Anantapur District News
-
సర్కారు అన్యాయంపై ఆగ్రహం
అనంతపురం: కూటమి ప్రభుత్వ అన్యాయపూరిత చర్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ, నల్సార్ వర్సిటీని అమరావతికి తరలించాలన్న సర్కారు నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కోర్టులో బుధవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సీనియర్ న్యాయవాదులు ఎంసీ సంపత్‌కుమార్, బీజే రవికుమార్, జి. ఉమాపతి, నాగన్న, వెంకట్రాముడు, శ్రీనివాస్ రెడ్డి, హనుమన్న, రంగనాయకులు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు నిరవధికంగా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేసి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. దశాబ్ధాలుగా రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపై నిర్మిస్తున్న నల్సార్ వర్సిటీని సైతం అమరావతికి తరలించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ 2014–19 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న బీజేపీ.. నేడు మౌనంగా ఉండడం సరికాదని విమర్శించారు. కాగా... ఎయిమ్స్‌ను సైతం అనంతపురంలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ తీర్మానించింది. గురువారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ జిల్లా కోర్టులో విధుల బహిష్కరణ -
అవగాహన లేకుండా వాడుతున్నారు
ఇటీవల కాలంలో చీడపీడలు, తెగుళ్ల నివారణకు కాంబినేషన్ విధానంలో మందులు పిచికారీ చేస్తున్నారు. ఒక మందు అవసరమైనా... అందులో మరొకటి లేదా రెండు రకాల మందులు కలిపి వాడుతున్నారు. సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పురుగు, తెగుళ్ల ఉధృతిని అంచనా (ఎకనామిక్ త్రెష్‌హోల్డ్ లెవెల్) వేయకుండా లక్షణాలు కనిపించిన తక్షణమే పురుగు మందులు వాడుతున్నారు. కనీసం మూడేళ్లకు ఒకసారి లోతుగా దుక్కులు చేసుకుంటే కోశస్థ దశలో ఉన్న పురుగులు నశిస్తాయి. అలాగే ఒకే పంట కాకుండా మార్పిడి చేసుకోవాలి. పంట కాలంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించినపుడు మందుల ఖర్చులు బాగా తగ్గిపోతాయి. వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తలు, పురుగు మందుల డీలర్లు సంయుక్తంగా రైతుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ విజయశంకరబాబు, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, రేకులకుంట. -
భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు
అనంతపురం: అదనపుకట్నం కోసం వేధించి భార్యను హత్య చేసిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వివరాలు.. గుంతకల్లులోని అరవింద నగర్‌కు చెందిన బాలాజీనాయక్ కుమారుడు కే. సుబ్రమణ్యం నాయక్‌కు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం రాచువారిపల్లికి చెందిన అఖిలతో 2021లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు 10 తులాల బంగారు నగలు ఇచ్చారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే అదనపు కట్నం కోసం భార్యను సుబ్రమణ్యం నాయక్ వేధించడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు, ఒకటిన్నర ఎకర పొలం తన పేరు మీద రాయించాలని సతాయించేవాడు. మరోవైపు అఖిలపై అనుమానం పెంచుకుని హింసించేవాడు. ఈ క్రమంలోనే 2022 మార్చి 31 రాత్రి 8:30 గంటల సమయంలో అఖిల తన తల్లికి ఫోన్ చేసింది. ‘నన్ను ఎక్కడెక్కడో తిప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఏం చేస్తాడో అనే భయం వేస్తోంది. రేపు ఉదయాన్నే ఊరికి వస్తా’ అని చెప్పింది. అయితే, ఆ తర్వాతి రోజే సుబ్రమణ్యం నాయక్ అఖిలను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గుంతకల్లు సీఐ నాగశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతపురం నాలుగో సెషన్స్ జడ్జి కోర్టు(మహిళా న్యాయస్థానం)లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో పీపీ సుజన 13 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో బుధవారం నాలుగో సెషన్స్ జడ్జి శోభారాణి తీర్పు వెలువరించారు. ముద్దాయి కే. సుబ్రమణ్యం నాయక్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి, ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు మానిటరింగ్ సిస్టం సీఐ వెంకటేశ్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ సౌ రెడ్డి, కానిస్టేబుల్ నాగేంద్రయ్యను ఉన్నతాధికారులు అభినందించారు. -
మనుషుల్నే మింగేస్తున్న పురుగు మందు
● మొదటికే మోసం తెస్తున్న క్రిమి సంహారకాలు● మనుషులపై తీవ్ర దుష్ప్రభావం● తెల్ల, ఎర్ర రక్త కణాల ఆవిరి● క్యాన్సర్, అల్సర్లకు దారితీస్తున్న వైనం● ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతున్నట్టు వైద్యుల హెచ్చరికలుసాక్షి ప్రతినిధి, అనంతపురం: పైర్లపై క్రిమి కీటకాలు దాడి చేస్తుంటే.. వాటిని చంపేందుకు వాడుతున్న పురుగు మందులు మనుషులపై దాడి చేస్తున్నాయి. ఏవైనా వ్యాధులు సోకినప్పుడు మనకు రక్షణ కవచంలా పనిచేసేది మూలకణాలే. ఎలాంటి రోగాలనైనా తిప్పికొట్టే సామర్థ్యం వీటికి ఉంటుంది. అలాంటి మూల కణాలపైనే పురుగు మందుల అవశేషాలు దాడి చేస్తున్నట్లు తేలింది. ఈ విషయం ప్రజలనే కాదు వైద్యులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే రకరకాల వైరస్లు, బాక్టీరియాలు దొంగ దెబ్బ తీస్తుండగా... నేడు పురుగు మందుల అవశేషాలు కూడా కోలుకోలేని దెబ్బతీస్తున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. ఇకపోతే మందుల అవశేషాల వల్ల శరీరానికి ప్రాణవాయువులా ఉండే తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలు, ప్లేట్లెట్స్ కూడా ప్రమాదానికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ మొదలు ఎప్లాస్టిక్ ఎనీమియా (బోన్‌మారో ఫెయిల్యూర్ సిండ్రోమ్) వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు వివరిస్తున్నారు.తీవ్ర నీరసం..ఎప్లాస్టిక్ ఎనీమియా వల్ల శరీరంలో ప్రధానంగా హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. తెల్లరక్త కణాలు గణనీయంగా తగ్గుతాయి. ఇక ప్లేట్లెట్స్ కౌంట్ వందల్లోకి చేరుతుంది. దీంతో మనిషి రోజు రోజుకు నీరస పడిపోతాడు. ఆరోగ్యవంతుడికి హిమోగ్లోబిన్ 14 ఉండాలి. కానీ ఎప్లాస్టిక్ ఎనిమీయా బాధితుడికి 2 వరకు పడిపోతుంది. ప్లేట్లెట్స్ సాధారణంగా 1.50 లక్షల నుంచి 4 లక్షల పైన ఉండాలి. అలాంటిది వెయ్యికి కూడా పడిపోతాయి. దీనంతటికీ కారణం మూల కణాల్లోనుంచి ఉత్పత్తి కావాల్సిన తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు, ప్లేట్లెట్స్ ఉత్పత్తి కాకపోవడమే. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్లు, అల్సర్లు, చర్మానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకు పురుగు మందుల అవశేషాలు కారణమని వైద్యులు చెబుతున్నారు.విచ్చలవిడిగా వాడకం..ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూరగాయలతో పాటు పండ్ల తోటల వ్యవసాయం ఎక్కువగా ఉంది. పురుగు మందు పిచికారీ చేస్తేగానీ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో రైతులు విచ్చలవిడిగా పురుగు మందులు వాడుతుండటంతో ఆ అవశేషాలు మనిషి శరీరంలోకి వెళ్లి తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పురుగు మందుల అవశేషాల కారణంగా వస్తున్న జబ్బులను వైద్యులు వెల్లడిస్తున్నారు. దీర్ఘకాలిక జబ్బుల కారణంగా ఎక్కువమంది ప్రభావితమవుతున్నట్టు తేలింది. ముఖ్యంగా ఎప్లాస్టిక్ ఎనీమియా బారిన పడుతున్న వారు ఎక్కువవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. -
జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుత రోజుల్లో రసాయనాలతో పండించిన పంటల వాడకం అధికమైంది. వీటివల్ల కిడ్నీ, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. కేన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయి. పంటలకు క్రిమిసంహారక మందులు అధికంగా వాడడం వల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. వీలైనంత వరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఒకటికి రెండుసార్లు శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటించాలి. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. – భీమాసేనాచార్, హెచ్ఓడీ, జనరల్ మెడిసిన్, ప్రభుత్వ సర్వజనాస్పత్రి -
గంజాయి రవాణాను అరికట్టాలి
● ఎస్పీ జగదీష్ అనంతపురం: గంజాయి సరఫరా, రవాణా, క్రయ, విక్రయాలను అరికట్టాలని ఎస్పీ పి. జగదీష్ అన్నారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ముందుగా సర్కిళ్ల వారీగా ఎస్పీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.రాంగ్రూట్లో వెళ్లే వాహనాలు, ఓవర్‌లోడ్, ట్రిపుల్రైడ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారు, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానా విధించాలన్నారు. ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా, సహాయకారిగా మెలిగినప్పుడే పోలీసుల పట్ల సదభిప్రాయం ఏర్పడి విశ్వాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి, డీఎస్పీలు వి. శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు, రవిబాబు, రామకృష్ణుడు, మహబూబ్ బాషా, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా మునిసిపల్ హెచ్ఎం పదోన్నతులు అనంతపురం ఎడ్యుకేషన్: నగరపాలక సంస్థ, మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ బుధవారం ప్రశాంతంగా జరిగింది. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మూడు గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు, ఉమ్మడి జిల్లాలో మునిసిపాలిటీ స్కూళ్లలోని మూడు గ్రేడ్–హెచ్ఎం పోస్టులకు పదోన్నతులు జరిగాయి. డీఈఓ కార్యాలయంలో ఉదయం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి మధ్యాహ్నం కౌన్సెలింగ్ ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేశారు. 1:3 చొప్పున కౌన్సెలింగ్‌కు పిలవగా.. అనంతపురం కార్పొరేషన్లో మొదటి అభ్యర్థి నాట్ విల్లింగ్ ఇచ్చారు. తక్కిన ముగ్గురూ పదోన్నతులు తీసుకున్నారు. మునిసిపాలిటీలకు వచ్చేసరికి మూడు పోస్టులకు 9 మంది అభ్యర్థులను పిలవగా ఇద్దరు విల్లింగ్ ఇచ్చి..తక్కిన ఏడుమంది నాట్ విల్లింగ్ ఇచ్చారు. దీంతో సీనియార్టీ జాబితాలో 13వ స్థానంలో ఉన్న టీచరు ఫోన్ ద్వారా విల్లింగ్ ఇవ్వడంతో ఆయనను గురువారం కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి సరెండర్ అనంతపురం మెడికల్: ఆరోగ్యశాఖలో ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న కోదండరామిరెడ్డిని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ బుధవారం కడప ఆర్డీకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ యూనియన్ పేరుతో కొంత మందిని బెదిరిస్తున్నట్లు అతనిపై ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సాగునీటి సంఘాల ఎన్నికలకు కసరత్తు అనంతపురం సెంట్రల్: సాగునీటి సంఘాల ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ డీఆర్సీ భవన్లో నీటి సంఘాల ఎన్నికలపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కేశవనాయుడు, హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్, చిన్ననీటి పారుదలశాఖ ఎస్ఈ విశ్వనాథ రెడ్డి, ట్రైనర్స్ రాజ్‌కుమార్, ఈఈ రమణారెడ్డిలు హాజరై ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. ఓటర్లుగా ఉన్న ఆయకట్టు రైతుల వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ రోజే చైర్మన్ ఎన్నిక ఉంటుందన్నారు. ఉదయం నామినేషన్ ప్రక్రియ, ఉప సంహరణ, ఫలితాల వెల్లడి జరుగుతుందని వివరించారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదలవుతాయని పేర్కొన్నారు. -
పింఛన్‌దారులపై ‘పచ్చ’ కుట్ర
రాప్తాడు: ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ఇంటింటికీ తిరుగుతున్న టీడీపీ నాయకులు పింఛన్ దారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. పింఛన్ అందకుండా చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. అనర్హులంటూ ఈ నెల 6వ తేదీ నుంచి మండల వ్యాప్తంగా దాదాపు 140 మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు అధికారుల ద్వారా నోటీసులు పంపారు. వీరిలో ఒక్కరు కూడా టీడీపీ వారు లేకపోవడం గమనార్హం. అధికారులపై ఒత్తిడి.. : రాప్తాడు మండల వ్యాప్తంగా దాదాపు 7 వేల మంది వివిధ రకాల పింఛన్లు అందుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించాలని అధికారులపై పచ్చ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. తాము చెప్పినట్లు చేయకుంటే బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లాలని బెదిరిస్తున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లు భరించలేక ఎంపీడీఓ బుల్లే విజయలక్ష్మి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. బాధితుల ఆవేదన.. : నోటీసులు అందుకున్న పింఛన్‌దారులు బుధవారం రాప్తాడులోని ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ అర్హత పత్రాలను అధికారులకు చూపించారు. నోటీసులు అందించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లను నిలుపుదల చేస్తే హైకోర్టులో దావా వేస్తామని స్పష్టం చేశారు. పింఛన్‌దారులకు వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్ మద్దతు పలికారు. కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతి పరులకే నోటీసులు పంపడం అన్యాయమని, వైఎస్సార్ సీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క పింఛను కూడా తొలగించలేదని పేర్కొన్నారు. అర్హుల పింఛన్లు తొలగిస్తే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయంపై ఎంపీడీఓ బుల్లే విజయలక్ష్మి మాట్లాడుతూ విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా నోటీసులు -
రైతులతో బీమా ప్రీమియం కట్టించండి
అనంతపురం అగ్రికల్చర్: రైతులతో బీమా ప్రీమియం డిసెంబర్ 15 లోపు కట్టించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రస్తుత రబీకి సంబంధించి అమలులో ఉన్న ప్రధానమంత్రి ఫసల్‌బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పంటల బీమా పథకాలు రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రబీలో పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఫసల్‌బీమా, అలాగే వాతావరణ బీమా కింద టమాటకు వర్తింపజేశారని తెలిపారు. వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం డిసెంబర్ 15 లోపు రైతులు చెల్లించాల్సి వుంద న్నారు. పప్పుశనగ ఎకరాకు రూ.450 ప్రకారం, వేరుశనగ ఎకరాకు రూ.480, జొన్నకు రూ.315, మొక్కజొన్న రూ.325, వరికి రూ.630, టమాట రూ.1,600 ప్రకారం రైతులు ప్రీమియం చెల్లించాలన్నారు. రుణాలు పొందుతున్న రైతులు బ్యాంకు ల్లోనూ, రుణాలు లేని రైతులు కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ), సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా నేషనల్ క్రాప్ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్సీఐపీ)లో తమ వాటా చెల్లించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇందుకు వ్యవసాయ, ఉద్యానశాఖతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. పంట కోత ప్రయోగాల ఫలితాలు, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టు ఆధారంగా బీమా పరిహారం లెక్కించి రైతులకు పరిహారం ఇస్తారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో మలోలా, జేడీఏ ఉమామహేశ్వరమ్మ,, సీపీవో అశోక్‌కుమార్, డీహెచ్‌వో నరసింహారావు, ఎల్డీఎం నర్సింగ్‌రావు, ఇన్సూరెన్స్ కంపెనీ, ఎన్ఐసీ అధికారులు, టెక్నికల్ ఏవోలు పాల్గొన్నారు. ‘పీఎం ఆవాస్’పై విస్తృత అవగాహన గుత్తి రూరల్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. గుత్తి మండలంలోని జక్కలచెరువు గ్రామంలో బుధవారం జరిగిన ‘పీఎం ఆవాస్ యోజన, సప్తాహ్’ వారోత్సవాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గృహానికి రూ.1.20 లక్షలు అందుతుందని వివరించారు. స్థలం ఉన్న వారికి పొజీషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తామని, స్థలం లేని వారు అర్జీ ఇస్తే మంజూరు చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్లు, ఇంకుడు గుంతలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ శైలజను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించుకున్న ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని ఎస్టీ కాలనీలో నిర్వహించిన సికిల్ సెల్ వ్యాధి నిర్మూలన మిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం అవుతోందని ఎంపీపీ విశాలాక్షి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, తహసీల్దార్ ఓబిలేసు, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్యాణి, సీహెచ్‌ఓలు నాగమణి, మోనాలిసా, ఏఎన్ఎం సుగుణ, హౌసింగ్ డీఈ మధుసూదన్‌రెడ్డి, ఏఈ సూర్యనారాయణ, సర్పంచ్ సుహాసిని, ఎంపీటీసీ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ ఆదేశం -
కొత్త వీసీ వచ్చే వరకే రెక్టార్, రిజిస్ట్రార్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు నూతన వీసీ వచ్చే వరకు మాత్రమే పదవుల్లో కొనసాగుతారు. కొత్త వీసీ తన అభీష్టం మేరకు వారిని పదవుల్లో కొనసాగించవచ్చు లేదా తొలగించవచ్చు. ఈ మేరకు ఎస్కేయూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాలకమండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. స్టాటిస్టికల్ ఆఫీసర్ అయిన రమేష్ బాబు రిజిస్ట్రార్ పదవికి అనర్హుడని ఇటీవల పలువురు ప్రొఫెసర్లు మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ హోదా గల వ్యక్తిని రిజిస్ట్రార్‌గా నియామకం చేయవచ్చనే నిబంధన ఉన్నప్పటికీ, ఎలాంటి అర్హత లేని వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే జరిగిన పాలకమండలి సమావేశంలో రిజిస్ట్రార్ పదవిని ర్యాటిఫై చేసే అంశాన్ని ప్రవేశపెట్టగా కోన శశిధర్ సమ్మతించలేదు. పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రస్తుత రిజిస్ట్రార్, రెక్టార్ పదవులకు ఆమోదం తెలపలేమని స్పష్టం చేశారు. కొత్త వీసీ వచ్చే వరకు మాత్రమే కొనసాగాలని సూచించారు. ● 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. శ్రీకాంత్ గతంలో వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే అప్పటి వీసీ మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి ఆమోదం తెలపడంపై ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే కనీసం పిలిచి మాట్లాడి పునరాలోచించుకోవాలని కోరకుండా ఏకపక్షంగా రాజీనామాను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆమోదంతో ఆయన్ను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని పాలకమండలి నిర్ణయించింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంగా పాలకమండలి సభ్యులుగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లాలని కోరారు. కాగా, తమ పదవులను ర్యాటిఫై చేసే సమయంలో రెక్టార్, రిజిస్ట్రార్ సమావేశంలో ఉండకూడదు. కానీ ఇద్దరూ మీటింగ్‌లో కూర్చుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. నూతన వైస్ చాన్స్‌లర్ వచ్చాక అభీష్టం మేరకు నిర్ణయం ఎస్కేయూ పాలకమండలి సమావేశంలో తీర్మానం -
ప్రేమిస్తావా.. చంపమంటావా?
● విద్యార్థినికి యువకుడి వేధింపులు ● ఆమె ఉంటున్న హాస్టల్‌కే వెళ్లి దాడి అనంతపురం: ప్రేమించకపోతే చంపేస్తానంటూ ఓ యువకుడు విద్యార్థినిపై దాడి చేసిన ఘటన అనంతపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన విద్యార్థిని అనంతపురంలోని సాయి నగర్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కేఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన రవి కొన్నాళ్లుగా బాలిక వెంట పడుతున్నాడు. బుధవారం సాయంత్రం విద్యార్థిని ఉంటున్న హాస్టల్ వద్దకు వెళ్లాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. అందరూ చూస్తుండగానే విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే గట్టిగా తోయడంతో కింద పడిన బాలిక కాలికి గాయమైంది. విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పగా.. వారు అనంతపురం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీకాంత్ యాదవ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
జనవరి 3 నుంచి ఎస్ఎస్బీఎన్ 80వ వార్షికోత్సవం
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక సాయిబాబా జాతీయ పాఠశాల, కళాశాలల 80వ వార్షికోత్సవాన్ని 2025, జనవరి 3 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేలా ఏర్పాట్లకు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు బుధవారం ఆ కళాశాలలో సమావేశమై చర్చించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పరుచూరి రమేష్ బాబు మాట్లాడుతూ 1945లో సత్యసాయిబాబా జాతీయ ఉన్నత పాఠశాలను స్థాపించారని గుర్తు చేశారు. కాలక్రమేణ జూనియర్ కళాశాలగా, డిగ్రీ, పీజీ కళాశాలగా వృద్ధి చెందడం సంతోషదాయకమన్నారు. ఈ విద్యాసంస్థలో చదువుకున్న ఎంతోమంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలుగా స్థిరపడ్డారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పూర్వ విద్యార్థులతో పాటు పూర్వ ఆచార్యులతో కలసి 80 వసంతోత్సవాల పేరిట ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 3న పాఠశాల వేడుకలు, 4న జూనియర్ కళాశాల వేడుకలు, 5న డిగ్రీ, పీజీ కళాశాలల ఆత్మీయ సమ్మేళన వేడుకలు ఉంటాయన్నారు. ఈ విద్యాసంస్థలో చదువుకున్న ప్రతి విద్యార్థీ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు పీఎల్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎస్ఆర్ నాగభూషణం, కార్యదర్శి సుంకు వేణుగోపాల్, సహాయ కార్యదర్శులు శివచంద్ర, అన్నపూర్ణ, కోశాధికారి చంద్రశేఖర్ గుప్త పాల్గొన్నారు. -
తండ్రీ కొడుకును కబళించిన విద్యుత్ తీగ
యల్లనూరు: పుట్లూరు మండలానికి చెందిన తండ్రీకొడుకును విద్యుత్ తీగ కబళించింది. వేరే ఊరికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగొస్తుండగా మార్గమధ్యంలో విద్యుత్తీగ తెగిపడడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు మండలం మడుగుపల్లికి చెందిన బయ్యన్న స్వామి పూజారి రామాంజినేయులు(42), కుమారుడు రవి (12) బుధవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలం అంకేవారిపల్లిలో బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. బంధువులందరితో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు. సింహాద్రిపురం మండలం బిదనంచెర్ల నుంచి యల్లనూరు మండలం దంతపల్లి మీదుగా వ్యవసాయ పొలాల రోడ్డులో వెళుతుండగా..మార్గమధ్యంలో విద్యుత్ తీగ తెగి ద్విచక్ర వాహనంపై పడింది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలోని రైతులు గమనించి విద్యుత్ అధికారులకు తెలియజేశారు. వారు కరెంట్ సరఫరా ఆపేశారు. విషయం తెలుసుకున్న రామాంజినేయులు భార్య భాగ్యలక్ష్మి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ‘చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండాయా నాయనా.. పొద్దున్నే లేవగానే స్కూల్‌కు వెళ్లి ఉంటే ప్రమాదం తప్పేది కదరా’ అంటూ కుమారుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. కాగా.. రామాంజినేయులుకు భార్య, ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాదంలో మృతిచెందిన ఒక్కగానొక్క కుమారుడు రవి మడుగుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తండ్రీ కొడుకు మృతితో మడుగుపల్లి శోకసంద్రమైంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీరాంప్రసాద్, ఏఎస్ఐ సంపత్‌కుమార్, విద్యుత్ శాఖ డీఈ రాజశేఖర్, ఏఈ పద్మనాభరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొత్త లైన్ ఏర్పాటు చేశామని, ఈ లైన్ తెగి పడిందని విద్యుత్ సిబ్బంది చెప్పారు. -
చోరీ కేసులో ముద్దాయికి 10 నెలల జైలు
అనంతపురం: నగరంలోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చోరీ ఘటనలో నేరం రుజువు కావడంతో ముద్దాయికి 10 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ ఏడాది మే 18న తన ఇంటికి చాకలి నారాయణ తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి పొరుగు ఇంట్లో నిద్రపోయాడు. విషయాన్ని గుర్తించిన గుంతకల్లుకు చెందిన నల్లబోతుల వాసు తాళం వేసిన ఇంట్లోకి చొరబడి ఒక జత బంగారు కమ్మలు, మూడు జతల వెండి కాళ్ల పట్టీలు, ఒక శ్యామ్‌సంగ్ టీవీ, చిన్న పిల్లల దుస్తులు, రూ.68 వేలు విలువ చేసే పరికరాలు చోరీ చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసు వాదనలు పూర్తయి తుది తీర్పు బుధవారం వెలువడింది. నేరం రుజువు కావడంతో ముద్దాయి నల్లబోతుల వాసుకు పది నెలల జైలు శిక్ష విధిస్తూ మొబైల్ కోర్టు న్యాయమూర్తి జె.సుజిన్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను ఏపీపీ వి.శ్రీనివాసులు వినిపించారు. మహిళను బెదిరించిన కేసులో ఏడాది జైలు అనంతపురం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ మహిళను, ఆమె నాన్నను దుర్భాషలాడిన ఘటనలో నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒకటో స్పెషల్ కోర్టు జడ్జి కె.శివశంకర్ బుధవారం తీర్పు వెలువరించారు. నగరంలోని రంగస్వామి నగర్లో నివాసముంటున్న రమేష్ అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించినట్లుగా నేరం రుజువైంది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఎలమాసు భాను వాదనలు వినిపించారు. ఆర్ఆర్బీ పరీక్షార్థుల కోసం ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ఈ నెల 23, 24వ తేదీల్లో ఆర్ఆర్బీ పరీక్షలు రాసే అభ్యర్థుల రాకపోకలకు అనుకూలంగా అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ కార్యాలయ వర్గాలు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించాయి. 23న నాంథేడ్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు(07105) మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరిగి ఈ రైలు తిరుపతి జంక్షన్ నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నాంథేడ్ జంక్షన్‌కు చేరుతుంది. ఈ రైళ్లు ముద్కైడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
చోరీ కేసులో ముద్దాయికి 10 నెలల జైలు
అనంతపురం: నగరంలోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చోరీ ఘటనలో నేరం రుజువు కావడంతో ముద్దాయికి 10 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ ఏడాది మే 18న తన ఇంటికి చాకలి నారాయణ తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి పొరుగు ఇంట్లో నిద్రపోయాడు. విషయాన్ని గుర్తించిన గుంతకల్లుకు చెందిన నల్లబోతుల వాసు తాళం వేసిన ఇంట్లోకి చొరబడి ఒక జత బంగారు కమ్మలు, మూడు జతల వెండి కాళ్ల పట్టీలు, ఒక శ్యామ్‌సంగ్ టీవీ, చిన్న పిల్లల దుస్తులు, రూ.68 వేలు విలువ చేసే పరికరాలు చోరీ చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసు వాదనలు పూర్తయి తుది తీర్పు బుధవారం వెలువడింది. నేరం రుజువు కావడంతో ముద్దాయి నల్లబోతుల వాసుకు పది నెలల జైలు శిక్ష విధిస్తూ మొబైల్ కోర్టు న్యాయమూర్తి జె.సుజిన్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను ఏపీపీ వి.శ్రీనివాసులు వినిపించారు. మహిళను బెదిరించిన కేసులో ఏడాది జైలు అనంతపురం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ మహిళను, ఆమె నాన్నను దుర్భాషలాడిన ఘటనలో నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒకటో స్పెషల్ కోర్టు జడ్జి కె.శివశంకర్ బుధవారం తీర్పు వెలువరించారు. నగరంలోని రంగస్వామి నగర్లో నివాసముంటున్న రమేష్ అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించినట్లుగా నేరం రుజువైంది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఎలమాసు భాను వాదనలు వినిపించారు. ఆర్ఆర్బీ పరీక్షార్థుల కోసం ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ఈ నెల 23, 24వ తేదీల్లో ఆర్ఆర్బీ పరీక్షలు రాసే అభ్యర్థుల రాకపోకలకు అనుకూలంగా అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ కార్యాలయ వర్గాలు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించాయి. 23న నాంథేడ్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు(07105) మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరిగి ఈ రైలు తిరుపతి జంక్షన్ నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నాంథేడ్ జంక్షన్‌కు చేరుతుంది. ఈ రైళ్లు ముద్కైడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు వీడాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం, మరింత ఒత్తిడికి గురిచేసే విధానాలను ఇప్పటికై నా మానుకోవాలని కూటమి సర్కార్‌ను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శవన్నగారి బాలాజీ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని ఆపస్ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యవర్గాల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బాలాజీ మాట్లాడుతూ... ఇప్పటికే రకరకాల యాప్‌లు, ఎఫ్ఎల్ఎన్ మరియు లీడర్షిప్ ట్రైనింగ్‌లు, అపార్ నంబర్ జనరేషన్ తదితర బోధనేతర పనులతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. 117 జీఓతో ఉపాధ్యాయులపై విపరీతమైన పనిభారం ఉందన్నారు. దీనికి అదనంగా సాయంత్రం 5 గంటల వరకు బడి వేళలు పొడిగించడం దారుణమన్నారు. ప్రస్తుతం ఉన్న బడివేళలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. అదే సమయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆపస్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలన్నారు. అప్పటిదాకా మధ్యంతర భృతి (ఐఆర్)ను ప్రకటించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి మాట్లాడుతూ... 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు జీఓ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన అధ్యాపకుడు డాక్టర్ రంగనాథంను సన్మానించారు. సమావేశంలో సంఘం గౌరవ సలహాదారుడు వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణస్వామి, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు, నాయకులు హర్షవర్ధన్, పీఎస్వీ నాయుడు, గోపీచంద్, భాస్కరయ్య, రమేష్ వెంకటేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ -
సాయిబాబా ఆలయంలో పట్టపగలే చోరీ
● పంచలోహ విగ్రహం, వెండి సామగ్రి అపహరణ ఉరవకొండ: స్ధానిక శిరిడి సాయిబాబా ఆలయంలో పట్టపగలే చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... ఈ నెల 19న మాలాధారణ భక్తుడిగా ఆలయానికి వెళ్లిన ఓ దుండగుడు సాయిబాబా పంచలోహ విగ్రహంతో పాటు పెద్ద ఎత్తున వెండి సామగ్రి అపహరించుకెళ్లాడు. ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడం గమనార్హం. మూలవిరాట్ వద్ద ఉంచిన బాబా పంచలోహ విగ్రహం, వెండి సామగ్రి, గంటను ఒక బ్యాగ్‌లో పెట్టుకోని తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. బుధవారం దుయం ఆలయంలో విలువైన వెండి సామగ్రితో పాటు స్వామి పంచలోహ విగ్రహం లేకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజీలను ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు. దీంతో చోరీ విషయం వెలుగు చూసింది. ఘటనపై పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆసియా దేశాల సదస్సుకు అనంత మేయర్ అనంతపురం ఎడ్యుకేషన్: ఇరాన్లో గురు, శుక్రవారాల్లో జరగనున్న ఆసియా దేశాల మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం వెళ్లారు. బుధవారం ఇరాన్ దేశం రాజధాని తెహరాన్‌కు చేరుకున్న ఆయనకు అక్కడి మునిసిపల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. గురు, శుక్రవారం రెండురోజుల పాటు ఆసియన్ మేయర్స్ ఫోరం (ఏఎంఎఫ్) ఆధ్వర్యంలో ఖోర్రామాబాద్లో జరిగే సదస్సులో ఆయన పాల్గొననున్నారు. నగరాల్లో పౌరుల మధ్య మంచి సంబంధాలు పెంచడం, మెరుగైన జీవనం కల్పించడం, ఆయా దేశాల మధ్య దౌత్యం, పరస్పర విజ్ఞాన మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా నగరాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మేయర్లు తమ అనుభవాలను వివరించనున్నారు. ప్రధానంగా పర్యావరణం, పట్టణ ఆరోగ్యంపై చర్చించనున్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ...ఇతర దేశాలు మన నగరాన్ని గుర్తించడం గర్వకారణం అన్నారు. ఇది అనంతపురం నగర ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతి లెటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువు పొడిగించారు. ఈ మేరకు లేపాక్షిలోని విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత ప్రవేశ పరీక్ష 2025, ఫిబ్రవరి 8న ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులకు నాగరాజు పిలుపునిచ్చారు. ఇంటి పన్ను వివరాలు వారం లోపు అప్లోడ్ చేయాలి అనంతపురం రూరల్: ఇంటి పన్ను వివరాలను వారం లోపు అప్లోడ్ చేయాలని పంచాయతీ అధికారులను డీపీఓ నాగరాజునాయుడు ఆదేశించారు. ఇంటి పన్ను అంశంపై బుధవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీఎల్డీఓలు, ఈఓఆర్డీలతో ఆయన సమీక్షించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రొఫైల్‌ను అప్డేట్ చేసుకుని ఇంటి పన్ను వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పంట నమోదు తప్పనిసరి బుక్కరాయసముద్రం: సాగు చేసిన పంటలను తప్పనిసరిగా ఈ–క్రాప్ నమోదు చేయించాలని రైతులకు జేడీఏ ఉమామహేశ్వరమ్మ పిలుపునిచ్చారు. బీకేఎస్‌లోని గాంధీనగర్ రైతు సేవాకేంద్రంలో బుధవారం నిర్వహించిన కౌలు రైతుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కౌలు రైతుకూ బ్యాంక్‌ల ద్వారా పంట రుణాలు మంజూరు చేస్తామన్నారు. తీసుకున్న రుణాన్ని పంట కాలం అయిన తర్వాత బ్యాంకులకు చెల్లించాలన్నారు. ఈ–క్రాప్‌లో నమోదైన పంటలకు మాత్రమే నష్టపరిహారం, బీమా తదితర పథకాలు వర్తిస్తాయన్నారు. ఎల్డీఎం నరసింహారావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పథకం లబ్ధిని వివరించారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, రెడ్డిపల్లి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, ఎస్బీఐ మేనేజర్ శరత్, మండల ఏఓ శ్యామసుందరరెడ్డి, ఏఈఓ జ్ఞానజ్యోతి, నగేష్, వీఏఓలు, వీహెచ్ఓలు, ఎంపీఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుంతకల్లు రూరల్: దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్సకు స్పందించక ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం మొలకలపెంట గ్రామ మాజీ సర్పంచ్ మొలగవెళ్లి రంగమ్మ కుమారుడు జయుడు (42) అదే గ్రామానికి చెందిన వివాహిత వరలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. పలుమార్లు ఆమె వద్దని వారించినా జయుడు వినకుండా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. దీంతో జయుడి బారి నుంచి తప్పించుకునేందుకు కొంత కాలం ఇతర ప్రాంతాల్లో తల దాచుకున్న వరలక్ష్మి.. కొంత కాలం క్రితం గుంతకల్లుకు మకాం మార్చింది. ఈ విషయం తెలుసుకున్న జయుడు ఈ నెల 8న రాత్రి గుంతకల్లులోని వరలక్ష్మి ఇంటికి చేరుకుని ఆమైపె లైంగిక దాడికి యత్నించాడు. విషయాన్ని వెంటనే వరలక్ష్మి తన కుమారుడు ఉదయ్‌కి ఫోన్ చేసి తెలపడంతో తన స్నేహితుడు చందును తీసుకుని ఇంటికి ఉదయ్ చేరుకున్నాడు. ఆ సమయంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగిన జయుడిని వరలక్ష్మి, ఉదయ్, చందు కొట్టి, అనంతరం మొలకలపెంట గ్రా శివారులో పడేసి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో స్పృహలోకి వచ్చిన జయుడు తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి పోయారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు, అక్కడి నుంచి తిరిగి కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం కర్నూలు ఆస్పత్రిలో ఆయన మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
తెలుగుదేశం నేత బరితెగింపు
అనంతపురం రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు బరితెగించారు. ప్రభుత్వ భూములే కాకుండా సామాన్యులు కష్టపడి కొనుకున్న స్థలాలను సైతం ఆక్రమించుకోవడానికి పన్నాగం పన్నారు. బుధవారం రుద్రంపేటలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఏళ్ల నాటి క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు హిందూపురం మాజీ కార్పొరేటర్ చక్రపాణినాయుడు తమపై దౌర్జన్యం చేస్తున్నారని బి.యాలేరు గ్రామానికి చెందిన మనేరు ఈశ్వరయ్య కుటుంబసభ్యులు బుధవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు మాట్లాడుతూ... కక్కలపల్లి సర్వే నంబర్ 133–1, 134లో 4 సెంట్ల స్థలాన్ని 1991లో కొనుగోలు చేసి తమ తల్లి మనేరు నరసమ్మ పేరిట రిజిష్ట్రేషన్ చేయించి, చుట్టూ ఫెన్సింగ్ వేయించామన్నారు. ఆ స్థలాన్ని తాము ఎవరికి విక్రయించలేదన్నారు. ఆ స్థలానికి చక్రపాణినాయుడుకు ఎలాంటి సంబందం లేకపోయినా ఆక్రమించుకునేందుకు తమపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాన్ని ఆక్రమించుకుంటే దిక్కేవరు వస్తారని, తనకు పరిటాల శ్రీరామ్, బాలకృష్ణ బందువులవుతారంటూ స్థలం చుట్టూ నాటిన బండలను జేసీబీతో పగులకొట్టించారని వాపోయారు. ఆ సమయంలో అడ్డుకోబోయిన మహిళలపై తన అనుచరులతో కలసి దురుసుగా ప్రవర్తించారన్నారు. పోలీసు అధికారులు స్పందించి టీడీపీ నాయకుల అరాచకాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. టీడీపీ నాయకుల నుంచి రక్షణ కల్పించండి తాతల కాలం నుంచి సాగులో ఉన్న భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు టీడీపీ నాయకులు కక్ష కట్టి తమపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలంటూ గార్లదిన్నె మండలం అంకంపేట గ్రామ రైతు గోపాలరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంకంపేటలోని సర్వే నంబర్ 3–3లో తనకు 1.09 ఎకరాల భూమి ఉందన్నారు. నలభై ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి తాము సాగులో ఉన్నామన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు తమ పేరుపైనే ఉన్నా... కొన్ని నెలలుగా ఆ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ
బెళుగుప్ప: స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పీహెచ్‌సీని బుధవారం కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబుతో కలసి జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో ఆర్ఐ విధుల్లో లేకపోవడం గమనించి తహసీల్దార్ షర్మిళను ప్రశ్నించారు. విధులకు సక్రమంగా హాజరు కాని వారిపై తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. పీహెచ్సీలో ఓపీ వివరాలపై వైద్యాధికారి ప్రియాంకతో ఆరాతీసారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. అనంతరం రమనేపల్లి వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనుమతుల జారీ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వ్యక్తి ఆత్మహత్య గుమ్మఘట్ట: మండలంలోని 75 వీరాపురం గ్రామ నివాసి ప్రహ్లాద (38) ఆత్మహత్య చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితమైన ప్రహ్లాదకు భార్య తిప్పమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ నాలుగేళ్ల క్రితం తిప్పమ్మ మృతి చెందింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం పద్మక్కను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబంలో తరచూ గొడవలు చోటు చేసుకుంటుండడంతో తాగుడుకు బానిసైన ప్రహ్లాద గ్రామ శివారులోని గుడిసెలో బుధవారం మద్యం మత్తులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గంజాయి విక్రేతల అరెస్ట్ అనంతపురం: నగరంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. జిల్లాలో గంజాయి విక్రయాలపై ఈ నెల 18న గం‘జాయ్’ శీర్షికన ‘సాక్షి’ వెలువడిన కథనంపై ఎస్పీ జగదీష్ స్పందించారు. గంజాయి విక్రయాలు అరికట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విస్తృత తనిఖీలు చేపట్టిన అనంతపురం వన్‌టౌన్ పోలీసులు చెరువు కట్టపై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న దూదేకుల షంషాద్వలి అలియాస్ షెక్షావలి అలియాస్ షెక్షా, షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాన్ అలియాస్ జిలాన్‌తో పాటు మైనర్ బాలుడుని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో వారి వద్ద రెండు కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి గుత్తి: రైలు నుంచి జారి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గుత్తి ఆర్ఎస్లోని పత్తికొండ మార్గంలోని ఆర్ఓబీ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలాన్ని జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, కానిస్టేబుల్ వాసు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప మాట్లాడుతూ... మృతుని వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఇతర ఆధారాలేమీ లభ్యం కాలేదని, ఆచూకీ పసిగట్టిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పొదుపు మంత్రం తప్పనిసరి..
అనంతపురం అగ్రికల్చర్: ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మండలాలతో పాటు మిగిలిన మండలాల్లోనూ నీటి వాడకం బాగా తగ్గించి పొదుపు చర్యలు చేపట్టకపోతే వేసవిలో మరింత ఒత్తిడి ఎదుర్కొవాల్సి ఉంటుందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో భూగర్భ జలాలు పదిలంగా ఉన్నా... 16 మండలాలు తీవ్ర నీటి ఒత్తిడికి గురవుతున్నట్లు నివేదికలూ పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో నీటి పొదుపు చర్యలు చేపడితే వచ్చే వేసవి నుంచి గట్టెక్కవచ్చని, లేకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనే ఆ మండలాలు.. జిల్లా వ్యాప్తంగా 97 ప్రాంతాల్లో ఉన్న ఫిజోమీటర్ల ఆధారంగా ఆ శాఖ సేకరించిన వివరాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి సగటు నీటిమట్టం 9.21 మీటర్లుగా నమోదు కావడం గమనార్హం. భూగర్భ జలాలు మెరుగుపడుతున్నట్లు భూగర్భ జలవనరుల శాఖ అంచనా వేసినా... ఇప్పటికీ 16 మండలాలు నీటి ఒత్తిడికి గురవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అనంతపురం, బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, డి.హిరేహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కంబదూరు, కూడేరు, కుందుర్పి, నార్పల, పామిడి, పుట్లూరు, శెట్టూరు, తాడిపత్రి, యాడికి తదితర మండలాల్లో నీటి ఒత్తిడి ఉన్నట్లు అంచనా వేశారు. ఈ చర్యలు తప్పనిసరి ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటలు, చెక్‌డ్యాంల మరమ్మతులు చేపట్టి భూగర్భంలో నీరు ఇంకే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరు తడి పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించడం విశేషం. యాడికి మండలం రాయలచెరువు ఫిజోమీటర్‌లో 34.90 మీటర్లలో భూగర్భజలాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే శెట్టూరు ఫిజోమీటర్‌లో 31.18 మీటర్లు, యాడికి మండలం నగరూరులో 28.80 మీటర్లు... ఇలా కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గిపోయినట్లు గుర్తించారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన ప్రాంతాలు, చెరువులు నిండిన మండలాల్లో నీటిమట్టం మెరుగుగా ఉన్నట్లు చెబుతున్నారు. 97 ఫిజోమీటర్లకు గానూ 43 ఫిజోమీటర్లలో 8 మీటర్లు అంతకన్నా ఎక్కువ లోతులో భూగర్భజలాలు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే పరిస్థితి లేనందున నీటి పొదుపు చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని హెచ్చరిస్తున్నారు. నీటి ఒత్తిడి జాబితాలో 16 మండలాలు నీటి పొదుపు తప్పనిసరి అంటున్న నిపుణులు -
మోడల్ స్కూల్లో చేరిన ఉద్యోగులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉత్కంఠకు తెర పడింది. ఆ ఉద్యోగులకు ఊరట లభించింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి మెరిట్ కమ్ రోస్టర్ ద్వారా ఎంపిక చేసిన ఉద్యోగులను ఉరవ కొండ మోడల్ స్కూల్లో చేర్చుకోకుండా ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరులు అడ్డుకుంటూ బెదిరింపులకు దిగిన వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. వార్డెన్ పోస్టుకు బంగి సునీత, పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్ పోస్టుకు మాదిగ రాజేశ్వరి ఎంపికయ్యారు. కలెక్టర్ జారీ చేసిన నియామక ఉత్తర్వులతో విధుల్లో చేరేందుకు ఈనెల 11న వెళ్లిన ఆ ఇద్దరు ఉద్యోగులను స్థానిక టీడీపీ చోటా నాయకులు అడ్డుకున్నారు. ఏకంగా మోడల్ స్కూల్లోకి వచ్చి ప్రిన్సిపాల్ ఎదుటే హెచ్చరించారు. నియామక పత్రాలు చింపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ ఇద్దరు వెనుతిరిగారు. కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఈ క్రమంలో ఈనెల 13న ‘సాక్షి’లో ‘మా వారిని కాదని ఎలా ఇస్తారు?’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అయినా ఏమాత్రం తగ్గని టీడీపీ నాయకులు అదేరోజు డీఈఓ కార్యాలయానికి వచ్చి సమగ్ర శిక్ష ఏపీసీ నాగరాజుకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. వీరి బెదిరింపులపై 14న ‘సాక్షి’లో ‘తగ్గని తెలుగు తమ్ముళ్లు’ శీర్షికతో మరో కథనం వెలువడింది. ఈ కథనాలు జిల్లా వ్యాప్తంగా దుమారం రేపాయి. అధికారులపై ఒత్తిళ్లు పెరగడంతో ఆ మరుసటి రోజే పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్ను చేర్చుకున్నారు. వార్డెన్‌ను మాత్రం చేరనీయకుండా టీడీపీ నాయకులు ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసులను ఆశ్రయించినా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో బాధితురాలు మరోమారు జిల్లా స్థాయి స్పందనకు వచ్చి జాయింట్ కలెక్టర్‌ను కలిసి విన్నవించగా.. మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఉరవకొండలో అరాచకం’ శీర్షికతో మరో కథనం వెలువడింది. దీంతో స్పందించిన రాష్ట్ర అధికారులు డీఈఓ, సమగ్రశిక్ష ఏపీసీకి ఆదేశాలు జారీ చేశారు. జీసీడీఓ వాణీదేవిని రంగంలోకి దింపారు. ఆమె స్వయంగా ఉరవకొండ మోడల్ స్కూల్‌కు వెళ్లి బంగి సునీతను విధుల్లో చేర్చుకునేలా ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అయితే ఈ సమయంలోనూ కొందరు టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అవుతోందని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దంటూ జీసీడీఓ వారికి చురకలంటించి వార్డెన్‌ను చేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. -
సాయి కీర్తనం.. భవిష్యత్ నిర్దేశనం
ప్రశాంతి నిలయం: అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం ప్రశాంతి నిలయం సత్యసాయికీర్తనలతో ప్రతిధ్వనించింది. సత్యసాయిబాబా 99వ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం సాయికుల్వంత్ సభా మందిరంలో మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈశ్వరమ్మ ఇంగ్లిష్ మీడియం, సత్యసాయి ప్రైమరీ, అనంత పురం మహిళా క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులు పూర్ణ కలశాలు చేతబూని మేళతాళాలు, బ్రాస్ బ్యాండ్‌తో సత్యసాయి యజుర్ మందిరం నుంచి సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి వరకు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ స్వరాలు పలికించారు. మృదుమధురమైన సంగీతంతో అందరినీ ఆకట్టుకున్నారు. సత్యసాయి అనంతపురం మహిళా క్యాంపస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్వరి పాటిల్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు సతీమణి హిమ వాహిణితో కలసి తెలంగాణ హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. డాక్టర్ రాజేశ్వరి పాటిల్ ప్రారంభోపన్యాసం చేశారు. మహిళాలోకం పట్ల సత్యసాయి చూపిన ఆదరణను వివరించారు. భవిష్యత్ మహిళలదే భవిష్యత్ అంతా మహిళల చేతుల్లోనే ఉంటుందని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద అన్నారు. మహిళా దినోత్సవంలో ఆమె కీలక ఉపన్యాసం చేశారు. మహిళలకు భవిష్యత్‌ను నిర్దేశించారు. మహిళలు ఇప్పటికే కుటుంబం, సమాజం, జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, పురుషులతో సమానంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారన్నారు. ప్రతి మహిళా తన సామర్థ్యాలపై నమ్మకంతో కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని ఎంచుకున్న రంగంలో ముందుకు సాగితే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం -
ప్రభుత్వ పాపం.. వర్సిటీలకు శాపం
అనంతపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఎస్కేయూ, జేఎన్టీయూ అనంతపురం వీసీలను నిర్బంధంగా రాజీనామా చేయించారు. అప్పటి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కే. హుస్సేన్ రెడ్డి, జేఎన్టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావును రాజీనామా చేయాలని అధికారికంగానే కోరారు. దీంతో తక్షణమే వారు రాజీనామా చేశారు. అనంతరం ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ అనిత, జేఎన్టీయూ ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావును నియమించారు. ప్రభుత్వ ఘనకార్యంతో దుస్థితి.. గత ఐదు నెలలుగా ఇన్చార్జ్ వీసీలతోనే వర్సిటీల పాలన సాగిస్తున్నారు. వర్సిటీల్లో పూర్తి స్థాయి వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. కమిటీల్లో వర్సిటీ తరఫున నామినీ, యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్), రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో నామినీ ప్రకారం ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ ముగ్గురు సమావేశమై, మూడు పేర్లను ప్రతిపాదిస్తారు. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు గవర్నర్ నియమిస్తారు. కాగా, ఇప్పటికే వీసీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను కూడా స్వీకరించింది. వాటిని స్క్రూటినీ చేసి సెర్చ్ కమిటీలను నియామకం చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ఒకే సారి 16 యూనివర్సిటీల వీసీలతో ప్రభుత్వం రాజీనామా చేయించడంతో యూజీసీ నామినీ నియామకంలో ఇక్కట్లు ఎదురువుతున్నాయి. కమిషన్ నామినీలుగా అంతమందిని ఒకే దఫా నియామకం చేయాలంటే నిపుణుల కొరత ఉండడమే ఇందుకు కారణం. ముందుచూపు లేకుండా కూటమి ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్లే నేడు ఈ దుస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. లోకల్ రాజకీయాలు.. ఇన్చార్జ్ వీసీలుగా ఆయా వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫసర్లనే నియమించడంతో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఉండే ప్రొఫెసర్లపై కక్ష సాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయి వీసీలుగా ఇతర వర్సిటీలకు చెందిన వారిని నియమించడంతో అంతర్గత రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తారని విద్యావేత్తలు అంటున్నారు. ఏదిఏమైనా దీర్ఘకాలికంగా ఇన్చార్జ్ వీసీలతో పాలన సాగించడం వర్సిటీల పురోగతికి ఆటంకంగా మారుతోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఈ విషయంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎస్కేయూ, జేఎన్టీయూల్లో ఐదు నెలలుగా ఇన్‌చార్జ్‌ల పాలన అధికారంలోకి వచ్చీ రాగానే కక్షగట్టి రెగ్యులర్ వీసీలతో రాజీనామాలు ముందుచూపు లేకుండా సర్కారు తీసుకున్న నిర్ణయంతో నేడు చిక్కులు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా త్వరితగతిన స్పందించాలని నిపుణుల సూచన నియామకం.. మరింత ఆలస్యం! జేఎన్టీయూ, ఎస్కేయూలకు కొత్త వీసీల నియామక ప్రక్రియలో మరింత జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం జేఎన్టీయూ పాలకమండలి సమావేశం జరగ్గా.. ‘వీసీ సెర్చ్ కమిటీ’లో వర్సిటీ నామినీకి సంబంధించిన అంశం ప్రస్తావించకపోవడం గమనార్హం. వాస్తవానికి నామినీ ఎంపికే ప్రధాన అంశంగా సమావేశం నిర్వహించినప్పటికీ ఆ విషయం కనీసం చర్చకు కూడా రాలేదు. ఇదే క్రమంలో తక్కిన అంశాలపై కూడా చర్చ జరగలేదు. దీంతో జేఎన్టీయూ వీసీ నియామకం మరింత ఆలస్యం కానుంది. ఇక.. బుధవారం జరిగే ఎస్కేయూ పాలకమండలి సమావేశంలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రెండు వర్సిటీల పాలకమండలి సమావేశాలూ మంగళవారం జరగాల్సి ఉన్నప్పటికీ ఎస్కేయూలో జమున అనే ఉద్యోగి మరణించడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. దీంతో పాలకమండలి సమావేశం బుధవారం జరగనుంది. -
గురుకులాల్లో టీచరు పోస్టులకు దరఖాస్తులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచరు పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 21న ఉదయం 10 గంటలకు అనంతపురం రూరల్ మండలం కురుగుంట గురుకుల పాఠశాలలో జరిగే డెమోకు హాజరుకావాలని గురుకులాల సమన్వయ అధికారి ఉదయశ్రీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు. బాలికల పాఠశాలలకు మహిళలను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీల వివరాలు ఇలా... తిమ్మాపురం బాలికల పాఠశాలలో టీజీటీ బీఎస్, పీజీటీ సోషల్, ఉరవకొండ బాలికల పాఠశాలలో జేఎల్ ఇంగ్లిష్, కురుగుంట బాలికల పాఠశాలలో జేఎల్ ఇంగ్లిష్, పీడీ, అమరాపురం బాలికల పాఠశాలలో టీజీటీ పీఎస్, టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లిష్, గుత్తి బాలికల పాఠశాలలో జేఎల్ కెమిస్ట్రీ, జేఎల్ ఇంగ్లిష్, హిందూపురం బాలుర పాఠశాలలో టీజీటీ పీఎస్, హిందూపురం బాలికల పాఠశాలలో టీజీటీ పీఎస్. ఇవీ విద్యార్హతలు జేఎల్ పోస్టులకు పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, పీజీటీ పోస్టులకు పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్, టీజీటీ పోస్టులకు డిగ్రీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్ (టీజీటీ హిందీకి డిగ్రీతో పాటు పీజీ ఉండాలి), పీఈటీ పోస్టులకు బీపీఎడ్, టెట్ క్వాలిఫై సర్టిఫికెట్ ఉండాలి. -
కర్ణాటక మద్యం పట్టివేత
కంబదూరు: అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కంబదూరు, అనంతపురం ఎకై ్సజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం కుందుర్పి మండలం కొలిమిపాళ్యం చెక్‌పోస్టు వద్ద అనంతపురం ఎకై ్సజ్ సీఐ లక్ష్మీసుహాసిని, కంబదూరు ఎకై ్సజ్ సీఐ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కుందుర్పి మండలం జంబుగుంపలకు చెందిన శివన్న, కుందుర్పి గ్రామానికి చెందిన బసవరాజు ద్విచక్రవాహనాల్లో కర్ణాటక మద్యాన్ని తీసుకోస్తూ పట్టుబడ్డారు. నిందితులను అరెస్ట్ చేసి, మద్యంతో పాటు వాహనాలను సీజ్ చేశారు. చీటింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్ గుత్తి: ప్రభుత్వ శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... కర్నూలుకు చెందిన మేరి సునీత, అన్నమయ్య జిల్లాకు చెందిన గుర్రం ప్రసాదరెడ్డి, షేక్ బాబ్జాన్ సాహెబ్... గుత్తికి చెందిన నిఖిల్‌తో పాటు మరి కొందరు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.15 లక్షలు వసూలు చేసుకుని మోసం చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.