high prices
-
బంగారం దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి నాలుగు నెలల్లో.. ఏప్రిల్ నుంచి జూలై వరకు 12.64 బిలియన్ డాలర్ల (రూ.1.05 లక్షల కోట్లు సమారు) విలువైన బంగారం దిగుమలు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్–జూలై మధ్య దిగుమతులు 13.2 బిలియన్ డాలర్లతో పోలి్చనప్పుడు 4.23 శాతం తగ్గాయి. ఒక్కజూలై నెల వరకే చూస్తే పసిడి దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 జూలైలో 3.5 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదు కావడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులకు తోడు, అధిక ధరలే బంగారం దిగుమతులపై ప్రభావం చూపించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో సెపె్టంబర్ నుంచి దిగుమతులు పెరగొచ్చని, దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం సైతం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని ఓ జ్యుయలరీ వర్తకుడు అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి ఇటీవలి బడ్జెట్లో భాగంగా కేంద్రం తగ్గించడం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24) మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన దేశానికి దిగుమతి అవుతున్న బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. మన దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతంగా ఉంది. గణనీయంగా వెండి దిగుమతులు ఏప్రిల్ నుంచి జూలై మధ్య మన దేశం నుంచి 9.1 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 7.45 శాతం తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 648 మిలియన్ డాలర్ల విలువైన వెండి దిగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 215 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు రెండు రెట్లు పెరిగాయి. యూఏఈతో 2022 మే 1 నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచి్చంది. దీంతో ఆ దేశం నుంచి బంగారం, వెండి దిగుమతులు పెరిగిపోయాయి. దీనిపై పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండంతో కొన్ని నిబంధనలను సమీక్షించాలని భారత్ కోరుతోంది. పెరిగిన వాణిజ్య లోటు ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశ వాణిజ్య లోటు 85.58 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క జూలై నెలకే 23.5 బిలియన్ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదైంది. చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా జ్యుయలరీ పరిశ్రమ నుంచి బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. -
పసిడి డిమాండ్‌కు ధరల చెక్
ముంబై: భారత్‌లో పసిడి పరిమాణం డిమాండ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతానికిపైగా పతనమైంది. 2023 ఇదే కాలంతో పోలి్చతే డిమాండ్ పరిమాణం 158.1 టన్నుల నుంచి 149.7 టన్నులకు పడిపోయింది. అధిక ధరలు, దీనితో కొనుగోళ్లు త్గగడం దీనికి కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) జూన్ త్రైమాసిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ నెల 23వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కస్టమ్స్ సుంకాలను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరలు భారీగా పడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి డిమాండ్‌కు ఏమాత్రం దోహదపడిందన్న అంశం ఆగస్టు త్రైమాసికంలో తెలియనుంది. తాజా డబ్ల్యూజీసీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → జూన్ త్రైమాసికం డిమాండ్ పరిమాణంలో తగ్గినా.. విలువలో మాత్రం 17 శాతం పెరిగి రూ.82,530 కోట్ల నుంచి రూ.93,850 కోట్లకు ఎగసింది. → 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.74,000 దాటితే, సగటు ధర ఇదే కాలంలో రూ.52,191.60 నుంచి రూ.62,700.50కు ఎగసింది. (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా). అంతర్జాతీయంగా చూస్తే, ఔన్స్ (31.1గ్రాములు) ధర ఇదే కాలంలో 1,975.9 డాలర్ల నుంచి 2,338.2 డాలర్లకు ఎగసింది. (అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయర్క్ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో జూలై 16వ తేదీన ఔన్స్ ధర ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన సంగతి తెలిసిందే) → ఇక జూన్ త్రైమాసికంలో ఆభరణాలకు పరిమాణ డిమాండ్ 17 శాతం పడిపోయి 128.6 టన్నుల నుంచి 106.5 టన్నులకు చేరింది. → ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మాత్రం ఇదే కాలంలోలో 46 శాతం పెరిగి 29.5 టన్నుల నుంచి 43.1 టన్నులకు ఎగసింది. → రీసైకిల్డ్ గోల్డ్ పరిమాణం 39 శాతం తగ్గి 37.6 టన్నుల నుంచి 23 టన్నులకు పడింది. → దిగుమతులు 8 శాతం పెరిగి 182.3 టన్నుల నుంచి 196.9 టన్నులకు ఎగసింది.గ్లోబల్ డిమాండ్ 4 శాతం అప్మరోవైపు అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ జూన్ త్రైమాసికంలో 4 శాతం పెరిగి 1,207.9 టన్నుల నుంచి 1,258.2 టన్నులకు ఎగసింది. హోల్‌సేల్, స్పాట్‌సహా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, ఈటీఎఫ్ అవుట్ఫోస్లో మందగమనం దీనికి కారణం. గోల్డ్ సరఫరా 4 శాతం పెరిగి 929 టన్నులుగా ఉంది.ఎదురుగాలిలోనూ ముందుకే.. బంగారానికి ఎదురుగాలి వీసే అవకాశం ఉంది. అయినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి, ఇవి బంగారం డిమాండ్‌కు మద్దతునిస్తాయి. డిమాండ్‌ను మరింత పెంచుతాయి. – లూయిస్ స్ట్రీట్, డబ్ల్యూజీసీ సీనియర్ మార్కెట్స్ విశ్లేషకురాలు -
Gujarat Assembly Election 2022: మోదీ నుంచి మోర్బీ వరకు...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తొలిసారిగా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతూ ఉండడంతో ప్రతీ అంశమూ ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా అధికార బీజేపీ ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం దగ్గర్నుంచి ఇటీవల జరిగిన మోర్బీ కేబుల్ వంతెన దుర్ఘటన వరకు ఎన్నో అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించనున్నాయి. అవేంటో చూద్దాం.. అధికార వ్యతిరేకత రాష్ట్రంలో 1998 నుంచి అంటే 24 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వంపై వివిధ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, తడిసిమోపెడైన జీవన వ్యయం, నాసిరకమైన రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం వంటివన్నీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లపై పడనున్నాయి. రాష్ట్ర ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనే విశ్లేషణలు వినబడుతున్నాయి. మోదీ ఇమేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ ఈ ఎన్నికల్లో అత్యంత కీలక అంశం కానుంది. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ప్రజల్లో ఆయనకున్న ఛరిష్మా తగ్గలేదు. 2001 నుంచి 2014 వరకు ఆయన రాష్ట్రాన్ని నడిపించిన తీరు, అంతర్జాతీయంగా మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు గుజరాత్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గుజరాత్ మనం తయారు చేసుకున్నదే అంటూ మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుజరాత్ మోడల్‌నే అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతూ ఉండడం గమనార్హం. బిల్కిస్ బానో దోషుల విడుదల గుజరాత్ మత ఘర్షణల సమయంలో జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను శిక్షా కాలం కంటే ముందుగానే విడిచిపెట్టడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ముస్లిం వర్గంపై దీని ప్రభావం అత్యధికంగా ఉంది. 6.5 కోట్లున్న గుజరాత్ జనాభాలో ముస్లింలు 11% ఉన్నారు. 25 అసెంబ్లీ స్థానాల్లో వీరు ప్రభావం చూపించగలరు. బిల్కిస్ బానోకి న్యాయం జరగాలని వీరు చేస్తున్న ఆందోళనలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న చర్చ జరుగుతోంది. కరెంట్ కష్టాలు దేశంలో కరెంట్ చార్జీలు అత్యంత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నెల తిరిగేసరికల్లా వచ్చే బిల్లుని చూసి సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. ఇక కమర్షియల్ విద్యుత్ టారిఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పరిశ్రమలకిచ్చే కరెంట్ చార్జీలు ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌కి రూ.4 ఉంటే గుజరాత్లో ఏకంగా రూ.7.50గా ఉండడంతో వాణిజ్యవేత్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఆప్, కాంగ్రెస్ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీలు ఇచ్చారు. రైతు సమస్యలు గుజరాత్ రాష్ట్రాన్ని గత రెండేళ్లుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పంట నీటిపాలై రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. అయినప్పటికీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. ఇక అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం భారీగా భూముల్ని సేకరించింది. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వడోదర, ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం చేసిన భూ సేకరణ వివాదాస్పదమైంది. పేపర్ లీక్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్ష పేపర్ల లీకేజీ యువతలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. తరచుగా పేపర్స్ లీక్ కావడం పరీక్షలు వాయిదా పడడం నిరుద్యోగుల ఆశల్ని అడియాసలు చేస్తోంది. గత ఏడేళ్ల కాలంలో ఎనిమిది సార్లు వివిధ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకయ్యాయి. మోర్బీ వంతెన దుర్ఘటన సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ 30న కుప్పకూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాంట్రాక్టులు, స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి బదులుగా ప్రమాద సమయంలో నదిలోకి దూకి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే కాంతి అమృతియకు టికెట్ ఇవ్వడం చూస్తేనే దీని ప్రభావం ఎంత ఉందనేది అర్థమవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ధరలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కేంద్రం దదిద్దుబాటు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో ధరలు రెండు రెట్లు పెరిగాయి. దిగుమతులు పెరిగిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. జీడీపీ తొమ్మిది నుంచి ఏడు శాతానికి పడిపోయింది. చమురు దిగుమతి వల్ల ఎకానమీపై భారం పెరిగింది. అందుకే.. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో సోలార్ ఎనర్జీ విషయంలో కేంద్ర తీరు సరికాదు. నదుల అనుసంధానంతో కరెంట్ ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. వంట గ్యాస్ ధరలు తగ్గించాలి.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల పామాయిల్ రెట్లు పెరిగాయి. కానీ వాటి ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలి. తిరుమల తిరుపతిపై జీఎస్టీ రద్దు చేయాలి. హిందువుల మనోభావాలు కాపాడాలని ఎంపీ మార్గాని భరత్ కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఆదుకోవడం లేదు ధరల పెరుగుదలపై కేంద్రం కారణాలు మాత్రమే చెప్తోందని.. ఎవరిని ఆదుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత తెలిపారు. ప్రజలు కూడా అదే సమస్యలతో బాధపడుతున్నారు. ధరల పెరుగుదలతో తీవ్ర కష్టాలపాలు అవుతున్నారు. మానవతా దృక్పథంతో ప్రజలను ప్రధాని ఆదుకోవాలి. ప్యాకేజీ ఫుడ్ పై జీఎస్టీ వేయడం దారుణం. కష్టాలు ఉన్నా.. ఏపీలో సీఎం వైఎస్ జగన్ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేం గడప గడప కార్యక్రమం కింద ప్రజల వద్దకు వెళితే.. ధరల తగ్గించేలా పార్లమెంట్లో మాట్లాడాలని అడుగుతున్నారు అని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. -
నన్ను క్షమించండి: శ్రీ లంక ప్రధాని
ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు చేజారిపోయిన వేళ.. శ్రీలంకలో నిరసనలు మిన్నంటాయి. ఆహార.. మందలు కొరత, నిత్యావసరాల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం అవినీతి విధానాల వల్లే ఇదంతా అంటూ ఆరోపిస్తూ.. దిగిపోవాలంటూ ప్రజా నిరసన పెల్లుబిక్కుతోంది. ఈ తరుణంలో ప్రధాని మహీంద రాజపక్స ఒక వీడియో విడుదల చేశాడు. ఆర్థిక సంక్షోభంతో పాటు తాజా పరిస్థితులపైనా దేశ పౌరులకు వివరణ ఇచ్చుకున్నాడు. శ్రీ లంక ప్రధాని మహీంద రాజపక్స.. సోమవారం జాతిని ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశాడు. రాజీనామా డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చల్లార్చే దిశగా ఆయన ప్రసంగం సాగింది. లంక తీవ్ర సంక్షోభానికి కారణాలేంటో చెప్పిన మహీంద రాజపక్స.. ప్రదర్శలను తక్షణమే విరమించాలని నిరసనకారుల్ని విజ్ఞప్తి చేశాడు. ‘‘కొవిడ్‌తో లంక ఆర్థిక స్థితి కుప్పకూలింది. క్షీణించిన విదేశీ నిల్వలు కారణంగానే.. ఆర్థిక సంక్షోభంలోకి దేశం కూరుకుపోయింది. మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే మన దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిసినప్పటికీ.. లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. అందుకే మన విదేశీ నిల్వలు క్షీణించాయి. అంతేగానీ.. ప్రభుత్వ విధానాలు, మా పాలన అందుకు కారణాలు కావు. మా పాలనలో అసలు అవినీతికి చోటే లేదు కూడా. గత ప్రభుత్వాలు కూడా దేశాన్ని అప్పుల్లోకి నెట్టాయి. కరోనా పరిస్థితులు ఆ అప్పుల్ని మరింత ఊబిలోకి లంకను నెట్టేశాయని చెప్పుకొచ్చారు మహీందా. ప్రజల కష్టాలు చూసి చాలా బాధపడుతున్నా. శ్రీ లంక ప్రజల్ని క్షమాపణ కోరుతున్నా అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నాడు మహీంద. ‘‘ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 24 గంటలూ మా ప్రభుత్వం పని చేస్తోంది. మీరు(నిరనసకారుల్ని ఉద్దేశిస్తూ..) వీధుల్లో గడిపే ప్రతి నిమిషమూ దేశానికి డాలర్ ప్రవాహాన్ని దూరం చేస్తుంది. ఈ సమయంలో రాజకీయాలు వద్దన్నా.. ఎవరూ వినడం లేదు. దేశం పతనం కాకుండా రక్షించుకునేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలన్నా ఎవరూ స్పందించలేదు. మీరైనా సహనంతో మాకు సహకరించండి. అతికొద్దిరోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తాం’’ అని పేర్కొన్నాడు. స్నేహపూర్వక దేశాల నుండి సహాయం తీసుకునేటప్పుడు తాను దేశ సార్వభౌమత్వాన్ని త్యాగం చేయనని పేర్కొన్న రాజపక్సే.. ద్వీపం దేశం చాలా నిర్ణయాత్మక దశలో ఉందని అన్నారు. పనిలో పనిగా.. రైతులకు ఎరువుల సబ్సిడీని పునరుద్ధరిస్తానని శ్రీలంక ప్రధాని కీలక ప్రకటన చేశారు. చదవండి: మా వల్ల కాదు బాబోయ్.. లంకలో తీవ్ర ఉద్రిక్తతలు -
అడ్డగోలు దోపిడీ.. ప్రేక్షకులపై తిను‘బండ’రాలు
సాక్షి, అమరావతి బ్యూరో: వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విక్రయించే తినుబండారాల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ థియేటర్, ఈ థియేటర్ అనే తేడా లేదు. థియేటర్ స్థాయి బట్టి ధరలు మోతమోగుతున్నాయి. సినిమా టికెట్టుకంటే స్నాక్స్, పాప్‌కార్న్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ధరలే అధికం. విజయవాడలో ఏసీ, నాన్ ఏసీ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లు వెరసి 46 వరకు ఉన్నాయి. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. చదవండి: Andhra Pradesh: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134.95 కోట్లు ఏ క్లాస్‌కు వెళ్లిన వారి కైనా ఒకటే బాదుడు. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులకు పది నిమిషాల పాటు విరామం ఉంటుంది. ఆ సమయంలో క్యాంటీన్లకు వచ్చి తినుబండారాలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ కొనుగోలు చేయడం రివాజు. కుటుంబ సమేతంగా వెళ్లిన వారు పిల్లలకు తినుబండారాలు కొనివ్వక తప్పదు. లేదంటే వారు మారం చేస్తారు. క్యాంటీన్లలో విక్రయించే ధరలు బయట దొరికే రేట్లకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఉదాహరణకు 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ధర మార్కెట్లో రూ.14 (గాజు బాటిల్), రూ.20 (ప్లాస్టిక్ బాటిల్) ఉండగా థియేటర్లలో రూ.60 నుంచి 79 వరకు వసూలు చేస్తున్నారు. బయట రూ.30కి దొరికే 150 గ్రాముల పాప్‌కార్న్ రూ.180, రూ.20 విలువచేసే స్వీట్‌కార్న్ రూ.60, రూ.20కే దొరికే ఐస్క్రీంను రూ.50కి, రూ.20ల కేక్, పఫ్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. బయట రూ.10లకే దొరికే టీ సినిమా హాళ్ల క్యాంటీన్లలో కొన్నిచోట్ల రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో టీ, కాఫీ, లెమన్ టీలు ఏదైనా రూ.50 చొప్పున పిండుతున్నారు. సినిమా హాళ్ల క్యాంటీన్లలో నాలుగైదు రెట్ల అధికంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మరో విచిత్రమేమిటంటే.. థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎమ్మార్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ‘ఎమ్మార్పీకే విక్రయిస్తున్నాం’ అని క్యాంటీన్ల నిర్వాహకులు దబా యిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచి నీళ్ల బాటిల్‌ను కూడా తీసుకెళ్లనీయరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధి లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్తే కనీసం రూ.వెయ్యి ఖర్చవుతోంది. మామూలు థియేటర్ టికెట్టు ధర రూ.100 ఉంటే నలుగురికి రూ.400 అవుతుంది. థియేటర్లో తినుబండారాలకు పొదుపుగా ఖర్చు చేస్తే మరో రూ.600 అయినా వెచ్చించక తప్పదు. ఇలా ఒక మధ్య తరగతి కుటుంబం సినిమాకి వెళ్లాలంటే రాను, పోను ఖర్చులు కాకుండా రూ.వెయ్యి భారం పడుతోంది. -
Telangana: మాస్క్ ధరలు.. తగ్గేదే లే!
ఆస్పత్రుల్లో సర్జికల్ మాస్కులుగా మాత్రమే పరిచయం ఉన్నవి కాస్త.. కరోనా టైం నుంచి మన జీవితాల్లో భాగం అయ్యాయి. వేవ్‌లు విరుచుకుపడుతున్నప్పుడల్లా మూతులకు అతుక్కుపోతున్నాయి. ఆంక్షలు, అభ్యంతరాల నేపథ్యంలో అవసరంకొద్దీ అప్పటికప్పుడు ఎంతైనా సరే చెల్లించి కొనేస్తున్నారు జనాలు. అయితే మాస్క్‌ల ఉత్పత్తి పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం ఇంకా దిగిరాకపోవడంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్ సహా ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మూడు పొరల సర్జికల్ మాస్క్ ధర ఒకటి రూ.10 నుంచి 15 రూ. మధ్య ఉంటోంది(డిజైన్లు, ఇతర కంపెనీలవి మినహాయించి). సాధారణ మెడికల్ షాపు ఓనర్ల నుంచి బిజీ ఏరియాల దగ్గర చిరువ్యాపారుల దాకా ఈ ధరకి ఫిక్సయిపోయారు. ఇక మండలాలు, రూరల్ ఏరియాల్లో ఇంతకంటే ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. సాధారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి సర్జికల్ బయటకు వచ్చేది రూపాయిలోపు(ఒక్కోటి) ధరకే!. మరి అన్నేసి రేట్ల రేటుకు అమ్మడం ఎందుకు?. ప్రతీకాత్మక చిత్రం మధ్యవర్తులే కారణం.. హైదరాబాద్ శివారులో దాదాపు పది యూనిట్ల నుంచి నిత్యం మాస్క్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ రోజులో లక్ష నుంచి 4 లక్షల దాకా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అంటే ఒక్క హైదరాబాద్ నుంచే రోజుకి 30 లక్షల సర్జికల్ మాస్కుల ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. ఇవిగాక మరో పది లక్షల మాస్క్‌లను ఢిల్లీ నుంచి దిగుమతి చేస్తున్నారు. మొత్తంగా 40 లక్షల మాస్క్‌లతో భారీ సప్లయి నడుస్తోంది. అయినప్పటికీ ధరలు మాత్రం దిగి రావట్లేదు. అయితే దళారులు, మధ్యవర్తుల కారణంగానే వీటి ధరలు అధికంగా ఉంటున్నాయని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు.. రిటైలర్స్‌కు 90పై. నుంచి 1.రూ.మధ్య అమ్ముతున్నారు. మొదటి వేవ్ నుంచి ఇదే ధర కొనసాగుతోంది కూడా. కానీ, రిటైలర్స్ నుంచి కొందరు దళారులు వీటిని కొనుగోలు చేసి.. మూడు నుంచి ఐదు రూపాయల కమిషన్‌తో కిందిస్థాయికి అమ్మకాలు చేస్తున్నారు. అందుకే తామూ అధిక ధరలకు అమ్ముతున్నామని మెడికల్ షాప్ ఓనర్లు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక మాస్క్ ధరించకపోతే ఫైన్లు విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వీళ్ల వ్యాపారానికి మరింత కలిసొస్తోంది. ప్రతీకాత్మక చిత్రం మాదేం లేదు కరోనా మొదటి, రెండో వేవ్‌ల టైంలో తెలంగాణలో మాస్క్‌ల కొరత నడిచింది. ఉత్పత్తి అస్థిరత వల్ల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు డిమాండ్‌కు మించి సప్లయ్ ఉంటున్నా.. అధిక ధరలకు అమ్ముతుండడం విశేషం. ఫస్ట్ వేవ్ కోనా టైంలో ఒక్కో మాస్క్‌ను 8రూ నుంచి 9రూ. గరిష్ట ధరకు అమ్మేవాళ్లు. అయితే తయారీదారులు ఇప్పుడూ పాత రేట్లకే అమ్ముతున్నా.. కస్టమర్‌కి మాత్రం ఐదు నుంచి పది రేట్లకు చిల్లు పడుతోంది. పైగా ఈ ఏడాది వేసవి తర్వాత ఉత్పత్తి గణనీయంగా పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. తెలంగాణలో సరిపడా యూనిట్లు ఉన్నాయని, ధరల విషయంలో మాదేం లేదంటున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. పైగా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి దందాలను, ధరల నియంత్రణను ప్రభుత్వాలే చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్లు. ప్రస్తుతం స్టాక్ వివరాలు ఎన్ 95 మాస్కులు.. 41 లక్షల కుపైనే 3 పొరల మాస్క్‌లు, కోటి 50 లక్షలకు పైనే పీపీఈ కిట్స్.. 8 లక్షలకుపైనే హోం ట్రీట్మెంట్ కిట్స్.. 8.71 లక్షలు కొసమెరుపు.. బల్క్‌గా త్రీ లేయర్స్ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్న కొందరు.. షాపులు, మెడికల్ స్టోర్లు కాకుండా రోడ్ల మీద, ఫుట్‌పాత్‌లపై రూ. 2 నుంచి 7రూ. మధ్య అమ్మేస్తున్నారు కొందరు. కానీ, వాటి క్వాలిటీపై నమ్మకం లేక చాలామంది దూరంగా ఉంటూ వస్తున్నారు. మాస్క్ మస్ట్.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందే వేరియెంట్. గాలి ద్వారా శరవేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేప్పుడు, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్‌లకు వెళ్లినప్పుడు మాస్క్‌లు(మూడు పొరలున్న ఎలాంటి మాస్క్‌లైనా సరే వాడడం మరీ మంచిది) ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై ఫైనల్ వర్డ్ ఇదే: ఆర్బీఐ -
యజమానికి కాసులు కురిపిస్తున్న గొర్రె.. మేళతాళాలతో ఊరేగింపుగా..
సాక్షి, మండ్య (కర్ణాటక): మామూలుగా ఒక గొర్రె రూ. 25–30 వేలు పలికితే గొప్ప. మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప అనే వ్యక్తి చిత్రంలోని ఈ గొర్రెను పెంచాడు. రెండేళ్ల క్రితమే రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టి కొన్నాడు. ఇప్పటివరకు అనేక పిల్లలు కూడా పుట్టి మంచి ఆదాయం పొందాడు. ఇప్పుడీ గొర్రెకు నాలుగేళ్లు. బీదరకోటె గ్రామవాసి కృష్ణగౌడ గొర్రె కథ విని దేవీపురకు వచ్చి రూ.1.91 లక్షలు చెల్లించి దీన్ని కొనుగోలు చేశాడు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు.. -
వామ్మో.. ఠారేత్తిస్తున్న ధరలు.. పక్షం రోజుల్లో డబుల్..
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పప్పులు, నూనెలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటగా.. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడికి గుదిబండగా మారుతున్నాయి. ఏ రకం కూరగాయ అయినా.. రూ.60కి తక్కువ పలకడం లేదు. దీంతో కూరగాయలు కొనాలంటే కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి నెలకొంది. కరోనా సెకండ్‌వేవ్ లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు వారం, పదిరోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్లి వారానికి సరిపడేలా కూరగాయలు కొనుగోలు చేసేవారు.. పెరిగిన ధరలతో ఏరోజుకారోజు కొంటున్నారు. ఇంట్లో ఉన్న వాటితోనే సరిపెట్టుకుని పూటగడిపే పరిస్థితి రాగా.. వర్షాకాలం నేపథ్యంలో ఈ ధరలు మరింత పేరిగే అవకాశం ఉందని విక్రయదారులు అంటున్నారు. తగ్గిన దిగుబడితో తంటాలు ఉమ్మడి జిల్లాలో బోయినపల్లి, సిరిసిల్ల, వేములవాడ, కోహెడ, హుస్నాబాద్, హుజూరా బాద్, చిగురుమామిడి, తిమ్మాపూర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. జిల్లాలో సగటున ఏడాదికి 75వేల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం స్థానికంగా దిగుబడి తగ్గడంతో హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కర్నూలు నుంచి కూరగాయులు వస్తున్నాయి. దీంతో ధరలు మండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడతో రైతులు పంటభూములను దుక్కిదున్నుతుంటారు. దీంతో పాతపంటను దాదాపు తీసివేస్తారు. ఈ క్రమంలో దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అదే విధంగా లాక్డౌన్లో కూరగాయలు సాగుచేసిన రైతులకు నష్టాలు రావడంతో ఇప్పుడు వేరే పంటలు వేస్తున్నారు. ఇదికూడా ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేక ధరలు పెరిగాయని విక్రయదారులు, కొనుగోలుదారులు అంటున్నారు. పక్షం రోజుల్లో రెట్టింపు ధరలు పదిహేను రోజుల కిత్రం ఉన్న కూరగాయల ప్రస్తుతం ధరలు రెండింతలు అయ్యాయి. ప్రధానంగా పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, క్యాప్సికం రూ.100కు చేరువలో ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రూ.5 పలికిన టమాట ప్రస్తుతం రూ.30కి కిలో అమ్ముడవుతోంది. వారంకిత్రం కిలో పచ్చిమిర్చి రూ.30 ఉండగా ఇప్పుడు రూ.80 పలుకుతోంది. కాకరకాయ రూ.60కి చేరింది. బెండ, చిక్కుడు, బీన్స్, వంకాయ, క్యారెట్ ఏదీ కొనేటట్టు లేదు. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.50, అంతకంటే ఎక్కువే. ఉల్లిగడ్డ మొన్నటి వరకు కిలో రూ.14, 15 ఉండగా.. ఇప్పుడు 30 అయ్యింది. ఎండకాలంలో వేసిన పంట ఉత్పత్తుల దిగుబడులు తగ్గడం, వర్షాకాలానికి ముందు వేసిన దిగుబడులు రావడానికి మరో పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో కూరగాయల ధరలు దిగి వచ్చే పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా పొదుపుగా కూరగాయలు కొంటున్నారు. చదవండి: సూది గుచ్చడంలో తేడాతో రక్తంలో గడ్డలు! -
వంట నూనె : పదకొండేళ్ల తర్వాత..
సాక్షి, న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వంట నూనె సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖల లెక్కలు ధృవీకరిస్తున్నాయి. దశాబ్దకాలంగా ఎన్నడూ లేనంత వ్యత్సాలతో వంట నూనె అధిక ధరకు చేరుకుంది. కరోనా, లాక్డౌన్ ఎఫెక్ట్‌తో వంట నూనె ధరలు మరింత పెరగడానికి కారణాలని గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ఎక్కువగా వాడుతున్న ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్స్ ధర సగటున మే నెలలో బాగా పెరిగిందని, గత పదకొండేళ్లలో ఇదే ఎక్కువని తెలుస్తోంది. పల్లీ, ఆవ, వనస్పతి, సోయా, సన్‌ఫ్లవర్, పామ్.. ఇలా దాదాపు ప్రతీ ఆయిల్ మీద ప్రభావం పడిందని అఫీషియల్ డేటా వెల్లడించింది. ముఖ్యంగా కరోనా మధ్యకాలంలో లాక్డౌన్ల వల్ల రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవిలకు విఘాతం కలగడం కూడా వంట నూనె ధరలు పెరగడానికి ఒక కారణంగా ఆ డేటా వెల్లడించింది. ఎంతెంతంటే.. రాష్ట్రాల పౌర సరఫరా విభాగాలు సమర్పించిన డేటా ఆధారంగా ఆయిల్ ధరలు.. జనవరి 2010 తర్వాత ఇప్పుడు అధిక వ్యత్యాసాలతో పెరిగాయని తెలుస్తోంది. సాధారణ నూనె 2010లో 63 రూపాయలకు కేజీ ఉండగా, ఇప్పుడది 155 రూపాయలకు చేరుకుంది. ఆవ నూనె కేజీకి పోయినేది ఇదే టైంకి 118 రూపాయలు ఉండగా, 39 శాతం పెరిగి 164 రూపాయలకు చేరుకుంది. ఇక మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే పామ్ ఆయిల్ పిరం అయ్యింది. పోయినేడాది కేజీ పామ్ ఆయిల్ ధర 88 రూపాయలుగా ఉండగా, ఇప్పుడు అది 131 రూపాయలకు చేరుకుంది. అంటే 49 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇదే పామ్ ఆయిల్ ధర 2010లో 49 రూపాయలుగా ఉంది. మిగిలిన ఎడిబుల్ ఆయిల్స్ ప్రస్తుత పౌర సరఫరా శాఖల లెక్కల ప్రకారం.. వేరుశనగ నూనె(పల్లీ) కేజీ రూ.175.50, వనస్పతి 127 రూపాయలు, సోయా 148 రూపాయలు, సన్‌ఫ్లవర్ 170 రూపాయలకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ నాలుగు ఆయిల్స్ ధరలు 19 నుంచి 52 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. తక్షణ చర్యల కోసం.. కాగా, ఎడిబుల్ నూనెల ధరల పెరుగుదలను పదకొండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యల కోసం ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ సోమవారం స్టేక్‌హోల్డర్స్ అందరితో ఒక సమావేశమైంది. ఆయిల్ ధరలు తగ్గే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఈ మీటింగ్‌లో రాష్ట్రాలను కోరింది. అంతేకాదు కేంద్ర కూడా నిల్వలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. -
ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే లైసెన్సులు రద్దు
సాక్షి, అమరావతి: కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎరువులు కొనుగోలు చేస్తున్నప్పుడు బస్తాపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా కూడా చెల్లించవద్దన్నారు. డీలర్ నుంచి విధిగా రసీదు పొందాలని సూచించారు. ఎవరైనా డీలర్లు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే.. స్థానిక వ్యవసాయాధికారికి గానీ, సమీకృత రైతు సమాచార కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 15521కి గానీ ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ 19 నాటికి 6.63 లక్షల ఎంటీల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు 20.45 లక్షల టన్నులను కేంద్రం కేటాయించిందని.. వాటిని నెలవారీ కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి సరఫరా చేస్తారని తెలిపారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలతో పాటు వాటిపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల వివరాలను రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో అంతర్గత తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి రిటైల్, హోల్‌సేల్, తయారీదారుల స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలని ఆయన వ్యవసాయ శాఖ సంచాలకులకు ఆదేశాలిచ్చారు. -
పసిడి డిమాండ్‌కు కరోనా కాటు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభం, ఆకాశాన్నంటిన ధరలతో పసిడికి డిమాండ్ భారీగా పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020 సంవత్సరంలో దేశీయంగా పుత్తడి డిమాండ్ 25 ఏళ్ల కనిష్టానికి క్షీణించింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2020 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 25 సంవత్సరాల కనిష్టానికి చేరింది. (అన్ని ఆభరణాలకూ హాల్‌మార్క్ అమలయ్యేనా?) 2019లో 690.4 టన్నులతో పోలిస్తే ఇది 446 టన్నులకు పడిపోయింది. 1995లో 462 టన్నుల వద్ద డిమాండ్ చివరిసారిగా పెరిగిందని డబ్ల్యుజీసీ ఇండియా పీఆర్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం వెల్లడించారు. డబ్ల్యుజీసీ డేటా ప్రకారం మొత్తం ఆభరణాల డిమాండ్ 2019 లో 544.6 టన్నులతో పోలిస్తే భారతదేశంలో (సమీక్షించిన కాలంలో) 42 శాతం పడి 315.9 టన్నులుగా ఉంది. 2020 లో ఆభరణాల డిమాండ్ 22 శాతం తగ్గింది. విలువ పరంగా ఇది రూ. 133.260 కోట్లు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఆంక్షలకు తోడు, బంగారం ఆల్ టైం ధరల నేపథ్యంలో 2020 లో భారతదేశ బంగారం డిమాండ్ మూడో వంతు పడిపోయింది. అయితే విలువ పరంగా చూసినప్పుడు ఈ డ్రాప్ గణనీయంగా తక్కువగా ఉంది. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపు, పండుగ సీజన్‌నే పథ్యంలో బంగారానికి డిసెంబర్ త్రైమాసికం ఆశలను రేకెత్తించింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 137.3 టన్నులకు పెరిగింది. ఈకాలంలో పెట్టుబడులుకూడా 8 శాతం పెరిగి 48.9 టన్నులకు చేరుకుంది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 186.2 టన్నులుగా ఉంది, ఇది అంతకుముందు 2019 లో (194.3 టన్నులు) పోలిస్తే 4 శాతం తగ్గింది. విలువ పరంగా, డిమాండ్ 26 శాతం పెరిగి రూ .82.790 కోట్ల రూపాయలుగా ఉంది. గ్లోబల్ వ్యూ 2020నాటికి, ప్రపంచ డిమాండ్ 3,759.6 టన్నులతో 14శాతం తగ్గింది. 2020లో వినియోగదారుల డిమాండ్ బలహీనపడటం వెనుక కీలకమైన కారణం కరోనా మహమ్మారేని డబ్ల్యుజీసీ తెలిపింది. 2009 తరువాత గ్లోబల్‌గా మొదటిసారి వార్షిక ప్రాతిపదికన పసిడి డిమాండ్ 4వేల టన్నుల మార్క్ కంటే దిగువకు పడి పోయింది. అయితే 2021వ సంవత్సరం బంగారానికి మంచి సంవత్సరంగా ఉండనుందని సోమసుందరం అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్లు కోవిడ్-19 ఆర్ధిక సంక్షోభ ప్రభావానికి ఇంకా పూర్తిగా గురి కాలేదు. ఆ తర్వాత, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో డిమాండ్ ప్రభావితమవుతుందని అంచనా వేశారు. -
బొప్పాయి..బాదుడేనోయి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ, మలేరియా, డయేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఔషధగుణాలున్న బొప్పాయి పండ్లకు ఎన్నడూ లేనంత గిరాకీ పెరిగింది. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్లు బొప్పాయి సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. అన్ని జిల్లా, మండల ప్రధాన ఆస్పత్రులన్నీ డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోతున్నాయి. దీనికితోడు వర్షాల సీజన్ కావడంతో కలుషిత నీటితోనూ ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగులు బొప్పాయి పండ్లను ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంకా పలు రకాల మేలు కలుగుతుందని చెబుతున్నారు. ఎక్కడ నుంచి సరఫరా... రాష్ట్రంలో పెద్ద సైజు బొప్పాయి పండ్లు అధికంగా ఖమ్మం, జహీరాబాద్, కల్వకుర్తి, అచ్చంపేట, ఒంగోలు నుంచి, చిన్నసైజు బొప్పాయిలు నల్లగొండ, వరంగల్, కర్ణాటకలోని గుల్బర్గా, ఏపీలోని నూజివీడుల నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. ధర.. దడదడ గత ఏడాది ఇదే సమయానికి గడ్డిఅన్నారం మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులు పెద్దరకం బొప్పాయి కిలో రూ.8 నుంచి రూ.10కి విక్రయించారు. అది కాస్త ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40కి పెరిగింది. దీన్ని రిటైల్ వ్యాపారులు కిలో రూ.80కి అమ్ముతున్నారు. సూపర్ మార్కెట్లలో కిలో రూ.100కి అమ్ముతున్నారు. ఇక జిల్లాల్లో పెద్దరకం బొప్పాయిలు అందుబాటులో లేవు. చిన్నసైజు బొప్పాయి ధర సైతం జిల్లాలో కిలో రూ.80కి తక్కువగా లేదు. అయితే, గడ్డిఅన్నారం మార్కెట్‌కు శుక్రవారం 80 టన్నుల మేర బొప్పాయి పండ్లు వచ్చినట్లు మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నారు. ఇదే రీతిన మార్కెట్లో బొప్పాయి వస్తేనే ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. మేలు ఇలా.. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేందుకు, శరీరంలోని కొవ్వును తగ్గించడానికి దోహదపడుతుంది. గుండెపోటు నివారణకు, జలుబు, జ్వరంతో బాధపడేవారికి మంచి ఔషధం.. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ∙లివర్ సిరోసిస్ వంటి కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. -
ఆగని ఇసుక దందా
రేణిగుంట మండలంలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా స్వర్ణముఖీ నదిలోని అనధికారిక రీచ్‌ల నుంచి ఇసుకను నిరాటంకంగా తరలిస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు పలుమార్లు దాడులు జరిపి కేసులు బనాయించినా మార్పు కనిపించడం లేదు. పంట పొలాల్లోనే ఇసుకను తోడేస్తున్నారు. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది. సాక్షి, రేణిగుంట : మండలంలోని స్వర్ణముఖీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏర్పేడు దుర్ఘటన నేపథ్యంలో కొంతకాలం పాటు మెరుపుదాడులతో అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. అనంతం పర్యవేక్షణ లోపించడంతో మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రేణిగుంట మండలం కొట్రమంగళం, గాజులమండ్యం, వెంకటరెడ్డి కండ్రిగ, జీపాళెం, కొత్తపాళెం, జీవాగ్రం తదితర గ్రామాల నుంచి నిత్యం వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. నకిలీ పర్మిట్లతో.. నకిలీ పర్మిట్లతో కొట్రమంగళం ప్రాంతం నుంచి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తిరుపతికి తరలించి సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు అడపాదడప దాడులు నిర్వహిస్తున్నా వీరు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. అధికారికంగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నా చాలా వరకు సరైన పర్మిట్లు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా అరికట్టే బాధ్యత వీరిది.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు అధికారిక రీచ్‌ల నుంచి ఇసుక తరలింపు పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఉంది. వీరిలో తహసీల్దార్‌తోపాటు, పోలీసు అధికారులు, ఎంపీడీఓ, గ్రామ రెవెన్యూ అధికారి, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సభ్యులుగా ఉంటారు. అయితే క్షేత్రస్థాయిలో కేవలం రెవెన్యూ, పోలీసు అధికారులనే బాధ్యులను చేస్తున్న పరిస్థితి. తరలింపు నిబంధనలివీ.. అధికారికంగా ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ప్రజా అవసరాల నిమిత్తం తరలించడానికి ట్రాక్టర్ యజమానులు కొన్ని నిబంధనలు పాటించాలి. అధికారిక రీచ్‌లలో అదనపు రేట్లు ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం మండలంలో నాలుగు చోట్ల అధికారిక రీచ్‌లను ఏర్పాటు చేసింది. అయితే ఇసుకాసురులు ప్రభుత్వం విధించిన నియమాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన పర్మిట్లు లేకపోగా అధిక ధరలకు అమ్ముకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. అయితే అన్నీ తెలిసినా అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారో అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను నివారించండి మండలంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ పూర్వస్థితికి చేరింది. కొందరు నకిలీ పర్మిట్లు సృష్టించి ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నారు. ఇసుకను ఉచితం చేసినా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ట్రాక్టర్ల యజమానులు విక్రయించడం లేదు. రెవెన్యూ, పోలీసు అధికారులు నిఘా పెట్టాలి. – ప్రభాకర్, రేణిగుంట చర్యలు తీసుకుంటాం ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే పోలీసు అధికారుల సహకారంతో తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలు మార్లు దాడులు చేసి కేసులు పెట్టాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినా చర్యలు తప్పవు. – నరసింహులునాయుడు, తహసీల్దార్, రేణిగుంట -
తారల్లో కూరలు
సిటీలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మరీ ముఖ్యంగా పచ్చిమిర్చి రేటు మూడు రోజుల్లోనే రెట్టింపైంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80కు విక్రయిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రూ.10 కిలో ఉన్న టమాటా రూ.30కి చేరింది. బెండ, దొండ, బీన్స్, బీరకాయ ధరలు కిలో రూ.40 దాటాయి. దీంతో మధ్య తరగతి జనం బెంబేలెత్తుతున్నారు. గ్రేటర్ ప్రజల అవసరాలకు తగినట్లుగా శివార్లలో కూరగాయల సాగు ఉండడం లేదు. దీంతో అన్నీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది పచ్చిమిర్చి సాగు బాగా తగ్గిందని అందుకే ధర రెట్టింపైందని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో బాబోయ్ ఇవేం ధరలు. వేసవిలో ఎండలతో పాటు కూరగాయలూ మండుతున్నాయి. ధరలు కుతకుత ఉడుకుతూ సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. పచ్చిమిర్చి మిరామిరామంటోంది. బీన్స్ బెంబేలెత్తిస్తోంది. చిక్కుడు చికాకెత్తిస్తోంది. ఇలా ఒక కూరగాయని ఏమిటి అన్నీ తామేం తక్కువ తినలేదని తార పథానికి దూసుకుపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే కాయగూరల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది. గడచిన వారం రోజుల్లో కూరగాయల ధరలు రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మే నెలలోనే ఇలా ఉంటే ఇక జూన్, జూలై నెలల్లో ధరలు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన సగటు జీవుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో ఈ నెల మొదటి వారంలో టమాటా కిలో 15 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ.30కి ఎగబాకింది. వంకాయ రూ.15 నుంచి రూ.50 చేరింది. బెండకాయ రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.60 అయింది. దొండకాయ పరిస్థితి ఇలాగే ఉంది. బీరకాయ రూ.40 నుంచి రూ.80కి చేరింది. బీన్స్, చిక్కుడు ధరలు శతకానికి చేరువలో ఉన్నాయి. రెండు మూడు రోజుల క్రితం కిలో రూ.30– 40 ఉన్న కిలో పచ్చిమిర్చి సోమవారం రూ. 80కి ఆకాశాన్నంటింది. ఇలా కూరగాయల ధరల పరిస్థితి నెలకు అవతల, నెలకు ఇవతల డబులై కూర్చున్నాయి. దీంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండిపోతున్న ధరలు కేవలం కొనుగోలుదారులనే కాదు అమ్మకపుదారులను కూడా కష్టాల్లోకి నెట్టేస్తోంది. పావుకిలో కూడా కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అంటూ సాధారణ కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తంచేస్తుంటే.. ఏం అమ్మేటట్టు లేదు ఏం మిగిలేటట్టు లేదు అని కూరగాయల అమ్మకందారుల చెబుతున్నారు. పచ్చిమిర్చి ఘాటుకు కారణమిదే.. నగర ప్రజల పచ్చిమిర్చి అవసరాలు తీర్చడానికి శివారు ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతి అవుతోంది. ఇటీవల అకాల వర్షాలతో మిర్చి పంటకు తీవ్ర ఇష్టం జరిగింది. దీంతో మిర్చి సరఫరా తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నగరానికి మిర్చి సరఫరాల తగ్గింది. నగరానికి రోజు దాదాపు 12 వందల నుంచి 15 వందల క్వింటాళ్ల మిర్చి అవసరం. సోమవారం నగరానికి కేవలం సుమారు 850 క్వింటాళ్ల మిర్చి మాత్రమే వివిధ హోల్‌సేల్ మార్కెట్లకు దిగుమతి అయింది. మిర్చి తక్కువగా దిగుమతి అవడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో మిర్చి క్వింటాల్ ధర రూ.5 వేల నుంచి రూ.6వేలు పలుకుతోంది. తగ్గిన స్థానిక దిగుమతులు.. మార్కెట్‌కు ప్రస్తుతం పెద్ద మొత్తంలో టమాటా మాత్రమే దిగుమతి అవుతోంది. ఈ ఏడాది నగర శివారు జిల్లాలైన వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ రైతలు టమాటా పండించటంతో ఎక్కువగా దిగుమతి అయ్యేవి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా టమాటా దిగుమతులు ఎక్కువగా ఉండడంతో వీటి ధర కిలో రూ30 దాటలేదు. కాగా.. టమాటాతో పాటు మిగతా కూరగాయలు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్ర్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదు గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా దాదాపు కోటిమంది. వీరికి ప్రతి రోజు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగమవుతున్నాయి. ప్రతి ఒక్కరికి 300 గ్రాముల కూరగాయలు అవసరం. వేసవి ఆఫ్ సీజన్లో నగర ప్రజల 70 శాతం కూరగాయల అవసరాలు ఇతర రాష్ట్రాల దిగుమతులతో పూర్తవుతాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు రాకపోవడంతో ధరలు మండుతున్నాయి. దిగుబడులు తగ్గడంతో ధరలు పెరిగాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఆలస్యంగా పెరిగాయి. ఇందుకు కారణం వర్షాలు డిసెంబర్ వరకు కురిశాయి. స్థానికంగా కూరగాయల దిగుమతులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల నుంచి మిర్చి, కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. – కె. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
బాటిల్‌పై బాదేస్తున్నారు!
► బస్టాండ్లలో వాటర్ బాటిళ్లకు అడ్డగోలు రేట్లు ► రూ.20 నీటి సీసా రూ.25కు విక్రయం.. ► ఎమ్మార్పీని ఏమార్చి బిల్లులు ..జనానికి తప్పని తిప్పలు సాక్షి, హైదరాబాద్ : ..ఇది ఈ ఒక్కచోటే జరుగుతున్న తంతు కాదు! రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. నీళ్ల సీసాలను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారు. బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.20 కాగా.. ఏకంగా రూ.5 అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతు న్నారు. కొందరు ప్రయాణికులు ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా గట్టి చర్యలు తీసుకోవడం లేదు. సొంత లోగో.. అయినా ఆగని దోపిడీ! ఇటీవల ఆర్టీసీ ఓ వింత నిర్ణయం తీసుకుంది. బస్టాండ్లలో కేవలం బిస్లరీ కంపెనీ మంచినీటి సీసాలనే విక్రయించేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ నీటి సీసాపై బిస్లరీ వివరాలతోపాటు ఆర్టీసీ లోగో కూడా ముద్రిస్తున్నారు. నాసిరకం నీటి విక్రయాల నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ ప్రకటించింది. దీనిపై ఇతర కంపెనీలు కోర్టును ఆశ్రయించటంతో ఆ కేసు కొనసాగుతోంది. ఆ సంగతి అటుంచితే... ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త సమస్యకు కారణమైంది. సాధారణంగా బస్టాండ్లలో మంచినీటి బాటిల్స్ సహా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి అమ్ముతుంటారు. ఇదంతా తెలిసినా ఆర్టీసీ నియంత్రించడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ లోగోతో వచ్చిన వాటర్ బాటిల్స్‌ను కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. దీనిపై ఆర్టీసీకి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో.. వాటి అసలు ధర (రూ.20)ను తెలియజేస్తూ స్టిక్కర్లు అతికించి చేతులు దులుపుకొన్నారు. వాటిని ఖాతరు చేయని వ్యాపారులు రూ.25 చొప్పున అమ్ముతున్నారు. నీటి ప్లాంట్ల ఊసే లేదు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎమ్మెల్సీగా ఉండగా తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 32 ఆర్టీసీ బస్టాండ్లలో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయించారు. హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ఇవి ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వీటిల్లో పది మాత్రమే పనిచేస్తున్నాయి. నీటిని శుద్ధి చేసి ఉచితంగా ప్రయాణికులకు అందుబాటులో ఉంచటం దీని ఉద్దేశం. పేద ప్రయాణికులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అన్ని బస్టాండ్లలో దశలవారీగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వ్యాపారులకు మేలు చేసేందుకే అన్నట్టుగా ఆర్టీసీ వీటి ఏర్పాటును పూర్తిగా విస్మరించింది. కేవలం మామూలు నీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆ ప్రాంతం అపరిశుభ్రంగా ఉంటుండటంతో ఆ నీటిని తాగేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. దీంతో కచ్చితంగా బాటిల్ నీటిని కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణమైన వరంగల్ సహాæ కరీంనగర్, నిజామాబాద్ లాంటి రద్దీ బస్టాండ్లలో కూడా మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేయలేదు. కళ్లు మూసుకున్న ప్రజాప్రతినిధులు మంచినీటి కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం స్పందించడం లేదు. ఒకరిద్దరు మినహా ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ ఈ విషయంలో స్పందించ లేదు. బ»స్టాండ్లలో ప్రయాణికుల వసతి మెరుగుపరిచేందుకు ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ల నుంచి ప్రజాప్రతినిధులకు లేఖలు అందాయి. కానీ గడచిన ఏడాది కాలంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మంచినీటి శుద్ధి ప్లాంటును ప్రతిపాదించలేదు. బస్టాండ్లలో సింహభాగం దుకాణాలు ఎమ్మెల్యేల అనుచరులవే కావటమే దీనికి కారణం. ఎమ్మార్పీకి అమ్మితే నష్టమట తమకు సరఫరా అయ్యే నీటి సీసాల్లో కొన్ని లీకేజీలతో వస్తున్నాయని, ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తుందని, అలాంటప్పుడు ఎమ్మార్పీ ధరలకు నీటి సీసాలు అమ్మితే నష్టం వస్తుందని దుకాణదారులంటున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే ధర పెంచి అమ్ముతున్నామని పేర్కొంటున్నారు. అంటే.. పరోక్షంగా అధికారుల సమ్మతితోనే ఈ దందా నడుస్తోందని స్పష్టమవుతోంది. ఈయన పేరు మేకల నాంపల్లి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామం. ఓ పనిపై కరీంనగర్ వచ్చి సొంతూరికి తిరుగుపయనమయ్యాడు. దాహం వేయటంతో బస్టాండ్‌లో మంచినీళ్ల బాటిల్ కొనేందుకు వెళ్లాడు. రూ.25 చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. ఆయన ఊరికి బస్ టికెట్ ధర రూ.16. వాటర్ బాటిల్ ధర మాత్రం రూ.25. చివరికి అంత ధర పెట్టలేక దాహం తీర్చుకోకుండానే బస్సెక్కాడు. అదే బస్టాండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ ఇది. ఈ నెల 13న ఓ ప్రయాణికుడు ఇందులో వాటర్ బాటిల్ కొనగా.. రూ.25కు బిల్ ఇచ్చారు. నిజానికి ధర రూ.20 మాత్రమే. పైగా బిల్‌పై వాటర్ బాటిల్ పేరు కాకుండా ‘మిస్లేనియస్’ అని రాశారు. సరిగ్గా ఆ దుకాణం ముందే ఆర్టీసీ కంట్రోలర్ కూర్చుని ఉండటంతో ప్రయాణికుడు ఆయనకు ఫిర్యాదు చేశాడు. ఆయన పట్టించుకోకపోవటంతో ఫోన్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు ఆ కంట్రోలర్‌ను హెచ్చరించి దుకాణం ముందు మంచినీటి సీసా ధర రూ.20 అని సూచిస్తూ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటిదాకా బోర్డు ఏర్పాటు చేయలేదు. బస్టాండ్లలో ఇదీ పరిస్థితి.. ♦ కరీంనగర్ బస్టాండ్‌కు రద్దీ అధికంగా ఉంటుంది. నిత్యం దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. బస్టాండ్‌లో ఎక్కడ చూసినా నీటి సీసాలు అమ్మే దుకాణాలే. శుద్ధి చేసిన నీటిని ఉచితంగా అందుబాటులో ఉంచాలన్న ఆలోచన ఆర్టీసీకి రావడం లేదు. ♦ కేంద్రం ప్రతిపాదించిన స్మార్ట్ సిటీ జాబితాలో వరంగల్ ఉంది. ఇక్కడి హన్మకొండ బస్టాండ్‌కు నిత్యం 35 వేల మంది వరకు ప్రయాణికులు వస్తారు. ఇక్కడా నీటి శుద్ధి ప్లాంటు లేదు. ♦ మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో నీటి శుద్ధి ప్లాంటు మరమ్మతుకు చేరి మూతపడింది. అధికారుల నిర్లక్ష్యంపై ‘సాక్షి’లో కథనం రావటంతో ఇటీవలే దాన్ని పునరుద్ధరించారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా పలు బస్టాండ్లలో 32 చోట్ల నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నా.. అందు లో 20 వరకు పనే చేయటం లేదు. అధికారులు ప్రతిపాదిస్తే చూస్తాం ఏ డిపోకు ఏ అవసరాలుంటాయో పరిశీలించి తదనుగుణంగా హైదరాబాద్‌లో ఉండే ఉన్నతాధికా రులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డిపోలకు కొత్త భవనాలు, కొత్త బస్సులు, బస్టాండ్లలో వసతుల కల్పన.. ఇలా అన్ని విషయాలపై సమీక్షల్లో చర్చించి చర్యలు తీసుకుంటారు. కానీ.. ఉచిత మంచినీటి శుద్ధి కేంద్రాల విషయంలో మాత్రం వారి తీరు విస్తుపోయేలా ఉంటుంది. ఎందుకంటే.. ఆయా బస్టాండ్లలో మంచినీటి ప్లాంటు ఎందుకు అవసరమో వివరిస్తూ విడిగా ప్రతిపాదన ఉన్నతాధికారులకు అందజేయాలి. అలా ప్రతిపాదన వస్తే దాని ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలించి చర్యలు తీసుకుంటామనేది ఉన్నతాధికారుల వాదన. దీనిపై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే... ఇప్పటివరకు తమకు నీటి శుద్ధి ప్లాంట్లు కావాలంటూ డిపో అధికారుల నుంచి ప్రతిపాదనలు రాలేదని పేర్కొనటం విశేషం. వాటర్ బాటిళ్ల ధరలను తెలిపే స్టిక్కర్లు ఇవి. చల్లని బాటిల్ రూ.21, మామూలు బాటిల్ రూ.20 చొప్పున అమ్మాలని, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కానీ.. దీన్ని అతికించిన వెంటనే ధర కనపడకుండా ఇలా చించేయడం, వేరే కాగితాలు అతికించటం చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు ఎవరికీ కన్పించకుండా దుకాణాల పైభాగంలో అతికించి వారికి పరోక్షంగా సహకరిస్తున్నారు. -
ఏం చర్యలు తీసుకుంటున్నారు..!
► వాటర్ బాటిల్స్ అధిక ధరపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్: రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బస్స్టేషన్లు తదితర చోట్ల వాటర్ బాటిళ్లను గరిష్ట అమ్మకపు ధర (ఎంఆర్పీ) కన్నా అధికంగా విక్రయిస్తున్నా తూనికలు, కొలతల శాఖ పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పెండ్యాల సతీష్‌కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఎంఆర్పీ కన్నా అధిక ధరకన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిం చాలంటూ పౌర సరఫ రాలశాఖ ముఖ్య కార్యదర్శి, తూనికలు, కొలతలశాఖ కంట్రోలర్లను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. -
‘అక్షయ’ అమ్మకాలపై అధిక ధరల ప్రభావం
♦ 11 శాతం పెరిగిన ధరలు ♦ 20-30 శాతం తగ్గనున్న అమ్మకాలు ముంబై: అధిక ధరలు అక్షయ తృతీయ అమ్మకాలపై ప్రభావం చూపాయి. పుత్తడి ధరలు 11 శాతం పెరగడంతో గత ఏడాది కంటే అమ్మకాలు 20-30 శాతం వరకూ తగ్గవచ్చని పరిశ్రమ సంబంధిత కొన్ని సంఘాలు పేర్కొన్నాయి. వివిధ సంస్థలు భారీగా డిస్కౌంట్లు అఫర్ చేస్తున్నప్పటికీ, కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని సమాచారం. గత ఏడాది అక్షయ తృతీయ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.27,100గా ఉండగా, ఈ ఏడాది అక్షయ తృతీయ రోజు ధర రూ.30,100గా ఉంది. ధరలు అధికంగా ఉండడంతో పాటు రూ.2 లక్షలకు మించిన బంగారు కొనుగోళ్లపై పాన్ నంబర్ తప్పనిసరిగా వెల్లడించాల్సిరావడం తదితర అంశాలు ఈ ఏడాది అమ్మకాలపై తీవ్రమైన ప్రభావమే చూపాయని గీతాంజలి గ్రూప్ సీఎండీ మెహుల్ చోక్సి చెప్పారు. అయితే అమ్మకాలు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, విలువ పరంగా 10 శాతం వృద్ధి ఉందని పీసీ జ్యూయలర్ ఎండీ బలరామ్ గార్గ్ పేర్కొన్నారు. ధరలు పెరగడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈసారి డిమాండ్ 60 శాతం తగ్గిందని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. -
ధరల దరువుపై యుద్ధ భేరి
వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన విశాఖ వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీని అడ్డగించిన పోలీసులు అమర్నాథ్ సహా పలువురి అరెస్ట్ కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే బూడి నేతృత్వంలో ధర్నా అధిక ధరలపై నిరసన వెల్లువెత్తింది. నినాదాలతో నగరం హోరెత్తింది. సర్కార్ వైఫల్యాలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఆందోళనలో పాల్గొన్న ప్రజలను నిలువరించేందుకు పోలీసులు కర్కశ త్వాన్ని ప్రదర్శించారు. అడగుడుగునా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు విఫలయత్నం చేశారు. ర్యాలీని అడ్డుకొని, పార్టీ ముఖ్యనేతలందరినీ అదుపులోకి తీసుకున్నా కలెక్టరేట్ వద్ద ధర్నాను మాత్రం ఆపలేక పోయారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని వామపక్షాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. విశాఖపట్నం: ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం విశాఖలో తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సరస్వతీ పార్కు నుంచి జగదాంబ జంక్షన్, కేజీహెచ్ అప్రోడ్ మీదుగా ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకోసం ముందుగా పోలీసుల అనుమతి కూడా కోరింది. బుధవారం రాత్రి వరకు అభ్యంతరం లేదని చెప్పిన పోలీసులు గురువారం తెల్లవారేసరికి సెక్షన్-30, 31లు అమలులో ఉన్నందున ర్యాలీకే కాదు.. ధర్నాకు కూడా అనుమతినిచ్చేది లేదని మాట మార్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ నిలువరించేందుకు నగరానికి దారితీసే గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక, హనుమంతవాకలతోపాటు నగరంలోని ఎన్ఏడీ జంక్షన్, మద్దిలపాలెం, పెందుర్తి, దుర్గాలమ్మ గుడి, ఓ ఆప్టెక్స్ సెంటర్, కంచరపాలెం, ఊర్వశి తదితర ముఖ్య కూడళ్లలో భారీగా పోలీసులను మోహరింపచేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోపక్క ర్యాలీ ప్రారంభమయ్యే సర స్వతీ పార్కు, వైఎస్సార్సీపీ కార్యాలయం, జగదాంబ జంక్షన్లలో నగరంలోని రోప్ పార్టీలతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. శివార్లలో ఎన్ని ఆంక్షలు పెట్టినా పార్టీ కార్యాలయానికి వేలాదిగా జనం పోటెత్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్ కుమార్, మళ్ల విజయప్రసాద్, కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజు, రొంగలి జగన్నాథం, రాష్ర్ట అధికార ప్రతినిధులు కొయ్యా ప్రసాదరెడ్డి, కంపా హనోకు, రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, అనుబంధ విభాగాల జిల్లా, నగర కమిటీల అధ్యక్షులు పసుపులేటి ఉషాకిరణ్, బోని దేవ, బోని శివరామకృష్ణ, మహ్మద్ షరీఫ్, జబీరా బేగం, తుల్లి చంద్రశేఖర్, నగర ప్రచార కార్యదర్శి బర్కత్ అలీ, పక్కి దివాకర్, సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పార్టీ శ్రేణులతో చర్చించి ర్యాలీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలతో జగదాంబ జంక్షన్ కిక్కిరిసిపోవడంతో ఏసీపీలు పాపారావు, రమణలకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ర్యాలీకి అనుమతిస్తున్నామని, నినాదాలు, బ్యానర్లు లేకుండా బృందాలుగా జిల్లా కోర్టు పక్క నుంచి వెళ్లాలని నాయకులకు సూచించారు. పార్టీ శ్రేణులు కొద్ది దూరం వెళ్లేసరికి పోలీసులు అడ్డగించి ర్యాలీకి అనుమతిచ్చే ప్రసక్తి లేదంటూ బలవంతంగా వ్యాన్లలో ఎక్కించారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లిపోయారు. ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేసి ఫోర్త టౌన్, భీమిలి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు మాత్రం పోలీసుల కళ్లుగప్పి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటికే వివిధ డివిజన్ల నుంచి అక్కడకు చేరుకున్న కార్యకర్తలు ధర్నాకు ఉపక్రమించారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, నర్సీపట్నం కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర గణేష్ తదితరులు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి సుమారు రెండుగంటలపాటు ధర్నా చేశారు. అనంతరం ఏఓ ప్రకాశరావుకు వినతిపత్రం సమర్పించారు. -
ధరల పెరుగుదలపై సీపీఐ ధర్నా
వైఎస్సార్ జిల్లా: ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఐ కార్యకర్తలు వైఎస్సార్ జిల్లా బద్వేల్ తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. నిత్యావసర ధరలు పెరిగిపోయి జనం ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
ధరల కిక్కుకు.. ఇక చెక్!
‘మందు’స్తు వ్యూహం ! - మద్యం దుకాణాల్లో హేలోగ్రాఫిక్ మెషీన్లు తప్పనిసరి - బిల్లింగ్ విధానంలో మార్పులు - పది రోజుల్లో జిల్లాలో అమలు రాజమండ్రి రూరల్ : మద్యం దుకాణాల్లో అధిక ధరల విక్రయాలకు చెక్ పెట్టేందుకు ఆశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇకపై హేలోగ్రాఫిక్ తప్పనిసరి చేస్తూ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. బిల్లింగ్ విధానంలోనూ మార్పులు తేనున్నారు. అన్ని సక్రమంగా జరిగితే పదిరోజుల్లో జిల్లాలో ఈ నూతన ప్రక్రియను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయాలు సాగించకుండా సరికొత్త విధానాన్ని మద్యం దుకాణాల్లో ప్రవేశపెడుతున్నామని గతం నుంచీ అధికారులు చెబుతూ వస్తున్నారు. వాణిజ్యకేంద్రాల్లో ఉండే హేలోగ్రాఫిక్ బిల్లింగ్ సిస్టంను జిల్లాలోని మద్యంషాపుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కానీ నేటీకీ ఆచరణలో పెట్టలేకపోయారు. ఈలోపు కొత్త మద్యం పాలసీ వచ్చింది. ఆగస్టు ఒకటి నుంచి శాశ్వత లెసైన్‌స మంజూరు చేయనున్నారు. అది కావాలంటే హేలోగ్రాఫిక్ విధానం మద్యం దుకాణాలలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. 2015-17 ఎక్సైజ్ పాలసీతో జిల్లాలో 562 మద్యంషాపులకు జూన్ 22న కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 57 షాపులను పూర్తిగా ప్రభుత్వం నిర్వహించనుంది. మిగతా 505 షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించగా, అందులో 458 షాపులు నడుస్తున్నాయి. మిగతా 47 షాపులకు ఎటువంటి దరఖాస్తులు రాలేదు. రెండేళ్ల కాలానికి ఇచ్చే ఈ లెసైన్‌స 2017 జూన్30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. అయితే షాపులు దక్కించుకున్న వారికి తాత్కాలిక లెసైన్‌సలు మాత్రమే ఇచ్చారు. లాటరీ ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకు గ్యారంటీలు చెల్లించి పర్మినెంట్ లెసైన్‌సలు పొందాలని సూచించారు. కొంత మంది గ్యారంటీలు చెల్లించకపోవడంతో ఈనెలాఖరు వరకు గడువు పెంచారు. ఆగస్టు ఒకటిన శాశ్వత లెసైన్‌సలు మంజూరు చేయనున్నారు. ప్రతి ఒక్కరూ హోలోగ్రాఫిక్ సిస్టంను ఏర్పాటు చేయాల్సిందేన ని అధికారులు చెబుతున్నారు. హేలోగ్రామ్ ఏం చేస్తుంది.. మద్యం బాటిల్‌పై ఉండే హోలోగ్రామ్‌ను హేలోగ్రాఫిక్ పరికరం వద్ద ఉంచితే ఆటోమేటిక్‌గా దాని ధర కంప్యూటర్లో నమోదై బిల్లు వచ్చేస్తుంది. మద్యం ప్రియులు బిల్లు తీసుకుని దాని మేరకే సొమ్ము చెల్లిస్తారు. ఇప్పటికే ఈ పరికరాలు చాలా మద్యం దుకాణాలకు చేరాయి. ఈ ఏడాది ఎక్సైజ్ పాలసీలో కొత్త నిబంధనలు పెట్టారు. రెండేళ్ల కాలానికి సంబంధించి ఆదాయ పన్ను ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని, వ్యాట్ పరిధిలో ఉంటే సంబంధిత పత్రం చెల్లించవచ్చన్నారు. వీటితో పాటే ఇప్పుడు హేలోగ్రాఫిక్ బిల్లింగ్ సిస్టంను తప్పనిసరి చేశామని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. దీనివల్ల మద్యం దుకాణాల అమ్మకాలు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయాలకు, బేవరేజస్ డిపోలకు, మద్యం కంపెనీలకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. కనెక్టవిటీకి టైం పడుతుంది ఇప్పటికే మద్యం దుకాణాలలో హేలోగ్రాఫిక్ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మద్యం దుకాణాల నుంచి మద్యం డిపోలకు, ఎక్సైజ్ కార్యాలయాలకు అనుసంధానం చేయాల్సి ఉంది. ఈసిస్టమ్ అంతా హైదరాబాద్ నుంచి కనెక్టవిటీ చేయాల్సి ఉంది. సుమారు పదిరోజుల వరకు టైం పట్టే అవకాశం ఉంది. - వివేకానందరె డ్డి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖ -
ఇదో రకం దోపిడీ!
- ప్రైవేటు స్కూళ్లలో నోట్‌బుక్స్, ఇతర సామగ్రి అమ్మకాలు - బహిరంగ మార్కెట్ కంటే రెండింతలు అధిక ధరలు - నిబంధనలు ఉల్లంఘన - చలనం లేని విద్యాశాఖాధికారులు సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు స్కూళ్ల దోపిడీ పరాకాష్టకు చేరుతోంది. పిల్లల నుంచి దోచుకునేందుకు అనువైన ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఇప్పటికే ట్యూషన్, అడ్మిషన్, డొనేషన్ ఫీజుల పేరిట పిండుకుంటున్నా.. వారి ధనదాహం తీరడం లేదు. చిన్నపాటి ప్రైవేటు పాఠశాల మొదలుకొని కార్పొరేట్ స్కూళ్ల వరకు ఇదే పరిస్థితి. బడుల్లో ఏ వస్తువూ విక్రయించకూడదని నిబంధలు స్పష్టం చేస్తున్నా... హద్దు మీరుతున్నారు. నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, పెన్సిళ్లు, చార్టులు, పెన్నులు, యూనిఫాంలు, సాక్సులు తదితర వాటిని బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నారు. బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు వారించినా.. యాజమాన్యాలు వదిలిపెట్టడం లేదు. దీంతో చేసేదేమీలేక ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తూ చేతి చమురు వదిలించుకుంటున్నారు. రెండింతలు అధికం స్కూల్ పేరు, చిరునామా ముద్రించి మరీ కొన్ని యాజమాన్యాలు నోట్‌బుక్స్ విక్రయిస్తున్నాయి. ఒక్కో నోట్‌బుక్ పై ధర రూ.40- రూ.50 వేసి దండుకుంటున్నారు. అదే నోట్‌బుక్ బహిరంగ మార్కెట్లో రూ.20- రూ.30కు మించి ఉండదు. వారు నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయని పిల్లల పట్ల యాజమాన్యాలు కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. విభిన్న రూపాల్లో దండిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తొమ్మిదో తరగతికి అవసరమయ్యే 25 నోట్‌బుక్స్‌కు రూ.1100కు పైడి, పదో తరగతిలో 30 నోట్‌బుక్స్‌కు రూ.1300 - రూ.1700 వరకు వసూలు చేస్తుండడం ప్రైవేటు స్కూళ్ల నిలువు దోపిడీకి నిదర్శనం. ప్రత్యామ్నాయం లేక ఖర్చు ఎక్కువైనా ఆ స్కూళ్లలో కొనుగోలు చేస్తున్నారు విద్యార్థులు. కొన్ని ప్రాంతాల్లో బయట లభించే నోట్బుక్స్నే స్కూళ్లలో అధిక ధరలకు అంటగడుతున్నారు. ఇంకొన్ని బడులలో ఏడాదికి సరిపడే నోట్‌బుక్స్, అట్టలు, పేరు స్టిక్కర్లు, రంగులతోపాటు సాధారణ పెన్సిళ్లు, పెన్నులు, చార్టులకు ధర నిర్ణయించి ప్యాకేజీలా అమ్ముతున్నారు. వీటికి తోడు ఏమాత్రం నాణ్యత లేని వర్క్‌బుక్స్‌ని వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. అధికారుల మొద్దు నిద్ర ప్రైవేటు స్కూళ్ల అక్రమ వ్యవహారమంతా విద్యాశాఖాధికారులకు తెలిసినా... చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు అందితేనే తప్ప తనిఖీలకు కదలని పరిస్థితి దాపురించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న స్కూళ్ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. కొన్నిచోట్ల స్కూళ్ల లొసుగులు తెలిసినా అధికారులు చర్యలకు ఉపక్రమించే ధైర్యం చేయడం లేదు. యాజమాన్యాలు అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తుండడంతో చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. జంట విద్యాశాఖలకు సిబ్బంది కొరత వేధిస్తోందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలకు ప్రత్యేక వ్యవస్థ లేదు. ఈ కారణంగా వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. పున:ప్రారంభానికి ముందు... ఆ తర్వాత కొన్ని నెలల వరకు ప్రైవేటు స్కూళ్ల నిర్వహణపై విద్యాశాఖాధికారులు ఓ కన్నేస్తే మంచిది. కొంతవరకైనా వాటి ఆగడాలను అదుపుచేయవచ్చు. ఉపేక్షించం ప్రైవేటు స్కూళ్లలో నోట్‌బుక్స్ విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. స్కూళ్లలో తనిఖీలు చేపడతాం. ఒకవేళ అమ్ముతున్నట్లు సమాచారం అందితే ఆ స్కూళ్లపై చర్యలు తప్పవు. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఏ వస్తువూ అమ్మకూడదు. గీత దాటితే ఉపేక్షించేది లేదు. - సోమిరెడ్డి, హైదరాబాద్ డీఈఓ యూనిఫాంలపైనా... ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు యూనిఫాంలూ కాసులు కురిపిస్తున్నాయి. పాఠశాలల్లో నేరుగా యూనిఫాంలు విక్రయిస్తే అధికారులతో ఇబ్బంది ఎదురవుతుందని భావించిన యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. స్కూల్ ఉన్న సమీప ప్రాంతంలోనే ఓ వ స్త్ర దుకాణంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. తమ యూనిఫారాలు అక్కడే లభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే కొనుగోలు చేసేలా చూస్తున్నాయి. దీనిపై వస్త్ర దుకాణాల నుంచి కమీషన్ల రూపంలో భారీగా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇసుక నుంచి కాసులు పిండుతున్నారు
- ఆదాయమే లక్ష్యంగా రీచ్‌ల నిర్వహణ - ఆన్‌లైన్‌లోబ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్న బడాబాబులు - కొనుగోలు చేయలేని స్థితిలో పల్లెవాసులు - ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు దేవరాపల్లి: ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నయినా, ఏ పథకాన్నయినా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి. కాని ప్రస్తుత ప్రభుత్వం సంపన్నులకు మేలు చేయడమే లక్ష్యంగా ఇసుక పాలసీని రూపొందించి విమర్శల పాలవుతోంది. అందినంత ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా రూపొందించిన ఇసుక పాలసీ పేద ప్రజల పాలిట శాపంగా, బడాబాబులకు వరంగా మారింది. కష్టం లేకుండా కాసులు కురిపిస్తున్న ఇసుక ఆన్లైన్ అమ్మకాలపై పలువురు బడాబాబుల కన్నుపడటంతో సామాన్యుడికి ఇసుక దొరక్కుండా పోతోంది. ఇసుక అమ్మకాలను ఆన్లైన్లో పెట్టిన క్షణాల్లోనే ఇసుక మాఫియా బినామీ పేర్లతో చలానాలు చెల్లించి బుక్ చేసి బ్లాక్ చేస్తున్నారు. తరువాత ఇసుకను పట్టణ ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు అమ్మి దర్జాగా కోట్లు గడిస్తున్నారు. అధికారుల అండతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు గ్రామం నడి ఒడ్డున శారద నదిలో కళ్లెదుట ఉన్న ఇసుకను తీసుకునే వీలులేకుండా చేయడంతో గ్రామస్తులు నిశ్చేష్ఠులుగా మిగిలిపోతున్నారు. సొంత ఇళ్లు నిర్మించుకుందామనుకున్నా ఇసుక పాలసీ అంతరాయంగా మారింది. అసలే సిమెంట్, ఇసుము, పిక్క వంటి ఇంటి సామగ్రి ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. దీనికి తోడు ఇసుకను కూడా అధిక ధరలకు కొనుగోలు చేయలేక ఇళ్ల నిర్మాణాలను నిలిపేస్తున్నారు. నిధులున్నా ప్రారంభం కాని పనులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనా ఇసుక తరలింపుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇసుక ధరలకు భయపడి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవడంతో నిధులు మురిగిపోతున్నాయి. టైరు బళ్లపై కేసులా? గ్రామాల్లో సొంత అవసరాలకు టైరు బళ్లలో ఇసుకను తెచ్చుకుంటున్న వారిపై కేసులు నమోదు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేసుల బారిన పడి ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు. -
ఫుల్లుగా వసూలు
మద్యం వ్యాపారులు మందుబాబులను నిలువునా దోచుకుంటున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తూ వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. కాయకష్టం చేసే నిరుపేదల బతుకులను పీల్చి పిప్పి చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన ఎక్సయిజ్ అధికారులు ‘మామూలు’గా వదిలేస్తున్నారు. సాక్షి, గుంటూరు : జిల్లాలోని మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. పలు ప్రాంతాల్లో అయితే ఎమ్మార్పీ కంటే ఒక్కో సీసాకు రూ. 20 నుంచి రూ. 40 వరకూ అధికంగా వసూలు చేస్తుండగా, గుంటూరు నగరంలో ఒక్కో క్వార్టర్ బాటిల్‌పైనా రూ. 5 నుంచి రూ. 10 అధికంగా వేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం మద్యం దుకాణాల ద్వారా వచ్చిన ఆదాయంలో నాలుగో వంతు కూడా ఈ సారి ప్రభుత్వానికి రాని విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో అధిక ధరలకు మద్యం దుకాణాలకు టెండర్లు వేయడం వల్లే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపారని భావించిన ప్రభుత్వం మండల, మున్సిపల్, కార్పొరేషన్ల పరిధుల్లో ఉన్న మద్యం దుకాణాలకు తక్కువ మొత్తంలో లెసైన్స్ ఫీజులను నిర్ణయించి లాటరీ పద్ధతిన దుకాణాలను కేటాయించింది. దీని కోసం కొన్ని నిబంధనలు సైతం పెట్టింది. బెల్టు షాపులు ఉండకూడదని, ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని, సమయపాలన పాటించాలని నిర్దేశించింది. ఆ విధంగా తక్కువ లెసైన్స్ ఫీజులకే మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు సిండికేట్లుగా మారి గతంలో మాదిరిగానే అధిక ధరలకే మద్యం విక్రయిస్తున్నారు. కాసులు కురిపిస్తున్న మందుబాబుల బలహీనత ఎమ్మార్పీ కంటే అధికంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెగ ప్రచారం చేసిన ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదేమని ప్రజలు ప్రశ్నిస్తే కౌంటర్లో ఉన్న మంచి బ్రాండ్ మద్యం సీసాలను పక్కకు తప్పించి ఎవరికీ తెలియని బ్రాండ్లను పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. కాస్త మంచిబ్రాండ్లకు అలవాటు పడిన మందుబాబులు చేసేది లేక ఎక్కువ డబ్బు చెల్లించి నోరుమూసుకుంటున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా విక్రయాలు జరుపుతూ రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. చేష్టలుడిగి చూస్తున్న అధికారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేసే మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు, రాత్రి 10 గంటల తరువాత మద్యం దుకాణాలను మూయించాల్సిన పోలీస్ అధికారులు ‘మామూలు‘గా వదిలేస్తున్నారు. రాత్రి 9 గంటలు అయిందంటే రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు, చిన్న చిన్న బడ్డీ దుకాణాలను సైతం మూసివేయించే పోలీసులు మద్యం దుకాణాలను మాత్రం తెల్లవారుజాము వరకు అనుమతిస్తుండటం గమనార్హం. అధిక ధరలకు విక్రయిస్తే సహించం: ఎక్సయిజ్ డీసీ కుళ్లాయప్ప ఎమ్మార్పీ కంటే అధిక మొత్తాలకు మద్యం విక్రయిస్తే సహించ బోమని ఎక్సయిజ్ డీసీ కుళ్లాయప్ప తెలిపారు. జిల్లాలో జరుగుతున్న సిండికేట్ల వ్యవహారాన్ని ‘సాక్షి’ ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. జిల్లాలో వీటిని అరికట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామనీ, మద్యం లెసైన్స్‌లు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో ఎమ్మార్పీ అతిక్రమణకు పాల్పడుతున్న 25 షాపులను సస్పెండ్ చేశామని తెలిపారు. ఒక్క అక్టోబర్ నెలలోనే ఎనిమిది దుకాణాలు మూయించినట్ట చెప్పారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను పంపి చర్యలు తీసుకుంటామని వివరించారు. -
అధిక ధరలకు మద్యం విక్రయిస్తే ఖబడ్దార్
అనంతపురం క్రైం : ‘వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా కూలీనాలీ చేసుకునే వారున్నారు. వారు సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలబెడుతున్నారంటూ ప్రతి రోజూ మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. మీరేమో అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ పేదల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇలాగైతే కుదరదు. కచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు జరపాలి. అలా కాదని అధిక ధరలకు విక్రయిస్తే తాట తీస్తాన’ని వన్ టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. సోమవారం స్టేషన్ పరిధిలోని బ్రాందీ షాపుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలు విశ్వనాథ్‌చౌదరి, జాకీర్‌హుసేన్ పలు సూచనలు చేశారు. లెసైన్సుదారులు నిబంధనలకు లోబడి మద్యం అమ్మకాలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. లూజుగా మద్యం అమ్మకూడదని, నిర్ణీత వేళలు కచ్చితంగా పాటించాలని, షాపుల ముందు వాహనాలు పార్కింగ్ చేయరాదని ఆదేశించారు. షాపుల వద్ద తాగుబోతులు ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బార్లు, బ్రాందీ షాపులకు తేడా లేకుండా పోతోందని, బ్రాందీ షాపుల పక్కన సిటింగ్‌కు టేబుళ్లు ఏర్పాటు చికెన్, ఇతర తినుబండారాలు విక్రయించడాన్ని సీఐ పూర్తిగా తప్పుబట్టారు. కొందరు నేరగాళ్లకు నేరాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు బ్రాందీ షాపులు అడ్డాగా మారాయన్నారు. కూలీనాలీ చేసుకునే వారిని రాచి రంపాన పెట్టొద్దని సూచించారు. తాము చట్టానికి లోబడే పని చేస్తామని, ప్రజల పక్షాన నిలబడే విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రతి షాపు ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వివిధ మద్యం ధరలను సూచించే డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే పోలీసుల నంబర్లనూ డిస్ ప్లే చేయాలని ఆయన సూచించారు. రెండుసార్లు కేసుల నమోదైతే మూడోసారి లెసైన్సు రద్దుకు అటు కలెక్టరుకు, ఇటు ఎక్సైజ్ అధికారులకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.