Dhananjaya de Silva
-
ఇంగ్లండ్‌తో టెస్టు.. ఎట్టకేలకు లంక పేసర్ అరంగేట్రం!
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. పేసర్ మిలన్ రత్నాయకేకు ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది. మిలన్ ఆగమనం మినహా.. ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌తో తలపడ్డ జట్టుతోనే ఇంగ్లండ్‌తో టెస్టులోనూ బరిలోకి దిగనున్నట్లు తెలిపింది.కాగా టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆగష్టు 21న మొదటి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించగా.. మంగళవారం శ్రీలంక సైతం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించింది.ధనంజయ డి సిల్వ సారథ్యంలోని ఈ జట్టులో వెటరన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నె.. యువ క్రికెటర్ నిషాన్ మదుష్కతో కలిపి లంక ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక మిడిలార్డర్లో కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్ ఆడనుండగా.. కెప్టెన్ ధనంజయ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.అతడి తర్వాతి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ రానున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు అసితా ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండోతో పాటు కొత్తగా రత్నాయకే కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికి రెండు సార్లు జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నా తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కలేదు. అయితే, ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా ఆ లోటు తీరనుంది.కాగా 28 ఏళ్ల మిలన్ రత్నాయకే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశాడు. ఇందులో మూడు నాలుగు వికెట్ల హాల్స్, ఒక ఐదు వికెట్ల హాల్ ఉంది. ఇక 45 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన మిలన్ రత్నాయకే 47 వికెట్లు పడగొట్టాడు. 22 టీ20లలో 24 వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యకు మాత్రమే చోటు దక్కింది. ఇక పాతుమ్ నిసాంక, సదీర సమరవిక్రమ, రమేశ్ మెండిస్, నిసాల తారక, లాహిరు కుమార, కసున్ రజిత, జెఫ్రే వాండర్సె బెంచ్‌కే పరిమితం కానున్నారు. కాగా 2016లో చివరగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక 0-2తో ఓటమిని చవిచూసింది. గత మూడు సందర్భాల్లోనూ ఇంగ్లండ్ చేతిలో ఓటమి(ఎనిమిది టెస్టుల్లో ఏడు పరాజయం, ఒకటి డ్రా) పాలైంది.ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు:తుదిజట్లుఇంగ్లండ్డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.శ్రీలంకదిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేశ్ చండిమాల్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్నాయకే. -
డిసిల్వ, మెండిస్ 'ద్వి'శతక హోరు.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక
రెండు మ్యాచ్‌ల టెస్ట సిరీస్‌లో భాగంగా సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 328 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ధనంజయ డిసిల్వ (102, 108), కమిందు మెండిస్ (102, 164) రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాది శ్రీలంకను గెలిపించారు. వీరికి బౌలర్లు కసున్ రజిత (3/31, 5/56), విశ్వ ఫెర్నాండో (4/48, 3/36), లహిరు కుమార (3/31, 2/39) తోడవ్వడంతో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్, నహిద్ రాణా తలో 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లాం, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లంక బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తైజుల్ ఇస్లాం (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 92 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. డిసిల్వ, మెండిస్ మరోసారి శతక్కొట్టడంతో 418 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మీరజ్ 4, నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం చెరో 2, షోరీఫుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శనను పునరావృతం చేసి 182 పరుగులకే చాపచుట్టేసింది. తద్వారా శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్ (87 నాటౌట్) చివరి వరకు ఒంటి పోరాటం చేశాడు. రెండో టెస్ట్ మార్చి 39 నుంచి ప్రారంభంకానుంది. -
SL Vs BAN: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్.. టెస్ట్ క్రికెట్లో ఒకే ఒక్కడు..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. ఏడు అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి, ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కమిందు ఈ అద్భుత రికార్డును నమోదు చేశాడు. 150 ఏళ్లకు పైబడిన టెస్ట్ క్రికెట్లో కమిందుకు ముందు ఒక్క ఆటగాడు కూడా ఈ ఘనత సాధించలేదు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ (102) చేసిన కమిందు.. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ప్లేస్‌లో బరిలోకి దిగి 100 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మరో ఘనత కూడ ఉంది. లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వ కూడా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. ధనంజయ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసిన ధనంజయ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ధనంజయ, కమిందు సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసి ఆలౌటైంది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. విశ్వ ఫెర్నాండో (4/48), రజిత (3/56), లహిరు కుమార (3/31) విజృంభించడంతో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తైజుల్ ఇస్లాం (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 92 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు టీ సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి 430 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధనంజయ, కమిందుతో పాటు కరుణరత్నే (52) కూడా రాణించాడు. -
శ్రీలంక జట్టు ప్రకటన.. ఒకేసారి ముగ్గురు కొత్త ఆటగాళ్ల ఎంట్రీ
అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు ముగ్గురు అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఉపుల్ తరంగా నేతృత్వంలోని శ్రీలంక సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ లాహిరు ఉదరా, ఫాస్ట్ బౌలర్లు చమిక గుణశేఖర, మిలన్ రత్నాయకేలకు తొలిసారి శ్రీలంక టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇక ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక జట్టుకు ధనంజయ డి సిల్వా సారథ్యం వహించనున్నాడు. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శన తర్వాత శ్రీలంకకు ఇదే తొలి టెస్టు మ్యాచ్. ఫిబ్రవరి 2 నుంచి కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు అఫ్గానిస్తాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్, అబ్దుల్ మాలిక్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నాసిర్ జమాల్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్, బహీర్ షా, మహ్మద్ సలీమ్ సఫీ, నవీద్ జద్రాన్, కైస్ అహ్మద్, నిజత్ మసూద్, జహీర్ ఖాన్, జియా-ఉర్- రెహ్మాన్, యామిన్ అహ్మద్జాయ్, నూర్ అలీ జద్రాన్ శ్రీలంక జట్టు: ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, సదీర సమరవిక్రమ, రమేష్ మెండిస్, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత, కమిందు మెండిస్, ప్రబాత్ ఉ జయసూర్య, ప్రబాత్ జయసూర్య గుణశేఖర, మిలన్ రాత్నాయకే -
శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్..
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ ధనంజయ డి సిల్వాను శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టెస్టుల్లో శ్రీలంక జట్టుకు సారథ్యం వహించనున్న 18 ఆటగాడిగా డి సిల్వా నిలిచాడు. దిముత్ కరుణరత్నే స్ధానాన్ని ధనంజయ భర్తీ చేయనున్నాడు. కాగా గతేడాది జాలైలో పాకిస్తాన్ టెస్టు సిరీస్ అనంతరం దిముత్ కరుణరత్నే శ్రీలంక కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను ధనంజయ డి సిల్వాకు శ్రీలంక క్రికెట్ అప్పగించింది. అదే విధంగా అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ వ్యవహరించనున్నాడు. కాగా ఈ నెలఖారులో అఫ్గాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక కొత్త కెప్టెన్‌గా ఎంపికైన ధనంజయ డి సిల్వా 51 టెస్టుల్లో 39.77 సగటుతో 3,301 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టెస్టుల్లో అతడికి 34 వికెట్లు కూడా ఉన్నాయి. కాగా ఇటీవలే వన్డే, టీ20లకు ఇద్దరూ వేర్వేరు కెప్టెన్లను శ్రీలంక క్రికెట్ నియమించింది. జింబాబ్వేతో వైట్‌బాల్ సిరీస్ నేపథ్యంలో తమ జట్టు టీ20 కెప్టెన్‌గా వనిందు హసరంగా, వన్డే కెప్టెన్‌గా కుశాల్ మెండిస్‌ను ఉపుల్ తరంగా నేతృత్వంలోని లంక సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చదవండి: IND vs SA 2nd Test: చరిత్ర సృష్టించిన కేప్ టౌన్ టెస్టు.. 134 ఏళ్ల రికార్డు బద్దలు -
అతిపెద్ద పొరపాటు.. తప్పని భారీ మూల్యం.. కనీసం సింగిల్ తీసినా..
Afghanistan vs Sri Lanka: ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడి నిరాశగా ఇంటిబాట పట్టింది. గ్రూప్-బిలో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో అఫ్గన్‌పై గెలిచిన దసున్ షనక బృందం సూపర్-4లో ఎంట్రీ ఇచ్చి ముందడుగు వేసింది. కచ్చితంగా సూపర్-4కి అర్హత సాధిస్తారనుకున్నాం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక- అఫ్గన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ.. ‘‘అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ చూస్తే కచ్చితంగా వాళ్లు సూపర్-4కు అర్హత సాధిస్తారని అనిపించింది. కానీ.. ఎప్పుడైతే ముజీబ్ ఉర్ రహమాన్ వికెట్ కోల్పోయిందో.. ఫజల్హక్ ఫారూకీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతా తలకిందులైంది. అతడు కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. క్రీజులోకి వచ్చాడు.. అలా స్టక్ అయిపోయాడు. బహుశా.. కనీసం సింగిల్ అయినా తీయాలని ఎవరూ అతడికి చెప్పలేదేమో! ముజీబ్ అవుట్ కాకపోయినా.. ఫారూకీ సింగిల్ తీసినా.. తర్వాతి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాది ఉంటే.. అఫ్గనిస్తాన్‌కు అనుకూలంగా ఫలితం వచ్చి ఉండేది. అతిపెద్ద పొరపాటు కానీ అలా జరుగలేదు. బహుశా.. ఇంకా తాము రేసులో ఉన్నామనే విషయాన్ని తెలిపే షీట్ మైదానంలో ఉన్న వాళ్లకు అంది ఉండదు. కీలక సమయంలో అఫ్గనిస్తాన్ చేసిన అతిపెద్ద పొరపాటు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పీయూశ్ చావ్లా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పాకిస్తాన్‌లోని లాహోర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్‌డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 92 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గన్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(45), కెప్టెన్ హష్మతుల్లా షాహిది(59), మహ్మద్ నబీ(65) ఇన్నింగ్స్‌తో గాడిన పడింది. ఆ విషయం తెలియదా? అయితే, రన్‌రేటు పరంగా వెనుకబడ్డ అఫ్గనిస్తాన్ 37.1 ఓవర్లలో టార్గెట్ ఛేదిస్తే సూపర్-4లో అడుగుపెట్టే అవకాశం. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేయగా.. 37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది. మరో బంతికి ఇంకో 3 పరుగులు తీస్తే చాలు విజయం సాధిస్తామనగా.. ధనంజయ డిసిల్వా అఫ్గనిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్‌లో 37.1వ ఓవర్ వద్ద ముజీబ్ ఉర్ రహమాన్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ అఫ్గనిస్తాన్ సాంకేతికంగా.. 37.3 ఓవర్లలో 294 పరుగులు, 37.4 ఓవర్లలో 295 పరుగులు సాధిస్తే.. క్వాలిఫై అయ్యే అవకాశం ముంగిట నిలవగా.. ధనుంజయ మళ్లీ దెబ్బేశాడు. సింగిల్ కూడా తీయకుండా బిగుసుకుపోయిన ఫారూకీని ఎల్బీ డబ్ల్యూ చేశాడు. దీంతో అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం What a thrilling match! Sri Lanka secures a spot in the Super 4s with a heart-pounding 2-run victory over Afghanistan! 🇱🇰🇦🇫#AsiaCup2023 #AFGvSL pic.twitter.com/PxL53z217r — AsianCricketCouncil (@ACCMedia1) September 5, 2023 -
రాణించిన చండీమల్.. కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టి..!
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో బి లవ్ క్యాండీ తొలి విజయం సాధించింది. దంబుల్లా ఔరాతో ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో క్యాండీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దినేశ్ చండీమల్ (48; 7 ఫోర్లు) రాణించగా.. ఆఖర్లో ఏంజెలో మాథ్యూస్ (28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడి క్యాండీని విజయతీరాలకు చేర్చాడు. మాథ్యూస్‌కు ఆసిఫ్ అలీ (16 నాటౌట్; 3 ఫోర్లు) సహకరించాడు. క్యాండీ టీమ్ కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టి మ్యాచ్ గెలవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా.. ధనంజయ డిసిల్వ (61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అవిష్క ఫెర్నాండో (32; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (4-0-17-2), ఉడాన (4-0-33-2) రాణించారు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చండీమల్, ఏంజెలో మాథ్యూస్‌తో పాటు ఫకర్ జమాన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డంబుల్లా బౌలర్లలో ధనంజయ, హేడెన్ కెర్లకు తలో వికెట్ దక్కింది. -
BAN VS PAK 1st Test: సౌద్ షకీల్ సెంచరీ.. పాక్‌కు ఆధిక్యం
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్తాన్ ఆధిక్యం సాధించింది. 221/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్.. లంచ్ విరామం సమయానికి అఘా సల్మాన్ (83) వికెట్ (ఆరో వికెట్) కోల్పోయి 313 పరుగులు చేసింది. సౌద్ షకీల్ అజేయ సెంచరీ (119)తో పాకిస్తాన్‌కు లీడ్ అందించాడు. ప్రస్తుతం ఆ జట్టు పరుగు ఆధిక్యంలో కొనసాగుతుంది. షకీల్‌కు జతగా నౌమన్ అలీ (13) క్రీజ్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (19), ఇమామ్ ఉల్ హాక్ (1), కెప్టెన్ బాబర్ ఆజమ్ (13), సర్ఫరాజ్ అహ్మద్ (17) విఫలం కాగా.. షాన్ మసూద్ (39) పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 3, రమేశ్ మెండిస్ 2, కసున్ రజిత ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకే ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధశతకంతో రాణించాడు. లంక ఇన్నింగ్స్‌లో నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమల్ (1), రమేశ్ మెండిస్ (5), ప్రభాత్ జయసూర్య (4), కసున్ రజిత (8) విఫలం కాగా.. కెప్టెన్ కరుణరత్నే (29), సమరవిక్రమ (36), విశ్వ ఫెర్నాండో (21 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు. -
SL Vs Pak: జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్! ఆ బాధ వర్ణణాతీతం!
Sri Lanka vs Pakistan, 1st Test- Babar Azam Failed: శ్రీలంకతో మొదటి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే నిమిత్తం పాకిస్తాన్ శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం (జూలై 16) తొలి మ్యాచ్ ఆరంభమైంది. గాలే వేదికగా జరుగుతున్న టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డి సిల్వ సూపర్ సెంచరీ అయితే, పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే దిముత్ కరుణరత్నె బృందానికి షాకిచ్చాడు. ఓపెనర్లు మధుష్క(4), కరుణరత్నె(29)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(12)ను త్వరగా పెవిలియన్‌కు పంపాడు. ఇలా కష్టాల్లో కూరుకుపోయిన జట్టును నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాథ్యూస్ (64), ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధనుంజయ డి సిల్వా(122) ఆదుకున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ సమరవిక్రమ(36) తన వంతు సహకారం అందించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 312 పరుగులు చేయగలిగింది. ఇక బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు అబుల్లా షఫీక్(19)ను ప్రభాత్ జయసూర్య, ఇమామ్ ఉల్ హక్(1)ను కసున్ రజిత అవుట్ చేశారు. జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్ అంటూ సెటైర్లు వన్‌డౌన్‌లో వచ్చి నిలదొక్కుకున్న షాన్ మసూద్(39)ను మెండిస్ పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన బాబర్ ఆజం పూర్తిగా తేలిపోయాడు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో సమరవిక్రమకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘అయ్యో.. జస్ట్ 87 పరుగులతో బాబర్ ఆజం సెంచరీ మిస్ అయ్యాడు. ఈ జింబాబర్ పాక్‌లో ఉండే రోడ్పిచ్లు అనుకుని పొరపాటు పడ్డాడు’’ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక టాపార్డర్ విఫలం కావడంతో సౌద్ షకీల్ (69- నాటౌట్), అఘా సల్మాన్ (61- నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరి బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా సోమవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ తొలి టెస్టు తుది జట్లు: శ్రీలంక దిముత్ కరుణరత్నే (కెప్టెన్), నిషాన్ మదుష్క, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, దినేష్ చండిమాల్, సదీర సమరవిక్రమ (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత. పాకిస్తాన్ అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్ (కెప్టెన్), సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, నౌమాన్ అలీ, అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా. చదవండి: కోహ్లి, రాహుల్, హార్దిక్.. వీళ్లెవరూ కాదు! సౌత్ హీరోయిన్ను పెళ్లాడిన క్రికెటర్? టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. ‘సెహ్వాగ్ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’ -
SL VS PAK 1st Test: ధనంజయ డిసిల్వ సూపర్ సెంచరీ
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక జట్టు ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. గాలే వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (122) సూపర్ సెంచరీతో మెరవగా.. ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీతో రాణించాడు. వీరు మినహా మిగతా వారెవ్వరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు లంచ్ సమయానికి లంక ఇన్నింగ్స్ ముగిసింది. 10వ సెంచరీ పూర్తి చేసిన ధనంజయ.. కష్ట సమయంలో (54/4) క్రీజ్‌లోకి వచ్చిన ధనంజయ బాధ్యతాయుతంగా ఆడి, జట్టు స్కోర్ 300 దాటించడంతో పాటు కెరీర్లో 10వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్‌తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ధనంజయ, టెయిలెండర్లతో కలిసి మరిన్ని పరుగులు జోడించాడు. 31 ఏళ్ల ధనంజయకు పాక్‌పై ఇది మూడో సెంచరీ కాగా.. తన 50వ టెస్ట్ మ్యాచ్‌లో అతను సెంచరీ చేయడం విశేషం. కెరీర్‌తో 88 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన ధనంజయ.. 10 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 3152 పరుగులు చేశాడు. -
రాణించిన మాథ్యూస్, డిసిల్వ.. దిగ్గజాల సరసన చేరిన లంక క్రికెటర్
2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్.. గాలే వేదికగా ఇవాళ (జులై 16) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (64), ధనంజయ డిసిల్వ (94 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. లంక ఇన్నింగ్స్‌లో నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) విఫలం కాగా.. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. వంద వికెట్ల క్లబ్లో అఫ్రిది.. తొలి రోజు ఆటలో 3 వికెట్లు పడగొట్టిన షాహీన్ అఫ్రిది టెస్ట్‌ల్లో 100 వికెట్ల క్లబ్లో చేరాడు. 23 ఏళ్ల అఫ్రిది 26 టెస్ట్‌ల్లో 102 వికెట్లు పడగొట్టాడు. దిగ్గజాల సరసన ఏంజెలో.. లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. పాక్-శ్రీలంక మధ్య టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో కుమార సంగక్కర (2911) టాప్‌లో ఉండగా.. యూనిస్ ఖాన్ (2286), జయవర్ధనే (1687), ఇంజమామ్ ఉల్ హాక్ (1559) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత మాథ్యూస్ 1522 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. జయవర్ధనే, సంగక్కర తర్వాత.. వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్.. తన 105 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 15029 పరుగులు ఎదుర్కొనగా.. లంక తరఫున అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా మహేళ జయవర్ధనే (22959) ముందువరుసలో ఉన్నాడు. జయవర్ధనే తర్వాత కుమార సంగక్కర (22882) ఉన్నాడు. -
ఓడినా వణికించింది.. వరల్డ్‌కప్ అర్హతకు చేరువలో లంక
వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అంశంలో శ్రీలంక మరింత దగ్గరైంది. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్‌లో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్, శ్రీలంక మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 214 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్ అయింద. ఒక దశలో నెదర్లాండ్స్ విజయం దిశగా నడిచి శ్రీలంకను వణికించింది. అయితే లంక బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో నెదర్లాండ్స్‌ను నిలువరించారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 68 బంతుల్లో 67 పరుగులు చేయగా.. వెస్లీ బార్సీ 52 పరుగులు, బాస్ డీ లీడే 41 పరుగుల చేశారు. లంక బౌలర్లలో మహీషా తీక్షణ మూడు వికెట్లు తీయగా.. వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమారా, మధుషనక, షనకలు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది.ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో డిసిల్వా 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రీలంక వరల్డ్‌కప్ అర్హతకు మరింత చేరువైంది. ప్రస్తుతం లంక ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్ ఓటమితో ఇబ్బందుల్లో పడింది. డచ్ తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇతర జట్ల ఓటములపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Back on 🔝 Sri Lanka reclaim the No.1 spot in the Super Six Standings and are on the verge of booking their #CWC23 berth 🤩 pic.twitter.com/peX1Jfxmq4 — ICC Cricket World Cup (@cricketworldcup) June 30, 2023 చదవండి: #Ashes2023: స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు! దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు -
దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్‌లో శుక్రవారం రెండో మ్యాచ్‌లో లంక తడబడింది. నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్ 'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్ చర్య -
ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు.. భారీ విజయం
తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి శ్రీలంక ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 4) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్‌లో ఆతర్వాత బౌలింగ్‌లో రెచ్చిపోయిన లంకేయులు.. పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గెలుపొందారు. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్‌లో ప్రతి ఒక్కరు బ్యాట్‌ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. ఓ దశలొ (146/2) విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినప్పటికీ.. స్పిన్నర్ ధనంజయ డిసిల్వ (10-0-39-3) ఆ జట్టును భారీగా దెబ్బకొట్టాడు. సెట్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (54), హస్మతుల్లా షాహిది (57)లను ఔట్ చేసి ఆఫ్ఘన్ల ఓటమికి బీజం వేశాడు. అనంతరం హసరంగ (9-2-42-3) వారి పతనాన్ని శాశించాడు. వీరితో పాటు చమీరా (2/18), తీక్షణ (1/35), షనక (1/29) తలో చేయి వేయడంతో ఆఫ్ఘన్లు 42.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. ఫలితంగా 132 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్, షాహిది హాఫ్ సెంచరీలతో రాణించగా.. రహ్మత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (28) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. -
SL VS AFG 1st ODI: రాణించిన అసలంక, డిసిల్వ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 2) తొలి వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్-2023లో సీఎస్కే తరఫున సత్తా చాటిన మతీష పతిరణ.. ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. పతిరణతో పాటు లెగ్ బ్రేక్ బౌలర్ దుషన్ హేమంత కూడా ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్, ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్ను సమస్య కారణంగా లంకతో సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉండగా.. ఐపీఎల్ సహచర ఆటగాడు (గుజరాత్ టైటాన్స్) నూర్ అహ్మద్ నేటి మ్యాచ్ బరిలో నిలిచాడు. ఐపీఎల్ సెంటర్ పాయింట్ అయిన మరో ఆఫ్ఘన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో పాల్గొంటున్నాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి. -
సెమీస్ రేసులో శ్రీలంక.. ఆఫ్గాన్‌పై ఘన విజయం!
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బ్రిస్బేన్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 4 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. లంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా 66 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మన్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్(28), ఘనీ(22), ఇబ్రహీం జద్రాన్(22) పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్ల పడగొట్టగా.. కుమారా రెండు, రజితా, డి సిల్వా తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ దూరం -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు
స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య (3/80, 5/117), రమేశ్ మెండిస్ (5/47, 4/101)లు రెచ్చిపోవడంతో పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. 508 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. లంక స్పిన్నర్ల ధాటికి 261 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 246 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 89/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆట మొదలైన కొద్దిసేపటికే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (49) వెనుదిరగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (81) , వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (37)లు కాసేపు ప్రతిఘటించారు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఫవాద్ ఆలం (1), అఘా సల్మాన్ (4), మహ్మద్ నవాజ్ (12), యాసిర్ షా (27), హసన్ అలీ (11), నసీమ్ షా (18)లు లంక స్పిన్నర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్క ఫవాద్ ఆలం (రనౌట్) వికెట్ మినహా మిగిలిన వికెట్లన్నిటినీ లంక స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 231 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం శ్రీలంక 360/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. భారీ ఛేదనలో పాక్ చేతులెత్తేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ధనంజయ డిసిల్వాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 17 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్ జయసూర్యకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. కాగా, తొలి టెస్ట్‌లో లంక నిర్ధేశించిన 342 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ సునాయాసంగా ఛేదించి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. స్కోర్ వివరాలు.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్ (చండీమల్ (80), నసీమ్ షా (3/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (అఘా సల్మాన్ (62), రమేశ్ మెండిస్ (5/47)) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 360/8 డిక్లేర్ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్ షా (2/44)) పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 231 (బాబర్ ఆజమ్ (81), ప్రభాత్ జయసూర్య (5/117)) చదవండి: డిసిల్వా అద్భుత శతకం.. పాక్ ఓటమి ఖాయం..! -
డిసిల్వా అద్భుత శతకం.. పాక్ ఓటమి ఖాయం..!
పాక్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ ధనంజయ డిసిల్వా (109) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 360 పరుగుల (8 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 508 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (46), కెప్టెన్ బాబర్ ఆజమ్ (26) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రెండో వికెట్‌కు అజేయమైన 47 పరుగులు జోడించారు. ఈ దశలో వెలుతురు లేమి కారణంగా ఆటను కాస్త ముందుగా ఆపేశారు. ఆట ముగిసే సమయానికి పాక్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో లంక విజయానికి 9వికెట్లు అవసరం కాగా.. పాక్ గెలుపుకు 419 పరుగులు చేయాల్సి ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను పాక్ కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ధనంజయ డిసిల్వాకు తోడుగా కెప్టెన్ కరుణరత్నే (61), టెయిలెండర్ రమేశ్ మెండీస్ (45 నాటౌట్) రాణించడంతో శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించి ప్రత్యర్ధి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. స్కోర్ వివరాలు.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్ (చండీమల్ (80), నసీమ్ షా (3/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (అఘా సల్మాన్ (62), రమేశ్ మెండిస్ (5/47)) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 360/8 డిక్లేర్ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్ షా (2/44)) పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 89/1 (ఇమామ్ ఉల్ హక్ (46 నాటౌట్), ప్రభాత్ జయసూర్య (1/46)) చదవండి: వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లో! -
వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన శ్రీలంక..
గాలే: వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టులో శ్రీలంక 164 పరుగులతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విండీస్ 56.1 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా (5/35), రమేశ్ మెండిస్ (5/66) కరీబియన్ జట్టును పడగొట్టేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 328/8తో ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 121.4 ఓవర్లలో 345/9 వద్ద డిక్లేర్ చేసింది. ధనంజయ డిసిల్వా (155 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ధనంజయకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... రమేశ్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: IND Vs NZ: ఒకే ఒక్కడు 6వికెట్లు.. భారత్‌పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్.. -
ధనంజయ సెంచరీ.. డ్రా అయ్యే అవకాశమే ఎక్కువ
గాలే: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా అజేయ సెంచరీ (153 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. దాంతో గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 279 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 46/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంకను ధనంజయ ఆదుకున్నాడు. నిసంక (66; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 78 పరు గులు... లసిత్ ఎంబుల్దేనియా (25 బ్యాటింగ్; 1 ఫోర్)తో కలిసి అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 107 పరుగులు జోడించాడు. ఫలితంగా శ్రీలంక పటిష్ట స్థితిలో నిలిచింది. ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశం ఉంది. -
వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా!
Joshua da Silva Vs Dhananjaya de Silva.. క్రికెట్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాటలయుద్ధం జరగడం సహజం. వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇక ఆటగాళ్లు ప్రతీకారం ఈ విధంగా కూడా తీసుకుంటారా అని అనిపించడం ఖాయం. వారిద్దరే ధనుంజయ్ డిసిల్వా.. జోషువా ద సిల్వా. ధనుంజయ్ డిసిల్వా శ్రీలంక ఆల్‌రౌండర్ కాగా... జోషువా ద సిల్వా వెస్టిండీస్ వికెట్ కీపర్. ఇక విషయంలోకి వెళితే.. లంక, విండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులో విండీస్ కీపర్ ద సిల్వా.. లసిత్ ఎంబుల్దేనియా బౌలింగ్‌లో ధనుంజయ్ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో 54 పరుగులు చేసిన జోషువా.. కీలక సమయంలో రాణించినప్పటికి జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తాజాగా రెండో టెస్టులో ఈసారి 2 పరుగులు చేసిన ధనుంజయ్ డిసిల్వా.. వీరాస్వామి పెరుమాల్ బౌలింగ్‌లో జోషువా ద సిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్‌కు వెళ్తున్న ధనుంజయ్‌ను ఉద్దేశించి జోషువా ..''నువ్వు నా క్యాచ్ పట్టావు.. నేను నీ క్యాచ్ పట్టా.. క్రికెట్లో జరిగేది ఇదే'' అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 21, చరిత్ అసలంక 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. రమేశ్ మెండిస్ 6 వికెట్లు తీయగా.. ఎంబుల్డేనియా 2, జయవిక్రమ 2 వికెట్లు తీశారు. చదవండి: ICC Test Rankings: టాప్-5లోకి దూసుకొచ్చిన షాహిన్.. దిగజారిన విలియమ్సన్ "You catch me, I catch you - that's how it works in cricket" - @joshuadasilva08 😂 After being caught by (Dhananjaya) de Silva in the first Test, (Joshua) Da Silva promised revenge - and he got it! #SLvWI pic.twitter.com/GqkKR4NM3U — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 30, 2021 -
దురదృష్టమంటే ధనంజయ డి సిల్వాదే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..
Dhananjaya de Silva gets out hit wicket in a hilarious manner: గాలే వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా దురదృష్టకర రీతిలో తన వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వా మంచి టచ్‌లో కనిపించాడు. అయితే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రియెల్ వేసిన 95వ ఓవర్లో.. రెండో బంతిని డి సిల్వా ఢిపెన్స్ ఆడగా అది ఎడ్జ్ తీసుకుని స్టంప్స్‌ను తాకబోయింది. చదవండి: Rohit Sharma- Ashwin: అశ్విన్‌పై రోహిత్ ప్రశంసలు.. కెప్టెన్‌కు అటాకింగ్ ఆప్షన్ అంటూ.. ఈ క్రమంలో బంతిని స్టంప్‌కు తగలకుండా డి సిల్వా ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతడు అనుకోకుండా తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా ధనంజయ డి సిల్వా హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. కాగా టెస్టుల్లో హిట్ వికెట్‌గా వెనుదిరగడం అతడికి ఇది రెండోసారి. అధేవిధంగా టెస్ట్ క్రికెట్లో రెండు సార్లు హిట్ వికెట్‌గా ఔటైన రెండో శ్రీలంక ఆటగాడిగా ధనంజయ డి సిల్వా నిలిచాడు. చదవండి: Lendi Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..? Here's the moment Dhananjaya de Silva becomes the second Sri Lankan to hit his own wickets twice in Test cricket. #SLvWI pic.twitter.com/DyGShkaByE — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 22, 2021 -
టీమిండియాపై సత్తా చాటిన వారికి అవకాశం.. స్టార్ ప్లేయర్స్‌కు షాక్
కొలంబో: అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ 2021 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు డసున్ శనక సారథ్యం వహించనుండగా.. స్టార్ బ్యాట్స్‌మెన్ ధనంజయ్ డిసిల్వా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న 21 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ మహిష్ తీక్షణ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జులైలో టీమిండియాపై గెలిచిన జట్టులోని మెజారిటీ సభ్యులు ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఆ సిరీస్‌లో ధవన్ సేనపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన వనిందు హసరంగ, దుష్మంత చమీరా, వికెట్ కీపర్ మినోద్ భానుక, ప్రవీణ్ జయవిక్రమ జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు ఇంగ్లండ్‌లో కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం ద్వారా నిషేధానికి గురైన స్టార్ ఆటగాళ్లు నిరోషన్ డిక్వెల్లా, కుశాల్ మెండిస్, ధనుష్క గుణతిలకలకు ఈ జట్టులో చోటు దక్కపోగా, గాయం నుంచి కోలుకున్న కుశాల్ పెరీరా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, డసున్ శనక నాయకత్వంలోని లంక జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా(ధవన్ సేన)ను ఓడించిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన ఈ సిరీస్‌ను లంక జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు మొదటగా క్యాలిఫైర్ మ్యాచ్‌లు ఆడనుంది. శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టు: డసున్ శనక (కెప్టెన్), ధనంజయ్ డిసిల్వా (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేష్ చండీమల్, అవిష్క ఫెర్నాండో, రాజపక్స, అసలంక, వనిందు హసరంగ, కె మెండిస్, కరుణరత్నే, నువాన్ ప్రదీప్, దుష్మంత చమీరా, జయవిక్రమ, మధుశంక, తీక్షణ. రిజర్వ్ ప్లేయర్స్: లహిరు కుమార, బి ఫెర్నాండో, అఖిల ధనంజయ, పి తరంగ చదవండి: అదే జరిగితే 2-2తో సిరీస్ సమం అవుతుంది.. -
కరుణరత్నే అజేయ డబుల్ సెంచరీ
పల్లెకెలె: కెప్టెన్ దిముత్ కరుణరత్నే (234 బ్యాటింగ్; 25 ఫోర్లు) డబుల్ సెంచరీకితోడు ధనంజయ డిసిల్వా (154 బ్యాటింగ్; 20 ఫోర్లు) శతకంతో క్రీజులో నిలబడటంతో... బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ‘డ్రా’ దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 229/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 512 పరుగులు చేసింది. వెలుతురులేమితో 76 ఓవర్ల ఆట సాధ్యంకాగా... శ్రీలంక ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. కరుణరత్నే, ధనంజయ నాలుగో వికెట్‌కు అజేయంగా 322 పరుగులు జతచేశారు. నాలుగో రోజు కరుణరత్నే–ధనంజయ ద్వయం 283 పరుగులు జోడించింది. కరుణరత్నే కెరీర్లో ఇది తొలి డబుల్ సెంచరీ. టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక తరఫున ఒక రోజంతా ఆడిన ఆరో జోడీగా కరుణరత్నే–ధనంజయ జంట నిలిచింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 541/7కు శ్రీలంక మరో 29 పరుగుల దూరంలో ఉంది. -
‘మీరు బాగా ఆడారు; లేదు.. ఔటయ్యాను’
రావల్పిండి: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభమైంది. బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఈ క్రమంలో గురువారం ఆట ముగిసిన తర్వాత లంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్ విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్ల ప్రశ్నలు డిక్వెల్‌తో పాటు అక్కడున్న మిగతా ఆటగాళ్లకు నవ్వులు తెప్పించాయి. ఇంతకీ విషయమేమిటంటే... మ్యాచ్ గురించి ఓ విలేకరి మాట్లాడుతూ... ‘ మీరు చాలా బాగా ఆడారు. సెంచరీకి దగ్గరగా ఉన్నారు. ఈ పిచ్‌పై శతకం సాధిస్తానని అనుకుంటున్నారా అని డిక్వెల్‌ను ప్రశ్నించాడు. ఇందుకు చిరునవ్వులు చిందించిన డిక్వెల్... ‘నేను డిసిల్వాను కాదు. డిక్వెల్‌ను అంటూ బదులిచ్చాడు. అయినప్పటికీ మరో విలేకరి సైతం ఇలాంటి ప్రశ్ననే సంధించడంతో..‘ మీరు నా గురించేనా మాట్లాడేది. నేను డిక్వెల్. ఇప్పటికే ఔట్ అయ్యి పెవిలియన్‌లో కూర్చున్నాను. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో వీలైతే సెంచరీ గురించి ఆలోచిస్తా’ అంటూ డిక్వెల్ ఓపికగా మళ్లీ అదే సమాధానమిచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో మ్యాచ్ వివరాలు, ఆటగాడి పేరు కూడా తెలుసుకోకుండా విలేకర్ల సమావేశానికి ఎలా వస్తారు. కనీస అవగాహన లేకుండా ప్రశ్నలు అడగడం సబబేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డిక్వెల్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా గురువారం ఆట ముగిసే సరికి ధనంజయ డిసిల్వా(72 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు. Dickwella’s classic replies #PAKvSL @OsmanSamiuddin @Athersmike @TheRealPCBMedia pic.twitter.com/s4LYrQwO96 — Rizwan Ali (@joji_39) December 12, 2019