Adilabad District Latest News
-
పత్తి రైతుల ఆందోళన
● సమయం దాటిందని కొనుగోలు చేయని సీసీఐ అధికారులు ● కలెక్టర్ చొరవతో రాత్రి 8 గంటలకు తిరిగి కొనుగోళ్లు ఆదిలాబాద్‌టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు వచ్చిన అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత సమయం దాటిందని సీసీఐ అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. అధికారులను ప్రాధేయపడినప్పటికీ వినకుండా వెళ్లిపోయారు. దీంతో అన్నదాతలు ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు దాదాపు 1600లకు పైగా పత్తి వాహనాలు వచ్చాయి. సీసీఐ ధర తగ్గుతుందని సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తి వాహనాలతో మార్కెట్ యార్డుకు వచ్చారు. ఇదిలా ఉండగా సాయంత్రం 5 గంటల వరకు కొనుగోలు చేసిన తర్వాత 200 వరకు పత్తి వాహనాలు మిగిలి ఉన్నాయి. సమయం దాటిందని, తాము కొనుగోలు చేయమని అధికారులు తెలిపారు. ఆందోళనకు దిగడంతో ఈ విషయం కలెక్టర్ రాజర్షిషా దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన చొరవ తీసుకొని రాత్రి 8 గంటల ప్రాంతంలో కొనుగోళ్లు పునఃప్రారంభించారు. -
బైక్‌ను ఢీకొట్టిన కారు
● ఇద్దరికి తీవ్ర గాయాలు ● రోడ్డు పక్కన అమ్మకానికి ఉంచిన 12 బైక్‌లు ధ్వంసంఆదిలాబాద్టౌన్: రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న ఓ కారు అతివేగంతో ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. అనంతరం విక్రయాల కోసం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన పాత బైక్‌లపైకి ఆ కారు వేగంగా దూసుకెళ్లడంతో 12 వాహనాలు ధ్వంసమయ్యాయి. టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్కు చెందిన షేక్ సోహెల్, కుమ్ర శ్రీకాంత్ శుక్రవారం రాత్రి ఎగ్జిబిషన్ చూసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ చౌక్ వైపు నుంచి బస్టాండ్‌కు రాంగ్రూట్లో వస్తున్న కియా కారు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాలిలో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు గమనించి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. షేక్ సోహేల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. రోడ్డు పక్కన విక్రయాల కోసం నిలిపి ఉంచిన 12 ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో పాటు ఈద్గా ఫెన్సింగ్ కూడా ధ్వంసమైంది. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన కారు యజమాని ఈ ప్రమాదానికి కారణమైనట్లుగా కుమ్ర శ్రీకాంత్ తండ్రి కుమ్ర బాపురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
చికిత్స పొందుతూ బాలుడు మృతి
ఇంద్రవెల్లి: విద్యుత్ షాక్‌తో గాయాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపారు. మండల కేంద్రంలోని భీంనగర్‌కు చెందిన మసురే సంతోష్, సుకేష్మ దంపతుల ఏకై క కుమారుడు మసురే వీరేందర్(13) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 7న పాఠశాలకు వెళ్లిన విద్యార్థి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఆడుతుండగా ఓ భవనంపై వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలను ముట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా 44 రోజులపాటు చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజమున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు
శ్రీరాంపూర్: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు పతకాలు సాధించినట్లు అసోసియేషన్ జిల్లా చైర్మన్ నిట్టూరి మైసూర్, అధ్యక్షుడు పాదం రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో జరిగిన సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ పోటీల్లో గుడిపేటలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలకు చెందిన ఈ.తిరుపతి, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థిని జీ శాన్వీ సిల్వర్ మెడల్స్ సాధించినట్లు వారు పేర్కొన్నారు. గుడిపేట స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్, పీడీ సురేశ్ విద్యార్థులను అభినందించారు. -
భయాందోళనకు గురికావొద్దు
తాంసి: భీంపూర్ మండలంలోని కోజ్జన్గూడ శివారులో ఉన్న సూర్యగుట్ట అటవీ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని బీట్ అధికారి రామేశ్వర్ స్పష్టం చేశారు. శుక్రవారం సూర్యగుట్ట సమీపంలో కుక్కపై అడవి జంతువులు దాడిచేసి హతమార్చాయి. సంఘటన స్థలాన్ని అటవీశాఖ బీట్ అధికారి రామేశ్వర్ శనివారం ఎనిమల్ ట్రాకర్స్‌తో కలిసి పరిశీలించారు. కుక్క కళేబరం వద్ద పులి లేదా చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు లేవన్నారు. శునకాన్ని హైనా లేదా నక్క హతమార్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎనిమల్ ట్రాకర్స్ ఆత్రం నాందేవ్, స్థానికులు ఉన్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీమంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాలిటీలో శనివారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ సీఐ ప్రశాంత్, ఏఈఈ శశిధర్, తహసీల్దార్ గిరీశ్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పన్నుల వివరాలు, ఇతర ఆదాయ మార్గాల వివరాలు సేకరించారు. డీటీసీగా రవీందర్ కుమార్ఆదిలాబాద్టౌన్: రవాణశాఖ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ)గా పి.రవీందర్‌కుమార్ నియామకమయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు నిజామాబాద్ జిల్లా డీటీసీ దుర్గా ప్రమీళ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‌లోని నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ఆర్టీవోగా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం డీటీసీగా జిల్లాకు బదిలీ చేసింది. కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అటవీ అధికారులపై ఫిర్యాదుజైపూర్: కోతుల దాడిలో ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా తీవ్రంగా నష్టపోతున్నామని, ఇందుకు కారణమైన అటవీశాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం భీమారం గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పంటలను నాశనం చేయడమే కాకుండా అడ్డువస్తున్న వారిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వారు పేర్కొన్నారు. -
చోరీకి యత్నించిన స్థల పరిశీలన
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని రామాయిలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 13న చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. ఎస్పీ గౌస్ ఆలం శనివారం సంఘటన స్థలాన్ని పరిశీ లించారు. బ్యాంకులోని నగదు, ఇతర వ స్తువుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను బ్యాంకు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. చోరీకి య త్నించిన సమయంలో అక్కడ మోగిన సైరన్, ఇతర వాటిని పరిశీలించారు. సీసీ ఫుటేజీలను సేకరించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై ముజాహిద్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ పీ.చంద్రశేఖర్, సీసీఎస్ పోలీసులు, బ్యాంకు ఉద్యోగులు, తదితరులు ఉన్నారు. అన్యమత ప్రచారం అడ్డుకున్న యువకులుభీమిని: మండలంలోని బిట్టురుపల్లిలో శుక్రవారం రాత్రి అన్యమత ప్రచారం చేస్తున్న పలువురిని గ్రామ యువకులు అడ్డుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కొంక సత్యనారాయణకు సమాచారం అందివ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకుని వారికి డబ్బులు ఎరజూపి అన్యమతంలోకి మారుస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిమందమర్రిరూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలలోని చున్నంబట్టి వాడకు చెందిన మహాత్మ సంతోష్ (35) పని నిమిత్తం మేడారం వచ్చాడు. శనివారం రోడ్డు దాటుతుండగా మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహన చోదకుడికి సైతం తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై తెలిపారు. -
సిరుల గని.. సింగరేణి
● సంస్థ క్షేమం.. పెరిగిన సంక్షేమం ● భవిష్యత్ సవాళ్లమయం ● నూతన గనులతోనే మనుగడ ● ఇతర రంగాల్లో విస్తరణకు శ్రీకారం ● పొరుగు రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపన ● నవరత్నాలకు దీటుగా లాభాలు ● 23న ఆవిర్భావ దినోత్సవంప్రతిపాదిత నూతన గనులు ప్రాజెక్టు పేరు సామర్థ్యం (మి. టన్నుల్లో) వీకే ఓసీపీ – 5.30 జీడీకే 10 ఓసీపీ – 6.0 జేకే ఓసీపీ(రోంపేడు) – 2.0 గోలేటి ఓసీపీ – 3.5 ఎంవీకే ఓసీపీ – 2.0 పీవీఎన్ఆర్(వెంకటాపూర్) – 2.5 కేటీకే ఓసీపీ 2(యూజీ సెక్షన్) – 0.60 దీనితో పాటు ఒడిశాలోని నైనీ బ్లాక్ 2025లో ప్రారంభమైతే ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి రానుంది.సింగరేణి విస్తరణ : 6 జిల్లాలు(ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం) భూగర్భ గనులు : 22 ఓపెన్‌కాస్టు గనులు : 18 ఉద్యోగుల సంఖ్య : 38,594 అధికారుల సంఖ్య : 2,255 కాంట్రాక్ట్ ఉద్యోగులు : 23,500 ఓసీపీల్లో యంత్రాలు: షవల్స్ : 66, డంపర్లు: 425, డోజర్లు: 109, డ్రిల్స్: 48, ఇతర యంత్రాలు: 828 భూగర్భ గనుల్లో యంత్రాలు: మ్యాన్‌రైడింగ్ యంత్రాలు: 52, కోల్ కట్టింగ్ డ్రిల్స్ : 119, ఎస్డీఎల్స్:105, ఎల్హెచ్డీస్: 10, లాంగ్వాల్: 1, కంటిన్యూయస్ మైనర్స్: 5, బోల్టర్ మైనర్స్: 2పెరుగుతున్న ఉత్పత్తి, తగ్గుతున్న ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి ఉద్యోగులు (మి.ట) 2013–14 50.47 61,778 2014–15 52.54 58,837 2015–16 60.38 58,491 2016–17 61.34 56,282 2017–18 62.01 54,043 2018–19 64.40 48,942 2019–20 64.02 46,021 2020–21 50.58 43,895 2021–22 65.02 43,672 2022–23 67.14 42,733 2023–24 70.02 41,837 2024–25 (నేటివరకు) 44.31 38,594 శ్రీరాంపూర్: తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ అయిన సింగరేణి దినదినాభివృద్ధి చెందుతోంది. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించి వేల కోట్ల రూపాయల లాభాలు గడిస్తోంది. నేడు దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 135 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 23న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సింగరేణిపై ‘సాక్షి’ అందిస్తున్న కథనం. పొయ్యి రాళ్లే పునాదిరాళ్లు.. నాడు కట్టెల పొయ్యికి వాడిన రాళ్లే సింగరేణికి పునాది రాళ్లయ్యాయి. 1870లో భద్రాచలం రా ములవారిని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులు మార్గమధ్యలో వంటావార్పుకు ఆగారు. వంటకోసం పేర్చిన పొయ్యిరాళ్లు అంటుకుని బూడిదయ్యాయి. దీంతో ఇదేదో రాకాసి మాయ అని భయపడ్డ భక్తులు అక్కడి నుంచి పారిపోయారు. అప్పటి బ్రిటీష్ పాలకులు దీనిపై పరిశోధనలు చేసి ఇది బొగ్గు ఖనిజం అని గుర్తించారు. అలా నల్లబంగారం లోకానికి వెలుగు చూసింది. ఖమ్మం నుంచి విస్తరణ మొదలై.. సింగరేణి సంస్థ బ్రిటీష్ ప్రభుత్వంలో పురుడు పోసుకుంది. మొట్టమొదట ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులోని బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకా లు ప్రారంభించారు. ఆ తర్వాత 1920, డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా ఏర్పడింది. 1927లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో, 1961లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం, 1991లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో బొగ్గు గనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలోని సుమారు 450 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలను భూగర్భశాఖ అధికారులు గుర్తించారు. 1889లో 59,671 టన్నుల బొగ్గు ఉత్పత్తితో కంపెనీ ప్రస్తానం మొదలైంది. జాతీయీకరణ తరువాత సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతంతో కంపెనీ కొనసాగుతూ వస్తోంది. రికార్డు స్థాయిలో ఉత్పత్తి... గడిచిన ఆర్థిక సంవత్సరం 2023–24లో కంపెనీ రికార్డు స్థాయిలో 70.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఏడాది 2024–25లో 72 మిలియన్ టన్నుల లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం భూగర్భ గనులన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే రూ.10,394 ఖర్చు అవుతుండగా దీన్ని అమ్మితే రూ.4,854 వస్తుంది. ఈ లెక్కన టన్నుకు రూ. 5,540 నష్టాన్ని కంపెనీ చవిచూస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికీ భూగర్భ గనుల్లో రూ.1,176 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ఓసీపీల్లో, ఎస్టీపీపీ నుంచి వచ్చే లాభాలతో ఈ నష్టాలను పూడ్చుకుంటూ కంపనీ ముందుకెళ్తోంది. మూసివేత దశలో భూగర్భ గనులు కంపెనీలో ఉన్న 22 భూగర్భ గనుల్లో నిల్వలు అడుగంటడంతో 15 మూసివేతకు దగ్గరపడ్డాయి. వీటి స్థానంలో పదేళ్లుగా ఒక్క కొత్త గని ఏర్పాటు కాలేదు. గతంలో ఖనిజాన్వేషణ చేసి సిద్ధంగా ఉన్న కొన్ని బొగ్గు గనులను తవ్వేందుకు కంపనీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ గనుల్లో తవ్వకాలు మొదలైతే సింగరేణికి మరింత ఉజ్వల భవిష్యత్ ఉండబోతోంది. ఇతర రంగాల్లో విస్తరణ మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1200 మెగావాట్ల ఽథర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల లాభాలు గడిస్తోంది. దీనికి అదనంగా మరో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. కంపెనీ వ్యాప్తంగా 246 మెగావాట్ల సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రేడ్ యూనియన్ల ఆవిర్భావం ఇలా.. కార్మికుల హక్కుల సాధనలో సింగరేణి ట్రేడ్ యూనియన్ల పాత్ర ఎంతో కీలకం. వారి నీడలో కార్మికులు అనేక హక్కులు, సదుపాయాలు కల్పించబడ్డాయి. ● 1945లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ● 1965లో సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ), ● 1977లో సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) ● 1977 ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ కాలరీస్ మజ్ధూర్ సంఘం ● 1978లో గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) ● 1981లో సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ● 1996లో శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఏఐఎఫ్టీయూ) ● 1984లో తెలుగునాడు గ్రేడ్ యూనియన్ (టీఎన్టీయూసీ) ● 1988లో పలు వృత్తి సంఘాలతో కలిపి సాజక్ ● 2003లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ● 1998 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం సంక్షేమానికి పెద్దపీట ● కార్మికులకు క్వార్టర్లు, ఉచిత విద్యుత్, ఏసీ సౌకర్యం ● ఆస్పత్రులు, క్యాంటీన్లు, స్కూల్స్, కాలేజీలు, క్రీడామైదానాలు, రిక్రియేషన్ క్లబ్‌లు, పార్కులు ● ఉద్యోగులతో పాటు తల్లిదండ్రులకు సైతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం ● రిటైర్డ్ కార్మికులకు సీపీఆర్ఎంఎస్ స్కీం కింద వైద్యఖర్చులు రూ.8 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంపు ● గని ప్రమాదంలో కార్మికులు చనిపోతే రూ.కోటి ప్రమాదబీమా ● కాంట్రాక్ట్ కార్మికులకు రూ.30 లక్షల ప్రమాదబీమా ● రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలలో కార్మికుల పిల్లలకు 7 సీట్లు, మంథని జేఎన్టీయూలో 35 సీట్లు కేటాయింపు ● లాభాల్లో వాటా 33 శాతం కార్మికులకు చెల్లింపుచాలా మార్పులు వచ్చాయి 36 ఏళ్లుగా సింగరేణిలో పని చేస్తున్నా. నాడు తట్టా చెమ్మస్‌తో పని చేశాం. ఇప్పుడన్నీ యంత్రాలతోనే చేస్తున్నాం. మొదట్లో చాలా ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు సేఫ్టీ పెరిగి ప్రమాదాలు తగ్గాయి. కారుణ్య ఉద్యోగాలతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. – మెండె వెంకటి, సపోర్టుమెన్, ఆర్కే7 లక్ష్యాలను సాధిస్తే అద్భుత ఫలితాలు నిర్ధేశించిన లక్ష్యాలను సాధిస్తేనే అద్భుత ఫలితాలు పొందుతాం. అప్పుడే సంస్థ మనుగడ సాధిస్తుంది. లాభాలు వస్తే ఉద్యోగుల సంక్షేమానికి మరింత ఖర్చు చేయొచ్చు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో రక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చే చర్యలు చేపట్టాం. సింగరేణీయన్లకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. – ఎల్వీ సూర్యనారాయణ, జీఎం, శ్రీరాంపూర్ గర్వంగా ఉంది కారుణ్య నియామకం కింద డిపెండెంట్‌గా నాకు ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్లుగా సంస్థలో పనిచేస్తున్నా. మా నాన్న పని చేసిన సంస్థలోనే నేను కూడా రెండో తరంగా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. సింగరేణిలో ఉద్యోగం చేయడం గర్వంగా ఉంది. – రమణ, ఉద్యోగి, ఆర్కే 8 డిస్పెన్సరీ -
టీజీబీ సిబ్బందిపై ఫిర్యాదు
బేల: ఆదివాసీ రైతు ఖాతాలోంచి రూ.50 వేలు కాజేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై శనివారం బాధిత రైతు ఆత్రం రాందాస్‌తో కలిసి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మణియార్‌పూర్‌కు చెందిన ఆత్రం రాందాస్ గత ఆగస్టు 28న బ్యాంకుకు వెళ్లి రూ.50వేలు కావాలని విత్‌డ్రా రశీదును క్యాషియర్‌కు ఇవ్వగా అంత ఇవ్వలేమని, ఆ రశీదు అలాగే ఉంచుకుని రూ.20వేలు మాత్రమే ఇవ్వొచ్చని చెప్పాడన్నారు. ఈక్రమంలో బాధితుడి నుంచి రూ.20వేల విత్‌డ్రా రశీదు రాయించుకుని ఖాతాదారునికి నగదు అందజేశారన్నారు. అమాయకుడైన బాధిత రైతు ఇది గమనించుకోకుండా మరోసారి ఖాతా నుంచి రూ.50వేలు కావాలని వెళ్తే ఖాతాలో అసలు డబ్బులు లేవని క్యాషియర్ చెప్పారన్నారు. దీంతో బాధిత రైతు దీనిపై పలుమార్లు బ్యాంకులో అడిగితే సమాధానం దాటేవేస్తున్నారన్నారు. వారి వెంట గ్రామ రైతులు ఠాక్రే గంభీర్, బొక్రే పాండురంగ్, విపుల్, తదితరులు ఉన్నారు. -
మత్తు పదార్థాలను నిర్మూలించాలి
కై లాస్‌నగర్: జిల్లాలో గంజాయి వంటి మత్తు పదా ర్థాలను పూర్తిగా నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి శనివారం నార్కోటిక్–కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా విస్తృత అవగా హన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సాంస్కృతిక సారథి కళాకారులతో గ్రామగ్రామాన ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. మత్తుపదార్థాల రవాణా, క్రయ విక్రయాలను నివారించేందుకు స్పె షల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తరగతుల వారీగా యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటుచేయాలన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన,క్విజ్‌పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో గంజాయి పెంచకుండా రైతులకు అవగాహన క ల్పించాలన్నారు. అలాగే పాఠశాలల పరిసర ప్రాంతాల్లో మత్తు చాక్లెట్లు, ఇతరత్రా పదార్థాల రూపంలో డ్రగ్స్ విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టా లన్నారు. ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి అనే పదం వినబడకుండా ఉక్కుపాదం మోపాలన్నారు.ఈ మేరకు సంబంధిత శాఖల అధి కారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ ఏడాది 75 కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 987.425 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు వీటి విలువ సుమారు రూ.2కోట్ల 31లక్షల 31వేల750 ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపుకలెక్టర్ శ్యామలా దేవి, సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రెయినీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా, ఆర్డీవో వినోద్‌కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూంను తనిఖీ చేసిన కలెక్టర్ ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌లో గల ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్‌ను కలెక్టర్ రాజర్షి షా శనివారం తనిఖీ చేశారు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. వారి సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిపించి అందులో ఉన్న ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం వారి సమక్షంలో స్ట్రాంగ్ రూంకు సీల్ వేయించారు. ఆయన వెంట ఆర్డీవో వినోద్‌కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పంచపూల తదితరులున్నారు. కలెక్టర్ రాజర్షి షా పలు శాఖల అధికారులతో నార్కోటిక్ కోఆర్డినేషన్ సమావేశం -
లెక్కల మా‘స్టార్’
మంచిర్యాలఅర్బన్: తాండూర్ మండలం కాసిపేట ఎంపీయూపీఎస్ గణిత ఉపాధ్యాయుడు గంప శ్రీనివాస్ విద్యార్థులకు కొత్త తరహా గణిత బోధనకు ప్రత్యేక కిట్ రూపొందించారు. గణితంపై సామర్థ్యాలు మెరుగుపరుస్తూనే ఎఫ్ఎల్ఎన్–లిప్ గణిత ఐఎల్ఎం కిట్ ప్రదర్శనతో నాలుగుసార్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆరేళ్లుగా కాసిపేట స్కూల్లో బోధన చేస్తున్నారు. గణితంలో విద్యార్థుల భయాన్ని దూరం చేసేందుకు మూడేళ్ల క్రితం విడివిడిగా తయారు చేసిన పరికరాలతో వినూత్నంగా బోధించేవారు. విద్యార్థులకు చదువులో సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ) అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని పరికరాలు కలిపి ప్రత్యేక గణిత కిట్‌తో బోధన చేస్తున్నారు. ప్రతీ ఏడాది రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్‌ఫెయిర్‌లో నవంబర్ 31, డిసెంబర్ 2024లో నిర్వహించిన పోటీల్లో టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం) శ్రీనివాస్ ప్రదర్శించిన ఎఫ్ఎల్ఎన్–లిప్ మ్యాథమాటికల్ ఐఎల్ఎం కిట్ రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. 2022–23 విద్యాసంవత్సరంలో కేరళలో నిర్వహించిన ప్రదర్శనలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఒకటో తరగతికి చెందిన నంబరు లెక్కింపు మొదలుకుని 10వ తరగతికి చెందిన త్రికోణమితికి చెందిన టీఎల్ఎం ఈ కిట్‌లో ఉన్నాయి. ప్రతీ ప్రాఠశాలలో ఈ కిట్ అందుబాటులో ఉంటే విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంపొందించవచ్చని ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. -
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
● పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలి ● రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులపై చట్టపరంగా చర్యలు ● జిల్లా జడ్జి ప్రభాకరరావు, కలెక్టర్ రాజర్షి షా కైలాస్‌నగర్: లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, అలాంటి పరీక్షలు చేసే కేంద్రాలపై దృష్టి సారించి వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు అన్నారు. కలెక్టర్ చాంబర్లో పీసీ పీఎన్డీటీ యాక్ట్‌పై బహుళ సభ్యుల సముచిత అధికార కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, జిల్లాలోని ఆసుపత్రులు, అల్ట్రాసౌండ్ స్కా నింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. జిల్లా సరిహద్దులోని మహా రాష్ట్రకు సమీపంలోని మండలాల్లో సీ్త్ర, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విజిలెన్స్ ఏర్పాటుతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నా రు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో వచ్చే రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా, ఆ స్కానింగ్ కేంద్రంపై పోలీస్‌శాఖ ద్వారా చర్యలు ఉంటాయన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసు కు రావాలన్నారు. జిల్లాలోనిస్కానింగ్ సెంటర్ల పని తీరు, తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో లింగ నిష్పత్తి, లింగ వివక్షతపై అవగాహన సదస్సులు చేపట్టాలన్నారు.ఆయా ఆసుపత్రులు,ల్యాబ్‌లు, ఆయుష్ క్లీనిక్,క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకా రం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అర్హత కలి గిన సిబ్బందిని నియమించుకోవాలని, అలాగే ధర ల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, ట్రెయినీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా తదితరులు పాల్గొన్నారు. -
సులువుగా అర్థమయ్యేలా..
గణిత బోధన సమయంలో విద్యార్థులు తార్కికంగా ఆలోచించేలా వారికి కొన్ని క్రియలు, ప్రాజెక్టులు ఇవ్వాలి. సహజసిద్ధంగా నేర్చుకునేందుకు ఆటల ద్వారా బోధించాలి. దీంతో వారు గణితంపై మక్కువ పెంచుకుంటారు. సామర్థ్యంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్న చిన్న సూత్రాలు గుర్తు పెట్టుకునేలా అభ్యసన చేయించాలి. మ్యాథ్స్ అంటే భయం పోగొట్టేలా చూడాలి. టీఎల్ఎం సాయంతో బోధన ద్వారా వారికి సులువుగా అర్థమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీవీ ప్యానల్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు ఆసక్తిగా చదువుకుంటున్నారు. – పిల్లి కిషన్, గణిత ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి -
విజ్ఞానంతోపాటు వినోదం..
మా పాఠశాల గణిత ఉపాధ్యాయులు సబ్జెక్టును భ యంతో కాకుండా ఆసక్తితో నేర్చుకునేలా ప్రయోగా త్మకంగా బోధిస్తున్నారు. దీంతో గణితం నేర్చుకోవా లన్న అభిరుచి పెరిగింది. గణితం ద్వారా విజ్ఞా నం సాధనే కాకుండా వినోదాన్ని కూడా పొందవచ్చు. ఫజిల్స్, క్విజ్ వంటివే కాకుండా అర్థమెటిక్ లాజికల్ రీజనింగ్ వంటి ప్రశ్నల సాధన ఎలా చేయాలో నేర్పించడం వల్లే ఇటీవల గణిత ప్రతిభా పరీక్షలో నిర్మల్ జిల్లాస్థాయిలో రెండో స్థానం సాధించాను. – కొట్టె హర్షవర్ధన్, విద్యార్థి, జెడ్పీహెచ్ఎస్, మస్కాపూర్ -
టాడా జిల్లా కార్యవర్గం
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ (టీఏడీఏ) ఆదిలాబాద్ యూ నిట్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. చైర్మన్‌గా గణేశ్రాథోడ్, అధ్యక్షుడిగా జాదవ్ కైలాస్, జనరల్ సెక్రెటరీగా ప్ర మోద్ రెడ్డి, ట్రెజరరీగా వివేక్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కె.అరుణ, వైస్ ప్రెసిడెంట్లుగా జి.సాయితేజ రెడ్డి, జి.రమేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎల్.రవితేజ, పబ్లిసిటి సెక్రెటరీగా రాథోడ్ శ్రద్ధ, కల్చరల్, స్పోర్ట్స్ సెక్రెటరీలుగా టి.విశ్వనాథ్, కేంద్ర కార్యవర్గ సభ్యులుగా విశ్వమిత్ర, సంధ్యారాణి,జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎండీ.సాద్, జే.పూజ, ఎం.కృష్ణవేణి ఎన్నికయ్యారు. న్యూస్రీల్రిమ్స్లో వైద్యం చేయించుకున్న కలెక్టర్ఆదిలాబాద్టౌన్: కలెక్టర్ రాజర్షిషా శనివా రం రిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. పంటి సమస్యతో బాధపడుతున్న కలెక్టర్ రిమ్స్‌కు వెళ్లారు. దంత వైద్యులు ర వీందర్‌రెడ్డి, వినోద్ భల్లా, సచిన్‌రెడ్డి, గో పాల్ వైద్యసేవలు అందించారు. కలెక్టర్ వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఉన్నారు. -
గణితమంటే ఆసక్తి కలిగించాలి
విద్యార్థుల్లో అభ్యసన స్థాయిని పెంచి గణితంపై ఆసక్తి కలిగించాలి. వి ద్యా ప్రమాణాలను ఆధారంగా చే సుకుని విద్యార్థి కేంద్రీకృతంగా వ్య క్తిగత, గ్రూప్‌గా కృత్యాలు నిర్వహిస్తూ బోధన చేయాలి. అవసరమైన చోట బోధనభ్యాస సామగ్రిని ఉపయోగించాలి. గణి తం సూత్రధారితమైనది. ఎలా సూత్రీకరించబడిందో తెలియజేస్తూ నేర్పించాలి. అంతేకాని బట్టి పట్టించే ప్ర యత్నం చేయకూడదు. పాఠశాలల్లో మ్యాథ్స్ క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించి వి ద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని తొలగించాలి. వా రు గణితం నేర్చుకునేలా ప్రోత్సహించాలి.– కుంబోజి సూర్యకాంత్, యూపీఎస్, తాంసి(కె) -
గుడిహత్నూర్‌లో ఉద్రిక్తత..
గుడిహత్నూర్: మండలకేంద్రంలో ఓ బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఎస్సీ కాలనీకి చెందిన చట్ల పోశెట్టి(25) గతంలో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఏడాది క్రితం తిరిగి వచ్చి స్థానిక బస్టాండ్‌లో కొంతకాలం టిఫిన్ సెంటర్ నడిపాడు. ప్రస్తుతం దుకాణం బంద్ చేసి జులాయిగా తిరుగుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలనీకి చెందిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు. కుటుంబ సభ్యులు బాలిక ఆచూకీ కోసం పలుచోట్ల వెదికారు. రాత్రి 6గంటల సమయంలో పోశెట్టి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై మహేందర్ అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే కుటుంబ సభ్యులు, స్థానికులు.. లైంగిక దాడికి పాల్పడిన అతడిని అప్పగించాలంటూ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. ఆయన సమాచారంతో అక్కడికి చేరుకున్న ఇచ్చోడ సీఐ భీమేష్ పెద్ద సంఖ్యలో గుమిగూడిన వారికి సర్ది చెప్పారు. వారు వినకపోవడంతో పాటు పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. సీఐ, ఎస్సైకి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా ఆందోళనకారులు చెదిరిపోయారు. అదే సమయంలో నిందితుడిని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాలపై వారు మరోసారి రాళ్లు రువ్వగా అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం కాలనీకి చేరుకొని నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తలకు గాయమైన సీఐని స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించి అనంతరం రిమ్స్‌కు తరలించారు. అలాగే ఇచ్చోడ ఎస్సై తిరుపతి కాలుకు గాయమవగా స్థానికంగా చికిత్స అందించారు. కాగా, నిందితుడు గతంలో పలు దొంగతనం కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. మండలకేంద్రంలో సుమారు మూడున్నర గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
కాంట్రాక్ట్ ఏఎన్ఎంల రాస్తారోకో
కై లాస్‌నగర్: ఎలాంటి రాత పరీక్ష లేకుండా తమను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు చేపట్టిన 48 గంటల నిరసన ముగిసింది. రెండు రోజుల పాటు కలెక్టరేట్ ఎదుటే బైఠాయించి నిరసన వ్య క్తం చేసిన ఏఎన్ఎంలు శనివారం పట్టణంలోని కలెక్టరేట్చౌక్లో రాస్తారోకో చేపట్టా రు. వీరి ఆందోళనతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచా రం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ, ప్రభుత్వం స్పందించి తమను రెగ్యు లరైజ్ చేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో సీఐటీయూ నాయకులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
గణిత మేధావి రామానుజన్..
‘సున్నా’ లేకుండా గణితం లేదు. లెక్కలేని జీవితం లేనే లేదు. లెక్కించడం ప్రారంభమైప్పటి నుంచే మానవ నాగరికత మొదలైంది. అలా లెక్కించే దానికి అంకెలు అవసరం అయ్యాయి. అంకెలు సంఖ్యలుగా మారి మానవ జీవితాన్ని మార్చివేశాయి. నిత్యజీవితంలో గణితానికి చాలా అనుబంధం ఉంటుంది. అందుకే పోటీ పరీక్షల్లో అంక గణితానికి ప్రత్యేక స్థానం లభించింది. జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, ఎంఈసీ వంటి కోర్సులకు డిమాండ్ ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తుకు ఇదే తొలిమెట్టు. ఇందులో ప్రతిభ కనబరిచే వారు ఇంజినీర్లు, చార్టెడ్ అకౌంట్, తదితర రంగాల్లో స్థిరపడుతున్నారు. బాల్యం నుంచే గణిత భావనలు.. పిల్లలు బాల్యం నుంచే గణిత భావనలు అలవర్చుకుంటారు. సందర్భానుసారంగా తార్కికంగా ఆలోచించడం, సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకుంటారు. గణితంలో వెనుకబడుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖతో పాటు గణిత ఫోరం అనేక చర్యలు చేపడుతోంది. అలాగే మ్యాథ్స్‌లో ప్రతిభ కలవారిని ప్రోత్సహించేందుకు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 12న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. నేడు హైదరాబాద్‌లో ఈ పోటీలు కొనసాగనున్నాయి. తమిళనాడు రాష్ట్రం తంజావూరులోని కుంభకోణంలో కుప్పుస్వామి–కోమలతమ్మల్ దంపతులకు 1987 డిసెంబర్ 22న రామానుజన్ జన్మించారు. పేద కుటుంబంలో పుట్టినా విద్యార్థి దశ నుంచే గణితంలో ప్రావీణ్యం సాధించారు. 13ఏళ్ల వయస్సులోనే త్రికోణమితి, జామెట్రీలను సొంతగా నేర్చుకున్నారు. ఈయ న ప్రతిభకు తార్కానమే 1729(రెండు విధాలుగా, రెండు ఘనాల మొత్తం అతి చిన్న సంఖ్య). దీనినే రామానుజన్ సంఖ్యగా వ్యవహరిస్తారు. ఆధునిక గణితశాస్త్రానికి అనేక సేవలందించారు. 33 ఏళ్ల వయస్సులోనే ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. -
ఉపకరణాలతో గణిత బోధన
నిర్మల్‌రూరల్: విద్యార్థులకు చార్టులు, బోధనోపకరణాలతో విద్యాబోధన చేస్తున్నారు నర్సాపూర్(జి) ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వి.మనోహర్‌రెడ్డి. ప్రాథమికస్థాయి నుంచి ఉపకరణాలతో గణితం బోధించడంలో ఆయన దిట్ట. ఇందుకోసం ఆయన సొంతంగా ఉపకరణాలు తయారు చేసుకున్నారు. రాష్ట్రస్థాయి, సౌత్ఇండియా స్థాయి, జాతీయస్థాయిలోనూ తన ఉపకరణాలను ప్రదర్శించి ప్రశంసలను పొందారు. సులభంగా గణితం బోధించడానికి తయారు చేసిన స్టడీ మెటీరి యల్, ఎస్సీఈఆర్టీ ద్వారా రాష్ట్రస్థాయిలో గణి త ఉపాధ్యాయులకు ఇచ్చే వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు, కరదీపికల రూపకల్పనలో మనోహర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్ర భుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలను ప్రో త్సహించడానికి ట్రస్టు ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
12వ రోజుకు ‘సమగ్ర’ సమ్మె
● బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన ఉద్యోగులు కై లాస్‌నగర్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. స్థానిక ఎన్టీఆర్ చౌక్‌లో మహిళా ఉద్యోగులు శనివారం బతుకమ్మ ఆడి నిరసన తె లిపారు. కలెక్టరేట్ ఎదుట చేపటిన సమ్మె శిబిరాన్ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, నాయకులతో కలిసి సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నేరవేర్చకుండా సమగ్ర శిక్ష ఉద్యోగులను మోసం చేసిందని ఆ రోపించారు. ఆయన వెంట పార్టీ నాయకులు జా దవ్ సుమన్ బాయి, అధినాథ్ తదితరులున్నారు. -
అందని ‘రుణమాఫీ’
ఇక్కడ కనిపిస్తున్నది ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు శంకర్. ఈయన గుడిహత్నూర్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గతంలో రూ.లక్ష 90వేల పంట రుణం తీసుకున్నాడు. రుణమాఫీకి అర్హుడై ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన నాలుగు విడతల జాబితాల్లోనూ ఈయన పేరు లేకపోవడం గమనార్హం. మూడో విడతలో వ్యవసాయ కార్యాయానికి వెళ్లి అధికారులతో సెల్ఫీ సైతం తీసుకున్నాడు. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఇతనొక్కడే కాదు.. రుణమాఫీకి అర్హులై ఉండి పథకం వర్తించని రైతులు జిల్లాలో వేలల్లోనే ఉన్నారు. – ఇచ్చోడఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. రూ.2లక్షల లోపు పంటరుణం పొందిన రైతులకు ఈ ఏడాది ఆగస్టు 15 లోపు పూర్తిస్థాయిలో వర్తింపజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో అన్నదాతలు సంబురపడిపోయారు. ఐదు నెలలు గడిచినా ఇంకా వర్తించకపోవడంతో అర్హులైన వేలాది మంది రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా పంట రుణం తీసుకున్న రైతులు 90వేల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన జీవో నం. 567 ప్రకారం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్టాపాస్ బుక్ ఆధారంగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. అయితే ఇప్పటి వరకు 62,568 మందికే వర్తింపజేశారు. ఇంకా 27వేల మందికి అందాల్సి ఉంది. మరోవైపు నాలుగో విడతలో 6,607 మందికి రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం నవంబర్‌లో ప్రకటించింది. అయితే ఇప్పటికీ వారి ఖాతాలో డబ్బులు జమకాకపోవడం గమనార్హం. మరోవైపు రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారి అయోమయంగా మారింది. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు పేర్కొంటున్నారు. అర్హతలున్నా వర్తించని వైనం జిల్లాలో 27వేలకు పైగా రైతులకు మొండిచేయి నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు -
వంటావార్పుతో ‘సమగ్ర’ నిరసన
ఆదిలాబాద్‌టౌన్/కై లాస్‌నగర్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ చౌక్‌లో వంటావార్పు చేపట్టి రోడ్డుపైనే సహపంక్తి భోజనం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇ చ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీరికి గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అమర్‌సింగ్ తిలావత్, గడ్డం శశికళ, ఉదయ్‌రావు, దే విదా స్ సంఘీభావం తెలిపారు. ఇందులో సమగ్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక, ప్రత్యేక అధికారులు కవిత, హిమబిందు, అర్చన, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
మరో చాన్స్
● ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుకు అవకాశం ● మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో స్వీకరణ కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. లబ్ధిదారుల ఎంపిక నిమి త్తం జిల్లాలో ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే ఇళ్లు పొందేందుకు అర్హులై ఉండి వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపాల్టీలోని ప్రత్యేక ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నిర్ణయంపై అర్హులైన వారిలో హర్షం వ్యక్తమవుతుంది. జిల్లాలో 1,97,448 దరఖాస్తులు ఏడాది క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా అభయహస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూతతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. గతేడాది డిసెంబర్ 28నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కింద ఈ కార్యక్రమం కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 1,97,448 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 17 గ్రామీణ మండలాల పరిధిలో 1,66,295 మంది, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 31,153 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుదారులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ఈ నెల 9 నుంచి తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు సర్వే పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వారికి మరో అవకాశం గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని పేదలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సొంతింటి స్థలం కలిగి, ఇళ్లు లేని నిరుపేదలు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ పరిధిలోని ప్రజలు ము న్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజాపాల న కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్ర స్తుతం ప్రజాపాలన వెబ్సైట్ అందుబాటులో లేకపోవడంతో కేవలం దరఖాస్తులను మాత్రమే స్వీకరించనున్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని నిరుపేదలు తమ వివరాలతో ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రజాపాలన వెబ్సైట్ అందుబాటులో లేకపోవడంతో మ్యానువల్‌గా స్వీకరించి భద్రపరుస్తాం. ప్రభుత్వం ఎప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి అనుమతిస్తే అప్పుడు వాటి వివరాలను ఆన్లైన్ చేస్తాం. – జి.జితేందర్‌రెడ్డి, జెడ్పీసీఈవో -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
● అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆదిలాబాద్: సీఎం కప్–2024లో భాగంగా జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పోటీలను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైతం రాణిస్తే ఉ జ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం ఆత్యాపాత్య, సైక్లింగ్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, వుషూ క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, క్రీడా సంఘాల బాధ్యులు కాంతారావు, రాష్ట్రపాల్, హరిచరణ్, పాండు, వీరేష్, శ్రీనివాస్, వేదవ్యాస్, శ్రీనివాస్, రాము, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ లక్ష్యాలను పూర్తి చేయాలి
● కలెక్టర్ రాజర్షి షాకైలాస్నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. పథకం అమలు తీరుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం స మీక్ష నిర్వహించారు. క్లస్టర్ల వారీగా పని దినాలు, చే పడుతున్న పనులు, వనమహోత్సవం, మహిళాశక్తి ఉపాధి భరోసా, స్వచ్ఛభారత్ మిషన్, సోషల్ ఆడి ట్ వివరాలను మండలాల వారీగా ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయా మండలాల్లోని పాఠశాలల్లో గల 95 కిచెన్గార్డెన్లలో 13,527 కూరగాయల మొ క్కలు నాటినట్లు తెలిపారు. వాటి సంఖ్య మరింతగా పెంచేందుకు గాను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో స్థలాలను సేకరించాలన్నారు. నర్సరీల్లో ఈత, ఖర్జూర మొక్కల లక్ష్యం 9 లక్షలు కాగా 5,04,500 మొక్కలు నాటినట్లు తెలిపారు. అలాగే పశువుల పాకాల నిర్మాణాల లక్ష్యం 340కి గాను 232 మంజూరు చేయగా 59 పూర్తి చేసినట్లు చె ప్పా రు. పొలంబాట, చెక్ డ్యాం పనుల లక్ష్యాలను త్వరి తగతిన పూర్తి చేసేలా శ్రద్ధ వహించాలన్నారు. అంతకు ముందు ఆయా మండలాల్లో సాధించిన లక్ష్యాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఇందులో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో సాయన్న, ఏడీఆర్డీవో కుటుంబ రావు తదితరులు పాల్గొన్నారు. సర్వే పకడ్బందీగా చేపట్టాలి ఇంద్రవెల్లి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కో సం చేపట్టిన మొబైల్ యాప్ సర్వే పకడ్బందీగా ని ర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని ముత్నూర్ గ్రామంలో పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. అనంతరం సర్వే తీరును పరిశీలించి గడువులోపు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయనవెంట ఉట్నూ ర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, తదితరులున్నారు.