Bangladesh premier league
-
మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్‌లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్‌కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు. "పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బీజీగా ఉండటంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది. మూడు మ్యాచ్‌లు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ విజేతగా తమీమ్ జట్టు..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)– 2024 సీజన్ ఛాంపియన్‌గా ఫార్ట్యూన్ బరిషల్ నిలిచింది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన ఫైనల్లో కొమిలియా విక్టోరియన్స్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బరిషల్ జట్టు.. తొలిసారి బీపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. కొమిలియా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బరిషల్.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బరిషల్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (30 బంతుల్లో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ (26 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మెహిది హసన్ మిరాజ్ (26 బంతుల్లో 29, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కొమిలియా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కొమిలియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ మహిదుల్ ఇస్లామ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆండ్రూ రసెల్ (14 బంతుల్లో 27, 4 సిక్సర్లు) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బరిషల్ బౌలర్లలో జేమ్స్ ఫుల్లర్ 2 వికెట్లు పడగొట్టగా.. మైర్స్,సైఫుద్దీన్, మెకాయ్ తలా వికెట్ సాధించారు. 2012 నుంచి జరుగుతున్న బీపీఎల్‌లో కొమిలియా విక్టోరియన్స్ నాలుగు సార్లు (2015, 2019, 2022, 2023)టైటిల్ విజేతగా నిలవగా.. ఢాకా గ్లాడియేటర్స్ మూడు సార్లు( 2012, 2013, 2016) ఛాంపియన్స్‌గా నిలిచింది. అదే విధంగా రంగాపూర్ రైడర్స్ (2017), రాజ్షాహి రాయల్స్ (2020)లు తలా ఒకసారి టైటిల్‌ను ముద్దాడాయి. ఇప్పుడు పదో సీజన్లో తమీమ్ ఇక్భాల్ సారథ్యంలోని ఫార్ట్యున్ బరిషల్ సరి కొత్త ఛాంపియన్స్‌గా అవతరిచింది. -
కైల్ మేయర్స్ ఆల్‌రౌండ్ షో.. మెరుపు అర్దశతకం సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చూన్ బారిషల్ ఆటగాడు కైల్ మేయర్స్ (వెస్టిండీస్) ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మెరుపు అర్దశతకం (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సహా రెండు వికెట్లు (4-0-28-2) తీసి తన జట్టును గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో రాణించిన మేయర్స్ ఆతర్వాత బ్యాటింగ్‌లో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కైల్ మేయర్స్, సైఫుద్దీన్, మెక్కాయ్ తలో 2 వికెట్లు తీసి ఛాలెంజర్స్ పతనాన్ని శాశించారు. తైజుల్ ఇస్లాం, జేమ్స్ ఫుల్లర్ చెరో వికెట్ పడగొట్టారు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ చేసిన 34 పరుగులే అత్యధికం. కెప్టెన్ షువగట (24), ట్రామ్ బ్రూస్ (17), సైకత్ అలీ (11), రొమారియో షెపర్డ్ (11), నిహాదుజ్జమాన్ (10) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లు కనీసం ఈపాటి పరుగులు కూడా సాధించలేకపోయారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. కైల్ మేయర్స్, తమీమ్ ఇక్బాల్ (52 నాటౌట్) చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఫలితంగా బారిషల్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. బారిషల్ ఇన్నింగ్స్‌లో సౌమ్య సర్కార్ (0) విఫలం కాగా.. డేవిడ్ మిల్లర్ (17) వేగంగా పరుగులు సాధించాడు. ముష్ఫికర్ రహాం (6 నాటౌట్) విన్నింగ్ రన్స్ కొట్టాడు. ఛాలెంజర్స్ బౌలర్లలో షువగట, బిలాల్ ఖాన్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. రంగ్‌పూర్ రైడర్స్, కొమిల్లా విక్టోరియన్స్ మధ్య ఇవాళ రాత్రి క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫిబ్రవరి 28న జరిగే క్వాలిఫయర్-2లో ఫార్చూన్ బారిషల్‌తో తలపడుతుంది. -
ఆండ్రీ రసెల్ ఊచకోత.. 12 బంతుల్లోనే.. 358.33 స్ట్రయిక్‌రేట్‌తో..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. రంగ్‌పూర్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 358.33 స్ట్రయిక్‌రేట్‌తో అజేయమైన 43 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకుముందు రసెల్ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. 2.5 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైడర్స్.. రసెల్, ముస్ఫిక్ హసన్ (3/18), మథ్యూ ఫోర్డ్ (2/32), తన్వీర్ ఇస్లాం (1/12) ధాటికి 19.5 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. రైడర్స్ ఇన్నింగ్స్‌లో నీషమ్ ఒక్కడే అజేయమైన అర్దసెంచరీతో (69 నాటౌట్) రాణించాడు. నీషమ్‌తో పాటు రోనీ తాలుక్దార్ (14), షకీబ్ అల్ హసన్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన విక్టోరియన్స్.. రసెల్ శివాలెత్తడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (4 వికెట్లు కోల్పోయి). విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో రసెల్‌తో పాటు లిటన్ దాస్ (43), మహిదుల్ ఇస్లాం (39) కూడా రాణించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. మొయిన్ అలీ (6 నాటౌట్) రసెల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైడర్స్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హైదర్ రోని ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
కళ్లు చెదిరే క్యాచ్.. రొమారియో షెపర్డ్ అద్భుత విన్యాసం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ ఆటగాడు, విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఖుల్నా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనాముల్ హక్ కొట్టిన షాట్‌ను షెపర్డ్ అద్భుత క్యాచ్‌గా మలిచాడు. షొహిదుల్ ఇస్లాం బౌలింగ్‌లో షెపర్డ్ రివర్స్‌లో పరిగెడుతూ బౌండరీ లైన్ సమీపంలో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. What an unbelievable catch by Romario Shepherd. 🔥pic.twitter.com/YG8MtmP4Qy — Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తంజిద్ హసన్ (116) మెరుపు సెంచరీ చేసి ఛాలెంజర్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. 58 బంతుల్లో శతక్కొట్టిన తంజిద్.. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 65 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్...షువగటా హోమ్ (3/25), బిలాల్ ఖాన్ (2/13), సలావుద్దీన్ (1/15), షొహిదుల్ ఇస్లాం (1/18), రొమారియో షెపర్డ్ (1/25), నిహాదుజ్జమాన్ (1/29) ధాటికి 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో అనాముల్ హక్ (35), షాయ్ హోప్ (31), జేసన్ హోల్డర్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
బంగ్లాదేశ్ ఓపెనర్ మెరుపు శతకం.. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ బ్యాటర్, బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ తంజిద్ హసన్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఖుల్నా టైగర్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 20) జరుగుతున్న మ్యాచ్‌లో తంజిద్ 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న తంజిద్ 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో తంజిద్ చేసిన సెంచరీ మూడవది. తంజిద్‌కు ముందు తౌహిద్ హ్రిదోయ్, విల్ జాక్స్ సెంచరీలు చేశారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టామ్ బ్రూస్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. ముహమ్మద్ వసీం (1), సైకత్ అలీ (18), రొమారియో షెపర్డ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. టైగర్స్ బౌలర్లలో వేన్ పార్నెల్, నసుమ్ అహ్మద్, జేసన్ హోల్డర్, ముకిదుల్ ఇస్లాం తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు తొలి ఓవర్ ముగిసే సరికి కేవలం రెండు పరుగులు (వికెట్ నష్టపోకుండా) మాత్రమే చేయగలిగింది. -
బెన్నీ హోవెల్ వీర బాదుడు.. లిటన్ దాస్ పోరాటం వృధా
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో సిల్హెట్ స్ట్రయికర్స్ ఆటగాడు బెన్నీ హోవెల్ (ఇంగ్లండ్) వీర బాదడు బాదాడు. కొమిల్లా విక్టోరియన్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. హోవెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హోవెల్ మినహా మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. కెన్నార్ లెవిస్ 33, జాకిర్ హసన్ 18, షాంటో 12, యాసిర్ అలీ 2, కెప్టెన్ మిథున్ 28 పరుగులు చేశారు. విక్టోరియన్స్ బౌలర్లలో సునీల్ నరైన్ పొదుపుగా (4-1-16-2) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టగా.. రషీద్ హొసేన్ 2, ముస్ఫిక్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో విక్టోరియన్స్ చివరివరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లిటన్ దాస్ (85) విక్టోరియన్స్‌ను గెలిపించేందుకు సకల ప్రయత్నాలు చేశాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (23) కూడా తనవంతు ప్రయత్నించినప్పటికీ విక్టోరియన్స్ గెలవలేకపోయింది. లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (165/6) నిలిచిపోయి, ఓటమిపాలైంది. విక్టోరియన్స్ కీలక ఆటగాళ్లు జాన్సన్ చార్లెస్ (17), మొయిన్ అలీ (0) విఫలమయ్యారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3, సమిత్ పటేల్, షఫీకుల్ ఇస్లాం, బెన్నీ హోవెల్ తలో వికెట్ పడగొట్టారు. -
చెన్నై స్టార్ బౌలర్ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సెషన్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలకు గాయమైంది. ముస్తాఫిజుర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం(ఫిబ్రవరి 19)న సిల్హెట్ స్ట్రైకర్స్‌తో కొమిల్లా తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సెషన్లో కొమిల్లా జట్టు పాల్గోంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో కొమిల్లా కెప్టెన్ లిట్టన్ దాస్ కొట్టిన ఓ బంతి.. బౌలింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ముస్తాఫిజుర్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. వెంటనే నుంచి అతడి తల నుంచి రక్తం కారింది. అక్కడే ఉన్న ఫిజియోలు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ముస్తాఫిజుర్‌ను స్థానికంగా ఉన్న ఇంపీరియల్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే ముస్తాఫిజుర్ గాయంపై కొమిల్లా విక్టోరియన్స్ టీమ్ ఫిజియో జహిదుల్ ఇస్లాం అప్డేట్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సమయంలో ఓ బంతి నేరుగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ తల ఎడమ బాగంలో బలంగా తాకింది. మేము వెంటనే స్పందించి కంప్రెషన్ బ్యాండేజ్‌తో రక్తస్రావం కాకుండా చూశాము. ఆ తర్వాత ఇంపీరియల్ ఆసుపత్రికి తరిలించి ‘సిటీ స్కాన్ చేయంచాము. అయితే అదృష్టవశాత్తూ తల పై భాగంలో మాత్రమే గాయమైంది. ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్ లేదు. అతడికి తలపై కొన్ని కుట్లు పడ్డాయి. ముస్తఫిజుర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు’ అని ప్రకటనలో జహిదుల్ ఇస్లాం పేర్కొన్నాడు. కాగా వచ్చే నెలలో బంగ్లాదేశ్ శ్రీలంక పర్యటనకు వెళ్ల నుంది. ఈ పర్యటనకు ముందే స్టార్ బౌలర్ గాయపడటం బంగ్లా జట్టును కలవరపెడుతోంది. అదే విధంగా ఐపీఎల్-2024 వేలంలో రూ. 2 కోట్లకు ముస్తాఫిజుర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ⚠️ MUSTAFIZUR RAHMAN GOT HIT BALL ON HIS HEAD During practice session of Comillael Victorians a shot from Matthew Ford, the ball hit on Mustafizur's head then start bleeding . Instantly he has taken into the hospital.#BPL2024 pic.twitter.com/sY3HaLtEc8 — bdcrictime.com (@BDCricTime) February 18, 2024 -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కైల్ మేయర్స్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా సిల్హెట్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫార్చూన్ బారిషల్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బారిషల్.. కైల్ మేయర్స్ (31 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహాం (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బారిషల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 19, అహ్మద్ షెహజాద్ 17, సౌమ్య సర్కార్ 8, మహ్మదుల్లా 12 నాటౌట్, మెహిది హసన్ మీరజ్ 15 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. షఫీకుల్ ఇస్లాం, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. బెన్నీ హోవెల్ (53), ఆరీఫుల్ హక్ (57) అర్దసెంచరీలతో రాణించినప్పటికీ లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (0), జకీర్ హసన్ (5), నజ్ముల్ షాంటో (0), ర్యాన్ బర్ల్ (3) దారుణంగా విఫలం కాగా.. ఏంజెలో పెరీరా (17), మొహమ్మద్ మిథున్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బారిషల్ బౌలర్లలో కైల్ మేయర్స్ (4-1-12-3) అద్భుత గణాంకాలతో అదరగొట్టగా.. సైఫుద్దీన్, మెక్కాయ్, కేశవ్ మహారాజ్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. మరో మ్యాచ్‌లో దురంతో ఢాకాపై చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాలెంజర్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఢాకా టీమ్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తంజిత్ హసన్ (70), షువగటా హోమ్ (3-0-12-2) ఛాలెంజర్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించారు. -
టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెట్లో తాహిర్‌కు ముందు డ్వేన్ బ్రావో (624 వికెట్లు), రషీద ఖాన్ (556), సునీల్ నరైన్ (532) 500 వికెట్ల మార్కును తాకారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్.. ఖుల్నా టైగర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తాహిర్ ఐదు వికెట్ల ఘనత సాధించి, తన జట్టును ఒంటిచేత్తో గెలిచిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (69), మెహిది హసన్ (60) అర్దసెంచరీలతో రాణించగా.. నురుల్ హసన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఖుల్నా టైగర్స్ బౌలర్లలో లూక్ వుడ్ 3, నహిద్ రాణా, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టైగర్స్.. ఇమ్రాన్ తాహిర్ (4-0-26-5), షకీబ్ అల్ హసన్ (3.2-0-30-2), మెహిది హసన్ (1/13), హసన్ మహమూద్ (1/29), జేమ్స్ నీషమ్ (1/5) ధాటికి 18.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. టైగర్స్ బౌలర్లలో అలెక్స్ హేల్స్ (60) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లు కనీసం 20 పరుగులకు మించి చేయలేకపోయారు. -
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన మొయిన్ అలీ.. హ్యాట్రిక్ సహా..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో (బీపీఎల్) కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన మొయిన్ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. ఆతర్వాత హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు (3.3-0-23-4) తీసి విక్టోరియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొయిన్‌తో పాటు సహచర ఆటగాడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సునామీ శతకంతో వీరంగం సృష్టించడంతో విక్టోరియన్స్ 73 పరుగుల తేడాతో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మొయిన్ సాధించిన హ్యాట్రిక్ ఎనిమిదవది. మొయిన్ హ్యాట్రిక్ వికెట్లతో మ్యాచ్‌కు ముగించాడు. Moeen Ali scored a fifty and took a hat-trick in the BPL match. 🤯pic.twitter.com/yIGVsgU9Lh — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2024 శతక్కొట్టిన విల్ జాక్స్.. మెరుపు అర్దశతకంతో విరుచుకుపడిన మొయిన్ అలీ తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ జాక్స్, మొయిన్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. విక్టోరియన్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లిటన్ దాస్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో మెరిశాడు. తిప్పేసిన మొయిన్, రిషద్ హొసేన్. 240 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఛాలెంజర్స్.. మొయిన్ అలీ, రిషద్ హొసేన్ (4-0-22-4) మాయాజాలం ధాటికి 166 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీసి విక్టోరియన్స్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఛాలెంజర్స్ ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ (41), సైకత్ అలీ (36), జోష్ బ్రౌన్ (36) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
ఓ పక్క రసెల్ ఊచకోత.. మరో పక్క విల్ జాక్స్ శతక్కొట్టుడు
పొట్టి ఫార్మాట్లో ఇవాళ (ఫిబ్రవరి 13) రెండు ధమాకా ఇన్నింగ్స్‌లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాయి. వీటితో పాటు మరో రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ సుడిగాలి అర్ధశతకంతో (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) రచ్చ చేయగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ మెరుపు వీరుడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించి శతక్కొట్టాడు. వీరిద్దరికి సహచరులు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మొయిన్ అలీ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో వారివారి జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రసెల్, రూథర్‌పోర్డ్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్లె కొనసాగుతున్నాయి. -
సంచలన ఆరోపణలు: షోయబ్ స్పందన.. ముందుగా అనుకున్నట్లే చేశాం
తనపై వస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ స్పందించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఫార్చ్యూన్ బరిషల్‌తో తన బంధం ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే తాను బంగ్లాదేశ్ వీడి దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. ఏకంగా మూడు నోబాల్స్ కాగా బీపీఎల్-2024 సీజన్లో బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఖుల్నా టైగర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఒకే ఓవర్లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఏకంగా మూడు నోబాల్స్ వేయడం ఇందుకు కారణం. షోయబ్ మాలిక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బరిషల్ యాజమాన్యం షోయబ్ మాలిక్ కాంట్రాక్టును రద్దు చేసిందని వార్తలు వినిపించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన షోయబ్ మాలిక్.. ‘‘ఫార్చ్యూన్ బరిషల్‌తో నా బంధం గురించి ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నా. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేను దుబాయ్‌లో ఓ మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించిన తర్వాతే బంగ్లాదేశ్‌ను వీడాను. ఫార్చ్యూన్ బరిషల్ రానున్న మ్యాచ్‌లలో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా. ఒకవేళ నా సేవలు అవసరమైతే తప్పకుండా మళ్లీ వాళ్లకు మద్దతుగా బరిలోకి దిగుతాను. క్రికెట్ ఆడటం అంటే నాకు ఇష్టం. ఆటను కొనసాగిస్తూనే ఉంటా’’ అని షోయబ్ మాలిక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. అతడు మాకోసం ఎంతో చేశాడు అదే విధంగా.. ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మిజానుర్ రహ్మాన్ సైతం ఈ విషయంపై స్పందించాడు. షోయబ్ మాలిక్‌పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలను అతడు కొట్టిపడేశాడు. ‘‘షోయబ్ మాలిక్ గొప్ప క్రికెటర్. అతడి గురించి వస్తున్న వదంతుల పట్ల నేను చింతిస్తున్నాను. మాకోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అలాంటిది అతడి గురించి మేము ఇలాంటి చెత్త ప్రచారాలు ఎలా చేస్తామనుకున్నారు’’ అని మిజానుర్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. చదవండి: Shoaib Malik: ‘ఆమెతో మూడేళ్లుగా రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా..’ Official statement ; I would like to address and dismiss the recent rumors circulating about my playing position with Fortune Barishal. I had a thorough discussion with our captain, Tamim Iqbal, and we mutually planned the way forward. I had to leave Bangladesh for a… pic.twitter.com/kmPqPt1nxv — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 26, 2024 -
షోయబ్ మాలిక్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. జట్టు నుంచి ఔట్!?
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ప్రీమీయర్ లీగ్ ఫ్రాంచైజీ ఫార్చూన్ బరిషల్ "ఫిక్సింగ్" అనుమానంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. కాగా ఇప్పటికే మాలిక్ వ్యక్తిగత కారణాలతో బీపీఎల్-2024 నుంచి స్వదేశానికి వచ్చేశాడు. అంతలోనే మాలిక్‌కు ఫార్చూన్ బరిషల్ ఈ షాకిచ్చింది. ఈ లీగ్‌లో కేవలం 3 మ్యాచ్‌ల మాత్రమే ఆడాడు. అసలేం జరిగిందంటే? జనవరి 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఫార్చ్యూన్ బరిషల్,ఖుల్నా రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన మాలిక్ ఓకే ఓవర్లో ఏకంగా మూడు నో బాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. సాధరణంగా స్నిన్నర్లు నో బాల్స్ చాలా అరుదుగా వేస్తుంటారు. అటువంటిది మాలిక్ ఏకంగా మూడు నో బాల్స్ వేయడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ మాలిక్‌పై వేటు వేసింది. కాగా ఇటీవలే మాలిక్ మూడో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులిచ్చి పాక్ నటి సనా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు. చదవండి: IND vs ENG: ఆట మర్చిపోయావా గిల్.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి? -
39/6.. ఓటమి కొరల్లో చిక్కుకున్న జట్టును గెలిపించిన బాబర్ ఆజమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి కొరల్లో చిక్కుకున్న తన జట్టును టెయిలెండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సాయంతో విజయతీరాలకు చేర్చాడు. 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న రంగ్‌పూర్ రైడర్స్‌ను బాబర్-ఒమర్జాయ్ జోడీ అజేయమైన 86 పరుగులు జోడించి 4 వికెట్ల తేడాతో గెలిపించింది. Flies into the BPL ✈️ Scores an unbeaten 50 🏏 Wins it for his team 💪 Boss it like Babar 👑 . .#BPL2024 #BPLonFanCode #BabarAzam pic.twitter.com/5kChUkZhHY — FanCode (@FanCode) January 23, 2024 బీపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్‌లో సిల్హెట్ స్ట్రయికర్స్, రంగ్‌పూర్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. రిపన్ మొండల్ (2/19), మెహిది హసన్ (2/18), మొహమ్మద్ నబీ (1/17), హసన్ మురద్ (1/29) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హోవెల్ (43), కట్టింగ్ (31), షాంటో (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఛేదనలో బాబర్ ఆజమ్ జట్టు రంగ్పైర్ రైడర్స్ కూడా తడబడింది. దుషన్ హేమంత ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో (39/6) పడింది. అయితే బాబర్.. ఒమర్జాయ్ సహకారంతో రైడర్స్‌కు అపురూప విజయాన్ని అందించాడు. మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడి 18.2 ఓవర్లలో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. రైడర్స్ జట్టులో ముగ్గురు డకౌట్లు కాగా.. రోనీ తాలుక్దార్ 6, నురుల్ హసన్ 8, షమీమ్ హొసేన్ 2 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో హేమంత 3, నగరవ, తంజిమ్ సకీబ్, నజ్ముల్ ఇస్లాం తలో వికెట పడగొట్టారు. చదవండి: ఫలితాలు పట్టించుకోం.. బాబర్ గెలిపించలేకపోయాడు: షాహిన్ ఆఫ్రిది -
పాకిస్తాన్ బ్యాటర్‌కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!?
పాకిస్తాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హరీస్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఊహించని షాకిచ్చింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గోనేందుకు ఢాకాకు వెళ్లిన హరీస్‌కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసి) ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది. దీంతో అతడు ఢాకా విమానాశ్రయం నుంచే స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. లగేజీ ఫోటోలను షేర్ చేస్తూ బ్యాక్ టూ హోమ్ అని రాసుకొచ్చాడు. అయితే పీసీబీ రూల్స్ ప్రకారం.. ఆ దేశ క్రికెటర్లు రెండు విదేశీ లీగ్‌లు ఆడేందుకు మాత్రమే అర్హులు. కానీ హ్యారీస్ ఇప్పటికే రెండు ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే మూడో లీగ్‌లో ఆడేందుకు అతడికి పీసీబీ ఎన్ఓసి జారీ చేయలేదు. కాగా బీబీఎల్‌లో చట్టోగ్రమ్ ఛాలెంజర్స్ తరఫున ఆడాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుబడుతున్నారు. ఎన్ఓసి విషయం అతడికి ముందే చెప్పి ఉంటే ఢాకా వరకు వెళ్లే వాడు కాదు కదా అంటూ మండిపడుతున్నారు. కాగా పాక్ తరపున ఇప్పటివరకు 9 టీ20లు ఆడిన మహ్మద్ హరీస్.. 126 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! Mohammad Haris had asked the Pakistan Cricket Board for a NOC and was told to go to Bangladesh for the BPL. He arranged for a flight on 17th January and was told by PCB that they will give him the NOC on 18th January. After arriving in Bangladesh, the PCB refused to give him a… pic.twitter.com/YuT70wZv7J — Saj Sadiq (@SajSadiqCricket) January 21, 2024 -
డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగిన కోచ్..ఇది నిజంగా సిగ్గు చేటు! వీడియో వైరల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 ఆది నుంచే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఖలీద్ మహమూద్.. మ్యాచ్ జరగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. అసలేం జరిగిందంటే? ఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం(ఫిబ్రవరి10) ఖుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిషల్ ఢాకా వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ జరగుతుండగా ఖలీద్ మహమూద్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇదింతా కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బాధ్యయుత కోచ్ స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించిన ఖలీద్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "యూరప్‌లో ఆటగాళ్లు ఇలా చేసినందుకు ఆటగాళ్లను సస్పెండ్ చేసారు. అటువంటిది కోచ్ స్థానంలో ఉన్న ఖలీద్ మహ్మద్ డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ ఎలా తాగాడో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs AUS: నా ముఖం కాదురా అయ్యా.. ముందు రిప్లేలు చూపించు! రోహిత్ సీరియస్ @BCBtigers In Europe players are getting suspended for vaping. I don’t understand how Khaled Mahmud Sujon smoked in the dressing room. It was absolutely disgusting to watch. — Azharul (@Azharulislam07) February 11, 2023 -
పాక్ క్రికెటర్ ఓవరాక్షన్.. లావుగా ఉన్న సహచర సభ్యుడిని ఎగతాళి చేస్తూ..!
Naseem Shah-Azam Khan: పాకస్తాన్ క్రికెటర్, ఆ జట్టు యువ పేసర్ నసీం షా తమ దేశ క్రికెటర్లకు మాత్రమే సాధ్యమయ్యే ఓవరాక్షన్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. నసీం.. లాపుగా ఉన్న సహచర సభ్యుడు, పాక్ దిగ్గజ వికెట్‌కీపర్ మొయిన్ ఖాన్ తనయుడు ఆజం ఖాన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాడీ షేమింగ్ చేస్తూ ఎగతాళి చేయడమే కాకుండా, అతన్ని ఢీకొట్టాడు. తమ దేశ క్రికెటర్‌తో పరాయి గడ్డపై అభ్యంతరకరంగా ప్రవర్తించి, తనతో పాటు తన దేశ పరువునూ బజారుకీడ్చాడు. Naseem Shah teasing Azam Khan at the Bangladesh Premier League #BPL2023 #Cricket pic.twitter.com/IsJgBLcE0i — Saj Sadiq (@SajSadiqCricket) January 31, 2023 ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలో ఎదురెదురు పడిన సందర్భంలో ఆజం శరీరాన్ని నసీం అవహేళన చేశాడు. ఆజం బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తుండగా నసీం ఎదురెళ్లి అతని శరీర తత్వాన్ని వెక్కిరిస్తూ, అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్ చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆజంను ఢీకొట్టి, అతని శరీరంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవేవి పట్టించుకోని ఆజం ఖాన్, నసీంను నెట్టేసి క్రీజ్వైపు వెళ్లాడు. వెళ్తున్నప్పుడు కూడా నసీం ఓవరాక్షన్ అలాగే కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవగా, నెటిజన్లు ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా నసీం షాను వాయించేస్తున్నారు. తమ వాడితో ఇలా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది, పరాయి దేశస్తుడితో ఇలా ప్రవర్తించి ఉంటే నీకు కచ్చితంగా దేహశుద్ధి అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశస్తుడైనా బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నసీంకు చురకలంటిస్తున్నారు. ఇంకొందరైతే.. షేమ్, షేమ్ నసీం షా.. షేమ్, షేమ్ పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆజం ఖాన్, కొమిల్లా విక్టోరియన్స్ తరఫున నసీం షా బరిలోకి దిగారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఘన విజయం సాధించింది. విండీస్ వీరుడు జాన్సన్ చార్లెస్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి కొమిల్లా విక్టోరియన్స్ చారిత్రక విజయాన్ని అందించాడు. -
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్‌ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్‌ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు.. విధ్వంసం సృష్టించిన హోప్, తమీమ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఈ లీగ్‌లో భారత్ మినహాయించి ప్రపంచ దేశాల క్రికెటర్లు పాల్గొంటూ, సత్తా చాటుతున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి. ఇవాళ (జనవరి 31) కొమిల్లా విక్టోరియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యా ఛేదనకు దిగిన కొమిల్లా విక్టోరియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (29 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్ముదులుపుతున్నారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ స్కోర్ 11 ఓవర్లకే 107కి చేరింది. ఈ జట్టు గెలవాంటే 54 బంతుల్లో మరో 104 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
నోబాల్ విషయంలో పాక్ క్రికెటర్ నానా యాగీ
పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ నోబాల్ విషయమై అంపైర్‌తో నానా యాగీ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో భాగంగా ఇది చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా రంగ్‌పూర్ రైడర్స్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ రోబుల్ హక్ వేశాడు. వరుసగా రెండు బంతులు బౌన్సర్లు వేయడంతో.. ఫీల్డ్ అంపైర్ రెండో బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నో బాల్ ఇవ్వడంపై రంగ్‌పూర్ రైడర్స్ కెప్టెన్ నురుల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన హారిస్ రవూఫ్ జోక్యం చేసుకొని అసలెలా నోబాల్ ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బౌన్సర్లు వేస్తే వార్నింగ్‌తో సరిపెట్టాలని రూల్ ఉన్నా.. పట్టించుకోకుండా నోబాల్ ఇవ్వడమేంటన్నాడు. అయితే అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో నురుల్ హసన్, హారిస్ రవూఫ్‌లు కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రంగ్‌పూర్ రైడర్స్ సిల్హెట్ స్ట్రైకర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రైకర్స్.. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో తంజిమ్ హసన్ సకీబ్(41 పరుగులు), కెప్టెన్ మొర్తజా(21 పరుగులు).. ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో హసన్ మహ్మూద్, అజ్మతుల్లాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోనీ తాలుక్దార్ 41 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. Haris Rauf In fight With Umpire over a no Ball. #BPL #Bpl2023 pic.twitter.com/oLLme81d7f — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 27, 2023 చదవండి: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? -
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత
Bangladesh Premier League 2023: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. రంగ్‌పూర్ రైడర్స్‌తో ఇవాళ (జనవరి 19) జరుగుతున్న మ్యాచ్‌లో ఫార్చూన్ బారిషల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతని జతగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (43 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో ఫార్చూన్ బారిషల్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది బీపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక టీమ్ టోటల్‌గా రికార్డుల్లోకెక్కింది. 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జత కట్టిన ఇఫ్తికార్-షకీబ్ ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో అజేయమైన 192 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇఫ్తికార్-షకీబ్ జోడీ ఇన్నింగ్స్ ఆఖరి 3 ఓవర్లలో (18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 24, 20వ ఓవర్లో 27) నమ్మశక్యం కాని రీతిలో 73 పరుగులు జోడించి బీపీఎల్‌లో చరిత్ర సృష్టించింది. ఇఫ్తికార్-షకీబ్ జోడీ.. ప్రత్యర్ధి స్పిన్నర్లను ఊచకోత కోసింది. కాగా, బీపీఎల్ ప్రస్తుత సీజన్లో షకీబ్ సారధ్యంలోని ఫార్చూన్ బారిషల్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. టాప్ ప్లేస్‌లో సిల్హెట్ స్ట్రయికర్స్ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు) టీమ్ ఉంది. కొమిల్లా విక్టోరియన్స్, రంగ్‌పూర్ రైడర్స్, చట్టోగ్రామ్ ఛాలెంజర్స్, ఖుల్నా టైగర్స్, ఢాకా డామినేటర్స్ వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఈ లీగ్‌లో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు కొందరు భారత ఆటగాళ్లు (బీసీసీఐతో సంబంధం లేని వాళ్లు) కూడా పాల్గొంటున్నారు. -
వైడ్ ఇవ్వలేదని అంపైర్ మీదకు వెళ్లిన షకీబ్.. ఇదేమి బుద్దిరా బాబు!
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షకీబ్ దురుసు ప్రవర్తను ప్రదర్శించాడు. వైడ్‌బాల్ విషయంలో అంపైర్‌తో వాగ్వాదానికి షకీబ్ దిగాడు. బీపీఎల్-2023లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? బీపీఎల్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌కు షకీబ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఫార్చ్యూన్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో రెహమాన్ రాజా వేసిన ఒక షార్ట్ బాల్ షకీబ్ పై నుంచి వెళ్లింది. అయితే అంపైర్ దాన్ని తొలి బౌన్సర్‌గా సిగ్నిల్ ఇచ్చాడు. షకీబ్ మాత్రం అది ఎలా బౌన్సర్ అవుతుందని లెగ్ అంపైర్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతడు లెగ్ అంపైర్‌పై గట్టిగా అరుస్తూ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సరైన వివరణ ఇవ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ క్రీజులోకి వెళ్లిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకు ముందు 2021లో ఢాకా ప్రీమియర్‌లో కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు. అప్పటిల్లో అది తీవ్ర వివాదాస్పదకావడంతో షకీబ్ క్షమాపణలు కూడా తెలిపాడు. Shakib Al Hasan - the man the myth the umpire’s nightmare pic.twitter.com/wKQnb3wNUH — adi ✨🇧🇩 (@notanotheradi) January 7, 2023 చదవండి: Rishabh Pant: బీసీసీఐ మంచి మనసు.. పంత్ క్రికెట్ ఆడకపోయినా ఫుల్ సాలరీ! -
బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్.. తొలి భారత క్రికెటర్‌గా!
2012 అండర్ 19 ప్రపంచకప్‌ను ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని యువ భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం ఉన్ముక్త్ చంద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత క్రికెట్లో మరో విరాట్ కోహ్లి అవుతాడని అంతా భావించారు. అయితే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు రాకపోవడంతో 2021లో భారత్‌ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఇక భారత్‌ను వీడి వెళ్లిన చంద్ విదేశీ లీగ్‌ల్లో సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు సాధించిన చంద్.. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్లో చటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ఉన్ముక్త్ చంద్ ఆడనున్నాడు. తద్వారా బీపీఎల్‌లో డ్రాఫ్ట్ అయిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో కూడా చంద్ తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఏ ప్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ -
IPL 2022: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్
Sunil Narine: వెస్టిండీస్ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ భీకరమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. లీగ్‌లో భాగంగా బుధవారం చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ (57 పరుగులు) ఆడిన నరైన్.. శుక్రవారం ఫార్చూన్ బారిషల్‌తో జరిగిన ఫైనల్లోనూ అదే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కొమిల్లా విక్టోరియన్స్ జట్టు బీపీఎల్ 2022 ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు స్కోర్ చేశాడు. దొరికిన బంతిని దొరికనట్లు బాధడమే పనిగా పెట్టుకున్న అతను.. లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. చదవండి: 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ.. 6 సిక్స్‌లు.. 5 ఫోర్లు.. యూవీ రికార్డు జస్ట్ మిస్! ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన కొమిల్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఫార్చూన్ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు నరైన్ భీకరమైన ఫామ్ ఉండటంతో కేకేఆర్ ఫ్రాంచైజీ సంబురాల్లో మునిగి తేలుతుంది. ఈ ఏడాది మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 5️⃣ 1️⃣ runs in just 2️⃣ 1️⃣ balls! We love to see it! 😍 The ball has been bouncing off #SunilNarine’s bat and landing in the stands. 📺 Watch the action LIVE from the final of #BBPL2022 on #Fancode 👉 https://t.co/kIiCjX0tXl#BPLonFanCode pic.twitter.com/oBCCUU4aWS — FanCode (@FanCode) February 18, 2022 చదవండి: IPL 2022: రూ.100 కోట్లతో సునీల్ నరైన్ సరికొత్త రికార్డు