Gadkari
-
గడ్కరీని ఓడించేందుకే వారు పనిచేశారు : రౌత్ సంచలన ఆరోపణలు
ముంబై: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్‌పై శివసేన(ఉద్ధవ్) కీలక నేత, ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని నాగ్‌పూర్‌లో ఓడించేందుకు షా, ఫడ్నవిస్‌లు పనిచేశారని రౌత్ ఆరోపించారు.‘మోదీ, షా, ఫడ్నవిస్‌లు కలిసి గడ్కరీని ఓడించేందుకు గట్టిగా పనిచేశారు. అయితే గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన తర్వాత ఫడ్నవిస్ ఆలస్యంగా నాగ్‌పూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మాటలు నేను కాదు ఆర్ఎస్ఎస్ క్యాడరే బహిరంగంగా చెబుతోంది’ అని శివసేన(ఉద్ధవ్) అధికారిక పత్రిక సామ్నాలో రౌత్ కథనం రాశారు. మరోపక్క అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ చెందిన క్యాండిడేట్లను ఓడించేందుకు సీఎం షిండే ఒక్కో నియోజకవర్గంలో రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈసారి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగిని మారుస్తారు’అని రౌత్ తన కథనంలో పేర్కొన్నారు. కాగా, రౌత్ రాసిన ఈ కథనంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ఫైర్ అయ్యారు. నిజానికి రౌత్ శివసేన అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా ఎన్సీపీ(శరద్‌పవార్) అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రౌత్‌కి దమ్ముంటే 2019లో సీఎం అవడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కథనం రాయాలని సవాల్ విసిరారు. -
భారతదేశంలో మొదటి టాటా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ.. ఇదే!
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ భారతదేశంలో తన మొదటి 'రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ' (RVSF)ని రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించింది. దీనిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రారంభించారు. టాటా మోటార్స్ ప్రారంభించిన ఈ ఆధునిక సదుపాయంతో సంవత్సరానికి 15,000 వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. అంతే కాకుండా పేపర్‌లెస్ కార్యకలాపాల కోసం పూర్తిగా డిజిటలైజ్ చేయబడింది. స్క్రాప్ చేయాల్సిన వెహికల్స్ యొక్క టైర్లు, బ్యాటరీలు, ఫ్యూయెల్, ఆయిల్స్ వంటి వాటిని విడదీయడానికి కూడా ఇందులో ప్రత్యేకమైన స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో వెహికల్ స్క్రాపింగ్‌కి అయ్యే ఖర్చులను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, అంతే కాకుండా ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనేది కూడా ప్రకటించలేదు. టాటా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ప్రారంభ సమయంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి దశలవారీగా స్క్రాపేజ్ విధానం ఉపయోగపడుతుంది. ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేసిన టాటా మోటార్స్‌ని అభినందిస్తున్నానన్నారు. అంతే కాకుండా దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశాన్ని వాహన స్క్రాపింగ్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు, భారతదేశంలో ఇలాంటి అత్యాధునిక స్క్రాపింగ్, రీసైక్లింగ్ యూనిట్లు మరిన్ని అవసరమని గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. -
గడ్కరీ నోట ‘యూజ్ అండ్ త్రో’ వ్యాఖ్యలు.. బీజేపీ అధిష్ఠానానికి గురి?
ముంబై: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కీలకమైన పార్లమెంటరీ కమిటీ నుంచి ఆయన్ని తప్పించిన తర్వాత రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో.. అవసరానికి వాడుకుని వదిలేయకూడదంటూ శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల కార్యక్రమం వేదికగా గడ్కరీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు కాదని, తాను పూర్తిగా వదిలేసినప్పుడే అంతమవుతాడని పేర్కొన్నారు. ‘బిజినెస్, సామాజిక పనులు, రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలం. అయితే, ఎవరూ వాడుకుని వదిలేసే మనస్తత్వంతో వ్యవహరించకూడదు. మంచి, చెడు రెండు సమయంలోనూ పట్టుకున్న చేతిని వదలకూడదు. ఎల్లప్పుడూ పట్టుకునే ఉండాలి. ఉదయించే సూర్యుడిని(ఎదిగే వ్యక్తులను) పూజించొద్దు.’ అని పేర్కొన్నారు గడ్కరీ. స్టూడెంట్ నాయకుడిగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు గడ్కరీ. ఆ సమయంలో మంచి భవిష్యత్తు కోసం తనను కాంగ్రెస్‌లో చేరాలని శ్రీకాంత్ జిక్కర్ కోరినట్లు చెప్పారు. అయితే, కాంగ్రెస్ భావజాలం తనకు నచ్చదని, పార్టీలో చేరటం కంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకైనా సిద్ధమని చెప్పినట్లు తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలు తమ ఆశలను ఎప్పటికీ వదులుకోవద్దని సూచించారు. ఇదీ చదవండి: ప్రభుత్వంపై నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు.. మరోసారి దుమారం! -
కేంద్ర మంత్రి గడ్కరీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
-
మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం
-
నరేంద్ర మోదీ డ్రీమ్ టీమ్ ఇదే...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రీమ్ టీమ్ ప్రమాణ స్వీకారం చేసింది. భారత ప్రధానమంత్రిగా మోదీ రెండోసారి అంతఃకరణ శుద్ధితో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మోదీ భారతదేశానికి 16వ ప్రధాని. మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా కేబినెట్ కూర్పుపై ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుదీర్ఘంగా చర్చలు జరిపినా చివరి వరకూ గోప్యత పాటించారు. 58మందితో నరేంద్ర మోదీ మంత్రివర్గం కొలువుతీరింది. మోదీతో సహా 25మంది కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదాలో 9మంది సహాయ మంత్రులు, 24 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు. కాగా గత మంత్రివర్గంలో 25మంది కేంద్రమంత్రులుగా, 11 సహాయ (స్వతంత్ర), 40 సహాయ మంత్రులుగా ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం కేంద్రమంత్రులు... 1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి) 2. రాజ్‌నాథ్ సింగ్ 3. అమిత్ షా 4. నితిన్ గడ్కరీ 5. సదానంద గౌడ 6. నిర్మలా సీతారామన్ 7. రాంవిలాస్ పాశ్వాన్ 8. నరేంద్ర సింగ్ తోమర్ 9. రవిశంకర్ ప్రసాద్ 10. హర్సిమ్రత్ కౌర్ బాదల్ 11. థావర్ చంద్ గెహ్లాట్ 12. సుబ్రహ్మణ్యం జయశంకర్ 13. రమేశ్ పోఖ్రియాల్ 14. అర్జున్ ముండా 15. స్మృతి ఇరానీ 16. డాక్టర్ హర్షవర్థన్ 17. ప్రకాశ్ జవదేకర్ 18. పీయూష్ గోయల్ 19. ధర్మేంద్ర ప్రధాన్ 20. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ 21. ప్రహ్లాద్ జోషీ 22. మహేంద్రనాథ్ పాండే 23. అరవింద్ సావంత్ 24. గిరిరాజ్ సింగ్ 25. గజేంద్ర సింగ్ షెకావత్ సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1. సంతోష్ గాంగ్వర్ 2. రావ్ ఇందర్జీత్ సింగ్ 3. శ్రీపాద యశో నాయక్ 4. జితేంద్ర సింగ్ (సహాయ మంత్రి) 5. కిరణ్ రిజిజు (సహాయ మంత్రి) 6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ (సహాయ మంత్రి) 7. రాజ్ కుమార్ సింగ్ (సహాయ మంత్రి) 8. హర్దీప్ సింగ్ పూరీ (సహాయ మంత్రి) 9. మన్సూఖ్ మాండవియా (స్వతంత్ర సహాయ మంత్రి) సహాయ మంత్రులు 1. ఫగ్గీన్ సింగ్ కులస్తే 2.. అశ్వినీ చౌబే 3. అర్జున్ రామ్ మేఘవాల్ 4. జనరల్ వీకే సింగ్ 5. కిృషన్ పాల్ గుజ్జర్ 6. దాదారావ్ పాటిల్ 7. కిషన్ రెడ్డి 8. పురుషోత్తం రూపాలా 9. రాందాస్ అథవాలే 10. సాధ్వీ నిరంజన్ జ్యోతి 11. బాబుల్ సుప్రియో 12. సంజీవ్ కుమార్ బాల్యాన్ 13. దోత్రే సంజయ్ శ్యారావ్ 14. అనురాగ్ సింగ్ ఠాకూర్ 15. సురేష్ అంగాడి 16. నిత్యానంద్ రాయ్ 17. రత్తన్ లాల్ కఠారియా 18. వి.మురళీధరన్ 19. రేణుకా సింగ్ 20. సోమ్ ప్రకాశ్ 21. రామేశ్వర్ తెలి 22. ప్రతాప్ చంద్ర సారంగి 23. కైలాస్ చౌదరి 24. దేవశ్రీ చౌదురి -
‘కాళేశ్వరం’పై తీరు మార్చుకోరా?
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, జాతీయ రహదారుల పనులు ప్రారంభం తదితర అంశాలపై చర్చించేందుకు హరీశ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టును అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో హైకోర్టులో 80 కేసులు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో 3 కేసులు, సుప్రీంకోర్టులో 3 కేసులు మొత్తంగా 86 కేసులు వేశారన్నారు. ప్రాజెక్టుకు అను మతులు లేవంటూ ఒకసారి, ఇచ్చిన అనుమతులు చెల్లవంటూ మరోసారి, పర్యావరణ, అటవీ సంపద దెబ్బతింటుందని, వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుందని చనిపోయిన వారి పేర్ల మీద కూడా కోర్టుల్లో కేసులేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుకు 90 శాతం మంది ప్రజలు స్వచ్ఛందంగా భూములిచ్చి పూర్తి సహకారం అందిస్తుండటంతో ప్రతిపక్షాలకు ఏం చేయాలో పాలుపోక జంతు సంపదకు నష్టం వాటిల్లుతుందంటూ కేసులు వేస్తున్నారన్నారు. ఏ కోర్టూ ఈ ప్రాజెక్టు పనులు నిలిపేయాలని ఆదేశాలివ్వలేదన్నారు. మొదట్లో ఎన్జీటీ ఆదేశాల్చినా వాటిని హైకోర్టు తోసిపుచ్చిందని గుర్తుచేశారు. కోర్టులు కూడా పిటిషనర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయన్నారు. ప్రాజెక్టుపై గతంలో దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా ఇది ఫోరం హంటింగ్లా ఉందం టూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య చేసిందని గుర్తుచేశారు. ప్రాజెక్టుపై పక్క రాష్ట్రాలకు లేని అభ్యంతరాలు మీకెందుకంటూ సోమవారం మరో కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించిందని హరీశ్ పేర్కొన్నారు. తాజా పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా బుద్ధి రావట్లేదా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఇకనైనా తమ కుట్రలను మానుకోవాలన్నారు. కాంగ్రెస్, బాబు మూకుమ్మడి ప్రయత్నాలు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు చెయ్యని ప్రయత్నమంటూ లేదని, ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాల్సిందిగా చంద్రబాబు ఢిల్లీకి పదేపదే లేఖలు రాస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల నోటికాడ ముద్ద లాగేసేం దుకు మూకుమ్మడిగా ప్రయత్నిస్తూ ప్రాజెక్టును పద్మవ్యూహంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రూ.కోట్లు దోచింది... కాంగ్రెస్ పార్టీ 2007లో ప్రాణహిత–చేవెళ్లను ప్రారంభించి 8 ఏళ్లపాటు ప్రాజెక్టు కోసం ఏ అనుమతి సాధించకపోగా మొబిలైజేషన్, సర్వే పేరుతో రూ.2,400 కోట్లు దోచేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ 2008లో లేఖ రాసినా కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నా ఎవరూ దీనిపై స్పందించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మార్చిన డిజైన్‌ను సీడబ్ల్యూసీ ప్రశంసించిందన్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించాలని సీడబ్ల్యూసీ ఇంజనీర్లను కూడా పంపిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తాము అతితక్కువ కాలంలో ప్రాజెక్టు అనుమతులన్నీ సాధించగలిగామన్నారు. ప్రాజెక్టులకు వాటా నిధులు విడుదల చేయండి - కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన మంత్రి హరీశ్‌రావు తెలంగాణలో నిర్మాణ దశలో ఉన్న వివిధ ఏఐబీపీ ప్రాజెక్టులకు సీఏడబ్ల్యూఎం ఇన్సెంటివైజేషన్ పథకం కింద కేంద్ర వాటాగా విడుదల కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర జలవనరుల, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి హరీశ్‌రావు కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసిన హరీశ్... ఈ త్రైమాసికంలో వివిధ ప్రాజెక్టులకు విడుదల కావాల్సిన కేంద్ర నిధుల వివరాలు అందజేశారు. మహబూబ్‌నగర్‌లోని భీమా ప్రాజెక్టుతోపాటు అదిలాబాద్ జిల్లాలోని నీల్వాయి, ర్యాలివాగు, మత్తడివాగు, కొమురం భీం, గొల్లవాగు ప్రాజెక్టులకు క్వార్టర్లో రూ. 60 కోట్లు విడుదల కావాల్సి ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో సంబంధిత అధికారులను పిలిపించిన కేంద్ర మంత్రి... నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. అలాగే తెలంగాణలోని ఏడు జాతీయ రహదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు విడుదల చేయాలని కోరారు. వీటిలో సిద్దిపేట–ఎల్కతుర్తి, జనగామ–దుద్దెడ, మెదక్–ఎల్లారెడ్డి, ఫకీరాబాద్–బైంసా, వలిగొండ–తొర్రూరు, నిర్మల్–ఖానాపూర్ జాతీయ రహదారుల పనులు ప్రారంభించేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. దీనిపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు హరీశ్ మీడియాకు వివరించారు. గడ్కరీని కలసిన వారిలో ఎంపీలు వినోద్ కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్నారు. -
సీతారామను ప్రాజెక్టుగా గుర్తించండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం చేపట్టిన సీతారామ ఎత్తిపోతలను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుగానే గుర్తించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విన్నవించారు. ఈ మేరకు శనివారం గడ్కరీకి లేఖ అందించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని సమాచారం. -
గడ్కరీని కలిసిన ఎంపీ కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని బుధవారం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ, అరకు ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పరిహారం, పునరావసం కల్పించాలని నేతలు కోరారు. తర్వలోనే పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తామని, 2019 మార్చికల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. భేటీ అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు మాట్లాడుతూ.. ‘పోలవరం కాంట్రాక్టర్ల మార్పు, కమిషన్ల బేరసారాలను మేం పట్టించుకోం. ఎవరి వాటా ఎంత అన్నది తేల్చుకుని, పని మొదలుపెడితే చాలు. ప్రజాధనం వృధా అవడాన్ని ఎవరూ ఆపలేం. ఆంధ్రా ప్రజల ఆకాంక్ష పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే ముందున్న లక్ష్యం. ఈ ప్రభుత్వం వల్లకాకుంటే వచ్చే యూపీఏ ప్రభుత్వ హయాంలోనైనా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.’ అని అన్నారు. పరిహారం, పునరావాసం అందరికీ అందాలి: కొత్తపల్లి గీత అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. పోలవరం ముంపు ప్రాంతంలో 9 మండలాలు, 275కి పైగా గ్రామాలున్నాయని, నిర్వాసితుల్లో 70శాతంమంది గిరిజన, ఆదివాసీలేనని అన్నారు. పరిహారం, పునరావాసం అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి వచ్చి సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు ఇచ్చిన రాష్ట్ర విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని ఆమె కోరారు. 11 నెలల్లో పూర్తి చేస్తే చాలా సంతోషం: కొణతాల భూ సేకరణ, పరిహారం ఖర్చులు పూర్తిగా కేంద్రమే భరించాలని తాము కోరినట్లు ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. ‘భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రతిపాదనలు అందలేదని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనలు అందిన తర్వాత కేంద్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 2018 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని అంటున్నారు. ఇంకా 11 నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఎలా పూర్తి చేస్తారో వారికే తెలియాలి. కానీ మేం ఆశావాదులం. 11 నెలల్లో పూర్తి చేస్తే చాలా సంతోషం. కాంట్రాక్టర్ల మార్పు తదితర సాంకేతికాంశాలతో మాకు సంబంధం లేదు.’ అని అన్నారు. -
కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం టూర్
-
గడ్కరీతో వైఎస్ఆర్ సీపీ ఎంపీల సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం విషయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం సమావేశం అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2019 నాటికి కేంద్ర ప్రభుత్వమే పోలవరాన్ని పూర్తి చేయాలని వారు ఈ సందర్భంగా గడ్కరీని కోరారు. పోలవరంపై ఇచ్చిన హామీ అమలు అయ్యేటట్లు కేంద్రం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని అన్నారు. గడ్కరీని కలిసినవారిలో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ చేయాలి. ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయమైనా కేంద్ర మే భరించాలి.2019 ఎన్నికలలోపే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. దుగ్గరాజపట్నం పూర్తి చేయాలని గడ్కరీని కోరాం. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేశాం. ప్రైవేటీకరణ వల్ల జాతీయ భద్రతకు ముప్పు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు అండగా ఉంటాం. మా రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఈ క్షణమే పదవులు వదులుకుంటాం.’ అని అన్నారు. -
పోలవరాన్ని రాష్ట్రానికి వదిలిపెట్టొద్దు
సాక్షి, రాజమండ్రి : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. పోలవరాన్ని రాష్ట్రానికి వదిలిపెట్టొద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. కాంట్రాక్టర్ల వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం టెండర్లను మళ్లీ పొడిగిస్తూ గడువు పెంచడం ఏంటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను మార్చవద్దని కేంద్రమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే..మళ్లీ కొత్త టెండర్లకు జనవరి 5వ తేదీ వరకు షెడ్యూల్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్రం వద్దు అన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఎలా మార్చుతుందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిందని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. కేవలం ముడుపుల కోసం టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను మార్చుకొని, వారి ముసుగులో దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చూస్తూ ఊరుకోమని, పోలవరంపై కేంద్రాన్ని వైఎస్ఆర్ సీపీ ఒత్తిడి తెస్తుందని తెలిపారు. 2019 ఏప్రిల్‌లోగా పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండు చేస్తుందని చెప్పారు. ఇదే విషయంపై ఈ నెల 22వ తేదీన కేంద్ర మంత్రిని కలువబోతున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాము ప్రాజెక్టు పనులు పరిశీలించిన సందర్భంలో... ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు, కాంట్రాక్టర్ల పనితీరు చూస్తే వారి వల్ల ప్రాజెక్టు నిర్మించడం సాధ్యం కాదని తమ పరిశీలనలో తేలిందన్నారు. గడ్కారి, కేంద్ర జలవనరుల శాఖమంత్రి పోలవరాన్ని సందర్శించాలని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం కోసం తమ పార్టీ పోరాటం చేస్తునే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా వీటి కోసం ఉద్యమిస్తామన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతూనే ఉంటారని చెప్పారు. తుది అంశంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని తమ అధ్యక్షులు వైమెస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే చెప్పినట్లుగా తాము కట్టుబడి ఉన్నామన్నారు. -
గడ్కరీ అభ్యంతరాలు పట్టించుకోని ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నేటితో ముగియాల్సిన టెండర్ల ప్రక్రియను జనవరి 5వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రూ.1,483 కోట్లతో ఏపీ సర్కార్ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కేంద్రమంత్రి గడ్కరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టెండర్లు కొనసాగించవద్దని గడ్కరీ ఆదేశించినా ప్రభుత్వం టెండర్లను రద్దు చేయలేదు. నెలరోజుల పాటు ట్రాన్స్ట్రాయ్కు అవకాశం ఇవ్వాలని సూచించినప్పటికీ, టెండర్ల షెడ్యూల్ పొడిగింపు ఎత్తుగడకు ఏపీ సర్కార్ తెరతీసింది. కాగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా స్పిల్ వే, స్పిల్ వే ఛానల్ పనుల కోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని కేంద్ర జలవనరుల శాఖ తప్పుపట్టింది. అంతర్జాతీయ టెండర్లు పిలిచినపుడు 45 రోజులు గడువు ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 18 రోజులే గడువిచ్చింది. దాంతో కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే టెండర్ ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తూనే, దాని గడువును పెంచనున్నామని ఏపీ అధికారులు తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి గడ్కరీ ఈనె ల23న పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. -
కేంద్ర మంత్రి గడ్కరీకి చంద్రబాబు ఫోన్
అమరావతి: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు మంగళవారం ఫోన్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ఆయన కోరారు. ఈ క్రమంలో చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలపై సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. కమిటీతో సమావేశం తర్వాత చంద్రబాబు గడ్కరీకి ఫోన్ చేశారు. -
మరోసారి పోలవరానికి గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల వనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 22న పోలవరం ప్రాజెక్ట్‌ను స్వయంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాణపు పనులను ఆయన పర్యవేక్షించనున్నారు. అదే రోజు ప్రాజెక్ట్ పనులపై సమీక్ష జరపనున్నట్లు గడ్కరీ తెలిపారు. 2018కల్లా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి బిల్లులు తమ వద్ద పెండింగ్‌లో లేవని, వాటిని ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలని ఆదేశించినట్లు గడ్కరీ తెలిపారు. ఏపీ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. కాగా గడ్కరీ ఈ ఏడాది అక్టోబర్ లో పోలవరంను సందర్శించారు. అయితే టెండర్ల విషయంలో పోలవరం ప్రాజెక్టు పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడ్కరీ స్వయంగా పోలవరంను సందర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్రసింగ్ కూడా గడ్కరీతో కలిసి పోలవరానికి వెళ్లనున్నారు. -
రాంగ్ పార్కింగ్ ఫొటో కొట్టు.. గిఫ్ట్ పట్టు
న్యూఢిల్లీ: ఎక్కడపడితే అక్కడ వాహనాల్ని పార్కింగ్ చేసే వ్యక్తులకు షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేసిన వాహనాలను పౌరులు మొబైల్‌తో ఫొటో తీసి సంబంధిత విభాగానికి లేదా పోలీసులకు పంపాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత వాహనదారుడికి రూ.500 జరిమానా విధించడంతో పాటు అందులో 10 శాతాన్ని ఫిర్యాదుదారుడికి బహుమానంగా అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు మోటర్ వాహనాల చట్టంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ రవాణా మంత్రిత్వశాఖ కార్యాలయం ఆటోమేటిక్ పార్కింగ్ లాట్ పనులకు గడ్కారీ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పార్కింగ్ లాట్‌కు సంబంధించి 13 అనుమతులు పొందడానికి తన మంత్రిత్వశాఖకే 9 నెలలు పట్టిందని వాపోయారు. -
‘గడ్కరీ చెప్పినా చంద్రబాబు వినడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను మాయ ప్రాజెక్ట్‌లా తయారు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పార్థసారధి వ్యాఖ్యానించారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా పోలవరాన్ని మార్చారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్థసారధి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రూ.వేల కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడుతున్నప్పటికీ కొత్త కాంట్రాక్టర్‌ను తీసుకు రావాలని ముఖ్యమంత్రి యత్నిస్తున్నారు. కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినప్పటికీ చంద్రబాబు వినడం లేదు. పోలవరాన్ని ఒక ఆదాయ వనరుగా చంద్రబాబు మార్చుకున్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేసి, రాష్ట్రానికి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం నుంచి పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు లాక్కున్నారు?. పోలవరాన్ని కమీషన్ల ప్రాజెక్ట్‌గా చంద్రబాబు మార్చేశారు. రూ.16వేలకోట్ల ప్రాజెక్ట్‌ను రూ.50వేల కోట్ల ప్రాజెక్టుగా మార్చారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో విచారణ చేసి ఏం జరుగుతుందో ప్రజలకు కేంద్రం చెప్పాలి. పోలవరం ఖర్చుపై కేంద్రం ఏ చెప్పిందో స్పష్టత ఇవ్వాలి. మీకు ముడుపులు చెల్లించే కాంట్రాక్టర్ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదు.’ అని ఆయన హెచ్చరించారు. కేంద్రమంత్రి చెప్పినా చంద్రబాబు వినడం లేదు -
కార్గో హ్యాడ్లింగ్లో 12 ప్రధాన పోర్ట్‌ల రికార్డ్
► సత్ఫలితాలిచ్చిన చర్యలు ► షిప్పింగ్ మంత్రి గడ్కరీ న్యూఢిల్లీ: భారత్‌లోని 12 ప్రధాన ఓడరేవులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డ్‌స్థాయిలో కార్గో హ్యాడ్లింగ్ చేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని ఈ ప్రధాన పోర్ట్‌ల పనితీరు మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని కేంద్ర షిప్పింగ్ రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ 12 మేజర్ పోర్ట్‌లు 2016–17 ఆర్థిక సంవత్సరంలో 647.43 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేశాయని, ఈ సంవత్సరం 6.8 శాతం వార్షిక వృద్ధి నమోదైందని తెలియజేశారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతం వృద్ధి సాధించామని చెప్పారాయన. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పోర్ట్‌లు 4 శాతం వృద్ధి మాత్రమే సాధించాయని తెలిపారు. అగ్రస్థానంలో కాండ్లా పోర్ట్: అన్ని ప్రధాన పోర్ట్‌లలో కాండ్లా పోర్ట్ అత్యధికంగా కార్గోను హ్యాండిల్ చేసిందని గడ్కరీ తెలిపారు. 105.44 మిలియన్ టన్నులతో కాండ్లా పోర్ట్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 88.95 మిలియన్ టన్నులతో పారదీప్ పోర్ట్, 63.05 మిలియన్ టన్నులతో ముంబై పోర్ట్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని తెలియజేశారు. కమోడిటీల విషయానికొస్తే, ఇనుప ఖనిజం ట్రాఫిక్ బాగా పెరిగిందన్నారు. ఇనుప ఖనిజం ట్రాఫిక్ 164 శాతం పెరిగిందని, పెట్రోలియమ్, ఆయిల్, లూబ్రికెంట్స్ 8 శాతం, ఇతర సాధారణ కార్గో 19 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేలా ఈ పోర్ట్‌లను అభివృద్ధి చేశామని చెప్పారు. భారత్‌లో మొత్తం 12 ప్రధాన పోర్ట్‌లున్నాయి. కాండ్లా, ముంబై, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్, మర్మగోవా, న్యూ మంగళూర్, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్, వి ఓ చిదంబరనార్, విశాఖ పట్టణం, పారదీప్, కోల్‌కత(హల్డియాను కలుపుకొని) పోర్ట్‌లున్నాయి. -
అప్పుడు కాంగ్రెస్ హీరో నిద్రపోయారు: గడ్కరీ
న్యూఢిల్లీ: ‘ఆ రాత్రి కాంగ్రెస్ హీరో నిద్రపోయి ఉండకుంటే గోవాలో ఆ పార్టీ సినిమానే నడిచేది’ అని గడ్కరీ పరోక్షంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గోవాలో తగినన్ని సీట్లు రాకున్నా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గడ్కరీ కాంగ్రెస్ పట్ల విలన్ గా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా శుక్రవారం లోక్‌సభలో ఇలా స్పందించారు. గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో విఫలమైనందుకు తమ హీరోనే నిందించుకోవాలని సూచించారు. ‘ నన్నెందుకు బాధ్యున్ని చేస్తారు? మీ హీరో ఆ రోజు రాత్రంతా నిద్రపోవడం వల్లే ఇదంతా’ అని కాంగ్రెస్ సభ్యులతో వ్యాఖ్యానించారు. -
చక్రం తిప్పిన ఢిల్లీ పెద్దలు!
గోవా, మణిపూర్లలో ఫలించిన బీజేపీ వ్యూహం ⇒ రెండో స్థానంలో ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం ⇒ గోవాలో గడ్కారీ, పరీకర్.. మణిపూర్‌లో రాం మాధవ్, హిమంత ⇒ బీజేపీ ధనబలాన్ని ప్రయోగించిందని విపక్షాల ధ్వజం సాక్షి నేషనల్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఒక్క పంజాబ్‌లో తప్ప మిగిలిన చోట్ల బొక్కబోర్లా పడింది. మణిపూర్, గోవాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటు వ్యూహంలో దారుణంగా విఫలమైంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన శక్తినుపయోగించి రాత్రికి రాత్రే చక్రం తిప్పేసింది. ఢిల్లీలోని పార్టీ పెద్దల సూచన ప్రకారం మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లతో పొత్తులు కుదుర్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారం చేసుకుంది. ఇందుకు గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్, ఆప్ విమర్శించినా.. పరిస్థితి అందిపుచ్చుకోవటంలో బీజేపీ పెద్దలు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది సుస్పష్టం. ఎన్నికల ఫలితాలు విడుదలవటమే ఆలస్యం.. ఢిల్లీ నుంచి కమలం పార్టీ పెద్దలు ఆయా రాష్ట్రాల్లో వాలిపోయి పరిస్థితులు ‘చేతి’కందకుండా పరిస్థితులు చక్కబెట్టారు. దీంతో నేడు గోవాలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. మణిపూర్‌లో బీజేపీ తన మద్దతుదారుల జాబితాను గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు సమర్పించింది. శనివారం రాత్రి ఏం జరిగింది? శనివారం వెల్లడైన ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నా.. బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మణిపూర్, గోవాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ఎలాగైనా ఈ రెండు రాష్ట్రాల్లో గెలుస్తామనే ధీమాతోనే ఫలితాలు రాగానే అమిత్ షా ‘గోవా, మణిపూర్‌లలోనూ మా ప్రభుత్వమే ఉంటుంది’ అని బహిరంగంగా ప్రకటించగలిగారు. గోవా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అమిత్‌షా రంగంలోకి దించారు. శనివారం రాత్రి గోవా చేరుకున్న నితిన్ గడ్కారీ.. వస్తూనే ‘మిషన్ గోవా సర్కారు’ను ప్రారంభించారు. పణజీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎన్సీపీ, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 1 గంటనుంచి 4 గంటలవరకు మూడు గంటలపాటు వీరితో చర్చించి ప్రభుత్వానికి మద్దతిచ్చేలా ఒప్పించారు. దీంతో 13 సీట్లున్న బీజేపీకి ఏడుగురు చేరటంతో బలం 20కి పెరిగింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఎమ్మెల్యే కావాలి. దీంతో గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్తో పణజీ సమీపంలోని ఓ రిసార్టులో చర్చలు ప్రారంభించారు. ముగ్గురు ఎమ్మెల్యేలున్న జీఎఫ్తో ఉదయం ఎనిమిది గంటలవరకు జరిగినా సానుకూలంగా జరగలేదు. దీంతో మధ్యాహ్నం మరోసారి ఓ దూతను విజయ్ దగ్గరకు పంపిన గడ్కారీ.. డీల్ ఓకే (ముగ్గురికీ మంత్రి పదవులిచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం) అయినట్లుగా జీఎఫ్తో మద్దతు పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. దీంతో బీజేపీ బలం 23కు చేరింది. ఈ చర్చలన్నీ పరీకర్, గడ్కారీ సమక్షంలో జరిగాయి. అయితే పరీకర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే విజయ్ సర్దేశాయ్.. సీఎంగా పరీకర్ ఉంటానంటేనే మద్దతిస్తాను అని ప్రకటించటం గమనార్హం. తెల్లారేసరికి మారిన ‘హంగ్’ మణిపూర్‌లోనూ అదే పరిస్థితి అధిష్టానం దూతలుగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన రామ్ మాధవ్, అస్సాం మంత్రి హిమంత్ బిస్వా శర్మలు శనివారం రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఎన్పీపీ, ఎల్జేపీలతోపాటు ఓ టీఎంసీ ఎమ్మెల్యే, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఒప్పించారు. హంగ్‌పై చర్చ జరుగుతుండగానే.. ఆదివారం తెల్లారేసరికి 32 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమని ప్రకటించటం ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా బీరేన్ సింగ్‌ను ఎన్నుకున్నారు. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికార దుర్వినియోగమే: విపక్షాలు మణిపూర్, గోవాల్లో తమ చేతుల్లోంచి బీజేపీ అధికారాన్ని లాగేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని విరుచుకుపడింది. ‘ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఎక్కడిది?’ అని మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. గోవాలో ప్రజాబలం కన్నా ధనబలమే విజయం సాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. గోవాలో ధన, మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటుకు గురైన ఆప్ కూడా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించింది. గోవాలో ఎమ్మెల్యేలను ఎన్నుకునే బదులు.. ఎన్నికల సంఘం ఆ సీట్లను వేలం వేస్తే పార్టీలు కొనుక్కునేవని ఎద్దేవా చేసింది. నిమ్మకు నీరెత్తని కాంగ్రెస్ గోవాలో గడ్కారీ, పరీకర్ తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే పనిలో పడింది. పార్టీ పరిశీలకుడిగా గోవాలో మకాం వేసిన దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే ఎమ్మెల్యేలు నేనంటే నేను సీఎం అని పోటీ పడ్డారు. మెజారిటీకి తగ్గిన 4 సీట్ల గురించి ఆలోచించకుండానే.. ఆదివారమంతా హోటల్లో తమ బలాబలాల ప్రదర్శనలో పడ్డారు. సీఎల్పీ పదవికోసం రహస్య ఓటింగ్ నిర్వహించారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్సీపీ అభ్యర్థి.. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేసినా అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చినా.. కాంగ్రెస్‌నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశంలో ఉండగానే.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌తో భేటీకి వెళ్తున్న సమాచారం అందింది. -
గడ్కరీకి కుర్తా.. నితీష్‌కు పైజామా
రహదారి నిర్మాణ పనులపై ఎలాంటి ముందడుగు కనిపించకపోవడంతో కలతచెందిన బిహార్‌లోని ఓ స్థానిక ఎంఎల్ఏ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. సగం ప్యాంటు, బనీన్ను మాత్రమే ధరించి, తన కుర్తాను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి, పైజామాను బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పంపి తన నిరసన తెలిపారు. బీహార్‌కు చెందిన ఎమ్ఎల్ఏ వినయ్ బిహారీ, గత మూడేళ్లుగా తమ నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జోగపట్టి మార్గాన్ని కలుపుతూ వెస్ట్ చంపారన్స్ మనుపుల్ నుంచి నావల్పుర్ రత్వాల్ చౌక్ మార్గాన్ని మీదుగా 44కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాలని ఆయన సంకల్పించారు. కానీ ఈ రోడ్డు నిర్మాణ పనులపై కనీసం సీఎం నితీష్‌కుమార్ నుంచి కానీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా వారినుంచి స్పందన కరువైంది. దీంతో ఇరు ప్రభుత్వాల తీరుపై విసుగెత్తిన ఆయన తన కుర్తాను నితిన్ గడ్కరీకి పంపుతూ ఓ లేఖను పంపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేవరకు తాను కుర్తాను ధరించనని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుర్తా ఎలా ఉందో అలా భారతీయ జనతా పార్టీ అహంకారపూరిత వైఖరి కనిపిస్తుందన్నారు. అంతటితో ఆగకుండా తన పైజామాను సీఎం నితీష్‌కు పంపుతూ... మూడేళ్ల కిందట ఆయన ఇచ్చిన వాగ్దానాలపై మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వాత హామీలన్నింటినీ నితీష్ పక్కనబెట్టారని బాహాబాటంగా విమర్శించారు. -
రహదారులకు డిసెంబర్‌కల్లా అనుమతులు
కేంద్ర మంత్రులు గడ్కారీ, తోమర్లతో తుమ్మల భేటీ సీఆర్ఎఫ్ కింద రూ.400 కోట్లు ఇస్తామన్న గడ్కారీ న్యూఢిల్లీ: తెలంగాణలో 1,951 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులకు సంబంధించిన అనుమతులను డిసెంబర్ కల్లా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కలసి జాతీయ రహదారులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సమర్పించారు. నివేదికను పరిశీలించి డిసెంబర్ కల్లా అనుమతులిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తుమ్మల చెప్పారు. గతంలో రాష్ట్రానికి సెంట్రల్ కోడ్స్ ఫండ్స్ పథకం కింద నిధులు కూడా తక్కువగా విడుదలైన విషయాన్ని గడ్కారీ దృష్టికి తీసుకెళ్లామని, వీలైనంత త్వరగా సీఆర్ఎఫ్ పథకం కింద రూ.800 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని వివరించారు. దీనికి గడ్కారీ స్పందిస్తూ రూ.400 కోట్లు అందిస్తామని తెలిపినట్లు తుమ్మల చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి పెండింగ్‌లో ఉన్న రూ.1,350 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. తుమ్మల వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగాపాలాచారి, రామచంద్రు తెజావత్, ఎంపీలు వినోద్, ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ తదితరులు ఉన్నారు. ఆ మూడు జిల్లాలను కలపండి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తుమ్మల సమావేశమై గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కింద కేవలం ఖమ్మం జిల్లాను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని, రెండో దశలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్‌లను జోడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 3 జిల్లాల్లో రూ.1,590 కోట్లతో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇచ్చేందుకు రూపొందించిన నివేదికను కేంద్రానికి సమర్పించామన్నారు. త్వరలో కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను ఆమోదిస్తామని తోమర్ చెప్పినట్లు తుమ్మల తెలిపారు. -
దేశానికే రోల్ మోడల్ గా చేస్తాను..!
అహ్మదాబాద్ః గుజరాత్ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేస్తానని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ రూపానీ పేర్కొన్నారు. తనకు గొప్ప బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పిన ఆయన.... పటేల్ తనకీ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందీ బెన్ పటేల్ రాజీనామాతో.. గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్నిదక్కించుకున్నవిజయ్ రూపానీ పటేల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పని చేసిన ఆయన.. తనకప్పగించిన బాధ్యతలను సద్వినియోగం చేసుకొని, గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ముందుంటానన్నారు. అంతేకాక దేశంలోని రాష్ట్రాలన్నింటిలో ప్రత్యేకంగా తీర్చి దిద్దుతానని, దేశానికే రోల్ మోడల్ గా మారుస్తానని అన్నారు. భారతీయ జనతాపార్టీ నిర్ణయంమేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. మీడియా ముందు రూపానీని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రతి ఒక్కరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం పదిమంది బిజేపీ మంత్రులు రూపానీని ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్ ను చేసేందుకు మద్దతు పలికినట్లు గడ్కరీ తెలిపారు. అంతకు ముందు ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంటారని ఊహాగానాలు వచ్చినా.. పార్టీ నిర్ణయం మేరకు ఆయనను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. -
'రహదారుల ప్రతిపాదనకు గడ్కారీ ఆమోదం'
హైదరాబాద్: రాష్ట్రంలో 1018 కి.మీ మేర జాతీయ రహదారుల ప్రతిపాదనలను కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి ఇచ్చామని ... వాటికి ఆయన వెంటనే ఆమోదం తెలిపారని తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో తమ్ముల నాగేశ్వరరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రెండు లైన్లకు బదులుగా ఒకేసారి నాలుగు లైన్లు విస్తరించాలని ఆయన్ని కోరినట్లు తెలిపారు. అలాగే కేంద్రం జల రవాణా ప్రతిపాదనల్లో గోదావరి నదిని కూడా చేర్చాలని నితిన్ గడ్కారీని కోరినట్లు తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మరికల్-జడ్చర్ల మధ్యగల జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం వద్ద విజయవాడ నుంచి జగదల్పూర్ వెళ్లే ఎన్‌హెచ్ 221 విస్తరణ పనులకు, అలాగే రుద్రంపూర్ నుంచి భద్రాచలం వరకు రహదారి విస్తరణకు, గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణానికీ ఆయన శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రహదారులతోపాటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని తుమ్మల నాగేశ్వరరావు... కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కోరారు. -
101 నదుల్లో జల రవాణా!
న్యూఢిల్లీ: దేశంలో జల రవాణాను ప్రోత్సహిస్తే అది ప్రజా ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తుందని కేంద్రం భావిస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా 101 నదులను జల రవాణా మార్గాలుగా మార్చే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి గడ్కారీ వెల్లడించారు. నదులను జల మార్గాలుగా మార్చాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అని పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. కిలోమీటర్ ప్రయాణానికి రోడ్డు మార్గంలో రూ.1.50 ఖర్చు అవుతుందని, జల రవాణాలో అయితే అర్ధరూపాయే ఖర్చవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రధానమంత్రి జల్ మార్గ్ యోజన’ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, నదీమార్గాలను జల మార్గాలుగా మార్చడంతోపాటు డ్రై, శాటిలైట్ ఓడరేవులను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని గడ్కారీ వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు జాతీయ జలమార్గాల్లో గంగా-భగీరథీ-హుగ్లీ నదీ వ్యవస్థ (అలహాబాద్-హల్దియా-1,620 కి.మీ.), బ్రహ్మపుత్ర నది (ధుబ్రీ-సదియా-891 కి.మీ.), ఉద్యోగ్‌మండల్-చంపకర కెనాల్స్‌లోని పశ్చిమ తీర కెనాల్ (కొట్టాపురం-కొల్లామ్-205 కి.మీ.), కాకినాడ-పుదుచ్చేరి కెనాల్స్ (గోదావరి-కృష్ణా నదులు 1,078 కి.మీ.), బ్రహ్మపుత్ర-మహానదిలోని తూర్పు తీర కెనాల్ (588 కి.మీ.) ఉన్నాయి.