chamber of commerce
-
అన్నింటికీ ఒక్కటే టీడీఎస్
న్యూఢిల్లీ: అన్ని రకాల చెల్లింపులకు 1 శాతం లేదా 2 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయాలని వాణిజ్య మండలి ‘అసోచామ్’ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. వివాదాల నివారణకు, పన్ను నిబంధనల అమలును సులభతరం చేసేందుకు ఇలా కోరింది. బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది. కొన్ని రకాల టీడీఎస్ వైఫల్యాలను నేరంగా పరిగణించరాదని కూడా కోరింది. కొన్ని రకాల చెల్లింపులకు టీడీఎస్ అమలు చేయకపోవడాన్ని నేరంగా చూడరాదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం ద్వారా పన్ను చెల్లింపుదారు ప్రయోజనం పొందిన కేసుల్లోనే ఇలా చేయాలని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ సూచించారు. ‘‘వివాదాలను తగ్గించడం, నిబంధనల అమలు మెరుగుపరచడం పన్ను సంస్కరణల లక్ష్యం అవుతుందని భావిస్తున్నాం. ఈ దిశగా కార్పొరేట్ రంగం నిర్మాణాత్మక సూచనలు చేసింది. పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యల కోసం కూడా కార్పొరేట్ ఇండియా చూస్తోంది’’అని చెప్పారు. కంపెనీల విలీనాలు, వేరు చేయడాలకు పన్ను న్యూట్రాలిటీని అందించాలని కూడా అసోచామ్ కోరింది. పన్ను అంశాల్లో సమానత్వాన్ని ట్యాక్స్ న్యూట్రాలిటీగా చెబుతారు. మూలధన లాభాల మినహాయింపులు లేదా నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే విషయంలో, విలీనాలు, డీమెర్జర్లు (వేరు చేయడం), గుంపగుత్తగా విక్రయించడంలో ప్రస్తుతం నిబంధనల పరంగా అంతరాలు ఉండడంతో అసోచామ్ ఇలా కోరింది. బైబ్యాక్‌ల రూపంలో వచి్చన దాన్ని డివిడెండ్‌గా పరిగణించాలని సూచించింది. -
వృద్ధి బలపడుతుంది...
ముంబై: భారతదేశంలో ఆర్థిక వృద్ధి బలంగా పుంజుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశీయంగా ఉన్న అంతర్గత పరిస్థితులు, వివేకవంతమైన పాలసీ విధానాలతో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తోందని భరోసాను ఇచ్చారు. టోక్యోలో ట్యోక్యో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారత్ ఎకానమీపై ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ అన్ని సవాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉందని, ద్రవ్య విధానం ద్రవ్యోల్బణం కట్టడికి, వృద్ధికి తోడ్పడుతుందని కూడా చెప్పారు. 2 శాతం ప్లస్ లేదా మైనస్లతో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగేలా చర్యలు ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. సుపరిపాలన, సమర్థవంతమైన పర్యవేక్షణ, నైతిక ప్రవర్తన, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారించడం భారత్ దృష్టి సారించడం జరిగిందన్నారు. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) ద్వారా ఫిన్‌టెక్‌లు తమకుతాము స్వీయ–నియంత్రణను పాటించేలా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతోందన్నారు. -
ఇక న్యాయ, పాలనా సంస్కరణలపై కేంద్రం దృష్టి
కోల్‌కతా: ప్రభుత్వం తదుపరి సంస్కరణల ఎజెండాలో దేశంలోని పరిపాలనా, న్యాయ రంగాలేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు.ఇక్కడ భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (బీసీసీ)లో సన్యాల్ మాట్లాడుతూ, 2014లో కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ‘‘2014 నుండి సంస్కరణల కొత్త పథం అమలులోకి వచ్చింది. గత దశాబ్దంలో, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు జరిగాయి. దివాలా కోడ్ (ఐబీసీ), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి కీలక వ్యవస్థలు అమల్లోకి వచ్చాయి. ద్రవ్యోల్బణ లక్ష్యం నిర్దేశ విధానం ప్రారంభమైంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడు రెండు ప్రధాన సంస్కరణలు.. పరిపాలనా– న్యాయపరమైన సంస్కరణలు అవశ్యం. దీనికి విస్తృత ప్రజా మద్దతు అవసరం’’ అని ఆయన అన్నారు. 7 శాతం వరకూ వృద్ధి స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సన్యాల్ విశ్లేíÙంచారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరత్వం ఉన్నాయని, కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) తగిన స్థాయిలో ఉందని, 13 నెలలకు సరిపడా విదేశీ మారక నిల్వలు (600 బిలియన్ డాలర్లు) ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్దీపనలతో దేశంలో డిమాండ్ పరిస్థితులను పెంచాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని కూడా ఆయన ఉద్ఘాటించారు. ఇలాంటి విధానాలతో దిగుమతులు పెరిగితే అది క్యాడ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. కోవిడ్ సంవత్సరాల్లో తీవ్ర ప్రభావానికి గురయిన సరఫరాల వ్యవస్థను పటిష్టంగా ఉంచాల్సిన అవసరం మాత్రం తక్షణం ఉందని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణంపై అప్పుడప్పుడు కూరగాయల ధరలు పెరుగుతున్న ప్రభావం మినహా అంతర్లీన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అంత బలంగా లేవని భరోసాను ఇచ్చారు. మౌలిక రంగం ఊతం మౌలిక రంగంలో గత పెట్టుబడులు ఇప్పుడు మనకు ప్రయోజనం సమకూర్చుతున్నట్లు సన్యాల్ తెలిపారు. ప్రపంచాన్ని నిరుత్సాహపరిచే పలు ఆర్థిక పరిస్థితలు నేపథ్యంలో భారత్ 6.5 శాతం వృద్ధి సాధించడం మామూలు విషయం కాదని కూడా స్పష్టం చేశారు. ఉద్దీపనల వంటి చర్యలతో వృద్ధి వేగాన్ని భారీగా పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం లేదని ఆయన పేర్కొంటూ, ‘‘స్పష్టమైన రహదారి ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం. ఇప్పుడు ఈ బాటలో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయి’’ అని విశ్లేíÙంచారు. స్థూల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ఇప్పుడు కీలకమని పేర్కొన్న ఆయన ఈ విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరత, సరఫరాల వ్యవస్థలో లోపాలు లేకుండా చేయడం ముఖ్యమన్నారు. జర్మనీ, జపాన్ సరేకానీ... అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఐదవ స్థానంలో నిలిచిన భారత్ ఎకానమీ మన ముందు ఉన్న దేశాలను అధిరోహిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదని అన్నారు. అయితే తొలి రెండు దేశాలు మాత్రం మనకంటే ఎంతో ముందు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు. రూపాయిని అంతర్జాతీయం చేసి, వాణిజ్య మారి్పడిలో కీలక మారకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సన్యాల్ అన్నారు. ‘‘అమెరికా డాలర్ విషయంలో ఈ విధానం ఎంతమాత్రం జోక్యం చేసుకోదు. రూపాయిని భవిష్యత్తులో యాంకర్ కరెన్సీగా ఉండాలన్నదే దేశ విధానం’’ అని ఆయన చెప్పారు. చివరిగా 2011లో జరిగిన జనాభా లెక్క జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తదుపరి జనాభా గణన చేయాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా సన్యాల్ పేర్కొన్నారు. -
విక్రయాల కోసం ప్రభుత్వంపై ఆధారపడకండి
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్ల)పై ఆధారపడొద్దని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ సూచించారు. దానికి బదులుగా దేశీ మార్కెట్, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొనుగోళ్ల ద్వారా స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు సానుకూలంగా కృషి చేస్తున్నాయని, అనేక సందర్భాల్లో పలు మినహాయింపులు కూడా ఇస్తున్నాయని ఆయన చెప్పారు. అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ చక్కని రన్‌వేలాంటిదని కాంత్ వివరించారు. ‘అయితే, అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వాలు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. చురుకైన స్టార్టప్‌లు మార్కెట్‌ప్లేస్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ కొనుగోళ్లపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదు‘ అని ఆయన చెప్పారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి స్కీముల ద్వారా స్టార్టప్‌లకు పెట్టుబడులు లభించేలా తోడ్పాటు అందించడానికి మాత్రమే ప్రభుత్వ పాత్ర పరిమితం కావాలని కాంత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, లింగ అసమానతలను రూపుమాపేందుకు, మహిళల జీవన ప్రమా ణాలు మరింత మెరుగుపడేందుకు పురుషుల దృష్టికోణం మారాలని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్, దక్షిణాసియాలో ఆస్తిని కుమార్తెలకు కాకుండా కుమారులకే మార్పిడి చేసే సంస్కృతి ఉందని.. అలా కాకుండా కుమార్తెల పేరిట బదిలీ చేసే సంస్కృతి వస్తే దశాబ్ద కాలంలోనే మహిళలు మరింతగా రాణించడాన్ని చూడగలమని కాంత్ చెప్పారు. -
ఈయూతో ఎఫ్‌టీఏ దిశగా అడుగులు
ముంబై: యూరోపియన్ యూనియన్‌తో (ఈయూ) వచ్చే ఏడాది నాటికి భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంటుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► దేశం ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)సహా ఇతర దేశాలు లేదా బ్లాక్‌లతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుపుతోంది. ► ఇటలీకి చెందిన విదేశాంగ మంత్రితో సహా ఒక ప్రతినిధి బృందం దేశ రాజధానితో పర్యటిస్తోంది. ఎఫ్‌టీఏపై ఈ సందర్భంగా చర్చలు జరగనున్నాయి. ► ఇప్పటికే బ్రిటన్‌తో మూడు దఫాల చర్చలు జరిగాయి. త్వరలో నాలుగో రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉంది. మే 26–27 తేదీల్లో బ్రిటన్ ప్రతినిధులతో కీలక సమావేశం జరగనుంది. ► స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశంలో వృద్ధిని పెంచుతాయి. భారీ ఉపాధి కల్పనకు వీలు కలుగుతుంది. భారత్ ఇతర దేశాలు లేదా కూటములతో న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన, విజయవంతమైన భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తోంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులు జరిపి రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో దేశం ఎన్నడూ లేని విధంగా 38 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవుతాయన్న విశ్వాసం ఉంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తుల తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, మౌలిక రంగం పురోగతికి చర్యల తత్సబంధ కార్యక్రమాల ద్వారా దేశం ఆశించిన ఫలితాలను సాధిస్తోంది. ► ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు స్థాయలో రూ. 1.67 లక్షల కోట్లకు పైగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల జరిగాయి. విశ్లేషకుల అంచనాలను మించి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఆశాజనకం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌లు కూడా ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ, పునరుద్ధరణను సూచిస్తున్నాయి. ► 2021లో దేశం 82 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఏ) ఆకర్షించింది. ఇది ఎన్నడూ లేనంత అత్యధికం. చట్టబద్ధమైన పాలన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, పారదర్శక న్యాయ వ్యవస్త, వ్యాపారాలను ఆకర్షించే స్థిరమైన విధానాల వంటి అంశాలు ఈ రికార్డుల సాధనకు కారణం. ఆస్ట్రేలియా దిగుమతుల్లో కొన్నింటికే సుంకాల మినహాయింపు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 29.8 శాతం ఉత్పత్తులకు సుంకాలపరమైన మినహాయింపులు వర్తించవని కేంద్రం వెల్లడించింది. డైరీ ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు, విలువైన లోహాలు, ఆభరణాలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. దేశీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మినహాయింపులు వర్తించే ఉత్పత్తుల జాబితా నుంచి వీటిని తొలగించినట్లు కేంద్రం తెలిపింది. భారత్–ఆస్ట్రేలియా మధ్య కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఇండ్‌ఆస్ ఈసీటీఏ) సంబంధించిన సందేహాల నివృత్తి కోసం వాణిజ్య శాఖ ఈ మేరకు వివరణ (ఎఫ్ఏక్యూ) జారీ చేసింది. ఏప్రిల్ 2న కుదిరిన ఈ ఒప్పందం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఎఫ్ఏక్యూ ప్రకారం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత 27.5 బిలియన్ డాలర్ల నుంచి 45–50 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇండ్‌ఆస్ ఈసీటీఏతో వచ్చే 5–7 ఏళ్లలో 10 లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది. -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్‌కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్‌లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచేందుకుగాను ఆర్థిక ఉద్దీపనలతో కూడిన మరో ప్యాకేజీని ప్రభుత్వం సరైన సమయంలో ప్రకటిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 15వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి సన్యాల్ ప్రసంగించారు. తదుపరి ఉద్దీపనలను ప్రకటించేందుకు వీలుగా అటు ద్రవ్యపరంగా, ఇటు పరపతి పరంగానూ వెసులుబాటు ఉన్నట్టు చెప్పారు. కరోనా కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన అనంతరం.. రూ.1.70 లక్షల కోట్ల విలువ చేసే పలు ఉద్దీపనలతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత భారత్‌ను తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని సైతం ప్రకటించింది. ‘‘సరైన సమయంలో తదుపరి ఉద్దీపనల అవసరాన్ని మేము (ప్రభుత్వం) గుర్తించాము’’ అని సన్యాల్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ క్షీణతపై వస్తున్న ఆందోళనలకు స్పందించారు. ఇతర దేశాల మాదిరి ముందుగానే భారీ డిమాండ్ కల్పనకు బదులు.. ఒత్తిడిలోని వర్గాలు, వ్యాపార వర్గాల వారికి రక్షణ కవచం ఏర్పాటుపై భారత్ దృష్టి పెట్టిందన్నారు. మరో ప్యాకేజీకి వెసులుబాటు: కామత్ సంజీవ్ సన్యాల్ మాదిరి అభిప్రాయాలనే ప్రముఖ ఆర్థికవేత్త, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మాజీ ప్రెసిడెంట్ కేవీ కామత్ సైతం వ్యక్తం చేశారు. మరో ప్యాకేజీకి వీలుగా ద్రవ్య, పరపతి పరమైన వెసులుబాటు ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ వచ్చే 25 ఏళ్ల పాటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. భారత్ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. ‘‘నేడు భారత్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆశావాదం నెలకొంది. ఎందుకంటే భారత్ ఎన్నో అవకాశాలను, ఎంపికలను కల్పించడంతోపాటు తలుపులు తెరుస్తోంది’’ అంటూ అమెరికా–భారత్ వాణిజ్య కౌన్సిల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ పేర్కొన్నారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎన్నో సంస్కరణలు చేపట్టడంతోపాటు ఎన్నో రంగాల్లోకి పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు వివరించారు. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ప్రాముఖ్యతను కరోనా మహమ్మారి చూపించిందన్నారు. దేశీయంగా బలమైన ఆర్థిక సామర్థ్యాలతో భారత్ బలంగా నిలిచిందన్నారు. భారత్ అవకాశాల కేంద్రంగా మారుతోందంటూ ఒక ఉదాహరణను తెలియజేశారు. పట్టణల్లో కంటే గ్రామీణం గానే ఇంటర్నెట్ వినియోగదారులు అధికంగా ఉన్నారన్న ఆసక్తికరమైన నివేదికను ప్రస్తావించారు. -
అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరమ్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్(డాక్) పేరుతో జాతీయ స్థాయిలో ఒక నూతన వేదిక ఏర్పాటైంది. ఢిల్లీలో మంగళవారం డాక్ ప్రారంభసభలో డాక్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి దళిత పారిశ్రామిక వేత్తలు, ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరం సభ్యులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడం ఈ చాంబర్ ఉద్దేశమని వివేక్ మీడియాకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభివృద్ధికి పథకాలు అమలుచేస్తున్నా సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఉపయోగించుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చాంబర్ ద్వారా ఔత్సాహిక దళిత పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇచ్చి, ప్రభుత్వాలతో చర్చించి దళితుల అభివృద్ధికి కృషిచేయనున్నట్టు తెలిపారు. -
‘నా అడ్రస్ మారిందే కానీ, డ్రెస్ మారలేదు’
సాక్షి ప్రతినిధి, చెన్నై: పరిశ్రమ, వ్యవసాయం దేశాభివృద్దికి రెండు కళ్లువంటివని, వీటితో పాటు వాణిజ్య వ్యాపారాలు కూడా ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. అన్ని రంగాల వారిలో జాతీయతాభావం పెరగాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 90వ వార్షిక వేడుకలు సోమవారం చెన్నైలోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ... 'సంపదను పెంచితేనే పంచగలం, లేకుంటే పంచె మాత్రమే మిగులుతుంది. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత భారత ప్రభుత్వమే వ్యాపారం చేయకతప్పలేదు...మౌళిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత, వాటిని సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధి దిశగా తీసుకెళ్లడం పౌరుల కర్తవ్యమ'న్నారు. 'మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు.. అన్నిచోట్లకూ రాలేరు కదా అని అడుగుతున్నారు. బందోబస్తుకు 25 మంది, అత్యవసర వైద్యసహాయం కోసం నలుగురు డాక్టర్లు, ఎయిర్‌ఫోర్సు విమానంలో ప్రయాణం అని ఏమేమో ఊహిస్తున్నారు. కొందరు నా పంచకట్టు గురించి కూడా అడుగుతున్నారు. నా అడ్రస్సు మారిందేగానీ డ్రస్సు మారదని చెప్పాను. మన సంస్కృతి సంప్రదాయాలను పాటించాలి, గౌరవించాలి. ఇప్పుడిప్పుడే వారు అర్థం చేసుకుంటున్నారు. వారితోపాటూ నేనూ ఈ పదవిని అర్థం చేసుకుంటున్నా. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ 90 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకోవడం అంటే దాన్ని అపూర్వ విజయంగా పరిగణించాల్సి ఉంటుంద’ని అన్నారు. వెంకయ్యకు స్టాలిన్ హితవు! ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు రాజకీయాలు మాట్లాడటం విడ్డూరమని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యానించారు. వెంకయ్య తన ప్రసంగంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. -
ఒకే పన్ను..అవగాహనే దన్ను
- నేటి నుంచి జీఎస్టీ అమలు - వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు రద్దు - పెట్రోల్, డీజిల్, ఆల్కాహాల్‌కు వినహాయింపు - ఇప్పుడున్న పన్నులు శాశ్వతం కాదన్న వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ - ‘సాక్షి’ సదస్సుకు విశేష స్పందన కర్నూలు(హాస్పిటల్): జూలై ఒకటో తేదీ నుంచి ఒకే దేశం...ఒకే పన్ను పేరుతో దేశవ్యాప్తంగా జీఎస్టీ(వస్తుసేవల పన్ను) అమలు కానుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. ఇందులో భాగంగా శనివారం స్థానిక పాతబస్టాండ్ సమీపంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రజలు, ప్రజా సంఘాలు, వ్యాపారులు, వాణిజ్యవర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికున్న సందేహాలను వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జె.తాతారావు నివృత్తి చేశారు. పన్ను చెల్లించే విధానాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్ వివరించారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకరరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి రసూల్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాయకల్లు సోమసుందరం, ఏపీ గ్రానైట్స్ ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యంగౌడ్, పారిశ్రామిక వేత్తలు సి.నాగిరెడ్డి, బైసానిరాజు, ఎంఎస్ఎఫ్ నాయకులు గోపి, సుధాకర్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న పన్నులు శాశ్వతం కాదు –జె.తాతారావు, డిప్యూటీ కమిషనర్ వాణిజ్యపన్నుల శాఖ జీఎస్టీపై కొంత మంది వర్తకుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడున్న పన్నులు శాశ్వతంగా ఉండవు. ఇప్పటికే అనేక మంది ఇచ్చిన విన్నపాల మేరకు కమిటీ పరిశీలించి సవరణలు చేసింది. తరచూ కమిటీ సవరణలు చేస్తూనే ఉంటుంది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, వినతులను ప్రభుత్వానికి నివేదిస్తాం. కొన్ని రకాల వస్తువుల ధరలు ఉత్పత్తి, డిమాండ్ ఆధారంగా ఉంటాయి. వాటిపై జీఎస్టీ ప్రభావం ఉండదు. గ్రానైట్, ఫర్నిచర్లపై వేసిన జీఎస్టీపై కమిటీ పరిశీలన చేస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్‌ను సైతం జీఎస్టీ పరిధిలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న టిన్ నెంబర్ స్థానంలో జీఎస్టీవస్తుంది. చైతన్యవంతం కావాలి –వెంకటేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్, వాణిజ్యపన్నుల శాఖ వినియోగదారులు చైతన్యవంతం కావాలి. ప్రతి కొనుగోలుపై తప్పనిసరిగా జీఎస్టీతో కూడిన బిల్లును తీసుకోవాలి. దీనివల్ల పన్నుల వ్యవస్థ పటిష్టమవుతుంది. జీఎఎస్టీ వల్ల వస్తువుల ధరలు పెరుగుతాయనే ప్రశ్నే ఉండదు. ప్రతి స్టేజీలో అంతకుముందు చెల్లించిన పన్ను ఇన్‌పుట్‌గా తిరిగి వ్యాపారులకు వస్తుంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ, స్థానిక సంస్థల వినోదపుపన్ను, ఆల్కహాలు వంటి వాటికి మినహాయింపు ఇచ్చారు. ఇతర దేశాల్లో తక్కువ –ఐ.విజయకుమార్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఇతర దేశాల్లో జీఎస్టీ తక్కువగా ఉంది. ఫర్నిచర్‌పైన ఇప్పుడున్న పన్ను 5 శాతం నుంచి 18శాతానికి పెంచారు. దీనివల్ల ధరలు పెరిగి కొనుగోళ్లు తగ్గిపోతాయి. కేంద్రం.. మంచి చేస్తున్నామని చెబుతూనే పన్నులు పెంచుతోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి –హఫీజ్‌ఖాన్, వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త జీఎస్టీపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వీటిని అధికారులు.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. ప్రజల విజ్ఞప్తులు పరిగణనలోకి తీసుకుని పన్నులు తగ్గించాలి. అరుణ్‌జైట్లీకి విన్నవించాం –నక్కల మిట్ట శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి జీఎస్టీపై ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై ఫిట్మెంట్ కమిటీ వేశారు. పన్నులు సైతం మారుస్తున్నారు. నేను కూడా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి పన్నులు తగ్గించాలని విన్నవించాను. -
జీఎస్టితో వ్యాపారులకు ప్రయోజనం
కర్నూలు(హాస్పిటల్): దేశంలో జూలై ఒకటి నుంచి అమలయ్యే జీఎస్టీతో వ్యాపారులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ తాతారావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మున్సిఫ్‌కోర్టు సమీపంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో ట్రేడర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఐ.విజయకుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీసీ తాతారావు మాట్లాడుతూ.. జూలై ఒకటి నుంచి దేశమంతా ఒకే పన్ను విధానం అమలులోకి వస్తుందన్నారు. ఈ విధానంపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రిటర్న్స్ ఎలా కట్టాలి, పన్నులు ఎలా చెల్లించాలి, నూతన విధానాల ఎలాగుంటాయనే విషయాల గురించి ట్రేడర్లకు కూలంకుషంగా వివరిస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీతో వ్యాపారులకు పన్నులు తగ్గుతాయని, దేశంలో ఎక్కడ నుంచైనా సరుకులు కొనుగోలు చేసినా ఒకేసారి పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది వ్యాపారులకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ బుచ్చన్న, సీటీవోలు నరేంద్ర ప్రసాద్, హుసేన్‌సాహెబ్, రామాంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారులకు అండగా చాంబర్ ఆఫ్ కామర్స్
పాత గుంటూరు: 75 ఏళ్ల నుంచి వ్యాపార, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి చాంబర్ ఆఫ్ కామర్స్ విశేష కృషి చేసిందని ది ఇండియన్ చాంబర్ ఆఫ్‌కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. జిన్నాటవర్ సెంటర్లోని చాంబర్ కార్యాలయంలో మంగళవారం 77వ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆతుకూరి ఆంజనేయులు అధ్యక్షత వహించి మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో 3 వేల మంది సభ్యులు, 90 అనుబంధ సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కంపెనీ యాక్ట్ కింద రిజిష్ట్రరు అయి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చాంబర్ గుంటూరు ఒక్కటేనన్నారు. ఎక్స్‌పోర్టు సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజన్ ఇచ్చే అధికారం ఉందన్నారు. జిల్లాలో పొగాకు, మిర్చి, కాటన్ ఎగుమతి అవుతుందని, ఎవరైనా వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళాలంటే చాంబర్ లెటర్ ఉంటేనే వ్యాపార వీసా ఉంటుందని వెల్లడించారు. డిసెంబరులో చాంబర్ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం∙జూబిలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆతుకూరి ఆంజనేయులును సంస్థల అధ్యక్ష, కార్యదర్శులు, మిత్రులు శాలువా, పూలదండలతో సత్కరించారు. సంస్థ కార్యదర్శి అన్నా పూర్ణచంద్రారవు, గజవల్లి శివన్నారాయణ, రంగ బాలకృష్ణ, తూనుగుంట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘వ్యాపారుల సంక్షేమమే లక్ష్యం’
శ్రీకాకుళం అర్బన్: వ్యాపారుల సంక్షేమమే లక్ష్యంగా చాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని కామర్స్ అధ్యక్షుడు అంధవరపు వరాహ నరసింహం(వరం) అన్నారు. శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో శుక్రవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పని చేస్తామని తెలిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి పీవీ రమణ మాట్లాడుతూ వ్యాపారుల విశాల ప్రయోజనం కోసం ఏర్పడింనదన్నారు. జిల్లాలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుకు ఎన్నో ఏళ్ల నుంచి శ్రమించామని చెప్పారు. ఆ కల ఇప్పటికి నెరవేరిందని అన్నారు. నెల క్రితం 46 సంఘాలతో చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిందన్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులూ ఉన్నారన్నారు. వ్యక్తుల మధ్య వైరం ఉంటే దాన్ని పక్కనపెట్టి చాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. సంఘ ప్రతినిధి జామి భీమశంకరరావు‡ మాట్లాడుతూ 34ఏళ్ల క్రితం ఏర్పడాల్సిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్నాళ్లకు ఏర్పడడం అభినందనీయమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఒక గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి వ్యాపారుల సమస్యల కోసం కృషి చేస్తామన్నారు. త్వరలోనే మెంబర్షిప్, రిజిస్ట్రేషన్ కోసం కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పేర్ల సాంబమూర్తి, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, పేర్ల మహేష్, గుమ్మా నాగరాజు, గుడ్ల మల్లేశ్వరరావు, తంగుడు నాగేవ్వరరావు, పాపారావు, బరాటం చంద్రశేఖర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
‘ఇన్కమ్ డిక్లరేషన్ స్కీం’ను సద్వినియోగం చేసుకోవాలి
వరంగల్ సిటీ : జిల్లాలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, డాక్టర్లు ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్–2016ను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్ఎస్ ఆదాయపన్ను శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లు సూచించారు. వరంగల్‌లోని చాంబర్ ఆఫ్ కామ ర్స్ కార్యాలయంలో బుదవారం ఈ స్కీంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నల్లధనం, పన్ను చెల్లించని ఆస్తుల వివరాలు సరైన విధంగా తెలియజేయకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంకా పన్ను చెల్లించాల్సిన వారు ఈ స్కీంను వినియోగించుకుని లబ్ధి పొందాలని సూచించారు. సెప్టెంబర్ 30 లోపు ప్రత్యేక ఫామ్ ద్వారా గతంలో చెల్లించని ఆస్తులకు సైతం మూడు వాయిదాలల్లో వచ్చే ఏడాది మార్చి 31 వరకు చెల్లించవచ్చని వివరించారు. రిటర్న్్సను చెల్లించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపా రు. గతంలో తెలియజేసిన ఆస్తులకు కూడా ప్రస్తు తం ట్యాక్స్ చెల్లించే సదుపాయం ఉందన్నారు. సదస్సులో ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఎంఎస్.రావు, రీజినల్ చార్టెడ్ కౌన్సిల్ ప్రతినిదులు రాజేం ద్రకుమార్, ఉపేందర్‌రావు, తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, చాంబర్ ప్రతినిదులు దుగ్యాల గోపాల్‌రావు, కంది ర వీందర్‌రెడ్డి, నాగమళ్ల పూర్ణచందర్, కట్కూరి సత్యనారాయణ, నాగభూషణం, చింతలపెల్లి వీరారావు, రాజయ్యయాదవ్, శ్రీరాం బిక్షపతి, అల్లె సంపత్, రాయిశెట్టి సత్యనారాయణ, కంచె సంప త్, బండి జనార్ధన్, రాజేష్కరాణి, శెట్టి కిషన్, హరి బాబు, తూము అశోక్ పాల్గొన్నారు. -
25 నుంచి తిరుపతిలో ట్రేడ్ బంద్
- మూడు రోజులపాటు హోటళ్లు, దుకాణాలన్నీ మూత - సీటీవో వేధింపులపై భగ్గుమంటోన్న వ్యాపారులు - శ్రీనివాసులు నాయుడుని బదిలీ చేయాల్సిందేనని స్పష్టీకరణ - మంగళవారం నగరంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌ల ర్యాలీ తిరుపతి : తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులంతా ట్రేడ్ బంద్‌కు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు దుకాణాలన్నీ మూసి నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతున్నారు. తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి పట్టణాలకు చెందిన సుమారు 10 వేల మంది వ్యాపారులు బంద్‌లో పాల్గొంటున్నారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సభ్యత్వం ఉన్న 27 వ్యాపార సంఘాలు మూకుమ్మడిగా బంద్‌కు పిలుపునిచ్చాయి. తిరుపతి సీటీవో-2 గా విధులు నిర్వర్తిస్తోన్న శ్రీనివాసులు నాయుడు వేధింపులకు నిరసనగా బంద్ పిలుపు ఇచ్చినట్లు తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్ పేర్కొన్నారు. ఇదీ వ్యాపార వర్గాల వాదన... తిరుపతి సీటీవో శ్రీనివాసులు నాయుడు వ్యవహార శైలి బొత్తిగా బాగోలేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తన మాట వినని వ్యాపారులపై ఉద్దేశపూర్వకంగా పెనాల్టీలు విధించడం, చిన్నచిన్న తప్పిదాలను ఎత్తిచూపి భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేయడం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్లతో తనకున్న పరిచయాలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా తమను వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి. వ్యాపారులంతా పలుమార్లు సీటీవోను కలిసి గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో వీరు మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, యనమల రామకృష్ణులను కలిశారు. సీటీవో శ్రీనివాసులు నాయుడును బదిలీ చేయకపోతే వ్యాపారాలు చేయడం కష్టమని చెప్పారు. అయినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా సీటీవో శ్రీనివాసులునాయుడు నగరంలో టైల్స్, ఇటుక వ్యాపారులను పట్టుకుని భారీగా పెనాల్టీలు విధించారు. దీంతో వ్యాపారులంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. అన్ని వ్యాపార సంఘాల అధ్యక్షులూ ప్రత్యేకంగా సమావేశమై మూడు రోజుల బంద్‌కు నిర్ణయం తీసుకున్నారు. బంద్ పోస్టర్లను కూడా విడుదల చేశారు. మంగళవారం తిరుపతి ఆర్ట్స్ కాలేజీ నుంచి పెద్ద ఎత్తున మోటార్‌బైక్‌ల ర్యాలీ ప్రారంభించి నగరంలోని ప్రధాన రోడ్లపై నిరసన నిర్వహించారు. సీటీవో శ్రీనివాసులు నాయుడును బదిలీ చేసే వరకూ ఆందోళనలను వీడబోమని వ్యాపార సంఘాలు స్పష్టం చేశాయి. పన్నులు చెల్లించేందుకు తాము వ్యతిరేకం కాదనీ, సీటీవో వ్యవహార శైలినే ఇబ్బందికరంగా ఉందన్నది వీరి వాదన. బంద్ జరిగితే... ఈ నెల 27 నుంచి తిరుపతిలో మహానాడు జరుగనుంది. 25 నుంచి ట్రేడ్ బంద్ జరిగితే హోటళ్లు, ట్రావెల్స్, ఫ్యాన్సీ, రెడీమేడ్, క్లాత్, ఐరన్, హార్డ్‌వేర్, కిరాణా, జ్యుయెల్లరీ షాపులన్నీ మూత పడతాయి. ప్రధానంగా హోటళ్లు మూతపడితే మహానాడుకు వచ్చే అతిథులకు గదులు దొరకడం కష్టమవుతుంది. నగరంలో వాటర్ సప్లయి, కొండ మీదకు పప్పులు, నూనెలు తీసుకెళ్లే లారీలు కూడా నిలిచిపోతాయి. ఇదే జరిగితే తిరుమల నిత్యాన్న పథకానికీ ఇబ్బందులు తలెత్తే వీలుంది. మెడికల్ షాపులు కూడా మూతపడనున్నాయి. సీటీవో ఏమంటున్నారంటే... వ్యాపార వర్గాల ఆరోపణలను సీటీవో శ్రీనివాసులు నాయుడు ఖండిస్తున్నారు. వారి ఆరోపణలన్నీ అవాస్తవమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ మాట్లాడలేనని 'సాక్షి' తో పేర్కొన్నారు. -
సమరపథంలో వ్యాపారులు
అమలాపురం టౌన్ : జిల్లాలో వ్యాపారవర్గాలు పోరుబాట పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యాపార వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం జిల్లా బంద్‌కు వ్యాపార సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. జిల్లాలోని బంగారు వర్తక సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఆందోళనలో భాగస్వాములవుతున్నాయి. ఇప్పటికే బంగారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంగారు వర్తక సంఘాలు గత వారం రోజులుగా బంగారు దుకాణాల్ని మూసివేసి, సమ్మె చేస్తున్నాయి. జిల్లాలో ఉన్న 12 బులియన్ అసోసియేషన్లు ఆ బాటలోనే నడుస్తూ, వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నాయి. కాగా బంగారు వర్తకుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూనే మరోపక్క వాణిజ్య పన్నుల శాఖ వ్యాపార వ్యతిరేక విధానాలు, ఆ శాఖ అధికారుల వేధింపులను నిరసిస్తూ జిల్లాలోని 17 చాంబర్ ఆఫ్ కామర్స్‌లు గురువారం బంద్‌కు సంకల్పించాయి. రెడీమేడ్ దుస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ విధించటంతో జిల్లాలోని వస్త్ర వ్యాపారులు ముఖ్యంగా రెడీమేడ్ దుస్తుల దుకాణాల యజమానులు ధ్వజమెత్తుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యాపార వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నందుకే జిల్లాలోని అన్ని చాంబర్ ఆఫ్ కామర్స్‌లు ఉమ్మడి పోరుకు దిగాయని అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ అన్నారు. వారం రోజులుగా విస్తృత ప్రచారం ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖ విధానాల వల్ల కిరాణా వర్తకులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా చాంబర్ ఆఫ్ కామర్స్‌లో భాగస్వాములైన కిరాణా వర్తక సంఘాలు కూడా గురువారం నాటి బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తూ దుకాణాలు మూసివేయనున్నాయి. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని, రామచంద్రపురం, మండపేట, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, పెద్దాపురం తదితర ముఖ్య ప్రాంతాల్లోని బులియన్ అసోసియేషన్లు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లు గత వారం రోజులుగా జిల్లాలో గురువారం వర్తక బంద్ విజయవంతానికి ఆయా నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో ఆటోలు, లౌడ్ స్పీకర్ల ద్వారా విస్తృత ప్రచారం చేశాయి. ప్రభుత్వ విధానాలను, తమ బంద్‌కు, సమ్మెకు కారణాలను వివరిస్తూ కరపత్రాలు ముద్రించి, ప్రజలకు పంపిణీ చేశాయి. జిల్లాలో నేటి బంద్‌లో దాదాపు 2,500 మంది బంగారు వర్తకులు, 18 వేల మంది స్వర్ణకారులు, కార్మికులు పాల్గొంటున్నారు. దాదాపు రెండు వేల బంగారు దుకాణాలు బంద్ పాటిస్తున్నాయి. అన్ని వ్యాపార వర్గాలకు సంబంధించి జిల్లాలో గురువారం దాదాపు 15 వేలకు పైగా దుకాణాలు మూతపడనున్నాయి. నేడు వ్యాపారుల ర్యాలీలు, ధర్నాలు జిల్లాలోని బులియన్ అసోసియేషన్లు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లు, ఇతర వ్యాపార సంఘాలు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆర్డీవో, తహశీల్దార్లకు ఇవ్వనున్నాయి. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని తదితర ప్రాంతాల్లో వ్యాపార సంఘాలన్నీ ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. అమలాపురం బులియన్ అసోసియేషన్, రెండు చాంబర్ ఆఫ్ కామర్స్‌లు, కోనసీమ కిరాణా చాంబర్ ఆఫ్ కామర్స్‌ల ఆధ్వర్యంలో గడియారం స్తంభం సెంటరులో తొలుతు నిరసన తెలిపి ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం అందించనున్నారు. మందుల షాపులకు మినహాయింపు గురువారం జిల్లాలో దాదాపు అన్ని రకాల దుకాణాలు మూతపడనుండటంతో వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. లావాదేవీలు స్తంభించటం వల్ల రూ.100 కోట్లకు పైగా వ్యాపారం నిలిచిపోనుందని అంచనా. అయితే రోగులకు అవస్థ కలగకుండా బంద్ నుంచి మందుల దుకాణాలను మినహాయించారు. జిల్లావ్యాప్త బంద్ నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
అడ్డగోలు జీవోలు రద్దు చేయండి
కొత్తపేట(గుంటూరు) : వ్యాపారుల నడ్డివిరిచేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడ్డగోలు జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన జిల్లా వ్యాప్త వ్యాపార సంస్థల బంద్ విజయవంతమైంది. నగరంలో ఉన్న అన్ని వ్యాపార సంస్ధలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. దీంతో క్లాత్, కిరాణా, ఫ్యాన్సీ, బంగారం తదితర సంస్ధలకు చెందిన దుకాణాలు బంద్ పాటించాయి. నిత్యం వ్యాపారాలతో కిటకిటలాడే నగర ప్రధాన వీధుల బోసిపోయాయి. రేపు రాజమండ్రిలో మహాసభ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలను ఇరుకున పెట్టే ఇబ్బందికర జీవోలను వెంటనే రద్దు పరిచేలా తగు నిర్ణయం తీసుకోవాలని గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్టాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంక్షలను సడలించి, పునఃపరిశీలించుకోవాలన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యాపార సంస్ధలకు సంబంధించిన ప్రతినిధులతో ఈ నెల 14 న రాజమండ్రిలో మహాసభను ఏర్పాటు చేస్తునున్నట్టు ఆయన వెల్లండించారు.ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు తేదీ ఖరారు, కార్యచరణ ప్రకటన వంటి వాటిపై సరైన నిర్ణయాలు తీసుకొని ప్రకటించనున్నట్టు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమలులో ఉన్న ఆ మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వాణిజ్య కేంద్రంగా ఖమ్మం
ఖమ్మం గాంధీచౌక్: బ్రిటీష్ కాలం నాటి చట్టాలతో వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆయా చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ధ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.సోమవారం రాత్రి స్థానిక వర్తక సంఘం భవనంలో జరిగిన చాంబర్ ఆఫ్ కామర్స్ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల ముగింపు సభలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొందని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. వ్యాపారులు సంతోషంగా ఉంటే రైతులు సంతోషంగా ఉంటారని, వారి ద్వారా కూలీలు తద్వారా ప్రభుత్వం ఆనందంగా ఉంటుందని అన్నారు. గుజరాత్, పంజాబు రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో, వ్యాపార, వ్యవసాయ రంగాలలో ముందంజలో ఉండే విధంగా కృషి జరుగుతుందన్నారు. జిల్లాలో ఖమ్మన్ని వాణిజ్య కేంద్రంగా గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తుమ్మల అన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు వంటి పట్టణాలు పారిశ్రామికంగా, సింగరేణి కేంద్రాలకు బాసిల్లుతున్నాయని, ఖమ్మం వాణిజ్య కేంద్రంగా మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రణాళిక చేస్తున్నామని అన్నారు. ఖమ్మం నగరానికి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందే అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్దికి మరో రూ.500 కోట్లు వెచ్చిచనున్నామని తెలిపారు. ఖమ్మాన్ని అనుసందానం చేస్తూ జాతీయ రహదారులను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని అన్నారు. విద్య, వ్యవసాయం, సాంస్కతిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో ఖమ్మాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపి గుర్తింపు తీసుకువచ్చేందు కృషి చేస్తానన్నారు. మనిషి విశాలంగా ఎదగాలని సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో అందరూ బాగస్వాములు కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ, ఇతర రంగాలకు మాదిరిగా పరిశ్రమలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శివకుమార్ గుప్తాఅన్నారు. పన్నుల విధానంలో అనేక ఇబ్బందులను వ్యాపారులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రిని కలిసి విన్నవించామన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మేళ్ల చెరువు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన సభలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, మాజీ అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు నరేష్ కుమార్, మెంతుల శ్రీశైలం తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు గుడవర్తి శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శి చింతల రామలింగేశ్వరరావు, కోశాధికారులు కురువెల్ల ప్రవీణ్ కుమార్, తూములూరి లక్ష్మీ నర్సింహారావు, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు అశోక్, 19 శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వర్తక సంఘం భవన ఆవరణలో మంత్రి ప్రతిష్టించారు. ‘వాణిజ్య వాణి’ సావనీరును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. -
రైతు బజార్ల ద్వారా ఇక నిత్యావసరాలు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని రైతు బజార్ల ద్వారా నిత్యావసర సరుకులను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పా టు జిల్లాలోని ఇతర వ్యాపారులు కూడా సహకరించాలని జేసీ రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మి నీ కాన్ఫరెన్స హాల్లో శుక్రవారం సాయంత్రం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన వినియోగదార్ల సంఘాల ప్ర తినిధులు, వర్తక సంఘాలను నిత్యావసరాలను త క్కువ ధరలకే విక్రయించేలా ఒప్పించారు. ప్రజలకు అందుబాటు ధరలకు నిత్యావసర సరుకులను అందించాలన్నారు. బియ్యంతో పాటు మంచినూనె, పంచదార, చింతపండు, పప్పులు తదితర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడానికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. పట్టణంలోని మూ డు రైతుబజార్లతో పాటు పార్వతీపురం రైతుబజార్లో కూడా శనివారం నుంచి అందుబాటు ధరల్లో నిత్యావసరాలు విక్రయించాలన్నారు. వర్తక సంఘాల ఒప్పం దం మేరకు కిలో రూ.70 నుంచి 80 రూపాయలు పలుకుతున్న కందిపప్పు కిలో 67 రూపాయలకు విక్రయిస్తామన్నారు.అదేవిధంగా *90 పలుకుతున్న మినపగుళ్లను కిలో *75కు సరఫరా చేస్తామన్నారు. పెసరపప్పును కిలో *86కు ఇస్తామన్నారు. ఈ ధరలు వ్యాపారులు రైతుబజార్లకు విక్రయించగా వాటిని వినియోగదారులకు మహిళా సంఘాలు 50 పైసల మార్జిన్‌తో విక్రయిస్తారన్నారు. అలాగే పామాయిల్‌ను కిలో *58 కు విక్రయిస్తారన్నారు. టమోటాను *26కు, సన్నబి య్యం *30లకు విక్రయిస్తున్నామనీ, వీటిని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. బంగాళాదుంపల ధర అధికంగా ఉన్నప్పటికీ రెండు రోజుల్లో తగ్గే అవకాశముండటంతో వాటిని మినహాయించారు. చింతపం డు జీసీసీ ద్వారా *25కు సరఫరా అవుతోందనీ, దాన్ని విక్రయించడానికి వర్తకులు ముందుకు వస్తే వారికి మార్జిన్ మనీ అందిస్తామన్నారు. అలాగే ఎక్కువ ధర ఉన్న ఎండుమిర్చిని భద్రాచలం నుంచి తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా సబ్సిడీపై అందిస్తున్నట్టు జేసీ తెలిపారు. జిల్లాలో ప్ర స్తుతానికి ఎరువుల కొరతలేదన్నారు. మార్క్‌ఫెడ్, ఇతర డీలర్ల ద్వారా కూడా ఎరువులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 5,300 టన్నుల యూరియా, 4వేల టన్నుల డీఏపీ, 1300 టన్నుల ఎంఓసీ, 2200 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వరి విత్తనాలు కిలోకి *5, వేరుశనగ విత్తనాలు కిలోకు *15, పెసర, మినుము, కంది, పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తామన్నారు. ధరల నియంత్రణకు సహకరించి రైతుబజార్లలో విక్రయాలకు అంగీకరించిన వర్తక సంఘాలకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ జే వెంకటరావు, వ్యవసాయ శాఖ జేడీ డి.ప్రమీల, డీఎస్ఓ హెచ్వీ ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు జి శివకుమార్, ఎంవీ చలం,పప్పులు, నూనెల వర్తక సంఘాల ప్రతినిధులు సంతోష్, కె.సతీష్, అనీష్, ఉల్లి వ్యాపార సంఘం ప్రతినిధి డి.రమేష్‌కుమార్, బియ్యం వర్తక సంఘ ప్రతినిధి పి.నాగేశ్వరరావు, ధరల నియంత్రణ కమిటీ సభ్యుడు జే.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యంగా ఉందాం.. సమరం చేద్దాం
తాడేపల్లిగూడెం : వ్యాపారులంతా సమైక్యంగా ఉంటూ.. సమస్యల పరి ష్కారం కోసం సమరం సాగించాలని సీమాంధ్రలోని వ్యాపార రంగాని చెందిన ప్రతినిధులు నినదించారు. స్థానిక గమిని ఫంక్షన్ ప్లాజాలో మంగళవారం సీమాంధ్ర ప్రాంత వర్తక సంఘ ప్రతిని ధుల సమావేశం తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ మిల్లర్స్ అధ్యక్షుడు గమిని సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించి, నాన్‌బెయిలబుల్ సెక్షన్ చొప్పిస్తే వ్యాపారులంతా రోడ్డున పడే ప్రమాదం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి సెక్షన్ల వల్ల చాలామంది ఆస్తులు కోల్పోయి, అనారోగ్యం పాలయ్యూరని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే నాన్‌బెయిలబుల్ సెక్షన్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయూలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ చాంబర్ ఆఫ్ మర్చంట్స్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ వ్యాపారాలకు దశ, దిశ లేకపోవడంతో చాలా నష్టం జరిగిందన్నారు. అంతా కలసి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేశామని, రాష్ట్రం విడిపోవడంతో రాత్రికి రాత్రే వ్యాపారాలను వదిలేసి సొంత జిల్లాలకు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోధుమ ఆధారిత పరిశ్రమలు తెలంగాణలో ఉండిపోవడం వల్ల ఆ ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చుకోవడానికి వ్యాట్, సీఎస్టీ చెల్లించాల్సి వస్తుందన్నారు. రోజువారీ అవసరాల కోసం తెలంగాణలోని 39 మిల్లుల నుంచి 1,260 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. పంచదారపై ఏ రాష్ట్రంలోనూ వ్యాట్ లేదని, మన రాష్ట్రంలో మాత్రం వసూలు చేస్తున్నారని తెలి పారు. చాలా సరుకులను ఇక్కడ వ్యాట్ పరిధిలోకి తీసుకెళ్లారన్నారు. ఇవి చాలవన్నట్టుగా నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి ఉల్లిపాయలు, బంగాళా దుంపలను చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో సిద్ధం చేసిందని, అది ఎప్పుడైనా బయటకు రావచ్చని అన్నారు. నిత్యావసర సరుకుల చట్టంలో నాన్‌బెరుులబుల్ సెక్షన్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని, దీనిని అడ్డుకునేందుకు వ్యాపారులంతా సమైక్యంగా పోరాడాలన్నారు. ఇలాం టి జీవోలు వస్తే అధికారులు తీసుకునే మామూళ్లను పెంచేసి వేధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయూలపై సీమాంధ్రలోని అన్ని జిల్లాల వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామని, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను వివరిస్తామని చెప్పారు. భీమవరం వర్తక సంఘ ప్రతినిధి సభాపతి, అత్తిలి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం వ్యాపార వర్గ ప్రతినిధి కర్పూరం నారాయణరావు, తణుకు చాంబర్ ప్రతినిధి గమిని రాజా, తాడేపల్లిగూడెం చాంబర్ కార్యదర్శి నరిశే సోమేశ్వరరావు, వివిధ జిల్లాల వ్యాపార సంఘాల ప్రతినిధులు నాన్ బెయిలబుల్ సెక్షన్‌ను నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని నిరసించారు. వ్యాపారుల్ని సంప్రదించాలి వ్యాపారాలకు సంబంధించి చట్టా లు చేసే సమయంలో ప్రభుత్వం ఆయా విభాగాల వారితో సంప్రదించాలి. భయంకర యాక్టులు వ్యాపారులపై రుద్దకండి. పన్నులు చెల్లించకుంటే ఖజానా ఎలా నిండుతుందని అడుగవద్దు. వ్యాపారుల నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తుందో చెప్పండి. ఈసీ యాక్టులో నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే వ్యాపారులకు వేధింపులు, అధికారులకు ఆదాయం పెంపుదల తప్ప వేరే ప్రయోజనం ఉండదు. - కొప్పు సత్యనారాయణ, పాలకొల్లు భారాలు మాపై మోపుతారా ప్రజలకు అవి ఉచితంగా ఇస్తాం.. ఇవి ఉచితంగా ఇస్తాం అని హామీలు ఇస్తారు. ఆ భారం మోయడానికి వ్యాపారులే ప్రభుత్వానికి కనిపిస్తున్నారు. రెవెన్యూ లోటు పూడాలంటే వ్యాపారులే దొరికారా. జంబ్లింగ్ తనిఖీల పేరిట వ్యాపారులను భయాందోళనలకు గురి చేయవద్దు. ఈసీ యాక్టులో నాన్ బెయిలబుల్ సెక్షన్ వద్దే వద్దు. - కాగిత వెంకటరమణారావు, ప్రధాన కార్యదర్శి, జిల్లా వర్తక, వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య -
చాంబర్ ఆఫ్ కామర్స్‌ను విస్తరించాలి
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: చాంబర్ ఆఫ్ కామర్స్‌ను జిల్లావ్యాప్తంగా విస్తరించాలని కలెక్టర్ ఐ. శ్రీనివాస శ్రీనరేష్ సూచించారు. ఆదివారం రాత్రి చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఆవిర్భవించి 60 ఏళ్లు అవుతోందని, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ముందంజలో ఉందని అన్నారు. మరింతగా ముందుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యావంతులైన పలువురు యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి చేయూతనందిస్తే వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారని అన్నారు. జిల్లా కేంద్రంలో అనేక సమస్యలున్నాయని, ప్రధానంగా ట్రాఫిక్ సమస్య నెలకొందని అన్నారు. రహదారులను అభివృద్ధి చేయడంతోపాటు నగరంలో వ్యాపారాలను శివారు ప్రాంతాలకు విస్తరింపచేయాలని సూచించారు. నగరాభివృద్ధికోసం వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇన్నర్ రింగ్‌రోడ్, అవుటర్ రింగ్‌రోడ్ కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో అపారంగా ఖనిజ సంపద ఉందని, దానికి అనుగుణంగా పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులు దగా కాకుండా చాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్భవించిందని, మార్కెట్లలో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులు దగా కాకుండా చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సేవలు రైతులకు, ప్రజలకు అందించాలని తెలిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు జిల్లా అసోసియేషన్‌గా విస్తరింపచేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం త్రీటౌన్ సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించి మోడ్రన్ మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు. త్రీటౌన్ నుంచి ప్రభుత్వానికి రూ.12 కోట్ల రెవెన్యూ వస్తోందన్నారు. త్రీటౌన్‌లో ఉన్న మార్కెట్‌ను బస్టాండ్‌గా అభివృద్ధి చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. వ్యాపార విద్యా విశ్లేషకురాలు వై.శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల్లో వ్యాపారుల పట్ల వ్యతిరేక భావన ఉందన్నారు. వ్యాపారులు ఆ విధంగా వ్యవహరించకుండా ఉండాలని కోరారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, తెలుగు వేద, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రసంగించారు. చాంబర్ ఆఫ్‌కామర్స్ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, సహాయ కార్యదర్శి చింతల రామలింగేశ్వరరావు, కోశాధికారులు కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, తూములూరి లక్ష్మీ నరసింహారావులతోపాటు పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధ్యక్ష,కార్యదర్శులతో ఎన్నికల అధికారి వీవీ అప్పారావు ప్రమాణస్వీకారం చేయించారు. ఆత్మీయ అతిథులకు అవమానం.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆత్మీయ అతిథులు అవమానానికి గురయ్యారు. ఆత్మీయ అతిథులుగా ఆహ్వాన పత్రికల్లో ప్రచురించినప్పటికీ ప్రమాణ స్వీకార సమయంలో వారి గురించి మాట్లాడక పోవడం, వేదికపైకి ఆహ్వానించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వెంపటి లక్ష్మీనారాయణ, కొప్పు నరేష్కుమార్, గుర్రం ఉమామహేశ్వరరావు, మెంతుల శ్రీశైలం తదితరులను విస్మరించడంతో వారు కాసేపు ఉండి వెళ్లిపోయారు. -
అందరి ఆకాంక్ష సమైక్యతే
సాక్షి, విజయవాడ : జిల్లాలోని అన్నివర్గాలూ సమైక్యాంధ్ర ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్నాయి. రోడ్లపైకి వచ్చి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎండగడుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ట్రేడ్బంద్ విజయవంతమైంది. ముస్లింలు మసీదుల్లో ప్రార్థనల అనంతరం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మచిలీపట్నంలో మునిసిపల్ అధికారులు, ఉద్యోగులు వినూత్నంగా రోడ్లు ఊడ్చి, డ్రెయిన్ల పూడిక తీసి నిరసన తెలిపారు. మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు బంద్ పాటించారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు జెడ్పీ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. రెండు వేలమందికి భోజనాలు పెట్టారు. కంకిపాడులో ఉపాధ్యాయులు, సమైక్యవాదులు, ఎన్జీవోలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో జరుగుతున్న జేఏసీ రిలేదీక్షల్లో మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో సెల్ మెకానిక్‌లు, అసోసియేషన్ నాయకులు భారీ ఎత్తున ప్రదర్శన చేశారు. మునిసిపల్ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. న్యాయవాదులు మానవహారంగా ఏర్పడ్డారు. కైకలూరులో జాతీయ రహదారిపై మాక్ డ్రిల్ చేపట్టారు. చిల్లకల్లులో తోపుడు బళ్ల వ్యాపారులు మానవహారం నిర్మించారు. మైలవరంలో ఆర్ఎంపీలు, ల్యాబ్‌ల నిర్వాహకులు, మెడికల్ షాపుల యజమానులు, పారా మెడికల్ సిబ్బంది, వ్యాపారులు తమ దుకాణాలు మూసి భారీ ర్యాలీ నిర్వహించారు. దివిసీమ బంద్ విజయవంతమైంది. చల్లపల్లిలో జాతీయరహదారిపై ముస్లింలు వంటావార్పు నిర్వహించారు. రహదారిపైనే ప్రార్థనలు జరిపి, భోజనాలు చేశారు. విస్సన్నపేటలో బంద్ నిర్వహించారు. ఏకొం డూరు మండలం పోలిశెట్టిపాడులో రాస్తారోకో చేశారు. గంపలగూడెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నూజివీడు లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు 23వ రోజుకు చేరాయి. న్యాయవాదుల రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి. మున్సిపల్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన ప్రదర్శన చేశారు. జగ్గయ్యపేటలో ఉపాధ్యాయ సంఘాల నేతలు స్థానిక రైతుబజారులో కూరగాయలు అమ్ముతూ నిరసనను వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరులో పెయింటర్లు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఉయ్యూరులో ఐఎంఏ నేతృత్వంలో వైద్యులు సంపూర్ణ బంద్ పాటిం చారు. దీక్షా శిబిరం వద్దే అత్యవసర వైద్య సేవలు అందించి వినూత్న నిరసన తెలిపారు. టింబర్ డిపో, కార్పెంటరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ-మచిలీపట్నం జాతీ య రహదారిపై బస్టాండ్ సెంటర్ సమీపంలో వంటవార్పుతో రహదారిని దిగ్బంధించారు. క్రేనుకు కేసీఆర్ ఫ్లెక్సీని దుంగకు ఉరివేసి వేలాడదీసి వాహనాలతో భారీ ప్రదర్శనగా ఉయ్యూరు వీరమ్మతల్లి ఆలయం వరకు వెళ్లారు. విజయవాడలో.. రామవరప్పాడు రింగ్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం జరిగింది. మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు సమావేశమై 7న సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయిం చారు. 10 నుంచి వీధిదీపాలు ఆపేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సమావేశమై మంచినీటి సరఫరాపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇరిగేషన్ ఇంజినీర్లు వారం రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని ఆ తర్వాత సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. తెలుగుతల్లి ఐసీయూ లో ఉందంటూ వైద్యులు, వైద్య ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో చిచ్చుపెట్టిన సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యుత్ జేఏసీ సభ్యులు ఎన్జీవోల దీక్షా శిబిరంలో రిలే దీక్షలు చేశారు. కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ వ్యాపారులు ట్రేడ్ బంద్ పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. చిట్టినగర్‌లో కొత్త అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు అమ్మవారికి 101 కొబ్బరి కాయలను కొట్టారు. ఆర్టీసీ బస్సులు లేకపోవటంతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉచిత ఆటో సర్వీసులను ప్రారంభించారు. లయోలా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి నల్లబెలూన్లను వదిలి నిరసన తెలిపి, నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ సభ్యులు, లాయర్లు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించి గుంటూరు వరకు పాదయాత్ర చేపట్టారు. సింగ్‌నగర్ పైపులరోడ్డు సెంటర్లో వివిధ పాఠశాలల విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉప్పలగుప్ప, కరా టే, ఇతర ఆటలను ఆడి నిరసన తెలిపారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం జరిగింది. -
విడిపోతే విపరీతాలే : భాను
జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : అసమర్ధ పాలకుల చేతకాని తనం వల్ల అసలే అంతంమాత్రంగా బతుకీడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రం విడిపోతే మరిన్ని విపరీత అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సాగునీరందక, అరకొర విద్యుత్‌తో సీమాంధ్ర అన్ని విధాలుగా నష్టపోయి అంధకారమయమవుతుందని తెలిపారు. 58 రోజులుగా అమరణ నిరాహార దీక్షచేపట్టి ఆత్మబలిదానం ద్వారా సమైక్యాంధ్రను సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పోడవటం సీమాంధ్రవాసుల దౌర్భాగ్యమన్నారు. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా తెలుగు వారంతా కలసి ఉంటేనే సుఖంగా ఉంటారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉన్నత, సాంకేతిక విద్య నభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల విషయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయని, ప్రత్యేక ప్యాకేజీల ద్వారా వాటిని అభివృద్ధి చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. ఎగువ ప్రాంతంలో ప్రవహించే గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణా వారి ఆధిపత్యం కొనసాగి డెల్టా ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. కావేరి జలాల విషయమై కర్నాటక, తమిళనాడు వివాదాల వలే నిత్యం జలపోరాటాలు తప్పవని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రవహించే మునేరుపై ఖమ్మం జిల్లా మధిర వద్ద డెప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క డ్యాం నిర్మిస్నున్నారని, దీనివల్ల పేట నియోజకవర్గంలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు ప్రాంతంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందక ఎండిపోయే ప్రమాదముందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఒకే నినాదంతో సీమాంధ్ర ప్రజలంతా ఏకం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, అఖిలపక్ష, ఎన్జీవో, ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని విరమించేదిలేదు.. జగ్గయ్యపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విరమించేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వద్ద నిర్వహిస్తున్న రెండో రోజు రిలే నిరాహార దీక్షలను బుధవారం ఆయన సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. దీక్షలో కూర్చున్నవారిలో టూవీలర్ మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు జి.ముక్తేశ్వరరావు, ఉపేంద్ర, బి.రంగా, ఎండి. కలీల్ , ఎస్కె.హఫీజ్, సైదా,నాగులు, షమ్మీముల్లా, మున్నా తదితరులు ఉన్నారు. అఖిల పక్ష , జేఏసీ ప్రతినిధులు జే.ఉదయభాస్కర్, ఎస్ఎం.రఫీ, మనోహర్,రాంబాబు, న్యాయవాది రాము, జగదీష్, అబ్బాస్ ఆలీ, కన్నా నరసింహారావు, కొప్పాల శ్రీను, వెంకట్రావు, ఉషారాణి, రఘుబాబు, నారాయణరావు, శేషంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ర్యాలీ... సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పట్టణంలోని రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమైక్యవాదులు కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాలు, ఎన్జీవో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘చాంబర్’ ఎన్నికలకు రంగం సిద్ధం
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్:ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్(వర్తక సంఘం) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడేళ్లకోసారి ఈ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. వివిద శాఖలకు చెందిన 229 మంది చాంబర్ ఆఫ్ కామర్స్‌లో నూతన సభ్యత్వాల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ప్రస్తుత కమిటీలో వివాదం చెలరేగి రెండువర్గాలుగా విడిపోయారు. కొత్తవారికి సభ్యత్వాలు ఇవ్వాలని ఒక వర్గం, ఎన్నికల తరువాత ఏర్పడే నూతన కమిటీలో వారికి స్థానం కల్పించాలని మరో వర్గం పట్టుబట్టాయి. ఎట్టకేలకు చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు ఈ వివాదాన్ని పరిష్కరించటంతో ఎన్నికలకు సుగమమైంది. నూతన సభ్యులను పక్కనబెట్టి ప్రస్తుతం ఉన్న 993 మంది సభ్యులతో సెప్టెంబర్ 8న ఎన్నికలు నిర్వహించాలని ప్రస్తుత కమిటీ నిర్ణయించింది. కమిటీలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఐదుగురు కార్యవర్గ సభ్యులు ఉంటారు. మొత్తం 19 వ్యాపార శాఖలకు చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. ఎన్నికల అధికారులుగా వి.వి.అప్పారావు, సర్వదేవభట్ల సోమశేఖర శర్మ వ్యవహరిస్తున్నారు. ఓటర్లలో మార్కెట్ వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు అధికంగా ఉన్నారు. మార్కెట్లో వ్యాపారం చేసే 417 మంది, క్లాత్ అండ్ రెడీమేడ్ దుకాణాల వ్యాపారులు 70 మంది, బంగారం, వెండి దుకాణాల వ్యాపారులు 114 మంది, కిరాణం దుకాణాలకు చెందిన 29 మంది, ఎగుమతి శాఖకు చెందిన 50 మంది, దాల్ మిల్ వ్యాపారులు 23 మంది, ఆయిల్ మిల్ వ్యాపారులు 11 మంది, రైస్‌మిల్ వ్యాపారులు 11 మంది, జనరల్ మనియారీ శాఖకు చెందిన 33 మంది, సామిల్స్‌కు చెందిన 42 మంది, మిర్చి శాఖకు చెందిన వ్యాపారులు 45 మంది, సిమెంట్ వ్యాపారులు 21 మంది, కలప వ్యాపారులు 11 మంది, మోటార్స్ అండ్ పైప్స్ వ్యాపారులు 14 మంది, ఇనుము వ్యాపారులు 19 మంది, ధాన్యం వ్యాపారులు 15 మంది, కాన్వాసింగ్ వ్యాపారులు 26 మంది, కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు 13 మంది, డిస్ట్రిబ్యూటర్లు 33 మంది, జిన్నింగ్ మిల్ వ్యాపారులు ఏడుగురు ఓటర్లుగా ఉన్నారు. వీరంతా కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.