Andhra Pradesh
-
గంగపుత్రులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్ని రంగాల, వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా.. మత్స్యకార సంక్షేమం కోసం ఆయన ఏం చేశారనేది వివరిస్తూ.. ప్రపంచ మత్స్యకార దినోత్స శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.. .. వేట నిషేధ సమయంలో దాదాపు 1,23,519 మత్స్యకార కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్‌లు అందించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. మత్స్యకారుల సంక్షేమం కోసం మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వేట నిషేధ స…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2024 -
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.ఇక ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ఈనెల 18న నియమించారు.కాగా అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.ఇక 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. మూర్తి 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయయారు. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. -
‘మీ మద్దతే కదా ఉంది.. ప్రధాని మోదీని ఒప్పించలేరా?’
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి... స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం... ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు. -
ముగిసిన YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశం
గుంటూరు, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. -
బాబూ.. ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్సే ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారు. ఎన్నికలు అయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. గతంలో ఉన్న బ్రాండ్స్ ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయి. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అధిక ధరలన్నాడు.. నాణ్యత లేదన్నాడు. ఆడ పిల్లల మంగళ సూత్రాలు తెంపుతాడు.. మీ ఆరోగ్యం గోవింద అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు. 99 రూపాయలకే మద్యం అన్నాడు.. కానీ ఆ చీఫ్ లిక్కర్ మాత్రం దొరకడం లేదు. మీరిచ్చిన మాట ప్రకారం ధరలు ఎక్కడ తగ్గించారు?. జగన్ ప్రభుత్వంలో అది విషం.. ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా?. ఇప్పుడు ఆడ బిడ్డల మెడలో తాళిబొట్టు తెగవా?. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం తాగే సోదరులే. వారితో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని కూడా బాబు మోసం చేశాడు.చంద్రబాబు ఇచ్చే చీఫ్ లిక్కర్ 99కి అమ్మితే.. అదే మందు కేరళలో 85కి ఇస్తున్నారు. దానికి తోడు ఈ చీఫ్ లిక్కర్ నాణ్యమైనది కాదనేది నా అభిప్రాయం. కొన్ని ఏళ్లు ఈ మద్యం తాగితే వారి ఆరోగ్యం తప్పకుండా చెడిపోతుంది. చివరికి మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు. వారికి 20 శాతం మార్జిన్ అని చెప్పి ఇప్పుడు 9.5శాతం మార్జిన్ ఇస్తున్నాడు. విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయి.. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. మా ప్రభుత్వంలో 47వేల బెల్టు షాపులు రద్దు చేస్తే మళ్ళీ వాటిని తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యం షాపులు సంఖ్య తగ్గించి పర్మిట్ రూమ్స్ లేకుండా చేశాం. కానీ, మళ్ళీ చంద్రబాబు పాత రోజులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు -
CBNlies: ‘మాట మార్చడంలో డాక్టరేట్ ఇవ్వాలేమో!’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు చేస్తున్న ప్రకటనలపై శాస్త్రీయంగా ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు.. ఆ తరువాత ఇస్తున్న సందేశాలు అంత ఆసక్తికరంగా ఉన్నాయి మరి! మాటలు మార్చడం ఇంత తేలికా అన్నట్టుగా ఉన్నాయి ఇటీవలి కాలంలో వీరు చేస్తున్న ప్రకటనలు. ఏమాత్రం జంకు గొంకూ లేకుండా అసత్యాలెలా చెప్పగలుగుతున్నారు? అసలు వీరి మాటలను ప్రజలు పట్టించుకుంటున్నారా? అన్న అనుమానాలూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమన్నారు..? తన రాజకీయ అనుభవంతో ప్రజలపై భారం పడకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాననే కదా? ఈ మాటలన్నింటికీ పవన్ కళ్యాణ్ ఊకొట్టడమే కాకుండా నిజం నిజం అంటూ బాబును ఆకాశానికి ఎత్తేశారా లేదా? వందిమాగధుల చందంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు పొడగ్తలతో బాబుకు ఎలివేషన్ కూడా ఇచ్చాయే..!! జగన్ సంక్షేమ కార్యక్రమాలను వృథా ఖర్చులంటూ, బటన్ నొక్కడం తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ విమర్శించిన ఈ మీడియా సంస్థలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు, మూడు రెట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించాయి కూడా. జగన్ చేస్తే తప్పట. అదే చంద్రబాబు ఇంకా అధికంగా చేస్తానని చెబితే సూపర్ అట. ఇలా సాగిపోయింది వారి ప్రచారం. కానీ... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం ఒక్కసారిగా అందరి గొంతు మారిపోయింది. వారి అసలు స్వరూపాన్ని బయటబెట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిలోనూ యూటర్న్ తీసేసుకున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గుపడటమూ లేదు సరికదా.. దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు పిసరంత పెంచినా బాదుడే, బాదుడు.. విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెరిగాయి అంటూ టీడీపీ, ఎల్లో మీడియా గొంతు చించుకునేవి. ఈ ప్రభావం ప్రజలపై కూడా కొంత పడింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అదే ట్రూ అప్ ఛార్జీలను మరింత అధికంగా బాదుతున్నారు. ఏకంగా రూ.17 వేల కోట్ల భారం మోపడానికి ఆమోదం పొంది, రూ.ఆరు వేల కోట్లకు పైగా మొత్తాన్ని తక్షణం వసూలు చేయడం ఆరంభించారు. అదేమిటంటే జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల పెంచాల్సి వస్తోందని కొత్త రాగం అందుకున్నారు. దీంతో సంపద సృష్టి అంటే జగన్ టైమ్‌లో కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమా? అని ప్రజలు నివ్వెర పోతున్నారు. ఇంకో ఉదాహరణ... రోడ్లపై గోతులు పూడ్చి, రోడ్ల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటన చూడండి. జగన్ టైమ్‌లో రహదారులను బాగు చేసినప్పటికీ రాష్ట్రంలో రోడ్లన్ని పాడైపోయినట్లు ఈనాడు మీడియా ప్రచారం చేసింది. వర్షాల వల్ల గోతులు పడినా, అదంతా జగన్ ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారం ఎంత స్థాయికి చేరుకుందంటే.. చంద్రబాబు, పవన్‌లు అధికారంలోకి రాగానే రహదారులపై గోతులు ఆమాంతం మాయమైపోతాయని, అద్దాల్లా మెరిసిపోతాయని ప్రజలు అనుకున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా మారింతి వీసమెత్తు కూడా లేదు. చంద్రబాబు నాయుడు అట్టహాసంగా హెలీకాప్టర్ వేసుకుని ఓ గ్రామం వద్ద రహదారి గోతిపై మట్టిపోసి రావడం తప్ప! తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మళ్లీ గొంతు మార్చేశారు. రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామన్నారు. వాహనదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసి ప్రైవేట్ సంస్థలే రహదారులను మరమ్మతు చేస్తాయని, ఉభయ గోదావరి జిల్లాల్లోనే తొలి పైలట్ ప్రాజెక్టు మొదలు పెడాతమని ప్రకటించారు. పైగా ప్రజలను ఈ పద్ధతికి ఒప్పించే బాధ్యతను ఆయన ఎమ్మెల్యేలపై నెట్టడం.. వారు ఒప్పుకోకుండా గుంతల్లోనే తిరుగుతామని అంటే తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పడం కొసమెరుపు!! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ పన్ను వేసినా, ఏ ఆదాయ వనరు పెంచినా, ప్రభుత్వ దోపిడీ అని అభివర్ణించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు కాకుండా, అన్నిటిపై ముక్కు పిండి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంటున్నారన్నమాట. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మండల స్థాయి రోడ్లకు కూడా యూజర్ ఛార్జీలు అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఈ పద్దతి అమలు చేస్తామని చెబితే తప్పు కాదు. అప్పుడేమో అంతా ఫ్రీ అని, ఆ తర్వాత ఏదీ ఉచితం కాదని, డబ్బులు మీరే ఇవ్వాలని జనాన్ని అంటుంటే వారు నిశ్చేష్టులవడం తప్ప చేసేది ఏమి ఉంటుంది? ఇక్కడ మరో సంగతి చెప్పాలి. రోడ్లు,భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డి మాత్రం రహదారులపై టోల్ గేట్లు ఉత్తదే అని ప్రకటన చేశారు. కాని మంత్రి గాలి తీస్తూ చంద్రబాబు యూజర్ చార్జీల ప్రకటన చేసేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం స్థానిక సంస్థలు పారిశుద్ద్యం నిర్వహణకు నెలకు ఏభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తే జగన్ ప్రభుత్వం చెత్తపన్ను వేశారని, ఇది చెత్త ప్రభుత్వం అని దుర్మార్గపు ప్రచారం చేశారు. ఇప్పుడేమో వేల రూపాయల చొప్పున యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు. లేకుంటే గోతులే మీకు గతి అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు దీనిని రోడ్లపై గుంతలకు కూడా జనం నుంచి డబ్బు వసూలు చేసే రోత ప్రభుత్వం అని ఎవరైనా విమర్శిస్తే తప్పులేదేమో! ఒకవైపు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్నారు. ఆ అప్పులు రాష్ట్రం అంతా కట్టాల్సిందే. అమరావతిలో మాత్రం కొత్త రోడ్లపై టోల్ గేట్లు పెట్టి డబ్బలు వసూలు చేస్తామని చెప్పడం లేదు. అమరావతిలో విలాసవంతమైన కార్లలో తిరిగే ఖరీదైన షరాబులే అధికంగా ఉంటారు. వారు తిరిగే రోడ్లపై అంతా ఫ్రీ. పేదలు, మధ్య తరగతి వారు ఎక్కువగా తిరిగే గ్రామీణ రోడ్లపై మాత్ర టోల్ వసూళ్లు. ఇసుక ,మద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇసుక మొత్తం ఉచితం అనుకున్న ప్రజలకు గతంలో కన్నా అధిక రేట్లు పెట్టి కొనాల్సి రావడం అనుభవం అయింది. మద్యం ధరలు తగ్గిస్తారనుకుంటే ఎమ్.ఆర్.పి కన్నా ఎక్కువ రేట్లే వసూలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలలో భాగంగా గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పెడితే చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్‌లు నానా యాగీ చేశారు. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా దుర్మార్గపు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటినే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. అప్పట్లో స్మార్ట్ మీటర్లపై వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఈనాడు మీడియా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయి.. అని హెడింగ్ పెట్టి ప్రజలను పండగ చేసుకోమన్నట్లుగా స్టోరీలు ఇస్తోంది. వివిధ కారణాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. వాటిని అదుపు చేసే యంత్రాంగం లేకుండా పోయింది. అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా సరుకుల రేట్లు పెరిగిపోయాయని యాగీ చేసిన టీడీపీ, ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఇప్పుడు అంతకు రెట్టింపు ధరలు పెరిగినా నోరు మెదిపితే ఒట్టు. ప్రజలకు జగన్ టైమ్ లో వచ్చిన స్కీముల డబ్బుతో పేదల జీవితం చాలావరకు సాఫీగా సాగేది. ఆయన ఇచ్చిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని కూటమి నేతలు అబద్దాలు చెప్పి, ఇప్పుడు దాదాపు అన్నిటిని ఎగవేసే పనిలో ఉన్నారు.దాంతో మండుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం పిండుతున్న అదనపు వసూళ్లు చాలవన్నట్లు జీఎస్టీపై ఒక శాతం సర్ఛార్జ్ వసూలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోరారు. అది కూడా వస్తే ఏపీలో పన్నులు మరింతగా పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు మండుతాయి. ప్రజల జీవితం మరింత భారంగా మారుతుంది. చేసిన బాసలకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరిశోధనార్హమే అవుతుందేమో! బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని టీడీపీ సూపర్ సిక్స్ నినాదం. కాని అది ఇప్పుడు బాబు ష్యూరిటీబాదుడే, బాదుడుకు గ్యారంటీగా మారిందా! ఇప్పుడు జనం రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని అనుకోరా! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు. -
చంద్రబాబు పచ్చి మోసంపై ప్రజాగ్రహం
అమరావతి, సాక్షి: ఏపీలో సంక్షేమ వారధులుగా ముద్రపడిపోయిన వలంటీర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. గతంలో వాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఎన్నికలటైంలో వాళ్లను కొనసాగిస్తానని, జీతం సైతం పెంచుతామని స్వయంగా ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకే మంగళం పాడేశారు.ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వలంటీర్ వ్యవస్థ మొదలైంది. సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారాయన. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం.. వీళ్ల ద్వారానే పౌర సేవలు నిరాటంకంగా సాగాయి. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా.. చివరకు కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి మరీ సేవల్ని అందించారు వాళ్లు. దేశవ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థ గురించి చర్చ నడిచింది. అయితే.. ఎన్నికలకు నెలముందు.. టీడీపీ రాజకీయం నడిపించి వలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు ఎన్నికలయ్యాయి. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. మరోవైపు.. తమ విధులకు సంబంధించి 2.66 లక్షల మంది వాలంటీర్ల ఆందోళనకు గురయ్యారు. కలెక్టరేట్ల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ఇంకోపక్క.. నామ మాత్రంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కొనసాగించారు. దీంతో వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఇక్కడ వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. జగన్ ఆలోచనను తుడిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే.. అసెంబ్లీ సాక్షిగా ఏపీ మంత్రి చేసిన ప్రకటనతో.. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ల ఊపిరి తీసింది. వలంటీర్లు విధుల్లో లేరని, వాళ్లను కొనసాగించేది లేదని, అలాంటప్పుడు జీతాల పెంపు ఎక్కడిదంటూ? చెప్పడంతో చంద్రబాబు పచ్చి మోసంపై.. ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.బుధవారం మండలిలో మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా వలంటీర్ వ్యవస్థపై ప్రశ్న YSRCP ఎమ్మెల్సీల ప్రశ్న.. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం ఎప్పుడు పెంచుతారు?మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం.. ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు పనిచేయడంలేదని చెప్పారు. వారికి ఈ ఏడాది మే వేతనం రూ.277.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిందని, ఆ తర్వాత వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదని, అందుకే తాము వారిని కొనసాగించలేమని అన్నారు. వలంటీర్ వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎలా వస్తుంది. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉక్కు కార్మికుల డెడ్‌లైన్
సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్ లైన్ విధించారు. తమకు చెల్లించాల్సిన జీతాలను వారం రోజుల్లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. జీతాలు ఇవ్వని పక్షంలో ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టేందుకు అర్హత లేదంటూ సీపీఎం నేత కామెంట్స్ చేశారు.విశాఖ ఉక్కు కార్మికుల జీతాల విషయంపై సీపీఎం నేత గంగారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. విశాఖ వచ్చే లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి. లేదంటే విశాఖలో కాలుపెట్టే అర్హత లేదు.. అడుగడుగునా ముట్టడిస్తాం. ఉద్యోగుల జీతాల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలి.ఉక్కు కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే విశాఖ ఎంపీ ఏం చేస్తున్నారు?. యూనివర్సిటీని నడుపుకోడానికి నిన్ను ఎంపీని చేయలేదు. జీతాలకోసం యాజమాన్యంతో మాట్లాడాలి. ఎంపీ మాట కూడా యాజమాన్యం వినకపోతే ఉద్యమంలోకి రావాలి. ఆయనతో కలిసి మేమంతా ఉద్యమిస్తాం అని చెప్పుకొచ్చారు. -
తిరుమల: సర్వదర్శనానికి 6గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న ( బుధవారం) 59,231 మంది స్వామివారిని దర్శించుకోగా 22,029మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.08 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.ఆన్లైన్లో 2025 ఫిబ్రవరి నెల ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు విడుదలనేడు ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాళంకరణ టికెట్లు విడుదల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను విడుదల4వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల... -
అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది.. ప్రభుత్వ యంత్రాంగమంతా నీ చేతుల్లోనే ఉంది.. నీ చేతుల్లో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టావు.. అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే.. ఆ లెక్కలను కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా ధ్రువీకరించింది.. మరి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 2018–19 నాటికి అంటే నువ్వు అధికారంలోకి నుంచి దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.3.13 లక్షల కోట్లు అని లెక్క చూపావు.. 2023–24 నాటికి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని తేల్చావు.. మరి ఇప్పడేమో లేదు లేదు.. రాష్ట్ర అప్పులు రూ.10.47 లక్షల కోట్లని ఒకరు.. రూ.11 లక్షల కోట్లని మరొకరు..! పక్కకు వస్తే వేరే నెంబర్లు చెబుతా అని అంటావా? గుంజీలు తీయిస్తానంటావా? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతో.. బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా భిన్న అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మోసాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామికవాదులపై అక్రమ కేసులను బనాయిస్తూ, నిర్భందిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తప్పైతే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?2018–19 నాటికి రూ.3.13 లక్షల కోట్లున్న అప్పులు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని నిర్థారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పద్దులను ఆడిట్ చేసే కాగ్ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అందులోనూ రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగానే తేల్చారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే.. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలోని తన వదినమ్మ, ఎల్లో మీడియాతో కలిసి అబద్ధాలకు రెక్కలు కట్టి ఎలా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడుతున్నారనేందుకు రాష్ట్ర అప్పులపై వారు చేసిన దు్రష్ఫచారమే తార్కాణమని గత మీడియా సమావేశంలోనే చెప్పా. బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా రాష్ట్ర అప్పులపై అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు దుష్ఫ్రచారం కొనసాగిస్తున్నారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? పైగా మరో అడుగు ముందుకేసి బకాయిలపై (స్పిల్ ఓవర్ అకౌంట్స్) పదే పదే అబద్ధాలా? ప్రభుత్వం వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు ఏటా స్పీల్ ఓవర్ కింద మరుసటి ఏడాదికి రావడం సహజం. 2019లో చంద్రబాబు దిగిపోతూ రూ.42,183 కోట్ల బకాయిలు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో బకాయిలు పెట్టిన దాఖలాలు లేవు. అయినా సరే చిరునవ్వుతో ఆ బకాయిలన్నీ మేం చెల్లించాం. ఇలా సర్వసాధారణ విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ ఏదో జరిగిపోతోందనే భ్రాంతి కలిగించడంలో చంద్రబాబు దిట్ట.ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. మేమిచ్చినవీ ఊడగొట్టారుమెగా డీఎస్సీ అని హామీ ఇచ్చారు. ఉన్న డీఎస్సీ కూడా ఆగిపోయింది. మేం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. వీళ్లు 16,347 పోస్టులతో ఇస్తున్నామన్నారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పటికి ఆర్నెల్లు గడిచిపోయాయి. అదే మేం అధికారంలోకి వచి్చన ఆర్నెళ్లు తిరగకమునుపే అక్టోబర్ 2వతేదీన గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.30 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 58 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాలు చేశాం. ఇవన్నీ ఆర్నెళ్ల లోపే చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతున్నారు. ఇప్పటికే 2.66 లక్షల మంది వలంటీర్లు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న 15 వేల మందిని పీకేశారు. ఆర్థిక విధ్వంస కారుడు బాబే..» ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితికి మించి 2014–19 మధ్య రూ.28,457 కోట్లు అప్పులు చేసింది నువ్వు కాదా బాబూ? ఈ అంశాన్ని కాగ్ నివేదిక, కేంద్ర ఆర్థిక సంఘం నివేదిక కూడా స్పష్టం చేసింది. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేయడం వల్ల ఆ మేరకు మా హయాంలో అప్పులపై కోత పడింది. మా హయాంలో కేవలం రూ.1,600 కోట్లు మాత్రమే పరిమితికి మించి అప్పులు చేశాం. ఈ గణాంకాలు చాలు.. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో.. ఎవరు ఆర్థిక క్రమశిక్షణతో నడిచారో.. ప్రభుత్వాన్ని నడిపించారో చెప్పడానికి! సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అప్పులను భూతంగా చూపే కార్యక్రమాలు చేస్తున్నాడు.» చంద్రబాబు హయాంలో కోవిడ్ లాంటి మహమ్మరి లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా ప్రభావంతో రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అనుకోని ఖర్చులు పెరిగిపోయాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కోవిడ్ వల్ల అనూహ్య పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్సార్సీపీ హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) తక్కువగానే ఉంది. నాడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్లకు చేరగా.. సీఏజీఆర్ 19.54 శాతంగా నమోదైంది. అనంతరం మా హయాంలో అప్పులు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 కోట్లకు చేరాయి. సీఏజీఆర్ 15.61 శాతంగా ఉంది. అంటేæ చంద్రబాబు హయాంలో కంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు 4 శాతం తక్కువగా ఉన్నట్లు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు ఆర్ధిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. » నాన్ గ్యారంటీ అప్పులు బడ్జెట్లోకి రావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన ఎస్బీఐ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ లాంటి సంస్థలు చేసే అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఖాతాలో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ నాన్ గ్యారంటీ అప్పులు కాబట్టి. అయినా సరే ఈ నాన్ గ్యారంటీ అప్పులు కూడా కలిపి చూసినా నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లుగా ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.77,229 కోట్లకు తీసుకుపోయిన ఘనత కూడా బాబుదే. మా హయాంలో వాటిని రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు తగ్గించాం. ఈ నాన్ గ్యారంటీ అప్పుల వార్షిక వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 54.98 శాతం ఉంటే మా హయాంలో అది 0.48 శాతం తగ్గింది. రాష్ట్ర అప్పులు, గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు కలిపి చూస్తే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉన్న అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతంగా నమోదైంది. మా హయాంలో ఆ అప్పులు రూ.3.90 లక్షల కోట్ల నుంచి రూ.7.21 లక్షల కోట్లకు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధి రేటు 13.57 శాతం మాత్రమే. ఈ లెక్కలు చూస్తే ఎవరు ఆరి్ధక విధ్వంసకారుడో ఇట్టే అర్ధమవుతుంది. » చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా హయాంలో తలసరి ఆదాయం 9 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని ప్రచారం చేశాడు. చంద్రబాబు సర్కార్ దిగిపోయేనాటికి 2018–19లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు మాత్రమే ఉంటే మా హయాంలో 2024 మార్చి నాటికి రూ.2,42,479గా నమోదైంది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంటే.. రెండేళ్లు కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మా హయాంలో 15వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది లెక్కలు కూడా కలిపితే మరో 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. 2019–24 మధ్య ఏ రంగాన్ని తీసుకున్నా సరే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీ వృద్ధి రేటు దేశం కంటే ఎక్కువగా ఉంది. అయినా సరే వాస్తవాలకు ముసుగేసి చంద్రబాబు వక్రీకరిస్తూ దు్రష్ఫచారం చేస్తున్నారు. ప్రతికూలతలోనూ పారిశ్రామిక వృద్ధి..బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ 2014–19 వరకు రాష్ట్ర వృద్ధి రేటు 13.50 శాతం ఉంటే 2019–24 మధ్య 10.60 శాతానికి పడిపోయిందన్నారు. బాబూ..! నీ హయాంలో కోవిడ్ లేదు. ప్రపంచమంతా రెండేళ్ల పాటు కోవిడ్‌తో అతలాకుతలమైంది. 2014–19తో పోల్చి చూస్తే గత ఐదేళ్లలో వృద్ధి రేటు ప్రతి రాష్ట్రంలోనూ తక్కువే ఉంది. దేశ వృద్ధి రేటు చూస్తే 2014–19 మధ్య 10.97 శాతం ఉంటే 2019–24 మధ్య 9.28 శాతం ఉంది. 2014–19 మధ్య మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సగటున 11.92 శాతం ఉండగా 2019–24 మధ్య 12.61 శాతంగా నమోదైంది. ఇవేమీ నేను చెప్పిన లెక్కలు కాదు. బడ్జెట్‌తో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికలో వెల్లడించిన అంశాలే ఇవన్నీ! రాష్ట్ర పారిశ్రామిక రంగంలో స్థూల వస్తు ఉత్పత్తి విలువ (జీవీఏ) చూస్తే 2014–19 మధ్య రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 11.92 శాతంగా నమోదైంది. అదే 2019–24 మధ్య కోవిడ్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రూ1.88 లక్షల కోట్ల నుంచి రూ.3.41 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 12.61 శాతం పెరిగింది. జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018–19లో 11 స్థానంలో ఉన్న రాష్ట్రం 2019–24 మధ్య 8వ స్థానంలోకి ఎగబాకింది. ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ (జీవీఏ) 12.61 శాతం ఉంటే దేశంలో సగటున ఉత్పత్తి విలువ 8.17 శాతంగా నమోదైంది. అంటే పారిశ్రామికాభివృద్ధి దేశంలో కంటే రాష్ట్రంలో 4 శాతం ఎక్కువగా ఉంది. మేకపిల్ల – కుక్కపిల్ల కథలో గజదొంగల్లా..!చంద్రబాబు అబద్ధాలు చూస్తే ఓ కథ గుర్తుకొస్తోంది. ఒక ఊరిలో ఓ అమాయకుడు భుజాన మేకపిల్లను వేసుకుని అమ్ముకోవాలని బజారుకు బయలుదేరతాడు. ఇంటి గడప దాటగానే ఒకడొచ్చి నీ కుక్క భలే ఉందంటాడు! దాంతో ఆ అమాయకుడు ఆలోచనలో పడతాడు. వీధి చివరికి వచ్చేసరికి మరొకడు ఎదురై నీ కుక్క పిల్ల చాలా తెల్లగా, బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చావు? అంటాడు. మళ్లీ ఆ అమాయకుడు సందిగ్ధంలో పడి.. ఇది మేకపిల్లే.. కుక్కపిల్ల కాదు.. నీకు కళ్లు కనిపించట్లేదా అనుకుంటూ ముందుకువెళ్తాడు. అక్కడి నుంచి కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఇంకొకడు కనిపిస్తాడు. అరే.. నీ కుక్కపిల్ల బాగుంది.. నాకు అమ్ముతావా? అంటాడు! ఇక.. ఆ అమాయకుడిలో గందరగోళం ప్రారంభం అవుతుంది. నేను మేక పిల్లలను భుజాన వేసుకుని వెళ్తుంటే ఇంతమంది అది కుక్క పిల్లే అని అంటున్నారు. నా కళ్లకు ఏమైనా అయ్యిందా? నాకు ఏమైనా జరిగిందా? అనే అనుమానంతో మేకపిల్లను కిందకు దించి నాకు మేకపిల్లా వద్దూ.. కుక్క పిల్లా వద్దూ! అనుకుని వెళ్లిపోతాడు. ఈ కథ చంద్రబాబు వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని ఎలా కబళిస్తున్నారో చెప్పేందుకు అతికినట్లు సరిపోతుంది. ఈ కథలో తొలి వ్యక్తి పేరు చంద్రబాబు! రెండో వ్యక్తి దత్తపుత్రుడు! మూడో వ్యక్తి బీజేపీలో ఉన్న తన వదినమ్మ..! నాలుగో వ్యక్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5..లాంటి ఎల్లో మాఫియా. వీళ్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌కు లేని అప్పులు ఉన్నట్టుగా వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకే. ఈ కథలో రాష్ట్ర ప్రజలు అమాయకులు అయితే.. మేక పిల్ల మన రాష్ట్రం. ఆ నలుగురు గజదొంగలు కలసి కింద పడేసిన మేకను తీసుకెళ్లి బిర్యానీ వండుకుని పంచుకుని తిన్నట్లుగా.. ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచేసే పంచుకు తింటున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా?ఆరోగ్యశ్రీ గతంలో వెయ్యి ప్రొసీజర్స్‌కు మాత్రమే పరిమితం కాగా మేం 3,300 ప్రొసీజర్స్‌కు పెంచి రూ.25 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా పథకాన్ని విస్తరించాం. గతంలో చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువే ఉన్న పరిస్థితి నుంచి మా హయాంలో ఏకంగా రూ.3,762 కోట్లకు చేరాయి. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికను పరిశీలిస్తే 2023–24లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అని పేర్కొన్నారు. 2023–24లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉండగా దాన్ని మార్చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీంగా పెట్టేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 13,22,319 మంది రోగులకు మేలు చేశారట! రూ.3,762 కోట్లు ఖర్చు చేశారట! 1–4–2023 నుంచి 31–3–2024 మధ్య ఎవరి ప్రభుత్వం ఉంది? వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3,762 కోట్లు ఖర్చు చేసి 13 లక్షల మందికిపైగా పేదలకు వైద్యం అందిస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వస్తుందోననే ఆందోళనతో ఇలా చేశారు. మేం ఖర్చు పెట్టింది వాళ్లు (చంద్రబాబు) వ్యయం చేసినట్లు రాసుకుని.. దొంగ పబ్లిసిటీ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే మీకంటే (చంద్రబాబు) దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా? నాలుగు నెలల నుంచి జీతాలు అందట్లేదని 104, 108 ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మా హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో తగినంత మంది స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాం. 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టాం. పులివెందుల సహా మరో రెండు కొత్త కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లను కేటాయించినా అడ్డుపడిన చరిత్ర మీది. 32.79 లక్షల మందికి ఉద్యోగాలు..అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వే నివేదికలో పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఎంఎస్ఎంఈ రంగంలో ఆయన హయాంలో 2014–19 మధ్య 8.67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడైంది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. భారీ, మెగా ప్రాజెక్టులతో మా హయాంలో 1,02,407 ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు హయాంలో ఉపాధి కల్పన చాలా తక్కువగా నమోదైంది. మేనిఫెస్టోతో మోసం..చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్‌ను ఉపయోగించారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లు అంటూ హామీలిచ్చి మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని రచించారు. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరి మనోభావాలతో ఆడుకుని, వాడుకున్నారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లలో అతి చిన్న అంశాలు! కూటమి నాయకులు ఎన్నికల వేళ ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో చిన్న పిల్లలు కనిపిస్తే చాలు.. ఎంత మంది ఉన్నా సరే.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు..నీకు రూ.15 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. వాళ్ల అమ్మ.. చిన్నమ్మలు బయటకొస్తే నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. అనేవాళ్లు! అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద వయసు మహిళలు కనిపిస్తే నీకు రూ.48 వేలు..నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అనేవాళ్లు. ఇంట్లో 26 ఏళ్ల యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. నీకు రూ.36 వేలు..నీకు రూ.36 వేలు అనేవాళ్లు.రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. ఇవన్నీ సూపర్ సిక్స్‌లో భాగమే. పెద్దవి కూడా. మోసాల్లో భాగంగా ఇవన్నీ ఎలాగూ చేయరనుకుంటే చిన్న చిన్న వాటిల్లోనూ మోసాలే! రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.55 కోట్లు ఉన్నాయి. కర్నాటకలో 1.84 కోట్లు, కేరళలో 96 లక్షలు, తమిళనాడులో 2.33 కోట్లు, తెలంగాణలో 1.24 కోట్లున్నాయి. ఏపీలోని 1.55 కోట్ల కనెక్షన్లకు సిలిండర్‌కు రూ.895 చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రూ.4,200 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో మాత్రం రూ.895 కోట్లే పెట్టారు. అంటే ఇచ్చేది ఒక్క సిలిండర్.. అది కూడా అందరికీ ఇవ్వరు. ఒక్కో సిలిండర్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.1,400 కోట్లు కావాలి. అందరికీ ఇవ్వడానికి నీకు (చంద్రబాబు) మనసు లేదు. 40 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారని అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామంటారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ సంవత్సరానికి ఒకటే ఇస్తామంటారు. ఒక మంత్రి చెప్పేదానికి.. ఇంకో మంత్రి చెప్పేదానికి పొంతన లేదు. పోనీ ఒక్కటన్నా అందరికీ ఇస్తున్నారంటే అదీ లేదు. దారుణమైన అబద్ధాలు, మోసాలకు ఇది నిదర్శనం కాదా? -
తీరిగ్గా ‘మీడియం’ మార్పు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను కూటమి సర్కారు ఒక్కొక్కటీ రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్‌ను, ఇంగ్లిష్ ప్రావీణ్య శిక్షణ టోఫెల్‌ను రద్దు చేసిన ప్రభుత్వం... తాజాగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసే విధానంలో మార్పులు చేసింది.2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు మీడియంలో కూడా రాయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత తీరిగ్గా ఇప్పుడు మీడియం మార్పు చేయడం వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే దాదాపు 4.20లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.మీడియం ఎంచుకుని.. నామినల్ రోల్స్ పంపిన తర్వాత ఇలా...ఈ నెల మొదటి వారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన దాదాపు 4 లక్షల మంది వరకు ఫీజు చెల్లించారు. నామినల్ రోల్స్ పంపించినప్పుడు ఎంచుకున్న మీడియంలోనే పరీక్షలు రాయాలి. ఫీజు చెల్లించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంనే ఎంచుకున్నారు. అయితే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో ‘మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్’లో ‘తెలుగు’ మార్చుకునేందుకు ఎడిట్ అవకాశం కల్పించాలని అన్ని పాఠశాలల హెచ్ఎంలను బుధవారం విద్యాశాఖ ఆదేశించింది.గత ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దాదాపు 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తున్నారు. మిగిలిన వారు ఈ విద్యా సంవత్సరం (2024–25) ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. దేశంలో సగటున 37.03 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 2.23 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు తెలుగు మీడియం పరీక్ష విధానం తెరపైకి తేవడంపై తల్లిండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులు కోరుకున్న ఇంగ్లిష్ మీడియం విద్యను రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా దిగజార్చుతూ నిర్వీర్యం చేసే దిశగా ఈ సర్కారు చర్యలు ఉన్నాయని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ఉన్నత విద్యలో యువతుల హవా
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో యువతులు ఆధిపత్యం సాధిస్తున్నారు. దేశంలో తొలిసారిగా యువకుల కంటే యువతుల అధిక సంఖ్యలో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో చేరికలను సూచించే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో 2017–18 నుంచి యువకులను యువతులు అధిగవిుంచారు. యువకుల జీఈఆర్ 28.4శాతం ఉండగా.. యువతుల జీఈఆర్ 28.5శాతంగా నమోదైంది. 2017–22 మధ్య ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో వచ్చిన విశేష మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనబరుస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)–డెలాయిట్ సంయుక్త అధ్యయన నివేదిక–2024 వెల్లడించింది. సీఐఐ–డెలాయిట్ సంయుక్తంగా 2017–22 మధ్య కాలంలో దేశ ఉన్నత విద్యా రంగం తీరుతెన్నులను విశ్లేషించాయి.ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ....» దేశంలో ఉన్నత విద్యను అందించే కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017లో దేశంలో 39,050 కాలేజీలు ఉండగా 2022 నాటికి 42,825కు పెరిగాయి.» ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాన్ని సూచించే ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(జీఈఆర్) చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. 2017–18లో జీఈఆర్ 24.6శాతం ఉండగా... 2021–22 నాటికి 28.4శాతానికి పెరగడం విశేషం.» ఉన్నత విద్యా సంస్థల్లో యువతుల జీఈఆర్ కూడా పెరగడం సానుకూల పరిణామం. యువతుల జీఈఆర్ 2017–18లో 25.6శాతం ఉండగా 2021–22నాటికి 28.5శాతానికి పెరిగింది. » ఉన్నత విద్యా సంస్థల్లో యువకుల జీఈఆర్ 2017–18లో 24.6శాతం ఉండగా, 2021–22నాటికి 28.4 శాతానికి చేరింది. ఈ ఐదేళ్లలోను యువతుల జీఈఆర్ అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.» ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి కూడా క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడంతో ఇది సాధ్యపడింది. 2017–18లో 25 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా... 2021–22 నాటికి 23 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. » ఇక దేశంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2017–18లో దేశంలో మొత్తం 1,61,412 మంది పీహెచ్డీ కోర్సుల్లో చేరారు. 2021–22లో ఏకంగా 2,12,522 మంది పీహెడ్డీ కోసం ఎన్రోల్ చేసుకోవడం విశేషం. » పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సుల్లో 2017–18లో 29.40 లక్షల మంది విద్యార్థులు చేరగా... 2021–22 విద్యా సంవత్సరంలో 37.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2017–18లో 2.64 కోట్ల మంది విద్యార్థులు చేరగా, 2021–22 విద్యా సంవత్సరంలో 3.07కోట్ల మంది ప్రవేశంపొందారు. -
రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్ ఆర్డర్‌ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్‌ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ ఆర్డర్ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్‌కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయలేదన్నారు. రిమాండ్ ఆర్డర్‌ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్ ఆర్డర్‌ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. -
శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నాపట్టించుకోరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తెలంగాణను నిలువరించని ప్రభుత్వంకృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టువిభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. -
కాంట్రాక్టర్లకు మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు
సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చే విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానాన్ని తిరిగి తీసుకొస్తేనే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారనే అభిప్రాయం వ్యక్తమవడంతో దాన్ని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ నిర్ణయాలను ప్రభుత్వం బయటకు వెల్లడించే అవకాశంలేకపోవడంతో వాటిని అధికారికంగా విడుదల చేయలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి..» రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు పీడీ చట్టాన్ని పటిష్టం చేసేలా చట్టాన్ని సవరించాలని తీర్మానించారు. » లోకాయుక్త చట్టాన్ని సవరించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. లోకాయుక్తను నియమించే సమయంలో ప్రతిపక్ష నేత ఉండాల్సి ఉన్నందున.. ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేని పరిస్థితిలో ఏం చేయాలనే దానిపై మంత్రులు చర్చించారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఇలాంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరించారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలని నిర్ణయించారు. » ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. » దేవాలయ కమిటీల్లో అదనంగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టాన్ని సవరించాలన్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు. » కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం.. » యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపి దానికి ఈగల్ అని పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. » ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు. » అమరావతిలో నిర్మాణ పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. » నూతన క్రీడలు, పర్యాటక విధానాలకు ఆమోదం తెలిపారు. అధికారులు చెప్పింది చెప్పినట్లుగా బయటకు చెప్పొద్దు..ఇక మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో స్థానికంగా ప్రతిభ చూపించే విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సూచించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో అది సురక్షితంగా ఉండేలా చూడాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని పవన్ అభిప్రాయపడ్డారు. మంత్రులు సీరియస్‌గా ఉండాలని అధికారులు చెప్పే విషయాలను సరిచూసుకోవాలని వారు చెప్పింది చెప్పినట్లు బయటకు చెప్పకూడదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. -
పాఠశాల విద్యలో పైరవీల రాజ్యం!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మరోసారి అక్రమ బదిలీలకు తెర తీశారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రికమండేషన్ల లేఖలతో ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా బదిలీ చేయడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగు చూసింది. పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లేఖలతో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద క్యూ కట్టడంతో వారికి ఓపెన్ స్కూల్ జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో కీలకంగా మారిన సిఫారసు లేఖలు ఇప్పుడూ పని చేస్తున్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలకు వెళ్లడం.. అందుకు ఎమ్మెల్యేలు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే పోస్టుకు ఎమ్మెల్యే, మంత్రి చెరొకరిని సిఫారసు చేయడం.. దాన్ని విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవడం.. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆరు జిల్లాలకు మెమో..ఆరు జిల్లాలకు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లుగా కూటమి నాయకులు సిఫారసు చేసిన ఉపాధ్యాయుల పేర్లతో మంగళవారం మెమో విడుదల కావడం చర్చకు దారితీసింది. హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని వైఎస్సార్ కడప జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్‌గా నియమించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి లేఖ ఇవ్వగా... ఇదే పోస్టు మరో ఉపాధ్యాయుడికి ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి లేఖ ఇచ్చారు. విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రకాశం జిల్లా పోస్టుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అనంతపురం పోస్టుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అన్నమయ్య జిల్లా పోస్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి లేఖలతో ఉపాధ్యాయులకు ఆయా పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేటప్పుడు ఆయా పోస్టుల వివరాలు, అర్హతలను బహిరంగ పరచాలి. విధివిధానాలతో దరఖాస్తులు ఆహ్వానించాలి. కానీ ఇవేమీ లేకుండానే నేతల సిఫారసు లేఖలకు విద్యాశాఖ అధికారులు తలొగ్గడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
25న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు చలిగాలులు ప్రారంభమైన తరుణంలో... భారీ వర్షాలు మరోసారి విరుచుకుపడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. క్రమంగా.. ఇది దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు కూడా ఉన్నాయని వివరించారు. దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. 23 నుంచి తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు 23 నుంచి 27 వరకూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
పరిశ్రమలకు 'కూటమి' కాటు
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పరిశ్రమలు తెస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు తేకపోగా, ఉన్న వాటిని కూడా వెళ్లగొట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారి అరాచకాలకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకొని కూటమి నేతలు పన్నిన కుట్రతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ప్రముఖ జెఎస్డబ్ల్యూ జిందాల్ గ్రూప్ వెనకడుగు వేసింది. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కృష్ణపట్నం పోర్టు దగ్గర అదానీ గ్రూపు ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. తాజాగా వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో అక్కడి ఎమ్మెల్యే వర్గీయులు అదానీ ప్రాజెక్టులో విధ్వంసానికి దిగారు. దీంతో దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూపే రాష్ట్రమంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. ప్రతి పనికీ కమీషన్లు ఇవ్వాలని, పనులు తమకే ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు పారిశ్రామికవేత్తల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఎమ్మెల్యేల దుశ్చర్యలను అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ తీరు రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలగజేస్తుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ఇదీ జరిగింది..వైఎస్సార్ జిల్లాలో గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టు అదానీ సంస్థకు దక్కింది. తొలి విడతగా రూ.1,800 కోట్లతో అదానీ సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. టెండర్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సివిల్ పనులు దక్కాయి. పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పనులు తమకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. అయినా స్పందన లేకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, మరో సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు ప్రాజెక్టు వద్ద విధ్వంసం సృష్టించారు. అక్కడి సిబ్బందిపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడి ఉద్యోగులు, ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక్కడ పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదంటూ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి, ఎంపీ సీఎం రమేష్ సోదరుడు రాజేష్‌నాయుడు బుధవారం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఎటువంటిస్పందనా రాలేదు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య జరుగుతున్న ఘర్షణ మొత్తం ప్రాజెక్టు పైనే పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీయుల విధ్వంసంతో అదానీ సంస్థకు నష్టం కలిగిందని, నాయకుల మధ్య ఈ దందాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు కొనసాగుతుందో, ఆగిపోతుందోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆగిపోయిన జిందాల్ స్టీల్ పరిశ్రమవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థ జేఎస్‌డబ్ల్యూ జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చింది. వైఎస్సార్ జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోపాటు మరికొన్ని భారీ పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటి కాదంబరి జత్వానీ పేరుతో దారుణంగా కేసులు పెట్టించి, రాష్ట్రంలో ఆ గ్రూపు పెట్టుబడులు పెట్టకుండా కూటమి పెద్దలు అడ్డుకొంటున్నారు. దీంతో ఆ గ్రూపు ఇప్పుడు రాష్ట్రం వైపు చూడటానికే జంకుతోంది. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ పరిశ్రమ నిలిచిపోయింది.కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి దాడులుగత నెలలో కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే స్వయంగా దాడికి పాల్పడ్డారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణపై మాట్లాడుతానంటూ తన అనుచరులతో కలిసి పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడి అదానీ సంస్థ ఉద్యోగులను దూషిస్తూ దాడికి దిగారు. పోర్టు డీజీఎంపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన పారిశ్రామిక, వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగించింది.అదానీ పవర్ ప్రాజెక్టుపై దాడి ఘటనలో కేసు నమోదుకొండాపురం: అదానీ సంస్థ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన దాడి ఘటనకు సంబంధించి కొందరిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. అదానీ సంస్థకు చెందిన రామకృష్ణ, రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. -
జెన్కోలో ‘రెడ్ బుక్’ రాజ్యం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో)లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత రెండు నెలల్లో 135 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.వీరిలో దాదాపు 90 శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గం వారే ఉండటం గమనార్హం. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లోకేశ్ రెడ్‌బుక్‌లో పేరుందని అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలు! వాస్తవానికి ఏపీజెన్కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నె శ్రీనివాసకుమార్‌కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్ (మినహాయింపు) ఉన్నప్పటికీ... ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తీరును తప్పుబట్టారు. యూనియన్ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని, తమ యూనియన్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. బదిలీలకు గడువు ముగిసిన తర్వాత...ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత... అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్కో యాజమాన్యం... రెండు నెలలుగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎనీ్టటీపీఎస్)తోపాటు విద్యుత్ సౌధ (జెన్కో ప్రధాన కార్యాలయం)లోను పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే రెండు కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రెండు నెలల్లో విద్యుత్ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఎన్టీపీఎస్‌లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా, వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్ యూనియన్ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇ చ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. -
వీఓఏల పోరుబాట
సాక్షి నెట్వర్క్: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఓఏలకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలుచేయాలని వెలుగు వీఓఏల యూనియన్ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు యానిమేటర్స్ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సర్క్యులర్ కారణంగా వీఓఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వారన్నారు. దానిని రద్దుచేయాలని ఎన్నికల ముందు తాము ఆందోళన చేస్తున్న సమయంలో టీడీపీ తరఫున వర్ల రామయ్య స్వయంగా హాజరై, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సర్క్యులర్ని రద్దుచేస్తామని, చంద్రబాబు తన మాటగా నన్ను చెప్పమన్నారని వర్ల హామీ ఇచ్చారని వీఓఏలు విజయవాడలో చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సర్క్యులర్‌ను రద్దుచేయకపోగా దాని ఆధారంగా మూడేళ్లు పూర్తయిన వీఓఏలను మార్చుకోవచ్చని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనలు చేయడాన్ని యూనియన్ తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్టీఆర్ జిల్లాలో 200 మందిని తొలగించారన్నారు. ఈ సర్కులర్‌ను రద్దుచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఓఏలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలుచేయాలని.. నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, మహిళా మార్ట్‌ల్లో బలవంతపు సరుకుల కొనుగోలు ఆపాలని భీమవరం, విశాఖç³ట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడలో వీఓఏలు డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం అన్యాయమని కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలో వీఓఏలు నినదించారు. రాజకీయ వేధింపులు ఉండవని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు చేయడం ఎంతవరకు న్యాయమని చిత్తూరులో వీఓఏలు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలకు ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల రాష్ట్ర సంఘం (సీఐటీయూ) నేతృత్వం వహించింది. -
మాకు ‘సాగర్’ పగ్గాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ పగ్గాలను తమకే అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌తోపాటు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించడానికి డిసెంబర్ 3న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనున్న 19వ సమావేశం ఎజెండాలో మొత్తం 24 కీలక అంశాలను కృష్ణాబోర్డు చేర్చడంతో వీటిపై వాడీవేడీ చర్చ జరగనుంది. బోర్డు చైర్మన్, కన్వీనర్‌తోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ డిమాండ్లు ‘ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారంతనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. యావత్ జలాశయం కార్యకలాపాలన్నింటినీ తెలంగాణకే అప్పగించాలి. ఈ విషయంలో ఏపీ జోక్యానికి, తెలంగాణ విధుల ఆక్రమణకు తావులేదు. కృష్ణా బోర్డు సూచనల మేరకు రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా, గతేడాది నవంబర్ 28న ఏపీ అధీనంలోకి తీసుకుంది. కుడికాల్వ రెగ్యులేటర్ నుంచి నీళ్లను విడుదల చేసింది. ఈ ఘటనకు పూర్వ స్థితిగతులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ 2023 డిసెంబర్ 1న ఏపీని ఆదేశించింది’అనే అంశాలను తెలంగాణ సూచనల మేరకు ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచింది. నో అన్న ‘అపెక్స్’.. మళ్లీ బోర్డుకు పంచాయతీ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటా నుంచి ఏపీ, తెలంగాణకు పంపకాలు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో 2015–16 అవసరాల కోసం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. 2016–17లో సైతం ఇదే కేటాయింపులను కొనసాగించాలని 2016లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీని ఆధారంగానే 2017–18లో ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని 2017లో కృష్ణా బోర్డు నిర్ణయించింది. 2021–22 వరకూ దీన్నే కొనసాగించారు. 2022–23లో దీని కొనసాగింపును తెలంగాణ వ్యతిరేకించింది. 50:50 నిష్పత్తిలో పంపిణీ జరపాలని తెలంగాణ కోరగా, 66:34 నిష్పత్తిలోనే కొనసాగించాలని ఏపీ పట్టుబట్టింది. తాత్కాలిక కోటాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని కోరుతూ వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు రెఫర్ చేయగా, అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని జలశక్తి శాఖ చెప్పింది. దీంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డుకు చేరింది. ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచిన అంశాలివీ.. » కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు. » గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించాలి. » ఇరు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలి. » రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు. తెలంగాణ ఇతర డిమాండ్లు » తాము వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో పొదుపు చేసిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఏపీజెన్కో అనధికారికంగా 4 టీఎంసీలను విడుదల చేసింది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు ఏపీ 117 టీఎంసీలను విడుదల చేసింది. ఇకపై టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం నుంచి వరదలున్నప్పుడే నీళ్లు విడుదల చేయాలి. సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణనూ తెలంగాణకే అప్పగించాలి. » ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుపడుతుండటంతో తమ వాటా జలాలను తీసుకోలేకపోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్–2 నీటి కేటా యింపులు జరిపే వరకు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించే అధికారం ఏపీకి లేదు. » ఏపీ నీటి వినియోగాన్ని లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. » రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ చేపట్టరాదు. » శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి ఏపీ అత్యవసర మరమ్మతుల నిర్వహించాలి. -
చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!: వైఎస్ జగన్
అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు రూ.18 వేల కోట్లు కరెంటు బిల్లులు బాదేశారు. ఇందులో రూ.6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లుల్లోనే ప్రారంభమైంది. మరో రూ.11 వేల కోట్ల బాదుడు తర్వాతి నెలలో ఉంటుంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై జీఎస్టీ మీద ఒక శాతం సర్‌చార్జ్ విధించి, ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం మోపడమేనా? చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లి దండ్రులెవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్లతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక.. వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్లిద్దరూ కాలం చేస్తే కనీసం తల కొరివి అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డయినా తింటాడు. ఏ అబద్ధమైనా ఆడతాడు. ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఇదే పెద్ద మనిషి చంద్రబాబు ప్రజలపై రోడ్డు ట్యాక్స్ వేస్తా అంటున్నారు. అలా వసూలు చేసిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టి అట. నిజంగా ఆయన బాదుడే బాదుడును నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నారు. రోడ్లన్నీ మరమ్మతులు చేస్తానని ఎన్నికల్లో గొప్పగా మాట్లాడి.. ఈ రోజు ప్రజలు రోడ్డెక్కితే పన్నుల వాత పెడతామని చెబుతున్నారు. అలా అయితేనే రోడ్లు బాగు చేయిస్తాం.. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతేనని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి సీఎం అయ్యారు. సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే విద్యుత్ చార్జీలు.. యూజర్ చార్జీలు, టోల్ చార్జీలతో బాదడమేనని వ్యాఖ్యానించారు. దాదాపు రూ.18 వేల కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడే ఇందుకు నిదర్శనమన్నారు. భావితరాల కోసం గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన విలువైన సంపద మెడికల్ కాలేజీలు, పోర్టులను స్కామ్‌ల కోసం అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? అత నిలదీశారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతి విషయంలోనూ బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా ముఠాలే కనిపిస్తున్నాయన్నారు. ‘మద్యంలో స్కామ్.. ఇసుకలో స్కామ్.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులతో స్కామ్.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే నియోజకవర్గాల్లో పనులు సాగని దుస్థితి.. ఎటు చూసినా నాకింత.. నీకింత! అని దోచుకోవడం.. పంచుకోవడమే! ఓవైపు సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్ సెవెన్లు లేవు.. మరోవైపు ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో అక్రమంగా నిర్బంధిస్తున్నారు’ అని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా పలు అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు కనిపిస్తున్నాయి. మద్యంలో ఒక స్కామ్, ఇసుకలో ఇంకో స్కామ్, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఎక్కడ పరిశ్రమలు, నిర్మాణాలు జరుగుతున్నా.. మైనింగ్ చేస్తున్నా.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే పనులు సాగని పరిస్థితి. అదానీ వాళ్లు ప్లాంట్ కడుతుంటే కూటమి ఎమ్మెల్యే చంద్రబాబు ప్రోద్బలంతో బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో నాకింత.. నీకింత అని దోచుకోవడం.. పంచుకోవడమే జరుగుతోంది. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, విద్యుత్ చార్జీలు, రోడ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ, అప్పులు, రాష్ట్ర ప్రగతి, ఇండస్ట్రీ, పారిశ్రామిక వేత్తలు.. ఇవన్నీ గాక తల్లి, చెల్లి అంటూ నా కుటుంబం మీద ఎక్కడ పడితే అక్కడ ఈ చంద్రబాబు మాట్లాడుతూనే ఉన్నాడు.సూటిగా ఆయన్ను ఓ ప్రశ్న అడుగుతున్నా. నీకూ కుటుంబం ఉంది. మా కుటుంబంలో విబేధాలు ఉండొచ్చు. నువ్వు పెట్టే పోస్టులు కానీ, క్రూరమైన రాజకీయాలు కానీ, ఎవరూ చేయరు. నీలాంటి దుర్మార్గుడైతే తప్ప. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీసులో అధికారిక ప్రతినిధితో నన్ను ‘బోస్డికే’ అని తిట్టించాడు. అది దుర్మార్గం కాదా? నా చెల్లెలు షరి్మల మీద హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఈయన బావమరిది, లోకేశ్ మామ బాలకృష్ణ సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్ నుంచి తప్పుడు రాతలు రాయించి ప్రచారం చేయలేదా? హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇది నిజమని తేలలేదా? స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమైతే, నిందితులను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? ఈడీ వాళ్ల ప్రాపర్టీస్‌ను అటాచ్ చేసింది. స్కిల్ స్కామ్ నుంచే ఆ డబ్బులన్నీ వెళ్లడంతో పక్కాగా స్కామ్ అని తేలడంతోనే వాళ్లను ఈడీ అరెస్ట్ చేసింది. అలాంటప్పుడు ఈ కేసులో చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలి కదా? డబ్బులు ఇచ్చింది చంద్రబాబే కదా? వాళ్లు ‘వివేకం’పేరిట ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తే తప్పు లేదు. రాంగోపాల్ వర్మ సినిమా తీసి సెన్సార్ బోర్డు అనుమతితో రిలీజ్ చేస్తే ఆ సినిమాలో తమను కించపరిచారంటూ ఆయనపై కేసులు పెడుతున్నారంటే వీళ్లను ఏమనాలి? సెన్సార్ బోర్డు అప్రూవల్తో విడుదలైన సినిమాను అడ్డం పెట్టుకొని ఆయన్ని పిలిపించే కార్యక్రమం చేస్తున్నారు. అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది ఇల్లీగల్ డిటెన్షన్ కాదా? సెన్సార్ బోర్డులు ఎందుకున్నట్టు?సూమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్ లెన్సర్ విస్కీ, ట్రోపికానా వీసా బ్రాందీ, షార్ట్ విస్కీ, బ్రాందీ 99, కేరళా మాల్టెడ్ ఫైన్ విస్కీ.. ఇవన్నీ తీసుకొచ్చారు. ఆశ్చర్యం ఏమంటే.. ఇవన్నీ రూ.99 అని చెబుతున్నారు. నాణ్యతను తగ్గించి ఈ బ్రాండ్లు తీసుకొచ్చారు. ఇదే కేరళ మాల్టెడ్ విస్కీ రూ.85కే దొరుకుతుంది. చంద్రబాబు మాత్రం రూ.99కి అమ్ముతున్నారు. నాణ్యత తగ్గించిన మద్యాన్ని వైఎస్సార్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు ఉండే బ్రాండ్లు ఎమ్మార్పీ ఇప్పటికీ రూ.120నే. కానీ, ఎక్కడా ఆ ధరకు అమ్మట్లేదు. – వైఎస్ జగన్ఉద్యోగులకు ఐఆర్ ఎక్కడ?చంద్రబాబు ఉద్యోగులను మోసం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒకటవ తేదీనే జీతం అన్నారు. ఈ నెలలో మూడు వారాలు అయిపోతున్నా చాలా మందికి జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులు అందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. చంద్రబాబు వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంకా ఐఆర్ ఊసే ఎత్తట్లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. మరి కొత్త పీఆర్సీ చైర్మన్ నియమించాలా లేదా? మరో వైపు వలంటీర్లు, బేవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలను పీకేశారు. 104, 108 ఉద్యోగులను పీకడానికి రెడీ అవుతున్నారు. హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు.తనకు అనుకూలంగా ఉండే ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ వంటి రిటైర్డ్ అధికారులను ఓ జట్టుగా తయారు చేసి, చంద్రబాబు తన వద్ద కూర్చో బెట్టుకున్నారు. వీరు జిల్లాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారి పేర్లను టీడీపీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరిస్తున్నారు. ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో ఫాలో అప్ చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీస విచారణ లేకుండా నిబంధనలకు విరుద్దంగా కేసులు బనాయిస్తున్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత కోర్టులకు కూడా హాజరు పర్చడం లేదు. ఎక్కడున్నారో తెలుసుకునేందుకు హెబియస్ కార్పస్ పిటీషన్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. రోజుల తరబడి వారి వద్దే పెట్టుకుని, కళ్లకు గంతలు గట్టి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు కొట్టడమే కాదు.. వీడియోలు తీసి పైనున్న ఈ జట్టు అధికారులకు పంపుతున్నారు. – వైఎస్ జగన్వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని దారుణంగా వంచించావు..మాపై బండవేసే ప్రయత్నంలో భాగంగా 2023 ఆగస్టు నుంచే వలంటీర్ వ్యవస్థ లేదంటున్నారు. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్ అప్రూవల్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతుందా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇస్తారా? ఈయనేమో హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటారు. అయ్యా చంద్రబాబూ.. హెడ్ ఆఫ్ అకౌంట్లో 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటైల్డ్ హెడ్, 293 అబ్జెక్ట్ హెడ్.. ఇవన్నీ వలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ నంబర్లు. ఇన్నేళ్లూ ఈ హెడ్ల కిందే జీతాలు ఇస్తున్నారు. ఫైనాన్స్ కాంకరెన్స్తో.. బడ్జెట్లో పెట్టి.. చంద్రబాబు సీఎం అయ్యే వరకు జీతాలు ఇస్తున్నా కూడా.. వలంటీర్లకు ఇచ్చిన హామీని ఎగరగొట్టి అబద్ధాలు, దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? నోరు తెరిస్తే అబద్ధాలు.. నోరు తెరిస్తే మోసం. ఇదీ చంద్రబాబు పరిపాలన.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనం వివరాలు వలంటీర్లపై దిక్కు మాలిన అబద్ధాలాడుతున్నారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆగస్టు 2023లోనే.. అంటే మా హయాంలోనే ‘ప్రస్తుతం వలంటీర్లు ఎవ్వరూ పని చేయట్లేదు. 2023 ఆగస్టు నుంచి వలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు’ అని చెబుతున్నారు. కానీ, ఈ ఏడాది వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు ఎన్ని అన్న ప్రశ్నకు మాత్రం రూ.277 కోట్లు అని సమాధానం ఇచ్చారు. అంటే ఈ సంవత్సరం జీతాలు ఇచ్చినట్టే కదా! ఎన్నికలప్పుడు వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది వాస్తవం కాదా బాబూ? వలంటీర్ల వ్యవస్థ ఉనికిలోనే లేదని.. వారికి గౌరవ వేతనం పెంపు అన్నది ఉత్పన్నమే కాదని తేల్చిచెప్పిన సర్కార్.. పోలవరంలో విధ్వంసం బాబు ఘనతే⇒ పోలవరంలో విధ్వంసానికి కారణం చంద్రబాబు విధానాలేనని తేల్చి చెబుతూ ఇటీవల అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కట్టాక.. గోదావరి నదికి అడ్డంగా 2.5 కి.మీల పొడవునా ప్రధాన డ్యాం నిర్మించాలి. తొలుత పునాది డయాఫ్రం వాల్ వేసి, ఆ తర్వాత ప్రధాన డ్యాం పనులు చేపట్టాలి.⇒ కానీ.. కాంక్రీట్ పనుల్లో కమీషన్లు ఎక్కువగా రావని.. మట్టి పనుల్లో అయితే ఎక్కువ కమీషన్లు వస్తాయని స్పిల్ వే పునాది స్థాయిలో ఉండగానే చంద్రబాబు ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ వేశారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టారు. వరద ప్రవాహం స్పిల్ వే వైపు మళ్లించడం సాధ్యం కాకపోవడంతో కాఫర్ డ్యాంలకు ఇరు వైపులా 400 మీటర్లు, 300 మీటర్ల చొప్పున ఖాళీ ప్రదేశాలు వదిలేశారు. 2.5 కి.మీల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి వరద.. కుంచించుకుపోయి ప్రవహించడంతో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కోతకు గురయ్యాయి. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ⇒ మేం అధికారంలోకి వచ్చాక గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను 48 గేట్లతో సహా పూర్తి చేశాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు మురమ్మతులు చేసి పూర్తి చేశాం. స్పిల్ వే మీదుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించాం. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతానికి మరమ్మతులు చేసి, యథాస్థితికి తీసుకొచ్చాం. దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? లేక కొత్తది కట్టాలా అన్నది తేల్చాలని కేంద్రాన్ని కోరాం. దాన్ని తేల్చే బాధ్యతను నిపుణుల కమిటీకి కేంద్రం అప్పగించింది. ⇒ ఇప్పుడు ఆ కమిటీ వచ్చింది. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తయిన నేపథ్యంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య కొత్త డయా ఫ్రం వాల్ వేసి, ప్రధాన డ్యాంను పూర్తి చేయడానికి మార్గం సుగమం చేశాం. అయినా చంద్రబాబు గోబెల్స్ మాదిరిగా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు. వాళ్లకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయతగ్గ ముఠా మా దగ్గర లేదు.ఐదేళ్లలో ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చావా? ⇒ చంద్రబాబు హయాంలో ఒక్క నిరుపేద కుటుంబానికి కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? మేము 30.60 లక్షల కుటుంబాలకు అక్క చెల్లెమ్మల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాలు ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 9.02 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన 11 లక్షల ఇళ్లు పునాదులు దాటి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఏకంగా 17 వేల జగనన్న కాలనీల్లో ఏకంగా ఊళ్లే తయారవుతున్నాయి. ఆ ఇళ్లన్నీ పూర్తయితే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో చంద్రబాబు హౌసింగ్ కార్యక్రమాన్ని ఆపేశారు.⇒ మా ప్రభుత్వ హయాంలో సిమెంట్, స్టీలు, ఇతర సామగ్రిని సబ్సిడీపై, ఇసుకను ఉచితంగా ఇచ్చే వాళ్లం. ఇవి కాకుండా రూ.35 వేలు పావలా వడ్డీకి రుణంగా ఇచ్చే వాళ్లం. రూ.1.80 లక్షల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే వాళ్లం. అంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిలిపి వేసినందుకు నిరుపేదలందరూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్నారు. పేదల ఇళ్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు అసెంబ్లీ నడుపుతున్నారో.. ఎందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో వీళ్లకే తెలీదు.బినామీలకు దోచిపెట్టేందుకే అసైన్డ్‌పై దుష్ప్రచారం⇒ అసైన్డ్ భూములపై నిస్సిగ్గుగా అబద్ధాలు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వం రాక ముందు పేరుకే దళితులకు భూమి ఉండేది. దానిని అమ్ముకునే స్వేచ్ఛ లేదు. ఇంట్లో వాళ్లకు అత్యవసర పరిస్థితులు ఎదురైనా, వారసుల పేరుపైకి బదిలీ చేయాలన్నా అగమ్య గోచర పరిస్థితి ఉండేది. రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకోలేని నిస్సహాయ స్థితిలో శనక్కాయలకు.. పావలాకు, పది పైసలకు వేరే వాళ్లు కొనుక్కొని అనుభవించే వారు.⇒ మేము అధికారంలోకి వచ్చాక పేదల జీవితాలు మార్చాలని ఆలోచించాం. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూమి ఉన్న వారికి చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తూ సొంత భూములుగా మార్చాం. ఆ సొంత భూములను అమ్ముకుంటారా? వాళ్ల పిల్లలకు ఇచ్చుకుంటారా? వాళ్ల ఇష్టం. ఈ లోగా ఎవరైనా భూములు కొనుగోలు చేసి ఉంటే కూడా అవన్నీ ఒరిజినల్ అసైనీలకు వెళ్లిపోతాయి. వాళ్ల పేరుతోనే పట్టా వస్తుంది. కొన్న వాళ్లకు పట్టా రాదు. ఇలా హక్కులిచ్చి 15.21 లక్షల మంది రైతులకు, పేదలకు మంచి చేస్తే కూటమి నాయకులు నిస్సిగ్గుగా బురద వేస్తున్నారు. మళ్లీ పేదల దగ్గర నుంచి హక్కులు తీసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వారి హక్కులను రద్దు చేయనున్నారు. ఆ తర్వాత అవే భూములను పెత్తందార్లు 10 పైసలకు, 20 పైసలకు కొనుక్కోవచ్చు. వీళ్లకు మాత్రమే మంచి రేటు ఉండాలి. పేదలకు మాత్రం మంచి రేటు రాకూడదు.⇒ చంద్రబాబు ఇచ్చిన ఒక మెమో ద్వారా 2.06 లక్షల ఎకరాలను ఉద్దేశ పూర్వకంగా నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టారు. 98 వేల మంది రైతులను నానా కష్టాలకు గురి చేస్తున్నారు. మేము నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించి.. రైతుల భూమిపై చంద్రబాబు చేసిన దాష్టీకం నుంచి విడుదల చేశాం. వారి భూములపై సర్వ హక్కులు కల్పించాం. అది తప్పంటున్నారు. ⇒ ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి 22వేల ఎకరాల భూమిని పంపిణీ చేశాం. ఇది మరో విప్లవం. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్యలను పరిష్కరించి ఏకంగా 1.07 లక్షల మంది రైతుల కుటుంబాలకు మేలు చేశాం. 33 వేల ఎకరాల షరతుల భూములపై 22 వేల మంది రైతులకు సర్వ హక్కులు కల్పించాం. ఇదంతా వాళ్లు తప్పంటున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మహిళలు అందరూ మాయమైపోతున్నారని దుష్ప్రచారం చేశారు. ఇందుకు వలంటీర్లు కారణమని, మానవ అక్రమ రవాణా చేస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా దత్తపుత్రుడు.. ఇప్పుడు డెప్యూటీ సీఎం ఊగిపోయాడు. వాళ్లు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఈ దుష్ప్రచారం ఒక భాగం. సాక్షాత్తు అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఐదేళ్లలో 46 మంది మాత్రమే మానవ అక్రమ రవాణాకు గురయ్యారని, కేవలం 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని వాళ్లంతకు వాళ్లే చెప్పారు. గతంలో 30 వేల మంది మానవ అక్రమ రవాణా జరిగిందనే దుష్ప్రచారానికి, వలంటీర్లపై వీళ్లు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్స్టాప్ కాదా? – వైఎస్ జగన్కేవలం 46 మంది మహిళలే అక్రమ రవాణాకు గురయ్యారని తేల్చిన కూటమి సర్కార్ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలు నిలదీస్తే అక్రమ కేసులా?సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్సెవెన్లు లేవు.. మరో వైపు అన్ని రకాలుగా రాష్ట్రం వైఫల్యం చెందింది. ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే చాలు దారుణంగా వేధిస్తున్నారు. పోలీసులను అన్యాయంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల ద్వారా వాళ్ల నియోజకవర్గాల్లో ప్రైవేటు మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమ నిర్బంధాలు (ఇల్లీగల్ డిటెన్షన్) చేస్తున్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.⇒ కొట్టాం.. వీడియోలు తీశాం.. చూసి ఆనందించండి.. అని స్థానిక పోలీసులు పై వాళ్లకు పంపిస్తూ శాడిజం ప్రదర్శిస్తున్నారు. పైగా థర్డ్ డిగ్రీ దెబ్బలు చూపిస్తున్నారు. న్యాయ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల కోసం బాధితుల బంధువులు పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. ఇలా తప్పుడు కేసులతో అరెస్ట్ అయిన వారిని న్యాయవాదులు కష్టపడి బెయిల్‌పై బయటకు తీసుకొస్తుంటే మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.⇒ చంద్రబాబు అరాచకాలు ఇంతటితో ఆగిపోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చివరకు సినీ దర్శకులపై కూడా కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటలో ఎస్పీ ప్రోద్భలంతో సీఐ ద్వారా నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేశారు. తోటలో పని చేస్తున్న 55–60 ఏళ్ల వయసున్న వృద్ధురాలిని కొట్టి ఒప్పించే కార్యక్రమం చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట తన దెబ్బలు చూపించి, జరిగిన విషయాన్ని ఆమె చెప్పడంతో ఆ సీఐని మేజిస్ట్రేట్ తిట్టి పంపించిన ఘటన వారం రోజుల క్రితం జరిగింది. తుదకు సినీ దర్శకులను కూడా వదలడం లేదు. వాళ్లేమో ఇష్టానుసారం సినిమాలు తీయొచ్చట.⇒ రాష్ట్రంలో పేకాట జరుగుతుందని, తన నియోజకవర్గంలో నడుస్తోన్న పేకాట క్లబ్‌ను ఉదాహరణగా చూపుతూ పోస్టు పెట్టినందుకు మా ఎమ్మెల్యే చంద్రన్నపై కూడా కేసు పెట్టారు. ఆయనపై ఇప్పటి వరకు 8 కేసులు పెట్టారు. మరో దళిత ఎంపీ నందిగాం సురేష్‌పై కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. తెలుగుదేశం ఆఫీసుపై దాడి చేశాడని కేసు పెట్టారు. ఆ రోజు ఆయన అసలు ఊళ్లోనే లేడు. అయినా అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్‌పై బయటకొచ్చేలోగా మరో కేసు పెడుతున్నారు. అన్నీ దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, మాజీ ఎంపీ.. 70 రోజులుగా జైలులో ఉన్నాడు. మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజాలపై కూడా ఇష్టానుసారం కేసులు పెట్టారు.⇒ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. ఒక వైపు కేసులు పెట్టడం, మరొక వైపు ఎవరైనా మాట్లాడితే అన్యాయంగా దూషించడం. ఇంకొక వైపు దుష్ప్రచారాలు చేయడం. ఇది చంద్రబాబు నైజం. టాపిక్ డైవర్షన్, తప్పుడు ప్రచారం, అబద్ధాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు స్పెషలిస్ట్. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్ అసాస్నేట్) చేయడంలో ప్రసిద్ధుడు. లక్ష్మీపార్వతితో మొదలు నా వరకు ఎలా ప్రచారం చేశారో చూశాం.నా చెల్లిపై దుష్ఫ్రచారం చేసింది చంద్రబాబే ⇒ చంద్రబాబు తప్పుడు ప్రచారంపై గతంలో నా చెల్లెలు షర్మిల ఏమన్నారో చూడండి. (వీడియోను ప్రదర్శిస్తూ..) ఆ వీడియోలో షర్మిల మాట్లాడుతూ.. ‘ఎన్బీకే బిల్డింగ్ నుంచి దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్‌ను బట్టి పోలీసులు చెబుతున్నారు. ఈ వెబ్సైట్లన్నీ ప్రొ టీడీపీ ప్రమోట్ చేసినవే. ప్రత్యర్థులను కించపరిచేవి. ఈ పోస్టింగ్‌లన్నీ బాలకృష్ణ బిల్డింగ్ నుంచి, ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయంటే బాలకృష్ణకు సంబంధం లేదని నేను ఎలా అనుకోవాలి? సంబంధం ఉంది కనుకే బాలకృష్ణ నా మీద నింద వేశారని, పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారని నేను విశ్వసిస్తున్నా. బాలకృష్ణ ఇలా దిగజారుడు తనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే చెప్పాలి’ అన్నారు.⇒ మా ప్రభుత్వ హయాంలో వర్రా రవీంద్రారెడ్డి పేరిట ఐ టీడీపీ సభ్యుడు ఉదయ్‌భూషణ్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మను, మా చెల్లెలిని తిట్టించాడు. వర్రా రవీంద్రరెడ్డి పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఉదయ్ భూషణ్‌ను ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఎంత దారుణమైన నికృష్టుడంటే తన స్వార్థం కోసం ఎవరినైనా సరే వ్యక్తిత్వ హననం చేస్తాడు. వాళ్ల సానుభూతిపరులతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయించి, వాళ్లతో మన వాళ్లను తిట్టిస్తాడు.మద్యం, ఇసుక అంతా స్కామ్..⇒ రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు దోచుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు అధికారంలోకి వస్తే నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నారు. మద్యం రేటు తగ్గిస్తానన్నారు. ఆశ్చర్యం ఏమంటే.. గతంలో చంద్రబాబు హయాంలో అవే డిస్టిలరీలు.. మా హయాంలో అవే.. ఇప్పుడు కూడా అవే డిస్టిలరీలు. మద్యం ఆదాయంలో చీప్ లిక్కర్ నుంచే 85 శాతం వస్తుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత చీప్ లిక్కర్లో నాణ్యత తగ్గించారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ఎప్పుడూ మనం వినని, చూడని బ్రాండ్లు అవి.⇒ అన్ని చోట్లా బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో బెల్టు షాపునకు.. ఒక్కో గ్రామంలో పోటీ పెట్టి వేలం వేస్తున్నారు. రూ.2 లక్షలకు పాడుకున్న వాడికే ఇస్తున్నారు. ఇలా మాఫియా రాజ్యం నడుస్తోంది. మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మకోవాలంటే పోటీ ఎందుకు? ఎమ్మెల్యేలు మనుషులను ఎందుకు కిడ్నాప్ చేయించాలి.. ఎందుకు ఎవరినీ పాడనివ్వకుండా చేయాలి? వేరేవాళ్లకు వచ్చినా షాపులు నడుపుకోలేని పరిస్థితికి ఎందుకు నెట్టేయాలి? ఎమ్మార్పీ ప్లస్ మాఫియాకు కమీషన్ రావాలనే ఇదంతా చేస్తున్నారు. ఇసుక పరిస్థితి కూడా అంతే. హామీ ఇచ్చినట్లు ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. -
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం నాశనం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అసలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(నవంబర్20) నిర్వహించిన మీడియా సమావేశంలో పోలవరం జాప్యం వెనుక అసలు విషయాలను వైఎస్ జగన్ వివరించారు. ‘ఇది నేను చెబుతోంది కాదు. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు తప్పిదం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయన్నది స్పష్టంగా చెప్పింది. పోలవరం వద్ద గోదావరి నది దాదాపు 2.5 కిలోమీటర్ల వెడెల్పు ఉంటుంది. ఆ నీరు మళ్లిస్తేనే కద ప్రాజెక్టు కట్టగలిగేది. అందుకోసం ఏం చేయాలి? స్పిల్‌వే పనులు పూర్తి చేయాలి.కానీ అవి పూర్తి చేయలేదు. అవి పూర్తి కాకుండానే కాఫర్‌డ్యామ్ పనులు మొదలుపెట్టావు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటంటే.. దాని ద్వారా నీరు ఆపుతారు. ఆ తర్వాత మెయిన్ డ్యామ్ పనులు చేయాలి. నదికి అటు,ఇటు రెండు కాఫర్‌డ్యామ్‌ల పనులు మొదలుపెట్టాడు. అంటే ఒకవైపు స్పిల్‌వే పూర్తి చేయలేదు.మరోవైపు మెయిన్డ్యామ్కు ఫౌండేషన్ వేశారు. ఎందుకంటే అవన్నీ ఎర్త్‌వర్క్‌లు..కమీషన్లు వస్తాయి. సిమెంటు పనులైతే కమిషన్లు రావు. ఈలోగా సీజన్ వచ్చింది. కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేయలేదు. దాంతో నీరు పోవడానికి కాఫర్డ్యామ్పై రెండు గ్యాప్‌లు వదిలారు. అప్పుడేం జరిగింది. రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న నది, ఇక్కడికి రాగానే 400 మీటర్ల మేర తగ్గింది.ఆ ఉధృతికి ప్రాజెక్టు ఫౌండేషన్ అయిన డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతిన్నది. చంద్రబాబు హయాంలోనే 2018–19లోనే భారీ వరదలకు అన్నీ దెబ్బతిన్నాయి. అందుకే మేం రాగానే స్పిల్‌వే పూర్తి చేశాం. దాంతో నీరు క్లియర్‌గా వెళుతున్నాయి. కాఫర్‌డ్యామ్ మరమ్మతులు మేమే చేశాం. ఇక డయాఫ్రమ్‌వాల్‌ను ఏం చేయాలి? మళ్లీ కట్టాలా? వద్దా అనేది నిపుణులు తేల్చాలి.చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం పనులు నాశనమయ్యాయి. అయినా అదే పనిగా దుష్ప్రచారం. ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోంది’అని పోలవరంపై చంద్రబాబు మోసాలను వైఎస్జగన్ ఏకరువు పెట్టారు.