Brinda Karat
-
కేరళ గవర్నర్‌పై బృందాకారత్ సంచలన వ్యాఖలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌పై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కావాలంటే ఖాన్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ‘గౌరవ గవర్నర్‌కు ఒకవేళ రాజకీయాలంటే ఆసక్తి ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి. పోటీచేసి రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. బీజేపీ టికెట్ తీసుకుని కేరళలోని ఏ స్థానం నుంచి అయినా ఆయన పోటీ చేయొచ్చు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. గవర్నర్ రోజూ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చే బదులు సీఎంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే మంచిది’అని బృందా కారత్ సూచించారు. కేరళ ప్రభుత్వం పంపిన యూనివర్సిటీ బిల్లులపై సంతకాలు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. దీంతో గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చెడిపోయాయి. యూనివర్సిటీ బిల్లులు మనీ బిల్లులయినందున గవర్నర్ ఆమోదం లేకుండా వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు. దీంతో ఆ బిల్లులపై ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. గవర్నర్‌కు ఈ బిల్లులపై డైరెక్షన్స్ ఇదీచదవండి..విజయ్‌కాంత్‌ను తల్చుకుని ప్రధాని భావోద్వేగం -
కేంద్రం చెప్పేదొకటి... చేసేదొకటి...
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది మరొ కటని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. పూర్తిగా అబద్ధాలు, వక్రీకర ణలు, విద్వేష ప్రసంగాలతో దేశాన్ని పాలిస్తున్నార ని ధ్వజమెత్తారు. కులమతాలతో సంబంధం లేకుండా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన చారిత్రక తెలంగాణ రైతాంగ సా యుధ పోరాట చరిత్రను కూడా ముస్లింరాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయ త్నం చేయడం అందులో భాగమేనని వ్యాఖ్యానించారు. ఆదివారం సుందరయ్య పార్కు వద్ద సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా బృందా కారత్ మాట్లాడుతూ బ్రిటిషర్లకు సలాంకొట్టిన ఆర్ ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు ఇప్పుడు తెలంగాణ వి మోచన దినం జరుపుతామని బయలుదేరడం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులే ఆనాడు బ్రిటిషర్లు, నిజాం, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు. దాని ఫలితంగానే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారే సెప్టెంబర్ 17న హైదరాబాద్‌కు వచ్చి వేడు కలు నిర్వహిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ పోరాటం కమ్యూనిస్టుల సొత్తు, వారి హక్కు అని స్పష్టం చేశారు. సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి. నర్సింహ్మరావు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. -
జంతర్ మంతర్ వద్ద బృందా కారత్కు చేదు అనుభవం
ఢిల్లీ: సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్(75)కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు గురువారం ఆమె చేరుకున్నారు. అయితే.. వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన బజరంగ్ పూనియా.. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పైకి బృందా కారత్ ఎక్కేందుకు యత్నించగా.. తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు.. కారత్ను ఉద్దేశిస్తూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం గమనార్హం. కారత్‌తో పాటు మరికొందరు కమ్యూనిస్ట్ నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు. ఆపై కాసేపటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. #WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk — ANI (@ANI) January 19, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ కైసర్‌గంజ్ ఎంపీ(ఉత్తర ప్రదేశ్) బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అవినీతి, మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ హస్తిన నడిబొడ్డున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్, మరో ఛాంపియన్ సాక్షి మాలిక్‌లు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. వ్యవహారం మరింత ముదిరింది. బ్రిజ్ భూషణ్, కోచ్‌లు.. మహిళా రెజర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు వాళ్లు. ఇక ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్.. తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కునేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. జజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు వారం కిందట తనను కలిశారని, ఇద్దరూ ఎలాంటి సమస్యలు లేవని తనతో చెప్పారని, ఈ నిరసనల వెనుక తనను దించేసే కుట్ర జరుగుతోందని, ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. మరోవైపు ఈ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శాస్త్రి భవన్‌లోని కేంద్ర క్రీడా శాఖల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించడానికి రెజ్లర్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని భజరంగ్ పూనియా సైతం ధృవీకరించారు. సమావేశం తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ పూనియా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. I request PM Modi to make sure that our wrestlers get justice. I will continue to stand with our athletes: Dr Krishna Poonia, Congress MLA & former gold-medal-winning track & field athlete, at Jantar Mantar in Delhi pic.twitter.com/GEVTLJFT2Z — ANI (@ANI) January 19, 2023 -
Jahangirpuri Bulldozers: రెండు గంటల హైడ్రామా తర్వాతే..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానికి చేరిన ‘బుల్డోజర్ ట్రీట్మెంట్’ రాజకీయాలు.. బుధవారం రసవత్తరంగా సాగాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు తమ పనిని కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10 గంటల సమయంలో.. ఎక్కడైతే హానుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో.. అదే ప్రాంతంలో అక్రమ కట్టాలంటూ కూల్చివేత పనులు మొదలుపెట్టారు అధికారులు. భద్రత కోసం సుమారు 400 మందిని పోలీస్ సిబ్బందిని వెంటపెట్టుకుని.. తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ నిర్మాణలంటూ కూల్చేసుకుంటూ పోయారు. ఈ క్రమంలో పిటిషనర్ సుప్రీం కోర్టును హుటాహుటిన ఆశ్రయించారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో మత ఘర్షణలను సాకుగా చూపిస్తూ ఒక వర్గం వాళ్ల కట్టడాలను కూల్చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కూల్చివేతను ఆపేయాలని ఆదేశించింది. కానీ.. కోర్టు ఆదేశాలు అందలేదని.. తమకింకా కోర్టు ఆదేశాలు అందలేదని చెబుతూ.. అధికారులు తమ పని చేసుకుంటూ ముందుకు పోయారు. అలా ఓ మసీదు గోడ, గేటును సైతం కూల్చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 12 గంటల ప్రాంతంలో సీపీఎం నేత బృందా కారత్.. కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బల్డోజర్‌కు ఎదురెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వీడియో సైతం ఒకటి బయటకు వచ్చింది. "The MCD is ignoring the Supreme Court's order staying the demolition. I am here to stop the demolitions and see to it that the court order is implemented": Brinda Karat, CPI(M) leader pic.twitter.com/x34D6oYzit — NDTV (@ndtv) April 20, 2022 స్పందించిన సీజే.. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేత ఆగలేదనే విషయం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వాళ్లకు(ఢిల్లీ మున్సిపల్ అధికారులకు) అందలేదని, దయచేసి ఈ విషయం వాళ్లకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. అంతేకాదు మీడియాలోనూ ఇది చూపిస్తున్నారని, ఇది సరైందని కాదని, ఆలస్యమైతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో.. సెక్రటరీ జనరల్ ద్వారా గానీ, సుప్రీం కోర్టు రిజిస్టర్ జనరల్ ద్వారాగానీ తక్షణమే మున్సిపల్ అధికారులతో మాట్లాడించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయవాది దవే నుంచి సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకుని.. సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించారు. అలా రెండు గంటల హైడ్రామా తర్వాత.. ఎట్టకేలకు ఢిల్లీ జహంగీర్‌పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇక పిటిషన్‌పై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు.. గురువారం వాదనలు విననుంది. -
ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్లకు ధారాదత్తం
తిరుపతి కల్చరల్: నవరత్నాల్లాంటి ప్రభుత్వ సంస్థలను అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ నుంచి ఈ దేశాన్ని కాపాడుకుందాం అంటూ జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి రామతులసీ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం సభ నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. 6,300 కోట్లకుపైగా లాభం వస్తున్న విశాఖ ఉక్కును అమ్మడంలో మర్మమేంటన్నారు. పోలవరం నిర్వాసితులకు ఒక్కపైసా నష్టపరిహారం, పునరావాసం కల్పించలేదన్నారు. త్వరలోనే తిరుపతి విమానాశ్రయాన్ని ఆదాని చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఏయూ క్యాంపస్ (విశాఖతూర్పు): ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం సత్వరమే నెరవేర్చాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విశాఖ రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చారని అది ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ విభేదాలున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కలసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం విశాఖపట్నంలోని ఏయూ స్నాతకోత్సవ మందిరంలో ‘ఈ నెల 27న దేశ బంధ్‌ను జయప్రదం చేయాలి..విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుందాం’ అనే నినాదంతో సీపీఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. బృందాకారత్ మాట్లాడుతూ.. కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తూ.. బడా వ్యాపారవేత్తలకు కేంద్ర ప్రభుత్వం బానిసలా వ్యవహరిస్తున్నదని, దేశ సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతుందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ బీజేపీ ప్రభుత్వం తన పరిపాలన సాగిస్తోందన్నారు. రైతులపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు నినదిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో తొమ్మిది నెలలుగా రైతులు అలుపెరగని పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో వలస కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కరోనా మహమ్మారి విలయానికి ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. దీన్ని కప్పిపుచ్చుతూ ఉచిత వ్యాక్సిన్ హోర్డింగ్‌లను పెట్టుకుంటూ మోదీ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను వదిలేసి మత సమస్యలపై పోరాడటం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కరోనాతో త్రిపుర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గౌతమ్‌దాస్ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సీపీఎం గ్రేటర్ నగర కార్యదర్శి బి.గంగారావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ నేత కొండయ్య ప్రసంగించారు. -
‘మోదీ తమ్ముడు కేసీఆర్ తీరు సరిగా లేదు’
ఖమ్మం/చుంచుపల్లి: ప్రజా వ్యతిరేక విధానాలతో నియం తలా పాలన సాగిస్తున్న ప్రధాని మోదీ ఆటలు ఇక చెల్లవని, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు తిరగబడే రోజు లు దగ్గరలోనే ఉన్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన పోడు సాగుదారు ల ప్రజా గర్జన సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరపకుండా మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతులు నేడు రోడ్లెక్కే పరి స్థితి ఎందుకొచ్చిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అదా నీ, అంబానీల కోసం రైతుల వెన్నువిరచాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. కేంద్రం వెంటనే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రైతులకు అండగా నిలిచి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దాలుగా పోడునే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులకు ప్రభుత్వాలు అటవీ చట్టాలను అమలుచేసి హక్కు పత్రాలివ్వాలని ఆమె డిమాండ్ చే శారు. రాష్ట్రంలో నరేంద్ర మోదీ తమ్ముడు కేసీఆర్.. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట అన్న తీరున వ్య వహరిస్తున్నారని విమర్శించారు. హరితహారం పేరుతో వారి నుంచి భూములను లాక్కు నే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు సగం కూడా ఇవ్వలేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మా ట్లాడుతూ ఆదివాసీలకు పట్టాలిచ్చే వరకు సీపీఎం ఆధ్వర్యంలో మిలిటెంట్ పో రాటాలు నిర్వహిస్తామన్నారు. కాగా, వ్యవసాయ చట్టాలకు తెలంగాణ ప్రభుత్వం వ్య తిరేకమే అయితే కేరళ మాదిరిగా రైతు చ ట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని బృందా కారత్ డిమాండ్ చేశారు. సోమవారం ‘సీఏఏ, ఎన్ఆర్సీ, మూడు వ్యవసాయ చట్టాలు–ప్రజల ముందున్న సవాళ్లు’అనే అంశంపై సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆమె మాట్లాడారు. -
మరోసారి వివాదాల్లో నాగేశ్వరరావు
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో మతసామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకురాలు బృందా కారత్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అత్యంత దారుణమైన రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన రావుపై ఢిల్లీ పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. (సీబీఐ అదనపు డైరెక్టర్ తొలగింపు..!) హిందువుల అణచివేత ముస్లింలకు అనుకూలంగా భారత చరిత్రను వక్రీకరించారనే అర్థం వచ్చేలా నాగేశ్వరరావు ట్విటర్లో పోస్ట్‌లు పెట్టారు. భారత నాగరికతను కుట్ర ప్రకారం ఇస్లామీకరణ(అబ్రహమైజేషన్) చేశారని ఆయన ఆరోపించారు. హిందువులను అన్ని రకాలుగా అణచివేశారని పలు వ్యాఖ్యలు చేశారు. వామపక్ష అనుకూల విద్యావేత్తలను నెత్తిన పెట్టుకుని, హిందూ అనుకూల జాతీయవాద పండితులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. 1947-77 మధ్య 30 ఏళ్లలో దేశానికి విద్యాశాఖ మంత్రులుగా 20 ఏళ్లు ముస్లింలు, మిగతా పదేళ్లు వామపక్షవాదులు ఉన్నారని.. హిందువుల పతనానికి ఇది మొదటి దశగా అని వర్ణించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 11 ఏళ్ల పాటు(1947-58) విద్యా శాఖ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. విద్యతో పాటు మీడియా, వినోద రంగాలను ఇస్లామీకరణ చేశారని.. హిందువుల ఉనికి ముప్పు వాటిల్లేలా కుట్రలు చేశారని నాగేశ్వరరావు పలు ఆరోపణలు చేశారు. రావుపై చర్యలు తీసుకోండి నాగేశ్వరరావు వ్యాఖ్యలపై బృందా కారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముస్లిం సమాజానికి చెందిన ఇతర ప్రముఖ విద్యావేత్తలను అవమానించి రెండు వర్గాల మధ్య శత్రుత్వ భావనలను ప్రేరేపించడానికి నాగేశ్వరరావు ప్రయత్నించారని కారత్ తన లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిబంధనలు ఉల్లఘించి బహిరంగంగా రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేసిన ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు వ్యాఖ్యలను పలువురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు తప్పుబట్టారు. వివాదాలకు చిరునామా మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం నాగేశ్వరరావుకు కొత్త కాదని ఆయన గతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. తొంభై దశకం చివరలో ఒడిశాలోని బెర్హంపూర్ డెవలప్మెంట్ అథారిటీలో అధికారిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని విషపూరిత మత ప్రకటనలు చేశారు. రెండు అధికారిక విచారణలు ఆయనను దోషిగా గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాయి. 2018లో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రావును నియమించినప్పుడు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోమ్గార్డ్స్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. -
కరోనా కాలం: అబార్షన్ల సంఖ్య పెరిగే అవకాశం!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో లాక్డౌన్ విధించిన వేళ గృహహింస కేసులు రెట్టింపు కావడం ఆందోళనకరంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా సొంత ఇంట్లోనే హింసకు గురవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మరో ఆందోళనకర వార్త సామాజిక కార్యరక్తలు, మానవ హక్కుల సంఘాలను కలవరపెడుతోంది. అంటువ్యాధి ప్రబలుతున్న తరుణంలో లింగ నిర్ధారణ పరీక్షలపై ఉన్న నిబంధనలను సడలిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టెలిగ్రాఫ్ పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సేవలను విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించింది. ప్రీనాటల్ డయాగ్నటిక్ టెక్నిక్స్(గర్భస్థ శిశువు నిర్ధారణ- లింగ ఎంపికపై నిషేధం) నిబంధనలు-1996 ప్రకారం.. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించే క్లినిక్‌లు అన్నీ.. తమ వద్ద పరీక్షలు చేయించుకున్న గర్భవతుల జాబితా స్థానిక ఆరోగ్య అధికారులకు సమర్పించాలి. ప్రస్తుతం కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోయిన కారణంగా.. వారికి మెరుగైన చికిత్సలు అందించే క్రమంలో ఈ నిబంధనలు సడలిస్తూ ఏప్రిల్ 4న కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30 వరకు ఎటువంటి రికార్డులు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది.(లాక్డౌన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!) కాగా 2018 గణాంకాల ప్రకారం భారత్‌లో దాదాపు 63 మిలియన్ మంది ఆడవాళ్లు ఉన్నారు. ఇక లాన్సెట్ అధ్యయనం ప్రకారం లింగ వివక్ష కారణంగా 2000-2005 మధ్య కాలంలో భారత్‌లో ఐదేళ్ల లోపు వయస్సున్న 239000 మంది బాలికలు మరణించారు. 2017 అధ్యయనం ప్రకారం 2015లో 15.6 మిలియన్ అబార్షన్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు సడలించిన కారణంగా గర్భంలో ఆడ శిశువులు ఉన్నారని తెలిస్తే అబార్షన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (గృహహింసకు ముగింపు పలకండి:యూఎన్ చీఫ్) ఈ క్రమంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆస్పత్రి యాజమాన్యాలు, తల్లిదండ్రులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘నిబంధనలు సడలించిన కారణంగా జూన్ 30 వరకు క్లినిక్‌లు సమాచారం అందించాల్సిన అవసరం లేదు. కొంతమంది దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్చగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్-19 సృష్టించిన పరస్థితులను చట్ట వ్యతిరేక చర్యలకు వినియోగించే అవకాశం ఉంది’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక సీపీఎం-ఎల్ సభ్యురాలు, అఖిల భారత అభ్యుదయ మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు కవితా కృష్ణన్ కూడా ఈ విషయంపై ట్విటర్లో స్పందించారు. The Health Ministry has suspended the ban on Sex determination tests for the period of the Covid-19 pandemic! So the pandemic will mean a free hand to sex selective abortion! Seriously @drharshvardhan? @narendramodi महामारी में बेटी नहीं बचाना है?! https://t.co/eyELwr9CFL — Kavita Krishnan (@kavita_krishnan) April 8, 2020 -
ఢిల్లీ హింసపై 12న విచారణ
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసపై వివిధ వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హింస, విద్వేషపూరిత ప్రసంగాలపై ఢిల్లీ హైకోర్టు మార్చి 12న విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. జస్టిస్ డీఎన్.పటేల్, జస్టిస్ హరిశంకర్ల ధర్మాసనం పౌరసత్వ సవరణ చట్ట అనుకూల, వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో చెలరేగిన హింసపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా, సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ఢిల్లీ పోలీసులూ, ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఢిల్లీ అల్లర్లకు సంబంధముందన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన వారి వివరాలను వెల్లడించాలంటూ కారత్ కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారి శవపరీక్షలను వీడియో రికార్డు చేయాలని సంబంధిత ఆసుపత్రులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా ఢిల్లీ అల్లర్ల వార్తలను ప్రసారం చేసినందుకుగానూ కేరళలోని మీడియా వన్, ఆసియానెట్ న్యూస్ చానెళ్లను కేంద్రం రెండు రోజుల పాటు సస్పెండ్ చేసింది. (చదవండి: బదిలీపై స్పందించిన జస్టిస్ మురళీధర్) -
వారిని చంపేందుకు 29న ముహూర్తం
బెంగళూరు: కర్ణాటకలో పలువురు ప్రముఖులను చంపుతామంటూ బెదిరింపు లేఖ ఓ ఆశ్రమానికి వచ్చింది. అందులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఈ నెల 29 బుధవారం రోజున హతమారుస్తామంటూ పేర్కొన్నారు. అయితే వీరి హిట్ లిస్టులో మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్, నిజాగుణానంద స్వామి యాక్టర్ చేతన్ కుమార్, భజరంగ్ దళ్ నాయకుడు మహేంద్రకుమార్, జర్నలిస్ట్ అగ్ని శ్రీధర్ సహా మొత్తంగా 15 మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడలో ఉన్న ఈ లేఖలో ధర్మానికి, దేశానికి ద్రోహం చేస్తున్నవారిని హతమార్చేందుకు జనవరి 29ని ముహూర్తంగా నిర్ణయించుకున్నామని, అందరూ తమ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలని లేఖలో తెలిపారు. ఈ మేరకు నిజగుణానంద స్వామి మఠానికి అనేకమంది పేర్లతో కూడిన లేఖ అందింది. అయితే ఆశ్రమ నిర్వాహకులు ఆ లేఖను జిల్లా ఎస్పీకి అందించారు. ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని పోలీసులు చెప్పగా, నిజగుణానంద స్వామి తిరస్కరించారు. అయితే తనను కూడా హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయంటూ మాజీ సీఎం కుమారస్వామి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. -
‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోయేలా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మహిళ ఆర్థిక మంత్రి పదవి చేపట్టినప్పటికీ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. శుక్రవారమిక్కడ ఆమె మాట్లాడుతూ... నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మీద కోలుకోలేని దెబ్బ పడిందన్నారు. గత 60 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని విమర్శించారు. ‘గ్రామీణ భారత దేశం పనులకోసం ఎదురు చూస్తుంది. బీజేపీ హయాంలో భారతదేశం నేర దేశంగా ఎదుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గత రెండేళ్లలో మహిళలపై దాదాపు 38000 అకృత్యాలు జరిగాయి. నేను జాతీయ నేర గణాంక లెక్కల ప్రకారమే ఈ వివరాలు చెబతున్నా. కొన్ని రాష్ట్రాలలో ఏకంగా ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కొంత మంది స్వామీజీలు కూడా ఉన్నారు’ అని నరేంద్ర మోదీ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. మోదీ సర్కారు తలాక్ బిల్లుపై చూపిన శ్రద్ధ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు చూపడం లేదని బృందాకారత్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు అధికార పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు సీపీఎం ఆధ్వర్యంలో మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు బృందాకారత్ తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. -
‘పరువు హత్యలపై చట్టం చేయాలి’
సాక్షి, చిత్తూరు : దళితుల పేరుతో ఓట్లు పొందిన వారు..ఇంతవరకు వారిని ఎందుకు చూడటం లేదని సీపీఐ(ఎం) కేంద్ర నాయకురాలు బృందా కారత్ మోదీ సర్కారును ప్రశ్నించారు. మంగళవారం పలమనేరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్క్రూటినీ లేకుండానే మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేసిందని విమర్శించారు. పరువు హత్యలపై తాను గతంలో ప్రైవేటు బిల్లు పెట్టినా.. ఇప్పటికీ చట్టం జరుగలేదని తెలిపారు. ఇందుకు గల కారణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని.. పరువు హత్యలపై కచ్చితంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
‘బీజేపీ హటావో.. దేశ్‌కో బచావో’ మా నినాదం
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట/నల్లగొండ టౌన్: ‘బీజేపీ హటావో.. దేశ్‌కీ బచావో’అనే ఎన్నికల నినాదంతో ముందుకెళ్తున్నామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. దేశంలో అల్లర్లు, కులాల మధ్య చిచ్చుపెడుతూ పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఎతైనా ఉందన్నారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో వామపక్షాలు బలపర్చిన నల్లగొండ ఎంపీ అభ్యర్థి మల్లు లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ అన్నింట్లో విఫలమయ్యారు కాబట్టే నేడు పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయదని, వారు కలిసే పనిచేస్తారన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న కవితపై వంద మందికి పైగా రైతులు పోటీ చేస్తున్నారంటే.. ఆమె ఎంపీగా రైతులతో కాకుండా బీజేపీతోనే ఎక్కువ కలిసి ఉన్నారని విమ ర్శించారు. బహిరంగ సభలో నల్లగొండ ఎంపీ అభ్యర్థి మల్లు లక్ష్మి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జి.రాములు పాల్గొన్నారు. -
ఎర్ర చుక్క.. లెక్క మారింది!
‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదం.. ఓట్లేసే వాళ్లకే సీట్లు అనే నినాదంగా మారిందా? సోషలిస్టు ఎజెండాను వదిలి.. బహుజన సమాజం అధికంగా ఉండే తెలంగాణలో సామాజిక ఎజెండాను ఎందుకు ఎత్తుకున్నారు? గతంలో మాదిరిగా సంప్రదాయ పార్టీలతో పొత్తులను సీపీఎం ఎందుకు వద్దనుకుంది? తోకపార్టీ ముద్ర పోగొట్టుకునేందుకా? సామాజిక మార్పు కోసమేనా? అసలు సీపీఎం రాజకీయ భవిష్యత్తు ఏం కానుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఏకైక సమాధానం ‘బీఎల్ఎఫ్’ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్). సామాజిక న్యాయం, రాజకీయాల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలే ప్రధాన ఎజెండాగా, బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదనతో ఏర్పాటైన ఈ ఫ్రంట్ రానున్న ఎన్నికలలో ఎలాంటి పాత్ర పోషించబోతోందనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈసారి ఎన్నికలలో స్వతంత్ర రాజకీయ పంథాను ఎంచుకుని వెళ్లాలన్న సీపీఎం నిర్ణయం అంత సులువుగా తీసుకున్నదేమీ కాదు. పార్టీలో చర్చోపచర్చలు జరిపి, గతాన్ని సమీక్షించుకుని, భవిష్యత్తుపై పక్కా అంచనాకు వచ్చిన తర్వాతే బీఎల్ఎఫ్ పేరుతో పెద్ద కామ్రేడ్లు ఎన్నికల బరి గీశారు. ముఖ్యంగా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను తెరపైకి తెచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి నమూనాను రూపొందించారు. తెలంగాణలో సామాజిక న్యాయం అమలు జరగాలని, అగ్రకులాల రాజకీయ ఆధిపత్యం పోవాలని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో అందరికీ అవకాశాలు రావాలని, అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండాలనే సిద్ధాంతపు పునాదులపైనే ఈ ఫ్రంట్ ఏర్పడింది. రాష్ట్రస్థాయిలో రాజ్యాంగబద్ధంగా ప్రధానమైన పదవి అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని తెలంగాణలో అన్ని వర్గాల కంటే ఎక్కువగా ఉండే వెనుకబడిన వర్గాల(బీసీలు)కు ప్రతిపాదించింది. సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉండగా, అదే కోణంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు కూడా అన్ని పార్టీల కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చి తమది సామాజిక ఎజెండానేనని చెప్పకనే చెప్పింది. సామాజిక కూర్పుతోనే.. ఈసారి ఎన్నికలలో సామాజిక ఎజెండాను ముందుపెట్టి సీపీఎం ప్రజల్లోకి వెళుతోంది. అందులో భాగంగానే బహుజన లెఫ్ట్ పార్టీ, ఎంసీపీఐ (యూ), తెలంగాణ లోక్‌సత్తా, తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ, మహాజన సమాజం లాంటి పార్టీలతో కలిసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పేరుతో జట్టు కట్టింది. ఇందులో ప్రధానంగా సామాజిక కోణాన్నే స్పృశిస్తోంది. అన్ని వర్గాలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం అనే నినాదం, బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రతిపాదన, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్న స్థానాల కన్నా ఎక్కువ సీట్లు కేటాయించడం, అగ్రవర్ణాలకు కేవలం ఏడు టికెట్లే ఇవ్వడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్క ఆసిఫాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అందులో 26 చోట్ల సీపీఎం పోటీ చేస్తోంది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఆ పార్టీ మొదటి నుంచీ చెబుతున్న విధంగా బీసీలకు 60 స్థానాలకు దగ్గరగా 58 స్థానాలను కేటాయించింది. ఎస్సీలకు 28, ఎస్టీలకు 15, ముస్లిం మైనార్టీలకు 10 స్థానాలు కేటాయించింది. ఓసీలకు కేవలం ఏడు చోట్లే అవకాశమిచ్చింది. బీసీల్లోనూ అత్యంత వెనుకబడిన, గుర్తింపు లేని కులాలు, సంచార జాతులకు టికెట్లు కేటాయించింది. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు తగినన్ని సీట్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. తెలంగాణలోని సామాజికవర్గాల జనాభా కు అనుగుణంగా, అందుకు సరిగ్గా తగినట్టుగానే బీఎల్ఎఫ్ సీట్లు కేటాయించింది. చీలనున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు! టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ తో కలిపి ఏర్పాటైన కూటమిలో చే రకుండా బీఎల్ఎఫ్ పక్షాన సీపీఎం పోటీచేస్తుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొన్ని స్థానాల్లో చీలిపోయే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కూటమికి బలంగా ఉండే ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సీపీఎం కూడా తోడయి ఉంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ రెండు జిల్లాల్లోని ఐదారు స్థానాల్లో సీపీఎంకు గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్, భద్రాచలం, వైరా, మధిర స్థానాల్లో చెప్పుకోదగిన స్థాయిలోనే ఆ పార్టీకి ఓట్లున్నాయి. ఈ స్థానాలతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల కూడా గౌరవప్రదంగానే ఓట్లు వస్తాయని అంచనా. ఈ మేరకు కూటమికి నష్టం కలుగుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశముందని తెలుస్తోంది. అయితే, తాము స్వతంత్రంగా పోటీచేయడం వల్ల కూటమితో పాటు టీఆర్ఎస్కు కూడా నష్టం జరుగుతుందని సీపీఎం నేతలు చెపుతున్నారు. 2014 ఎన్నికల్లో తాము పోటీచేసిన స్థానాలు మినహా అన్నిచోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులకు బహిరంగంగానే మద్దతిచ్చామని, ఇప్పుడు తామే బరిలోకి దిగడం ద్వారా ఆ మేరకు టీఆర్ఎస్ ఓటుబ్యాంకుకు చిల్లు పడ్డట్టేనని వారంటున్నారు. అధికార, విపక్షాలకు ఎంత మేరకు నష్టం జరుగుతుందనేది ప్రధానం కాదని, రాజకీయంగా తమ భవిష్యత్తు ఏంటనేది ప్రధానమని సీపీఎంలోని ఒక ముఖ్య నేత వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఏమయ్యేనో? ఎవరికి నష్టం జరిగినా.. ఎవరికి లాభం చేకూరినా.. ఈసారి ఎన్నికలలో బీఎల్ఎఫ్ పేరుతో పోటీ చేయడం ద్వారా సీపీఎం ఏ మేరకు రాజకీయంగా నిలదొక్కుకుంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా తోకపార్టీగా మిగిలిపోయిన కామ్రేడ్లలోని ఒక పార్టీ ఇకపై ఆ ముద్ర పోగొట్టుకున్నట్టేననే అభిప్రాయం ఓవైపు వ్యక్తమవుతుండగా, నామమాత్రపు ఓట్లు, సీట్లతో రాజకీయ ప్రయోజనం ఏమిటనే చర్చ కూడా జరుగుతోంది. ‘సీపీఎం ఒకటో, రెండో స్థానాలు గెలిస్తే గెలవచ్చు. అదీ లేకపోవచ్చు. అలాంటప్పుడు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే రాజకీయ శక్తిగా సీపీఎం ఏ దశలోనూ పనిచేయలేదు. ఆ పనిచేయకుండా సమకాలీన రాజకీయాల్లో పాతకాలపు సిద్ధాంతాలతో మనుగడ సాధించడం ఎలా సాధ్యమవుతుంది?. సీపీఎంకు ఈ అంచనా ఎందుకు రాలేదు? సీపీఎం ఆశించినట్టు జరగాలంటే మళ్లీ దశాబ్దాలు పడుతుంది. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మరికొంత విశాలంగా ఆలోచించి ఉంటే సీపీఎంకు లబ్ధి జరిగేదేమో?’ అని ఓ వామపక్ష శ్రేయోభిలాషి వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, సీపీఎం పక్షాలు మాత్రం తమ పంథా సరైందేననే భావనలో ఉన్నాయి. సీపీఎం గుర్తు వదిలి... ఎన్నికల సందర్భంలో పొత్తులు కుదుర్చుకున్నప్పుడు ఇతర పార్టీల గుర్తులకు కట్టుతప్పకుండా సీపీఎం శ్రేణుల ఓట్లు పడేవి. అయితే, పొత్తులు వద్దనే భావనతోనే ఎన్నాళ్లకయినా తమకంటూ ప్రజాక్షేత్రంలో బలం వస్తుందనే అంచనాతో ఈసారి సంప్రదాయ పార్టీలకు సీపీఎం దూరంగా ఉంది. కానీ, కేవలం 26 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గుర్తు ‘సుత్తి కొడవలి నక్షత్రం’పై పోటీచేస్తోంది. మిగిలిన అన్ని చోట్ల బీఎల్పీ పేరుతో రైతునాగలి గుర్తుకు ఓట్లేయాలని చెపుతోంది. సామాజిక ఎజెండాను పట్టుకుని గుర్తును వదిలి పోటీచేయాల్సి రావడం ఏ మేరకు పార్టీ భవిష్యత్తుకు ఉపకరిస్తుందనేది సీపీఎం శ్రేణులకే అర్థం కాని పరిస్థితి. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందా.. చీలికలు, పీలికలు అవుతుందా..? విద్యాధికులు కాని పార్టీ శ్రేణులు ఏం చేస్తాయన్నది పార్టీలో చర్చనీయాంశమవుతోంది. కూటమి అడిగినా... కాదన్నారు వాస్తవానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో మహాకూటమిలోకి సీపీఎంను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ బడానేతలు కొందరు సీపీఎం ముఖ్య నేతలతో చర్చలు జరిపి కూటమిలో చేరాల్సిన ఆవశ్యకతను చెప్పినప్పటికీ తమ్మినేని ‘నో’ చెప్పేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తమకు కూడా సానుకూల అభిప్రాయం ఏమీ లేనప్పటికీ తమ ఎజెండాతోనే ముందుకెళతామని ఆయన కాంగ్రెస్ నేతలకు తేల్చిచెప్పారు. ప్రతిసారీ ఏదో పార్టీతో పొత్తులు పెట్టుకుని పార్టీ పరంగా నష్టపోయామని, రాజకీయంగా తమ ఉనికిని స్వతంత్రంగానే కాపాడుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో సీపీఎం కూటమిలో చేరకుండా బీఎల్ఎఫ్లో భాగస్వామి అయింది. కమ్యూనిస్టుల ఐక్యత ఎండమావేనా..? కమ్యూనిస్టుల ఐక్యత గురించి ఎప్పుడూ ప్రధానంగా ప్రస్తావించే సీపీఎం ఈసారి ఎన్నికల్లో తోటి కామ్రేడ్లపైనే పోటీకి సిద్ధమైంది. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ పోటీచేస్తున్న మూడు స్థానాల్లోనూ బరిలో దిగింది. బెల్లంపల్లి, హుస్నాబాద్ లో బీఎల్ఎఫ్ అభ్యర్థులు పోటీచేస్తుండగా, వైరాలో ఏకంగా సీపీఎం పార్టీనే బరిలోకి దిగింది. అయితే, సీపీఐ మాత్రం తాము పోటీచేస్తున్న స్థానాల్లో మినహా అన్ని చోట్లా సీపీఎంకు మద్దతిస్తామని కూటమిలో చేరకముందు చెప్పినప్పటికీ అది సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఈసారి ఎన్నికలలో కమ్యూనిస్టుల ఐక్యత ఎండమావిగానే మిగిలిపోనుంది. బీఎల్ఎఫ్ ‘ప్రభావం’ ఇక్కడే.. మిర్యాలగూడ, భద్రాచలం, మధిర, వైరా, కొత్తగూడెం, పాలేరు, నారాయణపేట, భూపాలపల్లి, చెన్నూరు, ఆలేరు, జూబ్లీహిల్స్, గోషామహల్, జడ్చర్ల, వేములవాడ, వికారాబాద్.. ఈ స్థానాల్లో బీఎల్ఎఫ్ ప్రభావం ఉండనుందని సీపీఎం అంచనా. -
కాంగ్రెస్ కన్నా బీజేపీ పాలన అధ్వానం
భద్రాచలం: కాంగ్రెస్ పార్టీ విధానాలతో విసిగి వేసారిన ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తే, వారి పాలన మరీ అధ్వానంగా తయారైందని సీపీ ఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. గురువారం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి, పెట్టుబడిదారుల కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు, దీని వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతోందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లతో ప్రజలకు నష్టమేనన్నారు. అందుకే వీటికి ప్రత్యామ్నాయ శక్తిగా రాష్ట్రంలో బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ ఏర్పడిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ వంతపాడుతున్నారని, ఈ కారణంగా దోపిడీ వ్యవస్థ పెరిగిపోయిందని చెప్పారు. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంతోనే మిలాఖత్ అవుతూ వారికే మోకరిల్లుతున్నారని విమర్శించారు. -
మోదీ, కేసీఆర్ దొందూ దొందే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్దన్న అయితే.. సీఎం కేసీఆర్ చిన్నన్నగా వ్యవహరిస్తూ ప్రజలను నట్టేట ముంచుతున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మండిపడ్డారు. సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల పరిధిలోని కొణిజర్ల, ముదిగొండ మండల కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడంలో పోటీ పడుతున్నాయన్నారు. ఇదేమిటని ప్రశ్నించకపోతే, ఉద్యమ పంథాన పయనించకపోతే ఈ ప్రభుత్వాల దుందుడుకు చర్యలు నిలువరించలేమన్నారు. తెలంగాణలో రాజకీయ సుస్థిరత కొరవడిందని, అధికారమే లక్ష్యంగా రాజకీయ నేతలు ఉద యం ఒక పార్టీలో.. సాయంత్రం మరో పార్టీలో దర్శనమిస్తున్నారన్నారు. వీరికి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రజాకూటమి కాదని.. మహా కుర్చీలాట కూటమి అని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి వస్తే మాత్రం పాలనను టీఆర్ఎస్ తరహాలోనే కొనసాగిస్తారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేస్తూ.. మతం పేరుతో ప్రజలను విడదీస్తున్న మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు పలుకుతున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో దేశవ్యాప్తంగా 50 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. తెలంగాణలో 4 వేలకు పైగా ఆత్మ హత్య చేసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను ఓడించాలని పిలుపునిచ్చారు. సభల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులు భూక్యా వీరభద్రం, కోటా రాంబాబు, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి హైమావతి పాల్గొన్నారు. -
మోదీ పెద్దన్న.. చంద్రబాబు చిన్నన్న
సాక్షి, విజయవాడ : మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని సీపీఎం సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. దేశ భక్తులుగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు స్వాతంత్ర్య ఉద్యమంలో ఏమైపోయ్యారని ఆమె ప్రశ్నించారు. శనివారం విజయవాడలో జరిగిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల బహిరంగ సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని.. మనువాద ఎజెండాను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని కాపాడాలంటే మోదీని గద్దె దించాలని ఆమె అన్నారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ నడుస్తోందని.. కార్పొరేట్ శక్తులకు బీజేపీ సాగిలాపడిందని ఆమె విమర్శించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ..‘‘మోదీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై అధిక భారం మోపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో రికార్డు సృష్టించారు. మోదీ ప్రభుత్వం జేబు దొంగల ప్రభుత్వం, దేశ ప్రజల జేబులకు చిల్లులు పెడుతూ దొచ్చుకుంటున్నారు. మోదీ పాలన విధానం వల్ల దేశం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. మోదీ ఆర్థిక విధానాలకు అనుకూలంగా చంద్రబాబు అనుసరిస్తున్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ చంద్రబాబు కొత్తపాటు పాడుతున్నారు. దేశంలో మోదీ పెద్దన్న అయితే రాష్ట్రాంలో చంద్రబాబు చిన్నన్న’’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
‘ఆయన దోపిడీ ప్రభుత్వానికి నాయకుడు’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విరుచుకు పడ్డారు. నూతన అభివృద్ధి భారతాన్ని చూపుతామన్న మోదీ.. ఈ నాలుగేళ్లలో అసత్యాలు, దోపిడీల ప్రభుత్వాన్ని చూపిస్తున్నారని విమర్శల వర్షం గుప్పించారు. సీపీఐ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంచి రోజులు తెస్తామన్న మోదీ పాలనలో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని ఏచూరి ఆరోపించారు. వ్యవసాయంలో సంక్షోభం నెలకొనడంతో రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. కేవలం 2.05 లక్షల ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీతో అసంఘటిత రంగం కుదేలయిందని, ఈ సంస్కరణల వల్ల జీడీపీలో సగ భాగమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయనీ.. ప్రపంచంలో పెట్రోల్‌కు ఎక్కడా లేనంత అధిక ధర భారత దేశంలో ఉందన్నారు. మోదీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం తగ్గిందని అభిప్రాయపడ్డారు. దాడులు పెరిగాయి.. దళితులు, ఆదివాసీల అభివృద్ధికి పాటుపడతామని గొప్పలు చెప్పిన దేశ ప్రధాని చేసింది శూన్యమని బృందా కారత్ అన్నారు. ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో వారిపై దాడులు పెరిగాయని ఆమె తెలిపారు. రిజర్వేషన్లను నీరుగార్చడంతో ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీలు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలలో వనరుల దోపిడీకి కార్పొరేట్లకు అన్ని అనుమతులు ఇస్తున్నారని బృందా కారత్ ఆరోపించారు. -
ఏచూరీయే.. లేదంటే చీలికే?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా అనేదానిపై కామ్రేడ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీతారాం అనుకూల, వ్యతిరేక వర్గాలు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే మరో వర్గం.. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరును తెరపైకి తెచ్చింది. దీంతో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. సమావేశాల చివరిరోజైన ఏప్రిల్ 22న కొత్త ప్రధాన కార్యదర్శి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఏచూరీ వర్సెస్ కారత్ : పుచ్చలపల్లి సుందరయ్య మొదలుకుని ఈఎంఎస్ నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సుర్జిత్, ప్రకాశ్ కారత్ వరకు అందరూ కనీసం మూడు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఇదే సంప్రదాయం ప్రకారం.. సీతారాం ఏచూరీయే మరోసారి ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలూ లేకపోలేదు. కానీ పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళ గ్రూపుల్లో స్పష్టమైన విభేదాలు పొడసూపాయి. దీనికి తోడు మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరీ మధ్య కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. ఎన్నికలు అనివార్యమేనా..! ప్రకాశ్ కారత్కు కేరళ సీఎం పినరయి విజయన్ నుంచి బలమైన మద్దతుంది. దీనికితోడు పలు రాష్ట్రాల కామ్రెడ్లూ కారత్ వెంటే ఉన్నామంటున్నారు. 16 మంది సభ్యులున్న పొలిట్ బ్యూరో, 85 మంది సభ్యులున్న సెంట్రల్ కమిటీల్లో కారత్‌కే బలమైన మద్దతుంది. అయితే, ఏచూరీకి బలమైన మద్దతు లేదు. దీనికి తోడు, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసిపనిచేయటమే మంచిదని మొదట్నుంచీ ఈయన చెబుతూ వస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కారత్, ఆయన మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్ కామ్రెడ్లు మాత్రం ఏచూరీ ఆలోచన నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉందని.. కారత్ వ్యూహం స్టాలిన్ కాలం నాటి ఆలోచన అని అంటున్నారు. 21నాటి సమావేశంలో పార్టీ సెంట్రల్ కమిటీయే కొత్త ప్రధాన కార్యదర్శిపై నిర్ణయం తీసుకోనుంది. ఏచూరీ కాకుండా మరెవరైనా ఆసక్తి కనబరిస్తే.. ఎన్నికలు అనివార్యమే. ఏచూరీయే.. లేదంటే చీలికే? మరోవైపు ఏచూరీ, కారత్‌ల వ్యతిరేక వర్గం త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్‌ను తెరపైకి తెచ్చేందుకు యోచిస్తోంది. అటు మహిళలకు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. అదే జరిగితే.. ప్రకాశ్ కారత్ భార్య బృందా కారత్ ఒక్కరే పోటీదారు. పలువురి పేర్లు ప్రధాన కార్యదర్శి పదవికోసం తెరపైకి వస్తున్నప్పటికీ.. ఏచూరీకి మరోసారి అవకాశం ఇవ్వని పక్షంలో పార్టీలో భారీ చీలిక తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. -
'దారుణం, అన్యాయం'
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి దూరదర్శన్, ఆలిండియా రేడియో నిరాకరించడాన్ని సీపీఎం ఖండించింది. ఇది దారుణమైన, అన్యాయమైన చర్యగా సీపీఎం నాయకురాలు బృందా కారత్ వర్ణించారు. రాష్ట్రాలతో సహకారాత్మక సమాఖ్య విధానం అవలంభిస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 'నరేంద్ర మోదీ సహకారాత్మక సమాఖ్య విధానం గురించి మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో నేతృత్వంలోని ప్రభుత్వం.. దూరదర్శన్‌లో త్రిపుర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి నిరాకరించింది. సహకారాత్మక సమాఖ్య విధానం అంటే ఇదేనా? ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంలో మార్పులు చేసే అధికారం దూరదర్శన్‌కు ఎవరిచ్చారు? ఇది దారుణం, పూర్తిగా అన్యాయమ'ని బృందా కారత్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రసార మాధ్యమాల తీరును తీవ్రంగా ఖండిస్తూ సీపీఎం పొలిట్‌బ్యూరో పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే హక్కు ముఖ్యమంత్రికి ఉందని పేర్కొంది. మోదీ సర్కారు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని.. దూరదర్శన్, ప్రసార భారతి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందని విమర్శించింది. సీఎం మాణిక్ సర్కారు ప్రసంగాన్ని సీపీఎం తన అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. -
‘ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలే ఆజ్యం పోశాయి’
న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ’వీధి గుండా’లా వ్యవహరిస్తున్నాంటూ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో దీనిపై సీపీఎం నేత బృందా కారత్ స్పందించారు. సోమవారం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సందీప్ దీక్షిత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, అయితే ఒక నిర్దిష్ట సందర్భాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పడంతో ఆ వ్యవహారం ముగిసిపోయిందని అన్నారు. అయితే బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటం వల్లే వివాదం చెలరేగిందన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా తన పదవికి ఉన్న గౌరవాన్ని ఆయన తగ్గించినట్టయిందని, మన సైన్యానికి సంబంధించిన అంశాల విషయంలో ఆయన సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని బృందాకారత్ అభిప్రాయపడ్డారు. బిపిన్ రావత్ రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ, పాకిస్థాన్‌తో పాటు దేశంలోని ఉగ్రవాదులు, తీవ్రవాదులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్న అర్ధంలో రెండున్నర యుద్ధాలకు (టూ అండ్ ఆఫ్ వార్ ఫ్రంట్)కు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీనిపై సందీప్ దీక్షిత్ స్పందిస్తూ, రావత్ వ్యాఖ్యలు ఓ వీధి గూండాను తలపిస్తున్నాయని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో సందీప్ దీక్షిత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఈ దుమారం తగ్గలేదు. పేరున్న ఓ కాంగ్రెస్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. దీంతో సందీప్ దీక్షిత్ మరోసారి క్షమాపణలు చెప్పారు. తాను ఎలాంటి అనాగరిక భాష ఉపయోగించలేదని, బిపిన్ రావత్ మరోలా మాట్లాడాల్సి ఉందని చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. -
నుదుటిపై తొలిపొద్దు
సీపీఐ (ఎమ్) లీడర్ బృందాకారత్ తలరాతను ఎవరూ మార్చలేరంటారు. కానీ.. అదే తలరాత మీద రూపాయి బిళ్లంత ఉదయించే సూర్యుడు కనబడితే... ప్రతిరోజూ... ఒక అందమైన తొలిపొద్దు అవుతుంది. తలరాతను సైతం మార్చే ఉద్యమ సిందూరం అవుతుంది. బృందాకారత్... రోజూ ఉదయించే ఒక ఉద్యమం! ఎన్డీటీవీ వెబ్‌సైట్‌కి కనీసం నెలకొక ఆర్టికలైనా రాస్తుంటారు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. దేశంలోని పరిణామాల తీవ్రతను బట్టి ఒక్కో నెలలో రెండు ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి. ఈ ఏడాది జనవరి నెలలో ఆమె బెంగళూరు అకృత్యాలపై హోమ్ మినిస్టర్ వైఖరిని విమర్శించారు. అదే నెలలో, ‘గిరిజన మహిళలపై అత్యాచారం అన్నది ఒక ఆయుధం అయినప్పుడు...’ అంటూ ఒక వ్యాసం రాసి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తర్వాత ఫిబ్రవరిలో... కేరళ నటిపై జరిగిన లైంగిక నేరం... సమాజాన్ని కలవరపరుస్తున్న ధోరణులకు ఒక ప్రతిబింబమని ఆవేదన చెందారు. ఆర్టికల్స్ రాయడం కాకుండా, బృందాకారత్ నిర్వహించే సామాజిక బాధ్యతలు ఇంకా చాలానే ఉన్నాయి. రాజకీయంగా దేశంలోనే అత్యంత క్రియాశీలకంగా ఉండే కమ్యూనిస్టు కార్యకర్తల్లో బృందా ముఖ్యులు. మహిళా సమస్యలు దేశంలో ఎక్కడ తలెత్తినా మొదట నినదించే గొంతు, మొదట బిగుసుకునే పిడికిలి ఆమెదే! ఇరవై ఏళ్ల వయసు నుంచి పోరాట పథంలో ఉన్న ఈ 69 ఏళ్ల సీనియర్ నాయకురాలు ప్రస్తుతం... బెంగాల్ ప్రభుత్వ అరాచక కృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల టీచర్ల నియామకాలలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ మార్చి 9న విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరుపుతున్నప్పుడు వారిలోంచి పోలీసులు నలుగురు విద్యార్థినులను నిర్బంధంలోకి తీసుకుని ‘సెర్చింగ్ రూమ్’లో వారికి నరకం చూపించారు. బట్టలు తీయించారు. పీరియడ్స్‌లో ఉన్న ఒక యువతినైతే అండర్వేర్ కూడా తీయించి మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ దారుణంపై బృందాకారత్ ప్రస్తుతం ఉడికిపోతున్నారు. ఇదే విషయాన్ని ఈ నెల ఎన్డీటీవీ ఆర్టికల్ రాస్తూ, ఆరేళ్ల క్రితం ఆదివాసీ మహిళ సోని సోరిపై జరిగిన లైంగిక రాక్షసత్వానికి ఇది ఏమాత్రం తీసిపోని వికృతమైన అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బృందాకారత్ ‘ఐద్వా’ (ఆలిండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్) ఉపాధ్యక్షురాలు. ‘సెర్చింగ్ రూమ్’ ఘటనపై గత కొన్ని రోజులుగా ఐద్వా నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు తీవ్రరూపం దాల్చితే కనుక ఆ ఉద్యమ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు బెంగాల్ ప్రభుత్వం ఏ క్షణాన్నైనా బృందాకారత్‌ను అరెస్టు చేయవచ్చు. సాహసోపేతమైన సామాజిక కార్యకర్త బృందాకారత్ గురించి కొన్ని వివరాలు, విశేషాలు. చదువు... ఉద్యోగం... ఉద్యమం బృంద 13 ఏళ్ల వరకు కలకత్తాలో చదువుకున్నారు. అక్కడి నుండి డెహ్రాడూన్‌లోని వెల్హమ్ వెళ్లిపోయారు. అక్కడి ‘వెల్హమ్ గర్ల్స్ హైస్కూల్’లో చదువుకున్నారు. తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల ‘మిరాండ హౌస్’లో డిగ్రీలో చేరారు. 1967లో డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత లండన్‌లోని ఎయిర్ ఇండియా శాఖలో నాలుగేళ్లు పనిచేశారు. అక్కడ తప్పనిసరిగా స్కర్ట్లు ధరించాలి. చీర కట్టుకోడానికి లేదు. స్కర్ట్ ను ధరించాలన్న ఆ నిబంధనకు వ్యతిరేకంగా బృంద ఉద్యమించారు. దాంతో ఎయిర్ ఇండియా దిగివచ్చింది. నిబంధనను సడలించింది. స్కర్ట్ అయినా, చీర అయినా చాయిస్ మహిళా సిబ్బందిదే అని ప్రకటించింది! బృంద లండన్‌లో పనిచేస్తున్నపుడు వియత్నాం యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధ పర్యవసానాలు బృందను సామ్రాజ్యవాద వ్యతిరేకిగా, అంతకన్నా కూడా యుద్ధ వ్యతిరేకిగా మార్చాయి. లండన్‌లోని అనేక యుద్ధవ్యతిరేక ప్రదర్శనల్లో కూడా ఆమె పాల్గొన్నారు. 1971లో ఇండియా తిరిగొచ్చి, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.హిస్టరీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా క్యాంపస్‌లోను, బంగ్లాదేశ్ యుద్ధ శరణార్థుల శిబిరాలలోనూ పనిచేశారు. అప్పుడే పార్టీ పత్రికలో కొన్ని వ్యాసాలు రాశారు. తర్వాత పూర్తికాల కార్యకర్తగా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాలు ►కార్మిక సంఘాలలో పని చేయడం కోసం 1975లో ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో సీపీఐ(ఎం)కి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య. ఆయనే బృందకు ఢిల్లీ శాఖలో సభ్యత్వం ఇచ్చారు. అదే ఏడాది నవంబర్ ఏడున ఆమె పార్టీ కామ్రేడ్ ప్రకాశ్ కారత్‌ని పెళ్లి చేసుకున్నారు. ► ఢిల్లీలో జౌళిమిల్లు కార్మికుల తరఫున ఢిల్లీ కార్మిక సంఘాల సమన్వయకర్తగా పనిచేశారు. మహిళా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1980లలో అత్యాచార వ్యతిరేక చట్ట రూపకల్పన జరుగుతున్న క్రమంలో బృందా కారత్కు ప్రముఖంగా గుర్తింపు వచ్చింది. అనంతరం సీపీఐ(ఎం) మహిళా విభాగం అయిన ‘ఐద్వా’లో పూర్తి స్థాయి దీర్ఘకాలిక కార్యకర్తగా కొనసాగారు. ►2005లో పశ్చిమబెంగాల్ నుంచి పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలయ్యారు. అదే ఏడాది పార్టీ పొలిట్‌బ్యూరో తొలి మహిళా సభ్యురాలయ్యారు. ►పొలిట్‌బ్యూరోలో సభ్యత్వాన్ని బృంద పోరాడి సాధించుకున్నారనే చెప్పాలి. అయితే తన సభ్యత్వం కోసం ఆమె పోరాడలేదు. పొలిట్‌బ్యూరోలో అసలు మహిళల ప్రాతినిధ్యమే లేకపోవడాన్ని తప్పుపట్టారు. అందుకు ఆగ్రహించిన కేంద్ర కమిటీ ఆమెను తొలగించింది. అయితే అలా తొలగించడం లెనినిస్టు సిద్ధాంతాలకు విరుద్ధం అని గ్రహించి పునర్నియమించుకుంది. ఆ తర్వాతి పరిణామమే పొలిట్‌బ్యూరోలోకి మహిళల ప్రవేశం. అమ్మానాన్న! బృందాకారత్‌కు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి అశ్రుకణ చనిపోయారు. అశ్రుకణ అంటే అర్థం తెలిసిందే. కన్నీటి బిందువు. ఎన్నో కన్నీళ్ల నిరీక్షణ తర్వాత పుట్టిందని ఆమెకు ఆ పేరు పెట్టారు. అశ్రుకణ విప్లవవాది! ఆ కాలంలో ఆడవాళ్లకు ఎన్నో లక్ష్మణరేఖలు ఉండేవి. వాటిని దాటి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. ఒకేఒక ఆడకూతురు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఆమెకు అడ్డుచెప్పలేదు. చదువుకున్నంతా చదివించారు. బృంద తండ్రి సూరజ్ లాల్. లాహోర్ ఆయన పుట్టినిల్లు. ఉద్యోగం వెతుక్కుంటూ కలకత్తా వచ్చారు. మొదట పోర్ట్ కమిషనర్ ఆఫీసులో ఉద్యోగం సంపాదించారు. తర్వాత కాలగమనంలో పెద్దపెద్ద కంపెనీలకు డైరెక్టర్ అయ్యారు. ఉద్యమ సిందూరం బీజేపీకి, కమ్యూనిస్టులకు పడదు. మరి బొట్టుకు, బృందాకారత్‌కు ఎలా పడింది! ఏ కాలం నాటిదీ ప్రశ్న?! అయినా సరే, ఇప్పటికీ బృందను అడుగుతుంటారు. ‘మీరేమో ఉద్యమ వనిత. మీ నుదుటిపై మాత్రం సంప్రదాయ సిందూరం. ఏమిటీ వైరుధ్యం?’ అని. ఈ మాటకు నవ్వుతారామె. సిందూరం వ్యక్తిగతం. ఉద్యమం సామాజికం అనే అర్థం ఆ నవ్వులో కనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 17కు ఆమెకు 70 ఏళ్లు నిండుతాయి. కానీ ఆమె చలాకీదనం ఆమె వయసును ఏళ్లుగా ధిక్కరిస్తూ వస్తోంది. నిరంతరం ఆమె ప్రజా ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉండడమే ఆమె అందం, ఆరోగ్య రహస్యం కావచ్చు. అయినా అవిశ్రాంతంగా శ్రమిస్తుండే ఒక సామాజిక కార్యకర్త అందచందాల గురించి అదొక ముఖ్యాంశంగా మాట్లాడుకోవడం సరికాదేమో! కార్మిక సంఘాల నాయకురాలిగా సీపీఐ(ఎం)లోకి వచ్చిన ఈ వామపక్ష యోధురాలు గత ముప్పై ఏళ్లుగా నిరుపేదలు, దళితులు, మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. సర్వకాల సర్వైవల్ మహిళా సమస్యలు, మహిళా ఉద్యమాలపై 2005 ఏప్రిల్‌లో బృందాకారత్ ఈ పుస్తకం రాశారు. బృంద స్వీయానుభవాలు, సునిశిత పరిశీలనల కలబోతే ‘సర్వైవల్ అండ్ ఇమాన్సిపేషన్’. సుప్రసిద్ధ మార్క్సిస్టు సిద్ధాంతి, రాజకీయ వ్యాఖ్యాత అయిన ఐజీజ్ అహ్మద్ మాటల్లో చెప్పాలంటే... ‘ఇది అరుదైన పుస్తకం. సమాచారం ఇస్తుంది. సూచనలిస్తుంది. స్ఫూర్తినిస్తుంది’. మల్టిపుల్ స్ట్రగుల్స్, గ్లోబలైజేషన్స్ అండ్ సర్వైవల్ ఇష్యూస్, ఆన్ పొలిటికల్ పార్టిసిపేషన్, కమ్యూనలిజం అండ్ ఉమెన్, వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, ఎ పర్సనల్ రిమెంబరింగ్ అనే ఆరు అధ్యాయాలలో ‘స్త్రీల మనుగడ, దాస్యవిముక్తి’ అంశాలను పొందుపరిచారు. వివాదాలు యోగా గురు బాబా రామ్‌దేవ్... కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఆయన ఉత్పత్తి చేస్తున్న పదార్థాలలో మానవ ఎముకలను మిళితం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని బృందాకారత్ ప్రస్తావించడం వివాదాస్పదం అయింది. శరద్‌పవార్, ములాయంసింగ్ యాదవ్, అంబికా సోని, నారాయణ్ దత్ తివారీ వంటి రాజకీయ నాయకులు ఈ విషయమై బృందా కారత్‌పై తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బృందను తప్పుపట్టారు. భారతీయ జనతాపార్టీ ఫరీదాబాద్ నాయకుడొకరు ఏకంగా ఆమెకు లీగల్ నోటీసే పంపారు! అశ్రుకణ పెళ్లి పెద్ద సీన్ అయింది బృంద తల్లి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమె పెళ్లి నాటికే బృంద అమ్మమ్మ చనిపోయారు. ఆమె తాతయ్యకో పెద్దన్నయ్య ఉన్నాడు. ఆ పెద్దన్నయ్య వాళ్లది కోల్‌కతాలో పెద్ద పేరున్న కుటుంబం. ఆయనకు బృంద తల్లి కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. ఆ పెళ్లికి ఎవరూ వెళ్లడానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. దాంతో బృంద... అమ్మగారి వివాహం సుబోద్ మాలిక్ అనే స్వాతంత్య్ర సమరయోధుడి సహాయంతో జరిగింది. సుబోద్ ఇంటికి శ్రీ అరబిందో, రవీంద్రనాథ్ టాగోర్ వంటి జాతీయ నాయకులు వచ్చి వెళుతుండేవారు. దాంతో ఇంకెవరూ మాట్లాడేందుకు లేకుండాపోయింది. ఆ సమరయోధుడు బృంద తల్లికి బంధువు కూడా. బృందకు ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి. అన్న, అక్క చనిపోయారు. చెల్లి రాధికారాయ్ ఎన్డీటీవీ అధినేత ప్రణయ్‌రాయ్ భార్య. బృంద సహా పిల్లలంతా తల్లి భావాలకు అనుగుణంగా స్వేచ్ఛగా లౌకికవాదులుగా పెరిగారు. ప్రశ్న – జవాబు మార్క్స్–జ్యోతిబసు ఏ వయసులో మీరు కమ్యూనిస్టు అయ్యారు? 21–23 మధ్య. అంటే 1960ల చివర్లలో. భారతీయ విద్యార్థులు నక్సలైట్ ఉద్యమంలోకి ఉరుకుతున్న సమయం కదా అది! మీరెందుకని కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చారు? అప్పటికే మార్క్స్ నా మైండ్‌లో ఉన్నాడు. కళ్లెదుట జ్యోతిబసు ఉన్నారు. సీపీఐ(ఎం)లో చేరిపోయాను. క్రియాశీల కమ్యూనిస్టు రాజకీయాల్లోకన్నా, కార్మిక సంఘాల కార్యాచరణల్లోనే ఎక్కువగా కనిపించారు? నేనొక కమ్యూనిస్టు కార్యకర్తను... అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ. అత్యంత అప్రజాస్వామికమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటమే నేను ఎంచుకున్న లక్ష్యం. భారతదేశంలో కమ్యూనిజం విఫలమైనట్లు కనిపిస్తోంది. ఒక కార్యకర్తగా మిమ్మల్ని ఏనాడూ నిరాశ ఆవరించలేదా? నిలబడిపోవడం నిరాశ. నినదిస్తూ సాగిపోవడం కమ్యూనిజం. మేమెక్కడా నిలబడిపోలేదు. -
కేసీఆర్ దగాకోరు: బృందాకారత్
ఏటూరునాగారం: కేసీఆర్ పెద్ద దగా కోరని, సెంటిమెంట్‌తో ప్రధాని మోదీ, కేసీఆర్‌లు ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. సమన్యాయం, సమగ్రాభివృద్ధిపై సీపీ ఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం 100వ రోజుకు చేరుకున్న సందర్భం గా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారంలో ఏర్పాటుచేసిన ఆది వాసీ పోడు గర్జన సభలో ఆమె మాట్లాడారు. ప్రజాపోరాటాల ద్వారా ప్రభు త్వాల తీరును ఎండగడతామన్నారు. అక్టోబర్ 17న ప్రారంభమైన పాద యాత్ర వంద రోజుల పాటు 2,650 కి.మీ మేర చేపట్టిన రాష్ట్ర నాయకులు 9 మందికి కేంద్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
మోదీ ప్రసంగం పెద్ద డ్రామా: బృందాకరత్
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్ వేదికగా కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం పెద్ద డ్రామాగా ఆమె అభివర్ణించారు. కేంద్రం చర్యను వ్యతిరేకిస్తున్న విపక్షాలన్నీ కలిసికట్టుగా ఈ అంశంపై పోరాడతాయని సోమవారమిక్కడ స్పష్టం చేశారు. డిసెంబర్ 31 వరకూ పాత నోట్ల చెల్లుబాటయ్యేలా చూడాలని మోదీ సర్కార్‌ను కోరతామని బృందాకరత్ చెప్పారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ విషయంలో బద్దశత్రువు తృణమూల్‌తో కలిసి ముందుకెళ్లేందుకు అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు -
చంద్రబాబు.. మోదీకి లేఖ రాయడమా
-
చంద్రబాబు.. మోదీకి లేఖ రాయడమా: బృందాకరత్
ఎప్పుడూ పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలికే చంద్రబాబు.. నల్లధనం అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం విడ్డూరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మండిపడ్డారు. ఆక్వా ఫుడ్ పార్కు పేరుతో పేదల పొట్టగొట్టే చంద్రబాబు.. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని ఆమె విమర్శించారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఐడీఎస్-2016 పథకంలో మొత్తం రూ. 65వేల కోట్ల మేర నల్లధనాన్ని దేశవ్యాప్తంగా ప్రకటించగా, అందులో రూ. 13 వేల కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. అందులోనూ రూ. 10వేల కోట్లను ఒకే వ్యక్తి వెల్లడించారంటూ ఆయన తెలిపారు. ఈ అంశంపైనే బృందకరత్ మండిపడ్డారు. -
ఏపీలో గూండా సర్కారు
రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు : బృందా కారత్ ధ్వజం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని.. లాఠీలు, తుపాకీ గుళ్లను ప్రయోగించే గూండా సర్కారు రాజ్యమేలుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను నిర్మించడాన్ని నిరసిస్తూ.. భీమవరం పాత బస్టాండ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను ఉల్లంఘిస్తూ ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం దారుణమని దుయ్యబట్టారు. ప్రజల అంగీకారం లేకుండా పార్క్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించా రు. ఫుడ్‌పార్క్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆధైర్యంతో కన్నీరు పెట్టుకోకుండా, ప్రభుత్వంపై పోరాడి చంద్రబాబుకు కంటనీరు తెప్పించాలని పిలుపునిచ్చారు. కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులిస్తారా? స్వచ్ఛభారత్ అంటూ ప్రచారం చే స్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. -
'ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడపలేరు'
భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ధనవంతుల కోసమే పనిచేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన అఖిలపక్ష ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ, చంద్రబాబు పేర్లు వేరు కానీ బుద్ధి మాత్రం ఒక్కటేనని పేర్కొన్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను జైల్లో పెట్టి కంపెనీలను నడపలేరని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు మేకా శేషుబాబు మాట్లాడుతూ... చంద్రబాబు సర్కారు కార్పొరేట్ సంస్థలను పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. -
మోదీ ప్రతినిధిగా కేసీఆర్
- భూ నిర్వాసితుల మహాధర్నాలో బృందా కారత్ - సొంత నియోజకవర్గ ప్రజలపై లాఠీచార్జీ చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌దే - వాస్తవాలు చూడాలని సూచన సాక్షి, హైదరాబాద్ : కేంద్ర భూసేకరణ చట్టం 2013 ద్వారా కాకుండా జీవో 123 వంటి నల్ల చట్టాన్ని తీసుకొచ్చి సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ప్రతినిధినని చాటుకున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. పార్లమెంట్లో భూసేకరణ చట్టాన్ని సవరించే ప్రయత్నాల్లో విఫలమైన మోదీ... రాష్ట్రాల ద్వారా దొడ్డిదారిలో చేస్తున్న ఆ ప్రయత్నాలకు కేసీఆర్ చేదోడువాదోడుగా నిలుస్తున్నారన్నారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద ‘తెలంగాణ భూనిర్వాసితుల పోరాట కమిటీ’ నిర్వహించిన మహాధర్నాలో ఆమె ప్రసంగించారు. ‘రైతులు, నిర్వాసితులపై లాఠీచార్జీలకు పాల్పడుతూ... అప్రజాస్వామికంగా భూమిని లాక్కుంటూ బంగారు తెలంగాణను సాధించలేరు. తన సొంత నియోజకవర్గ పేదలు, రైతులపై లాఠీలు, తూటాలు ప్రయోగించి, కాళ్లు, చేతులు విరగ్గొంటించిన సీఎంగా దేశంలోనే ఎవరూ సాధించని ఘనత కేసీఆర్ దక్కించుకున్నారు’ అని బృందా కారత్ ఆరోపించారు. లాఠీచార్జ్జీకి కారకులైన డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేసి, బాధ్యులైన ఇతర పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన ప్రభుత్వ దృష్టి కోణాన్ని మార్చుకునేందుకు కళ్లజోడు మార్చుకోవాల న్నారు. తన నియోజకవర్గ ప్రజలు విరాళాలు వేసుకుని కొత్త కళ్లద్దాలు కొనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బిచ్చగాళ్లను చేస్తామంటే సహించం... ‘నాడు తెలంగాణ ఉద్యమంలో రోడ్లు దిగ్బం ధించి మంత్రి హరీశ్‌రావు వంటా వార్పు చేస్తే రైటు.. ఇప్పుడు భూనిర్వాసితులు రోడ్లపై బైఠాయిస్తే తప్పా’ అని జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నిం చారు. కేసీఆర్, హరీశ్‌రావు చట్ట, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. భూములపై నయానోభయానో సంతకాలు పెట్టించుకున్నం త మాత్రాన ప్రాజెక్టులు పూర్తికావని, ఇందులో అంతిమ విజయం ప్రజలదేనన్నారు. అణచి వేత చర్యలపై ప్రజలు, సంఘాలు, వివిధ పక్షాల ఐక్య ఉద్యమాల ద్వా రానే ప్రభుత్వానికి చెక్ పెట్టగలమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరి ట రైతులను బిచ్చగాళ్లను చేస్తామంటే సహిం చేది లేదన్నారు. కేసీఆర్‌కు కళ్లద్దాల కోసం విరాళం..! బృందాకారత్ ఇచ్చిన పిలుపు మేరకు భూని ర్వాసితులు కొందరు ఆందోళనకారులు కేసీఆర్ కు కళ్లద్దాలు కొనిచ్చేందుకు వంద నుంచి ఐదొందల రూపాయల వరకు విరాళాలు ఇచ్చా రు. ఈ మొత్తాన్ని సీఎంకు మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తామని భూనిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ బి.వెంకట్ తెలిపారు. ధర్నాలో పోటు రంగారావు (న్యూ డెమోక్రసీ), విమలక్క, పి.శంకర్ (డీబీఎఫ్), ప్రొ.పీఎల్వీ (ఆప్), రాజ య్య, జూలకంటి (సీపీఎం) పాల్గొన్నారు. భూములివ్వం... ఊళ్లో నుంచి పోం... మాకు ఎలాంటి రిజర్వాయర్ (పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు) అవసరంలేదు. ప్రాజెక్టులకు భూములివ్వం. ఊళ్లో నుంచి ఎక్కడికీ వెళ్లం. మా ఊరు ఉండాలి.. మా భూమి మాకే ఉండాలి. ఇప్పుడిప్పుడే వేసిన పంట చేతికొచ్చి అన్నం తినే సమయం వచ్చింది. రైతుల నోట్లో మట్టిపోసి ఆయన (సీఎం) బంగారం తింటారా? జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి ఇప్పుడు రిజర్వాయర్ల మంత్రి అయ్యారు. భూములు తీసుకుని కేసీఆర్ ఏమైనా రూపాయలు, బంగారంపై నిద్రపోతారా? - కె.మణెమ్మ, మహబూబ్‌నగర్ జిల్లా ఉద్దండపూర్ సర్పంచ్ కేంద్ర చట్టం అమలుకు పోరు.. ముచ్చర్ల ఫార్మాసిటీని 400 ఫార్మా కంపెనీల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఏ అవసరం కోసం భూమిని తీసుకుంటున్నారో స్పష్టంగా చెప్పడంలేదు. వాటర్‌గ్రిడ్ పేరుతో సంతకాలు పెట్టిస్తున్నారు. భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం లాక్కుంటుందని బెదిరిస్తున్నారు. అక్రమ భూసేకరణను ప్రశ్నించినందుకు వందలాది మందిపై కేసులు పెట్టారు. కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాస ప్యాకేజీ కోసం గట్టిగా పోరాడతాం. - రాంచందర్, ముచ్చర్ల ఫార్మాసిటీ బాధితుడు -
బృందా గానం!
చెన్నై :‘ సెంట్రల్లో మోదీ...స్టేట్‌లో లేడీ ’ అంటూ సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ కొత్త పల్లవితో అందరి చేత చప్ప ట్లు కొట్టించే పనిలో పడ్డారు. అయితే, ఆ మోదీ, ఈ లేడి పుణ్యమా ప్రజలు కష్టాల కడలిలో మునగాల్సి వచ్చిందని శివాలెత్తుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా వారి వారి అధినేతలు ప్రచారబాటలో ఉన్న విషయం తెలిసిందే. ఇక, తాము సైతం అంటూ సీపీఎం, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీల జాతీయ నాయకులు తమిళనాడు బాటకు సిద్ధం అయ్యారటా..!. ఇందులో భాగంగా తంజావూరు, తిరుచ్చి, మదురైలలో బృందాకారత్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. తమ అభ్యర్థులకు అండగా నిలవాలని పిలుపునిస్తూ, కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని లేడీ సర్కారు అంటూ కొత్త పల్లవితో సెటైర్లు విసిరే పనిలో పడ్డారు. తన దైన శైలిలో మోదీ...లేడీ అంటూ ఆమె సంధిస్తున్న వ్యాఖ్యలకు జనం నుంచి చప్పట్లు దరువెత్తుతున్నాయట. దీంతో మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా అమ్మకు అన్నీ తెలుసూ అంటూ, అందుకే తాగు నీళ్లకు బదులుగా మద్యం ఏరులై పారిచ్చేస్తున్నారు. బిడ్డల జీవితాల్ని పిప్పి చేసేస్తున్నారంటూ చలోక్తులు విసురుతున్నారు. అయితే, కేవలం సీపీఎం అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రసంగాలు సాగుతుండడంతో, ఇక తమను ఆదరించరా..? అన్నట్టు ప్రజా సంక్షేమ కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులు ఎదురు చూస్తున్నారట. -
'ఆ ఎయిర్ పోర్ట్ ప్లానింగ్ మోసపూరితం'
విజయనగరం : భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్లానింగ్ మోసపూరితమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. పార్టీకి చెందిన నేతలతో కలిసి విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలో మంగళవారం బృందా కారత్ పర్యటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధిచేకూర్చేలా ఎయిర్పోర్ట్ ప్లానింగ్ ఉందని ఆమె ఆరోపించారు. సీపీఎం తరఫున పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి విమానాశ్రయ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆమె పేర్కొన్నారు. దేశంలోని చాలా ఎయిర్‌పోర్టులలో ఉద్యోగులను తొలగిస్తుంటే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోందని బృందా కారత్ విమర్శించారు. -
'శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం'
విశాఖపట్నం: బాక్సైట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. ఆదివాసీల భూములను వేరొకరికి ఇచ్చే హక్కు ఎవరికి లేదన్నారు. కేంద్రంలో పెద్దన్న మోదీ, రాష్ట్రంలో చిన్నతమ్ముడు చంద్రబాబు ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. -
'వాహ్ మోదీ!'
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. నల్లధనం వెలికితీయడానికి బదులుగా గోమాంసం ఎక్కడుందో వెతకడానికే పోలీసులను కేంద్రం ఉపయోగిస్తోందని ఆక్షేపించారు. 'బ్లాక్ మనీ ఎక్కడుందో కనిపెట్టేందుకు పోలీసులు దాడులు చేయడం లేదు. గోమాంసం కోసం పోలీసులు సోదాలు చేస్తున్నారు. వాహ్ మోదీ!' అంటూ బృందా కారత్ ట్వీట్ చేశారు. గోమాంసం వడ్డిస్తున్నారనే ఫిర్యాదుతో ఢిల్లీలోని కేరళ హౌస్ లో సోమవారం పోలీసులు సోదాలు చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వండుకోవడానికి పప్పులు ఇవ్వలేని మోదీ సర్కారు ఆవు మాంసం కోసం పోలీసులతో వెతికిస్తోందని ధ్వజమెత్తారు. Brinda Karat: Police raids not to unearth black money but to unearth imaginary cow meat, vah Modi! #KeralaHouse — CPI (M) (@cpimspeak) October 28, 2015 -
సమస్యలపై పోరాటం చేయాలి
-
విలీనంలేదు:బృందా కారత్
విశాఖపట్నం: సీపీఎంను విలీనం చేసేదిలేదని, అవసరమైతే బలోపేతం చేసుకుంటామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు బృందా కారత్ చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో 21వ సీపీఎం అఖిలభారత్ వెబ్‌సైట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, హుద్‌హుద్ తుపాను సాయం విషయంలో తమ పార్టీ సీరియస్‌గా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు హామీలతోనే సరిపెట్టుకుంటున్నట్లు విమర్శించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడంలేదని విమర్శించారు.పార్లమెంటు సమావేశాలలో ఈ అంశాలను చర్చకు తీసుకువస్తామని బృందా కారత్ చెప్పారు. -
'సోషలిజాన్ని అనుసరించి ఉండాల్సింది'
సీతంపేట: దేశంలో రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధమైన వ్యవస్థ లేదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో సీపీఐ(ఎం) 21వ అఖిల భారత మహాసభలలో భాగంగా బుధవారం అంబేద్కర్ భవన్లో ‘ప్రైవేటు రంగం, రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆమె ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం పెట్టుబడిదారీ వ్యవస్థను కాకుండా సోషలిజాన్ని అనుసరించి ఉంటే కుల, మత, అసమానతలు లేని గొప్ప ప్రజాస్వామ్య భారతదేశం ఆవిష్కృతమయ్యేదని అభిప్రాయపడ్డారు. దేశంలో రిజర్వేషన్లు ఒక వివాదస్పదమైన అంశమని, ఎందుకు వివాదస్పదమైనదో సులువుగా అర్థం చేసుకోవచ్చన్నారు. శతాబ్దాల నుంచి దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలుచేస్తున్నా వారి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కన్పించడం లేదని తెలిపారు. కేవలం పారిశుద్ధ్యం, చేతివృత్తులకే దళిత వర్గాలు పరిమితమయ్యాయని, అత్యున్నత స్థానాలు వారికి దక్కడం లేదని బృందా కారత్ ఆవేదన వ్యక్తంచేశారు. 2010లో ప్రభుత్వ సర్వేల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇతర కులస్థులు 41 శాతం ఉపాధి పొందగా, ఎస్సీ, ఎస్టీలు కేవలం 14 శాతం మాత్రమే ఉపాధి పొందారని స్పష్టమైందని ఆమె తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇతర కులస్థులు 37 శాతం ఉపాధి పొందగా, దీనిలో మూడవ వంతు షెడ్యూల్ కులాలు ఉపాధి పొందుతున్నట్లు సర్వేలలో స్పష్టమైందన్నారు. ఈ పరిస్థితులలో మార్పు రావడానికి ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవస్థ, విధానాలు అనుసరించాలని బృందా కారత్ కోరారు. -
రైతుల గుండెలపై నిలబడి రాజధాని నిర్మాణమా?
* చంద్రబాబుకు బృందా కారత్ సూటి ప్రశ్న * రైతులకు పరిహారాన్ని ఎగ్గొట్టేందుకే భూసేకరణ ఆర్డినెన్స్‌పై నోరు మెదపలేదు * ప్రత్యేక ప్యాకేజీపై ప్రజలు బాబును నిలదీయాలి.. * ‘సాక్షి’తో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సాక్షి, హైదరాబాద్: ‘రైతుల గుండెల మీద నిలబడి రాజధాని నిర్మిస్తారా?’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. బాబు తన సిద్ధాంతాలను తానే గాలికొదిలి పచ్చి రాజకీయ అవకాశవాదిగా మారారని, కేంద్రంతో మిలాఖత్ అయ్యారని దుయ్యబట్టారు. రైతుల నడ్డివిరిచేలా కేంద్రం భూ సేకరణ చట్ట సవరణపై ఆర్డినెన్స్ తెచ్చినా నోరు మెదపలేదని విమర్శించారు. రాష్ట్ర రాజధాని కోసం భూమిని సేకరిస్తున్నారని, ఆ భూమినే నమ్ముకున్న రైతులకు పరిహారాన్ని ఎగ్గొట్టేందుకే బాబు నోరు కుట్టేసుకున్నారని స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి నమూనా దారుణాతి దారుణమైనదని పేర్కొన్నారు. ‘నేను చంద్రబాబును మూడు ప్రశ్నలడగదలచుకున్నా.. కేంద్ర ఆర్డినెన్స్‌పై నోరెందుకు మెదపలేదో చెప్పాలి. రెండోది.. సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల్ని హరించేలా కేంద్రం సవరణలు చేసింది. దీనిపై మీ వైఖరేమిటో స్పష్టం చేయాలి. ఏపీ రాజధాని నిర్మాణం కోసం మీరు సింగపూర్, జపాన్, మలేసియా అంటూ అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. రాజధానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ చౌకగా దొరుకుతున్న కార్మిక శక్తిని అమ్మదలచుకున్నారా? రెతుల నడ్డి విరిచి నగరాల్ని నిర్మిస్తారా? సింగపూర్ నమూనా ఇక్కడెలా సాధ్యపడుతుంది? ఇక మూడో ప్రశ్న ఆదివాసీలకు సంబం దించింది.. పోలవరం ప్రాజెక్టును ఎవరి పొట్టగొట్టి నిర్మించాలనుకుంటున్నారు? ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించింది. అది ఎందుకు రాలేదో బాబు చెప్పాలి. ప్రజలూ నిలదీయాలి’ అని బృందా కారత్ అన్నారు. -
గిరిజన హక్కులను కాలరాస్తున్న మోదీ
* తెలంగాణ గిరిజన సంఘం బహిరంగ సభలో బృందాకారత్ సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన తెలంగాణ గిరిజన సంఘం బహిరంగసభలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని నీరుగారుస్తోందన్నారు. అధికారంలోకి రాక ముందు స్వర్గాన్ని చూపిస్తానని చెప్పి ఇప్పుడు నరకాన్ని చూపుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల భూములను లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకుంటే సమాజంలో తీవ్రమైన అసమానతలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధిపత్య, పాశ్చాత్య సాంస్కృతిక దాడిలో ఆదివాసీ తెగల సంస్కృతులన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయన్నారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అనేక మంది ఆదివాసీల జీవితాలను విధ్వంసం చేస్తోందని విమర్శించారు. అంతకు ముందు గిరిజన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా పార్కు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు వేలాది మంది గిరిజనులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. లంబాడీ, గుస్సాడి, థింసా, బుడియబాపు, తీజ్, కోలాటం తదితర సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గిరిజనుల ఆరాధ్యమైన సంత్ సేవాలాల్ సినిమాను ప్రదర్శించారు. కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్‌నాయక్, ఎంపీ జితిన్‌చౌదరి, త్రిపుర గిరిజన మంత్రి అఘోరదేవ్ బర్మన్, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మన్ బజ్‌బాన్ రియాజ్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్, శోభన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై దాడులను అడ్డుకోలేమా?
లైంగిక దాడులను జాతీయ సమస్యగా చూడాలి సీపీఎం జాతీయ నేత బృందాకారత్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సమాజంలో మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని సీపీఎం జాతీయ కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే లైంగిక దాడులను జాతీయ సమస్యగా చూడాలన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘స్త్రీ స్వేచ్ఛ-ఆటంకాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. దళిత మహిళపై లైంగిక దాడి జరిగితే ఏ ఒక్కరూ స్పందించకపోవటం విచారకరమన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని ఆరోపించారు. జాతీయ సంపద, సహజ వనరులను దోచుకునే విధంగా రాజకీయ వ్యవస్థ తయారైందన్నారు. హిందూత్వ మతతత్వ శక్తులు మహిళల సాధికారతను అడ్డుకుంటున్నాయని, ఇది దేశాభివృద్ధికి ఆటంకమని తెలిపారు. ముగ్గురు ఉన్న కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలనే విధానం లింగవివక్షతకు దారితీసి చివరకు విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుందని, ఇదేనా ప్రభుత్వ విధానమని ఆమె ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా చూడాలని ఆమె కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రొఫెసర్ వి.పద్మజ, భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, ప్రముఖ రచయిత్రి శిలాలోలిత, ఐద్వా రాష్ర్ట కార్యదర్శి హైమావతి, ఐలు నగర కార్యదర్శి పొత్తూరి సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'హామీలు నిలబెట్టుకోవడంలో బాబు విఫలం'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై సీపీఎం అగ్రనేత బృందాకారత్ మండిపడ్డారు. ఉపాధి హామీకి సంబంధించి ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మౌనవ్రతం చేస్తున్నారని ఆమె విమర్శించారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఉపాధి హామీ నిధులను నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన స్థాయిలో ఖర్చుపెట్టలేకపోయిందని బృందాకారత్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చేసేది లేక మౌనవ్రతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నిలక హామీని చంద్రబాబు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు. అసలు రుణమాఫీని కూడా బాబు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పింఛన్ల విధానంలో ఆయన తీరు చాలా విడ్డూరంగా ఉందన్నారు. కుటుంబంలో ఇద్దరుంటే ఒక్కరికే ఇవ్వడం సరికాదని చంద్రబాబు తీరును తప్పుబట్టారు. -
టీడీపీ అంటే 'తెలుగు డిస్ట్రక్షన్ పార్టీ': బృందా కారత్
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డిస్ట్రక్షన్ పార్టీ (తెలుగువాళ్లను విచ్చిన్నం చేసే పార్టీ) అని వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో సీపీఎం పార్టీ అభ్యర్ధి నర్సింగరావు తరపున ప్రచారం నిర్వహించిన బృందా కారత్.. తెలుగుదేశం, బీజేపీల పొత్తుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాణానికి రెండు వైపుల్లాంటి వాళ్లు అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ్యానిఫెస్టో చూస్తే వారి మధ్య ఎలాంటి తేడాలు లేవని బృందా కారత్ అన్నారు. రాజకీయాల్లో అధికార పక్షానికి, ప్రతిపక్షం కుమ్మక్కవడం అత్యంత శోచనీయం అని అన్నారు. ప్రధాని పీఠంపై కూర్చోవడానికి ముందు నరేంద్రమోడీ చరిత్రలోని కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని బృందాకారత్ ఎద్దేవా చేశారు. -
కాశ్మీర్ టూ కన్యాకుమారి... కాంగ్రెస్ ఖతం
నేలకొండపల్లి: దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని సీపీఎం పోలిట్‌బ్యూరో మెంబర్, రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. మతోన్మాదంతో ముందుకు సాగుతున్న బీజేపీని, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడుగు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపైనే ఉందన్నారు. దేశంలో మూడోఫ్రంట్ ఏర్పాటుకు కృషి జరుగుతోందని తెలిపారు. పేదలను విస్మరించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాలు బాగుపడాలంటే ఖమ్మం పార్లమెంట్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, పాలేరు అసెంబ్లీకి సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పాలేరు అసెంబ్లీ అభ్యర్థి పోతినేని సుదర్శన్, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు కోటి సైదారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి బత్తుల లెనిన్, ఐద్వా జిల్లా నాయకురాలు బుగ్గవీటి సరళ, డివిజన్ కార్యదర్శి సిరికొండ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో అన్ని హక్కులూ ఆదివాసీలవే: బృందాకారత్
అరకులోయ, న్యూస్‌లైన్: గిరిజన హక్కులు, చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపిం చారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలపై విశాఖపట్నం జిల్లా అరకులోయలో గురువారం నిర్వహించిన ‘గిరిజనగర్జన’ సభలో ఆమె ప్రసంగించారు. ఎవరో పెట్టిన భిక్షతో గిరిజనచట్టాలు, హక్కులు రాలేదని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని మన్యంలో అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టేందుకే ప్రభుత్వం అటవీశాఖాధికారులకు తుపాకులు ఇస్తోందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నది ఒక్క సీపీఎం మాత్రమేనని అన్నారు. ఈసారి అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఎం పోటీచేస్తుందని, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ ఎంపీ పి.మధు మాట్లాడుతూ, ఏజెన్సీలో వి.ఎస్.ఎస్‌ల పేరుతో గిరిజనులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారన్నారు. భద్రాచలం మాజీఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ గిరిజన ఉప ప్రణాళిక నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. -
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
విభజన పాపం ఆ పార్టీలదే సంపన్నులకు ఊడిగం చేస్తున్న మోడీ సీపీఎం నేత బృందా కారత్ ధ్వజం విశాఖపట్నం, న్యూస్‌లైన్: పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ వ్యాఖ్యానించారు. కేజీ బేసిన్లో సహాజవాయివు నిక్షేపాలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. విశాఖలో బుధవారం జరిగిన సీపీఎం నేత జ్యోతిబసు శతజయంతి ఉత్సవ సభలో ఆమె ప్రసంగించారు. ఎర్రజెండాతో 75ఏళ్లు కార్మికులు, పీడిత ప్రజల కోసం పోరాడిన ఏకైక నేత జ్యోతిబసు అని కొనియాడారు. అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితాంతం వాటికి దూరంగానే బతికారన్నారు. టీ అమ్ముకునే కుటుంబం నుండి వచ్చానని చెప్పుకుంటూ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తిరుగుతూ సంపన్నులకు ఊడిగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల జెండాలు వేరైనా సిద్ధాంతాలు మాత్రం ఒక్కటేనన్నారు. అందమైన రాష్ట్రాన్ని ముక్కలు చేశారు స్వాతంత్రం వచ్చిన తరువాత నంబూద్రి ప్రసాద్, జ్యోతిబసు, బసవపున్నయ్య తదితరుల పోరాటాల ఫలితంగా ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని బృందాకారత్ పేర్కొన్నారు. ఈరోజు అతిపెద్ద, అందమైన రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు కలసి ముక్కలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ సూచనలను పక్కనబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఒక మాంత్రికుడిలా మాయజాలం చేసి ప్యాకేజీలతో తన జేబు నింపుకున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చే పార్టీలకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. -
పార్లమెంట్లో జరిగిన పరిణామాలు శోచనీయం : బృందాకారత్
-
గిరిజనుల గోడు పట్టదా?
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘ఓట్లు.. సీట్ల.. కోసం ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి.. కుర్చీల కుమ్ములాటల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూరుకుపోయాయి.. కానీ గిరిజనుల ఇబ్బందులు, రైతుల కష్టాలు, దళితులు, పేదల సమస్యలను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. తరతరాలుగా ఆదివాసీ గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు బృందాకారత్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మూడేళ్లుగా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కూర్చుని తమ పదవులను కాపాడుకోవడంతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 33లక్షల ఎకరాల భూమికి గిరిజన పట్టాలు అందించాల్సి ఉండగా, వీటిని కేవలం 19 లక్షలకు కుదించారని, ఇందులో 4.5లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారని విమర్శించారు. అర్హులైన గిరిజనుల దరఖాస్తులను తిరస్కరించి వారి నోటివద్ద ముద్దను లాక్కొనే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పొతినేని సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.