DGP
-
లగచర్ల ఘటన.. సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్‌ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
Lagcherla Incident: పరిగి డీఎస్పీ కరుణసాగర్‌పై వేటు
సాక్షి, వికారాబాద్ జిల్లా : దుద్యాల మండలం లగచర్లలో ఈ నెల 11న అధికారులపై జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనలో ఉన్నతాధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిగి డీఎస్పీగా కరుణసాగర్‌రెడ్డిపై వేటు వేసింది. డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌ను నియమించింది.మరోవైపు కలెక్టర్‌పై దాడి కేసులో కొత్తకోణం చేసుకుంది. దాడి ఘటనలో పంచాయితీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సంగయ్య పల్లి పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తున్న రాఘవేందర్ రైతుల్ని రెచ్చగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో సంగయ్యపల్లి పంచాయితీ సెక్రటరీపై రాఘవేందర్‌పై వేటు వేస్తూ సంబంధిశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. Attack On #DistrictCollector in #TelanganaTension erupts in #Lagcherla village in #Dudyala mandal of #Vikarabad district, as villagers were attacked with sticks on District Collector Prateek Jain and govt officials and pelted stones on their vehicles.The officials today… pic.twitter.com/LjKtlrTujC— Surya Reddy (@jsuryareddy) November 11, 2024 -
రెండ్రోజులు చూస్తాం.. కోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా ఇతర నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై డీజీపికి వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఆధారాలతో సహా వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, ఆదిమూలపు సురేష్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు.దౌర్జన్యకాండపై కలిసికట్టుగా పోరాటం చేస్తాం: అంబటిఅనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా పెట్టిన పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ‘‘టీడీపీ సోషల్ మీడియా పెట్టిన అసభ్యకరమైన పోస్టుల కాపీలను డీజీపీకి అందజేశాం. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల విషయాన్ని డీజీపీకి వివరించాం. ఏపీలో జరుగుతున్న దౌర్జన్యకాండపై కలిసికట్టుగా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు చెప్పారు.వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా పోస్టులను డీజీపీకి ఇచ్చాం. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోరాం. మా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారు. సుధారాణి అనే యువతిపై చిలకలూరిపేట సీఐ తీవ్రంగా దాడి చేసి కొట్టారు. దీనిపై కూడా డీజీపికి ఫిర్యాదు చేశాం. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, అవినాష్‌రెడ్డి ఇతరులపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ వివరాలు కూడా డీజీపికి ఇచ్చాం. మా వారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తాం. ఆడబిడ్డపై దాడులు జరిగితే సహించననే చంద్రబాబు సుధారాణి విషయంలో ఎలా స్పందిస్తారో వేచిచూస్తాం. మా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రెండు రోజులు చూస్తాం. తర్వాత కోర్టును ఆశ్రయిస్తాంకూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన: ఎమ్మెల్యే చంద్రశేఖర్చిన్న విషయాలకే పోలీసులు కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డారు. ‘‘విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారంటే నాపై కేసు పెట్టారు. మంచినీటి కంటే ఎక్కువగా మద్యం ఏరులై పారుతోంది. ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాపై నిర్బంధ కేసు పెట్టారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం కాకుండా ఇంకెవరు అడుగుతారు? పేకాట క్లబ్‌లను ఎందుకు కట్టడి చేయడం లేదు?. కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్సీపీ -
అమోయ్‌కుమార్ ‘భూ’ కేసుల విచారణలో కొత్త ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అమోయ్‌కుమార్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల విచారణలో కీలక మలుపు తిరిగింది.నాగారం ల్యాండ్ స్కామ్ ఈడీ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంది. అమోయ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై వివరాల కోసం తెలంగాణ డీజీపీకి తాజాగా ఈడీ లేఖ రాసింది.భూ అక్రమాలపై ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు వచ్చాయని లేఖలో డీజీపీకి ఈడీ తెలిపింది. ఈడీ లేఖకు తెలంగాణ డీజీపీ స్పందించారు. నాగారం తో పాటు పలు కేసులకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేశారు. ఈడీకి చేరిన శంకరాహిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్, నాగారం,రాయదుర్గం ల్యాండ్ల వివరాలిచ్చారు.పోలీసుల నుంచి వివరాలు రావడంతో ఈడీ విచారణ వేగవంతం చేయనుంది.ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు..? -
డీజీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ DGP రియాక్షన్..
-
మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా పై ఈసీ వేటు
-
మహారాష్ట్ర డీజీపీపై ఈసీ బదిలీ వేటు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికళ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బదిలీ వేటు వేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఈసీ తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విషయంలో డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.రష్మీ శుక్లా స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. డీజీపీగా నియామకం కోసం మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్‌ను పంపాలని తెలిపింది. దీంతో రష్మీ శుక్లా స్థానంలో అత్యంత సీనియర్ అధికారిగా ఉన్న వివేక్ ఫన్సాల్కర్‌కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ముంబై సీపీగా పనిచేస్తున్నారు.కా గాగత నెలలో రాష్ట్ర డీజీపీని తొలగించాలని అభ్యర్థిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే లేఖ రాశారు. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ(శరద్చంద్ర) సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై డీజేపీ శుక్లా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు. చదవండి: దేశంలో పలు స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పుగత ప్రభుత్వ హయాంలో నేతల ఫోన్లను ట్యాప్ చేశారని.. నేతలు ఏం చేయబోతున్నారనేది తెలుసుకొని ఆ సమాచారాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేరవేశారంటూ శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రాజకీయ హింస పెరిగిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. ఆమెను తొలగించాలని లేఖలో కోరాయి. దీనిపై ఈసీ స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించారు. తమ విధులను నిర్వహించడంలో పార్టీలకతీతంగా భావించేలా చూడాలన్నారు. ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఓటింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
ఎన్నికల వేళ ఈసీ ఆదేశాలు..
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే తొలగించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఆయన స్థానంలో అదే కేడర్‌లోని అత్యంత సీనియర్ డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. అర్హులైన అధికారుల పేర్లను ఈ నెల 21వ తేదీలోగా తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అనురాగ్ గుప్తాపై వచి్చన ఆరోపణలపై విచారణకు ఈసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
TG:గ్రూప్-1 ఆపితే చర్యలు తప్పవు: డీజీపీ
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ 1 మెయిన్స్ కోసం బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ తెలిపారు. పరీక్షను అడ్డుకున్నా ఇబ్బందులకు గురిచేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి పబ్లిక్కు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు.పరీక్ష నిర్వహించేందుకు హైకోర్టు ఆదేశాలున్నాయని,మీకు అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత.. అదుపులోకి బండి సంజయ్ -
తెలంగాణ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు
ఢిల్లీ: తెలంగాణ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. వట్టి జానయ్య కేసులో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది దేవీన సెహగల్ సరైన జవాబు ఇవ్వకపోవడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదికి సరైన వివరాలు అందించడంలో పోలీస్ శాఖ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రాసిక్యూషన్‌కు, ప్రభుత్వ న్యాయవాదికి మధ్య గ్యాప్ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న తెలంగాణ డీజీపీ వ్యక్తిగతంగా హాజరుకావాలని లేదంటే వర్చువల్‌గానైనా హాజరు కావాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.వట్టి జానయ్య కేసులో చార్జ్ షీట్ల తేదీల వివరాలను సుప్రీంకోర్టు కోరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తనను వేధిస్తోందని వట్టి జానయ్య పిటీషన్ దాఖలు చేశారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సమయంలో ప్రభుత్వ న్యాయవాది దేవీన సెహగల్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.చదవండి: రాహుల్.. ఒక్కసారి తెలంగాణవైపు చూడండి: కేటీఆర్ -
Laddu Row: సిట్ బ్రేకులపై డీజీపీ రియాక్షన్
తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు నిలిపివేతపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. దర్యాప్తును తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారాయన.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ అంశంపై.. కేసు తీవ్రత వల్లే సిట్ వేయాల్సి వచ్చింది. అయితే సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే దర్యాప్తును ఆపుతున్నాం. తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు విచారణ వుంటుంది’’ అని తెలిపారాయన.తిరుమల లడ్డూ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ జరిగింది. ఆ టైంలో.. సిట్ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సోలిసిటర్ జనరల్‌ను ద్విసభ్య ధర్మాసనం కోరింది. అక్టోబర్ 3వ తేదీన తదుపరి విచారణ టైంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే ఐదోవ రోజు గరుడ వాహన సేవ రోజున అదనంగా భద్రతా ఏర్పాట్లు చేస్తాం. బ్రహోత్సవాల కోసం నాలుగు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తున్నాం. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం... మొబైల్ డివైజ్ ఫింగర్ ప్రింట్ ఏర్పాట్లతో అనుమానితుల్ని గుర్తిస్తాం. 2,700 సీసీ కెమరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాలో తప్పులు వార్తలు ప్రచారం కాకుండా నిఘా ఉంచుతాం. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు వీక్షించే అవకాశం వుండగా.. అదనంగా 80 వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైనులు ద్వారా అనుమతిస్తాం.మొత్తం.. 2.5 లక్షల మంది ప్రయాణించేలా గరుడ సేవ రోజున ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తేనే సౌకర్యవంతంగా వుంటుంది అని అన్నారాయన. అలాగే.. దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబోవనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ఫోన్‌ట్యాపింగ్‌పై స్పందించిన డీజీపీ
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీమ్‌తో విచారణ చేస్తున్నామని,కోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై తాను కామెంట్ చేయలేనని డీజీపీ జితేందర్ అన్నారు. ట్యాపింగ్ కేసుపై మంగళవారం(సెప్టెంబర్24) జితేందర్ మీడియాతో మాట్లాడారు.‘ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున నేను కామెంట్ చేయలేను.ప్రభాకర్ రావు,శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి కొంత సమయం పట్టింది.రెడ్ కార్నర్ నోటీసుల కోసం ఇంటర్ పోల్కి లేఖ రాశాం.సీబీఐకి రాగానే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అవుతుంది’అని తెలిపారు.గణేష్ ఉత్సవాల్లో డీజే సౌండ్స్ ఇబ్బంది పెట్టాయి.. డీజీపీనగరంలో ఇటీవల గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఉత్సవాలు విజయవంతంగా పూర్తిచేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పారు. నిమజ్జనం కోసం అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేశాయన్నారు.ట్రైనీ ఎస్సైలు , కానిస్టేబుళ్లు 12వేల మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. గణేష్ ఉత్సవాల్లో డీజేల ఏర్పాటు, శబ్ద కాలుష్యం కొంత నగర వాసులను ఇబ్బంది పెట్టిందన్నారు. డీజేల విషయంలో త్వరలో మార్గదర్శకాలు విడుదలచేస్తామని చెప్పారు. వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త వహించాలని డీజీపీ సూచించారు. -
రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు శుక్రవారం మధ్యాహ్నం కలిశారు. డీజీపీ కార్యాలయంలో తుంగతుర్తి రైతులపై, గురువారం సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడులపై డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపైనా డీజేపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని నేతలు ఆరోపించారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరంపైన దాడి చేయడం టెంట్ పీకి వేయడం వంటి కార్యక్రమాల పైన అభ్యంతరం వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని డీజేపీకి తెలియజేశారు. రాజకీయ ప్రమేయం జోక్యం వలన ప్రతిపక్ష నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, హింసిస్తున్నారని తెలిపారు. కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొనడం గుర్తుచేశారు.అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. దీనిపై శాంతియుతంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. తిరుమలగిరిలో తమ నాయకుడు కిశోర్ ధర్నా చేస్తే.. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కమూకలు దాడి చేశాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో హింస సరికాదని హితవు పలికారు. పోలీసుల సమక్షంలో కిరాయి మూకలు దాడి చేశాయని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారని అన్నారు. ‘పోలీసులు మంత్రుల బర్త్ డేకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైడ్రా పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల ఫార్మ్ హౌస్‌లను కూల్చాల్సిందే. మంత్రి పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి. మీ ఫార్మ్ హౌస్ కూల్చాలో లేదో రంగనాధ్ డిసైడ్ చేస్తారు. రేపు మహిళా కమీషన్ ముందు హాజరవుతా.నిన్న ప్రజాస్వామ్యబద్దంగా బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో రైతులు ధర్నా చేస్తుంటే 50 మంది కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. స్థానిక పోలీసు యంత్రాంగంతో కుమ్మక్కు అయ్యి దాడి చేశారు. సుతిల్ బాంబులు వేసి దాడులకు పాల్పడ్డారు. దాడులకు పోలీసులు మద్దతు తెలపడం అంటే రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు పరాకాష్ట. రుణమాఫీపై రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం..రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేశారు. కొండారెడ్డిపల్లి నుండి కల్వకుర్తి వరకు మహిళా జర్నలిస్టులను వాళ్ళను వెంబడించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏమీ అన్నారని వాళ్లపై దాడులు చేశారు. రేవంత్ రెడ్డి సిగ్గుంటే ఏ ఊరుకు వస్తావో చెప్పు. నేను వస్తా. రుణమాఫీ ఏ ఊరులో సంపూర్ణంగా జరిగిందో రేవంత్ రెడ్డి చెప్పాలి. సీఎంకు పరిపాలించే సత్తా లేదు. ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా నళిన్ ప్రభాత్
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌కు కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. తరచూ ఉగ్రదాడులతో అత్యంత ఉద్రిక్తంగా మారిన జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దడమే లక్ష్యంగా ఆయనను జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా ఎంపికచేసింది. వచ్చే నెల 30న ప్రస్తుత పోలీస్‌బాస్ ఆర్ఆర్ స్వాయిన్ రిటైరైన వెంటనే అక్టోబర్ ఒకటిన ప్రభాత్ డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ప్రభాత్ ఇప్పటికే పలు విభాగాల్లో పనిచేసి అద్భుత ప్రతిభ కనబరిచి విశేష అనుభవం గడించారు. మూడు పోలీస్ గ్యాలంట్రీ మెడళ్లు, ఒక పరాక్రమ్ పతకం సాధించారు. 55 ఏళ్ల ప్రభాత్‌కు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని అణిచివేసేందుకు ఉద్దేశించిన గ్రేహౌండ్స్ దళాలకూ ఆయన సారథ్యం వహించారు. గతంలో సీఆర్పీఎఫ్లో ఐజీగా, కశ్మీర్ ప్రాంతంలో అదనపు డీజీగా సేవలందించారు. -
జమ్ముకశ్మీర్ డీజీపీగా.. ఏపీ కేడర్ ఐపీఎస్ నలిన్ ప్రభాత్ నియామకం
జమ్ముకశ్మీర్‌కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా(డీజీపీ) సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కేబినెట్ నియామకాల కమిటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్ కశ్మీర్లో డీజీపీగా ఆర్ఆర్ స్మైన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్ 30 ముగియనుంది. కాగా స్మైన్ 1991 బ్యాచ్‌కు చెందిన జమ్మూకశ్మీర్ కేడర్ ఐపీఎస్ అధికారి. 11 నెలలపాటు డీజీపీగా సేవలు అందించారు. ఈ తర్వాత పదవీ విరమణ చేయనున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రభాత్. అయితే ఆంధ్రప్రదేశ్ కేడర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం (AGMUT) కేడర్‌కు అతని డిప్యుటేషన్‌ను కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(NSG)కి అధిపతిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 వరకు జమ్మూ కాశ్మీర్లో స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎస్డీజీ)గా నియమితులయ్యారు.అక్టోబర్ 1న డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఆర్టికల్ 370 రద్దు అనంతరం సెప్టెంబర్ 30వ తేదీలోపు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. మరో వారం, పది రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించడం, అసెంబ్లీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం పంపిందనే ఓ చర్చ సైతం కొనసాగుతుంది.1968లో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జన్మించిన నళిన్ ప్రభాత్.. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఎంఏ చేశారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు. కరీంనగర్, కడప, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా నళిన్ ప్రభాత్ పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.మూడు పోలీసు గ్యాలెంట్రీ మెడల్స్‌తో సహా అనేక గౌరవాలను అందుకున్నారుగ్యాలంట్రీ మెడల్స్, పరాక్రమ్ పతక్(విశిష్ట సేవా పతకం), ఆంత్రిక్ సురక్ష పతకం సహా అనేక మెడల్స్ అందుకున్నారు. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. మొదట కొన్నాళ్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF)లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్(ITBP) 14వ బెటాలియన్(శ్రీనగర్), 21వ బెటాలియన్(శ్రీనగర్), 16వ బెటాలియన్(లడఖ్)లకు కమాండెంట్‌గా పనిచేశారు. తర్వాత సీఆర్పీఎఫ్లో సౌత్ కాశ్మీర్ ఆపరేషన్ రేంజ్ డీఐజీగా మూడేళ్లపాటు పనిచేసిన ఆయన, కొన్నాళ్లు చండీగఢ్ రేంజ్, బస్తర్ ఆపరేషన్స్ రేంజ్‌లలో డీఐజీగా పనిచేశారు. 2010 డిసెంబర్ నుంచి రెండేళ్ల పాటు సీఆర్పీఎఫ్లో ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, జమ్ము-కాశ్మీర్ జోన్, శ్రీనగర్ సెక్టార్లలో సేవలందించారు. ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కాశ్మీర్ ఆపరేషన్స్ సెక్టార్‌కు నేతృత్వం వహించారు.ఇలా సుదీర్ఘకాలం జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన, పట్టు ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏరికోరి జమ్ము-కాశ్మీర్ డీజీపీగా నియమించింది. -
Telangana: బంగ్లాదేశ్ పరిణామాలపై పోలీస్ శాఖ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్‌శాఖ అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో పోలీసులు నిఘా ఉంచారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా పెట్టారు. హైదరాబాద్‌కి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్న డీజీపీ.. బాలాపూర్ పరిధిలో ఐదువేల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని.. అలాగే, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. -
‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: యువత భవిష్యత్తును చిత్తు చేసే ‘మత్తు’మహమ్మారి కట్టడికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల ముఠాల సప్లై చైన్ కట్టడి మరోవైపు మత్తు పదార్థాల వైపు యువత వెళ్లకుండా అవగాహన పెంచే వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు. మత్తుదందాలో ఎంతటివారున్నా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా పౌరుల కష్టార్జితాన్ని దోచుకొనే సైబర్ ముఠాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామని.. గత ఆరు నెలల్లోనే రూ. 150 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించగలిగామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐదో డీజీపీగా జూలై 10న బాధ్యతలు స్వీకరించిన జితేందర్ శనివారంతో పదవీబాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్‌ను ఆవిష్కరించారు. ప్రశ్న: పోలీస్ బాస్‌గా మీ నెల రోజుల పనితీరు ఎంతమేర సంతృప్తినిచి్చంది? జవాబు: డీజీపీగా ఈ నెల రోజుల పనితీరు ఎంతో సంతృప్తినిచి్చంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా పూర్తి చేశాం. భారీ నేరాలేవీ జరగకుండా కట్టడి చేశాం. పోలీస్ కమిష నర్లు, జిల్లా ఎస్పీలతో ఓ రోజంతా సమావేశమై రాష్ట్రంలో పోలీసింగ్ తీరుతెన్నులు, దృష్టిపెట్టాల్సిన అంశాలు, మత్తుపదార్థాల రవాణా, సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లపై స్పష్టత ఇవ్వగలిగాం. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు మెరుగయ్యాయి. ప్రజలకు అత్యవసర సేవలందించే డయల్ 100 సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టా. డయల్ 100 రెస్పాన్స్ టైం గతంలో కంటే సరాసరిన 5నిమిషాలు తగ్గింది. ప్రశ్న: మీ ప్రధాన ఫోకస్ ఏ అంశాలపై ఉండనుంది? జవాబు: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తున్న సైబర్ నేరాల కట్టడిపై, యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు ముఠాల అణచివేతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా. అదే సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? జవాబు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్యలో చెప్పదగ్గ స్థాయిలో పెరగలేదు. హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కొన్ని రకాల దు్రష్పచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై గణాంకాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసెంబ్లీలో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ఎంతో కఠినంగా ఉన్నాం. విజుబుల్ పోలీసింగ్‌ను పెంచాం. ప్రశ్న: డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అంతంతమాత్రమేనన్న విమర్శలపై ఏమంటారు? జవాబు: కొన్ని సాంకేతిక కారణాలతో గతంలో ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసుల్లో శిక్షలు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోతో కలిసి దాదాపు 18 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పక్కాగా కేసుల నమోదు, దర్యాప్తుతో శిక్షలు పెరిగాయి. ఈ నెల రోజుల్లో నాలుగు ఎన్డీపీఎస్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో రెండు కేసుల్లో దోషులకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది. కొందరు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ డ్రగ్స్ దందాలో దిగుతున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాం. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారిని స్వదేశాలకు పంపుతున్నాం. గత నెల రోజుల్లో ముగ్గురు విదేశీయులను వెనక్కి పంపాం. ప్రశ్న: దొంగతనం కేసులో ఇటీవల ఓ దళిత మహిళను పోలీసులు కొట్టడం వంటి ఘటనల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా కఠినంగానే ఉంటాం. ఇందులో ఏ మినహాయింపు ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిందే. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందిని ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూనే ఉంటాం. ప్రశ్న: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు: కేవలం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోనే మార్పు రాదు. దీనిపై తల్లిదండ్రులు సైతం ఆలోచించాలి. తమ పిల్లలే ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని వారు గుర్తిస్తేనే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. రోడ్డు ప్రమాదాల నియ ంత్రణకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. ప్రశ్న: అతిపెద్ద ముప్పుగా మారిన సైబర్ నేరాలను ఎలా ఎదుర్కొంటున్నారు? జవాబు: సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేసిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేర ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. గత ఆరు నెలల్లో సైబర్ బాధితులకు రూ. 150 కోట్లు రీఫండ్ చేయించడం గొప్ప ఏచీవ్మెంట్. ఒకవైపు సైబర్ కేసుల సత్వర దర్యాప్తు మరోవైపు మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ప్రశ్న: డ్రగ్స్, గంజాయిని ఎంత మేర కట్టడి చేశామనుకుంటున్నారు? జవాబు: మత్తు పదార్థాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పూర్తిస్వేచ్ఛ ఉండటంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు పెంచాం. ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. గతానికి భిన్నంగా పబ్బులు, క్లబ్బుల్లోనూ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నాం. కేసుల నమోదు పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే గంజాయి కట్టడికి గంజాయి తాగిన వాళ్లను గుర్తించే కిట్లను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వంటి కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు పంపాం.సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలిసైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్‌లో డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, యువత వారి ఆలోచన విధానాన్ని విస్తృతపర్చుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోకలిసి టీజీ సైబర్ సెక్యూరిటీ ‘ది గ్రేట్ యాప్‌సెక్ హ్యాకథాన్ 2024’ నిర్వహిస్తోంది. శుక్రవారం బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ హ్యాకథాన్ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, సామాజిక భద్రత విషయంలో సైబర్ భద్రత అత్యంత ప్రధానంగా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ ౖఈ హ్యాకథాన్‌లో 20కి పైగా దేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 22న ఈ హ్యాకథాన్ ఫలితాలు వెల్లడిస్తామని, తెలంగాణలో మొదటి ఐదుగురు, జాతీయస్థాయిలో తొలి ఐదుగురు, అంత ర్జాతీయ స్థాయిలో తొలి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామ న్నారు. వీరికి తెలంగాణ సైబర్‌సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ⇒ ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గతేడాది సైబర్ క్రైమ్ కారణంగా రూ. 7,500 కోట్లు కోల్పోగా, ఆ సొమ్మును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కాపాడారని చెప్పారు. దీనికి సంబంధించి రీఫండ్ ఆర్డర్లను బాధితులకు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సెబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్‌సింగ్, హర్షవర్ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాంబంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ జితేందర్ స్పందించారు. హైదరాబాద్‌లో ఉంటున్న బంగ్లా దేశీ యులపై నిఘా ఉంచామన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారమే నడుచుకుంటామన్నారు. -
TG: బంగ్లాదేశీయులపై నిఘా ఉంచాం: డీజీపీ
సాక్షి,హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాకథాన్-2024 కార్యక్రమాన్ని డీజీపీ శుక్రవారం ప్రారంభించారు.‘బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా నిఘా పెట్టాం. బంగ్లాదేశీయులు హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు’అని డీజీపీ తెలిపారు. -
రాజకీయాల్లోకి మాజీ డీజీపీ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
రిటైర్డ్ పోలీసు అధికారులు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణంగా మారింది. పోలీసు ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకుని, యూపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అసీమ్ అరుణ్ బీజేపీకి చెందిన ప్రముఖ నేతల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇదేవిధంగా పలు రాష్ట్రాల పోలీసు అధికారులు రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంజయ్ పాండే ముంబైలోని వెర్సోవా నియోజకవర్గం నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు.తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఈ నేపధ్యంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ డీజీపీ పాండే మీడియాకు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తాను ఉంటున్న నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, అన్ని వర్గాల మద్దతును స్వాగతిస్తున్నానని పాండే పేర్కొన్నారు.ముంబై పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేసిన పాండే తాను ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీని సంప్రదించలేదని, సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, దానిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పాండేను 2022 సెప్టెంబర్‌లో సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు నేపధ్యంలోనే సంజయ్ పాండే వార్తల్లో నిలిచారు. ఆయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో చదువుకున్నారు. -
అనూహ్యంగా తెరపైకి జితేందర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాష్ట్ర డీజీపీ మార్పుపై కసరత్తులు జరుగుతున్నాయి. తెరపైకి కొందరు సీనియర్ అధికారుల పేర్లు వచ్చినా అవకాశం మాత్రం అనూహ్యంగా డాక్టర్ జితేందర్‌కు దక్కింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిలో డీజీపీగా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ గతేడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే నాటి పీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డిని ఇంటికి వెళ్లి కలిసి అభినందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో రవి గుప్తాను నియమిస్తూ మరసటి రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీలో కీలకంగా మారిన ఆనంద్... రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి దఫదఫాలుగా పోలీసు బదిలీలు జరిగినా రవి గుప్తాను మాత్రం కొనసాగించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కొత్త అధికారిని డీజీపీగా నియమించడానికి కసరత్తులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రానికి సంబంధించి డీజీపీ హోదాలో ఉన్న అధికారుల సీనియారిటీ జాబితాలో తొలి పేరు 1990 బ్యాచ్‌కు చెందిన రవి గుప్తాదే. ఈ తర్వాతి స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్ ఉండగా... ఇటీవల ఆయన కన్ను మూయడంతో అదే బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఆ స్థానంలోకి వచ్చారు. ఈ పరిణామంతో 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ సీనియారిటీ జాబితాలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చారు. రవి గుప్తా తర్వాత సీనియర్ అయిన సీవీ ఆనంద్ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న గొర్రెల స్కామ్ సహా అనేక కేసులు కీలక దశలో ఉన్నాయి. ఈ విభాగానికి డైరెక్టర్‌గా పని చేసిన ఏఆర్ శ్రీనివాస్ సైతం గత నెల ఆఖరున పదవీ విరమణ చేశారు. దీంతో ఏసీబీలో ఆనంద్ కీలకం కావడంతో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. ఆయనకు ఈసారి డీజీపీగా అవకాశం దక్కలేదు. ఇక అనుభవం, సమర్థతతో పాటు వివాదరహితుడు, మృదుస్వభావి కావడంతోనే జితేందర్‌ను డీజీపీ పోస్టు వరించింది. పదోన్నతులు పూర్తి కాకపోవడంతోనే... ప్రస్తుతం నిఘా విభాగాధిపతిగా ఉన్న 1994 బ్యాచ్‌కు చెందిన బి.శివధర్‌రెడ్డి పేరు కూడా డీజీపీ రేసులో వినిపించిది. అయితే ఆయన ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నారు. డీజీపీ హోదాలో ఉన్న రాజీవ్‌రతన్ కన్ను మూయడం, సందీప్ శాండిల్య పదవీ విరమణ చేయడం రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అదనపు డీజీల సీనియారిటీ జాబితాలో ముందున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డితో (హైదరాబాద్ పోలీసు కమిషనర్) పాటు శివధర్రెడ్డికీ డీజీలుగా పదోన్నతి రావాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో లైన్ క్లియర్ కాలేదు.పూర్తి స్థాయి డీజీపీని నియమించాలంటే... రాజకీయ కారణాల నేపథ్యంలో కొన్నేళ్లుగా రాష్ట్ర పోలీసు విభాగానికి ఇన్చార్జ్ లేదా ఫుల్ అడిíÙనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) డీజీపీలే నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలంటే సీరియారిటీ ఆధారంగా ఐదుగురు ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. సీనియారిటీ, గతంలో పని చేసిన స్థానాలు, అనుభవం, సెంట్రల్ డెప్యుటేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే కేంద్రం వీటిలో మూడు పేర్లను వెనక్కు పంపుతుంది. ఆ ముగ్గురి నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాసరెడ్డి, శివధర్‌రెడ్డి పదోన్నతుల తర్వాత కేంద్రానికి సీనియారిటీ జాబితా పంపితే అందులో వీరితో పాటు రవి గుప్త, సీవీ ఆనంద్, జితేందర్‌ల పేర్లు ఉంటాయి. వీటిలో ఏ మూడు పేర్లు వెనక్కు వస్తాయి? వారిలో ఎవరిని డీజీపీగా నియమిస్తారు? లేదా గతంలో మాదిరిగా జితేందర్ పదవీ విరమణ చేసే వరకు, ఆ తర్వాత కూడా ఎఫ్ఏసీ డీజీపీతోనే నడిపిస్తారా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. -
Telangana: తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ జితేందర్ నియామకం
-
తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ జితేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్. తెలంగాణలో మొదట నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా జితేందర్ విధులు నిర్వహించారు. ఇక, 2025 సెప్టెంబర్‌లో జితేందర్ పదవీ విరమణ చేయనున్నారు. కాబట్టి మరో 14 నెలల పాటు ఆయన డీజీపీగా విధులు నిర్వర్తించనున్నారు. ఇక, ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా జితేందర్ ఉన్నారు. అలాగే, విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు కూడా జితేందర్ నిర్వర్తిస్తున్నారు. ఇక, గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మరోవైపు.. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. -
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై డీజీపీకి వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు
-
వైఎస్సార్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి
సాక్షి, అమరావతి: అధికార కూటమి నేతల అమానుష దాడుల నుంచి రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని పార్టీ ముఖ్య నేతలు డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరారు. పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, పార్టీ కార్యాలయాల్లోకి అక్రమ చొరబాట్లను, దాడులను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం డీజీపీకి ఓ లేఖ రాశారు. దానిని డీజీపీకి మెయిల్ ద్వారా పంపారు. కూటమి నేతల దౌర్జన్యాలకు సంబంధించిన పలు ఆధారాలు, వివరాలు కూడా లేఖతో పాటు జత చేశారు.‘రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందినప్పటి నుంచి గత 25 రోజులుగా వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వారి ఆస్తులకు, పార్టీ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలపైన అమానుషంగా దాడులు చేస్తున్నారు. వారి ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకోవడంలేదు. మా ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు. ఈ ఘటనలపై వెంటనే కేసులు నమోదు చేసి, కారకులను వెంటనే అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి టీడీపీ, జనసేన మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు దిగుతున్నారు. గురువారానికి రాష్ట్రంలోని 14 చోట్ల పార్టీ కార్యాలయాల్లోకి చొరబడ్డారు. మా పార్టీ కార్యాలయాలు, ప్రాంగణాల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు. ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారు. టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించినా, బెదిరింపులకు దిగినా పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించడంలేదు సరికదా వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు. శాంతి భద్రతలను కాపాడి, రక్షణగా ఉండాల్సిన పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు తావివ్వడం ద్వారా శాంతి భద్రతలను ప్రమాదంలో పడేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార టీడీపీ కూటమి నాయకుల దాడులు, దౌర్జన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.