Jitesh Sharma
-
అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఎవరనగానే ఠక్కున.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు చెప్పేస్తారు క్రికెట్ ప్రేమికులు. ఇక అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నది ఎవరంటే.. మరో ఇద్దరు భారత స్టార్లు శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్. మరి ఈ ముగ్గురికి సాధ్యంకాని రీతిలో ఓ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాడు మరొకడు ఉన్నాడు.క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక హైక్ పొందిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఏకంగా 5500 శాతం హైక్‌తో కోట్లు కొలగొట్టాడు. ఇంతకీ అతడు ఎవరా అంటారా?!.... టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. అవును.. ఐపీఎల్లో ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో జితేశ్ ఏకంగా ఈసారి వేలంలో తన పాత ధర కంటే.. 5500 శాతం ఎక్కువ మొత్తం పలికాడు.21 నిమిషాల వ్యవధిలోనే సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండురోజుల పాటు జరిగిన వేలంలో.. మొదటిరోజే రికార్డులు బ్రేకైన విషయం తెలిసిందే. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ. 18 కోట్లను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కోసం రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు.అయితే, 21 నిమిషాల వ్యవధిలోనే అతడి రికార్డును రిషభ్ పంత్ బద్దలుకొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్-2024 సీజన్లో శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. జట్టును చాంపియన్‌గా నిలిపిన అతడు కేకేఆర్ నుంచి 2022 వేలంలో రూ. 12.25 కోట్లు అందుకున్నాడు. అంతే మొత్తానికి ఈసారీ ఆడాడు.అర్ష్‌దీప్ హైక్ 3500 శాతానికి పైనే!అయితే, ఈసారి వేలంలో రూ. 26.75 కోట్లు దక్కించుకోవడంతో అయ్యర్‌కు 200 శాతం మేర హైక్ లభించినట్లయింది. మరోవైపు అర్ష్‌దీప్ గతంలో రూ. 4 కోట్లే అందుకున్నాడు. ఈసారి ఏకంగా రూ. 18 కోట్లు దక్కించుకున్నాడు. అంటే అర్ష్‌దీప్ హైక్ 3500 శాతానికి పైనే!ఇక రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా గతంలో రూ. 16 కోట్లు అందుకోగా.. ఈసారి 11 కోట్ల మేర హైక్ పొందాడు. మరోవైపు.. లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా భారీ జంప్ కొట్టాడు. చివరగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చహల్ పాత ధర రూ. 6జ5 కోట్లు.. ఈసారి పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్మరి జితేశ్ శర్మ ధర సంగతి ఏమిటంటారా?!.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఈ విదర్భ ఆటగాడిని రూ. 20 లక్షల కనీస ధరకు కొనుక్కుంది. 2024 వరకు అదే ధరకు అతడిని కొనసాగించింది. అయితే, ఈసారి వేలంలో జితేశ్‌కు డిమాండ్ రాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ. 11 కోట్లకు సొంతం చేసుకుంది. అలా 20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్ కొట్టాడు.నిజానికి 2024 ఎడిషన్‌లో జితేశ్ పెద్దగా రాణించలేదు. 131 స్ట్రైక్‌రేటుతో కేవలం 187 పరుగులే చేశాడు. అయినప్పటికీ భారీ ధర పలకడానికి కారణం అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు. అంతేకాదు పొట్టిఫార్మాట్లో లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గానూ జితేశ్‌కు మంచి రికార్డు ఉంది. ఇక దినేశ్ కార్తిక్ రిటైర్మెంట్ తర్వాత ఆర్సీబీకి వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం కూడా ఉండటంతో జితేశ్ పంట ఇలా పండింది. చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా? -
టీమిండియా క్రికెటర్ నిశ్చితార్థం (ఫోటోలు)
-
పెళ్లి పీటలెక్కనున్న భారత క్రికెటర్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్
టీమిండియా యువ క్రికెటర్ జితేష్ శర్మ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గురువారం (ఆగస్టు 8) జితేష్ తన చిన్ననాటి స్నేహితురాలు శలక మకేశ్వర్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఈ మహారాష్ట్ర క్రికెటర్ పంచుకున్నాడు. దీంతో ఈ కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. భారత క్రికెటర్లు రుతరాజ్ గైక్వాడ్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు సైతం జితేష్-మకేశ్వర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నాగపూర్ చెందిన శలాకా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఇక జితేష్ శర్మ విషయానికి వస్తే.. టీమిండియాతో పాటు ఐపీఎలో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల ద్వారా భారత జట్టు తరపున అరంగ్రేటం చేశాడు.కానీ తనకు వచ్చిన అవకాశాన్ని జితేష్ అందిపుచ్చుకోలేకపోయాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన జితేష్ కేవలం 100 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున 40 మ్యాచ్‌లు ఆడిన జితేష్ శర్మ.. 730 పరుగులు చేశాడు. View this post on Instagram A post shared by Jitesh Sharma (@jiteshsharma_) -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జితేష్ శర్మ..
ఐపీఎల్-2024 సీజన్లో తమ చివరి మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్కమ్రించిన పంజాబ్.. కనీసం తమ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజన్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు. పంజాబ్ తత్కాలిక కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కుర్రాన్ టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్దమయ్యేందుకు తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలోనే చివరి మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి జితేష్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. కాగా పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా సీజన్లో మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సామ్కుర్రాన్కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను పంజాబ్ అప్పగించింది. అయితే ఇప్పుడు సామ్ కుర్రాన్ కూడా స్వదేశానికి వెళ్లిపోవడంతో జితేష్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఐదింట విజయం సాధించింది. -
IPL 2024 GT VS PBKS: ఫిఫ్టి కొట్టిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ తరఫున 50 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిన్నటి మ్యాచ్‌లో జితేశ్ శర్మ వికెట్ సాధించడం ద్వారా రషీద్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లోనే (సన్‌రైజర్స్‌తో) షమీని అధిగమించి గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించిన రషీద్.. తాజాగా మరో మైలురాయిని తాకాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో రషీద్ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్లో గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లు.. రషీద్ ఖాన్-50 మొహమ్మద్ షమీ-48 మోహిత్ శర్మ-34 నూర్ అహ్మద్-17 అల్జరీ జోసఫ్-14 మ్యాచ్ విషయానికొస్తే.. శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అనూహ్య రీతిలో విరుచుకుపడటంతో గుజరాత్‌పై పంజాబ్ సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
పంత్ తిరిగొచ్చి ఐపీఎల్లో అదరగొట్టినా.. టీమిండియాలో చోటు కష్టం
T20 WC 2024- Rishabh Pant: రిషభ్ పంత్ టీమిండియా పునరాగమనం గురించి భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ జట్టులోకి తిరిగి వచ్చినా.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం కష్టమన్నాడు. కాగా డిసెంబరు 30, 2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ వికెట్ కీపర్.. ఫిట్నెస్ సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పంత్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత అంటే.. జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రదర్శనను బట్టే బీసీసీఐ సెలక్టర్లు.. వరల్డ్‌కప్ ఆడే భారత జట్టును ఎంపిక చేయనున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరన్న అంశంపై బోర్డు ఇప్పటికీ నిర్ణయానికి రాలేకపోతోంది. ఇషాన్ కిషన్‌కు బీసీసీతో విభేదాలు తలెత్తాయన్న తరుణంలో.. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో ముగిసిన సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌లకు స్వదేశంలో జరిగిన ఈ టీ20 సిరీస్ ఆడే అవకాశం దక్కింది. అయితే, పంత్ తిరిగి వస్తే వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. టీ20 జట్టులో పంత్ పునరాగమనం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్ జీవితంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ ఆటగాడిగా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అంత సులువేమీ కాదు. పంత్ తిరిగి మైదానంలో అడుగుపెడితే అందరికీ సంతోషమే. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా చేరుకున్నాడు. అయితే, ప్రస్తుతం తను పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించడమే అన్నికంటే ముఖ్యం. ఆతర్వాత రెగ్యులర్‌గా క్రికెట్ ఆడాలి. ఆటలో మునుపటి లయను అందుకోవాలి. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కమ్‌బ్యాక్ ఇవ్వడం అది కూడా అంతటి ఘోర ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకుని తిరిగి రావడం అంటే కష్టంతో కూడుకున్న పనే.. ఇవన్నీ ఆలోచిస్తే గనుక.. పంత్ ఐపీఎల్లో అద్భుతంగా ఆడినా.. సెలక్టర్లు అతడిని టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆడించే రిస్క్ చేస్తారని అనుకోవడం లేదు’’ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
పాపం జితేష్.. ఫోర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు! వీడియో వైరల్
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన విలియమ్స్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 5వ బంతిని బౌండరీగా మలిచిన జితేష్.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. స్టంప్స్‌కు దగ్గరగా ఆడుతున్న జితేష్.. ఫోర్ కొట్టే క్రమంలో బ్యాలన్స్ కోల్పోయి తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో 4 పరుగులు చేసిన జితేష్ హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. జితేష్ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐదో భారత ఆటగాడిగా.. కాగా అంతర్జాతీయ టీ20ల్లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన ఐదో భారత ఆటగాడిగా జితేష్ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్, హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో జితేష్ శర్మ కూడా చేరాడు. ఇక ఆఖరి టీ20లో దక్షిణాఫ్రికాపై 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. pic.twitter.com/KkkayMyqMm — Sitaraman (@Sitaraman112971) December 14, 2023 చదవండి: IND vs SA: ఇదేమి అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్ -
అనవాయితీని కొనసాగించిన సూర్యకుమార్.. రింకూ, జితేశ్‌లకు..!
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే విజయం సాధించి, దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. ట్రోఫీ గెలిచిన అనంతరం స్కై భారత కెప్టెన్లు ఆచరించిన ఆనవాయితీని కొనసాగించాడు. ఇటీవలికాలంలో భారత్ సిరీస్ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్లు కొత్త ఆటగాళ్లకు ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని స్కై కూడా కొనసాగిస్తూ.. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు ట్రోఫీని అందించాడు. టీమిండియాలో ఈ ఆనవాయితీని మహేంద్ర సింగ్ ధోని 2007లో ప్రవేశపెట్టాడు. నాటి నుంచి భారత్ ట్రోఫీ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్ ఎవరైనా ఈ ట్రెడిషన్ కొనసాగుతూనే ఉంది. Suryakumar Yadav with the T20I series Trophy. - A memorable start for Captain SKY. pic.twitter.com/zo3elColpN — Johns. (@CricCrazyJohns) December 3, 2023 ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేసిన భారత్.. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆసీస్‌ను నిలువరించగలిగింది. Suryakumar Yadav handed over the Trophy to Rinku & Jitesh. - A lovely gesture by the leader. pic.twitter.com/gwHdVxZRlA — Johns. (@CricCrazyJohns) December 3, 2023 ఆఖరి ఓవర్లో ఆసీస్ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో అర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. 6 బంతుల్లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ సిరీస్‌లో ఆసీస్ కేవలం మూడో టీ20లో మాత్రమే విజయం సాధించగా.. భారత్ మిగిలిన మ్యాచ్‌లన్నిటిలో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. -
ఆసీస్‌తో 100 మీటర్ల భారీ సిక్సర్.. సీక్రెట్ చెప్పేసిన రింకూ
టీమిండియా నయా బ్యాటింగ్ సంచలనం రింకూ సింగ్ మరోసారి దుమ్మురేపాడు. రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో రింకూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న రింకూ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. టీమిండియా 174 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రింకూ కొట్టిన సింగ్ ఓ సిక్సర్ ఏకంగా 100 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో ఈ సిరీస్‌లో భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా రింకూ నిలిచాడు. కాగా మ్యాచ్ అనంతరం తన పవర్ హిట్టింగ్‌కు గల సీక్రెట్‌ను రింకూ బయటపెట్టాడు. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడమే తన బలానికి కారణమని రింకూ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ టీవీతో రింకూ సింగ్, జితేష్ శర్మ మాట్లాడారు. ఈ క్రమంలో జితేష్.. నీ పవర్ హిట్టింగ్‌కు గల కారణమెంటి అని ప్రశ్నించాడు. "నేను నీతో(జితేష్ శర్మ) కలిసి జిమ్ చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. బరువులు ఎత్తడం కూడా నాకిష్టం. అందుకే సహజంగా నాలో అంత పవర్ ఉంది" అని నవ్వుతూ రింకూ సమాధనమిచ్చాడు. చదవండి: IPL 2024 Mini Auction: ఐపీఎల్ వేలంలోకి 1166 మంది ప్లేయర్స్.. వారి కోసం తీవ్ర పోటీ! SINGH IS KING.#RinkuSinghpic.twitter.com/B4Bbikmz0F — KnightRidersXtra (@KRxtra) December 1, 2023 Secret behind the giant six 😎 Roaring Raipur crowd 🔥 Adding calmness to the partnership 👏 On the mic with Rinku Singh & Jitesh Sharma 👌👌 - By @28anand Watch the full Video 🎥🔽 #TeamIndia | #INDvAUS https://t.co/lc8Dfk7hI7 pic.twitter.com/RHaXeFnsmP — BCCI (@BCCI) December 2, 2023 -
'భారత్‌కు మరో ఫినిషర్ దొరికేశాడు.. దుమ్మురేపుతున్నాడు'
జితేష్ శర్మ తన ప్రదర్శనతో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న జితేష్ శర్మ 1 ఫోర్, 3 సిక్స్‌లతో 35 పరుగులు చేశాడు. టీమిండియా 175 పరుగుల స్కోర్ నమోదు చేయడంలో జితేష్ తన వంతు పాత్ర పోషించాడు. రింకూ సింగ్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఏడాది చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో జితేష్ శర్మ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే జితేష్ శర్మ సీనియర్ జట్టు తరపున ఆడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన జితేష్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ మ్యాచ్‌లో జితేష్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి బ్యాటింగ్ చేసిన విధానం నమ్మశక్యం కానిది. ఈ మ్యాచ్‌కి ముందు అతడి ఫియర్లెస్ బ్యాటింగ్ గురించి మాట్లాడాను. మరోసారి అతడు తన బ్యాటింగ్ టాలెంట్‌ను చూపించాడు. వేరే ఆటగాడు జితేష్ శర్మ పొజిషన్లో బ్యాటింగ్‌కు వచ్చి వుంటే కచ్చితంగా కొన్ని బంతులను ఎదుర్కొని క్రీజులో సెటిల్ కావడానికి ప్రయత్నిస్తారు. కానీ అతడు బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే క్రిస్ గ్రీన్‌ను ఆటాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వరుసగా సిక్స్‌లు బాది బౌలర్‌ను ఒత్తడిని నెట్టాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు ఒక్కసారిగా ముందుకు కదలింది. అతడి బ్యాటింగ్ ఎటాక్ నన్ను ఎంతగానో అకట్టుకుంది. టీమిండియాకు జితేష్ రూపంలో మరో ఫినిషర్ దొరికినట్లే" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆసీస్‌తో ఐదో టీ20.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్! తిలక్ రీ ఎంట్రీ -
అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య
టీమిండియా టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి సిరీస్‌లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అటు బ్యాటర్‌గా.. ఇటు సారథిగా తన పాత్రను సమర్థవంతంగా పోషించి.. భారత జట్టుకు ట్రోఫీని అందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కీలక ఆటగాళ్లు ఎవరూ లేకుండానే యువ జట్టుతో ఆసీస్‌పై పైచేయి సాధించగలిగాడు. కాగా ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో గెలుపొందడం ద్వారా టీమిండియా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1తో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. రింకూ సింగ్ 29 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ 19 బంతుల్లోనే 35 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయి దెబ్బకొట్టారు. అక్షర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రవి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు చాలా రోజుల తర్వాత భారత జట్టులో పునరాగమనం చేసిన పేసర్ దీపక్ చహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్ కూడా ఒక వికెట్ తీయగలిగాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన మాథ్యూ వేడ్ బృందం 154 పరుగులకే ఆట ముగించి.. భారత్‌కు సిరీస్‌ను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ విజయంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు టాస్ తప్ప అన్నీ మాకు అనుకూలంగా జరిగాయి. మా కుర్రాళ్లు పట్టుదలగా నిలబడి మ్యాచ్ గెలిపించారు. వాళ్లు ఇలా బాధ్యతగా ఆడటమే మాకు అన్నిటికన్నా ముఖ్యం. మ్యాచ్‌కు ముందే మేమంతా సమావేశమైన సమయంలో.. ‘మిమ్మల్ని మీరు నిరూపించుకునే అద్భుత అవకాశం. ప్రతి ఒక్కరు భయం లేకుండా ఆడాలి’ అని చెప్పాం. నిజానికి అక్షర్ పటేల్‌ను ఒత్తిడిలోకి నెట్టడం నాకెంతో ఇష్టం. ఎందుకంటే.. ఎంత ప్రెజర్ పెడితే అతడు అంత గొప్ప స్పెల్స్ వేస్తాడు. ఇక డెత్ ఓవర్లలో యార్కర్లు వేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాం’’ ప్రణాళికను సరిగ్గానే అమలు చేశాం’’ అని సూర్య పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మిగిలిన నామమాత్రపు మ్యాచ్ ఆదివారం బెంగళూరులో జరుగనుంది. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. The moment #TeamIndia recorded their third win of the series 👌 Celebrations and smiles all around in Raipur 😃#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/BxRiBbSzCz — BCCI (@BCCI) December 1, 2023 -
Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్‌లకు ఛాన్స్!
డబ్లిన్: వెస్టిండీస్‌తో ఐదు టి20 మ్యాచ్‌లు, ఆ తర్వాత ఐర్లాండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి. వన్డే ప్రపంచకప్ ఏడాది ఎక్కువ మంది సీనియర్లు విరామం తీసుకోగా, కుర్రాళ్లంతా తమకు లభించిన చాన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో కలిపి ఏడు మ్యాచ్‌లలో ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మరో ఇద్దరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. టూర్ చివరి మ్యాచ్‌లో ఆ చాన్స్ దక్కుతుందా అనేది చూడాలి. సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకున్న భారత్ కోణంలో ఇది మాత్రమే ఆసక్తికర అంశం. మరోవైపు వన్డే, టి20 ఫార్మాట్లలో కలిపి భారత్‌తో ఆడిన 10 సార్లూ ఓడిన ఐర్లాండ్ ఈసారైనా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ గెలవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20కి రంగం సిద్ధమైంది. జితేశ్, షహబాజ్‌లకు అవకాశం! ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్లోలనూ రాణించిన కెప్టెన్ బుమ్రా, పేసర్ ప్రసిధ్ కృష్ణ ఫామ్‌లోకి రావడం, ఆసియా కప్‌కు ఎంపిక కావడంతో ఈ సిరీస్ నుంచి భారత్‌కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. అయితే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్ కూడా సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్ కూడా తమకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకోగా, శివమ్ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు. సిరీస్‌లో విఫలమైన తిలక్ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో మూడు మార్పులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వికెట్ కీపర్ జితేశ్ శర్మ, 3 వన్డేలు ఆడిన షహబాజ్ అహ్మద్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. మరోవైపు కొంత విరామం తర్వాత టీమ్‌లోకి వచ్చిన అవేశ్ ఖాన్ కూడా టీమ్‌తో పాటు ఉన్నాడు. అతనికీ ఒక మ్యాచ్ ఇవ్వాలనుకుంటే అర్‡్షదీప్‌కు విశ్రాంతినిస్తారు. ఇదే జరిగితే కుర్రాళ్లతో భారత్ ప్రయోగం సంపూర్ణమవుతుంది. స్టిర్లింగ్ ఫామ్‌లోకి వచ్చేనా! రెండు టి20 మ్యాచ్‌లలో ఐర్లాండ్ ఆటతీరు మరీ పేలవంగా లేకున్నా భారత్‌లాంటి బలమైన జట్టుకు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. గతంలోనూ కొన్ని చక్కటి ప్రదర్శనలు వచ్చినా టీమిండియాను ఓడించడంలో మాత్రం ఆ జట్టు సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి పోరులోనైనా ఆ జట్టు గెలుపు బాట పడుతుందేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇక్కడ మాత్రం రెండింటిలోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించడం కీలకం. ఐర్లాండ్ కూడా గత మ్యాచ్‌తో పోలిస్తే మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. -
ఐర్లాండ్‌తో మూడో టీ20.. సంజు శాంసన్‌పై వేటు! ఐపీఎల్ హీరో ఎంట్రీ
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్దమైంది. బుధవారం డబ్లిన్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని బుమ్రా సేన భావిస్తోంది. అదే విధంగా గత రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లకు ఆఖరి టీ20లో అవకాశం ఇవ్వాలని జట్టు మెన్జ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆఖరి మ్యాచ్‌కు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురి స్ధానంలో వరుసగా జితేష్ శర్మ, షాబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో అదరగొట్టి జట్టులోకి వచ్చిన జితేష్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాడు. గత కొన్ని సిరీస్‌లకు జితేష్ ఎంపికవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం రావడం లేదు. అయితే ఐర్లాండ్‌తో ఆఖరి టీ20లో జితేష్ అరంగేట్రం దాదాపు ఖాయమన్పిస్తోంది. మరోవైపు అవేష్ ఖాన్ విండీస్‌తో టీ20 సిరీస్ ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడికి ఆఖరి టీ20లో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్‌రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తుది జట్లు(అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, షాబాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ చదవండి: IND vs IRE: అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు -
Ind Vs Ire: వాళ్లిద్దరి అరంగేట్రం.. జితేశ్ శర్మకు మొండిచేయి..
Ireland vs India, 1st T20I: అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలన్న భారత యువ బ్యాటర్ రింకూ సింగ్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐరిష్ జట్టుతో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చి కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్‌ది పేద కుటుంబం. అయితే, చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతడు.. ఇంటింటికి గ్యాస్ బండలు మోస్తూనే ఆటపై దృష్టి సారించాడు. దేశవాళీ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకుని ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూను కొనడంతో అతడి రాత మారింది. ఆరంభంలో బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చినా.. రింకూ ఓపికగా ఎదురుచూశాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్-2023లో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023లో సత్తా చాటి మొత్తంగా 14 ఇన్నింగ్స్‌లో 149.53 స్ట్రైక్‌రేటుతో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్ తొలుత ఆసియా క్రీడలు-2023 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్ నిమిత్తం ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టులో చోటు దక్కడంతో శుక్రవారం అరంగేట్రం చేశాడు. జితేశ్‌కు మొండిచేయి ఇక రింకూ సంగతి ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌తో కచ్చితంగా టీమిండియా క్యాప్ అందుకుంటాడనుకున్న మరో బ్యాటర్ జితేశ్ శర్మకు నిరాశే మిగిలింది. వెస్టిండీస్ పర్యటనలో మెరుగ్గా రాణించకపోయినప్పటికీ సీనియర్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ ఇంకొన్నాళ్లు వేచిచూడకతప్పదు. డబ్లిన్‌లో మూడు మ్యాచ్‌లు ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా కర్ణాటక బౌలర్ ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రసిద్‌కు కూడా బుమ్రా టీమిండియా క్యాప్ అందించాడు. రింకూ, ప్రసిద్ల అరంగేట్రానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక డబ్లిన్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ల మధ్య ఆగష్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: బౌలింగ్‌లోనూ 'కింగే'.. చెక్కుచెదరని బౌలింగ్ రికార్డు విరాట్ సొంతం Moments like these! ☺️ All set for their debuts in international cricket and T20I cricket respectively 👍 👍 Congratulations Rinku Singh and Prasidh Krishna as they receive their caps from captain Jasprit Bumrah 👏 👏#TeamIndia | #IREvIND pic.twitter.com/JjZIoo8B8H — BCCI (@BCCI) August 18, 2023 -
టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్!
Ireland vs India T20Is 2023: ఇటీవలి కాలంలో యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా క్యాప్ తేలికగానే లభిస్తోందని మాజీ పేసర్ అతుల్ వాసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగడం మంచిది కాదని.. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు సూచించాడు. కొత్త వాళ్లను ఆడించే క్రమంలో అర్హులైన ప్లేయర్లను బెంచ్‌కు పరిమితం చేయవద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్ స్టార్లకు అవకాశాలు కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో నిరూపించుకున్న చాలా మంది యువ క్రికెటర్లు అనతికాలంలో భారత జట్టుకు ఆడే అదృష్టం దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా టీ20 జట్టు ఎంపిక సమయంలో వీరికి ప్రాధాన్యం ఉంటోంది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా యశస్వి జైశ్వాల్(టెస్టు ద్వారా), ముకేశ్ కమార్, తిలక్ వర్మ అరంగేట్రం చేశారు. ఇక ప్రస్తుతం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జితేశ్ శర్మతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. ఈజీ అయిపోయింది.. ఇలాగే కొనసాగితే డబ్లిన్ వేదికగా శుక్రవారం మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో ఐరిష్ జట్టుపై వీరిద్దరి అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతుల్ వాసన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో ఇండియన్ క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది. మనందరం ఇలాంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కష్టం. నా అభిప్రాయం ప్రకారం... ఎంత మందికి అవకాశమిచ్చినా.. ఒక మంచి ఆటగాడిని మాత్రం మిస్ చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా టీ10, టీ20, 50- ఓవర్ పేరిట ఎన్నో జట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క ఆటగాడికి ఏదో ఒక రూపంలో కచ్చితంగా ఆడే అవకాశం వస్తోంది’’ అని అతుల్ ఇండియా.కామ్‌తో చెప్పుకొచ్చాడు. అదే జరిగితే బుమ్రా అవుట్! ఇక ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్న భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తీవ్రమైన వెన్ను నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని బుమ్రా తిరిగి వస్తున్నాడు. ఫిట్నెస్ నిరూపించుకుంటే అతడి కెరీర్ మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఒకవేళ గాయం గనుక తిరగబెడితే మాత్రం కష్టం. తనదైన బౌలింగ్ యాక్షన్‌తో బుమ్రా సాధించిన విజయాలు కొనసాగించాలంటే తప్పక పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాల్సిందే’’ అని అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు. కాగా 55 ఏళ్ల అతుల్ వాసన్ టీమిండియా తరఫున 4 టెస్టుల్లో 10, 9 వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 18-23 వరకు బుమ్రా సారథ్యంలోని భారత యువ జట్టు ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పోటీ పడనుంది. చదవండి: అరంగేట్రంలో విఫలం.. కట్ చేస్తే.. ప్రపంచ క్రికెట్లో రారాజుగా! From emotions of an India call-up to the first flight ✈️ & Training session with #TeamIndia 😃 𝗪𝗵𝗲𝗻 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝘁𝗮𝗸𝗲 𝗳𝗹𝗶𝗴𝗵𝘁 ft. @rinkusingh235 & @jiteshsharma_ 👌👌 - By @RajalArora Full Interview 🎥🔽 #IREvINDhttps://t.co/m4VsRCAwLk pic.twitter.com/ukLnAOFBWO — BCCI (@BCCI) August 17, 2023 -
తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. మా అమ్మ కల నెరవేరింది!
ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య డబ్లిన్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ సిరీస్‌తో టీమిండియా పేస్‌గుర్రం జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు 11 నెలల తర్వాత బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అంతేకాకుండా ఐరీష్ టూర్లో బుమ్రానే భారత జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనకు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఐపీఎల్-2023లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, జైశ్వాల్ వంటి యువ ఆటగాళ్లకు చోటుకల్పించారు. అయితే తిలక్ వర్మ, జైశ్వాల్ ఇప్పటికే విండీస్ టూర్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టగా.. రింకూ సింగ్, జితేశ్ శర్మ తమ అరంగేట్రం కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సిరీస్ కోసం బుమ్రా సారథ్యంలోని భారత జట్టు బుధవారం ఐర్లాండ్‌కు చేరుకుంది. తొలిసారి.. భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్, జితేశ్ శర్మలు తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ తొలి అంతర్జాతీయ పర్యటనకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్చేసింది. "నాకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు ఆడాలనేది ప్రతీ ఒక్క ఆటగాడి కల. నేను నా గదిలోకి వెళ్లి.. నా పేరు, 35 నంబర్ ముద్రించిన జెర్సీని చూడగానే భావోద్వేగానికి లోనయ్యా. ఈ రోజు కోసమే నేను కష్టపడ్డాను. నేను భారత జట్టు ఎంపికైనప్పుడు నా స్నేహితులతో నోయిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. వెంటనే మా అమ్మకు ఫోన్ చేశాను. నేను ఈ స్ధాయిలో ఉన్నానంటే అందుకు ఒక కారణం మా అమ్మ కూడా. ఆమెకు నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. భారత్ తరపున ఆడాలన్నది నా ఒక్కడి కలే కాదు మా అమ్మది కూడా. ఇప్పడు మా ఇద్దరి కల నిజమైందని" బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో రింకూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా జితేష్ శర్మ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ఈ సంతోషంలో నాకు మాటలు కూడా రావడం లేదు. భారత క్రికెట్ జట్టుతో కలిపి విదేశాల్లో పర్యటించడం గొప్ప అనుభవం. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం అనేది మనకు లభించిన గౌరవం. అంతేకాకుండా బాధ్యత కూడా మన సత్తా చూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. నాకు ఆడేందుకు అవకాశం లభిస్తే 100 శాతం ఎఫక్ట్ భారత్‌ను గెలిపించేందుకు పెడతాను "అని పేర్కొన్నాడు. చదవండి: BAN vs NZ: బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. 10 ఏళ్ల తర్వాత -
ఐర్లాండ్‌తో తొలి టీ20.. రింకూ, జితేశ్ అరంగేట్రం.. సంజూకు మొండిచెయ్యే..!
భారత్-ఐర్లాండ్ మధ్య తొలి టీ20కి సర్వం సిద్ధమైంది. డబ్లిన్‌లోని ద విలేజ్ మైదానంలో రేపు (ఆగస్ట్ 18) జరుగబోయే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా దాదాపుగా ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న మ్యాచ్ కావడంతో భారత అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఐపీఎల్ స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తారా లేదా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు రింకూ సింగ్‌పై భారీ అంచనాలు ఉండటంతో ఈ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ మ్యాచ్‌తో రింకూ, జితేశ్‌లు అరంగేట్రం చేస్తారో లేదో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. రింకూ, జితేశ్‌ల అరంగేట్రంపై డిస్కషన్ నేపథ్యంలో ఐర్లాండ్‌తో తొలి టీ20కి భారత జట్టు ఇలా ఉండబోతుందంటూ పలువురు మాజీ, విశ్లేషకులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మెజారిటీ శాతం అభిప్రాయాల మేరకు.. భారత తుది జట్టులో రింకూ సింగ్, జితేశ్ శర్మ ఇద్దరూ చోటు దక్కించుకోనున్నారు. వికెట్‌కీపర్ కోటాలో సంజూ శాంసన్‌ను కాదని జితేశ్‌కు మెజారిటీ శాతం జనాలు ఓటేస్తున్నారు. సంజూకి విండీస్‌తో సిరీస్‌లో చాలా అవకాశాలు ఇచ్చారని, జితేశ్‌కు కూడా ఒకట్రెండు అవకాశాలిస్తే, అతనిలో విషయం ఉందో లేదో తెలిసిపోతుందని అంటున్నారు. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేలను అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, అర్షదీప్ తుది జట్టులో ఎలాగూ ఉంటారు కాబట్టి, మూడో పేసర్‌గా ప్రసిద్ధ కృష్ణ, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బిష్ణోయ్‌కు అవకాశాలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఐర్లాండ్‌తో తొలి టీ20కి భారత్ తుది జట్టు (అంచనా).. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, రవి బిష్ణోయ్ -
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ద్రవిడ్ అడిగాడు! అప్పుడు నేను..
ఐపీఎల్లో గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు జితేశ్ శర్మ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గతేడాది 10 ఇన్నింగ్స్‌లో 234 పరుగులు సాధించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 16వ ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్‌లో 309 రన్స్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఓసారి టీమిండియాకు ఎంపికైన జితేశ్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. శ్రీలంకతో టీ20 సిరీస్ నేపథ్యంలో ఈ విదర్భ బ్యాటర్‌కు పిలుపు వచ్చింది. కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయపడటంతో అతడి స్థానంలో జితేశ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ రూపంలో వికెట్ కీపర్ అందుబాటులో ఉండటంతో అతడికి ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా మరోసారి అదృష్టం జితేశ్ తలుపుతట్టింది. చైనాలో జరుగునున్న ఈ మెగా ఈవెంట్లో పాల్గొననున్న భారత ద్వితీయ శ్రేణి జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన జితేశ్ మొదటిసారి జట్టుకు ఎంపికైనపుడు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించాడు. ‘‘జితేశ్.. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావో తెలుసా?’’ అని ద్రవిడ్ అడిగారు. అందుకు బదులుగా.. ‘‘వీలైనంత ఎక్కువ స్ట్రైక్‌రేటు నమోదు చేయడం నా బలం. త్వరత్వరగా పరుగులు రాబడతాను. అందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు’’ అని సమాధానమిచ్చాను. అందుకు రాహుల్ సర్ కూడా.. ‘‘అవును.. నువ్వు ఇక్కడిదాకా వచ్చింది అందుకే! నీదైన శైలిలో ఆడు.. జట్టు కోసం ఆడు.. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు’’ అంటూ 29 ఏళ్ల జితేశ్ డ్రెస్సింగ్‌రూం అనుభవాలు పంచుకున్నాడు. కాగా ఆసియా క్రీడలకు రింకూ సింగ్, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తదితరులు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకుడు. -
భారత జట్టులో నో ఛాన్స్.. ‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌తో ఉన్నాడు’
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు కొత్త ఛైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్ వంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. అయితే మరి కొంతమంది ఐపీఎల్ హీరోలకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. అందులో ముందు వరుసలో ఉంటాడు పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. జితేష్ శర్మ ఈ ఏడాది సీజన్లో అదరగొట్టాడు. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 156.06 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేశాడు. కాగా అంతకు ముందు శ్రీలంక, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లకు భారత జట్టులో జితేష్‌కు చోటు దక్కినప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక తాజాగా ఓ ఇంటరర్వ్యూలో విండీస్ టూర్‌కు చోటు దక్కకపోవడంపై జితేష్ శర్మ స్పందించాడు. విండీస్ టూర్‌కు ఎంపికకాకపోవడం గురించి ఏమనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్ వేశాడు’’ ఒక్క మాటలో సమాధానమిచ్చాడు. రాహల్ ద్రవిడ్ సార్ నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నారు. మీరు చాలా బాగా రాణిస్తున్నారని, మేము మీలాంటి యువ ఆటగాళ్ల కోసం వెతుకుతున్నామని ద్రవిడ్ సార్ చెప్పారు. నేను ఇంకా ఎక్కువగా పరుగులు సాధించాలని అనుకుంటున్నాని అతనితో చెప్పాను. అందుకు బదులుగా ఆయన నేను ఆడే పోజేషన్కు అవే ఎక్కువ పరుగులు అని కితాబు ఇచ్చారు. పరుగులు కాదు గెలుపు కోసం మీరు ఎంత ఎక్కువ కృషి చేస్తారో అది ముఖ్యమని ఆయన అన్నారు" అని క్రికెట్.కామ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు. విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: Rohit Sharma: 'ఆటగాళ్ల మధ్య దూరానికి అది కూడా కారణమే.. రోహిత్ కెప్టెన్సీ అంతగా బాగోలేదు' -
#JiteshSharma: పంజాబ్ తరపున కొత్త సిక్సర్ల వీరుడు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున వికెట్ కీపర్ జితేశ్ శర్మ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ ఆడినంతసేపు ఎక్కువగా సిక్సర్లకే ప్రాధాన్యమిచ్చిన జితేశ్ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం(మే 19న) రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 28 బంతుల్లో 44 పరుగులు చేసిన జితేశ్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. Photo: IPL Twitter కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు జితేశ్ శర్మ 21 సిక్సర్లు బాదాడు. పంజాబ్ కింగ్స్ తరపున సీజన్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా నిలిచాడు. జితేశ్ శర్మ తర్వాత లియామ్ లివింగ్‌స్టోన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 19 సిక్సర్లతో ఉన్నారు. ఇక ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున జితేశ్ శర్మ మూడో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 309 పరుగులు చేశాడు. ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే జితేశ్ ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. సీజన్లో అతని అత్యధిక స్కోరు 49 నాటౌట్‌గా ఉంది. చదవండి: స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి! -
అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి.. శాంసన్ కంటే బెటర్!
ఐపీఎల్-2023లో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మపై భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి ప్రశంసల వర్షం కురిపించాడు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో జితేష్ శర్మ ఒకడని సునీల్ జోషి కొనియాడాడు. కాగా జితేష్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పంజాబ్ జట్టుకు అద్భుతమైన ఫినిషర్‌గా మారాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన జితేష్ 165.97 స్ట్రైక్ రేట్‌తో239 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో హిందూస్తాన్ టైమ్స్‌తో జోషి మాట్లాడుతూ.. "ఐపీఎల్లో జితేష్ దుమ్మురేపుతున్నాడు. పంజాబ్‌కు మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. కాబట్టి సంజూ శాంసన్ స్ధానంలో జితేష్ శర్మను భారత జట్టుకు ఎంపిక చేయాలి. సంజూ కంటే జితేష్ శర్మ మెరుగైన ఆటగాడు. గత కొన్ని నెలలగా అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు కచ్చితంగా టీమిండియాకు ఆడాలి. గత కొన్ని టీ20 సిరీస్‌లకు జితేష్ భారత జట్టులో భాగమయ్యాడు. కానీ అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఈ సారి మాత్రం అతడికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వండి. అతడు పంజాబ్‌కు ఏమి చేస్తున్నాడో టీమిండియాకు కూడా అదే అందిస్తాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్ -
#JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్ అవతారం
పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ స్టన్నింగ్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసిన జితేశ్ శర్మ ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో జితేశ్ 357.14 స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం విశేషం. Photo: IPL Twitter కాగా గత సీజన్లోనే జితేశ్ శర్మ వెలుగులోకి వచ్చాడు. ఎక్కువగా ఆరు లేదా ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్న జితేశ్ ఐపీఎల్ 2022లో పంజాబ్ తరపున 12 మ్యాచ్‌ల్లో 163.64 స్ట్రైక్‌రేట్‌తో 234 పరుగులు చేశాడు. ఈ సీజన్లో కూడా జితేశ్ అదిరిపోయే స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు సీజన్లో పంజాబ్ తరపున ఏడు మ్యాచ్‌ల్లో 150 స్ట్రైక్‌రేట్‌తో 145 పరుగులు చేశాడు. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావాలనుకొని.. Photo: IPL Twitter అయితే జితేశ్ శర్మకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి లేదు. పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్‌లో అదనపు మార్కుల కోసం క్రికెటర్ అవతారం ఎత్తాడు. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావాలన్న కోరిక జితేశ్‌లో బలంగా ఉండేది. మహారాష్ట్రలో ఎన్డీఏ పరీక్షకు స్పోర్ట్స్ కోటాలో ఒక కటాఫ్ ఉంది. ఏ క్రీడ అయినా రాష్ట్ర స్థాయిలో ఆటగాడిగా రాణిస్తే 25 మార్కులు అదనంగా ఇస్తారు. ఇది జితేశ్ శర్మను బాగా ఆకట్టుకుంది. ఎలాగైనా బ్లూ డ్రెస్(ఎయిర్‌ఫోర్స్) వేసుకోవాలని కల గన్న జితేశ్ అలా క్రికెటర్ అవతారం ఎత్తాడు. కట్‌చేస్తే దేశవాలీలో విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న జితేశ్ శర్మ.. ఇవాళ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున బెస్ట్ ఫినిషర్‌గా ఎదిగాడు. Photo: IPL Twitter ఇక క్రికెట్‌పై తనకు ఆసక్తి లేదన్న విషయాన్ని జితేశ్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ప్రాక్టీస్ సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' నేను ఎప్పుడు క్రికెటర్ అవ్వాలనుకోలేదు. నిజానికి నాకు ఎలాంటి చైల్డ్‌హుడ్ కోచ్ లేడు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ క్రికెట్ నేర్చుకున్నా. ముఖ్యంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌరవ్ గంగూలీ బ్యాటింగ్‌లకు సంబంధించిన వీడియోలను రిపీట్‌గా చూసేవాడిని. డిఫెన్స్‌లోకి వెళ్లి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావాలన్న కోరిక బలంగా ఉండేది. అయితే మహారాష్ట్రలో స్పోర్ట్స్ కోటాలో 25 మార్కులు అదనంగా ఇచ్చే అవకాశం ఉండేది. ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావడం కోసం క్రికెట్ ఆడడం ప్రారంభించాను. 2011లో 16 ఏళ్ల వయసులో విదర్భ క్రికెట్ అసోసియేషన్ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నా. అక్కడే నాకు పరిచయం అయ్యాడు అమర్. అమర్ సహా అక్కడికి వచ్చిన చాలా మంది నీకు మంచి టాలెంట్ ఉందని.. క్రికెటర్‌గా మంచి భవిష్యత్తు ఉందని ఎంకరేజ్ చేశారు. అలా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కలను వదులుకొని క్రికెట్‌వైపు అడుగులేశాను. నా జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: జితేశ్ శర్మ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులు బద్దలు -
జితేశ్ శర్మ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సామ్ కరన్, హర్‌ప్రీత్ బాటియా, జితేశ్ శర్మలు కలిసి చేసిన విధ్వంసానికి రికార్డులు పగిలిపోయాయి. చివరి ఆరు ఓవర్లలో పంజాబ్ 109 పరుగులు చేసింది. దీనితో పాటు కొన్ని రికార్డులను పరిశీలిద్దాం. ►ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేశ్ శర్మ సంచలనం సృష్టించాడు. ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసిన జితేశ్ శర్మ పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. జితేశ్ 357.14 స్ట్రైక్‌రేట్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో బానుక రాజపక్స(9 బంతుల్లో 31 పరుగులు, 344.44 స్ట్రైక్‌రేట్), కేఎల్ రాహుల్(16 బంతుల్లో 51 పరుగులు, 318.75 స్ట్రైక్‌రేట్), నికోలస్ పూరన్ (8 బంతుల్లో 25*పరుగుఉల, 312.50 స్ట్రైక్‌రేట్) ఉన్నారు. ►ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చివరి ఆరు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 109 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో చివరి ఆరు ఓవర్లలో ఇన్ని పరుగులు చేయడం పంజాబ్‌కు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా పంజాబ్ రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆర్సీబీ గుజరాత్ లయన్స్‌పై చివరి ఆరు ఓవర్లలో 126 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా.. 2020లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై 104 పరుగులు చేసింది. ►ఇక ముంబై ఇండియన్స్ తరపున ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్ నిలిచాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో అర్జున్ ఒక ఓవర్లో 31 పరుగులిచ్చుకున్నాడు. తొలి స్థానంలో డేనియల్ సామ్స్ (35 పరుగులు వర్సెస్ కేకేఆర్) ఉన్నాడు. ►ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సామ్ కరన్-హర్‌ప్రీత్ బాటియాలు ఐదో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. పంజాబ్ కింగ్స్ తరపున ఐదో వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. తొలి స్థానంలో డేవిడ్ మిల్లర్-రాజ్‌గోపాల్ సతీష్(130*పరుగులు) తొలి స్థానంలో ఉన్నారు. Jitesh da muqabla, das mainu kithe ae ni 💪#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @jiteshsharma_ pic.twitter.com/kphTnuy591 — JioCinema (@JioCinema) April 22, 2023 Super Sam goes bang bang 💥 A stunning 5️⃣0️⃣ by Curran and @PunjabKingsIPL are ✈ at Wankhede 📈 #MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL pic.twitter.com/NQjSSWnLDA — JioCinema (@JioCinema) April 22, 2023 -
కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన జితేశ్ శర్మ
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. మార్క్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఐదో బంతిని జితేశ్శర్మ మిడాఫ్ దిశగా ఆడాడు. బంతి కచ్చితంగా బౌండరీ వెళుతుందన్న దశలో కేఎల్ రాహుల్ తన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు. బంతి అతనికి చాలా దూరంలో ఉన్నప్పటికి సూపర్ టైమ్‌లైన్‌తో స్పందించిన రాహుల్ అమాంతం ఒకవైపుగా డైవ్‌చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. లక్నో కెప్టెన్ దెబ్బకు జితేశ్ శర్మ నోట మాట రాక బిత్తరపోయాడు. రాహుల్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కేఎల్ రాహుల్ ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. 56 బంతుల్లో 74 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌కు ఈ సీజన్లో ఇదే తొలి అర్థసెంచరీ కావడం విశేషం. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. उड़ता राहुल #KLRahul #LSGvPBKS @LucknowIPL #IPL23 pic.twitter.com/koq3dTTj4R — KUNAL KOUSHAL (@KUNALKOUSHAL65) April 15, 2023 WHAT A CATCH BY KL RAHUL. pic.twitter.com/cFzyRdQbQ0 — Johns. (@CricCrazyJohns) April 15, 2023 An absolute blinder from KL Rahul to dismiss Jitesh Sharma🔥 📸: JioCinema#KLRahul #JiteshSharma #LSGvPBKS #LSGvsPBKS #PBKSvLSG #PBKSvsLSG #TATAIPL #TATAIPL2023 #IPL #IPL2023 #IndianPremierLeague #Cricket #SBM pic.twitter.com/VttOONPJrC — SBM Cricket (@Sbettingmarkets) April 15, 2023 చదవండి: 'ఆ నవ్వుకే పడిపోయాడనుకుంటా..' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాలో మూడు మార్పులు..?
IND VS NZ 3rd T20: ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దాదాపు ఒకే జట్టుతో (చహల్ మినహాయించి) బరిలోకి దిగిన భారత్.. మూడో టీ20 కోసం మూడు మార్పులు చేయనుందని సమాచారం. రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పాటు బౌలింగ్ విభాగంలో మరో కీలక మార్పు చేయాలన్నది జట్టు యాజమాన్యం యోచనగా తెలుస్తోంది. శుభ్‌మన్, ఇషాన్‌ల స్థానాల్లో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మ.. అలాగే చహల్ లేదా కుల్దీప్ స్థానాల్లో ముకేశ్ కుమార్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తొలుత బ్యాటింగ్‌కు, ఆతర్వాత పేసర్లకు సహకరించే అస్కారం ఉండటంతో స్పిన్నర్ స్థానంలో అదనపు పేసర్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ముకేశ్ కుమార్‌కు ఈ సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో మూడో టీ20లో తప్పక ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే గిల్, ఇషాన్‌లు వరుసగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని నేపథ్యంలో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మలకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నది టీమ్ ప్లాన్‌గా తెలుస్తోంది. మరోవైపు, సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో మేనేజ్మెంట్ పెద్దగా ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చన్న టాక్ కూడా నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ తుది జట్టులో ఎవరెవరు ఉంటారో తేలాలంటే మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి (తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో మ్యాచ్‌లో భారత్ గెలిచాయి) సిరీస్‌లో సమవుజ్జీలుగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వన్డేల్లో డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో హిట్ అయిన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఫట్ అయ్యాడు.