ghmc commissioner
-
సార్‌ను కలవాలంటే సవాలే!
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్‌ను కలవాలి. సర్కిల్, జోన్లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు. .. ఇదీ రెగ్యులర్ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్‌గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్‌ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్పీఎఫ్తో భద్రత.. బహుశా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్‌ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు. మంత్రులు ప్రజలను కలుస్తున్నా.. ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి. రాజకీయ అండ? జీహెచ్ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్‌కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా.. ఈయన ఇలా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
GHMC commissioner: వర్క్ ఫ్రమ్ ఝార్ఖండ్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇలంబర్తి దాదాపు గత పది రోజులుగా నగరంలో లేరు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్ రాష్ట్రంలో ఆయనను ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో అక్కడే ఉన్నారు. అయినా.. ఆయన అక్కడి నుంచే ప్రతిరోజూ జీహెచ్ఎంసీ కార్యక్రమాలు చక్కపెడుతున్నారు. ప్రతిరోజూ అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లు, సందర్భాన్ని బట్టి వెబినార్లు నిర్వహిస్తున్నారు. కుటుంబ సర్వేపైనా ఆరా.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కూడా ఇలంబర్తి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, కంటోన్మెంట్ అధికారులతోనూ చర్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఇంటింటికి స్టిక్కరింగ్ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ, పని త్వరితగతిన జరిగేందుకు అధికారులను పురమాయిస్తున్నారు. ఇన్చార్జ్ ఆఫీసర్లు ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌లోని 30 సర్కిళ్లు, కంటోన్మెంట్ బోర్డు ప్రాంతానికి వెరసి.. 12 మంది ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఇన్చార్జులుగా నియమించారు. అడిషనల్ కమిషనర్లు ఎస్.సరోజ, ఎన్. యాదగిరిరావు, ఎస్.పంకజ, ఎన్. సామ్రాట్ అశోక్, గీతారాధిక, కె.సత్యనారాయణ, చంద్రకాంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సీఎన్.రఘుప్రసాద్, నళినీ పద్మావతి, ఎస్టేట్ ఆఫీసర్ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్‌చంద్రలకు ఆయా సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు. ఫైళ్ల క్లియరెన్స్ సైతం.. జీహెచ్ఎంసీకి సంబంధించి రోజూ పత్రికల్లో వస్తున్న వార్తలపైనా ఇలంబర్తి స్పందిస్తున్నారు. ముఖ్యంగా, ప్రతికూల వార్తలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ పనుల గురించి తెలుసుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులపైనా ఆదేశిస్తున్నారు. జీహెచ్ఎంసీ వాహనాల పెట్రోల్, డీజిల్‌ల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల పరిశీలన సందర్భంగా ప్రైవేటు బంకుల నుంచి కొనాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించినట్లు సమాచారం. డ్యూయల్ రోల్.. సాధారణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సెలవుపై వెళ్లినా, ఇతరత్రా సందర్భాల్లోనూ విధుల్లో లేకుంటే మరో ఉన్నతాధికారిని జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. ఇలంబర్తి అదనపు బాధ్యతలతోనే కమిషనర్‌గా ఉన్నందున, వేరెవరినీ ఇన్చార్జిగా నియమించలేదని సమాచారం. -
గణేష్ శోభాయాత్ర.. భక్తులకు ఆమ్రపాలి విజ్ఞప్తి
-
ఇక బల్దియాపైనే ఆమ్రపాలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఇకనుంచి జీహెచ్ఎంసీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇప్పటి వరకు ఆమెకు జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఎండీగా, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగానూ అదనపు బాధ్యతలున్నాయి. దీంతో పూర్తిస్థాయిలో జీహెచ్ఎంసీపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారనే అభిప్రాయాలున్నాయి. తాజాగా ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ఎంఆర్డీసీఎల్ ఎండీ, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా బాధ్యతల నుంచి రిలీవ్ చేయడంతో రెగ్యులర్ కమిషనర్‌గా ఇక బల్దియాపై పట్టు సాధించనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి దాకా పలు అంశాల్లో కొందరు అధికారులు ఆమ్రపాలిని తప్పుదారి పట్టించారనే ఆరోపణలు వెలువెత్తాయి. ఇటీవల కొన్ని విభాగాల్లో బదిలీలు, శేరిలింగంపల్లి జోన్లో ఇంజినీర్ల కొట్లాటలో ఒక్కరిపైనే చర్యలు, తదితరమైనవి అందుకు ఊతమిచ్చాయి. ఏళ్ల తరబడిగా సీట్లకు అంటుకుపోయిన వారు కదలకపోవడం.. పేరుకు బదిలీ తప్ప కొందరు అదే ప్రాంతంలో కొనసాగుతుండటం వంటివి అందుకు దృష్టాంతాలు. ఇతర విభాగాల బాధ్యతలున్నందున జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల, అన్ని స్థాయిల అధికారులకు తగినంత సమయమిచ్చేందుకు వీలు కాలేదని చెబుతున్నారు. -
ఆమ్రపాలి.. ఆన్ డ్యూటీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి నగరంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లకుంట శంకర్‌మఠ్ సమీపంలో ఆర్ఎఫ్సీ వాహన డ్రైవర్‌తో మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే దారిలో తనకు తారసపడిన ఓ విద్యార్థినితో మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్చ హైదరాబాద్ సాధనకు కృషి చేయాలని ఆ విద్యారి్థనికి చెప్పారు. నారాయణగూడ క్రాస్‌రోడ్స్ దగ్గర నిరి్మంచిన మార్కెట్ గదుల కేటాయింపులు పూర్తిచేయాలని జోనల్ కమిషనర్‌కు సూచించారు. కమిషనర్ వెంట తనిఖీలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు. కాగా ఐఏఎస్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కార్యాలయాలకే పరిమితం కారాదని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించడం తెలిసిందే. సమావేశానికి సిద్ధం కండి ఈ నెల 6న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఆయా విభాగాల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం తన చాంబర్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 4న జరగనున్న స్టాండింగ్ కమిటీ, 6న జరగనున్న సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలన్నారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. -
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లేందుకు సెలవు పొందడంతో ఆయన స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలిని నియమించారు. ఈ నెల 8,9 తేదీలు, తిరిగి 23వ తేదీ సెలవు దినాలను వినియోగించుకునేందుకు అనుమతితో పాటు 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోనాల్డ్ రాస్కు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆమ్రపాలికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వు జారీ చేశారు. -
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్‌పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్‌పాస్‌లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్‌వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్‌పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్‌లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్‌కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్‌పాత్‌పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్‌పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్‌లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
చెరువు రక్షణకు 18 ఏళ్లు సరిపోలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘రామంతాపూర్ చెరువు రక్షణకు సంబంధించి మీరు 2016లో రెవెన్యూ విభాగానికి ఒక లేఖ రాశారు. దాని తర్వాత కూడా గుర్తు చేశారు. ఎప్పుడు లేఖ రాశార న్నది మీకు కచ్చితమైన తేదీ తెలియదు. మరో ఇద్దరు ముగ్గురు బిల్డర్లు చెరువు పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టా లని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి సమాధానా లిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. తీవ్ర అహసనంతో చెబుతు న్నాం.. మీ చట్టబద్ధమైన విధిని నిర్వర్తించనందుకు మీపై చర్య తీసు కోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. ఈ పిటిషన్ 2005 నుంచి పెండింగ్‌లో ఉంది. 18 ఏళ్లు గడిచినా చెరువు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎన్నాళ్లు సమయం కావాలి. మీ పనిని మరొకరిపై నెట్టి తప్పించుకో లేరు. భవిష్యత్ తరాలకు తాగునీటికి సంబంధించిన అంశంలోనూ ఇంత నిర్లక్ష్యమా? ఉన్న జలవనరులను రక్షించు కోలేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు’ అని జీహెచ్ఎంసీ కమిష నర్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రామంతాపూర్ పెద్దచెరువును రియల్టర్లు, అక్ర మార్కులు ఆక్రమించకుండా అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీ కమిష నర్ రొనాల్డ్ రోస్‌ను ప్రశ్నించింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధి కారులకు 2016లోనే లేఖ రాశామని, వివ రాలు ఇంకా అందలేదని ఆయన చెప్పారు. దీంతో జీహెచ్ ఎంసీ కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అసహ నం వ్యక్తం చేసింది. తదు పరి విచారణకు కూడా హాజరు కావా లని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్లో హెచ్ఎండీఏ కమిష నర్ ను ఇంప్లీడ్ చేయాలని రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా వివరాలు అందజేయండి.. హైదరాబాద్‌లో 532 చెరువులు క్షీణిస్తున్నాయని, 26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, ఈ కారణంగా నీటికాలుష్యం పెరిగి దుర్వాసన వ్యాపిస్తోందని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ కెఎల్ వ్యాస్ 2005లో లేఖ రాశారు. చెరువు సమీపంలో చెత్త వేయడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నా యని, తద్వారా వాతావరణం కలుషితమై, దుర్వాసనతో, దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ ప్రదేశంలో చెత్తను వేయకుండా జీహెచ్ఎంసీ అధికారు లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖను హైకోర్టు విచా రణకు స్వీకరించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావా లని గత విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఆదేశించింది. దీనిలో భాగంగా మంగళవారం విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. అయితే ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంపై ప్రభుత్వ న్యాయవాది, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌పై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌లోని వివరాలను కమిషనర్‌కు వివరించడంలో వీరు విఫలమ య్యారని వ్యాఖ్యానించింది. ఇకపై న్యాయవాదులపై అధార పడకుండా, సబ్జెక్టుపై సిద్ధమై కోర్టుకు రావాలని ఆదేశించింది. రామంతాపూర్ పెద్దచెరువుకు కంచె ఎప్పుడు వేస్తారు.. చెత్తరహిత నీటి వనరుగా తీర్చిదిద్దడానికి, నీటి నిల్వ పెరిగేందుకు ఏం చర్యలు తీసుకున్నారు.. ఆక్రమణలను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు.. చెత్తను వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించడం.. చెరువు సరిహద్దులు రూపొందించడం.. మట్టి కోతను అరికట్టేందుకు పరీవాహక ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టడం.. ఎఫ్టీఎల్ నిర్ధారణకు నోటిఫికేషన్ ఇవ్వడం.. వీటన్నింటిపై వివరాలు తెలుసుకుని అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
గడువులోగా ఆ పనులు పూర్తి చేయకుంటే ఉద్యోగం ఊస్టే!
సాక్షి, సిటీబ్యూరో: ఈసారి వర్షాకాలంలో ప్రాణాపాయం వంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు కొత్త కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా వేటు తప్పదని హెచ్చరించడంతో ఆమేరకు చర్యలకూ ప్రభుత్వం వెనుకాడబోదని భావిస్తున్న ఉన్నతాధికారులు.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సంబంధిత అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 5లోగా రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని.. నాలాలు, మ్యాన్‌హోళ్ల వంటి ప్రాంతాలతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌ల మార్గాల్లో సైతం గోతులుండరాదని మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ మెమో జారీ చేసిన నేపథ్యంలో.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రాణాపాయం జరిగితే ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తుందని పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. నాలా సేఫ్టీలో భాగంగా చేపట్టాల్సిన పనులతో పాటు ఇతర ప్రాంతాల్లోని పనుల్ని సైతం వెంటనే పూర్తిచేయాలని, పూర్తయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో బారికేడింగ్స్తో పాటు ఇతరత్రా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారుల టీమ్స్‌కు నాలుగైదు రోజుల క్రితమే సర్క్యులర్లు జారీ చేశారు. సేఫ్టీ ఆడిట్లో భాగంగా పైపైనే చూస్తే సరిపోదని తాము సర్వేచేయాల్సిన ప్రాంతాల్లో అన్ని ప్రదేశాలకూ నడిచి వెళ్లి, క్షేత్రస్థాయి పరిస్థితులు క్షుణ్నంగా పరిశీలించి, రక్షణ ఏర్పాట్లు నూరు శాతం ఉన్నట్లు నిర్ధారించుకొని ధ్రువీకరించాలని పేర్కొన్నారు. ఇవీ బాధ్యతలు.. ►మాన్సూన్ సేఫ్టీ ఆడిట్లో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన బృందాల్లో నియమించిన డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగంలోని ఎస్ఈ, ఈఈలు, డీఈఈలు, ఏఈలు, టౌన్‌ప్లానింగ్ విభాగంలోని సీపీ, జోనల్ ఏసీపీలు, సర్కిల్స్థాయిల్లోని ఏసీపీలు, ఎస్ఓలు, శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఏఎంఓహెచ్‌లు, డిప్యూటీఈఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు కిందివిధంగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ►తాము సర్వే చేయాల్సిన ప్రాంతంలోని ప్రతి రోడ్డు, లేన్, బైలేన్లు, డ్రెయిన్ల వెంబడి నడచుకుంటూ వెళ్లి చూడాలి. వాహనాల్లో అయితే సరిగ్గా తెలియదని నడవాలని పేర్కొన్నారు. గుంతలు, రోడ్కటింగ్లు ఉంటే సంబంధిత ఈఈ దృష్టికి తెచ్చి వెంటనే పూడ్పించాలి. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న అన్ని నాలాలకు ఫెన్సింగ్ ఉండాలి. అంతకంటేతక్కువ వెడల్పున్న నాలాలకు పైకప్పులుండాలి. అన్ని క్యాచ్పిట్లపై మూతలుండాలి. మూతలకు పగుళ్లు ఉండరాదు. అలాంటివాటిని మార్చాలి. ►అన్ని కల్వర్టుల వద్ద రక్షణ కంచెలుండాలి.అవసరమైన అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులుండాలి. ఈ పనులు పూర్తి చేశాక అన్ని ప్రాంతాల్లో నూరు శాతం సేఫ్టీ ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారి, డిప్యూటీ కమిషనర్, ఈఈలు ధ్రువీకరించాలి. నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించే పరిస్థితి లేదని, తీవ్రంగా పరిగణించడంతో పాటు తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని, మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయనున్నట్లు తీవ్రంగా హెచ్చరించారు. -
ఆరు నెలలైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి హిమాయత్‌సాగర్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు వర్షపునీరు ప్రవహించే కాలువలన్నీ కూల్చిన భవనాల వ్యర్థాలు, అక్రమ కట్టడాలతో నిండిపోయాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని లేకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్షం నీరు ప్రవహించే కాలువలన్నీ వ్యర్థపదార్థాలతో పూడుకుపోవడంతో పాటు, అక్రమ నిర్మాణాల వల్ల నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయిందని, కాల్వల్లో నీరు ప్రవహించేలా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. -
జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తన దగ్గరకు జీహెచ్ఎంసీ అధికారులను పంపకపోవడంపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారంటూ దుయ్యబట్టారు. కాగా హైదరాబాద్‌లో వరదల్లో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలను కిషన్ రెడ్డి బుధవారం సందర్శించారు. దోమల గూడలోని అరవింద్, సూరజ్ కాలనీలో పర్యటించి బాదిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటన ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల్లో కేంద్రంమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితులు, ఇబ్బందుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతితో ఫోన్లో మాట్లాడారు. నిత్యావసరాలు,పాలు, ఆహారం పంపిణీ చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కిషన్‌రెడ్డి ముందే బీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు నిలదీశారు. -
షోకాజ్ నోటీస్లోనే తప్పుంటే ఎలా?
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమను మూసేయాలని నోటీసులిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేయొద్దని.. ఎందుకు మూసేయాలో నోటీసుల్లో జీహెచ్ఎంసీ పేర్కొనకపోవడం సరికాదని హైకోర్టు తప్పుపట్టింది. షోకాజ్ నోటీసే చట్ట ప్రకారం లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిం చింది. ఏవిధంగా చట్టాన్ని ఉల్లంఘించిందీ నోటీసుల్లో పేర్కొనకపోతే ఎలా అని నిలదీసిం ది. హైదరాబాద్‌లోని శాస్త్రిపురంలో ఒక పరిశ్రమను మూసివేతకు ఇచ్చిన నోటీసులో పేర్కొ న్న విషయానికి తమ ఎదుట చేస్తున్న వాదనలకు పొంతన లేదని వ్యాఖ్యానించింది. ఈ గందరగోళాన్ని నివృత్తి చేసేందుకు ఈ నెల 15న జరిగే విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరై వివరించాలని ఆదేశించిం ది. శాస్త్రిపురంలోని తన గోదాంను మూసేయాలని జీహెచ్ఎంసీ మార్చి 5న ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ మహమ్మద్ తౌఫీక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. నివాస ప్రాంతాల్లో పరిశ్రమల్ని ఏర్పాటు చేసి చట్టాన్ని ఉల్లంఘించారా లేక మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకించారా.. కాలుష్యానికి కారణం అవ్వడం వల్ల నోటీసు ఇచ్చారా.. ఏ చట్ట ప్రకారం నోటీసు ఇచ్చారో స్వయంగా విచారణకు హాజరై తెలియజేయాలని ఆదేశించింది. నోటీసులోనే తప్పుందని అభిప్రాయపడింది. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే నోటీసు ఇచ్చే అధికారం ఉన్న కమిషనర్ నోటీసు జారీకి ముందు చట్టాలను చదవాలని సూచించింది. మాస్టర్‌ప్లాన్ స్పష్టం చేస్తోంది.. ఇంతకు శాస్త్రిపురం నివాస ప్రాంతమా లేక పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతమా? నిబంధనల ప్రకారం భవనంలో పాత ఇనుము నిల్వ చేయకూడదు కదా.. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా చేయకూడదని తెలియదా..? అని పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నిం చింది. దీనిపై పిటిషనర్ న్యాయవాది పవన్‌కుమార్ అగర్వాల్ స్పందిస్తూ..ట్రేడింగ్ బిజినెస్ మాత్ర మే చేస్తున్నామని జవాబు చెప్పారు. ఇలా చేయకూడదని మాస్టర్ ప్లాన్ స్పష్టం చేస్తోందని, మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా చేయకూడదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్.. కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్లే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల ప్రమాదం జరిగిందని తెలిపారు. లోకేశ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లై ఓవర్‌పైకి మళ్లీ వాహనాలను అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. మరో పదిరోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తెరిచే అవకాశముందని తెలిపారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై హైస్పీడ్‌తో వాహనాలు నడిపిన 540 వాహనాలకు పెనాల్టీలు విధించామని, ఇకనుంచి కూడా పెనాల్టీలు కొనసాగుతాయని తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిందని, ఫ్లై ఓవర్ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని నిపుణులు తమ నివేదికలో తేల్చారని వివరించారు. హైస్పీడ్ కారణంగానే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల ప్రమాదం జరిగిందని నిపుణులు నిర్ధారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరమైతే శని, ఆదివారాల్లో ఈ ఫ్లైఓవర్‌ను పోలీసులతో చర్చించి మూసివేస్తామని తెలిపారు. చదవండి: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై దిద్దుబాటు చర్యలు బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరం -
త్వరలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు ప్రారంభం : జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రోడ్డు ప్రైవేటీకరణ పనులు త్వరలో ప్రారంభం కానునట్లు జీహెజ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 10నుంచి 709 కి. మీ మేరకు పనులు మొదలు పెడతామన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను జనవరిలో ప్రారంభిస్తామన్నారు. ఫిబ్రవరి వరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించే విధంగా పనులు చేపడుతున్నట్లు, దాదాపు తొమ్మిది వేల వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యామన్నాయ రోడ్ల కోసం భూసేకరణ చేస్తున్నామన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఓపెన్ స్పేస్‌లలో పార్క్‌లను అభివృద్ధి చేస్తామని, మీడియన్.. జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి జోన్లో స్కైవాక్ నిర్మించాలన్నారు. రోడ్డు మరమత్తు పనులు పూర్తి అవుతున్నాయని, చెత్త సేకరణ కోసం 60 ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్ల వెల్లడించారు. సీ అండ్ డీ వేస్ట్ పరిశ్రయ త్వరలోనే మొదలు కానుందని, వీటిని కంపోస్ట్ అలాగే కరెంట్ ఉత్పాదన కోసం ఉపయోగిస్తామన్నారు. మూడు నెలల్లో 284 పనులకు అనుమతులిచ్చామని, వీడీసీసీ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. -
‘తెలంగాణలో 2400 డెంగ్యూ కేసులు నమోదు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రెండు మూడు వారాలుగా యాంటీ లార్వా ఆపరేషన్స్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలను ఎప్పటికపుడు వెబ్సైట్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 2400 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, హైదరాబాద్ లో 845 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 86 వేల ఇళ్లలో స్ర్పే చేయించామని, పాఠశాలలను శుభ్రం చేసే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లో 410 అధిక ప్రమాదం గల ఏరియాలు ఉన్నాయని, డిసెంబర్ వరకు దోమల నివారణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారంలో రెండు రోజులు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేస్తున్నామని వెల్లడించారు. దోమల నియంత్రణ కోసం 1040 మిషన్లు ఉన్నాయన్నారు. అసలు దోమలు ఎపుడు ప్రభావంగా ఉంటున్నాయన్న అంశంపై పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం విష జ్వరాల ప్రభావం తగ్గిందని కమిషనర్ తెలిపారు. -
బాస్ సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమాలు, నగరంలో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ సీరియస్ అయ్యారు. అక్రమ నిర్మాణం జరుగుతుందని తెలిసినప్పటికీ ఎందుకు అడ్డుకోవడంలేదని టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులను ప్రశ్నించారు. పిల్లర్లు వేశాక శ్లాబ్ వేసేందుకు ఎంతో సమయం పడుతుందని, ఆలోగా ఎందుకు నిలువరించలేకపోతున్నారని నిలదీశారు. నిర్మాణం మొత్తం పూర్తయ్యేంతదాకా చోద్యం చూస్తూ మొక్కుబడి తంతుగా నోటీసులిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల వేళ.. అక్రమాల లీల’ శీర్షికతో ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన అక్రమ నిర్మాణాలపై ఆయన స్పందించారు. గురువారం టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ సర్కిల్లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోవడాన్ని ప్రస్తావించారు. సంబంధిత సెక్షన్ ఆఫీసర్ కోర్టు పనులంటూ చెప్పడంతో ‘రోజంతా కోర్టులోనే ఉంటారా?’ అంటూ దానకిశోర్ ప్రశ్నించారు. అదనపు అంతస్తుకు పిల్లర్లు వేశాక శ్లాబ్ పూర్తయ్యేలోపునే అడ్డుకోనందుకు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయవద్దంటూ ప్రశ్నించారు. తొలి సమావేశం కావడంతో ప్రస్తుతానికి మెమో జారీ చేయాల్సిందిగా సీసీపీకి సూచించారు. ఇకపై ఎవరు నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని, అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ విభాగానిదేనని స్పష్టం చేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచే తనకు అత్యధిక ఫిర్యాదుల వస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. రోజుకు తనకు 30 ఫిర్యాదులు అందితే, వాటిలో 27 టౌన్‌ప్లానింగ్‌వే నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అక్రమ నిర్మాణాలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు చేయాల్సిందే.. భవననిర్మాణ అనుమతులు జారీ కాగానే, నిర్ణీత వ్యవధుల్లోగా తనిఖీలు చేసేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని, తనిఖీలకు ఎప్పుడు వెళ్లాలనేది కూడా ఆన్లైన్లోనే ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా తగిన ఏర్పాట్లు చేయాలని దానకిశోర్ సిబ్బందికి సూచించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసుల జారీని కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. తద్వారా ఎప్పుడు నోటీసులిచ్చారు.. తదుపరి ఏం చర్యలు తీసుకున్నారు.. అనే విషయాలు తెలుస్తాయన్నారు. మార్టిగేజ్ నిబంధనల్లేని 200 చ.మీ. లోపు నిర్మాణాల్లోనే అదనపు అంతస్తులు ఎక్కువగా వెలుస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకొని వాటిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. ఎన్నికల తరుణాన్ని ఆసరా చేసుకొని అక్రమనిర్మాణాలు జరుగకుండా తనిఖీ చేపట్టాలని, కూల్చివేతలకు వెనుకాడవద్దని స్పష్టం ఆయన చేశారు. అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ అస్త్రం ఇప్పటికే జరిగిన అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తుల వివరాలను ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగానికి అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో కలిసి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అక్రమ నిర్మాణాలను తొలగిస్తాయని పేర్కొన్నారు. అయితే నిరుపేదలు, చిరు వ్యాపారుల జోలికి పోవద్దని స్పష్టం చేశారు. కొంతమంది టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వల్లే సిటీలో అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని పత్రికల్లో వస్తుండటాన్ని ప్రస్తావించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సర్కిళ్ల వారీగా ఎన్ని అక్రమ నిర్మాణాలు, డీవియేషన్లు ఉన్నాయో, ఎన్నింటికి నోటీసులు జారీచేశారో, కోర్టు కేసులెన్ని ఉన్నాయో వివరాలను ఏరోజుకారోజు నమోదు చేసేందుకు సాఫ్ట్వేర్ రూపొందించి, ప్రతిరోజూ ఈ సమాచారం పొందుపరచాలన్నారు. సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్లు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయాలు ఓకే.. అమలు సంగతి? అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాలని దాదాపు ఏడాది క్రితమే నిర్ణయించారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు కూల్చివేసేందుకు సర్కిల్, జోన్ల స్థాయిలో టౌన్‌ప్లానింగ్, విజిలెన్స్, తదితర విభాగాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ అమలుకు నోచుకోలేదు. -
స్మార్ట్ పాలన... ‘బిగ్’ ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ రాష్ట్రానికి గుండెలాంటి హైదరాబాద్‌ను ఇక్కడ సమృ ద్ధిగా ఉన్న వనరులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి, పారదర్శక సేవలకు అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తా. అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో ఉన్న బిగ్ డేటా అనలిటిక్స్‌తో సమస్య ఎక్కడ ఉందో సులభంగా గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా..’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అన్నారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న, వలసలతో పెరిగిపోతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు క్షేత్రస్థాయిలో తక్షణ సేవలందేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారంలో అవినీతికి అస్కారం లేకుండా చూడటం ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహ్లాదంగా.. ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తనముందున్న పెద్దప్రాజెక్టులు కాగా, చెరువుల సుందరీకరణ, ప్లేగ్రౌండ్స్, పార్కుల్ని ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దడంపై శ్రద్ధ వహిస్తానన్నారు. రహదారులపై గుంతల సమస్యపైనా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఎంపిక చేసిన 23 చెరువుల సుందరీకరణకు ముంబైకి చెందిన కన్సల్టెంట్ నివేదిక అందాక పనులు చేపడతామన్నారు. టాయ్లెట్ల నిర్వహణలో సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాల్లో జాతీయస్థాయితో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ, మరింత మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. చెత్తను తడిపొడిగా వేరు చేయడం జాతీయస్థాయిలో దాదాపు 25 శాతం మాత్రమే ఉండగా, నగరంలో 50 శాతం ఉందన్నారు. ఈ–వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు, వరదకాలువలపై శ్రద్ధ చూపుతానని చెప్పారు. సహకరించే పాలకవర్గం, అనుభవజ్ఞులైన అధికారులు, యువ ఐఏఎస్‌ల సమన్వయం, సహకారాలతో తగిన ప్రణాళికతో మెరుగైన ఫలితాలు సాధించగలనన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ‘ప్రజావాణి’ ‘మైజీహెచ్ఎంసీ’ యాప్, తదితరమైన వాటిని మెరుగు పరుస్తానన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా అందే ప్రజాసేవల్లో గడచిన నాలుగేళ్లలో ఎంతో మార్పు వచ్చినప్పటికీ,మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తానన్నారు. గత కమిషనర్ జ నార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తానని దానకిశోర్ పేర్కొన్నారు. థర్డ్‌పార్టీ ఫీడ్‌బ్యాక్.. వాటర్‌బోర్డులో మాదిరిగా సమస్య పరిష్కారమైందీ లేనిదీ, థర్డ్‌పార్టీ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామన్నారు. చదివే అలవాటు పెంచేందుకు కాఫీషాప్స్లో బుక్స్ ఏర్పాటుపై దృష్టిసారిస్తానని పేర్కొన్నారు. చెత్త సమస్యలు తీవ్రం.. ప్రతి నగరానికీ చెత్త సమస్య తీవ్రంగా ఉందంటూ, ప్రస్తుతం ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 500 గ్రాముల చెత్త వెలువరిస్తుండగా, భవిష్యత్‌లో ఇది 1500 గ్రాములకు పెరగనుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎక్కడికక్కడ ఖాళీ ప్రదేశాల్లో చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తామన్నారు. -
అండాలమ్మా.. బాగున్నావా
సాక్షి, హైదరాబాద్: అది సచివాలయం సమీపంలోని అన్మోల్ హోటల్. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలి వద్ద సడన్‌గా ఇన్నోవా కారు ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు అధికారులు ఆమె పేరు, వివరాలు తెలుసుకున్నారు. నెలనెలా జీతం అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. ఆమెకు జీవిత భీమా సదుపాయం ఉందో లేదో తెలుసుకున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నదీ లేనిదీ అడిగారు. తన పేరు అండాలమ్మ అని, ప్రతినెలా వేతనం సక్రమంగా అందుతోందని తెలిపిన ఆమె, ప్రతిరోజూ బయెమెట్రిక్ హాజరు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇంతకీ తామెవరో తెలుసా? అంటే తెలియదని సమాధానం ఇచ్చింది. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌నని, ఈమె ఆరోగ్యవిభాగం అదనపు కమిషనర్ శృతిఓజా అని బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. దాంతో ఆమెకు నోట మాటరాలేదు. ఆశ్యర్యం వ్యక్తం చేసింది. కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్థాయిలోని ఉన్నతాధికారులు తనతో మాట్లాడటం ఇదే మొదటిసారి అని, తన యోగక్షేమాలు తెలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేసింది. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ‘పీఎం ఎక్సలెన్సీ’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలనా విభాగంలో కేంద్రం అందజేసే ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రదానం చేశారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అత్యున్నత ఫలితాలు సాధించిన 13 మంది ఐఏఎస్ అధికారులకు అవార్డులను అందజేశారు. దక్షిణ భారత దేశం మొత్తంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఈ అవార్డులు లభించగా, ఆ ఇద్దరూ తెలంగాణకు చెందినవారే కావడం విశేషం. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కార్యక్రమం కింద జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని సమర్థవంతంగా చేపట్టినందుకు గుర్తింపుగా జనార్దన్‌రెడ్డిని ఈ అవార్డు వరించింది. కార్యక్రమానికి జనార్దన్‌రెడ్డి సతీమణి సులోచన, కుమారుడు రాహుల్ కూడా హాజరయ్యారు. అవార్డుల బహూకరణకు ముందు హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ, లబ్ధిదారుల వివరాలతో కూడిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల విజయగాథలతో ప్రచురించిన ప్రత్యేక సావనీర్లో జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విజయప్రస్థానంపై ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించారు. స్వచ్ఛ నమస్కారానికి ప్రధాని అభినందన ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించేందుకు వేదికపైకి వెళ్లిన జనార్దన్‌రెడ్డి ప్రధానమంత్రిని ఉద్దేశించి ‘స్వచ్ఛ నమస్కారం’అంటూ అభివాదం చేశారు. స్వచ్ఛభారత్ స్పూర్తిని కలిగించేలా ఉన్న ఆ సంబోధన ప్రధానిని ఆకట్టుకుంది. దీంతో జనార్దన్‌రెడ్డిని మోదీ అభినందించారు. గురుశిష్యులకు అవార్డులు.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు పీఎం ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. జనార్దన్‌రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో సర్ఫరాజ్ అహ్మద్ శిక్షణ ఐఏఎస్ అధికారిగా విధుల్లో చేరారు. జనార్దన్‌రెడ్డి వద్ద శిక్షణ పొందిన సర్ఫరాజ్‌కు కూడా ఈ అవార్డు దక్కడంతో వీరిద్దరి అనుబంధాన్ని పలువురు అధికారులు ప్రస్తావించారు. మరింత ఉత్సాహం.. మరింత శక్తి: జనార్దన్‌రెడ్డి పైస్థాయి నుంచి అందే ఇలాంటి వాటివల్ల మరింత శక్తిసామర్థ్యాలతో సంతోషంగా పనిచేసే వీలు కలుగుతుంది. సివిల్ సర్వీసెస్ ఉండాల్సిందేనని చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్, అవార్డు అందజేయడం ద్వారా నూతనోత్తేజాన్ని కలిగించిన ప్రధాని నరేంద్రమోదీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హెచ్చార్సీ నోటీసులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ పరిధి కామాక్షి పురంలో వీధికుక్కల దాడిలో పిల్లలు తీవ్రంగా గాయపడిన విషయంపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. గాయపడిన విషయాన్ని బాలల హక్కుల సంఘం హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్‌కి నోటీసులు జారీ చేస్తూ ఈ ఘటన పై జూన్ 19 లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌తో సాక్షి టీవీ ఫోన్ ఇన్
-
కుక్కలకూ కావాలొక ‘శ్రీమంతుడు’
నగరంలో వీధి కుక్కల దత్తత.. దేశంలోనే తొలిసారి సాక్షి, హైదరాబాద్: దత్తత కాన్సెప్టు ఇప్పుడు వీధి కుక్కల వరకూ చేరింది. వీధి కుక్కల బెడదను నివారించేందుకు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ మహానగరంలో ‘వీధి కుక్కల దత్తత’అనే వినూత్న కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఆదివారం నార్త్‌జోన్‌లో ‘స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్’కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. తొలిరోజు ఐదు కుక్కపిల్లలను జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. దత్తత ద్వారా వీధికుక్కల నియంత్రణకు మార్గం లభిస్తుందని బల్దియా భావిస్తోంది. మహానగరం పరిధిలో ప్రస్తుతం ఆరు లక్షల వీధికుక్కలు ఉన్నాయి. వీటిలో ఒక లక్ష కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలో ఉన్న వీధికుక్కలకు రేబిస్ నిరోధక టీకాలతోపాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నా, నగర శివార్లలోని గ్రామాలు, పట్టణాలలో ఈ విధమైన పద్ధతి లేనందున అక్కడి వీధికుక్కల సమస్య జీహెచ్ఎంసీకి తలనొప్పిగా తయారైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదివారం అడిషనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ వెటర్నరీ అధికారి వెంకటేశ్వరరెడ్డి, ఇతర వెటర్నరీ అధికారులతో సమావేశమై వీధి కుక్కల దత్తతపై చర్చించారు. దత్తతపై అవగాహన దత్తతపై స్వచ్ఛంద సంస్థలకు, జంతు ప్రేమికులకు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న కుక్కపిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, అవసరమైన వైద్య చికిత్సలను తామే చేపడతామని బల్దియా వెటర్నరీ అధికారులు భరోసా ఇస్తున్నారు. రెండు రోజులక్రితం నార్త్ జోన్ పరిధిలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు 20 మందికిపైగా స్వచ్ఛంద సంస్థల, జంతు ప్రేమికుల సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వీధికుక్కలను దత్తత తీసుకునేవారు స్థానిక జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులను సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జంతు ప్రేమికులకు సూచించారు. -
‘ఫైన్ సిటీ’లక్ష్యం
జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ప్రశ్న : ఈ ఉగాది లక్ష్యం..? కమిషనర్: వచ్చే ఉగాది నాటికి 20 లక్షల కుటుంబాల నుంచి ఇంటివద్దే చెత్త నూరు శాతం వేరు కావడం లక్ష్యం. మొత్తం చెత్తలో 30 శాతం పొడి చెత్త వల్ల (ప్లాస్టిక్ తదితర) ఎలాంటి దుర్వాసన రాదు. ఇంటివద్దనే దాన్ని వేరు చేయడం వల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. గోద్రెజ్, ఐటీసీ వంటి సంస్థలు వీటిని రీసైక్లింగ్ చేస్తాయి. వీటిని వేరుచేసే చెత్త కార్మికులకు నెలకు అదనంగా రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆదాయం పెరుగుతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, స్వచ్ఛ భారత్ లక్ష్యాల మేరకు ఈ కార్యక్రమాల్ని అందరి కంటే ముందే ప్రారంభించాం. ఉద్యమ రూపంలో ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నూరు శాతం చేయడం అంటే వాషింగ్టన్, బెర్లిన్, పారిస్ వంటి నగరాల సరసన చేరడమే. అతిశయోక్తిగా అనిపించినా ఇది వాస్తవం. ప్రశ్న: పారిశుధ్య కార్యక్రమాల అమలులో భాగంగా సింగపూర్ తరహాలో ఫైన్లు వేస్తారా..? కమిషనర్: ఫైన్లు వేయడం కంటే ‘ఫైన్ సిటీ’గా తీర్చిదిద్దడం లక్ష్యం.అన్నీ తెలిసిన విద్యాధికులే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుండటం, సామాజిక స్పృహ లేకపోవడం దౌర్భాగ్యం. తొలుతే ఫైన్లు వేయకుండా తగిన కౌన్సిలింగ్స్ నిర్వహిస్తాం. అప్పటికీ మారకపోతే డ్రంకెన్ డ్రైవ్ మాదిరిగా చలానా వేసే యోచన ఉంది. ప్రశ్న: దుకాణదారులపై ఎలాంటి చర్యలు చేపడతారు ? కమిషనర్: రోడ్లపై చెత్తవేయడమే కాక ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వ్యాపారులకు పోలీసుల సహకారంతో జరిమానాలు విధిస్తాం. జరిమానాలకు వెరవకుండా మళ్లీమళ్లీ పాల్పడితే క్రిమినల్ చర్యలు చేపడతాం. ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాం. 210 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 90 మందికి జైలు శిక్షలు పడ్డాయి. ప్రశ్న: బహిరంగ మూత్ర విసర్జన చేసేవారికి ఎలాంటి జరిమానా వేస్తున్నారు?! కమిషనర్: గడచిన 60 ఏళ్లలో నగరంలో 500 ప్రదేశాల్లో మాత్రమే పబ్లిక్ టాయ్లెట్లు ఉండగా, కేవలం మూడు నెలల్లోనే 323 పెట్రోలు బంకుల్లోని టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునే అవకాశం కల్పించాం. ఆమేరకు వారు బోర్డులు కూడా పెట్టారు. హోటళ్లలోని టాయ్లెట్లనూ ప్రజలు వినియోగించుకునేందుకు హోటళ్ల యాజమాన్యాలతో చర్చిస్తున్నాం. దీన్నో ఉద్యమంగా చేపడతాం. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో తగిన నిర్వహణతో ఉండేలా పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోగా వీటన్నింటినీ పూర్తిచేస్తాం. -
భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష
హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల నిమిత్తం నగరంలో 220 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. నీట మునిగిన కాలనీలు, బస్తీల్లో భోజన వసతి ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. పైప్‌లైన్ పగలడం వల్లే ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డుపై గుంత ఏర్పడినట్లు ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్‌ను ఎవరూ తెరవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామన్నారు. అలాగే పురాతన భవనాల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కేసీఆర్ ఫోన్
హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కేసీఆర్ ఫోన్ చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో, నాలాల వెంట ప్రమాదాలను నివారించేందుకు ముందుజాగ్రత్తగా తగిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.