current wires
-
అన్నమయ్య జిల్లా: గృహ ప్రవేశం జరుగుతున్న ఇంట విషాదం
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గృహప్రవేశం కార్యక్రమంలో ఇంటికి వచ్చిన బంధువులపై కరెంట్ తీగలు తెగిపడటంతో నలుగురు మృతిచెందారు. దీంతో, వేడుక జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగమాకులపల్లెలో గృహప్రవేశం జరిగిన ఇంట విషాదం నెలకొంది. ఓ ఇళ్లు గృహప్రవేశానికి వేసిన షామియాన గాలికి కరెంట్ తీగలపై పడింది. దీంతో, ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగి.. అక్కడున్న వారిపై పడటంతో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరికొందరు గాయపడటంతో వారిని వెంటనే బి.కొత్తకోట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. కాగా, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వేడుక జరుగుతున్న ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నారు. మృతుల వివరాలు ఇవే.. 1. లక్ష్మమ్మ 75, 2.ప్రశాంత్ 26, 3. లక్ష్మన్న 53, 4. శాంతమ్మ 48. -
మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ
రాయదుర్గం/ బొమ్మనహాళ్/ సాక్షి, అమరావతి: కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వ్యవసాయ కూలీలను కరెంటు తీగ కాటేసింది. ట్రాక్టర్లో ఇళ్లకు తిరుగు పయనమవుతున్న సమయంలో వారి బతుకులు బుగ్గిపాలయ్యాయి. అప్పటి వరకు మేఘావృతమై కనిపించిన ఆకాశం.. పనులు పూర్తయ్యే సరికి చిరుజల్లులు కురిపించింది. దీంతో 11 కేవీ విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్‌కు గురయ్యాయి. ఓ తీగ తెగి కూలీలు వెళ్తున్న ట్రాక్టర్‌పై పడింది. అక్కడికక్కడే నలుగురు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్ కుమార్ తదితరులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బళ్లారి ఆస్పత్రికి వెళ్లి మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద విషయాన్ని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి దర్గా హొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. (విద్యుత్ శాఖ ద్వారా రూ.5 లక్షలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5 లక్షలు) బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని అధికారులకు ఆదేశించారు. కాగా, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు, ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలిచ్చామన్నారు. ‘కండక్టర్’ తెగడం వల్లే ప్రమాదం ఇన్సులేటర్ ఫ్లాష్ అవ్వడంతో కండక్టర్ తెగడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ కే సంతోషరావు తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి–ఎంఎం) డి.వి.చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ–యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించామని చెప్పారు. ఈ కమిటీని హుటాహుటిన సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్.మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్. హమీదుల్లా బేగ్, లైన్మెన్ (దర్గా హొన్నూర్) కె.బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని సీఎండీ తెలిపారు. అనంతపురం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం–పి/అనంతపురం) కె. రమేష్‌ల నుంచి వివరణ కోరుతూ మెమో జారీ చేశామన్నారు. -
11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్
-
11కేవీ హైఓల్టేజ్ కరెంట్ తీగలపై స్టంట్స్.. వీడియో వైరల్
లక్నో: మన ఇంట్లోని సింగిల్ పేస్ కరెంట్ షాక్ తగిలితేనే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి 11 కేవీ విద్యుత్తు వైర్లను తాకితే ఏమైనా ఉందా? స్పాట్లోనే మాడి మసైపోతాం. కానీ, ఓ వ్యక్తి ప్రమాదకర సహసానికి పూనుకున్నాడు. 11కేవీ విద్యుత్తు తీగలపై స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్ 24న నగరంలోని అమారియా ప్రాంతంలో నౌషద్ అనే వ్యక్తి ఈ ప్రమాదకర సాహసం చేశాడు. ఇళ్ల పైకప్పుపైకి ఎక్కి విద్యుత్తు తీగలపైకి చేరుకున్నాడు. ఊయల మాదిరిగా ఊగుతూ అందరిని షాక్‌కు గురిచేశాడు. అయితే.. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయటం.. అతడికి అదృష్టంగా మారింది. లేకపోతే.. కాలి బూడిదయ్యేవాడు. హైఓల్టేజ్ తీగలపై వేలాడుతున్న వ్యక్తిని చూసిన కొందరు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేశారు. విద్యుత్తు సరఫరా ప్రారంభించవద్దని సూచించారు. వెంటనే అక్కడికి చేరుకున్న విద్యుత్తు అధికారులు.. నౌషద్‌ను బలవంతంగా కిందకు దించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారితో పంపించారు. నౌషద్ ప్రస్తుతం బండిపై గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇలా ఎందుకు చేశాడో నౌషద్ చెప్పలేదు. అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Viral Video:రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్ -
విద్యుత్ తీగలు తగిలి టిప్పర్ దగ్ధం
-
కడుపు కొట్టిన కరెంటు...
సాక్షి, కేవీబీపురం(చిత్తూరు) : కరెంటు... ఆ రైతు కుటుంబాన్ని చితికిపోయేలా చేసింది. రెండేళ్ల క్రితం రైతు కుమారుడిని పొట్టన పెట్టుకున్న కరెంటు, ఈ పర్యాయం ఆ రైతు చెరకు తోటను బుగ్గి చేసింది. విధి విలాసమో, ట్రాన్స్‌కో నిర్లక్ష్యమోగానీ ఆ కుటుంబానికి మళ్లీ కోలుకోలేని దెబ్బపడింది. విద్యుత్ వైరు తెగి పడి చెరకుతోట దగ్ధమైన సంఘటన మంగళవారం మండలంలోని కోటమంగాపురంలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చవల సిద్ధయ్య మూడెకరాల్లో చెరకుతోట సాగు చేశాడు. పొలం మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్ వైరు తెగి తోటపై పడి అంటుకుంది. గాలుల వేగానికి, ఎండతీవ్రతకు క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించి తోట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.3.50 లక్షల విలువచేసే పంట కాలిపోయింది. చేతికందివస్తున్న పంట ఇలా బుగ్గిఅవడంతో బాధిత రైతు కుటుంబం భోరున విలపించింది. రూ.2లక్షలు అప్పు చేసి పంట సాగు చేశారు. కళ్లెదుటే బుగ్గి అవుతున్న పంటను చూసి నిస్సహాయులయ్యారు. అప్పులే మిగిలాయని, ఒక దశలో ఆ మంట ల్లోకి దూకి బలవన్మరణం చెందేందుకు రైతు దంపతులు యత్నించారు. స్థానికులు వారిని అడ్డుకున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితం సిద్ధయ్య కుమారుడు ఇదే పొలంలో కరెంటు షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం వారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. కాలిపోయిన చెరకతోటను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కరెంటు తీగలు తగిలి ఇద్దరి మృతి
అనంతపురం జిల్లా : విద్యుత్ తీగలు తగిలి మంగళవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు. పుట్లూరు మండలం అరకటివేములలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద గాలివాన తో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా అప్పటికే తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అప్రమత్తమై రక్షించేలోపే ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరి శరీరాలు కరెంటు ప్రసరణ ధాటికి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుకు నల్లమాడ మండలంలో ఇద్దరు, చిలమత్తూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అకాలవర్షాలకు తాడిపత్రి, పుట్టపర్తి, శింగనమల నియోజకవర్గాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. -
రైతు నెత్తిన మృత్యుతీగలు
గజ్వేల్: పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాద ఘంటికలను మోగిస్తూనే ఉన్నాయి. ఈ తీగలను సరిచేసి ప్రాణాలను కాపాడాలంటూ రైతులు వేడుకుంటున్నా పట్టించుకునే నా«థుడే కరువయ్యాడు. తాజాగా గజ్వేల్ మండలం అక్కారంలో రైతు మంద మల్లయ్య(55) తన పొలంలో వేలాడుతున్న వైర్లు తగిలి చనిపోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. గతంలో విద్యుత్ ప్రమాదాలు జరిగిన సమయంలో విద్యుత్ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరిస్తే ఈ రోజు ఈ ఘటన జరిగేది కాదన్న ఆవేదన స్థానికుల నుంచి వ్యక్తం అవుతోంది. మల్లయ్య మాట పట్టించుకోని అధికారులు.. ఎప్పటిలాగే సోమవారం పొలానికి వెళ్లిన మల్లయ్య (55) వంగిన విద్యుత్ స్తంభం నుంచి వేలాడుతున్న కరెంటు తీగలు తాకి చనిపోయాడు. సపోర్ట్ లేకుండా పాతిన విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారిందని...దానిని సరి చేయాలని మల్లయ్యతోపాటు పరిసర పొలాల రైతులు వేడుకున్నా ఏ అధికారి పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట ఈదురు గాలులతో కూడిన వర్షంతో స్తంభం క్రమ క్రమంగా వంగిపోయి...వైర్లు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. పరిష్కారం చూపని పవర్ డే.. 2015 జనవరి 17న వేలాడుతున్న విద్యుత్‌వైర్లు, వంగిన స్తంభాలను సరిచేయడంతోపాటు ఇళ్ల మధ్యన ప్రమాద ఘంటికలను మోగిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలం చెల్లిన కండక్టర్ వైర్లు, ఏబీ స్విచ్‌లు లేని ట్రాన్స్ఫార్మర్లు, పంట పొలాల్లో వేలాడుతున్న వైర్లను సరిచేయడం తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని ఎస్ఈ మొదలుకొని వివిధస్థాయిల అధికారులు గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై ‘పవర్ డే’ చేపట్టారు. నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ముగ్గురు నుంచి నలుగురు చొప్పున 600మందికిపైగా ఏకకాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలావరకు అధికారులు సమస్యలపై సర్వే చేపట్టి వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు తయారుచేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోని పలు గ్రామాల్లో జరిపిన సర్వేలో 1549 విరిగిన స్తంభాలు, 604 వంగిన స్తంభాలు, మధ్యలో వేయాల్సిన స్తంభాలు 3001, వేలాడుతున్న వైర్లు 1391, ఇళ్లమీద ఉన్న స్తంభాలు 1217 కావాల్సిందిగా అధికారులు తేల్చారు. ఏబీ స్విచ్లులేని ట్రాన్స్ఫార్మర్లు 258, ఎస్జీ ఫ్యూజ్‌లు లేని ట్రాన్స్ఫార్మర్లు 228, ఎర్తింగ్ సక్రమంగాలేని ట్రాన్స్ఫార్మర్లు 632, దిమ్మెలు సరి గాలేని ట్రాన్స్ఫార్మర్లు 91, కాలం చెల్లిన కండక్టర్ వైరు 87 కిలోమీటర్లు, వీధిలైట్లు ఆన్ఆఫ్ చేయడానికి కావాల్సిన వైరు 303 కిలోమీటర్లు, మరో 1099 స్విచ్‌లు కావాలని గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారానికి రూ. 5 కోట్లు వరకు వెచ్చించారు. కానీ పంట పొలా ల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసే ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. ఫలితంగా పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మృతదేహం వద్ద రోదిస్తోన్న బంధువులు గతంలో ప్రమాదాలు.. - వర్గల్ మండలం సామలపల్లిలో ట్రాక్టర్‌పై గడ్డి నింపుకుని వస్తున్న యువరైతు నాగులపల్లి కేశవరెడ్డి గతనెల 13న కరెంటు తీగలకు తగిలి మృత్యువాతపడ్డాడు. - ఇదే మండలంలోని నాచారంలో ఆరు నెలల క్రితం ఓ రైతు కరెంటు షాక్‌తో చనిపోయాడు. - ఏడాది క్రితం తున్కిమక్త లో కరెంటు ప్రసరిస్తున్న ఇ నుప స్తంభం తాకి రెండు ఎ ద్దులు మృత్యువాతపడ్డాయి. - అక్కారంలో 2013 డిసెం బర్ 26న సింగిల్ ఫెజ్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ లోపాలు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల ఊరంతా షాక్ వచ్చింది. ఈ ఘటనలో రాజు, చంద్రయ్య అనే ఇద్దరు మృతి చెందగా. అనేక మంది గాయాల పాలయ్యారు. -
పొంచి ఉన్న ప్రమాదం
ఆదిలాబాద్‌రూరల్ : మండలంలోని చాందా–టి గ్రామంలో ఇళ్లపై నుంచి వెళ్తున్న 33 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ప్రజలు ప్రతి రోజు భయందోళనకు గురవుతున్నారు. ఈదురుగాలులు వచ్చినప్పుడు ఎక్కడ ఇళ్లపై పడుతాయోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంటున్నారు. ఈ విద్యుత్‌లైన్ ఆదిలాబాద్‌లోని 132/33 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ఈ లైన్ చాందా మీదుగా జైనథ్, బేల మండలాలకు వెళ్తుంది. ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను గత 40 సంవత్సరాల కిందట వేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు జరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. విద్యుత్లైన్లు తొలగించాలని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ విద్యుత్ లైన్ తొలగించాలంటే గ్రామ పంచాయితీ లేదా సంబంధిత ఇంటి యజమానులు దానికి అయ్యే ఖర్చు భరించాల్సి ఉంటుందని, అప్పుడే వాటిని తొలగించడానికి సాధ్యమవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భయందోళనతో బతుకులు.. చిన్న విద్యుత్ తీగ ఇంటికి దగ్గర ఉంటేనే ప్రజలు భయపడిపోతారు. అలాంటిది ఏకంగా పెద్ద లైనే ఇడ్లపై నుంచి వెళ్తుంటే ఇంకెంత భయడిపోతారు అర్థం చేసుకోవచ్చు. చాందా–టి గ్రామంలోని ఇడ్లపై నుంచి వెళ్తుండడంతో నిత్యం భయంభయంగా బతుకుతున్నారు. వర్షకాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. గాలిదుమారం ఎక్కువగా ఉంటే తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. తమ సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధుతలో పాటు మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని వాపోతున్నారు. భయపడుతున్నారు.. ఇంటిపై వెళ్తున్న విద్యుత్ లైన్‌తో నిత్యం మా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అధికారులకు ఈ విషయాన్ని తెలిపిన స్పందడం లేదు. విద్యుత్‌లైన్‌ను తొలగించి సమస్యను పరిష్కరించాలి. – రవి, చాందా (టి) ఎవరు బాధ్యత వహిస్తారు తమ ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్‌లైన్ తొలగించాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. జరగరానిది ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించమంటే ఎవ్వరు రావడం లేదు. – ప్రశాంత్, చాందా(టి) అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. తమ గ్రామంలో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తొలగించాలని గతంలో విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన. సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. – బొజ్జ అడెల్లు, సర్పంచ్, చాందా–టి తొలగించేందుకు పేమెంట్ చేయాలి... చాందా–టి గ్రామంలో చాలా సంవత్సరాల కిందట 33 కేవీ విద్యుత్లైన్లను వేశారు. ఆ సమయంలో ఖాళీ ప్రాంతం ఉండడంతోనే విద్యుత్‌లైన్ వేయడం జరిగింది. ప్రస్తుతం వాటిని తొలగించాలంటే షిప్టింగ్‌కు సంబంధించిన చార్జీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. – శ్రావణ్‌కుమార్, విద్యుత్‌శాఖ ఏఈ, ఆదిలాబాద్ రూరల్ -
విద్యుత్ తీగ తెగిపడి గేదెలు మృతి
వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో ఓ పొలం మడిలో11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో ఆ మడిలోకి నీరు తాగడానికి వెళ్లిన తొమ్మిది గేదెలు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ గేదెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అందే ఎత్తులో ‘ప్రమాదం’
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు మనూరు: మండలంలోని ముక్టాపూర్ శివారులో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలను సరి చేయాలని గతంలో సంబంధిత అధికారులను కోరినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ తీగలు చేతికి అందేంత ఎత్తులో ఉన్నాయని వెంటనే వాటిని సరి చేయాలని ముక్టాపూర్ ప్రజలు డిమాండ్ చేశారు. -
కరెంట్ తీగలు తగిలి లారీ, జేసీబీ దగ్ధం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఓదెల మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక లారీతోపాటు జేసీబీ కాలిపోయాయి. కొలనూర్ నుంచి లారీలో జేసీబీని తరలిస్తుండగా ఓదెల సమీపంలో కరెంటు తీగలు తగిలాయి. అది గమనించని లారీ డ్రైవర్ లారీని ముందుకు తీసుకెళ్లాడు. ఇంతలో కరెంట్ తీగలు ఒకదానికికోటి రాసుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లారీ, జేసీబీ పూర్తిగా కాలిపోయాయి. రూ.70 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. కాగా, లారీ డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. -
కరెంటు తీగలు ఒకదానికొకటి రాసుకుని..
పరిగి(రంగారెడ్డి జిల్లా): వేలాడుతున్న కరెంటు తీగలు ఒకదానికొకటి రాసుకోవడంతో నిప్పు రవ్వలు చెలరేగి ఓ గుడిసె దగ్దమయ్యింది. ఈ సంఘటన దోమ మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆదివారం మద్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. దోమ మండలానికి చెందిన బోయిని నర్సింహులు తమ పొలం వద్ద గుడిసె కట్టుకుని అందులోనే తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఆ గుడిసెకు సమీపం నుంచే కరెంటు వైర్లు ఉండటంతో పాటు అవి కిందకు వేలాడుతున్నాయి. మద్యాహ్నం కాస్తా గాలి ఎక్కువగా రావటంతో వేలాడుతున్న రెండు వైర్లు ఒకటికొకటి రాసుకున్నాయి. దీంతో నిప్పు రవ్వలు చెలరేగి గుడిసె తగలబడింది. పొలంలో పనులు చేసుకుంటున్న కుటుంబీకులు వచ్చి ఆర్పే ప్రయత్నం చేసే లోపు గుడిసె తగలబడింది. గుడిసెలో ఉన్న ఆరు ఉల్లిగడ్డ సంచులు, ఇతర వంట సామాగ్రి, బట్టలు, వ్యవసాయ సామాగ్రి తగలబడి పోయాయని బాధితు రైతు పేర్కొన్నాడు. సుమారుగా రూ. 40 వేల ఆస్తి నష్టం జరిగినట్లు అతను పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. -
కరెంట్ వైర్లు తెగి పదెకరాల్లో పంట నష్టం
స్టేషన్ ఘన్పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీడికొండ గ్రామంలో శనివారం రాత్రి వీచిన భారీ గాలులకు అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ వైర్లు తెగిపడడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకునే సరికి.... స్థానిక రైతులకు చెందిన సుమారు పది ఎకరాల్లో వరి పంట దగ్ధమైంది. అలాగే, గ్రామంలోని మామిడి తోటలకు కూడా కొంత నష్టం వాటిల్లింది. -
చెరుకు పంట దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని జామి మండలం పావడ గ్రామంలో ఆదివారం చెరుకు పంట అగ్నికి ఆహుతి అయింది. పంట పోలంలోని కరెంట్ తీగలు ఒకదానికొకటి తగిలి రాసుకోపోవడంతో మంటలు చెలరేగాయి. సాగు చేసుకుంటున్న10 ఎకరాల చెరుకు పంటకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. దాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంట.. తమ కళ్ల ముందే బూడిద కావడంతో తట్టుకోలేని రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. -
50మంది టీచర్లకు తృటిలో తప్పిన ప్రమాదం
సిరిసిల్ల (కరీంనగర్ జిల్లా) : ఎన్నికల సిబ్బందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామ శివార్లలో శనివారం చోటుచేసుకుంది. ఈ సమయంలో బస్సులో 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారంతా బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన చేపట్టారు. -
యమపాశాలు!
రైతుల జీవితాల్లో వెలుగులు పంచాల్సిన విద్యుత్ తీగలు కాలనాగులై కాటేస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు కాలం చెల్లిన కరెంట్ తీగలు ఎప్పుడు తెగి పడతాయో... విద్యుత్ స్తంభాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. ఏటా పదుల సంఖ్యలో అన్నదాతలు కరెంట్ షాక్‌కు బలవుతున్నారు. బతుకుసాగులో రైతన్నకు అండగా నిలుస్తున్న మూగజీవాలు సైతం కరెంట్ షాక్‌తో మృత్యువాత పడుతున్నాయి. - మెదక్ విద్యుత్ శాఖ అధికారు లు, సిబ్బంది నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు బలిగొంటుంది. దశాబ్దాల క్రితం నాటి స్తంభాలు, వైర్లు శిథిలమై రైతులు, జనానికి కొరకరాని కొయ్యగా మారుతున్నాయి. చాలాచోట్ల కర్రలే విద్యుత్ స్తంభాలుగా మారి ప్రమాద ఘం టికలను మోగిస్తున్నాయి. ఇదిలావుంటే వేలాది రూపాయల్లో జీతాలు తీసుకుంటున్న కొంతమంది విద్యుత్ ఉద్యోగులు వారు చేయాల్సిన పనిని బయటి వారికి అప్పగిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. దీంతో వచ్చిరాని పనితనంతో విద్యుత్ మరమ్మతులు చేస్తూ కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్రలే స్తంభాలుగా... ఔరంగాబాద్, శమ్నాపూర్, రాయిన్‌పల్లి, పాతూర్‌తోపాటు అనేక గ్రామాల్లో అదనపు స్తంభాల కోసం డీడీలు చెల్లించి ట్రాన్స్‌కో కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ కరెంట్ కనెక్షన్ల నిమిత్తం బోరు బావి వద్దకు విద్యుత్ పోల్ వేయాల్సిన అధికారు లు.. నిర్లక్ష్యం చేస్తుండటంతో కర్రలనే ఆధారంగా చేసుకొని రైతులు కరెంట్ తీగలు వేసుకుంటున్నా రు. ఈ క్రమంలో ఈదురు గాలులు వీచినా, భారీ వర్షాలు పడ్డా... ఆ కర్రలు నేల వాలుతున్నాయి. కరెంట్ తీగలు తెగిపోతున్నాయి. వెనుకాముందు చూడని రైతులు ఆ తీగలకు బలవుతున్నారు. మోగుతున్న ప్రమాద ఘంటికలు... గ్రామాల్లో సుమారు 40 ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ వైర్లు, స్తంభాలు శిథిలమై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఎర్తింగ్ ఏర్పాటు చేయక పోవడం, ఏ-బీ స్విచ్‌లు అమర్చకపోవడం, విద్యుత్ లైన్ కింద పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించక పోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ట్రాన్స్‌కోకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు తాము చేయాల్సిన పనులను బయటివారికి అప్పగిస్తున్నారు. పదో పరకో చేతపెట్టి యువకులతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు. దీంతో అనుభవం లేని ఆ యువకులు కరెంట్ కాటుకు బలవుతున్నారు. చోటుచేసుకున్న పలు ఘటనలు... అందోల్ మండలం సాయిబాన్పేటలో శుక్రవారం రాములు(35) అనే రైతు నేలవాలిన విద్యుత్ తీగలకు బలయ్యాడు. ఇటీవల మెదక్ మండలం శమ్నాపూర్‌కు చెందిన మైలి పోచయ్య తన వ్యవసాయ పొలంలో కర్రల ఆధారంగా వేసిన విద్యుత్ వైర్లు తెగిపడగా మరమ్మతులు చేయబోయి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాల పాలయ్యాడు. మే 20న పాపన్నపేట మండలం కొడుపాకలో మంగళి శివరాం(35) అనే వ్యక్తి తెగిపడ్డ విద్యుత్ తీగలకు బలయ్యాడు. ఇదే గ్రామంలో అంతకుముందు మంగళి రాములు, తమ్మలి ప్రతాప్, కుర్మ బీరయ్య, సందిల రాములు విద్యుత్ షాక్‌తోనే మృత్యువాత పడ్డారు. మెదక్ మండలం వెంకటాపూర్‌కు చెందిన బొమ్మర్తి కిష్టయ్య(50), పాపన్నపేట మండలం గాజులగూడెంలో గంజి హన్మంతు(25) విద్యుత్ ప్రమాదానికి బలయ్యారు. గతంలో పాపన్నపేట మండలం చిత్రియాల్‌లో పుట్టి యాదమ్మ, ఎల్లాపూర్‌లో పుట్టి నర్సింలు, శానాయిపల్లిలో జిన్న ఏసయ్య, జిన్న వెంకయ్యలు కరెంట్ కాటుకు కన్నుమూశారు. ఇటీవల దౌల్తాబాద్ మండలం ముత్యంపేటలో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లు సంపత్ అనే మూగబాలుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రైతులతోపాటు వ్యవసాయంలో వారికి చేదోడు వాదోడుగా ఉండే మూగజీవాలు సైతం కరెంట్షాక్లతో మృత్యువాత పడుతున్నాయి. -
విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం
-
విద్యుత్ తీగలు తగిలి కాలేజీ బస్సు దగ్ధం
ఆచంట: ఓ ప్రైవేట్ విద్యాసంస్థ బస్సును పార్క్ చేస్తుండగా విద్యుత్ తీగలు తెగిపడటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని పెనుమంచిలిలో చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ సందర్భంగా విద్యార్థులను తీసుకొచ్చిన బస్సు పార్కింగ్ చేస్తుండగా ఆ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే సమయానికి విద్యార్థలంతా దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. -
మళ్లీ ముంచిన వడగళ్లు
- ఈదురుగాలుల బీభత్సం - మామిడి మటాష్ - తెగిపడిన కరెంటు తీగలు - జిల్లాలో అంధకారం జిల్లాలో ఈదురుగాలులు, అకాలవర్షం మరోసారి బీభత్సం సృష్టించారుు. చెట్లు, స్తంభాలు విరిగిపడ్డారుు. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు భారీగావీయడంతో కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈసారి మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలు విపరీతంగా రాలిపోయూరుు. కొమ్మలు విరిగిపడ్డారుు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డారుు. స్థానిక గాంధీచౌక్ చౌరస్తాలో హోర్డింగ్ పడిపోరుంది. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోరుంది. సారంగాపూర్ : మండలంలో రాత్రి ఏడుగంటల నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. మామిడితోటలు తుడిచిపెట్టుకుపోయూరుు. నాగునూర్, రంగపేట, లచ్చక్కపేట గ్రామాల్లో కోళ్ల షెడ్లు గాలికి కొట్టుకుపోయూరుు. ఓదెల : మండలంలో కుండపోత వాన కురిసింది. గుంపుల, ఓదెల, ఇందుర్తి, గూడెం, పొత్కపల్లి, కొలనూర్, కనగర్తి, ఉప్పరపల్లె గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. కరెంటు లేక గ్రామాల్లో అంధకారం అలుముకుంది. మామిడి, వరి నేలవాలారుు. గొల్లపల్లి : మండలంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన నుంచి తేరుకోకముందే ఆదివారం రాత్రి మళ్లీ వడగళ్లు దెబ్బతీశారుు. భీంరాజ్‌పల్లి, ఆత్మకూర్, చిల్వకోడూర్ తదితర గ్రామాల్లో భారీగా రాళ్లు పడ్డారుు. అరగంట పాటు రాళ్లవానతో ప్రజలు భయూందోళనకు గురయ్యూరు. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దరుుంది. మామిడి కాయ మిగిలే పరిస్థితే లేదు. వెల్గటూర్ : మండలంలో రాత్రి గాలివాన బీభత్సానికి ప్రజలు వణికిపోయూరు. పెద్దపెద్ద చెట్లు నేలకొరిగారుు. కరెంటు తీగలు తెగి, స్తంభాలు కూలి రోడ్లపై పడ్డారుు. ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర రహదారిపై రాజక్కపల్లి వద్ద రెండు పెద్ద చెట్లు విరిగి పడ్డారుు. రాత్రిపూట వర్షంలో ఈ చెట్ల తొలగింపు కష్టమే. దీంతో కరీంనగర్- రాయపట్నం రహదారిపై వాహనాలు నిలిచిపోయూరుు. వీణవంక : దేశారుుపల్లి, మల్లారెడ్డిపల్లి, చల్లూరు, బేతిగల్, ఎల్బాక, గంగారం, కిష్టంపేట గ్రామాల్లో విద్యుత్‌వైర్లు తెగిపడ్డారుు. రేకుల షెడ్లు కొట్టుకుపోయూరుు. సత్యనారాయణరెడ్డికి చెందిన రేకులు 15 మీటర్ల దూరంలో పడ్డారుు. కోర్కల్, ఎల్బాక, వీణవంక సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ నిలిపివేశారు. సప్తగిరికాలనీ : జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సరిగ్గా రాత్రి 8:30 గంటలకు పెద్ద ఎత్తున ఈదురుగాలులు రావడంతో నగరం మొత్తం దుమ్ముతో కమ్ముకుపోరుుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోరుు నగరంలో అంధకారం అలుముకుంది. దీంతో విద్యుత్ మొత్తం నిలిచిపోగా నగరం అంధకారమయమైంది. ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డారుు. ఫ్లెక్సీలు కొట్టుకుపోయూరుు. రాత్రి 10 గంటలకు కరెంటు రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. -
యమపాశాలు
ముదిగుబ్బ మండలం దొరిగిల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటకృష్ణారెడ్డి(50), లక్ష్మిదేవి(44) దంపతులు ఈ నెల 16న విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కంచెపై 11కేవీ విద్యుత్ తీగ తెగిపడటంతో పొలంలో పనులు చేసుకుంటున్న దంపతులిద్దరూ మృతి చెందారు. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన శేఖర్ (18) ఈ నెల 17న విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వ్యవసాయ పనులు ముగించుకొని తోట నుంచి ఇంటికెళుతుండగా మార్గ మధ్యంలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతపురం టౌన్ : విద్యుత్ తీగలు ప్రజల పాలిట యమ పాశాలుగా మారాయి. కరెంట్ తీగలు ఎక్కడ ఎప్పుడు తెగిపడతాయో.. ఎంత మంది ప్రాణాలు బలిగొంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడో ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లనే నేటికీ కొనసాగిస్తున్నారు. కాలపరిమితి దాటినా వాటిని మార్చడం లేదు. చిన్నపాటి గాలులకే తెగిపడుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి ఇప్పటి వరకూ అధికారికంగా 25 మంది మృతి చెందారు. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 50 దాటి ఉంటుంది. జిల్లాలో వ్యవసాయ బోర్లకు, గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడానికి 48,723 కిలోమీటర్ల మేర లైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఎల్టీ లైన్లు 28,106 కి.మీ, 11కేవీ లైన్లు 18,034 కి.మీ, 33 కేవీ లైన్లు 2,583 కి.మీ మేర విస్తరించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అటవీభూములు, పొలాల మీదుగా వెళుతున్న విద్యుత్లైన్ల నిర్వహణ కుంటుపడింది. వాస్తవానికి విద్యుత్ తీగలకు 25 ఏళ్ల గడువు (లైఫ్) ఉంటుంది. అవి నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసి ఉన్నట్లయితే ఇది వర్తిస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్తంభాల ఏర్పాటు దగ్గర నుంచి అన్నింట్లోనూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 50 అడుగులకు ఒకటి చొప్పున విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 100-120 అడుగుల దూరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల తీగలు కిందకు వేలాడుతున్నాయి. ఎర్త్ అవుతున్నాయి. మెటీరియల్ కొరత : నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి, ప్రమాదాలను అరికట్టడానికి మెటీరియల్ కొరత అధికారులను వే ధిస్తోంది. వ్యవసాయ కనెక్షన్ల కోసం 32 వేల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. వీరికి కనెక్షన్లు మంజూరు చేయాలంటే ఇప్పట్లో కష్టసాధ్యంగా కన్పిస్తోంది. ప్రతి ఐదు కనెక్షన్లకు ఒకటి చొప్పున 7 వేల ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు లాగడానికి దాదాపు 40 వేల వరకూ స్తంభాలు అవసరమవుతాయి. దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో కొంతమంది రైతులు అనధికారికంగానే విద్యుత్ వినియోగిస్తున్నారు. దీని వల్ల విద్యుత్ తీగలపై అదనపు భారం పడుతోంది. 11 కేవీ విద్యుత్ వైరుకు 100 హెచ్‌పీ మాత్రమే వాడాలి. ఆపై భారం పడితే మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలి. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లపై లోడు అధికంగా పడుతున్నా, పంటలు ఎండిపోతాయనే ఉద్దేశంతో రైతులు వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. -
విద్యుత్ తీగలు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య
పెద్దవూర, న్యూస్‌లైన్ : భార్యతో గొడవ పడి వ్యక్తి విద్యుత్ తీగలు పట్టుకుని ఓ యువకు డు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్దబావితండాకు చెందిన రమావత్ బిచ్యా-బుజ్జి దంపతుల మొదటి కుమార్తె లక్ష్మీని దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలోని బుడ్డతండాకు చెందిన లావూరి నెహ్రూ(27)కి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. ఆర్థికంగా లేకపోవడంతో జీవనోపాధి కోసం నెహ్రూ భార్యాపిల్లలతో సహా ఒంగోలుకు వెళ్లి అక్కడ ఆటోను నడుపుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సుద్దబావితండాలో మఠం (పెద్దల) పండగకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పండగను బంధుమిత్రులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. పూటుగా మద్యం సేవించిన నెహ్రూ తన భార్య లక్ష్మీతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయా డు. రాత్రి 10.30 గంటల సమయం లో తాను చనిపోతున్నానని బంధువులకు, స్నేహితులతోపాటు భార్య, మా మ, తోడల్లుడులకు ఫోన్ చేశాడు. వా రు నెహ్రూ కోసం పరిసరాలలో వెతికా రు. అయినా ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటికి తిరిగొచ్చారు. మండలంలోని తుమ్మచెట్టు స్టేజీ సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నెహ్రూది పులి వచ్చే కథ.. గతంలోనూ నెహ్రూ రెండు మూడు సార్లు తాను చనిపోతున్నానని ఫోన్లు చేసి ఉరుకులు పరుగులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో అతడు బంధువులు విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులు వ్యక్తి చని పోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని మృతుడి సెల్ఫోన్లో ఉన్న నంబ ర్లకు ఫోన్ చేసి మృతుడు నెహ్రూగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నా రు. మృతుడి భార్య లక్ష్మీ ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తాడిపర్తి శేషుబాబు తెలిపారు. -
ఎంత పని చేశావమ్మా..
శుక్రవారం రాత్రి 8 గంటలు.. పెద్దవడుగూరు మండలం కాసేపల్లిలో అంతా హడావుడి.. మూడు గ్రామాల ఆధ్వర్యంలో జరిగే బండిశిల తిరుణాల కావడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు.. ఏడు జతల ఎద్దులతో బండిశిల రథం లాగిస్తున్నారు.. ఒక్క సారిగా అరుపులు కేకలు.. హాహాకారాలు.. ఏం జరిగిందో తెలుసుకునే లోగా పైనున్న విద్యుత్ తీగలు మృత్యుపాశాలై అక్కడున్న వారిని చుట్టుకున్నాయి.. అంతా చీకటి. కరెంటు తీగలు తెగి ఎద్దులపై, జనం పైన పడ్డాయి.. అంతలోనే తొక్కిసలాట.. ఎవరికి తోచిన వైపు వారు పరుగు తీయడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు కింద పడిపోయారు.. సుంకులమ్మ తిరుణాలలో జరిగిన ఈ విషాద ఘటనలో నలుగురు మృత్యు ఒడికి చేరగా.. బండిశిలను లాగుతున్న మూడు ఎద్దులు ప్రాణాలు కోల్పోయాయి. పెద్దవడుగూరు, కాశేపల్లి, రామరాజుపల్లిలో విషాదం నెలకొంది. కాశేపల్లిలో రథం దగ్ధమైంది. గ్రామం అంధకారమయమైంది. పెద్దవడుగూరు/పామిడి/గుత్తి, గుత్తి రూరల్ న్యూస్‌లైన్ : పెద్దవడుగూరు మం డలం కాశేపల్లిలో బండి శిల రథం విద్యుదాఘాతానికి గురైందన్న వార్తతో చుట్టుపక్కల గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం కలవరపాటుకు గురి చేసింది. కాశేపల్లి, గుత్తి అనంతపురం, పామిడి మండలం రామరాజు పల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ మూడు గ్రామస్తుల సమక్షంలో ఈ నెల 7న సుంకులమ్మ బండిశిల తిరుణాల ప్రారంభమైంది. శుక్రవారం రామరాజుపల్లి నుంచి గుత్తి అనంతపురం శివారులోని సుంకులమ్మ ఆలయం వద్దకు బండిశిలను ఏడు జతల ఎద్దులతో తీసుకుని బయలుదేరారు. రాత్రి 8.20 గంటలకు కాశేపల్లికి చేరుకున్నారు. అక్కడ పైనున్న 220 కేవీ విద్యుత్ తీగలను బండిశిల తాకడంతో ఒక్కసారిగా తీగలు తెగిపడ్డాయి. అవి ఎద్దులు, భక్తులపై పడడంతో వారు భయంతో పరుగుతీశారు. అంతలో గ్రామంలో పూర్తిగా అంధకారం నెలకొంది. అరుపులు, కేకలు మిన్నంటాయి. అంతలోనే తొక్కిసలాట జరిగడంతో కాశేపల్లికి చెందిన ముత్యాలరెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందారు. మార్గం మధ్యలో రామాంజులరెడ్డి (30), మాణిక్యాచారి (20), లక్ష్మినారాయణ (50) మృతి చెందారు. పవన్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుధీర్, లక్ష్మిరెడ్డి, బాబురెడ్డి, శ్రీరామరెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్సుల్లో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన సుమారు 30 మందికి గుత్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో కాశేపల్లిలో విషాదం నెలకొంది. క్షతగ్రాతులను జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, వైఎస్ఆర్సీపీ అనంతపురం ఎంపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి, రాయదుర్గం, అనంతపురం అసెంబ్లీ అభ్యర్థులు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గుంతకల్లు తాజా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పరామర్శించిన అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
అయ్యో.. రైతన్నా..
కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంకు చెందిన ఎరుకల మల్లయ్య గతేడాది నవంబర్ 10న పొలంలో విద్యుత్ మోటార్ వద్ద షాక్ తగిలి చనిపోయాడు. మల్లయ్య-రాధమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకులకు భూమి పంచి ఇవ్వగా.. మిగతా రెండెకరాల్లో మల్లయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. మల్లయ్య మృతితో రాధమ్మ పెద్ద దిక్కు కోల్పోయింది. ‘పెనిమిటి పంట కోసం చేసిన రూ.50 వేల అప్పు అట్లనే ఉన్నది. అప్పులోళ్లు ఆగనిత్తలేరు. సర్కారు సాయం పైసా అందలేదు’ అని మల్లయ్య భార్య రాధమ్మ కన్నీటి పర్యంతమవుతోంది. - న్యూస్‌లైన్, (కమలాపూర్) మంకమ్మతోట, న్యూస్‌లైన్ : ఓవైపు వచ్చీరాని కరెంట్.. వచ్చిన కాసేపైనా ఏదో ఒక లోపం.. ఆ లోపాన్ని సరిచేసేందుకు అందుబాటులో ఉండని సిబ్బంది.. మరోవైపు వేలాడుతున్న విద్యుత్ వైర్లు.. రక్షణ లేని సపోర్ట్ తీగలు రైతుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మోటార్ల ద్వారా మడులు తడిపి పంటలను కాపాడుకునేందుకు పొలాల వద్దకు వెళ్తున్న అన్నదాతలను కరెంట్ వైర్లే కాటేస్తున్నాయి. అధికారుల పుణ్యమా అని ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఆర్నెల్లలో సుమారు వంద మంది పొలాల్లోనే శవాలుగా మారారు. అర్ధరాత్రి ఇచ్చే కరెంట్‌కు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, ట్రాన్స్‌కో చేష్టలుడిగి చూస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిస్తున్న అధికారులు, నాయకులకు అనంతరం ఓదార్చేందుకూ మనసు రావడం లేదు. ట్రాన్స్‌కో నిర్లక్ష్యంతో కరెంట్ కాటుకు రైతులు పిట్టల్లా రాలుతున్నా.. వారికి పరిహారం ఇప్పిద్దామన్న సోయి కూడా అధికారులకు రావడం లేదు. వారు ఎలా చనిపోయారో కూడా ధ్రువీకరించడం లేదు. ఆర్నెల్లలో వంద మంది వరకు మృత్యువాతపడినా.. అధికారుల రికార్డుల్లో మాత్రం 37 మందికి మించలేదు. గత రెండు సంవత్సరాల్లో జిల్లావ్యాప్తంగా వందలాది మంది రైతులు కరెంటు కాటుకు బలయ్యారు. విద్యుత్ శాఖ ఫీల్డ్ ఆఫీసర్ నివేదిక ప్రకారం నెల రోజుల్లో పరిహారం అందించాల్సి ఉంది. బాధిత కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను ఇటీవల రూ.2లక్షలకు పెంచారు. అయినప్పటికీ ప్రభుత్వపరంగా పైసా సాయం అందకపోవడంతో బాధిత కుటుంబాలు దిక్కులు చూస్తున్నాయి. ఆదుకునే చర్యలేవీ? లోవోల్టేజీ, సాంకేతిక సమస్యల వల్ల ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. సంబంధిత అధికారులకు సమాచారం అందిం చినా సకాలంలో స్పందించకపోవడంతో రైతులే ప్రాణాలకు తెగించి మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద, మోటార్ల వద్ద విద్యుత్‌షాక్‌కు గురవుతున్నారు. సాంకేతిక సమస్యలపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో నిండుప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇటీవల ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యం లో రైతుమిత్ర వాహనాలను ఏర్పాటు చేశారు. టాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా, విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తినా సమాచారం అందిస్తే రైతుమిత్ర వాహనం వచ్చి సమస్య పరిష్కరిస్తుందని అధికారులు ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా రైతుమిత్ర సేవలు అందడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వి ద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యు త్ షాక్‌తో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకోవడంతోపాటు.. భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలంటే మెరుగైన సేవలందించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరముంది. -
నిలువెత్తు నిర్లక్ష్యం
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: జిల్లాలో అనేకచోట్ల విద్యుత్ తీగలు ప్రజల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. ప్రభుత్వం ఓవైపు మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది సరైన పద్ధతిలో స్తంభాలు ఏర్పాటు చేయకపోవడం, మరోవైపు తీగలు బిగుతుగా లాగకపోవడం తదితర కారణాలతో జిల్లాలో ఏదోఒక చోట విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.. దీంతో విద్యుత్ నిర్వహణ తీరుపై వినియోగదారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్తంభాల ఏర్పాటులో కిరికిరి.. జిల్లాలో ఉన్న సర్వీసులకు సంబంధించి 4.50 లక్షల స్తంభాలు ఉండగా, ఇందులో 11 కేవీ స్తంభాలు 1.85 లక్షలు, ఎల్టీ స్తంభాలు 3.25 లక్షలు ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్ల నుంచి 8 మీటర్ల స్తంభాలు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ 8 మీటర్లలో అడుగున్నర స్తంభం భూమిలోకిపోగా మిగిలిన 6 మీటర్ల స్తంభం ఎత్తులో విద్యుత్ తీగలు ఉండాలి. స్తంభానికి, స్తంభానికి మధ్య కనీసం 60 మీటర్ల దూరం ఉండాలనేది నిబంధనగా ఉంది. అయితే ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై 80 నుంచి 100 మీటర్ల దూరంలో స్తంభాలు ఏర్పాటు చేయడంతో తీగలు నేలను తాకే పరిస్థితి తలెత్తుతోంది. తొండూరు, పులివెందుల, వేంపల్లె, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వల్లూరు మండలాల్లో ప్రధానంగా స్తంభాలు లేకపోవంతో రైతులు విద్యుత్ తీగలను కర్రలకు తగిలించుకుని మోటార్లు ఆడించుకుంటున్నారు. అలాగే పల్లెల్లో కూడా స్తంభాల మధ్య దూరం ఎక్కవగా ఉండటంతో ఇళ్లపై తీగలు వేలాడుతున్నాయి. పాత కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం వెనుక వైపు ఇళ్లను తీగలు తాకుతున్నాయి. ఇటీవల ఆ ప్రాంతానికి చెందిన వెంకటలక్షుమ్మ అనే మహిళ ఇంటిపై దుస్తులు ఆరవేసేందుకు వెళ్లి కరెంట్ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా అవసరాలకు 14 వేల స్తంభాలు కావాల్సి ఉంది. అయితే ఆ స్తంభాలు రాకపోవడంతో తీగలను వ్యవసాయదారులు, గృహ వినియోగదారులు కర్రలపైనే ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి ఉంటోంది. ఆయా ప్రాంతాల విద్యుత్‌శాఖ అధికారులకు సమస్యలపై వినతి పత్రాలు అందజేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో విద్యుత్ సర్వీసులు జిల్లాలో గృహ విద్యుత్ సర్వీసులు 6,62,550, వ్యాపార సముదాయాలు 54,204 సర్వీసులు, పరిశ్రమల సర్వీసులు 5397, చిన్న పరిశ్రమల సర్వీసులు 569, వ్యవసాయ సర్వీసులు 1,25,507,వాటర్ వర్క్స్ సర్వీసులు 5952, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, వీధి దీపాల సర్వీసులు 4985, పెద్ద పరిశ్రమల సర్వీసులు 245 ఉన్నాయి.