Aryna Sabalenka
-
సెమీస్‌లో సబలెంకా
రియాద్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పర్పుల్ గ్రూప్ రెండో లీగ్ మ్యాచ్‌లో సబలెంకా 6–3, 7–5తో నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది. తద్వారా వరుసగా రెండో విజయంతో సబలెంకాకు సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇదే గ్రూప్‌లోని మరో లీగ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 7–6 (7/4), 3–6, 6–1తో ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)ను ఓడించింది. ఫలితం రెండు పరాజయాలతో రిబాకినా సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. జాస్మిన్, కిన్వెన్ జెంగ్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేతకు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. -
సబలెంక శుభారంభం
రియాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫైనల్స్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ అరైనా సబలెంక (బెలారస్) శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్ పోరులో సబలెంక 6–3, 6–4తో చైనా స్టార్, ఏడో సీడ్ జెంగ్ కిన్వెన్ను వరుససెట్లలో ఓడించింది. రెండు సెట్లలోనూ టాప్‌సీడ్ జోరుకు ఎదురే లేకుండాపోయింది. చైనా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంక గంటా 24 నిమిషాల్లో మ్యాచ్ గెలిచింది. నంబర్‌వన్ ప్లేయర్ 3 ఏస్‌లు సంధించి ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేయగా, జెంగ్ కిన్వెన్ 4 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 8 ఏస్‌లు సంధించినప్పటికీ టాప్‌సీడ్ జోరుకు చతికిలబడింది. ఓవరాల్‌గా వీళ్లిద్దరు ముఖాముఖిగా తలపడిన ఐదుసార్లు కూడా బెలారస్ స్టారే విజయం సాధించింది. ఈ ఏడాదే నాలుగుసార్లు చైనా ప్రత్యర్థిని ఓడించింది. ఈ సీజన్లో ఆ్రస్టేలియా ఓపెన్ ఫైనల్లో కిన్వెన్ను ఓడించి గ్రాండ్‌స్లామ్ గెలిచిన సబలెంక... యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్‌కు ఇంటిదారి చూపింది. ఇటీవల సొంతగడ్డ వూహాన్‌లోనూ కిన్‌వెన్‌కు సబలెంక చేతిలో నిరాశే ఎదురైంది. ఈ గ్రూప్‌లోని తర్వాతి రెండు మ్యాచ్‌లలో జాస్మిన్ పావొలిని, ఎలెనా రైబాకినాలపై గెలిస్తే సబలెంక వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. -
US Open 2024: సభలెంకా... విజయ ఢంకా
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ స్టార్ అరీనా సబలెంకా నాలుగో ప్రయత్నంలో సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 7–5, 7–5తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. విజేతగా నిలిచిన సబలెంకాకు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ జెస్సికా పెగూలాకు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సబలెంకా 2021, 2022లలో సెమీఫైనల్లో ని్రష్కమించింది. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన పెగూలా అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్లో కోలుకున్న పెగూలా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో గేమ్ గెలిచిఉంటే పెగూలా రెండో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచేది. కానీ కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సబలెంకా తన ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా విజృంభించిన ఈ బెలారస్ స్టార్ వరుసగా నాలుగు గేమ్‌లు గెల్చుకొని 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సబలెంకా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకా తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. 2019లో నాన్న చనిపోయాక మా ఇంటìæపేరును టెన్నిస్ చరిత్రలో భాగంగా చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగాను. నా టెన్నిస్ ప్రయాణం నిరాటంకంగా, ఎల్లవేళలా కొనసాగేందుకు నా కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేశారు. గత మూడేళ్లుగా ఈ టోరీ్నలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. టోర్నీలలో విన్నర్స్ ట్రోఫీపై నా పేరు చూసుకుంటున్నపుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. –సబలెంకా -
యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా సబలెంక (ఫోటోలు)
-
US Open 2024: యూఎస్ ఓపెన్ మహిళల విజేతగా సబలెంక..
యూఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ స్టార్ అరీనా సబలెంక నిలిచింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన పెగులాపై 7-5, 7-5 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంక గెలుపొందింది.దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ తుది పోరులో తీవ్రంగా శ్రమించిన సబలెంక.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. పెగులా నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి సబెలంక మాత్రం తన పట్టును కోల్పోలేదు. కాగా సబలెంక గత యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరినప్పటికీ తుది మెట్టుపై బోల్తా పడింది. కోకో గాఫ్ చేతిలో ఓటమిపాలైంది. కానీ ఈసారి మాత్రం ఈ బెలారస్ స్టార్ తన కలను నేరవేర్చుకుంది. 26 ఏళ్ల అరీనా ట్రోఫీని అందుకున్న వెంటనే కోర్టుంతా తిరుగుతూ సంబరాలు చేసుకుంది. అదే విధంగా సబెలెంక ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. -
ఫైనల్లో జెస్సికా, సబలెంకా
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. గ్రాండ్‌స్లామ్ కెరీర్లో తొలిసారి సెమీస్ చేరిన ఆమె తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ఈ సారి సొంతగడ్డపై యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ జెస్సికా 1–6, 6–4, 6–2తో కరోలినా ముచొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. అయితే మరో అమెరికన్ ఎమ్మా నవారో ఆట సెమీస్‌తోనే ముగిసింది.రష్యన్ స్టార్, గత యూఎస్ ఓపెన్ రన్నరప్ అరినా సబలెంక 6–3, 7–6 (7/2)తో 13వ సీడ్ ఎమ్మా నవారోను వరుస సెట్లలో ఇంటిదారి పట్టించింది. నేడు జరిగే ఫైనల్లో పెగూలా తన తొలి గ్రాండ్‌స్లామ్ కోసం, సబలెంక తన మూడో గ్రాండ్‌స్లామ్ కోసం తలపడతారు. సబలెంకా 2023, 2024లలో వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. తొలి సెట్ కోల్పోయినా... క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌ను ఓడించిన జెస్సికాకు సెమీస్ పోరు అంత సులువుగా సాగలేదు. మ్యాచ్ ఆరంభంలో ఫ్రెంచ్ ఓపెన్ 2023 రన్నరప్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచొవా చెలరేగి ఆడింది. తొలి 12 విన్నర్లలో పది విన్నర్లను ఆమె కొట్టింది. తొలి సెట్లో పెగూలా అదేపనిగా చేసిన తప్పిదాలు, పేలవమైన సర్విస్తో వెనుకబడింది. ఇదే అదనుగా పట్టు బిగించిన ముచొవా 28 నిమిషాల్లోనే తొలి సెట్‌ను వశం చేసుకుంది. రెండో సెట్లోనూ తొలి 9 గేముల్లో ఎనిమిదింట గెలిచి ఒక దశలో 3–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఇక్కడి నుంచి సీన్ మారిపోయింది. జెస్సికా జోరు మొదలైంది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆటలో వేగం పెంచింది. మూడు బ్రేక్ పాయింట్లతో రెండో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో చెక్ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశమివ్వకుండా జెస్సికా మెరుపుషాట్లతో విరుచుకుపడింది. సబలెంక జోరు మరో సెమీఫైనల్లో రష్యన్ స్టార్ సబలెంక జోరుకు ఎమ్మా నవారో ఎదురు నిలువలేకపోయింది. ప్రత్యేకించి యూఎస్ ఓపెన్‌లో తొలిరౌండే దాటని అమెరికన్ ప్లేయర్ ఎమ్మా నిరుటి రన్నరప్ సబలెంక ధాటికి తొలిసెట్లో చతికిలబడింది. తొలిసెట్‌ను 6–3తో గెలుచుకున్న రెండో సీడ్ సబలెంకకు రెండో సెట్లో కాస్తా పోటీ ఇవ్వడంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. అయితే టై బ్రేక్‌లో అనుభవజ్ఞురాలైన రష్యన్ అలవోకగా పాయింట్లు సాధించడంతో కేవలం గంటన్నరలోనే మ్యాచ్ ముగిసింది. సబలెంక 8 ఏస్‌లతో చెలరేగింది. 34 విన్నర్లు కొట్టింది. ఒకే ఒక ఏస్ సంధించిన నవారో 13 విన్నర్లే కొట్టగలిగింది. -
స్వియాటెక్‌పై సబలెంకా పైచేయి
సిన్సినాటి: సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ నుంచి మహిళల టెన్నిస్ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) నిష్క్రమించింది. ఆదివారం జరిగిన సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–3తో స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్వియాటెక్‌తో 12వ సారి తలపడిన సబలెంకా నాలుగోసారి విజయాన్ని అందుకుంది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఈ సీజన్లో ఐదో టోర్నీలో ఫైనల్ చేరిన సబలెంకా తదుపరి ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు చేరుకుంటుంది. జెస్సికా పెగూలా (అమెరికా), పౌలా బదోసా (స్పెయిన్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో సబలెంకా తలపడతుంది. -
అరీనా సబలెంకాకు గాయం.. వింబుల్డన్ టోర్నీకి దూరం
వింబుల్డన్ -2024 నుంచి బెలారస్ టెన్నిస్ స్టార్, మూడో సీడ్ అరీనా సబలెంకా వైదొలిగింది. భుజం గాయం కారణంగా సబలెంకా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీకు దూరం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మెయిన్ డ్రాలో సబలెంకా స్ధానాన్ని రష్యన్ టెన్నిస్ స్టార్ ఎరికా ఆండ్రీవాతో భర్తీ చేశారు. ఇక ఈ విషయాన్ని అరీనా సబలెంకా సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. గాయం కారణంగా వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సబలెంక తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. "భుజం గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకున్నాను.ఈ విషయాన్ని మీకు తెలియజేయాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. కానీ నా భుజం గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నొప్పితో బాధపడుతున్నప్పటకి ప్రతీ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే ఏడాది ఇంతకంటే బలంగా తిరిగి వస్తానని మీకు మాటిస్తానని" ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా వింబుల్డన్ టోర్నీ జూలై 1 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం తొలి దశ పోటీలు జరుగుతున్నాయి. -
సబలెంకాకు చుక్కెదురు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవా 2 గంటల 29 నిమిషాల పోరులో 6–7 (5/7), 6–4, 6–4తో సబలెంకాను బోల్తా కొట్టించగా... ఇటలీకి చెందిన 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని 2 గంటల 3 నిమిషాల్లో 6–2, 4–6, 6–4తో రిబాకినాను ఓడించింది. ఆండ్రీవా, జాస్మిన్ తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/3), 5–7, 6–1తో సాండర్ గిలె–జొరాన్ వ్లీగెన్ (బెల్జియం) జంటను ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/3), 6–4తో తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచి రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. -
French Open 2024: క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–2, 6–3తో ఎమా నవారో (అమెరికా)పై, రిబాకినా 6–4, 6–3తో స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) 4–6, 6–0, 6–1తో ఎలీనా అవానెస్యాన్ (రష్యా)పై, మిరా ఆంద్రీవా 7–5, 6–2తో వర్వారా గ్రచెవా (ఫ్రాన్స్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మెద్వెదెవ్కు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 4–6, 6–2, 6–1, 6–3తో మెద్వెదెవ్‌ను ఓడించి ఎనిమిదో ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–7 (2/7), 6–3, 7–6 (10/8)తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
ప్రిక్వార్టర్స్ చేరిన రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో కజకిస్తాన్ స్టార్ రిబాకినా, రెండో సీడ్ సబలెంక అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడోరౌండ్లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–4, 6–2తో వరుస సెట్లలో ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)ను చిత్తు చేయగా, రెండో సీడ్ సబలెంక (రష్యా) 7–5, 6–1తో బడొసా (స్పెయిన్)పై నెగ్గింది. ఆ్రస్టేలియా ఓపెన్ రన్నరప్, ఏడోసీడ్ క్వినెన్ జెంగ్‌కు రష్యా ప్లేయర్ ఎలీనా అవనెసియాన్ షాకి చ్చింది. మూడో రౌండ్లో అన్సీడెన్ ఎలీనా 3–6, 6–3, 7–6 (10/6)తో చైనా స్టార్‌ను ఇంటిదారి పట్టించింది. మరో మ్యాచ్‌లో వింబుల్డన్ చాంపియన్ మార్కెటా వొండ్రొసొవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో క్లో పాక్వెట్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్, అల్కరాజ్ ముందంజ వేశారు. మూడోరౌండ్లో నిరుటి సెమీఫైనలిస్ట్, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 3–6, 6–4, 6–2, 4–6, 7–6 (10/3)తో టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)పై శ్రమించి నెగ్గాడు. స్పెయిన్ స్టార్, మూడో సీడ్ కార్లొస్ అల్కరాజ్ 6–4, 7–6 (7/5), 6–3తో 27వ సీడ్ సెబాస్టియన్ కొర్డా (అమెరికా)పై గెలుపొందగా, సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–3, 6–1తో జాంగ్ జిజెన్ (చైనా)ను ఓడించాడు. ఆ్రస్టేలియా ఓపెన్ రన్నరప్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7–6 (7/4), 7–5, 1–6, 6–4తో థామస్ మచక్ (చెక్ రిపబ్లిక్)పై చెమటోడ్చి విజయం సాధించాడు. శ్రీరామ్ బాలాజీ ముందంజ భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. పురుషుల డబుల్స్‌లో మిగెల్ వరేలా (మెక్సికో)తో జోడీకట్టిన బాలాజీ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో భారత్–మెక్సికన్ ద్వయం 6–4, 3–6, 6–2తో డాన్ ఆడెడ్–థియో అరిబేజ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. -
సబలెంకా బోణీ
పారిస్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–2తో ఇరీకా ఆంద్రీవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.27 విన్నర్స్ కొట్టిన సబలెంకా నెట్ వద్ద 11 పాయింట్లు సాధించింది. ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న ఈ బెలారస్ స్టార్ గత ఏడాది తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ మరియా సాకరి (గ్రీస్) వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. సాకరి 6–3, 4–6, 3–6తో వర్వరా గ్రెచెవా (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), పదో సీడ్ దరియా కసత్కినా (రష్యా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రిబాకినా 6–2, 6–3తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై, కిన్వెన్ జెంగ్ 6–2, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్)పై, కసత్కినా 7–5, 6–1తో మగ్ధలీనా ఫ్రెచ్ (పోలాండ్)పై గెలుపొందారు. రూడ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2022, 2023 రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రూడ్ 6–3, 6–4, 6–3తో అల్వెస్ మెలెగిని (బ్రెజిల్)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 23 విన్నర్స్ కొట్టిన రూడ్ నెట్ వద్ద 10 పాయింట్లు సాధించాడు. వర్షం అంతరాయం కారణంగా మంగళవారం జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లను వాయిదా వేశారు. ఇందులో భారత డబుల్స్ ప్లేయర్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ తొలి రౌండ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కార్నె వీడ్కోలు... ఈ టోర్నీతో ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ అలీజా కార్నె కెరీర్‌కు వీడ్కోలు పలికింది. కిన్వెన్ జెంగ్ చేతిలో మ్యాచ్ ముగిశాక ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు కార్నెను సన్మానించి చేసి వీడ్కోలు ట్రోఫీని అందజేశారు. 34 ఏళ్ల కార్నె అత్యధిక వరుస గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. కార్నె 2007 ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తాజా ఫ్రెంచ్ ఓపెన్ వరకు వరుసగా 69 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడింది. 2014 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో నాటి ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించిన కార్నె 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2009లో కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్‌ను అందుకున్న కార్నె తాజా ర్యాంకింగ్స్‌లో 106వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్‌పరంగా కార్నెకు నేరుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. -
అప్పటికే విడిపోయాం.. నా హృదయం ముక్కలైంది: టెన్నిస్ స్టార్
బెలారస్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ టూ సీడ్ అరీనా సబలెంక ఉద్వేగానికి లోనైంది. ఐస్ హాకీ మాజీ ఆటగాడు కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా.. కొన్ని రోజుల ముందే తామిద్దరం విడిపోయామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా బెలారస్‌కు చెందిన కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2002- 2010 మధ్య దేశం తరఫున పలు టోర్నీల్లో పాల్గొన్న అతడు 2010 వింటర్ ఒలింపిక్స్‌లోనూ భాగమయ్యాడు. ఈ క్రమంలో 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన కొల్త్సోవ్.. ఆ తర్వాత రష్యన్ క్లబ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. గతంలో జులియా అనే మహిళను వివాహం చేసుకున్న కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్కు ఆమెతో ముగ్గురు సంతానం కలిగారు. అయితే, అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2020లో భార్యకు విడాకులు ఇచ్చిన 42 ఏళ్ల ఈ మాజీ హాకీ ప్లేయర్.. 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకతో ప్రేమలో పడ్డాడు. గత మూడేళ్లుగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ధ్రువీకరించే ఫొటోలను సబలెంక తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ కొల్త్సోవ్ మియామీలో మరణించినట్లు వార్తలు రాగా.. బెలారస్ హాకీ ఫెడరేషన్ మంగళవారం ఈ వార్తను ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా కొల్త్సోవ్ది ఆత్మహత్య అని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. కొల్త్సోవ్ మృతి నేపథ్యంలో సబలెంకకు సానుభూతి తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. అప్పటికే విడిపోయాం ఈ క్రమంలో బుధవారం ఈ విషయంపై స్పందించిన సబలెంక.. కొన్నాళ్ల క్రితమే కొల్త్సోవ్తో తాను విడిపోయినట్లు తెలిపింది. దయచేసి ఈ విషయంలో తన గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘గత కొన్నాళ్లుగా మేము విడిగా ఉంటున్నాం. ఏదేమైనా.. కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ మరణం ఊహించలేని విషాదం. నా హృదయం ముక్కలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు, నా కుటుంబ గోప్యతకు భంగం కలగకుండా చూసుకుంటారని భావిస్తున్నా’’ అని సబలెంక ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంక.. శుక్రవారం మియామీ ఓపెన్ బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Australian Open (@australianopen) -
ఆమెకు 25.. అతడికి 42.. బాయ్‌ఫ్రెండ్‌తో సబలెంక (ఫొటోలు)
-
సబలెంక జీవితంలో తీవ్ర విషాదం.. భాగస్వామి హఠాన్మరణం
టెన్నిస్ స్టార్ అరీనా సబలెంక వ్యక్తిగత జీవితంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్, ఐస్ హాకీ మాజీ ఆటగాడు కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ హఠాన్మరణం చెందాడు. 42 ఏళ్ల వయసులో అతడు కన్నుమూశాడు. బెలారస్ హాకీ ఫెడరేషన్ మంగళవారం ఈ వార్తను ధ్రువీకరించింది. కొల్త్సోవ్ ఆకస్మిక మరణం తమను తీవ్ర విషాదంలో ముంచివేసిందని పేర్కొంది. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఆటగాళ్లకు ప్రగాభ సానుభూతి తెలియజేసింది. అయితే, కొల్త్సోవ్ మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కాగా బెలారస్‌కు చెందిన కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ 2002- 2010 మధ్య హాకీ ప్లేయర్‌గా రాణించాడు. 2010 వింటర్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు. 2016లో రిటర్మెంట్ ప్రకటించాడు. అనంతరం రష్యన్ క్లబ్ అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించాడు. కాగా 2021 నుంచి కొల్త్సోవ్- అరీనా సబలెంక జంటగా కనిపించడం మొదలుపెట్టారు. ప్రియుడిపై ప్రేమను చాటుకుంటూ అతడితో కలిసి ఉన్న ఫొటోలను సబలెంక తన సోషల్ మీడియా అకౌంట్లలో తరచూ షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. కొల్త్సోవ్ మరణవార్తపై మాత్రం ఆమె ఇంతవరకు స్పందించలేదు. అయితే.. ఆమె అభిమానులు మాత్రం.. ‘‘హృదయం ముక్కలైంది.. ధైర్యంగా ఉండు సబలెంక’’ అని అండగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by 𝗔𝗥𝗬𝗡𝗔 𝗦𝗔𝗕𝗔𝗟𝗘𝗡𝗞𝗔 🐯🎾❤️ (@sabalenka_aryna) ఇక బెలారస్ టెన్నిస్ స్టార్ అయిన సబలెంక రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మహిళల సింగిల్స్‌లో విజేతగా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. తద్వారా.. 31,50,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంది 25 ఏళ్ల సబలెంక. ప్రస్తుతం వరల్డ్ నంబర్ టూ సీడ్‌గా ఉన్న సబలెంక.. ఈ వారంలో మియామీ ఓపెన్ ఆడాల్సి ఉంది. -
సబలెంకాకు షాక్
కాలిఫోర్నీయా: ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్, బెలారస్ స్టార్ సబలెంకాకు ఊహించని పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంకా 3–6, 6–3, 2–6తో ప్రపంచ 23వ ర్యాంకర్ ఎమ్మా నవారో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
Tennis Tigress: అవమానించిన చోటే అదరగొట్టి.. ‘నేను ఆడ పులిని’!
నాలుగేళ్ల క్రితం.. బెలారస్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం సాగింది. తీవ్ర నిరసనలు, పోరాటాలు జరిగాయి. సహజంగానే ప్రభుత్వం వాటిని అణచివేసేందుకు ప్రయత్నించింది. ఆ దేశంలోని ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించకుండా తటస్థంగా ఉండేందుకే ప్రయత్నించారు. కానీ 22 ఏళ్ల ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి మాత్రం గట్టిగా తన గళాన్ని వినిపించింది. దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ ల్యుకాన్షెకో వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. మరో రెండేళ్ల తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రష్యాపై తీవ్ర విమర్శలు కురుస్తున్న సమయంలో బెలారస్ మాత్రం యుద్ధంలో రష్యాకు మద్దతు పలికింది. ఆ సమయంలోనూ ఆ ప్లేయర్ తమ ప్రభుత్వాన్ని, దేశాధ్యక్షుడిని తీవ్రంగా విమర్శించింది. ‘అమాయకులపై దాడులు చేసే యుద్ధాన్ని నేను సమర్థించను. అందుకే మా ప్రభుత్వాన్ని కూడా సమర్థించను’ అంటూ బహిరంగ ప్రకటన చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ మహిళా క్రీడాకారిణి తన కెరీర్‌ను పణంగా పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత దశకు వేగంగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి పనులు తనను ఇబ్బంది పెడతాయని తెలిసినా తాను నమ్మినదాని గురించి గట్టిగా మాట్లాడింది. ఆమె పేరే.. అరీనా సబలెంకా. ఈ బెలారస్‌కు టెన్నిస్ స్టార్ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించడం, వరల్డ్ నంబర్‌వన్ కావడం మాత్రమే కాదు.. ఆటతో పాటు తనకో ప్రత్యేక వ్యక్తిత్వం ఉందనీ నిరూపించింది. ‘నేను ఆడ పులిని’.. కెరీర్ ఆరంభంలో సబలెంకా తన గురించి తాను చెప్పుకున్న మాట. అప్పటికి ఆమె పెద్ద ప్లేయర్ కూడా రాదు. ధైర్యసాహసాలు, చివరివరకూ పోరాడే తత్వం వల్ల తనను తాను అలా భావించుకుంటానని చెబుతుంది. ఆమె చేతిపై ‘పులి’ టాటూ ఉంటుంది. ఆ టాటూను చూసినప్పుడల్లా స్ఫూర్తి పొందుతానని అంటుంది. టెన్నిస్ కోర్టులో సబలెంకా దూకుడైన ఆటే అందుకు నిదర్శనం. పెద్ద సంఖ్యలో విన్నర్స్ ద్వారానే పాయింట్లు రాబట్టడం ఆమె శైలి. ఆరడుగుల ఎత్తు.. పదునైన సర్వీస్.. సబలెంకా అదనపు బలాలు. అవమానించిన చోటే అదరగొట్టి.. 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్... సబలెంకా తొలి రౌండ్ మ్యాచ్. అప్పటికి ఆమె అనామక క్రీడాకారిణి మాత్రమే. అంతకు ముందు ఏడాది ఇదే టోర్నీలో క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. ఈసారి కాస్త ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో 66వ స్థానంలో ఉంది. అయితే అటు వైపున్న ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ యాష్లీ బార్టీ. చాలా మంది పాతతరం ప్లేయర్ల మాదిరే సబలెంకా కూడా కోర్టులో షాట్ ఆడేటప్పుడు గట్టిగా అరుస్తుంది. ఏ స్థాయికి చేరినా చిన్నప్పటి నుంచి సాధనతో పాటు వచ్చిన ఈ అలవాటును మార్చుకోవడం అంత సులువు కాదు. ఈ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. సబలెంకా దూకుడైన ఆటతోపాటు అరుపులు కూడా జోరుగా వినిపించాయి. ఫలితంగా తొలి సెట్ ఆమె సొంతం. దాంతో బార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అరుపులు కొంతవరకు ఓకే గానీ మరీ శ్రుతి మించిపోయాయని ఫిర్యాదు చేసింది. అయితే బార్టీని మించి ఆస్ట్రేలియా అభిమానులు చేసిన అతి సబలెంకాను బాగా ఇబ్బంది పెట్టింది. పూర్తిగా నిండిన గ్యాలరీల్లో అంతా బార్టీ అభిమానులే ఉన్నారు. వారంతా సబలెంకాను గేలి చేయడం మొదలుపెట్టారు. సబలెంకా ప్రతి షాట్‌కూ వారు పెట్టిన అల్లరి వల్ల ఆమె ఏకాగ్రత చెదిరింది. దాంతో తర్వాతి సెట్లలో ఓడి మ్యాచ్‌లో పరాజయంపాలైంది. దీనిని సబలెంకా మరచిపోలేదు. అదే వేదికపై తానేంటో నిరూపించుకుంటానని ఈ ‘ఆడ పులి’ ప్రతిజ్ఞ పూనింది. అనుకున్నట్టుగానే తన పట్టుదలను చూపించింది! అరుపులను ఆపలేదు కానీ ఆటలో మాత్రం అద్భుతంగా దూసుకుపోయింది. ఐదేళ్ల తర్వాత 2023లో అదే రాడ్ లేవర్ ఎరీనాలో సబలెంకా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకుంది. సంవత్సరం తర్వాతా దానిని నిలబెట్టుకొని అదే మెల్బోర్న్ ఫ్యాన్స్ ద్వారా సగర్వంగా జేజేలు అందుకుంది. సీనియర్‌గానే సత్తా చాటుతూ.. చాలామంది వర్ధమాన టెన్నిస్ స్టార్లతో పోలిస్తే సబలెంకా ప్రస్థానం కాస్త భిన్నం. దాదాపు ప్లేయర్లందరూ జూనియర్ స్థాయిలో చిన్న చిన్న టోర్నీలు ఆడుతూ ఒక్కో మెట్టే ఎక్కుతూ ముందుకు వెళతారు. అయితే ఆమె మాత్రం జూనియర్ టోర్నీల్లో ఆడే వయసు, అర్హత ఉన్నా వాటికి దూరంగా ఉంది. గెలిచినా, ఓడినా ప్రొఫెషనల్ సర్క్యూట్లో సీనియర్ స్థాయిలో పోటీ పడటమే మేలు చేస్తుందన్న కోచ్ మాటను పాటిస్తూ సర్క్యూట్లో పోరాడింది. సబలెంకా తన కెరీర్లో ఒక్క జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కూడా పాల్గొనకపోవడం విశేషం. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ఐటీఎఫ్ విమెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీల్లో ఆడటం మొదలుపెట్టింది. తొలి రెండేళ్లలో ఐదు టోర్నీలూ సొంతగడ్డ బెలారస్‌లోనే ఆడింది. టైటిల్స్ దక్కకపోయినా ఆమె ఆట మెరుగుపడుతూ వచ్చింది. 2015 ముగిసే సరికి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 548వ స్థానంలో ఉన్న సబలెంకా.. 2017లో తన తొలి పెద్ద టోర్నీ (ముంబై ఓపెన్) విజయానంతరం 78వ ర్యాంక్‌తో ఆ ఏడాదిని ముగించింది. ఆ తొలి మూడేళ్లను మినహాయిస్తే ఆ తర్వాత అమిత వేగంతో సబలెంకా కెరీర్ దూసుకుపోయింది. అప్పటి వరకు అనామకురాలిగానే ఉన్నా.. 2018 ఆరంభంలో 11వ ర్యాంక్‌కు చేరి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్–10లో తన స్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. డబుల్ గ్రాండ్‌స్లామ్.. 2016 యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో సబలెంకా ఓడింది. తర్వాతి ఆరేళ్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో కలిపి 22 సార్లు బరిలోకి దిగినా ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. గరిష్ఠంగా మూడుసార్లు సెమీఫైనల్‌తోనే ఆమె సరిపెట్టుకుంది. అయితే 2023లో సబలెంకా కెరీర్ సూపర్‌గా నిలిచింది. అప్పటికి సింగిల్స్‌లో నాలుగు ప్రధాన డబ్ల్యూటీఏ టైటిల్స్ విజయాలతో ఫేవరెట్లలో ఒకరిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగి.. చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు సింగిల్స్, డబుల్స్‌లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాలుగో ప్లేయర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ ఆమె దరి చేరింది. ఆపై శిఖరానికి చేరేందుకు సబలెంకాకు ఎక్కువ సమయం పట్టలేదు. మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్‌లలో సెమీస్ చేరిన ఆమె యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన కారణంగా ఇదే టోర్నీ ముగిసే సరికి అధికారికంగా సబలెంకా వరల్డ్ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. ఫలితంగా సింగిల్స్, డబుల్స్‌లలో ఏదో ఒక దశలో అగ్రస్థానంలో నిలిచిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో ఆమె చేరింది. కొత్త ఏడాది వచ్చేసరికి ఆమె ఆట మరింత పదునెక్కింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఏడు మ్యాచ్‌లలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజయఢంకా మోగించింది. రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకొని చిరునవ్వులు చిందించింది. దేశం పేరు లేకుండానే.. తన దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా గళమెత్తిన సబలెంకా ఒక క్రీడాకారిణిగా కూడా అదే తరహాలో స్పందించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ బహిరంగ లేఖ రాసింది. బాధితులైన ఉక్రెయిన్ దేశస్థులకు మద్దతునిస్తున్నానంటూ ఆ దేశపు జాతీయ పతాకంలోని రంగుల బ్యాండ్లను మైదానంలో ధరించింది. తన దేశం అనవసరంగా యుద్ధపిపాసి జాబితాలో చేరడంపై బాధను వ్యక్తం చేసింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఆమె బెలారస్ ప్లేయర్ కావడమే. యుద్ధ నేపథ్యంలో రష్యా, బెలారస్ దేశపు ప్లేయర్లపై వేర్వేరు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు నిషేధం విధించాయి. ఈ జాబితాలో విమెన్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) కూడా ఉంది. తర్వాత.. యుద్ధంతో ప్లేయర్లకు సంబంధం లేదని భావించి వారికి ఆడే అవకాశాన్నిచ్చాయి. కానీ తమ దేశం పేరును వాడకుండా.. ఏ దేశానికీ ప్రాతినిధ్యం వహించకుండా.. తటస్థులుగా బరిలోకి దిగాలనే నియమంతో! దాంతో చాంపియన్‌గా నిలిచిన తన దేశం పేరును, జెండాను సగర్వంగా ప్రదర్శించుకునే పరిస్థితి సబలెంకాకు లేకపోయింది. ఇటీవలి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అదే కొనసాగడంతో.. ఇప్పటికీ డబ్ల్యూటీఏ వెబ్సైట్లో ఆమె పేరు పక్కన దేశం పేరు లేదు. 26 ఏళ్ల సబలెంకా తాజా ఫామ్‌ను బట్టి ఈ ప్రతికూలతలన్నింటినీ దాటుకుని మున్ముందు మరిన్ని ఘన విజయాలు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
సబలెంకా... మళ్లీ చాంపియన్
మెల్బోర్న్: బెలారస్ టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా రెండో ఏడాదీ మహిళల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ సబలెంకా 76 నిమిషాల్లో 6–3, 6–2తో చైనాకు చెందిన 12వ సీడ్ జెంగ్ కిన్వెన్పై గెలిచింది. విజేత సబలెంకాకు 31,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు), రన్నరప్ జెంగ్ కిన్‌వెన్‌కు 17,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసెట్లో రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకకు ఈ సెట్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో సెట్లోనూ రెండు బ్రేక్ పాయింట్లను సాధించిన 25 ఏళ్ల బెలారస్ స్టార్ ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లను సంధించి, 14 విన్నర్లు కొట్టింది. 14 అనవసర తప్పిదాలు చేసింది. ఒక్కసారి కూడా డబుల్‌ఫాల్ట్ చేయకుండా జాగ్రత్తగా ఆడింది. జెంగ్ 6 ఏస్‌లతో రాణించినప్పటికీ 6 డబుల్ ఫాల్ట్‌లు, 16 అనసవర తప్పిదాలతో టైటిల్‌కు దూరమైంది. గత 13 నెలల్లో ప్రతీ టోర్నీలోనూ మెరుగవుతున్న సబలెంకా జోరు ముందు ఏమాత్రం నిలువలేకపోయింది. గత సీజన్లో ఆరంభ గ్రాండ్‌స్లామ్ గెలిచిన బెలారస్ అమ్మాయి ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మధ్యలో ఫ్రెంచ్, వింబుల్డన్ ఓపెన్లలోనూ సెమీఫైనల్ వరకు పోరాడింది. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలోనే ఓడి ఇంటిదారి పట్టిన 21 ఏళ్ల జెంగ్ కిన్వెన్ ఇప్పుడు ఆమె జోరుకు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. తద్వారా మళ్లీ ఈ ఏడాదీ కొత్త సీజన్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అజరెంకా (2012, 2013) తర్వాత వరుస టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా ఘనతకెక్కింది. 2000 తర్వాత సెట్ కోల్పోకుండా ఇక్కడ విజేతగా నిలిచిన ఐదో క్రీడాకారిణిగా సబలెంకా నిలిచింది. -
జొకోవిచ్ జోరుగా...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సిన్నెర్ (ఇటలీ), మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక (బెలారస్), నాలుగో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) క్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్ అతి సులువైన విజయంతో ముందంజ వేశాడు. పది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అయిన జొకో 6–0, 6–0, 6–3తో అడ్రియన్ మనారినొ (ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. ఏకంగా 17 ఏస్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన సెర్బియన్ దిగ్గజం 31 విన్నర్లతో అలవోకగా మ్యాచ్‌ని చేతుల్లోకి తెచ్చుకున్నాడు. తొలి రెండు సెట్లలో అయితే ఫ్రాన్స్ ఆటగాడిని ఖాతా తెరువకుండా చేశాడు. ప్రత్యర్థి సర్వి స్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. కేవలం గంటా 44 నిమిషాల్లోనే వరుస సెట్లలో ప్రత్యర్థి ఆట కట్టించాడు. తాజా ఫలితంతో గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో 58 సార్లు క్వార్టర్స్ ఫైనల్ చేరిన ఆటగాడిగా స్విట్టర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన సెర్బియన్ సూపర్‌స్టార్ నిలిచాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లోనే 14 సార్లు క్వార్టర్స్ చేరిన జొకోవిచ్ 10 సార్లు ముందంజ వేసి టైటిల్ గెలువగలిగాడు. సిట్సిపాస్ అవుట్ నిరుటి రన్నరప్, ఏడో సీడ్ స్టెఫనొస్ సిట్సిపాస్ (గ్రీస్)కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గత మూడేళ్లలో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అతనికి ఇదే నిరాశాజనక ప్రదర్శన. ఆదివారం జరిగిన పోరులో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ 6–7 (3/7), 7–5, 3–6, 3–6తో అమెరికాకు చెందిన 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ చేతిలో కంగుతిన్నాడు. ఈ విజయంతో అమెరికా ఆటగాడు తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్‌లో నాలుగో రౌండ్ అడ్డంకిని దాటి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు స్థానిక ప్లేయర్ నుంచి అసాధారణ పోటీ ఎదురైంది. సుదీర్ఘంగా 4 గంటల 14 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో రుబ్లెవ్ 6–4, 6–7 (5/7), 6–7 (4/7), 6–3, 6–0తో పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా)పై చెమటోడ్చి నెగ్గాడు. దీంతో స్థానిక ఆటగాడు వరుసగా మూడో ఏడాదీ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టాడు. నాలుగో సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 7–5, 6–3తో గత సీజన్ సెమీఫైనలిస్ట్, 15వ సీడ్ కరెన్ కచనొవ్ (రష్యా)కు షాకిచ్చాడు. కొకొ గాఫ్ తొలిసారి... మహిళల సింగిల్స్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్, నాలుగో సీడ్ అమెరికన్ స్టార్ కొకొ గాఫ్ తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. నాలుగేళ్లుగా బరిలోకి దిగుతున్న ఆమెకు రెండు సార్లు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. కానీ ఈ సారి ఆమె 6–1, 6–2తో మగ్దలెన ఫ్రెచ్ (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. కేవలం గంట 3 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. రెండో సీడ్ అరిన సబలెంక (బెలారస్) 6–3, 6–2తో అమండ అనిసిమొవ (అమెరికా)పై గెలుపొందగా, 9వ సీడ్ క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 4–6, 6–3, 6–2తో మిర అండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది. -
సబలెంకా జోరు
మెల్బోర్న్: టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంకా విశ్వరూపం ప్రదర్శించింది. ప్రపంచ 33వ ర్యాంకర్, 28వ సీడ్ లెసియా సురెంకో (ఉక్రెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 6–0, 6–0తో ఘనవిజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేవలం 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తన ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని సబలెంకా 16 విన్నర్స్ కొట్టి ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేయడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సినెర్ (ఇటలీ), ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–2, 6–4తో జాన్ మిల్మన్–ఎడ్వర్డ్ వింటర్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–విక్టర్ కార్నియా (రొమేనియా) జంట 6–3, 6–4తో అర్నాల్డీ–పెలెగ్రినో (ఇటలీ) జోడీపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది. -
వరల్డ్ నంబర్ వన్‌కు షాక్
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్)కు రెండో లీగ్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మెక్సికోలోని కాన్కున్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగూలా 6–4, 6–3తో సబలెంకాను ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెగూలా ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు సబలెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సబలెంకా, రిబాకినా (కజకిస్తాన్) మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌కు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. -
వరల్డ్ నంబర్ వన్ సబలెంకా శుభారంభం
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో గత ఏడాది రన్నరప్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి లీగ్ మ్యాచ్‌లో సబలెంకా 6–0, 6–1తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో లీగ్ మ్యాచ్‌లో జెస్సికా పెగూలా (అమెరికా) 7–5, 6–2తో రిబాకినా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. టైటిల్ విజేతగా 19 ఏళ్ల కోకో గాఫ్
యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన సెకెండ్ సీడ్ అరీనా సబలెంకాను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గాఫ్ కైవసం చేసుకుంది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 2-6, 6-3, 6-2 తేడాతో 19 ఏళ్ల కోకో గాఫ్ ఓడించింది. తొలి సెట్లో కోకో గాఫ్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ తర్వాతి రెండు సెట్లలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక చాంపియన్‌గా నిలిచిన గాఫ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. సెరెనా విలిమమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గౌఫ్ నిలిచింది. చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా! -
సబలెంకా vs కోకో గాఫ్
కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అందుకోవాలనే లక్ష్యంతో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్ కోకో గాఫ్ 6–4, 7–5తో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై... సబలెంకా 0–6, 7–6 (7/1), 7–6 (10/5)తో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలుపొందారు. భారత కాలమానం ప్రకారం నేడు అర్ధరాత్రి దాటాక గం. 1:30 నుంచి ఫైనల్ జరుగుతుంది. ముకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల కోకో గాఫ్ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ కీస్‌తో 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో ఆమె 4–5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. తొమ్మిదో గేమ్‌లో కీస్ తన సర్విస్‌ను నిలబెట్టుకొని ఉంటే విజయం అందుకునేది. కానీ కీస్ సర్విస్‌ను సబలెంకా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడింది. ఈసారీ తేరుకొని స్కోరును 4–4తో సమం చేసింది. చివరకు టైబ్రేక్‌లోనూ ఆధిపత్యం కనబరిచి విజయాన్ని అందుకుంది. -
బోపన్న జోడి ఓటమి.. ఫైనల్లో జబర్, వొండ్రుసోవా
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఆన్స్ జబర్ (ట్యునీషియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఆరో ర్యాంకర్ జబర్ 6–7 (5/7), 6–4, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్)పై నెగ్గగా... వొండ్రుసోవా 6–3, 6–3తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించింది. ఫైనల్ శనివారం జరుగుతుంది. జబర్‌తో 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా ఏకంగా 45 అనవసర తప్పిదాలు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించిన స్వితోలినా సెమీఫైనల్లో మాత్రం తడబడింది. ఒక్కఏస్ కూడా కొట్టలేకపోయిన స్వితోలినా నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు గెలిచింది. బోపన్న జోడీ ఓటమి పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 5–7, 4–6తో టాప్ సీడ్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ని్రష్కమించిన బోపన్న జోడీకి లక్షా 50 వేల పౌండ్లు (రూ. కోటీ 61 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); మెద్వెదెవ్ (రష్యా)తో అల్కరాజ్ (స్పెయిన్) తలపడతారు. ఈ మ్యాచ్‌లను సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: #KylianMbappe: ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్' జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి