gst council meet
-
బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదా
బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్న పాలసీదారుల ఆశలపై మంత్రుల బృందం నీరు చల్లింది. శనివారం జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే ఈ అంశంపై ఆర్థిక మంత్రుల బృందం చర్చించింది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ నిర్ణయం వాయిదా పడినట్లు మండలి తెలిపింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మరింత పరిశీలన అవసరమని మండలి భావించినట్లు తెలిసింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇందులో పలు వస్తువులపై జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల్లో మార్పులు వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలనేలా గతంలో మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్‌లో సమావేశమై చర్చించింది. దాంతో పాలసీదారులకు ప్రీమియం తగ్గే అవకాశం ఉందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ 55వ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.ఇదీ చదవండి: ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టుఎవరు హాజరయ్యారంటే..కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, గోవా, హరియాణా, జమ్ము కశ్మీర్, మేఘాలయ, ఒడిశా ముఖ్యమంత్రులు, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ శాఖ కార్యదర్శులు, సీబీఐసీ ఛైర్మన్లు, సభ్యులు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న తుది నిర్ణయాలు ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. -
బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?
జైసల్మేర్: జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను భారం తొలగించాలన్న కీలక డిమాండ్‌పై జీఎస్టీ కౌన్సిల్ ఈ రోజు భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఖరీదైన చేతి గడియారాలు, పాదరక్షలు, వస్త్రాలపై పన్ను పెంపు, కొన్ని రకాల ఉత్పత్తులపై 35 శాతం ప్రత్యేక సిన్ (హానికారక) ట్యాక్స్‌పైనా చర్చించనున్నట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరగనుంది. కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొననున్నారు.148 ఉత్పత్తుల పన్ను రేట్ల క్రమబద్దీకరణపై జీవోఎం నివేదిక కూడా కౌన్సిల్ అజెండాలో ముఖ్యాంశంగా ఉంటుందని తెలుస్తోంది. విమానయాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జొమాటో, స్విగ్గీపై 18 శాతం పన్ను (ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో) ఉండగా, ఇన్పుట్ ట్యాక్స్ ప్రయోజనం లేకుండా 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన సైతం ఉంది. వినియోగించిన ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), చిన్న పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్ను రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలంటూ ఫిట్మెంట్ కమిటీ కౌన్సిల్‌కు నివేదించనున్నట్టు తెలిసింది. ప్రధాన అంశాలు ఇవే..టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా మినహాయించేందుకు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం నవంబర్లోనే అంగీకారం తెలిపింది.రూ.5 లక్షల సమ్ అష్యూరెన్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పూర్తి పన్ను మినహాయింపునకు సైతం అంగీకరించింది. ఇందుకు సంబంధించి జీవోఎం ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది.రూ.5 లక్షలకు మించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను రేటులో ఎలాంటి ఉపశమనం ఉండదని తెలుస్తోంది.ఎయిరేటెడ్ బెవరేజెస్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్ను రేటును 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని జీవోఎం ఇప్పటికే తన సిఫారసులను సమర్పించడం గమనార్హం.గేమింగ్ డిపాజిట్లపై కాకుండా ప్లాట్‌ఫామ్ ఫీజులపైనే 28 శాతం జీఎస్టీ విధించాలని స్కిల్ ఆన్లైన్ గేమ్స్ ఇనిస్టిట్యూట్ (ఎస్వోజీఐ) డిమాండ్ చేసింది. తద్వారా ఆఫ్‌షోర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు పన్ను ఆర్బిట్రేజ్ ప్రయోజనం పొందకుండా అడ్డుకున్నట్టు అవుతుందని ప్రభుత్వానికి సూచించింది.ఉపాధి కల్పన, జీడీపీలో కీలక పాత్ర పోషించే గేమింగ్ పరిశ్రమ పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరింది.ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, క్యాసినోల్లో గేమర్లు చేసే డిపాజిట్లపై పన్ను రేటు 18 శాతం ఉండగా, 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతానికి పెంచడం గమనార్హం.ఇదీ చదవండి: పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?అదనపు ఫ్లోర్ స్పేస్‌పై జీఎస్టీ వద్దు: క్రెడాయ్ అదనపు ఫ్లోర్ స్పేస్ (విస్తీర్ణం) కోసం చెల్లించే ఛార్జీలపై జీఎస్టీ విధించొద్దంటూ ప్రభుత్వాన్ని క్రెడాయ్ కోరింది. డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖకు రియల్టర్ల మండలి క్రెడాయ్ ఒక లేఖ రాసింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)/ అదనపు ఎఫ్ఎస్ఐ కోసం స్థానిక అధికారులకు చెల్లించిన ఛార్జీలపై 18 శాతం జీఎస్టీని విధించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించాలని కోరింది. ఈ ఛార్జీ విధింపు నిర్మాణ వ్యయాలను పెంచేస్తుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 10 శాతం వరకు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు వ్యయాల్లో ఎఫ్ఎస్ఐ/అదనపు ఎఫ్ఎస్ఐ అధిక వాటా కలిగి ఉన్నట్టు క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. ప్రతిపాదిత జీఎస్టీ విధింపు ఇళ్ల సరఫరా, డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. -
జీఎస్టీ మినహాయింపు వీటిపైనే?
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారి పన్ను రేట్లలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ఈనెల 21న జరిగే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో నిర్వహిస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ సమావేశంలో తీసుకుబోయే నిర్ణయాలు కింది విధంగా ఉంటాయని ఊహాగానాలు వస్తున్నాయి.మినహాయింపులు..జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లను తగ్గించే ప్రతిపాదనలున్నాయి.సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ.5 లక్షల వరకు కవర్ చేసే పాలసీలకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.రూ.5 లక్షల కంటే ఎక్కువ కవరేజీ ఉన్న పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ కొనసాగిస్తారని అంచనా.మార్పులు..జీఎస్టీ హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం విలాసవంతమైన వస్తువులు, సిన్ గూడ్స్ (అత్యంత ఖరీదైన దిగుమతి చేసుకునే వస్తువులు)పై పన్ను పెంచుతారు.చేతి గడియారాల ధర రూ.25,000 ఉంటే జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూస్‌పై జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.రూ.1,500 వరకు ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 5% జీఎస్టీ.రూ.1,500-రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18% జీఎస్టీ.రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 28% జీఎస్టీ.కొన్ని పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీను కొత్తగా 35% స్లాబ్‌లోకి తీసుకురాబోతున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..పన్ను తగ్గింపు..ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (20 లీటర్లు, అంతకంటే ఎక్కువ)పై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింపు.రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింపు.నోట్‌బుక్‌లపై 12% నుంచి 5%కి తగ్గింపు. -
జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చ
జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల శ్లాబుల క్రమబద్ధీకరణ, రేట్ల తగ్గింపుపై మంత్రుల బృందం ఈ నెల 25న భేటీ కానుంది. గోవాలో మంత్రుల బృందం సమావేశం అవుతున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం (జీవోఎం) చివరిసారి ఆగస్టు 22న సమావేశం కాగా, ఈ నెల 9న జీఎస్టీ కౌన్సిల్‌కు ఈ అంశంపై స్థాయీ నివేదిక సమర్పించింది.కొన్ని రకాల వస్తు, సేవల పన్ను రేట్లలో మార్పులు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాలపై పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ నుంచి మంత్రుల బృందం నివేదిక కోరడం గమనార్హం. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులను తక్కువ శ్లాబులో, విలాస వస్తువులను అధిక శ్లాబులో ఉంచారు. 12 శాతం, 18 శాతం స్థానంలో ఒక్కటే పన్ను ఉండాలన్న ప్రతిపాదన ఉంది. పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు శ్లాబులను కుదించడం పట్ల సానుకూలంగా లేవు. జీఎస్టీ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండొద్దన్నది ఈ రాష్ట్రాల వాదనగా ఉంది. ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్! -
49th GST Council Meeting: జీఎస్టీ ఫైలింగ్ ఆలస్య రుసుము తగ్గింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్ ఆలస్య రుసుమును హేతుబద్ధీకరిస్తూ జీఎస్టీ మండలి 49వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను నమోదిత వ్యక్తులు ఫామ్ జీఎస్టీఆర్–9కు సంబంధించి రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉంటే ఆలస్య రుసుము రోజుకు రూ.50, రూ.5–20 కోట్ల టర్నోవర్ ఉంటే రోజుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రుసుము రూ.200 ఉంది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి ఫామ్ జీఎస్టీఆర్–4, ఫామ్ జీఎస్టీఆర్–9, ఫామ్ జీఎస్టీఆర్–10లో పెండింగ్‌లో ఉన్న రిటర్నులకు సంబంధించి షరతులతో కూడిన మినహాయింపు లేదా ఆలస్య రుసుము తగ్గించడం ద్వారా క్షమాభిక్ష పథకాలను జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు పరిహార బకాయిలు.. 2022 జూన్‌కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలు రూ.16,982 కోట్లు, అలాగే ఆరు రాష్ట్రాలకు మరో రూ.16,524 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. కేంద్రం తన సొంత వనరుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకుందని, భవిష్యత్తులో పరిహార రుసుము వసూళ్ల నుంచి ఈ మొత్తాన్ని తిరిగి పొందుతామని ఆమె చెప్పారు. దీంతో జీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఐదేళ్ల కాలానికి తాత్కాలికంగా అనుమతించదగిన మొత్తం పరిహార బకాయిలను కేంద్రం క్లియర్ చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది. రాష్ట్రాలు వారి అకౌంటెంట్ జనరల్ నుంచి సర్టిఫికేట్లను ఇచ్చినప్పుడు పెండింగ్‌లో ఉన్న ఏవైనా పరిహార రుసుము మొత్తాలను వెంటనే క్లియర్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిహార బకాయి కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు సమకూరనున్నాయి. బెల్లం పానకంపై తగ్గింపు.. ఇక విడిగా విక్రయించే బెల్లం పానకంపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ప్యాక్, లేబులింగ్ చేసి బెల్లం పానకం విక్రయిస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెన్సిల్ షార్ప్నర్స్కు 18 శాతం నుంచి జీఎస్టీని 12 శాతానికి చేర్చారు. పన్ను ఎగవేతలను ఆరికట్టడంతోపాటు పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు వంటి వస్తువుల నుండి ఆదాయ సేకరణను మెరుగుపరచడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫార్సులను జీఎస్టీ మండలి ఆమోదించింది. -
క్యాసినోలు,ఆన్లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీ?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనపై ఈ వారంలో సమావేశమయ్యే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించనుంది. చండీగఢ్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో జీఎస్ట్ కౌన్సిల్ భేటీ కానుంది. ఆన్లైన్ గేమింగ్‌ను యూజ ర్ చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై పన్ను విధించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కోనార్డ్సంగ్మ అధ్యక్షతన మంత్రుల గ్రూపు సిఫా రసు చేసింది. రేస్ కోర్స్‌లకు బెట్టింగ్ పూర్తి విలువపై విధించాలని సూచించింది. అదే క్యాసినోలు అయితే ఆడేవారు కొనుగోలు చేసే చిప్స్/కాయిన్స్ విలువపై విధించాలని సిఫారసు చేసింది. ఇలా అన్ని రకాల ఫీజులు, చార్జీలు, పందెం విలువపై 28 శాతం జీఎస్టీ రేటును మంత్రుల గ్రూపు సిఫారసు చేయడం గమనార్హం. ఆహారం, పానీయాలపైనా ఇదే పన్ను రేటు వర్తించనుంది. అంటే స్థూల విలువపై పన్ను ఉండాలన్నది మంత్రుల గ్రూపు ప్రతిపాదన. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 18% జీఎస్టీ అమలవుతోంది. కానీ, పరిశ్రమ మాత్రం పన్ను పెంపును వ్యతిరేకిస్తోంది. -
జీఎస్టీలో 5 శాతం రేటుకు మంగళం?
న్యూఢిల్లీ: పరిహారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా, జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణతో ఆదాయం పెంచుకునే ఆలోచనతో రాష్ట్రాలు ఉన్నాయి. జీఎస్టీలో 5 శాతం రేటును ఎత్తివేసి.. అందులో ఉన్న వస్తు, సేవలను 3, 8 శాతం శ్లాబుల్లోకి మార్చేసే ప్రతిపాదనపై వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్న వాటిని 3 శాతం రేటులోకి, మిగిలిన వాటిని 8 శాతం రేటులోకి మార్చనున్నారు. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం రేట్ల విధానం అమల్లో ఉంది. దీనికి అదనంగా బంగారం, బంగారం ఆభరణాలపై 3 శాతం పన్ను రేటు విధిస్తున్నారు. బ్రాండెడ్ కాని, ప్యాక్ చేయని ఉత్పత్తులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తోంది. ఇలా మినహాయింపు జాబితాలోని వస్తు, సేవలను తగ్గించేయాలన్నది జీఎస్టీ కౌన్సిల్ యోచన. కొన్ని ఆహారేతర ఉత్పత్తులను 3 శాతం పరిధిలోకి చేర్చే ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రితోపాటు.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండడం తెలిసిందే. 5 శాతం పన్ను పరిధిలో ఎక్కువగా ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులు ఉన్నాయి. ఈ రేటును ఒక శాతం పెంచినా రూ.50వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా -
జీఎస్టీ శ్లాబ్ రేట్లలో మార్పులు?
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 31న భేటీ కానుంది. పలు వస్తు, సేవల రేట్ల కమ్రబద్ధీకరణపై సమావేశం చర్చించనుంది. భౌతికంగా ఈ సమావేశం జరగనుంది. పలు ఉత్పత్తుల సుంకాల్లో దిద్దుబాటుపైనా దృష్టి సారించనుంది. జీఎస్టీ మండలికి ఇది 46వ భేటీ అవుతుంది. రేట్ల క్రమబద్ధీకరణపై మంత్రుల గ్రూపు (జీవోఎం) కౌన్సిల్‌కు నివేదికను సమర్పించనుంది. శ్లాబు, రేట్ల పరంగా చేయాల్సిన మా ర్పులు, మినహాయింపుల విభాగం నుంచి తొలగించాల్సిన వస్తువుల వివరాలను పన్ను అధికారులు మంత్రుల బృందానికి సిఫారసు చేయ డం గమనార్హం. ప్రస్తుతంజీఎస్టీలో 5, 12, 18, 28% రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులు కొన్నింటికి పన్ను మినహాయింపు ఉండగా, మరికొన్ని చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తులకు గరిష్ట రేట్లు అమల్లో ఉన్నాయి. 12, 18% రేట్లను కలిపేసి ఒకటే రేటును అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇలా తగ్గే ఆదాయాన్ని.. మినహాయింపుల జాబితా నుంచి కొన్ని వస్తువులను పన్ను పరిధిలోకి చేర్చడం ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చన్న సూచనలు ఉన్నాయి. చదవండి:జనవరి నుంచి జీఎస్టీలో కొత్త మార్పులు అమల్లోకి.. -
బ్లాక్ ఫంగస్ మందులపై జీఎస్టీ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్ వ్యాధితో కష్టాలుపడుతున్న బాధితులకు కేంద్రప్రభుత్వం కాస్త ఉపశమనం కల్గించే కబురుతెచ్చింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఔషధాలపై జీఎస్టీ(వస్తుసేవల పన్ను)ను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశంలో కోవిడ్ విధానాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 28న ఏర్పాటైన మంత్రుల బృందమొకటి జూన్ ఏడున ఇచ్చిన నివేదికపై కౌన్సిల్ చర్చించింది. తాజాగా తగ్గిన జీఎస్టీ రేట్లు ఈ సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. కోవిడ్ వ్యాక్సిన్లపై వసూలుచేస్తున్న పన్నును తగ్గించాలన్న డిమాండ్లను కౌన్సిల్ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వ్యాక్సిన్లపై ప్రస్తుతమున్న 5% పన్ను అలాగే కొనసాగనుంది. ప్రభుత్వమే పౌరులందరికీ ఉచితంగా టీకా అందిస్తున్నందున 5% పన్ను అనేది సాధారణ పౌరుడికి ఏమాత్రం భారం కాబోదని నిర్మలా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను కౌన్సిల్ భేటీ తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు ఆంఫోటెరిసిన్–బీపై సున్నా జీఎస్టీ బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్–బి ఔషధంతో పాటు, టోసిలిజుమాబ్పై జీఎస్టీ పన్ను రేటును ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. గతంలో ఈ రెండు ఔషధాలపై 5% జీఎస్టీ ఉండేంది. అంబులెన్స్ సేవలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. కోవిడ్ పరికరాలపై ఇక 5 శాతమే కోవిడ్ సంబంధ ఔషధాలు, పరికరాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. హెపారిన్, రెమ్‌డెసివిర్ వంటి యాంటీ కోగ్యులెంట్ల జీఎస్టీ 12 % నుంచి 5 శాతానికి తగ్గింది. పరికరాలు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు/ జనరేటర్లు (వ్యక్తిగత దిగుమతులతో సహా), వెంటిలేటర్లు, వెంటిలేటర్ మాస్క్‌లు/హెల్మెట్లు, హై ఫ్లో నాసల్ కాన్యులా(హెచ్ఎఫ్ఎన్సీ) పరికరాల జీఎస్టీని 12% నుంచి ఐదు శాతానికి తగ్గించారు. కోవిడ్ టెస్టింగ్ కిట్స్, డి–డైమర్, ఐఎల్–6, ఫెర్రిటిన్, ఎల్డీహెచ్ వంటి స్పెసిఫైడ్ ఇన్‌ఫ్ల్లమేటరీ డయాగ్నోస్టిక్ కిట్లపై పన్నును 12% నుంచి 5%కి తగ్గించారు. హ్యాండ్ శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, బీఐపీఏపీ మెషీన్, టెస్టింగ్ కిట్, టెంపరేచర్ చెక్ చేసే పరికరాలుసహా 18 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించారు. -
వ్యాక్సిన్‌పై ఐదు శాతం జిఎస్టీ
-
GST Council meet: కీలక నిర్ణయాలు
సాక్షి,ఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నుల తగ్గించారు. కోవిడ్-19 చికిత్సకు ఉపయోగించే మూడు రకాల మందులకు పన్ను మినహాయింపునిచ్చారు. అయితే కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 శాతం జీఎస్టీ యధా విధిగా అమలవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈమినహాయింపులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో వ్యాక్లిన్లపై జీఎస్టీ వడ్డింపు నుంచి ఊరట లభిస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్టీని 12 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు ఇది 28శాతంగా ఉంది.అలాగే ఎలక్ట్రిక్ ఫర్నేసులు,టెంపరేచర్ తనిఖీపరికరాలపై 5శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతోపాటు బ్లాక్‌ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బీపై జీఎస్టీ మినహాయింపు నివ్వడం విశేషం. వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఇతర ముఖ్య అధికారులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో శనివారం జరిగిన భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్య నిర్ణయాలు వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ అమలు కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌పై సిఫారసులకు ఆమోదం టోసిలుజుమాబ్, యాంఫోటెరిసిన్ ఔషధాలపై పన్ను మినహాయింపు రెమ్‌డెసివిర్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు మెడికల్ ఆక్సిజన్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు జనరేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు వెంటిలేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్న సవరించిన జీఎస్టీ మినహాయింపులు -
జీఎస్టీ మండలి భేటీ, ఊరట లభించనుందా!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ వైద్యపరికరాలు, బ్లాక్‌ఫంగస్ మందుల పన్నురేట్ల తగ్గింపుపై ఈ భేటీ చర్చ జరగనుంది. అలాగే ఆక్సిజన్ కొరత, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గురించి చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడనున్నారు. -
రాష్ట్రాలకు రూ. 20వేల కోట్ల జీఎస్టీ నిధులు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది జీఎస్టీ పరిహారం కింద వసూలైన రూ 20,000 కోట్ల నిధులను సోమవారం రాత్రి రాష్ట్రాలకు బదలాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 42వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. వచ్చే వారంలోగా మరో 24,000 కోట్లను ఐజీఎస్టీ కింద చెల్లిస్తామని చెప్పారు. జీఎస్టీ సెస్‌ను ఐదేళ్ల పాటు విధించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరగా మరికొంత కాలం పరిహార సెస్ వసూలును పొడిగిస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్మెంట్స్పై సమావేశంలో ముందుగా చర్చించారు. పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని.. పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రాన్ని కోరారు. చదవండి : ఫైటర్ మినిస్టర్ ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలనే డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందుంచారు. ఈ సమావేశంలో జీఎస్టీ పరిహారం చెల్లింపుపై ఎటూ తేల్చకపోవడంతో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈనెల12న మరోసారి సమావేశం కావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.ఇక కోవిడ్-19, లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వెంటాడటంతో రుణ అవకాశాలను తోసిపుచ్చుతూ జీఎస్టీ పరిహారంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు కోవిడ్ 19 సమస్యలు, జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లిన 2.35 లక్షల కోట్ల ఆదాయ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆర్బీఐ వద్ద రుణం తీసుకోవడంతో పాటు మార్కెట్ నుంచి రుణాలను సమీకరించుకోవాలని గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం సూచించింది. రుణ అవకాశాలను తోసిపుచ్చిన రాష్ట్రాలు కేంద్రం చెల్లించాల్సిన రూ 97,000 కోట్ల జీఎస్టీ పరిహారంపై పట్టుబడుతున్నాయి. -
చిరు వ్యాపారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : చిరువ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ల నేపథ్యంలో మే, జూన్, జులై మాసాలకు జీఎస్టీఆర్-3బీ ఫామ్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా దాఖలు చేసే రూ 5 కోట్ల టర్నోవర్ లోపు చిరువ్యాపారులపై ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక జులై 6 వరకూ జీఎస్టీ రిటన్స్‌ను దాఖలు చేసే పన్నుచెల్లింపుదారులపై అపరాథ వడ్డీ ఉండదని, ఆ తర్వాత జీఎస్టీ రిటన్స్‌ను ఫైల్ చేసే చిరు పన్నుచెల్లింపుదారులపై విధించే వడ్డీ రేటును 9 శాతానికి తగ్గించామని, ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇక రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై చర్చించేందుకు జులైలో అదే అజెండాతో ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. పాన్ మసాలాపై పన్ను విధించే ప్రతిపాదనపై తదుపరి జీఎస్టీ భేటీలో చర్చిస్తామని చెప్పారు. -
అన్నీ మంచి శకునాలే..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకేసారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం కావడం వంటి అనుకూల అంశాలతో గత వారాంతాన దేశీ స్టాక్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ సానుకూల అంశం నేపథ్యంలో దేశీ మార్కెట్ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. ట్రేడ్ డీల్ ఒక కొలిక్కి రావడం, బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం వంటి మార్కెట్ ప్రభావిత అంశాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ తెలిపారు. నిఫ్టీకి 12,200 – 12,250 స్థాయిలో ప్రధాన నిరోధం ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక తాజా పరిణామాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉన్నందున ర్యాలీకి ఆస్కారం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈవారంలోనే.. పరోక్ష పన్నుల విధానంలో ఆదాయాన్ని పెంచేందుకు ఈవారంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం కానుంది. బుధవారం జరిగే 38వ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మినహాయింపు అంశాలపై సమీక్ష, రేట్లలో మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. వీటికి ప్రభావితం అయ్యే రంగాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఆర్బీఐ మినిట్స్ వెల్లడి..: ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశ మినిట్స్‌ను ఆర్బీఐ బుధవారం విడుదల చేయనుంది. ఇక నవంబర్ నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సోమవారం వెల్లడికానుంది. -
ఇకపై జీఎస్టీ వడ్డన!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) ద్వారా ఆశించినంత వసూళ్లు జరగకపోవడంతో పలు వస్తువుల జీఎస్టీని సవరించాలని, పన్ను శ్లాబుల్ని పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి భేటీ కానుంది. ఆ మండలి సమావేశంలో జీఎస్టీ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, జీఎస్టీలో పన్నుల శాతం పెంపుపై కొన్ని సిఫార్సులు చేశారు. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%; 28% శ్లాబులు ఉన్నాయి. 28శాతం కంటే తక్కువ ఉన్న శ్లాబుల్లో కూడా అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ఖజానాకి ఆశించినంత ఆదాయం రావడం లేదు. 5 శాతం పన్నుని 8శాతానికి , 12 నుంచి 15 శాతానికి పెంచే అవకాశాల్ని కూడా పరిశీలించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ధరల్ని స్థిరీకరిస్తూనే ఖజానా ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించారు. కొన్ని వస్తువులపై భారీగా సెస్ విధించాలని కూడా జీఎస్టీ మండలి యోచిస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతమున్న పన్ను రేటు శ్లాబుల్ని మూడుకి కుదించాలని భావిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్–నవంబర్ మధ్య జీఎస్టీ పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలకంటే 40శాతానికి తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. -
మార్కెట్లకు ‘కార్పొరేట్’ బూస్టర్!
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకమైనది. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను ఇతోధికం చేయడంతోపాటు దేశ సంపదను పెంచి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వీలు పడుతుంది. ఇది భారత్‌లో తయారీకి ప్రేరణనిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన ప్రైవేటు రంగం పోటీతత్వం పెరుగుతుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’’. –ప్రధాని మోదీ సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఈ సారి మాత్రం స్టాక్ మార్కెట్లో ‘సీతమ్మ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్‌పై పట్టు బిగించిన బేర్లకు నిర్మలా సీతారామన్ చుక్కలు చూపించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె సంధించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు అస్త్రానికి బేర్లు బేర్మన్నారు. సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 556 పాయింట్లు పెరిగాయి. పదేళ్లలో ఈ రెండు సూచీలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 2,285 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 1,921 పాయింట్ల లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 569 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్లకు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ చెరో 5.32 శాతం వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు ఎగసింది. దీపావళి బొనంజా.... కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను నిర్మలా సీతారామన్ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే కొత్త తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గతంలో ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌పై ట్యాక్స్‌ను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే మూలధన లాభాలకు సూపర్ రిచ్ ట్యాక్స్ వర్తించదని వివరించారు. ఈ నిర్ణయాలన్నీ స్టాక్ మార్కెట్‌కు దీపావళి బహుమతి అని నిపుణులంటున్నారు. ఒక్క స్టాక్ మార్కెట్‌కే కాకుండా వినియోగదారులకు, కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు కూడా ఈ నిర్ణయాలు నజరానాలేనని వారంటున్నారు. తాజా ఉపశమన చర్యల కారణంగా కేంద్ర ఖజానాకు రూ.1.45 లక్షల కోట్లు చిల్లు పడుతుందని అంచనా. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు అప్ మందగమన భయాలతో అంతకంతకూ పడిపోతున్న దేశీ స్టాక్ మార్కెట్లో జోష్ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో పలు తాయిలాలు ప్రకటించారు. విదేశీ ఇన్వెస్టర్లపై సూపర్ రిచ్ సెస్ తగ్గింపు, బలహీన బ్యాంక్‌ల విలీనం, రియల్టీ రంగం కోసం రూ.20,000 కోట్లతో నిధి.. వాటిల్లో కొన్ని. అయితే ఇవేవీ స్టాక్ మార్కెట్ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. శుక్రవారం ఉదయం 10.45 నిమిషాలకు ఎవరూ ఊహించని విధంగా కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎవరి అంచనాలకు అందకుండా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఇన్నేసి పాయింట్లు లాభపడటం చరిత్రలో ఇదే మొదటిసారి. చివరకు సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 569 లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 11 శాతం ఎగసింది. అన్ని సూచీల కంటే అధికంగా లాభపడిన సూచీ ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా వాహన కంపెనీలకు అత్యధికంగా పన్ను భారం తగ్గుతుండటమే దీనికి కారణం. ఈ సూచీలోని 15 షేర్లూ లాభపడ్డాయి. వీటిల్లో ఆరు షేర్లు పదిశాతానికి పైగా పెరగడం విశేషం. నిఫ్టీ కంపెనీల నికర లాభం 12 శాతం పెరుగుతుంది దాదాపు 20 నిఫ్టీ కంపెనీలు 30 శాతానికి పైగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను చెల్లిస్తున్నాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది ఆ యా కంపెనీల నికర లాభాల్లో దాదాపు 40 శాతంగా ఉంటోందని తెలిపింది. 30 శాతం మేర పన్ను చెల్లించే కంపెనీల నికర లాభం 12 శాతం మేర పెరగే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ విలువ రూ.6.82 లక్షల కోట్లు పెరిగి రూ.1,45,37,378 కోట్లకు ఎగసింది. ఉదయం 9 సెన్సెక్స్ ఆరంభం 36,215 ఉదయం 10.40 ఆర్థిక మంత్రి కార్పొరేట్ ట్యాక్స్ కోత 36,226 ఉదయం 11.31 37,701 మధ్యాహ్నం 2 గంటలు 38,378 3.30 ముగింపు 38,015 -
మందగమనంపై సర్జికల్ స్ట్రైక్!
దేశ ఆర్థిక రంగంలో గుర్తుండిపోయే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఊహించని కానుకతో కార్పొరేట్లను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కార్పొరేట్ పన్ను(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని ఎప్పటి నుంచో చేస్తున్న అభ్యర్థనను ఎట్టకేలకు మన్నించింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును ఏకంగా 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. దీంతో మధ్య, పెద్ద స్థాయి కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి దిగొస్తుంది. ఇతర ఆసియా దేశాలైన దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల సమాన స్థాయికి మన కార్పొరేట్ పన్ను దిగొస్తుంది. ప్రభుత్వం తీసుకున్న మరో విప్లవాత్మక నిర్ణయం... అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతమే అమలు కానుంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. స్టాక్ మార్కెట్లలో మూలధన లాభాలపై ఆదాయపన్ను సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని మంత్రి ప్రకటించారు. అంతేకాదు వేగంగా ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఇంతకుముందు మూడు విడతల్లో... ఆటోమొబైల్ రంగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... అవేవీ పడిపోతున్న ఆర్థిక వృద్ధిని కాపాడలేవన్న విశ్లేషణలు వినిపించాయి. దీంతో కార్పొరేట్ కంపెనీలపై పన్ను భారాన్ని దించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించాలని ప్రభుత్వం భావించే సాహసోపేతంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుంది. ఈ నిర్ణయాలకు స్టాక్ మార్కెట్లు ఘనంగా స్వాగతం పలికాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ తన చరిత్రలోనే ఒకే రోజు అత్యధికంగా లాభపడి రికార్డు నమోదు చేసింది. బీఎస్ఈ సైతం దశాబ్ద కాలంలోనే ఒక రోజు అత్యధికంగా లాభపడింది. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శకుల దగ్గర్నుంచి విశ్లేషకుల వరకు అందరూ మెచ్చుకున్నారు.. అభినందించారు. కంపెనీలపై కార్పొరేట్ పన్ను భారం నికరంగా 28 శాతం ఒకేసారి తగ్గిపోవడం, ఆరేళ్ల కనిష్ట స్థాయికి కుంటుపడిన దేశ ఆర్థిక రంగ వృద్ధిని (జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతం) మళ్లీ కోలుకునేలా చేస్తుందని, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో కార్పొరేట్ ఇండియా (భారత కంపెనీలు) పోటీ పడగలదని విశ్వసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్ తర్వాత నుంచి పడిపోతున్న స్టాక్ మార్కెట్లకు తాజా నిర్ణయాలు బ్రేక్ వేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయాలు వృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సాహిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ద్రవ్యలోటుపై దీని ప్రభావం పట్ల తాము అవగాహనతోనే ఉన్నామని, గణాంకాలను సర్దుబాటు చేస్తామని చెప్పారు. ప్రధాన నిర్ణయాలు ► కార్పొరేట్ ట్యాక్స్ బేస్ రేటు ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు పొందని రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న దేశీయ కంపెనీలపై 25 శాతంగా, అంతకుమించిన టర్నోవర్‌తో కూడిన కంపెనీలపై 30 శాతంగా ఉంది. ఇది ఇకపై 22 శాతమే అవుతుంది. ► 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసి... 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే అమలవుతుంది. ఇతరత్రా ఎలాంటి రాయితీలు/ప్రోత్సాహకాలు పొందనివాటికే ఈ కొత్త రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిపై ఈ పన్ను 25 శాతంగా అమల్లో ఉంది. ► ఎటువంటి పన్ను తగ్గింపుల విధానాన్ని ఎంచుకోని కంపెనీలకే ఈ కొత్త పన్ను రేట్లు. అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) వంటి వాటిల్లో నడుస్తూ పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్న కంపెనీలు ఇంతకుముందు మాదిరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ట్యాక్స్ మినహాయింపు కాలవ్యవధి తీరిన తర్వాత కొత్త రేట్లు వాటికి అమలవుతాయి. ఇవి మ్యాట్‌ను చెల్లిస్తున్నాయి. ► బేస్ పన్ను రేటుకు అదనంగా స్వచ్ఛ భారత్ సెస్సు, విద్యా సెస్సు, సర్‌చార్జీలు కూడా కలిపితే కార్పొరేట్లపై వాస్తవ పన్ను 34.94 శాతంగా అమలవుతోంది. రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలపై రూ.29.12 శాతం అమలవుతోంది. ఇవి ఇకపై అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలు కలిపి 25.17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ యూనిట్లపై అన్ని సెస్సులు, సర్‌చార్జీలు కలిపి అమలవుతున్న 29.12 శాతం పన్ను కాస్తా 17.01 శాతానికి దిగొస్తుంది. ► ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుందని అంచనా. వాస్తవానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.16.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ► కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. అసలు పన్ను చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉండకూడదని భావించి, అన్ని కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని 1996–97లో మ్యాట్‌ను ప్రవేశపెట్టారు. కంపెనీలు తాము పొందే పుస్తక లాభాలపై 18.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని 15 శాతానికి తగ్గించారు. సాధారణ కార్పొరేట్ పన్ను కట్టే కంపెనీలకు మ్యాట్ ఉండదు. ► 2023 మార్చి 31 తర్వాత ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలు ఎటువంటి పన్ను మినహాయింపులు తీసుకోకపోతే, వాటిపై పన్ను రేటు అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలతో కలిపి 17.01 శాతంగా అమల్లోకి వస్తుంది. ► కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్) తమ లాభాల్లో 2% ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు కూడా వర్తింపజేశారు. ► రూ.2 కోట్లకుపైన ఆదాయం ఉన్న వర్గాలు ఆర్జించే మూలధన లాభాలపై సర్‌చార్జీని భారీగా పెంచుతూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ లోగడే ప్రకటించారు. ఇది కూడా అమల్లోకి వచ్చినట్టే. ► 2019 జూలై 5లోపు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలు దానిపై ఇక ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. -
ఈ వస్తువుల ధరలు దిగిరానున్నాయ్..
ముంబై : ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ పుంజుకునేందుకు పలు వస్తువులు, సేవల ధరలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గోవాలో శుక్రవారం జరగనున్న 37వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ దిశగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలో తిరిగి ఉత్తేజం నెలకొనడంతో పాటు కార్లు, బైక్‌లు సహా ఆటోమొబైల్ విక్రయాలు ఊపందుకునేలా పలు చర్యలు చేపడతారని భావిస్తున్నారు. బిస్కట్ల నుంచి కార్ల వరకూ పలు వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయాలు వెల్లడవుతాయని ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ సమావేశంలో పన్ను రేట్లు, విధానాల సరళీకరణకు సంబంధించి దాదాపు 80 ప్రతిపాదనలు ముందుకు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆటోమొబైల్ పరిశ్రమను ఆదుకునేందుకు కార్లపై ప్రస్తుతం విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తారని భావిస్తున్నారు. పండుగ సీజన్‌కు ముందు ఈ నిర్ణయం వెలువడితే విక్రయాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నారు. ఈ దిశగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం కోసం ఆటోమొబైల్ కంపెనీలు వేచిచూస్తున్నాయి. బిస్కెట్లు, అగ్గిపుల్లలు, హోటల్స్‌కు సంబంధించి కూడా పన్ను రేట్ల తగ్గింపుపై ఆయా వర్గాలు సానుకూల నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నాయి. చిన్న వ్యాపారులకు కనీసం తొలి ఏడాది (2017-18) వరకైనా వార్షిక రిటన్ దాఖలు నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. పిల్లలు, పెద్దలు నిత్యం ఉపయోగించే బిస్కట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని బిస్కెట్ తయారీదారులు కోరుతున్నారు. మరోవైపు లగ్జరీ హోటళ్లపై విధిస్తున్న జీఎస్టీ రేట్‌ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలనే డిమాండ్ జీఎస్టీ కౌన్సిల్ ముందుకు రానుంది. -
జీఎస్టీ కౌన్సిల్ భేటీ : వీటి ధరలు తగ్గే ఛాన్స్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌కు రెండు వారాల ముందు శుక్రవారం జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడతాయని భావిస్తున్నారు. నిర్మాణ, ఆటోమొబైల్ రంగాలకు ఊతమిచ్చేలా ఆటోమొబైల్, సిమెంట్ రంగాలపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించే ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కారణంగా ఆటో పరిశ్రమకు జీఎస్టీ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు. అదేతరహాలో సిమెంట్ పరిశ్రమ సైతం జీఎస్టీ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్య ప్రస్తుతం నిస్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెస్తుందని భావిస్తున్నారు. కాగా సిమెంట్ రంగంపై పన్ను రేట్లను 18 శాతానికి తగ్గిస్తే ప్రభుత్వ ఖజానాకు రూ 12,000 నుంచి రూ 14000 కోట్ల వరకూ ఆదాయ నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు రూ 50 కోట్ల పైబడిన లావాదేవీలకు ఈ-ఇన్వాయిసింగ్ను తప్పనిసరి చేయడంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రస్తుతం అత్యధికంగా 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులు, సేవలను తక్కువ పన్ను శ్లాబ్‌ల్లోకి తీసుకురావడంపైనా ప్రధానంగా చర్చించనున్నారు. -
21న జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జీఎస్టీ కౌన్సిల్ ఈనెల 21న భేటీ కానుంది. ఈ సమావేశంలో అధిక శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులు, సేవలను తక్కువ పన్ను శ్లాబుల్లోకి తీసుకురావడంపై చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ సమర్పించే రెండు వారాల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం 28 శాతం శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులపై పన్ను శ్లాబును తగ్గించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆటో, ఉత్పాదక, నిర్మాణ రంగాల్లో స్ధబ్ధత నెలకొన్న కారణంగా ఆయా రంగాల్లో ఉత్తేజం పెంచేందుకు జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించాలని పారిశ్రామిక వర్గాల నుంచి సైతం ఒత్తిడి ఎదురవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇక బడా కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు రూ 50 కోట్లు పైబడిన లావాదేవీలకు విధిగా ఈ-ఇన్వాయిసింగ్ను అనివార్యం చేయడంపైనా ఈ భేటీలో చర్చిస్తారు. కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్ 22న మూవీ టికెట్లు, టీవీ, మానిటర్ స్ర్కీన్లు, పవర్ బ్యాంక్స్, నిల్వచేసే కూరగయాలు సహా 23 వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. -
చిన్న వ్యాపారులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్టీ మినహాయింపు ఉండగా... దీన్ని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచింది. దీనికితోడు ఒక శాతం పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని రూ.1.5 కోట్లు చేయాలని గతంలోనే నిర్ణయించగా... ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కౌన్సిల్ ప్రకటించింది. భారీ వరదలతో దెబ్బతిన్న కారణంగా... పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అంతర్రాష్ట్ర రవాణాపై రెండేళ్ల పాటు ఒక శాతం విపత్తు సెస్సును విధించుకునే అవకాశాన్ని కేరళ రాష్ట్రానికి కౌన్సిల్ కల్పించింది. ఈ మేరకు గురువారం జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ లోపు ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉందని, దీన్ని రూ.40 లక్షలకు పెంచామని చెప్పారు. పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, ఇకపై రూ.20లక్షలు అవుతుందన్నారు. జీఎస్టీ మినహాయింపును రెట్టింపు చేయడం వల్ల... అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే రూ.5,200 కోట్ల మేర పన్ను రాబడి తగ్గుతుందని అంచనా. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలు, ట్రేడర్లు, సేవల రంగానికి మేలు చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. సులభమైన ప్రజా అనుకూల జీఎస్టీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కాంపోజిషన్ స్కీమ్ మినహాయింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి వరకు టర్నోవర్ ఉన్న వారు... కాంపోజిషన్ స్కీమ్ కింద టర్నోవర్‌పై ఒక శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచుతూ కౌన్సిల్ నవంబర్ నాటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్లు, వస్తు, సేవల సరఫరా దారులు రూ.50 లక్షల్లోపు టర్నోవర్ ఉంటే, కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కాంపోజిషన్ స్కీమ్‌లో టర్నోవర్ పరిమితి పెంచటం వల్ల రూ.3,000 కోట్ల మేర ఆదాయం తగ్గొచ్చని అంచనా. ఈ నిర్ణయాలు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు (ఎంఎస్ఎంఈ) ఉపశమనం కల్పిస్తాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకునే వ్యాపారులు వార్షికంగా ఒకేసారి ట్యాక్స్ రిటర్ను వేస్తే సరిపోతుందని, పన్ను మాత్రం త్రైమాసికానికి ఓ సారి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారాయన. ‘‘జీఎస్టీలో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగం, పెద్ద కంపెనీల నుంచే వస్తోంది. ఈ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలకు మేలు చేస్తాయి. వారికి పలు ఆప్షన్లు ఇచ్చాం. సేవల రంగంలో ఉంటే, 6 శాతం కాంపౌండింగ్ పొందొచ్చు. తయారీ రంగంలో ఉంటే రూ.1.5 కోట్ల టర్నోవర్‌పై ఒక శాతం కాంపౌండింగ్ ఎంచుకోవచ్చు. వీరు రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ వరకు పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. సరుకుల సరఫరాదారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్, చెల్లింపు విషయంలో రూ.40 లక్షలు, రూ.20 లక్షల పరిమితులు ఉన్నాయి. పరిమితి పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది’’ అని అరుణ్ జైట్లీ వివరించారు. ఇతర నిర్ణయాలు... ⇒ రియల్ ఎస్టేట్‌పై జీఎస్టీ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఏడుగురు సభ్యుల మంత్రివర్గ గ్రూపును ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ⇒ లాటరీలపైనా ఇదే పరిస్థితి నెలకొనడంతో దీన్నీ మంత్రివర్గ బృందమే తేల్చనుంది. ⇒ ప్రస్తుతం రూ.20 లక్షల్లోపు టర్నోవర్‌కు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ... 10.93 లక్షల మంది పన్నులు చెల్లిస్తున్నారని కేంద్ర రెవెన్యూ సెక్రటరీ అజయ్‌భూషణ్ పాండే తెలిపారు. రూ.40 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు అనేది సరుకుల వర్తకానికి, ఒకే రాష్ట్రం పరిధిలో వాణిజ్యానికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య లావాదేవీలకు ఇది వర్తించదన్నారు. ⇒ జీఎస్టీ కింద 1.7 కోట్ల వ్యాపారులు నమోదు చేసుకోగా, వీరిలో 18 లక్షల మంది కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకున్నారు. వీరు మూన్నెళ్లకోసారి పన్ను చెల్లించాలి. మిగిలిన వారు ప్రతీ నెలా పన్ను చెల్లించాలి. పైగా కాంపోజిషన్ స్కీమ్‌లో వ్యాపారులు రికార్డులను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. లక్షలాది వర్తకులకు మేలు: పరిశ్రమ వర్గాల హర్షం న్యూఢిల్లీ: రూ.40 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారులకూ జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ పారిశ్రామిక రంగం హర్షం వ్యక్తం చేసింది. ఇది లక్షలాది వ్యాపారులకు మేలు చేస్తుందని, వ్యాపార సులభత్వాన్ని పెంచుతుందని పేర్కొంది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఉత్పత్తుల వ్యయాన్ని తగ్గిస్తుంది. ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంచుతుంది’’ అని సీఐఐ పేర్కొంది. కాంపోజిషన్ స్కీములో మూడు నెలలకోసారి పన్ను చెల్లింపు, ఏడాదికోసారి రిటర్నుల దాఖలు అన్నది పన్నుల విధానాన్ని మరింత సులభంగా మార్చేస్తుందని, ఎంఎస్ఎంఈ రంగంపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. లక్షలాది చిన్న, మధ్య స్థాయి వర్తకులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని అసోచామ్ పేర్కొంది.జీఎస్టీ మినహాయింపు రూ.40 లక్షలు చేయడం వల్ల, నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50–60% మేర తగ్గుతుందని, వారికి నిబంధనల అమలు భారం తొలగిపోతుందని కేపీఎంజీ పార్ట్నర్ సచిన్ మీనన్ అభిప్రాయపడ్డారు. -
30 సార్లు సమావేశమైన జీఎస్టీ మండలి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) మండలి గత రెండేళ్లలో 30 సార్లు సమావేశమైందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ కాలంలో జీఎస్టీకి సంబంధించి మొత్తం 918 నిర్ణయాలను తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో జీఎస్టీ విధి విధానాలు, రేట్లు, పరిహారం తదితర నిర్ణయాలు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే సుమారు 96 శాతం నిర్ణయాలను అమలు చేశామని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పింది. ఈ నిర్ణయాలు అమలుకు కేంద్రం, ప్రతి రాష్ట్రం 294 నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఒకే దేశం– ఒకే పన్ను నినాదంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ జీఎస్టీకి శ్రీకారం చుట్టింది. ఎట్టకేలకు సుమారు 17 ఏళ్ల తర్వాత గతేడాది జూన్ 30వ తేదీ అర్ధరాత్రి జీఎస్టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ గుడ్‌న్యూస్ : డిజిటల్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు జరిగాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను రూపే, భీమ్ యాప్ చెల్లింపులపై ప్రోత్సాహకాలు లభించనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు. పైలట్ ప్రాజ్జెక్టుగా ముందుగా రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయనున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాలు ప్రయోగాత్మంగా, స్వచ్ఛందంగా ప్రారంభించనున్నాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టులో సాధించిన ఆదాయం, నష్టం లాంటి అంశాలను అంచనా వేయనున్నామని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సహాకాలపై బీహార్ డిప్యూటీముఖ్యమంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ బృందం ప్రతిపాదనలకౌన్సిల్ ఆమోదించినట్టు తెలిపారు. ఇది అమల్లోకి వస్తే 20శాతం దాకా క్యాష్‌బ్యాక్ వినియోగదారులకు చెల్లించనున్నామని వెల్లడించారు. మొత్తం జీస్‌ఎటీపై గరిష్టంగా వంద రూపాయలు వరకు పొందవచ్చని గోయల్ చెప్పారు. కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29తేదీల్లో గోవాలో జరుగనుంది. -
గుడ్‌న్యూస్ : జీఎస్టీ రేట్లు తగ్గాయి
సాక్షి, న్యూఢిల్లీ : అధిక పన్ను రేట్లతో సతమవుతున్న సామాన్యులకు జీఎస్టీ మండలి తాజాగా చేసిన ప్రకటన ఉపశమనాన్ని కలిగించింది. ప్రజల అవసరాలు, డిమాండ్ల దృష్ట్యా జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పలు ఉత్పత్తులు, సర్వీసులపై కేంద్రం పన్ను రేట్లు తగ్గిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని వస్తువులపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గిస్తున్నట్లు జీఎస్టీ మండలి ప్రకటించింది. శనివారం జరిగిన 28వ జీఎస్టీ మండలి సమావేశంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మహిళల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా శానిటరీ నాప్కిన్స్పై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొన్నారు. బలవర్ధకమైన పాలు, విస్తరాకులపై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా కొత్తగా ప్రకటించిన తగ్గింపు రేట్లు జూలై 27 నుంచి అమలులోకి రానున్నాయి. జీఎస్టీ నుంచి మినహాయింపు పొందిన వస్తువులు *శానిటరీ నాప్కిన్స్ *చీపుర్లలో ఉపయోగించే ముడి సరుకులు *మార్బుల్స్, రాఖీలు, పాలరాయి *రాళ్లు, చెక్కతో చేసిన విగ్రహాలు *ఆర్బీఐ జారీ చేసే స్మారక నాణేలు పన్ను శాతం తగ్గిన వస్తువులు.. *వెయ్యి రూపాయల లోపు పాదరక్షలపై 5 శాతం *హ్యాండ్లూమ్ దారాలపై 12 నుంచి 5 శాతానికి తగ్గింపు *లిథియం అయాన్ బ్యాటరీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, గ్రైండర్లు, ఇస్త్రీ పెట్టెలు, వాటర్ హీటర్లు, వాటర్ కూలర్లు, పర్ఫ్యూమ్స్, టాయ్‌లెట్ స్ప్రేలు, ఫ్రిజ్‌లు, హేర్ డ్రయర్స్, వార్నిష్లు, కాస్మోటిక్స్, పెయింట్లలపై 28 నుంచి 18 శాతానికి తగ్గింపు