Hotels
-
పొయ్యిపై సల.. సల..ఆరోగ్యాలు విల విల!
పుట్టపర్తికి చెందిన 30 ఏళ్ల మహిళ తిన్న ఆహారం జీర్ణం కాలేదని ఆస్పత్రిలో చేరింది. కడుపు నొప్పితో పాటు ఆకలి మందగించినట్లు డాక్టర్లకు తెలిపింది. పలు వైద్య పరీక్షల అనంతరం కల్తీ ఆహారం తినడం కారణంగానే ఆరోగ్య సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్తీ నూనె, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలని డాక్టర్లు సూచించారని ఆమె తెలిపింది.పెనుకొండలో ఓ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఐదు కుటుంబాలు విందులో పాల్గొనేందుకు హోటల్‌కు వెళ్లాయి. వాళ్లందరూ రకరకాల వంటకాలు తిన్నారు. చివరగా ఇంటికి చేరే సమయంలో దారిలో కనిపించిన స్ట్రీట్ ఫుడ్ కూడా రుచి చూశారు. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు. కానీ ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫుడ్ పాయిజనింగ్‌గా తేల్చారు. సాక్షి, పుట్టపర్తి : నిత్యావసర సరుకుల ధరలతో పాటు వంటనూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ వాడకం మాత్రం తగ్గడంలేదు. మరోవైపు హోటళ్లలో తిండి ధరలు ఉన్నఫలంగా పెంచడం కుదరదు. దీంతో చాలా మంది కల్తీనూనె వాడటం మొదలుపెట్టారు. దీనికితోడు పొయ్యిపై నూనెను పదే పదే మరిగించేస్తున్నారు. ఫలితంగా తాజా నూనె అయినప్పటికీ మరిగించడంతో రుచి మారుతోంది. ఆ నూనెలో తయారు చేసిన పదార్థాలను తింటున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో తరచూ వెలుగు చూస్తున్నాయి. రోడ్డు పక్కన తయారు చేసే ఆహార పదార్థాలు దుమ్ము, ధూళి రేణువులు చేరి అనారోగ్యానికి గురి చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పట్టణాల్లోనే అధికం.. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే హోటళ్లు అధికం. అందులో రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు ప్రతి వంద మీటర్లకు ఒకటి కనిపిస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి పలు పనులపై వచ్చే వాళ్లు గత్యంతరం లేక ఇక్కడే తినాల్సి వస్తోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలోని హోటళ్లలో ఎక్కువ మంది ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే నూనెను పదే పదే మరిగించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా.. మద్యం దుకాణాల సమీపంలోని చికెన్ కబాబ్ సెంటర్లలో ఎక్కువసార్లు మరిగించిన నూనెలో చేసిన పదార్థాలను తినడం కారణంగా మందుబాబులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మద్యం కంటే కల్తీ నూనె పదార్థాలు ఎక్కువగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయనే విషయం మత్తులో గమనించలేకపోతున్నారు. మటన్, చికెన్, కోడిగుడ్ల వంటకాల్లో ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రైవేటు మద్యం దుకాణాలు రావడంతో ఒక్కో దుకాణం వద్ద పదుల కొద్దీ చికెన్ కబాబ్ సెంటర్లు వెలిశాయి. ఒకసారి పొయ్యి పెట్టిన నూనె సాయంత్రం వరకూ కాగుతూనే ఉంటోంది. ఫలితంగా ఆ ఆహారాన్ని తీసుకునే వారు ఫుడ్ పాయిజన్‌తో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అటకెక్కిన తనిఖీలు.. పదే పదే మరిగించిన నూనెలో వంటకాలు చేయడం.. ఆ పదార్థాలు తిన్న వారు అనారోగ్యం బారిన పడటం.. సైకిల్ చక్రంలా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు లేకపోవడంతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తే కానీ తనిఖీలు చేయరని అంటున్నారు. మరి కొన్ని చోట్ల ఆర్నెల్లకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదని రికార్డులు చెబుతున్నాయి. పండుగ సమయంలో మాత్రమే అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. నూనె డబ్బాల్లో ఎంతమేరకు కల్తీ ఉందనే విషయం ఎవరూ బయటపెట్టడంలేదు. కబేళాలకు తరలించే పశువుల ఎముకల పిండి కూడా నూనెలో కలిపేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కల్తీ అని తేలితే కఠిన చర్యలు మా సిబ్బంది ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ కల్తీ జరుగుతోందో పక్కా సమాచారం ఇస్తే.. తనిఖీ ముమ్మరం చేస్తాం. శ్యాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపిస్తాం. కల్తీ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవు. ఇప్పటికే చాలా చోట్ల తనిఖీలు చేశాం. కల్తీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాం. ప్రజలు బయట ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. – రామచంద్ర, ఫుడ్ ఇన్స్పెక్టర్, పుట్టపర్తి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారంతోనే ఆరోగ్యం బాగుంటుంది. బయట ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. మసాలా, నూనె వంటలు తినడం తగ్గించాలి. నూనె వంటకాలతో కొవ్వు శాతం పెరగడంతో పాటు కల్తీ నూనె వంటకాలు తింటే వివిధ రోగాలు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ మంజువాణి, డీఎంహెచ్ఓరోగాలు ఇలా.. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిల్వ ద్వారా విష పదార్థాలు కూడా ఏర్పడతాయి. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. -
HYD: హోటళ్లలో తనిఖీలు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: హబ్సిగూడ, నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం(నవంబర్ 10) ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు.కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.ఎక్స్పైర్ అయిన పాడైన ఫుడ్ ఇంగ్రీడియెంట్స్‌తో వంట చేస్తున్నట్లు గుర్తించారు.దీంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్ కిచెన్లలోనూ తనిఖీలు చేశారు.కుళ్ళిపోయిన టమాటో, పొటాటోలను వంటకాల్లో ఉపయోగిస్తున్నారని తేలింది.వీటికి తోడు కాలం చెల్లిన పన్నీర్, మష్రూమ్‌లతో వంటల చేస్తున్నట్లు గుర్తించారు.ఇదీ చదవండి: HYD: హోటల్లో భారీ పేలుడు.. పక్కనున్న బస్తీలో ఎగిరిపడ్డ రాళ్లు -
హోటల్స్‌ను అర్ధరాత్రి వరకు అనుమతించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచేందుకు సహకరించాలని కోరుతూ ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి వినతిపత్రం అందజేసింది. ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.స్వామి, కార్యదర్శి ఎం.నాగరాజు, కోశాధికారి ఇ.వి.పూర్ణచంద్, విజయవాడ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ, కార్యదర్శి రాఘవ డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. 2018 అక్టోబరు 15వ తేదీన విడుదల చేసిన జీవో 25 ప్రతిని డీజీపీకి అందజేశారు.దీనికి కొనసాగింపుగా 2022 జూన్ 13వ తేదీన ఇచ్చిన మెమో ఉత్తర్వుల కాపీని కూడా జోడించారు. పొరుగున ఉన్న తెలంగాణలో అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని వివరించారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. -
తిరుపతి హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
సాక్షి, తిరుపతి: నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్ సవాల్‌గా మారగా, మూడు హోటల్స్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఐఎస్ఐ పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.తిరుపతి, తిరుమల అత్యంత సేఫ్‌గా ఉన్నాయని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతి వాసులు, భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. కాగా, తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్, మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది. -
తిరుపతిలో బాంబు బెదిరింపుల టెన్షన్
-
బాంబు బెదిరింపులతో హడల్
సాక్షి, అమరావతి: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెదిరింపు రాగానే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తుండటం గమనార్హం. ‘నాన్నా.. పులి కథ’లా మారకూడదన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వారాల్లో 400 బెదిరింపులువిమానాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వస్తుండటంతో పౌర విమానయాన శాఖ బెంబేలెత్తుతోంది. రెండు వారాల్లో ఏకంగా 400 బెదిరింపులు రావడం గమనార్హం. శనివారం ఒక్కరోజే 33 బెదిరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల బెదిరించడం కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్తోపాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో టేకాఫ్ తీసుకున్న విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయిస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ భారతమే ప్రధాన లక్ష్యంగా..బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఆగంతకులు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు బెదిరింపులు వచ్చాయి. అక్కడి విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లోనూ, ఆ నగరంలోని హోటళ్లలోనూ బాంబులు పెట్టినట్టు బెదిరించారు. బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ బెదిరింపుల బెడద బారిన పడ్డాయి. ఆ రెండు నగరాల్లో విమానాలతోపాటు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికల ద్వారా బెంబేలెత్తించారు. బెదిరింపుల బెడద ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.వారం రోజుల్లో తిరుపతిలోని 17 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఇస్కాన్ ఆలయంలోనూ బాంబు పెట్టినట్టు బెదిరించడం గమనార్హం. కాగా.. విజయవాడలోని ఓ స్టార్ హోటల్‌కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు, విజయవాడలోని హోటళ్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఓ ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. అస్సాం నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు గుర్తించి ఏపీ, కర్ణాటక ఎస్ఐబీ విభాగం అధికారులు ఆ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ‘బీటీసీ’ల మోహరింపుబాంబు బెదిరింపుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) కార్యాచరణను వేగవంతం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ థ్రెట్ అసిస్టెంట్ కమిటీ(బీటీసీ)లను మోహరించింది. బెదిరింపు ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను ఈ విభాగం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయో గుర్తించడం, ఎవరు చేస్తున్నారన్నది దర్యాప్తు చేయడం, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు భద్రతా దళాలకు సహకరించడంలో బీటీసీ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మరో విమానానికి బాంబు బెదిరింపువిశాఖ నుంచి ముంబై బయలుదేరిన విమానాన్ని వెనక్కి రప్పించిన అధికారులుతనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారణసాక్షి, విశాఖపట్నం: వరుస బాంబుబెదిరింపులు విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా వివిధ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బెదిరింపు కాల్ సోమవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.అప్పటికే విశాఖ చేరుకుని.. ముంబై బయలుదేరిన ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికే బాంబ్ స్క్వాడ్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులను దింపి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విశాఖ నుంచి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.32 గంటలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లిందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. -
తిరుపతి: హోటళ్లకు ఆగని బాంబు బెదిరింపులు
సాక్షి,తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించి ఫేక్‌మెయిల్స్ పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఫేక్మెయిల్స్పై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరుపతిలోని ఏడు హోటల్స్‌తో పాటు రెండు ఆలయాలకు జాఫర్‌సాదిక్ పేరుతో బాంబు బెదిరింపు ఫేక్‌మెయిల్స్ వచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్,మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది.ఇదీ చదవండి: హత్యకు యత్నం.. పీఎస్‌కు వెళితే అక్కడా దాడి -
తిరుపతిలో హోటల్సు కు బాంబు బెదిరింపు..
-
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు కాల్స్
-
తిరుపతి హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
తిరుపతి, సాక్షి: తిరుపతిలోని హోటళ్లకు మరోసారి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్‌పార్క్, పాయ్ వైస్రాయి హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే.. నాలుగు రోజుల క్రితం తిరుపతిలోని 4 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టి.. వాటిని ఫేక్ మెయిల్స్‌గా నిర్ధారించారు. ఫేక్ బాంబు మెయిల్స్‌పై నిన్న(శుక్రవారం) తిరుపతి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.చదవండి: పట్టణాల్లో 83 లక్షల టన్నుల చెత్త -
ఐటీసీ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 5,054 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,965 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 22,282 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 19,270 కోట్ల టర్నోవర్ సాధించింది. హోటళ్ల బిజినెస్ ఏకీకృతం ప్రస్తుతం హోటళ్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్న ఐటీసీ బోర్డు తాజాగా ప్రత్యర్థి సంస్థలలో గల వాటాలను ఏకీకృతం చేసే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సొంత అనుబంధ సంస్థ రస్సెల్ క్రెడిట్(ఆర్సీఎల్) ద్వారా ఆతిథ్య రంగ దిగ్గజాలు ఒబెరాయ్, లీలా హోటళ్లలోగల వాటాలను కొనుగోలు చేయనుంది. ఈఐహెచ్(ఒబెరాయ్) లిమిటెడ్‌లో 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను, హెచ్ఎల్వీ(లీలా)లో 34.6 లక్షల షేర్లను బుక్ విలువ ఆధారంగా కొనుగోలు చేయనుంది. దీంతో ఈఐహెచ్‌లో ఐటీసీకి 16.13 శాతం, హెచ్ఎల్వీలో 8.11 శాతం చొప్పున వాటా లభించనుంది. ప్రస్తుతం ఈఐహెచ్‌లో ఐటీసీకి 13.69 శాతం, ఆర్సీఎల్కు 2.44 శాతం చొప్పున వాటా ఉంది. ఇక హెచ్ఎల్వీలో ఐటీసీకి 7.58 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. -
హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా!
హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి చోట్ల నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన సీబీడీటీ.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించకుండా నిఘా పెట్టాలని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. -
హోటల్స్ లో వేడివేడిగా టేస్టీ టేస్టీ పాయిజన్..
-
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రేజీ.. థీమ్స్.. వంట నుంచి వడ్డన దాకా..
ఆహారం వడ్డించడానికి ఇత్తడి పళ్లెం, నీళ్లు తాగడానికి రాగి, గాజు గ్లాసు, బిర్యానీ వండేందుకు మట్టి కుండలు, ఆహారం వడ్డించేందుకు ఇత్తడి గరిటెలు, స్పూన్లు.. ఇదంతా ఎప్పుడో పూర్వకాలం రోజులు అనుకుంటే పొరపాటు పడినట్లే.. హైదరాబాద్ నగరంలో తాజాగా హోటల్ యాజమాన్యాలు అవలంబిస్తున్న ట్రెండ్ ఇది. వివిధ రకాల థీమ్‌లతో ఏర్పాటు చేస్తున్న హోటల్స్‌లో రుచికరమైన ఆహారంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో యువతను ఆకట్టుకునేందుకు సెల్ఫీ పాయింట్లు, స్టార్ హీరోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో కొత్తకొత్త పేర్లతో రెసిపీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటున్నారు. టీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు చేసిన చిన్న పొరపాట్లకు మొత్తం హోటల్ వ్యాపార రంగంపై ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా రొటీన్‌గా నడిచే హోటళ్లు ఆదరణ కోల్పోతున్నాయి. దీంతో ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు ఎవరికి వారు ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, కాస్త ధర ఎక్కువైనా మనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసుకోవాలని హోటల్ నిర్వాహకులు, యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఆర్థికంగా వీటి నిర్వహణ భారమైనప్పటికీ పోటీ మార్కెట్లో తప్పదంటున్నారు. అదే సమయంలో ఆహారప్రియుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుందని సంతోషపడుతున్నారు. పార్టీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లువివాహాది శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. చిన్న కుటుంబం పుట్టినరోజు పార్టీ చేసుకుందామంటే ఫంక్షన్ హాల్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇటువంటి వారి కోసం హోటళ్లలో 20 నుంచి 30 సీటింగ్‌తో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంప్లిమెంటరీగా కేకులు సైతం ఉచితంగా అందిస్తామంటున్నారు.బిర్యానీలకు స్థానిక పేర్లు..హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీకి ఫేమస్. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఓ హోటల్లో వంటకాలకు స్థానిక పేర్లను పెడుతూ ఆకట్టుకుంటున్నారు. పాలకొల్లు ఫ్రై పీస్ బిర్యానీ, మొగల్తూరు మటన్ బిర్యానీ, రాజమండ్రి రొయ్యల బిర్యానీ, గుంటూరు మిర్చి కోడి బిర్యానీ, ఓజీ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు అంటూ కొత్తకొత్త పేర్లు మెనూలో కనిపిస్తున్నా యి. దీంతో పాటే దక్షిణ భారత దేశం రెసిపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం తయారీ విధానాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా, రీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు.మట్టి పాత్రలో..ప్రస్తుత రోజుల్లో మట్టి పాత్రల్లో వంట చేయడం గ్రామీణ ప్రాంతాల్లో సైతం కనుమరుగైందనే చెప్పాలి. స్టీల్, అల్యూమినియం పాత్రలు మన్నిక ఎక్కువగా వస్తాయని, అంతా అటువైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నగరంలోని హోటల్స్‌లో మాత్రం ప్రధానంగా కుండ బిర్యానీకి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కొన్ని హోటళ్లలో నేరుగా కుండలోనే బిర్యానీ వండి, వడ్డిస్తున్నారు. పార్సిల్ తీసుకునే వారికి నేరుగా కుండతోనే డెలివరీ ఇస్తున్నారు. దీన్ని ఆహార ప్రియులు ఆస్వాదిస్తున్నారు. ఆదరణ బాగుంది...ఒక థీమ్ ఎంపిక చేసుకున్నాం. మార్కెట్లో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. సాధారణంగా భోజనం తినే ప్లేట్లు రూ.200నుంచి 500లో లభిస్తాయి. అయినా ఇత్తడి ప్లేట్లు పెడుతున్నాం. ఒక్కో ప్లేటు ధర రూ.3500 వరకూ ఉంది. అలాగే యూత్ ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ మస్ట్ అన్నట్లు ఉన్నారు. దీనికోసం కొంత ప్లేస్ కేటాయించాం. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అప్డేట్ అవుతున్నాం. ఫుడ్ క్వాలిటీలో ఎక్కడా రాజీపడటంలేదు. అందుకే అందరి ఆదరణ పొందగలుగుతున్నాం. – ప్రసాద్, అశోక్, అద్భుతాహారం నిర్వాహకులు, రాయదుర్గం -
సందీప్ కిషన్ మంచి మనసు.. వారి కోసం నెలకు రూ. 4 లక్షలు
టాలీవుడ్ యంగ్ హీరోలలో సందీప్ కిషన్ చాలా ప్రత్యేకమనే చెప్పవచ్చు.. సినిమాలతో పాటు హోటల్ రంగంలోనూ రాణిస్తున్నాడు. ప్రతిరోజూ పేదలకు ఆహారం అందిస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. సినిమా రంగంలో అపజయాలు ఎదురైనా తన పంతాను మార్చుకుంటూ మళ్లీ విజయం సాధిస్తాడు. తమిళ్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. అక్కడ ఆయనకంటూ ప్రత్యేకమైన మమార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేశాడు.చాలా మంది సినీ సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని వారు చెప్పే వరకు అభిమానులకు కూడా తెలియదు. వారు చేస్తున్న మంచి పనిని గోప్యంగానే ఉంచుతారు. తాజాగా హీరో సందీప్ కిషన్ రాయన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో తను నిర్వహిస్తున్న రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు తెలిపారు. దీంతో నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ తెలిపారు.భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు. ప్రస్తుతం ఈ అంశం గురించి తన టీమ్ పరిశీలిస్తుందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. నెటిజన్లు కూడా సందీప్‌ను ప్రశంసిస్తున్నారు. -
ఆహార కల్తీపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర
-
ఒక రాత్రికి రూ.1 లక్ష.. పెరిగిన హోటల్స్ ధరలు - కారణం ఇదే!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి ఈ నెల 12న (జులై) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. వీరి వివాహానికి ముందే ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కూడా కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నారు.సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లోని గదుల ఛార్జ్ ఒక రాత్రికి రూ.13000 ఉంటుంది. అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు రూ.1 లక్షకు పెంచారు. దీన్ని బట్టి చూస్తే అంబానీ పెళ్లి వేడుకలను హోటల్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.హోటల్స్ ధరలు పెంచడం ఇదే మొదటిసారి కాదుసీజన్ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హోటల్స్.. గదుల చార్జెస్ భారీగా పెంచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బెంగళూరులో ఏరో షో జరిగినప్పుడు కూడా అక్కడున్న హోటల్స్ గదుల రేట్లకు భారీగా పెంచాయి. ఇది మాత్రమే కాకుండా ఆటో ఎక్స్పో సమయంలో ఢిల్లీ, గురుగ్రావ్ ప్రాంతాల్లోని హోటల్స్ కూడా భారీ చార్జీలను వసూల్ చేశాయి.పెళ్ళికి హాజరుకానున్న ప్రముఖులుఇప్పటికే అనంత్, రాధికల వివాహ వేడుకలు ప్రారంభమైపోయాయి. ఇటీవలే సంగీత్ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకలకు సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాగా వీరి వివాహం త్వరలోనే జరుగుతుంది. ఈ వేడుకలకు కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మొదలైనవారు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. -
ఇక రంగు పడకుండా చికెన్ పకోడా
బనశంకరి: హోటళ్లు, వీధుల్లో విక్రయించే శాకాహార, మాంసాహార వంటకాలు బాగా కనిపించాలని వ్యాపారులు ఎరుపు, ఊదా వంటి కృత్రిమ రంగులను ఉపయోగిస్తుంటారు. ఆ రంగుల వల్ల ప్రజలకు అనారోగ్యం కలుగుతోందని ఆరోపణలు రావడంతో కృత్రిమ రంగుల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి నిషేధించింది. ఆహార తనిఖీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 39 చికెన్ పకోడా, కబాబ్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబోరేటరీలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8 కబాబ్ల్లో హానికారకమైన కృత్రిమ రంగులను వాడినట్లు తేలింది. దీంతో కృత్రిమ రంగుల వాడకాన్ని సర్కారు నిషేధించింది. ఉల్లంఘనకు పాల్పడితే 7 ఏళ్ల జైలుశిక్ష , రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశముందని ఆహార సురక్షత నాణ్యత ప్రమాణాల శాఖ కమిషనర్ తెలిపారు. -
ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవ హరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడటంతో దానిపై మంత్రి ఆరా తీశారు. మంగళవారం సచివాలయంలో అధి కారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని, హోటల్ యాజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రతి 6 నెలలకు వర్క్‌షాపు నిర్వహణ, అవగాహన సద స్సు నిర్వహిస్తామని, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ డాక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేష న్ ప్రెసిడెంట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
సౌదీ అతిధి గృహాల అందాలకు...పర్యాటకుల ఫిదా
పర్యాటకుల స్వర్గధామంగా వర్ధిల్లుతున్న సౌదీలో పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా అద్భుతమైన హోటల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక ప్రైవేట్ ద్వీపంలో ప్రశాంతంగా నివసించాలనుకున్నా, మారుమూల ఎడారిలో విడిది కోరుకున్నా, సందడికి కేంద్రమైన చోట విలాసవంతమైన బస కోరుకున్నా...పర్యాటకుల కోసం వైవిధ్యభరిత నివాస సౌకర్యాలను అందిస్తోంది. సౌదీపై పర్యాటకుల ఆసక్తిని రెట్టింపు చేసే వాటిలో అతిధి గృహాలు కూడా ఉన్నాయి. కొన్ని అనూహ్యమైన అద్భుతమైన నేపథ్యాలతో సెట్ చేయబడిన అతిధి గృహాలు.. అటు ప్రకృతి సౌందర్యాన్ని ఇటు సంప్రదాయం ఆధునికతను మిళితం చేస్తూ హోటల్ అనే పదానికి కొత్త నిర్వచనాలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి విశేషాలు...సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ఎడారి మైదానాలు హిజాజ్ పర్వతాలు వంటి మంత్రముగ్దులను చేసే నేపధ్యంతో ఉంటుంది సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ ఇది ఒక ది రెడ్ సీ రిసార్ట్, ఇది నబాటేయన్ నిర్మాణ వారసత్వం తో ఎడారి పరిసరాలకు వన్నె తెస్తుంది. ఎడారి పువ్వుతో ప్రేరణ పొందిన ఈ హోటల్ బసను, ఫంక్షన్లను ఒకే కప్పు క్రింద నిర్వహిస్తుంది. అతిథులు చుట్టుపక్కల ఉన్న కొండ దిబ్బల వీక్షణలను ఆస్వాదించడానికి అనుకూలంగా విల్లాలు నిర్మించారు. ఈ ప్రదేశంలో అతిథులు ఆనందించడానికి రెండు సిగ్నేచర్ రెస్టారెంట్లు, అవుట్డోర్ పూల్, ఫిట్నెస్ సెంటర్, ప్రపంచ స్థాయి సిక్స్ సెన్సెస్ స్పా ఉన్నాయి. కాండే నాస్ట్ ట్రావెలర్ ప్రచురించిన ప్రపంచంలోని ఉత్తమ హోటల్ల జాబితాలో ’2024 హాట్ లిస్ట్’లో ఇదీ ఒకటి.డెసర్ట్ రాక్ రిసార్ట్అచ్చంగా లోయలూ పర్వతాల మధ్య ఉన్న డెసర్ట్ రాక్ రిసార్ట్ హోటల్ ఒక నిర్మాణ కళాఖండం దాని అద్భుతమైన సహజ ప్రకృతిని సంరక్షిస్తూ పర్వతప్రాంతంలో పూర్తిగా కలగలిసి సిపోయింది. అతిథులు రాతితో చెక్కిన గదులలో సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు. నుజుమా, ఎ రిట్జ్ కార్ల్టన్ రిజర్వ్ ది రెడ్ సీఅద్భుతమైన సహజ సౌందర్యం స్వదేశీ డిజైన్‌తో సహజమైన హోటల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు రిట్జ్–కార్ల్టన్ రిజర్వ్‌ల ప్రత్యేక శ్రేణిలో ఇది కూడా ఒకటి. చేరింది. ఈ హోటల్ రెడ్ సీ బ్లూ హోల్ ద్వీపాల సమూహంలో భాగమైన ప్రైవేట్ ద్వీపాల సహజమైన సెట్లో నెలకొల్పారు. పూర్తిగా ప్రకృతి సౌందర్యంతో మమేకమై పర్యావరణ హితంగా రూపొందించిన ఈ రిసార్ట్‌లో వన్ టూ ఫోర్ బెడ్ రూమ్ పడక గదులు 63 తో పాటు బీచ్ విల్లాలు ఉంటాయి. విలాసవంతమైన స్పా, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్ల శ్రేణి...మరెన్నో ఉంటాయి.బాబ్ సంహాన్, దిరియాఈ ఏడాదే ప్రారంభమైన బాబ్ సంహాన్...యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా నిలిచిన దిరియాలో ప్రారంభించిన మొట్టమొదటి హోటల్‌గా ఘనత దక్కించుకుంది. సిగ్నేచర్ నజ్దీ నిర్మాణ శైలితో సమకాలీన లగ్జరీని మిళితం చేసిన ఈ హోటల్ 106 గదుల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తుంది, అతిథులను ప్రాంతపు సంస్కృతి చరిత్రలో మమేకం చేస్తుంది. నార్త్ దిరియాలోని సుందరమైన వాడి హనీఫా,అట్–తురైఫ్ రెండింటికి దగ్గరగా ఉన్నందున, అతిథులు హోటల్ సౌకర్యాలతో పాటు సమీపంలోని ఆకర్షణలను ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు.దార్ తంతోరా, అల్ ఉలాదార్ తంతోరా అనేది ది హౌస్ హోటల్ నుంచి ఒక ఉన్నత స్థాయి పర్యావరణ వసతి గృహం, ఇది కూడా ఇటీవలే ప్రారంభించారు. చారిత్రాత్మక అల్ ఉలా ఓల్డ్ టౌన్లో ఉన్న ఈ హోటల్... వారసత్వపు వైభవం, సమకాలీన డిజైన్స్ ల మేలు కలయిక, ఇది అతిథులను 12వ శతాబ్దానికి తిరిగి తీసుకువెళ్లడానికి వినూత్నంగా రూపుదిద్దారు, అదే సమయంలో వారికి ఆధునిక ఆతిథ్యం కూడా అందిస్తుంది. హోటల్లో 30 అతిథి గదులు చారిత్రాత్మక మట్టి–ఇటుక భవనాల తరహాలో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతలతో కొలువుదీరాయి. -
ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
సాక్షి, ఖమ్మం: ఆహార ప్రియులకు, బిర్యానీ లవర్స్‌కు అలెర్ట్. వారం మొత్తం కష్టపడి వీకెండ్లో ఫ్యామిలితో రెస్టారెంట్లకు,హోటళ్ళకు వెళ్ళి తింటున్నారా.. ఐతే కొంచెం జాగర్తండోయ్.. కొందరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. మరికొందరికి చికెన్ కబాబ్స్ అంటే మరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. కానీ అవే ఆహార పదార్ధాలు వారాల కొద్దీ నిల్వ ఉంచి మీకు పెడుతున్నారంటే నమ్ముతారా.. ఇది ముమ్మాటికీ నమ్మలేని నిజమే అని చెప్పాలి. కావాలంటే ఒక్కసారి ఖమ్మం జిల్లాకు వెళ్ళి చూసొద్దాం రండి. రెస్టారెంటుకు వెళ్ళి డిమ్ లైటింగ్‌లో కూర్చుని వేడి వేడి బిర్యాని, దానికి తగ్గట్టుగా చికెన్ లాలిపప్స్.. చికెన్ 65, చికెన్ కబాబ్స్ తింటుంటే ఉంటుంది. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా. చికెన్, మటన్, ప్రాన్స్, ఇలా ఎన్నోరకాల వంటలు రెస్టారెంట్లలో,హోటళ్ళలో దొరుకుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్త.. అదే ఆహారం విషంగా మారితే మీ పరిస్థితి ఏంటి?. ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినా మనం ఏం చేస్తుంటా అలా రెస్టారెంటుకు వెళ్ళి బిర్యానీ తినాలి అనుకుంటాం అలాంటప్పుడు ఎక్కువగా ఫేమస్ రెస్టారెంట్లవైపే మొగ్గు చూపుతుంటాం. ఎందుకంటే పది రూపాయలు ఎక్కువైన సరే ఫుడ్ రుచితో పాటు శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కూడా పాటిస్తారని.. అందులో తింటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదన్న గట్టి నమ్మకంఅయితే ఆ గట్టి నమ్మకం కాస్త ఇప్పుడు గుడ్డి నమ్మకమని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తేలిపోయింది. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల బండారాలు బయటపడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదండోయ్. నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపించటం ఆందోళనకరం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లలో ఫ్రీజర్‌లో దాచిన చికెన్ కబాబ్స్, ప్లాస్టిక్ బకెట్లలో మ్యారినేట్ చేసిన చికెన్, బ్యాచ్ నంబర్ లేని మసాలా ప్యాకెట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ గడువు లేని పసుపు, ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు, రూల్స్ అతిక్రమించి పామాయిల్ వినియోగం...ఇలా పలు లోపాలను, మోసాలను గుర్తించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్ జ్యోతిర్మయి టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.హోటల్లో తనిఖీల సందర్భంగా సిబ్బంది ఎవరికీ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తెలుసుకున్నారు .నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్ చేశారు. శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఓ హోటల్లో ఫ్రీజర్‌లో నిల్వ చేసిన 12 కిలోల చికెన్ కబాబ్స్‌ను గుర్తించిన అధికారులు, వాటిని రూల్స్ ప్రకారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించాల్సి ఉండగా.. అక్కడే డ్రైనేజీలో పారబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిర్వాహకులు చపాతి, పరోటా పిండిని కలిపి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచారు. చికెన్ ధమ్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్‌ను ప్లాస్టిక్ బకెట్లో నిల్వ చేశారు. దీంతో మ్యారినేట్ చేసిన చికెన్‌ను కూడా బయటపడేయించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ఫైర్ అయ్యారు. స్టోరూమ్స్ ఎక్స్పైరీ అయిన జీలకర్ర, బ్రాండెడ్ కాని జీడిపప్పు, గోధుమ పిండిని గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే పర్మిషన్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆహార వస్తువులపై లేబుల్స్, బ్యాచ్ నంబర్లోకపోతే ఫైన్‌తో పాటు, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 300 హోటళ్లు, 28 రెస్టారెంట్లు ఉండగా ఏడు నెలల్లో అధికారులు తనిఖీలు చేసి 14 కేసులు మాత్రమే నమోదు చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్పా తనిఖీలు చేయరన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పించి రెగ్యులర్‌గా సోదాలు చేయరనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం కారణంగా చూసి చూడనట్టు వదిలేస్తారనే విమర్శలున్నాయి.ఇప్పటికైనా ఆహార భధ్రత అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నెలకో రెండు నెలలకో తనిఖీలు చేయడం కాకుండా నిత్యం రెస్టారెంట్లు హోటళ్ళపై నిఘా ఉంచాలని, ప్రజల ప్రాణాలకు హాని కలింగించే ఆహార పధార్దాలు ఇలాంటి రెస్టారెంట్లు,హోటళ్ళు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ లవర్స్ కోరుతున్నారు. -
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
-
వామ్మో..హోటళ్లలో ఫుడ్డా!
బంజారాహిల్స్: ఆర్భాటంగా... తళుకు బెళుకుల ఇంటీరియర్‌తో ఆకట్టుకునే ఫర్నీచర్‌తో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో నాణ్యతా లోపాలు, అపరిశుభ్రత, గడువుతీరిన ఆహార పదార్థాలు వెలుగు చూస్తుండటంతో ఆహార ప్రియులు షాక్ అవుతున్నారు. గడిచిన నాలుగు వారాల నుంచి ఫుడ్ సేప్టీ టాస్‌్కఫోర్స్ టీమ్ సభ్యులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్‌పేట, పంజగుట్ట, సోమాజిగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో ముఖ్యంగా కిచెన్లలో పరిశుభ్రత పూర్తిగా లోపించడంతో అధికారులు పేర్కొంటున్నారు. 👉 జూబ్లీహిల్స్‌లోని 16 పబ్‌లలో అధికారులు తనిఖీలు చేయగా దాదాపు అన్నింట్లోనూ నిల్వ చేసిన ఆహార పదార్థాలు గడువుతీరిన తరువాత కూడా వంటల్లో వినియోగిస్తున్నట్లు నిర్థారించారు. 👉ఇక హోటళ్లలోని కిచెన్లలో అపరిశుభ్రత, దుర్గంధం, దుర్వాసనలు, ఈగలు, దోమలు, ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు స్వైరవిహారం చేయడమే కాకుండా వంటలకు వినియోగిస్తున్న సామగ్రిపై వాలుతున్నట్లు కూడా గుర్తించారు. 👉 వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ పదార్థాలను ఒకే ఫ్రిడ్జ్‌లో ఒకే రాక్‌లో పెడుతుండడాన్ని కూడా అధికారులు గుర్తించారు. చాలా హోటళ్లలో కొన్ని ఆహార పదార్థాలు బూజు పట్టి కనిపించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్లన్నీ బూజు పట్టిన కూరగాయలతో కనిపించాయి. 👉 చాలా ఫిర్యాదుల అనంతరం ఇటీవల కాలంలో ఫుడ్‌సేప్టీ అధికారులు ఆయా హోటళ్లపై తనిఖీలు చేస్తూ నాణ్యతపై ఆరా తీస్తుండగా చాలా హోటళ్లలో ఆహార పదార్థాలపై క్రిమికీటకాలు వాలుతున్నట్లుగా నిర్థారణ అయ్యింది. చెత్తా చెదారం, వ్యర్థాలు వేసే డస్బిన్లపై మూతలు కూడా ఏర్పాటుచేయడం లేదని, దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. 👉 ఇందులో కొన్ని జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న చైన్ హోటళ్లు ఉన్నాయని, అలాగే అంతర్జాతీయ స్థాయి చైన్ హోటళ్లు కూడా ఈ దుర్గంధం లోపించిన జాబితాలో ఉన్నట్లు తెలిపారు. 👉 జీహెచ్ఎంసీ గత పదేళ్లుగా హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోగా హోటళ్ల యాజమాన్యాలు ఇచ్చింది పుచ్చుకుంటూ అందినకాడికి దండుకుని అటువైపు తొంగి చూడలేదు. 👉 జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్–17, జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకాపూల్ ప్రాంతాల్లో సుమారు 35కి పైగా పబ్‌లు, 98 రెస్టారెంట్లు, 179 హోటళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్ల పరిధిలోని ఫుడ్ సూపర్వైజర్లు ఏనాడూ తనిఖీలు చేయకపోగా పరిశుభ్రతను పట్టించుకోలేదు. దీంతో కొత్తగా ఫుడ్‌సేప్టీ కమిషనర్‌ను ఏర్పాటుచేసి టాస్‌్కఫోర్స్ బృందాన్ని నియమించడంతో ఈ హోటళ్లు, పబ్‌లలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 👉 కేఎఫ్‌సీ లాంటి ఇంటర్నేషనల్ చైన్ హోటళ్లలో కూడా ఈ అధికారులు దాడులు చేసి ఆహార పదార్థాల నాణ్యతపై నోటీసులు జారీ చేశారు.ఉల్లంఘించిన హోటళ్ల జాబితా..క్రీమ్ స్టోన్, నేచురల్స్ ఐస్‌క్రీమ్, కరాచి బేకరీ, కేఎఫ్‌సీ, రోస్ట్రీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్ పబ్, ఎయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, కిజిలింగ్ జో, ఖాన్‌సాబ్, హోటల్ సుఖ్‌సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, సోమాజిగూడ కృతుంగ రెస్టారెంట్, సోమాజిగూడ రెస్ట్ ఓ బార్. -
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
నిజానికి ఉడిపి కాదు, ఉడుపి అని వ్రాయాలి. ఉడుపి అంటే అర్థం నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుని భూమి అని అర్థం. ఇక ఉడుపి వంట లేక భోజనం- దీని మూలం ఉడుపిలో ఉన్న కృష్ణ దేవాలయంలో, అష్ట మఠాలలో ఉంది. ఉడుపి శ్రీ మధ్వాచార్యులు జన్మించిన ఊరు. ఇది ద్వైత సాంప్రదాయ ముఖ్య కేంద్రం. అన్నదాన సేవలో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో శిక్షణ పొందిన వంటవారు ఉడిపి హోటళ్లను తెరవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. మరీ ఉడుపి భోజనానికే ఎందుకంటే పేరుగాంచిందంటే..కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైన్యానికి..ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరంటే..? మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి దాదాపు 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి. రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుందంటూ..అందరికీ భోజనాలు తయారుచేయమని చెబుతాడు శ్రీకృష్ణుడు.నిజానికి 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు, అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేషుడు.ఎలా వండేవాడంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు. ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు?..అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..ఇలా18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని గొప్పతనం అంతా ఎవరికి ఇస్తారు అని అడిగాడు?. అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని చెబుతాడు. అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతాడు యుధిష్టరుడు. అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు... శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని.. శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. ఇదంతా 13వ శతాబ్దంలో కర్ణాటకలోని చిన్న తీర పట్టణమైన ఉడుపిలో ప్రారంభమైంది. ఇక్కడ, ఒక ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం లేదా అన్నదానం చేసే పద్ధతిని ప్రారంభించింది. మెనూలో ఆహారం ఎప్పుడు వడ్డించాలనే సమయాలు రెండూ నిర్ణయించబడ్డాయి. ఈ దేవాలయాలలో శిక్షణ పొందిన వంటవారు చివరికి బెంగళూరు, చెన్నై, ముంబై వంటి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఈ ప్రాంతాల్లో ఉడుపి హోటళ్లను ఏర్పాటు చేసినట్లు చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ భోజనానికి విశేష స్థానం ఉంది. సాత్విక పద్ధతిలో చెయ్యాలి. శాకాహారం భోజనం మాత్రమే చెయ్యాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఉపయోగం చేయకూడదు. కృష్ణ మఠంకు చాలా చాలా మంది భక్తులు వస్తారు. వాళ్ళు అందరికి ప్రసాదం రూపంలో భోజనం ప్రతి దినం ఇస్తారు. అంత మందికి భోజనం ఇవ్వాలి, అందుకే చాలా మంది వంటచేసే బ్రాహ్మణులు ఉండేవారు. ఉడుపిలో చాలమంది బ్రాహ్మణులకు వంట చేసే విషయంలో ప్రావీణ్యత దొరికింది. హోటల్ ఉద్యమం ప్రారంభించడానికి ఈ పాకశాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించారు. 1942లో ఉడిపి నుండి ముంబైకి వలస వచ్చిన ఒక యువకుడు మొదటి ఉడిపి శ్రీకృష్ణ హోటల్ని స్థాపించాడు. 1950వ దశకంలో, ఇద్దరు సోదరులు మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్), ఉడిపి తరహాలో మరొక హోటల్ని ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాల వ్యాపారం తర్వాత, ఎంటీఆర్ ఇప్పుడు ఒక పెద్ద నమ్మకమైన సంస్థగా పరిగణించబడుతుంది.ఇదంతా గత వైభోగం కాని నేడు.. దేశ వ్యాప్తంగా ఉడుపి హోటల్స్ విలుప్త అంచున ఉన్నాయి...మన ఆహార సంస్కృతి తీవ్ర ప్రమాదంలో ఉంది, అమెరికన్ ఎమ్ఎన్సీలు ఫుడ్ జెయింట్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఉడిపి రెస్టారెంట్లను తొలగిస్తోంది. దీని పర్యవసానంగా చాలా ఉడుపి ఫుడ్ జాయింట్లు వేగంగా మూసుకుపోతున్నాయి. పదేళ్ళ క్రితం వరకు దేశంలో ఏ మూలకు వెళ్ళినా కుగ్రామంలో కుడా ఉడుపి హోటల్ ఉండి తీరాల్సిందే. ఉడుపి హోటల్ పేరు ఎత్తితే చాలు ఆ రవ్వ దోశలు, మసాలా దోశలు, వడ సంబారు, ఘుమఘ్జుమ లాడే కొబ్బరి చట్నీలు..... కానీ నేడు వాటి స్థానంలో నూడుల్స్ సెంటర్లు, పాణి పూరీలు, అమెరికన్ ఎమ్ఎన్సీలు పుణ్యమా..! అని దేశీయ చాట్ సెంటర్లు కుడా కనుమరుగైపోయాయి మన పిల్లలు జంక్ ప్లాస్టిక్ ఫుడ్స్‌కు అలవాటు పడి చిన్నతనం నుంచే తీవ్ర ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్స్‌తో స్థూలకాయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి.అమెరికన్ ఫుడ్ దిగ్గజా లక్ష్యం మన చిన్నారులు, యువతే. ముఖ్యంగా పిల్లల మనస్సును మరల్చగలగడమే వారి థ్యేయం. ఎందుకంటే..?మధ్య వయస్కులు, వృద్ధులు ఈ జంక్ ఫాస్ట్ ఫుడ్‌ను ఎన్నటికీ అంగీకరించరని వారికి బాగా తెలుసు. ఈలోగా చిన్నారులు యుక్తవయస్సు వచ్చే నాటికి ఈ జంక్ ఫుడ్స్‌కు బాగా బానిస అయ్యిపోతారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందులో ఉపయోగించే పదార్థాలు మన రూపు రేఖల్ని అందవిహీనంగా మార్చేసి మనకి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!)