drinking water
-
అక్క తగ్గేదేలే...
-
కోహ్లి-అనుష్క తాగే నీరు ఎక్కడ నుంచి దిగుమతి అవుతుందో తెలుసా..!
విరాట్ కోహ్లి-అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమైన సెలబ్రిటీ జంటగా పేరుగాంచిన ఈ ఇద్దరు ఏ వేడుకకైన జంటగానే హాజరవ్వుతారు. ఫ్యాషన్ పరంగా కూడా ఇద్దరూ స్టైలిష్ ఐకాన్లుగా ట్రెండ్‌కి తగ్గట్టు ఉంటారు. అలాగే ఇద్దరు కూడా ఫిట్నెస్ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు. వ్యాయామ సెషన్ నుంచి నిద్ర వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంలో ఈ జంట చాలా ప్రత్యేకం. మాములుగా ఏజ్‌ని బట్టి, పరిస్థితుల రీత్యా డైట్‌ని మారుస్తు కాస్త హెల్తీగా మార్పులు చేసకోవడం సహజం. కానీ వీళ్లు ఏకంగా తాగే నీళ్ల విషయంలో కూడా మార్పులు చేశారు. అదికూడా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న నీళ్లను తాగుతారట. వీళ్లు ఎవియన్ అనే సరస్సు నుంచి వచ్చే నేచురల్ స్ప్రింగ్ వాటర్ (భూమి నుంచి సహజసిద్ధంగా వచ్చేది) తాగుతారట. అంతేగాదు నివేదికల ప్రకారం ఎవియన్-లెస్-బెయిన్స్ సరస్సులోని నీరు ఎటువంటి రసాయనాలతో కలుషితం కాలేదని వెల్లడయ్యింది. ముఖ్యంగా ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. ఎవియన్-లెస్-బెయిన్స్ జెనీవా సరస్సు దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని అతి పెద్ద సరస్సులలో ఒకటి. దీన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు పంచుకుంటున్నాయి. అంతేగాదు ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ. 600ల దాక ఉంటుంది. అంటే ప్రతిరోజు రెండు లీటర్ల నీటిని తీసుకుంటే రూ. 1200 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఒక లీటర్ ఎవియాన్ బాటిళ్లు డజను వచ్చేటప్పటికీ ఏకంగా రూ. 4200/ పలుకుతుంది.(చదవండి: వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!) -
గ్రామాల్లో మంచినీటి సహాయకులు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి సరఫరా విషయంలో నూతన ఒరవడికి ప్రభుత్వం నాంది పలికిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి గ్రామంలో మంచినీటి సహాయకుడిని నియమించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 15 జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతోందని.. ఈ నెలాఖరులోగా అన్ని గ్రామాలకూ సహాయకులను నియమించి శిక్షణ పూర్తి చేస్తామన్నారు. తాగునీటి నాణ్యత పరిశీలనతోపాటు బోర్లు పాడైతే అదే రోజు మరమ్మతులు జరిగేలా, లీకేజీలను సరిచేసేలా గ్రామాల్లో మంచినీటి సహాయకులు కృషి చేస్తారని వివరించారు. సోమవారం సచివాలయం నుంచి శాఖాపరమైన సమీక్ష సందర్భంగా వివిధ విభాగాలవారీగా పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని పెండింగ్ బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. విభాగాలవారీగా నూతన పనులకు కార్యాచరణ సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీఉల్లా హాజరయ్యారు. -
‘సుంకిశాల’ ప్రాజెక్టు ఘటన ఎందుకు దాచారు?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ అన్నారు. శుక్రవారం(ఆగస్టు9) తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. మునిసిపల్ శాఖ తనవద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం స్పందిస్తుందని, ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని కేటీఆర్ నిలదీశారు. మేడిగడ్డ ఘటను ఎన్నికలున్నప్పటికీ తాము దాచలేదని గుర్తు చేశారు. రాజధాని హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని విమర్శించారు. ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి దివాళాకోరు విధానాలని, చిల్లర విమర్శలని ఫైర్ అయ్యారు. ‘రాష్ట్ర ప్రజల కోట్లాది రూపాయల సంపద నీట మునిగింది. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయాలని వేగంగా పనులు చేశాం. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేదు. నెత్తిమీద నీళ్ళు జల్లుకొని భట్టి, తుమ్మల యాక్టింగ్ చేస్తుండవచ్చు’అని కేటీఆర్ చురకంటించారు. -
70,00,000 తాగునీటి కొళాయిలు
⇒ రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పరీక్షల నిర్వహణలో మొత్తం 700 మార్కుల ప్రాతిపదికన ఆ రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే 699.93 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 657.10 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రెండున్నర లక్షల తాగునీటి వనరులు ఉండగా, నీటిశుద్ధి పరీక్షల అనంతరం 25,546 తాగునీటి వనరుల్లో నీరు వివిధ కారణాలతో కలుషితమైనట్టు గుర్తించగా, ఆయా ప్రాంతాల్లొ అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.45 లక్షల ఇళ్లు ఉంటే, అందులో 70.04 లక్షల ఇళ్లకు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికే తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ అండ్ శానిటేషన్ 2023–24 ఆరి్థక సంవత్సరం వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేసింది. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీటిని వారి ఇంటి ఆవరణలోనే అందజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో కలిసి 2019 ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 60 శాతం గ్రామీణ ప్రాంత ఇళ్లలో తాగునీటి కుళాయిలు అందుబాటులోకి రాగా, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత ఇళ్లలో 73.38 శాతం ఇళ్లకు 2024 మార్చి నెలాఖరుకే అందుబాటులోకి వచ్చాయని నివేదిక పేర్కొంది. -
స్కై వాటర్: సూర్యరశ్మి, గాలితో వాటర్..!
ప్రస్తుతం మహా నగరాల్లో తాగునీటి ఇక్కట్లు మాములుగా లేవు. మన దేశంలో బెంగుళూరు, ముంబై, హైదరబాద్ వంటి నగరాలు సమ్మర్ వస్తే చాలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో జనాలు నివశించడానికే భయపడే పరిస్థితి ఎదురవ్వుతుందని హెచ్చరిస్తున్నారు కూడా. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేసిన తప్పిదాలే ఇందుకు కారణమని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచే మొత్తుకుంటున్నారు. నీటి ఎద్దడి కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అవన్నీ ఆయా ప్రాంతాలను బట్టి సక్సెస్ అవ్వడం అనేది ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడూ ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ఓ సరికొత్త వాటర్‌ని తాజాగా శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. త్వరలోనే ఆ నీటిని బాటిల్స్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు కూడా. ఇంతకీ పరిశోధకులు ఎలా నీటిని సృష్టిస్తున్నారంటే..అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూర్యుడు, గాలితో నీటిని తయారుచేసే సరికొత్త సాంకేతికను కనుగొన్నారు. ఏంటీ సూర్యకాంతి, గాలితోనా అని ఆశ్చర్యపోకండి. గాలిని స్వేదనంగా మార్చేందుకు హైడ్రోపనెల్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో గాలి నుంచి నీరు ఆవిరిని అయ్యేలా చేసి..ఆ నీటిని సేకరిస్తారు. ఇందుకోసం సోలార్ ప్యానెల్ మాదిరిగా ఉండే వాటిని తీసుకుంటారు. అయితే ఇవి విద్యుత్తుకు బదులు స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేశాయి.ఇక్కడ ఈ ప్యానెళ్లు గాలి నుంచి నీటి ఆవిరిని తీసుకుంటాయి. ఈ తేమను సాంద్రీకృత గాలి ప్రవాహంలోకి విడుదల చేసేందుకు మళ్లీ సౌరశక్తిని వినియోగిస్తుంది. ఈ ప్యానెల్ లోపల నీటి నిష్క్రియాంతక సంక్షేపణను అనుమతిస్తుంది. అంతేగాదు ప్రతి ప్యానెల్ ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపోయేలా మూడు లీటర్ల వరకు త్రాగునీటిని ఉత్పత్తి చేయగలదు. ఈ నీరు స్వచ్ఛమైనది, మినరలైజ్ చేసినది. త్రాగేందుకు సురక్షితంగా ఉండేలా ఓజోనేటెడ్ చేయబడుతుంది కూడా.నిజానికి దీన్ని జీరోమాస్ వాటర్ పేరుతో అమెరికా సోర్స్ కంపెనీ 2014లోనే ప్రారంభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లో హైడ్రోప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్లను గ్రౌండ్ శ్రేణులుగా లేదా ఇంటి పైకప్పులపై తాగునీటితో అనుసంధానించవచ్చు. ప్రతి హైడ్రోప్యానెల్ ధర సుమారు రూ. 2 లక్షల్లో అందుబాటులో ఉండేలా చేసి, నీటి కొరత సమస్యను నివారించాలని భావిస్తున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ పద్ధతిలో నీటిని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించేశారు కూడా. ఇక్కడ రోజుకు దాదాపు మూడు వేల లీటర్‌ని ఉత్పత్తి చేస్తున్నారు కూడా. అంతేగాదు సెప్టెంబర్ 2024 కల్లా యూఎస్ అంతటా స్కైవాటర్ బ్రాండ్‌తో పునర్వినియోగించే అల్యూమినియం క్యాన్‌ల్లో ఈ నీటిని విక్రయించాలని చూస్తున్నారు. అంతేగాదు అమెరికా కంపెనీ సోర్స్ స్కై వాటర్‌ని ప్రజలకు పరిచయం చేసేలా మార్కెటింగ్ చేయాలనుకోవడమే గాక హైడ్రోపనెల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచి స్థిరమైన నీటి వనరులను ప్రోత్సహించడమే లక్ష్యం అని చెబుతోంది. ప్రస్తుతం సోర్స్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ హైడ్రోప్యానెల్స్ అధిక ధర కాస్త అవరోధంగా ఉంది. భవిష్యత్తులో వీటి ధరలు గణనీయంగా తగ్గితే సదరు కంపెనీకి మంచి లాభదాయకమే గాక అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
తాగునీటిలో విష ప్రయోగం
కణేకల్లు: ప్రజలు తాగే నీళ్లలో విషాన్ని కలిపారు.. ఆ నీరు తాగినోళ్లు ప్రాణాలతో ఉండకూడదనుకున్నారో.. లేక వాంతులు, విరేచనాలొచ్చి నిర్వహణ చేసే వారికి చెడ్డపేరు రావాలనుకున్నారో గానీ అత్యంత అమానుష ఘటనకు ఒడిగట్టారు. వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తుంబిగనూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తుంబిగనూరులో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్.. రెండేళ్ల క్రితం మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించింది. గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు ఫణీంద్ర గౌడ్ వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తన తండ్రి తిప్పయ్యను ప్లాంట్ వద్దే ఉంచారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పంచాయతీ ఆధ్వర్యంలో రూ.5కే రెండు బిందెల నీటిని పంí³ణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుప్పటి కప్పుకుని మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కిటికీలు తీసి నీటి ట్యాంకులో టెర్మినేటర్ పురుగుల మందు కలిపారు. అదే సమయంలో బహిర్భూమి కోసం లేచిన తిప్పయ్య ప్లాంట్ వద్ద వ్యక్తులు ఉండటాన్ని గమనించి.. ఎవరక్కడ అంటూ గద్దించాడు. దీంతో పొరుగున ఉండే తలారి హనుమంతు, కొట్రేగౌడ్ నిద్ర లేచి అక్కడికి వచ్చారు. ఇంతలోనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వాటర్‌ప్లాంట్‌ను పరిశీలించగా.. అందులో పురుగుల మందు కలిపినట్టు తేలింది. ఈ ఘటనను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని ఉపేక్షించొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, కణేకల్లు ఎస్ఐ శ్రీనివాసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రంగంలో దింపి ఆధారాలను సేకరించారు. జరిగిన ఘటనపై తిప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎల్లో మీడియాలో దుష్ప్రచారం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ రాలేదన్న ఉద్దేశంతో నేనే కొందరితో తాగునీటిలో విషం కలిపించానంటూ ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం దుర్మార్గం. గ్రామ సర్పంచ్‌గా నేను 365 ఓట్ల మెజార్టీతో గెలిచాను. గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 494 ఓట్లు రాగా.. టీడీపీకి 512 ఓట్లు వచ్చాయి. ఓట్లు వేయలేదని ప్రజలను బెదిరించడం, దౌర్జన్యం చేయడం లాంటివి నేను ఏరోజూ చేయలేదు. ఎల్లో మీడియా నాపై నింద వేయడంబాధాకరం.– ఫణీంద్ర గౌడ్, గ్రామ సర్పంచ్, తుంబిగనూరు -
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా?
నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంతమంచిదని అంటారు. అలా అని ఎప్పుడుపడితే అలా తాగడం మంచిది కాదని కూడా చెబతున్నారు నిపుణులు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలని..ఇలా చేస్తే మలబద్దక సమస్య ఉండదని అంటారు. ఆ తర్వాత వీలు కుదిరినప్పుడైన నీళ్లు తాగే యత్నం చేయండని అంటారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బోజనం అయ్యిన వెంటనే లేదా భోజనం మధ్యమధ్యలో అదేపనిగా తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంట. ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు నిపుణులు. అవేంటంటే..నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. దాహార్తిని తీర్చడమే కాకుండా ఆహారాన్ని చక్కగా విచ్ఛిన్నం చేసి సులభంగా జీర్ణమవ్వడంలో సహాయపడుతాయి. తద్వారా శరీరం త్వరిగతగతిన పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..భోజనం అయ్యిన వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటంటే..జీర్ణ సమస్యలు..తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్టిక్ రసాలు, జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని చెబతున్నారు. దీని వల్ల పోషకాల సహజ శోషణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అయిపోతుంది. దీంతో సాధారణంగా జీర్ణం అయ్యే వ్యవధిలో మార్పులు వచ్చి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. బరువు పెరగడం..తిన్న వెంటనే నీళ్లు తాగడంతో తొందరగా ఆహారం విచ్చిన్నమయ్యి వేగంగా జీర్ణ మయ్యిపోతుంది. దీంతో వెంటనే ఆకలిగా అనిపించి..అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడం, ఓబెసిటీ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గుండెల్లో మంట..భోజనం చేసిన వెంటనే తాగిన నీరు జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి ఆమ్లత్వానికి దారితీసి గుండెల్లో మంటకు కారణమవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ రసాయనాలు, డైజిస్టివ్ ఎంజైమ్‌లు అదనపు నీటితో కరిగించబడి ఆమ్లత్వానికి దారితీస్తుంది. దీంతో గుండెల్లో మంట వంటివి కలుగుతాయి. ఇన్సులిన్ పెరుగుదలకు..ఇలా నీళ్లు తాగడం వల్ల కొంత ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఇది కాస్త కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయడబడి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మధుమేహానికి దారితీసి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఎలా తాగడం మంచిదంటే..భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత నీరు తాగడానికి సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడూ ఎక్కిళ్లు వచ్చి నీళ్లు తాగక తప్పడం లేదు అనుకుంటే..తింటున్నప్పుడూ మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీటిని సిప్ చేయండి. ఇలా చేస్తే కాస్త గొంతులో ఆహారం సాఫీగా దిగడమే కాకుండా ఆహారం మృదువుగా అయ్యి సులభంగా జీర్ణమవుతుంది. అలాగే బాగా చల్లగా ఉన్న నీటిని అస్సలు తాగొద్దు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసి జీర్ణమయ్యే వ్యవధిని మందగించేలా చేస్తుంది. పైగా యాసిడ్ రిఫ్లక్స్‌కి దారితీసి, టాక్సిన్ సేకరణకు దారితీస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ తినేటప్పుడూ ఎరేటెడ్ డ్రింక్స్, కెఫిన్ వంటి పానీయాలను తీసుకోకండి అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?) -
Summer Special: ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!
ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లోనుంచి బాటిల్ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్ వాటర్ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.ఇవి చదవండి: Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా! -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
తెలంగాణకు 8.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో.. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్‌ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్‌కుమార్, ఈఈ విజయ్‌భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు. -
ఎండల తీవ్రత ముదురుతున్నా.. జూన్ వరకు నీటి సమస్య రాదు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత ముదురుతున్నా.. వచ్చే జూన్ వరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య అధికం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి ఎద్దడి కాస్త అధికంగా ఉన్నట్లు గుర్తించామనీ, అలాగే 67 మున్సిపాలిటీలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. తాగునీటి సమస్యపై ప్రతీరోజు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తాగునీటి సమస్య పర్యవేక్షణకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన విషయాన్ని గుర్తు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందన తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినా, వార్తలు వచ్చినా వెంటనే అధికార యంత్రాంగం స్పందిస్తోందని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే.. అందులో 130 మునిసిపాలిటీల్లో సాధారణ రోజులతో పోలిస్తే పదిశాతం మేరకు నీటి కొరత ఉన్నా.. ప్రజలకు సరిపడే తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించింది. సాధారణ రోజుల్లో ఈ పట్టణాల్లో సగటున 1398.05 ఎల్ఎండీ(మిలియన్స్లీటర్స్ పర్ డే) తాటి సరఫరా జరిగితే ప్రస్తుతం 1371 ఎల్‌ఎండీల నీటి సరఫరా జరుగుతోందని, 26.31 ఎల్‌ఎండీల కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. పది మునిసిపాలిటీలతోపాటు, రెండు కార్పొరేషన్లలో అధికంగా నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఖమ్మం, కరీంనగర్లో ప్రత్యామ్నాయ చర్యలు ఖమ్మం, కరీంనగర్లో ఎండలు ముదిరే కొద్ది నీటి ఎద్దడి పెరుగుతుందన్న అంచనాతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 27 పట్టణాల్లో 135 ఎల్ పీసీడీ(లీటర్స్ పర్ పర్సన్ పర్డే) కంటే ఎక్కువ నీటి సరఫరా జరుగుతుంటే, 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీల మధ్య, 67 మునిసిపాలిటీల్లో 100 ఎల్పీసీడీ కంటే తక్కువ సరఫరా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేదని భగీరథ అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వంద ఎల్పీసీడీ నీటి సరఫరా జరుగుతోంది. అందుబాటులో గ్రిడ్, స్టాండ్ బై పంపులు మంచినీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే గ్రిడ్ పంప్‌లతోపాటు, స్టాండ్‌బై పంపులు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల నుంచి నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేట్టింది. మిడ్ మానేర్, లోయర్ మానేరు నుంచి కరీంనగర్ నగరానికి నీటిని అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే కర్ణాటక లోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్‌కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథకు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుని, అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నీటి మట్టాలు తగ్గడం వల్లనే ఎద్దడి గడిచిన అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడం, గోదావరి, కృష్ణా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడం వల్ల తాగునీటి సమస్య ఉత్పన్నం అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
అడుగంటిన పాలేరుకు జీవం
సాక్షి, మహబూబాబాద్: మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు జలాశయంలో నీరు అడుగంటడంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు వదిలారు. ఎడమ కాల్వనుంచి రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని పాలేరు జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నాలుగు జిల్లాలకు పొంచి ఉన్న తాగునీటి ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని 2,439 గ్రామాలకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, నర్సంపేట మున్సిపాలిటీలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. వీటి పరిధిలోని సుమారు 22లక్షల జనాభాకు పాలేరు నుంచి వచ్చే గోదావరి నీరే ఆధారం. ఇటీవల పాలేరు జలాశయం అడుగంటే పరిస్థితికి చేరుకుంది. 2.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో నీరు బుధవారం నాటికి 0.49 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ఉన్న నీటితో రెండు, మూడు రోజులకు మించి తాగునీరు అందదని అధికారులు భావించి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో సాగర్ జలాలు విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు విడుదల చేసే నీరు ఏప్రిల్, మే నెలలకు సరిపోనుందని, ప్రస్తుతానికి గండం తప్పినట్లేనని పాలేరు గ్రిడ్ డీఈ మురళీకృష్ణ చెప్పారు. -
కృష్ణా జలాలు తీసుకుంది చాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లను తీసుకోవడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యులు డాక్టర్ ఆర్ఎన్ శంఖువా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నెల 2న లేఖ రాశారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీ లను తెలంగాణ వాడుకుందని ఫిర్యాదు చేస్తూ ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. -
ఏపీ, తెలంగాణ మధ్య ‘కృష్ణా’ మంటలు!
సాక్షి, హైదరాబాద్: మండు వేసవి కృష్ణా జలాల్లో మంటలు పుట్టించింది. కృష్ణా జలాల వాడకంపై ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో తాజాగా ఇరు రాష్ట్రాలు కోట్లాటకు దిగాయి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీల జలాలను తెలంగాణ వాడుకుందని ఏపీ ఆరోపించింది. లెక్కాపత్రం లేకుండా తెలంగాణ చేస్తున్న నీటి వాడకాన్ని నియంత్రించడానికి సత్వరమే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా బోర్డుకు ఈ నెల 1న లేఖ రాసింది. త్రిసభ్య కమిటీకి నీటి అవసరాలపై సరైన ఇండెంట్లు సమర్పించకుండానే.. బోర్డు నుంచి వాటర్ రిలీజ్ ఆర్డర్లు లేకుండానే తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాలను వాడుకుందని లేఖలో ఆరోపించింది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 513.4 అడుగులకు పడిపోగా నిల్వలు 137.515 టీఎంసీలకు తగ్గిపోయానని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. డెడ్ స్టోరేజీ లెవల్ 505 అడుగులకు ఎగువన వాడుకోవడానికి వీలుగా 14.182 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నా యని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఏపీ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసేందుకు అనుమతించేలా సీఆర్పీఎఫ్ బలగాలకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు నీటి విడుదల ప్రక్రియను పర్యవేక్షించడానికి సిబ్బందిని పంపించాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. సభ్యులంతా హాజరు కావాలన్న బోర్డు.. ఏపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కృష్ణా బోర్డు ఈ నెల 4న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, సభ్యులందరూ హాజరు కావాలని ఇరు రాష్ట్రాలను కోరింది. త్రిసభ్య కమిటీ కన్వినర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు వ్యహరించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలతోపాటు నీటి విడుదల ఆర్డర్ల జారీపై ఈ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ఏప్రిల్, మేలలో తాగునీటి సరఫరాకు సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని పంపుల ద్వారా తరలించాలని ఇప్పటికే తెలంగాణ నిర్ణయం తీసుకుంది. ‘42.39 టీఎంసీలను తెలంగాణ వాడేసుకుంది’ శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి తమ రాష్ట్రానికి 45 టీఎంసీలు కేటాయించగా తాము 42.457 టీఎంసీలనే వినియోగించుకున్నామని... కానీ తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయిస్తే 7.391 టీఎంసీలు అధికంగా మొత్తం 42.391 టీఎంసీలను వాడుకుందని ఏపీ ఆరోపించింది. ఏపీలో తాగునీటికి తీవ్ర కొరత ఉన్నందున పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఈ నెల 8 నుంచి నీటి విడుదలకు అనుమతించాలని కోరింది. ఏపీ ఆరోపణలకు బదులిస్తూ త్వరలో తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాయనుంది. -
కరెంట్ కోతలుండొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వేసవిలో పెరిగిన డిమాండ్‌కు సరిపడా విద్యుత్ లభ్యత ఉందని.. ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండరాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి తీవ్రతతో పెరిగిన డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్నారు. కరెంట్ పోయిందనే ఫిర్యాదులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు జారీ చేశారు. అత్యవసర సేవలైన విద్యుత్, తాగునీటి సరఫరాలపై తొలుత సమీక్ష నిర్వహించాలని సీఎం భావించినా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేవలం సూచనలు జారీ చేశారని సీఎంఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నా, కోత లేకుండా విద్యుత్‌ను అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ప్రశంసించారు. ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్కని అభినందించారు. తాగునీటి సరఫరాకు యాక్షన్‌ప్లాన్ అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. బోర్‌వెల్స్, బావులను తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. గ్రామాలవారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పారు. అవసరాన్ని బట్టి రాష్ట్రస్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరత అధిగమించేందుకు వాటర్‌ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటకు చేరేలా చూడాలని, అందుకు సరిపడా ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. గత ఏడాదితో పోలిస్తే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14,000 మెగావాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండోవారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. – గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ వినియోగం ఉంటే.. 2024 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో సగటున రోజుకు 251.59 ఎంయూల విద్యుత్ వినియోగం ఉంది. – గత ఏడాది మార్చి 14న అత్యధికంగా 297.89 ఎంయూల విద్యుత్ వినియోగం ఉండగా, ఈ ఏడాది 308.54 ఎంయూల వినియోగం జరిగి కొత్త రికార్డును సృష్టించింది. – గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. -
వేసవిలో కుండలోని నీళ్లే ఎందుకు బెటర్?
వేసవిలో దాహార్తి మాములుగా ఉండదు. ఎంతలా అంటే ఏం తిన్నా ముందుగా దాహం అనిపించేస్తుంది. దీనిక తోడు బయట ఎండ ధాటికి తట్టుకోలేక చలచల్లగా నీళ్లు ఉంటే చాలనిపిస్తుంది. అందుకని ఫ్రిజ్‌లోని బాటిళ్లను ఖాళీ చేసేస్తుంటాం. అయితే చాలామంది కుండలోని నీళ్లే మంచిది అంటారు. ఫ్రిజ్‌లోని నీరు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తుంటారు నిపుణులు. అసలు కుండలోని నీళ్లే ఎందుకు బెటర్ అంటే.. వేసవి రాగానే చల్లదనాన్ని అందించే కూలర్లు, ఏసీల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఇదే సమయంలో ఫ్రిజ్ అమ్మకాలు కూడా పెరుగుతాయి. నేడు ప్రతి ఇంట్లో ప్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. కూరగాయలు ఇతర పదార్థాలను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇందులో నీటిని కూడా ఉంచి చల్లగా చేసుకుంటాం. అయితే ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పూర్వకాలంలో వేసవిలో ఎక్కువగా మట్టితో చేసిన కుండ నీరు తాగేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కుండ నీరే తాగుతున్నారు. వేసవిలో కుండ నీరు మాత్రమే చల్లగా ఉంటాయి. ఓపెన్ ప్లేసులో పెట్టడం వల్ల ఇవి మరింత చల్లగా మారుతాయి. ముఖ్యంగా మట్టిలో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. అందువల్ల కుండనీరు తాగగానే అవన్నీ నేరుగా శరీరంలోకి వెళ్లి మేలు చేస్తాయి. అందువల్ల ఫ్రిజ్ నీరు కంటే కుండలోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది. రిఫ్రిజిరేటర్ నీరు మోతాదుకు మించి చల్లదనం ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. రెగ్యులర్‌గా కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి అనూహ్యంగా పెరుగుతుంది. చలవ చేయడం మాటే అటుంచి అందులోనూ ఈ వేసిలో వేడిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందువల్ల కుండలోని నీటికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది నిపుణులు సూచిస్తున్నారు. అదీగాక మట్టి కుండలో నీరు తాగడం వల్ల జీవ క్రియలు పెరుగుతాయి. పైగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. (చదవండి: Fennel Seeds: సొంపుతో ఇన్ని లాభాలా? ఐతే దీన్ని..!) -
తాగునీటికి ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన మూడు జలాశయాలైన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌లలో గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ సరిపడా నీటి లభ్యత ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి సరఫరాను సమీక్షించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ‘వేసవి కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించి జిల్లాలకు తగు నిధులను కూడా విడుదల చేసినట్లు సీఎస్ తెలిపారు. తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు. నిరంతర నీటి సరఫరా కొనసాగింపునకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోని తాగునీటి సమస్యను మన రాష్ట్రానికి కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన వార్తా కథనాలు రాయడం సరికాదన్నారు. ఏప్రిల్ రెండో వారం అనంతరం రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌ను చేపడతామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో కూడా సరిపడా నీటి సరఫరా చేస్తున్నామని, వాణిజ్య అవసరాల నిమిత్తం డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు వెల్లడించారు. -
నల్లా ఇరుక్కు!
మీ ఇంట్లో నల్లాల ద్వారా నీరొస్తోందా.. దాన్ని నేరుగా తాగుతున్నారా? లేదా ఏదైనా ఫిల్టర్‌లో వేసి తాగుతున్నారా? అత్యధిక శాతం ప్రజలు ఫిల్టర్లనే వాడుతుంటారు. ఎందుకంటే.. మంచి నీళ్లని చెబుతున్నా.. అవన్నీ మంచిగా ఉన్నవేనా అన్న డౌటు. ఫిల్టరైజేషన్ చేయకుంటే.. రోగాల బారినపడతామన్న భయం. అయితే.. కొన్ని దేశాల్లో నల్లా నీటిని నేరుగా తాగేయొచ్చు. ఎందుకంటే.. తాగునీటి సరఫరా విషయంలో ఇవి కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. సురక్షితమైన నీటిని నల్లాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అందుకే ఈ కింది దేశాల్లోని నీరు ‘నల్లా ఇరుక్కు’అన్నమాట!! చాలా సినిమాల్లో ఈ మాట విన్నట్లు అనిపిస్తోంది కదూ.. ఈ తమిళ పదానికి అర్థం ఇది బాగుంది లేదా మంచిది అని. మార్చి 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ నేపథ్యంలో.. ఈ ‘నల్లా ఇరుక్కు’ దేశాల టాప్–10 వివరాలివీ.. ఫిన్లాండ్ ప్రకృతి సహజ వనరులకు పెట్టింది పేరైన ఫిన్లాండ్లో అత్యాధునిక వ్యవస్థలతో విస్తృతంగా నీటి శుద్ధి చేపడతారు. ఇక్కడ నల్లాల ద్వారా సరఫరా చేసే మంచి నీరు ప్రపంచంలోనే సురక్షితమైనదిగా పేరుపొందింది. ఐస్‌ల్యాండ్ ఈ దేశంలో హిమానీ నదాలు (గ్లేసియర్లు), వేడి నీటి ఊటల నుంచి వచ్చే నీరు సాధారణంగానే సురక్షితమైనది. ఆ నీటినే మరికాస్త శుద్ధిచేసి ఇళ్లకు సరఫరా చేస్తారు. స్విట్జర్లాండ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు, శుద్ధి చేసేందుకు అనుసరించే విధానాలతో ఈ దేశంలో నల్లా నీళ్లు సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. ఆస్ట్రియా ఇక్కడి పర్వత ప్రాంతాలు, వాటికి అనుబంధంగా ఉన్న మంచి నీటి వనరులకు తోడు.. నీటి సంరక్షణ చర్యలు, కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. నార్వే హిమానీనదాలు, ఇతర మంచి నీటి వనరులు అందుబాటులో ఉండటం, నీటి శుద్ధికి అత్యంత ఆధునిక విధానాలు అవలంబించడంతో.. సురక్షిత నీరు సరఫరా చేసే దేశాల్లో నార్వే ఒకటిగా నిలిచింది. నెదర్లాండ్స్ మంచినీటి వనరులు మరీ ఎక్కువగా లేని దేశమే అయి నా.. నీటి శుద్ధి, నల్లాల ద్వారా పరిశుభ్రమైన నీటి సరఫరా విషయంలో ముందు నుంచీ మంచి ప్రమాణాలు పాటిస్తోంది. మాల్టా ఇది చుట్టూ ఉప్పునీరే కమ్ముకుని ఉన్న చిన్న ద్వీప దేశమే అయినా.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే (డీసాలినేషన్ ప్రక్రియ) ద్వారా సురక్షిత నీటిని ఇళ్లకు సరఫరా చేస్తోంది. ఐర్లాండ్ ఇక్కడ మంచినీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు జలాల సంరక్షణ, శుద్ధి విషయంలో కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటి సరఫరాలో టాప్–10 దేశాల్లో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు పాటించడం, నీటి శుద్ధికి అత్యున్నత విధానాలను అవలంబించడంతో ప్రమాణాలతో కూడిన నీటిని ఈ దేశంలో సరఫరా చేస్తున్నారు. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
బెంగళూరు దాహార్తి!
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి. కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్‌మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్‌లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి. ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది. 1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క. కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్‌లోని రాంసర్లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది. మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్‌టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి. ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది. నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్‌టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది. -
రూ.900 కోట్ల తో ఇంటిఇంటికి మంచి నీరు సరఫరా
-
తాగునీటికి తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి తాగునీరు అందేలా చూడాలని సూచించారు. ఇందుకోసం సాగునీటి, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు కలసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వర్షాభావంతో రాష్ట్రంలోని కీలక జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి తాగునీటి అంశంపై సమీక్షించారు. బోర్లు, మోటార్లకు మరమ్మతులు కొత్త నీటి పథకాలను తెచ్చినప్పుడల్లా అంతకుముందున్న అనేక నీటి వనరులను వదిలేశారని.. అలాంటి వాటిని ప్రస్తుతం వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సమీక్షలో సీఎం సూచించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని.. కానీ మిషన్ భగీరథ వచ్చాక దానిని వదిలేశారని చెప్పారు. ఇలాంటివి రాష్ట్రంలో ఎక్కడున్నా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి బోర్లు, బావులు, మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఇందుకోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధుల నుంచి కోటి రూపాయలు, అవసరమైతే అంతకన్నా ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. కృష్ణానీటిపై దృష్టి పెట్టండి ఏపీ సర్కారు తాగునీటి కోసమంటూ నాగార్జునసాగర్ నుంచి తొమ్మిది టీఎంసీలకుపైగా నీటిని తీసుకుపోతోందని సమీక్షలో అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన రేవంత్.. అంత పెద్దమొత్తంలో తాగునీటిని ఎక్కడ వినియోగిస్తున్నారో సరైన గణాంకాలు తీసుకోవాలని.. ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని సూచించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటిని తీసుకోవాలంటే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ ఎంబీ)కి లేఖ రాయాల్సి ఉంటుందని చెప్పగా.. ఎంత నీరు అవసరమో వెంటనే సమీక్షించి లేఖ రాయాలని ఆదేశించారు. నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను కోరవచ్చని అధికారులు చెప్పగా.. పరిస్థితిని బట్టి దీనిని చివరి అవకాశంగా తీసుకోవాలని సీఎం సూచించారు. తప్పుడు నివేదికలతో అందని నిధులు ఇటీవల తాను ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక గ్రామాల్లో తాగునీటి సరఫరా లేదని గుర్తించినట్టు సీఎం చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా 99శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చినందునే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ నిధులు రావడం లేదన్నారు. గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తంగా జూలై చివరిదాకా ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ తాగునీటికి సమస్య లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే హైదరాబాద్‌కు పెద్దగా ఇబ్బందులు లేవని.. అవసరమైతే ఎల్లంపల్లి, నాగార్జునసాగర్‌ల నుంచి తెప్పించుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇక వేసవి పూర్తయ్యే వరకు హైదరాబాద్ నగరంలో తాగునీటి ట్యాంకర్ల రాకపోకలకు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడా లని సీఎం ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బందికి వేతనాలకోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.