Boy
-
AP: దారుణం.. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి
సాక్షి,ఎన్టీఆర్జిల్లా: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో సోమవారం(నవంబర్ 11) దారుణం జరిగింది. రెండేళ్ల బాలుడు బాలతోటి ప్రేమ్ కుమార్ తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.దాడి చేసిన తర్వాత కుక్కలు బాలుడిని పొలాల్లోకి లాక్కెళ్లాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో పెనుగంచిప్రోలు గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: రంగరాయలో ర్యాగింగ్ కలకలం -
మూడేళ్ళ పాపను ఎత్తుకెళ్లిన యువకుడు
-
ఆరు నెలల బాలుడికి కిడ్నీలో రాళ్లు
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా చిన్నపిల్లలకు అవయవాలు చాలా చిన్నగా ఉంటాయి. అందులోనూ ఆరు నెలల పిల్లలంటే అత్యంత సున్నితంగా ఉంటాయి. ఆ వయసులో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాంటిది రెండు కిడ్నీల్లోనూ రెండేసి రాళ్లు, అవీ పెద్ద పరిమాణంలో ఏర్పడటంతో ఓ బాబుకు మూత్రవిసర్జన ఆగిపోయి, పొట్ట ఉబ్బిపోయింది. ఆ బాబుకు ఎండోస్కోపిక్ విధానంలో మొత్తం నాలుగు రాళ్లను తొలగించి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఊరట కలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆస్పత్రి యూరాలజిస్టు డాక్టర్ వై.మనోజ్‌కుమార్ తెలిపారు. ‘నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన ఆరు నెలల బాబు దక్షిత్‌కు మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బిపోవడంతో ఈ నెల 5వ తేదీన కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతనికి అన్ని పరీక్షలు నిర్వహించగా, రెండు కిడ్నీల్లో 11 మి.మీ, 9 మి.మీ, 9 మి.మీ, 7 మి.మీ. పరిమాణంలో నాలుగు రాళ్లు ఉన్నట్లు తేలింది. ముందుగా స్టెంట్లు అమర్చి కిడ్నీలను సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఎండోస్కోపిక్ విధానంలో కుట్లు లేకుండా లేజర్ ద్వారా ఇతర అవయవాలకు ఎలాంటి హాని జరగకుండా కిడ్నీలో రాళ్లను తొలగించాం. అతను కోలుకోవడంతో 10వ తేదీన డిశ్చార్జ్ చేశాం. ఇంత చిన్న వయసులో రెండు కిడ్నీల్లో రెండేసి రాళ్లు ఏర్పడటం ఏపీలో ఇదే తొలిసారి. లక్ష మందిలో కేవలం పది మందికే ఇలాంటి సమస్య తలెత్తుతుంది.’ అని డాక్టర్ వివరించారు. -
కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో సోమవారం కిడ్నాపైన బాలుడు లాసిక్ (12)... మంగళవారం సాయంత్రం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పుటేరులో శవమై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వరగలిలోని కాతారి రమేష్, సంధ్య దంపతుల కుమారుడు లాసిక్ వాకాడులోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లిదండ్రులు నిర్వహించే దుకాణంలో ఉండగా, అక్కడకు వచ్చిన చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు గిరిజన వ్యక్తులు బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, బంధువులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఉప్పుటేరు (కండలేరు క్రీక్)కు ఆవలి వైపున ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం తిరుమలమ్మ పాళెం సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు మంగళవారం సాయంత్రం అక్కడి వారు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోట్లపై అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి తీసుకుని వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, అదుపులో ఉన్న గిరిజనుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, మత్తు మందు ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని.. బాలుడు స్పృహలోకి వచ్చి గొడవ చేయడంతో ఉప్పు నీటిలో పడేసి ఉంటారని తెలుస్తోంది. -
13 ఏళ్ల బాలునిపై తోడేలు దాడి
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం ఆగడం లేదు. అటవీశాఖ అధికారులు ఐదవ తోడేలును పట్టుకున్న తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన ఆరవ తోడేలు ఆహారం కోసం నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న 13 ఏళ్ల అర్మాన్ అలీపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు గాయపడ్డాడు. బాధిత బాలునికి బహ్రాయిచ్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.అటవీ శాఖ అన్ని రకాలుగా తోడేళ్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. మహసీ ప్రాంతంలో తోడేళ్ల దాడుల కారణంగా సుమారు 110 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మహసీ, శివపూర్‌లోని 110 గ్రామాల్లో అటవీశాఖ, పోలీసులు, పీఎస్సీ సిబ్బంది, జిల్లా ఉద్యోగులు వంతుల వారీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ తోడేళ్ల దాడులు ఆగడం లేదు.బహ్రాయిచ్‌లోని మహసీ తహసీల్‌లో గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. తోడేళ్లు ఇప్పటివరకు 60 మందిని గాయపరిచాయి. ఆరు తోడేళ్లు దాడులకు దిగుతున్నాయని గుర్తించామని, వాటిలో ఐదు తోడేళ్లను పట్టుకున్నామని అటవీ శాఖ పేర్కొంది. ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలి ఉందని, దానిని పట్టుకోవడానికి అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే అటవీ శాఖ సమాధానానికి గ్రామస్తులు సంతృప్తి చెందడం లేదు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు? -
బాలుడి దారుణ హత్య
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కోసమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. బాల్కొండకు చెందిన బండి నరేందర్.. నచ్చు రాకేశ్ మేనమామ అయిన నాగాపూర్‌కు చెందిన దశరథ్ మేకలను మేతకు తీసుకుని వెళ్తాడు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులకు పరిచయమయ్యాడు. గణపతులను చూసి వద్దామని చెప్పి ఈ నెల 11న బండి నరేందర్ చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడు నచ్చు రాకేశ్‌ను.. బాల్కొండకు తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నరేందర్‌ను ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాక పోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా శనివారం ఉదయం బాల్కొండలోని ఖిల్లా ప్రాంతంలో బాలుడి మృతదేహం ఉందని చిట్టాపూర్ గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోగా.. ఎడమ కంటి భాగంపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఖిల్లాలోని ఓ గుహ ముందు హత్య చేసి మృతదేహాన్ని కొద్దిదూరంలో పారేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. బాలుడిని నరేందర్ హత్య చేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్‌తో వెళ్లేముందు బాలుడు తన అన్న మణికంఠకు ఫోను చేసి చెప్పాడని తెలిపారు. పోలీసులు నరేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అనుమానితుడు నేరాన్ని అంగీకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాçప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని నరేందర్‌ను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య జరిగిన మర్నాడు కూడా నరేందర్ తన భార్య మొబైల్‌తో ఫోన్ చేసి.. రాకేశ్ ఖానాపూర్ వద్ద ఉన్నాడని అబద్ధం చెప్పాడని వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం నరేందర్.. మొదట బాలుడి అన్న మణికంఠకు ఫోన్‌చేసి ఖిల్లా వద్దకు రమ్మన్నాడని, మణికంఠ వెళ్లకపోవడంతో రాకేశ్‌ను తీసుకెళ్లినట్లు వివరించారు. న్యాయం చేస్తామని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి హామీ ఇవ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు. హతుని తండ్రి రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
శభాష్ హృతిక్
సాక్షి, హైదరాబాద్: అంచనాలకు మించి రాణించి... తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించి... హైదరాబాద్ కుర్రాడు హృతిక్ కటకం ఆసియా అండర్–14 టెన్నిస్ చాంపియన్íÙప్ బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. కంబోడియాలో జరిగిన ఈ టోర్నీలో హృతిక్ టైటిల్ గెలిచే క్రమంలో టాప్ సీడ్, రెండో సీడ్, మూడో సీడ్ క్రీడాకారులను ఓడించడమే కాకుండా... తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఫైనల్లో హృతిక్ 6–3, 7–5తో రెండో సీడ్ డాంగ్జే కిమ్ (దక్షిణ కొరియా)ను ఓడించి టైటిల్ దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో హృతిక్ 6–0, 6–0తో యితియన్ లూ (చైనా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–1, 6–1తో మూడో సీడ్ రమ్తిన్ రఫీ»ొరుజెని (ఇరాన్)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో టాప్ సీడ్ ధర్మ పాంతారాటోర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన డేవిస్‌కప్ ప్లేయర్, లండన్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ విష్ణువర్ధన్ దిశానిర్దేశనంలో హృతిక్ ముందుకు సాగుతున్నాడు. హైదరాబాద్ హబ్సిగూడలోని ట్రినిటీ చాలెంజర్స్ టెన్నిస్ అకాడమీలో కోచ్‌లు హెన్రీ ప్రవీణ్, రామకృష్ణ వద్ద హృతిక్ శిక్షణ తీసుకుంటున్నాడు. పుణేలోని ఆర్యన్ పంప్స్‌కు చెందిన ప్రశాంత్ సుతార్ హృతిక్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఆసియా టైటిల్‌తో హృతిక్ ఈ ఏడాది డిసెంబర్లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే ప్రతిష్టాత్మక ఎడ్డీ హెర్, ఆరెంజ్ బౌల్ చాంపియన్íÙప్ పోటీలకు కూడా అర్హత సాధించాడు. -
కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!
చిన్నారులపై కుక్కలు పాశవివంగా దాడిచేసి, ప్రాణాల్ని తీసేసిన ఘటనలు మనందరి హృదయాల్ని పిండేసాయి. కారణాలేమైనప్పటికీ పిల్లలు,పెద్దలపై కుక్కల స్వైర విహారం ఉదంతాలు ఈ మధ్య కాలంలో కనిపించాయి. అలాగే రోడ్డుపై వెళుతున్నపుడు కూడా ఒక్కసారిగా మీదకు ఉరుకుతాయి. భయంకరంగా మొరుగుతూ కొద్ది దూరం వెంబడిస్తాయి కూడా. ద్విచక్రవాహనదారులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. అయితే కుక్క మనపై దాడికి ప్రయత్నించినా, గట్టిగా మొరిగినా పరిగెత్తకుండా, నిలబడి గట్టిగా అదిలిస్తే చాలా వరకు వెనక్కి తగ్గుతాయి. దాదాపు అలాంటి వీడియో ఒకటి ఎక్స్‌లో ఆకట్టుకుంటోంది.ప్రమాదం మన ముందుకొచ్చినపుడు ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అంటూ ఒక వీడియోను ది ఫిగెన్ అనే ఎక్స్ యూజర్ దీన్ని షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అనేది వివరాలు అందుబాటులో లేన్నప్పటకీ, ఈ ఫుటేజ్ ప్రకారం ఇద్దరు చిన్నారులు (పాప,బాబు) వీధిలో నడుస్తుండగా కుక్కలు ఎదురపడ్డాయి. దీంతో పక్కనున్న పాప భయంతో పారిపోయింది. తరువాత ఒంటరిగా మిగిలిన చిన్నారి మీదికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు కుక్కలు ఎగబడ్డాయి. అప్పుడా బాలుడు ధైర్యంగా నిలబడిన తీరు విశేషంగా నిలిచింది.When you're cornered, your only option is to be brave ... pic.twitter.com/uLDXhtNvcw— Figen (@TheFigen_) September 11, 2024ఆ బాలుడి గుండె ధైర్యానికి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వెంత బలవంతుడివో నీకు తెలియదు.. ధైర్యంగా ఉండటమే నీకున్న ఏకైక మార్గం అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. -
యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే
దేశంలో నకిలీ డాక్టర్ల రోజురోజుకి పెరిగిపోతున్నారు. వీరి కారణంగా అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా వాంతులు అవుతున్నాయని 15ఏళ్ల బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. ఫేక్ డాక్టర్ చికిత్స చేయడంతో వాంతులు తగ్గాయి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడికి యూట్యూబ్ చూస్తూ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. పరిస్థితి విషమించడంతో అత్యసర చికిత్స కోసం సదరు డాక్టర్.. మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలో బాలుడు చనిపోవడంతో డెడ్ బాడీని ఆస్పత్రి ఆవరణలో వదిలేసి పారిపోయాడు నకిలీ డాక్టర్. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం సరణ్ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. మా అబ్బాయికి పలు మార్లు వాంతులయ్యాయి. చికిత్స కోసం గణపతి ఆస్పత్రికి తీసుకొచ్చాం.ఆస్పత్రిలో జాయిన్ చేయించిన కొద్ది సేపటికి వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి మాత్రం బాలుడికి ఆపరేషన్ చేశారు. యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ఆపరేషన్ చేయడంతో నా కుమారుడు మరణించాడు అని బాలుడి తండ్రి చందన్ షా గుండెలవిసేలా రోదిస్తున్నారు.మేం డాక్టర్లమా.. లేదంటే మీరు డాక్టర్లా.. గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ ఓ పని మీద తండ్రిని పంపించి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నా మనువడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అనుమతి లేకుండా ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. మేం డాక్టర్లమా? మీరు డాక్టర్లా? అంటూ మండిపడ్డారు. నా మనవడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు అయినా, ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్నాం. కానీ ఆపరేషన్ జరిగిన సాయంత్రం నా మనవడి శ్వాస ఆగింది. సీపీఆర్ చేసిన నకిలీ డాక్టర్ అత్యవసర చికిత్స కోసం పాట్నాకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందడంతో నా మనవడి మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయారు. వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని’ నేను అనుకోలేదని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా విచారం వ్యక్తం చేశాడు.విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్‌గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి..
సాక్షి, హైదరాబాద్: అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి, చివరకు తన సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి ఓ బాలుడు చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని తొలుత స్థానికంగానే ఒక ఆస్పత్రిలో చేర్చి, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి, అక్కడినుంచి బాబును ఇక్కడకు తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్‌కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే తెలిపారు. “ఆ బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దాంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారు. మేం రాయ్‌పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చింది.ఇక్కడినుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచాం. మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు మందులు వాడాం. తర్వాత అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఇలా విమానంలో తీసుకురావడానికి మా పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారు. ఆ బాలుడు ఇక్కడ 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగింది, ఫిట్స్ వచ్చాయి, అన్నింటినీ తగిన మందులతో నయం చేశాం. అతడికి వచ్చిన రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివల్ల అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. అతడికి తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా వాటినీ మందులతో నయం చేశాం. ఇక్కడ చేరిన నాలుగోరోజే వెంటిలేటర్ తీసేశాం. తొమ్మిదో రోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ పరాగ్ డెకాటే చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లయినా ఉండవచ్చని, వారికి చికిత్స చేయగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు అక్కడ ఉండకపోవచ్చని చెప్పారు. డాక్టర్ ప్రభ్‌జోత్, డాక్టర్ జయంత్ కృష్ణ (పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు), డాక్టర్ పాండు (పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు), డాక్టర్ మౌనిక (పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు), డాక్టర్ ప్రతీక్ వై పాటిల్ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)లతో కూడిన బృందం ఆ బాలుడికి పూర్తి చికిత్స చేసింది. “ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి నయం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చినవాటిలో ఇది రెండో కేసు. ఇటీవలే మేము నాగ్‌పూర్ నుంచి ఎక్మో పెట్టి, 9 గంటల రోడ్డు ప్రయాణంలో హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇది ఎక్మో పెట్టి తీసుకొచ్చినవాటిలో ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం. ఒక రకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన యూనిట్‌ను రోడ్డుమీదే సృష్టించడం అవుతుంది. ఇలాంటి అత్యంత సంక్టిష్టమైన కేసులకు కూడా సమర్థవంతంగా చికిత్స చేసిన చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉంది” అని డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. -
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు తప్పొప్పులు నేర్పించాలి: బాంబే హైకోర్టు
ముంబై: బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.ద్లాపూర్లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.‘సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.కాగా గత వారం బద్లాపూర్‌లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది. -
ఖమ్మంలో సంచలనం రేకెత్తించిన బాలుడి దత్తత ఘటన సుఖాంతం
-
హైదరాబాద్: కుక్కల దాడిలో మరో బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల దాడులకు పసివాళ్లు బలవుతున్నారు. నగరంలో శునకాల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. 20 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.. కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా కోకాపేట్ కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని ఆసుప్రతికి తరలించారు.కాగా, ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కాలే యాన్ని తినేశాయి.బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది. -
స్కూటీ లిఫ్ట్ అడిగి.. బస్సు, రైలెక్కి
మీర్‌పేట: ట్యూషన్‌కు వెళ్తున్నాని ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్‌రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్‌లో ట్యూషన్‌కు బయలుదేరాడు. వీరు నిత్యం లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్ అడిగి మీర్పేట్ బస్టాండ్ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్ కాలేజీ బస్‌లో మలక్‌పేట్ రైల్వే స్టేషన్ బస్టాప్‌లో దిగాడు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుని రైలు ఎక్కాడు. ముందుగా కిడ్నాప్ అనుకుని.. ట్యూషన్‌కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్ అనుకుని మీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్ అడిగి.. బస్ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు. సొంతూరు కర్నూల్ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశామని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్‌పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించారని.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి వెతుకుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా గోవా టికెట్ తీసుకున్న బాలుడు రైలెక్కి అక్కడకు వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
బాలుడు కిడ్నాప్.. ఆందోళనలో తల్లిదండ్రులు
-
అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే టైప్-1 డయాబెటిస్ ముప్పు ఎక్కువ
ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో 10 ఏళ్ల తర్వాత టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్లైన్ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్ డేటా సాయంతో పరిశోధకులు టీఐడీ ఉన్న వ్యక్తుల 235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్ చేయనున్నారు. -
ప్లాన్ ప్రకారమే ఎత్తుకెళ్లాడు.. తండ్రి రోదన..
-
అర్ధరాత్రి ఆసుపత్రిలో పిల్లాడిని ఎత్తుకెళ్లిన దుండగులు
-
బిడ్డా.. ఎంత తల్లడిల్లినవో
మిరుదొడ్డి/జవహర్‌నగర్: గోరంత ముల్లు గుచ్చు కుంటేనే తల్లడిల్లే ప్రాణంరా నీది.. గుంపులుగా వచ్చిన కుక్కలు గాట్లు పడేలా కొరుకుతూ, ఈడ్చుకెళుతుంటే ఎంత తల్లడిల్లినవో కొడుకా అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడిపెట్టించాయి. మల్కాజిగిరి– మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో కుక్కల దాడిలో విహాన్ మృతి చెందడం యావత్ రాష్ట్రాన్నే కుది పేసింది. విహాన్ మృతదేహం బుధవారం ఉదయం స్వగ్రా మమైన మిరుదొడ్డికి చేరుకుంది. నిలువెల్లా గాయాలతో నిండిపోయిన చిన్నారి మృతదేహాన్ని చూసిన బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. మధ్యాహ్నం తర్వాత విహాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. బతుకుదెరువుకు వలసొచ్చి.. కొడుకును కోల్పోయి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన పుల్లూరి భరత్‌కుమార్–వెంకటలక్ష్మి దంపతులకు ఎనిమిదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు సాహితి, శృతి, కుమారుడు విహాన్ ఉన్నారు. గ్రామంలో కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నెలరోజుక్రితం బతుకుదెరువుకు జవహర్‌నగర్‌కు వలసవచ్చారు. స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విహాన్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఆరు బయటకు వెళ్లాడు. అక్కడే వేచి ఉన్న వీధికుక్కలు విహాన్ వెంటపడి విచక్షణారహితంగా దాడిచేసి కొరికాయి. కుక్కలదాడిలో విహాన్ బలికావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అఖిలపక్ష నేతల నిరసన జవహర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలతో కలిసి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు శ్రీకాంత్ యాదవ్, మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌లు అన్నారు. తక్షణ సహాయంగా రూ. 50వేలు అందిస్తున్నా మన్నారు. బాలుడి కుటుంబానికి మున్సిపల్ కార్యాల యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఇంటిస్థలం అందించేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. కదిలిన మున్సిపల్ యంత్రాంగం వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారుల్లో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని వ్యాన్‌లో ఎక్కించి బయటకు తీసుకెళ్లారు. విహాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎంపీ ఈటల విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మేడ్చల్ కలెక్టర్‌తోపాటు జవహర్‌నగర్ మున్సి పల్ కమిషనర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పారు. కలెక్టర్‌కు నివేదించాం: కమిషనర్ తాజ్మోహన్రెడ్డివీధికుక్కల దాడి ఘటనపై పూర్తి వివరాలతో మేడ్చల్ కలెక్టర్‌కు నివేదిక అందించామని జవహర్‌నగర్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.50 వేలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
గుంపుగా వచ్చి.. బాలుడిని ఈడ్చుకెళ్లి..
జవహర్‌నగర్/గాందీఆస్పత్రి: మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఆరు బయట ఆడుకుంటున్నాడు...అదే సమయంలో వీధి కుక్కలు గుంపుగా అక్కడకు వచ్చాయి. ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేశాయి. తలభాగాన్ని నోట్లో కరుచుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లాయి. అలా ఈడ్చుకుంటూ వెళుతున్న క్రమంలో ఆ బాలుడి తలవెంట్రుకలు, తలలోని కొంత భాగం ఆ పరిసరాల్లో ఊడి పడింది. గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మల్కాజిగిరి–మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన భరత్–లక్ష్మి దంపతులకు ఏడాదిన్నర కుమారుడు విహాన్ ఉన్నాడు. లక్ష్మి సోదరుడు వెంకట్ జవహర్‌నగర్‌లోని ఆదర్శనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన ఇంటికి లక్ష్మి దంపతులు కుమారుడితో కలిసి చుట్టపుచూపుగా కొద్దిరోజుల క్రితం వచ్చారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా విహాన్‌పై దాడి చేశాయి. కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లి పడేశాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అదే కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ఆ కుక్కల గుంపు దగ్గరకు వెళ్లి చూడగా, బాలుడు తీవ్ర రక్తస్రావంతో కిందపడి ఉన్నాడు. ఒళ్లంతా రక్కడంతో కుక్కకాటు గుర్తులు ఉన్నాయి. ఆ పరిసరాల్లోనే విహాన్ తల వెంట్రుకలు, మెదడులోని కొంత భాగం కూడా మరో చోట పడింది. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని గాంధీ ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. శరీరమంతా కుక్కకాట్లతో నిండిపోయి ఉండటంతో పరిస్థితి విషమించింది. అనస్థీషియా, పిడియాట్రిక్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రాత్రి 9:30 గంటలకు విహాన్ మృతి చెందాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో కాపాడలేకపోయామని గాంధీ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. జవహర్‌నగర్ పరిధిలో వీధికుక్కల బెడద ఎక్కువగానే ఉందని స్థానికులు వాపోయారు. ఇంకెన్ని ప్రాణాలు పోతే.. అధికారులు ఈ సమస్యను పట్టించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్ అమ్మాయి
జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలో రిసెప్షన్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్‌కుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.అతడికి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీకారంతో వారిద్దరు మైలవరంలోని కోదండ రామాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంటముక్కలలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించారు. -
కుక్కలదాడిలో బాలుడి మృతి
పటాన్చెరు టౌన్: బహిర్భూమికి వెళ్లిన ఆరేళ్ల బా లుడిపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన బాల్కన్, ప్రమీల దంపతులు బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌కు వలస వచ్చారు. వీరికి ము గ్గురు సంతానం.ఇద్దరిని స్వగ్రామంలో ఉంచి చిన్న కుమారుడు బిశాల్ (6)ను తమ వెంట తీసుకొచ్చారు. ఓ వెంచర్ వద్ద మేస్త్రీ కింద భార్యాభర్త లు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా రు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బిశాల్ బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో నాలు గు కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. మెడపై శరీర భాగాలపై తీవ్రంగా గాయాలు కావడంతో బాలుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముత్తంగిలో 8 నెలల పాపపై.. పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముత్తంగిలో ఎనిమిది నెలల పాపపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోకిరం, రోట్న దంపతులు బతుకుదెరువు కోసం ముత్తంగి నాగార్జున కాలనీకి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం భార్యాభర్తలిద్దరూ స్వాతి (8 నెలలు)ని పడుకోబెట్టి పక్కనే పని చేసుకుంటున్నారు. అటుగా వచి్చన కుక్క పాపను కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంత రం చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. -
HYD: కుక్కల దాడిలో బాలుడి మృతి
సాక్షి,హైదరాబాద్: పటాన్చెరు ఇస్నాపూర్‌లో శుక్రవారం(జూన్28) దారుణం జరిగింది. కుక్కలదాడిలో ఎనిమిదేళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లినపుడు కుక్కలు విశాల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.విశాల్ కుటుంబం కూలిపని చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. పొట్ట కూటి కోసం వచ్చి కొడుకును కోల్పోవడంపై విశాల్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాగానే బాలుడు మృతి!
ఓ టీనేజ్ బాలుడు(15) స్విమ్మింగ్ చేసి.. పూల్ నుంచి పైకి ఎక్కి నడుస్తునే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటు చేసుకుంది. బాలుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవటంతో అక్కడ ఉన్నవారు.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.In UP’s meerut a 17-Year-old collapses and dies after coming out of the swimming pool. The teenager played cricket before coming for swimming and after swimming for sometime the boy collapses as soon as he steps out and was later declared dead at the hospital. pic.twitter.com/qIFWLSX8Kz— Tanishq Punjabi (@tanishqq9) June 21, 2024 దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిమ్మింగ్ పూల్ మేనెజర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతిపై తల్లిదండ్రులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటన చోటు చేసుకున్న వెంటనే స్విమ్మింగ్ పూల్ వచ్చేవారి రాకను మూసివేశారు. -
ఈఏపీ సెట్లో బాలురు భళా
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్)/పుల్లలచెరువు/బలిజిపేట/ఆదోని సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకులను కొల్లగొట్టారు. అగ్రికల్చర్ విభాగంలో టాప్ టెన్‌లో ఆరుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణు సాయి 97 మార్కులతో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. అగ్రికల్చర్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి 93.44 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. విజయవాడలో మంగళవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో గతేడాదితో పోలిస్తే అత్యధికంగా 24వేల మందికిపైగా ఉత్తీర్ణత సాధించారు. టాప్ టెన్‌లో 8 మంది ఏపీ విద్యార్థులు కాగా ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఈఏపీసెట్‌కు 3,62,851 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 2,74,213 మంది రిజిస్టర్ చేసుకోగా 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,95,092 (75.51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకుంటే 80,766 మంది పరీక్ష రాశారు. వీరిలో 70,352 (87.11 శాతం) మంది అర్హత సాధించారు. తెలంగాణ ఈఏపీ సెట్లో రెండు విభాగాల్లోనూ టాప్–10లో నిలిచిన వారిలో నలుగురు విద్యార్థులు చొప్పున ఏపీ ఈఏపీసెట్‌లోనూ ర్యాంకులు సాధించడం విశేషం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన నంద్యాల జిల్లా గోస్పాద మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ తెలంగాణ ఈఏపీసెట్‌లో 4వ ర్యాంకు సాధించగా తాజాగా ఏపీ ఈఏపీసెట్‌లో 3వ ర్యాంకు దక్కించుకున్నాడు. గతేడాది మాదిరిగానే ఇంజనీరింగ్‌కు అత్యధికంగా బాలురు, అగ్రికల్చర్ వైపు బాలికలు మొగ్గు చూపారు. వెబ్సైట్లో ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచామని, త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత వేగంగా ప్రవేశాలు కల్పించి.. తరగతులను నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. 25 శాతం వెయిటేజీతో ర్యాంకులుమే 16 నుంచి 23 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించినట్టు సెట్ చైర్మన్, జేఎన్టీయూ–కాకినాడ వీసీ ప్రసాదరాజు చెప్పారు. ఈఏపీసెట్ పూర్తయిన అనంతరం ప్రాథమిక కీ విడుదల చేశామన్నారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు కీ అబ్జర్వేషన్స్ వెరిఫికేషన్ కమిటీని నియమించామన్నారు. ఇందులో కేవలం మూడు ప్రశ్నలకు మాత్రమే పూర్తి మార్కులు కేటాయించామన్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఈఏపీసెట్‌లో అర్హత సా«దించిన వారందరికీ ఇంటర్ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటించామని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ (ఇన్చార్జి) కె.రామ్మోహనరావు, వైస్ చైర్పర్సన్ ఉమామహేశ్వరిదేవి, సెట్స్ ప్రత్యేక అధికారి సు«దీర్‌రెడ్డి, సెట్ కనీ్వనర్ వెంకటరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ జేడీ పద్మారావు పాల్గొన్నారు. సీట్లకు మించిన ఉత్తీర్ణత రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు 1.60 లక్షలు ఉండగా ఈ ఏడాది అత్యధికంగా 1.95 లక్షల మందికిపైగా ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే ఉత్తీర్ణతలో ముందున్నారు. 1,48,696 మంది బాలురు పరీక్ష రాస్తే 1,09,926 (73.93 శాతం) మంది, 1,09,678 మంది బాలికలు పరీక్ష రాస్తే 85,166 (77.65 శాతం) ఉత్తీర్ణులయ్యారు.జిష్ణుసాయికి ప్రథమ ర్యాంకు ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో గుంటూరు నగరానికి చెందిన మాకినేని జిష్ణుసాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 62వ ర్యాంకు సాధించాడు. గుంటూరు నగరానికి చెందిన మరో విద్యార్థి కోమటినేని మనీష్ చౌదరికి ఈఏపీసెట్‌లో 5వ ర్యాంకు లభించింది.సాయి యశ్వంత్‌రెడ్డికి రెండో ర్యాంక్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు గుంటూరులోనే చదివిన కర్నూలుకు చెందిన మరో విద్యార్థి సాయి యశ్వంత్‌రెడ్డికి ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 2వ ర్యాంకు లభించింది. ఇటీవల జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 50వ ర్యాంకు దక్కించుకున్నాడు. తనది చాలా పేద కుటుంబమని.. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతానని యశ్వంత్ తెలిపాడు. జీవితంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడడమే తన లక్ష్యమని వెల్లడించాడు. సందేశ్‌కు మూడో ర్యాంక్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బి.రామసుబ్బారెడ్డి, వి.రాజేశ్వరిల కుమారుడు బి.సందేశ్ ఏపీఈసెట్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకును సాధించడం విశేషం. సందేశ్ 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్ నారాయణ కళాశాలలో పూర్తి చేశాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని తెలిపాడు. ఆ తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమన్నాడు. ఇద్దరికి 10వ ర్యాంక్ ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామానికి చెందిన కొమిరిశెట్టి ప్రభాస్ 10వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అతడి తండ్రి కొమ్మరిశెట్టి పోలయ్య గుంటూరు మిర్చి యార్డులో పనిచేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నగుదాసరి రాధాకృష్ణ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. కుమారుడు మంచి ర్యాంకు సాధించడంతో వ్యవసాయ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు నారాయణరావు, కృష్ణవేణి సంతోషం వ్యక్తం చేశారు.