Orissa
-
చిల్లంగి నెపంతో దాడి
● రాజకీయ కక్ష అంటూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు బొబ్బిలి: ‘నిత్యం కడుపునొప్పి వస్తోంది. నువ్వు రోజూ కలలో కనిపిస్తున్నావు. నువ్వే చిల్లంగి పెట్టిఉంటావు’’ అంటూ వైఎస్సార్సీపీ పంచాయతీ వార్డు మెంబర్ భర్తపై అదే గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ అనుచరుడు దాడి చేశాడు. అంతే కాకుండా బాధితుడి భార్య వార్డు మెంబర్పైనా దూషణలకు దిగాడు. బొబ్బిలి మండలం కొండదేవుపల్లి గ్రామంలో రెండురోజుల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఇన్నాళ్లూ గ్రామంలోనే ఉన్న వార్డు మెంబర్ భర్తపై లేనిపోని ఆరోపణలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ కక్షలతో దాడులకు దిగడం దారుణమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ దాడిపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి భార్యాభర్తలిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై గ్రామ పెద్దలతో కలిసి బుధవారం బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు క్యాంపు కార్యాలయానికి వెళ్లి మొరపెటుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. దీంతో శంబంగి పోలీసులకు ఫోన్‌చేసి ఇదేం సంప్రదాయం? ఇలాగేనా రాజకీయ కక్షలు తీర్చుకుంటారు. ఈ రోజుల్లో కూడా చిల్లంగి వంటి పాతనమ్మకాలను అడ్డంపెట్టుకుని రాజకీయకక్షలు సాధిస్తారా? ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి వెనుక నేపథ్యం..! కొండదేవుపల్లిలో పంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలు వైఎస్సార్ సీపీ, టీడీపీకి సమానంగా వచ్చాయి. ఇందులో బొమ్మరిల్లు అప్పలనర్సమ్మ కూడా ఉన్నారు. వారిలో ఒకరు టీడీపీలోకి వస్తే ఉప సర్పంచ్ పదవి వస్తుందని అప్పలనర్సమ్మను టీడీపీ వారు ప్రలోభపెట్టారు. దీనికి ఆమె, ఆమె భర్త వ్యతిరేకించారు.మేం వైఎస్సార్సీపీకి మద్దతు దారులం. ఎప్పుడైనా పార్టీ మారేది లేదని తెగేసి చెప్పారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు ఇలా కక్ష తీర్చుకుంటున్నారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తెలియజేస్తున్నారు. -
పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలి
● బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ అప్పారావు విజయనగరం ఫోర్ట్: పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. ఈ మేరకు బాలల వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలపై లైంగిక దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. బాలికలు చెడు స్నేహాలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేఽశించుకుని దాన్ని సాధించడానికి కృషి చేయాలని కోరారు. విద్యార్థులపై తల్లిదండ్రులకంటే ఉపాధ్యాయలకు బాధ్యత ఎక్కువని స్పష్టం చేశారు. బాలికల విద్యాభివృధ్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ పండిట్ జవహర్లాల్ పుట్టిన రోజు నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామని, గతంలో బాలలకు హక్కులు గురించి చెప్పేవారు ఉండేవారు కాదన్నారు. నేడు బాలల హక్కులు గురించే తెలియజేసే అనేక సంస్థలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని, సాంకేతికతను మంచికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. చదువుపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం శిశు గృహ వారు ఊయల కార్యక్రమంపై రుపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ వివిధ క్రీడా పోటీల్లో రాణించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ హిమబిందు, సభ్యులు చిట్టిబాబు, ఐసీడీఎస్ పీడీ బి.శాంతకుమారి, డీసీపీయూ యాళ్ల నాగరాజు, శిశు గృహ మేనేజర్ త్రివేణి, పీఓఐసీ బి.రామకోటి పాల్గొన్నారు. -
కొనసాగుతున్న నేత్ర వైద్య పరీక్షలు
పార్వతీపురంటౌన్: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల పరిధిలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ నగేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేత్ర పరీక్షలు, వైద్య చికిత్సలు చేసి ఉచితంగా మందుల పంపిణీ, దృష్టి దోషం ఉన్న వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించి కంటి చూపు కాపాడాల్సిన బాధ్యత జిల్లా అంధత్వ నివారణ సంస్థ చేపడుతుందని చెప్పారు. నేత్ర సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్ర చికిత్సల కోసం పుష్పగిరి కంటి ఆస్పత్రి, జెమ్స్ ఆస్పత్రి, పాలకొండ, పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి నిర్వహిస్తామన్నారు. వారందరికీ ఉచిత రవాణా, వసతి, భోజనం, కళ్ల జొళ్లు, మందుల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నేత్ర వైద్య అధికారులు, కంటి వైద్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
గిరిజన వర్సిటీని త్వరగా పూర్తి చేయాలి
● మంత్రి లోకేష్ ప్రకటన విరమించుకోవాలి ● ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మవిజయనగరం పూల్‌బాగ్/మెంటాడ : గిరిజన యూనివర్సిటీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గిరిజన యూనివర్సిటీని కొత్తవలస వద్ద రెల్లి గ్రామం వద్దకు మారుస్తామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను విరమించుకోవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మెంటాడ మండలంలోని కుంటినవలసలో నిర్మాణంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అనంతరం విజయనగరంలోని ఎన్పీఅర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ నిర్మాణం లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీని స్థలాన్ని మార్చడంతో నేటికీ కుంటినవలస వద్ద వర్సిటీ నిర్మాణం ప్రారంభ దశలోనే ఉందన్నారు. నేడు మళ్లీ దీన్ని కొత్తవలస మండలంలో రెల్లి వద్ద అప్పుడు సేకరించిన స్థలంలోనే నిర్మిస్తామని ఈ నెల 13 న రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారన్నారు. ప్రతిసారీ మార్చడం అవివేకం మత్రి ప్రకటిన వల్ల వర్సిటీ నిర్మాణం మరింత ఆలస్యమవుతుంది తప్ప మరొకటి కాదన్నారు. గత ప్రభుత్వం రెల్లి నుంచి ఇక్కడికి మార్చిందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా స్థలాలు మార్చుకోవడం భావ్యం కాదని హితవు పలికారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న దీనిని మార్చడం అంటే అవివేకం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. గిరిజనులకు 50 శాతం సీట్లు కేటాయించాలి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కేంద్ర విద్యా శాఖ మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకే మాత్రం జాప్యం చేయకుండా మెంటాడలోనే దీనిని నిర్మించాలని లేఖలు రాశామన్నారు. గిరిజనులకు 50శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధత ఏర్పాటు చేయాలని కూడా ఆ లేఖలో కోరినట్లు తెలిపారు. బుధవారం తమ బృందం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్‌ను కలిసి చర్చించినట్లు చెప్పారు. ఎస్టీ అసెంబ్లీ నియోజక వర్గం సాలూరులో భాగంగా ఉన్న మెంటాడ మండలంలోని కుంటినివలస గ్రామం వద్ద దీని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన 2025 లోగా పూర్తి చేయాలని, శాశ్వత సిబ్బందిని నియమించి, అన్ని కోర్సులను అందుబాటులోకి తేవాలని, గిరిజనులకు 50శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ వాసా, ఉపాధ్యక్షురాలు కె. విజయ గౌరి, గిరిజన సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి టి. సోములు, మన్యం జిల్లా కార్యదర్శి సీదిరి అప్పారావు, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాము, జగదీష్, రవికుమార్, కాంతారావు, గ్రామ సర్పంచ్ రమేష్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
22న బొల్లినేని మెడిస్కిల్స్‌లో జాబ్‌మేళా
శ్రీకాకుళం రూరల్: మండలంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రి, బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఈ నెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18 నుంచి 20 ఏళ్లలోపు విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.13,500 వేతనం అందుతుందని, అనకాపల్లి జిల్లా పరవాడలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌మేళాకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. బస్సును ఢీకొట్టిన మరో బస్సుడెంకాడ: విజయనగరం–విశాఖ జాతీయ రహదారిపై డెంకాడ మండలంలోని మోదవలస సమీపంలో అనీల్నీరుకొండ ఆస్పత్రి బస్సును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్డడంతో పలువురికి గాయాలయ్యాయని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. బుధవారం ఉదయం అనీల్నీరుకొండ ఆస్పత్రికి చెందిన బస్సు విజయనగరం నుంచి తగరపువలస వైపు వెళ్తోంది. అదే వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సుల్లో ఉన్న 15 మంది వరకూ గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులను వెంటనే తగరపువలస వద్ద ఉన్న అనీల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ మోటార్ల చోరీపూసపాటిరేగ : మండలంలోని చౌడువాడ పంచాయతీ కొణతాల పాలెం సమీపంలో గల వ్యవసాయక్షేత్రంలో మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయి. కొణతాల పాలెం సమీపంలో దన్నాన సత్యనారాయణకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గల షెడ్లో గల మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సుమారు రూ.2 లక్షల విలువైన మోటార్లు చోరీకి గురవడంతో పోలీస్ష్టేషన్లో బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు.షెడ్ తలుపులు విరగ్గొట్టి దొంతనానికి పాల్పడినట్లు బాధిత రైతు ఫిర్యాదులో తెలియజేశాడు. ఇదే తరహాలో మండలంలోని పలు గ్రామాలులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు తరుచూ చోరీకి గురవుతూనే ఉన్నాయి. పోక్సో కేసు నమోదువిజయనగరం క్రైమ్: జిల్లాకేంద్రం విజయనగరం వన్‌టౌన్ పరిధిలో రెండో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించి విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు బుధవారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. వన్‌టౌన్ పరిధిలో ఉన్న ఓ స్కూల్‌కు రిక్షాలో రెండేళ్లుగా పాపను తీసుకువెళ్లి, తీసుకువచ్చే 56 ఏళ్ల వ్యక్తి మంగళవారం సాయంత్రం చిన్నారిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తున్న సమయంలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేసరికి చిన్నారిపై లైంగికదాడికి యత్నిస్తుండగా స్థానికులు చూసి చితకబాది వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితుడిపై దిశ స్టేషన్లో పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంరామభద్రపురం: మండలంలోని చందాపురం గ్రామ పరిధిలో బుధవారం ఎకై ్సజ్ సీఐ పి చిన్నంనాయుడు సిబ్బందితో కలిసి సారాబట్టీలపై దాడులు చేశారు. ఈ క్రమంలో 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా సారా తయారు చేసే నిర్వాహకులు, మద్యం దుకాణ యజమానులు బెల్టు షాపుల ఏర్పాటుకు ప్రోత్సహించినా, అక్రమంగా సరఫరా చేసిట్లు తనిఖీలలో గుర్తిస్తే ఆయా లైసెన్స్‌దారులపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. -
విద్యార్థుల మేధాశక్తికి ప్రదర్శనలు అవసరం
రాయగడ: విద్యార్థుల మేధాశక్తికి పదునుపెట్టేలా విధంగా విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కల్యాణసింగుపూర్ అటవీ శాఖ రేంజర్ చందన్ గొమాంగొ అన్నారు. జిల్లాలొని కల్యాణసింగుపూర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన విజ్ఞాన ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను కనబరిచేందుకు ఇలాంటివి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సమితిలో గల వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 80 ప్రాజెక్టులను ప్రదర్శించారు. సమితి ఏబీఈఓ మోహనరావు కొండగిరి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనకు బహుమతులను అందజేశారు. బిసంకటక్ సమితి వైస్ చైర్మన్‌పై కేసు నమోదు రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న దేవి ప్రసాద్ పట్నాయక్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిసంకటక్‌లో గల ఆదివాసీ ఉన్నయన పరిషత్ తరఫున సొమవారం సాయంత్రం ఈ మేరకు పొలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వడం విశేషం. ఆదివాసీ ఉన్నయన పరిషత్‌కు చెందిన అంగద్ కుట్రుక, సహకార్యదర్శి అభికలకకల నేతృత్వంలో ఆదివాసీలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పట్నాయక్ పై కేసు వేశారు. ఈ నెల 15వ తేదీన దేవి పట్నాయక్ తన వ్యక్తిగత ఫేస్బుక్లో ఈ ప్రాంతానికి చెందిన ఆదివాసీలు ఎందుకూ పనికిరాని దద్దమ్మలని పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో దీనిపై స్పందించిన ఆ ప్రాంత ఆదివాసీ ఉన్నయన పరిషత్‌కు చెందిన అధ్యక్షులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. అది పొరపాటును పోస్ట్ అయ్యిందని, వెంటనే డిలీట్ చేశానని ఆయన అన్నారు. దీనిపై ఆదివాసీ నాయకులతో మాట్లాడతానన్నారు. -
వన్డే మ్యాచ్ టికెట్ ధరలు తగ్గింపు
భువనేశ్వర్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ ధరల్ని తగ్గించినట్లు రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్ మంగళ వారం ప్రకటించారు. స్థానిక కళింగ స్టేడియంలో మంత్రి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల 9వ తేదీన కటక్ బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. క్రీడా విభాగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ఓసీఏ అధికార వర్గాలు, రాష్ట్ర క్రీడా విభాగం అధికారులు సమావేశమై చర్చించారు. లోగడ ఒడిశా క్రికెటు అసోసియేషను నిర్ధారించిన భారత్, ఇంగ్లండు వన్డే క్రికెటు మ్యాచ్ టికెటు ధరల్ని తగ్గించాలని నిర్ణయించారు. న్యూ పెవెలియన్, కార్పొరేటు బాక్సు టికెట్లు మినహా ఇతర వర్గాల టికెటు ధరల్ని తగ్గించారు. ఈ నిర్ణయం ప్రకారం మ్యాచ్ టికెటు తాజా ధరల వివరాలిలా ఉన్నాయి. ● 1, 3వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 12 వేల నుంచి రూ. 11 వేలకు తగ్గించారు. ● 2, 4వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 1,000 నుంచి రూ. 900కి తగ్గించారు. ● 5వ నంబరు గ్యాలరీ ధరని రూ. 1,500 నుంచి రూ. 1,200కి, 7వ నంబరు గ్యాలరీ టికెటు ధరని రూ. 800 నుంచి రూ. 700కి తగ్గించారు. ● ఎన్‌క్లోజరు టికెటు ధరని రూ. 8 వేలు నుంచి రూ. 7 వేలకి తగ్గించారు. ● ఎయిర్ కండిషన్ గ్యాలరీ బాక్సు టికెటు ధరని రూ. 9 వేల నుంచి రూ. 8 వేలకి తగ్గించారు. ● లోగడ ఒడిశా క్రికెటు అసోసియేషను నిర్ధారించిన న్యూ పెవెలియన్ టికెటు ధర రూ. 10 వేలు, కార్పొరేటు బాక్సు టికెటు ధర రూ. 20,000గా కొనసాగుతుంది. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
● కనీస మద్దతు ధర రూ.2,300 ● సాగు పెట్టుబడి ప్రోత్సాహం రూ.800 ● డిప్యూటీ సీఎం కనక వర్ధన్ సింగ్ దేవ్ ప్రకటనభువనేశ్వర్: రాష్ట్రంలోని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని డిప్యూటీ సీఎం, వ్యవసాయం, రైతు సాధికారిత విభాగం మంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ తెలిపారు. ఈసారి ధాన్యం విక్రయించే రైతులకు కనీస మద్దతు ధర రూ.2,300 లతో అదనంగా సాగు పెట్టుబడి ప్రోత్సాహం కింద రూ.800లు లభిస్తాయి. ఈ మొత్తం విడుదల డిసెంబర్ 8వ తేదీ నుంచి ఆరంభం అవుతుంది. రైతుల పొదుపు ఖాతాకు ప్రత్యక్షంగా ఈ సొమ్ము బదిలీ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. పారదర్శకంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు తొలిసారిగా రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది. పూర్తి విభిన్నంగా రైతులకు అనుకూలంగా ఉండే రీతిలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సమగ్ర ప్రక్రియ అత్యంత సరళంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేశారు. విక్రయానికి సిద్ధం చేసిన ధాన్యం నాణ్యత పరిశీలన కోసం ప్రత్యేక ధాన్య నాణ్యత విశ్లేషకులను నియమించారు. వరి సేకరణ, కొనుగోళ్లు మండీ ప్రాంగణాల్లో ఈ యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. వరి సాగు పుష్కలంగా ఉండి అధికంగా విక్రయించే ప్రాంగణాల్లో ఈ నిపుణుల బృందాలను నియమించారు. కొన్ని ప్రాంతాలు మినహా అత్యధిక ప్రాంతాల్లో ధాన్యం నాణ్యత విశ్లేషకులు అందుబాటులో ఉంటారని మంత్రి వివరించారు. సందేహాల నివృత్తికి ధాన్యం విక్రయాలు పురస్కరించుకుని రైతాంగం సందేహాల నివృత్తికి సమగ్ర నియమావళి అందుబాటులో ఉంటుంది. వరి నాణ్యత (తేమ వంటి అంశాలు) విశ్లేషణ పారదర్శకంగా ప్రదర్శితం అవుతుంది. ఒక్కో రైతు వరి విక్రయం పురస్కరించుకుని 2 చొప్పున టోకెన్లు జారీ చేస్తారు. వీటిలో ఒకటి రైతు దగ్గర, మరొకటి ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీని ఆధారంగా వరి విక్రయం లావాదేవీల సమగ్ర సమాచారం పారదర్శంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి వివరించారు. ఈ లెక్కన ఈ ఏడాది వరి విక్రయం అత్యంత సరళీకర వ్యవస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా విజయవంతం కాగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. -
కార్చిచ్చు నివారణకు కసరత్తు
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ హాల్ నంబర్ 1లో జిల్లా స్థాయి అగ్నినివారణ సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.ఆనంద్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సబ్ కలెక్టర్ అనూప్ పండా అటవీ రేంజ్ అధికారులు, తహసీల్దార్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. శీతాకాలంలో గజపతి జిల్లాలో మొత్తం అటవీ ప్రాంతాల్లో గత ఏడాది 921 పాయింట్లలో తరచూ అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. ముఖ్యంగా మోహన, ఆర్.ఉదయగిరి, నువాగడ అటవీ ప్రాంతాల్లో 2024– 25అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు నివారించడానికి యాక్షన్ ప్లాన్ అవసరమని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల అనేక విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో కార్చిచ్చు ఆపడానికి తగు చర్యలను అధికారులు వివరించారు. అటవీ ప్రాంతాల్లో దగ్గరలోని పంచాయతీ సర్పంచులు చొరవ తీసుకుని అగ్నిప్రమాదాల నివారణకు ఉపక్రమిస్తే వారికి తగు పారితోషికం, సత్కారం అందిస్తామని డీఎఫ్ఓ తెలిపారు. -
సహకార సంఘాలతోనే రైతుల ప్రగతి
పర్లాకిమిడి: రైతుల ఆర్థిక, సామాజికాభివృద్ధికి సహకార సంఘాలు దోహదపడతాయని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్.ఆర్.ఫంక్షన్ హాలులో జరిగిన 72వ భారతీయ సహకార సంఘాల వారోత్సవాల్లో కలెక్టర్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎస్పీ జితేంద్రనాథ్ పండా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సబ్ కలెక్టర్ అనూప్ పండా, బరంపురం కోపరేటివ్ సొసైటీల అధికారి నృసింహా చరణ్ బెహరా, జిల్లా వ్యవసాయ అధికారి రాంప్రసాద్ పాత్రో, నాబార్డు ఏజీఎం ప్రతీక్ పండా తదితరులు హాజరయ్యారు. రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద పరపతి వాడే కంటే, ప్రభుత్వ సహకార పరపతి వద్ద స్వల్పకాలిక రుణాలు తీసుకుంటే మంచిదని కలెక్టర్ దాస్ ఉద్బోధించారు. అనంతరం జెడ్పీటీసీ ఎస్.బాలరాజు మాట్లాడుతూ, ఈ ఏడాది రైతులు ఖరీఫ్ ధాన్యం మండీల వద్దే విక్రయాలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర తీసుకోవాలన్నారు. సహకార పరపతి సంఘాలు, రైతులకు అవినాభావ సంబంధం ఉందని బాలరాజు అన్నారు. స్వల్పకాలిక పరపతి సంఘాల రుణాలు తీసుకుని పంపుసెట్లు, బోరుబావులు తవ్వించుకుని రైతులు లాభదాయకమైన పంటలు పండించవచ్చని సబ్ కలెక్టర్ అనుప్ పండా అన్నారు. జిల్లాలో 87 సహకార పరపతి సంఘాలు ఉన్నాయని, వాటి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఈ ఏడాది ఖరీఫ్ పంట విక్రయం చేసుకోవచ్చని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఈ సందర్భంగా గత 35 ఏళ్లుగా బరంపురం కో ఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అర్బన్ బ్యాంకు డైరెక్టర్ అభిమన్యుపండా, బరంపురం కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్, ఆర్.యం.సి.యస్. డైరక్టరు కోడూరు కిరణ్ కుమార్, తంపరకవిటి సొసైటీ డైరెక్టర్ గేదెల శ్రీధరనాయుడుని సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా భాజపా కృషక్ మోర్చా అధ్యక్షులు ప్రశాంత పాలో తదితరులు కూడా మాట్లాడారు. -
ఖరీఫ్ ధాన్యం సేకరణ లక్ష్యం 94.37 మెట్రిక్ టన్నులు
రాయగడ: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 94.37 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో ఖరీప్ ధాన్యం సేకరణ పై అధికారులు, మిల్లర్లు, రైతులతో ఆమె మంగళవారం సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం ప్రతి క్వింటాల్ ధాన్యంకు ఇన్పుట్ సహకారంతొ అదనంగా మరో రూ.800 చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో గల 11 సమితుల్లో 21504 మంది రైతుల ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆమె వివరించారు. ధాన్య భాండాగారంగా గుర్తింపు పొందిన పద్మపూర్ సమితిలో అత్యధికంగా 3752 మంది రైతులు నమోదు చేసుకున్న వారిలో ఉన్నట్లు ఆమె తెలిపారు. ధాన్యం సేకరణ వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. సమావేశంలో రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, సబ్ కలెక్టర్ (రాయగడ)కళ్యాణిసంఘమిత్రాదేవి, సబ్ కలెక్టర్ (గుణుపూర్ ) సహాట తదితరులు పాల్గొన్నారు. -
నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి రాక
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె పర్యటన ఖరారైంది. డిసెంబరు నెల 4న పూరీ బ్లూ ఫ్లాగ్ తీరంలో నేవీ దినం వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా డిసెంబరు నెల 3 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సొంత జిల్లా మయూర్భంజ్ సందర్శిస్తారు. వచ్చే నెల 3న స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతారు. మర్నాడు పూరీ సాగర తీరంలో జరగనున్న నేవీ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాలుపంచుకుంటారు. అదే రోజు స్థానిక ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం ఓయూఏటీ 40వ కాన్వొకేషను కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబరు నెల 5న కొత్త జుడిషియల్ కోర్టు సముదాయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. మర్నాడు కోల్కత్తా మీదుగా ఆమె సొంత జిల్లా మయూర్భంజ్ చేరుతారు. కోల్‌కతా డిఫెన్సు ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక హెలికాప్టరులో మయూర్భంజ్ రొంగొమటియా వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గంలో దళిత గ్రామం ఉప్పొరొబెడా చేరుతారు. ఈ ప్రాంతంలో రాష్ట్రపతి విద్యాభ్యాసం పొందిన ప్రభుత్వ పాఠశాల సందర్శించి అక్కడి ఉపాధ్యాయులు, బాలలతో ప్రత్యక్షంగా సంభాషించి కాసేపు ముచ్చటగా కాలక్షేపం చేస్తారు. రాయరంగపూర్ తన సొంత ఇంటిలో ఆరోజు మద్యాహ్న భోజనం చేస్తారు. స్వగ్రామం ఆస్పత్రిలో అంబులెన్సు వాహన సేవల్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం రాయరంగపూర్ మహిళా కళాశాల సందర్శన పురస్కరించుకుని విద్యార్థినులతో సంభాషిస్తారు. అక్కడి పుణేశ్వర ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజాదుల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగియడంతో సొంత ఇంటికి చేరి రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానికులతో కలిసి మెలిసి కాసేపు గడిపి దండబోష్ ఎయిర్ స్ట్రిప్ నుంచి వాయు మార్గంలో బంగిరిపొషి చేరుతారు. ఆ ప్రాంతంలో 3 రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రపతి శంకు స్థాపన చేస్తారు. వీటిలో బాదం పహాడ్ – కెంజొహర్‌గొడొ, బంగిరపొషి – గోరుమొహిషాని మరియు బురామరా – చకులియా రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో దళిత పరిశోధన కేంద్రం నిర్మాణం, దండబోష్ ఎయిర్ స్ట్రిప్, సబ్ ఆస్పత్రి అభివృద్ధికి శంకు స్థాపన చేస్తారు. కార్యక్రమాలు ముగించుకుని కోల్‌కతా డిఫెన్సు ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక విమానంలో న్యూ ఢిల్లీకి తిరిగి వెళ్తారు. -
వికసిత ఒడిశా రూపకల్పనకు సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్ర అవతరణ శతాబ్ధి దగ్గర పడుతోంది. 2036 సంవత్సరంలో రాష్ట్రం శతాబ్ధి పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వికసిత ఒడిశా ఆవిష్కరించాలని నడుం బిగించింది. సాధికారిత సాధన దిశలో సరికొత్త ఆశలు, సృజనాత్మక కార్య శైలి, అభివృద్ధి చెందిన సమాజం వంటి ఉన్నత దృక్పథ కార్యాచరణ రూపకల్పన కోసం సమాజంలో అన్ని వర్గాల నుంచి అమూల్యమైన అభిప్రాయాల్ని ఆహ్వానించింది. ఈ గడువుని మరి కొద్ది కాలం పొడిగించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. లోగడ ప్రకటించిన ప్రకారం వికసిత ఒడిశా ఆవిష్కరణ ప్రతిపాదనల దాఖలు గడువు బుధవారం (ఈ నెల 20)తో ముగియాల్సి ఉంది. ఈ గడువుని డిసెంబరు నెల 5వ తేదీ వరకు పొడిగించారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ 2047కి సంబంధించిన మార్గదర్శకాల్ని ప్రజలు దాఖలు చేసేందుకు వీలవుతుందని ప్రకటించారు. నీతీ ఆయోగ్ ప్రముఖ కార్యనిర్వాహక అధికారి సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వికసిత్ ఒడిశా, వికసిత్ భారత్ ఆవిష్కరణకు సంబంధించి ప్రజాభిప్రాయాల దాఖలు ఇతరేతర అనుబంధ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కమిషనరు అనూ గర్గ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయాల దాఖలు గడువుని పొడిగించినట్లు ప్రకటించారు. భావి అవసరాలు, సవాళ్లని దృష్టిలో ఉంచుకుని వికసిత్ ఒడిశా దార్శనిక (విజన్) పత్రం రూపకల్పన జరగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అభ్యర్థించారు. సోమవారం సాయంత్రం సరికి సమాజంలో వివిధ వర్గాల నుంచి 15 వేల ప్రతిపాదనలు దాఖలైనట్లు అభివృద్ధి కమిషనరు తెలిపారు. డిసెంబరు నెల 5వ తేదీ వరకు ప్రతిపాదనల్ని దాఖలు చేసేందుకు వీలు అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాల్ని ఈ–మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా దాఖలు చేసేందుకు వీలు కల్పించారు. 63709–51920 నంబర్‌కు సూచనలు వాట్సాప్ చేయాలన్నారు. -
25 వేల మంది సభ్యత్వమే లక్ష్యం
కొరాపుట్: నబరంగ్‌పూర్ విధాన సభ స్థానంలో బీజేడీలో 25 మందిని సభ్యులుగా చేర్చాలనే లక్ష్యంగా పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ చంద్ర మజ్జి పిలుపునిచ్చారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో డొంబురు మజ్జి కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యులను చేర్చాలని సూచించారు. గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుత పాలకులు పేద ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం వైఖరిని ఎత్తిచూపాలన్నారు. పార్టీ నాయకులు ప్రతిప్ మజ్జి, సదాశివ ప్రధాని తదితరులు ప్రసంగించారు. -
సమస్యలు పరిష్కరించండి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితిలో మంగళవారం కలెక్టర్ వి.కీర్తి వాసన్ నిర్వహించిన ప్రజాభియోగ శిబిరంలో 40 ఫిర్యాదులు అందినట్లు బొరిగుమ్మ అధికారులు వెల్లడించారు. ఈ ఫిర్యాదులలో వ్యక్తిగతమైనవి 13, కమ్యూనిటీకి చెందినవి 27 వచ్చాయన్నారు. బొరిగుమ్మ సమితి ఇంజినీర్‌పై కుచులి గ్రామం ప్రతాపహోత్త ఫిర్యాదు చేశారు. హోర్దిలి గ్రామంలో ఉన్నత పాఠశాల ప్రాంతంలో సమితి తరఫున నూతన గృహం నిర్మించామని, నిర్మాణం పూర్తయి 3 ఏళ్లు గడచినా ఇంజినీర్ గుప్త దాస్ డబ్బు చెల్లించలేదని ఫిర్యాదులో ఆరోపించారు. తెలింగిరి డ్యామ్ నీరు కొద్ది రోజుల్లో బయటకు పోయి ఖాళీ అవుతుందని, సాగునీటి సమస్య పరిష్కరించాలని పోడాపొదర్ గ్రామం చిత్ర సేన్ నేతృత్వంలో రైతులు కోరారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులతోపాటు అదనపు బీడీఓ మాధురీ ఆచారి, ఏఈ ప్రకాశ్ ప్రధాన్, బీఈఓ సచిన్ కుమార్ మల్లిక్, సీడీపీఓ గాయత్రీ బాహిణీపతి తదితరులు పాల్గొన్నారు. -
ఏహెచ్‌పీ లబ్ధిదారులకు కేటాయింపు పత్రాల పంపిణీ
భువనేశ్వర్: నగరంలో సరసమైన గృహ ప్రాజెక్టు కింద లబ్ధిదారులకు రాష్ట్ర గృహ నిర్మాణం, నగర అభివృద్ధి విభాగం మంత్రి డాక్టరు కృష్ణ చంద్ర మహాపాత్రో కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు. స్థానిక ఇడ్కో ఆడిటోరియంలో మంగళ వారం జరిగిన లాటరీ కార్యక్రమంలో అర్హులైన వారికి మంత్రి ఈ పత్రాల్ని ప్రత్యక్షంగా అందజేశారు. రాజధాని నగరంలో ఇల్లు కలిగి ఉండడం సామాన్యునికి అతి పెద్ద కల. ప్రభుత్వం సగటు మనిషి కలని సాకారం చేసే దిశలో ఈ చర్యపట్ల చొరవ తీసుకున్నట్లు మంత్రి ప్రసంగంలో పేర్కొన్నారు. చంద్రశేఖర పూర్, నీల మాధవ్ ఆవాస్, సుబుద్ది పూర్ ప్రాంతాల్లో సరసమైన గృహ ప్రాజెక్టు పథకం నగర బీదల కోసం ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. ఈ ప్రాజెక్టుల కింద సమగ్రంగా 116 మందికి మంత్రి కేటాయింపు పత్రాలు అందజేశారు. చంద్రశేఖర పూర్ ప్రాంతంలో 47, నీల మాధవ్ ఆవాస్ ప్రాజెక్టు కింద 36, సుబుద్ధి పూర్ ప్రాంతంలో 28 ఇళ్లకు సంబంధించి కేటాయింపు పత్రాలు జారీ చేయడం పూర్తయ్యింది. చంద్రశేఖర పూర్ ప్రాంతం 20 ఎకరాల విస్తీర్ణంలో 2,600 ఇళ్ల నిర్మాణం చేపట్టి 820 నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిలో 737 మందికి అర్హులుగా పరిగణించి కేటాయింపు లేఖలు అందజేశారు. స్థానిక కేర్ ఆస్పత్రి చేరువలో నీల మాధవ్ ఆవాస్ ప్రాజెక్టు కింద 8.18 డెసిమల్ విస్తీర్ణపు స్థలంలో చేపట్టిన 1,200 ఇండ్ల నిర్మాణంలో 960 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 543 మంది అర్హులకు అందజేశారు. సుబుద్ధి పూర్ బరుణై ఎంక్లేవ్ ప్రాజెక్టు కింద 342 ఇండ్లు నిర్మించడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కింద 28 ఇళ్ళ నిర్మాణం పూర్తి కావడంతో అర్హులైన లబ్దిదారులకు కేటాయించారు. స్థానిక సత్య నగర్ ప్రాంతం 10 ఎకరాల సువిశాల విస్తీర్ణపు స్థలంలో కేశరి రెసిడెన్సీ బీదల వాడ పునరాభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ స్థలంలో 1,300 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా 560 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 454 మంది లబ్ధిదారులకు కేటాయించారు. -
ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి
జయపురం: ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకోవాలని జయపురం సబ్ కలెక్టర్ ఎ.శొశ్యా రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక నేహ్రూనగర్ జయపురం సిటీ ఉన్నత పాఠశాల శిశు ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల హెచ్ఎం బి.సుజాత అధ్యక్షతన జరిగిన శిశు ఉత్సవంలో ఆమె మాట్లాడుతూ తాము ఏమీ సాధించాలో విద్యా దశలోనే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. సాధించాలన్న పట్టుదల, కార్యదీక్ష ఉన్న నాడే గమ్యాన్ని చేరగలమన్నారు. శిశు ఉత్సవంలో పాఠశాల నిర్వాహకులు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన నృత్య, నాట్య ప్రదర్శనలు, చిన్నారుల విచిత్ర వేషధారణలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఇటీవల పాఠశాల యాజమాన్యం నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు సబ్ కలెక్టర్ బహుమతులు అందజేశారు. కమిటీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు శశిపట్నాయక్, తెలుగు సంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్ కలెక్టర్ అరెస్ట్
భువనేశ్వర్: ఢెంకనాల్ కామాక్ష్య నగర్ సబ్ కలెక్టర్ నారాయణ చంద్ర నాయక్‌ని మంగళవారం విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా లెక్కాజమ లేని ఆస్తులు ఆర్జించినట్లు అతనికి వ్యతిరేకంగా ఆరోపణ. సోమవారం నిర్వహించిన సోదాల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో అరెస్టు చేసినట్లు వివరించారు. సోదాల్లో భాగంగా భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో 3 బహుళ అంతస్తు భవనాలు, 14 ఇళ్ల స్థలాలు, 365 గ్రాముల బంగారం, రూ.34,57,000 బ్యాంకు పొదుపు ఖాతాలో నిల్వ, రూ.1.48 లక్షల నగదు స్వాధీనపరచుకున్నారు. బ్రిటిష్ వంతెనపై హెచ్చరిక బోర్డులు కొరాపుట్: కొరాపుట్–నబరంగ్‌పూర్ జిల్లాలను విడదీస్తున్న ఇంద్రావతి నది పై బ్రిటిష్ వారు ఇనుప వంతెన నిర్మించారు. ఆ నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. దాని మీద వాహనాలు రాకపోకలు లేనప్పటికీ పాదచారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ ప్రమాదకర గోతులు కనిపిస్తున్నాయి. వీటిని గమనించిన నబరంగ్‌పూర్ పట్టణానికి చెందిన ఐకాన్స్ ఇన్ మొషన్ష్ యువజన సంస్థ సభ్యులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 5టి పాఠశాలల పరిశీలన రాయగడ: గత ప్రభుత్వం అమలు చేసిన 5టి పథకంలో భాగంగా అభివృద్ధి చెందిన వివిధ పాఠశాలలను బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా మునిగుడలొ గల నొడల్ మాధ్యమిక ఉన్నత పాఠశాలలో పర్యటించిన ఆయన 5టి పథకంలొ మంజూరైన నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. సమితి ఏఈఓ ఐఽశ్వర్య భంజదేవ్ ఈ సందర్భంగా పాఠశాలలో గల వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నిధుల నుంచి అదనపు తరగతి గదులను నిర్మించేందుకు హామీ ఇచ్చారు. 25న అఖిల పక్ష సమావేశం భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభ స్పీకర్ సురమా పాఢి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఖరారైంది. శాసనసభలో ఆమె అధ్యక్షతన ఈ సమావేశం ఈనెల 25వ తేదీన జరుగుతుందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మంగళవారం తెలిపారు. శాసనసభ శీతాకాలం సమావేశాలు పురస్కరించుకుని అఖిల పక్షాలతో స్పీకర్ సమావేశం కానున్నట్లు మంత్రి వివరించారు. ఈనెల 26వ తేదీ నుంచి శాసనసభ శీతాకాలం సమావేశాలు ఆరంభం అవుతాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో 25 పని దినాలు ఉంటాయి. పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్నారు. విపక్షాల అభ్యర్థనలపై సమర్ధవంతంగా స్పందించేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉందని మంత్రి ముఖేష్ మహా లింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విడత సమావేశంలో మధ్యంతర బడ్జెట్‌ని సభలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. కొరాపుట్ @7.9 డిగ్రీల ఉష్ణోగ్రత కొరాపుట్: జిల్లాలో కనీస స్థాయిలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. మంగళవారం ఉదయం 7.9 డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యింది. దీంతో చలిపులి పంజా విసిరింది. సాయంత్రం 6 గంటలకే ప్రజలు ఇళ్లకి పరిమితం అవుతున్నారు. రాత్రిపూట సుదూర ప్రాంతాలకు నడిచే బస్సు సర్వీసుల్లో ప్రయాణికులు అల్పంగా ఉంటున్నారు. కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలక అగ్గిమంట వద్ద చలి కాచుకుంటూ, ప్రస్తుతం రాజకీయ వాతావరణం కూడా చల్లబడి పోయిందని సామాజిక మాద్యమాల్లో పేర్కొన్నారు. -
ఆంగ్లం విశ్వ భాష
– విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ జయపురం: ఇంగ్లిస్ విశ్వ భాష అని పాఠశాల, విద్యా విభాగశాఖ మంత్రి నిత్యానంద గోండ్ అన్నారు. మంగళవారం స్థానిక నేహ్రూనగర్ సిటీ ఉన్నత పాఠశాల సభా గృహంలో ఐదురోజుల ఇంగ్లిష్ భాష ఎన్రిచ్మెంట్ కోర్సు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంగ్ల భాషను మనం మాట్లాడ గలుగుతున్నాం, కానీ అనర్గళంగా మాట్టాడేందుకు కష్టపడుతున్నామన్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాషలో పాఠ్యాంశాలు బోధించటంలో సమస్యలు ఏర్పడుతున్నాయని, అందువలన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతునందని వెల్లడించారు. శిక్షణ పొందే ఉపాధ్యాయులు చక్కగా ఇంగ్లిష్ బోధించాలన్నారు. జిల్లా విద్యాధికారి ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ.. ఐదు రోజులు జరుగనున్న శిక్షక్షణలో కొరాపుట్, రాయగడ, గజపతి జిల్లాల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల నుంచి 52 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారని వెల్లడించారు. వారికి క్షీరబ్ కుమార్ బొటమిశ్ర, పార్ధసారథి పండా, దుర్యోధన ముదులి, సౌమ్యప్రసాద్ నాయక్, దేవేంద్ర కుమార్ దొర, రమేష్ చంద్ర సాహు, జయప్రకాశ్ మిశ్ర శిక్షణ ఇస్తారన్నారు. నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీశంకర మఝి, కార్యక్రమ కో ఆర్డినేటర్ చంద్ర కళా బొగర్తీ, విక్రమదేవ్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు మనోరంజన్ ప్రదాన్, సిటీ హైస్కూల్ హెచ్ఎం బి.సుజాత, తదితరులు పాల్గొన్నారు. -
అటవీ శాఖ సిబ్బంది సస్పెన్షన్
భువనేశ్వర్: ఆహార అన్వేషణలో విద్యుదాఘాతానికి గురై మూడు ఏనుగులు దుర్మరణం పాలయిన ఘటనలో ముగ్గురు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు సీనియర్ అధికారులను బా ధ్యులుగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని దర్యాప్తు బృందం విభాగానికి సిఫారసు చేసింది. అలాగే వన్య ప్రాణులను చేజిక్కించుకునేందుకు విద్యుత్ తీగలు పన్నిన ముఠాకు చెందిన ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం స్థానిక పోలీసుల సహకారంతో గాలిస్తున్నారు. హైకోర్టులో వ్యాజ్యం విద్యుదాఘాతంతో ఏనుగుల గుంపు దుర్మరణం విచారకర ఘటనపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా స్పందించింది. ఈ సంఘటనపై హైకోర్టు స్వయంగా ప్రజాహిత వ్యాజ్యం ప్రతిపాదించింది. ఈ వ్యాజ్యం విచారణకు ధర్మాసనం స్వీకరించి ప్రత్యర్థి వర్గాలకు తాఖీదులు జారీ చేసింది. వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు జారీ చేసింది. -
23 ఎకరాల్లోని గంజాయి పంట దహనం
జయపురం: బొయిపరిగుడ సమితి జి.మఝిగుడ పంచాయతీ కాట్రగుడ, బంసుయగుడ, బంశుగుడ గ్రామాల ప్రాంతాల్లో 23 ఎకరాల్లో రైతులు పండించిన గంజాయి పంటను పోలీసులు గుర్తించి దహనం చేసినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ మీడియాకు తెలిపారు. 23 ఎకరాల్లో 22,0300 గంజాయి మొక్కలను కాల్చివేసినట్లు వెల్లడించారు. జిల్లా వలంటరీ సురక్షా ఫోర్స్ సహకారంతో జరిగిన దాడుల్లో బొయిపరిగుడ పోలీసులు జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మ, మెజిస్ట్రేట్ బాధ్యతలు నిర్వహిస్తున్న బొయిపరిగుడ అదనపు తహసీల్దార్ ఖొగేశ్వర సౌరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి మాఫియా బొయిపొరిగుడ సమితిలో స్థావరాలు ఏర్పరుచుకొని ఆదివాసీలను ప్రలోభ పరచి గంజాయి సాగు చేయిస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే అలాంటి వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో వేదపండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ డీవీవీ.ప్రసాదరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
డీజీఎం సుబాష్ పండా అరెస్టు
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ పోలీసులు ఒడిశా పోలీసు హౌసింగ్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజరు సుబాష్ పండాని మంగళవారం అరెస్టు చేశారు. అక్రమ ఆస్తుల ఆర్జన ఆరోపణ ఆధారంగా సోమవారం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 2 బహుళ అంతస్తు భవనాలు, 1 ఫ్లాటు, 870 గ్రామలు బంగారం, 5 ఇళ్ల స్థలాలు, నగదు రూ. 13 లక్షల 50 వేలు, పొదుపు, పెట్టుబడుల్లో రూ. 1 కోటి 80 లక్షలు ఉన్నట్లు గర్తించారు. వీటి సమగ్ర విలువ ఆదాయం కంటే 303 శాతం అధికంగా లెక్క తేలింది. తల లేని మృతదేహంలో కేసులో ఆరుగురు అరెస్టు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 57 గ్రామంలో నదిలో బస్తాలో కట్టి పడేసిన మృతదేహాన్ని గత గురువారం కలిమెల పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహానికి తల లేదు. దర్యాప్తులో మృతుడు సుర్లుకొండ గ్రామానికి చెందిన పదియా మడ్కమి (47)గా తెలిసింది. ఇతను చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఆరుగురు వ్యక్తులు పొలంలో నిద్రపోతున్న సమయంలో తల నరికేసి తలలో పడేసినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితులైన సోడి పోడియామి, రామ పోడియామి, మున్న పోడియామి, ఇర్మా పోడియామి, పధలం పోడియామి, రామ కావసీలను మంగళవారం సుర్లుకొండ గ్రామంలో అరెస్టు చేసి కలిమెల పోలీస్‌స్టేషన్‌కు తెచ్చారు. ఈనెల 8న హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. రెండు బైక్‌లు ఢీ: నలుగురికి గాయాలు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీసు స్టేషన్ పరిధిలో గల ఎంవీ 126 గ్రామం వద్ద ఈ రోజు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో రెండు బైక్‌లు ఢీకొని నలుగురు గాయపడ్డారు. కనిమెట్ల గ్రామానికి చెందిన గంగా పోడియామి, కార్తీక్ పోడియామిలు ఒక బైక్‌పై వస్తున్నారు. మోటు వైపు నుంచి భీమా మధిర, నీల్ మధిర అనే ఇద్దరు మరో బైక్‌పై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. స్థానికులు చూసి వీరిని అంబులెన్స్ సాయంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మల్కన్‌గిరి తరలించారు. ఐఐసీ చంద్రకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
రోగాలపై అప్రమత్తత అవసరం
రాయగడ: రోగం సంక్రమించక ముందే అప్రమత్తతతో వ్యవహరించాలని సబ్ కలెక్టర్ కళ్యాణి సంఘమిత్రాదేవి అన్నారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురష్కరించుకుని స్థానిక సెంచూరియన్ ఫార్మసీ విభాగానికి చెందిన విద్యార్థులు మంగళవారం నిర్వహించిన అవగాహనర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక గజపతి కూడలి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జీసీడీ మైదానం వరకు కొనసాగింది. సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఫార్మసి విభాగానికి చెందిన డాక్టర్ చంద్ర శేఖర్ పాత్రో, అధ్యాపకులు గోపాలకృష్ణ పాడి, అవినాష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. ఏనుగు బాధితులకు పరిహారం ఇస్తాం పర్లాకిమిడి: కాశీనగర్ సమితిలోని జైగుడ గ్రామంలో నాలుగు అటవీ ఏనుగులు సంచరిస్తున్నట్టు జిల్లా అటవీశాఖ అధికారి సుబ్రహ్మణ్యం ఆనంద్ తెలిపారు. కాశీనగర్‌లో ఏనుగుల సంచారంపై ట్రాక్ చేస్తూ, టాటా విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపడుతున్నామని ఆయన అన్నారు. ఏనుగులు పంట పొలాలు నాశనం చేస్తున్నాయన్న ఫిర్యాదులపై డీఎఫ్ఓ ఆనంద్ స్పందిస్తూ దీనిపై పంట నష్టపరిహారం అంచనాలు వేస్తున్నామని, 45 రోజుల్లోగా నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. మత్స్య, ప్రాణి సంపద మేళా ప్రారంభం రాయగడ: స్థానిక రైల్వే గ్రౌండ్లో మంగళవారం జిల్లా స్థాయి మత్స్య, ప్రాణి సంపద మేళా ప్రారంభమైంది. రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక ముఖ్యఅతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలొ కలెక్టర్ ఫరూల్ పట్వారి, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో వలలు దగ్ధం ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని డి.మత్స్యలేశం పంచాయతీ కొత్తదిబ్బలపాలెం సముద్ర తీరంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో చేపల వలలు దగ్ధమయ్యాయి. ఉదయం 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్లాస్టిక్ తాళ్లతో ఉన్న వలలకు నిప్పంటుకోవడంతో మంటలు అదుపు చేయలేకపోయారు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో వలలు కాలిపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు చీకటి పండువాడు, రాము, సూరాడ కూర్మయ్య, కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత అక్టోబర్ 21న డి.మత్స్యలేశం తీరంలోనూ ఇలాగే వలలు కాలిపోయినా ఎందుకు ప్రమాదం జరిగిందో కారణం తెలియలేదు. ప్రమాదమా? వ్యక్తిగత కక్షలతో నిప్పుడు పెడుతున్నారా అన్నది తెలియడం లేదు. -
ఆలిండియా బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సీటీ బాక్సింగ్ పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు అర్హత సాధించారు. ఇటీవల విశాఖలోని ఆంధ్రయూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన అంతర్ కళాశాలల చాంపియన్ షిప్లో ఉత్తమప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు పతకాలు దక్కించుకోవడంతో పాటు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారుల్లో ఎస్.తేజేశ్వర్ 48 కిలోల విభాగంలో బంగారుపతకం, ఎ.సాయి 51 కిలోల విభాగంలో బంగారు పతకం, జి.లిఖిత్‌రెడ్డి 92 కేజీల విభాగంలో బంగారు పతకం, ఎస్.కె.సుల్తానా కాంస్య పతకం దక్కించుకున్నారు. ఆ నలుగురు క్రీడాకారులు డిసెంబర్ 26 నుంచి జనవరి2వ తేదీవరకు పంజాబ్‌లో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సీటీ పోటీలకు ఆంధ్రా యూనివర్సీటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. యూనివర్సిటీ స్థాయిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోలా మన్మథకుమార్, శాప్ కోచ్ బి.ఈశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు ఎస్.ఈ.రాజు, పీఎల్.ప్రసాద్, రింగ్ ఆఫీషియల్స్ వి.సంతోష్‌కుమార్, పి.శ్రీనివాసరావు, బి.జగదీష్‌నాయుడు తదితరులు అభినందించారు. వచ్చే నెల 26నుంచి పంజాబ్‌లో పోటీలు