Ar rahman
-
ఏఆర్ రెహమాన్, సైరా మళ్లీ కలిసిపోయే ఛాన్స్!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారం అభిమానులను షాక్‌కు గురి చేసింది. 29 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి సిద్ధపడటాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో వీరి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వందన షా.. వీళ్లు మళ్లీ కలిసిపోయే ఛాన్స్ ఉందంటూ హింటిచ్చారు. సుదీర్ఘ జర్నీ.. మళ్లీ కలిసే ఛాన్స్తాజాగా ఓ ఇంటర్వ్యూలో వందన మాట్లాడుతూ.. వాళ్లది సుదీర్ఘ వైవాహిక జర్నీ.. ఎంతో ఆలోచించుకున్నాకే విడిపోవడానికి సిద్ధపడుంటారు. పిల్లల కస్టడీ ఇంకా నిర్ణయించలేదు. తల్లిదండ్రుల్లో ఎవరితో ఉండాలని డిసైడ్ చేసుకున్న హక్కు పిల్లలకు ఉంది. అయినా ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదని నేను ఎక్కడా కొట్టిపారేయలేదు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రెహమాన్ దంపతులు మళ్లీ కలిసుండే అవకాశం ఉందని పలువురూ అభిప్రాయపడుతున్నారు.కాగా ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు సంతానం. ఈ నెల ప్రారంభంలో రెహమాన్, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.చదవండి: బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే! -
రెహమాన్ నాకు తండ్రి లాంటి వ్యక్తి: మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్, సైరా బాను దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వార్తలు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రెహమాన్ టీమ్‌లో పనిచేస్తున్న మోహినిదే అనే యువతి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ నిర్ణయానికి లింక్ పెడుతూ రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా రిలేషన్ ఉందా అంటూ కోలీవుడ్‌లో భారీగా కథనాలు వచ్చాయి.రెహమాన్ గురించి ఎక్కువగా చెడు ప్రచారం జరుగుతున్న సమయంలో రెండు రోజుల క్రితం సైరా బాను రియాక్ట్ అయింది. రెహమాన్ చాలామంచి వ్యక్తి అంటూ ఎవరూ తప్పుగా ప్రచారం చేయకండి అని ఆమె కోరింది. ఈ క్రమంలో తాజాగా మోహినిదే కూడా మరోసారి స్పందించారు. ఆ రూమర్స్‌ను ఖండిస్తూనే రెహమాన్ గోప్యతను గౌరవించాలని కోరింది.మోహినిదే ఒక వీడియో సందేశాన్ని ఇలా పంపింది. 'నేను కొన్ని విషయాలను అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా జీవితంలో నాకు తండ్రితో పాటు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. నా కెరీర్ అభివృద్ధిలో వారందరూ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా ఏఆర్ రెహమాన్ నాకు తండ్రిలాంటివారు. ఇంకా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ మా నాన్న కంటే చిన్నవాడు. అతని కూతురు నా వయసు దాదాపు సమానంగానే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను ఆయన టీమ్‌లో 8 సంవత్సరాలకు పైగా పనిచేశాను. అయితే, గత 5 సంవత్సరాల నుంచి అమెరికాలో ఒక పాప్ సంగీత కళాకారుడితో కలిసి పని చేస్తున్నాను. నాకు నా స్వంత బ్యాండ్ ఉంది. విడాకుల విషయంలో ఏఆర్ రెహమాన్‌పై వస్తున్న పుకార్లు చాలా బాధాకరం. ఆయన గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నాను.' అని ఆమె పేర్కొన్నారు.#ARRahman is like my father❤️🔥- #MohiniDey 👍🏻pic.twitter.com/RtuYXF2lwi— Tharani ᖇᵗк (@iam_Tharani) November 26, 2024 -
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్ రెహమాన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్‌ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.అందువల్లే ఏఆర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్ రెహమాన్ ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్ రెహమాన్ పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు. – సాక్షి చెన్నై, తమిళ సినిమా -
రెహమాన్‌కు దూరంగా ఉండటానికి కారణం ఇదే: సైరా బాను
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయిన తర్వాత సోషల్‌మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రెహమాన్‌ను తప్పుపడుతూ తమిళ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ వారు పలు కథనాలు ప్రసారం చేయడంతో తాజాగా సైరా బాను రియాక్ట్ అయ్యారు.'రెహమాన్ చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి తెలియకుండా తప్పుగా ప్రచారం చేయడం బాధగా ఉంది. పలు అనారోగ్య కారణాలతో నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను. కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. ఈ కారణం వల్లే ఆయనకు దూరంగా ఉండాలని నేనే కోరుకున్నా. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మీడియాతో పాటు యూట్యూబ్ వారికి నా విన్నపం. దయచేసి ఆయన గురించి చెడుగా ప్రచారం చేయకండి. ప్రపంచంలో ఆయనకు ఉన్న మంచి గుర్తింపును చెడగొట్టకండి. ఇప్పటికీ ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాపై కూడా ఆయనకు ఎనలేని ప్రేమ ఉంది. ఇకనైనా తప్పుడు కథనాలకు ఫుల్స్టాప్ పెడుతారని అనుకుంటున్నాను. మేమిద్దరం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో మా గోప్యతను కాపాడండి. కొద్దిరోజుల్లో నేను చెన్నై వస్తాను.' అని ఆమె తెలిపారు. -
విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆరె రెహమాన్.. రీసెంట్గా విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇతడి భార్య సైరా భాను లాయర్ బయటపెట్టాడు. ఇద్దరు ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు. కానీ రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈయన దగ్గర పనిచేస్తున్న మోహిని దే అనే అమ్మాయి కూడా భర్తకు డివోర్స్ ఇచ్చింది. దీంతో రుమార్స్ మొదలయ్యాయి.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్)రెహమాన్-మోహిని దే మధ్య రిలేషన్ ఉన్నట్లు పలువురు ఆర్టికల్స్ రాశారు. యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేశారు. అయితే ఇవన్నీ అవాస్తవాలని, ఇలాంటివి ప్రచారం చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏఆర్ రెహమాన్ టీమ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రకటన రిలీజ్ చేసింది.తన గురించి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్టు టీమ్ పేర్కొంది. ఇప్పటికే పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెహమాన్.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తీస్తున్న సినిమా కోసం పనిచేస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రభుత్వం ఉద్యోగం సాధించిన సుకుమార్ ఇంట్లో పనిమనిషి)Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x— A.R.Rahman (@arrahman) November 23, 2024 -
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?వీటిని ‘గ్రే డివోర్స్’లని ‘సిల్వర్ స్పిల్టింగ్’ అంటున్నారు.నటుడు ఆశీష్ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే ఇప్పుడు రెహమాన్ జంట కేసు కూడా గ్రే డివోర్స్ను చర్చాంశం చేసింది. సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఆశీష్ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆశీష్ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?హృదయాలు ఎందుకు పగలాలి?ఏ.ఆర్.రెహమాన్ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.జాగ్రత్త పడాల్సింది ఇప్పుడేఅమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. → మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్ ఫ్రెండ్సే, కామన్ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.→ రూపాయి తగాదా: డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. → అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు. కలిసి ఉంటే కలదు సుఖముపెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది. -
ఆమె కారణంగానే రెహమాన్ విడాకులు.. స్పందించిన మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్-సైరాబాను దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పర్పస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు న్యాయవాది వందనా షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు రెహమాన్ విడాకుల విషయం బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ విడాకులకు మోహినిదే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు రెహమాన్-మోహినిదే మధ్య ఏదో సంబంధం ఉందన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై మోహినిదే సోషల్ మీడియా వేదికగా స్పదించారు. తనపై వస్తున్న రూమర్స్‌ని తీవ్రంగా ఖండించారు.‘నా విడాకుల ప్రకటన వెల్లడించిన తర్వాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. వారంతా ఎందుకు నా ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారో నాకు తెలుసు. వారి అభ్యర్థనను నేను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. దయచేసి నా గోప్యతను గౌరవించండి’అని మోహినిదే తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.కాగా, ఇదే ఇష్యూపై రెహమాన్ కొడుకు అమీన్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించాడు. ‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. -
మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ప్రకటన అనంతరం వస్తున్న వార్తలపై వారి తనయుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి.దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ కుమార్తె రహీమా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘మనల్ని ద్వేషించే వాళ్లే వదంతులు సృష్టిస్తారు. తెలివితక్కువ వాళ్లు వాటిని వ్యాప్తి చేస్తారు. పనికి రానివాళ్లు వాటిని అంగీకరిస్తారు. దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి’’ అంటూ పోస్ట్ చేశారామె.ఇక ఈ నెల 19న ఏఆర్ రెహమాన్, సైరాల విడాకుల ప్రకటన వచ్చిన అనంతరం రెహమాన్ బృందంలోని మోహినీ దే అనే అమ్మాయి కూడా తన భర్త, తాను విడిపోతున్నట్లు ప్రకటించారు. దాంతో రెహమాన్, మోహినీ ఒకేసారి విడాకుల గురించి ప్రస్తావించడం వెనక ఏదో కారణం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఉద్దేశించే అమీన్, రహీమా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
కోలీవుడ్‌లో పెరుగుతున్న డైవోర్స్ కేసులు..
-
శ్రీమంతుల పాలిట విడాకుల ఎక్స్పర్ట్ ఈమె!
ఆస్తిపాస్తులు కనీసం పదివేల కోట్లు ఉన్నవారు.. విడాకుల కోసం వెళ్లాలంటే వందనా షాను కలుస్తారు. దేశంలో హైప్రోఫైల్ డివోర్స్ కేసులు చూసే మహిళా లాయర్‌గా వందనా షా పేరు గడించారు. ఏ.ఆర్.రెహమాన్, సాయిరా బానుల విడాకులతో ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘విడాకులు ఇప్పించడం మీకు సంతోషమా?’ అనడిగితే ‘నేను స్వేచ్ఛను ఇప్పిస్తున్నాను’ అంటారామె. స్వయంగా డివోర్సీ అయిన వందనా ఆ తర్వాతే లా ప్రాక్టీసు మొదలెట్టారు. వందన పరిచయం, రెహమాన్ విడాకుల పూర్వాపరాలు... 1995లో ఏ.ఆర్. రెహమాన్ పెళ్లయ్యింది. అదే సంవత్సరం అతను సంగీతం చేసిన ‘బొంబాయి’ విడుదలైంది. ‘బొంబాయి’లో హీరోయిన్ పేరు సాయిరా బాను. రెహమాన్ జీవిత భాగస్వామి పేరు కూడా అదే. వచ్చే సంవత్సరం ‘బొంబాయి’ సినిమా, రెహమాన్ వైవాహిక జీవితం 30 ఏళ్ల ఉత్సవం జరుపుకోవాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రమే జరుగుతుంది. ఒకటి జరగదు. సంగీత మాంత్రికుడి జీవితంలో అపశ్రుతి వస్తుందని ఎవరూ ఊహించలేదు. వీరి విడాకుల వ్యవహారాన్ని అడ్వకేట్ వందనా షా చూశారు. అధికారికంగా ఆమే ప్రకటించారు.గుజరాత్ మూలాలు1973లో జన్మించిన సాయిరా బాను మూలాలు కచ్‌లో ఉన్నాయి. వారిది గుజరాతి ముస్లిం కుటుంబం. మదురైలో స్థిరపడ్డ ఈ కుటుంబం నుంచి ఒక కుమార్తెను మలయాళ నటుడు రెహమాన్ (రఘు) వివాహం చేసుకుంటే మరో అమ్మాయిని ఏ.ఆర్.రెహమాన్ చేసుకున్నాడు. పెళ్లయ్యాక సాయిరా బాను రెహమాన్‌కు పేరు వచ్చేకొద్దీ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి మిత్రురాలైందని అంటారు. సాయిరా, నీతా మధ్య మంచి స్నేహం ఉందని కథనం. ఇటీవల అంబానీ కుమారుడి పెళ్లిలో రెహమాన్ ప్రత్యేకమైన షో కూడా ఇచ్చాడు. ఇప్పుడు విడాకుల కేసును చూసిన వందనా షా కూడా గుజరాత్‌కు చెందిన అడ్వకేటే. అయితే ఆమె ప్రాక్టీసు ముంబై, పూణెలలో ఉంది.తల్లి తెచ్చిన కోడలురెహమాన్ తల్లి నిర్ణయానికి ఎంతో విలువనిచ్చేవాడు. ‘నాకు సమయం లేదు. నేను పెళ్లిచూపులకు తిరగలేను. చదువుకుని, సంగీతం అంటే ఇష్టపడుతూ, వినమ్రతతో ఉండే అమ్మాయిని చూడు’ అని మాత్రమే తల్లిని అతడు కోరాడు. తల్లే ఈ సంబంధం తెచ్చింది. పెళ్లయ్యాక రెహమాన్, సాయిరా పరస్పరం ఎంతో గౌరవించుకునేవారు. ‘నేను అతని స్వరానికి ఫ్యాన్‌ని’ అని సాయిరా రెహమాన్ గురించి వేదికమీద చెప్పింది. రెహమాన్ కూడా ఆమెను వెంటబెట్టుకునే సంగీత యాత్రలు చేసేవాడు. వీరికి ముగ్గురు పిల్లలు. రెహమాన్ రెండు వారాల క్రితమే ఆస్ట్రేలియాలో, అబూదాబీలో లైవ్ షోలు చేశాడు. అతని ఫేస్బుక్ పేజ్‌లో ఇంకా భార్యతో ఉన్న ఫోటోనే కవర్ ఫొటోగా ఉంది. వందనా షాకు పరస్పర ఆమోదయోగ్యంగా విడుపెయేలా కేసులను గట్టెక్కిస్తుందనే పేరు ఉంది. అందుకే రెహమాన్గానీ, సాయిరాగాని మీడియాకు ఎక్కలేదు. వారిద్దరి నడుమా ఎంతో ప్రేమ ఉన్నా వెనక్కు రాలేనంతగా అగాథాలు ఏర్పడటమే’ విడాకులకు కారణం అంటారు వందనా షా.శ్రీమంతుల విడాకులువందనా షా శ్రీమంతుల విడాకుల ఎక్స్పర్ట్. ‘ఆమె విడాకులు ఎక్కువగా ఇప్పిస్తోంది. పెళ్ళిళ్లకు పిలవకండి’ అనేవారూ ఉన్నారు. కాని పాలిహిల్స్ (ముంబై)లో ఉండే జంటల విడాకుల కారణాలు అనూహ్యంగా ఉంటాయని అంటారు వందనా షా. ‘బోర్డమ్’, ‘బిగ్గర్ బెటర్ డీల్’ వల్ల విడి΄ోయే జంటలు ఎక్కువ అని ఆమె అంటారు. శ్రీమంతుల ఇళ్లలో భార్యాభర్తల మధ్య డబ్బు పంపకం, పిల్లల బాధ్యత ఇవే ప్రధాన సమస్యలనీ, ‘ఇగో’, ‘వివాహేతర సంబంధాలు’ తర్వాతి స్థానం అని అంటారామె. ‘బాగా డబ్బున్న వారు పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ విడిపోతే ఎవరికి ఎంత, పిల్లలకు ఎంత.. ఇవి మాట్లాడుకుంటే అసలు వైవాహిక జీవితంలో గొడవలే రావు’ అంటుందామె. ఇక మధ్యతరగతి విడాకులలో ‘పిల్లలు ఎదిగొచ్చిన స్త్రీకి ఇక తానేమిటి, తన ఉనికి ఏమిటి అనే సమస్య మొదలయ్యి తన జీవితానికి ప్రాధాన్యత లేదా అనే అసంతృప్తి నుంచి విడాకులు అవుతాయి’ అని తెలిపింది వందనా షా. ‘పరస్పరం హింసించుకునే పెళ్లి కంటే విడాకులే నయం’ అంటుందామె. అయితే పెళ్లితో బాధలు పడుతున్న పురుషుల గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. ‘బాగా సంపాదించే భార్య తన భర్తను ఇంటిపట్టున ఉండమని కోరడం, అతనిపై ఆధిపత్యం చెలాయించడం చూస్తున్నాం. మగాళ్లు హౌస్ హజ్బెండ్లుగా ఉండటాన్ని ఇష్టపడుతున్నా ఆధిపత్యం, అవమానం భరించలేక విడాకులు కోరుతున్నారు’ అని తెలిపిందామె. మధ్యతరగతి ఇళ్లలో తల్లిని, భార్యను ఎదురుబొదురు కూచోబెట్టి వారి సమస్యను నేరుగా పరిష్కరించక తప్పించుకు తిరిగే మగవాడు అంతిమంగా విడాకుల దగ్గర తేలుతాడని కూడా ఆమె హెచ్చరిస్తోంది. బహుపరాక్. (చదవండి: లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?! ) -
గురువు దారిలోనే శిష్యురాలు.. భర్తకు విడాకులు
దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. ఇతడి భార్య సైరా భాను.. తన లాయర్ల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రెహమాన్ దగ్గర పనిచేస్తున్న శిష్యురాలు కూడా భర్తకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన సైరా భాను.. భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు.. పెద్ద అంతరాన్ని సృష్టించాయని ఆమె లాయర్ వందనా షా పేర్కొన్నారు. రెహమాన్- సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకు ఉన్నాడు.ఇకపోతే రెహమాన్ దగ్గర బాసిస్ట్‌గా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలో ఏఆర్ రెహమాన్, అతడి సహాయకురాలు విడాకులు (వేర్వేరుగా) తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రెండు విడాకుల అంశాలకు ఏమైనా సంబంధముందా అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఏఆర్ రెహమాన్ విడాకులకు కారణం తెలిపిన అడ్వకేట్.. పిల్లల కామెంట్స్
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయారు. వారిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. 1995లో వారు పెళ్లి చేసుకున్నారు. సుమారు 29 ఏళ్లు కలిసి జీవించిన వారు ఇలా విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయంపై వారి పిల్లలు కూడా సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.ఎందుకు విడిపోయారంటే..ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోవడానికి ఉన్న కారణాలను వారి అడ్వకేట్ వందనా షా ఇలా చెప్పారు. 'భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగానే వారు విడిపోయారు. దంపతుల మధ్య సంబంధాల సమస్యలే ఈ నిర్ణయానికి దారితీశాయి. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట తమ మధ్య వచ్చే చిన్నచిన్న విభేదాలు, పోరాటాల విషయంలో పరిష్కరించుకోలేకపోయారు. అవి వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయ. శ్రీమతి సైరా చాలా బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ గోప్యతను, గౌరవాన్ని ప్రజలు కాపాడాలని వారిద్దరూ కోరారు.' అని న్యాయవాది తెలిపారు.విడాకులపై పిల్లల కామెంట్స్29 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ జంట తమ వివాహ బంధాన్ని ముగించుకున్నారని తెలుసుకున్న అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రెహమాన్, సైరా ఇద్దరూ కలిసే బాలీవుడ్ పార్టీలు, అవార్డులు, సెలబ్రిటీల వివాహాలకు హాజరవుతారు. ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో వారు చివరిసారిగా కలిసి కనిపించారు.విడాకుల విషయంపై వారి పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ స్పందిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. 'మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో మీరందరూ గోప్యత పాటించి గౌరవంగా వ్యవహరించారు. అందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు' అంటూ రహీమా పోస్ట్ చేయగా..ఖతీజా ఇలా తెలిపింది. ' ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరినీ వేడుకుంటున్నాం. మా బాధను అర్థం చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది. -
ఏఆర్ రెహ్మాన్ జంట విడాకులు
-
29 ఏళ్ల బంధానికి ముగింపు.. రెహమాన్-సైరా విడాకులు (చిత్రాలు)
-
ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య
సంగీత సామ్రాట్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ విషయాన్ని రహమాన్ దంపతుల తరఫున ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఒక సంయుక్త ప్రకటన మంగళవారం విడుదలచేశారు. ‘‘పెళ్లయిన చాన్నాళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. కొరవడిన భావోద్వేగాలే బంధం బీటలు పడటానికి కారణం. ఒకరిపై ఇంకొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాసరే అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు సైతం ఈ విషయాన్ని అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కష్టమైన దశను వీళ్లిద్దరూ దాటగలరని భావిస్తున్నా’ అని లాయర్ వందనా షా ఆ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి’ అని రెహమాన్ కుమారుడు అమీన్ సైతం ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. రహమాన్, సైరా బానూ వివాహం 1995 మార్చిలో చెన్నైలో జరిగింది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. -
అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?
మెగాహీరో రామ్ చరణ్ సోమవారం రాత్రి కడప వెళ్లారు. పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే పెద్ద దర్గాను దర్శించుకోవడం వెనక ఓ కారణముంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇలా చేసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం మ్యూజిక్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈయన మూడు నెలల క్రితం రామ్ చరణ్‌ని పెద్ద దర్గాను సందర్శించాలని కోరారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్.. రెహమాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది)కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ దర్గాకు రెహమాన్.. ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ని తీసుకొస్తానని అక్కడి వాళ్లకు మాటిచ్చారట. అలా ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 'ఏఆర్ రెహమాన్.. ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని మూడు నెలల ముందే చెప్పారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్‌తోపాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు)#ARRahman గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. - @AlwaysRamCharan pic.twitter.com/4l7CSysAtq— Rajesh Manne (@rajeshmanne1) November 18, 2024 -
ఘనంగా ఉరుసు ఉత్సవాలు.. కడప పెద్ద దర్గాలో ఏఆర్ రెహమాన్ (ఫొటోలు)
-
కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహమాన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌లు తమ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచార సభల్లో పాల్గొంటూ, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఓ సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా జరగబోయే ఒక ప్రచార సభలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఇవ్వనున్నారని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) అనే నిధుల సేకరణ బృందం ప్రకటించింది. కాగా ఈ కార్యక్రమ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఏఏపీఐ తెలిపింది. ఈ విషయమై ఏఆర్ రెహమాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే తేదీ నిర్ణయించిన తరువాత రెహమాన్ నుండి ప్రకటన రావచ్చని అంటున్నారు. కమలా హారిస్‌కు మద్దతుగా రెహమాన్ సంగీత కార్యక్రమం జరగబోతున్నదనే వార్త వెలువడగానే ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంతో కమలా హారిస్ ఓటర్ల నుంచి మరింత ఆదరణ పొందగలరని పలువురు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు
సెలబ్రిటీల పిల్లలని చూస్తే.. వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా కష్టాలు ఉంటాయి. కాకపోతే అవి విచిత్రమైన కష్టాలు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూతురు కూడా తన గురించి, తండ్రి గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు బయటపెట్టింది. 'మిన్ మినీ' అనే తమిళ సినిమాతో రీసెంట్గా సంగీత దర్శకురాలిగా పరిచయమైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది.ఏఆర్ రెహమన్ కూతురు కావడంతోనే మీతో మాట్లాడుతున్నారా? లేదంటే నిజంగానే మీతో స్నేహం చేస్తున్నారా అనే ప్రశ్నకు బదులిచ్చిన ఖతీజా రెహమాన్.. చిన్నప్పటి నుంచి చాలామంది తనతో మాట్లాడేవారని, కొందరు మాత్రం ఏఆర్.రెహమన్ కూతురిననే పరిచయం పెంచుకునేవారని, ఆ తర్వాత వారి అవసరాల గురించి చెప్పేవారని, అదే తనకు చాలా కష్టంగా ఉండేదని చెప్పింది.(ఇదీ చదవండి: తప్పు చేశా నాన్న.. ఏడ్చేసిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్)ఇక రెహమాన్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ఏఆర్ రెహమాన్ తండ్రి సంగీత కళాకారుడు. ఆయన స్ఫూర్తితోనే రెహమాన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట్లో పియానిస్ట్‌గా పనిచేశాడు. 'రోజా' మూవీతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే రెహమాన్ సోదరి రెహానా కూడా సంగీత దర్శకురాలే. రెహమాన్ కొడుకు ఏఆర్ అమీన్, సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూతురు ఖతీజా సంగీత దర్శకురాలి అయిపోయింది. మిన్మినీ చిత్రానికి ఖతీజా సంగీతమందించింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా, ఈమె పనితనాన్ని బాగానే మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి) -
2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్’ రెహమాన్ స్పెషల్ సాంగ్ వైరల్
హోరాహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకోవడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ అపురూపమైన సందర్భాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కూడా సంబరంగా జరుపుకున్నారు. అంతేకాదు మెన్ ఇన్ బ్లూకి ఒక అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏఆర్ రెహమాన్ బ్లూ ఇన్ మెన్‌కి అభినందనలుత తెలుపుతూ 'టీమ్ ఇండియా హై హమ్' పేరుతో ప్రత్యేక గీతాన్ని బహుమతిగా అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాంగ్‌ను తొలుత అజయ్ దేవగన్ 'మైదాన్' కోసం కంపోజ్ చేశారట. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా అజయ్ దేవగన్ హీరోగా 'మైదాన్' మూవీకోసం 'టీమ్ ఇండియా హై హమ్'ఒరిజినల్ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ , నకుల్ అభ్యంకర్ పాడారు.కాగా జూన్29న ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి, బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నసంగతి తెలిసిందే. -
పాటే మంత్రము.... గానం బంధము...
సాక్షి, హైదరాబాద్: : ఆమె పాట... స్వరాల ఊయలలూగించింది... అనుభూతుల లోకంలో ముంచింది. ప్రముఖ నేపథ్య గాయని సుమధుర గాత్రంతో సంగీత సంచలనం ఎఆర్ రెహమాన్‌ను సైతం తన అభిమానిగా మార్చుకున్న రోంకిణి గుప్తా... నగరవాసుల్ని పాటల లోకంలో విహరింపజేశారు. తెలంగాణ పర్యాటక శాఖ, సురమండల్ సంస్థల ఆధ్వర్యంలో నగరంలోని మాసబ్ ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆవరణలో నిర్వహించిన సంగీత ప్రదర్శనలో ఈ సంప్రదాయ సంగీత కళాకారిణి...హిందూస్థానీ క్లాసికల్ రాగాలాపనతో ప్రారంభించి తన ప్రాచుర్యం పొందిన పాటల్ని ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఆమెకు తోడుగా తబలా విద్వాంసులు అశిష్ రగ్వానీ, హార్మోనియం విద్వాంసులు దీపక్ మరాతెలు తమ స్వరాలతో సంగీతాభిమానులను ఓలలాడించారు. ఇద్దరు స్థానిక టంపోరా కళాకారులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. -
నేడు రోంకిణి గుప్తా సంగీత ప్రదర్శన
మ్యాస్ట్రో ఎ.ఆర్.రెహ్మాన్ అభిమాన గాయకురాలిగా గుర్తింపు పొందిన ప్రముఖ నేపథ్య గాయని రోంకిణి గుప్తా నగరంలో తన సంగీత ప్రదర్శన శనివారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ టూరిజంతో కలిసి సాయంత్రం 6.30 గంటలకు మాసబ్ ట్యాంక్ సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జెఎన్ఎఎఫ్ఎయు) ఆడిటోరియంలో రోంకిణి గుప్తా హిందుస్థానీ క్లాసికల్ సంగీతాన్ని సుర్మండల్ పేరిట అందించనున్నారు. మూడు సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా నామినేట్ అయిన రోంకిణి గుప్తా ఇటీవల స్వర కోకిల లతా మంగేష్కర్ అవార్డును సైతం అందుకున్నారు. -
Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్‌లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్‌లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్‌సీఎల్, ఇండిగో ఎయిర్లైన్స్లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్‌లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్‌తో చేసిన ఇన్స్టాగ్రామ్ సిరీస్‌కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్లైన్లో ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్‌లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్డ్ థెరపిస్ట్‌గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.‘లైఫ్‌స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది. భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్‌ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది. -
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రాయన్ నుంచి తాజాగా మొదటి సాంగ్ విడుదలైంది.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఎంతో క్రేజీగా సాగిని ఈ సాంగ్‌కు ధనుష్‌తో పాటు ఏఆర్ రెహమాన్ గాత్రం కలిపారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్ 13న రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది.