Movies
-
రవితేజ వారసుడి మూవీ.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న మూవీ "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకురాలు గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి వస్సాహి వస్సాహి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. యాక్టర్ శివాజీ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. ఇంతవరకు సంస్కృత భాషలో ఏ పాట రాలేదని శివాజీ అన్నారు. హీరో మాధవ్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.కాగా.. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. లిరిక్ రైటర్ శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్ శ్రీరామచంద్ర పాడారు. 'సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ,చతురస్య చాతుర్య మహిమ కింతు పరంతు విరంచ్య విరచితం కిమిదం, ఇదంకిం తమాషా...వస్సాహి వస్సాహి' అంటూ సంస్కృత సాహిత్యంతో ఆకట్టుకునేలా ఉంది ఈ సాంగ్. ఈ చిత్రంలో జయప్రకాష్, ఆచంట మహేశ్, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కాశీ విశ్వనాథ్, హిమజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రామచ్‌రణ్‌పై విమర్శలు.. స్పందించిన ఉపాసన
మెగాహీరో రామ్‌చరణ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం నుంచి స్వామి మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లడంతో పలువురు విమర్శించారు. కానీ, కొందరైతే అందులో తప్పేముందని చరణ్‌కు సపోర్ట్‌గా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.రామ్‌చరణ్‌పై విమర్శులు చేయడాన్ని ఉపాసన తప్పపట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్ ఫోటోను షేర్ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు. దేవుడిపై విశ్వాసం ఉంటే అందరినీ ఏకం చేస్తుందని ఆమె చెప్పారు. 'భక్తి ఎవరినీ చిన్నాభిన్నం చేయదు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మన బలం ఉంది. వన్ నేషన్.. వన్ స్పిరిట్' అని తెలిపారు.రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కడప దర్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో వారిద్దరూ కలిసి కొత్త సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా వారు అక్కడకు వచ్చారు. గతంలో మగధీర విడుదల సమయంలో కూడా చరణ్ దర్గాను సందర్శించి అక్కడి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సినిమా చరణ్ కెరిర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. దీంతో కడప దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చరణ్ పేర్కొన్నారు. జనవరి 10న శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. -
అమరన్ సక్సెస్.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో!
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్కే23 వర్కింగ్ టైటిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు. #Sivakarthikeyan served Biryani to #SK23 crew members on celebrating #Amaran Blockbuster success ❤️🔥❤️🔥pic.twitter.com/uAzB5PbXqh— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024 -
గురువు దారిలోనే శిష్యురాలు.. భర్తకు విడాకులు
దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. ఇతడి భార్య సైరా భాను.. తన లాయర్ల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రెహమాన్ దగ్గర పనిచేస్తున్న శిష్యురాలు కూడా భర్తకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన సైరా భాను.. భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు.. పెద్ద అంతరాన్ని సృష్టించాయని ఆమె లాయర్ వందనా షా పేర్కొన్నారు. రెహమాన్- సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకు ఉన్నాడు.ఇకపోతే రెహమాన్ దగ్గర బాసిస్ట్‌గా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలో ఏఆర్ రెహమాన్, అతడి సహాయకురాలు విడాకులు (వేర్వేరుగా) తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రెండు విడాకుల అంశాలకు ఏమైనా సంబంధముందా అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
సూర్య కంగువా.. తగ్గించినా లాభం లేదు.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది. తొలిరోజు సూర్య కెరీర్లోనే ది బెస్ట్ వసూళ్లు రాబట్టినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో రిలీజైన ఆరు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది.మొదటి రోజు రూ. 24 కోట్లు రాబట్టిన కంగువా ఆ తర్వాత వీకెండ్లోనూ పెద్దగా రాణించలేకపోయింది. నవంబర్ 19న కేవలం రూ.3.15 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండో వారంలోనైనా పుంజుకుంటుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది.12 నిమిషాల తగ్గింపుకంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతున్న ఈ మూవీ నిడివిని తగ్గించారు. దాదాపు 12 నిమిషాల సీన్స్ కట్ చేసినట్లు ప్రకటించారు. ట్రిమ్ చేసిన కంగువ వర్షన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పుడైనా ఫ్యాన్స్ నుంచి కంగువాకు ఆదరణ దక్కుతుందేమో వేచి చూడాల్సింది. కాగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్లో రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ లెక్కన చూస్తే బిగ్ డిజాస్టర్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. -
డేటింగ్లో ఆదిపురుష్ భామ.. బాయ్‌ఫ్రెండ్‌కు స్పెషల్ విషెస్
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఈ ఏడాది క్రూ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల దో పట్టి మూవీలోనూ కనిపించింది. అయితే ఇటీవల విదేశాల్లో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్ డే వేడుకలు సైతం విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ పార్టీలో ఆమె బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా ఫోటోల్లో కనిపించారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.తాజాగా ఇవాళ కబీర్ బహియా బర్త్ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. హ్యాపియస్ట్ బర్త్ డే అంటూ లవ్ సింబల్‌ను జోడించింది. ఈ పోస్ట్ చూస్తే వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ జంట డేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కబీర్ బహియా యూకేలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం.అంతేకాకుండా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ సైతం కబీర్ దహియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా కబీర్, కృతి కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. కృతి చివరిసారిగా నటించిన దో పట్టి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో కాజోల్, షాహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
తెలుగులో తొలి మూవీ ప్లాఫ్.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్
సాధారణంగా హీరోయిన్లు నటించిన సినిమాలు ప్లాఫ్ అయితే కొత్తగా అవకాశాలు రావడం తక్కువ. అలాంటిది 'మిస్టర్ బచ్చన్' బ్యూటీకి మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వస్తున్నాయి. భాగ్యశ్రీ.. తొలుత 'యారియన్ 2' అనే హిందీ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది. రవితేజ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోయింది. మూవీ డిజాస్టర్ అయినప్పటికీ.. భాగ్యశ్రీ డ్యాన్సులు, గ్లామర్‌కి మార్కులు పడ్డాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)ఇప్పుడదే గ్లామర్ మరికొన్ని అవకాశాలు తీసుకొస్తోంది. ఇప్పటికే దుల్కర్ 'కాంత' సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. తాజాగా రామ్ పోతినేని కొత్త మూవీలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ మహేశ్ బాబు.. రామ్-భాగ్యశ్రీ సినిమాని తీస్తున్నాడు. నవంబర్ 21న ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
వేట్టయన్, కంగువా, సినిమాల ఎఫెక్ట్.. కోలీవుడ్ కీలక నిర్ణయం
ఇండియన్2, వేట్టయన్, కంగువా సినిమా ఫలితాలతో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు అనుకున్నంత స్థాయిలో రానించలేదు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా నష్టాలు తప్పలేదు. సినిమా బాగున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక అంచనాకు వచ్చింది.సినిమా విడుదలైన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా రిజల్ట్‌పై పడుతుందని కోలీవుడ్ నిర్మాతలు గ్రహించారు. భారీ బడ్జెట్‌తో ఈ ఏడాదిలో తెరకెక్కిన సినిమాలపై వారి రివ్యూలు చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇండియన్2. వేట్టయాన్,కంగువా సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పలు యూట్యూబ్ ఛానల్స్ తెరపైకి వచ్చాయి. మూవీ బాగలేదంటూ రివ్యూలు ఇవ్వడం చేశాయి. దీంతో ఈ చిత్రాలపై చాలా ప్రభావం చూపింది. భవిష్యత్‌లో ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతుందని వారు భావించారు. దీనిని అరికట్టేందుకు థియేటర్ యజమానులు ముందుకు రావాలని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరించారు.కంగువా, సినిమా విడుదల సమయంలో ఫస్ట్ డే నాడే దారుణమైన రివ్యూలు ఇవ్వడంతో రెండోరోజు సినిమాకు వెళ్లే వారిపై ప్రభావం చూపింది. ఇందులో సూర్య నటన బాగుంది అంటూనే.. సినిమా ఏమాత్రం బాగాలేదని కామెంట్లు చేశారు. ఈ విషయంపై నటి జ్యోతక కూడా రియాక్ట్ అయింది. కంగువా సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలు చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపింది. ఒకరకంగా ఈ రివ్యూల వల్లే సినిమాకు మైనస్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా మొదటిరోజే ఇంతటి నెగిటివ్ రివ్యూలు చూడటం బాధగా ఉందని తెలిపింది. కానీ, ఈ చిత్రంలోని పాజిటివ్స్‌ను ఎవరూ చెప్పలేదని ఆమె పేర్కొంది. -
హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు!
ది లయన్ కింగ్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. అయితే సూపర్ హిట్ అయిన చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024 -
ఏఆర్ రెహమాన్ విడాకులకు కారణం తెలిపిన అడ్వకేట్.. పిల్లల కామెంట్స్
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయారు. వారిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. 1995లో వారు పెళ్లి చేసుకున్నారు. సుమారు 29 ఏళ్లు కలిసి జీవించిన వారు ఇలా విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయంపై వారి పిల్లలు కూడా సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.ఎందుకు విడిపోయారంటే..ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోవడానికి ఉన్న కారణాలను వారి అడ్వకేట్ వందనా షా ఇలా చెప్పారు. 'భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగానే వారు విడిపోయారు. దంపతుల మధ్య సంబంధాల సమస్యలే ఈ నిర్ణయానికి దారితీశాయి. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట తమ మధ్య వచ్చే చిన్నచిన్న విభేదాలు, పోరాటాల విషయంలో పరిష్కరించుకోలేకపోయారు. అవి వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయ. శ్రీమతి సైరా చాలా బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ గోప్యతను, గౌరవాన్ని ప్రజలు కాపాడాలని వారిద్దరూ కోరారు.' అని న్యాయవాది తెలిపారు.విడాకులపై పిల్లల కామెంట్స్29 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ జంట తమ వివాహ బంధాన్ని ముగించుకున్నారని తెలుసుకున్న అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రెహమాన్, సైరా ఇద్దరూ కలిసే బాలీవుడ్ పార్టీలు, అవార్డులు, సెలబ్రిటీల వివాహాలకు హాజరవుతారు. ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో వారు చివరిసారిగా కలిసి కనిపించారు.విడాకుల విషయంపై వారి పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ స్పందిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. 'మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో మీరందరూ గోప్యత పాటించి గౌరవంగా వ్యవహరించారు. అందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు' అంటూ రహీమా పోస్ట్ చేయగా..ఖతీజా ఇలా తెలిపింది. ' ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరినీ వేడుకుంటున్నాం. మా బాధను అర్థం చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది. -
సీరియల్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు
తమిళంలో సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి గాయత్రికి ప్రమాదం జరిగింది. మెషీన్లో ఈమె చెయ్యి ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని సాయి గాయత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 1-2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఓవైపు సీరియల్ నటిగా చేస్తూనే సాయి గాయత్రి బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా పెట్టుకుంది. పాండియన్ స్టోర్స్, నీ నాన్ కాదల్ తదితర సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే పలు వ్యక్తిగత కారణాలతో ఈ రెండు ప్రాజెక్ట్‌ల నుంచి మధ్యలోనే బయటకొచ్చేసింది. గతేడాది తల్లిదండ్రులతో కలిసి 'సాయి సీక్రెట్స్' అనే బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టింది.సబ్బులు, హెయిర్ ఆయిల్ తదితర ఉత్పత్తులు తన సంస్థలో తయారు చేసి విక్రయించేది. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న టైంలో సాయి గాయత్రి చెయ్యి.. అనుకోకుండా ఓ యంత్రంలో ఇరుక్కుంది. దీంతో కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింద కాండం'. రూ.7 కోట్ల ఖర్చు పెట్టి థియేటర్లలో రిలీజ్ చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి. అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు. ఓరోజు ఈయన గన్ మిస్ అవుతుంది. ఎన్నికల టైం కావడంతో తుపాకీని స్టేషన్లో అప్పగించాలని నోటీసులు ఇస్తారు. కట్ చేస్తే ఓ కోతి చేతిలో గన్ కనిపిస్తుంది. అది తనదేనని అప్పు పిళ్లై కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడికి అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) అనే కొడుకు. అజయ్ తొలి భార్య చనిపోవడం, కొడుకు కనిపించకుండా పోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? మిస్ అయిన కొడుకు ఏమయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఎలా ఉందంటే?మిస్టరీ థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాట్లో స్టోరీ ఉంటుంది. ఓ హత్య, దాని చుట్టూ సాగే దర్యాప్తు. హంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ 'కిష్కింద కాండం' పూర్తిగా డిఫరెంట్. పాట, ఫైట్ లాంటివి ఏం ఉండవు. ఎప్పుడూ చూసే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు. దానిని చూపించిన విధానం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేశారు.మతిమరపు వ్యక్తి, కనపడకుండా పోయిన తుపాకీ, బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి, తప్పి పోయిన పిల్లాడు ఇవే ఈ కథ లోని ముఖ్యమైన అంశాలు. ఇంతకీ మించి చెబితే సినిమాలోని థ్రిల్‌ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. చూస్తున్న ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. కానీ 'కిష్కింద కాండం' అది చేసి చూపించింది. రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కథ, మాటలు అందించిన బాహుల్ రమేశ్.. సినిమాటోగ్రఫీ కూడా చేశారు. కథ రాసుకున్న వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ తర్వాత ఉల్లిపాయ ఒక్కో పొర విప్పినట్లు కథలో ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకు సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.'జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం', 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం'.. సినిమా చూసిన తర్వాత ఈ రెండు డైలాగ్స్ మీకు తెగ నచ్చేస్తాయి. అలానే తండ్రి గజిని, కొడుకు కమల్ హాసన్ అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు, స్లోగా సాగే సినిమాలంటే ఇష్టం లేనివాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. రెండు గంటల నిడివితో తీసిన మిస్టరీ థ్రిల్లర్.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
అందరి టార్గెట్ కన్నడ బ్యాచ్.. నామినేషన్స్‌లో ఎవరెవరు?
బిగ్‌బాస్ 12వ వారం విచిత్రమైన పద్ధతిలో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయినవాళ్లు హౌసులోకి వచ్చి ఈ వారం ఎవరెవరు నామినేట్ అవ్వాలనేది డిసైడ్ చేశారు. సోమవారం కొంతవరకు జరగ్గా.. మంగళవారం కూడా ఇదే కొనసాగింది. మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత వచ్చారు. తన పాయింట్లు చెప్పి రఫ్ఫాడించేశారు. ఇంతకీ బిగ్‌బాస్‌లో మంగళవారం(79వ రోజు) ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన శోభా శెట్టి)తొలుత హౌసులోకి వచ్చిన నైనిక.. నిఖిల్‌ని పలకరించి హగ్గు ఇచ్చింది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని చెప్పింది. ఇక తన మొదటి నామినేషన్ నబీల్ పేరు చెప్పింది. 'నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావ్ నబీల్.. షేర్ (సింహం) అన్నావ్ కదా! మరి అది ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయింది. గత కొన్నివారాలుగా నువ్వు కనిపించట్లేదు' అని అడిగింది. దీనికి సమాధానంగా.. నేను వచ్చిందే ఆ కప్పు కోసం.. ఖచ్చితంగా దాని కోసమే ఆడతా.. నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే అని నబీల్ తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు.నైనిక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది. ఒకప్పుడు యష్మీ ఇప్పుడు కనిపించట్లేదని, ఎప్పుడైతే నిఖిల్ వెంటపడటం మొదలుపెట్టావో అప్పటినుంచి యష్మీ మిస్ అయిపోయిందని చెప్పింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన యష్మీ.. నేనెందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు.. నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మీ ఏడ్చింది. ముందు యష్మీని తీసుకొస్తా.. కప్పు కొట్టడానికి ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!)తర్వాత వచ్చిన మణికంఠ.. నిఖిల్‌ని నామినేట్ చేశాడు. నేను వెళ్లేటప్పుడే నీ గ్రాఫ్ పడిపోతుందని నీకు చెప్పా. కానీ నీకెలా తెలుసు అని నువ్వు అడిగావ్.. ఇప్పుడు నేనే చూసి వచ్చా అందుకే చెబుతున్నా.. నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ పెట్టుకోవడానికి వచ్చావా? కప్పు కోసం వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ గెలవడం చాలా కష్టం నిఖిల్ అని అన్నాడు. దీనికి నిఖిల్ వైపు నుంచి పెద్దగా సమాధానం ఏం రాలేదు. సైలెంట్‌గా ఉండిపోయాడు.రెండో నామినేషన్ నబీల్‌కి వేసిన మణికంఠ పెద్ద మోటివేషన్ ఇచ్చాడు. నాలుగు వారాలుగా నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నావ్. త్యాగాలు చేస్తున్నావ్. సైలెంట్ అయిపోయావ్. ఇవన్నీ ఎందుకు. నిన్ను ఇష్టపడే వాళ్లు నీ గేమ్ చూడాలనుంకుంటారు.. నీ త్యాగాలు కాదు అని అన్నాడు. దీంతో ఇకపై నా ఆట చూపిస్తా అని నబీల్ సవాల్ చేశాడు.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య)అనంతరం హౌసులోకి వచ్చిన సీత.. విష్ణుప్రియని సూపర్ ఆడుతున్నావ్ అని మెచ్చుకుంది. ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్. డిక్టేటర్లా బిహేవ్ చేశావ్. ఇదే విషయం నీ భర్త కూడా చెప్పారు. ఆయన చెప్పి వెళ్లిన కాసేపటికే కిచెన్ దగ్గర తేజతో దోస గురించి గొడవపడ్డావ్. నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయ్ అని చెప్పుకొచ్చింది. నేను వాటిని మార్చుకుంటానని ప్రేరణ చెప్పింది. సీత తన నెక్స్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టిన తర్వాతి నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్ ఉంటేనే నువ్వు కనపడుతున్నావ్ అని గట్టిగానే క్లాస్ పీకింది.తర్వాత వచ్చిన ఆదిత్య ఓం.. కర్మ ఈజ్ బ్యాక్ అనే డైలాగ్‌తో హౌసులోకి వెళ్లాడు. యష్మిని మొదటగా నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మీరు ముందే ఫిక్సయి లోపలికి వచ్చినట్లున్నారు. ఎందుకంటే ప్రేరణ, నిఖిల్, పృథ్వీలను మీరు ఇప్పటివరకూ నామినేట్ చేయలేదు. వేరే వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు పెద్ద తప్పులు చేసినాసరే మీరు వదిలేస్తున్నారు. పక్షపాతంగా ఉంటున్నారు. ఫేవరిటిజం చూపిస్తున్నారు. న్యూట్రల్‌గా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇది 12వ వారం అండి.. ఇంకెన్ని వారాలు చేస్తారని తన అసహనాన్ని వ్యక్తపరిచాడు.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఆదిత్య మాటలపై స్పందించిన యష్మీ.. గ్రూప్ గేమ్ ఆడితే నా గేమ్ స్పాయిల్ అవుతుందని నాకు క్లారిటీ ఉందని చెప్పింది. గ్రూపిజం గురించి ఆదిత్యతో యష్మి కాస్త వాదన పెట్టుకుంది. కానీ చివరకు తను కొన్ని గేమ్స్‌లో ఫేవరెటిజం చూపించానని ఒప్పుకొంది. తర్వాత ప్రేరణని ఆదిత్య నామినేట్ చేశాడు. ఈమె కూడా గ్రూప్ గేమ్ ఆడుతోందనే కారణమే చెప్పాడు. దీంతో యష్మీని మీరు 12 వారాల్లో ఒక్కసారి కూడా ఎందుకు నామినేట్ చేయలేదు? అని ఆదిత్య అడిగాడు. అంతకంటే ఎక్కువ తప్పులు వేరే చోట కనిపించాయ్ అని ప్రేరణ అనేసరికి.. అవును మీకు నబీల్లో, నాలో, విష్ణుప్రియలో కనిపించాయ్, ప్రతిసారి మీకు మేమే కనిపిస్తామా? బయట జనాలు ఎలా నమ్ముతారు అని అడిగేసరికి ప్రేరణ సైలెంట్ అయిపోయింది.అలా ఈసారి నామినేషన్స్ కాస్త వెరైటీగా జరిగింది. కాకపోతే కన్నడ బ్యాచ్ ఫుల్ టార్గెట్ అయింది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్ ఆడుతూ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు కానీ ఈసారి మాత్రం వీళ్లు నలుగురిపై కత్తి వేలాడుతోంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి లిస్ట్‌లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, నబీల్ చేరారు.(ఇదీ చదవండి: నటి కస్తూరిపై మరిన్ని కేసులు) -
జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య
ఒకప్పుడు పెళ్లి కోసం యువత ఎగబడే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగాలు, ఇండిపెండెంట్‌గా బతకడం లాంటివి చెబుతూ అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు సింగిల్‌గానే ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్లలో సినిమా హీరోహీరోయిన్లు కూడా ఉన్నారండోయ్. వాళ్లకు పెళ్లిపై నమ్మకమున్నా సరే ఎందుకో చేసుకోవట్లేదు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి మాత్రం జీవితంలో తాను పెళ్లి చేసుకోనని చెబుతోంది.(ఇదీ చదవండి: అక్కినేని హీరోతో పెళ్లి.. స్పందించిన మీనాక్షి చౌదరి)మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. గతంలో పెళ్లి చేసుకోనని ఓసారి చెప్పిన ఈమె.. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు గల కారణాల్ని కూడా బయటపెట్టింది.'జీవితంలో నేను పెళ్లి చేసుకోను. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నాకు తెలిసిన చాలామందిని చూశారు. ఒక్క జంట తప్పితే మిగిలిన వాళ్లందరూ రాజీ పడి బతుకుతున్నారు. పెళ్లి వల్ల చాలామంది వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే పెళ్లి వద్దని ఫిక్సయ్యాను. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూశాను. అవి చూసినప్పుడల్లా నేను కూడా అలానే చేసుకోవాలని అనుకున్నా. కానీ పెద్దయిన తర్వాత పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది.'(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య)'కొన్నేళ్ల ముందు వరకు కూడా పెళ్లి చేసుకోవాలనే అనుకున్నారు. ఓ మ్యాట్రిమోని సైట్లో నేను నా ప్రొఫైల్ కూడా పెట్టాను. కానీ అది ఫేక్ అని చాలామంది అనుకున్నారు. కానీ కొన్నాళ్లకు పెళ్లిపై నా అభిప్రాయం మారిపోయింది' అని ఐశ్వర్య లక్ష్మీ చెబుతోంది.తమిళ నటుడు అర్జున్ దాస్‌తో ఈమె ప్రేమలో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మాటలతో అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయాయి. ఐశ్వర్య ప్రస్తుతం తెలుగులో సాయితేజ్ లేటెస్ట్ మూవీలో చేస్తోంది.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య
సంగీత సామ్రాట్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ విషయాన్ని రహమాన్ దంపతుల తరఫున ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఒక సంయుక్త ప్రకటన మంగళవారం విడుదలచేశారు. ‘‘పెళ్లయిన చాన్నాళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. కొరవడిన భావోద్వేగాలే బంధం బీటలు పడటానికి కారణం. ఒకరిపై ఇంకొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాసరే అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు సైతం ఈ విషయాన్ని అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కష్టమైన దశను వీళ్లిద్దరూ దాటగలరని భావిస్తున్నా’ అని లాయర్ వందనా షా ఆ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి’ అని రెహమాన్ కుమారుడు అమీన్ సైతం ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. రహమాన్, సైరా బానూ వివాహం 1995 మార్చిలో చెన్నైలో జరిగింది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. -
ఇఫీలో గుస్సాడీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు. – సాక్షి, హైదరాబాద్ -
కస్తూరిపై మరిన్ని కేసులు
సాక్షి, చైన్నె : తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై మరికొన్ని పోలీసు స్టేషన్లలో కేసుల నమోదుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన కస్తూరి పుళల్ జైలలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఖైదీ నెంబర్ 644798 కేటాయించినట్టు సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమైపె చైన్నెలో నాలుగు, మదురైలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆమైపె కోయంబత్తూరు, కుంభకోణం, కోయంబేడు పోలీసు స్టేషన్లలో సైతం ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై పోలీసులు పరిశీలన జరుపుతున్నారు. ఆమైపె మరికొన్ని కేసులు నమోదు చేసి, ఆ కేసులలో అరెస్టు చేసే విధంగా పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. -
ఓ తల్లి ప్రతీకారం
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అటు హీరోయిన్గా ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు తాప్సీ. తాజాగా ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘గాంధారి’. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లోపాల్గొన్నారట తాప్సీ. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.కిడ్నాప్ అయిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసేపోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వెండితెరపై తాప్సీ తల్లిపాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇదే. త్వరలో ‘గాంధారి’ సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది యూనిట్. ఇదిలా ఉంటే... తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్ కథ అందించిన ‘హసీన దిల్రుబా’, ఫిర్ ఆయీ హసీన దిల్ రుబా’లకు మంచి స్పందన లభించింది. దీంతో వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. -
మీకు తెలిసినోడి కథ
‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష ఇతర కీలకపాత్రలుపోషించారు. ‘బచ్చలమల్లి’ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇది మీ కథ... లేకపోతే మీకు తెలిసినోడి కథ’ అని ఈ సినిమాను ఉద్దేశించి, ‘ఎక్స్’లో పేర్కొన్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎమ్. నాథన్. -
పదహారేళ్ల తర్వాత...
మోహన్‌లాల్, మమ్ముట్టి కాంబినేషన్లో దాదాపు యాభైకి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 2008లో రిలీజైన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ సినిమా చేయలేదు. పదహారేళ్ల తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి ఓ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో ‘మాలిక్, టేకాఫ్, సీ యూ సూన్’ వంటి సినిమాలతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మహేశ్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్ ఓ కీలకపాత్రలో నటిస్తుండగా, మరో కీలకపాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో మొదలైంది. మమ్ముట్టి, మోహన్‌లాల్, కుంచాకోల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాదల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్‌లాల్ నటించారు. కానీ ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ది అతిథిపాత్ర. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న తాజా ఫుల్ లెంగ్త్ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. -
సరికొత్త ఫ్యాషన్‌తో శోభిత ధూళిపాళ్ల.. రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్స్!
సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో శోభిత ధూళిపాళ్ల..రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ లుక్...ఆ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుందన్న రష్మిక మందన్నాకలర్ఫుల్ డ్రెస్‌లో హన్సిక మోత్వానీ హోయలు..శారీలో మెరిసిపోతున్న మేఘా ఆకాశ్.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
అక్కినేని హీరోతో పెళ్లి.. ఆ వార్తలపై స్పందించిన మీనాక్షి చౌదరి
ఇటీవల లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ మీనాక్షి చౌదరి. మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.ఇటీవల వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవల సుశాంత్‌ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు గుంటూరు కారం భామను ప్రశ్నించారు.దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ..'అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని అన్నారు. కాగా.. మెకానిక్ రాకీలో మరో హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్లో వివరించారు.కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు.మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. -
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి అలా!
మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా ద్వారా మిస్ ఇండియా మానస వారణాసి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ వర్మ రాసిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. అందరిలా కాకుండా కాస్తా వైరైటీగా మూవీ ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదటి ఐదు నిమిషాల మూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. #DevakiNandanaVasudeva ఏం అయివుంటుంది? pic.twitter.com/FR1sIUH5xf— Kakinada Talkies (@Kkdtalkies) November 19, 2024 -
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ శుక్రవారమే థియేటర్లలో పుష్ప..!
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పుష్ప 2 ది రూల్. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడు లేని రికార్డులు సృష్టస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.అయితే పుష్ప 2 రిలీజ్‌కు కొద్ది రోజులు సమయం ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు. తాజాగా పుష్ప ది రైజ్ పార్ట్-1 రీ రిలీజ్ చేయనున్నట్లు గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ సంస్థ ట్వీట్ చేసింది. హిందీ వర్షన్‌ను ఈ నెల 22న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నార్త్‌లో మార్కెట్‌ను మరింత పెంచుకునే ఆలోచనతో మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే హిందీలో మాత్రమే పుష్ప పార్ట్-1 రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. అలాగే దక్షిణాది భాషల్లోనూ రీ రిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు యూఎస్‌లో పుష్ప పార్ట్-1 రీ రిలీజ్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషించారు. #Pushpa - The Rise (Hindi) Re-Releasing In Cinemas on 22nd Nov 2024@alluarjun @iamRashmika @GTelefilms #PushpaTheRise #AlluArjun #RashmikaMandanna #PushpaReReleaseInCinemas pic.twitter.com/vrdSQCGqKg— Goldmines Telefilms (@GTelefilms) November 19, 2024 #PushpaTheRise USA RE RELEASE Bookings started to open 💥🪓#Pushpa2TheRule pic.twitter.com/owcQvwbF5z— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 16, 2024 #PushpaTheRise Re-Release bookings are now open at @Cinemark 💥💥🪓🪓Grab your tickets today with TUESDAY discount offers and relive the PUSHPA mania before the storm of #Pushpa2TheRule begins! 💥💥@alluarjun #Sukumar @MythriOfficial @PushpaMovie pic.twitter.com/a4UUkrBGfB— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 18, 2024