసమే హోం డెలివరీని ప్రారంభించిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అందిరికి ఇస్తున్నామని.. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి చెప్పారు. -
36 కిమీ..28 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సైబరాబాద్ పోలీసుల సహకారంతో మరోసారి ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శంషాబాద్‌లోని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ అయిన ఊపిరితిత్తుల్ని తరలిస్తున్న అంబులెన్స్‌ల కోసం ఈ పని చేశారు. ఫలితంగా ఈ 36.8 కిమీ దూరాన్ని అంబులెన్స్ కేవలం 28 నిమిషాల్లో అధిగమించాయి. ఇతర రాష్ట్రంలోని ఓ డోనర్ ఇచ్చిన ఊపిరితిత్తులతో కూడిన విమానం శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ లైవ్ ఆర్గాన్స్ బాక్సుల్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్‌లు అక్కడకు చేరుకున్నాయి. చదవండి: 11.5 కిమీ.. 9 నిమిషాలు అక్కడ నుంచి ఉదయం 11.11 గంటలకు బయలుదేరాయి. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌లకు ఎస్కార్ట్‌గా ముందు వెళ్ళింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో నిరాటంకంగా సాగి 11.39 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర ట్రాఫిక్ పోలీసులు మొత్తం 13 సార్లు లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్సుల కోసం గ్రీన్‌ఛానల్ ఇచ్చినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ తెలిపారు. -
పర్యాటక రంగం పరుగు!
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరోనా ప్రభావం పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలపై తీవ్రంగా ఉంది. ఇప్పటికీ హోటల్స్‌లో తినాలన్నా, వేరే ఊళ్లకి వెళ్లాలన్నా ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ఒక ఆర్థిక ప్యాకేజీని రూపొందించడానికి కసరత్తు చేస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఒక జాతీయ చానెల్‌కు వెల్లడించారు. ఈ ప్యాకేజీతో పర్యాటక రంగం పరుగులు పెట్టడమే కాకుండా పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అంతే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బలోపేతంపై కూడా కేంద్రం దృష్టి సారిస్తున్నట్టుగా అమితాబ్ కాంత్ వెల్లడించారు. అయితే ఈ ప్యాకేజీని ప్రకటించడానికి మరో రెండు మూడు నెలలు పడుతుందని ఆయన వివరించారు. ఈ పండుగ సీజన్లో వచ్చే ఆదాయ మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. పౌర విమానయానం, రైల్వేల నుంచి ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సెప్టెంబర్‌లో ప్రజల కొనుగోలు శక్తి సూచి 56.8 పాయింట్లకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మధ్య తరగతి ప్రజలు దసరా, దీపావళి సీజన్లో ఎంత ఖర్చు పెడతారో చూడాల్సి ఉందని అమితాబ్ కాంత్ చెప్పారు. -
ప్రమాదకరంగా పశ్చిమ బెంగాల్ రవాణా
కోల్‌కతా: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ దేశంలో ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రల్లో ప్రజా రవాణా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో బస్సులను శానిటైజ్ చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బస్సు మొదలైనప్పుడు తప్ప మరెక్కడ బస్సును శానీటైజ్ చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. పశ్చిమ మిడ్నపూర్‌లో జిల్లా మేజిస్టేట్ బస్సులను శానిటైజ్ చేయాలని ఆదేశించినప్పటికీ బస్సు యజమానులు ఖాతరు చేయడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో డ్రైవర్లకు, కండక్టర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. (చదవండి: కరోనా మృతులకు 10 లక్షలు.. ఉద్యోగం) దీంతో మిగిలిన వారు కూడా విధులకు రావడానికి సంకోచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో బస్సులు ఆగిపోయాయి. కరోనా పాజిటివ్ సోకిన ఒక కండక్టర్ 30 మంది ఇతర సిబ్బందితో కలిసి ఉండటం కలకలం రేపింది. ఈ విషయం గురించి ప్రైవేట్ బస్సు యజమానులు మాట్లాడుతూ.. బస్సుకు 20 మందినే అనుమతించడం వల్ల తమకు చాలా నష్టం వస్తుందని, ఇక శానిటైజర్లు వాడటం, బస్సులను శానిటైజ్ చేయించడం అంటే తమ వల్ల కాదని చెప్పారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ సిన్హా స్పందిస్తూ.. ‘బెంగాల్లో బస్సు సదుపాయాలను కల్పిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సిబ్బందికి ఇప్పటి వరకు సరైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు కూడా ఇవ్వలేదు’ అని ఆయన ఆరోపించారు. (చదవండి: కరోనా కట్టడికే ఆన్లైన్ ప్రజావాణి) -
తమిళనాడు : రవాణాకు బ్రేక్..లాక్డౌన్ పొడిగింపు
చెన్నై : దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ర్టాల్లో తమిళనాడు ఒకటి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 15 వరకు అమల్లో ఉన్న ప్రభుత్వ,ప్రైవేటు రవాణాను ఈనె 31 వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయించింది. అయితే ఆటోలు, క్యాబ్‌లకు మాత్రం అనుమతులిన్నట్లు పేర్కొంది. రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని, దీనిలో భాగంగానే ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు సహకరించకుంటే ఆ కష్టం అంతా వృధాగా పోతుందని కరోనా నివారణకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. (పంజాబ్‌లో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినం) -
ఆరేళ్లుగా విద్యుత్ సరఫరాకు నోచుకోని గ్రామం
కొండల కోనల మధ్య నాగరిక జీవనానికి..అభివృద్ధికి ఆమడ దూరంలో చీకటిలో మగ్గుతోంది టేకులపెంట గ్రామం. కొమరోలు మండలం చింతలపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న ఆ గ్రామానికి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్ల రాళ్లుతేలిన మట్టిబాటే శరణ్యం. ఆ ఊరి మొత్తం మీద అక్షరాలు నేర్చిన వారు ముగ్గురే. ఆ ఊరికి విద్యుత్ వెలుగులే లేవు..ఇక ఫోను, టీవీ సంగతి సరేసరి. దప్పికేస్తే నేల బావి..ప్రాణం మీదకొస్తే డోలీలే దిక్కు. ఆ గ్రామస్తుల స్థితిగతులపై సాక్షి కథనం గిద్దలూరు: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఫోన్, టీవీకి దూరంగా జీవిస్తున్న వారు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నెలకు ఓసారి కూడా వారు బస్సులు, ఆటోల ముఖం చూడరంటే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ అదే నిజం.! నాగరిక జీవనానికి దూరంగా ఉంటున్న ఆ గ్రామం పేరు టేకులపెంట. కొమరోలు మండలం చింతలపల్లెపంచాయతీ పరిధిలో ఉంటుందీ ఊరు. ఏదైనా పనిమీద గ్రామం నుంచి బయటకురావాలంటే ఏడు కి.మీ దూరం రాళ్లు, ముళ్లపొదల్లో క్రూర మృగాల మధ్య నడిచి వెళ్లాలి. సాయంత్రం ఆరు గంటలు దాటితే చిమ్మచీకటి. గ్రామానికి 2 కి.మీ దూరంలో ఉన్న నేలబావి నీటితోనే నేటికీ దప్పిక తీర్చుకుంటున్నారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లేదు. 60 మంది జనాభా నివసిస్తున్న గ్రామంలో చదువుకున్న వారు ముగ్గురే. సుస్తీ చేస్తే డోలీ కట్టుకుని ఏడు కి.మీ దూరం నడవాల్సిన దుస్థితి. సంక్షేమ పథకాలకు అర్హులైనా అవి అందించే మార్గం లేక అధికారులు తలపట్టుకుంటున్నారు. ‘మాకు రోడ్డు, కరెంటు, తాగునీటి బోరు ఏర్పాటు చేస్తే చాలు’ అంటున్నారే తప్ప గ్రామాన్ని ఖాళీ చేసిజనజీవన స్రవంతిలోకి వస్తామని చెప్పడం లేదు. టేకులపెంట వాసులకు ఏ అవసరమొచ్చినా, ఆపదొచ్చినా రాళ్లతో కూడిన దుర్భరమైన ఈ రహదారిలోనే ఏడు కిలోమీటర్ల దూరంప్రయాణించాలి.. కొండల మధ్య జీవనం చింతలపల్లె పంచాయతీ పరిధిలోని టేకులపెంట గ్రామం కొండల మధ్య ఉంది. వీరు ఐదు కి.మీ దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రానికి చేరుకోవాలంటే కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. దట్టమైన అడవులు, కొండల్లో చెట్లను తప్పించుకుంటూ నడవాలి. వీరు పంచాయతీ కేంద్రానికి వచ్చేది ఎన్నికల సమయంలోనే. రేషన్‌కార్డులు ఉన్నా సరుకులు తీసుకునేది తక్కువే. దట్టమైన అడవి మధ్య 40 కుటుంబాల వరకు ఉండేవి. అందరిదీ ఒకే సామాజిక వర్గం. కాలక్రమంలో ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం 14 కుటుంబాలకు చెందిన 60 మంది మాత్రమే నివసిస్తున్నారు. గ్రామానికి చుట్టూ రాతితో గోడ కట్టి అడవి జంతువులు రాకుండా చిన్న గేటు ఏర్పాటు చేసుకోవడం విశేషం. జబ్బు చేస్తే డోలీ కట్టాల్సిందే.. టేకులపెంటలో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీ కట్టుకుని ఏడు కిలోమీటర్ల దూరంలోని కోనపల్లి వరకు మోసుకెళ్లాల్సిన దీనావస్థ. అక్కడ నుంచి ఆటోలో సమీప వైద్యశాలకు వెళ్తారు. అనారోగ్యం నుంచి కోలుకుంటే చిన్నగా గ్రామానికి వెళ్తారు. లేదంటే బంధువుల వద్దకు వెళ్లి ఆరోగ్యం బాగయ్యాకే తిరిగి స్వగ్రామానికి వెళ్తారు. గర్భిణులు నెలలు నిండితే సాధారణ ప్రసవం చేస్తారు. లేదంటే డోలిలోనే వైద్యశాలకు తీసుకెళ్తారు. ఈ గ్రామంలో ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. సెల్‌ఫోన్ కొనుక్కున్నా చార్జింగ్ పెట్టేందుకు కరెంటు లేదు. మాట్లాడేందుకు సెల్ టవర్ సిగ్నల్ అందదు. కొండ నుంచి మైదాన ప్రాంతానికి రావాలని అధికారులు సూచించినా గ్రామస్తులు ఇష్టపడటం లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొండిగా భరిస్తున్నారు. గ్రామానికి రోడ్డు, తాగునీటి బోరు, విద్యుత్ సరఫరా తదితర వసతులు కల్పిస్తే ‘మా బతుకు మేము బతుకుతాం’ అని చెబుతున్నారు. టేకులపెంట గ్రామం వ్యూ సమస్యలతో సతమతం టేకులపెంట గ్రామం కొమరోలు మండలంలో ఉన్నప్పటికీ వీరికి ఏ అవసరం వచ్చినా బేస్తవారిపేట మండలంలోని కోనపల్లెకు వెళ్తారు. ఇందుకు ఏడు కిలోమీటర్లు నడవాలి. నడిచేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. మొనదేలిన రాళ్లపై కిందామీద పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలబావి(దిగుడుబావి) వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. ఆ నీటితోనే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో గతంలో మోటారు ఏర్పాటు చేసినా అది మరమ్మతులకు గురయ్యాక ఎవరూ పట్టించుకోలేదు. ఆరేళ్ల క్రితం వరకు విద్యుత్ సరఫరా ఉన్న ఈ గ్రామం.. ప్రస్తుతం చీకట్లో మగ్గుతోంది. ఆరేళ్ల క్రితం గాలివాన బీభత్సంతో స్తంభాలు నేలకొరిగి, తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సోలార్ ఎల్ఈడీ లైటు ఏర్పాటు చేసినా అది పనిచేయడం లేదు. మేకల పెంపకం, చిరుధాన్యాల సాగు అడవుల్లో ఉన్న వీరు వాణిజ్య పంటలు సాగుచేయరు. వర్షాధార పంటలుగా చిరుధాన్యాలైన కొర్రలు, సజ్జ, జొన్న, రాగులు, ఉలవలుపండిస్తున్నారు. వాటినే ఆహారంగా తింటున్నారు. దీంతో తమ శరీరం దృఢంగా ఉంటుందనిగ్రామస్తులు చెబుతున్నారు. అడవుల్లో గడ్డిఎక్కువగా లభ్యమవుతున్నందున మేకలు, గేదెలు పెంచుతున్నారు. అడవులకు ఎలాంటి హాని తలపెట్టకుండా జీవనం సాగిస్తున్నారు. ధాన్యం ఎక్కువగా పండితే మూటలు కట్టుకునిమోసుకుంటూ వెళ్లి విక్రయించుకుని బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుంటారు. తాగునీరు, కరెంటు, రోడ్డు ఏచ్చే ఇక్కడే బతుకుతామయ్యా మాకు ఏమొద్దయ్యా తాగేదానికి బోరు, కరెంటు లైను, ఊర్లోకి వచ్చేదానికి రోడ్డు ఏచ్చే ఎలాగోలా ఇక్కడే బతుకుతాం. దేవుని దయవలన వానలు పడుతున్నాయి. అంతో ఇంతో పంటలు పండుతాయి. అనారోగ్యం సేచ్చే రోడ్డు ఉంటే ఏదొక ఆటోను పిలుచుకొచ్చుకుని ఆసుపత్రికి పోతాం. అసలు మాకు జ్వరాలు కూడా రావు. ఆకు పసురుకే తగ్గిపోతాయి. ఈడనే మేము ఆరోగ్యంగా ఉండగలమనిపిస్తోంది. బోరు, కరెంటు, రోడ్డు వేసేలా చూడాలి. – వెంకటేశ్వర్లు, టేకులపెంట గ్రామస్తుడు -
ట్రాన్స్పోర్ట్ కేటుగాళ్లు
-
‘‘వైరస్ ప్రభావాన్ని ముందే ఊహించా’’
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల చమురు మార్కెట్ బ్లాక్ స్వాన్ లాంటి ప్రమాదాన్ని ఎదుర్కొబోతుందని ఫ్రెంచ్ చమురు వ్యాపారి పియరీ అండురాండ్ గతంలో హెచ్చరించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ యుద్ధాలు, అనూహ్య ఉగ్రవాద సంఘటనలను సాధారణంగా బ్లాక్ స్వాన్‌తో పోలుస్తారు. కరోనా కారణంగా చమురుకు డిమాండ్ లేనప్పుడు ధరలు సాధారణంగా తగ్గుతాయని అన్నారు. అయితే దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారమవుతుందని.. కానీ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆండురాండ్ క్యాపిటల్ అనే చమురు సంస్థను పియరీ అండురాండ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. చమురు డిమాండ్, సప్లయ్‌లో వ్యత్యాసం ఉన్నప్పుడు చమురు ధరలపై ప్రభావం పడుతుందని తెలిపారు. కోవిడ్ విశ్వరూపం చూపకముందే వైరస్ వ్యాప్తిని ప్రపంచ దేశాలు అరికట్టలేవని తానే ముందే గ్రహించినట్లు పేర్కొన్నారు. చమురు మార్కెట్ లాభాల భాట పట్టాలంటే దేశాలు విదిస్తున్న లాక్డౌన్లను ఎత్తేయాలని తెలిపారు. ముఖ్యంగా రవాణా, తయారీ రంగం వేగంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తేనే చమురుకు డిమాండ్ పెరిగి మార్కెట్లో జోష్ నెలకొంటుందని పియరీ అండురాండ్ అభిప్రాయపడ్డారు. -
గమ్యస్థానాలకు 75లక్షల మంది కార్మికులు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 4 కోట్ల మంది వలస కార్మికులు నివసిస్తున్నట్లు కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పునియా సాలిలా శ్రీవాస్తవ తెలిపారు. శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ అమలు నాటి నుంచి ఇప్పటి వరకు 75 లక్షల మంది వలస కార్మికులు బస్సులు, రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. వలస కార్మికులు మే 1నుంచి ఇప్పటి వరకు 2,600 శ్రామిక రైళ్లో తమ నివాసాలకు చేరుకున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. 35 లక్షల మంది కార్మికలు ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో ప్రయాణించగా, మిగతా 40 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు కార్మికులకు మెరుగైన ఆహార, నివాస సదుపాయాలు కల్పించాయన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు వేగవంతమైన చర్యలు చేపట్టాయని తెలిపారు. వలస కార్మికల కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు శ్రీవస్తవ తెలిపారు. చదవండి: వలస కార్మికులకు అండగా హైకోర్టులు -
3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు గత మూడు రోజులుగా పాసుల జారీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పాసులు జారీ చేయొద్దని స్పష్టం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. శనివారం నాటికి మహారాష్ట్రలో 29,100 మందికి కరోనా సోకగా, 1,068 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్లో 9,931 మందికి కరోనా సోకగా, 606 మంది మరణించారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర, మరణాల రేటులో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న వారికి పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. పొరుగునే ఉన్న ఏపీలో 2,307 మందికి కరోనా సోకగా, 48 మంది మృతి చెందారు. ఏపీలో కేసుల సంఖ్య, మరణాల రేటు తక్కువగా ఉన్నా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధుత్వాలు, విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఏపీ నుంచి రావాలనుకుంటున్న వారికి సైతం పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉండటం కూడా ఓ కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 80 వేల మంది రాక కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. స్వరాష్ట్రానికి తిరిగి రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు పాసులు జారీ చేసేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఇందులో 100 మంది అధికారులు 3 షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కంట్రోల్ రూం ద్వారా 17,500 పాసులు జారీచేయగా, 80 వేల మంది తెలంగాణకు తిరిగి వచ్చారు. ఒక్కో పాస్ ద్వారా ముగ్గురు, నలుగురు వ్యక్తులకు సైతం అనుమతిస్తున్నారు. కంట్రోల్ రూం నంబర్లు(040–23450624)లకు రోజూ 2 వేల కాల్స్ వస్తుండగా, రోజుకు సగటున 500–600 పాసులు జారీ చేస్తున్నారు. పాస్ కోసం కాల్ చేసిన వ్యక్తులు తెలంగాణవాసులేనా? ఎందుకు రావాలనుకుంటున్నారు? అన్న విషయాలను రుజువు చేసుకున్న తర్వాతే వాట్సాప్ ద్వారా పాసులు జారీ చేస్తున్నారు. స్వరాష్ట్రానికి తిరిగి వచ్చే వ్యక్తుల పేర్లు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఈ పాసులు జారీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రానికి తిరిగి వచ్చే వారిని రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఆపి జ్వరం, జలుబు, ఇతర లక్షణాల కోసం స్క్రీనింగ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలుంటే వారిని తిప్పి పంపేస్తున్నారు. లక్షణాలు లేని వారి చేతులపై 14 రోజుల హోం క్వారంటైన్ ముద్ర వేసి ఇంటికి పంపుతున్నారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు మాత్రమే సచివాలయంలోని కాల్‌సెంటర్ పని చేస్తుండగా, తెలంగాణ నుంచి సొంత రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలనుకుంటున్న వారు సైతం అవగాహన లేక కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి వారికి స్థానిక పోలీసు స్టేషన్లలో పాసులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. -
వలస కూలీలను తరలించే బాధ్యత కేంద్రానిదే: తలసాని
బన్సీలాల్‌పేట్: వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బిహార్ వంటి సుదూర రాష్ట్రాలకు బస్సుల్లో వలస కూలీలను తరలించడం కూలీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. గురువారం సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో అధికారులతో కలసి నూతన రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మార్గదర్శకాల పేరిట వలస కూలీల తరలింపు బాధ్యతను రాష్ట్రాలపై మోపీ చేతులు దులుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించి ప్రత్యేక రైళ్లలో ఉచితంగా వారిని స్వస్థలాలకు చేర్చాలన్నారు. వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చే విషయం లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు బాధ్యతారాహిత్యంగా, అసం బద్ధంగా, ఆచరణకు సాధ్యం కాని గాలిమాటల్లా ఉన్నాయన్నారు. ఓ ఆర్డర్ పాస్ చేశాం.. రాష్ట్రాలు అవి అమలు చేయాలని కేంద్రం కోరడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించి లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రశ్నకు తలసాని బదులిచ్చారు. -
బస్సులు నడపకుంటే ఇంజిన్లు దెబ్బతింటాయి
చెన్నై, టీ.నగర్: రవాణ సంస్థ డిపోల్లో నిలిపిన బస్సులను దీర్ఘకాలం నడపకుంటే ఇంజిన్లు దెబ్బతింటాయని, రూ. లక్షలు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మెకానిక్‌లు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీ, ఎక్స్‌ప్రెస్, నగర ఎంటీసీ బస్సులు, టౌన్ బస్సులు డిపోల్లో నిలిపి వేశారు. మెయింటినెన్స్ లేని పక్షంలో బస్సుల ఇంజిన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని తమిళనాడు మోటారు వాహన మెకానిక్‌ల సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కుమరవేల్ తెలిపారు. -
లాక్డౌన్: నిత్యావసర సరుకుల రవాణాపై చర్యలు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశమంతట లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకుండా వాటిని అందుబాటులోకి తెచ్చే విషయంలో పర్యవేక్షణ కోసం కమాండ్ కట్రోల్ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్నా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల విషయంలో జిల్లాల్లో కూడా జేసీల అధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరుకుల రవాణ, అధిక ధరలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ నెంబర్ 1902కు డయల్ చేయాలని చెప్పారు. సరుకుల రవాణకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని, పంటలను మార్కెట్టుకు తెచ్చే విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (రేషన్' ఫ్రీ') అంతేగాక నిత్యావసరాలకు సంబంధించి ప్రైవేటు రంగంలో పని చేసే ఉద్యోగులకు, సిబ్బందికి ఈ-పాస్ అందచేస్తున్నామని ఆయన తెలిపారు. సరుకులను ప్రజలకు అందజేసే విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఇందుకోసం రైతు బజార్లను వికేంద్రీకరించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 101 రైతు బజార్లు ఉంటే.. మరో 350 రైతు బజార్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేగాక 130 మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 753 మంది మాత్రమే డోర్ డెలివరీని వివియోగించుకుంటున్నారని, ఈ సంఖ్యను పెంచాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిరాణా షాపుల యజమానులు డోర్ డెలివరీకి సిద్దంగా ఉన్నారని, సప్లై చైన్ బ్రేక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు. ఉల్లి, అరటి వంటి పంటలకు మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా పొరుగు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. (కరోనా చికిత్సకు కొత్త పరికరం) -
తీరని కష్టాలెన్నో..!
ఒడిశా, మల్కన్‌గిరి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దాదాపు 7 దశాబ్దాలు దాటినా చాలా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. దీంతో అక్కడి గిరిజనులు తమ అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య సదుపాయాల కోసం కొన్ని మైళ్ల దూరం కొండలు, గుట్టలు, వాగులు, నదులు దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ప్రమాదాల రూపంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవే విషయాలు నేతలు, అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. వారిని ఎన్నికల సమయంలో ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలుగా స్వీకరించి, వారి అభివృద్ధి చర్యలను ఎవ్వరూ కాంక్షించడం లేదు. జిల్లాలోని చిత్రకొండ సమితిలో కటాఫ్ ఏరియాలోని నువాగుడ పంచాయతీలో ఉన్న పల్లీగుడ గ్రామానికి చెందిన డొంబునీ హంతాల్ అనే గర్భిణికి పురిటినొప్పులు సోమవారం ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె పడుతున్న బాధను తాళలేని కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చేందుకు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో తాము రాలేమని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పింది. గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్కా రహదారికి తీసుకురావాలని సూచించారు. దీంతో చేసేదీ ఏమీ లేకపోవడంతో బాధితురాలి భర్త విష్ణు గ్రామస్తులతో కలిసి, భార్యను మంచంపై ఉంచి పక్కా రహదారి ఉన్న చిత్రకొండకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్‌లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గురుప్రియ వంతెన పూర్తయితే తమ ప్రాంతాలకు రహదారుల నిర్మాణాలు జరుగుతాయని అంతా అన్నారని, అయితే ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాలకు అంబులెన్స్‌లు వచ్చేలా పక్కా రహదారుల నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఏపీ: టెన్త్ పరీక్షలకు అడ్డంకులు లేకుండా చర్యలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి ఏపీలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, బుక్లెట్ల రవాణాకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో సీటింగ్ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని విద్యా శాఖ తెలిపింది. పరీక్షల సమయంలో ఎవరైనా విద్యార్థులు జలుబు, జర్వం, దగ్గుతో బాధపడుతుంటే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. (కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు) -
లగేరహో లక్సెంబర్గ్
యూరోపియన్ యూనియన్‌లోని లక్సెంబర్గ్ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మార్గానికి లగ్జెంబర్గ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బస్సులు, ట్రామ్‌లు, రైళ్లు ఈ మూడింటిలో ఏ రవాణామార్గాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో మీరు హాయిగా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసేయొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. యావత్ ప్రజారవాణా వ్యవస్థని నిజంగానే ప్రజలకు అంకితమిచ్చింది. ఒకరోజో, రెండ్రోజులో కాదుసుమండీ. లక్సెంబర్గ్‌లో ప్రజలందరికీ ఇక ప్రయాణం ప్రతిరోజూ ఉచితమే. యూరప్‌లోని అతిచిన్న దేశమైన లక్సెంబర్గ్ జనాభా కేవలం 6,14,000. జనాభా గత 20 ఏళ్లలో 40 శాతం పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. రద్దీని తగ్గించేందుకే.. ప్రపంచ ప్రజల ముందున్న ప్రధానమైన సవాళ్ళలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు అత్యంత కీలకమైనవి. పర్యావరణం, రద్దీ (ట్రాఫిక్ సమస్య) ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న సమస్యలు కూడా. ఇక లక్సెంబర్గ్ సంగతి సరేసరి. విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ప్రధాన రోడ్లన్నీ పాడైపోయాయి. బస్సులు పాతబడిపోయాయి. రైళ్ళ రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. దీనికి తోడు లక్సెంబర్గ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సగానికి సగం మంది అంటే 2 లక్షల మంది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీల నుంచి లక్సెంబర్గ్‌కి వచ్చేవారే. అక్కడ అధిక వేతనాలు ఉండడమే అందుకు కారణం. ఖర్చు మోపెడు దీనివల్ల టిక్కెట్ల ద్వారా నష్టపోయే మొత్తం 44 మిలియన్ డాలర్లు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేస్తారు. ఉచిత రవాణా మొత్తానికి అయ్యే ఖర్చు 50 కోట్ల యూరోలు. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు. ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులే టిక్కెట్లు కొంటారు కనుక టిక్కెట్ల తనిఖీకి వెచ్చించాల్సిన సమయం తగ్గుతుంది. లక్సెంబర్గ్‌లో చాలా మంది కార్మికులకు సబ్సిడీతో కూడిన పాస్‌లు ఉంటాయి. టిక్కెట్టు కొనుక్కునేవారు తక్కువగానే ఉంటారు. ఇప్పుడు మిగిలిన వారికి కూడా ప్రయాణం ఉచితం కావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తిపై 600 యూరోలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి మరో కారణం ప్రజారవాణా వ్యవస్థని బలోపేతం చేయడం. రాబోయే ఐదేళ్లలో ప్రజారవాణాని ఉపయోగించే వారి సంఖ్య 20 శాతం పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర యూరోపియన్ దేశాలకంటే లక్సెంబర్గ్ ప్రజారవాణా వ్యవస్థపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఏడాదికి 600 యూరోలు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ లక్సెంబర్గ్‌లో కార్లు అధికం. వేతనాలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా కావడంతో కార్ల వాడకం ఎక్కువ. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఈ ఉచిత బాట. లక్సెంబర్గ్ ప్రజలతో పాటే పర్యాటకులకు సైతం అక్కడ ప్రయాణం ఉచితమే. అయితే ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రం టిక్కెట్టు వడ్డింపులు భారీగానే ఉంటాయి. -
కువైట్ బాటలో ఖతర్
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఖతర్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తమ దేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ సహా 14 దేశాల నుంచి తమ దేశంలోకి రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో ఉపాధి కోసం ఖతర్ వెళ్లే తెలంగాణవాసు లు ఇప్పట్లో అక్కడకు వెళ్లే అవకాశం లేదు. పలువురు కార్మికులకు వీసాతో పా టు ముందస్తుగానే విమాన టిక్కెట్ కొనుకున్నా, తాజా పరిణామాలతో ఆ దేశం వెళ్లలేని పరిస్థితి.. విమాన సర్వీసుల ర ద్దుపై ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనుందని తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్ వల్ల తమ దేశ ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన కువైట్ ప్రభుత్వం కూడా ఎనిమిది దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా ఖతర్ ప్రభుత్వం కూడా రాకపోకలపై నిషే ధం విధించింది. ఈ నిర్ణయంతో భారత్, చైనా, బంగ్లాదేశ్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్ నుంచి ఖతర్‌కు రాకపోకలు నిలిచి పోయాయి. ఖతర్‌లో ఆదివారం వరకు 24 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ ప్రభావం ఉన్న ఈ 14 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. కాగా, ఖతర్‌లో ఉన్న తెలంగాణవాసులు ఒకవేళ తమ సొంత ఊళ్లకు వెళ్లాలంటే అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. ఖతర్‌లోని వివిధ నిర్మాణ కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలలో వేలాది మంది తెలంగాణ వాసులు ఉపాధి పొందుతున్నారు. రోజూ పలువురు అక్కడి నుంచి స్వదేశానికి రాకపో కలు సాగిస్తారు. తాజా పరిణామాలతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఇప్పట్లో రాలేం..: ఖతర్ నుంచి ఇప్పట్లో ఇండియాకు రాలేం. అలాగే మన దేశం నుంచి ఖతర్‌కు వచ్చే వారు కూడా కొన్ని రోజుల పాటు ఓపిక పట్టాల్సిందే. కరోనా విస్తరించకుండా ఉండడానికి ఖతర్ ప్రభుత్వం 14 దేశాల రాకపోకల పై నిషేధం విధించింది. కొత్తగా వీసాలు తీ సుకున్న వారు కూడా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. – అబ్బగోని శ్రీధర్ గౌడ్, ఖతర్ -
‘మౌలికం’ కీలకం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరుల జీవనాన్ని సులభతరం చేసేందుకు 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మౌలిక వసతుల రంగంలో ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తామని ప్రధాని గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్ (ఎన్ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు. 2023కి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం, నిర్వహణ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. త్వరలోనే జాతీయ సరుకు రవాణా విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 2023 నాటికి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయన్నారు. చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రహదారి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయని చెప్పారు. ‘రహదారుల నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది. 2015–16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018–19 నాటికి ఇది 29.7 కి.మీ.కి పెరిగింది’అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గృహ నిర్మాణం, చౌకగా పరిశుద్ధమైన ఇంధనం, ఆరోగ్యం, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్ టెర్మినళ్లు, మెట్రో, రైల్వే రవాణా, గిడ్డంగులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ఉపాధి అవకాశాలు విస్తృతం: గడ్కారీ మౌలిక వసతుల రంగానికి ఈ బడ్జెట్ గట్టి ఊతం ఇచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్ పారిశ్రామిక అభివృద్ధికి జవసత్వాలు కల్పించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా 2 కోట్లకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. బడ్జెట్లో ‘మౌలిక’వరాలు... ► పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్ రైళ్లు. ► ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైళ్లపై చురుగ్గా పరిశీలన. ► ‘ఉడాన్’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి. ► ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్లో రూ.22,000 కోట్లు ► 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్ ► 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి. రైల్వే లైన్ల పక్కన సోలార్ ప్రాజెక్టులు రైల్వే నెట్వర్క్ కోసం సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా ట్రాక్‌ల పక్కన రైల్వేకు చెందిన భూమిలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో 150 ప్యాసింజర్ రైళ్ల ఏర్పాటు, 4 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 18,600 కోట్లు ఖర్చయ్యే 148 కి.మీల బెంగళూరు సబర్బన్ రవాణా ప్రాజెక్టును బడ్జెట్లో ప్రతిపాదించారు. మెట్రో తరహాలో టికెట్ రేట్లు ఉంటాయి. -
కశ్మీర్ : ఆపిల్ రైతులపై దాడులు; సంబంధాలే ముఖ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నిత్యం జరిగే ఉగ్రదాడులతో ప్రజలు భయంభయంగా బతుకున్నారు. ఇక రైతుల కష్టాలు సరేసరి. తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకునేందుకు ఆపిల్ రైతులు, సరఫరాదారులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆపిల్ పంట ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఓ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు కాశ్మీరీయేతర ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. మరో రెండు ట్రక్కులను ఉగ్రవాదులు తగులబెట్టారు. అక్టోబర్ 14న రాజస్తాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. దీంతో కశ్మీర్‌కు వాహనాల్ని పంపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి రాష్ట్రాలకు ఆపిల్ పంటను రవాణా చేసే క్రమంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పరిపాలన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ఆపిల్ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. బయటి రాష్ట్రాల్లో అమ్ముకుంటే వచ్చేదానికన్నా ఎక్కువ ధర చెల్లించిమరీ కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే, ఈ విధానంపై రైతులు, వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంవత్సరాల నుంచి ఉన్న తమ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఎంఐఎస్ స్కీమ్‌పైగులాంనబీ అనే రైతు మాట్లాడుతూ.. ‘సంప్రదాయ మార్కెటింగ్ విధానంలోనే ఇటీవల 15 కిలోల ఆపిల్ పెట్టెను కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరఫరా చేశాను. దాదాపు రూ.700 నుంచి రూ. 800 వరకు లాభం వచ్చింది. కానీ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తే రూ.1000 వచ్చేవి. అయితే, నాకది ఇష్టం లేదు. బయటి రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులతో చాలా ఏళ్లుగా ఉన్న సంబంధాలే మాకు ముఖ్యం. డబ్బులు ప్రధానం కాదు. పంజాబ్ లేదా దక్షిణ భారతదేశంలోని వ్యాపారులతో కశ్మీర్ వ్యాపారుల సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మాకు ఇష్టం లేదు’అన్నాడు. -
గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి, హనుమాన్‌జంక్షన్: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలను నియమించామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం ఎ.సీతారామపురం సెంటర్లో వీరవల్లి పోలీసులు శనివారం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. రూ.20 లక్షలు విలువైన గంజాయి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు వీరవల్లి పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై పక్కా సమాచారం రావటంతో వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏపీ 16 యూ 8793 నంబర్ గల లారీలో 200 కేజీల బరువు కలిగిన 100 గంజాయి ప్యాకెట్లు తరలించటాన్ని గుర్తించారు. ఈ లారీతో పాటు డ్రైవర్ కూచిపూడి ఫ్రాన్సిస్, సహాయకుడు బండి నాగరాజులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విశాఖ జిల్లా జె.నాయుడుపాలెం గ్రామం నుంచి ఈ నెల 11వ తేదీన గంజాయి లోడుతో బయలుదేరినట్లు తెలిపారు. ఈ గంజాయి ప్యాకెట్లను గన్నవరం చేర్చేందుకు డ్రైవర్ ఫ్రాన్సిస్‌కు రూ.1.50 లక్షలు, సహాయకుడు బండి నాగరాజుకు రూ.50 వేలు ఇచ్చేట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణా ప్రధాన సూత్రధారులు, ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తున్నారనే వివరాలపై పోలీసులు వీరిద్దరిని తమదైన శైలిలో విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా ప్రధాన సూత్రధారుడిని పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను నియమించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, కాలేజి విద్యార్థులకు వీటిని సరఫరా చేయటంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే నూజివీడులో గంజాయి వ్యసనానికి గురైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశామని, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. కాలేజి విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాపై కూడా నిఘా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 200 కేజీల గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. వీటిని తరలిస్తున్న కూచిపూడి ఫ్రాన్సిస్, బండి నాగరాజులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గన్నవరం మండలం కట్టుబడిపాలెంకు చెందిన ఫ్రాన్సిస్‌కు విశాఖ జిల్లా రోలుకుంట మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన బండి నాగరాజుతో ఏర్పడిన పరిచయంతోనే గంజాయి అక్రమ తరలింపునకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ వివరించారు. రూ.20 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబును నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, హనుమాన్‌జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకట రమణ అభినందించారు. -
సరుకుల రవాణాకు ‘ఈ–పర్మిట్’
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి దిగుబడి ఏటా 35 లక్షల క్వింటాళ్లకు పైగా వస్తుంది. రైతులు పూర్తిగా విక్రయించినా మార్కెట్ దస్త్రాల్లో సగం కూడా నమోదు కావడం లేదు. మరి మిగతా సరుకులు ఎక్కడికి వెళ్తున్నాయి.. కొనుగోలుదారులు కట్టాల్సిన పన్నులను ఎవరు తన్నుకుపోతున్నారు.. సర్కారు ఖజానాకు ఏ మేరకు గండిపడుతోంది..? కొన్నేళ్లుగా అందరిలో వెల్లువెత్తుతున్న సందేహాలు ఇవి. ఆలస్యంగానైనా మేల్కొన్న రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అవినీతికి తెరదింపేందుకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, సరుకుల రవాణా, పన్నుల వసూళ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. ఇకపై లెక్కలు పక్కాగా చూపేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారీగా ప్రధాన పంటల దిగుబడులు.. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్, రబీ కలుపుకొని ఏటా 6.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో రెండు లక్షల హెక్టార్లు పత్తి, మూడు లక్షల హెక్టార్లు వరి, లక్ష హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తారు. 35 లక్షల నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి, 1.80 కోట్ల క్వింటాళ్ల వరి, 50 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఇరు సీజన్లలో క్రయవిక్రయాలు సాగుతాయి. వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ రంగ సంస్థలే అధికంగా సేకరిస్తుండగా, పత్తిని పూర్తిగా మిల్లర్లు, ట్రేడర్లు కొంటున్నారు. నిబంధనల ప్రకారం.. వ్యాపారులు సరుకుల కొనుగోళ్ల వివరాలను రోజూ మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, ఇతర అపరాల ఎగుమతికి కార్యదర్శి నుంచి రవాణా పర్మిట్ తీసుకోవాలి. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొనుగోలు చేసిన సరుకుల విలువలో ఒకశాతం పన్నుగా చెల్లించాలి. మార్కెట్ ఆదాయానికి భారీగా గండి.. కొందరు వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కొన్న సరుకులు, మార్కెట్‌కు చూపుతున్న లెక్కలకు పొంతన ఉండడం లేదు. ప్రధానంగా మిల్లుల్లో కొంటున్న సరుకులను పూర్తిస్థాయిలో చూపడంలేదు. అధికారులకు రోజూ ఇవ్వాల్సిన వివరాలను నెలకు ఒక్కసారి కూడా సమర్పించడం లేదు. అడిగే దిక్కులేక చాలామంది వ్యాపారులు తప్పుడు లెక్కలతో మార్కెట్ ఆదాయానికి గండికొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోపాయికారీ ఒప్పందాలతో మాన్యువల్ పర్మిట్లు తీసుకుంటూ సరుకులను రవాణా చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా పత్తి, ధాన్యం, మక్కలు ఖరీదు చేస్తున్న దళారులు ఆయా చెక్‌పోస్టుల్లో చేతివాటం ప్రదర్శిస్తూ సరుకులను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా ఏటా లక్షలాది క్వింటాళ్లు వక్రమార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాలిల్లుతోంది. ఇది బహిరంగమే అయినా అధికారుల్లో చలనం కరువైంది. నామమాత్రపు తనిఖీలతో అక్రమ వ్యాపారానికి అడ్డులేకుండా పోయింది. ఎట్టకేలకు మేల్కొన్న మార్కెటింగ్‌శాఖ.. ఏళ్లుగా సాగుతున్న అవినీతిని ఎట్టకేలకు మార్కెటింగ్‌శాఖ గుర్తించింది. కొనుగోళ్లలో పారదర్శకత, పూర్థిసాయిలో పన్నుల వసూళ్లకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సదరుశాఖ రూపొందించిన వెబ్సైట్లో తొలుత మిల్లర్లు, ట్రేడర్లు వారి సంస్థలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్ అధికారులు పరిశీలించాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. భద్రత కోసం పాస్వర్డ్ మార్చుకునే వీలుంది. వ్యాపారులు వెబ్సైట్లో లాగిన్ అయ్యాక సరుకుల కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. యార్డులో అయితే కమీషన్ ఏజెంట్ ద్వారా ఎన్ని క్వింటాళ్లు కొన్నారనేది చూపితే సరిపోతుంది. ఎందుకంటే రైతుల వివరాలను మార్కెట్ సిబ్బంది రికార్డుల్లో చేరుస్తారు. గ్రామాల్లో, మిల్లుల్లో నేరుగా కొంటే.. సరుకులు అమ్మిన రైతుల వివరాల(చిరునామా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్)ను వ్యాపారులు పూర్తిగా నమోదు చేయాలి. నెలవారీ కొనుగోళ్ల ప్రకారం ప్రతినెలా పదో తేదీ లోపు పూర్తిగా పన్ను(సరుకుల విలువలో ఒకశాతం) చెల్లించాలి. ఇవి పాటిస్తేనే బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, అపరాలు తదితర ఉత్పత్తుల రవాణాకు ఆన్లైన్లో ఈ–పర్మిట్ జారీచేస్తారు. ఈ విధానం గతనెల 26న ఉమ్మడి జిల్లాలో అమల్లోకి రాగా.. మిల్లర్లు, ట్రేడర్లు క్రమంగా వెబ్సైట్లో లాగిన్ అవుతున్నారు. రంగంలోకి విజిలెన్స్ బృందాలు.. ఇకపై వ్యాపారులు ఇష్టారాజ్యంగా పర్మిట్లు తీసుకునే వీల్లేదు. సరుకుల కొనుగోళ్ల మేరకే పర్మిట్లు ఇచ్చేలా వెబ్సైట్ రూపొందించారు. లెక్కల్లో చూపని వాటికి రవాణా అనుమతులు రాకుండా రూపకల్పన చేశారు. ఒకవేళ అక్రమ రవాణా చేస్తే చెక్‌పోస్టులో నిలిపివేస్తారు. చేతివాటంతో అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా దాన్నీ అడ్డుకునేందుకు మార్కెటింగ్‌శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రహదారులపై తనిఖీకి విజిలెన్స్ బృందాలను నియమించింది. ఈ–పర్మిట్ లేకుండా రవాణా చేస్తూ పట్టుబడితే వ్యాపారులు చెల్లించాల్సిన పన్ను కంటే 5 నుంచి 8 రెట్లు అధికంగా జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. దొంగ దందాతో సర్కారు ఖజానాకు తూట్లు పొడుస్తున్న దళారులపై కూడా విజిలెన్స్ ఉక్కుపాదం మోపనుంది. ఇకనుంచి అధికారులు గ్రామాల్లో నేరుగా జరిగే కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే దళారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
అజయ్ పిరమళ్ చేయి వేస్తే...
ముంబై: అజయ్ పిరమల్‌కు... పెట్టుబడులపై భారీ లాభాలు ఆర్జిస్తారనే పేరు ఉంది. దీనిని ఆయన మరోసారి నిజం చేశారు. ఆరేళ్ల క్రితం (2013లో) ఆయన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో 9.96 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ వాటాను రూ.653 కోట్ల లాభంతో రూ.2,305 కోట్లకు అమ్మేశారు. ఒక్కో షేర్‌ను ఎంత ధరకు అమ్మారన్న వివరాలు లభించనప్పటికీ, సగటు విక్రయ ధర రూ.1,000–1,015 రేంజ్లో ఉండొచ్చని సమాచారం. మొత్తం మీ ఈ డీల్‌లో ఆయనకు ఆరేళ్లలో 40 శాతం రాబడులు వచ్చినట్లయింది. అజయ్ పిరమళ్‌కు చెందిన పిరమళ్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇతర శ్రీరామ్ గ్రూప్ కంపెనీల్లో కూడా వాటాలున్నాయి. శ్రీరామ్ సిటీ యూనియన్‌లో 10 శాతం, శ్రీరామ్ క్యాపిటల్‌లో 20 శాతం చొప్పున ఆయనకు వాటాలున్నాయి. ఈ వాటాల కోసం ఆయన ఐదేళ్ల క్రితం రూ.4,600 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు వాటా విలువ రూ.9,000 కోట్లకు చేరింది. టెలికం దిగ్గజం వొడాఫోన్‌లో కూడా ఆయన భారీగానే ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలతో బైటపడ్డారు. గత పదేళ్లలో ఆయన పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాలో, కొనుగోళ్ల లావాదేవీలో జరిపారు. మెర్క్, ఎలిలిల్లీ, ఫైజర్, అబాట్, బయో–సింటెక్, బేయర్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. -
రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు
సాక్షి, జగిత్యాల: జిల్లాలో రాత్రిపూట ఆటోలో ఈవీఎంల తరలింపు కలకలం రేపింది. సోమవారం రాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకువచ్చారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై ఆటో డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈవీఎంలను ఆటోలో తరలించడం గమనించిన కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి డెమో ఈవీఎంలు అని ఆటో డ్రైవర్‌తో పాటు అక్కడున్న మరో వ్యక్తి చెబుతున్నారు. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
అనంతపురం జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌లో చీరల తరలింపు పట్టివేత
-
వసూళ్లపై పోలీస్ అధికారుల ఆరా..?
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 ఇంక్లైన్ వద్దగల కోల్ ట్రాన్స్‌పోర్టులో మళ్లీ వసూళ్ల దంద మొదలైంది. ఈవిషయంపై జిల్లా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందితో ఆరా తీయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వి శ్రీనివాస్‌రావు లారీ ఓనర్స్, ట్రాన్స్పోర్టర్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వసూళ్లను నిలిపివేయాలని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ముందస్తు జాగ్రత మేరకు ఏరియాలో కోల్ ట్రాన్స్‌పోర్టుకు అంతరాయం వాటిల్లకుండా ఉండేందుకు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు డివిజన్ ఉన్నతాధికారి ఈవసూళ్లపై సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కోల్‌ట్రాన్స్‌పోర్టులో గతంలో ఒక వర్గం వారే వసూళ్లు చేస్తే, ఈసారి రెండు వర్గాల వారు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి యాజమాన్యం నుంచి వినియోగదారులు బొగ్గును ఆన్లైన్లో కొనుగోలు చేసి, ట్రాన్స్పోర్టర్ల ద్వారా రవాణా చేయించుకుంటుంటే... ఈ మధ్యలో ఈ వసూళ్ల దందా ఏంటని, దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను కోరినట్లు తెలిసింది. -
ఆటో.. అటో ఇటో..!
ఆర్మూర్‌టౌన్: నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆటోలతో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిబంధనల మేరకు ఆటోలు, ఇతర వాహనాలు నడిపేందుకు ఆర్టీవో కార్యాలయం నుంచి లైసెన్సులు పొందాలి. లైసెన్సులు లేకున్నా ఆటోలు నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మూర్ పట్టణం మున్సిపల్ పరిధిలో ఆటోల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పట్టణంతోపాటు నిజామాబాద్ నగరం, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్ పట్టణాలే కాకుండా అన్ని మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించింది. పట్టణాలకు చుట్టు పక్కల గ్రామాలకు బస్సులు వెళ్లలేకపోవడంతో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఆటోల మీద ఆధారపడి ప్రయాణం సాగిస్తున్నారు. అదే విధంగా పట్టణాల్లో ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లేందుకు ప్రజలు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా ముగ్గురు ప్రయాణికులతో ప్రయాణించాల్సిన ఆటోలో ఎనిమిది నుంచి పది మంది వరకు ఎక్కించుకుని వెళుతున్నారు. పెరుగుతున్న ప్రమాదాలు అనుభవం, లైసెన్సు లేకుండా ఆటోలు నడపటంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఆటోలు నడపాలి. అయితే ఇక్కడ మైనర్లు సైతం ఆటోలు నడుపుతున్నారు. ఫలితంగా పట్టణంలో తరుచూ ప్రమాదాలు జరగుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆటోలు డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆటోలో డ్రైవర్ల పక్కన కూర్చుని ప్రయాణించేందుకు అనుమతి లేదు. కాగా డ్రైవర్ సీట్లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా ప్రయాణికుల కోసం ఆటో డ్రైవర్లు తమ ఆటోలను రోడ్డు మీదనే నిలుపుతున్నారు. దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఆటోవెనుక పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోతున్నాయి. బస్టాండ్ ప్రాంతంలో ఆటోడ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఆటోడ్రైవర్లపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మచ్చుకు కొన్ని సంఘటనలు.. ఫిబ్రవరి 7న పాత ఎంజే ఆస్పత్రి వద్ద బైక్ వెళ్తున్న మురిళి అనే వ్యక్తికి ఆటో ఢీకొట్టిన సంఘటనలో ఆయన చేయి విరిగింది. సుమారు రూ.80వేల వరకు ఆస్పత్రి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈనెల 4న గోల్‌బంగ్లా ప్రాంతంలో ఓ ఆటోడ్రైవర్ ఆటోను రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనుక ఉన్న ఓ బాలుడిని చూడక ఢీకొని పక్కన ఉన్న మురికి కాలువ పడిపోయాడు. ఈ సంఘటనలో బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగపోడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెలలో ఆలూర్ సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో 9మంది మహిళలకు గాయాలయ్యాయి. అటోల ఆగడాలను అరికట్టాలి.. పట్టణంలో ఆటోలు ఇష్టానుసారంగా వ్యహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణిలకు ఎక్కించుకొని వెళ్తున్నారు. మైనర్లు ఆటోలు నడిపించినట్లైతే వారి చర్యలు తీసుకునే విధంగా అ«ధికారులు చర్యలు తీసుకోవాలి. –రాజేందర్, ఆర్మూర్. లైసెన్సు లేకుంటే చర్యలు తీసుకోవాలి లైసెన్సు లేకుండా ఆటోలు నడిపిస్తున్న వారిపై సంబంధింత అధికారులు చర్యలు తీసుకోవాలి. మితిమీరిన వేగంతో నడిస్తున్న ఆటోడ్రైవర్లకు అడ్డుకట్టా వేయాలి. మైనర్లు ఆటోలు నడిపిస్తే ఆ ఆటోలను సీజ్ చేయాలి. అధికారులు ప్రతిరోజు ఆటోల తీరుపై నిఘా ఉంచాలి. –మోహన్, ఆర్మూర్. -
వ్యవసాయ ఎగుమతుల పెంపుపై దృష్టి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం, అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రుణ సంబంధ సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఫైనాన్స్ వ్యవహారాల కార్యదర్శి ఈ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తారని పేర్కొన్నారు. ఎగుమతుల రంగానికి రుణాన్ని ప్రాధాన్యతాపరమైనదిగా పరిగణించాలని డిమాండ్ ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఏ విధంగానూ ఉల్లంఘించకుండా, ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్–చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2018–19 ఏప్రిల్–అక్టోబర్ మధ్య భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ 48 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 43.11 బిలియన్ డాలర్లు. -
అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్లు
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్లు దక్కాయి. చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్‌వేస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్‌ల నుంచి ఆర్డర్లు లభించాయని అశోక్ లేలాండ్ తెలిపింది. ఈ సంస్థల నుంచి మొత్తం 2,580 బస్సులకు ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఎమ్డీ, వినోద్ కె దాసరి వివరించారు. ఈ బస్సులను మరో రెండు నెలల్లో డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, నవకల్పనలతో బస్సులను తయారు చేయడం వల్ల భారత బస్సు మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నామని వివరించారు. -
స్తంభించిన రవాణా, బ్యాంకింగ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన 48 గంటల సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా, బ్యాంకింగ్ రంగాలు స్తంభించాయి. సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమ్మెకు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ర్యాలీ, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్ టియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనలు మిన్నంటాయి. కార్మిక సంఘాల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేరళలో కార్మిక సంఘాలు రోడ్డెక్కడంతో ప్రజాజీవనం స్తంభించింది. ఒడిశాలోనూ రవాణా వ్యవస్థ స్తంభించింది. -
వాగులో రాత్రిళ్లు తోడేస్తున్నారు..
ఓ పక్క ఎన్నికల వేళ.. మరోపక్క అధికారులు విధుల్లో బిజీ. ఇంకేముంది ఇసుకాసురులకు ప్రతి రోజూ పండుగే అవుతోంది. ప్రస్తుత పరిస్థితులను క్యాష్ చేసుకుంటున్న ఇసుక అక్రమార్కులు పెద్దవాగు రాత్రివేళల్లో డంపింగ్ చేసి పగలు జంపింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకున్నా ఇసుక వ్యాపారులు తవ్వేస్తున్నారు. సాధారణ రోజుల్లోకంటే రెట్టింపు ధరలకు ఇసుకను అక్రమ వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. సాక్షి,వేల్పూర్: మండలంలోని రామన్నపేట్ గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్దవాగు నుంచి రాత్రిపూట ఇసుకను గ్రామం బయట గల అయ్యల గుట్ట వద్ద డంపు చేస్తున్నారు. చుట్టు పక్కల అవసరమైన వారికి పగటి పూట సరఫరా చేయడం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో, దొరికిన అవకాశాన్ని దళారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ అనుమతితో ఇసుక సరఫరాను అధికారులు నిలిపేశారు. ఇండ్లు నిర్మించేకునే వారికి ఇసుక లభించక విలవిలలాడుతున్నారు. దీంతో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో లభించే రేటుకు రెట్టింపు ధర పెరిగింది. దీనిని దళారులు గుర్తించి తమ వ్యాపారానికి పదును పెట్టారు. ఎక్కడ అవకాశం దొరికినా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రామన్నపేట్ గ్రామం పక్కన పెద్దవాగు ఉంటుంది. స్థానికి వీడీసీకి ట్రాక్టరుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తూ వ్యాపారులు రాత్రిపూట ట్రాక్టర్ల ద్వారా అయ్యల గుట్ట వద్ద ఇసుకను నిల్వ చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. అటువైపు ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఇతరులు అటువైపు వెళ్లే అవకాశం లేదు. ఇతర గ్రామాల వారుగాని, అధికారులుగాని చూడని ప్రాంతాన్ని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతితో నడిచే ఆసుక ఆగిపోవడంతో, దళారులు తమ వ్యాపారాన్ని ‘మూడు ట్రాక్టర్లు.. ఆరు టిప్పర్లు’గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ. 7 నుంచి 8 వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కూలీలతో ఇసుక నింపితే బయట తెలుస్తుందని దళారులు ఏకంగా జేసీబీలనే వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వాగులో ఒకటి, అయ్యల గుట్ట వద్ద మరో జేసీబీని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఇసుక అవసరమైన వారికి కొద్ది గంటల్లోనే చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక సరఫరాను నిషేధించడంతో అధికారులు అటువైపు దృష్టి పెట్టడం లేదు. దీనికి తోడు ఎన్నికల విధుల్లో చాలా బిజీగా ఉన్నారు. అధికారులకు ఉన్న బిజీ ఇసుక వ్యాపారుల పంట పండిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క వేల్పూర్ మండలంలోనే లేదు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉంది. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
శవాల తరలింపునకు దారేదీ..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదల మృతదేహాల తరలింపు ప్రక్రియ ప్రహనంగా మారింది. నిర్వహణ లోపం వల్ల వాహనాలు తరచుగా మెరాయిస్తుండటం, వివిధ సాంకేతిక లోపాలతో షెడ్డుకు చేరిన వాహనాలకు సకాలంలో రిపేర్లు చేయించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. మృతదేహాన్ని ఎలాగైనా సొంతూరికి తీసుకెళ్లాలనే బంధువుల ఆతృతను ప్రైవేటు అంబులెన్స్ యజమానులు ఆసరాగా చేసుకొని నిలువు దోపిడికి పాల్పడుతున్నారు. 32 వాహనాల్లో సగం షెడ్డులోనే.. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి చనిపోయిన వారి శవాలు, వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి మృతదేహాలు, వివిధ పనులపై నగరానికి వచ్చి ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయిన వారు, అనాధ శవాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా, గాంధీ శవాగారాలకు తరలిస్తుంటారు. వీటితో పాటు వివిధ జబ్బులతో బాధపడుతూ ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేక చనిపోయిన బాధితు లు ఉంటారు. ఇలా ఉస్మానియా మార్చురీకి రోజుకు సగటున 18 మృతదేహాలు వస్తుండగా, గాంధీ మార్చురీకి రోజుకు సగటున 25 మృతదేహాలు వస్తుంటా యి. శవపంచనామా తర్వాత ఫోరెన్సిక్ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగిస్తుంటారు. పేదల మృతదేహాల తరలింపు కోసం ప్ర భుత్వం 2016 నవంబర్‌లో 50 ‘హెర్సే’(పరమపద వాహనాలు)అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, నిలోఫర్, నిమ్స్ ఆస్పత్రులకు 32 వాహనాలను కేటాయించింది. నిధుల కేటాయింపు లేమితో పాటు నిర్వహణ లోపం వల్ల వీటిలో ప్రస్తుతం పదిహేను వాహనాలు పని చేయడం లేదు. ఎప్పటికప్పుడు వీటికి రిపేర్లు నిర్వహించి బాధితులకు అందుబాటులో ఉంచాల్సిన యంత్రాంగం పట్టించుకో కపోవడంతో విధిలేని పరిస్థితు ల్లో సొంతూళ్లకు మృత దేహాలను తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది. నిజానికి హెర్సే వాహనాలు అందుబాటులోకి వచ్చిన త ర్వాత ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రైవేటు అంబులెన్స్‌ను నిషేదించారు. కానీ ప్రస్తుతం వీటిలో చాలా వరకు రిపేర్ల పేరుతో షెడ్డులో చేరడంతో ప్రైవేటు వాహనాలు బారులు తీరుతున్నాయి. విధులకు దూరంగా ఆర్‌ఎంఓలు.. ఒక వైపు సగానికిపైగా వాహనాలు షెడ్డు దాటని పరిస్థితులో ఉంటే..మరో వైపు అందుబాటులో ఉన్నవాటికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఆస్పత్రిలో ఎవ రైనా బాధితుడు చనిపోతే..మృతదేహం తరలింపు కోసం పరమపద వాహనాలను సమకూర్చాల్సిన బాధ్యతను సంబంధిత ఆస్పత్రి ఆర్ఎంఓలకు అప్పగిం చింది. కానీ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆర్‌ఎంఓలు కాకుండా హెల్త్ ఇన్స్పెక్టర్లకు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. కీలకమైన ఎంఎల్సీ కేసుల వివరాలు నమోదు సహా పరమపద వాహనాల బుకింగ్ హెల్త్ ఇన్స్పెక్టర్లు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. సమయానికి వీరు ఆస్పత్రిలో అందుబా టులో లేక పోవడంతో బంధువులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి ఎదురు చూసినా వీరు రాకపోవడం, ఒక వేళ వచ్చి వాహనం సమకూర్చి నా..డిజిల్ ఖర్చుల పేరుతో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు సమ్మె‘పోటు’
కాళేశ్వరం: లారీల సమ్మెతో జయశంకర్ భూపాలపల్లిలో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. సిమెంటు, డీజిల్ నిల్వలు తరిగిపోతుండటం.. సమ్మె కారణంగా వచ్చే ముడిసరుకు నిలిచిపోవడంతో మరోమూడు రోజుల్లో ఇక్కడ పనులు నిలిచిపోయే అవకాశం ఉందని ఇంజనీర్లు, ఏజెన్సీల సంస్థల బాధ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తర్వాత ఎండలు, వర్షాలను మినహాయిస్తే లారీల సమ్మె కారణంగా తొలిసారిగా ఇబ్బందులు ఎదురుకానున్నాయని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. బ్యారేజీలు, పంపుహౌస్‌ల సమాహారమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువుపట్టు మేడిగడ్డ బ్యారేజీ. ఇక్కడ పనులు పూర్తయితే ప్రాణహిత నది నీటిని ఎత్తిపోతలు, గ్రావిటీ కెనాల్ల ద్వారా తెలంగాణ అంతటికీ పారించవచ్చు. ప్రాణహితలో నీటి ప్రవాహం కారణంగా ఇప్పటికే పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు బెడ్ లెవల్ వర్క్ పూర్తయి పిల్లర్ల దశలో నడుస్తున్నాయి. నిత్యం 3,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. దీని కోసం 2,000 టన్నుల సిమెంటు, 3,000 లీటర్ల డీజిల్ అవసరం అవుతున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చోట్ల పది రోజులకు సరిపడా మెటీరియల్‌ను సంబంధిత ఏజెన్సీలు నిల్వ ఉంచుకుంటున్నాయి. సమ్మెతో ఇప్పటికే ఏడు రోజుల పాటు రా మెటీరియల్ రాక ఆగిపో యింది. మరో మూడు రోజులకు సరిపడ మా త్రమే ఉంది. సమ్మె ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల తర్వాతæ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వరుస కష్టాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో 2018 జూలై నాటికి నీటిని కొంత మేరకైనా తరలించాలని ఏడాది కాలంగా పనులు వేగంగా చేపడుతున్నారు. వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పగటి వేళ పనులు నిలిపేసి రాత్రి వేళ కొనసాగించారు. దీంతో సుమారు ముప్పై రోజులపాటు పనులు మందగించాయి. ఆ తర్వాత వర్షాల కారణంగా జూలై 2 నుంచి 13 వరకు పని స్థలాల్లోకి నీరు చేరుకోవడంలో నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. మోటార్లు పెట్టి నీటిని తోడి మళ్లీ పనులు ఊపందుకున్న సమయంలో లారీల సమ్మెతో మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకేసారి అన్ని చోట్ల కీలకమైన మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్, కన్నెపల్లి –అన్నారం గ్రావిటీ కెనాల్, అన్నారం బ్యారేజీ, అన్నారం పంప్‌హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తోపాటు మేడారం సర్జ్‌పూల్ తదితర అన్ని పని ప్రదేశాల్లో డీజిల్, సిమెంటు స్టాకు పూర్తిగా అడుగంటడం ఇంజనీర్లు, నిర్మాణ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని చోట్ల జనరేటర్లు మొదలు లారీలు, టిప్పర్లు, క్రేన్లు, పొక్లెయినర్లు, హైడ్రాలిక్ యంత్రాలు, బ్లూమ్ ప్రెసర్ ఇలా అన్ని భారీ యంత్రాలకు డీజిల్ తప్పనిసరి కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మరోవైపు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె విరమించేది లేదని లారీ యూనియన్లు వెనక్కి తగ్గడం లేదు. ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సైతం సమ్మెలోకి దిగారు. దీంతో ప్రత్యామ్నయ మార్గాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. -
ప్రాణాలకు తెగించి...
విశాఖపట్నం, అరకులోయ: ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల లక్ష్మిపురం పంచాయతీ పరిధి లోని ముత్తగుమి రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో గిరిజనులు ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తున్నారు. ఎంతో కష్టపడి తమ వాహనా లను ఒడ్డుకు చేరుస్తున్నారు. రెండు రోజులుగా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్ష్మిపురం పంచాయతీతో సరిహద్దులో ఉన్న ఒడిశాలోని 80 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసర ప్రయాణానికి గిరిజనులంతా నరకయాతన పడుతున్నారు. గెడ్డలో నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. బైక్‌లు, ఆటోలను అతికష్టంపై గెడ్డను దాటిస్తున్నారు. గెడ్డ ఉధృతి తగ్గే వరకు గిరిజనులంతా మండల కేంద్రానికి చేరుకోవడానికి అవస్థలు తప్పేటట్టు లేవు. అనేక గ్రామాల గిరిజనులకు మండల కేం ద్రంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. -
కొత్త నోట్ల తరలింపు ఖర్చు రూ.29.41 కోట్లు
న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.2000ల నోట్లను తరలించటానికి ఏకంగా రూ. 29 కోట్లు ఖర్చు చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం డబ్బులు రవాణా చేయటానికి వీలుగా సైనిక విమానాలను ఉపయోగించటం వల్ల ఈ మొత్తం ఖర్చు అయినట్లు సమాచారం. నవంబర్ 8, 2016న 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో అత్యధిక భాగం సరఫరాలో ఉన్న డబ్బు చెల్లుబాటులో లేకుండా పోయింది. ఆర్బీఐ వీటి స్థానంలో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిని దేశం మొత్తం సరఫరా చేయటానికి సీ-17, సీ-130 సూపర్ హెర్క్యులీస్ వంటి సైనిక విమానాలను ఉపయోగించింది. దీంతో ఆ విమానాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ కొత్త 500, 2000 రూపాయల నోట్లు ముద్రించటానికి 2016-17 సంవత్సరానికి గానూ దాదాపు రూ. 7,965 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం మిగిలిన చిల్లర మొత్తాలను ముద్రించటానికి రూ. 3,421కోట్లు ఖర్చు చేసింది. ఉపసంహరణకు గురైన పాత నోట్లు 99శాతం బ్యాంకులకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. కొత్త నోట్ల రవాణా కోసం సైనిక విమానాలను కాకుండా మామూలు విమానాలను ఉపయోగించి ఉంటే బాగుండేదని రిటైర్డ్ ఆర్మీ కమాండర్ లోకేష్ బట్రా అభిప్రాయపడ్డారు. -
ఎరక్కపోయి... ఇరుక్కుపోయి!
ఇబ్రహీంపట్నం: రాజధాని అమరావతి నిర్మాణానికి జలమార్గం ద్వారా మెటీరియల్ రవాణా చేస్తున్న పంటు ఇబ్రహీంపట్నం ఫెర్రీ లాంచీ రేవు సమీపంలో నదిలో ఒడ్డుకు పట్టి ఇరుక్కుపోయిం ది. శుక్రవారం సాయంత్రం 6.30గంటల సమయంలో 15 లారీలు (600 టన్నులు) ఎక్కించుకుని ఫెర్రీ వైపు నుంచి లింగాయపాలెంకు బయలుదేరింది. బయలు దేరిన కొద్దిసేపటికే నదిలో ఏర్పాటు చేసుకున్న మార్గంలో పక్కకు రావటంతో ఒడ్డుకు పట్టి కదలకుండా నిలిచిపోయింది. ఈపరిణామాలతో పంటుపైన ఉన్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంటు ఒడు ్డకు పట్టి నిలిచిపోయిందనే విషయాన్ని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఒడ్డుకు పట్టిన పం టును పక్కకు జరిపే ప్రయత్నాలు సిబ్బంది చేపట్టారు. సంగమం ప్రాంతంలో వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పంటుకు ప్రమాదం ఏర్పడిందనే సమాచారం మండలంలో దావానంలా వ్యాపించింది. అయితే ఆలస్యంగా అసలు విషయాన్ని తెలుసుకుని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
రాకెట్ కబుర్లు తెస్తుంది..!
రవాణా వ్యవస్థ ప్రారంభమైనప్పుడే పోస్టల్ వ్యవస్థ చరిత్ర కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఉత్తరాలను ఒక చోటు నుంచి మరో చోటుకు ఎలా చేరవేసేవారంటే.. ఆ ఏముంది.. రైలులోనో.. బస్సులోనో.. అంటారు కదా.. మరీ దూరమైతే విమానాల ద్వారా కూడా చేరవేసేవారు. ఇప్పుడైతే వాటి అవసరమే లేకుండా పోయిందనుకోండి. మన తాతల తరం వారికి ఏ చిన్న సమాచారం చేరవేయాలన్నా.. ఈ ఉత్తరాలే అన్నింటికీ ఆధారం. అప్పట్లో ఒక్క ఉత్తరం చేరాల్సిన చోటుకు చేరాలంటే వారాలకు వారాల సమయం పట్టేది.. అయితే త్వరగా పంపాలంటే ఎలా.. అందుకోసం రాకెట్లను వాడేవారట. రాకెట్ ద్వారా పోస్ట్ ఎలా పంపిస్తారని ఆశ్చర్యపోకండి.. నిజంగా రాకెట్ ద్వారానే ఉత్తరాలు పంపేవారట. 1810లోనే ఆలోచన.. రాకెట్ ద్వారా పోస్టు పంపాలన్న ఆలోచనకు 1810లోనే బీజం పడింది. అప్పట్లో హెన్రిచ్ వోన్ క్లీస్ట్ అనే రచయిత రాకెట్ ద్వారా ఉత్తరాలు పంపే ఆలోచనను వ్యాసం రూపంలో ఓ పత్రికలో రాశారు. జర్మనీలోని బెర్లిన్ నుంచి బ్రెస్లూ (180 మైళ్లు)కు సగం దినంలో పంపొచ్చని ఆయన అంచనా వేశారు. అంటే గుర్రం ద్వారా పట్టే సమయంలో పదో వంతన్న మాట. ఆయన సిద్ధాంతాన్ని టోంగాలోని పాలినేసియన్ అనే చిన్న ద్వీపంలో బ్రిటిష్ పరిశోధకుడు సర్ విలియమ్ కంగ్రీవ్ ఆచరణలో పెట్టారు. అయితే అది సక్సెస్ అవలేదు. మరో వందేళ్ల వరకు దీని గురించి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 1927లో హెర్మన్ జులియస్ అనే జర్మన్ ఫిజిసిస్ట్ దీనిపై ప్రయోగాలు చేశారు. 1928లో యువ ఇంజనీరైన ఫ్రెడ్రిక్ స్క్మీడిల్ ఉత్తరాలను రాకెట్ ద్వారా పంపేందుకు ప్రయత్నించారు. చివరికి 1931లో చరిత్రలోనే తొలిసారిగా రాకెట్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి 102 ఉత్తరాలను ఒకేసారి పంపి చరిత్రలోకెక్కారు. కిందికి దింపేందుకు పారాచూట్లను వాడేవారు. భారత్‌లో తొలి రాకెట్ ఉత్తరం! ఆ తర్వాత వేరే దేశాల్లో కూడా ఈ ప్రయోగాలు జరిగాయి. 1934లో భారత్‌లో దీనిపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఎయిరోస్పేస్ ఇంజనీర్ స్టీఫెన్ స్మిత్ విజయవంతంగా ఈ రాకెట్ ద్వారా ఉత్తరాలను పంపారు. 1934 నుంచి 1944 మధ్య దాదాపు 270 సార్లు ప్రయోగించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు ఆహారం అందించేందుకు స్మిత్ ప్రపంచలోనే తొలిసారిగా రాకెట్‌ను ఉపయోగించారు. ఖర్చు చాలా ఎక్కువే.. అయితే రాకెట్ ద్వారా ఉత్తరాలు బట్వాడా చేయాలంటే అంత సులువేం కాదు.. ఇందుకోసం చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. ఈ ప్రయోగానికి అప్పట్లోనే 10 లక్షల డాలర్లు ఖర్చయ్యేదట. కానీ బట్వాడా చేయడం ద్వారా వచ్చే ఆదాయం కేవలం 240 డాలర్లు. -
‘ఆర్సీ’తో ఏమార్చి కోట్లు కొట్టేశారు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : సింగరేణి బొగ్గు రవాణాలో ఇదో కొత్త తరహా కుంభకోణం! బొగ్గు రవాణా చేసే లారీకి రవాణా శాఖ జారీ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ని మార్చేసి కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు. ఒరిజినల్ ఆర్సీలో పేర్కొన్న వాహనం బరువు (నెట్ వెయిట్)ను కలర్ జిరాక్స్లో మార్ఫింగ్ చేసి గుట్టుగా దందా సాగించారు. బొగ్గుతో లోడ్ చేసిన తర్వాత వచ్చే లారీ బరువు(టోర్)ను లెక్కలోకి తీసుకొని ప్రతి లోడ్‌లో రెండు నుంచి మూడు టన్నుల వరకు అధికంగా రవాణా చేస్తున్నట్లు సింగరేణి అధికారులను బురిడీ కొట్టించారు. ఇలా ‘కిలోమీటరు, టన్ను, ట్రిప్పుల’ప్రాతిపదికన ప్రతి బొగ్గు లారీకి చెల్లించే మొత్తాన్ని పెంచేసుకొని రోజుకు లక్షల్లో, నెలకు కోట్లల్లో జేబుల్లోకి వేసుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఓ క్లర్క్.. ఆర్సీలపై అనుమానంతో తీగ లాగగా ఈ స్కాం డొంక కదిలింది. రవాణా శాఖ యాప్ ద్వారా ఒరిజనల్ ఆర్సీని తనిఖీ చేయగా.. లారీల బరువును ఒకటి నుంచి మూడు టన్నుల వరకు తగ్గించి కలర్ జిరాక్స్ ఆర్సీలను తయారు చేసినట్లు తేలింది. శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల నుంచి తీసిన బొగ్గును సమీపంలోని కోల్ హాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)లకు రవాణా చేసే ప్రక్రియలోనే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయంటే... సీహెచ్పీల నుంచి వేరే ప్రాంతాలకు రోజూ తరలివెళ్లే బొగ్గు రవాణాలో సింగరేణి ఎంత నష్టపోతుందో తేలాల్సి ఉంది. వాహనం బరువుకు ఆర్సీ ప్రామాణికమా? సాధారణంగా ఒక లారీలో రవాణా అయ్యే సరుకు బరువును కాంటా (వేయింగ్ మిషన్) ద్వారా తెలుసుకుంటారు. ఖాళీ లారీ బరువును ముందుగా తూకం వేసి, సరుకుతో నిండిన తర్వాత మరోసారి తూకం వేస్తే కచ్చితమైన బరువు ఎంతో తెలుస్తుంది. సాధారణంగా ఏ సరకు రవాణాకైనా ఇదే ప్రామాణికం. కానీ సింగరేణిలో బరువు తూచే విషయంలో వాహనం ఆర్సీని కూడా పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. ఆర్సీలో పేర్కొన్న వాహన నెట్ బరువు, గని వద్ద తూకం వేసిన వాహన బరువులో ఏది తక్కువగా నమోదైతే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధనను చేర్చారు. బొగ్గు రవాణా అనంతరం సీహెచ్‌పీ వద్ద వాహన బరువు (టేర్)ను లెక్కించి రవాణా అవుతున్న బొగ్గు గ్రాస్ వెయిట్‌ను కొలుస్తారు. దీని ప్రకారం ఎంత బొగ్గు రవాణా అయితే అన్ని టన్నులకు దూరం ఆధారంగా కాంట్రాక్టు సమయంలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించడం జరుగుతోంది. ఇలా ఎక్కడా లేని ఆర్సీ నిబంధనను బొగ్గు రవాణాలో పెట్టడం వల్ల కలర్ జిరాక్స్ ద్వారా మార్ఫింగ్‌కు అవకాశం కల్పించినట్లయింది. ఎలా బయటపడిందంటే? శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కార్యాలయంలోని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఓ క్లర్క్ ఇటీవల కాంట్రాక్టు సమయం పూర్తయిన బొగ్గు రవాణా లారీల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో లారీ నెట్ బరువుకు సంబంధించి దాఖలు చేసిన ఆర్సీలలో అక్షరాల్లో తేడా ఉండడం గమనించారు. ఓ ట్రాన్స్‌పోర్టు సమర్పించిన 10 ఆర్సీల్లో ఈ తేడా కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన ‘ఆర్టీఏ ఎం–వాలెట్’యాప్ ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గు రవాణా చేసే ఒరిజనల్ ఆర్సీలను పరిశీలించారు. 60 లారీలకుగాను 39 లారీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఆర్సీలలో లారీ నెట్‌వెయిట్‌ను టాంపరింగ్ చేసినట్లు తేలింది. సదరు ట్రాన్స్‌పోర్టుకు చెందిన పది లారీలలో మూడు టన్నుల తేడా రాగా, మరో లారీలో ఒక టన్ను తేడా చూపించారు. మరో లారీకి రెండు టన్నుల తేడాతో ఆర్సీ తయారు చేశారు. మిగతా 18 లారీలకు సంబంధించి కూడా ఒకటి నుంచి రెండు టన్నుల తేడాలతో ఆర్సీలలో నెట్‌వెయిట్ మార్చేశారు. దీంతో ఆ క్లర్క్ పై అధికారుల ద్వారా సింగరేణి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. రోజుకు లక్షల్లోనే ఎసరు బొగ్గు గని నుంచి సీహెచ్‌పీకి బొగ్గు రవాణా చేసినందుకు సగటున కిలోమీటరుకు రూ.10 చెల్లించేలా ఒప్పందం కుదిరిందనుకుంటే.. ఒక లారీ కనీసం పది కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. అంటే ఒక టన్నుకు రూ.100 చెల్లించాలి. రోజుకు ఎనిమిది ట్రిప్పుల మేర లారీ తిరిగితే టన్నుకు రూ.800 చొప్పున చెల్లించాలి. అంటే మూడు ట్రిప్పులకు అదనంగా చెల్లించినా ప్రతి లారీకి రూ.2,400 చొప్పున ముట్టజెప్పడమే. శ్రీరాంపూర్‌లో గుర్తించిన 39 లారీలకు ప్రతి ట్రిప్పుకు సుమారు 100 టన్నులకు పైగా ప్రతిరోజు అదనంగా చెల్లిస్తూ వచ్చారు. ఇక్కడే రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకు అదనంగా చెల్లిస్తున్నట్లు సమాచారం. మిగతా ఏరియాల్లో ఇంతేనా? ఏటా 64 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థలో 13 కోల్ హాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)లతోపాటు పెద్ద సంఖ్యలో బొగ్గు డిస్పాచ్ పాయింట్లు ఉన్నాయి. సింగరేణిలోని 19 ఓపెన్‌కాస్ట్ గనులు, 29 భూగర్భ గనుల నుంచి వెలికితీసిన బొగ్గును డిస్పాచ్ పాయింట్ల వరకు లారీల్లో తీసుకెళ్తారు. అక్కడ్నుంచి రైలు మార్గంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతుంది. గనుల నుంచి సీహెచ్పీల వరకు బొగ్గు రవాణా చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా వేలాది లారీలను వినియోగిస్తున్నారు. ఈ లారీల నెట్‌వెయిట్‌ను మార్చేసే తంతు ఎప్పట్నుంచి నడుస్తుందో తెలియదు. అందుకే అతి తక్కువ బిడ్‌తో బడా కాంట్రాక్టర్లే సింగరేణిలో రవాణా కాంట్రాక్టులను పొందుతున్నారని అర్థమవుతోంది. సింగరేణి విజిలెన్స్ విభాగం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. -
దర్జాగా ఇసుక దందా
ఖానాపూర్ : జిల్లాలోని ఖానాపూర్, పెంబి మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాగులతోపాటు అటవీ ప్రాంతంలోని ఒర్రెల నుంచి కూడా ఇసుకను తరలించి సమీప గ్రామాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా జిల్లా కేంద్రంతోపాటు ఇతర మండలాలకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పట్టపగలే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రధాన రోడ్ల గుండా దినమంతా ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకున్న అధకారి లేడు. అంతేకాకుండా ఖానాపూర్, పెంబి మండలాల్లోని ఆయా వీడీసీల ఆధ్వర్యంలో ఇసుక తరలింపునకు అనధికారికంగా టెండర్లు నిర్వహిస్తున్నా.. ఆయా శాఖల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అనధికార టెండర్లు నిర్వహిస్తున్నా.. ఖానాపూర్, పెంబి మండలాల మధ్య గల రాజూరా శివారులోని పల్కేరు వాగుతోపాటు పెంబి మండలంలోని ఇటిక్యాల, పస్పుల పంచాయతీల పరిధిలోని కడెం వాగు, ఖానాపూర్ మండలంలోని సోమర్పేట్, బీర్నంది గ్రామాల సమీపంలోని బల్లివాగు, మండల కేంద్రం, బాదన్‌కూర్తి సమీపంలోని గోదావరి తీరం నుంచి ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఖానాపూర్ మండలంలోని రాజూరా, పెంబి మండలంలోని మందపల్లి గ్రామాల్లో వీడీసీలు అనధికార టెండర్లు నిర్వహించినట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో డంపులు.. అక్రమంగా తరలించిన ఇసుకను నేరుగా విక్రయించడంతోపాటు రాత్రివేళ వాగుల నుంచి తరలించిన ఇసుకను ఆయా గ్రామాల శివార్లలో.. వ్యవసాయ పొలాలు, పంటచేల వద్ద నిల్వ చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంట కుప్పలుగా పోస్తున్నారు. ఇక్కడి నిల్వల నుంచి ట్రాక్టర్ల ద్వారా మళ్లీ జిల్లాలోని ఇతర మండలాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఎస్పీ గుర్తించినా ఆగని దందా.. ఖానాపూర్ మండలం పాతఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెవాడలో 15రోజుల క్రితం ఎస్సీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో సుమారు రూ.3లక్షల విలువ చేసే అక్రమ ఇసుక డంపులు గుర్తించారు. అయినప్పటికీ డంపులను స్వాధీనం చేసుకోవడం, శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గతంలోనూ పలు గ్రామాల్లో అక్రమంగా ఇసుకను డంపు చేసినవారికి నోటీసులిచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. పడిపోతున్న భూగర్భ జలాలు.. జిల్లాలోని పలు వాగులు, అటవీ ప్రాంతాల్లోని ఒర్రెల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుతుండడంతో భూగర్భజల మట్టం తగ్గుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతున్నా ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు చర్యలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆయా మండలాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం అనుమతి లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో తరలించినా.. గ్రామాల్లో డంపు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, మైనింగ్ అ ధికారులకు జరిమానా నిమిత్తం పంపిస్తాం. అంతేకాకుండా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇటీవల ఎల్లాపూర్‌లో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో సుమారు రూ.3లక్షల ఇసుక డంపులను గు ర్తించి రెవెన్యూ అధికారులకు అప్పగించాం. – ప్రసాద్, ఎస్సై, ఖానాపూర్ -
మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. పునరావాసం అందనివారు పొరుగు రాష్ట్రాల నుంచి నల్లబెల్లం, పటిక దిగుమతి చేసుకుని సారా బట్టీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న టన్నుల కొద్దీ నల్లబెల్లం, పటిక నిల్వలు గుడుంబా మళ్లీ విజృంభిస్తోందన్న వాస్తవాన్ని బయటపె డుతున్నాయి. ఏపీ నుంచి రైళ్లలో, మహారాష్ట్ర నుంచి రోడ్డు మార్గంతో నల్లబెల్లం రాష్ట్రంలోకి వస్తోందని అధికారవర్గాలు గుర్తించాయి. గట్టి చర్యలు చేపట్టినా.. రాష్ట్రాన్ని గుడుంబా రహితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి చర్యలే తీసుకు న్నారు. నాటుసారా తయారీపై ఎక్సైజ్, పోలీ సు సిబ్బంది దాడులు చేశారు. చాలా మంది గుడుంబా తయారీదారులను పట్టుకుని కేసు లు పెట్టారు. నల్లబెల్లం సరఫరాను నియం త్రించారు. గుడుంబా జీవనాధారంగా బతికే కుటుంబాల వారికి పునరావాసంగా ప్రత్యా మ్నాయ ఉపాధి కోసం రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించే కార్యక్రమా న్నీ చేప ట్టారు. ఐదారు నెలల్లోనే గుడుంబా నియం త్రణలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో చాలా మందిని పునరావాస సాయం కోసం ఎంపిక చేయలేదు, ఎంపికైనవారిలో పలు వురికి సా యం అందకపోవడంతో మళ్లీ గుడుంబా తయారీవైపు మరలినట్టు తెలుస్తోంది. రైలు, రోడ్డు మార్గాల్లో నల్లబెల్లం.. పొరుగు రాష్ట్రాల్లో నిషేధం లేక పోవడంతో తక్కువ ధరకే నల్లబెల్లంపై అందుబాటులో ఉంది. ఏపీలోని గుంటూరు, నెల్లూరు, గోదా వరి జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం, వరం గల్, నల్లగొండ జిల్లాలకు అక్రమంగా రవాణా అవుతోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు రోడ్డు మార్గంలో నల్లబెల్లం వస్తోంది. ఏపీ నుంచి రైళ్లలో రోజూ 50 టన్నుల వరకు నల్ల బెల్లం అక్రమరవాణా అవుతున్నట్టు నిఘా వర్గాల అంచనా. ఇటీవలే మహారాష్ట్ర నుంచి 11 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పటికను తరలిస్తున్న వాహనాన్ని ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు(టి)–కౌటాల రహదారిపై ఎౖMð్సజ్ అధికారులు పట్టుకోవడం గమనార్హం. గుం టూరు జిల్లా బాపట్ల నుంచి పద్మావతి ఎక్స్ ప్రెస్‌లో తీసుకువస్తున్న 10 టన్నుల బెల్లాన్ని కేసముద్రం వద్ద రైల్లోనే పట్టుకున్నారు. యువకులు బృందాలుగా మారి.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వారు కొందరు బృందాలుగా ఏర్పడి నల్లబెల్లాన్ని తీసుకువస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బెల్లం కొంటు న్నారు. ఒక్కొక్కరు ఒక్కో క్వింటాల్ బెల్లాన్ని బస్తాల్లో తీసుకుని సాధారణ ప్రయాణీకుల్లా రైలు ఎక్కుతున్నారు. తమ గమ్యస్థానం సమీపించగానే రైల్లోంచి బెల్లం మూటలను కిందికి తోసేస్తున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉండే మరికొందరు.. ఆ బెల్లాన్ని ఆటోలు, ఇతర వాహనాల ద్వారా గ్రామాలకు తీసుకెళ్లి రెండింతల ధరకు విక్రయిస్తున్నారు. -
హరిత హైదరాబాద్!
సాక్షి హైదరాబాద్: మహానగరంలో పెరిగిపోతున్న కాలుష్యానికి అర్బన్ పార్కుల నిర్మాణంతో చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్క హైదరాబాద్ చుట్టూ మాత్రమే కాకుండా పక్కన ఆనుకొని ఉన్న 6 జిల్లాల్లోనూ పార్కుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వీలైనంత త్వరగా అన్ని సౌకర్యాలతో కూడిన అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఉన్న 188 ఫారెస్ట్ బ్లాకుల్లో 129 ప్రాంతాలు పార్కుల నిర్మాణం, అభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు సమావేశంలో నివేదించారు. వీటిల్లో 70 ప్రాంతాలను ఫారెస్ట్ కన్జర్వేషన్ జోన్లుగా, మిగతా వాటిల్లో 52 ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా, మరో ఏడు ప్రాంతాలను ఎకో టూరిజం జోన్లుగా రూపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. సీఎం ఆదేశం మేరకు: సీఎస్ రానున్న రెండేళ్లలో దశలవారీగా పార్కులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని సీఎస్ ఎస్కే జోషి చెప్పారు. ఆ దిశగా అన్ని శాఖలు పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య, ఆహ్లాద, విహార సౌకర్యాలకు అనువుగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను, ఎకో టూరిజం స్పాట్లను తీర్చిదిద్దాలన్నారు. అటవీశాఖ ఇప్పటికే చేపట్టిన అర్బన్ పార్క్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. భాగ్యనగర్ నందనవనం, మేడిపల్లి ఫారెస్ట్ పార్క్, కండ్లకోయ ఆక్సిజన్ పార్కులు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, రోడ్లు భవనాలు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, పంచాయతీరాజ్ కార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్ పీకే ఝా, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల పరిధిలో.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 26 పార్కులు, మేడ్చల్‌లో 11, యాదాద్రిలో 6, మెదక్‌లో 4, సంగారెడ్డిలో 3, సిద్దిపేటలో 1, చొప్పన కొత్త పార్కుల నిర్మాణానికి అధికారులు రూపకల్పన చేశారు. తొలిదశలో అటవీశాఖ 15, హెచ్ఎండీఏ 17, జీహెచ్ఎంసీ 3, టీఎస్ఐఐసీ 11, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4, మెట్రోరైల్ 2 పార్కుల చొప్పున దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులు, మానవ వనరులను ఆయాశాఖలు సొంతంగా సమీకరణ చేసుకోవాలని లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వాడుకోవచ్చని సీఎస్ సూచించారు. వివిధ శాఖలు అర్బన్ పార్కులను అభివృద్ధి చేసి అటవీశాఖకు అప్పగిస్తే ఆ శాఖే నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుందన్నారు. టూరిజం శాఖ పరిధిలో మరో ఏడు చోట్ల ఎకో టూరిజంను పార్కులను అభివృద్ధి చేయనున్నారు. మేడ్చల్ జిల్లాలో మూడు, యాదాద్రి జిల్లాలో 4 చొప్పున ఎకో టూరిజం పార్కులు రానున్నాయి. -
రైల్వే @ 100 మిలియన్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సరుకు రవాణాలో రైల్వేలోని జోన్లలో మూడో స్థానంలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది వంద మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డు సృష్టించింది. రైల్వేకు ప్రధాన ఆదాయ కేంద్రాల్లో కీలకమైందిగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే లక్ష్యం విధించుకుని మరీ రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసి ఆదాయాన్ని భారీగా పెంచుకుంది. మార్చి 24 నాటికి ఈ మైలురాయిని అధిగమించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి జరిగిన రవాణా కంటే 5.82 మిలియన్ టన్నులు ఎక్కువగా సరుకును రవాణా చేసినట్టు పేర్కొంది. స్టీల్ ప్లాంట్లకు ముడిసరుకు రవాణాలో 32శాతం, ఇంపోర్టెడ్ ఐరన్ ఓర్లో 200%, సిమెంట్ లోడింగ్‌లో 3%, ఆహార ధాన్యాల్లో 38%, ఎరువుల తరలింపులో 11%, కంటెయినర్ లోడింగ్‌లో 20% పెరిగినట్టు పేర్కొంది. 100.122 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో.. గతేడాది కంటే 6.2 శాతం అధికంగా రవాణా చేసినట్టు తెలిపింది. ఈ రికార్డుపై దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మధుసూదనరావును ప్రత్యేకంగా అభినందించారు. -
ఏమయ్యాయో?
సంక్రాంతి కానుకలు పక్కదారి పట్టాయా... వచ్చిన సరకు మొత్తంసరఫరా కాలేదా... మిగిలిన సరకు ఎక్కడుందో కనిపించడం లేదా... ఈ ప్రశ్నలకు ఇప్పుడు జిల్లాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం... జిల్లాకు కేటాయించిన సరకు పూర్తిస్థాయిలో సరఫరా కాలేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. మిగిలినవాటిని గోదాములకు చేర్చాల్సి ఉన్నా... ఆ ప్రయత్నాలు జరగలేదని స్పష్టమవుతోంది. మరి అధికారులేం చేస్తున్నట్టు? విజయనగరం గంటస్తంభం: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రభుత్వం కంటితుడుపు కానుకగా ఆరు రకాల సరుకులు సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఒక్కో కుటుంబానికి కందిపప్పు, శనగపప్పు, బెల్లం అరకేజీ చొప్పున, గోధుమపిండి కేజీ, పామాయిల్ లీటరు, నెయ్యి రూ.100గ్రాముల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో ఉన్న 1400 రేషన్‌డిపోల ద్వారా జిల్లాలో ఉన్న 7,01,494 రేషన్‌కార్డులకు సరిపడా సరకులు డిపోలకు ముందుగానే పంపించారు. సరుకులను డీలర్లు జనవరి ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు పంపిణీ చేశారు. ఆ సమయంలో జిల్లాలో 6,41,960 కార్డులకే సరుకులు విడుదల చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.ఈ లెక్కన దాదాపుగా 3.21మెట్రిక్ టన్ను లవంతున కందిపప్పు, శనగపప్పు, బెల్లం, 642 మెట్రిక్ టన్నుల గోధమపిండి, 6,41,960 ప్యాకెట్ల వంతున పామాయిల్,, నెయ్యి మాత్రమే లబ్ధిదారులకు సరఫరా జరిగింది. మిగిలిపోయిన సరుకులు తిరిగి మండలస్థాయి నిల్వ కేంద్రాలకు పంపించాల్సి ఉంది. తిరిగి చేరని సరుకులు పంపిణీ తీరును బట్టి కందిపప్పు 30మెట్రిక్ టన్నులు, శనగపప్పు 29 మెట్రిక్ టన్నులు, బెల్లం 28మెట్రిక్ టన్నులు, గోధమపిండి 78మెట్రిక్ టన్నులు, పామాయిల్ ప్యాకెట్లు 59,245, నెయ్యి ప్యాకెట్లు 57,532 తిరిగి మండలస్థాయి నిల్వ కేంద్రాలకు చేరాలి. అయితే కందిపప్పు, పామాయిల్ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా జరుగుతున్నందున డీలర్లు వారి వద్ద ఉంచుకోవచ్చు. వాటికి మండలస్థాయి గోదాము నుంచి పంపిస్తున్నట్లు రిలీజ్ అర్డర్ ఇస్తున్నారు. అంటే శనగపప్పు, బెల్లం, గోధమపిండి, నెయ్యి వంటి సరుకులు వెనక్కి చేరాలి. కందిపప్పు, పామాయిల్ వంటి సరుకుల లెక్కలు పౌరసరఫరాలసంస్థ అధికారులు వద్ద ఉండాలి. అయితే రావాల్సిన సరుకులు సగానికిపైగా రాలేదని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. కనీసం ఎంత సరుకు చేరిందని అడిగితే లెక్కలు చెప్పలేకపోతున్నారు. ఇంకా సరుకులు రావాలని చెబుతున్నారు. సంక్రాంతి వెళ్లి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇంకా సరుకులు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీలర్లు, అధికారులు కుమ్మక్కై సరుకులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. -
బైక్‌పై మృతదేహం తరలింపు
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి (రంపచోడవరం): మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు వాహన సదుపాయం లేక మృతుని బంధువులు నానా అగచాట్లు పడ్డారు. ప్రభుత్వ అంబులెన్సు సమకూరక, పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించి ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేసుకోలేక తీవ్ర ఆందోళన చెందారు. చివరికి బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ హృదయ విదారక సంఘటన మండల ప్రధాన కేంద్రం రాజవొమ్మంగిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలివి... అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉన్న వట్టిగెడ్డ గ్రామానికి చెందిన గవిరెడ్డి తాతయ్యలు (58) అనే రైతును కుటుంబ సభ్యులు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వైద్యుడు వంశీ పరీక్షించి అప్పటికే అతడు మృతి చెందినట్టు చెప్పారు. దీనితో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు పీహెచ్సీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వైద్యులను కోరారు. ఆ వాహనంలో డీజిల్ లేదని చెప్పారు. దీంతో వారికి ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్తోమత లేక, మరో గత్యంతరం లేక మృతదేహాన్ని మోటారు సైకిల్‌పై మధ్యన కూర్చోబెట్టుకుని తరలించడం స్థానికులను కలచివేసింది. డీజిల్ లేకుండా అంబులెన్సును పీహెచ్సీలో ఉంచడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకుండా పీహెచ్‌సీకి, అంబులెన్సు నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
ఇదెక్కడి ‘సంత’ ?
ప్రతి బుధవారం పీలేరు పశువుల సంతలో పశువులను కొన్న మనుషులు వాటిని తరలించేందుకు మాత్రం రాక్షసత్వాన్ని వాడుతున్నారు. పశువులను ఇతర ప్రాంతాలకు తరలించేటపుడు లారీలలో 10 నుంచి 12, మినీలారీలో 8, క్యాబ్‌లో 4, ఇతర వాహనాల్లో అయితే వాటి కెపాసిటీ మించకుండా పశువులను తరలించాల్సి ఉంటుంది. అయితే పీలేరు మార్కెట్ కమిటీ అధికారులు నిబంధనలకు తిలోదకాలు వదలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇక గేట్ నిర్వాహకులేమో ‘ఎవరేమనుకుంటే మాకేంటి..ఇవ్వాల్సింది ఇచ్చేయండి..లోడ్ మీ ఇష్టం’ అన్న తరహాలో వ్యవహరిస్తూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. పీలేరు: వారపు సంతకెళ్లి రకరకాల కూరగాయలు కొని సంచిలో వేసుకున్నట్టు పశువులను కొని మూట చుట్టేస్తున్నారు. పశువులను ఒకదానిపై ఒకటి కట్టిపడేసి ఎవరికీ అనుమానం రాకుండా వాహనాల చుట్టూ టార్పాలిన్æ పట్టలు, ప్లాస్టిక్ కవర్లతో కప్పివేస్తున్నారు. దీంతో ఊపిరి ఆడక పశువులు నరకం చూస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పీలేరు మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది తీరుపై ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు గుప్పుమంటున్నాయి. మూగవేదన వినబడదా? పీలేరు మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రతి బుధవారం పశువుల సంత నిర్వహిస్తున్నారు. వారపు సంతకు వచ్చే పశువుల రేటులో ఒక శాతం గేటు వసూలు చేసేవారు. అయితే ఇష్టారీతిన పశువులను తరలించడానికి వీలు లేదు. కానీ లారీల్లో ఊపిరి ఆడక పశువులు కొట్టుమిట్టాడుతూ చేసే మూగవేదన మార్కెట్ అధికారులకు, వ్యాపారులకు వినబడడం లేదు. చేయి తడిపితే చాలు ఒక్కో వాహనంలో ఎన్ని పశువులు లోడ్ చేసినా ఫర్వాలేదన్న రీతిలో అధికారుల వ్యవహరించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మాకేం కొత్తకాదు’ నిబంధనలకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో పశువులను తరలిస్తున్నారేంటని ప్రశ్నిస్తే ‘మీకు ఏం కావాలి, ఎవరు మీరు, ఇదేం మాకు మొదటి సారి కాదు’ అంటూ వాహనదారులు ప్రశ్నల పరంపర కురిపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అదునుగా భావించిన పలువురు తమిళనాడుకు చెందిన వ్యాపారులు కారు చౌకగా పశువులను కొని వేలూరు, గుడియాత్తం, పుంగనూరు తదితర ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. అదిగాక వారపు సంతలో ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని నామమాత్రపు బిల్లులు రాసి పంపేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యాపారులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెపాసిటీ మేరకే... వారపు సంతలో కొనుగోలు చేసిన పశువులను వాహనాల కెపాసిటీ మేరకే తరలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పశువులను లోడ్ చేస్తే ఒప్పుకోం. ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఎవరూ చేతివాటం చూపినట్లు నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా. -ఎస్. అక్బర్‌బాషా, సెక్ర టరీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పీలేరు -
అమ్మాయిలకు బంపరాఫర్
సాక్షి, డెహ్రాడూన్ : కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1న ఉత్తరాఖండ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలను ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని ప్రతి నాలుగురోడ్ల కూడలిలో..ఉచిత వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాది సంబరాల సందర్భంగా మహిళలకు ఇబ్బంది కలగకుండా ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా తాగుబోతుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. -
క్రాష్ గార్డ్స్‌ను నిషేధిస్తే?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రమాదాల తీవ్రతను తగ్గించుకునేందుకు కార్ల యజమానులు ప్రత్యేకంగా క్రాష్ గార్డులను ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. ఈ కార్ క్రాష్ గార్డులపై కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ కొరడా ఝులిపిస్తోంది. మోటార్ వెహికల్ యాక్ట్‌ను ఉల్లంఘించి ఏర్పాటు చేసుకునే ఈ క్రాష్ గార్డులను నిషేధించే యోచనల రవాణ మంత్రిత్వ శాఖ ఉంది. క్రాష్ గార్డులనేవి.. పాదచారులకు, ద్విచక్ర వాహన దారులకు ప్రమాదమేనని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో కంపెనీ ఇచ్చిన వాటికి అదనగా ఏ మాత్రం మార్పులు చేర్పులు చేయరాదని మంత్రిత్వ శాఖ చెబుతోంది. సాధారణంగా వాహనదారులు కొత్త వాహనం కొత్త తరువాత ప్రమాద తీవ్రతను తగ్గించుకునే నేపథ్యంలో క్రాష్ గార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. దాదాపు ప్రతి ప్రభుత్వ వాహనానికి కూడా క్రాష్ గార్డులు ఉండడం గనార్హం. అయితే ఈ క్రాష్ గార్డుల వల్లే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశముదని రవాణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. క్రాష్ గార్డులు ఉండడం వల్ల ప్రమాద సమయంలో కంపెనీ ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కారణం వల్లనే క్రాష్ గార్డులను నిషేధించాలన్న ఆలోచనకి రవాణ మంత్రిత్వ శాఖ వచ్చినట్లు తెలుస్తోంది. -
బాబోయ్ బోటు ప్రయాణం
పగిడ్యాల: బ్యాక్ వాటర్‌లో ఇంజిన్ బోటుపై ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా ఇటు ప్రయాణికులు, అటు బోటు నిర్వాహకులు కొనసాగిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మండల పరిధిలోని నెహ్రూనగర్ మూర్వకొండ ఘాట్ నుంచి ఇంజిన్ బోట్ ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్ మీదుగా తెలంగాణ ఆవలి ఒడ్డున ఉండే మంచాలకట్ట గ్రామానికి ప్రయాణికులను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. 2007 జనవరి 19న సింగోటం జాతరకు నాటు పుట్టిలో మూర్వకొండ ఘాట్ నుంచి బయలుదేరిన 70 మందికి పైగా భక్తులు ప్రమాదానికి గురయ్యారు. 60 మంది నీటిలో మునిగి మరణించగా మిగతావారు అతికష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నారు. పుట్టి నిర్వాహకుల ధనాశకు అంతమంది బలైపోయారు. అప్పటి నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో నాటు పుట్టిలను అధికారులు నిషేధించారు. అయితే తెలంగాణ, రాయలసీమకు బంధుత్వాలు ఎక్కువగా ఉండడం, మూర్వకొండ ఘాట్ నుంచి నదిపై బోట్లలో వెళ్లడం అవసరం కావడంతో ఘాట్ నిర్వాహకులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజీవ్ యువశక్తి పథకం కింద రెండు ఇంజిన్బోట్లను మంజూరు చేయించారు. ఇంజిన్ బోటులో 20 మంది ప్రయాణికులకు మించి తరలించరాదని ఆదేశాలు కూడా జారీ చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు.. ప్రభుత్వ సాయం ద్వారా ఇంజిన్‌బోట్లు కొనుగోలు చేసి నిర్వహిస్తున్న నెహ్రూనగర్ వాసులు బోట్లో 20 మందికి మించి తరలించరాదనే ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. రూకల ఆశతో అధిక సంఖ్యలో ప్రయాణీకులు, బైక్‌లను ఎక్కించి తరలిస్తున్నారు. ఇదే సమయంలో ఇంజిన్ బోటులో ఆపద సమయంలో ప్రయాణీకుల భద్రత కోసం ఉండల్సిన లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. దీనికితోడు బోటును నడిపేందుకు పెద్దలకు బదులు అనుభవం లేని, ఈత రాని తమ పిల్లలను పంపిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు వారాల క్రితం ఓ విద్యార్థి ఇంజిన్ బోటుకు ఉన్న లంగర్‌ను తొలగించేందుకు నదిలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే 2007 ఘటన మరోసారి చవి చూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది. రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
ఆంధ్రా-ఒడిశా మధ్య రాకపోకలు బంద్
సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య మంగళవారం రాకపోకలు బంద్ అయ్యాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏపీ-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా... రాకపోకలు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
సూట్‌కేస్‌లో 50 పాములు
బీజింగ్: విషపూరితమైన 50 పాములను సూట్‌కేస్‌లో రవాణా చేసేందుకు యత్నిం చిన ఓ వ్యక్తిని చైనాలోని ఓ రైల్వేస్టేషన్లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సూట్‌కేస్‌లో బరువైన వస్తువు ఒకదానిని మడత పెట్టినట్లుగా రైల్వేస్టేషన్ లోని స్కానర్‌లో కనిపించింది. దీంతో అనుమానం వచ్చి సూట్‌కేస్‌ను తనిఖీ చేయగా, అందులో 4 కేజీల పాములు కనిపించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం పాములను అటవీ అధికారులకు అప్పగించారు. పాములు పిట్ వైపర్ జాతికి చెందినవి. స్నేక్ వైన్ తయారుచేయటం కోసం పాములను కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు. -
50వేలు దాటితేనే వేబిల్లు
కిలోమీటర్ల ప్రాతిపదికన వేబిల్లు గడువు విధింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే సరుకులకు సంబంధించిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వేబిల్లు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల ముఖ్య కార్య దర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. రవాణా వాహనంలోని సరుకుల విలువ రూ.50వేలు దాటితే కచ్చితంగా వేబిల్లు తీసుకో వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. గతంలో అమల్లో ఉన్న వ్యాట్ ప్రకారం వాహనంలోని సరుకుల విలువకు సంబంధం లేకుండా ఉండేది. ఒరిజినల్ వేబిల్లుతో పాటు డూప్లికేట్ కాపీ కూడా వాహనంలో ఉండాలని, అధికారులు తనిఖీ చేసినప్పుడు ఒరిజినల్ వేబిల్లు ను తీసుకుంటారన్నారు. అదే విధంగా కిలోమీటర్ల ప్రాతిపదికన వేబిల్లుల గడువు కూడా విధించారు. 100 కిలో మీటర్ల లోపు 2 రోజులు, 500 కి.మీ లోపు అయితే 3 రోజులు, 1000–2000 కి.మీ అయితే 10 రోజులు, 2 వేల పైన కి.మీ ఉంటే 12 రోజులు ఈ వేబిల్లులు చెల్లుబాటు అవుతాయి. ఈ లోపు సరుకులు గమ్యస్థానానికి చేరని పక్షంలో ఆ వేబిల్లులు చెల్లుబాటు కావు. అదే విధంగా ఒకే ఇన్వాయిస్ మీద ఉన్న సరుకులను రెండు వాహనాల్లో రవాణా చేయాల్సి వస్తే రెండు వేబిల్లులు తీసుకోవాలని పేర్కొన్నారు. -
విశాఖ మన్యం టు హైదరాబాద్
జీలుగుమిల్లి : ఎవరికీ అనుమానం రీతిలో గుట్టు చప్పుడు కాకుండా విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు తరలిపోతున్న గంజాయిని పక్కా సమాచారంతో జీలుగుమిల్లి పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. మినీ బస్సులోని సీలింగ్‌లో దాచి తరలిస్తున్న సుమారు 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు గంజాయి భారీగా రవాణా అవుతున్నట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ బుధవారం విలేకరులకు వివరాలు తెలిపారు. గంజాయి తరలింపుపై పక్కా సమాచారం అందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. మినీ బస్సు కొవ్వూరు, దేవరపల్లి, కొయ్యలగూడెం మూడు పోలీస్ స్టేషన్లను దాటుకుని జీలుగుమిల్లి సమీపంలో పోలీసులకు చిక్కింది. అయితే మూడు గంటల పాటు ఎంత తనిఖీ చేసినా గంజాయి ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు మెకానిక్‌ను రప్పించి బస్సులోని సీలింగ్ రేకు బోల్టులు ఇప్పించి చూడగా అందులో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. డీఎస్పీ, తహసీల్దార్ రాజశేఖరరావు సమక్షంలో గంజాయిని స్వా«ధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ చెప్పారు. మినీ బస్సును సీజ్ చేసి విశాఖ జిల్లాకు చెందిన డ్రైవర్ ఈగల రమణ, హైదరాబాద్‌కు చెందిన లతీఫ్ వజీర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ చెప్పారు. కాగా లతీఫ్ వజీర్ విశాఖ మన్యంలో గంజాయి కొనుగోలు చేసి హైదబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. పోలవరం సీఐ బాలరాజు, ఎస్సై కాళీ చరణ్, ఏఎస్సై భాస్కర్, ఉమ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
ఈ-వేబిల్స్‌తో గందరగోళం
ఆదోని అర్బన్: జీఎస్టీ అమల్లోకి రావడంతో వెబ్‌లో ఈ వేబిల్ ఆప్షన్‌ను తొలగించడంతో పట్టణ వ్యాపారస్తుల్లో గందరగోళం నెలకొంది. వేబిల్స్ ఆప్షన్స్ లేకపోవడంతో సరుకును ఇతర ప్రాంతాలకు పంపడానికి ఇక్కట్లు ఎదరవుతున్నాయని వారు వాపోతున్నారు. పట్టణంలో రోజూ రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. ఇక్కడి నుంచి పలు రకాల సరుకులను, ముడిపదార్థాలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా పత్తి. అయితే వాహనాల్లో తరలించడానికి వేబిల్ అవసరం. ఇప్పటి వరకు వేబిల్తోనే ఎగుమతులు జరిగేవి. అయితే ప్రస్తుతం వేబిల్ ఆప్షన్ లేకపోవడంతో వాణిజ్య పన్నుల అధికారులు తనిఖీలు చేస్తే వేబిల్ లేకపోవతే భారీ స్థాయిలో జరిమానాలు విధించే అవకాశుముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 30న సాక్షి ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీపై అవగాహన సదస్సులో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ గీతా మాధురి వ్యాపారస్తులకు సందేహాలను నివృతి చేశారు. అయితే జీఎస్టీ వస్తే వేబిల్స్ ఎలా అని వ్యాపారస్తులు ప్రశ్నించగా పాత వేబిల్స్ ఉంటాయని చెప్పారని, ఇప్పుడు ఆ ఆప్షనే లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఇన్వాయిస్ బిల్లులు రెండు కాపీలు పంపించండి – మురళీధరన్, వాణిజ్య పన్నుల శాఖ అధికారి–1 చెక్‌పోస్టులన్నీ ఎత్తివేశారు. ఈ వేబిల్ ఆప్షన్ కూడా లేదు. మూడు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. అంతవరకు వేచి ఉండాలి. అత్యవసరంగా సరుకులు పంపాలంటే వేబిల్ బదులుగా ఇన్వాయిస్ బిల్లు ఒరిజినల్, డూబ్లికేట్ ఒక్కోటి పంపించాలి. జీఎస్టీ ఉందని అధికారులకు తెలుసు. ఎవరూ పట్టుకోరు. ఒక వేళ పట్టుకున్నా తన సెల్ 9949992638 కు ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరిస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
రవాణాకు జీఎస్టీ బ్రేకులు
– ఆందోళనలో లారీల యజమానులు – జిల్లాపై రూ.13.22 కోట్ల అదపు భారం – ఆకస్మిక తనిఖీలు జరిగితే ఇబ్బందులే – 3.5శాతం పెరగనున్న స్పేర్ పార్ట్స్ ధరలు కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): రేపటి నుంచి జీఎస్టీ అమలవుతుండటంతో లారీల యజమానుల్లో గుబులు మొదలైంది. జీఎస్టీ సూచిస్తున్న నిబంధనలను చూసి షాక్ అవుతున్నారు. ఒప్పుటికే ఒడిదుడుకుల మధ్య ఉన్న రవాణా రంగంపై జీఎస్టీ పిడుగు పడుతుంటడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా లారీలు ఉన్నాయి. ఒకొక్క ట్రక్కు, లారీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 నుంచి 10 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వాటి విడిభాగాలపై గతంలో ఎక్సైజ్ డ్యూటీ 10 శాతం, వ్యాట్ 14.5 శాతం ఉండేది. అయితే ఇప్పుడు లారీ విడిభాగాలపై 28 శాతం పన్ను విధించారు. దీంతో విడిభాగాల పై 3.5 శాతం పన్ను భారం పెరిగింది. ఒకొక్క లారీకి ఏడాదికి కనీసం రూ. రెండున్నరల లక్షల వరకు విడిభాగాల కింద ఖర్చు చేస్తారు. అంటే పన్ను పెంపుతో ఓ లారీపై సుమారుగా రూ.8,750 వరకు అదనపు భారం పడుతుంది. ఈ లెక్కన ఏడాదికి కనీసం రూ.13.22 కోట్ల వరకు జిల్లా లారీ యజమానులు భరించాల్సి ఉంటుంది. అయితే ఆమేరకు లారీ అద్దెలు పెరగడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఒక వైపు డీజిల్ ధరల పెరుగుదల, మరో వైపు స్పేర్ పార్టులపై పన్నుల భారం మోపితే ఇక వాహనాలను మూలన పెట్టాల్సిందేనని వారు చెబుతున్నారు. లారీ యజమానుల సమస్యలు..: ఏటా టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తారని జీఎస్టీలో పేర్కొన్నారు. వాస్తవంగా రెండు లారీలు ఉన్న వారు కూడా ఏదికి రూ.20 లక్షల పైనే టర్నోవర్ చేస్తారు. అయితే అందులో డీజిల్ ఖర్చులు, సిబ్బంది జీతాలు, లారీ మెయిన్టెన్స్ పోతే రెండు లారీల మీద నెలకు రూ.25 వేలు రావడం గగనంగా ఉంది. అంటే ఏటా మూడు లక్షల కంటే ఆదాయం రాదు. అటువంటి వారిని జీఎస్టీ పరిధిలో చేర్చడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ అమలులోకి రాగానే చెక్ పోస్టులు తీసి వేస్తారు అయితే ప్రతి రాష్ట్రంలో 40 నుంచి 50 బృందాలను పెట్టి ఆకస్మిక తనిఖీలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. లారీని మధ్యలో ఆపి తనిఖీ పేరుతో డ్రైవర్లను వేధించి వేలాది రూపాయలను లంచాలు వసూలు చేసే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ చలనాలు జారీ చేస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు ఇంకా మాన్యువల్‌గానే ఈ వే బిల్లులు ఇస్తున్నాయి. ఇప్పుడు జీఎస్టీ అమలులోకి వస్తే మ్యాన్యువల్ వే–బిల్లులు ఆన్లైన్లో కనపడవు. దీంతో లారీని సీజ్ చేస్తే సరుకు పాడైపోవడంతో పాటు లారీ దెబ్బతినే ప్రమాదం ఉంది. లారీలో సింగిల్ కన్సయిన్మెంట్ ఉంటే దాన్ని నిర్ణీత సమయంలో గమ్య స్థానానికి చేర్చాలనే నిబంధన జీఎస్టీలో పెట్టారు. నిర్ణీత వ్యవధి దాటితే వే బిల్లు ఉన్నప్పటికీ లేదని భావించి లారీని సీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే లారీ మరమ్మతులు, ట్రాఫిక్ ఇబ్బందులు తదితర కారణాలతో ఆలస్యమైనా, దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే లారీయజమానులు కష్టాల పాలవుతారు. గతంలో లారీలో వే బిల్లు లేని సరుకు, అక్రమంగా సరుకు రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకుంటే, లారీ యజమాని సరుకు అప్పజెప్పి లారీని తెచ్చుకునే వారు. అయితే ఇప్పుడు జీఎస్టీ ప్రకారం లారీని కూడా సీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో లారీ యజమానులు నష్టపోయే ప్రమాదం ఉంది. డీజిల్, పెట్రోల్‌నూ జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలి: డీజిల్, పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 23 శాతం, వ్యాట్ 34 శాతం ఉంది. అంటే మొత్తం పన్ను 57శాతం అవుతోంది. అదే జీఎస్టీ పరిధిలోకి వస్తే అత్యధికంగా 28 శాతం పన్ను ఉంటుంది. ఈ లెక్కన డీజిల్ ఖర్చులు సగానికి తగ్గిపోతాయి. దీంతో ఈ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకరాలేదు. కాగా వ్యాట్ ఛార్జీలు పెంచినప్పుపడు లీటర్‌కు రెండు రూపాయలు తగ్గిస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం లారీ యజమానులకు హామీ ఇచ్చింది. అయితే అది ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. లారీలను అమ్ముకోవాల్సిందే: వై.నారాయణరెడ్డి, లారీ ఓనర్, డోన్ ఓ వైపు జీఎస్టీ, పెరుగుతున్న ఇంధన ధరలతో రవాణా రంగం కుదేలైంది. జీఎస్టీ కారణంగా లారీ విడిభాగాల ధర రెట్టింపు కావడంతో లారీ నిర్వహణ భారంగా మారుతుంది. దీంతో నష్టాలు భరించలేక లారీలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. లారీపై ఆధారపడి జీవనం సాగించే పలువురు ఉపాధిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. -
వందెకరాల్లో దందా
- కేశవరంలో అధికార పార్టీ నేతల కొత్త దందా - పగలు అనుమతి భూముల్లో.. రాత్రిళ్లు ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు - ఇసుక తరహాలో గ్రావెల్ తవ్వకాలు - ఒకే వే బిల్లుపై పలు ట్రిప్పులు - 100 ఎకరాల్లో - ప్రభుత్వ ఆదాయానికి గండి - ప్రేక్షకపాత్రలో సంబంధితాధికారులు . మండపేట : గ్రావెల్ తవ్వకాల్లో తెలుగు తమ్ముళ్లు సరికొత్త పంధాను తెరపైకి తెచ్చారు. ఇసుక తరహాలో గ్రావెల్ నిల్వలు వేస్తూ అక్రమాలకు కొత్తబాటలు తెరదీస్తున్నారు. పగలు అనుమతి పొందిన భూముల్లో, రాత్రిళ్లు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో లక్షలాది రూపాయల గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. . వందెకరాల్లో దందా... సాధారణంగా వరదలు వచ్చే ముందుగా ఇసుకను ఎక్కడికక్కడ అనధికారికంగా నిల్వలు చేసి అమ్మకాలు చేయడం పరిపాటి. ఇప్పుడు గ్రావెల్ తవ్వకాల్లోనూ తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ సరికొత్త విధానానికి మండలంలోని కేశవరంలో మొదలుపెట్టారు. కేశవరంలోని బీటు మెట్ట ప్రాంతంలో పేదలకు పంపిణీ చేసిన, ప్రభుత్వ భూములు దాదాపు వంద ఎకరాలకుపైగా ఉన్నాయి. పట్టా భూములు, ప్రైవేటు స్థలాలను సాగుకు అనుకూలంగా చదును చేయడం పేరిట అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. నిర్ణీత స్థలంలో మెరకను తీసివేసి సాగుకు అనువుగా చదును చేసేందుకు అనుమతులు తెచ్చుకుని దానిమాటున అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి వేళల్లో అధికారిక స్థలాల్లో తవ్వకాలు చేస్తూ రాత్రి సమయంలో ప్రభుత్వ భూములు, అనుమతులు లేని స్థలాల్లో లక్షలాది రూపాయలు విలువైన గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రోడ్డు పక్కల బెర్ముల వినియోగించే విలువైన పూస గ్రావెల్, ఎర్రమట్టి ఈ భూముల్లో దొరుకుతుండటంతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగిపోతున్నాయి. ఐదు యూనిట్లు స్థానికంగానే రూ. 4000 వరకు ఉండే ఈ గ్రావెల్, బయటి ప్రాంతాలకు ధరను మరింత పెంచి తరలిస్తుంటారు. డిమాండ్‌ను బట్టి మిగిలిన గ్రావెల్‌ను గుట్టలుగా నిల్వ చేస్తుండటం గమనార్హం. గతంలో లీజుకు తీసుకుని తవ్వకాలు పూర్తిచేసిన భూముల్లో ఈ గ్రావెల్‌ను నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అధికారులు వస్తే ఇంకా తవ్వకాలు చేయాల్సి ఉందని చూపించి వారికి ఎంతోకొంత ముట్టజెప్పి పంపిచేస్తున్నట్టు సమాచారం. పెద్ద ఎత్తున అక్రమంగా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేసి గ్రావెల్ నిల్వ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోపక్క ఒకే వే బిల్లుపై దూరాన్ని బట్టి రెండు నుంచి ఐదు ట్రిప్పుల వరకు లారీలు పంపిస్తున్నారు. దీనివల్ల సీనరేజీ రూపంలో ప్రభుత్వానికి చేరాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్నారు. తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ... ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించినప్పటికీ అక్రమ తవ్వకాలు అడ్డంకిగా మారాయి. అక్రమ తవ్వకాలు ద్వారా ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడి పరిశ్రమ ఏర్పాటుకు అనువుగా లేకపోవడంతో ఇప్పటికే పెట్రోవర్శిటీ ఈ ప్రాంతం నుంచి తరలిపోయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు అక్రమ తవ్వకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు లారీలను తనిఖీలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి అధికారులు గండిపడకుండా చూడాలంటున్నారు. -
మూగ రోదన
కరువు రక్కసి కాటేయడంతో పాడి రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. అనంతపురం మార్కెట్ యార్డు నుంచి దళారులు, కటిక వ్యాపారులు పశువులకు నెంబర్లు వేసి పెద్ద పెద్ద వాహనాల్లో హైదరాబాద్, తమిళనాడు, కేరళ, కర్నాటక ప్రాంతాలను తరలిస్తున్నారు. 12 పశువులను తరలించాల్సిన వాహనంలో ఏకంగా 50 గేదెలను కుక్కుతూ వాటికి నరకం చూపిస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి వ్యాపారం సాగుతోంది. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
రవాణా మంత్రితో లారీ యాజమాన్యాల భేటీ
అమరావతి: సచివాలయంలో రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో లారీ యజమానుల సంఘం నేతలు భేటీ అయ్యారు. డీజిల్ పై వ్యాట్ తగ్గింపు, రవాణా శాఖలో అధిక మొత్తంలో ఉన్న చలాన్ల తగ్గింపు, తెలంగాణతో సింగల్ పర్మిట్ అంశం, తదితర అంశాలపై చర్చించారు. 8 రోజులుగా లారీ యాజమాన్య సంఘాలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. -
ఆర్టీఏ లేడీస్ స్పెషల్
⇒ఈ నెల 8న మహిళా డ్రైవింగ్ లైసెన్స్ మేళా ⇒గత నెలలో లెర్నింగ్ తీసుకున్నవాళ్లకు డ్రైవింగ్ పరీక్షలు ⇒సుమారు 600 మంది మహిళలకు ప్రత్యేకంగా స్లాట్లు సిటీబ్యూరో: రవాణాశాఖ మరోసారి లేడీస్ స్పెషల్ డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు శ్రీకారం చుట్టింది. గత నెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లెర్నింగ్ లైసెన్సులు తీసుకున్న మహిళలకు ఈ నెల 8వ తేదీన నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పరీక్షలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్సులు అందజేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం మహిళలకు మాత్రమే 8వ తేదీన స్లాట్లు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. ఆ రోజు సుమారు 600 మంది డ్రైవింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆర్టీఏ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను అందుబాటులో ఉంచనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. సాధారణంగా చాలా మంది మహిళలకు డ్రైవింగ్ తెలిసినప్పటికీ లైసెన్సులు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ప్రతిరోజు గ్రేటర్లో సుమారు 1500 నుంచి 2000 మంది డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరవుతుండగా వారిలో మహిళలు కనీసం 25 శాతం కూడా ఉండడం లేదు. ఉద్యోగరీత్యా తీరిక లేకపోవడం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల మహిళలు డ్రైవింగ్ పరీక్షలకు హాజరుకావడం లేదు. మార్కెటింగ్ రంగంలో, ఐటీ రంగంలో, వ్యాపారంలోనే కాకుండా వివిధ రంగాల్లో కీలకమైన విధులు నిర్వహిస్తున్న చాలా మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవడంలో తీరికలేమి కారణంగా సరైన శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు చాలా మంది గృహిణులు పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లేందుకు, తిరిగి ఇళ్లకు తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనాలు, కార్లు వినియోగిస్తున్నప్పటికీ తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలనే అంశాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళల్లో డ్రైవింగ్ పట్ల అభిరుచిని పెంచే లక్ష్యంతో ఆర్టీఏ గత నెలలో ‘లేడీస్ స్పెషల్ మేళా’ చేపట్టింది. ఈ మేళాకు అనూహ్యమైన స్పందన లభించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 550 మంది మహిళలు లెర్నింగ్ లైసెన్సులు తీసుకున్నారు. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్సులు... సాధారణంగా ఒకసారి లెర్నింగ్ లైసెన్సు తీసుకున్న వారు 30 రోజుల్లో ఆర్టీఏ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలకు తమ వాహనాలతో హాజరై వాహనాలను నడపాలి. నెలరోజుల్లో డ్రైవింగ్ లైసెన్సు తీసుకోలేని వారికి 6 నెలల వరకు కూడా అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది గడువు ముగిసినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకాకపోవడం వల్ల లెర్నింగ్ దశలోనే ఉండిపోతున్నారు. గత నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు లెర్నింగ్ లైసెన్సులు అందజేసిన అధికారులు ప్రస్తుతం వారందరికీ శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గత నెలలో లెర్నింగ్ లైసెన్సులు తీసుకొన్నవాళ్లే కాకుండా గడిచిన 6 నెలల వ్యవధిలో తీసుకున్న మహిళలు కూడా ఈ నెల 8వ తేదీన స్లాట్ బుక్ చేసుకోవచ్చు. పరీక్షలకు హాజరయ్యేందుకు సొంత వాహనాలు ఉన్న వారు తమ వెంట తెచ్చుకోవలసి ఉంటుంది. -
ఎక్కడికక్కడే!
మూడురోజులుగా రోడ్డెక్కని లారీలు - నేటి నుంచి సమ్మెలోకి సరుకు రవాణా వాహనాలు - స్తంభించనున్న రవాణా రంగం – ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుతామంటున్న ప్రైవేట్ లారీ ఓనర్స్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రైవేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన దక్షిణ భారతదేశ లారీల సమ్మె రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. మూడు రోజుల (మార్చి 30) నుంచి దాదాపు 80 శాతం లారీలు రోడ్డెక్కడం లేదు. ఆదివారం నుంచి అత్యవసర సరుకు రవాణా చేసే లారీలు కూడా సమ్మెలోకి వెళ్తున్నాయి. దీంతో ఆహారపు సరుకులు, కూరగాయలు, రైతుల పండించిన పంటలను రవాణా చేయడం కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. లారీల సమ్మెను తేలికగా తీసుకున్న ప్రభుత్వం దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ప్రైవేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీల సమ్మెకు పిలుపునిచ్చారు. మొదటి రోజు నుంచి సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. ఎక్కడికక్కడే లారీలను నిలిపివేసి ఓనర్లు, డ్రైవర్లూ ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ లారీల సమ్మెను తేలికగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు కనీసం వారితో చర్చలు జరిపి డిమాండ్లు ఏమిటనే విషయాన్ని కూడా అడగడం లేదు. దీంతో అసోసియేషన్నాయకులు అత్యవసర సేవలను అందించే లారీలను సైతం సమ్మెలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం నుంచి వారు కూడా సమ్మెలో పాల్గొంటారని చెబుతున్నారు. పాలు, పెట్రోలు, కూరగాయలు, ఆహారపు సరుకులు, ఇతర పదార్థాలను తీసుకెళ్లే వాహనాలు సమ్మెలోకి వెళ్లితే ప్రజలపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. ఎక్కడికక్కడే ఉన్న వస్తువులకు డిమాండ్ నెలకొని ధరలు అకాశన్నంటే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో పేదలు, మధ్యతరగతి ప్రజల జీవన గమనంపై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లారీల సమ్మెను విరమింపజేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన డిమాండ్లు ఇవీ కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్ 29న ఇచ్చిన 894 ఉత్తర్వుల ద్వారా రవాణా రంగంలో ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, లేటు చలానా ఫీజులు రోజుకు రూ.50 చొప్పున 500 రెట్లకుపైగా పెంచింది. తక్షణమే ఆ పెంపును ఉపసంహరించుకోవాలి. 2017 మార్చి 3వ తేదీన మూడో పార్టీ ఇన్సూరెన్స్‌ను 50 శాతం పెంచుతూ ఐఆర్డీఏ ద్వారా ప్రతిపాదనలు పెట్టింది. ఇది అమలు అయితే కార్మికులకు భద్రత లేకుండా పోతుందని, దాన్ని తక్షణమే విరమించుకోవాలని లారీ ఓనర్ల వాదన. నిత్యం పెరుగుతున్న డీజిల్ రేట్లను తగ్గించాలి. టోల్ గేట్ల నుంచి ఫీజు మినహాయింపులు ఇవ్వాలి. లారీ డ్రైవర్ల భద్రతకు చర్యలు చేపట్టాలి. ఆర్టీఏ అధికారుల నుంచి వేధింపులు లేకుండా చూడాలి. న్యాయమైన డిమాండ్లను తీర్చాలి–పుల్లారెడ్డి, సీఐటీయూ నాయకులు లారీ ఓనర్లు, డ్రైవర్లూ చేపట్టిన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలి. సమ్మెలో ఉన్న కార్మికులపై ప్రభుత్వం కేసులు పెట్టడం దారుణం. పెంచిన ఆర్టీఏ చలానా, జరిమానా ఫీజులను ఉపసంహరించుకోవాలి. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను 50 శాతం వరకు పెంచడం దారుణం. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె మరింత ఉద్ధృతమవుతుంది. -
వేటు పడింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తప్పు చేసిన వారిని శిక్షించాలి్సన పోలీసులే వారికి రక్షణగా మారితే.. అక్రమాలకు ఊతమిస్తే.. ఏదో ఒక రోజున పట్టుబడి ఊచలు లెక్కించక తప్పదు. ఈ విషయాన్ని మర్చిపోయి గంజాయి అక్రమ రవాణాకు వెన్నుదన్నుగా నిలిచిన చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.దాసుపై పోలీస్ ఉన్నతాధికారులు ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు. నాన్ బెయిలబుల్ కేసులు సైతం నమోదు చేశారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి రవాణా వెనుక ఒక సర్కిల్ ఇ¯ŒSస్పెక్టర్ హస్తం వెలుగుచూసిన నెలరోజుల వ్యవధిలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో సీఐ పాత్ర నిరూపణ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. గత నెల 21న జిల్లాలో గంజాయి తరలిస్తున్న లారీని పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిని వదిలిపెట్టేందుకు ఒక అధికారి రూ.5.50 లక్షల్ని లంచంగా తీసుకున్నట్టు సమాచారం. దీనికి స్థానికంగా పనిచేస్తున్న కొందరు టీవీ చానల్ విలేకరులు డీల్ కుదిర్చారని, ప్రధాన నిందితుడు ప్రతి లోడుకు కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారని నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహా రాష్ట్రకు చింతలపూడి మీదుగా సరిహద్దు దాటిస్తున్నారు. గంజాయి రవాణా చేసే వాహనాలను ఎక్కడా నిలుపుదల చేయకుండా ఉండేందుకు ప్రతి లోడుకు రేటు కట్టి వసూలు చేస్తున్నారు. గత నెల 21న ఆపిన గంజాయి లారీకి సంబంధించిన వివరాలు స్పెషల్ బ్రాంచి వద్ద ఉండటం, ఆ బ్రాంచి పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే లారీని పట్టుకున్నా.. చింతలపూడి సీఐ ఆ కేసులో ప్రధాన నిందితుణ్ణి వదిలివేయడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ దాసు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఏలూరు ప్రాంతానికి రాగా.. బందోబస్తు విధులు నిర్వర్తించాలి్సన సీఐ దాసు డుమ్మా కొట్టారు. తనకు అరోగ్యం బాగుండక అసుపత్రిలో చేరానని, వైద్యులు 21 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారంటూ ఉన్నతాధికారులకు ఎస్ఎంఎస్ పెట్టారు. అనంతరం ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశారు. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ జరిపిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేసి, మరికొందరి పాత్రపై విచారణ జరుపుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితునితోపాటు సీఐ దాసు, అతని జీప్ డ్రైవర్, మరికొందరు పోలీసు సిబ్బందికి సంబంధించిన ఫోన్ కాల్ జాబితాలను రప్పించుకుని విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో చింతలపూడికి చెందిన ఒక చానల్ విలేకరితోపాటు స్టేషన్లో పనిచేసే కీలక సిబ్బందికి కూడా సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ప్రధాన నిందితునికి, సీఐకి మధ్య సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇతని పాత్ర నిర్ధారణ అయినప్పటికీ సస్పెన్షన్ వేటు వేసే విషయంలో పోలీసు అధికారులు మీనమేషాలు లెక్కించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో ఎట్టకేలకు సీఐ దాస్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
ఇక అన్ని సేవలు ఆన్లైన్లోనే!
– ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ కోసమే ఆర్టీఏ కార్యాలయానికి.. – ఏప్రిల్ నుంచి జిల్లాలో అమలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రవాణా సేవలన్నీ ఇకపై ఆన్లైన్లోనే లభించనున్నాయి. రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లకుండానే సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఆ తర్వాత కేవలం వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌తో పాటు లెర్నింగ్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రమే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి రానుంది. ఇక మిగిలిన సేవలన్నీ ఆన్లైన్లోనే లభించనున్నాయి. ప్రాథమికంగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని విశాఖపట్నంలో ఫిబ్రవరి 15న ప్రారంభించినట్టు రవాణాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి కర్నూలు జిల్లాలో అమలు చేయనున్నట్టు సమాచారం. రెండో వాహనం కొనుగోలు చేసినా.. ప్రస్తుతం కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ మినహా మిగిలిన పనులన్నింటికీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అయితే, కొత్త విధానంలో కొత్త వాహనానికి పర్మినెంటు నెంబర్ కూడా షోరూంలలోనే లభించనుంది. అంతేకాకుండా వాహనం ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేసినా కూడా ఆన్లైన్లోనే ఆర్సీ మార్చుకునేందుకు వీలు కలగనుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాహనాల ఫీజుల చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సెకండ్‌హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఒకచోట ఉండి.. ఆధార్‌కార్డులో ఉండే అడ్రస్ వేరే చోట ఉంటే అక్కడికే వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోంది. ఇది అదనపు భారంగా ఉంటోంది. తాజాగా అమల్లోకి రానున్న ఆన్లైన్ విధానంలో నెట్ ద్వారా రవాణాశాఖ వెబ్సైట్లోకి వెళ్లి సదరు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా రవాణాశాఖలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలు కూడా తగ్గిపోతాయనేది ఉన్నతాధికారుల ఆలోచనగా ఉంది. షోరూంలలోనే హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్లు ప్రస్తుతం కొత్తగా షోరూంలో వాహనాన్ని కొనుగోలు చేస్తే అక్కడికక్కడే తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు. పర్మినెంట్ నెంబర్ కోసం మళ్లీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా పర్మినెంట్ నెంబర్ వచ్చిన తర్వాత కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు వచ్చేందుకు మరో వారం, పదిరోజులు పడుతోంది. అన్ని రోజులు ఆగిన తర్వాత మళ్లీ సదరు సంస్థ నిర్దేశించిన సమయంలోనే వెళ్లి నెంబర్ ప్లేటు బిగించుకోవాల్సి ఉంటుంది. అయితే, తాజా విధానంలో హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను కూడా వాహనాల షో రూంకే అప్పగిస్తారు. తద్వారా వాహనదారులకు అదనపు భారం తగ్గుతుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
రవాణా రంగం నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏగఫూర్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కేంద్ర ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కుట్ర పన్నుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యద్శి ఎంఏ గఫూర్ ఆరోపించారు. పెంచిన ఆర్టీఏ చలానా, జరిమానాలతో కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మోటార్స్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యాలయంలో ఈ.పుల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నూతన మోటార్ ట్రాన్స్‌ఫోర్టు చట్టంతో కార్మికులు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. మోటార్ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ సుభాన్ మాట్లాడుతూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా మంది యువకులు ఆటోలు, లారీలు, ఇతర వాహనానలు నడుపుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరు రోజంతా కష్టపడితే వచ్చే నగదంతా చలానాలు, జరిమానాలు కట్టడానికే సరిపోతే వారి కుటుంబాల జీవనం ఎలా సాగించాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఆర్టీఏ అధికారుల దాడులతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే చలానా, జరిమానాల ఫీజులను పెంచితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మిన్నల్లా, లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ, యూసుఫ్ మియ్యా, లైట్ వెహికల్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస యాదవ్, మెకానిక్స్ యూనియన్ నాయకులు గోవిందు పాల్గొన్నారు. పోరాట కమిటీ ఎన్నిక పెంచిన ఆర్టీఏ చలానా, జరిమాన ఫీజులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు పోరాట కమిటీని ఎన్నకున్నారు. కమిటీ కన్వీనర్‌గా సీఐటీయూ నాయకులు ఇ.పుల్లారెడ్డి, కోకన్వీనర్ మిన్నల్లా, యూసూఫ్మియాతోపాటు 12 రంగాల నుంచి 42 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
గుప్పుమంటున్న నాటు సారా
తోటల్లో జోరుగా తయారీ వివిధ ప్రాంతాలకు ఎగుమతి పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు తొండంగి (తుని) : మండల పరిధిలోని వివిధ గ్రామాల సమీపంలోని జీడిమామిడి తోటల్లో నాటు సారా విచ్చలవిడిగా తయారు చేస్తూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా పీఈ చిన్నాయపాలెం, బెండపూడి, రావికంపాడు, కొమ్మనాపల్లి, సీతారాంపురం, పైడికొండ, ఆనూరు, ఎ.కొత్తపల్లి, గోపాపట్నం తదితర గ్రామాల పరిసరాల్లో కొండ ప్రాంతాలు, మామిడి, జీడితోటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తోట మాటున భారీ ఎత్తున బెల్లపు ఊటలను పులియబెట్టి నాటు సారా కాస్తున్నారు. అక్కడి నుంచి ప్లాస్టిక్ క్యాన్ల ద్వారా మండలంలోని గ్రామాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రాత్రి వేళల్లో రహస్యంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం రూ.10, రూ.20లకే మంచి కిక్కిచ్చే నాటు సారా లభిస్తుండడంతో వ్యవసాయ కూలీలు మద్యానికి బానిసలై ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. నాటు సారా వల్ల తమ కుటుంబాలు, జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయని బాధిత మహిళలు వాపోతున్నారు. నాటు సారాతో ఆరోగ్యానికి ముప్పు నల్ల బెల్లం, అమ్మోనియా, నికిల్, లెడ్ మిశ్రమం, బ్యాటరీ పౌడర్‌ను నీటిలో కలిపి పులియబెడతారు. సుమారు మూడు రోజుల పాటు పులియబెట్టిన ఆ ఊటను పొయ్యిపై పెట్టి మరగబెట్టడం ద్వారా వచ్చే ఆవిరిని పడతారు. ఆ ఆవిరి ద్రావణంగా మారి నాటు సారా తయారవుతుంది. తక్కువ ధరకే ఇది లభిస్తుండడంతో వ్యవసాయ కూలీలు, పేదలు దీన్ని తాగుతున్నారు. ఉత్సవాలు, జాతరలు, ఇతర కార్యక్రమాల్లో నాటు సారా ఏరులై ప్రవహిస్తోంది. బ్రాందీ షాపుల్లో లభించే మద్యం కన్నా ఇది బాగా తక్కువ ధరకు లభించడంతో పాటు ఎక్కువ మత్తు ఇస్తుండడంతో మద్యానికి బానిసలైన పేదలు నాటుసారా తాగేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. దీని తయారీలో కలిపే ప్రాణాంతక పదార్థాల వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, మొదడులోని నాడీ వ్యవస్థ ఇతర అవయవాలపై ప్రభావం చూపడంతో కొంతకాలానికి అనారోగ్యానికి గురై మరణిస్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా నాటు సారా తయారు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నెలవారీ మామూళ్ల వల్లే వారు ఇటువైపు తొంగి చూడ్డం లేదన్న ఆరోపణలు వినిపిన్నాయి. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి నాటు సారా తయారీని నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు తమ గ్రామం నాటు సారా వాసనతో గుప్పుమంటోందని పీఈ చిన్నాయపాలెం గ్రామానికి చెందిన పి.విజయమ్మ తెలిపారు. రాత్రి వేళల్లో తోటల్లో నాటు సారా తయారు చేస్తున్నారని, దీన్ని తక్షణం నిరోధించాలని తుని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పారు. -
20 నుంచి అక్రమ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు
నెల్లూరు (టౌన్): జిల్లాలో అక్రమంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రత్యేక తనిఖీలను నిర్వహించనున్నట్లు రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. రవాణా శాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న మోటార్ వాహనాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పన్ను చెల్లించని 10 వేల వాహనాలకు షోకాజ్ నోటీసులను జారీ చేయనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై వెంకటాచలం, కావలి ప్రాంతాల్లో నెలకు రెండుసార్లు రాత్రి వేళ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ క్యారేజీలు, ఓవర్‌లోడ్ వాహనాలు, డ్రంకెన్ డ్రైవ్‌పై తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై వారంలో రెండు పట్టణాల్లో బృందాలుగా తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరుతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఉదయగిరి, తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తామని చెప్పారు. ఫైనాన్స్ సీజ్ చేసిన వాహనాలకు కూడా త్రైమాసిక పన్ను చెల్లించాలని ఇప్పటికే నోటీసులను జారీ చేసినట్లు చెప్పారు. పన్ను చెల్లించని వాహనదారులు తక్షణమే ఆయా కార్యాలయాల్లో పన్ను చెల్లించాలని, లేని పక్షంలో రెండింతల అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. మోటార్ వాహనాల అధికారులు సీతారామిరెడ్డి, ఆదినారాయణ, బాలమురళీకృష్ణ, మురళీమోహన్, రామకృష్ణారెడ్డి, జయప్రకాష్, జకీర్, మాధవరావు, అసిస్టెంట్ మోటార్ వాహనాల అధికారులు కరుణాకర్, పూర్ణచంద్రరావు, రవికుమార్, ప్రభాకర్, ఏఓలు విజయ్‌కుమార్, సాయి, కిషోర్ పాల్గొన్నారు. -
అచటనుండును ఆంధ్ర మహావిష్ణువు
• మీసాలున్న మహావిష్ణువు • తెలుగుభాషకు దేవుడు శ్రీకాకుళేశ్వరస్వామి • ‘ఆముక్తమాల్యద’ గ్రంథ రచనకు శ్రీకారమిక్కడే • ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం శ్రీకాకుళేశ్వర స్వామి క్షేత్రం కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళ గ్రామంలో నెలకొని ఉంది. తెలుగువారికి ఈ క్షేత్రం విశిష్టమైనది. ఎందుకంటే శ్రీమహావిష్ణువు ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువుగా కొలువవడమే కాదు... ఆంధ్రనాయకుడుగా, తెలుగు వల్లభుడుగా పూజలందుకుంటున్నాడు. చారిత్రకంగా చూస్తే ఆంధ్రదేశం నుంచి దక్షిణాపథం వరకూ పాలించిన శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం కావడం ఒక పెద్ద విశేషం. శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి తన ‘ఆముక్తమాల్యద’ రచనకు ఇక్కడే శ్రీకారం చుట్టడం మరో విశేషం. ఇంకో విశేషం... ఇక్కడ స్వామి మీసాలున్న మహావిష్ణువు. ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుకనే... శ్రీకాకుళాన్ని 108 దివ్యక్షేత్రాలలో 57వ క్షేత్రంగా చెబుతారు. బ్రహ్మ పులకరించిన ప్రదేశం శ్రీకాకుళానికి సంబంధించి అనేక స్థలపురాణాలు వ్యాప్తిలో ఉన్నాయి. కలియుగంలో పాపాలు పెరిగి పోతున్నాయని దేవతలు, మునులు, మహర్షులు వ్యాకులత చెంది బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారట. ఆయన వారి మొర ఆలకించి, ఈ పాపభార ప్రక్షాళనకు విష్ణువు సాక్షాత్కారమే శరణ్యమని శ్రీకాకుళ ప్రాంతానికి చేరుకుని ఘోర తపస్సు చేశాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, ఇక్కడే ఉంటూ భక్తుల పాపాలు హరిస్తానని మాట ఇచ్చాడట. అయితే ఈ తపస్సు సమయంలో బ్రహ్మ ఈ ప్రాంతాన్ని చూసి చాలా పులకించిపోయాడట. అందువల్ల బహురూపాలు ధరించి ప్రతి మూలనా నిలబడి ఈ ప్రాంత అందాలు చూడసాగాడట. అప్పుడు ఇతర దేవతలకు, మునులకు ఎక్కడ చూసినా బ్రహ్మరూపమే కనిపించింది. దాంతో వారు ఈ ప్రాంతాన్ని ‘శ్రీకాకుళం’ అని పిలవడం మొదలుపెట్టారు. ‘శ్రీ’ అంటే శోభాయకరమైన, ‘క’ అంటే బ్రహ్మచే, ‘ఆకుళం’ అంటే వ్యాపించినది అని అర్థం. మరో కథనం ప్రకారం శ్రీమహావిష్ణువుకు సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు ఇష్టమైనవి కనుక ఆయన ఇక్కడ వెలిశాడట. మరో కథనం ప్రకారం భృగువు, పులస్త్యుడు, సుబాహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దశుడు, వశిష్ఠుడు, మరీచి అనే నవబ్రహ్మలు ఇక్కడి విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారనే నమ్మకం ఉంది. పద్యానికో అంగుళం చొప్పున... ఒకప్పుడు ఆంధ్రనాయకస్వామి ఆలయం కృష్ణానది మధ్యలోని దేవుడిలంకలో ఉండేదనీ, అయితే వరదల వల్ల ఆలయం దెబ్బతినడంతో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో పునరుద్ధరణ జరిగిందనీ తెలుస్తోంది. నిజానికి ఈ ఆలయం క్రీ.శ. 4వ శతాబ్దంలోనే ఉండేదనీ, అయితే విచిత్రంగా వెయ్యేళ్లపాటు మూలవిరాట్టు కనిపించకుండా పోయిందనీ మరో కథనం. వెయ్యేళ్ల తర్వాత ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఈ ప్రాంతం గుండా వెళుతూ క్షేత్రాన్ని దర్శించుకుని మూలవిరాట్టు లేకపోవడం గురించి ఆందోళన చెంది, దాని కోసం వెతికించినట్టూ, అయినా ఎక్కడా దొరకనట్టూ, అప్పుడు అతని కలలో స్వామి కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నానని చెప్పినట్టూ, మంత్రి అక్కడికి వెళ్లి తవ్వకాలు జరపగా మూలవిరాట్టు బయటపడినట్టూ ఒక కథ ఉంది. ఇంకో కథనం ప్రకారం 18వ శతాబ్దంలో చల్లపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన రాజా అంకినీడు బహద్దూర్ శ్రీకాకుళస్వామి మహాభక్తుడు. ఆయనకు ఆ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం లేకపోవడం వల్ల బాధ కలిగి అప్పటికే శ్రీకాకుళస్వామి మరో భక్తుడైన కాసుల పురుషోత్తముడనే కవిని ఆలయానికి తీసుకొచ్చి మూలవిరాట్టు భూమి లోపల ఉండవచ్చునని దానిని బయటకు వచ్చేలా చేయాలని కోరాడట. అప్పుడు పురుషోత్తమ కవి అక్కడిక్కడే 108 పద్యాల శతకం భక్తియుక్తంగా చెప్పగా, ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చొప్పున భూమి లోపల నుంచి స్వామివారి విగ్రహం పైకి లేచిందని అంటారు. ఆముక్త మాల్యదకు శ్రీకారం శ్రీకృష్ణదేవరాయలు 1509లో విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తరువాత 1513లో జైత్రయాత్ర సాగించాడు. ఉదయగిరి, కొండవీడు రాజ్యాలు జయించి విజయవాటిక, కొండపల్లి మొదలైన దుర్గాలను పట్టుకుని కళింగ వరకూ వెళ్లాడు. అక్కడ నుంచి విజయగర్వంతో తిరిగి వెళుతూ, వినమ్రుడై శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలకు శ్రీకాకుళేశ్వరస్వామి కలలో ప్రత్యక్షమై ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ రచన చేయాలని కోరాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టినట్టు ఆలయ క్రింది భాగంలో ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొనగా, తెలుగురాయుడైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆయన చేత తెలుగు సాహిత్యానికి తలమానికమైన ‘ఆముక్త మాల్యద’ ప్రబంధ రచన చేయించాడని ఒక నమ్మకం. ఈ రచన ద్వారా కృష్ణదేవరాయలు ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ’ బిరుదునందుకున్నాడు. అంతటి సాహితీవేత్త ప్రస్థానం శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరస్వామి సన్నిధిలో జరగడం తెలుగువారందరికీ గర్వకారణం. దర్శన వేళలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. రవాణా సౌకర్యం విజయవాడ నుంచి శ్రీకాకుళం గ్రామం కరకట్ట మార్గంలో 35 కి.మీ దూరంలో ఉంది. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల ద్వారా ఘంటసాల మండలం కొడాలి చేరుకోవాలి. అక్కడ నుంచి 7 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోలు, ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు. మచిలీపట్నం నుంచి చల్లపల్లి మీదుగా శ్రీకాకుళం చేరుకోవచ్చు. దూరం 35 కి.మీ. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పులిగడ్డ– విజయవాడ కరకట్ట మీదుగా ఈ క్షేత్రం 26 కి.మీ దూరం. మీసాల వెనుక కథ... శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరస్వామిగా పూజలందు కుంటున్న ఆంధ్ర మహావిష్ణువు మీసాలు కలిగి ఉండటం ఇక్కడి ఆలయం ప్రత్యేకత. అన్నవరంలోని సత్యనారాయణస్వామికీ, పలుచోట్ల చెన్నకేశవస్వామికీ ఈ విధంగా మీసాలున్నాయి. శ్రీరంగం, తిరుపతి వంటి ప్రసిద్ధి పొందిన వైష్ణవాలయాల్లో స్వామివారికి మీసాలుండవు. అయితే శ్రీకాకుళ స్వామి కేశాల వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వం ఈ ఆలయంలో ఒక అర్చకుడు ఉండేవాడు. అతడు మహాభక్తుడు. కానీ వేశ్యాలోలుడు. స్వామికి సమర్పించాల్సిన దండలు మొదట వేశ్యలకు సమర్పించి, ఆ తర్వాత స్వామికి అలంకరించి, ఆ తర్వాత స్థానిక ప్రభువుకు అర్పించే వాడట. ఒకసారి ప్రభువుకు ఆ దండల్లో సువాసనలీనే పొడవాటి వెంట్రుక కనిపించింది. దానిని చూసిన ప్రభువు ‘ఏమిటీ... మన స్వామికి కేశాలు ఉన్నాయా?’ అని అర్చకుణ్ణి అడిగాడు. అప్పుడు అర్చకుడు ‘ఆయన కేశవుడు కదా... కేశాలు లేకుండా ఎలా ఉంటాయి’ అని బదులిచ్చాడు. ‘అయితే రేపొచ్చి నేను చూస్తాను’ అన్నాడు ప్రభువు. భక్తుడైన అర్చకుడు భయపడలేదు. తన మానాన తాను వెళ్లి నిద్రపోయాడు. కానీ తెల్లారి ప్రభువు వచ్చేసరికి స్వామికి మీసాలు, కేశాలు ప్రత్యక్షమయ్యాయి. ‘భక్తుడి మర్యాదే నా మర్యాద’ అని భావించిన స్వామి తనకు తానే మీసాలు తెచ్చుకున్నాడట. ఇది చూసి నమ్మని ప్రభువు మీసాలు లాగి చూడగా స్వామికి చురుక్కమన్నదనీ, ఆ తప్పుకు ప్రభువు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడనీ చెప్పుకుంటారు. ఆంధ్రుల తొలి రాజధాని క్రీ.శ 3వ శతాబ్దం చివరలో అశోకుని మరణానంతరం శాతవాహనాంధ్రులు మౌర్య సామ్రాజ్యాన్ని ధిక్కరించి స్వతంత్య్ర రాజ్యాన్ని స్ధాపించుకున్నారు. కృష్ణానదీ తీరంలోని శ్రీకాకుళాన్ని తొలిరాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు. ధాన్యకటకానికి రాజ«ధానిని మార్చేవరకూ శ్రీకాకుళం రాజధానిగా ఉంది. శాతవాహనులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, వెలనాటి చోడులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు ఈ ప్రాంతాన్ని పాలించారు. – పుట్టి శ్రీనివాసరావు, ‘సాక్షి’, అవనిగడ్డ, కృష్ణాజిల్లా -
ఓబీఓఆర్ ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనకరం
భారత్-చైనా మిత్రమండలి హైదరాబాద్: చైనా ప్రతిపాదిస్తున్న ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ (ఓబీఓఆర్) పథకం బహుళ ప్రయోజనకరమని భారత్, చైనా మిత్రమండలి అభిప్రాయపడింది. మండలి ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని బేగంపేట సెస్ ప్రాంగణంలో ఆదివా రం కామ్రేడ్ జ్వాలాముఖి సంస్మరణార్థం ‘సిల్క్ రూట్.. ఫాస్ట్ అండ్ ఫ్యూచర్’ పేరుతో చర్చావేదిక నిర్వహించారు. దివంగత కామ్రేడ్ జ్వాలాముఖి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ప్రొ.నర్సింహా రెడ్డి మాట్లాడుతూ వివిధ దేశాలను కలుపుతూ రహదారులు, సముద్ర మార్గాలు, గ్యాస్, టెలికం పైప్లైన్లు సహా భారీ నిర్మాణాలతో 65 లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్ట్‌లో 62 దేశాలు భాగస్వామ్యులుగా చేరాయని, ప్రాజెక్ట్ పూర్తరుుతే చౌకగా విసృ్తత స్థారుులో సరుకు రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్ర మంలో సంస్థ అధ్యక్షుడు సోలిపేట రామచంద్రారెడ్డి, ప్రొ.ఆర్వీ.రమణమూర్తి, ముత్యంరెడ్డి, మండలి సభ్యులు జతిన్‌కుమార్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిపార్టుమెంటు సచ్చి పోయిందా!
–రవాణ అధికారులపై కలెక్టర్ నిప్పులు –నలుగురు ఎంవీఐలకు రెండు ఇంక్రిమెంట్లు కట్... చార్జి మెమోలు జారీ –ఆటోలు ఓవర్‌లోడ్‌తో వెళితే ఎంవీఐలను సస్పెండ్ చేస్తా కర్నూలు(అగ్రికల్చర్): డిపార్టుమెంటు ఉందా.. సచ్చి పోయిందా ... మీలో పవర్ లేదా? ఆటోలు ఓవర్‌లోడ్‌లో వెలుతుంటే మీకు కనబడదా? అంటూ రవాణ అధికారులపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రవాణ అధికారులతో కొద్ది సేపు నిర్వహించిన సమావేశంలో వారిపై నిప్పులు చెరిగారు. ఇదీ నేపథ్యం..ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కర్నూలులో పర్యటించారు. ముఖ్యమంత్రి పాల్గొనే డ్వాక్రా సదస్సుకు నగరం నుంచి వేలాది మందిని తరలించే విధంగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మహిళలను తరలించేందుకు వీలుగా మెప్మాలో పనిచేసే ఒక్కో కమ్యూనిటీ ఆర్గనైజర్‌కు 50 వాహనాలు సమకూర్చాలని రవాణ శాఖ ఎంవీఐలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే, కొందరు ఎంవీఐలు తగినన్ని వాహనాలు సమకూర్చలేదు. దీంతో మహిళలను తరలించడంలో మెప్మా అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని మెప్మా అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రవాణ అధికారులతో సమావేశం నిర్వహించి వాహనాలు సమకూర్చడంలో నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ఏం తమాషగా ఉందా...నిద్ర పోతున్నారా వీఐపీల కార్యక్రమాలకే వాహనాలు పంపలేరా... వాహనాలు స్వాదీనం చేసుకునే పవర్ లేదా అంటూ మండిపడ్డారు. సునీత, రఘునాథ్, శ్రీకాంత్, అతిగానా«థ్ అనే నలుగురు ఎంవీఐలకు రెండు ఇంక్రిమెంట్లను కట్ చేయడంతో పాటు చార్జి మెమోలు ఇచ్చారు. ఈ మేరకు ఫైల్ సర్క్యులేట్ చేయాలని డీటీసీని ఆదేశించారు. ఇక నుంచి ఆటోలు ఓవర్‌లోడ్‌తో వెళితే సంబంధిత ఎంవీఐలను సస్పెండ్ చేస్తానన్నారు. ఇందుకు డీటీసీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడీ రామాంజనేయులు పాల్గొన్నారు. -
మానవహక్కుల కమిషన్ స్పందన
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు నోటీసులు జనవరి 25వ తేదీనాటికి సమగ్రSనివేదిక ఇవ్వాలని ఆదేశం నరసరావుపేట టౌన్: ప్రభుత్వాస్పత్రుల్లో పేదలు మృతి చెందితే ఆయా మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు గుర్తు తెలియని మరణాలు సంభవించినప్పుడు శవాలను అంతిమ సంస్కారానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు. దీనిపై ఈ నెల ఆరో తేదీన సాక్షి దినపత్రికలో చచ్చినా చావే అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతదేహాల తరలింపులో తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొలుత నరసరావుపేట పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మాడిశెట్టి మోహనరావు మృతదేహాల తరలింపులో ఇబ్బందులపై సాక్షి కథనం ఆధారంగా మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమీషన్ మానవహక్కుల పరిరక్షణ చట్టంలో భాగంగా మృతదేహాల తరలింపులో అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందుతూ ఆయుషు తీరిన మృతులు, అనాథ శవాల తరలింపులో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వచ్చే ఏడాది జనవరి 25వ తేదీనాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలను చేర్చి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మోహనరావు తెలిపారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
రేపల్లె: మండలంలోని పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎన్.కిషోర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అడిషనల్ డీఎస్పీ శోభామంజరి ఆదేశాల మేరకు తమ సిబ్బందితో నిఘా ఉంచి పెనుమూడి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రేపల్లె వైపునుంచి కృష్ణాజిల్లావైపు వెళ్తున్న ఏపీ28డబ్లు్య 6437 నంబరుగల పాల లారీ డ్రై వర్ తనిఖీలను గమనించి లారీని పక్కనే ఉన్న మట్టిరోడ్డుకు తరలించి అక్కడే వదిలి పారిపోయాడన్నారు. లారీలో గోతాలు మార్చి నింపిన 83 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నాయని, రికార్డులను పరిశీలించగా ఇవి కర్లపాలెంకు చెందిన మహ్మద్ అబీబ్‌బేగ్‌దిగా గుర్తించామన్నారు. మహ్మద్ అబీబ్‌బేగ్‌పై ఈ సంవత్సరం అక్రమంగా బియ్యం తరలింపుపై ఇప్పటికే ఐదు సార్లు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రేపల్లె పోలీసులకు సమాచారం అందించి, లారీని రేపల్లె ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ టి.శ్రీనివాసరావు, కానిస్టేబుల్ మహేష్, ఆర్ఐ పి.సుధీర్ తదితరులున్నారు. -
కోడుమూరులో పట్టుబడిన బయో మందులు
కోడుమూరు రూరల్ : కోడుమూరులో అనుమతి లేని నకిలీ బయో మందులను భారీగా పట్టుకున్నారు. మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా సోమవారం తనిఖీల చేపట్టాడు. అందులో క్రాంతి ట్రాన్స్‌పోర్టులో రవాణాకు సిద్ధంగా ఉన్న రూ.4,81,000లు విలువ చేసే అనుమతి లేని బయో మందులు, వెల్దుర్తి రోడ్డులోని ఒక దుకాణానికి సంబంధించి అనుమతి లేని గోడౌన్లో నిల్వ ఉంచిన రూ.5లక్షలు పైగా విలువ చేసే మందులు పట్టుబడ్డాయి. గత వారం రోజుల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు బయోలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టుబడ్డ మందులను సీజ్ చేశా: అక్బర్‌బాషా, మండల వ్యవసాయాధికారి, కోడుమూరు క్రాంతి ట్రాన్స్‌పోర్టులో రూ.4,81,000 విలువ చేసే అనుమతి లేని 23రకాలను బయో మందులు సీజ్ చేశా. ఇందులో 10మందుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నా. అలాగే అనుమతి లేని గోడౌన్లో పట్టుబడ్డ బయో మందుల అమ్మకాలను కూడా నిలిపేసి వాటి విలువను అంచనా వేస్తున్నా. -
కరాచీ టు సిటీ వయా షార్జా!
- అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు - ముగ్గురు నిందితుల అరెస్టు, రూ. 9 లక్షలు సీజ్ - తొలిసారిగా వెలుగులోకి విమానమార్గ రవాణా సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు అయింది. పాకిస్తాన్లో ముద్రితమైన నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ తీసుకువచ్చిన అంతర్జాతీయ ముఠా గుట్టును హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.9 లక్షల నకిలీనోట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం వెల్లడించారు. వీరి అరెస్టుతో నకిలీ నోట్లు విమానాల ద్వారా హైదరాబాద్‌కు వస్తున్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అఖీల్ మార్ఫానీ గతంలో సౌదీ, షార్జాల్లో కార్పెంటర్‌గా పనిచేశాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా షార్జా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయాలనుకున్నాడు. కరాచీలో ఉంటున్న తన మేనమామ యాసీన్‌కు ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పాడు. పాకిస్తాన్లో ముద్రితమయ్యే భారత నకిలీ నోట్లను మార్పిడి చేస్తే మంచి లాభాలు ఉంటాయని ‘సలహా’ ఇచ్చాడు. తన ఏజెంట్ ద్వారా రూ.వెయ్యి, రూ.500 డినామినేషన్లో ఉన్న రూ.9 లక్షల నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జాకు పంపుతానన్నాడు. ఆ నగదును హైదరాబాద్ తీసుకువెళ్ళి చెలామణీ చేయాలని, తన వాటాగా రూ.3 లక్షలు ఇస్తే చాలని మార్ఫానీతో చెప్పాడు. దీనికి మార్ఫానీ అంగీకరించడంతో దుబాయ్‌లోని డేరా ప్రాంతంలో ఉన్న ఏజెంట్ ద్వారా యాసీన్ నకిలీ నోట్లు అందించాడు. ఈ నోట్లను ఓ బ్యాగ్ అడుగు భాగంగా నేర్పుగా పేర్చిన మార్ఫానీ దాన్ని తీసుకుని ఈ నెల 3న స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చాడు. గుర్తించని కస్టమ్స్ అధికారులు... ప్రయాణం నేపథ్యంలో నకిలీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌ను లగేజ్‌లో వేసి తీసుకువచ్చాడు. దీన్ని ఏ దశలోనూ కస్టమ్స్ అధికారులు గుర్తించకపోవడంతో నకిలీ నోట్ల బ్యాగ్‌ను మార్ఫానీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కొన్ని రోజులపాటు రహస్య ప్రదేశంలో దాచి మార్పిడి కోసం తన స్నేహితులైన ఘియాస్ మోహియుద్దీన్ (హుస్సేనిఆలం), మహ్మద్ తౌఫీఖ్ అహ్మద్ (సంగారెడ్డి) సహాయం తీసుకోవాలని నిర్ణయించాడు. వాటాలు ఇస్తానని చెప్పడంతో వీరిద్దరూ ముందుకు వచ్చారు. ఈ ముగ్గురూ కలసి నకిలీ నోట్లను మార్పిడి చేసే యత్నాల్లో ఉన్నారనే సమాచారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య, ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్ కుమార్, కేఎస్ రవి తమ బృందాలతో వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. కేసును మహంకాళి పోలీసులకు అప్పగించామని, కరాచీలో ఉన్న యాసీన్ కోసం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తామని డీసీపీ తెలిపారు. -
కొత్త జిల్లాలకు తీరొక్క పేరు..!
సీఎం చెప్పేదొకటి.. జీవోల్లో మరొకటి సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల పేర్లపై గందరగోళం నెలకొంది. ఫైనల్ గెజిట్‌లో ఒక పేరుండటం, వాడుకలో మరో పేరు ఉండటం, ముఖ్యమంత్రి చేసిన సూచనలు మరో తీరుగా ఉండటంతో విపత్కర పరిస్థితి నెలకొంది. ఏ పేరును ప్రామాణికంగా స్వీకరించాలి.. పరిపాలన వ్యవహారాల్లో ఏ పేరు వాడాలనే అయోమయం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాత పేర్లకు అనుబంధంగానే కొత్తగా ప్రతిపాదించిన పేర్లను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమీక్షలన్నింటా అధికారులకు ఆదేశాలిచ్చారు. దీని ప్రకారం గద్వాల జిల్లాకు జోగుళాంబ అని పేరు పెట్టినప్పటికీ ‘జోగుళాంబ గద్వాల’ జిల్లాగా కొనసాగించాలి. కానీ కొత్త జిల్లాల ఆవిర్భావం రోజున జారీ చేసిన గెజిట్‌లో ‘జోగుళాంబ జిల్లా’ అని పేర్కొన్నారు. అదేవిధంగా సిరిసిల్ల కేంద్రంగా ‘రాజన్న జిల్లా’ అని జీవో ఇచ్చారు. కానీ అక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలు, స్టాంపులన్నీ ‘రాజన్న సిరిసిల్ల’ పేరుతో చెలామణిలోకి వచ్చాయి. కుమ్రం భీం, జయశంకర్ జిల్లాలన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని గుర్తించారు. యాదాద్రి జిల్లా పేరును ‘యాదాద్రి భువనగిరి’ జిల్లాగా పిలవాలని ప్రకటించారు. ఇప్పటికైనా అధికారులు కొత్త జిల్లాలకు పెట్టిన పేర్లపై మరింత స్పష్టత ఇచ్చేలా.. జీవోల్లో ఉన్న తీరొక్క పేర్లను సవరించాల్సిన అవసరముంది. యాదాద్రి పేరు యాదాద్రి భువనగిరి: సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లాను ‘యాదాద్రి భువనగిరి’ జిల్లాగా పిలవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ధి చెందుతాయని సీఎం అన్నారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలని సూచించారు. బుధవారం సాయంత్రం యాదాద్రి నుంచి తిరిగి వస్తుండగా కేసీఆర్ భువనగిరిలో కాసేపు ఆగారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన భువనగిరిలోని ఎలిమినేటి కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కుటుంబ యోగక్షేమాలు, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో గడిపిన సందర్భాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో భువనగిరి పట్టణం చాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంఎంటీఎస్, రీజనల్ రింగ్ రోడ్ భువనగిరి నుంచే వెళ్లనున్నందున రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. -
రవాణా శాఖలో ఆన్లైన్ సేవలకు శ్రీకారం
ఇకపై డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్లు – దశల వారీగా 80 రకాల సేవలు ఆన్లైన్లోనే.. – జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కర్నూలు: రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు రంగం సిద్ధమయింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శక పాలన అందించేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. అదేవిధంగా మరో అడుగు ముందుకేసి ఆ శాఖ ద్వారా అందిస్తున్న 80 రకాల సేవలను దశల వారీగా ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందేందుకు చర్యలు చేపట్టారు. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగనవసరం లేదు. మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం అసలే ఉండదు. ఈ–ప్రగతి నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ఆన్లైన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గతంలో కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ డీలర్ల వద్దే అందజేస్తుండగా.. ఆ తర్వాత ఆర్టీఏ కార్యాలయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ఆన్లైన్ విధానంతో శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా డీలర్ల వద్దే నిర్వహించేలా చర్యలు ప్రారంభించారు. వాహనం కొనుగోలు చేసిన 24 గంటల లోపే శాశ్వత రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఈ విధానం విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద పట్టణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత అందులో లోటుపాట్లు తెలుసుకుని వాటిని సరిచేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కర్నూలులో కూడా అమలులోకి తెచ్చారు. ఆన్లైన్ ప్రక్రియ అమలుపై డీలర్లకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులను కూడా ఆర్టీఏ అధికారులు నిర్వహించారు. జిల్లాలో ఆన్లైన్ విధానం అమలుకు హైదరబాదుకు చెందిన ఓటీఎస్ ప్రకాష్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ఇంటినుంచే.. తాజాగా ప్రతిపాదించిన నూతన విధానంతో రవాణా శాఖ ద్వారా అందించే 80 రకాల సేవలను ఆన్లైన్ ద్వారానే పొందే వీలుంది. దరఖాస్తుదారుడు ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చొని వాహన్ వెబ్సైట్ ఓపెన్ చేసి తనకు కావలసిన సేవలను దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలంటే దానికి సంబంధించిన అన్ని పత్రాలను ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది. ఇంజన్ నెంబర్, ఛాసిస్ నెంబర్ టైప్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఈ తరహా విధానం ద్వారా ప్రజలకు సమయం ఆదాతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం... కర్నూలు నగర శివారులోని సంతోష్‌నగర్ వద్దనున్న ప్రీమియం హోండా షోరూమ్‌లో సోమవారం సాయంత్రం ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాపరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎస్పీ ఆకే రవికృష్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఆన్లైన్ సేవలకు శ్రీకారం చుట్టారు. మొదటి కొనుగోలుదారుడు పి.ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి హోండా కారుకు మొదట తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం, ఆన్లైన్ సేవలతో పది నిముషాల అనంతరం శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాన్ని అందజేశారు. ఏపీ21 బీపీ 0002 వాహనానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించారు. కార్యక్రమంలో డీటీసీ ప్రమీల, కర్నూలు, నంద్యాల ఆర్టీఓలు జగదీశ్వర్రాజు, హరిప్రసాద్, ఎంవీఐలు శ్రీకాంత్, శివశంకర్, శ్రీనివాసరావు, ఏఎంవీఐ స్వాతి, ఏఓలు జాన్‌పాల్, శ్రీనివాసులు, ప్రీమియం హోండా అధినేత ప్రసాదరెడ్డి, వివిధ షోరూమ్‌ల డీలర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరికీ ప్రీమియం హోండా షోరూమ్ ఆధ్వర్యంలో జ్ఞాపికలను అందజేశారు. ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలి రవాణా శాఖలో వస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ప్రజలు సేవలను వినియోగించుకోవాలి. జిల్లాలో నూతనంగా అమల్లోకి వచ్చిన ఆన్లైన్ విధానం ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరం. మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. - ప్రమీల, డీటీసీ -
15 నుంచి రవాణా శాఖలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
– నేటి నుంచి వాహన డీలర్లకు అవగాహన కార్యక్రమాలు కర్నూలు: రవాణా శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాహనాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. ఈనెల 15న కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా రవాణా శాఖ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇందుకు సంబంధించి వాహన డీలర్లు, సిబ్బందికి స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 13, 14వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశం వాహన డీలర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ ఉపకమిషనర్ బి.ప్రమీల విజ్ఞప్తి చేశారు. -
నత్తనడకన రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసు
డ్రైవరు, కూలీలు సరే అసలు సూత్రధారులేరీ.. అధికార పార్టీలో కీలక నేత తీరుపై సీఎంకు ఫిర్యాదు మాచర్ల (గుంటూరు జిల్లా): రాత్రంతా వేచిఉండి రేషన్ షాపుల నుంచి వినుకొండకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో అసలు సూత్రధారుల విషయంలో పోలీసులు ఇంకా నాన్చుతున్నారు. డిపోల నుంచి రేషన్ బియ్యం తీసుకొచ్చి రాత్రికి రాత్రి లారీకి లోడ్ చేసే శక్తి డ్రై వర్, క్లీనర్, కూలీలకు ఉండదు. ముందుగా అడ్వాన్సులు ఇచ్చి ఆయా డిపోల నుంచి టాటాఏస్ వాహనాల్లో బియ్యం బ్యాగులు తీసుకువచ్చి లోడ్ చేస్తారు. ఇదే సమయంలో బియ్యం బ్యాగ్‌లు తీసుకొచ్చిందెవరు... కూలీలకు నగదు చెల్లించేదెవరు... ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముందుగా మాట్లాడిందెవరూ అనే విషయాలు డ్రై వర్ నుంచి కూలీల వరకు అందరికీ తెలుసు. ఈ విషయంలో పోలీసులు నిర్లిప్తత ప్రదర్శిస్తూ అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ మాట్లాడడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మెల్యే పట్టించిన డ్రై వర్, క్లీనర్, మరో ముగ్గురు కూలీలు కాకుండా వారి స్టేట్మెంట్ ఆధారంగా శ్యామరాజపురం గ్రామానికి చెందిన రామారావు, శివాజీ (శివయ్య)లపై కేసు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎ.ఎస్.ఐ. ఇస్మాయిల్ సాక్షికి తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషిస్తూ, ప్రతి నెల లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న ఆ నాయకుడు నామినేటెడ్ పదవిలో ఉండడం వల్లే పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారని అధికార పార్టీలో ఉన్న ఓ మాజీ పోలీసు అధికారి ముఖ్యమంత్రికి ఫిర్యాదుచేశారు. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. -
టమాటలో ముసుగులో ఇసుక రవాణా
– వాహన తనిఖీల్లో మాఫియా గుట్టు రట్టు – లారీ, రెండు మోటర్ సైకిళ్లు సీజ్ కర్నూలు: కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్న మాఫియా గుట్టు రట్టు అయింది. నగర శివారుల్లోని అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద నిఘా తీవ్రతరం చేయడంతో అడ్డదారుల్లో ఇసుకను రవాణా చేస్తూ ఇసుక మాఫియా పోలీసుల వలకు చిక్కారు. టమాటల రవాణా పేరుతో కొంతకాలంగా ఇసుకను తరలిస్తున్నారు. కర్నూలు శివారుల్లోని హంద్రీనది నుంచి హైదరాబాద్‌కు ఐచర్ వాహనంలో ఇసుకను తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి నాల్గో పట్టణ సీఐ నాగరాజు రావు, తన సిబ్బందితో వెంకటరమణ కాలనీ మలుపు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఏపీ 01 ఎక్స్ 9755 ఐచర్ వాహనంలో సుమారు 10 టన్నుల ఇసుకను నింపి లారీకి వెనుక, ముందు మోటర్‌సైకిళ్లతో ఇద్దరు పైలట్ల తరహాలో తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. లారీలో ఇసుక కనపడకుండా టమాట బాక్సులను వెనుక భాగంలో అడ్డం పెట్టి, తడికలు కప్పి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులను చూడగానే డ్రైవర్ ఫయాజ్ వాహనాన్ని పక్కన పార్కు చేసి పారిపోయాడు. అలాగే ద్విచక్ర వాహనాలపై పైలెట్లుగా వ్యవహరించిన రాజు, మరో వ్యక్తి కూడా తమ వాహనాలను వదిలివేసి పారిపోవడంతో పోలీసులు టమాట బక్సులను తొలగించి తనిఖీ చేయగా, ఇసుక బయటపడింది. దీంతో రెండు మోటర్ సైకిళ్లు, లారీని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ముఠా వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ః కర్నూలు మండలం, పంచలింగాల గ్రామానికి చెందిన రాజు, గంగన్న, హుసేని, షాలు తదితరులు హైదరాబాద్‌కు చెందిన మొహిద్దీన్, ఫయాజ్‌తో చేతులు కలిపి కొంతకాలంగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. గంగన్న, హుసేని హమాలీలుగా పని చేస్తూ ముఠాకు చేదోడుగా ఉంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులకు మామూళ్లు ముట్టజెప్పి ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. సుంకేసుల పరిసర ప్రాంతాల్లోని తుంగభద్ర నది నుంచి కూడా భారీ ఎత్తున మాఫియా సభ్యులు ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెలుగు చూసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన మొహిద్దీన్, పంచలింగాలకు చెందిన గంగన్న, హుసేని తదితరులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఎంత కాలం నుంచి ఇసుక రవాణా అక్రమంగా జరుగుతుంది, ముఠా వెనుక ఎవరెవరి హస్తం ఉంది, తదితర విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
విజయవాడ (భవానీపురం) : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు.. కోదాడ నుంచి కాకినాడకు 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోందన్న సమాచారాన్ని అందుకున్న అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్.విజయపాల్ నేతృత్వంలో సిబ్బంది భవానీపురం బైపాస్ రోడ్లో కాపు కాశారు. ఉదయం 11.30 గంటల సమయంలో బియ్యం లోడుతో వస్తున్న లారీని అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 230 గన్నీ బ్యాగ్స్, 112 తెల్ల సంచుల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీ లోడులో పైవరుసలో సాధారణ బియ్యం బస్తాలను పేర్చి అడుగున రేషన్ బియ్యం బస్తాలను ఉంచారు. లారీలోని రేషన్ బియ్యాన్ని గొల్లపూyì మార్కెట్ యార్డ్‌లోని ఎంఎల్ఎస్ పాయింట్లో దించి, ఇన్చార్జి నరసింహారావుకు అప్పగించారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం లారీని, డ్రైవర్ నాగరాజును భవానీపురం పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ఎన్ఎస్ఎస్ అపర్ణ, ఎస్కే నభి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ, ఆర్ఐ ఎ.లత పాల్గొన్నారు. -
నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
ఈ నెల 15వ తేదీన జరుగనున్న వినాయక నిమజ్జనోత్సవానికి రవాణా, ఆర్టీసీ, రైల్వే విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి సహా వేల సంఖ్యలో విగ్రహాలను ట్యాంక్‌బండ్‌కు తరలించనున్నారు. వాహనాల రద్దీ, తరలింపులో జాప్యం, తదితర ఇబ్బందుల దష్ట్యా రెండు రోజుల ముందు నుంచే విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మండప నిర్వాహకులను నిమజ్జనానికి ప్రోత్సహిస్తున్నారు. అందుకనుగుణంగా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో చర్యలు చేపట్టాయి. నీటిపారుదల, రెవిన్యూ, పోలీసు, రవాణా,తదితర విభాగాలు రంగంలోకి దిగాయి. గత ఏడాది 50 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 60 వేలు దాటవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రధాన నిమజ్జనం జరుగనున్న ట్యాంక్‌బండ్‌తో పాటు, నగరంలోని ఇతర చెరువుల వద్ద మొత్తం 64 భారీ క్రేన్లను అందుబాటులో ఉంచేందుకు నీటిపారుదలశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. అలాగే, విగ్రహాల తరలింపు కోసం భారీ వాహనాలతో పాటు, తేలికపాటి వస్తు రవాణా వాహనాల వరకు 3500 పైగా సమకూర్చేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి టోకెన్ తీసుకొని వచ్చే మండపాల నిర్వాహకులకు వాహనాలను అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. అన్ని చోట్లా అందుబాటులో క్రేన్లు... ట్యాంక్‌బండ్‌కు రెండు వైపులా 34 భారీ క్రేన్లను ఈ సారి ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు, మీరాలం ట్యాంకు, రాజన్నబౌలీల్లో ఒక్కోటి, సరూర్‌నగర్ చెరువులో 7, కూకట్పల్లి ఐడీపీఎల్ చెరువులో 4, ప్రగతినగర్ చెరువులో 2, సఫిల్‌గూడ చెరువులో 2, కాప్రా చెరువులో 5, దుర్గం చెరువు-2, అల్వాల్ కొత్త చెరువు-1,పల్లెచెరువు-2,పత్తికుంట చెరువు-1, వెన్నెలగడ్డ చెరువు-1,ఏదులాబాద్, షేక్‌పేట్, సూరారం, జీడిమెట్ల, మేడ్చెల్, శంషాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున క్రేన్లు ఏర్పాటు చేస్తారు. అన్ని విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌కే తరలించకుండా సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో 3500 వాహనాలు.... ప్రధాన నిమజ్జన వేడుకలు జరుగనున్న 15వ తేదీన విగ్రహాల తరలింపు కోసం ఇప్పటికే 3500 వాహనాలను సిద్ధం చేశారు. డిమాండ్ మేరకు మరిన్ని వాహనాలను సమకూర్చనున్నట్లు జేటీసీ తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచే వాహనాలను మండపాల నిర్వాహకులకు అందజేస్తారు. ఇందుకోసం వారు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి టోకెన్ తీసుకోవలసి ఉంటుంది. నాగోల్, మలక్‌పేట్, టోలీచౌకి, జూపార్కు,ఆరాంఘర్,నెక్లెస్‌రోడ్డు, తిరుమలగిరి, మేడ్చెల్, సుచిత్ర, గచ్చిబౌలి, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, అత్తాపూర్, తదితర కేంద్రాల్లో వాహనాలను అందుబాటులో ఉంచుతారు. మండపాల నిర్వాహకులు తమ సమీపంలోని ప్రాంతీయ రవాణా అధికారుల సహాయంతో వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు. భారీ ట్రేలర్లకు రూ.20 వేలు, లారీలకు రూ.4,500, మధ్యతరహా వాహనాలకు రూ.5,500, టాటాఏసీ వంటి వాహనాలకు రూ.1000 చొప్పున అద్దె ఉంటుంది. ఇవి కాకుండా ట్రేలర్లు మినహా ఇతర వాహనాలకు నిర్వాహకులే డీజిల్ సమకూర్చుకోవాలి. డ్రైవర్, క్లీనర్లకు రూ.500 చొప్పున బత్తా చెల్లించాలి. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు... నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దష్టిలో ఉంచుకొని 15వ తేదీ రాత్ర 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీనియర్ పీఆర్వో షకీల్ అహ్మద్ తెలిపారు. నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-నాంపల్లి, లింగంపల్లి-నాంపల్లి,లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ల మధ్య ప్రతి గంటకు ఒక ట్రై యిన్ అందుబాటులో ఉంటుంది. -
రాజధానిలో రవాణా ప్రణాళిక కోసం అధ్యయనం
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రోడ్ నెట్వర్క్, బీఆర్టీఎస్, మెట్రో, రైల్ నెట్వర్క్, వాటర్ వేస్‌కు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని జపాన్‌కు చెందిన జైకా ప్రతినిధి బృందానికి సీఆర్డీఏ అధికారులు సూచించారు. అమరావతి రాజధాని నగరం, రీజియన్‌లో రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసి ప్రణాళికS రూపకల్పనకు జైకా బృందం మూడు రోజుల పాటు పర్యటనకు వచ్చింది. ఆ సందర్బంగా గురువారం సీఆర్డీఏ కార్యాలయంలో జైకా ప్రతినిధులతో అధికారులు సమావేశమై రవాణా ప్రణాళికలపై అవగాహన కల్పించారు. రాజధాని నగరం పరిధిలోని, రీజియన్ పరిధిలో సమగ్ర రవాణా ప్రణాళిక రూపొందించాల్సిన అవశ్యకతను జైకా ప్రతినిధులకు సీఆర్డీఏ అధికారులు సూచించారు. కేపిటల్ సిటీ, రీజియన్‌కు, ప్రతి అర్బన్ సెంటర్‌కు ప్రత్యేక ప్రణాళిక ఉండాలని చెప్పారు. రీజియన్‌తో ఎలా లింక్ చేయాలి, టీఓడీ కారిడార్ ఎలా ఉండాలి, ఇంటిగ్రేషన్ విత్ ట్రాన్స్‌పోర్టు ప్లాన్, దశలవారీగా ప్రణాళిక, ఇనిస్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్, మేజరల్ రోడ్ నెట్వర్క్ ప్లాన్, ఇంటిలిజెంట్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్, రోడ్ సేఫ్టీ ప్లాన్ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేధిక రూపొందించాలని సూచించారు. రవాణా ప్రణాళిక, ఫిజిబిలిటీ రిపోర్ట్, ఫైనాన్సియల్ రిపోర్ట్ అందజేయాలని సూచించారు. 2020 నుంచి ప్రతి ఐదేళ్లకు ప్రత్యేక ప్రణాళిక, 2050 నాటికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జైకా ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ అడ్వయిజర్ కవహర షుంటారో, యాక్టింగ్ డైరెక్టర్ సనద అకికో, ప్రతినిధి హిరోషి యొషిదా, ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్ వి.రామమనోహరరరావు, ఎడిసి చీఫ్ ఇంజినీర్ రామమూర్తి, ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ అరవింద్, ప్రిన్సిపల్ ప్లానర్ వివిఎల్‌ఎన్ శర్మ, ఆర్వీ కన్సల్టెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పునరుద్ధరిస్తే బకింగే
తాడేపల్లిగూడెం : హైడ్రాలిక్ హారన్ల శబ్దాల్ని భరించలేక చెవులు మూసుకోనక్కర్లేదు. సరంగుల హైలెస్సో .. హైలెస్సా పాటలు, కాలువ గట్లపై మోకులతో పడవల్ని లాక్కెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించకపోవచ్చు. కానీ.. గలగలాపారే నీటిపై సరుకులను రవాణా చేసే భారీ పడవలు రానున్న రోజుల్లో ఏలూరు ప్రధాన కాలువలో షికారు చేయనున్నాయి. ట్రాఫిక్ స్తంభనలు, రహదారి దగ్బంధనాలు వంటి గొడవ లేకుండానే వెయ్యి మెట్రిక్ టన్నుల వరకు సరుకులను అతి తక్కువ ధరకు సాఫీగా గమ్యస్థానాలకు చేర్చవచ్చు. బ్రిటిష్ కాలంలో జల రవాణాలో ప్రధాన భూమిక పోషించిన బకింగ్‌హాం కెనాల్ రవాణా వ్యవస్థ తిరిగి ఊపిరి పోసుకుంటోంది. ఇది సాకారమైతే రవాణా ఖర్చులు దాదాపుగా 60 శాతం తగ్గుతాయి. సరుకుల తరలింపు, నీటి పారుదల, పర్యాటక అభివృద్ధి లక్ష్యాలుగా బకింగ్‌హామ్ కెనాల్ జల రవాణా వ్యవస్థ పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోణంలో.. జాతీయ నాలుగో జలమార్గంగా 2004 జూన్‌లో చిగురులు తొడిగిన కేంద్ర ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చబోతోంది. జాతీయ జలమార్గాల సంస్థ చైర్మన్ అమితాబ్ తివారీ చొరవతో జల రవాణా పునరుద్ధరణకు సంబంధించి దశలవారీగా సర్వేలు జరిగాయి. బకింగ్‌హాం కెనాల్లో జలరవాణా పునరుద్ధరణకు రూ.3,200 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ముక్త్యాల–విజయవాడ–కాకినాడ మార్గంలో తొలిదశ పనులకు త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ కేంద్రానికి నివేదిక సమర్పించారు. కృష్ణా జిల్లాలో 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ముక్త్యాల కాలువను అభివృద్ధి చేసేందుకు మరో నాలుగు రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. గుంటూరు జిల్లాలో చామర్రు కాలువ అభివృద్ధికి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రెండు జలమార్గాలకు రూ.69.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కాలువ కథ ఇదీ జాతీయ నౌకాయాన శాఖ అధీనంలో గల బకింగ్‌హాం కాలువలో బ్రిటిష్ పాలనా కాలంలో పడవల ద్వారా సరుకుల రవాణా సాగేది. అప్పట్లో ఈ కాలువ 100 మీటర్ల వెడల్పున ఉండేది. ఆ కాలంలో జిల్లాలోని తాడేపల్లిగూడెంలో 120 పడవలతో కూడిన ఫ్లీట్ పాయింట్ ఉండేది. ఇక్కడి నుంచి పడవల్లో చెన్నైకు, ఇటు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ వరకు సరుకులను చేరవేసేవారు. రోడ్డు రవాణా పెరగడంతో జలమార్గాన్ని విస్మరించారు. సునామీ వంటి ప్రకృతి వైపరీ త్యాలు తలెత్తిన నేపథ్యంలో బకింగ్‌హాం కాలువ విలువ తెలిసివచ్చింది. దీంతో ఈ కాలువను రవాణా నిమిత్తం పునరుద్ధరించడానికి 2008లో జాతీయ జల రవాణా మార్గాల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి సర్వే చేపట్టారు. అనంతరం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) ఆధ్వర్యంలో కాలువ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో తమిళనాడులోని బకింగ్‌హామ్ కాలువలో 50 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ చేశారు. ఆధునికీకరించిన కాలువ మార్గంలో షోలింగనల్లూరు వద్ద కల్పకం కార్గో షిప్పింగ్ చానల్‌ను ఈ ఏడాది జనవరి 25న ప్రారంభించారు. దశలవారీగా బకింగ్‌హాం కాలువలో జలరవాణా పునరుద్ధరించడానికి కార్యాచరణ రూపొందించారు. ఆ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. అవి పూర్తయితే విజయవాడ నుంచి కాకినాడ మధ్య ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ధవళేశ్వరం మీదుగా కాకినాడ వరకు జల రవాణా మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. అడ్డంకులున్నాయ్ బకింగ్‌హాం జలరవాణా మార్గం కృష్ణా జిల్లా పెదగంజాం నుంచి ఏలూరులోని తూర్పులాకుల మీదుగా ఏలూరు గోదావరి కెనాల్‌తో అనుసంధానం అవుతుంది. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు, విజ్జేశ్వరం, ధవళేశ్వరం మీదుగా కాకినాడలో సముద్రతీర ప్రాంత సంగమం వరకు వెళుతుంది. జిల్లాలో ఏలూరు నుంచి విజ్జేశ్వరం వరకు గల ఏలూరు ప్రధాన కాలువ పలుచోట్ల ఆక్రమణలకు గురై బక్కచిక్కింది. ఏలూరులో మంచినీటి పథకాల నిర్మాణాలు, ఉంగుటూరు ప్రాంతంలో కాలువ గట్లపై ఆక్రమణలు, తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆలోచన రహితంగా తక్కువ ఎత్తులో నిర్మించిన వంతెనలు, పట్టణంలో ఆలయాలు, కాలువ గట్ల ఆక్రమణ వంటివి జరిగాయి. పెంటపాడు మండలం నవాబ్పాలెంలోని బౌ వంతెన వద్ద ఇదే పరిస్థితి ఉంది. పట్టణంలోని శివాలయం వద్ద నిర్మించిన వంతెన జల రవాణాకు ప్రతిబంధకంగా ఉంది. నందమూరు వద్ద ఎర్రకాలువ, ఏలూరు కాలువ విడిపోయే చోట నావిగేషన్‌కు ఇబ్బందులు ఉన్నాయి. పరిశ్రమలు వంటివి ఈ గట్టుపై లేనందువల్ల ఆక్రమణలు తొలగించడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ వంతెనలు వంటి నిర్మాణాలను విస్తరించాల్సి ఉంది. జల రవాణాకు అనుమతించే పడవలు, ఇతర యంత్ర రవాణా సా«ధనాలకు అనుగుణంగా డిజైన్స్ మార్చాల్సి ఉంది. -
ఎంతంత దూరం..
యాత్రికుల తికమక బస్సుల కోసం కిలో మీటర్ల దూరం నడక సక్రమంగా రూటు చెప్పని పోలీసులు సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల యాత్రికులు అడుగడుగునా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రయాణానికి సంబంధించిన వివరాలు అందించడంలో విఫలమవుతున్నారు. పుణ్యం కోసం పుష్కరాలకు వస్తే పోలీసుల ఆంక్షలతో కిలో మీటర్ల కొద్ది దూరం నడవాల్సి వస్తోంది. బస్సు కోసం నడవాల్సిందే.. 50 అడుగుల దూరం వెళ్లితే గమ్యం చేర్చే బస్సులను ఎక్కాల్సి ఉన్నా స్థానిక పోలీసుల తికమక సమా«ధానం, ఆంక్షలతో రెండు కిలో మీటర్లు నడవాల్సి వస్తోంది. మంగళవారం పున్నమి ఘాట్, భవానీఘాట్లలో భక్తుల అవస్థలు పడ్డారు. భవానీ ఘాట్‌లో స్నానం చేసి దుర్గమ్మ గుడికి లే దా మరో చోటకీ వెళ్లాలంటే స్వాతి సెంటర్లో బస్సు ఎక్కాలి , కానీ అక్కడ వెళ్లి తాము వెళ్లాల్సిన బస్సు అడ్రస్ అడిగితే పోలీసులు పున్నమి ఘాట్ జంక్షన్లోకి వెళ్లి ఎక్కాలని సమాధానం ఇస్తున్నారు. కానీ అక్కడ వెళ్లాలంటే పోలీసుల ఆంక్షలు వల్ల రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ జంక్షన్‌కు వెళ్లినా అక్కడ కూడా సరైన సమాధానం రావటం లేదు. బస్సుల అడ్రస్ తెలియక సామాన్య భక్తులు తికమక పడి అవస్థలు పడుతున్నారు. భవానీ ఘాట్ నుంచి పున్నమి ఘాట్‌కు వెళ్లాలంటే 50 అడుగుల దూరం ఉన్నా ట్రాఫిక్ మళ్లించడంతో సొరంగమార్గం గుండా రెండు కిలో మీటర్ల వరకు భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. దీంతో యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
సన్నగా.. తరలిపోగా!
జిల్లాలో బియ్యం మాఫియా – కర్ణాటకకు తరలిపోతున్న రేషన్ బియ్యం – డీలర్ల నుంచి సేకరిస్తున్న ఏజెంట్లు – నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు కేంద్రంగా వ్యవహారం – తాజాగా విజిలెన్స్ దాడుల్లో తేటతెల్లం సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డీలర్లతో పాటు కార్డుదారుల నుంచీ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని మిల్లుల్లో ఆడించి సన్నబియ్యంగా మారుస్తున్నారు. ఆ తర్వాత ఏదో ఒక బ్రాండ్ పేరున్న సంచుల్లో నింపి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి ఈ విధంగా రేషన్ బియ్యం కాస్తా సన్న బియ్యం రూపంలో తరలిపోతోంది. విజిలెన్స్ విచారణలో ఈ విషయాలన్నీ తాజాగా బయటపడ్డాయి. నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు కేంద్రంగా ఈ బియ్యం మాఫియా చెలరేగిపోతుందని సమాచారం. ఏజెంట్ల ద్వారా సేకరణ రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి తరలించేందుకు మాఫియా భారీగానే యాక్షన్ ప్లాన్ చేసి వ్యవహారం నడుపుతోంది. ప్రధానంగా ఈ బియ్యం మాఫియా బియ్యం సేకరించేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. కిలో బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10లతో కొనుగోలు చేస్తున్నారు. రూపాయికే వచ్చిన బియ్యానికి అధిక ధర వస్తుండటంతో అటు డీలర్లు, ఇటు దొడ్డుబియ్యం తినని కార్డుదారులు ఈ ఏజెంట్లను ఆశ్రయించి బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని కాస్తా ఏజెంట్లు.. బియ్యం మాఫియాకు రూ.14లకు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత మాఫియా కాస్తా దొడ్డు బియ్యాన్ని మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి బ్రాండ్ రూపంలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ విషయాలన్నీ తాజాగా నందికొట్కూరు కేంద్రంగా నడుస్తున్న బియ్యం మాఫియాపై విజిలెన్స్ దాడుల సందర్భంగా తేటతెల్లమయినట్లు తెలిసింది. రూపాయి.. ముపై ్ప రూపాయలవుతోంది వాస్తవానికి రేషన్‌షాపుల్లో కార్డుదారులకు కిలో బియ్యం రూపాయికే లభ్యమవుతోంది. ఈ బియ్యాన్ని డీలర్లతో పాటు రేషన్ బియ్యం తినని కార్డుదారుల వద్ద నుంచి మాఫియా సేకరిస్తోంది. ఇక్కడి నుంచి కర్ణాటకకు తరలిపోతున్న ఈ బియ్యం ధర కాస్తా అక్కడ కిలో రూ.30 పలుకుతోంది. అంటే కిలో రూపాయి బియ్యం కాస్తా రూ.30 అవుతోందన్నమాట. నందికొట్కూరు కేంద్రంగా ఖాదర్ బాషా నడుపుతున్న ఈ బియ్యం మాఫియా వ్యవహారం తాజాగా విజిలెన్స్ దాడుల్లో బయటపడింది. ఇలాంటి బియ్యం మాఫియా జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్నట్టు సమాచారం. ఈ మాఫియాకు అటు అధికారుల అండదండలతో పాటు అధికారపార్టీ నేతల ఆశీస్సులు ఉండటంతో వ్యవహారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. -
కొత్త ఆటోలకు గ్రీన్ సిగ్నల్
► పాత ప్రొసీడింగ్లపైనే జారీ ► 1407 ఆటోలకు అనుమతి ► జేటీసీ రఘునాథ్ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరిన్ని కొత్త ఆటోలు రోడ్డెక్కనున్నాయి. గతంలో పలు జీవోల కింద విడుదలై గడువు ముగిసిన కారణంగా మిగిలిపోయిన 1,407 ఆటో రిక్షాలకు అనుమతినిస్తూ మంగళవారం రవాణాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. బుధవారం నుంచి కొత్త ఆటోల విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వండి.. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు కొత్తవాళ్లకు కూడా ఆటో పర్మిట్లు పొందేందుకు అవకాశం కల్పించాలని ఏఐటీయూసీ కార్యదర్శి బి.వెంకటేశం, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి ఏ.సత్తిరెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రెండేళ్లలో పెరిగిన నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని అవకాశం కల్పించాలని కోరారు. -
ఇసుక డంపుల తరలింపుపై ఆందోళన
లారీలను అడ్డుకున్న ట్రాక్టర్ యజమానులు పోలీసుల తొలగింపుతో ఉద్రిక్తత కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం ఎలగందల్లో మంగళవారం ఇసుక అక్రమ డంపులను తరలించేందుకు వచ్చిన లారీలను ట్రాక్టర్ యజమానులు కుటుంబసభ్యులతో కలిసి అడ్డుకున్నారు. ఇసుక అక్రమరవాణా పేరిట అధికారులు చేస్తున్న దౌర్జన్యంతో తాము నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు గతనెల 31 నుంచి ఇసుకడంపులను స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో పర్మిట్లు పొందిన లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ట్రాక్టర్ యజమానులు ఈనెల 7న లారీలు వెళ్లకుండా కందకాలు తవ్వి అడ్డుకున్నారు. లారీలను నిలిపివేసి రాస్తారోకోకు దిగారు. అయినా అధికారులు తమపనికానిస్తున్నారు. దీంతో మంగళవారం సర్పంచ్ ఎర్ధండి ప్రకాశ్, నాయకులతో కలిసి ట్రాక్టర్ యజమానులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ జయచంద్రారెడ్డి, ఇన్చార్జీ సీఐ వెంకటరమణ పోలీస్‌బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఇసుక రవాణాతోనే తాము ఉపాధి పొందుతున్నామని, అక్రమ ఇసుక పేరిట వేధింపులను మానుకోవాలని యజమానులు డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ అక్రమ ఇసుకడంపులను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని, లారీలను అడ్డుకుంటే కేసులు పెడుతామంటూ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న ట్రాక్టర్ యజమానులు, కుటుంబసభ్యులను పోలీసులు బలవంతంగా తొలగించడంతో వివాదం ముగిసింది. -
అమ్మో.. అంత తరలిస్తున్నారా?
గ్రావెల్ అక్రమ రవాణాపై విస్తుపోయిన విజిలెన్స్ అధికారులు దగదర్తి : మండలంలోని తిరువీధిపాడు, చెన్నూరు, దామవరం, కౌరుగుంట తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను చూసి గనులశాఖ విజిలెన్స్ అధికారులే విస్తుపోయారు. అరకొర అనుమతులతో గ్రావెల్‌తోపాటు రోడ్డు మెటల్ తవ్వకాలు భారీ స్థాయిలో జరుగుతుండటంతో అధికారులు అవాక్కయారు. వివరాల్లోకి వెళితే.. తిరువీధిపాడు పంచాయతీ పరిధిలోని కనిగిరి రిజార్వాయర్ లోతట్టు ప్రాంతంలో నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తికి రోడ్ మెటల్ క్వారీకి గతంలో అధికారులు అనుమతులు మంజూరు చేశారు. చుట్టుపక్కల ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు. తాజాగా మైనింగ్ లీజు అనుమతులను వారసత్వ బదిలీ చేయాలని నిర్వాహకుని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు మరోమారు గనులశాఖతో పాటు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు రోజుల క్రితం తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. పూర్తిస్థాయిలో నివేదిక కోసం భూగర్భగనులశాఖ, అదే శాఖకు చెందిన నిఘా విభాగం, రెవెన్యూ అధికారులతో కలిసి తవ్వకాలను జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. తవ్వకాలను ప్రాధమికంగా అంచనా వేస్తేనే రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, రాము, గనులశాఖ అధికారులు రాము, నాగమణి పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సాయి అనే వ్యక్తి బైక్‌పై గంజాయి తరలిస్తుండగా.. గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ఓ బైక్‌తో పాటు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
నేడు ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పరీక్ష
హన్మకొండ అర్బన్ : టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వాకాటి కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. 48 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలన్నారు. ఉదయం 9.30 గంటల్లోగా పరీక్ష కేంద్రానికి రావాలని, ఆలస్యమైన వారిని అనుమతించబోమన్నారు. అభ్యర్థులు షూస్, వాచీలు ధరించి రావద్దన్నారు. అలాగే బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులను మాత్రమే వినియోగించాలన్నారు. ఓఎంఆర్ షీట్‌పై వైట్నర్ ఉపయోగిస్తే అనర్హులవుతారని తెలిపారు. టీఎస్ పీఎస్సీ నిబంధనలు ప్రతి అభ్యర్థి పాటించాలని పేర్కొన్నారు. -
నిధులు మంజూరైనా నిర్మాణంలో నిర్లక్ష్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మండలంలోని వివిధ గ్రామాలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో పనుల నిమిత్తం ఇంటి నుంచి పక్క గ్రామాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని నర్సాపూర్ వాగుపై బ్రిడ్జిని నిర్మించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అప్పటిప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో నర్సాపూర్‌తో పాటు బీరెల్లి గ్రామస్తులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బ్రిడ్జి నిర్మా ణం చేపట్టేందుకు ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని ముందుకు వచ్చిన ప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో పనులు ప్రారం భించలేదని స్థానికులు తెలిపారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అవతలి గ్రామాల్లోని పాఠశాలకు ఉపాధ్యాయులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఏటా ఇబ్బందులే – చింత సాంబయ్య, గ్రామస్తుడు, గోనెపల్లి జంపన్నవాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు ప్రతీ ఏటా వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు బాగా కురిసినప్పుడు గోనెపల్లి వాగు పొంగుతోంది. ఈ సమయంలో నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఎరువులు, వైద్య సేవల కోసం అవస్థలు పడుతున్నం. పదేళ్ల క్రితం వాగు వరద దాటుతూ గ్రామానికి చెందిన ఒకరు నీటిలో మునిగి చనిపోయారు. వాగు ఉధృతి తగ్గే వరకు బయటి ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం. అధికారులు తక్షణమే గోనెపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలి. అధికారుల అలసత్వంతోనే తిప్పలు – ఈసం సమ్మయ్య, గ్రామస్తుడు, ఎల్లాపూర్ నర్సాపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగుతుండడంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు పడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా పినపాక మండలానికి వెళ్తున్నాం. వర్షాలు తగ్గిన వెంటనే బ్రిడ్జి నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
అడ్డొస్తే అంతే..
మంత్రి ఇలాకాలోనే అధికారులపై దాడులు జిల్లావైపు కన్నెతి చూడని అమాత్యుడు ఓ డీఎస్పీ ‘మామూలు’ రూ.8 లక్షలపైనే ! ప్రత్యేక సమయంలోనే రవాణా కరీంనగర్ క్రైం : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నాయకులు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇసుక స్మగ్లర్లు దేనికైనా బరితెగిస్తున్నారు. ఏకంగా అధికారులపై దాడులకు దిగుతున్నారు. ఓపక్క ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ఇసుక స్మగ్లర్లు రవాణా శాఖ అధికారులపై దాడికి యత్నించడం గమనార్హం. మరోవైపు పోలీసుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుందనే ఆరోపణలున్నాయి. జిల్లావైపు చూడని మంత్రి... జిల్లాకు చెందిన మంత్రి కేటీఆర్ మూడునెలల క్రితం మైనింగ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఇంటిలెజెన్స్ ద్వారా సమాచారం సేకరించిన ఆయన అక్రమాలకు ఊతం ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలు పంపారు. ఇసుక అక్రమ వ్యవహారంలో మహబూబ్‌నగర్ మైనింగ్ ఏడీగా పనిచేస్తున్న కృష్ణప్రతాప్పై సస్పెన్షన్ వేటువేశారు. అయితే సొంత జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్‌కు రవాణా అవుతున్న ఇసుకలో 80శాతం కరీంనగర్ నుంచే వెళ్తోంది. వీటిలో 45శాతం అక్రమంగా రవాణా అవుతోంది. నిబంధనల ప్రకారం ఒక్క ఇసుక క్వారీ నిర్వహించడం లేదు. పైగా క్వారీ దక్కించుకున్న వారిలో చాలామంది అధికార పార్టీకి చెందిన నాయకులే ఉండడం గమనార్హం. దీంతోనే మంత్రి జిల్లాపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కోట్ల విలువైన సహజ సంపద తరలిపోతోంది. ఏకంగా మంత్రి నియోజకవర్గంలోనే ఇసుక మాఫియా రవాణాశాఖ అధికారులపై దాడులకు దిగడం స్మగ్లర్ల బరితెగింపునకు నిదర్శనం. నిబంధనలు గాలికి... ఇసుక రీచ్‌లు వేలంవేసే సమయంలో నిబంధనలు అమలుచేసే బాధ్యతను టీఎంఎన్డీసీకి అప్పగించారు. ఇసుక రవాణాలో పాదర్శకంగా అమ్మకాలు చేయడానికి పలు అంశాలను అందులో పొందుపర్చారు. అయితే వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై నిబంధనలను గాలికొదిలేశారు. ఇసుక క్వారీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రతీ లారీకి జీపీఎస్ ట్రాకర్లు అమర్చడం, చెక్‌పోస్టుల్లో ప్రత్యేక రికార్డ్‌లు ఏర్పాటుచేయాలి. అయితే ఇంతవరకూ ఏ ఒక్క క్వారీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల ఏర్పాటుచేసినా పనిచేయకుండా చేశారనే విమర్శలున్నాయి. రోజు జిల్లా నుంచి సుమారు 300 లారీల ఇసుక హైదరాబాద్‌కు రవాణా అవుతోంది. ఇందులో 60 శాతం వరకూ అక్రమంగా తరలిపోతోంది. ఇవన్నీ కూడా టీఎంఎన్డీసీ, పోలీసులు, మైనింగ్ అధికారులకు తెలిసినా వారు మాముళ్ల మత్తులో జోగుతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఓ డీఎస్పీ వాటా రూ.8 లక్షలు..! జిల్లాలో ఇసుక క్వారీలు అధికంగా ఉన్న ప్రాంతంలో పనిచేస్తున్న ఓ డీఎస్పీకి ఇసుక అక్రమ రవాణాదారులు ప్రతీనెల రూ.8 లక్షలపైనే ముట్టజెబుతున్నారు. సదరు డీఎస్పీ నియంత్రణలో ఉన్న సుమారు 60 టిప్పర్లు రోజూ తెల్లవారుజామున ఓ ప్రత్యేక సమయంలో వెళ్లిపోతాయని సమాచారం. వాటి నంబర్లతో సహా చెక్‌పోస్టులో ఉండడంతో ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణా సాగిపోతోందని సమాచారం. గతంలో పలువురు పోలీస్ సిబ్బంది కూడా వీటిని పర్యవేక్షించారని తెలిసింది. ఉన్నతాధికారులు మాత్రం ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటూ వారిపై బదిలీ వేటు వేసి దూరప్రాంతాలకు పంపించారు. అయితే సదరు డీఎస్పీ, సీఐలపై చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఇసుక క్వారీల ఉన్న ప్రాంతంలో ఉన్న పోలీస్స్టేషన్లు, సీఐలకు ఓవర్‌లోడు, అనుమతి లేకుండా రవాణా అవుతున్న ఒక్కో లారీకి నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తున్నారని తెలిసింది. పోలీసు అధికారులు కనుసన్నల్లోని చెక్‌పోస్టుల నుంచి ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణాచేస్తున్నారని తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపడితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశముంది. దాడులకు వెనుకాడని మాఫియా... ఇసుక అక్రమ రవాణాకు అడ్డువస్తున్న వారికి మొదట డబ్బులు ఎరవేయడం... లేదంటే దాడులు చేయడానికి కూడా వెనుకాడడంలేదు. నిబంధనల ప్రకారమే ఇసుక రవాణా చేస్తున్నామని చెప్పుకుంటున్న క్వారీల కాంట్రాక్టర్లు మరి అధికారులపై దాడులు ఎందుకు చేస్తున్నారనేది ప్రశ్న. ఇసుక రవాణా విషయంలో పోలీస్‌శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అధికారులు స్పందించి కఠినంగా వ్యవహరిస్తేనే ఈ దందాకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దూకుడుగా మైనింగ్ విజిలెన్స్ ఓ వైపు సిబ్బంది కొరత ఉన్నా మైనింగ్ విజిలెన్స్ దూకుడుగా వ్యవహరిస్తోంది. రోజు ఎక్కడో ఒకచోట అక్రమంగా ఇసుకరవాణా చేస్తున్న లారీలను అధికారులు పట్టుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే వాటికి రూ.50వేలు, రెండోసారి రూ.లక్ష జరిమానా విధిస్తున్నారు. 2015–16లో కేవలం ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని రూ.61.87లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు. వీరికి మరింత సిబ్బందిని మరిన్ని అధికారాలు ఇస్తే ఆదాయం పెరగడంతోపాటు అక్రమ రవాణా తగ్గుతుంది. -
బరితెగించిన ఇసుక స్మగ్లర్లు
- రవాణా అధికారులపై దాడికి యత్నం.. - పరుగులు పెట్టిన అధికారులు సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బుధవా రం తెల్లవారుజామున ఇసుక స్మగ్లర్లు మోటారు వాహన తనిఖీ అధికారుల (ఎంవీఐ) పైనే దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో రవాణాశాఖ అధికారులు పరుగులు తీశారు. కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆదేశాల మేరకు ఏఎంవీఐ అధికారులు సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై ఇసుక లారీలను తనిఖీ చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 3 లారీలను పట్టుకుని సీజ్ చేశారు. జిల్లెల్ల వద్ద అనుమతి లేకుండా ఇసుక లారీలు జేసీబీతో లోడ్ అవుతున్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లేం దుకు అధికారులు సిద్ధపడగా.. దాదాపు 25 మంది స్మగ్లర్లు అధికారుల వాహనాన్ని చుట్టుముట్టారు. అధికారులు వాహనం దిగగానే.. స్మగ్లర్లు దూషిస్తూ దాడికి యత్నించారు. దీంతో అధికారులు వెంటనే వాహనం లో సిద్దిపేట వైపు ముందుకెళ్లారు. ఇసుక స్మగ్లర్లు కార్లు, బైక్‌లపై అధికారులను వెంబ డిస్తూ.. వారి వాహనాన్ని ఓవర్ టేక్ చేసి దాడికి యత్నించినట్లు సమాచారం. కాగా, అధికారులు రక్షణ కోసం 100కు ఫోన్ చేశారు. సిద్దిపేట, చిన్నకోడూరు పోలీస్‌స్టేష న్లకు హైదరాబాద్ నుంచి సమాచారం అందడంతో పెట్రోలింగ్ పోలీసులు ఎంవీఐ అధికారులను కలి శారు. సంఘటన సిరిసిల్ల పోలీస్‌స్టేషన్ పరిధి లో జరిగినట్లు తేల్చడంతో ఏఎంవీఐ సంతోష్‌రెడ్డి బుధవారం సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ఎస్పీ డేవిస్ జోయల్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఓవర్టేక్ చేయబోరుు కారు డ్రైవర్ మృతి సిరిసిల్ల మండలం జిల్లెల్ల శివారులో బుధవారం తెల్లవారుజామున కారు చెట్టుకు ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన ఎండీ.అబూస్ అలీఫ్ లారీల యజమాని. సిరిసిల్ల మానేరు వాగు నుంచి ఇసుకను లారీల్లో తరలిస్తుం టారు. ఇసుక లారీల వెంట సిద్దిపేట వైపు వెళ్తుండగా జిల్లెల్ల శివారులో అలీఫ్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఎండీ.రిజ్వాన్(23) మరణించాడు. అబూస్ అలీఫ్ గాయపడగా ఆస్పత్రికి తరలించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌కు చెందిన రిజ్వాన్ ఎంబీఏ చేసి సిద్దిపేటలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇసుక లారీల పర్మిట్లు, ఓవర్‌లోడ్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఎంవీఐల వాహనాన్ని వెంబడించి ఓవర్టేక్ చేయబోగా జిల్లెల్ల శివారులో కారు రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులు భావిస్తున్నారు. ఎంవీ ఐల వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి చెట్టుకు ఢీకొన్నట్లు సమాచారం. -
హైవేపై గమ్మత్తుగా..
జిల్లా మీదుగా విచ్ఛలవిడిగా గంజాయి రవాణా దొరికితేనే దొంగ.. లేకపోతే కాసుల వర్షమే.. ఇటీవల కాలంలో ఎక్కువైన సరుకు తరలింపు గంజాయి వ్యాపారం అక్రమార్కులను అడ్డదారిలో అందలమెక్కిస్తోంది. ఒడిశా–విశాఖ సరిహద్దుల్లో ఎక్కువగా పండించే ఈ పంటను రాష్ట్రాల హద్దులు దాటిస్తే.. వారి పంట పండినట్టే. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల విలువైన గంజాయి రవాణాకు 16వ నంబరు జాతీయ రహదారి రాచమార్గంగా మారింది. పోలీసులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. – జగ్గంపేట జిల్లాలో తుని నుంచి మొదలు రావులపాలెం వరకూ హైవేపైన, ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి యథేచ్ఛగా రవాణా అవుతోంది. తాజాగా కడియం మండలం జేగురుపాడులో లారీ, వ్యాన్లపై భారీఎత్తున తరలిస్తున్న గంజాయి పట్టుబడడం పోలీసు వర్గాలనే విస్మయపరిచింది. సుమారు నాలుగు టన్నుల వరకున్న ఈ సరుకు విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. గంజాయి సాగు, రవాణా తీరిది తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధిలో గంజాయిని విరివిగా పండిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కుర్మనూరు, నిమ్మనూరు, రాశిబేడ, గిల్లమడుగు, సన్యాసిగూడ, అల్లూరుకోట, గుర్రలూరు, దంతుగూడ, పప్పులూరు ప్రాంతాల్లో ఏటా రెండు విడతలుగా గంజాయి పండిస్తున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు మొదటి పంట, డిసెంబర్ నుంచి మే నెల వరకు రెండో పంటను పండిస్తారు. ఆంధ్రా, తెలంగాణతో పాటు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులకు ప్రలోభాలకు గురిచేసి, ముందుగా పెట్టుబడులు పెట్టి గంజాయి పండించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో శీలావతి, కాడ, కల్లి అనే మూడు రకాల గంజాయిని పండించేవారు. కాలక్రమంలో కాడ, కల్లి రకాలకు ధర లేకపోవడంతో, ప్రస్తుతం శీలావతి గంజాయిని మాత్రమే పండిస్తున్నారు. పండిన గంజాయిని మిషన్ల ద్వారా 2, 5, 10 కిలోల చొప్పున ప్యాకెట్లు, బస్తాల్లో నింపి, ఒడిశా, తూర్పుగోదావరి సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న సీలేరు నది మధ్య ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్ వద్దకు చేరుస్తారు. అక్కడి నుంచి ఆర్డర్‌పై విశాఖ జిల్లా సీలేరు, తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి నడుమనున్న రహదారి వద్దకు తరలిస్తారు. అక్కడి నుంచి గంజాయిని కావళ్ల ద్వారా కాలినడకన చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి, లక్కవరం జంక్షన్ల వద్దకు తరలిస్తారు. అనంతరం గంజాయిని వాహనాల ద్వారా చింతూరు, భద్రాచలం మీదుగా విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు తరలిస్తుంటారు. క్షేత్రస్థాయిలో కిలో గంజాయి రూ.200 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు, దానిని స్మగ్లింగ్ మార్కెట్‌కు తరలించే సరికి కిలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తారు. పోలీసుల పాత్రే కీలకం గంజాయి రవాణాను అడ్డుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉండగా, ఏజెన్సీలో ఎక్కడా ఆ శాఖ అధికారులు గంజాయిని పట్టుకున్న దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో గంజాయిని పట్టుకోవడంలో పోలీసు శాఖ ప్రధానపాత్ర పోషిస్తోంది. గంజాయి రవాణాపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు తమ కొరియర్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ గుట్టు లాగి, నిందితులను పట్టుకున్నారు. ప్రలోభాలకు గురై.. గంజాయి రవాణా సమయంలో పట్టుబడుతున్న నిందితులంతా కేవలం కొద్దిపాటి సొమ్ము కోసం రవాణా చేసేందుకు ప్రలోభాలకు గురైనవారే. అసలు నిందితులైన బడా స్మగ్లర్లు మాత్రం దర్జాగా తప్పించుకుంటున్నారు. గంజాయిని పండిస్తున్న ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధి అంతా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలీసులు, అధికారుల నిఘా తక్కువగా ఉండడంతో, గంజాయి సాగు విరివిగా సాగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న స్మగ్లర్లు ఈప్రాంత గిరిజనులకు డబ్బు ఆశచూపి, గంజాయి సాగు చేయిస్తున్నారు. వినూత్న పద్ధతులు గంజాయి రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లు రవాణా కోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. వాహనాల్లో పలు మార్పులు చేసి, తాము పట్టుబడకుండా తప్పించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తవుడు, ధాన్యం, కలప అడుగున గంజాయి ప్యాకెట్లు పెట్టి రవాణా చేయడం పాత పద్ధతి. ఇప్పుడు వాహనాల అడుగు భాగంలో అరలుగా తయారు చేసి, అందులో గంజాయిని పెట్టడం, జీపులు, కార్లలో సీలింగ్‌కు అటకలా తయారుచేసి, అందులో గంజాయి పేర్చి రవాణా చేయడం పరిపాటిగా మారింది. చిన్నపాటి స్మగ్లర్లు గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి, నడుముకు కట్టుకుని రవాణా చేస్తున్నారు. హైవేపై ప్రత్యేక నిఘా జాతీయ రహదారిపై గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రత్యేక బృందాన్ని నియమించాం. కోటనందూరు, తుని రైల్వే స్టేషన్, కత్తిపూడి సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. గస్తీలో మొబైల్ చెకింగ్ చేస్తున్నాం. – రాజశేఖర్, డీఎస్పీ, పెద్దాపురం -
బల్లకట్టుపై జీరో దందా..!
ఆంధ్రా నుంచి మట్టపల్లి బల్లకట్టు మీదుగా హుజూర్‌నగర్‌కు వంటనూనె ప్యాకెట్లతో ప్రయాణిస్తున్న వాహనాన్ని ఇటీవల మట్టపల్లి పోలీసులు పట్టుకుని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్పారు. సదరు వాహన డ్రైవర్‌ను ప్రశ్నించగా కొంతకాలంగా తాము అనుమతి లేకుండా నూనె ప్యాకెట్లతో పాటు తదితర వస్తువులను బల్లకట్ల మీదుగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇలా వంట నూనె ప్యాకెట్లతో పాటు నిషేధిత వస్తువులు, పన్నులు ఎగవేసేందకు వాహనాల తరలింపునకు సైతం బల్లకట్లు దోహదపడుతున్నాయని తెలుస్తోంది. – హుజూర్నగర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్లు అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయి. తెలంగాణ– ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గల కృష్ణానదిపై ప్రయాణికుల రాకపోకలకు నియోజకవర్గంలోని మట్టపల్లి, చింతిర్యాల, బుగ్గమాదారంల వద్ద బల్లకట్లు తిప్పుతున్నారు. అయితే ప్రయాణికులను మాత్రమే ఇరువైపులా దాటించాల్సిన బల్లకట్లు అక్రమ సరుకులు, ఇతర ట్రాన్స్‌పోర్టులకు సంబంధించిన జీరో దందాకు సహకరిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్లకట్ల మీదుగా పీడీఎస్ బియ్యం, గుట్కాలు, మద్యం, నల్లబెల్లం వంటి నిషేధిత సరుకుల రవాణా జరుగుతున్నాయని తెలిసింది. అయితే సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అంతేగాక సన్న బియ్యం, పత్తి, మిర్చి, ధాన్యం, సిమెంట్, క్లింకర్లతో పాటు పలు రసాయనాలను కూడా ఈ బల్లకట్ల మీదుగా సరిహద్దులు దాటిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పలు రకాల పన్నులను ఎగవేస్తున్నారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా సరిహద్దు ప్రాంతాలైన కృష్ణానది పరివాహక గ్రామాల ప్రధాన రహదారులపై ఎలాంటి చెక్‌పోస్టుల ఏర్పాటు లేకపోవడంతో అక్రమ రవాణాదారుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. బల్లకట్ల నిర్వాహకులు సంపాదనే ధ్యేయంగా ఎటువంటి వస్తువుల రవాణానైనా సరిహద్దులు దాటిస్తుండటంతో ఈ అక్రమవ్యాపారాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనలకు విరుద్ధంగా బల్లకట్లు రాత్రివేళలో కూడా యథేచ్ఛగా నడుపుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బల్లకట్ల నిర్వహణ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నడపాల్సి ఉన్నప్పటికీ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కిష్ణపట్టె ప్రాంతాలైన దొండపాడు,మట్టపల్లి, చింతిర్యాల వద్ద ప్రధాన రహదారిపై మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడితే ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రా సరిహద్దులను దాటి రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అనుమతులు తప్పనిసరి కావడంతో సదరు అనుమతుల కోసం చెల్లించాల్సిన వేలాది రూపాయల బోర్డర్ ట్యాక్స్‌ను ఎగ్గొడుతూ బల్లకట్ల మీదుగా ప్రయాణిస్తున్నారు. అంతేగాక జాతీయ రహదారిపై గల కోదాడ మండలంలోని నల్లబండగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రెడ్లకుంట, కాపుగల్లు, గుడిబండ వద్ద నుంచి జగ్గయ్యపేట, దొండపాడు, మల్లారెడ్డిగూడెం మీదుగా గల రహదారుల ద్వారా ఆంధ్రాప్రాంతానికి చెందిన అనేక ట్రాన్స్‌పోర్టులకు చెందిన ఆంధ్రా వాహనాలు ఆయా బల్లకట్లకు చేరుకొని సరిహద్దులు దాటిస్తున్నారు. ఎటువంటి పన్నులు చెల్లించకుండానే సరిహద్దులు దాటుతుండటంతో బల్లకట్లపై ట్రాన్స్‌పోర్టు వాహనాల ప్రయాణం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా బల్లకట్ల సమీపంలో గల ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
బల్లకట్టుపై జీరో దందా..!
ఆంధ్రా నుంచి మట్టపల్లి బల్లకట్టు మీదుగా హుజూర్‌నగర్‌కు వంటనూనె ప్యాకెట్లతో ప్రయాణిస్తున్న వాహనాన్ని ఇటీవల మట్టపల్లి పోలీసులు పట్టుకుని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్పారు. సదరు వాహన డ్రైవర్‌ను ప్రశ్నించగా కొంతకాలంగా తాము అనుమతి లేకుండా నూనె ప్యాకెట్లతో పాటు తదితర వస్తువులను బల్లకట్ల మీదుగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇలా వంట నూనె ప్యాకెట్లతో పాటు నిషేధిత వస్తువులు, పన్నులు ఎగవేసేందకు వాహనాల తరలింపునకు సైతం బల్లకట్లు దోహదపడుతున్నాయని తెలుస్తోంది. – హుజూర్నగర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్లు అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయి. తెలంగాణ– ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గల కృష్ణానదిపై ప్రయాణికుల రాకపోకలకు నియోజకవర్గంలోని మట్టపల్లి, చింతిర్యాల, బుగ్గమాదారంల వద్ద బల్లకట్లు తిప్పుతున్నారు. అయితే ప్రయాణికులను మాత్రమే ఇరువైపులా దాటించాల్సిన బల్లకట్లు అక్రమ సరుకులు, ఇతర ట్రాన్స్‌పోర్టులకు సంబంధించిన జీరో దందాకు సహకరిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్లకట్ల మీదుగా పీడీఎస్ బియ్యం, గుట్కాలు, మద్యం, నల్లబెల్లం వంటి నిషేధిత సరుకుల రవాణా జరుగుతున్నాయని తెలిసింది. అయితే సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అంతేగాక సన్న బియ్యం, పత్తి, మిర్చి, ధాన్యం, సిమెంట్, క్లింకర్లతో పాటు పలు రసాయనాలను కూడా ఈ బల్లకట్ల మీదుగా సరిహద్దులు దాటిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పలు రకాల పన్నులను ఎగవేస్తున్నారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా సరిహద్దు ప్రాంతాలైన కృష్ణానది పరివాహక గ్రామాల ప్రధాన రహదారులపై ఎలాంటి చెక్‌పోస్టుల ఏర్పాటు లేకపోవడంతో అక్రమ రవాణాదారుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. బల్లకట్ల నిర్వాహకులు సంపాదనే ధ్యేయంగా ఎటువంటి వస్తువుల రవాణానైనా సరిహద్దులు దాటిస్తుండటంతో ఈ అక్రమవ్యాపారాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనలకు విరుద్ధంగా బల్లకట్లు రాత్రివేళలో కూడా యథేచ్ఛగా నడుపుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బల్లకట్ల నిర్వహణ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నడపాల్సి ఉన్నప్పటికీ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కిష్ణపట్టె ప్రాంతాలైన దొండపాడు,మట్టపల్లి, చింతిర్యాల వద్ద ప్రధాన రహదారిపై మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడితే ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రా సరిహద్దులను దాటి రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ట్రాన్స్‌పోర్టు వాహనాలకు అనుమతులు తప్పనిసరి కావడంతో సదరు అనుమతుల కోసం చెల్లించాల్సిన వేలాది రూపాయల బోర్డర్ ట్యాక్స్‌ను ఎగ్గొడుతూ బల్లకట్ల మీదుగా ప్రయాణిస్తున్నారు. అంతేగాక జాతీయ రహదారిపై గల కోదాడ మండలంలోని నల్లబండగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రెడ్లకుంట, కాపుగల్లు, గుడిబండ వద్ద నుంచి జగ్గయ్యపేట, దొండపాడు, మల్లారెడ్డిగూడెం మీదుగా గల రహదారుల ద్వారా ఆంధ్రాప్రాంతానికి చెందిన అనేక ట్రాన్స్‌పోర్టులకు చెందిన ఆంధ్రా వాహనాలు ఆయా బల్లకట్లకు చేరుకొని సరిహద్దులు దాటిస్తున్నారు. ఎటువంటి పన్నులు చెల్లించకుండానే సరిహద్దులు దాటుతుండటంతో బల్లకట్లపై ట్రాన్స్‌పోర్టు వాహనాల ప్రయాణం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా బల్లకట్ల సమీపంలో గల ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
అక్రమార్కులపై క్రిమినల్ కేసులు?
నగరంపాలెం : రవాణాశాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రవాణా శాఖ తరఫున కీలకంగా వ్యవహరించిన మంగళగిరి మోటరు వెహికల్ ఇన్స్పెక్టరు శివనాగేశ్వరావును ఇప్పటికే సెలవుపై పంపారు. జిల్లా రవాణా శాఖలో మంగళగిరి పరిధిలో లారీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో సోమవారం రాత్రి నుంచి జిల్లా ఉపరవాణా కమిషనర్ జీసీ రాజారత్నం ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. వాహనాలు విజయవాడలోని జాస్పర్ కంపెనీలో కొనుగోలు చేసినట్లు, అక్కడి ఆటోనగర్‌లోని కరుణామయా వర్క్‌షాపులో బాడీ బిల్డింగ్ చేసినట్లు పత్రాలు ఉండటంతో మంగళవారం, బుధవారం డీటీసీ విజయవాడలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటీకే వాహనాల రిజిస్ట్రేషన్‌కు కేటాయించిన 27 నంబర్లను ఆధికారులు రద్దు చేశారు. జరిగిన సంఘటనపై జాస్పర్ కంపెనీ వైస్ చైర్మన్‌ను విచారించారు. డీలరుకు సంబంధించిన గోడౌన్‌లోని కీ ఇన్వాయిస్, అవుట్ గోయింగ్ రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీ బిల్డింగ్ చేసినట్లు బిల్లులు ఇచ్చిన వర్క్‌షాపు యజమానులను విచారించి నివేదికను విచారణాధికారి డీటీసీ రాజారత్నం రవాణా కమిషనర్‌కు అందించనున్నారు. దీనిపై పూర్తి వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకునేందుకు గురువారం రవాణాశాఖ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం విజయవాడ రానున్నారు. బ్యాంకు పాస్‌బుక్ ద్వారా రిజిస్ట్రేషన్లు వాహనాల రిజిస్ట్రేషన్లు సాధారణంగా వాహనదారుల చిరునామా ప్రకారం ఆ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాల్లో చేస్తారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు చిరునామ ధ్రువపత్రాలను బ్యాంకు అకౌంట్ల ద్వారా సృష్టించారు. మంగళగిరిలోని 5-649.బి కొప్పురావు కాలనీ ఇంటి చిరునామాతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో అకౌంట్లు ప్రారంభించి పాస్‌బుక్‌లు పొందిన వాహన యజమానులు వాటి ద్వారా రిజిస్ట్రేషన్లు మంగళగిరి ఎంవీఐ కార్యాలయంలో చేయించారు. రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఎంవీఐకు మధ్యవర్తులకు రూ.లక్షల్లోనే మామూళ్లు అందినట్లు సమాచారం. పూర్తి నివేదిక తర్వాత ఎంవీఐపై శాఖపరమైన చర్యలతోపాటు, వాహన డీలర్లు, బాడీ బిల్డింగ్ యజమానులు, వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న యజమానులపై క్రిమినల్ కేసులూ నమోదు చేయనున్నట్లు సమాచారం. మోటారు వెహికల్ ఇన్చార్జి అధికారిగా బాలకృష్ణ మంగళగిరి : విజయవాడకు చెందిన పొట్లూరి ఆనంద్, రవిశంకర్, ఈనెల రవీంద్రనాథ్, జూపల్లి పద్మావతితో పాటు మంగళగిరి మండలం నూతక్కి చెందిన వెలిశెట్టి లక్ష్మీనారాయణకు ఇండియన్ ఆయిల్ కంపెనీలో చమురు సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు వాహనాలు అవసరమయ్యాయి. దీంతో విజయవాడ జాస్వర్ ఇండస్ట్రీస్ వద్ద 27 వాహనాలు కొనుగోలు చేసినట్లు బిల్లులు తీసుకున్నారు. ఆ వాహనాలకు కావాల్సిన బిల్లులు, సర్టిఫికేట్లు తీసుకుని మధ్యవర్తి ద్వారా శివనాగేశ్వరరావును కలిసినట్లు తెలుస్తోంది. సెలవుపై వెళ్లిన మంగళగిరి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శివనాగేశ్వరరావు స్థానంలో గుంటూరుకు చెందిన అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జేటీసీ విచారణ విజయవాడ : రవాణా శాఖలో వెలుగు చూసిన కుంభకోణంపై జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రసాదరావు విచారణ జరిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఆశాఖ అధికారులు స్పందించారు. బుధవారం జేటీసీ ప్రసాదరావు విజయవాడలో జాస్పర్ ఇండస్ట్రీస్ కార్యాలయానికి వెళ్లి 27 లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారించారు. వాహనాలకు సంబంధించిన ఇన్వాయిస్, ఇతర వివరాలను సేకరించారు. లారీల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలపై ఆయన కంపెనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలు బాడీలు నిర్మించారా లేదా అనే సమాచారాన్ని కూడా ఆయన సేకరించారు. -
లెసైన్సు లేకుండా నడిపితే బండి జఫ్తు
ఇప్పటి వరకు 6900 డ్రైవింగ్ లెసైన్స్‌లు సస్పెన్షన్ రహదారి భద్రతా నిబంధనలు మరింత కఠినతరం సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఆదేశాలతో ఆర్టీఏ చర్యలు సిటీబ్యూరో: రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించేవారిపై రవాణాశాఖ మరోసారి కొరడా ఝళిపించింది. వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6900లకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌లు సస్పెండ్ చేసింది. లెసైన్సులపై సస్పెన్షన్ కొనసాగుతున్నా.. లెక్కచేయకుండా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటివారి లెసైన్సులు రద్దు చేయడంతో పాటు తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు కే సులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాలని నిర్ణయించింది. రోడ్డు భద్రతా నిబంధనల అమలు పర్యవేక్షణపై సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ ఆదేశాల మేరకు రవాణాశాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటి వరకు పోలీసుల నుంచి అందిన వివరాల మేరకు రవాణా అధికారులు రంగారెడ్డి జిల్లా పరిధిలో 6 వేలు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 900 డ్రైవింగ్ లెసైన్సులను సస్పెండ్ చేశారు. మూడు నెలల పాటు ఈ తాత్కాలిక నిలుపుదల అమల్లో ఉంటుంది. ఆ నాలుగు కీలకం.... మద్యం తాగి వాహనాలు నడిపినా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా లెసైన్సులపై వేటు పడుతుంది. అలాగే అధిక వేగం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం వంటి ఉల్లంఘనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ నాలుగు రకాల ఉల్లంఘనల కారణంగానే దే శవ్యాప్తంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. సాధికార కమిటీ ఆదేశాల మేరకు పోలీసులు, రవాణాశాఖ కార్యాచరణ చేపట్టారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో డ్రైవింగ్ లెసైన్సులను తాత్కాలికంగా నిలుపుదల చేయడమే కాకుండా, సస్పెన్షన్ టైమ్‌లో తిరిగి రోడ్డెక్కకుండా వారిపై నిఘా పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుండటంతో నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. నిరంతర సమీక్ష... రోడ్డు భద్రతా నిబంధనల అమల్లో ప్రతి నెలా ఆర్టీఏ అధికారులు సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మూడు నెలలకు ఒకసారి న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు సాధికార కమిటీకి నివేదికను అందజేస్తారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అన్ని చోట్ల చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో డ్రైవింగ్ లెసైన్సులపై సస్పెన్షన్ విధించడం, అలాంటి ఉల్లంఘనులు మరోసారి రోడ్డెక్కకుండా నిఘా కొనసాగించడం ఇదే మొట్టమొదటిసారి అని హైదరాబాద్ జేటీసీ రఘునాథ్ అభిప్రాయపడ్డారు. చిన్నారి రమ్య మతి ఉదంతం నేపథ్యంలో రోడ్డు భద్రతా నిబంధనలు, లెసైన్సుల జారీని మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. -
ముంచెత్తుతున్న వానలు
జలదిగ్బంధంలో ఖమ్మం, వరంగల్ జిల్లా ఏజెన్సీలు సాక్షిప్రతినిధి, ఖమ్మం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం జిల్లాలో గురువారమూ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం 9 గంటల వరకు 32 మండలాల్లో 5 సెం.మీ పైగా వర్షం పడింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 3 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పాల్వంచ మండల పరిధిలోని ఎర్రచెరువుకు, బండ్రుగుండ చెరువుకు గండి పడింది. కొత్తగూడెం మండలం సింగభూపాలెం చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. కారుకొండ వద్ద లోలెవెల్ బ్రిడ్జీ సైడ్‌వాల్స్ కొట్టుకుపోవడంతో మరమ్మతులు ప్రారంభించారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో వర్షం కారణంగా 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సీతారాంపురం-ఆనందపురం గ్రామాల మధ్య రోడ్డుపై చప్టా తెగిపోవడంతో రాకపోకలు నిలిచాయి. మల్లెలమడుగు వద్ద రాజం పాపయ్య వాగు పొంగి సమీప గ్రామంలోని 15 రోడ్లు కోతకు గురయ్యాయి. గొందిగూడెం ఇసుకవాగు, బురదవాగు పొంగడంతో చుట్టుపక్కల 10 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గుండాల మండలంలో అంతర్గత రోడ్లు ధ్వంసం అయ్యాయి. బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం-సంజీవరెడ్డిపాలెం మధ్య రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రహదారులు జలమయం వరంగల్: వరంగల్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారుు.రవాణా వ్యవస్థ స్తంభించింది. భూపాలపల్లివాసులు పరకాల-వరంగల్ వచ్చే అవకాశం లేకుండాపోరుుంది. గణపురం సమీపంలోని మోరంచ వాగు ఉధృతి తగ్గకపోవడంతో వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయూరుు. సుమారు 200 గొర్రెలతో పాటు కాపరులు ఈ వాగులో చిక్కుకోగా, స్థానికులు వారిని రక్షించారు. 20 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయూరుు. భూపాలపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోరుుంది. గణపురం మండలం చెల్పూరు శివారు కుందయ్యపల్లి సమీపంలో కాజ్వే(బైపాస్‌రోడ్) కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయూరుు. ఈ రోడ్డుపై కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలు ఇరువైపులా కిలోమీటరు మేర నిలిచిపోయూరుు. ములుగు ఏజెన్సీని కూడా వర్షాలు ముంచెత్తారుు. కొండపర్తి-తాడ్వాయి మధ్య వట్టివాగు బ్రిడ్జి డైవర్షన్ రోడ్డు వరదల దాటికి తెగిపోయింది. దీంతో ఏటూరునాగారం-హన్మకొండ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏటూరునాగారం మండలం గోగుపల్లి ఊర చెరువు ఉధృతంగా ప్రవహించడంతో కల్వర్టుపై ఉన్న చప్టా(స్లాబ్) ధ్వంసమై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఇక ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్!
♦ వీడియో సెన్సర్ల ఆధారంగా సామర్ధ్య పరీక్షలు ♦ కేరళ తరహాలో అమలుకు రవాణాశాఖ సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: వీడియో ఆధారిత సెన్సర్లను వినియోగించడం ద్వారా శాస్త్రీయమైన పద్ధతిలో డ్రైవింగ్ సామర్ధ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ల తరహాలో తెలంగాణలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునీకరించనుంది. డ్రైవింగ్ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ప్రస్తుతం నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలోని డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు పరీక్షలు నిర్వహించి సామర్ధ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెం ట్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. దీంతో సరైన నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా డ్రైవింగ్ లెసైన్సులు వచ్చేస్తున్నాయి. నైపుణ్యం లేని డ్రైవర్లు రహదారి భద్రతకు సవాల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా పారదర్శకంగా నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారుల బృందం కొద్ది రోజుల క్రితం కేరళకు వెళ్లి ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లను అధ్యయనం చేసింది. త్రివేండ్రమ్‌తో పాటు మరికొన్ని నగరాల్లో అమలవుతున్న ఈ పద్ధతిలో ఎంవీఐల జోక్యం ఉండదు. వీడియో సెన్సర్లే కీలకంగా పనిచేస్తాయి.ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఈ సెన్సర్లు నమోదు చేస్తాయి. ఈ కదలికల ఆధారంగా సదరు వ్యక్తి నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేస్తూ సర్టిఫికెట్ అందజేస్తారు. రవాణాశాఖ నిర్ధారించిన ప్రమాణాలకు విరుద్ధంగా వాహనాలు నడి పిన వారు ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్లు వస్తాయి. కచ్చితమైన నిఘా... ఇప్పటికే వివిధ రకాల పౌరసేవలను ఆన్లైన్ ద్వారా అమలు చేసేందుకు చర్యలు చేపట్టిన రవాణాశాఖ డ్రైవింగ్ పరీక్షల్లోనూ కేరళ తరహా విధానంపైన దృష్టి సారించింది. ప్రస్తుతం లెర్నింగ్ లెసైన్సు, డ్రైవింగ్ లెసైన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాల యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ వంటి అన్ని రకాల పౌరసేవల కోసం వినియోగదారులు నేరుగా ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా స్లాట్ సమోదు చేసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. డ్రైవింగ్ పరీక్షల్లో మాత్రం సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎంవీఐల పరిశీలనే ప్రధానంగా ఉంది. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వచ్చే వారు ఎలాంటి పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లెసైన్సులు పొందుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లు దోహదం చేస్తాయి. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లోనే వీడియో సెన్సర్లను ఏర్పాటు చేయడం ద్వారా కంఫ్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అభ్యర్ధులు వాహనం నడిపే తీరు, వేగం, వాహనం కండీషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తై ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి. అమలు దిశగా సన్నాహాలు... కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ అనే సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని కోరుతూ రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే అమలు చేయనున్నట్లు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ‘సాక్షి’తో చెప్పారు. -
రైతులను ముంచుతున్న కేంద్రం
► పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్ ► సమావేశంలో మాట్లాడుతున్న నరేష్‌జాదవ్ ఆదిలాబాద్ క్రైం : కేంద్ర ప్రభుత్వం రైతులను నిలువునా మంచుతోందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట రుణాలపై 3 శాతం ఉన్న ప్రీమియంను 5 శాతానికి పెంచి రైతులను మరింత దెబ్బతీస్తోందన్నారు. ఎన్నికల సమయంలో రైతులను ఆందుకుంటామని ప్రలోభాలు పలికిన కేంద్రం ప్రస్తుతం కార్పోరేట్ వ్యాపారులకు ప్రీమీయాన్ని తగ్గిస్తూ రైతులకు పెంచడం దారుణమన్నారు. ఆదిలాబాద్ పత్తికి ఎంతో డిమాండ్ ఉందని, గతంలో కేంద్ర ప్రభుత్వం పత్తిని ఇతర దేశాలకు ట్రాన్స్‌పోర్టు చేసేందుకు రాయితీ ఇచ్చేదని, ఇప్పుడు దానిని ఎత్తివేయడంతో ఆభారం తమపై ఎక్కడ పడుతుందనే ఉద్దేశంతోనే పత్తిసాగు చేయకూడదని ముఖ్యమంత్రి చెబుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చెర్మైన్లు సంజీవ్‌రెడ్డి, నర్సింగ్‌రావు, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, పట్టణ అధ్యక్షుడు షకీల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అలాల్ అజయ్, మున్సిపల్ మాజీ చెర్మైన్ దిగంబర్‌రావు పాటిల్ తదితరులు ఉన్నారు. -
ఇక అంతా ఆటోమెటిక్
♦ సిటీలో కొత్త డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు! ♦ కేరళ తరహాలో వీడియో సెన్సర్ల ఏర్పాటు ♦ అమలు దిశగా రవాణాశాఖ సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: వీడియో ఆధారిత సెన్సర్లను వినియోగించడం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ల తరహాలో నగరంలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునికీకరించనుంది. డ్రైవింగ్ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చెల్‌లోని డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. దీంతో సరైన నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా లెసైన్సులు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారుల బృందం కొద్ది రోజుల క్రితం కేరళలోని ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లను అధ్యయనం చేసింది. అక్కడి పద్ధతిలో ఎంవీఐల జోక్యం ఉండదు. వీడియో సెన్సర్లు కీలకంగా పనిచేస్తాయి. ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఈ సెన్సర్లు నమోదు చేస్తాయి. ఈ కదలికల ఆధారంగా సదరు వ్యక్తి నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేసి సర్టిఫికెట్ ఇస్తారు. రవాణాశాఖ నిర్ధారించిన ప్రమాణాలకు విరుద్ధంగా వాహనాలు నడి పిన వారు ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్లు వస్తాయి. అమలు దిశగా సన్నాహాలు.. కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని కోరుతూ రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ‘సాక్షి’తో చెప్పారు. కచ్చితమైన నిఘా.. ప్రస్తుతం లెర్నింగ్ లెసైన్సు, డ్రైవింగ్ లెసైన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాల యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ వంటి పౌరసేవల కోసం వినియోగదారులు ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే వివిధ రకాల సేవల కోసం ఈ సేవ కేంద్రాల్లోనూ, ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించే పద్ధతి అందుబాటులోకి తెచ్చారు. డ్రైవింగ్ పరీక్షల్లో మాత్రం సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎంవీఐల పరిశీలనే ప్రధానంగా ఉంది. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారు ఎలాంటి పరీక్షలు లేకుండానే లెసైన్సులు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లు దోహదం చేస్తాయి. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లోనే వీడియో సెన్సర్లను ఏర్పాటు చేయడం ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు వాహనం నడిపే తీరును సెన్సర్ల ద్వారా పరిశీలించి పాస్, ఫెయిల్‌ను నిర్థారిస్తారు. -
పార్టీలోకొచ్చి.. పండుగ చేస్కోండి
► కొనసాగుతున్న టీడీపీ ప్రలోభపర్వం ► రాయదుర్గం నియోజకవర్గంలో మితిమీరిన ఆగడాలు అనంతపురం : టీడీపీ ప్రలోభపర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రత్యర్థి పార్టీ శ్రేణులను లాక్కోవడమే ధ్యేయంగా ఎంతకైనా బరి తెగిస్తోంది. ‘పార్టీలోకి రండి.. పండుగ చేస్కోండి’ అన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు రూ.కోట్లు కుమ్మరించి పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు కేడర్‌ను కూడా ప్రలోభపెడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో అయితే మరీ బరి తెగించారు. డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలోకి వస్తే ఇసుకను కర్ణాటకలో విక్రయించేందుకు, ఇనుప ఖనిజం అక్రమ రవాణాకు తోడ్పడతామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. గ్రామంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. గ్రామసమీపంలో ఉన్న ఇనుప గనుల్లో అక్రమంగా ఖనిజాన్ని తవ్వుకుని బీఐఓపీ పరిశ్రమకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు అవకాశం కల్పిస్తామని ఆశలు పెట్టారు. అలాగే బీఐఓపీలో ట్రాన్స్‌పోర్టును పార్టీలోకి వచ్చిన వారికే ఇచ్చేలా ఎస్కే మోదీ ( ఆ కంపెనీ ఎండీ)తో ఒప్పందం చేయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ తరపున అభివృద్ధి పనులు ఇస్తామని, పనులు చేయకపోయినా బిల్లులు వచ్చేలా చూస్తామంటూ..ఇలా పలురకాలుగా ప్రలోభపెడుతున్నారు. -
మనకే అధిక నిధులు
♦ ప్రభుత్వం నుంచి జిల్లాకే కేటాయింపులు ఎక్కువ ♦ రోడ్లు, పంచాయతీరాజ్ పనులకు రూ.2,200 కోట్లు ♦ విలేకరుల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు జిల్లాకే దక్కుతున్నాయని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్లో ఎక్కువ నిధులు జిల్లాకే వచ్చాయని, ఈసారి కూడా అదేస్థాయిలో రాబట్టి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులు, భవనాల విభాగానికి ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించగా.. అందులో రూ.1,400కోట్లు జిల్లాకే కేటాయించిందని, పంచాయతీరాజ్ విభాగానికి రూ.5వేల కోట్లు కేటాయించగా.. అందులో రూ.800 కోట్లు జిల్లాకు మంజూరు చేసిందన్నారు. అన్ని విభాగాల్లోనూ జిల్లాకు ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానన్నారు. బీజాపూర్ -హైదరాబాద్ రహదారికి జాతీయ గుర్తింపు రావడంలో ప్రభుత్వ కృషి ఎంతో ఉందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలుమార్లు ఈ అంశంపై ఒత్తిడి తేవడంతో ప్రతిఫలం దక్కిందన్నారు. దాదాపు రూ.1,300 కోట్లతో ఈ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వివరించారు. దీంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం కలగనుందని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని, పశ్చిమ ప్రాంతానికి సాగునీరందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందన్నారు. డిండి ప్రాజెక్టు నుంచి కూడా జిల్లాలోని తూర్పు ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించనున్నట్లు ఆయన వివరించారు. గతేడాది డబుల్ బెడ్రూమ్ స్కీం కింద ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించగా.. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయనుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్, తహసీల్దార్ స్థాయిలో జరుగుతుందని.. పంపిణీ ప్రక్రియ మాత్రం శాసన సభ్యుల చేతిమీదుగా సాగుతుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని, మొదటి జిల్లాగా వికారాబాద్ అవతరించడం ఖాయమన్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో వికారాబాద్ జిల్లా.. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటు కానుందన్నారు. జిల్లాకు బహుళ జాతీయ సంస్థల రాకతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని, ఇటీవల ప్రారంభించిన మైక్రోమ్యాక్స్, వండర్లా కంపెనీల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి వివరించారు. జీఓ 111 సడలింపుపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, త్వరలో ఆ ప్రాంత వాసులు శుభవార్త వింటారని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
కంపెనీలకు ప్రత్యేక గుర్తింపుగా పాన్!
న్యూఢిల్లీ: త్వరలో పాన్ నెంబర్ కంపెనీలకు ప్రత్యేక గుర్తింపుగా మారనుంది. దేశంలో వ్యాపారానుకూల పరిస్థితుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. పాన్ నెంబర్‌ను కంపెనీలకు కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యగా మార్చాలని కసరత్తు చేస్తోంది. ఎలాంటి వ్యాపారం నిర్వహించే కంపెనీకైనా పాన్‌ను ప్రత్యేక గుర్తింపుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని క్యాబినెట్ కార్యదర్శి పి.కె.సిన్హా తెలిపారు. ఆయన ఇక్కడ సీఐఐ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లోని పరిస్థితుల కారణంగా వ్యాపారానుకూల పరిస్థితుల జాబితాలో మన ర్యాంకు 142 నుంచి 130 స్థానానికి మెరుగుపడిందని చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అవరోధాలను ఒకదాని తర్వాత మరొకదాన్ని పరిష్కరించుకుంటూ వెళ్తామని తెలిపారు. ఇన్ఫ్రా, రవాణా తదితర రంగాల్లో పలు సంస్కరణలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. -
వసూల్ రాజా వసూల్
పోలీస్, ట్రాన్స్పోర్టుశాఖల్లో హోంగార్డులదే హవా అవినీతికి పాల్పడుతున్నారంటూ సబ్డివిజన్లు మార్చిన ఎస్పీ! అధికారపార్టీ నేతల అండదండలతో మళ్లీ పాత స్టేషన్లకే.. పోలీసు శాఖలో డీఎస్పీ నుంచి ఎస్ఐ వరకూ అధికారులంతా తమకు ఇష్టమైన హోంగార్డును వెంట ఉంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇంటిలో సొంత పనులు దగ్గర నుంచి డైలీ వసూళ్ల వరకు వీరి ద్వారానే వ్యవహారం నడుపుతున్నారు. నిబంధనల ప్రకారం వేటుపడితే అధికార పార్టీ నేతల అండదండలు, పోలీసు అధికారుల ఆశీస్సులు ఉన్న హోంగార్డులు మాత్రం గోడకు కొట్టిన బంతిలా మళ్లి గతంలో పని చేసిన పోలీస్స్టేషన్లకు వచ్చేస్తున్నారు. తమ హవా కొనసాగిస్తున్నారు. గుంటూరు : గుంటూరు జిల్లాలో అనేక మంది హోంగార్డులు ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తూ అక్కడి ఎస్సై, సీఐ, చివరకు డీఎస్పీలకు సైతం నెలవారి మామూళ్లు ఇసూలు చేసి ఇస్తూ, వారి ఇళ్లల్లో సొంత పనులు చక్కబెడుతూ హెడ్‌కానిస్టేబుళ్ల కంటే ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ నాలుగు నెలల క్రితం అవినీతికి పాల్పడుతున్న హోంగార్డుల జాబితాను రహస్యంగా స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా తెప్పించుకున్నారు. వీరందరినీ వేరే సబ్డివిజన్లలోని పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. అరుుతే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలున్న హోంగార్డులు నెల తిరకుండానే మళ్లి పాత పోలీస్స్టేషన్లకు వచ్చేశారు. ఉదాహరణకు జిల్లాలోని నరసరావుపేట -2 పోలీస్ స్టేషన్లో సీఐలకు నమ్మిన బంటులా ఇంట, బయట పనులు చేసిపెడుతున్న ఓ హోంగార్డును ఎస్పీ నారాయణ నాయక్ గురజాల సబ్ డివిజన్‌కు బదిలీ చేశారు. అయితే ఆయన ఓ ముఖ్యనేత తనయుడితో పైరవీ చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలుత గుంటూరుకు, అక్కడి నుంచి రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌కు, తిరిగి నరసరావుపేట-2టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చేశారు. మళ్లీ అధికారుల పక్కనే తిరుగుతూ దందా కొనసాగిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు శాఖలో.. జిల్లాకు చెందిన 20 మంది హోంగార్డులను రోడ్డు ట్రాన్స్‌పోర్టు శాఖకు డిప్యూటేషన్‌పై పంపించారు. మామూలుగా ఆరు నెలలకొకసారి డిప్యూటేషన్లు మార్చాలనే నిబంధన ఉన్నప్పటికీ పైరవీలు చేసుకుంటూ అక్కడే సాగుతున్నారు. నెలకో బ్రేక్ ఇన్స్పెక్టర్ వద్దకు, లేదా చెక్‌పోస్టు డ్యూటీలు చేసుకుంటూ నెలనెలా వేలల్లో సంపాదిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇలాగే అవినీతికి పాల్పడడమే కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్లను సైతం అవినీతి రొచ్చులోకి లాగుతున్న హోంగార్డుల వ్యవహారాన్ని గమనించిన అక్కడి డీటీసీ హోంగార్డులను మార్చేశారు. గుంటూరు జిల్లాలో అలా జరగాల్సి ఉన్నప్పటికీ మిగతా హోంగార్డులకు హెవీ వెహికల్ లెసైన్సులు లేవనే సాకుతో ఆ 20 మందిని నాలుగేళ్లుగా ఆర్టీఏ పరిధిలో కొనసాగిస్తున్నారు. దీనిపై అధికారులను వివరణకోరగా నరసరావుపేట -2 టౌన్లో పనిచేసి గురజాలకు మార్చిన హోంగార్డు తిరిగి అక్కడికి వెళ్లిన విషయం తమకు తెలియదని తెలిపారు. విచారించి మారుస్తామని పేర్కొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పరిగి: పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను రంగారెడ్డి జిల్లా పరిగి మండలం శిగుపల్లి సమీపంలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో.. అప్రమత్తమైన స్థానికులు ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 11 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. -
గోడౌన్లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తినష్టం
జమ్మలమడుగు: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాట్ కో ట్రాన్స్ పోర్ట్ బట్టల గోడౌన్లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కొన్ని నిమిషాల్లోనే గోడౌన్ ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదం వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎక్కడ..ఎవరికి..ఎలా..!
వాహనాల స్టాంపు డ్యూటీపై గందరగోళం ఆర్టీఏ, స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయం కరువు రుణప్రాతిపదికన వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు వాహనాల రిజిస్ట్రేషన్లలో జాప్యం సిటీబ్యూరో: ఫైనాన్స్ వాహనాలపై 0.5 శాతం చొప్పున ప్రభుత్వం విధించిన స్టాంపు డ్యూటీపై గందరగోళం నెలకొంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసి నెలరోజులు గడుస్తున్నా జీవో అమలుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు రవాణాశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయకొరవడడంతో స్టాంపు డ్యూటీ ఎక్కడ చెల్లించాలి, ఎవరికి చెల్లించాలో తెలియని సందిగ్థత నెలకొంది. స్టాంపు డ్యూటీ చెల్లించినట్లుగా ఆధారం ఉంటే తప్ప వాహనాలు నమోదు చేయడం సాధ్యం కాదని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎక్కడ చె ల్లించాలి, ఏ విధంగా చెల్లించాలో తెలియక వాహనదారులు అయోమయానికి లోనవుతున్నారు. వాహన రుణాలపై ఫైనాన్షియర్లు, వాహనదారులకు మధ్య కుదిరిన రుణ ఒప్పందం మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి చేరేవిధంగా ప్రతి వాహనంపైన 0.5 శాతం చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.బ్యాంకులు, సహకార సంస్థలు తదితర పెద్ద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు సక్రమంగానే జరుగుతున్నా వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ ఫైనాన్షియర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 0.5 శాతం చొప్పున ద్విచక్ర వాహనాలపైన రూ. 250 వరకు, కార్లు, ఇతర వాహనాలపైన రూ. 1500 నుంచి రూ.2500 వరకు వాహన ఖరీదు, తీసుకున్న రుణానికి అనుగుణంగా స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజూ 1000 నుంచి 1200 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. మరో 500 వాహనాలు రుణ ప్రాతిపదికన చేతులు మారుతున్నాయి. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫారమ్ 34 సమర్పించడానికి ముందు తప్పనిసరిగా వాహనయజమానికి, రుణదాతకు మధ్య కుదిరిన ఒప్పందంపై 0.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. అవగాహన లేమితోనే అసలు సమస్య... వాహనాల హైపొతికేషన్, లీజ్ అగ్రిమెంట్, తదితర అంశాలపైన కుదుర్చుకొనే ఒప్పందాలపై స్టాంపు డ్యూటీ చెల్లించాలనే అంశం మోటారు వాహన చట్టాల్లోనే ఉంది. బ్యాంకులు, బడా ఫైనాన్స్ సంస్థలు ఈ మేరకు ముందస్తుగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి కొంత మొత్తాన్ని చెల్లించి ఫ్రాంకిన్ మిషన్లను వినియోగిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోని చిన్న ఫైనాన్షియర్లు జరిపే క్రయవిక్రయాల్లో ఇది వసూలు కాకపోవడంతో ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. అయితే స్టాంపు డ్యూటీని ఆర్టీఏలో తీసుకోవడం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఖాతాలో జమ అయ్యేటట్లుగా ఆధారం ఉంటేనే వాహనం రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్నారు. ఈ చెల్లింపులకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఆర్టీఏ కేంద్రా ల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు, లేదా ఈ సేవా కేంద్రాల నుంచి స్వీకరించడం వంటి ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఫైనాన్షియర్లు ఫ్రాంకిన్ మిషన్లు వినియోగిస్తున్నప్పటికీ అవి ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్రతో ఉండడం వల్ల ఆర్టీఏ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్లపైన జాప్యం నెలకొంటోంది. రవాణా అధికారులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం అధికారులు కలిసి సమావేశమై ఒక అంగీకారానికి వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
ట్రాన్స్పోర్ట్ బిజినెస్‌లోకి ఎంటరైన ఫేస్బుక్!
వాషింగ్టన్: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లోకి ఎంటరైంది. ఈ మేరకు ఫేస్బుక్ సంస్థ 'ఉబర్'తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఫేస్బుక్ వినియోగదారులు తమ ఫేస్బుక్ అకౌంట్ నుండే నేరుగా క్యాబ్‌ను బుక్ చేసుకునే వీలు ఉంటుంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఫేస్బుక్ ద్వారా తమ ట్రాన్స్పోర్ట్ సేవలు ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయని ఉబర్ ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఉబర్ యాప్‌ను ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే తమ ఫేస్బుక్ అకౌంట్ నుండి నేరుగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం ప్రారంభం సందర్భంగా..మొదటి సారి ఈ సదుపాయాన్ని వినియోగించుకొనే వినియోగదారులకు ఫ్రీ రైడ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. ఈ విధానాన్ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్బుక్ భావిస్తోంది. ఉబర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ట్రాన్స్‌పోర్టేషన్ బిజినెస్‌లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఉబర్‌తో పాటు ఇతర కంపెనీలతో సైతం ఈ తరహా ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. -
వీవీఐపీలకూ మినహాయింపు లేదు!
న్యూఢిల్లీ: దేశరాజధాని హస్తినలో కాలుష్య నివారణకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ఫార్ములాకు సంబంధించిన విధివిధానాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. సోమ, బుధ, శుక్రవారాల్లో బేసి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలను రోడ్డుమీదకు అనుమతిస్తామని, మంగళ , గురు, శనివారాల్లో సరి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలకు వీలు కల్పిస్తామని తెలిపింది. అత్యవసర వాహనాలైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వ్యాన్లకు ఈ ప్రణాళిక వర్తించదని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. అయితే, వీవీఐపీలైన మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులకు ఈ ప్రణాళిక నుంచి మినహాయింపు ఉండబోదని, వారు కూడా దీనికి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. ఢిల్లీలో విషపూరితమైన వాయుకాలుష్యాన్ని నివారించేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను అమలుచేస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు ఈ ప్రణాళిక వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైతే.. పది, పదిహేను రోజులు చూసి.. ఈ ప్రణాళికను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. -
అద్దె వాహనాల్లో పశువుల చోరీలు
ఇద్దరు నిందితుల అరెస్టు రూ.2.2 లక్షలు, ఓ వాహనం స్వాధీనం మేడ్చల్: పశువుల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చాంద్రాయన్గుట్టకు చెందిన మహ ్మద్ హస్మత్(24), రాజేంద్రనగర్ డివిజన్ మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షేర్‌ఖాన్(24) వృత్తిరీత్యా డ్రైవర్లు. కొంతకాలంగా వీరు చాంద్రాయన్‌గుట్ట ప్రాంతంలో డీసీఎం వాహనాలను అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో పశువుల చోరీలకు పాల్పడుతున్నారు. దొంగిలించిన పశువులను నగరానికి తీసుకెళ్లి కబేళాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గత రెండు నెలల్లో మేడ్చల్ పట్టణంతో పాటు మండల పరిధిలోని శ్రీరంగవరం, గౌడవెళ్లి, రాయిలాపూర్‌లో పశువులను అపహరించుకుపోయారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. స్థానిక క్రైం పార్టీ పోలీసులు రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసుల సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం సాయంత్రం విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మండల పరిధిలోని డబీల్‌పూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేశారు. టాటా వింగర్(ఏపీ 29 టీబీ 5301)వాహనంలో వెళ్తున్న హస్మత్, షేర్‌ఖాన్ మేడ్చల్ వైపు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో తమదైన శైలిలో విచారణ జరుపగా పశువుల చోరీల విషయం తెలిపారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగుసార్లు, దుండిగల్, కేపీహెచ్‌బీ, పహాడీషరీఫ్, మేడిపల్లి ప్రాంతాల్లో పశువులను అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. వీరి గ్యాంగ్‌లోని మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షలు, టాటా వింగర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి వివరించారు. అనంతరం నిందితులను రిమాండుకు తరలించినట్లు ఆయన తెలియజేశారు. -
బ్యాంకాక్
పేరులో నేముంది థాయ్‌లాండ్ దేశ రాజధాని. ప్రపంచ ప్రధాన నగరాలలో ఒకటిగా ఖ్యాతి గడించింది. తప్పనిసరిగా సందర్శించదగ్గ టూరిస్ట్ ప్లేస్‌గా కూడా దీనికి పేరు. ఎనభై లక్షల జనాభా ఉన్న ఈ రాజధాని 15వ శతాబ్దం నుంచి రూపు దిద్దుకున్నదని ఆధారాలున్నాయి. బ్యాంగ్ అంటే నది ఒడ్డున ఉన్న గ్రామం అని అర్థం. కో అంటే ద్వీపం అని అర్థం. నది కాలువలు చుట్టు ముట్టినట్టుగా ఉండటంతో కాలక్రమంలో ఇది బ్యాంగ్‌కాక్ అయ్యింది. ‘మకాక్’ అనే వృక్షజాతి ఇక్కడ విస్తారం కనుక బ్యాంగ్ మకాక్ కాస్తా బ్యాంగ్‌కాక్ అయ్యిందని అంటారు. టూరిస్ట్‌ల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ నగరం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నా అందులో అధిక శాతం భారాన్ని కాలవల మీద సాగే నీటి బస్సులే మోస్తున్నాయి. అన్నట్టు బ్యాంకాక్ రెడ్‌లైట్ ఏరియాలకు కూడా ప్రసిద్ధం.