Jyotiraditya Scindia
-
భారత మార్కెట్లోకి స్టార్‌లింక్!
న్యూఢిల్లీ: పలు దేశాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారతీయ విపణిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధంచేసుకుంటోంది. భారత చట్టాల ప్రకారం సంస్థను నడిపేందుకు స్టార్లింగ్ ముందుకు వచ్చిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభుత్వ సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ తమ భారతీయ యూజర్ల సమాచారాన్ని దేశీయంగానే నిల్వచేయాల్సి ఉంటుంది. ఇందుకు స్టార్‌లింక్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో స్టార్‌లింక్ ప్రతినిధులు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.శాటిటైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల(జీఎంపీసీఎస్) లైసెన్స్ మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలను పాటిస్తామని సంస్థ తెలిపింది. స్టార్‌లింక్ సంస్థ ఇంకా తమ సమ్మతి పత్రాలను సమర్పించాల్సి ఉంది. సమర్పణ పూర్తయితే సంస్థ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌లో జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకుంది. ఈ రంగంలోని భారత నియంత్రణసంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) సంబంధిత అనుమతులను మంజూరుచేయనుంది. ఆలోపు తమ అభ్యంతరాలపై సరైన వివరణ ఇవ్వాలని స్టార్‌లింక్‌ను ఇన్–స్పేస్ కోరింది. స్టార్‌లింక్‌కు పోటీగా మరో ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ సంస్థలో భాగమైన ‘ప్రాజెక్ట్ కూపర్’సంస్థ సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ రెండు సంస్థల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా చెప్పారు. భద్రతా నియమాలకులోబడి సంస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం అన్నారు. అగ్రరాజ్యాధినేతగా తన సన్నిహితుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో భారత్‌సహా కీలక శాటిటైల్ ఇంటర్నెట్ సేవల మార్కెట్లలో మెజారిటీ వాటా కైవసంచేసుకోవాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు. స్ప్రెక్టమ్ కేటాయింపులు, తుది ధరలపైనే భారత్‌లో స్టార్‌లింక్ భవితవ్వం ఆధారపడిఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే భారతి గ్రూప్‌కు చెందిన వన్‌వెబ్, జియా–ఎస్ఈఎస్ సంయుక్త సంస్థ అయిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు లైసెన్సులు ఇచ్చింది. వీటికి ఇంకా స్ప్రెక్టమ్ కేటాయింపులు జరగలేదు. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన సిఫార్సులకు ట్రాయ్ డిసెంబర్ 15వ తేదీలోపు తుదిరూపునివ్వనుంది. -
మస్క్ వైపే కేంద్రం మొగ్గు..
న్యూఢిల్లీ: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలకు తగ్గట్లే కేటాయిస్తామే తప్ప వేలం వేయబోమని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి స్పష్టం చేశారు. అయితే దీన్ని ఉచితంగా ఇవ్వబోమని, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయించే ధరను కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రంను కేటాయించాలే తప్ప భారతీయ టెల్కోలు కోరుతున్నట్లుగా వేలం వేయరాదని కోరుతున్న స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు ఈ పరిణామం సానుకూలం కానుంది. ఈ స్పెక్ట్రంను వేలం వేయాలని దేశీ దిగ్గజాలు జియో, ఎయిర్టెల్ కోరుతున్నాయి. -
6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే 5జీ నెట్‌వర్క్‌లో వేగంగా విస్తరిస్తున్న భారత్.. 6జీ టెక్నాలజీపై దృష్టిపెట్టినట్లు కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. తద్వారా 6వ జనరేషన్(6జీ) మొబైల్ సర్వీసులలో ప్రపంచ పేటెంట్లలో 10వ వంతును అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.ఏఐఎంఏ నేషనల్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ ఇక్కడ నిర్వహించిన 51వ సదస్సు(ఎడిషన్) సందర్భంగా కీలకోపన్యాసం చేశారు. 5జీ సేవల నెట్‌వర్క్‌లో ప్రపంచంలోనే భారత్ వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రస్తావించారు. పీఎస్‌యూ సంస్థ బీఎస్ఎన్ఎల్ కోసం సొంత 4జీ టెక్నాలజీకి తెరతీసినట్లు పేర్కొన్నారు. 22 నెలల్లోనే 4.5 లక్షల 4జీ టవర్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ బాటలో 6జీ సాంకేతికతలోకి ప్రవేశించేందుకు భారత్ 6జీ కూటమి(అలయెన్స్)ను నెలకొలి్పనట్లు వెల్లడించారు.రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్త పేటెంట్లలో 10 శాతాన్ని సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచస్థాయిలో పురోగమిస్తున్నదని, సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ స్థాయిని అధిగమించిందని వివరించారు. ప్రపంచ ఆర్థిక, సామాజిక అనిశి్చత పరిస్థితుల్లో భారత్ నిలకడ, నమ్మకాల దిక్సూచిలా అవతరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండో పెద్ద దేశంగా భారత్ నిలుస్తున్నదని వెల్లడించారు.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంగత దశాబ్దంలో దేశీ కమ్యూనికేషన్ పరిశ్రమ సొంత బాటలో పరివర్తన చెందినట్లు తెలియజేశారు. సొంతంగా పూర్తి 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంతోపాటు.. వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా టెక్నాలజీ డిజైన్, అభివృద్ధి, అమలును చేపట్టినట్లు తెలియజేశారు. గ్లోబల్ ప్రమాణాలను అనుసరించడంతోపాటు.. రానున్న రోజుల్లో భారత్ సొంతంగా ప్రపంచానికి ప్రమాణాలను నిర్దేశించనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడం టీ-ఫైబర్ లక్ష్యమన్నారు. టీ-ఫైబర్ ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందిస్తామని రేవంత్ చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యం. టీ-ఫైబర్ అమలుగానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్‌కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
జియోపై బీఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ ఎఫెక్ట్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత చాలామంది బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నెట్‌వర్క్‌కు మారిపోతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 2.75 మిలియన్ల యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ వైపు వచ్చిన యూజర్లలో ఎక్కువ భాగం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి రీఛార్జ్ ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ చార్జీలు, వ్యాలిడిటీ వంటివి చాలామందిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ముకేశ్ అంబానీ జియోపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతోందని, స్వదేశీ 4జీ నెట్వర్క్ కూడా సిద్ధంగా ఉందని.. దానిని 5Gకి మార్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ కంపెనీలు 4జీ నెట్‌వర్క్‌ను తీసుకువచ్చినప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ ఎందుకు దీనిని ప్రవేశపెట్టలేదని చాలామంది అడిగారు. అయితే ప్రభుత్వం నిర్వహించే కంపెనీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసి వస్తే.. స్వదేశీ టెక్నాలజీ, పరికరాలను మాత్రమే ఉపయోగించాలని.. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే పరికరాలను ఉపయోగించకూడదని ప్రధానమంత్రి తీర్మానమని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.భారత్ తన స్వంత 4జీ స్టాక్, కోర్ సిస్టమ్ లేదా రేడియేషన్ యాక్సెస్ నెట్వర్క్ అని పిలువబడే టవర్లను అభివృద్ధి చేస్తుందని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధాని మోదీ వెల్లడించారు. భారతదేశం తన సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది, దేశప్రజలకు 4G నెట్‌వర్క్‌ను అందిస్తుందని అన్నారు. స్వదేశీ సాంకేతికతను కలిగి ఉన్న ఐదవ దేశంగా భారత్ అవతరించిందని సింధియా చెప్పారు.టవర్ల ఏర్పాటుకోసం తేజస్ నెట్వర్క్, సీ-డాట్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పనిచేస్తోంది. 2024 అక్టోబర్ నాటికి 80000 టవర్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి 21000 టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2025 నాటికి 4G నెట్‌వర్క్‌కు చెందిన లక్ష టవర్లు ఇన్స్టాల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. -
గుడ్‌న్యూస్.. బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం
BSNL 5G: ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ దేశంలో తన 5జీ సేవల ట్రయల్స్ నిర్వహించడం ప్రారంభించింది. దీనికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు."బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌తో ఫోన్ కాల్ ప్రయత్నించాను" అని సింధియా రాసుకొచ్చారు. ఈ మేరకు సి-డాట్ క్యాంపస్‌లో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు. మంత్రి పోస్ట్ చేసిన వీడియోలో ఆయన బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు.ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. టెలికం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, దేశంలో పూర్తిగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ సాంకేతికతను సులభతరం చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు. ఈ చర్య భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పెద్ద సవాలుగా మారవచ్చు.Connecting India! Tried @BSNLCorporate ‘s #5G enabled phone call. 📍C-DoT Campus pic.twitter.com/UUuTuDNTqT— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 2, 2024 -
సెంచరీ కూడా కొట్టలేదు.. కాంగ్రెస్‌పై సింధియా సెటైర్లు..
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు (సోమవారం) ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా ఎంపీక చేయటంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ ఎంపీలు నిరసన తెలిపారు. అయితే దీనిపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.‘‘ పార్లమెంట్ సమావేశాల తొలిరోజే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా హడావుడి చేస్తోంది. కేవలం సొంతంగా 99 సీట్లు గెలిచినందుకే ఇలా చేస్తోంది. ఇప్పటివరకు మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన అన్ని సీట్లు కలిపినా.. 2014లో బీజేపీ సాధించిన సీట్ల కంటే కూడా తక్కువ. అంటే కాంగ్రెస్ మూడు ఎన్నికల్లో సైతం 240 సీట్లు కూడా గెలవలేకపోతోంది’ అని సింధియా ఎద్దేవా చేశారు. (కాంగ్రెస్ పార్టీ 2014-56 సీట్లు, 2019-42 సీట్లు, 20124-99 సీట్లు గెలుచుకుంది). నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారని సింధియా అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా భారత్ ఎదుగుతుందనే పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇక.. 2024 ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలు గెలుపొందింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవటంతో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించగా.. ఇండియా కూటమి 234 సీట్లకే పరిమితమైంది. సోమవారం పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ‘ఇండియా కూటమి’ ఎంపీలు.. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్, ప్రోటెం స్పీకర్ ఎంపీక, పార్లమెంట్‌లోని విగ్రహాలను మరోచోటుకు తరలించటం వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగం బుక్‌తో నిరసన తెలిపారు. -
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి, రాజమాత మాధవి రాజే సింధియా కన్ను మూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆమె బుధవారం ఉదయం 9.28 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.“రాజమాత ఇక లేరు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి, గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన రాజమాత మాధవి రాజే సింధియా గత రెండు నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు వారాలుగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఉదయం 9:28 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. ఓం శాంతి” అని ఒక పత్రికా ప్రకటనలో ఢిల్లీ ఎయిమ్స్ పేర్కొంది. రాజమాత మాధవి రాజే సింధియా కుమారుడు, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈసారి సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. -
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: దళిత మహిళ గురించి మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ చేసిన వ్యాఖ్యపైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు మహిళలను గౌరవించడం తెలియదని, ఆ పార్టీకి ఉపయోగించుకుని వదిలేసే అలవాటు ఉందని అన్నారు.కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీతూ పట్వారీ.. ఇమర్తి దేవిపై పట్వారీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి నీచమైన పదాలు ఉపయోగిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి పదాలు ఏ మహిళపై ఉపయోగించకూడదని సింధియా అన్నారు. ఇమర్తి దేవి 2020 మార్చిలో సింధియాతో కలిసి బీజేపీలో చేరారు.పార్టీ కార్యకర్తలను, గిరిజన ప్రజలను, మహిళలను ఇలా ఎవరినైనా అవసరమున్నంత వరకు వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటని సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ తమపై దాడులు చేస్తూనే ఉంటుంది.. ఎప్పుడూ తమ విజయం తధ్యమని చెబుతుంది. చివరి ఫలితాలు తారుమారు అవుతాయని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని సింధియా పేర్కొన్నారు. -
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందని కేంద్రమంత్రి, ‘గుణ’ బీజేపీ ఎంపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా విర్శించారు. సైద్ధాంతికంగానూ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుంటోందని ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్నిస్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కొంతమందికి టికెట్లు ఇచ్చినా నామినేషన్ల తరువాత ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. వాస్తవానికి ఆ పార్టీతో ఉండాలని ఎవరూ అనుకోవడమూ లేదు’’ అని ఆయన విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీలో నేతలకు సముచిత గౌరవ మర్యాదలు ఉండవు అని కూడా ఆయన కుండబద్ధలు కొట్టారు. దేశంలో అత్యాయిక పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవడం మేలని అన్నారు. భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శిలను తిప్పికొడుతూ అది ఏ పార్టీతోనూ సాధ్యం కాని విషయమని అన్నారు.కాంగ్రెస్‌పార్టీలో చాలాకాలం కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా 2020లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచిన 15 నెలలకు సింధియా.. 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరారు. ఫలితంగా కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. -
మహిళపై కస్సుమన్న కేంద్రమంత్రి భార్య.. వెల్లువెత్తిన విమర్శలు
సమస్య చెబుతున్న గ్రామీణ మహిళపై కస్సుమన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శినీ రాజే సింధియా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. గ్రామీణ మహిళ పట్ల ఆమె ప్రవర్తినపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రదేశ్‌లోని గుణ-శివపురి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రియదర్శిని తన భర్త విజయం కోసం కుమారుడితో కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియదర్శిని రాజే ఖుజ్రీ గ్రామానికి వెళ్లగా అక్కడ కొందరు మహిళలు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను లేవనెత్తారు. దీంతో ఆమె సమస్యలను రాసి తమకివ్వలని చెప్పారు. ఇంతలో ఓ మహిళ “నువ్వే రాసుకో” అంది. అది విన్న ప్రయదర్శిని రాజే ఆగ్రహానికి గురై, "మీరు రాసి నాకు ఇవ్వండి, మీ పని చేయడం నా పని కాదు" అంటూ చిరాకుపడ్డారు.ఖుజ్రీ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు ప్రయదర్శిని సింధియాను ఆశ్రయించారు. గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని ఆ గ్రామ మహిళలు వాపోతున్నారు. ఈ సమయంలో, ఒక మహిళ, "మేడమ్, మీరు దయచేసి ఒకసారి ఇక్కడికి రండి. ఇక్కడ నీటి కోసం ఒక ట్యాంక్ ఉంది, కానీ అందులో నీరు లేదు" అంటూ తెలియజేసింది. -
సామాన్యుడు విమానాల్లో వెళ్లాలన్నదే మోదీ కల
సాక్షి, హైదరాబాద్: హవాయి చెప్పులు వేసుకునే సామాన్య వ్యక్తి సైతం విమానాల్లో ప్రయాణించాలన్నదే పీఎం నరేంద్రమోదీ కల అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఉడాన్ పథకంతో సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని పీఎం అందుబాటులోకి తీసుకు వచ్చారని గుర్తు చేశారు.గురువారం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా, ఏడవ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌గా భారత్ అవతరించిందని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 2047 నాటికి విమానయాన రంగంలో 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో 500 కొత్త ఇండిగో విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మానవవనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించే జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి: ఇస్లాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌ను మాజీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ సయ్యద్ ఇస్లాం ప్రారంభించారు. పార్టీ బలోపేతంతో సహా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై కూలంకుషంగా చర్చించడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఎటాక్ చేసేలా, మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన గురించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు గెలిపించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గగనంలో అద్భుత వీక్షణకు
సనత్‌నగర్ (హైదరాబాద్): గగనంలో గగుర్పొడిచే విన్యాసాలకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది. వింగ్స్ ఇండియా–2024కు కౌంట్‌డౌన్ మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తోపాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు (18, 19 తేదీలు) వ్యాపార, వాణిజ్యవేత్తలను, ఆ తరువాత రెండు రోజులు (20, 21 తేదీలు) సామాన్యులను అనుమతిస్తారు. ఈ షోలో 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్, 5,000 మంది బిజినెస్ విజిటర్స్ పాల్గొననున్నట్లు అంచనా. ఫ్లయింగ్ డిస్ప్లే సమయం పెరిగిందోచ్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్‌తోపాటు మార్క్ జాఫరీస్ బృందం చేసే వైమానిక విన్యాసాలను కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. గతంలో ఫ్లెయింగ్ డిస్ప్లే సమయాన్ని కేవలం 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు నిర్వహించగా, ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు. చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా విచ్చేయనున్న దృష్ట్యా ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు. సారంగ్ టీమ్ వచ్చేసింది.. ముగ్గురు హైదరాబాదీలే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్ మరోసారి తమ వైమానిక విన్యాసాలు ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఈ టీమ్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఐదు హెలికాప్టర్లతో ఏరోబాటిక్స్ ప్రదర్శించే ఈ బృందానికి సీనియర్ గ్రూప్ కెపె్టన్ ఎస్కే మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఏరోబాటిక్స్ ప్రదర్శన చేసే ఐదుగురిలో ముగ్గురు హైదరాబాదీలే కావడం విశేషం. హైదరాబాదీలైన వింగ్ కమాండర్లు టీవీఆర్ సింగ్, అవినాష్ సారంగ్ టీమ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ టీమ్ 350 షోలకు పైగా నిర్వహించి రికార్డు సృష్టించింది. వైమానిక విన్యాసాల వేళలు 18వ తేదీన మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు, 4.15–5 గంటల వరకు 19న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు. అనంతరం డ్రోన్ షో జరగనుంది. 20న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు.. 21న ఉదయం 11–11.45 వరకు, మధ్యాహ్నం 3–3.45 వరకు, సాయంత్రం 5–5.45 వరకు -
Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఇటీవల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. విమానాల రద్దు, కొన్ని ఆలస్యంగా బయలుదేరటంతో విమానా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. డేటా మైనింగ్ వలే ఇంటర్నెట్ నుంచి కేవలం కొన్ని ప్రెస్ ఆర్టీకల్స్‌ను సేకరించి ‘పరిశోధన’ అంటే ఎలా? అని ఎద్దేవా చేశారు. వాస్తవ నిజాలు.. సాంకేతిక రంగం వంటి విమానయానం గురించి శశిథరూర్, కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్లకు అర్థం చేసుకోవడానికి సహయ పడతాయని అన్నారు. విమానయానం వంటి రంగంలోని సంక్లిష్టత అర్థం చేసుకోకపోవటం థరూర్, కాంగ్రెస్ ఐటీసెల్ వెనకబాటుతనానికి నిదర్శనమని సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. 1/6 It is for someone who is lost in his esoteric world of thesaurus that data mining of selective press articles from the internet qualifies as “research”. Here are some actual facts for arm-chair critic @ShashiTharoor and the Cong IT Cell that might help tackle their lack of… https://t.co/hA3sijtjr8 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 17, 2024 ఇటీవల ఢిల్లీలో కప్పేసిన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు, ఆసల్యం కావటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. నిరసనగా రన్‌వే పైనే విమాన ప్రయాణికులు భోజనం చేశారు. దీనికంటే ముందు విమానం ఆసల్యం ఉందని ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఓ ప్రయానికుడు ఏకంగా విమానం పైలట్‌పైకే దాడికి యత్నించాడు. ఈ విషయంపై స్పందించిన విమానయాన శాఖ మంత్రి సింధియా.. పొగ మంచు నేపథ్యంలో విమానాల ఆలస్యంపై చర్యలు తీసుకుంటామని, ప్రయాణికుల రక్షణ కోసమే విమానాలు కొంత ఆలస్యం అవుతున్నాయని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే.. విమానాల ఆలస్యంపై శశి థరూర్ స్పందిస్తూ.. సంకాంత్రి పండగ సమయంలో విమాన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడటం ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శమని విమర్శలు గుప్పించారు. చదవండి: అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరు బలి -
విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి: సింధియా
న్యూఢిల్లీ: ఢిల్లీని తీవ్రమైన పొగ మంచు కప్పేయటంతో ఆదివారం సుమారు వంద విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. కొన్ని విమానాలు గంటల కొద్ది ఆలస్యంగా బయలుదేరాయి కూడా. ఈ వ్యవహారంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ ట్విటర్ వేదిక స్పందించారు. ‘‘నిన్న(ఆదివారం) ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని గంటలపాటు విజిబిలిటీ సమస్య ఎదురైంది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు జీరో విజిబిలిటీ ఉంది. ఈ కారణంగానే ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికుల రక్షణ, భద్రత విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విమాన సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. ఎయిర్‌పోర్టులోని CAT-IIIలో భాగంగా ప్రారంభించిన నాలుగో రన్‌వేను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానాల రద్దు, ఆలస్య అసౌర్యాన్ని తగ్గించడానికి, ప్రయాణికుల సరైన సమాచారం అందజేయాలని కూడా విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రయాణికులంతా సహకరించాలని కోరుతున్నా. ప్రయాణికలు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. ఈ సమయంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. అలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదు’’ అని మంత్రి సింధియా పేర్కొన్నారు. Yesterday, Delhi witnessed unprecedented fog wherein visibility fluctuated for several hours, and at times, dropped to zero between 5 AM to 9 AM. The authorities, therefore, were compelled to enforce a shut-down of operations for some time even on CAT III runways (CAT III… — Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 15, 2024 మరోవైపు.. విమానం ఆలస్యానికి సంబంధించి ఓ ప్రయాణికుడు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కెప్టెన్‌పై దాడికి యత్నంచిన విషయం తెలిసిందే. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Ram Mandir: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి? -
కుక్కపిల్లను కొట్టిచంపాడు
భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్‌గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
విమానయానంలో విప్లవం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: గత తొమ్మిదిన్నరేళ్లలో విమానయాన గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పౌర విమానయాన, ఉక్కుశాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రూ.347 కోట్లతో నిర్మిస్తున్న డొమెస్టిక్ టెర్మినల్ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల భారతదేశ చరిత్రలో 2014 నాటికి దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉన్నాయని, ఈ తొమ్మిదిన్నరేళ్లలో 75 ఎయిర్‌పోర్టులు నిర్మించామని చెప్పారు. దీంతో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 149కి చేరిందన్నారు. వీటి సంఖ్యను 220కి పెంచుతామని తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ పాయింట్ 21,094 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, రద్దీవేళల్లో 2,100 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతోపాటు భవిష్యత్‌లో ఏటా 30 లక్షలమంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం ఉంటుందని వివరించారు. 28 చెక్ ఇన్ కౌంటర్లు, నాలుగు అరైవల్ కరైజల్స్, 600 కార్లకు పార్కింగ్, ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో టెర్మినల్ రూపు దిద్దుకోనుందని చెప్పారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్‌కు మాత్రమే విమానాల కనెక్టివిటీ ఉండేదని, ప్రస్తుతం మూడు ప్రధాన నగరాలకు ఉందని తెలిపారు. తిరుపతి నుంచి గతంలో ఒక నగరానికి మాత్రమే కనెక్టివిటీ ఉండగా.. ఇప్పుడది 10 ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. విజయవాడకు రెండు నగరాలతో కనెక్టివిటీ ఉంటే ప్రస్తుతం ఎనిమిదికి పెరిగిందని, షార్జా కూడా వెళ్లగలుగుతున్నారని తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు తొమ్మిది ప్రాంతాలతో ఉన్న కనెక్టివిటీ ఇప్పుడు 14 నగరాలకు పెరిగిందన్నారు. సింగపూర్‌కు సైతం విమానాలు వెళ్లేలా వసతులు కల్పించామని చెప్పారు. అలాగే కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల ద్వారా వివిధ ప్రాంతాలకు విమానాలు వెళ్లేలా తీర్చిదిద్దామన్నారు. భోగాపురం, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులను గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఇటీవల భోగాపురంలో 2,200 ఎకరాల్లో రూ.4 వేల కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. రెండేళ్లలో దీని నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. కర్నూలులో రూ.500 కోట్లతో ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కలెక్టర్ కె.మాధవీలత, జేసీ ఎన్.తేజ్‌భరత్, రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కమిషనర్ కె.దినేష్‌కుమార్, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్‌కుమార్, మధురపూడి విమానాశ్రయ అధికారి ఎస్.జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సింథియా ప్రసంగం అందరికీ నమస్కారం.. అంటూ సింథియా ప్రారంభించిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సాంస్కృతిక రాజధానిగా ఖ్యాతిగాంచిన రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి ఒడ్డున ఉందని, వెయ్యేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఈ నగర సాంస్కృతిక వారసత్వం దేశానికే తలమానికమని కొనియాడారు. ప్రజాకవి నన్నయ నడయాడిన నేలగా అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడి వారేనని ఆయన పేర్కొన్నారు. -
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన
-
నా ఎత్తు ఇప్పుడు తెలిసిందా? ప్రియాంకకు సింధియా కౌంటర్
భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ చాలా చోట్ల ఓటమితో వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో తన ఎత్తుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు స్పందించారు. సింధియా ప్రభావం ఉన్న ప్రాంతంగా భావించే గ్వాలియర్ మాల్వా ప్రాంతంలో బీజేపీ ఆధిక్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘నా ఎత్తు గురించి ఎవరో మాట్లాడారు. గ్వాలియర్-మాల్వా ప్రజలు ఎంత ఎత్తులో ఉన్నారో చూపించారు’ అన్నారు. గత నెలలో డాటియాలో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ.. సింధియాపై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ‘ద్రోహ’ అని ముద్ర వేశారు. ‘వాళ్ల (బీజేపీ) నాయకులందరూ కొంచెం విచిత్రంగా ఉంటారు. ముందుగా మా సింధియా.. నేను యూపీలో అతనితో కలిసి పనిచేశాను. వాస్తవానికి అతని ఎత్తు కొంచెం తక్కువగా ఉంది. కానీ అహంకారంలో మాత్రం ఘనుడు’ అంటూ విమర్శించారు. ఎన్డీటీవీతో సింధియా మాట్లాడుతూ ‘బీజేపీ గెలుస్తుందని నేను ముందే చెప్పాను. మాకు ఇంత పెద్ద మెజారిటీని అందించిన మధ్యప్రదేశ్ ఓటర్లకు ధన్యవాదాలు. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వం పనిచేసింది’ అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందించిన ప్రజా, సంక్షేమ పథకాలు కూడా పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు. -
Madhya Pradesh: ఇప్పుడా ద్రోహి లేడు.. దిగ్విజయ్ తీవ్ర వ్యాఖ్యలు
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శనివారం ఆయన రాష్ట్ర రాజధాని భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ద్విగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ‘మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా దగ్గర సింధియా లేడు. కాబట్టి ద్రోహి లేడు’ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌లోని దాతియాలో ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ సింధియాపై 'ద్రోహి' అంటూ విరుచుకుపడ్డారు. సింధియా తనతో ఎమ్మెల్యేలతో కలిసి 2020 మార్చిలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ 130 సీట్లకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత, దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ కూడా తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పారు. -
Madhya Pradesh: ‘24 గంటలు ఆగండి.. పూర్తి మెజార్టీ మాదే’
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో సింధియా శనివారం గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘రేపటి కౌంటింగ్లోమాకు పూర్తి విశ్వాసం ఉంది. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 24 గంటలు ఆగండి.. ఫలితాలు మన ముందే ఉంటాయి’ అన్నారు. ఇంతకుముందు మాట్లాడిన ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భారీ మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని, అత్యధిక మెజారిటీతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించగా 77.15 శాతం ఓటింగ్ నమోదైంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే అత్యధిక ఎగ్జిట్ పోల్స్ జీజేపీ వైపే మొగ్గు చూపాయి. -
'పొట్టివాడే కానీ..' సింథియాపై ప్రియాంక గాంధీ ఫైర్
భోపాల్: బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింథియాను ద్రోహిగా పేర్కొన్నారు. యూపీలో గతంలో ఎన్నికల ప్రచారంలో సింథియాతో కలిసి పనిచేసిట్లు చెప్పిన ప్రియాంక గాంధీ.. పొట్టిగానే ఉంటాడు కానీ.. అహంకారం మాత్రం చాలా ఎక్కువని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని దాతియాలోని ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. 'ఎవరు ఆయన వద్దకు వెళ్లినా మహారాజ్ అని పిలవాలి. లేకపోతే ఆయన పెద్దగా స్పందించరు. మన సమస్యలు పరిష్కరించరు. ఈ రకమైన కుటుంబ సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తున్నారు. కానీ గ్వాలియర్, చంబా ప్రజలకు మాత్రం సింథియా ద్రోహం చేశారు.' అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సింథియా కూడా కాంగ్రెస్‌పై ఇటీవల తీవ్రంగా ఆరోపణలు చేశారు. మహిళలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో విఫలమయ్యారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పతనమైందని అన్నారు. 2018లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ సీఎం సీటు విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. కమల్‌నాథ్‌కు సీఎం పదవి ఇవ్వడంలో సింథియాను ఒప్పించింది అధిష్ఠానం. కానీ కొన్ని నెలల్లోనే సింథియా అసంతృప్తితో బీజేపీ గూటికి చేరారు. 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి. ఈ క్రమంలో నేడే ప్రచారానికి తెరపడింది. ఇదీ చదవండి: Madhya Pradesh Election: ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు! -
Madhya Pradesh Elections: సింధియాకు అగ్నిపరీక్ష
అసెంబ్లీ ఎన్నికలు ఇంకా వారం కూడా లేని వేళ మధ్యప్రదేశ్‌లో కీలకమైన గ్వాలియర్–చంబల్ ప్రాంతం అధికార బీజేపీకి తలనొప్పిగా మారుతోంది. పార్టీలోని పాత నేతలకు, మూడేళ్ల కింద కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయులకు అస్సలు సరిపడకపోవడం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఈ ప్రాంతంలో 34 కీలక అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఇక్కడ మంచి ఫలితాలు సాధించడం కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ చాలా కీలకం. అలాంటి ప్రాంతంలో పాత, కొత్త నేతలు సయోధ్యకు ససేమిరా అంటుండటం పార్టీ నాయకత్వంతో పాటు సింధియాకు కూడా ఇబ్బందికరంగానే మారింది. పైగా శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై జనంలో నెలకొన్న వ్యతిరేకత కూడా దీనికి తోడయ్యేలా కని్పస్తుండటం మరింత గుబులు రేపుతోంది. ఈసారి గ్వాలియర్ ప్రాంతంలో బీజేపీ సాధించబోయే సీట్ల సంఖ్యపై పారీ్టలో సింధియా భవితవ్యం కూడా చాలావరకు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది... అది గ్వాలియర్‌లోని హజీరా ప్రాంతం. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఇంధన మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటెయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓటెయ్యాల్సిందిగా కోరారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన అనంతరం యువ నేత జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న 16 మంది ఎమ్మెల్యేల్లో తోమర్ ఒకరు. ఆయన రాకతో కినుక వహించిన స్థానిక బీజేపీ నేతలు ఇప్పుడాయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దాంతో ఒకరకంగా ఆయనది ఒంటరి పోరుగానే మారింది. ఆయనకు మాత్రమే కాదు, బీజేపీ టికెటిచ్చిన సింధియా వర్గానికి చెందిన మరో 17 మంది నాయకులకూ దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది! అంతేగాక ఓటర్లు కూడా వారిపట్ల నిరాసక్తతే చూపుతున్నారు. ‘‘వారికే పరస్పరం కుదరడం లేదు. అలాంటి వాళ్లకు మా మంచీ చెడూ గురించి ఆలోచించేంత సమయం ఎక్కడుంటుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు! బీజేపీ వర్సెస్ సింధియా వర్గం 2020 మార్చిలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సింధియా బీజేపీలో చేరారు. దాంతో కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. వారంతా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలొచ్చాయి. గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో ఇలా రాజీనామా చేసిన 16 మందిలో 9 మంది తిరిగి నెగ్గారు. దాంతో అక్కడ బీజేపీ బలం 16కు పెరిగింది. ఈసారి ఆ స్థానాలన్నింటినీ నిలుపుకోవడంతో పాటు మరిన్ని చోట్ల నెగ్గాల్సిన కఠిన పరీక్ష సింధియా ముందుంది. కానీ పరిస్థితులు ఆయనకు అంత సానుకూలంగా కనిచడం లేదు. ఆ ప్రాంత ప్రజల్లో మెజారిటీ సింధియా నిర్ణయాన్ని తప్పుబడుతుండటం విశేషం. ఆయనసలు కాంగ్రెస్‌ను వీడాల్సిందే కాదన్నది వారి నిశి్చతాభిప్రాయం. దీనికి తోడు సింధియా వర్గానికి చెందిన 18 మందికి బీజేపీ నాయకత్వం టికెట్లివ్వడం కూడా పార్టీలో విభేదాలకు కారణమైంది. పలువురు ఆశావహులు పార్టీలు మారి బరిలో దిగి సవాలు విసురుతున్నారు. మోరెనా అసెంబ్లీ స్థానంలో సింధియా వర్గం ఎమ్మెల్యే రఘురాయ్ కన్సానాకు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాకేశ్ రుస్తుం సింగ్ బీజేపీని వీడారు. బీఎస్పీ టికెట్‌పై బరిలో దిగి సవాలు విసురుతున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును ఆయన గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు. పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి! దీన్ని గమనించే బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్టోబర్ 30 నుంచి వారంలోపే ఏకంగా రెండుసార్లు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో పర్యటించారు. అసంతృప్త పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరిపి బుజ్జగించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.‘‘అసలు బీజేపీ నేతల్లోనే చాలామంది సింధియాను వ్యతిరేకిస్తున్నారు. ఇది ఈసారి ఆ పారీ్టకి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది’’ అని రాజకీయ, మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి గ్వాలియర్ రాజ వంశీకునిగా సింధియాపై ఈ ప్రాంతవాసులకు చెప్పలేనంత అభిమానముంది. కానీ ఆయన పార్టీ మారిన తీరు వారికి పెద్దగా నచ్చలేదు. వ్యతిరేక పవనాలు...! అంతేగాక మధ్యలో ఓ ఏడాదిన్నర మినహా రాష్ట్రంలో 18 ఏళ్లుగా బీజేపీ పాలనే సాగుతుండటంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా సింధియాకు ప్రతికూలంగా మారుతోంది. ‘‘నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మాకొచ్చే రోజువారీ కూలీ ఏ మూలకూ చాలడం లేదు. పోయినసారి బీజేపీకి ఓటేశాం. ఈసారి మాత్రం కాంగ్రెస్‌కే వేసి చూద్దామనుకుంటున్నాం’’ అన్న మాలతీ కిరార్, ఆమె సోదరుడు యోగేంద్ర మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసినా తనకిప్పటికీ ఉద్యగం దొరకలేదని భగవాన్ దాస్ అనే యువకుడు వాపోయాడు. ‘‘మూడేళ్లుగా ప్రభుత్వోద్యోగాల భర్తీయే లేదు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?’’ అన్న ఆయన ప్రశ్న యువతలో కూడా కమలం పార్టీకి సానుకూలంగా లేదనేందుకు రుజువేనంటున్నారు.