general election campaign
-
చల్లని అభిమానం
వైఎస్ జగన్ జనభేరి సభలు జనసంద్రం మండుటెండలో చల్లని అభిమానం. కుమ్మక్కు రాజకీయాలు.. విశ్వసనీయతకు నడుమ సాగుతున్న పోరులో ‘గాలి’ ఎటువైపుందో తేలిపోయింది. రాజన్న బిడ్డకు జగమంత కుటుంబం అండగా మేమున్నామంటూ భరోసానిచ్చింది. ఆయన రాక ఆలస్యమైనా.. భానుడు ఉగ్రరూపం దాల్చినా.. కుటుంబ సభ్యుల్లో ఒకరు వస్తున్న భావన ప్రజల నిరీక్షణతో ప్రస్పుటమైంది. అక్కాచెల్లెళ్లు.. అన్నాతమ్ముళ్లు.. అవ్వాతాతలు.. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల వెంట బారులుతీరి స్వాగతించడం ‘రేపటి ప్రభంజనానికి’ అద్దం పట్టింది. సాక్షి, కర్నూలు : ముఖంలో చిరునవ్వు.. మాటల్లో ఆప్యాయత.. భవితకు భరోసా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతున్నంత సేపు ఎర్రని ఎండలోనూ అభిమానులు కట్టుకదలకపోవడం విశేషం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమవారం కర్నూలు, నంద్యాలలో పర్యటించారు. రోడ్‌షోలు నిర్వహించి జనభేరి సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘మిట్ట మధ్యాహ్నం దాటింది. ఎండ మండిపోతున్నా ఖాతరు చేయడం లేదు. పర్యటన అనుకున్న సమయం కన్నా దాదాపు మూడు గంటలు ఆలస్యమైనా ఏ ఒక్కరి ముఖంలోనూ చిరాకు కనిపించడం లేదు. ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కారణాలు వెతుక్కోలేదు. వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయత, ప్రేమానురాగాలు చూపుతున్న ప్రతి అక్కకు.. ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి అమ్మకు.. ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితునికీ చేతులు జోడించి.. పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ జగన్ మాట్లాడిన తీరు గుండెలకు హత్తుకుంది. మధ్యాహ్నం 11.30 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్ఏపీ క్యాంప్ వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్లో చేరుకున్న జననేత ఓపెన్‌టాప్ బస్సులో కొండారెడ్డి బురుజు వద్దనున్న పాత బస్టాండ్ వరకు రోడ్‌షో నిర్వహించారు. అప్పటికే అక్కడ వేలాదిగా చేరుకున్న ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబునాయుడు ఆల్‌ఫ్రీ హామీల తీరుతెన్నులను ఎండగట్టారు. తాను విశ్వసనీయ రాజకీయాలే చేస్తానని స్పష్టం చేశారు. ఓట్ల కోసం.. సీట్ల కోసమే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నాయకులు, చంద్రబాబు కలసికట్టుగా బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా పక్కన ఎస్వీ మోహన్‌రెడ్డి ఉన్నాడు. మంచివాడు.. అందరికీ అందుబాటులో ఉంటాడు. ప్రజా సేవ చేయడానికి ఉత్సాహంతో ఉన్నాడు. మనస్ఫూర్తిగా దీవించండని సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఇక నా కుడి పక్కన రేణుకమ్మ ఉన్నారు. నాకు అక్కలాంటిది. మంచి వారు.. మీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ చల్లటి ఆశీస్సులు ఇవ్వండి.. ఆదరించండి. మీ ఆప్యాయతలు చూపించాల్సిందిగా పేరుపేరునా చేతులు జోడించి కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న వీరిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించండి’’ అని అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసే వారు చేతులెత్తమని జగన్ అడగడంతో అక్కడున్న వారంతా చేతులెత్తి మద్దతుపలికారు. అనంతరం హెలికాప్టర్లోనే మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో నంద్యాలకు చేరుకున్నారు. ఇక్కడ పర్యటన దాదాపు రెండున్నర గంటలు ఆలస్యమైనా ప్రజలు కట్టుకదలకపోవడం విశేషం. రోడ్‌షో నిర్వహిస్తూ పొట్టిశ్రీరాములు సర్కిల్‌కు చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడి బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిలను గెలిపించాలని కోరారు. ‘నాకు అక్క లేదు... శోభమ్మలో అక్కను చూసుకున్నా. కానీ ఆమె లేదన్న వాస్తవం నన్ను కలచివేస్తోంది. భారీ మెజార్టీతో గెలిపించడమే ఆమెకు ఘనమైన నివాళి’ అని జగన్ అంటున్నప్పుడు ప్రజలు ఉవ్వెత్తున ఉద్వేగంతో స్పందించారు. శోభా నాగిరెడ్డి గురించి జగన్ మాట్లాడుతున్నంత సేపు ప్రజలు భూమా నాగిరెడ్డివైపే చూస్తుండటంతో ఆయన భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. జనభేరి సభల్లో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, మార్కెట్‌యార్డు చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, ఎన్.హెచ్.భాస్కర్‌రెడ్డి, డాక్టర్ నౌమాన్, రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మవంచన
మనిషి దూరమైతే ఆత్మీయులు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగిన నేత ప్రాణాలు కోల్పోతే ఆ ప్రజల క్షోభ ఊహకందనిది. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో కలసి నడిచిన నేత లేడంటే ఎలాంటి మనసులనైనా కదిలిస్తుంది. ఈ కోవలోనే ఆళ్లగడ్డ ప్రజల గుండెల్లో కొలువైన శోభా నాగిరెడ్డి రాజకీయంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నతరుణంలో ఓ రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఆమె భౌతికంగా దూరమైనా ప్రజలు ఆమెకు గెలుపుతో ఘన నివాళులర్పించేందుకు కంకణబద్ధులయ్యారు. వీరంతా ఒక వైపుంటే.. స్వార్థ రాజకీయం మరోవైపు బరితెగించింది. పార్టీల కతీతంగా చేతులు కలిపింది. కాంగ్రెస్, టీడీపీ ఒక్కటై.. మన మధ్య లేని ఓ మహిళపై గెలుపునకు వ్యూహాలు పన్నడం అదే ప్రజలను ఆలోచింపజేస్తోంది. - ఆళ్లగడ్డలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు - దివంగత శోభమ్మపై గెలుపునకు బరితెగింపు - స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అంటున్న ప్రజలు - గెలుపుతో నివాళులర్పించేందుకు కంకణబద్ధులైన జనం - ఎవరెన్ని కుట్రలు పన్నినా తీర్పు - శోభమ్మదేనంటున్న వైనం ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నిక అద్దంపడుతోంది. ఆ పార్టీల చీకటి ఒప్పందం ప్రజల్లో నవ్వుల పాలవుతోంది. మాట తప్పని.. మడమ తిప్పని రాజకీయాలకు పెట్టింది పేరైన రాయలసీమలో ఆ నేతల తీరు విమర్శల పాలవుతోంది. వరుస ఓటమిని జీర్ణించుకోలేక విలువలకు తిలోదకాలివ్వడం ఓటర్లలో చర్చనీయాంశమవుతోంది. గంగుల సోదరుల్లో ఒకరు కాంగ్రెస్‌లోనే ఉండిపోగా.. మరొకరు టీడీపీతో జతకట్టారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆశలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నీళ్లుచల్లి.. వలస నేతను బరిలో నిలపడం ఆయన వర్గీయులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రాష్ట్ర విభజన విషయంలో కలిసి డ్రామా నడిపిన కాంగ్రెస్, టీడీపీల బాటలోనే ఆ పార్టీల ఆళ్లగడ్డ నాయకులు సైతం సరికొత్త డ్రామాకు తెరతీశారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గంగుల ప్రతాప్‌రెడ్డి ఆ సంవత్సరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి శోభా నాగిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం కావడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా గెలవలేమని.. పైగా ప్రజల్లో శోభా నాగిరెడ్డి పట్ల విశేష ఆదరణ ఉండటంతో ఈ విడత బరిలో నిలిచేందుకు ఆయన వెనుకడుగు వేశారు. అయితే ఈయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరఫున ఆళ్లగడ్డ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. మూడు రోజులుగా ఆళ్లగడ్డలో మకాం వేసిన ఆయన ఆరు మండలాల టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం ఆ రెండు పార్టీల శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే ఆళ్లగడ్డ అభివృద్ధికి తాను హామీ అని పేర్కొంటుండటం గందరగోళానికి తావిస్తోంది. ఆయన గెలిస్తే.. కాంగ్రెస్ పార్టీలోని ఈయన ఎలా అభివృద్ధి చేస్తారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక కాంగ్రెస్‌కు రాజీనామా చేయకుండా టీడీపీ తరఫున ప్రచారం చేయడం ఇదెక్కడి రాజకీయమంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2012 ఎన్నికల్లో పార్టీలు మారే నాయకులను గెలిపించొద్దని పిలుపునిచ్చిన ప్రతాప్‌రెడ్డి.. తన తమ్ముడి విషయానికొచ్చే సరికి పార్టీలకు అతీతంగా ప్రచారంలో పాల్గొంటుండటం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
షర్మిలమ్మకు ఆత్మీయ వీడ్కోలు
- కుంచనపల్లిలో రాత్రి బస - ఉదయం కృష్ణాజిల్లాకు పయనం తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిలకు శుక్రవారం అభిమానులు, పార్టీ కార్యకర్తలు వీడ్కోలు పలికారు. గురువారం రాత్రి పది గంటలకు వైఎస్సార్ జనభేరి ప్రచారం ముగించిన ఆమె వెనిగండ్ల నుంచి తాడేపల్లి మండలం కుంచనపల్లి చేరుకున్నారు. అరవింద హైస్కూల్లో రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు పార్టీ మంగళగిరి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)తో కొద్దిసేపు మాట్లాడారు. నియోజకవర్గ పరిస్థితిపై ఆరా తీశారు. షర్మిల బస చేసిన ప్రాంతానికి భారీ సంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కృష్ణాజిల్లాకు బయలుదేరుతూ రాజన్న తనయ తన కోసం నిరీక్షిస్తున్న వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పాటిబండ్ల కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ పాతూరి లలితకుమారి, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు బొమ్మారెడ్డి సునీత, సర్పంచులు పాతూరి మేరిరాణి, పంది ఏసుబాబు, బడుగు శ్రీనివాసరావు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కమిటీ సభ్యులు జెక్కిరెడ్డి ప్రభాకరరెడ్డి(జేపీ), రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు చీడిపూడి జయలక్ష్మి, ఎస్సీసెల్ కన్వీనర్ సంకూరి మరియబాబు, మాజీ సర్పంచ్ విజయేంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు. -
హోరెత్తిన ర్యాలీలు
ముగిసిన సార్వత్రిక ప్రచారం... ప్రలోభాలకు శ్రీకారం సాక్షి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగి సింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తెరలేచింది. బుధవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచారం పరిసమాప్తమైంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్‌తో కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని కోదాడలో ముగించారు. అలాగే టీడీపీ, బీజేపీలు జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు హోరెత్తాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేపీ, సీపీఎం తదితర పార్టీల నాయకులు భారీగా జనసమీకరణ చేసి ప్రధాన పట్టణాల్లో బైక్‌ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించారు. గెలుపు తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేశారు. -
దుర్మార్గుడు.. నీచుడికి ఓటేస్తారా?
- అతనో మాయల ఫకీరు.. నోరుతెరిస్తే అన్నీ అబద్దాలే - కేసీఆర్‌పై చంద్రబాబు ధ్వజం - నోరు జారితే జైలుకు పంపుతా - సైకిల్‌తో తొక్కించి పచ్చడి చేస్తా ఇల్లెందు/మహబూబాబాద్, న్యూస్‌లైన్: ‘‘ కేసీఆర్.. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే.. మాయల ఫకీరును మించిపోయాడు. ఇలాంటి నీచుడికి ఓట్లేస్తారా తమ్ముడూ’’.. అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన బహిరంగ సభలో, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన ప్రసంగించారు. మనముందు పెద్ద సవాల్ ఉందని, అన్ని రంగాల్లో అవినీతిమయమైన కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని, అదే సందర్భంలో కేసీఆర్‌లాంటి అబద్దాల కోరు గెలవడానికి వీలులేదని చెప్పారు. బంగారు తెలంగాణ, నవ తెలంగాణ నిర్మాణం జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణలో రైతులు, డ్వాక్రా మహిళలు, బీడీ కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించాలంటే ఢిల్లీలో మోడీ ప్రభుత్వం.. తెలంగాణలో బీసీముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కాలన్నారు. ఎంత తిట్టినా తక్కువే.. కేసీఆర్ దుర్మార్గుడు, అవినీతి కోరు, సన్నాసి, క్రమశిక్షణ లేని వ్యక్తి.. ఆయనను ఎంత తిట్టినా తక్కువేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. కేసీఆర్.. అనవసరంగా నోరు జారితే శాశ్వతంగా జైలుకు పంపుతానని హెచ్చరించారు. కేసీఆర్‌ను సైకిల్‌తో తొక్కించి పచ్చడి పచ్చడి చేస్తానన్నారు. సోనియాగాంధీ అవినీతి అనకొండ అని.. ఊరుకో అనకొండను తయారు చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యూరు. రాహుల్‌గాంధీ మెద్దుబాబు అని.. అతడికి ఏమీ తెలియదని విమర్శించారు. ‘బాబు’పైకి చెప్పు విసిరిన యువకుడు గజ్వేల్: టీడీపీ అధినేత చంద్రబాబుపైకి ఓ యువకుడు చెప్పు విసిరాడు. సోమవారం మెదక్ జిల్లా గజ్వేల్ సభలో బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. సైకిల్‌కు అడ్డం వస్తే.. తొక్కేస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో.. సభలో జనాల మధ్య ఉన్న జగదేవ్‌పూర్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనూహ్యంగా లేచి.. ‘తెలంగాణ వ్యతిరేకి.. గో బ్యాక్’ అంటూ చెప్పును చంద్రబాబుపైకి విసిరాడు. అయితే, ఈ ప్రయత్నంలో చెప్పుకొంత దూరం వెళ్లి కింద పడింది. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆ యువకునిపై మూకుమ్మడిగా దాడి చేశారు. -
కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి
బోధన్ టౌన్/ఎడపల్లి, న్యూస్‌లైన్ : దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మాజీ భారత క్రికెట్ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బోధన్ పట్టణం, ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్, జాన్కంపేట్‌లలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం లభించినప్ప టి నుంచి కాంగ్రెస్ దేశ ప్రజలకు సేవ చేస్తోందన్నారు. రైతులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బోధన్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. రైతన్నలకు సాగునీరు అందించి వారి పంటలను కాపాడారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌ను చీటర్ అని విమర్శించారు. ఎన్నికలు కూడా క్రికె ట్ ఆటలాంటివే అని, జట్టులో సభ్యులందరూ కలిసి ఆడితేనె విజయం సాధ్యం అవుతుందని అన్నారు. బోధన్‌లో అజారుద్దీన్‌ను చూసేందుకు యువకులు అధిక సంఖ్యలో వచ్చారు. బ్యాట్లు తెచ్చి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అజారుద్దీన్ సమక్షంలో టీడీపీ నాయకులు బిల్ల గంగాధర్ తన అనుచరులతో కాం గ్రెస్‌లో చేరారు. అజారుద్దీన్‌కు కాంగ్రెస్ నాయకులు పట్టణ స్వాగత తోరణం వద్ద గజమాల వేసి స్వాగతం పలికారు. ఆచణ పల్లి బైపాస్ నుంచి ఆచన్ పల్లి, శక్కర్‌నగర్, శక్కర్‌నగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్, అం బేద్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, రాకాసీపేట్, పాత బోధన్‌లో రోడ్‌షో సాగింది. సుదర్శన్‌రెడ్డిని గెలిపిస్తే వందో టెస్టు పూర్తిచేసినట్లే రెంజల్ : మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తాను వందో టెస్టు పూర్తి చేసినట్లేనని అజారుద్దిన్ పేర్కోన్నారు. చాలాకాలం భారత క్రికెట్‌కు పనిచేసి అలసిపోయానని తాను కెరిర్ ముగించే సమయానికి 99 టెస్టులు మాత్రమే ఆడానని అన్నారు. మిగిలిన టెస్టు మ్యాచ్ ఈ నెల 30న జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు సిక్సర్లు కోడుతూ బ్యాలెట్ బాక్సులు నింపాలని సూచించారు. సుదర్శన్‌రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఎవరూ చేయలేదని కొనియాడారు. టీఆర్ఎస్, టీడీపీ, బిజేపీలు డబ్బున్న పార్టీలని ఆ పార్టీల నేతలకు ప్రజా సమస్యలు తెలియవన్నారు. -
మీ చల్లని దీవెనలు కావాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ, సీపీఎం తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి జిల్లా ప్రజలను కోరారు. జిల్లాలో మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో రెండురోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపచేశాయి. ఆదివారం సత్తుపల్లి బస్టాండ్‌సెంటర్‌లో జరిగిన భారీ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... విశ్వసనీయతకు, నిజాయితీకి పట్టం కట్టే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. పేదల మనసెరిగిన నాయకులకు, వారి గుండెచప్పుడు తెలిసిన నాయకులకు, చనిపోయిన తర్వాత పేదల గుండెల్లో నిలిచిపోవాలన్న ఆరాటం ఉన్న నాయకులకు ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటున్న చంద్రబాబు ఆయన పాలించిన తొమ్మిదేళ్లలో పేదల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. ఏరోజూ పేదల జీవితాలు పట్టని చంద్రబాబు రాజకీయాలను దిగజార్చి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకోమాట, పూటకో అబద్ధం చెప్పి పట్టపగలే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ మరణం తర్వాత గత ఐదేళ్లలో పేదలకు ఒక్క కొత్త రేషన్‌కార్డు, కొత్త ఇల్లు, కొత్త పింఛన్ ఇవ్వలేని కాంగ్రెస్‌కు ఓటేయవద్దనికోరారు. ఈ రెండు పార్టీల నేతలు ఓట్ల కోసం వస్తే మీకు ఓటెందుకు వేయాలని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని పలు చోట్ల జరిగిన రోడ్‌షోల్లో జగన్ ప్రసంగం ఇలా సాగింది... ‘‘మిట్టమధ్యాహ్నం... మండుతున్న ఎండలో... ఇంటికిపోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. నడిరోడ్డయినా, ఎండాకాలమనే సంగతి తెలిసినా, కార్యక్రమం ఆలస్యమవుతున్నా ఏ ఒక్కరి ముఖంలో కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. కష్టమనిపించినా, నడిరోడ్డుపై నిలబడి, ఎండ తీక్షణంగా ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపెడుతున్నారు. ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికీ, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరునికి, ప్రతి సన్నిహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యేల కోసం మీరు వేసే ఓటు చాలా కీలకమైనది. మీ తలరాతను మార్చే ఎన్నికలు ఇవి. వేసే ప్రతి ఓటు ఎటువంటి పార్టీకి వేస్తున్నారు... ఎటువంటి నాయకత్వానికి వేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు ప్రశ్నించుకోవాలి. ఏ నాయకుడు పేదవాడి గుండె చప్పుడు తె లుసుకుంటాడో, వారి మనసెరుగుతాడో, చనిపోయిన తర్వాత కూడా వారి గుండెల్లో ఉండాలని ఆరాటపడతాడో అలాంటి నేతలకే ఓట్లేయాలి. అలాంటి పార్టీనే అధికారంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మన తలరాతలు మంచిగా ఉంటాయి. ఒక్కటయితే చెపుతున్నా నాయకత్వం అంటే ఎలా ఉండాలి... సీఎం అంటే ఎలా ఉండాలి అనేదానికి వైఎస్‌ను చూడాలి. ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మన మధ్యలోంచి వెళ్లిపోయి ఐదేళ్లు గడుస్తున్నా మన హృదయాల్లోనే ఉన్నాడు. ఆయనకన్నా ముందు, ఆయన తర్వాత చాలా మంది సీఎంలను మనం చూశాం. కానీ సీఎం అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు దేశానికే చాటి చెప్పిన వ్యక్తి వైఎస్సార్. ఒక్క మాటలో చెప్పాలంటే నేను రామరాజ్యమైతే చూడలేదు కాానీ రాజశేఖరుని సువర్ణయుగాన్ని మాత్రం చూశాను. చాలా మంది సీఎంలు చేయలేనిది వైఎస్ చేశారు. ఇవ్వలేనివి ఇచ్చారు. ప్రతి పేదవాడి గుండెలో నిలిచిపోయారు. పేదల గురించి ఆలోచించని బాబు... వైఎస్ కన్నా ముందు పాలన సాగించిన చంద్రబాబునాయుడు ఏ రోజూ పేదల పరిస్థితి గురించి ఆలోచించలేదు. పేదవిద్యార్థుల గురించి ఆలోచించలేదు. వృద్ధులకు పింఛన్‌ను ఏదో ముష్టివేసినట్టు రూ.70 ఇచ్చేవారు. గ్రామంలో మూడు, నాలుగు వందల మంది పింఛన్‌కు అర్హులైన వారుంటే పదిమందికో, పదిహేనుమందికో ఇచ్చేవారు. మిగిలిన పింఛన్ల గురించి ఆర్డీవోను అడిగితే ఇప్పుడు ఇచ్చే 15 మందిలో ఎవరో ఒకరు చనిపోతేనే ఇంకో పింఛన్ ఇస్తామని చెప్పిన మాటలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. గ్రామాల్లో పేదలకు ఇళ్లు కట్టించే క్రమంలో మూడు, నాలుగు వందల ఇళ్లు అవసరం అయితే 10మందికి ఇచ్చేవారు. ఇళ్లకోసం గ్రామస్తులు ఆర్డీవో దగ్గరకు వెళితే నియోజకవర్గానికి 500 ఇళ్లు మాత్రమే ఇచ్చారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సర్దుబాటు చేయాలంటే 5 ఇళ్లకంటే ఎక్కువ ఇవ్వలేమనే మాటలు నాకు గుర్తొస్తున్నాయి. చంద్రబాబు పాలన చేస్తున్న రోజుల్లో విశ్వసనీయత, నిజాయితీకి అర్థం లేదు. ఆయన ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ప్రజలతో నాకేం పనిలే అన్నట్టు మరో మాట చెప్తారు. ఇప్పుడు కూడా ఎన్నికలొస్తున్నాయికదా అని సాధ్యం కాని హామీలిస్తున్నాడు. రోజుకో అబద్ధం చెపుతున్నాడు. ఒకరోజు టీవీలు ఉచితంగా ఇస్తానంటాడు. మరోరోజు సెల్ఫోన్లు ఫ్రీ అంటాడు. రుణమాఫీ అంటాడు. డ్వాక్రా రుణాల మాఫీ అంటాడు. బుట్ట తీసుకుని మీ ఇంటికే వచ్చి అన్నీ ఫ్రీగా ఇస్తానంటాడు. పట్టపగలే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బాబును చూస్తే నిజంగా రాజకీయాలు ఇంతగా దిగజారాయా అనిపిస్తుంది. ఇంతటి విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబునాయుడు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా అంతే. గత ఐదేళ్లలో ఒక్క రేషన్కార్డయినా ఇచ్చారా? ఒక్క పింఛన్ అయినా ఇచ్చారా? ఒక్క ఇల్లయినా కట్టించారా అని ఓటడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రశ్నించండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అనే పదానికి అర్థం తేవాలి. నాయకుడు మాట ఇస్తే మడమ తిప్పడనే సంకేతాలివ్వాలి. నేను ఒకటే చెపుతున్నా. సీమాంధ్రకు సీఎంగా నేను ప్రమాణం చేస్తా. అయినా తెలంగాణను మాత్రం విడిచిపెట్టేది లేదు. వైఎస్ ప్రతి గుండెల్లో ఉన్నాడు. ఇంతపెద్ద కుటుంబాన్ని నాకిచ్చి వెళ్లాడు. నేను ఒకటయితే చెపుతున్నా అక్కడ చేసే 11 కార్యక్రమాలు ఇక్కడ కూడా అమలుచేస్తాం. నా సోదరి షర్మిల త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తుంది. ఓదార్పు యాత్ర ఎందుకంటే... మంచి నాయకుడు కావాలంటే ఎవరూ చూడని గ్రామాలను చూడాలి. ఎవరూ వెళ్లని పూరి గుడిసెల్లోకి వెళ్లాలి. అక్కడ అక్కచెల్లెళ్లు ఎలా బతుకుతున్నారో గమనించాలి. ఒకటి కాదు రెండు కాదు... నేను 800 ఇళ్లు తిరిగాను. ఓదార్పు యాత్ర నిర్వహించాను. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియని విషయాలు, పేదలగురించిన విషయాలు నాకు మాత్రమే తెలుసు. పేదల కష్టాలు తెలుసుకుంటేనే మంచి రాజకీయ నాయకుడవుతారు. ఏదిఏమైనా ఈ ఎన్నికలలో కలిసికట్టుగా ఒక్కటై దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్ కలలు కన్న సువర్ణయుగాన్ని తీసుకువద్దాం. ఈ ఎన్నికల్లో ఒకవైపు నిజాయితీ, విశ్వసనీయత.., మరోవైపు కుట్రలు, కుతంత్రాల మధ్య పోటీ జరుగుతోంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నా.’ కొత్తపార్టీ.. ఫ్యాన్ గుర్తు జగన్ సభల్లో మాట్లాడుతూ....‘మీకు ఒకమాట చెపుతున్నా..... మన పార్టీ కొత్త పార్టీ. గుర్తు కొత్త గుర్తు. మన గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే చెపుతున్నా మన ఫ్యాన్ గుర్తు తెలిసిన వారు తెలియనివారికి చెప్పాలి. మీలో ఎంత మందికి ఫ్యాన్ గుర్తు తెలుసో చేతులు లేపండి’ అన్నప్పుడు ఆయా సభలకు హాజరైన వారిలో 99 శాతం మంది చేతులు లేపారు. దీంతో ఇంతమందికి గుర్తు తెలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, అ యినా ఒక్కసారి మన ఫ్యాన్ గుర్తు చూపిస్తానని, చూడవలసిందిగా జగన్ విజ్ఞప్తి చేశారు. సభ నలువైపులా గుర్తు చూపిస్తూ అన్నా ఫ్యాన్.. తల్లీ ఫ్యాన్... అవ్వా ఫ్యాన్..అంటూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాల్సిందిగా అభ్యర్థించారు. -
హోరాహోరీ
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 4 గంటలతో తెరపడనుంది. హోరెత్తిన మైకుల శబ్దం, జోరందుకున్న నాయకుల పలకరింపులు పరిసమాప్తం కానున్నాయి. ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో తొలి పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఖ్యాతి గాంచేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా తమ గెలుపుకోసం చెమటోడ్చుతున్నారు. మండు వేసవిలో పల్లె పట్నం అంటూ తేడా లేకుండా తమ తమ నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. గెలుపుపై ధీమా కోసం పార్టీల అగ్రనేతలను రప్పించి ఓటర్ల ప్రసన్నం కోసం పాట్లుపడుతున్నారు. కొందరు సినీతారలతో ప్రచారానికి తళుకులు అద్దారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నేటితో ప్రచారానికి శుభం కార్డు పడనుంది. ఇదిలాఉండగా.. ఓటర్లను ఫోన్ల ద్వారా కాకా పట్టడం, ద్వితీయ శ్రేణి నాయకులను ఓటర్లతో ‘టచ్’లో ఉంచే ఎత్తుగడలు అభ్యర్థులు రూపొందిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే ప్రలోభాల చిట్టాను నాయకులు తయారు చేసుకున్నట్లు సమాచారం. అగ్రనేతల సుడిగాలి పర్యటనలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఆయా పార్టీల అగ్రనేతల తాకి డి కనిపించింది. టీఆర్ఎస్ శ్రే ణుల గెలుపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒకరోజు సుడిగాలి పర్యటనలో తొమ్మిది నియోజకవర్గాలు చుట్టివచ్చారు. ప్రతిచోటా కార్యకర్తలతోపాటు ప్రజలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. సోమవారం మందమర్రిలో పర్యటించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి జైరాం ర మేశ్ జిల్లా అంతటా పర్యటించారు. జైరామ్ రమేశ్‌కు తోడుగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ల క్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు బహిరంగసభల్లో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వేర్వేరుగా రెండ్రోజులు ప్రచారం నిర్వహించారు. తూర్పు జిల్లాలో ప్రచారం నిర్వహించిన సమయంలో కిషన్‌రెడ్డితోపాటు పార్టీ నేత, సినీనటి జీవిత, సినీ హీరో రాజశేఖర్ పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్రపడటంతో ఆయన ఆ సభల్లో ఇక్కట్లను ఎదుర్కొన్నారు. వెరసి అన్నిపార్టీల నాయకులు ప్రచారంతో హోరెత్తించారు. ఆ విధంగా ముందుకు.. ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను చేరుకునేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కులసంఘాలు, గ్రామ పెద్దలతో ఫోన్లలో మంతనాలు చేయడం, యువజన సంఘాల ముఖ్యులతో భేటీ అవడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున ్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డ్వాక్రా సంఘాలు, పలు ఉద్యోగ, కార్మిక సంఘాల బాధ్యులతోనూ చర్చల యత్నాలు చేస్తున్నట్లు అభ్యర్థుల సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నారు. కాగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఆయా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు వెనుకాడబోమని పేర్కొంటున్నారు. నిర్దేశిత సమయం తర్వాత ఎలాంటి ప్రచారాలు చేపట్టకూడదని ఆదేశిస్తున్నారు. తమకున్న మార్గదర్శకాల ప్రకారం ఈ విషయంలో ముందుకువెళతామని పేర్కొంటున్నారు. -
నేడే ఆఖరు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో కీలక ఘట్టమైన ప్రచార పర్వానికి నేటితో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార గడువు ముగియనుంది. అంతిమ పోరైన పోలింగ్‌కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో విజయం కోసం పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. కీలకమైన ఈ కొన్ని గంటలను సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. చివరి క్షణాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ప్రచారానికి చివరి రోజైన సోమవారం అన్ని పార్టీల కీలక నేతలు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నామినేషన్లు దాఖలుచేసిన నాటి నుంచి అభ్యర్థులందరూ క్షణంతీరిక లేకుండా ప్రచారం నిర్వహించి నియోజకవర్గంలోని గడపగడపా తిరిగారు. ఎండలను సైతం లెక్కచేయక ప్రతి క్షణం ఓటర్లను ప్రసన్నం చేసేందుకు కృషి చేశారు. ప్రత్యర్థులను కలవరపెట్టేలా ఒకరినిమించి ఒకరు ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు. పార్టీ అధినేతలను, జనాకర్షక నాయకులను తమ నియోజకవర్గాలకు రప్పించి ప్రచారం చేయించుకున్నారు. ప్రత్యర్థుల ప్రచార సరళిపై వేగులను నియమించి ఎప్పడికప్పుడు సమాచారం పొందుతూ వారి కంటే ఒక అడుగు ముందుండేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరి రోజుల్లో పెరిగిన ప్రచార జోరు ప్రచార ఘట్టంలో చివరి రెండు రోజులు జిల్లాలో పలు పార్టీల కీలక నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాలోని ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు జిల్లాలోని సభలు, రోడ్‌షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని తాండూరు, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లిలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రలోభాల వల.. ఎన్నికల చివరి గంటల్లో పట్టుసడలిపోకుండా అభ్యర్థులందరూ ఓటర్లపై ప్రలోభాల ఎరవేస్తున్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. మహిళలను ఆకట్టుకునేందుకు కానుకలు పంచుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.రెండు వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉందని అంచనా. ఈ రెండు రోజులపాటు డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగనుండడంతో ఎన్నికల కమిషన్, పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిఘాను పటిష్టం చేశారు. ఏ చిన్న వాహనాన్నీ వదలకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. -
సార్వత్రిక జోరు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం 6గంటలకే బయలుదేరి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రచారంలోనే టీ, టిఫిన్, భోజనాలు చేస్తూ రాత్రి పది గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అంశాలపై అనుచరులతో సమాలోచనలు సాగిస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు కంటిమీద కునుకు లేకుండా ఓట్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. మరికొంత మంది అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. భార్య, కుమారుడు, కుమార్తె, కోడలు, ఇలా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. మాజీ అభ్యర్థులు తాము గతంలో చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ ముందుకు సాగుతుండగా, మరి కొంత మంది తాము గెలిస్తే ఏ అభివృద్ధి పనులు చేస్తామో వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు తమ నేతలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ...తాము గెలిచి..తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తున్నారు. ఏది ఏమైనా అభ్యర్థులు మాత్రం గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసుకుంటూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గెలుపుకోసం అడ్డదారులు.... పలు పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. మద్యం, డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు క్రికెట్ కిట్లు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా గ్రామాల్లో ఉన్న నాయకులను సమన్వయం చేసుకుని వారికే ఈ ‘పంపిణీ’ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తీవ్ర పోటీ ఉన్న చోట ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీస్థాయిలో తాయిలాలు అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోపక్క ద్వితీయ శ్రేణి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ సందడి.. నిన్నటి వరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన గ్రామాల్లో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల జిల్లా స్థాయి నేతలు గ్రామాల్లో మకాం వేసి ద్వితీయ శ్రేణి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రెబల్ అభ్యర్థులపైన దృష్టిసారిస్తున్నారు. వారిని ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తే దానికి తగిన ప్రతిఫలం వచ్చేలా చూస్తామని చెబుతున్నారు.. తమ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో కాంట్రాక్టులు ఇస్తామని, తమ పార్టీ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి అంటు మాయమాటాలు చెబుతున్నారు. ముఖ్యనేతల ప్రచారంలో కేడర్‌లో ఉత్సాహం.. అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తుంటే వారి తరఫున ఆయా పార్టీల రాష్ట్రస్థాయి నేతలు కూడా జిల్లాలో పర్యటించి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఒకసారి ఖమ్మంలో ‘జయభేరి’ మోగించగా.. మరోసారి ఎన్నికల ప్రచారం నిమిత్తం శనివారం జిల్లాకు వస్తున్నారు. అలాగే పార్టీ నాయకురాలు షర్మిల నాలుగురోజుల ఎన్నికల ప్రచార యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నేతల పర్యటనలు విజయవంతం కావడంతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తమ గెలుపునకు ఢోకాలేదని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరోజులోనే ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగూడెం, భద్రాచలం, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇక కాంగ్రెస్ తరుఫున కేంద్రమంత్రి జైరాంరమేష్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, సీపీఐ తరపున సురవరం సుధాకర్‌రెడ్డిలు ప్రచారం నిర్వహించారు. -
ప్రలోభాల ఎర
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ప్రచారాన్ని ఉధృతం చేశారు. మిగతా పార్టీలకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిలు జిల్లాలో ఇప్పటికే ప్రచారం పూర్తిచేశారు. వారికి జిల్లావాసులు బ్రహ్మరథం పట్టారు. జగన్ ప్రసంగాలు వారిని ఆలోచింపజేశాయి. పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే 2019లో ప్రజల ముందుకు వస్తామని ఆయన చేసిన ప్రకటన ప్రజల్లో విశ్వాసం నింపింది. అలాగే గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, డాక్టర్ అమృతపాణిలు ప్రచారంలో ముందున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. టీడీపీ ప్రలోభాలతో ముందుకు... వైఎస్సార్సీపీకి ప్రజల్లో వస్తున్న స్పందన చూసిన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయకులు గ్రామాల్లోని ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నాయకులను తమవైపుకు తిప్పుకోవడం, వారి ద్వారా ప్రజల్లోకి వెళ్లడం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా మాకు ఓటువేయకున్నా సరే ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు ఏం కావాలో చెప్పాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మద్యం పంపిణీ జోరుగా సాగుతుండగా డబ్బు, మహిళలకు చీరలు, యువతకు క్రికెట్ కిట్లు వంటి తాయిలాలు చూపుతున్నట్లు సమాచారం. నరసరావుపేట, సత్తెనపల్లి, నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రలోభాలు ఎక్కువుగా ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలుపుకోసం ఆరాటపడుతున్న ఓ నేత తన సామాజిక వర్గాల నాయకులను రంగంలోకి దింపారు. వారి ద్వారా ఓట్లు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్‌లో తమకు అనుకూలంగా ఉన్న వారితో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. రంగంలోకి దిగిన పచ్చ ఎన్ఆర్ఐలు... ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపుఖాయం కావడంతో తెలుగుదేశం పార్టీ చివరి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఏదో ఒక విధంగా తిరుగుబాటు అభ్యర్థులను బరిలో నుంచి తప్పించిన నాయకులు ఇప్పుడు గెలుపు కోసం తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు అర్థబలం కోసం ఎన్ఆర్ఐలను ఆశ్రయిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలోని కొన్ని మండలాలను, గ్రామాలను దత్తత తీసుకోవాలని, అక్కడ గెలిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. దీంతో ఇద్దరు, ముగ్గురు ఎన్ఆర్ఐలు ఒక మండలాన్ని దత్తత తీసుకొనేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం నిఘా ఎక్కువగా ఉండటం, చెక్‌పోస్టుల వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండటంతో అవసరమైన నిధులను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
జనహోరు..
- జననేతకు నీరాజనం పలికిన జిల్లా ప్రజలు - మండుటెండలోనూ తరగని అభిమానం - వైఎస్ జగన్ మూడురోజుల పర్యటన విజయవంతం - పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత పర్యటన - ఫ్యాన్ ప్రభంజనాన్ని చాటిన జనభేరి ప్రచారం నిరంతరం తమ సంక్షేమం కోసం పరితపించే నాయకుడెవరో.. తమ కలలు సాకారం చేయగల సమర్థుడెవరో ప్రజలకు బాగా తెలుసు.. అందుకే జననేతపై అభిమానం చాటుకున్నారు. భానుడు నిప్పులు చెరుగుతున్నా వెరవలేదు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఎర్రటి ఎండలోనూ గంటలకొద్దీ నిరీక్షించారు. ఆత్మీయానురాగాలు పంచారు. వారందరిలో ఒకటే ఆశ.. రాజన్న బిడ్డను చూడాలని, ఆ అభిమాన నేత పలుకులు వినాలని. జనభేరి రథంపై చిరునవ్వులు చిందిస్తూ తమ ముందుకు వచ్చిన జగనన్నను చూడగానే వారి ముఖాల్లో వెలిగిపోయాయి. వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. ఆయన పర్యటన ఫ్యాన్ ప్రభంజనానికి అద్దం పట్టింది. జగన్ ఉద్వేగపూరిత ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని నింపాయి. సాక్షిప్రతినిధి, గుంటూరు, వైఎస్సార్ జనభేరికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చిన జననేతకు ప్రతి పల్లెలోనూ అఖండ స్వాగతం లభించింది. ఈ నెల 21వ తేదీ సోమవారం రాత్రి తెనాలి నియోజకవర్గం కొల్లిపర చేరుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు గుదిబండి చినవెంకటరెడ్డి నివాసంలో బస చేశారు. మంగళవారం ఉదయం 10.45 నిమిషాలకు మాతృ వియోగంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. డెల్టాలో అపూర్వ స్వాగతం.. జిల్లాలో ఎన్నికల పర్యటనకు వచ్చిన జగన్‌కు డెల్టా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 11.05 నిముషాలకు కొల్లిపర నుంచి జగన్రోడ్షో ప్రారంభించారు. రోడ్ల వెంట బారులు తీరిన అశేష జనవాహిని, ప్రజలు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు అభిమానం కురిపించారు. కొల్లిపర నుంచి బయలుదేరిన ఆయనకు తూములూరు వద్ద ఇటుకబట్టీ కార్మికులు, మహిళలు, మొక్కజొన్న రైతులు స్వాగతం పలికి వారి సమస్యలను వివరించారు. త్వరలోనే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ వారికి జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి శిరిపురం అడ్డరోడ్డుకు చేరగానే ప్రజలు జగన్‌పై పూలవాన కురిపించారు. అనంతరం అత్తోట చేరుకున్న జగన్‌కు రైతులు, రైతుకూలీలు వారి సమస్యలను వివరించారు. మీరు ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు తీరుతాయంటూ తెలిపారు. నంబూరు, కాజా గ్రామాల మీదుగా మంగళగిరిలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఆయన చెప్పే ప్రతి మాటకు హర్షధ్వానాలు చేశారు. మంగళగిరి నుంచి దుగ్గిరాల మీదుగా తెనాలి చేరుకున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అప్పటికే ప్రచార సమయం ముగియడంతో ఆయన ప్రసంగించకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలసంఖ్యలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఆయనను అనుసరించారు. అక్కడి నుంచి ఆయన రాత్రి వినుకొండలోని బాలాజీ ఎస్టేట్స్‌కు చేరుకొని బస చేశారు.విను‘కొండంత’ అభిమానం... బాలాజీ ఎస్టేట్స్ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు ప్రచారానికి బయలుదేరిన జగన్‌కు వేలసంఖ్యలో ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలతో కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. నారపురెడ్డి పల్లె వద్ద బీఈడీ కళాశాల విద్యార్థులను, మార్గంమధ్యలో రైతులు, మహిళలను పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు. వినుకొండ పట్టణానికి చేరుకొనే సరికి సమయం సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలైంది. సుమారు గంటసేపు మండుటెండలో ఆయన ప్రసంగించారు. అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా బహిరంగసభ నుంచి వెళ్లలేదు. అనంతరం వినుకొండ నుంచి ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన ఆయన నరసరావుపేట మండలం లక్ష్మీపురం, పిట్లూరివారిపాలెం మీదగా చిలకలూరిపేట బహిరంగసభకు హాజరయ్యారు. అన్నిగ్రామాల్లోనూ ప్రజల ఎదురేగి ఘనస్వాగతం పలికారు. చిలకలూరిపేటలో బహిరంగసభ అనంతరం పొన్నూరుకు చేరుకొని రాత్రి బసచేశారు. గురువారం ఉదయం పొన్నూరులో రోడ్‌షో అనంతరం అక్కడ జరిగిన బహిరంగసభలో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. శోభమ్మ అక్కలాంటింది..:జగన్ పొన్నూరు బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ‘మీ అందరికో విజ్ఞప్తి ... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం నాకు తెలిసింది. శోభమ్మ కారు ప్రమాదంలో గాయపడటం నా మనసును తీవ్రంగా కలచివేసింది. శోభమ్మ నాకు అక్కలాంటిది. నా కోసం ఆమె ఎంతో చేశారు. నా ప్రతి అడుగులోనూ అడుగై నడిచారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమెను పరామర్శించేందుకు వెళ్తున్నా.. మండుటెండలో మేమంతా వేచి ఉంటే జగన్ మాట్లాడకుండా వెళుతున్నారని ఏమీ అనుకోవద్దు.. జగన్ మీ మనిషి... మీరు కాకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు..ఒక్క విషయం చెప్పదలచుకున్నా పొన్నూరు నియోజకవర్గ పార్టీ అభ్యర్తి రమణను, గుంటూరు ఎంపీ అభ్యర్థి బాలశౌరిలను గెలిపించండి’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్ పర్యటనతో జిల్లా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. పార్టీలో చేరిన ప్రముఖులు.. జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ సమక్షంలో పలువురు రాజకీయ ప్రముఖులు పార్టీలో చేరారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే చల్లా నారపరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షేక్ సుభాని, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దాసరి కిరణ్‌కుమార్, టీడీపీ నేత ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు చేరినవారిలో ఉన్నారు. -
నల్లగొండపై... నజర్
సాక్షిప్రతినిధి, నల్లగొండ, మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుండగా, 28వ తేదీన సాయంత్రం 5గంటలకు ప్రచారం పరిసమాప్తం కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలూ వీటిని కీలకంగా భావిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించిన టీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్, ఇలా.. ఈ మూడు పార్టీలూ తెలంగాణ సెంటిమెంటు ఓటుపై ఆశలు పెట్టుకున్నాయి. వీటితో పాటు జాతీయస్థాయిలో తెలంగాణ ఏర్పాటుకు సహకరిం చిన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) తెలంగాణ శాఖ సైతం అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ నేత చంద్రబాబు జిల్లాలో పర్యటించారు. కాగా, ఇపుడు ఆయా పార్టీల అభ్యర్థుల కోసం ముఖ్య నాయకులు ప్రచారానికి జిల్లాపై ముప్పేట దాడి చేయనున్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని భువనగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటున్నారు. ఈ సభ శని వారం జరగనుంది. దీంతో కాంగ్రెస్ నాయకులతో పాటు, అధికార యంత్రాంగం సైతం ప్ర ధాని సభ ఏర్పాట్లలో మునిగిపోయాయి. లోక్‌సభలో బీజేపీ నేత సష్మాస్వరాజ్ కూడా ఇదే రోజు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరి ధిలో పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా, భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఆలే రు, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కాసం వెంకటేశ్వర్లు, గంగిడి మనోహర్‌రెడ్డి, చెరుకు లక్ష్మి బరిలో ఉన్నారు. మునుగోడులో బీజేపీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ మనోహర్‌రెడ్డి పోటీలో ఉండడంతో సుష్మాస్వరాజ్ బహిరంగ సభను చౌటుప్పల్‌లో ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున 25వ తేదీన జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్ లో పర్యటించాల్సిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఒకరోజు వాయిదా పడింది. 26వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగనుంది. తొలిసారి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ (టీఆర్ఎల్డీ) నుంచి ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ భువనగరి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ 25వ తేదీన మునుగోడులో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ మరుసటి రోజు ఆలేరులో అజిత్‌సింగ్‌తో పాటు సినీ నటి జయప్రద, అమర్‌సింగ్‌లు కూడా టీఆర్ఎల్డీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పర్యటించనున్నా రు. మొత్తంగా అన్ని పార్టీల ముఖ్య నే తలు రెం డు మూడు రోజుల్లో జిల్లా ప్రచారానికి వస్తుండడంతో ఆ పార్టీల కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. -
ఒంగోలులో బాలినేని విస్తృత ప్రచారం
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం ముమ్మర ప్రచారం చేశారు. తొలుత 17వ వార్డులోని భాగ్యనగర్, విజయనగర్ కాలనీ, దారావారి తోట ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. 17వ వార్డు మాజీ కౌన్సిలర్ జి.ఏడుకొండలు ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ప్రచారం ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని బాలినేని కోరారు. టీ కొట్లు, చిల్లర బంకుల వద్ద ప్రచార రథాన్ని ఆపి మరీ ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. బాలినేనితో పాటు వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, పార్టీ నాయకులు మధు, రమేష్, సుశీల, బడుగు ఇందిర, ఐ.నాగరాజు, జాకబ్, శ్రీను, తమ్మిశెట్టి రాంబాబు, నాగరాజు, యోహోను, తమ్మిశెట్టి చంద్ర, మహిళా కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి మహిళలు ప్రచారంలో భాగంగా బాలినేని భరత్ నగర్ కాలనీకి బాలినేని వెళ్లారు. అక్కడి మహిళలు బాలినేని సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పి.లక్ష్మి, జి.మస్తానమ్మ, బి.వీరమ్మ, డి.కోటేశ్వరి, ఎస్.ప్రమీల, ఎస్.శ్రీదేవి, బి.సుబ్బారావు, పి.హరిబాబు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు కూడా.. 15వ వార్డులోని కేశవస్వామిపేటకు చెందిన జూటూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాలినేని సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో దండూరి సుబ్బారావు, కె.శివయ్య, జాలశ్రీ లక్ష్మణ్, దుంపల తిరుమల వాసులు, నక్క కోటయ్య, దుంపల రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఉప్పుగుండూరు కార్యకర్తలు కూడా.. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒంగోలు వచ్చి బాలినేని ఇంటి వద్ద ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో తెలగతోటి చంద్రమోహన్, కొలకలూరి రమేష్, యక్కల సుబ్బారావు, కె.వరప్రసాద్, కట్టా అంజయ్య, కె.మాణిక్యరావు కుటుంబాలతో పాటు బాబూజగ్జీవన్‌రావు అండ్ అంబేద్కర్ స్నేహ యూత్ ఫోర్స్ యువకులు కూడా పార్టీలో చేరారు. దాదాపు వంద మందికిపైగా వైఎస్సార్ సీపీలో చేరారు. -
జనాభిమానం
అభిమానం పెల్లుబికింది. ఆప్యాయత ఉప్పొంగింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. జననేత ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ రోడ్‌షో జగన్నినాదంతో మార్మోగింది. సాక్షి, ఒంగోలు, అద్దంకి జనం అదరగొట్టారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు అడ్డరోడ్డులో జనగర్జన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ‘వైఎస్సార్ జనభేరి’ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోకు భారీ స్పందన లభించింది. ఐదు మండలాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఎడ్లబండ్లు, బస్సులు పెట్టుకుని మరీ స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు ఒకటీ..రెండు కాదు, ఏకబిగిన ఎనిమిది గంటల పాటు జగన్ కోసం నిలువెల్లా కనులై ఎదురుచూశారు. మిహ ళలు, వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు.. రైతులు, రైతు కూలీలు మండుటెండను సైతం లెక్కచేయకుండా జగన్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రోడ్‌షో ఉదయం 12 గంటలకు జరగాల్సి ఉండగా... సాయంత్రం ఆరు గంటలకు జగన్ ప్రచారరథం అక్కడకు చేరింది. ఉదయం 10 గంటల నుంచే అద్దంకి నియోజకవర్గ గ్రామాల నుంచి ప్రజలు బండ్లు కట్టుకుని ఒక్కొక్కరుగా చేరుకున్నారు. వాహనాలకు పార్టీ జెండాలు పెట్టుకుని, తలలకు జెండాలతో పాగాలు చుట్టుకుని సంతమాగులూరు అడ్డరోడ్డులో సందడి చేశారు. గ్రామాల నుంచి వచ్చేప్పుడు భోజనం క్యారేజీలు సైతం తెచ్చుకుని.. పండగ తిరునాళ్లలో దేవుని దర్శనం కోసం వేచిఉండే చందంగా వాతావరణం కనిపించింది. హైవే జంక్షన్ జామ్ చేసిన జనాభిమానం.. నాయకుడిని ఎంచుకుని..అతన్నే ఎన్నుకోవడానికి అభిమాని ఎన్నికష్టాలైనా ఓరుస్తాడనేది బుధవారం జగన్ రోడ్‌షోకు గంటల తరబడి వేచిఉన్న జనాన్ని చూస్తే నిరూపితమైంది. అద్దంకి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ అమృతపాణి కలిసివచ్చి ఉదయం 11 గంటలకు సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద కనిపించగానే.. సామాన్య మధ్యతరగతి జనం వారిని అప్యాయంగా పలకరించారు. అద్దంకి, కొరిశపాడు, బల్లికురవ, జె.పంగులూరు, సంతమాగులూరు మండలాలతో పాటు పర్చూరు నియోజకవర్గం పరిధిలోని మార్టూరు మండల జనం కూడా బృందాలుగా వచ్చి జగన్ రోడ్‌షోను విజయవంతం చేశారు. పదేళ్లపాటు అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడా గొడవలకు తావులేకుండా.. ప్రశాంతంగా అభివృద్ధి జరగడమే ...ఇంతటి ప్రజాదరణకు కారణమని అక్కడకొచ్చిన జనం చెప్పడం విశేషం. - చిన్నారులు వైఎస్సార్ సీపీ జెండాలు పట్టుకుని ఎండకు మండుతున్న హైవేరోడ్డుపై తల్లులతో కలిసి చిరునవ్వులు చిందించడం రాజకీయ పరిశీలకులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. - పాతమాగులూరుకు చెందిన పేరం వీరమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు జగన్ వచ్చేదాకా తాను ఇంటికెళ్లనంటూ.. తనకు పింఛన్ రావడం లేదని చెబుతానంటూ వేచి ఉంది. - మిన్నేకల్లు గ్రామానికి చెందిన రైతు సాంబశివరావు కూడా ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న సద్దిమూటను స్థానిక పెట్రోలు బంకు వద్ద కూర్చొని తింటూ.. జగన్‌ను చూసిన తర్వాతే ఇంటికెళ్తానని చిరునవ్వుతో చెప్పాడు. బైక్ ర్యాలీలతో జనభేరికి ఘనస్వాగతం.. గుంటూరు జిల్లా వినుకొండలో బహిరంగ సభ ముగించుకుని బయల్దేరిన జగన్‌కు ప్రకాశం జిల్లా సరిహద్దులోని వెల్లలచెరువు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బాపట్ల లోక్‌సభ, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థులు డాక్టర్ అమృతపాణి, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు జాగర్లమూడి రాఘవరావు, డాక్టర్ బాచినేని చెంచుగరటయ్య, ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైస్‌చైర్మన్ కోయి అంకారావు, అద్దంకి పట్టణ పార్టీ కన్వీనర్ కాకాని రాధాకృష్ణమూర్తి. మండల కన్వీనర్లు జ్యోతి హనుమంతరావు, జజ్జర ఆనందరావు, మలినేని గోవిందరావు, స్వయంపు హనుమంతరావు, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, కరి పరమేష్, జిల్లాఎస్సీసెల్ నాయకుడు రంపతోటి సాంబయ్య, సంతమాగులూరు నేతలు ఓరుగంటి కోటిరెడ్డి, అట్ల చినవెంకటరెడ్డి. యమహా రాజు, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బైక్‌లతో ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు. యువత వంటికి వైఎస్ఆర్ సీపీ జెండాలు చుట్టుకుని, రంగులు పూసుకుని బైక్‌లపై రకరకాల విన్యాసాలు చేయడం ఉత్సాహం కలిగించింది. -
జన సునామీ
మనసంతా ఆప్యాయత గూడుకట్టుకున్న పలకరింపు... ఆ పలకరింపు విని పులకరించిపోయే అవ్వా, తాతలు, అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు...ఆ కర స్పర్శ కోసం కలవరించే అభిమాన జనతరంగం... ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకునే జనం మనసెరిగిన నేత వైఎస్ జగన్‌ను చూడగానే అందరి హృదయాలూ ఆనందంతో పరవశించాయి. వారి కళ్లల్లో మెరుపులు మెరిశాయి... అందుకే నిప్పులు కక్కుతున్న ఎండలో సైతం వినుకొండ బస్టాండు సెంటర్ జనంతో నిండిపోయింది. శివయ్యస్థూపం సెంటరు నుంచి సభావేదిక దాకా ఇసుకేస్తే రాలని జనం...అభిమాన నేతకు అడుగడుగునా బ్రహ్మరథం... రాత్రి చిలకలూరిపేటలోనూ అదే తీరు... సమయం మించిపోయినా హృదయాల్లో గూడు కట్టుకున్న అభిమానం వారిని కదలనివ్వలేదు. కళామందిర్ సెంటర్ కిక్కిరిసిపోయింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు, జనప్రవాహం పొంగింది.. అభిమానం తొణికిసలాడింది.. ఎటు చూసినా జనసంద్రమే సాక్షాత్కరించింది.. జనప్రభంజనం వెల్లువెత్తింది.. రాజన్న బిడ్డ ముఖంలో చిరుమందహాసాన్ని చూసిన ప్రజానీకం ఉప్పొంగిపోయింది... వైఎస్సార్ జనభేరి కార్యక్రమంలో భాగంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జనభేరి కార్యక్రమానికి విచ్చేసిన జననేత వైఎస్ జగన్‌ను చూసి పల్లెప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మండుటెండను లెక్కచేయని జనం.. తమ దార్శినికునిపై పూలజల్లు కురిపించి ఆప్యాయతానురాగాలను వ్యక్తపరచింది. వినుకొండ పట్టణంలోని మేడలు, మిద్దెలు, చెట్లు ఇలా అన్నింటిపై అభిమానులు కిక్కిరిసిపోయారు. జయహో.. జగనన్నా.... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నినాదాలతో వినుకొండ హోరెత్తింది. మంగళవారం రాత్రి బస చేసిన బాలాజీ ఎస్టేట్స్ వద్ద నుంచి జగన్ జనభేరి ప్రచార రథం వినుకొండ పట్టణానికి బుధవారం ఉదయం 11 గంటలకు బయలుదేరింది. బాలాజీ ఎస్టేట్స్ నుంచి వినుకొండకు రోడ్‌షోగా బయలుదేరిన జగన్మోహన్రెడ్డి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ నన్నపనేని సుధ ఉన్నారు. మార్గంమధ్యలో నిర్మల స్కూల్ వద్ద ఎండను సైతం లెక్కచేయకుండా ఎదురుచూస్తున్న మహిళలు, వృద్ధులు, చిన్నారులను చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకుసాగారు. అక్కడి నుంచి నారపురెడ్డిపల్లెలో ఉన్న బీఈడీ కళాశాల వద్ద భారీ సంఖ్యలో వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను చూసి ప్రచారరథం దిగి కిందకు వచ్చి ఆత్మీయంగా పలకరించారు. విఠంరాజుపల్లి చేరుకున్న ప్రచార రథానికి అడ్డుతగిలిన అశేష జనవాహిని రాజన్న తనయుడిని కనులారా చూసి పులకరించిపోయింది. బసకేంద్రం నుంచి వినుకొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ప్రజాభిమానాన్ని కాదనలేక అనేక చోట్ల ప్రచార రథాన్ని ఆపుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ వినుకొండకు చేరుకునే సరికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. అశేష జనవాహినికి అభివాదం చేసుకుంటూ శివయ్యస్థూపం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ ప్రాంగణానికి మధ్యాహ్నానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలన లో రైతులను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రుణమాఫీ చేస్తానంటూ మీముందుకు వస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని చొక్కపట్టుకుని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిని, వినుకొండ అసెంబ్లీ అభ్యర్థిని డాక్టర్ నన్నపనేని సుధను ఫ్యాను గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఈలలు, కేకలు, హర్షధ్వానాలతో ఫ్యాను గుర్తుకే మా ఓటంటూ ప్రజలంతా నినదిం చారు. అక్కడి నుంచి రోడ్‌షోగా పట్టణ శివారువరకు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. విఠంరాజుపల్లి మీదుగా బాలాజీ ఎస్టేట్స్‌కు చేరుకున్న వైఎస్ జగన్ మధ్యాహ్న భోజనం విరామం అనంతరం శావల్యాపురం మండలం కనమర్లపూడి చేరిన వైఎస్ జగన్ రోడ్‌షోకు గ్రామప్రజలు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి శావల్యాపురం వెళుతున్న వైఎస్ జగన్ రోడ్‌షో అక్కడక్కడ తన కోసం వేచి ఉన్న రైతులు, మహిళా కూలీలు, వృద్ధుల వద్ద ఆగుతూ వారిని పలకరిస్తూ శావల్యాపురం చేరుకున్నారు. గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు పూలవానతో తమ అభిమాననేతను ముంచెత్తారు. అక్కడి నుంచి పొట్లూరు చేరుకున్న జగన్ ప్రచారరథానికి అడుగడుగునా ప్రజలు అడ్డుతగులుతూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అక్కడి నుంచి కృష్ణాపురం చేరుకునే సరికి యువకులు పెద్దఎత్తున ద్విచక్రవాహనాల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. ఘంటావారిపాలెం చేరుకున్న వైఎస్ జగన్‌కు అభిమానులు, మహిళలు బ్రహ్మరథం పట్టారు. అక్కడి నుంచి బయలుదేరిన జగన్ ప్రచారరథం ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం, సంతమాగలూరు మండలం, వెల్లలచెరువు అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరుకుని ఆత్మీయ స్వాగతం పలికారు. సంతమాగలూరు అడ్డరోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్‌కు అశేష జనవాహిని నీరాజనాలు పలికింది. అనంతరం నరసరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్‌కు నరసరావుపేట మండలం లక్ష్మీపురం వద్ద భారీసంఖ్యలో మహిళలు ఎదురేగి స్వాగతం పలికారు. యువకులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెట్లూరివారిపాలేనికి చేరుకున్న వైఎస్ జగన్‌ను పూలతో ముంచెత్తారు. వేలాది మంది అభిమానులు, మహిళలు, వృద్ధులకు అభివాదాలు చేసుకుంటూ జగన్ కోటప్పకొండ వైపునకు ముందుకుసాగారు. కట్టుబడివారిపాలెం వద్దకు చేరుకున్న జగన్‌ను చూసేందుకు చిమ్మచీకట్లోనూ మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం బారులు తీరారు. యడవల్లి, పురుషోత్తపట్నం మీదుగా చిలకలూరిపేటకు చేరుకున్న వైఎస్ జగన్ ప్రచార రథానికి అశేష జనవాహిని ఎదురేగి అఖం డ స్వాగతం పలికారు. పట్టణంలో రోడ్‌షో నిర్వహించిన జగన్మోహన్రెడ్డి బారులు తీరిన ప్రజానీకానికి అభివాదం చేసుకుం టూ బహిరంగసభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేచి ఉన్న వేలాది మంది జనం జగన్‌ను చూడగానే ఉప్పొంగిన ఉత్సాహం తో హర్షధ్వానాలు చేశారు. జగన్ ప్రసంగిస్తున్నంతసేపూ ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ అభిమానాన్ని చాటుకున్నారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌లను ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ కోరడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ రోడ్‌షోలో వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ దేవళ్ల రేవతి, ఆళ్ళ పేరిరెడ్డి, లతీఫ్‌రెడ్డి, గజ్జల నాగభూషణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు జనభేరి సాగేదిలా... వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపడుతున్న వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమంలో భాగంగా గురువారం పొన్నూరు, గుంటూరులలో పర్యటించనున్నారని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం తెలిపారు. ఉదయం పది గంటలకు పొన్నూరు పట్టణంలోనూ, సాయంత్రం ఐదు గంటలకు గుంటూరు నగరంలోనూ జరిగే బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రసంగిస్తారని వివరించారు. -
నిఘా నీడలో అభ్యర్థులు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థుల వ్యయం హద్దులు దాటుతోంది. ఏదోవిధంగా గెలిచి తీరాలనే పట్టుదల వారిని వివిధ రకాల ఖర్చులకు పురిగొల్పుతోంది. వీరి వ్యయం మితిమీరితే ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కల్గే అవకాశం ఉన్నందునా జిల్లా అధికార యంత్రాంగం నిఘాను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు జరుగుతున్న పర్యవేక్షణ, వ్యయ వివరాలను షాడో రిజిష్టర్‌లో సక్రమంగా నమోదు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అలసత్వం తగదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమ రికార్డింగ్, ఖర్చు అంచనా, ఆధారాల సేకరణ, షాడో రిజిష్టర్‌లో నమోదుపై తదితరవాటిపై నియోజకవర్గాల వారీగా సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీములతో కలెకక్టర్ బుధవారం కాన్ఫరెన్స్‌హాలులో సమీక్ష నిర్వహించారు. ఆదోని తదితర నియోజకవర్గాల్లో నామినేసన్ల కార్యక్రమాన్ని వీడియో తీయలేదని, ఖర్చుల వివరాలు నమోదు చేయలేదనే సమాధానాలు రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యయంపై గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఇలా ఉంటే ఎలా ఆంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సంబంధిత రిటర్నింగ్ అధికారి అనుమతితో వీడియో గ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకోండి. సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలతో సహా అభ్యర్థులు నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని రికార్డింగ్ చేసి ఆధారాలతో సహా షాడో రిజిష్టర్‌లో నమోదు చేయండి’ అని కలెక్టర్ ఆదేశించారు. వాహనాలు లేవని, ఉన్నా డీజిల్ వేయడం లేదని కొందరు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆర్వోలకు చెప్పి పరిష్కరిస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు. అభ్యర్థుల ఖర్చుకు సంబంధించిన రికార్డులను మూడు రోజులకోసారి విధిగా పరిశీలించాలని సూచించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారి జి.రామచంద్రారెడ్డి, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శివానందం తదితరులు పాల్గొన్నారు. -
జననేతను ముఖ్యమంత్రి చేద్దాం
వైఎస్సార్సీపీతో అభివృద్ధి సాధ్యం చంద్రబాబు పాలనను కోరుకోవద్దు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి షర్మిల రోడ్‌షోలో గౌరు వెంకటరెడ్డి కల్లూరు, న్యూస్‌లైన్: జననేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక చెన్నమ్మ సర్కిల్ వద్ద సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రోడ్‌షో నిర్వహించారు. ఈ సదర్భంగా గౌరు వెంకటరెడ్డితోపాటు ఆ పార్టీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రసంగించారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమైందన్నారు. ఆ మహానేత ఆశయాలను సాధించేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తే కరువు విలయతాండవం చేసిందని గుర్తుచేశారు. వ్యవసాయం దండగన్న బాబు.. ఎన్నికల సమయంలో రైతులపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనను మళ్లీ కోరుకోవద్దని సూచించారు. ఎంపీ ఎస్పీ వై రెడ్డి మాట్లాడుతూ... రైతుల గురించి టీడీపీ అధినేత ఏనాడు పట్టించుకోలేదన్నారు. అన్నదాతల సంక్షేమం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతులకు పగటి పూట ఏడు గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందుతుందని, అలాగే ధరల స్థిరీకరణకు రూ. 3 వేల కోట్లతో నిధి ఏర్పాటు అవుతుందన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఐదు సంతకాలతో రాష్ట్ర దిశను మార్చివేస్తారని గౌరు చరితారెడ్డి అన్నారు. అమ్మ ఒడి పథకం, డ్వాక్రా రుణాల మాఫీ.. మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వివరించారు. వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ చంద్రకళాదరరెడ్డి, కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నందికొట్కూరులో వీస్తున్న ఫ్యాన్ గాలి
మెరవని ‘రత్నం’ లబ్బీకి అసంతృప్తుల సెగ ప్రచారంలో దూసుకుపోతున్న ఐజయ్య సాక్షి, కర్నూలు: అరుదైన ‘బట్టమేక ’ పక్షికి స్థావరమైన నందికొట్కూరు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. ఇక్కడ అంతర్గత కుమ్ములాటలతో తెలుగుదేశం సతమతమవుతోంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఉద్యమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ బలంగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానం, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం వైఎస్సార్సీపీ గెలుపునకు దోహదపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో(1955) నందికొట్కూరు ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ఈ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన అయ్యపురెడ్డి, ఎన్‌కె.లింగం విజయం సాధించారు. అంతకుముందు 1952లో కమ్యూనిస్టు పార్టీ నేత చండ్ర పుల్లారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నందికొట్కూరు శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా మొత్తం 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. మరో మూడు సార్లు తెలుగుదేశం, రెండు సార్లు ఇండిపెండెంట్లు, ఒకసారి సీపీఐ గెలుపొందింది. 1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందడం విశేషం. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వై. ఐజయ్య బరిలో ఉన్నారు. ఈయన పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలున్నారు. దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలతో చాలా మంది లబ్ధిపొందారు. వీరంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫేస్టోను నమ్ముతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్సీపీ క్రీయాశీలక పాత్రను ప్రశంసిస్తూ ఆ పార్టీవెంటే తామంతా అంటూ నడుస్తున్నారు. ఐజయ్యకు అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
ప్రభంజనం
షర్మిల రోడ్‌షో, జనభేరి సభలు సక్సెస్ నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో ప్రచారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు రాజన్న కుమార్తెకు అపూర్వ స్వాగతం పోటెత్తిన జనం ‘ఫ్యాన్’ గాలి వీస్తోందనేందుకు ఈ జనమే సాక్షి. ఏ కూడలి చూసినా పోటెత్తిన అభిమానమే. ఆత్మీయత పంచుకునేందుకు రోడ్ల వెంట బారులు తీరిన ప్రజలు పూలవర్షం కురిపించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి.. మహానేత కుమార్తె షర్మిల రాకతో నంద్యాల పార్లమెంట్‌లోని పల్లెలు జనసంద్రమయ్యాయి. జనభేరి సభలకు ఇసుకేస్తే రాలనంతగా హాజరైన అశేష ప్రజానీకం పార్టీ ప్రభంజనానికి అద్దంపట్టింది. సాక్షి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అభిమానం పోటెత్తింది. మహానేత కుమార్తె రాకతో జనం రోడ్ల వెంట బారులు తీరడం విశేషం. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు.. ఆత్మకూరు, నంద్యాలలో ఆమె సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇక ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన జనభేరి సభలు జనసంద్రమయ్యాయి.వైఎస్ఆర్ అమర్హై.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఉదయం 11.25 గంటలకు కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్లో ప్రారంభమైన రోడ్‌షో నందికొట్కూరు, ఆత్మకూరు, వెలుగోలు మీదుగా నంద్యాలకు చేరింది. దారిపొడవునా జనం ప్రచారరథానికి ఎదురొచ్చి పూల వర్షం కురిపించారు. నంద్యాలలో రాత్రి 9.20 గంటలకు రోడ్‌షో ముగించుకుని ఆమె పులివెందుల వెళ్లారు. తన ప్రసంగంలో వైఎస్ఆర్ హయాంలో సాధించిన ప్రగతి.. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టారు. అదేవిధంగా వైఎస్ఆర్ ఆశయ సాధనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వైఎస్ జగన్ ఎదురొడ్డి నిలిచి పోరాడుతున్న తీరును వివరించిన తీరు ప్రజలను ఆలోచింపజేసింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటగా జగన్ చేయనున్న ఐదు సంతకాలు రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరిన ప్రతిసారీ ప్రజలు అంతే స్ఫూర్తితో మద్దతు తెలపడం విశేషం. కల్లూరులో పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి గౌరు చరితారెడ్డిని.. నందికొట్కూరులో ఐజయ్య, ఆత్మకూరులో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాలలో ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిలను ప్రజలకు పరిచయం చేస్తూ.. కనీవినీ ఎరుగని మెజార్టీ కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి పట్టణ శివార్లలో షర్మిలకు ఘన స్వాగతం పలికారు. స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్ ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసింది. తన ప్రసంగంలో వైఎస్ఆర్, జగన్ పేర్లను ప్రస్తావించిన ప్రతిసారీ ప్రజలు జేజేలు పలికారు. పోటెత్తిన జనం నినాదాలతో హోరెత్తించిన తీరు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బుట్టా రేణుక నందికొట్కూరు మండలంలో బ్రహ్మణకొట్కూరు వద్ద షర్మిలను కలిశారు. పర్యటనలో వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి.. పాణ్యం, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ అసెంబ్లీల అభ్యర్థులు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు హఫీజ్‌ఖాన్, నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, డాక్టర్ నౌమాన్, డాక్టర్ బాబన్, ఎన్.హెచ్ భాస్కరరెడ్డి, ఏవీఆర్ ప్రసాద్.. మాజీ కార్పొరేటర్లు తోట కృష్ణారెడ్డి, పెరుగు పురుషోత్తంరెడ్డి, టూరిజం శాఖ మాజీ డెరైక్టర్ తరిగోపుల భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు రాకేష్‌రెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పతుల కోసం సతుల ప్రచారం
చౌటుప్పల్, న్యూస్‌లైన్,భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా వెంకట్రెడ్డిలను గెలిపించాలని కోరుతూ వారి సతీమణులు కోమటిరెడ్డి లక్ష్మి, పల్లా విజయలు బుధవారం చౌటుప్పల్‌లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇళ్లిల్లూ తిరుగుతూ భువనగిరి ఎంపీకి చెయ్యి, ఎమ్మెల్యేకు కం కికొడవలి గుర్తులకు ఓట్లు వేసి గెలి పించాలని ఓటు వేయాలని అభ్యర్థిం చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముంగి చంద్రకళ, ఉబ్బు వెంకటయ్య, పబ్బు రాజుగౌడ్, చిక్క నర్సింహ్మ, మాదని యాదయ్య, బడుగు మాణిక్యం, బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, తిరుపతి రవీందర్, ముప్పిడి సైదులుగౌడ్, సుర్వి న ర్సింహగౌడ్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట శేఖర్‌రెడ్డి, మారగోని బుచ్చమ్మ, సుగు ణమ్మ పాల్గొన్నారు. సంస్థాన్ నారాయణపురంలో... సంస్థాన్ నారాయణపురం : భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యేగా పల్లా వెంకట్రెడ్డిలను గెలిపించాలని కోరుతూ వారి సతీమణులు కోమటిరెడ్డి లక్ష్మి, పల్లా విజయలు బుధవారం సంస్థాన్ నారాయణపురం, జనగాం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు గడ్డం మురళీధర్‌రెడ్డి, గులాం రసూల్, మంచికంటి జనార్దన్, ముంగి చంద్రకళ, వాంకుడోతు బుజ్జి, బోద్రబోయిన నర్సింహ, ఏపూరి సతీష్, మందుగుల బాలకృష్ణ, ఈసం సోమేశ్వర్, స్వామి, బచ్చనబోయిన గాలయ్య, ఎల్లంకి శ్రీనివాస్, ఎర్ర మల్లేష్, దుబ్బాక భాస్కర్ ఉన్నారు. -
యువతకు ఉపాధి కల్పిస్తా
టీడీపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యో గ అవకాశాలు కల్పిస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి అన్నారు. నల్లగొండ వెంకటసాయి ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం ఐటీ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు. బీడు భూములకు సాగునీరు అందించేందుకు సొరంగ మార్గం, ఎస్ఎల్బీసీ, నక్కలగండి పూర్తి చేస్తానన్నా రు. సూర్యాపేట పాలేరు నుంచి విద్యుత్ కోతలు లేకుండా సోలార్ సిటీగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఏరియా ఆస్పత్రులకు అనుగుణగా మెడికల్ కాలేజీ, కళాశాలలు ఏర్పాటు చేసి వైద్య రంగానికి, విద్యకు పెద్ద పీట వేస్తామన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజల సంక్షేమాన్ని విస్మరించి తన కుటుంబ ఆస్తులను పెంచుకున్నాడని ఆరోపించారు. ఫ్లోరైడ్ గ్రామాలకు తాగునీరు ఇవ్వలేదన్నారు. జానారెడ్డి ఆస్తులపై దర్యాప్తు జానారెడ్డి దోచుకుని ఇతర రాష్ట్రాలు దాచుకోవడంలోనే సీనియార్టీ ఉందని, పవర్ ప్లాంటుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం జానారెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. ఆయా కుటుంబ ఆస్తులపైన సీబీఐ, ఈడీ, ఆర్బీఐ తదితర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. గుత్తా మింగిన కమీషన్లు, అక్రమ ఆస్తులను కక్కిస్తామన్నారు. రాజకీయ అవనీతి లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో నిలబడినట్లు తెలిపారు. జానారెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకు తనపై అనేక అక్రమ కేసులు పెట్టించాడని, తన పరిశ్రమలపై సోదాలు, దాడులు చేయించినా బెదరలేదన్నారు. నరేంద్రమోడీని ప్రధాని కోసం ప్రజలు ఆదరించాలని కో రారు. అనంతరం గ్రామాలకు చెందిన యువకులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలోబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.శ్రీనివాస్‌రెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బోయపల్లి కృష్ణారెడ్డి, కాశీనాథ్, రియాజ్ అలీ, మధుసూదన్‌రెడ్డి, పల్లెబొయిన శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు. -
26న భువనగిరిలో ప్రధాని ప్రచారం
తెలంగాణపై సోనియా ప్రకటన చేసిన చోటే సభ సభను విజయవంతం చేయాలి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు భువనగిరి, న్యూస్‌లైన్, భువనగిరిలో ఈ నెల 26న జరిగే భారత ప్రధాని మన్మోహన్సింగ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం సాయంత్రం భువనగిరి మండలం మోత్కూరు రోడ్డులోని కూనూరు సమీపంలో ప్రధాని సభ జరిగే ప్రాంగణాన్ని ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009లో ఇక్కడే జరిగిన బహిరంగసభలో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానని ఇక్కడే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల ఆకాంక్షను మన్నించి పార్లమెంట్లో బిల్లు ఆమోదింప చేసిన మహోన్నత వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అలాంటి నాయకుడు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వస్తున్న సభకు 3లక్షల మంది జనం హాజరౌతారన్నారు. 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన గొప్ప ప్రధాని మన్మోహన్ అని చెప్పారు. మన్మోహన్ సింగ్ ఇక్కడికి రావడం మన అదృష్టమన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి తరలి రావాలని ప్రజలను కోరారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానికి సభావేదికను ఉద్ధేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సభా ఏర్పాట్లను ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పరిశీలిస్తారని చెప్పారు. గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రధాని సభకు అన్ని రకాల చర్యలను తీసుకుంటానని చెప్పారు. వీరీ వెంట జిలాపరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డినారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, కేశవపట్నం రమేష్, సందెల సుధాకర్, ఉపేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఈర పాక నర్సింహలున్నారు. ప్రధాని సభా స్థలిని పరిశీలించిన ఎస్పీజీ డీఐజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పాల్గొనే బహిరంగ సభాస్థలిని బుధవారం సాయంత్రం ఎస్పీజీ డీఐజీ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌రావు ఉన్నారు. -
జిల్లాకు జగన్
రేపు కోదాడ, హుజూర్‌నగర్‌లలో బహిరంగసభలు ఏర్పాట్లలో పార్టీ నాయకులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 25వ తేదీన జిల్లాకు రానున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో వైఎస్.జగ న్ ప్రసంగిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపారు. కోదాడలో ఉదయం 10 గంటలకు, హుజూర్‌నగర్‌లో 11.30 గంటలకు సభలు జరుగుతాయని చెప్పారు. సభలను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, వైఎస్సార్ అభిమానులకు జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. పార్టీ నేతల్లో ఉత్సాహం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ స్థానం కోసం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే జగన్ సోదరి షర్మిల జిల్లాలో ప్రచారం చేశారు. ఈ నెల 18వ తేదీన ఒకేరోజు హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆమె నిర్వహించిన ప్రచారానికి అనూహ్యంగా స్పందన లభించింది. సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో రెండు నియోజక వర్గాల్లో ఆ పార్టీ అధినేతే స్వయంగా ఎన్నికల ప్రచారానికి రానుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలైంది. హుజూర్నగర్, కోదాడలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న విషయం తెలిసిందే. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపి ఎన్నికల్లో విజయభేరి మోగించాలన్న లక్ష్యంతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు మొగ్గు చూపారు. ఎప్పుడెప్పుడా అని యువనేత కోసం ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. సభలు విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
అభిమాన గోదారి
ఎండ మండిపడే వేళ.. ఎవరైనా చల్లనిమాను నీడన చేరతారే తప్ప- ‘మబ్బు నీడ ఎక్కడా?’ అని ఓరకంట కూడా వెతుక్కోరు. దాహార్తులు చలివేంద్రాన్ని ఆశ్రయిస్తారే తప్ప-ఎండమావి దిక్కుకు అడుగు వేయరు. మనసావాచా కర్మణా తమ క్షేమాన్ని కాంక్షించే వారెవరో, తమ కలలను సాకారం చేయగలవారెవరో ప్రజలకు తెలుసు. విశ్వసనీయత ఏదో, విశ్వాసఘాతుకత్వం ఏదో.. పసిగట్టగల దిట్టలు వారు. అందుకే జిల్లాలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటన దిగ్విజయమైంది. ఆమెపై జనాభిమానం గోదావరి వరదనే చిన్నబుచ్చింది. జననేతపై గురి జేజేలుగా మార్మోగింది. సాక్షి, రాజమండ్రి : పుష్కరాలకు రాజమండ్రి నగరం ఇసుక వేస్తే రాలనంతగా జనంతో కిటకిటలాడిపోతుంది. అలాంటి రాజమండ్రి సహా జిల్లాలో పలు పట్టణాలు, గ్రామాలు.. ‘వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలు అప్పుడే వచ్చేశాయేమో!’ అనిపించేంతగా జనసంద్రాలయ్యాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, జననేత జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడురోజులు జరిపిన పర్యటనవిజయవంతమైంది. ఆమె అడుగిడిన ప్రతి చోటా మహిళలు అడుగడుగునా పూలజల్లులు, హారతులతో ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం తునిలో విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బుధవారం రాజమండ్రి సిటీ నియోజకవర్గంతో పర్యటన ముగించారు. బుధవారం ఉదయం మండపేట నుంచి బయలుదేరిన విజయమ్మ 10.20 గంట లకు అనపర్తి నియోజకవర్గంలోని పెడపర్తికి చేరుకున్నారు. అక్కడ అశేషంగా హాజరైన ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ఫ్యాను గుర్తు కు ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలి పించాల్సిందిగా కోరారు. అనంతరం 12.00 గంటలకు అనపర్తి చేరుకుని దేవీచౌక్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. రాజన్న సువర్ణయుగం జగన్‌బాబుతోనే సాధ్యమని నొక్కిచెప్పారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణరెడ్డిలను గెలిపించాల్సిందిగా కోరారు. 12.30 గంటలకు బయలుదేరి జేగురుపాడు వద్ద ఆడదానిరేవు సమీపంలోని రామదాసు పేపర్‌మిల్స్ వద్ద భోజనానికి ఆగారు. అంతకుముందు విజయమ్మ పర్యటన పెరపర్తి, కుతుకులూరు, రామవరం, పొలమూరు గ్రామాల గుండా సాగింది. రూరల్‌లో ప్రభంజనం.. భోజన విరామానంతరం విజయమ్మ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండల గ్రామాల్లో పర్యటించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్, అసెంబ్లీ అభ్యర్థి ఆకుల వీర్రాజు ఆమెకు ఘన స్వాగతం పలికారు. 4.10 గంటలకు ప్రారంభమైన పర్యటన జేగురుపాడు, మాధవరాయుడుపాలెం సెంటర్, కడియపు సావరం మీదుగా 5.10 గంటలకు కడియం బొబ్బిలిబ్రిడ్జిపైకి చేరుకుంది. ‘మీ కష్టాలు తీరాలంటే జగన్‌ను అధికారంలోకి తీసుకురావా’లని ఓటర్లను అభ్యర్థించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపూ రాష్ట్రానికి రూ.వంద కోట్లు విలువచేసే ప్రాజెక్టు కూడా తేలేక పోయారని ధ్వజమెత్తారు. కేంద్రంలో చక్రం తిప్పానన్న ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. అక్కడినుంచి ప్రారంభమైన యాత్ర 5.55 గంటలకు ధవళేశ్వరం చేరుకుంది. ప్రాణమున్నంత వరకూ పదిలం మీ అభిమానం ధవళేశ్వరం బస్టాండు సెంటర్లో జరిగిన సభలో కిక్కిరిసిన జనం మధ్య విజయమ్మ ప్రసంగిస్తూ ‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ మీ అభిమానాన్ని మర్చిపోలే’నంటూ ఉద్వేగానికి గురయ్యారు. ప్రజల అభిమానాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా నన్నారు. మహానేత రాజశేఖరరెడ్డిలో ఉన్న రాజసం, తెగువ, ధైర్యం జగన్ బాబులో ఉన్నాయని, అక్కున చేర్చుకోవాలంటూ ప్రజల్ని కోరారు. అక్కడినుంచి 6.20 గంటలకు బయలుదేరిన పర్యటన స్వరాజ్‌నగర్, రాజమండ్రి రైల్వేస్టేషన్, కోటిపల్లి బస్టాండు, మెయిన్‌రోడ్, కందకంరోడ్డు, లక్ష్మివారపుపేట, దేవీచౌక్, తుమ్మలావ, ఆర్యాపురం, లింగంపేట, ఆదెమ్మదిబ్బ, కంబాలచెరువు సెంటర్ల మీదుగా ఆజాద్‌చౌక్‌కు చేరుకుంది. అయిదు చేవ్రాళ్లు.. అయిదు వరాలు అంతకు ముందు ఆమెకు కోటిపల్లి బస్టాండు వద్ద పార్టీ కోఆర్డినేటర్, సిటీ నియోజకవర్గ అభ్యర్థి బొమ్మన రాజ్‌కుమార్, ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా తన కోసం వేచి ఉన్న వేలాది మంది ప్రజల అభిమానంతో విజయమ్మ ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆజాద్ చౌక్‌లో సభాస్థలానికి చేరుకున్న వెంటనే మైనార్టీలు, ఇతర వర్గాల ప్రజలు వేలాదిగా ఎదురొచ్చి స్వాగతం పలకడం చూసి విచలితులయ్యారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘రాజశేఖరరెడ్డి లేని లోటు నాకు ఈ జన్మలో తీరేది కాదు. కానీ ప్రజలకు రాజన్నలేని లోటును జగన్‌బాబు తీరుస్తాడు’ అని భరోసా ఇచ్చారు. జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవితాలను మార్చే పథకాలపై ఐదు సంతకాలు చేస్తారని, ఆ రోజునుంచే అవి అమల్లోకి వస్తాయని జగన్ తరపున విజయమ్మ హామీ ఇచ్చారు. పర్యటించిన ప్రతి చోటా ఈ మాట చెపుతున్నప్పుడు సభాప్రాంగణాలు కరతాళ ధ్వనులతో మారుమోగాయి. పార్టీ శ్రేణుల్లో పరవళ్లు తొక్కిన సమరోత్సాహం మూడు రోజులు సాగిన విజయమ్మ పర్యటనతో పార్టీ శ్రేణుల సమరోత్సాహం పదిరెట్లయింది. ఆమె కొన్ని నియోజకవర్గాల్లోనే పర్యటించినా.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచీ నేతలు, కార్యకర్తలు జనభేరి సభలకు పోటెత్తారు. ఆమెకు అడుగడుగునా లభించిన జనాదరణతో అభ్యర్థుల్లో విజయం పట్ల విశ్వాసం ద్విగుణీకృతమైంది. ప్రత్యర్థుల గుండెలలో రైళ్లు పరిగెత్తాయి.