Arshdeep Singh
-
తలకు గాయం.. అప్డేట్ ఇచ్చిన తిలక్ వర్మ! ఆ విషయంలో క్రెడిట్ వాళ్లకే
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్ వర్మ గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండో బంతికి కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ.. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.తిలక్ తల నేలకు బలంగా తాకినట్లుఫలితంగా క్యాచ్ మిస్ కావడమే గాక.. తిలక్ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్‌ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్‌తో జాన్సెన్ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తిలక్ వర్మ తన గాయంపై అప్డేట్ అందించాడు.నేను బాగానే ఉన్నాను‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇవ్వాలని తిలక్ అన్నాడు.107 పరుగులుఈ మ్యాచ్‌లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తిలక్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(41)క్యాచ్ అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ.. -
భువనేశ్వర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై కూడా అర్ష్‌దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్‌కు పంపిన అర్ష్‌దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్‌కు 80 మ్యాచ్‌లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు2. అర్ష్‌దీప్ సింగ్- 59 మ్యాచ్‌లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్‌లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వేలంలో అతడికి రూ. 10 కోట్ల ధర!
టీమిండియాతో మూడో టీ20లో సౌతాఫ్రికా అంత తేలికగా తలవంచలేదు. సూర్యకుమార్ సేన విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు పోరాడగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రొటిస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.కేవలం 16 బంతుల్లోనేస్పెషలిస్టు బ్యాటర్లంతా దాదాపుగా చేతులెత్తేసిన వేళ.. జాన్సెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక దశలో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడా అనేంతలా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.తొలి సౌతాఫ్రికా ప్లేయర్గాఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా మార్కో జాన్సెన్ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టీమిండియాపై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న జాన్సెన్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 317కు పైగా స్ట్రైక్‌రేటుతో 54 పరుగులు సాధించాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గనుక జాన్సెన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎట్టకేలకు జాన్సెన్ అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల వద్ద నిలిచిన సౌతాఫ్రికా టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే.. మూడో టీ20లో జాన్సెన్ ఒక వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ రూపంలో కీలక వికెట్ తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ(107) సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ సైతం తన ప్రతిభను చాటుకున్నాడు.రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా?ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మార్కో జాన్సెన్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘మార్కో జాన్సెన్.. రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా? నేనైతే అవుననే అంటాను’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో జాన్సెన్ గురించి ఫ్రాంఛైజీలకు గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024లో మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ సీజన్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా స్కోర్లువేదిక: సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్టీమిండియా స్కోరు- 219/6 (20)సౌతాఫ్రికా స్కోరు- 208/7 (20)ఫలితం: పదకొండు పరుగుల తేడాతో టీమిండియా విజయం.. 2-1తో భారత్ పైచేయిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ(56 బంతుల్లోనే 107 నాటౌట్).చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
‘డెత్ ఓవర్లలో బౌలింగ్ కత్తి మీద సామే’
సెంచూరియన్: పరిస్థితులకు తగ్గట్లు తన బౌలింగ్‌ను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నానని భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న అర్ష్ దీప్ ... ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్ దీప్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 58 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. ‘స్పష్టమైన గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెడతా. పరిస్థితులకు తగ్గట్లు దాన్ని మార్చుకుంటూ ఉంటా. జట్టుకు ఏం అవసరమో దాన్ని గుర్తిస్తా. వికెట్లు తీయడం ముఖ్యమా... లేక పరుగులు నియంత్రిచాల అనేది చూసి బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటా. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ప్రతిసారి మనం అనుకున్న ఫలితం రాదు. అయినా దాని గురించి అతిగా ఆలోచించను. ఆరంభంలో రెండు ఓవర్లు వేసి మళ్లీ చివర్లో రెండు ఓవర్లు వేయడం మధ్య చాలా సమయం దక్కుతుంది. ఆ లోపు జట్టుకు ఏం కావాలో ఆర్థం అవుతుంది. రోజు రోజుకు మెరుగవడంపైనే ప్రధానంగా దృష్టి పెడతా.ఇటీవలి కాలంలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు సహాయ పడేందుకు ప్రయత్నిస్తున్నా. భారీ షాట్లు ఆడటం ఇష్టమే. నెట్స్‌లో కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై కూడా దృష్టి పెట్టా. ఆ దిశగా కష్టపడుతున్నా. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా. అతడి లాంటి బౌలర్ మరో ఎండ్ నుంచి ఒత్తిడి పెంచుతుంటే వికెట్లు తీయడం చాలా సులువవుతుంది.మ్యాచ్‌పై పట్టు కొనసాగించడం ముఖ్యం. అది ప్రారంభ ఓవర్ అయినా... లేక చివరి ఓవర్ అయినా ఒకే విధంగా ఆలోచిస్తా’ అని అర్ష్ దీప్ వివరించాడు. పొట్టి ఫార్మాట్లో ప్రమాదక బౌలర్‌గా ఎదిగిన అర్ష్ దీప్ ... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రెండు మార్పులు చేయనున్న టీమిండియా..?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలువగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా రేపు (నవంబర్ 13) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.రెండో టీ20లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి నిమిషం వరకు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొయెట్జీ చివర్లో సూపర్‌గా బ్యాటింగ్ చేసి భారత్ చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత యూనిట్లో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి.మూడో మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో అతను దారుణంగా నిరాశపరిచాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ అభిషేక్‌ను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ స్థానంలో తిలక్ వర్మ, రమన్‌దీప్ సింగ్‌లలో ఎవరో ఒకరితో ఓపెనింగ్ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మతో పోలిస్తే రమన్‌దీప్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.రమన్‌దీప్‌కు హార్డ్ హిట్టింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. తిలక్ వర్మ మిడిలార్డర్లో ఎలాగూ సెట్ అయ్యాడు కాబట్టి టీమిండియా యాజమాన్యం అతన్ని కదిపే సాహసం చేయకపోవచ్చు. మూడో టీ20లో అభిషేక్‌తో పాటు అర్షదీప్ సింగ్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అర్షదీప్ గత రెండు టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదదర్శనలు చేయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని పక్కకు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అర్షదీప్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తే, అతని స్థానంలో యశ్ దయాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో టీ20లో రమన్‌దీప్, యశ్ దయాల్ ఇద్దరూ బరిలోకి దిగితే వారిద్దరికి అది అరంగేట్రం మ్యాచ్ అవుతుంది.భారత జట్టు (అంచనా): రమణ్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యష్ దయాల్, ఆవేశ్ ఖాన్. -
అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!
భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (నవంబర్ 10) రెండో టీ20 జరుగనుంది. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే.అర్షదీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే..!ఇవాళ జరుగనున్న రెండో టీ20లో అర్షదీప్ సింగ్ మరో మూడు వికెట్లు తీస్తే భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న ఈ రికార్డును అర్షదీప్ సింగ్ బద్దలు కొడతాడు. భువీ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ కేవలం 57 మ్యాచ్‌ల్లోనే 88 వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను కూడా అధిగమిస్తాడు. బుమ్రా 70 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత యుజ్వేంద్ర చహల్‌కు దక్కుతుంది. చహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా..చహల్- 96భువనేశ్వర్ కుమార్- 90జస్ప్రీత్ బుమ్రా- 89అర్షదీప్ సింగ్- 88హార్దిక్ పాండ్యా- 87కాగా, నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ శతక్కొట్టడంతో (50 బంతుల్లో 107; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి తలో మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. ఆవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాల్డ్ కొయెట్జీ (23), ర్యాన్ రికెల్టన్ (21), డేవిడ్ మిల్లర్ (18), ట్రిస్టన్ స్టబ్స్ (11), మార్కో జన్సెన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. -
టీమిండియా ప్రపంచ రికార్డు.. పాకిస్తాన్‌తో పాటు టాప్‌లో
అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి.. పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది.127 పరుగులకు బంగ్లా ఆలౌట్తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో రోహిత్ సేన పర్యాటక జట్టును క్లీన్‌స్వీప్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ టీ20లలోనూ శుభారంభం చేసింది. గ్వాలియర్‌లోని మాధవ్‌రావ్ సింధియా కొత్త క్రికెట్ స్టేడియంలో టీమిండియా ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడింది.టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ మూడు(3/14), హార్దిక్ పాండ్యా(1/26), మయాంక్ యాదవ్(1/21) ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లలో రీ ఎంట్రీ వీరుడు వరుణ్ చక్రవర్తి మూడు(3/31), వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్(1/12) తీశారు.పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సమంఈ క్రమంలో టీమిండియా.. అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధిక సార్లు ఆలౌట్ చేసిన జట్టుగా నిలిచింది. తద్వారా పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, ఉగాండా, వెస్టిండీస్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధికసార్లు ఆలౌట్ చేసిన జట్లు👉టీమిండియా- 42 సార్లు👉పాకిస్తాన్- 42 సార్లు👉న్యూజిలాండ్- 40 సార్లు👉ఉగాండా- 35 సార్లు👉వెస్టిండీస్- 32 సార్లుఇదిలా ఉంటే.. తొలి టీ20లో బంగ్లా విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 11.5 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు సంజూ శాంసన్(29), అభిషేక్ శర్మ(16) ధనాధన్ దంచికొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(29) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అరంగేట్ర ఆటగాడు నితీశ్ రెడ్డి 16.. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39) పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం భారత్ సొంతమైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్Hardik Pandya finishes off in style in Gwalior 💥#TeamIndia win the #INDvBAN T20I series opener and take a 1⃣-0⃣ lead in the series 👌👌Scorecard - https://t.co/Q8cyP5jXLe@IDFCFIRSTBank pic.twitter.com/uYAuibix7Q— BCCI (@BCCI) October 6, 2024 -
మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్త మైదానంలో తొలుత బంగ్లాను 127 పరుగులకే పరిమితం చేసిన భారత్.. మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇక యువ ఆటగాళ్లతో నిండిపోయిన జట్టు ముందు కూడా చతికిల పడిన బంగ్లాదేశ్ మరోసారి చేతులెత్తేసింది. ఈ గెలుపు ద్వారా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే‘‘జట్టు సమావేశమైన సమయంలో మా నైపుణ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని పక్కాగా అమలు చేయడంలో సఫలమయ్యాము. మా వాళ్లు పట్టుదలగా ఆడారు. కొత్త గ్రౌండ్లో మేము బ్యాటింగ్ చేసిన విధానం గొప్పగా అనిపించింది.ఇక ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియనన్ని మంచి ఆప్షన్లు ఉండటం మాకు ఒక రకంగా తలనొప్పి కలిగించేదే. అయితే, అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ప్రతి మ్యాచ్‌లోనూ మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. తదుపరి మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కూర్చుని చర్చించి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.నజ్ముల్ షాంటో బృందం విలవిలకాగా గ్వాలియర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’లో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్ల దెబ్బకు నజ్ముల్ షాంటో బృందం పరుగులు రాబట్టడానికి ఆపసోపాలు పడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓపెనర్లు పర్వేజ్ హొసేన్ ఎమాన్(8), లిటన్ దాస్(4) రూపంలో కీలక వికెట్లతో పాటు.. టెయిలెండర్ ముస్తాఫిజుర్(1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇతర పేసర్లలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడరు. ఇక స్పిన్నర్లలో వరుణ్ చకవర్రి(3/31), వాషింగ్టన్ సుందర్(1/12) కూడా మెరవగా.. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.మెరుపు ఇన్నింగ్స్లక్ష్య ఛేదనలో టీమిండియాకు బంగ్లా బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కొత్త ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16) సహా వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య(14 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND Vs BAN 1st T20I: పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా? 𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq— BCCI (@BCCI) October 6, 2024 -
తొలి టి20లో భారత్ అలవోక విజయం
భారత యువ జట్టు సత్తా ముందు బంగ్లాదేశ్ తేలిపోయింది. ముందుగా అర్ష్ దీప్ పేస్‌ను, వరుణ్ స్పిన్‌ను ఎదుర్కోలేక బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేయగా ... ఆపై స్వల్ప లక్ష్యాన్ని భారత బృందం సునాయాసంగా ఛేదించింది. పాండ్యా, సూర్య, సంజూ సామ్సన్ సులువుగా పరుగులు రాబట్టడంతో మరో 49 బంతులు మిగిలి ఉండగా ఘనవిజయం భారత్ సొంతమైంది. గ్వాలియర్: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన భారత్ అంతే జోరుగా టి20 సిరీస్‌ను కూడా మొదలు పెట్టింది. టెస్టులతో పోలిస్తే టి20ల్లో టీమిండియా బృందం మొత్తం మారినా... ఫలితంలో మాత్రం తేడా రాలేదు. ఆదివారం జరిగిన తొలి టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ముందుగా బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. మిరాజ్ (32 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, నజు్మల్ హుస్సేన్ (25 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్ దీప్ , వరుణ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం టీమిండియా లక్ష్య ఛేదనకు 71 బంతులే సరిపోయాయి. భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్ (19 బంతుల్లో 29; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. భారత్‌కు 1–0తో ఆధిక్యం లభించగా, రెండో మ్యాచ్ బుధవారం న్యూఢిల్లీలో జరుగుతుంది. పేలవ బ్యాటింగ్... అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే లిటన్ దాస్ (4) వెనుదిరగ్గా, అతని తర్వాతి ఓవర్లో పర్వేజ్ (8) అవుటయ్యాడు. వరుణ్ తొలి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 15 పరుగులు రాబట్టిన బంగ్లా 5 ఓవర్లు ముగిసేసరికి 39 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో జట్టుకు ఒక్క పరుగూ రాలేదు. ఈ ఓవర్‌తో అంతర్జాతీయ కెరీర్ మొదలు పెట్టిన మయాంక్ చక్కటి బంతులతో తౌహీద్ (12)ను కట్టడి చేసి తన మొదటి ఓవర్‌ను ‘మెయిడిన్’గా ముగించడం విశేషం. గతంలో అగార్కర్, అర్ష్ దీప్ మాత్రమే తమ అరంగేట్ర మ్యాచ్‌ను మెయిడిన్ ఓవర్‌తో మొదలు పెట్టారు. తర్వాతి ఓవర్లో తౌహీద్‌ను వరుణ్ అవుట్ చేయగా... మహ్ముదుల్లా (1)ను వెనక్కి పంపి మయాంక్ తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ నజ్ముల్ తడబడుతూనే ఆడగా... జాకీర్ (8) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి బంగ్లా 64/5 వద్ద నిలిచింది. తర్వాతి 59 బంతుల్లో జట్టు మరో 63 పరుగులు రాబట్టింది. ఇందులో మిరాజ్ ఒక్కడే 29 బంతులు ఆడి 29 పరుగులు సాధించగా... మిగిలిన వారు ప్రభావం చూపలేదు. ధనాధన్... షరీఫుల్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లతో సామ్సన్ ఛేదన మొదలు పెట్టగా... తస్కీన్ వేసిన తర్వాతి ఓవర్లో అభిõÙక్ శర్మ (16) ఒక సిక్స్, 2 ఫోర్లతో జోరు చూపించాడు. అయితే దురదృష్టవశాత్తూ అదే ఓవర్లో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అభిõÙక్ రనౌటయ్యాడు. అనంతరం వచ్చీ రాగానే ధనాధన్ బ్యాటింగ్ చూపించిన సూర్య ఆరు బంతుల వ్యవధిలో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత ఇలాగే ధాటిగా ఆడబోయి సూర్య, సామ్సన్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే 73 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 16 నాటౌట్; 1 సిక్స్) అండగా నిలవగా... పాండ్యా ఒక్కడే 39 పరుగులు బాదడం విశేషం. తస్కీన్ వేసిన 12వ ఓవర్లో వరుసగా మూడు బంతులను 4, 4, 6గా మలచి పాండ్యా మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్ దీప్ 8; లిటన్ దాస్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 4; నజు్మల్ (సి అండ్ బి) సుందర్ 27; తౌహీద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 12; మహ్ముదుల్లా (సి) సుందర్ (బి) మయాంక్ 1; జాకీర్ (బి) వరుణ్ 8; మిరాజ్ (నాటౌట్) 35; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 11; తస్కీన్ (రనౌట్) 12; షరీఫుల్ (బి) పాండ్యా 0; ముస్తఫిజుర్ (బి) అర్ష్ దీప్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–40, 4–43, 5–57, 6–75, 7–93, 8–116, 9–117, 10–127. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 3.5–0–14–3, హార్దిక్ పాండ్యా 4–0–26–1, వరుణ్ చక్రవర్తి 4–0–31–3, మయాంక్ యాదవ్ 4–1–21–1, నితీశ్ రెడ్డి 2–0–17–0, వాషింగ్టన్ సుందర్ 2–0–12–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రిషాద్ (బి) మిరాజ్ 29; అభిõÙక్ శర్మ (రనౌట్) 16; సూర్యకుమార్ (సి) జాకీర్ (బి) ముస్తఫిజుర్ 29; నితీశ్ రెడ్డి (నాటౌట్) 16; పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–25, 2–65, 3–80. బౌలింగ్: షరీఫుల్ 2–0–17–0, తస్కీన్ 2.5–0–44–0, ముస్తఫిజుర్ 3–0–36–1, రిషాద్ 3–0–26–0, మిరాజ్ 1–0–7–1. -
చెలరేగిన భారత బౌలర్లు.. 127 పరుగులకే బంగ్లా ఆలౌట్
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చేరిగారు. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లా జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచాడు. వచ్చినవారు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు చేరారు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్.. -
Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం
దులీప్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇండియా-డి ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇండియా-బితో ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మ్యాచ్‌లో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.ఆరేసిన అర్షదీప్373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-బి.. అర్షదీప్ సింగ్ (6/40), ఆదిథ్య థాకరే (4/59) ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (40 నాటౌట్), అభిమన్యు ఈశ్వరన్ (19), సూర్యకుమార్ యాదవ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.రికీ భుయ్ అజేయ శతకంరికీ భుయ్ అజేయ సెంచరీతో (119) కదం తొక్కడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (50), సంజూ శాంసన్ (45) రాణించారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, నవ్‌దీప్ సైనీ 3, మోహిత్ అవస్థి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. ఆదుకున్న సుందర్అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో (116), వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87) రాణించడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేయగలిగింది. ఇండియా-డి బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్షదీప్ 3, ఆదిథ్య ఠాకరే 2 వికెట్లు తీశారు.సంజూ మెరుపు సెంచరీ.. పడిక్కల్, భరత్, భుయ్ అర్ద సెంచరీలుతొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగగా.. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవదీప్ సైనీ 5, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: బంగ్లాతో రెండు టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
‘ఇంత చెత్తగా ఆడతారా?.. గంభీర్‌కు ఇలాంటివి నచ్చవు’
టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త షాట్ సెలక్షన్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను ‘టై’ చేశాడంటూ భారత జట్టు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే సరదానా? లేదంటే ప్రత్యర్థి అంటే లెక్కలేనితనమా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.కాగా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన తర్వాత తొలిసారిగా.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో శుక్రవారం వన్డే సిరీస్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చిన టీమిండియా.. ‘టై’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆతిథ్య లంక విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ గెలుపొందాలంటే.. 18 బంతుల్లో 5 పరుగులు అవసరమైన సమీకరణానికి చేరుకుంది. చేతిలో అప్పటికి రెండు వికెట్లు ఉన్నాయి.ఈ దశలో.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అప్పటికి శివం దూబే, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. అయితే, అసలంక ఓవర్లో మొదటి రెండు బంతుల్లో దూబే పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో మూడో బంతికి ఫోర్ కొట్టగా ఇరు జట్ల స్కోరు సమమైంది. అయితే, అనూహ్య రీతిలో ఆ మరుసటి బంతికి దూబనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అసలంక.ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ బౌలింగ్‌లో దూబే ముందుకు వచ్చి ఆడబోగా.. బంతి ముందుగా ప్యాడ్‌ను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా దూబే పెవిలియన్ చేరగా.. అర్ష్‌దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే, వచ్చీ రాగానే అసలంక బౌలింగ్‌లో భారీ స్లాగ్‌స్వీప్ షాట్ ఆడబోయిన అర్ష్‌దీప్.. పూర్తిగా విఫలమయ్యాడు. అసలంక బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ పదో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ టై గా ముగిసింది.నిజానికి.. ఇంకా 14 బంతులు మిగిలి ఉండి.. విజయానికి ఒక్క పరుగు తీయాల్సిన సమయంలో అర్ష్‌దీప్ డిఫెన్స్ ఆడాల్సింది. కానీ అలా చేయకుండా బ్యాటర్ మాదిరి భారీ షాట్‌కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ షాట్ సెలక్షన్‌పై విమర్శలు వస్తున్నాయి. మాజీ పేసర్ దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెయిలెండర్ల నుంచి పరుగులు ఆశించలేం.కానీ కనీస క్రికెట్ ప్రమాణాలు తెలిసి ఉండాలి కదా! అర్ష్‌దీప్ షాట్ సెలక్షన్ కచ్చితంగా గంభీర్‌కు నచ్చి ఉండదు. ఏదేమైనా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా ఆడారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంకకు ఈ ఫలితం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. టీమిండియా అభిమానులు సైతం దొడ్డ గణేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. అర్ష్‌పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ మీడియం పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.What a dramatic turn of events! 😲Back-to-back wickets for skipper Asalanka turned the game on its head, with the match tied! 😶🌫️Watch #SLvIND ODI series LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/qwu5rmlZIQ— Sony LIV (@SonyLIV) August 2, 2024Hard to digest Arshdeep Singh's last-over mistake. With just 1 run needed off 14 balls, conceding a six is tough to watch.Was it fearless cricket or a blunder? Either way, it stings. #ArshdeepSingh #INDvsSL #RohitSharma𓃵pic.twitter.com/3ghC56p38r— Sagar Lohatkar (@sagarlohatkar) August 3, 2024 -
ఆ ఒక్క పరుగు చేయాల్సింది.. వారి వల్లే: రోహిత్ శర్మ
‘‘మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఛేదించగల స్కోరే ఇది. నిజానికి మేము బాగానే ఆడాం. అయితే, నిలకడలేమి బ్యాటింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పది ఓవర్ల తర్వాత.. ఒక్కసారి స్పిన్నర్లు బరిలోకి వచ్చారంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని ముందే ఊహించాం. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని పరుగులు స్కోరు చేశాం.లక్ష్య ఛేదన మొదలుపెట్టిన సమయంలో మాదే పైచేయి. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ వల్ల తిరిగి పుంజుకున్నాం. అయితే, ఆఖర్లో 14 బంతులు ఉండి కూడా ఒక్క పరుగు తీయలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.ఆటలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, శ్రీలంక ఈరోజు అద్బుతంగా ఆడింది. పిచ్ మొదటి నుంచి ఒకేలా ఉంది. తొలి 25 ఓవర్లలో మేము కూడా బాగా బౌలింగ్ చేశాం. తర్వాత వికెట్.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారింది. ఏదేమైనా మేము చివరిదాకా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది.రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మేము కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయాల్సింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే ‘టై’గా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారిగా లంకతో వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు.దంచికొట్టిన రోహిత్ఈ క్రమంలో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టును 230 పరుగులకు పరిమితం చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినా మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాల్లో పడింది.ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(35 బంతుల్లో 16 రన్స్) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదుకుంటాడని భావిస్తే.. అతడు కూడా 32 బంతుల్లో కేవలం 24 పరుగులకే పరిమితమయ్యాడు.విజయానికి ఒక పరుగు దూరంలోవాషింగ్టన్ సుందర్(5) తేలిపోగా.. రీఎంట్రీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33) కాసేపు పోరాడగా.. శివం దూబే 25 పరుగులతో గెలుపు ఆశలు రేపాడు.అయితే, కేవలం 14 బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన వేళ.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్(0)ను అవుట్ చేయడంతో టీమిండియా ఆలౌట్ అయింది. విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచి.. మ్యాచ్‌ను టై చేసుకుంది. భారత ఓపెనర్ల వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే(2/39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: గురి చెదిరింది.. కాంస్యం చేజారింది -
T20 World Cup 2024: "భల్లే భల్లే" డ్యాన్స్‌తో ఇరగదీసిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్ 2024 గెలుపును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన విరాట్.. వరల్డ్‌కప్ విజయానంతరం భల్లే.. భల్లే స్టెప్పులేసి ఇరగదీశాడు. ప్రముఖ సింగర్ దలేర్ మెహందికి చెందిన పాపులర్ సాంగ్ "తునుక్ తనుక్"కు కోహ్లి.. సహచరుడు అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి చిందేశాడు. టీమిండియా సెలబ్రేషన్స్‌లో భాగంగా మైదానంలోని స్పీకర్స్‌లో ఈ సాంగ్ ప్లే అవుతుండగా.. విరాట్, అర్ష్‌దీప్‌లతో సిరాజ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, బుమ్రా జత కలిశారు. వీరందరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది.Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024కాగా, ఫైనల్ మ్యాచ్ గెలిచాక కాసేపు భావోద్వేగాలకు లోనైన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని ఎంజాయ్మెంట్ మూడ్‌లోకి వచ్చారు. జట్టు సభ్యులంతా ఎవరి స్టయిల్లో వారు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆటగాళ్లంతా స్టేడియం మొత్తం కలియతిరిగి అభిమానులకు అభివాదం చేశారు. కొందరు ఫోన్లలో.. కొందరు నేరుగా తమ వారితో సంతోషాన్ని పంచుకున్నారు. భారత ఆటగాళ్లందరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆనందబాష్పాలు కార్చడం ప్రతి భారతీయుడి మనస్సుని హత్తుకుంది. వీరితో పాటు కోచ్ ద్రవిడ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. మొత్తంగా తొలుత భావోద్వేగాలు, ఆతర్వాత సంబురాలతో బార్బడోస్ మైదానం పులకించిపోయింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది. -
టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడింది.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అసాధారణమైన రివర్స్ స్వింగ్‌ను రాబట్టాడని ఇంజి ఆరోపించాడు.అర్ష్‌దీప్ తన సెకెండ్ స్పెల్‌లో (16వ ఓవర్లో) కొత్త బంతితో రివర్స్ స్వింగ్‌ను ఎలా రాబట్టగలిగాడని ప్రశ్నించాడు. సహజంగా బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ అవుతుంది. అలాంటిది అర్ష్‌దీప్ కొత్త బంతితో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడని నిలదీశాడు. బాల్ టాంపరింగ్‌కు పాల్పడకుండా ఆటగాళ్లపై కన్నేసి ఉంచాలని అంపైర్లకు సూచించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ ఆరోపణలు చేశాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా లక్ష్యానికి 25 పరుగుల దూరంలో (20 ఓవర్లలో 181/7) నిలిచిపోయింది. అర్ష్‌దీప్ సింగ్ (4-0-37-3), కుల్దీప్ యాదవ్ (4-0-24-2), బుమ్రా (4-0-2-9-1) ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 27 ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. అదే రోజు రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. -
ఇక్కడ గెలవడం అంత సులువు కాదు.. క్రెడిట్ వాళ్లకే: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో తమకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది. ఆతిథ్య అమెరికా జట్టుపై బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, పసికూనే అయినా అమెరికాపై రోహిత్ సేనకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడిన భారత జట్టు సూర్యకుమార్ యాదవ్(50), శివం దూబే(31) అద్భుత అజేయ ఇన్నింగ్స్ కారణంగా గట్టెక్కింది.బ్యాటింగ్ అనుకూలించని పిచ్‌పై వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య, దూబేలపై ప్రశంసలు కురిపించాడు.గెలుపు అంత తేలికగా రాదని తెలుసుఅదే విధంగా.. అమెరికాపై విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపు అంత తేలికగా రాదని తెలుసు. మా వాళ్ల మెరుగైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది.బౌలర్లు కూడాసూర్య, దూబే ఆద్యంతం పట్టుదలగా నిలబడి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారు. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.ముఖ్యంగా అర్ష్‌దీప్. దూబే రూపంలో మాకు మరో ఆప్షన్ ఉంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ప్రయత్నించి చూశాం. ఎందుకంటే ఈరోజు పిచ్ సీమర్లకు ఎక్కువగా అనుకూలించింది. కాబట్టి అతడి సేవలను వాడుకున్నాం. అతిపెద్ద ఊరటఇక సూపర్-8కు క్వాలిఫై అవటం అనేది అతిపెద్ద ఊరట. ఇలాంటి పిచ్‌లపై విజయాలు అంత సులువేమీ కాదు. ప్రతి మ్యాచ్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాం.మూడింట మూడు విజయాలు సాధించాం. ఫలితంగా మా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సూర్యకుమార్ యాదవ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి మేము ఏం ఆశిస్తామో.. ఈరోజు అదే అతడు చేసి చూపించాడు.కఠినమైన పిచ్‌పై తనదైన శైలిలో రాణించి విజయాన్ని అందించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సమిష్టి కృషితో సూపర్-8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024: ఇండియా వర్సెస్ యూఎస్ఏ స్కోర్లు👉వేదిక: న్యూయార్క్👉టాస్: ఇండియా బౌలింగ్👉యూఎస్ఏ స్కోరు- 110/8 (20)👉ఇండియా స్కోరు- 111/3 (18.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఇండియా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(4/9).చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc) -
IND Vs USA: 7 వికెట్లతో అమెరికాపై గెలుపు.. ‘సూపర్–8’కు భారత్
బ్యాటింగ్‌కు బద్ధ విరోధిలా నిలిచిన న్యూయార్క్ పిచ్‌పై భారత్ మరోసారి తమ స్థాయి ఆటను చూపించింది. వరుసగా మూడో విజయంతో టి20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు చేరి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పట్టుదలగా పోరాడి అమెరికా కొంత ఇబ్బంది పెట్టినా... చివరకు టీమిండియా ముందు తలవంచక తప్పలేదు. అర్ష్ దీప్తో పాటు ఇతర బౌలర్ల పదును ముందు యూఎస్ అతి కష్టమ్మీద 100 పరుగులు దాటింది. ఛేదనలో భారత బ్యాటింగ్ కాస్త తడబడి ఉత్కంఠను పెంచినా... సూర్యకుమార్, శివమ్ దూబే జోడీ మరో 10 బంతులు మిగిలి ఉండగా జట్టును గెలుపు తీరం చేర్చింది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్ వేటలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకున్న భారత్ సూపర్–8లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టీవెన్ టేలర్ (30 బంతుల్లో 24; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్ దీప్ (4/9) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (35 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో అభేద్యంగా 67 పరుగులు జోడించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శనివారం లాడర్‌హిల్‌లో కెనడాతో తలపడుతుంది. తలా ఓ చేయి.. గత రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న అమెరికాకు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. అర్‡్షదీప్ వేసిన ఓవర్లో మొదటి బంతికే జహాంగీర్ (0) వికెట్ల ముందు దొరికిపోగా, చివరి బంతికి గూస్ (2) అవుటయ్యాడు. పవర్‌ప్లేలో యూఎస్ 18 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఇన్నింగ్స్ తడబడుతూనే సాగినా... చిన్న చిన్న భాగస్వామ్యాలు ఇన్నింగ్స్‌ను నడిపించాయి.ఫామ్‌లో ఉన్న జోన్స్ (11)ను పాండ్యా వెనక్కి పంపించగా, దూకుడుగా ఆడబోయిన టేలర్‌ను అక్షర్ బౌల్డ్ చేశాడు. పాండ్యా ఓవర్లో సిక్స్, ఫోర్‌తో కొంత ధాటిని ప్రదర్శించిన నితీశ్ ఇన్నింగ్స్ బౌండరీ వద్ద సిరాజ్ అద్భుత క్యాచ్‌తో ముగిసింది. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అండర్సన్ (15), హర్మీత్ (10) వెనుదిరిగారు. 18వ ఓవర్ ఐదో బంతికి యూఎస్ స్కోరు వంద పరుగులకు చేరింది. కోహ్లి మళ్లీ విఫలం... లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. గత రెండు మ్యాచ్‌లలో 1, 4 పరుగులే చేసిన కోహ్లి (0) ఈసారి తొలి బంతికే వెనుదిరిగి టి20 వరల్డ్ కప్‌లో తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఆ తర్వాత నేత్రావల్కర్ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మ (3) కూడా అవుట్ కాగా, కుదురుకుంటున్నట్లు అనిపించిన రిషభ్ పంత్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను చక్కటి బంతితో అలీఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో సూర్య, దూబే కలిసి జట్టును ఆదుకున్నారు. మరీ ధాటిగా ఆడకపోయినా పిచ్‌ను బట్టి సింగిల్స్‌తో పరుగులు రాబట్టారు. 22 పరుగుల వద్ద సూర్య ఇచ్చిన క్యాచ్‌ను నేత్రావల్కర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వకుండా భారత ద్వయం ఆటను ముగించింది. అమెరికాకు పెనాల్టీ... తొలి వరల్డ్ కప్ ఆడుతున్న అమెరికా ఓవర్‌రేట్ నిబంధనల అమలు విషయంలో ఇంకా పరిణతి చెందలేదు. అనూహ్య రీతిలో మ్యాచ్‌లో ఆ జట్టుకు అంపైర్లు 5 పరుగులు పెనాల్టీగా విధించారు. ఓవర్ల మధ్యలో ఆ జట్టు ఒక నిమిషంకంటే ఎక్కువ సమయం తీసుకోవడం మూడుసార్లు జరిగింది. దాంతో కేవలం హెచ్చరికతో వదిలి పెట్టకుండా శిక్ష వేయడంతో భారత్‌కు 5 అదనపు పరుగులు వచ్చాయి. స్కోరు వివరాలు అమెరికా ఇన్నింగ్స్: జహాంగీర్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; టేలర్ (బి) అక్షర్ 24; గూస్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 2; జోన్స్ (సి) సిరాజ్ (బి) 11; నితీశ్ (సి) సిరాజ్ (బి) అర్ష్ దీప్ 27; అండర్సన్ (సి) పంత్ (బి) పాండ్యా 15; హర్మీత్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 10; షాడ్లీ (నాటౌట్) 11; జస్దీప్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–0, 2–3, 3–25, 4–56, 5–81, 6–96, 7–98, 8–110. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–9–4, సిరాజ్ 4–0–25–0, బుమ్రా 4–0–25–0, పాండ్యా 4–1–14–2, దూబే 1–0–11–0, అక్షర్ 3–0–25–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హర్మీత్ (బి) నేత్రావల్కర్ 3; కోహ్లి (సి) గూస్ (బి) నేత్రావల్కర్ 0; పంత్ (బి) ఖాన్ 18; సూర్యకుమార్ (నాటౌట్) 50; దూబే (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.2 ఓవర్లలో 3 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–39. బౌలింగ్: సౌరభ్ నేత్రావల్కర్ 4–0–18–2, అలీ ఖాన్ 3.2–0–21–1, జస్దీప్ సింగ్ 4–0–24–0, షాడ్లీ 4–0–25–0, అండర్సన్ 3–0–17–0. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X న్యూజిలాండ్వేదిక: ట్రినిడాడ్, ఉదయం గం. 6 నుంచిబంగ్లాదేశ్ X నెదర్లాండ్స్ వేదిక: కింగ్స్టౌన్, రాత్రి గం. 8 నుంచిఇంగ్లండ్ X ఒమన్‌వేదిక: నార్త్‌సౌండ్, అర్ధరాత్రి గం. 12:30 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IND Vs USA: అర్ష్‌దీప్ అరుదైన రికార్డు.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా న్యూయర్క్ వేదికగా అమెరికాతో మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అమెరికా బ్యాటర్లకు అర్ష్‌దీప్ చుక్కలు చూపించాడు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి అమెరికాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓవరాల్‌గా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్‌దీప్.. 4 వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన పేరిట ఉండేది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌పై అశ్విన్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్.. అశ్విన్ రికార్డును బ్రేక్ చేశాడు.అదే విధంగా మరో రికార్డును అర్ష్‌దీప్ సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే వికెట్ పడగొట్టిన మొదటి భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. యూఎస్ఎ ఓపెనర్ జహంగీర్‌ను మొదటి బంతికే ఔట్ చేసిన అర్ష్‌దీప్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. -
ఇదేం టెస్టు మ్యాచ్ కాదు: రోహిత్‌పై మండిపడ్డ కపిల్ దేవ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మండిపడ్డాడు. టీ20 మ్యాచ్‌లలో టెస్టు మ్యాచ్ మాదిరి వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించాడు. వరల్డ్‌క్లాస్ బౌలర్, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను ఎలా వాడుకోవాలో తెలియదా అంటూ కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది.రెండు మ్యాచ్‌లలో తొలుత అతడి చేతికే బంతిగ్రూప్-ఏలో భాగమైన రోహిత్ సేన తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలుపొంది టాపర్‌గా కొనసాగుతోంది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలో టీమిండియా బౌలింగ్ అటాక్‌ను యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరంభించాడు.రెండో ఓవర్లో మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరో ఓవర్లో బుమ్రాను బరిలోకి దింపిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మూడో ఓవర్ సందర్భంగా బాల్ అతడికి ఇచ్చాడు.అద్భుత స్పెల్‌తో దుమ్ములేపిన బుమ్రాఈ రెండు లో స్కోరింగ్ మ్యాచ్‌లలోనూ జస్ప్రీత్ బుమ్రా అద్భుత స్పెల్‌తో ఆకట్టుకుని భారత్‌కు విజయాలు అందించాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్ల కోటాలో కేవలం ఆరు పరుగులిచ్చి.. రెండు వికెట్లు తీశాడు బుమ్రా.ఇక పాక్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, పేస్ దళ నాయకుడైన బుమ్రాను కాదని.. యంగ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్‌తో బౌలింగ్ అటాక్ ఆరంభించడం ఏమిటని ఇప్పటికే మాజీ సారథి సునిల్ గావస్కర్ ప్రశ్నించగా.. తాజాగా మరో దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇవేమీ టెస్టు మ్యాచ్‌లు కాదు‘‘అతడు వికెట్లు తీయగల సత్తా ఉన్నవాడు. అందుకే మొదటి ఓవర్లోనే బంతిని అతడికి ఇవ్వాలి. ఇవేమీ టెస్టు మ్యాచ్‌లు కాదు కదా! టీ20 ఫార్మాట్ ఇది.ఎంత త్వరగా వికెట్లు తీస్తే.. అంత త్వరగా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేయవచ్చు. ఒకవేళ బుమ్రా గనుక బౌలింగ్ అటాక్ ఆరంభించి.. ఆదిలోనే రెండు వికెట్లు తీసినట్లయితే.. మిగతా బౌలర్లు కూడా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.తప్పని నిరూపించాడుఅదే విధంగా.. ‘‘అతడి శరీరం.. ముఖ్యంగా భుజాలపై ఎక్కువగా ఒత్తిడి పెడతాడు కాబట్టి బుమ్రా ఎక్కువ రోజులు క్రికెట్లో కొనసాగలేడని మనమంతా భావించాం.అయితే, అందరి ఆలోచనలు తప్పని అతడు అనతికాలంలోనే నిరూపించాడు’’ అంటూ బుమ్రాను కొనియాడాడు కపిల్ దేవ్. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా బుధవారం నాటి మ్యాచ్‌లో న్యూయార్క్ వేదికగా అమెరికాతో తలపడనుంది.చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc) -
చెత్త షాట్లు.. బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్‌పై విమర్శలు
T20 WC 2024- India vs Pakistan: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్మెంట్ అనుసరించిన బౌలింగ్ వ్యూహాలను భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తప్పుబట్టాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడో ఓవర్లో బంతిని ఇవ్వడమేమిటని ప్రశ్నించాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసినట్లే.. బుమ్రాను కూడా తొలి ఓవర్లోనే ఉపయోగించుకోవాలని సూచించాడు. నిజానికి పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియాను బౌలర్లే గట్టెక్కించారని.. ఈ విజయంలో క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలని గావస్కర్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్- పాకిస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారీ అంచనాలతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 119 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. 31 బంతుల్లో 42 పరుగులతో పంత్ దుమ్ములేపగా.. అక్షర్ పటేల్ 20 పరుగులతో రాణించాడు.మిగతా వాళ్లంత సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను.. టీమిండియా బౌలర్లు ఆది నుంచే కట్టడి చేశారు. వీరి దెబ్బకు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ 113 పరుగులకే కుప్పకూలింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) అద్భుతంగా రాణించగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అయితే, ఈ మ్యాచ్‌లో బౌలింగ్ అటాక్‌ను అర్ష్‌దీప్ సింగ్ ప్రారంభించడం విశేషం. తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి బంతిని అందించాడు. మహ్మద్ సిరాజ్ రెండో ఓవర్ వేయగా.. బుమ్రా మూడో ఓవర్లో యాక్షన్‌లోకి దిగాడు. View this post on Instagram A post shared by ICC (@icc) బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడమేమిటి?ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ భారత్- పాక్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత క్రికెట్లో బౌలర్లూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.వాళ్లు తిరిగి పుంజుకోవడం అద్భుతంగా అనిపించింది. అయినా.. బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడమేమిటి? మూడో ఓవర్లో అతడికి చేతికి బంతినిస్తారా?మొదటి 12 బంతులు ఎందుకు వృథా చేశారు? మీ జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్‌కే కదా మొదటగా బంతిని ఇవ్వాల్సింది. రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లిని ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రమ్మని చెప్తారా?చెప్పరు కదా?!.. వాళ్లిద్దరు అత్యుత్తమ బ్యాటర్లు కాబట్టి టాపార్డర్‌లోనే వస్తారు. మరి ఈ ప్రధాన బౌలర్ విషయంలో మాత్రం ఎందుకిలా?’’ అని గావస్కర్ టీమిండియా సారథి రోహిత్ వ్యూహాలను విమర్శించాడు.చెత్త షాట్లతో వికెట్లు కోల్పోయిఅదే విధంగా టీమిండియా బ్యాటర్ల తీరుపైనా గావస్కర్ విమర్శలు గుప్పించాడు. అనవసరపు షాట్లకు యత్నించి వికెట్లు పారేసుకోవడం ఏమిటని మండిపడ్డాడు. ఏదేమైనా పాక్‌పై టీమిండియా మ్యాచ్ గెలవడం మాత్రం సంతోషంగా ఉందంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన భారత పేసర్లు.. 96 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్ 96 పరుగులకే (16 ఓవర్లలో) కుప్పకూలింది.ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు. -
వారెవ్వా అర్ష్‌దీప్.. ఏమైనా బాల్ వేశాడా? చూస్తే మైండ్ బ్లాంక్
టీ20 వరల్డ్‌కప్-2024 ప్రధాన టోర్నీకు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా సత్తాచాటింది. న్యూయర్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 60 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా 40(నాటౌట్) పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది.సూపర్ డెలివరీ..ఇక ఈ వార్మాప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్‌ను అర్ష్‌దీప్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. బంగ్లా ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ తొలి బంతిని లిటన్ దాస్‌కు బ్యాకప్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆఫ్‌సైడ్ పడిన బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అర్ష్‌దీప్ వేసిన బంతికి లిటన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.ఇది చూసిన లిటన్ దాస్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు అర్ష్‌దీప్ ప్రధాన టోర్నీలో కూడా కొనసాగించాలని కామెంట్లు చేస్తున్నారు.pic.twitter.com/Co5twCgaJc— Reeze-bubbly fan club (@ClubReeze21946) June 1, 2024 -
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్‌దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
-
సన్‌రైజర్స్‌కు ఇది కొత్తేం కాదు.. పంజాబ్ కింగ్స్‌కు కూడా!
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించనడంలో సందేహం లేదు. ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠ కలిగించిన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు సన్‌రైజర్స్ జయభేరి మోగించింది. కేవలం రెండు పరుగుల తేడాతో గెలుపొంది సీజన్లో మూడో విజయం అందుకుంది. మరోవైపు.. సొంతగడ్డపై ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఇలా ఆఖరి వరకు ఊరించి ఓడిపోవడం పంజాబ్ కింగ్స్‌కు కొత్తేం కాదు. అలాగే సన్‌రైజర్స్ కూడా ఆఖరి వరకు అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ కలిగించి విజయబావుటా ఎగురువేయడం అలవాటేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ రెండు జట్లలో సన్‌రైజర్స్ 2016లో టైటిల్ విజేతగా నిలవగా.. పంజాబ్ కింగ్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. ఐపీఎల్ చరిత్రలో విజయానికి అత్యంత చేరువగా వచ్చి పంజాబ్ కింగ్స్ ఓడిన సందర్భాలు(పరుగుల పరంగా) ►2016- మొహాలీ- ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓటమి ►2020- అబుదాబి- కేకేఆర్‌తో మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమి ►2021- దుబాయ్- రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమి ►2024- ముల్లన్పూర్-సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమి ఐపీఎల్ చరిత్రలో ఆఖరి వరకు ఊరించి పరుగుల పరంగా స్వల్ప తేడాతో సన్‌రైజర్స్ గెలిచిన సందర్భాలు ►2024- ముల్లన్పూర్- పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం ►2022- ముంబై- ముంబై ఇండియన్స్‌పై మూడు పరుగుల తేడాతో విజయం ►2014- దుబాయ్- ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం ►2016- వైజాగ్- రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం ►2021- అబుదాబి- ఆర్సీబీపై నాలుగు పరుగుల తేడాతో విజయం. మ్యాచ్ విషయానికొస్తే... PBKS vs SRH Scores ►వేదిక: ముల్లన్పూర్.. చండీగఢ్ ►టాస్: పంజాబ్ కింగ్స్.. బౌలింగ్ ►సన్‌రైజర్స్ స్కోరు: 182/9 (20) ►టాప్ స్కోరర్: నితీశ్ కుమార్ రెడ్డి: 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు ►పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సూపర్ స్పెల్: 4/29 ►పంజాబ్ కింగ్స్ స్కోరు: 180/6 (20) ►ఫలితం: రెండు పరుగులు తేడాతో సన్‌రైజర్స్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నితీశ్ కుమార్ రెడ్డి(64 రన్స్‌తో పాటు ఒక వికెట్) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024