Bajrang Punia
-
స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..
భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినందుకు పునియాను నాలుగేళ్లపాటు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది. నాడా యాంటీ డోపింగ్ నిబంధనలలోని ఆర్టికల్ 10.3.1ని ఉల్లంఘించిన కారణంగా పూనియాపై వేటు పడింది.అసలేం జరిగిందంటే?ఈ ఏడాది మార్చి 10న జాతీయ జట్టుకు ఎంపిక కోసం జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ పునియా తన యూరిన్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇదే నేరానికి సంబంధించి నాడా ఈ ఏడాది ఏప్రిల్ 23న బజరంగ్ పునియాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ (UWW) కూడా బజరంగ్‌పై నిషేధం విధించింది.ఈ క్రమంలో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది.అందుకు పూనియా స్పందించలేదు. అయితే నాడా మే 7లోపు వివరణ ఇవ్వాలని మళ్లీనోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో ఈ ఏడాది మేలో నాడా అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.అయితే నాడా నోటిసులకు స్పందించని బజరంగ్ పూనియా.. నాడా యాంటీ డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ (ADDP)కు మాత్రం తన వివరణ ఇచ్చాడు. పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో మే 31న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. కాగా ఈ ఏడాది జూన్ 23న మరోసారి నాడా బజరంగ్ పునియాకు నోటీసులు ఇచ్చింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొంది. ఈసారి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలకు బజ్రంగ్ జులై 11న వ్రాతపూర్వకంగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత సెప్టెంబరు 20, అక్టోబరు 4న భజరంగ్ వివాదంపై ఏడీడీపీ ప్యానల్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో అతడు డోపింగ్ నిబంధలు ఉల్లంఘించినట్లు ఏడీడీపీ గుర్తించింది. ఈ క్రమంలోనే అతడిపై నాడా నాలుగేళ్ల పాటు నిషేదం విధించింది. -
ఆమె నిజాయితీని అమ్ముకుంది: మండిపడ్డ బబిత
ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌పై మాజీ రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫొగట్ మండిపడ్డారు. తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం.. సాక్షి తన నిజాయితీని కూడా పూర్తిగా అమ్మేసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా 2016లో రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించారు.హర్యానాకు చెందిన సాక్షి ఇటీవలే తన ఆత్మకథ ‘విట్నెస్’ను మార్కెట్లో విడుదల చేశారు. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు భారత స్టార్ రెజ్లర్ల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పలువురు రెజ్లర్లు ఢిల్లీ వేదికగా ఉద్యమం నడిపిన విషయం తెలిసిందే.వినేశ్తో సాక్షి మాలిక్స్వార్థంగా ఆలోచించారుఇందులో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ గళాన్ని గట్టిగా వినిపించారు. బబితా ఫొగట్ సైతం రెజ్లర్ల నిరసనకు తన మద్దతు ప్రకటించారు. అయితే, ఈ ఉద్యమ సమయంలో ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కావాలని వినేశ్ ఫొగట్, బజరంగ్ కోరడం వల్ల తమకు చెడ్డపేరు వచ్చిందని సాక్షి తన పుస్తకంలో పేర్కొన్నారు.బబిత నటనకు కారణం అదేఎవరో ఉద్దేశపూర్వకంగానే వినేశ్, బజరంగ్లను రెచ్చగొట్టి ఇలా అత్యాశకు పోయేలా.. స్వార్థం నింపి ఉంటారని సాక్షి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. బబిత ఫొగట్ తమ ఉద్యమానికి మద్దతు తెలపడంలో కూడా స్వార్థమే ఉందని ఆరోపించారు.తాము బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడితే.. బబిత మాత్రం రిజ్భూషణ్ స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే.. తమ శ్రేయోభిలాషి తరహాలో బబిత ప్రవర్తించిందని సాక్షి మాలిక్ విమర్శించారు.నీ బాధ నాకు అర్థమవుతుందిలేఈ నేపథ్యంలో సాక్షి ఆరోపణలపై బబితా ఫొగట్ ఘాటుగా స్పందించారు. ‘‘నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. దాని ద్వారానే నువ్వు ప్రకాశించాలి. అంతేగానీ.. ఇతరులను నిందించడం ద్వారా ఇంకెన్నాళ్లు నువ్వు ప్రకాశించగలవు? కొందరికి అసెంబ్లీ సీట్లు వచ్చాయి.కొందరేమో పదవులు పొందారు. కానీ.. నువ్వు మాత్రం ఏదీ పొందలేకపోయావు కదా! నీ బాధ నాకు అర్థమవుతుందిలే!.. ఆమె తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం తన నిజాయితీని కూడా అమ్ముకుంది’’ అని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు బబిత.వినేశ్ స్పందన ఇదేఅంతకు ముందు వినేశ్ ఫొగట్ సైతం సాక్షి మాలిక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మాది స్వార్థమా? ఇలా ఎందుకు అన్నారో ఆమెనే అడగండి. తోటి అక్కాచెల్లెళ్ల కోసం పోరాడితే దానిని స్వార్థమే అంటారంటే.. అవును ఈ విషయంలో మేము స్వార్థపరులమే. దేశం కోసం ఒలింపిక్ పతకం తేవడం స్వార్థమే అయితే.. అంతకంటే గొప్ప స్వార్థం మరొకటి ఏది ఉంటుంది?నేను, సాక్షి, బజరంగ్ బతికి ఉన్నంతకాలం మా ఉద్యమం సజీవంగానే ఉంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని అవాంతరాలు వస్తాయి. అయినా.. సరే మేము గట్టిగా పోరాడతాం’’ అని పేర్కొన్నారు. కాగా బబిత, వినేశ్ కజిన్స్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. బజరంగ్.. బబిత సొంత చెల్లెలు సంగీత భర్త.రాజకీయాల్లో ఫొగట్ కుటుంబంఇదిలా ఉంటే.. బబిత బీజేపీలో చేరగా.. వినేశ్ ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి జులానా ఎమ్మెల్యే అయ్యారు. బజరంగ్ కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్.అయితే, సాక్షి వ్యాఖ్యలపై ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు’ -
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే?
భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ ఆస్తుల విలువ వెల్లడైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసిన సందర్భంగా తన దగ్గర ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను ఆమె వెల్లడించింది. కాగా ఒలింపిక్ పతకం గెలవాలన్న వినేశ్ ఫొగట్ కల ప్యారిస్‌లో చెదిరిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టులో జరిగిన విశ్వక్రీడల్లో మహిళల యాభై కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆమె.. స్వర్ణ పతక పోరులో తలపడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.నిరాశతో వెనుదిరిగినిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా వినేశ్ పోటీలో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించిన వినేశ్‌కు అక్కడా నిరాశే మిగిలింది. నిబంధనల ప్రకారం ఒక్క గ్రాము అదనపు బరువు ఉన్నా పోటీకి అనుమతించరని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా.. ఫైనల్ వరకు తన ప్రయాణం నిబంధనల ప్రకారమే సాగింది కాబట్టి కనీసం సంయుక్త రజతం ఇవ్వాలన్నా అభ్యర్థనను తిరస్కరించింది.కుస్తీకి స్వస్తిఈ పరిణామాల నేపథ్యంలో కలత చెందిన వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మళ్లీ రెజ్లర్‌గా తిరిగి వస్తానని సంకేతాలు ఇచ్చినా.. రాజకీయరంగ ప్రవేశం చేయడం ద్వారా తానిక ఆటకు పూర్తిగా దూరమైనట్లు వినేశ్ చెప్పకనే చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవలే హస్తం పార్టీ కండువా కప్పుకొంది.రాజకీయ నాయకురాలిగా మారిన వినేశ్అంతేకాదు.. జింద్‌లోని జులనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తి వివరాలను పేర్కొంది. ఆ వివరాల ప్రకారం... ‘వినేశ్ ఫొగట్ పేరిట మూడు కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సీ 60(ధర దాదాపు రూ. 35 లక్షలు), హుందాయ్ క్రెటా (రూ. 12 లక్షలు), టయోటా ఇన్నోవా(రూ. 17 లక్షలు) వినేశ్ వద్ద ఉన్నాయి.ఆస్తి ఎన్ని కోట్లంటే?వీటిలో టయోటా కొనుగోలు చేసేందుకు రూ. 13 లక్షలు లోన్ తీసుకున్న వినేశ్.. ప్రస్తుతం దశల వారీగా చెల్లిస్తోంది. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 2 కోట్ల మేర(సోనిపట్‌లోని ప్లాట్ విలువ) ఉంటుందని ఆమె పేర్కొంది. 2023-24 ఏడాదికి గానూ తాను రూ. 13,85,000 ఆదాయం పొందినట్లు వినేశ్ తెలిపింది. తన చేతిలో ప్రస్తుతం రూ. 1.95 వేల నగదు ఉన్నట్లు వెల్లడించింది’. కాగా రెజ్లర్‌గా ఎదిగిన క్రమంలోనే 30 ఏళ్ల వినేశ్ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.నా కల సంగీత నెరవేరుస్తుందివినేశ్ ఫొగట్ ఇప్పుడే రాజకీయాల్లో చేరడం తనకు ఇష్టం లేదన్న ఆమె పెదనాన్న, కోచ్ మహవీర్ ఫొగట్.. తన కుమార్తె సంగీతను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తానని అన్నారు. ‘‘వినేశ్ వచ్చే విశ్వ క్రీడల్లో పాల్గొంటుందని భావించాను. కానీ తను రాజకీయాల్లో చేరింది. అందుకే సంగీత ఫొగట్‌ను 2028 ఒలింపిక్స్‌కు సిద్ధం చేయాలని నిశ్చయించుకున్నా.దేశానికి తనే పతకం తీసుకువస్తుంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న కారణంగా సంగీత ఈ ఏడాది జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఈసారి మాత్రం అలా జరగదు’’ అని మహవీర్ ఫొగట్ పేర్కొన్నారు. కాగా నాటి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జరిగిన ఉద్యమంలో వినేశ్, సంగీత, సంగీత భర్త బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిఇదిలా ఉంటే.. వినేశ్తో కలిసి సంగీత ఫొగట్ భర్త బజరంగ్ కూడా కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వీరిద్దరు స్పోర్ట్స్ కోటాలో తాము పొందిన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. కాగా వినేశ్ ఫొగట్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా రెజ్లరే. అతడు రైల్వేలో పనిచేస్తున్నాడు.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
రెజ్లర్ల నిరసన వెనక కాంగ్రెస్ కుట్ర: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్‌తో కలిసి తనకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర బయటపడిందని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ అన్నారు. శుక్రవారం వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడారు.‘‘ రెజ్లర్లు నాకు వ్యతిరేకంగా 2023 జనవరి 18న ఆందోళన ప్రారంభించారు. ఆ రోజే నేను అసలు విషయం చెప్పాను. ఈ నిరసన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. హార్యానా మాజీ సీఎం భూపేందర్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్ హుడా, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారని చెప్పా. నేను చెప్పింది నేడు నిజమైంది. రెజ్లర్లు నిరసన వల్ల హర్యానా మహిళలు అవమానం ఎదుర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు, నిరసన తెలిపిన రెజ్లర్లు బాధ్యత వహించాలి. కాంగ్రెస్ నేతలు మహిళా రెజ్లర్ల గౌరవాన్ని దెబ్బతీశారు. కాంగ్రెస్ స్క్రిప్ట్ ప్రకారమే నాపై రెజ్లర్ల నిరసన జరిగింది’’ అని అన్నారు.అదే విధంగా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజరటంపై స్పందిస్తూ.. ఆమె ఒకే రోజు రెండు వేర్వేరు విభాగాల్లో పాల్గొని నిబంధనలు ఉల్లంఘించారు. అందుకే తుది పోరులో ఆమె అనార్హతకు గురయ్యేలా దేవుడే శిక్ష విధించాడని అన్నారు. -
కాంగ్రెస్‌లోకి వినేశ్, బజరంగ్: సాక్షి మాలిక్ వ్యాఖ్యలు వైరల్
భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ నాయకులుగా తమ ప్రయాణం మొదలుపెట్టనున్నారు. హర్యానాకు చెందిన వీరిరువురు శుక్రవారం హస్తం గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ స్పందించింది.వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేయడం వారి వ్యక్తిగత నిర్ణయమని.. తాను మాత్రం మహిళా రెజ్లర్ల తరఫున పోరాడేందుకు అంకితమవుతానని స్పష్టం చేసింది. తనకూ వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని.. అయితే, బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఉద్దేశం తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది.ఢిల్లీలో నిద్రాహారాలు మాని నిరసనకాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి హోదాలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు బాధితులకు మద్దతుగా ఢిల్లీలో నిరసనకు దిగారు. నెలలపాటు పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం చేశారు.అయితే, ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం వీరి ఉద్యమంపై స్పందించలేదు. దీంతో పతకాలు, ప్రభుత్వ పురస్కారాలు వెనక్కి ఇచ్చేందుకు రెజ్లర్లు సిద్ధపడిన తరుణంలో ఎట్టకేలకు రెజ్లింగ్ సమాఖ్యకకు ఎన్నికలు నిర్వహించారు. బ్రిజ్‌భూషణ్ పదవి నుంచి దిగిపోయినప్పటికీ అతడి అనుచరుడు సంజయ్ గద్దెనెక్కాడు.ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. వినేశ్, బజరంగ్ సైతం సంజయ్ ఎన్నికపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, వీరిద్దరు రెజ్లర్లుగా కొనసాగుతూనే ఉద్యమానికి అండగా ఉండగా.. సాక్షి మాత్రం బ్రిజ్‌భూషణ్ విషయంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేంతవరకు తన పోరాటం ఆగదని ప్రకటించింది.త్యాగాలకు సిద్ధపడాలిఈ నేపథ్యంలో వినేశ్, బజరంగ్ రాజకీయాల్లో చేరడంపై సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘అది వారి వ్యక్తిగత నిర్ణయం. నాకు తెలిసినంత వరకు ఒక లక్ష్యంతో పోరాడే వారు త్యాగాలకు సిద్ధపడాలి. నేను అదే చేస్తున్నా. మహిళా రెజ్లర్లకు మద్దతుగా మేము సాగించిన పోరాటంపై విమర్శలు వచ్చేలా, వక్రభాష్యాలు ఆపాదించేందుకు ఆస్కారమిచ్చేలా నేను ప్రవర్తించాలనుకోవడం లేదు.నిస్వార్థ పోరాటం ఆగదువారికి అండగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ఆలోచలన్నీ రెజ్లింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నాకు కూడా రాజకీయ పార్టీల ఆహ్వానాలు అందాయి. కానీ నేను ఉద్యమ బాటనే ఎంచుకున్నాను. బాధితులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే, వారి ప్రయోజనాల కోసమే నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను.మహిళా రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టల నుంచి విముక్తి లభించేదాకా నా పోరాటం ఆగదు. మా పోరాటం నిస్వార్థమైనది.. అది కొనసాగుతూనే ఉంటుంది’’ అని సాక్షి మాలిక్ తన మనసులోని అభిప్రాయాలను వెల్లడించింది.సాక్షి మాలిక్ సాధించిన ఘనతలు ఇవీకామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలుఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలురియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం -
కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా
సాక్షి, ఢిల్లీ: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. పార్టీ సీనియర్ నేతల మధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. ‘మా పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఆ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఆ పోరాటంలో కూడా విజయం సాధిస్తాం. మేము తీసుకున్న నిర్ణయంతో దేశ సేవకు కట్టుబడి ఉన్నాం. మా అక్కాచెల్లెళ్లకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీ కోసం ఎవరూ లేకున్నా నేను ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే హామీ ఇస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | After joining the Congress party, Vinesh Phogat says, "The fight is continuing, it hasn't ended yet. It's in Court. We will win that fight as well... With the new platform that we are getting today, we will work for the service of the nation. The way we played our game… pic.twitter.com/WRKn5Aufv2— ANI (@ANI) September 6, 2024 భజరంగ్ పూనియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. వినేష్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన రోజు దేశంలో అందరూ సంతోషించారు. మరుసటి రోజు అందరూ బాధపడ్డారు. మేము కేవలం రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. మహిళల కోసం గొంతు వినిపించేందుకు ముందుకు వస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Delhi | On joining Congress, Bajrang Punia says, "...What BJP IT Cell is saying today that we just wanted to do politics...We had written to all women BJP MPs to stand with us but they still didn't come. We are paying to raise the voices of women but now we know that BJP… pic.twitter.com/FGViVeGJLY— ANI (@ANI) September 6, 2024 ఇక, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కూడా కలిశారు. దీంతో, హర్యానా రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాగా, వీరు హస్తం పార్టీలో చేరడంతో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇందుకోసమే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించలేదని సమాచారం. మరోవైపు.. ఈ పరిణామాల మధ్య వినేష్ ఫోగట్, పూనియా ఇద్దరూ రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. #WATCH | Delhi | Bajrang Punia and Vinesh Phogat join the Congress party in the presence of party general secretary KC Venugopal, party leader Pawan Khera, Haryana Congress chief Udai Bhan and AICC in-charge of Haryana, Deepak Babaria. pic.twitter.com/LLpAG09Bw5— ANI (@ANI) September 6, 2024 ఇదిలా ఉండగా.. అక్టోబర్ ఐదో తేదీన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఆప్‌తో పొత్తు అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం ఇంకా రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తోంది. కానీ, ఆప్ మాత్రం 10 స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, గందరగోళ పరిస్థితి నెలకొంది. Vinesh Phogat and Bajrang Punia meet Congress national president Mallikarjun Kharge, in Delhi. Party's general secretary KC Venugopal also present.(Pics: Congress) pic.twitter.com/uLwZLa0ftk— ANI (@ANI) September 6, 2024 -
Haryana Assembly Elections 2024: ఎన్నికల బరిలో వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున హరియాణా శాసనసభ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి ఆమె పోటీచేసే అవకాశముందని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మరో ప్రముఖ మల్లయోధుడు భజరంగ్ పునియా సైతం బాద్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశముంది. ఈ ఇద్దరు రెజ్లర్లు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. దీంతో హస్తం పారీ్టలో వీరిద్దరి చేరిక ఖాయమైందని వార్తలొచ్చాయి. రాహుల్‌తో వినేశ్, పునియాలు దిగిన ఫోటోను కాంగ్రెస్ తన అధికారిక ఖాతా ’ఎక్స్’లో పోస్ట్ చేసిన అనంతరం వీరి పోటీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని గురు లేదా శుక్రవారం జరగబోయే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖరారుచేస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పోటీపై గురువారం నాటికి స్పష్టత వస్తుందని హరియాణా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపక్ బాబరియా మంగళవారం పేర్కొనడం తెల్సిందే. -
కాంగ్రెస్‌లోకి వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.. హర్యానా ఎన్నికల్లో పోటీ!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు హీటెక్కాయి. అభ్యర్థలు ఎంపిక, ప్రచారాలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్‌తో సహా ప్రాంతీయ పార్టీలు వేగం పెంచాయి. అధికారమే అవధిగా వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.భారత స్టారల్ రెజర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనేత, లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇరువురు హస్తం కండువా కప్పుకున్నారు. వినేశ్, బజరంగ్ వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికట్లో పోటీ చేయనున్నారు. అయితే వినేశ్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ జననాయక్ జనతా పార్టీకి చెందిన అమర్జీత్ ధండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పునియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు.కాగా గతేడాది భారత రెజ్లింగ్ సమాక్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల అనంతరం బ్రిజ్ భూషన్‌కు బీజేపీ కైసర్‌గంజ్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కుమారుడు కరణ్ సింగ్‌కు కేటాయించింది. కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
రూ. 15 పెట్టి పతకం కొనుక్కోవచ్చు కానీ..
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ను ఉద్దేశించి ఆమె బంధువు, రెజ్లర్ బజరంగ్ పునియా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ఒలింపిక్ చేజారినా.. వినేశ్ పేరుప్రతిష్టలకు వచ్చిన నష్టమేమీ లేదని.. ఇప్పటికే అందరి హృదయాల్లో చాంపియన్‌గా ఆమె స్థానం దక్కించుకుందని పేర్కొన్నాడు. పతకాన్ని మాత్రమే కోరుకునే వారు పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అంటూ వినేశ్‌ను విమర్శిస్తున్న వాళ్లకు చురకలు అంటించాడు.ఈ మేరకు.. ‘‘ఈ అంధకారంలో నీ పతకాన్ని ఎవరో మాయం చేశారు. అయినా సరే.. నువ్వొక వజ్రంలా మెరిసిపోతున్నావు. ఈరోజు ప్రపంచమంతా నిన్ను చూస్తూ ఉంది. వరల్డ్ చాంపియన్. వినేశ్ ఫొగట్.. నువ్వు మన దేశపు కోహినూర్వి.వినేశ్ ఫొగట్ అంటే వినేశ్ ఫొగట్ మాత్రమే. హిందుస్థాన్ రుస్తం-ఇ-హింద్ నువ్వు. ఎవరైతే పతకాలు కావాలని కోరుకుంటున్నారో వారు రూ. 15 చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు’’ అని బజరంగ్ పునియా ఎక్స్ వేదికగా వినేశ్ ఫొగట్ మెడల్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.విశ్వ క్రీడల్లో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడ్డ ఈ హర్యానా సివంగి.. పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) బుధవారం తమ తీర్పును వెలువరించింది. ఇక భారత ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.కాగా మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, జపాన్‌కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన వినేశ్.. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్పై విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి.. యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను 5-0తో మట్టికరిపించింది. ఫలితంగా ఒలింపిక్స్ ఫైనల్ చేరిన భారత తొలి రెజ్లర్‌గా రికార్డు నమోదు చేసింది.అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు అనూహ్య రీతిలో వినేశ్ ఫొగట్‌పై వేటు పడింది. నిర్ణీత 50 కిలోల కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య. ఈ నేపథ్యంలో తన అనర్హత, సెమీస్ వరకు చేరిన కారణంగా సంయుక్త రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అయితే పలుమార్లు తీర్పును వాయిదా వేసిన స్పోర్ట్స్ కోర్టు వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వినేశ్‌కు అభిమానులు అండగా నిలుస్తుండగా.. కొంతమంది మాత్రం బరువు పెరగటంలో తప్పంతా ఆమెదే అన్నట్లుగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బజరంగ్ పునియా వినేశ్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వినేశ్ ఫొగట్ వారి తరఫున ఢిల్లీలో ముందుండి పోరాటం చేయగా.. బజరంగ్ సహా సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆమెకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్‌ను వ్యతిరేకించేవారు.. ఆటపై కాకుండా క్రీడేతర విషయాలపై దృష్టి పెట్టిందని.. అందుకే ఈ ఫలితమని ఆమెపై విద్వేష విషం చిమ్ముతున్నారు. -
Vinesh Phogat: తన రాతను తానే మార్చుకుని.. సివంగిలా దూకి!
Vinesh Phogat: ‘ఈ అమ్మాయిని పోలీసు దెబ్బలతో అణచివేశారు... ఈ అమ్మాయిని తన దేశంలోనే రోడ్లపై ఈడ్చుకెళ్లారు... కానీ ఇదే అమ్మాయి ఇప్పుడు ప్రపంచాన్ని గెలుస్తోంది... పోరాటంలో ఎక్కడా తగ్గని మా వినేశ్ సివంగిలాంటిది. ఆమె విజయాలు చూస్తుంటే ఆనందిస్తున్నామో, కన్నీళ్లు వస్తున్నాయో కూడా తెలియడం లేదు.ఆమె ఆడుతున్న తీరు చూస్తే వినేశ్ ఒక్కతే కాదు... దేశంలోని ప్రతీ మహిళ పోరాడుతున్నట్లుగా ఉంది’... భారత మాజీ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మంగళవారం వినేశ్ ఫొగాట్ గురించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇది.నిజం... వినేశ్ సాధించిన ఘనత ఇప్పుడు ఒలింపిక్ పతకం మాత్రమే కాదు, అంతకుమించి దానికి విలువ ఉంది. ఆటలో కాకుండా మ్యాట్ బయట ఆమె ఎదుర్కొన్న అవమానం, బాధలు, కన్నీళ్లు ఈ పతకం వెనక ఉన్నాయి. ఏడాదిన్నర ముందు ఆమె ఈ పతకం గెలిచి ఉంటే ఒక ప్లేయర్‌గానే ఆమె గొప్పతనం కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులను దాటి సాధించిన ఈ గెలుపు అసాధారణం.ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. పోలీసు దెబ్బలు, అరెస్ట్, బహిరంగంగా అవమానాలు, చంపేస్తామనే బెదిరింపులు, అవార్డులను వెనక్కి ఇచ్చే పరిస్థితులు రావడం, గెలిచిన పతకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావడం... ఇలా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వినేశ్ వేదన అనుభవించింది. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే, సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోమని కోరడం వల్లే ఇదంతా జరిగింది.ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్ తన కెరీర్‌ను పణంగా పెట్టింది. రిటైర్మెంట్కు చేరువైంది కాబట్టే ఇలా చేస్తోందంటూ వినిపించిన వ్యాఖ్యానాలను ఆ తర్వాత బలంగా తిప్పి కొట్టింది. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయం నుంచి కోలుకొని మరీ పోరాడింది. ఆరు నెలలు ముగిసేలోపు తానేంటో నిరూపించుకుంటూ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఆడిన భారత రెజ్లర్‌గా బరిలోకి దిగి మూడో ప్రయత్నంలో తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచింది.ఈ గాయం బాధ చాలా పెద్దదికెరీర్లో ఎన్నోసార్లు గాయాలతో సహవాసం చేసి కోలుకోగానే మళ్లీ మ్యాట్‌పై సంచలనాలు సృష్టించిన వినేశ్‌పై ఢిల్లీ ఉదంతం తీవ్ర ప్రభావం చూపించింది. శరీరానికి తగిలిన గాయాలకంటే మనసుకు తగిలిన ఈ గాయం బాధ చాలా పెద్దది అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. బ్రిజ్‌భూషణ్ శరణ్‌పై పోరాటం తర్వాత మళ్లీ ఆటలోకి అడుగు పెట్టే క్రమంలో కూడా అడ్డంకులు ఎదురయ్యాయి.సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా సీనియార్టీ ద్వారా అడ్డదారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ మళ్లీ విమర్శలు. ఈ మనో వేదన వెంటాడినా వినేశ్ బేలగా మారిపోలేదు. మళ్లీ పట్టుదలతో నిలబడింది. కెరీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడిన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీలకు మారాల్సి వచ్చింది. రెజ్లింగ్‌లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. కానీ ఎక్కడైనా నెగ్గగలననే పట్టుదల తనను నడిపించగా ఈ సవాల్‌ను వినేశ్ అధిగమించింది. అప్పుడు అలా చేజారినా2016 రియోలో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన వినేశ్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా... చైనా రెజ్లర్‌తో బౌట్లో ఎడమకాలు విరిగి కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించింది. స్ట్రెచర్‌పై ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచి్చంది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో అద్భుత ఫామ్‌తో అడుగు పెట్టినా క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. దీనికి తోడు టీమ్ యూనిఫామ్ ధరించలేదని, గేమ్స్ విలేజ్ బయట ఉందని, భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఫెడరేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది.తన రాతను తానే మార్చుకొనికొన్నాళ్లకు దానిని ఎత్తివేయడంతో మళ్లీ ఆటలోకి అడుగు పెట్టినా... గత ఏడాది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయంతో దెబ్బ పడింది. ఆపై మళ్లీ శస్త్రచికిత్స, రీహాబిలిటేషన్. మళ్లీ కోలుకొని మ్యాట్‌పై అడుగు పెట్టిన వినేశ్ ఒలింపిక్ పతకం సాధించే వరకు విశ్రమించలేదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌లో ఒక స్ఫూర్తిదాయక వాక్యం రాసుకుంది. ‘ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా కే హర్ తఖ్దీర్ సే పహ్లే ఖుదా బందేసే ఖుద్ పూఛే బతా తేరీ రజా క్యా హై’ (నిన్ను నువ్వు ఎంత బలంగా మార్చుకో అంటే అదృష్టం అవసరం పడే ప్రతీ సందర్భంలో నీకు ఏం కావాలని దేవుడే స్వయంగా అడగాలి). దీనికి తగినట్లుగా ఇప్పుడు వినేశ్ తన రాతను తానే మార్చుకొని రెజ్లింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. – సాక్షి క్రీడా విభాగం -
రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..
భారత స్టార్ రెజర్, ఒలింపిక్ విజేత బజరంగ్ పునియాకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA ) మరోసారి బిగ్ షాకిచ్చింది. బజరంగ్ పూనియాపై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. బజరంగ్ పునియా డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు నాడా ఆదివారం సస్పెండ్ చేసింది. అతడికి తాజాగా జాతీయ డోప్ కంట్రోల్ ఏజెన్సీ నోటీసు అందజేసింది.అసలేం జరిగిందంటే?ఈ ఏడాది మార్చిలో సోనిపట్‌లో జరిగిన ఒలింపిక్స్ ట్రయల్స్‌లో రోహిత్ కుమార్‌పై బజరంగ్ పునియా ఓడిపోయాడు. ఆ తర్వాత బజరంగ్ పూనియాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్ అతడి నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించింది. కానీ పునియా మాత్రం యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నాడా.. ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(వాడా)కు పూనియా వ్యవహరం తెలియజేసింది.దీంతో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది. కానీ పూనియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటకి నాడా మళ్లీ మే 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో గత నెలలో అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.అయితే నాడా నోటీసులకు స్పదించని పూనియా.. నాడా క్రమశిక్షణ సంఘంకు మాత్రం తన వివరణ ఇచ్చాడు. డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని, పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో జూన్4న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. అయితే అతడు కావాలనే డోప్ టెస్టు తప్పించుకుంటున్నాడని భావించిన నాడా మరోసారి అతడిపై నిషేదం విధించింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
బజరంగ్‌పై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏడాది ముగిసేవరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్ వేదిక వద్ద బజరంగ్ డోప్ టెస్టుకు నిరాకరించడంతో జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ గత నెల 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. -
భారత టాప్ రెజ్లర్‌పై సస్పెన్షన్ వేటు
భారత టాప్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (United World Wrestling) సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు NADAచే తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన తర్వాత పునియాను UWW సస్పెండ్ చేసింది. పూనియాపై ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్ 31) సస్పెన్షన్ కొనసాగనుంది.డోప్ టెస్ట్‌కు నిరాకరించాడన్న కారణంగా 20 ఏళ్ల పూనియాను ఏప్రిల్ 23న NADA సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌పై పూనియా అప్పుడే స్పందించాడు. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని వివరణ ఇచ్చాడు. శాంపిల్ తీసుకునేందుకు నాడా అధికారులు గడువు ముగిసిన కిట్‌ను ఉపయోగిస్తుండటంతో అందుకు వివరణ మాత్రమే కోరానని తెలిపాడు.UWW సస్పెన్షన్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని పూనియా తాజాగా వివరణ ఇచ్చాడు. పూనియా స్టేట్మెంట్పై UWW సైతం స్పందించింది. పూనియాను సస్పెండ్ చేస్తున్న విషయాన్ని కారణాలతో సహా అతని ప్రొఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. ఒకవేళ పూనియాపై సస్పెన్షన్ వేటు నిజమే అయితే ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతక అవకాశాలకు గండి పడినట్లే. -
స్టార్ రెజ్లర్ బజరంగ్‌పై.. తాత్కాలిక నిషేధం!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్‌లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్‌కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్‌తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో.. -
Paris Olympics: బజరంగ్, రవి దహియాలకు షాక్
సోనెపట్ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా... కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ పూనియాలకు షాక్! పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్ 1–9తో రోహిత్ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్ కల్కాల్ గెలుపొంది ఆసియా, వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన 57 కేజీల విభాగంలో తొలి బౌట్లో రవి దహియా 13–14తో అమన్ సెహ్రావత్ చేతిలో... రెండో బౌట్లో 8–10తో ఉదిత్ చేతిలో ఓడిపోయాడు. ఇతర ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో జైదీప్ (74 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), దీపక్ నెహ్రా (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) విజేతలుగా నిలిచి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఏప్రిల్ 19 నుంచి 21 వరకు కిర్గిస్తాన్‌లో... వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ మే 9 నుంచి 12 వరకు ఇస్తాంబుల్‌లో జరుగుతాయి. -
భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై న్యాయపోరాటం చేసిన రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్లపై ఎలాంటి వివక్ష చూపరాదని పేర్కొంది. అదే విధంగా.. కక్ష్యసాధింపు చర్యలు చేపట్టకుండా అందరు రెజర్లకు సమాన అవకాశాలు కల్పించాలని డబ్ల్యూఎఫ్ఐకి యూడబ్ల్యూడబ్ల్యూ సూచించింది. సస్పెన్షన్ తొలగిపోవడంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లంతా మన జెండా కిందే పోటీపడొచ్చు. పతకం గెలిస్తే పోడియంలో మన పతాకమే రెపరెపలాడతుంది. గడువులోగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్ని నిర్వహించలేకపోవడంతో గత ఆగస్టులో సస్పెన్షన్ వేటు వేసింది. -
Rahul Gandhi: రెజ్లర్ల నిరసనలో పాల్గొని రాహుల్ కుస్తీ (ఫొటోలు)
-
‘కుస్తీ’ పట్టిన రాహుల్ గాంధీ
హర్యానా: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారుడు బజరంగ్ పూనియా, ఇతర రెజ్లింగ్ క్రీడాకారులను హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఛారా గ్రామంలొ కలుసుకున్నారు. ఆయన బుధవారం ఉదయమే.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన తెపుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపికను నిరసిస్తూ... బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును ఎనక్కి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాలో బుధవారం ఎంపీ రాహుల్ గాంధీ క్రీడాకారులతో భేటీ అయి వారికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎంపీ రాహుల్ గాంధీ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. वर्षों की जीतोड़ मेहनत, धैर्य एवं अप्रतिम अनुशासन के साथ अपने खून और पसीने से मिट्टी को सींच कर एक खिलाड़ी अपने देश के लिए मेडल लाता है। आज झज्जर के छारा गांव में भाई विरेंद्र आर्य के अखाड़े पहुंच कर ओलंपिक पदक विजेता बजरंग पूनिया समेत अन्य पहलवान भाइयों के साथ चर्चा की। सवाल… pic.twitter.com/IeGOebvRl6 — Rahul Gandhi (@RahulGandhi) December 27, 2023 ‘ఎంపీ రాహుల్ గాంధీ రెజ్లర్ల రోజువారి సాధన, కార్యకలాపాలను తెలుసుకోవడానికి మా వద్దకు వచ్చారు. కాసేపు మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు’ అని క్రీడాకారుడు బజరంగ్ పూనియా తెలిపారు. ‘రాహుల్ గాంధీ ఇక్కడ వస్తున్నట్లు మాకు ఎవరూ సమాచారం అందించలేదు. మేము రెజ్లింగ్ ప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో అకస్మత్తుగా మా వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయన ఉదయమే 6.15 గంటలకు ఇక్కడికి వచ్చారు. మాతో పాటు కాసేపు వ్యాయామం చేశారు. ఆయనకు క్రీడల పట్ల ఉన్న అనుభవాలను మాతో పంచుకున్నారు. రాహుల్ గాంధీకి క్రీడాల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది’ అని రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర ఆర్య పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు నమ్మినబంటుగా పేరున్న సంజయ్ కుమార్‌ను.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికపై నిరసన తెలుపుతూ.. తాజాగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా అర్జున, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు రోడ్డెక్కి పోరాడుతున్న క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం గమనార్హం. #WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestler Bajrang Poonia says, "He came to see our wrestling routine...He did wrestling...He came to see the day-to-day activities of a wrestler." pic.twitter.com/vh0aP921I3 — ANI (@ANI) December 27, 2023 చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -
WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యాను! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది
Sakshi Malik, Bajrang Punia Reaction On WFI Suspension: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించడాన్ని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్వాగతించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని ఆమె అన్నారు. వారి గౌరవం కంటే అవార్డు పెద్దది కాదు ఇక ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్లీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినపుడు ‘పద్మశ్రీ’ని తీసుకుంటా. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాల్ని అందరు గమనిస్తున్నారు’ అని అన్నారు. సంజయ్ సింగ్‌కు షాకిచ్చిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్ పునియా, జితేందర్ సింగ్ వంటివారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెలరోజులకు పైగా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్ అనిత షెరాన్ ప్యానెల్‌పై.. బ్రిజ్‌భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. బజరంగ్ పునియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్‌పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్ భూషణ్ జోక్యంతోనే సంజయ్ ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని.. అందుకే డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మంచో.. చెడో.. రిటైర్ అయ్యాను.. నాకేం సంబంధం లేదు ఈ నేపథ్యంలో.. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యానంటూ బ్రిజ్‌భూషణ్ సింగ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘నేను 12 ఏళ్ల పాటు సమాఖ్యకు సేవలందించాను. మంచో, చెడో ఏం చేశానో కాలమే సమాధానమిస్తుంది. ఇప్పుడైతే నేను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యాను. సమాఖ్యతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నాను. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల (లోక్‌సభ)పైనే దృష్టి పెట్టాను. డబ్ల్యూఎఫ్ఐలో ఏం జరిగినా అది కొత్త కార్యవర్గానికి చెందిన వ్యవహారమే తప్ప నాకు సంబంధించింది కాదు’’ అంటూ బ్రిజ్‌భూషణ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
నా సోదరి సాక్షిని చూసి గర్విస్తున్నా! చెప్పేదేమీ లేదన్న మంత్రి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టార్ రెజ్లర్లు. వీరికి బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా బాసటగా నిలిచాడు. తనకు లభించిన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించాడు. సాక్షిని చూసి గర్విస్తున్నా డెఫ్ ఒలింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో స్వర్ణ విజేతగా నిలిచిన వీరేందర్ ‘గుంగా పహిల్వాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భారత మానస పుత్రిక, నా సోదరి సాక్షి మలిక్ కోసం నేను నా ‘పద్మ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తా. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ... సాక్షిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను. దేశంలోని దిగ్గజ క్రీడాకారులంతా దీనిపై స్పందించాలని నేను కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీరేందర్ ట్వీట్ చేశాడు. స్పందించేందుకు నిరాకరించిన అనురాగ్ ఠాకూర్ మరోవైపు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు, తదుపరి స్టార్ రెజ్లర్ల నిరసన నిర్ణయాలపై స్పందించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లను అభినందించే కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘దీనిపై నేను ఇదివరకే చెప్పాల్సింది చెప్పా. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఠాకూర్ అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఎన్నికకు నిరసనగా కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. అంతేగాక డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ గెలవడం తమపై ప్రభావం చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలకగా.. మరో ఒలింపియన్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది? -
నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన భారత స్టార్ రెజ్లర్ల నుంచి మరో తీవ్రమైన నిర్ణయం వెలువడింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలకడం, ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం చేస్తున్నారు. ఇది భారత క్రీడాలోకానికి మచ్చగా మిగలడం ఖాయం! డబ్ల్యూఎఫ్ఐలో తిష్ట వేసుక్కూర్చున్న వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ చెరలోనే రెజ్లింగ్ సమాఖ్య కొనసాగనుండటం, ఆయన వీర విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా గెలవడంతో గురువారం రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. శుక్రవారం తాజాగా టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా భారత ప్రభుత్వం 2019లో ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేశాడు. రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి బజరంగ్ పార్లమెంట్ వైపు వెళ్తుండగా కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడి రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి తన నిరసన లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేలా చూడాలని పోలీసు అధికారుల్ని బజరంగ్ వేడుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ‘ప్రధాని మోదీకి నేను పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నా. ఈ లేఖే నా ఆవేదనగా భావించాలి’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. నిరసనగానే ఈ నిర్ణయం ఇక ఆ లేఖలో ఏముందంటే... ‘మోదీజీ మీరు బిజీగా ఉంటారని తెలుసు. అలాగే గత కొన్నాళ్లుగా మహిళా రెజ్లర్లు పడుతున్న పాట్లు, బ్రిజ్‌భూషణ్ నుంచి ఎదుర్కొంటున్న వేధింపులు మీకు తెలుసు. దీనిపై మేం రెండుసార్లు రోడెక్కి నిరసించాం. న్యాయం చేస్తామన్న ప్రభుత్వ హామీతో మా దీక్షను విరమించాం. ముందుగా అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. తాత్సారం తర్వాతే కేసు నమోదు చేశారు. మొదట్లో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది మహిళా రెజ్లర్లు స్టేట్మెంట్ ఇస్తే తదనంతరం ఈ సంఖ్య ఏడుగురికి పడిపోయింది. దీంతో అతని పలుకుబడి ఏ రకంగా శాసిస్తుందనేది అర్థమైంది. ఇప్పుడు మళ్లీ ఆయన వర్గమే రెజ్లింగ్ సమాఖ్యకు కొత్తగా ఎన్నికైంది. దీనికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని బజరంగ్ లేఖలో వివరించాడు. అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఎన్నికల విషయంలో మరోవైపు బజరంగ్ ‘పద్మశ్రీ’ని తిరిగిస్తుంటే కేంద్ర క్రీడాశాఖ తేలిగ్గా తీసుకున్నట్లుంది. వెనక్కి ఇవ్వడమనేది అతని వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. రెజ్లింగ్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని... అయినప్పటికీ బజరంగ్‌ను తన నిర్ణయం మార్చుకోవాలని కోరతామని క్రీడాశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
WFI: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ
Bajrang Punia Returns Padma Shri: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పద్మ శ్రీ అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. మహిళా రెజ్లర్లకు అవమానం జరిగిన దేశంలో తాను ఇలాంటి ‘గౌరవానికి’ అర్హుడిని కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్.. తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో.. నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉద్యమానికి యువత అండగా నిలబడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన మేర స్పందన రాలేదు. ఈ క్రమంలో విచారణ కమిటీ నియామకం జరగగా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం గురువారం (డిసెంబరు 21) ఢిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అనితా షెరాన్‌పై.. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. బ్రిజ్ భూషణ్‌కు ప్రధాన అనుచరుడిగా పేరొందిన అతడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ వంటి ఒలింపిక్ విజేతతో పాటు నిరసనలో భాగమైన వినేశ్ ఫొగాట్.. వీరికి మద్దతుగా నిలిచిన బజరంగ్ పునియా తదితరులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ మళ్లీ డబ్ల్యూఎఫ్ఐలో పెత్తనం చెలాయించడం ఖాయమంటూ సాక్షి.. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఒలింపియన్ బజరంగ్ పునియా సైతం ఓ అడుగు ముందుకు వేశాడు. సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. ‘‘ప్రియమైన ప్రధాన మంత్రి గారు.. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. మీ పనులతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయినప్పటికీ.. మీ దృష్టిని ఆకర్షించడం ద్వారా దేశంలో రెజ్లర్ల పరిస్థితి గురించి తెలియజేయడానికి నేను మీకు లేఖ రాస్తున్నాను. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిరసనలో నేను కూడా పాల్గొన్నాను. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేము ఆందోళన విరమించాం. కానీ.. ఇంతవరకు బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మూడు నెలలు గడుస్తున్నా అతడిపై ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మేము మరోసారి వీధుల్లోకి రావాలని భావిస్తున్నాం. ఏప్రిల్ నుంచి మళ్లీ నిరసనకు దిగుతాం. కనీసం అప్పుడైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే ఆశ. జనవరిలో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది కంప్లైంట్ చేశారు. అయితే, ఏప్రిల్ నాటికి వారి సంఖ్య ఏడుకు తగ్గింది. అంటే పన్నెండు మంది మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ ప్రభావితం చేశారు’’ అంటూ బజరంగ్ పునియా సంచలన విషయాలు వెల్లడించాడు. मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023 -
40 రోజులు రోడ్లపై నిద్రించాం కానీ.. సాక్షి మాలిక్ సంచలన ప్రకటన
Sakshi Malik Gets Emotional Video Viral: భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ప్రకటన చేసింది. ఆటకు తాను వీడ్కోలు పలుకనున్నట్లు తెలిపింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వంటి వ్యక్తి అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని.. అంతకంటే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అని వెల్లడించింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి బజరంగ్ పునియా, జితేందర్ వంటి పురుష రెజ్లర్లు మద్దతుగా నిలిచారు. అనితా షెరాన్‌కు తప్పని ఓటమి ఈ క్రమంలో.. అనేక పరిణామాల అనంతరం బ్రిజ్ భూషణ్ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ వేదికగా గురువారం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ వీర విధేయుడిగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్‌పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘దాదాపు నలభై రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించాం. దేశంలోని నలుమూలల నుంచి మాకు మద్దతుగా ఎంతో మంది వచ్చారు. కన్నీటి పర్యంతమైన సాక్షి ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, అతడి అనుంగు అనుచరుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు అయితే, నేను రెజ్లింగ్‌నే వదిలేస్తా’’ అంటూ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్ భూషణ్ విశ్వాసపాత్రులెవరూ డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో పాల్గొనరంటూ ప్రభుత్వం మాకిచ్చిన మాటను దురదృష్టవశాత్తూ నిలబెట్టుకోలేకపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితుడు కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వ్యక్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో భాగమైన అతడు బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై రెజ్లింగ్ సమాఖ్యలో విధివిధానాల రూపకల్పనపై అతడు కచ్చితంగా బ్రిజ్ భూషణ్ సూచనలు, సలహాలు తీసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సాక్షి మాలిక్ వంటి వాళ్లు ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో తాము ఆటను కొనసాగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Wrestler Sakshi Malik says "We slept for 40 days on the roads and a lot of people from several parts of the country came to support us. If Brij Bhushan Singh's business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling..." pic.twitter.com/j1ENTRmyUN — ANI (@ANI) December 21, 2023 -
నేరుగా ఆసియా క్రీడల్లో అడుగు.. అనూహ్య రీతిలో ఓటమి! ఎవరూ ఊహించలేరు..
Asian Games 2023: ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు అనూహ్య ఓటమి ఎదురుకాగా... అమన్ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్ మలిక్ (62 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్లలో అమన్ 11–0తో లియు మింగు (చైనా)పై, సోనమ్ 7–5తో జియా లాంగ్ (చైనా)పై, కిరణ్ 6–3తో అరియున్జర్గాల్ (మంగోలియా)పై నెగ్గారు. బజరంగ్ విఫలం సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనకుండా నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా నిరాశపరిచాడు. చైనా నుంచి అతను రిక్తహస్తాలతో స్వదేశానికి రానున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బజరంగ్ పూనియా కాంస్య పతక బౌట్లో 4 నిమిషాల 31 సెకన్లలో ఓడిపోయాడు. జపాన్ ప్లేయర్ కైకి యామగుచి 10–0తో బజరంగ్‌ను చిత్తుగా ఓడించాడు. రెండునెలల పాటు నిరసనలో రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బజరంగ్ తన సహచర రెజ్లర్లతో కలిసి దాదాపు రెండునెలలపాటు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో కొంతకాలంపాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. 2014 ఏషియాడ్‌లో బజరంగ్ 61 కేజీల్లో రజతం, 2018 ఏషియాడ్‌లో 65 కేజీల్లో స్వర్ణం నెగ్గాడు. ఎవరూ ఊహించలేరు కూడా! కాగా ఆసియా క్రీడల్లో విఫలమైన బజరంగ్‌కు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అండగా నిలిచారు. ‘‘బజరంగ్.. ఇప్పుడూ.. ఎప్పుడూ చాంపియనే! మహిళా రెజ్లర్ల పోరాటంలో అతడు అందించిన సహకారం మరువలేనిది. మాకోసం తను ఎంతగా కష్టపడ్డాడో ఎవరూ ఊహించలేరు కూడా!’’ అని వినేశ్ బజరంగ్ పునియాను ప్రశంసించారు. నేరుగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టి ఓటమిపాలైన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ మద్దతుదారులు బజరంగ్‌ను విమర్శిస్తున్న తరుణంలో.. లైంగిక వేధింపుల పోరాటంలో అతడు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ వినేశ్ ఉద్వేగానికి లోనయ్యారు.