Kamala Harris
-
బైడెన్ తప్పుడు నిర్ణయం
అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్‌ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్‌కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్‌కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్లే రూపొందించాయి. చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బైడెన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. దాంతో బైడెన్‌కు తత్వం బోధపడి బ్రిటన్ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్’ విధించటానికి తమ మిగ్–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్ పోలెండ్‌ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ‘నో ఫ్లైజోన్’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్ ట్రంప్ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ 1992లో చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్‌కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ సీనియర్ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.నిజానికి క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్‌కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్‌పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్కూ 1997లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్ అపరాధిగా మారినట్టయింది. మందుపాతరల వల్ల కీయూవ్లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. -
చివరి వారాల్లో అధ్యక్ష పీఠంపై కమల?
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో కాస్తంత వెనకబడి తొలి మహిళా దేశాధినేతగా అధ్యక్షపీఠంపై కూర్చునే సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గద్దెనెక్కించాలని గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్ స్థానికత సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అంతర్జాతీయ దౌత్యనీతిని పక్కకునెట్టి, దిగజారుడు వ్యక్తిగత దూషణలకు దిగి ఎలాగోలా పాపులర్ ఓటును ఒడిసిపట్టారన్న విమర్శల వేళ అగ్రరాజ్యంలో కొత్తరకం డిమాండ్ తెరమీదకొచ్చింది. చిట్టచివర్లో రేసులోకి దిగి, ఎన్నికల్లో చివరిదాకా పోరాడి అద్భుత పోరాటస్ఫూర్తిని ప్రదర్శించిన కమలాహారిస్‌కు చివరివారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. అయితే ఇదేతరహా డిమాండ్లకు తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవినే త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించినా హారిస్ అధ్యక్షపీఠమెక్కడం నైతికంగా ఎంత వరకు సబబు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘ బైడెన్ అద్భుతమైన నేత. ప్రజల ఎన్నో కోరికలను ఆయన నెరవేర్చారు. ఈ ఒక్క విన్నపాన్నీ ఆయన మన్నించాలి. అధికార మార్పిడికి ఒప్పుకుని హారిస్‌కు అవకాశం ఇవ్వాలి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే హారిస్ ఈ చివరి వారాలు అధికారంలో ఉంటే నైతిక విజయం కమలదే అనే బలమైన వాదనను వినిపించినవాళ్లమవుతాం. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలూ మెరుగవుతాయి. చివరి రోజుల్లో బైడెన్ చేయగల గొప్పపని అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే’’ అని కమలాహారిస్ కమ్యూనికేషన్స్ విభాగ మాజీ డైరెక్టర్ జమాల్ సైమన్స్ ఆదివారం విజ్ఞప్తిచేశారు. ‘‘ దేశవ్యాప్తంగా ట్రంప్‌తో పోలిస్తే కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే హారిస్‌కు తక్కువ వచ్చాయి. కోట్లాది మంది హారిస్‌ను అధ్యక్షపీఠంపై చూడాలనుకున్నారు. బైడెన్ దిగిపోయి హారిస్‌కు అవకాశమిస్తే వారి కల నెరవేరుతుంది. అమెరికా సైతం తొలి అధ్యక్షురాలిని చూస్తుంది’’ అని మరో డెమొక్రటిక్ నేత, నటుడు ఆండీ ఓస్ట్రీ అన్నారు. ట్రంప్‌తో ముఖాముఖి డిబేట్‌కు ముందువరకు బైడెనే డెమొక్రటిక్ అభ్యర్థి. డిబేట్లో పేలవ ప్రదర్శన తర్వాత అత్యున్నతస్థాయి డెమొక్రటిక్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే బైడెన్‌ను రేస్ నుంచి తప్పించారు. కమలను బరిలో నిలిపారు. ఈసారి కూడా టాప్ డెమొక్రాట్ల లాబీయింగ్ పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అసలు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేవా అనే వార్తపై కూడా అంతర్జాతీయ మీడియాకు లీకులు రావడం లేదు. 25వ సవరణ ఏం చెప్తోంది?అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే కమల ప్రెసిడెంట్ కావడం సాధ్యమే. రాజ్యాంగంలోని 25వ సవరణలోని ఒకటో సెక్షన్ ప్రకారం అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా, అధ్యక్షుడు రాజీనామా చేసినా, లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు. ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమలకు అధ్యక్షపగ్గాలు చేతికొస్తాయి. అయితే ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనైతికమవుతుందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఈ దుశ్చర్య ఏకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర’’ అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కమల ఎందుకు అధ్యక్ష పదవికి అనర్హురాలో మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే ధారాదత్తం అవుతాయి. ఈ విధానం కారణంగానే 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ఆ ఎన్నికల్లో హిల్లరీక్లింటర్ను దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చాయి. అంటే పాపులర్ ఓటు సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ సాధించలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పాపులర్ ఓటు సాధించిఉంటే కమలకు నైతిక అర్హత ఉండేదేమోనని కొందరు అభిప్రా యపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ పాపులర్ ఓటుతోపాటు అత్యధిక ఎలక్టోరల్ ఓట్లనూ సాధించడం విశేషం. ఏదేమైనా పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి శ్వేతసౌధం నుంచి కూడా అర్ధంతరంగా బయటికొస్తారేమోనని కమల అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
డెమొక్రాట్లను ఆదుకోండి
వాషింగ్టన్: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్ క్యాంపెయిన్ ప్రధాన ఫండ్రైజర్ అజయ్ జైన్ భూటోరియా చెప్పారు. BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024ట్రంప్‌కు బైడెన్ ఆతిథ్యం ట్రంప్‌తో దేశాధ్యక్షుడు బైడెన్ సమావేశమవుతారని వైట్‌హౌస్ ప్రకటించింది. బైడెన్ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రటరీ కరీన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా వైట్‌హౌస్‌కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ కొత్త స్టాఫ్ చీఫ్ సూజీ వైల్స్‌తో బైడెన్ స్టాఫ్ చీఫ్ జెఫ్ జియెంట్స్ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్‌కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్‌హౌస్ ఆనవాయితీగా వస్తోంది. చదవండి: ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్ -
అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు.. ఖాతాలో 312 ఎలక్టోరల్ ఓట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్ రిజలల్ట్స్ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనానూ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుకున్న ట్రంప్ 2020లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అరిజోనా గెలుపుతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకుని రికార్డు సృష్టించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పోలింగ్ జరిగిన నవంబర్ 5న వెలువడడం ప్రారంభమవగా అరిజోనాలో మాత్రం కౌంటింగ్ పూర్తవడానికి నాలుగు రోజులు పట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ మార్కు కనిపించేనా.. -
రాజకీయాలకు కమలా హారిస్ గుడ్‌బై?!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఏం చేయబోతున్నారు?. అమెరికా కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని.. కొనసాగిస్తానని చెప్పిన మాట మీద ఆమె నిలబడతారా?. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆమె భావిస్తున్నారా?.ట్రంప్ చేతిలో ఓటమి తర్వాత హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హారిస్ గంభీరంగానే ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. అయితే.. మరో 72 రోజుల్లో ఆమె ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత ఆమె ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.సాధారణంగా.. అమెరికా అధ్యక్షఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు.. మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశాలు దక్కుతుంటాయి. లేదంటే ఏదో ఒక కీలక పదవుల్లో వాళ్లకు అవకాశాలు దక్కవచ్చు. 2004లో జార్జి బుష్ చేతిలో ఓటమిపాలైన జాన్ కెర్రీ.. బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అంటే.. ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట.అయితే జాన్ కెర్రీలా తిరిగి రాజకీయాల్లో రాణించేందుకు ఛాన్స్ కమలకు ఉంది . 2017 నుంచి 2021 మధ్య కాలిఫోర్నియా నుంచి సెనేట్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించారు. అయితే మళ్లీ సెనేట్‌కు వెళ్లేందుకు ‘ఇంటిపోరు’ ఆమెకు ఆటంకంగా మారే అవకాశం లేకపోలేదు. సొంత రాష్ట్రంలో.. డెమోక్రటిక్ మద్దతుదారుల నుంచే ఆమెకు వ్యతిరేక గళం వినిపిస్తోంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలిచ్చినవాళ్లూ ఆమె పట్ల అసంతృప్తితోనే ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. పోటీ డెమోక్రటిక్ ప్రతినిధిగా కొనసాగుదామన్నా.. అందుకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ఈ లెక్కన.. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిత్వం కోసం ఆమె తీవ్రంగానే శ్రమించాల్సి ఉంటుంది. అలాకాకుంటే..రాజకీయాలకు దూరం జరిగి హిల్లరీ క్లింటన్, ఏఐ గోర్ మాదిరి సాహిత్య రచన, ఇతర వ్యాపకాల్లో మునిగిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. తన పోరాటం కొనసాగుతుందని కమలా హారిస్ ప్రకటించినప్పటికీ.. అందుకు అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవేవీకాకుండా ఆమె తన వ్యక్తిగత జీవితంపై దృష్టిసారించవచ్చనే అభిప్రాయమూ ఒకటి వినిపిస్తోంది. కమలా హారిస్ వయసు 60 ఏళ్లు. కాబట్టి, అధ్యక్ష ఎన్నికల రేసులో ఆమెకు బోలెడు అవకాశం ఉందని ఆమెకు దగ్గరి వ్యక్తులు చెబుతున్నారు. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది 2025 జనవరి 20 తర్వాత తేలిపోనుంది. -
US Election Results 2024: ముంచింది బైడెనే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే ప్రధాన కారణమంటూ వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్ష రేసు నుంచి ఆయన ఆలస్యంగా తప్పుకోవడం పార్టీ పుట్టి ముంచిందంటూ మండిపడుతున్నారు. హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక సంతులనం సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు. ‘‘దాంతో బైడెన్ విధానాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పదేపదే తీవ్ర విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. వాటిలో లోటుపాట్లను సరిచేసుకుంటామని స్పష్టంగా చెప్పి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు’’అంటూ వాపోతున్నారు. ఈ దారుణ ఓటమితో డెమొక్రటిక్ పార్టీ భవితపై నీలినీడలు కమ్ముకున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 81 ఏళ్ల బైడెన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని 2023 ఏప్రిల్‌లోనే ప్రకటించారు. వయోభారం దృష్ట్యా తప్పుకోవాలని పార్టీ నేతలు చెప్పినా ససేమిరా అన్నారు. పారీ్టలో ట్రంప్‌ను ఓడించగల ఏకైక నేతను తానేనని వాదించారు. మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా తనకుందని, దేవుడు తప్ప ఎవరూ తనను తప్పించలేరని చెప్పుకున్నారు. కానీ ట్రంప్‌తో తొలి డిబేట్లో ఆయన దారుణంగా తడబడటం, ప్రసంగం మధ్యలో ఆగి పదాల కోసం తడుముకోవడం డెమొక్రాట్లను హతాశులను చేసింది. బైడెన్ మానసిక సంతులనంపై అనుమానాలు పెరిగాయి. అభిప్రాయానికి పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు జూలైలో పోటీ నుంచి తప్పుకుని హారిస్‌కు దారిచ్చారు. దాంతో ప్రచారానికి ఆమెకు తక్కువ సమయం లభించింది. దానికి తోడు అప్పటికే ట్రంప్ గెలుపు ఖాయమనే తరహా వాతావరణం నెలకొని ఉంది. దాన్ని మార్చేసి ట్రంప్‌ను గట్టిగా ఢీకొట్టేలోపే పోలింగ్ తేదీ ముంచుకొచ్చింది. ఇదంతా ఆయనకు బాగా కలిసొచ్చిందని డెమొక్రాట్లు ఇప్పుడు తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.బైడెన్ నీడలోనే... అమెరికాలో గత 70 ఏళ్లలో అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు బైడెనేనని గాలప్ పోల్ సర్వే తేల్చింది. ప్రజల మనసులు గెలవలేకపోయిన రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కంటే కూడా ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి అధ్యక్షుడి నీడ నుంచి హారిస్ బయటపడలేకపోవడం కూడా ఓటమికి గట్టి కారణంగా నిలిచిందని ఆమె సహాయకులే అంటున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ నిర్ణాయల్లో తాను భాగమేనని ఆమె భావించారు. అందుకే బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకా ముందయ్యారు. అలాగాక బైడెన్ విధానాల్లో లోటుపాట్లను సమీక్షించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకుంటామని స్పష్టంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’అని వారంటున్నారు. ఎకానమీ, వలసల వంటి కీలక విధానాలపై ట్రంప్ దూకుడుకు హారిస్ నుంచి గట్టి సమాధానమే లేకపోయిందని గుర్తు చేస్తున్నారు. కనీసం వాటికి దీటైన ఇతర అంశాలను తెరపైకి తేవడంలో కూడా ఆమె విఫలమయ్యారంటున్నారు. అంతేగాక అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి తెలిసి కూడా ముందే చెప్పకుండా తమను, అమెరికా ప్రజలను హారిస్ మోసగించారని పలువురు డెమొక్రాట్లు ఆక్రోశిస్తున్నారు. పైగా 78 ఏళ్ల ట్రంప్‌తో పోలిస్తే కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో 60 ఏళ్ల హారిస్ విఫలమయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ప్రచార తీవ్రత చాలలేదని హారిస్ ప్రచార కమిటీ సీనియర్ సలహాదారు డేవిడ్ ప్లోఫ్ అంగీకరించారు. ఇది దారుణమైన ఓటమేనంటూ ఎక్స్‌లో వాపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
US Election Results 2024: ట్రంప్‌కు 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింతగా పెంచుకునే దిశగా సాగుతున్నారు. విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ఆయనకు ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లు సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా 48 రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితం తేలింది. అరిజోనా, నెవడాల్లో మాత్రమే తేలాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రంపే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడితే ఆయన మొత్తం 312 ఓట్లు సాధిస్తారు. ఇది 2016లో తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు సాధించిన ఓట్ల కంటే (304) అధికం. ట్రంప్‌కు ఇప్పటిదాకా 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం ఓట్లొచ్చాయి. ఆయన 7,27,34,149 ఓట్లు, హారిస్ 6,80,49,758 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌లో... అధ్యక్షునితో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలక పాత్ర పోషించే సెనేట్‌లో నాలుగేళ్ల అనంతరం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వారి స్థానాల సంఖ్య మెజారిటీ మార్కును దాటి 52కు చేరింది. డెమొక్రాట్లకు 45 స్థానాలకు పరిమితమయ్యారు. డెమొక్రాట్లు ఇప్పటికే 3 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవాయే సాగుతోంది. మెజారిటీకి 218 సీట్లు కావాల్సి ఉండగా వారికిప్పటికే 206 సీట్లు దక్కాయి. డెమొక్రాట్లు 192 సీట్లే గెలుచుకున్నారు. వారిప్పటికే 4 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. మరో 37 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. -
Kamala Harris: పోరులో వెనకబడ్డా.. పోరాటం ఆపబోను
వాషింగ్టన్: విజయతీరాలకు కాస్తంత దూరంలో నిలిచిపోయినా పోరాటం మాత్రం ఆపేదిలేదని డెమొక్రటిక్ నాయకురాలు కమలా హారిస్ వ్యాఖ్యానించారు. హోరాహోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో పరాజయం పాలైన హారిస్ ఫలితాల తర్వాత తొలిసారిగా స్పందించారు. గురువారం వాషింగ్టన్‌లోని హొవార్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వేలాది మంది పార్టీ మద్దతుదారుల సమక్షంలో ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. 60 ఏళ్ల హారిస్ గతంలో ఇదే వర్సిటీలో రాజనీతి, ఆర్థికశాస్త్రం చదువుకున్నారు.నా హృదయం నిండిపోయింది‘‘దేశంపై ప్రేమతో, దేశం కోసం పాటుపడుతూ మీరంతా నాపై ఉంచిన నమ్మకం, ప్రేమతో ఈ రోజు నా హృదయం నిండిపోయింది. ఈ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం దక్కలేదు. నిజానికి ఇలాంటి ఫలితం కోసం మనం పోరాడలేదు. మీరంతా ఓటేసింది కూడా ఇలాంటి ఫలితం కోసం కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం. అమెరికా అభ్యున్నతి కోసం మనందరం చేసిన ప్రతిజ్ఞా జ్వాల ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. ఓడిపోయాక పార్టీ అశేష అభిమానుల్లో పెల్లుబికి వస్తున్న భావోద్వేగాలను అర్థంచేసుకోగలను. అయినాసరే ఈ ఫలితాలను అంగీకరించక తప్పదు. ఫలితం ఎలా ఉన్నా ఆమోదించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. నేను ఈ ఫలితాలను, ఓటమిని అంగీకరిస్తున్నా. అయితే పోరాటాన్ని మాత్రం ఆపబోను’’ అని అన్నారు. ట్రంప్‌ను విష్ చేశాగత ఎన్నికల్లో ఓడినాసరే ఓటమిని అంగీకరించకుండా ట్రంప్ ప్రభుత్వం సాఫీగా అధికార మార్పిడి జరక్కుండా అడ్డుకున్న అంశాన్ని హారిస్ ప్రస్తావించారు. ‘‘ అధ్యక్ష్య ఎన్నికల్లో రెండోసారి గెలిచిన ట్రంప్‌కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. కాలపరిమితి ముగిశాక శాంతియుతంగా అధికార మార్పిడికి మా ప్రభుత్వం సాయపడుతుందని హామీ ఇచ్చా. మన దేశంలో ఒక అధ్యక్షుడికో, రాజకీయ పార్టీకో నిబద్దులై ఉండాల్సిన పనిలేదు. కానీ దేశ రాజ్యాంగానికి ఖచ్చితంగా మనం బద్ధులమై ఉండాలి. ఎన్నికలు ముగియడంతో మన పోరాటం ముగిసిపోలేదు. మన పోరాటం కొనసాగుతుంది. అగ్రరాజ్య ఆవిర్భావానికి పునాదులైన సూత్రాలకు కట్టుబడి ఉందాం. కొన్నిసార్లు పోరాటం అనేది సుదీర్ఘకాలం కొనసాగొచ్చు. అంతమాత్రాన మనం గెలవబోమని కాదు. గెలిచేదాకా పోరాటం ఆపకపోవడమే ఇక్కడ ముఖ్యం. స్వేచ్ఛా, అవకాశాలు, పారదర్శకత, ప్రజలకు మెరుగైన జీవితం అందించేదాకా మన పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం, శాంతి, సమానత్వం, న్యాయం కోసం నా పోరు ఆగదు. స్వేచ్ఛ కోసం జరిపే సమరం చాలా శ్రమతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి కష్టాన్ని మనం ఇష్టపడతాం. మన దేశం కోసం ఆమాత్రం కష్టపడటం సబబే. ఫలితాల తర్వాత మనం ఓటమి చీకట్లోకి జారుకుంటున్నామని చాలా మంది భావించి ఉండొచ్చు. కానీ ఈ కష్టకాలం పెద్ద విషయమే కాదు’’ అని అన్నారు.సభలో గంభీర వాతావరణంపార్టీ ఓటమితో డెమొక్రాట్లలో ఒకింత నైరాశ్యం నిండింది. సభకు వేలాది మంది వచ్చినా సరే కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. మధ్యమధ్యలో హారిస్ తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో వాళ్లలో హుషారు నింపే ప్రయత్నంచేశారు. పార్టీ సీనియర్ నేతలు కొందరు ప్రసంగించారు. దిగువసభ మాజీ మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ, డీసీ మేయర్ మురేల్ బౌసర్ తదితరులు మాట్లాడారు. పార్టీ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న కొందరు యువ ఓటర్లు, మద్దతుదారులు సభలోనే కన్నీటిపర్యంతమయ్యారు. -
అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి తర్వాత, ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అభిమానులు కొందరు వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు.ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించేందుకు ఆమె మద్దతుదారులు ఎంతో కృషి చేశారు.కొన్ని సందర్భాలలో కమలా మద్దతుదారులు ఎంతో దూకుడుగా కనిపించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక సీన్ మారిపోయింది.కమలా హారిస్ కోసం సోషల్ మీడియా మొదలుకొని వీధులలో ప్రచారం సాగించిన ఆమె అభిమానులు ఫలితాలు వెలువడ్డాక తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు.అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కమలా హారిస్ వాషింగ్టన్లో ప్రసంగించారు. మీరు నాపై చూపిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు.ఎన్నికల్లో ఓడిపోయినా మన లక్ష్య సాధన కోసం పోరాటం కొనసాగుతుందని కూడా కమలా హారిస్ అన్నారు.ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించారు. నాలుగేళ్ల క్రితం డెమొక్రాట్ల చేతిలో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.వాషింగ్టన్లో కమలా హారిస్ ప్రసంగిస్తున్నప్పుడు, ఆమె మద్దతుదారులు విచార వదనాలతో కనిపించారు.తమ నేత దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని కమలా హారిస్ మద్దతుదారులు భావించారు. అయితే వారి ఆశలు అడియాసలుగా మిగిలాయి. ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ -
మహిళలకు మళ్లీ మొండిచెయ్యే
అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారన్న అంచనాలు తారుమారయ్యాయి. 2016 తర్వాత మరోసారి ఓ మహిళకు అత్యున్నత పీఠం త్రుటిలో చేజారింది. హారిస్ మాదిరిగానే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కూడా హోరీహోరీ తలపడ్డారు. అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన తొలి మహిళగా నిలిచారు. హిల్లరీ కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫునే పోటీ చేయడం విశేషం. అప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే. ఆయనతో డిబేట్లలో హిల్లరీ తడబడ్డా ఆద్యంతం గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించారు. అంతేగాక ఆ ఎన్నికల్లో పాపులర్ ఓట్ కూడా సాధించారు. అంటే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఆమెకే ఎక్కువ పడ్డాయి. ట్రంప్ కంటే హిల్లరీ ఏకంగా 28 లక్షల పై చిలుకు అధిక ఓట్లు సాధించారు. కానీ ఎలక్టోరల్ కాలేజీ విధానం వల్ల ట్రంప్ చేతిలో 76 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో డెమొక్రాట్ల రాష్ట్రాలుగా పేరుబడ్డ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటమి కూడా హిల్లరీ కొంప ముంచింది. హిల్లరీ 2008లో కూడా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం విఫలయత్నం చేశారు. భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న 1993–2001 మధ్య కాలంలో ఆమె ఫస్ట్ లేడీగా వ్యవహరించారు. ఆమెకు ముందు 1968లోనే చార్లెన్ మిషెల్ అనే మహిళ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచిపోయారు. మిషెల్ పేరు కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్యాలెట్ పత్రాలపై చోటుచేసుకుంది. 150 ఏళ్ల క్రితమే తొలి పోటీ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఉదంతం 150 ఏళ్ల క్రితమే చోటుచేసుకుంది. ఆమె పేరు విక్టోరియా వుడ్హల్. 1872లో ఈక్వల్ రైట్స్ పార్టీ తరఫున ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మహిళలకు పురుషులతో సమాన హక్కుల కోసం ఉద్యమించిన నేతగా వుడ్హల్కు పేరుంది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కే ఉండని రోజుల్లో ఆమె ఏకంగా అధ్యక్ష పదవికే పోటీపడటం సంచలనంగా నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. కానీ పోటీ చేసేనాటికి వుడ్హల్కు 33 ఏళ్లు మాత్రమే. ఎన్నికల్లో ఆమె ఒక్క ఎలక్టోరల్ ఓటు కూడా సాధించలేకపోయారు. తర్వాత 1884, 1888ల్లో బెల్వా ఆన్ లాక్వుడ్ అనే మహిళను ఈక్వల్ రైట్స్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దింపింది. తర్వాత చాలాకాలానికి 1964లో మార్గరెట్ చేజ్ స్మిత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీ పడ్డారు. తద్వారా ఒక ప్రధాన పార్టీ అభ్యరి్థత్వ రేసులో దిగిన తొలి మహిళగా నిలిచారు. 1972లో షిర్లీ చిషోమ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం ప్రయత్నించారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలిచిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు. ఇక ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ తొలి మహిళగా గెరాల్డిన్ ఫెరారో. ఆమె 1984లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాల్టర్ మాండలేకు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. 2004లో సారా పాలిన్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. ఆమె జాన్ మెక్కెయిన్కు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. గత 30 ఏళ్లుగా పలు చిన్న పార్టీల తరఫున కూడా ఎందరో మహిళలు అధ్యక్ష రేసులో నిలిచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హారిస్.. ఐదు వైఫల్యాలు
1. ప్రభుత్వ వ్యతిరేకత–బైడెన్ అసమర్థతజో బైడెన్ నాలుగేళ్ల పాలనలో డెమొక్రాట్లపై అమెరికా అంతటా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత నెలకొంది. ఆర్థిక వ్యవస్థను అదుపు పెట్టడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారన్న అపప్రథను మూటగట్టుకున్నారు. అన్ని అంశాలపైనా ఆయన విధానాలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక బైడెన్ విదేశీ విధానం కూడా విమర్శలపాలైంది. ముఖ్యంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాలను నివారించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఇవన్నీ హారిస్‌కు ప్రతికూలంగానే మారాయి. విదేశీ విధానంపై ఆమె వాదన అమెరికన్లను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో ట్రంప్‌తో పోలిస్తే బాగా మెతక అన్న అభిప్రాయం ఆమెకు బాగా చేటు చేసింది. పలు కీలకాంశాలపై తన వైఖరి చెప్పకుండా దాటవేయడం కూడా ప్రతికూలంగా మారింది. నిజానికి హారిస్ ఆలస్యంగా బరిలో దిగినా శాయశక్తులా పోరాడి ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ అడుగడుగునా బైడెన్ వైఫల్యాల తాలూకు భారాన్ని మోయాల్సి రావడం హారిస్‌కు అతి పెద్ద ప్రతికూలాంశంగా పరిణమించింది. మెజారిటీ అమెరికన్లకు జీవన్మరణ సమస్యగా మారిన ఆర్థిక అవ్యవస్థను గాడిన పెట్టడానికి ఏం చేస్తానన్నది ఆమె సమర్థంగా వివరించలేకపోయారు. ఈ విషయంలో ఆమెకు మొదటినుంచీ పెద్దగా మార్కులు పడలేదు. దీనిపై ప్రతి సర్వేలోనూ ట్రంప్‌దే పైచేయిగా నిలిచింది. ఏకంగా మూడొంతుల మందికి పైగా ప్రభుత్వ విధానాలన్నీ అట్టర్ ఫ్లాప్ అని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలిగా ప్రభుత్వ విధానాల్లో నాలుగేళ్లుగా భాగస్వామి అయిన హారిస్ వాటితో గట్టిగా విభేదించలేకపోయారు. ఇది అంతిమంగా ఆమె కొంప ముంచింది.2. దన్నుగా నిలవని లాటిన్లు, ఇండియన్లులాటిన్, ఇండియన్ అమెరికన్లు సాంప్రదాయికంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా పేరుబడ్డారు. వారిపై హారిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిలో ఎక్కువమంది ఈసారి ట్రంప్‌కే ఓటేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. 2020లో ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌కు ఓటేసిన లాటిన్ అమెరికన్ల సంఖ్య 23 శాతం ఎక్కువని తేలింది. ఈసారి సీన్ రివర్సయింది. లాటిన్ అమెరికన్ల ఓట్లు హారిస్ కంటే ట్రంప్‌కు కనీసం 8 శాతం ఎక్కువగా పడ్డట్టు పోల్ పండితులు అంచనా వేస్తున్నారు! ఇండియన్ అమెరికన్లలో కూడా హారిస్‌కు నిరాశే ఎదురైంది. వారు కొన్నాళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ముఖ్యంగా యువతలో ట్రంప్‌ను సమర్థించే వారి సంఖ్య బాగా పెరిగింది. పురుషుల్లోనూ ఈ ధోరణి పెరిగినట్టు పలు సర్వేల్లో తేలింది. భారతీయ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్‌ను సమర్థించగా 47 శాతం ట్రంప్‌వైపు మొగ్గారు. కానీ మిగతా అమెరికన్ల మాదిరిగా ధరాభారం, ఉపాధి తదితరాలు భారత సంతతి వారిని కూడా ప్రభావితం చేసినట్టు కన్పిస్తోంది.3. యువ, స్వతంత్ర, తటస్థ ఓటర్ల మొండిచేయి2020లో బైడెన్‌కు ఓటేసిన వారితో పోలిస్తే అన్ని రకాల ఓటర్లలోనూ హారిస్‌కు మద్దతు తగ్గింది. కేవలం విద్యాధికులైన యువతుల్లో మాత్రమే ఆమె బైడెన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగారు. యువకులు మాత్రం ట్రంప్‌కే జైకొట్టారు. దాంతో మొత్తంగా 2020లో బైడెన్‌తో పోలిస్తే హారిస్‌కు యువత ఓట్లు తగ్గాయి. తటస్థులు, ఉదారవాదుల ఓట్లను కూడా ఆమె అనుకున్నంతగా సాధించలేకపోయారు. హారిస్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న అబార్షన్ హక్కుల అంశం కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ట్రంప్ నియంతృత్వ ధోరణులపై ఆందోళన వెలిబుచ్చడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణను ప్రధానాంశంగా పేర్కొన్న ఓటర్లు హారిస్‌కే భారీగా మద్దతిచ్చారు. కానీ అడ్వాంటేజీని పూర్వపక్షం చేస్తూ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ఆందోళనగా ఉన్నవారంతా ట్రంప్‌కే గుండుగుత్తగా ఓటేశారు.4. ఆదుకోని పట్టణ ప్రాంతాలుడెమొక్రాట్లకు దన్నుగా నిలుస్తూ వస్తున్న పట్టణ, శివారు ప్రాంతాల్లో కూడా ఈసారి ట్రెండ్ రివర్సయింది. వాటిలోనూ ట్రంప్ గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించినట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా స్పష్టత వచ్చిన పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ చోట్ల 2020లో బైడెన్ సాధించిన ఓట్లతో పోలిస్తే హారిస్ వెనకబడ్డారు. పైగా ఆ తేడా కనీసం ఒకట్రెండు పాయింట్లు, అంతకుమించి నమోదైంది. మిషిగన్ వంటి కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనైతే పట్టణ ప్రాంతాల్లో బైడెన్ సాధించిన 14 శాతం ఆధిక్యాన్ని హారిస్ నిలుపుకోలేకపోయారు. ఇది కూడా అంతిమ ఫలితాలపై గట్టి ప్రభావమే చూపింది.5. సోషల్ మీడియాఈసారి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తేల్చడంలో సోషల్ మీడియా కూడా కీలకంగా వ్యవహరించింది. అమెరికా మెయిన్‌స్ట్రీమ్ మీడియా దాదాపుగా హారిస్‌కే దన్నుగా నిలిచింది. కానీ దానికి అమెరికా ప్రజల్లో విశ్వసనీయత అడుగంటి చాలాకాలమైంది. వారు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాకు మళ్లుతున్నారు. ఈ మార్పును ఒడిసిపట్టుకున్న ట్రంప్ సోషల్ మీడియా ప్రచారంలో దూకుడు కనబరిచారు. ముఖ్యంగా ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ బాహాట మద్దతు ఆయనకు బాగా కలిసొచ్చింది. జో రోగన్ వంటి పాడ్కాస్టర్లు కూడా ట్రంప్‌కు విస్తృతమైన ప్రచారం కల్పించారు.అమెరికా జనాభాలో ఎవరెంత మంది?అమెరికా జనాభా 33 కోట్ల పైచిలుకుశ్వేతజాతీయులు 58.9 శాతంహిస్పానియన్లు 19.1 శాతంఆఫ్రో అమెరికన్లు 12.6 శాతంఆసియన్లు 6.1 శాతంమిగతా వారు 2.4 శాతంమూలవాసులు 0.7 శాతంఇతరులు 0.2 శాతంఓటేసేవారిలోశ్వేత జాతీయులు 73 శాతంఆఫ్రో 11 శాతంహిస్పానియన్లు 9 శాతంఆసియన్లు 2 శాతం -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపారు. హోరాహోరీ పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజంటూ డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ అలవోకగా దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. క్రిమినల్ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షునిగా ట్రంప్ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. పైగా పాపులర్ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్ విజయానికి పరిపూర్ణత చేకూరినట్టయింది. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసిందే. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్ ఇప్పటికే హారిస్ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్ అధ్యక్షునిగా నిలిచారు. అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్ హిల్‌పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. విజయం ఖాయం కాగానే ట్రంప్ తన భార్య మెలానియాను ఆప్యాయంగా అక్కుని చేర్చుకుని ముద్దాడారు. ఫ్లోరిడాలోని తన వెస్ట్‌పామ్ బీచ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు. రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మరోసారి తనపై విశ్వాసముంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అపూర్వమైన, అత్యంత శక్తిమంతమైన ఫలితమిది. అమెరికా చరిత్రలో స్వర్ణయుగానికి నా విజయం నాంది’’ అని ప్రకటించారు. ‘‘భగవంతుడు ఏదో పెద్ద కారణంతోనే నాకు ప్రాణదానం చేశాడని చాలామంది చెప్పింది నిజమేనని ఈ ఫలితాలు రుజువు చేశాయి’’ అని ప్రచార పర్వంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది అమెరికా ప్రజల విజయం. అంతేగాక దేశ చరిత్రలోనే అతి గొప్పదైన, కనీవిని ఎరగని రాజకీయ ఉద్యమమిది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నా చివరి శ్వాస దాకా ప్రతి రోజూ మీ కోసం, మీ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పోరాడతా. మీ జీవితాల్లో వెలుగులు పంచుతా. ద్రవ్యోల్బణం, అక్రమ వలసలతో సహా అన్ని సమస్యలకూ సమర్థ పరిష్కారం చూపుతా’’ అని వాగ్దానం చేశారు. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయి ట్రంప్‌ను అధ్యక్షునిగా లాంఛనంగా ప్రకటించేందుకు మరో రెండు నెలలు పట్టనుంది. అనంతరం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్న ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశాధినేతల నుంచి అభినందనలు, శుభాకాంక్ష సందేశాలు వెల్లువెత్తాయి. ముందునుంచీ... అమెరికావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటినుంచీ ట్రంప్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వాటిలో ఒకటైన విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన 270 ఓట్ల మెజారిటీ మార్కును దాటగానే రిపబ్లికన్ నేతలు, అభిమానులు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం రాత్రి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ 294 సొంతం చేసుకున్నారు. మరోవైపు హారిస్ 223 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయేలా కన్పిస్తున్నారు. ట్రంప్‌కు 7.1 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా ఆమెకు 6.6 కోట్లే వచ్చాయి. 50 రాష్ట్రాలకు గాను అరిజోనా, నెవడా, మెయిన్ ఫలితమే తేలాల్సి ఉంది. అరిజోనాల్లో ట్రంప్ గెలుపు లాంఛనమే కాగా మెయిన్, నెవడాల్లోనూ ఆయన ఇప్పటికే 50 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లోని 21 స్థానాలనూ గెలుచుకుని మరోసారి 300 మార్కు అలవోకగా దాటేలా కన్పిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయనకు 304 ఓట్లు దక్కడం తెలిసిందే. తన ఓటమి ఖాయం కావడంతో హార్వర్డ్ వర్సిటీలో బుధవారం రాత్రి తలపెట్టిన ప్రసంగ కార్యక్రమాన్ని హారిస్ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు బైడెన్ అభ్యర్థిత్వం పట్ల డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు బదులుగా అనూహ్యంగా బరిలో దిగిన హారిస్‌కు ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే. గెలిచి ఉంటే అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు కొద్ది నెలలుగా ఎన్నికల సర్వేలన్నీ పేర్కొంటూ రావడం తెలిసందే. స్వింగ్ స్టేట్లలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పడంతో ఫలితాలపై సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. -
విజయానికి ఐదు మెట్లు
పోరు హోరాహోరీ అంటూ విశ్లేషణలు. హారిస్‌దే పైచేయి అంటూ అమెరికా మీడియాలో కథనాల వెల్లువ. అందుకు తగ్గట్టు ట్రంప్‌తో ఏౖకైక డిబేట్లోనూ హారిస్ స్పష్టమైన ఆధిపత్యం. వీటికి తోడు ఆమె ఆఫ్రికన్, భారత మూలాలు. మహిళల దన్నుపై ధీమా. అబార్షన్ వంటి కీలకాంశాలు కలిసొస్తా యన్న అంచనాలు. సెలబ్రిటీల బహిరంగ మద్దతు. రిపబ్లికన్లతో పోలిస్తే ప్రచారానికి వరదలా వచ్చి పడ్డ నిధులు. కానీ తీరా చూస్తే ట్రంప్ హవా ముందు అన్నీ కొట్టుకుపో యాయి. హోరాహోరీ అనుకున్న పోటీ కాస్తా ఫలితాలొచ్చే సరికి ఏకపక్షంగా మారిపోయింది. ట్రంప్ విజయానికి, హారిస్ పరాజయానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే...1. అమెరికా ఫస్ట్2016లో ట్రంప్‌ను విజయతీరాలకు చేర్చిన ఈ నినాదం ఈసారి కూడా గట్టిగా పని చేసింది. ఉక్రెయిన్‌కు మద్దుతుగా బైడెన్ సర్కారు వందలాది కోట్ల డాలర్లను గుమ్మరించడం సగటు అమెరికన్లకు మింగుడు పడలేదు. దానికి తోడు చైనా తదితర దేశాల నుంచి కారుచౌకగా వచ్చిపడుతున్న వస్తూత్పత్తులు వారి పొట్టకొట్టడమే గాక ఉపాధికి కూడా ఎసరు పెడుతున్నాయి. అసలే ధరాభారంతో కుంగిపోతున్న అమెరికన్లకు ఈ పరిణామం కొన్నేళ్లుగా రోకటిపోటుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను ప్రాభవం కొడిగడుతున్న దేశంగా ట్రంప్ అభివర్ణించడాన్ని వారు సమర్థించారు. సుంకాలను భారీగా పెంచడం ద్వారా కారుచౌక దిగుమతులకు అడ్డుకట్ట వేస్తానన్న ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్థిక అవ్యవస్థ సహా అన్ని సమస్యలనూ చక్కదిద్దడానికి హారిస్‌తో పోలిస్తే ట్రంపే సరైన నేత అని మెజారిటీ ప్రజలు భావించారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదానికి విపరీతమైన స్పందన దక్కింది. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ అమెరికా ప్రాధాన్యాన్ని పునరుద్ధరిస్తానన్న వాగ్దానం శ్వేతజాతీయుల మనసు గెలుచుకుంది.2. అక్రమ వలసలువలసదారులు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారన్న ఆక్రోశం స్థానికుల్లో చాలా ఏళ్లుగా నెలకొని ఉంది. వారిలోని ఈ వ్యతిరేకతను ట్రంప్ పూర్తిస్థాయిలో సొమ్ముచేసుకోగలిగారు. బైడెన్ నాలుగేళ్ల పాలనలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో అక్రమ వలసలు జరిగాయి. వలసదారులు అమెరికన్ల పొట్టకొడుతు న్నారన్న ట్రంప్ వాదనతో వారు ఏకీభవించారు. వాటికి అడ్డుకట్ట వేయడమే గాక అక్రమంగా వచ్చిన 10 లక్షల పై చిలుకు మందిని స్వదేశాలకు పంపేస్తానని ప్రకటించడం ట్రంప్‌కు భారీగా లాభించింది.3.ఎకానమీఈసారి ట్రంప్‌ను గద్దెనెక్కించిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది. బైడెన్ పాలనలో గత నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం చుక్కలను తాకింది. నిత్యావసరాల ధరలు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు రెట్లకు పైగా పెరిగిపోయాయి. కరోనా తదితర సమస్యలూ దానికి కారణమైనా ఓటర్లు మాత్రం బైడెన్‌ను, ఆయన డెమొక్రటిక్ పార్టీనే దోషులుగా చూశారు. ట్రంప్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేదన్నది అమెరికన్లలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దే సామర్థ్యం విషయంలో ట్రంప్‌తో పోలిస్తే హారిస్ తేలిపోయారని అన్ని సర్వేల్లోనూ తేలింది.4. గ్రామీణ ఓటర్ల బ్రహ్మరథంతొలినుంచీ ట్రంప్‌కు గట్టి ఓటు బ్యాంకుగా నిలిచిన గ్రామీణ ఓటర్లు ఆయనకు ఈసారి మరింత దన్నుగా నిలిచారు. గత కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగినట్టు ఫలితాల సరళి చెబుతోంది. ఈ ట్రెండు దేశవ్యాప్తంగా కొనసాగడం ట్రంప్‌కు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే గ్రామీణ ఓట్లను ఆయన దాదాపుగా స్వీప్ చేశారు.మైనారిటీ ఓటర్లలోనూ పాగామెక్సికో తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తరాల కిందట వలస వచ్చి స్థిరపడ్డ స్పానిష్ మాట్లాడే వారిని హిస్పానియన్లుగా పిలుస్తారు. ఫలితాల్లో వీరి ఓట్లూ కీలకమే. డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లలో 12 శాతం దాకా ఉండే హిస్పానియన్లు కొన్నేళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ఆ ట్రెండ్ కూడా ఈసారి కూడా కొనసాగినట్టు కన్పిస్తోంది. దీనికి తోడు హిస్పానియన్లకు, ఇండియన్ అమెరికన్లకు దగ్గరయ్యేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పోలింగ్ సమీపించిన తరుణంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులను ఖండిస్తూ చేసిన ప్రకటన ఇండియన్ అమెరికన్లపై ప్రభావం చూపింది. 2020తో పోలిస్తే ట్రంప్‌కు ఈసారి లాటిన్, ఇండియన్ అమెరికన్ ఓట్లు గణనీయంగా పెరిగినట్టు దేశవ్యాప్తంగా 1.15 లక్షల ఓటర్లతో జరిపిన ఏపీ వోట్కాస్ట్ ప్రాథమిక సర్వే తేల్చింది. 2020లో బైడెన్‌కు ప్రతి 10 మంది లాటిన్ ఓటర్లలో 9 మంది ఓటేయగా ఈసారి హారిస్‌కు 8 మందే వేసినట్టు పేర్కొంది. 2020లో 60 శాతం పడ్డ హిస్పానియన్ ఓట్లు ఈసారి 50 శాతానికి తగ్గాయి. 30 ఏళ్ల లోపు ఓటర్లలో 2020లో బైడెన్‌కు 60 శాతం మంది ఓటేయగా ఈసారి అది 50 శాతానికి పరిమితమైంది. వారిలో 2020లో ట్రంప్‌కు మూడో వంతే ఓటేయగా ఈసారి అది 40 శాతానికి పెరిగింది. ఈ చిన్న మార్జిన్లే తుది ఫలితాలను గట్టిగా ప్రభావితం చేశాయి.5. భావజాలాలుపైకి కన్పించకపోయినా అమెరికా సమాజంలో జాత్యహంకారం, పురుషాధిక్య భావజాలం బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. ట్రంప్‌కు శ్వేతజాతీయులు మొదటినుంచీ గట్టి మద్దతుదారులుగా ఉండటానికి ఇది కూడా కారణమేనని చెబుతారు. అందుకే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ వంటి ట్రంప్ నినాదాల్లో అంతర్లీనంగా దాగున్న ఆ భావనలు ఓటర్లపై గట్టి ప్రభావమే చూపాయని భావిస్తున్నారు. వీటికి తోడు ట్రంప్‌పై కోర్టు కేసులు, క్రిమినల్ అభియోగాలను ప్రజలు పట్టించుకోకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది. పైగా ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఆ దూకుడేనని వారు భావించారు. దీన్ని ట్రంప్ కూడా అంగీకరించడం విశేషం. తనపై ఉన్న కేసులు, అభియోగాలు జనాదరణను మరింతగా పెంచాయని చెప్పుకొచ్చారాయన. -
ట్రంప్‌కే అమెరికా పట్టం
అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్‌లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు. పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది. రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్‌కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్‌నే వరించింది. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్‌కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్‌కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే. ఇక, గతంలో పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్‌కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్‌పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ. అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.భారత్‌కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్ల ఆశ నెరవేర లేదు. అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే! -
కమల యోధురాలు
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్‌ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు. స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్‌దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం. ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు. చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన -
అమ్మా.. నీకు మాటిస్తున్నా..!
-
US Election Results: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ మార్క్‌ను దాటారు.విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన ఈ మ్యాజిక్ ఫిగర్ దాటారు. ఇక.. ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో ఆయన అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్-280కమలా హారిస్-224ఇంకా నెవడా 6, మిషిగన్ 15, మైన్ 2, ఆరిజోనా 11, అలస్కా 3 చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.ట్రంప్ నెగ్గిన రాష్ట్రాలుఅలబామా 9, ఆర్కాన్సాస్ 6, ఫ్లోరిడా 30, జార్జియా 16, అయోవా 6, ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్ 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్ 1, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, నార్త్ కరోలినా 16, నార్త్ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17, ఓక్లహోమా 7, పెన్సిల్వేనియా 19, సౌత్ కరోలినా 9, సౌత్ డకోటా 3, టెన్నెసీ 11, టెక్సాస్ 40, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4,వయోమింగ్ 3, విస్కాన్సిన్ 10కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలివే..కాలిఫోర్నియా 54, కొలరాడో 10, కనెక్టికట్ 7, డీసీ 3, డెలవేర్ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, మైన్ 1, మిన్నెసోటా 10, నెబ్రస్కా 1, న్యూహ్యాంప్‌షైర్ 4, న్యూజెర్సీ 14, న్యూమెక్సికో 5, న్యూయార్క్ 28, ఓరెగాన్ 8, రోడ్ ఐల్యాండ్ 4, వర్జినియా 13, వెర్మాంట్ 3, వాషింగ్టన్ 12ట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్‌హౌజ్ వైపు అడుగులేశారు.చదవండి: Usha Chilukuri: ‘సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా’గా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి.. -
రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ!
హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక గెలుపు సాధించారు. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించు కోవాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే. దీంతో భారత్ సహా ప్రపంచదేశాలు ట్రంప్‌ను అభినందిస్తున్నాయి. మరోవైపు 78ఏళ్ల వయసులో అమెరికా అద్యక్షుడు కాబోతున్న ట్రంప్కిష్టమైన పదార్థాలేంటి, మద్యం తాగతాడా? టీ కాఫీలుతాగుతాడా అనేది నెట్టించ చర్చ మొదలంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఇష్టమైన ఫుడ్, వంటకాలేంటో ఒకసారి చూద్దాం.ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అభిమాని. అలాగే మీట్ లోఫ్ చాలా ఇష్టం. డైట్ కోక్, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. ఇంకా బర్గర్ కింగ్, కెఎఫ్సీ సహా తో సహా ఫాస్ట్ ఫుడ్‌కి విపరీతమైన అభిమాని. ఈ విషయాన్ని దేశ విదేశాల పర్యటనల్లో ఆయన ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. అంతేకాదు ఆయన రోజువారీ ఆహారంలోసాధారణంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కంటే కూడా డిన్నర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.బ్రేక్‌ఫాస్ట్, లంచ్ , డిన్నర్ బేకన్ , గుడ్లు, తృణధాన్యాలు లేదా మెక్‌డొనాల్డ్స్ మెక్మఫిన్ తింటాడు. కాఫీ లేదా టీ అస్సలు తాగడు. గతంలో మాజీ ప్రచార నిర్వాహకుడు కోరీ లెవాండోస్కీ రాసిన లెట్ ట్రంప్ బి ట్రంప్ అనే పుస్తకం ప్రకారం ట్రంప్ పగటిపూట ఎక్కువగా తినడానికి ఇష్టపడడు. సాధారణంగా 14 నుండి 16 గంటలు తినకుండానే ఉంటాడు. ఎగ్ మెఫిన్స్ ఫిష్ శాండ్విచ్ చాక్లెట్ షాక్ అన్నా కూడా ఇష్టం.వ నిల్లా-ఫ్లేవర్ ఉన్న కీబ్లర్ వియన్నా ఫింగర్స్‌ను తింటారు.డైట్ కోక్ అంటే పిచ్చిమద్యానికి దూరంగాఉండే ట్రంప్ కి అత్యంత ఇష్టమైన పానీయం ఏదన్నా ఉందంటే అది డైట్ కోక్. రోజుకు సుమారు 12 క్యాన్ల డైట్ కోక్ తాగుతాడని చెబుతారు.. ఇక వెజ్ విషయానికి వస్తే ఆటూ చిప స్, లేస్ పొటాటో చిప్స్ ని ఆయన అధికంగా తింటారు. చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం , చాక్లెట్ కేక్ ఆయనకు నచ్చిన ఆహారాల్లో భాగమే. -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో ఆయన రెండోసారిఅ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అమెరికన్ ఓటర్లు.. రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారని యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించి.. డొనాల్డ్ ట్రంప్, రన్నింగ్‌మేట్( ఉపాధ్యక్షుడు) జేడీ వాన్స్‌కి అభినందనలు తెలిపారు.‘‘ మేం అమెరికాను రక్షించాం. రిపబ్లిక్ పార్టీ ఘన విజయంతో..యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా సెనేటర్ జేడీ వాన్స్ వైట్ హౌస్‌కు వెళ్తున్నారు. వారితో కలిసి అమెరికన్ ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.We have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024చదవండి: రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ! -
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా
-
కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!
యూఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆహార నియామాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆమె అనుసరించే డైట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఆమె పాక్షిక శాకాహారి లేదా రోజులో కొద్దిసేపు శాకాహారిగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఈ ప్రక్రియను 'ఫ్లెక్సిటేరియన్ డైట్' అని అంటారట. అసలేంటి ఈ డైట్..? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ను అనుసరిస్తారు. ఈ డైట్ శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు మితంగా నాన్‌వెజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను అందించడంలో సహాయపడుతుంది. అందువల్లే ఈ డైట్‌ని "ఫ్లెక్సిబుల్" "వెజిటేరియన్" అనే పదాల కలయికతో ఫ్లెక్సిటేరియన్ డైట్‌గా పిలుస్తున్నారు.ఈ డైట్ విధానం..కమలా హారిస్ తరుచుగా శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. అయితే కమలా సాయంత్రం ఆరుగంటలోపు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నాన్‌వెజ్ సంబంధిత పదార్థాలను తీసుకుంటారు. ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..?డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ని రూపొందించారు. దీనిలో స్పష్టమైన నియమాలు లేదా సిఫార్సు చేసిన కేలరీలు, స్థూల పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..నిపుణల అభిప్రాయం ప్రకారం..పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకోవడంనాన్వెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చడంసౌకర్యవంతమైన పద్ధతిలో మితంగా నాన్‌వెజ్ తీసుకోవడంప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటంస్వీట్లను పరిమితం చేయడం తదితరాలు ఉంటాయి.ఆమె ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..ఉదయం టీలో తేనెను తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌గా బాదం పాలు, ఎండు ద్రాక్ష మాత్రమే తీసుకుంటారు. అంతేగాదు పలు ఇంటర్వ్యూలో బ్రేక్‌ఫాస్ట్ అస్సలు తీసుకోనని కేవలం బాదంపాల తోపాటు ఏదో ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటానని చెప్పారు కూడా. అలా సాయంత్రంలోపు మొక్కల ఆధారిత ఆహారమే తీసుకోగా, రాత్రిపూట మితంగా నాన్‌వెజ్‌కి ప్రాధాన్యత ఇస్తారు.ఈ డైట్లో ఉండే ఆహారాలు..ప్రోటీన్లు - సోయాబీన్స్, టోఫు, టెంపే, కాయధాన్యాలుకార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు - బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు - వింటర్ స్క్వాష్, బఠానీలు, మొక్కజొన్న, చిలగడదుంపపండ్లు - యాపిల్స్, నారింజ, బెర్రీలు, ద్రాక్ష, చెర్రీస్తృణధాన్యాలు - క్వినోవా, టెఫ్, బుక్వీట్, ఫార్రోనట్స్: బాదం, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, వేరుశెనగ వెన్న, అవకాడోలు, ఆలివ్‌లు, కొబ్బరిమొక్కల ఆధారిత పాలు - తియ్యని బాదం, కొబ్బరి, జనపనార, సోయా పాలుపానీయాలు - తగినన్ని నీళ్లు, టీ, కాఫీప్రయోజనాలు:ఫైబర్ తోపాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయిగుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిమధుమేహం నియంత్రణలో ఉంటుంది.కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గమనికి: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం మంచిది.(చదవండి: ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?) -
డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలినుంచి హావా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెండు కీలక స్వింగ్ స్టేట్స్ నార్త్ కరోలినా, జార్జియాలో విజయం సాధించి మరో నాలుగింటిలో లీడ్‌లో ఉన్నారు. దీంతో ట్రంప్ గెలుపు ఖాయమన్న భావన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇటు రిపబ్లికన్లలో జోష్ నెలకొనగా అటు డెమోక్రాట్లు నిరాశలో మునిగిపోయారు. ట్రంప్ బుధవారం ఫ్లోరిడాలో తన అభిమానులనుద్దేశించి ప్రసంగించనుండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ మాత్రం బుధవారం తన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. నిజానికి బుధవారం ఉదయం ఆమె హవర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాల్సి ఉంది. ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఆమె తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా.. -
ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?
యూఎస్‌లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ నేత కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిలో ఎవరిది పైచేయి అనేది కొద్ది క్షణాల్లో తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇరువురి అభ్యర్థుల ప్రచార వ్యూహం ఎలా ఉన్నా..వారి ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్ ఎంతవరకు ఓటర్లను ఆకర్షించింది?. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఈ ఇరువురు ఎలాంటి స్టైల్‌ని ఎంచుకున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా..!ఫ్యాషన్ రాజకీయాలు వేర్వేరు అనుకుంటే పొరబాటే. ఈ రోజుల్లో నాయకుల ఫ్యాషన్ శైలి కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న అంశంగా మారింది. అమెరికాలో ఉత్కంఠభరితమైన అధ్యక్ష పోలింగ్ వేళ..ఇరువురు తమ ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్‌తో ఓటర్లను తమదైన పంథాలో ప్రభావితం చేసేలా యత్నించారు. ఆ నాయకులిద్దరూ తాము ధరించే దుస్తులతో తాము ప్రజల మనిషి అని పరోక్షంగా తెలియజేశారు. వారి భావజాలంతో కంటే తమ ఫ్యాషన్శైలితోనే ఓటర్లకు కనెక్ట్ అయ్యారు. అదెలాగో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ క్లాసిక్ అండ్ టైలర్డ్ స్టైల్..డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ చాలా కాలంగా సిగ్నేచర్ సిల్హౌట్ ఫ్యాషన్‌కి కట్టుబడి ఉన్నారు. తన వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసేలా శక్తిమంతమైన సూట్లు, ఫ్యాంట్లు ఎంపిక చేసుకుంది. టైలర్డ్ ప్యాంట్సూట్లతో ప్రజలకు మరింత చేరవయ్యింది. అంతేగాదు ఆమె ధరించి షోల్డర్ ప్యాడ్లు ఓటర్లకు భరోసా ఇచ్చేలా ఉంటుంది. స్థిరత్వమైన నిర్ణయాలకు ప్రతీక అని చాటి చెప్పేలా కమలా ఆహార్యం ఉంటుంది. అలాగే కమలా ధరించే సూట్‌కి పిన్ చేసి ఉన్న ఫ్లాగ్ ఆమె దేశభక్తిని చాటి చెబుతోంది. ముఖ్యంగా ఆమె ధరించే ముత్యాలకు సంబంధించిన టూ-స్ట్రాండ్ ఐరీన్ న్యూవిర్త్ నెక్లెస్ ప్రశాంతతకు పెద్దపీట వేసే మనిషి అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Kamala Harris (@kamalaharris)డొనాల్డ్ ట్రంప్ బోల్డ్ అండ్ బ్రష్ ఎంపికలు..డొనాల్డ్ ట్రంప్ ధైర్యసాహసాలను చూపించేలా డార్క్ కలర్ బ్లూ సూట్లను, ఎరుపు టైని ధరిస్తారు. ఆ ఆహార్యంతో డొనాల్డ్ తరుచుగా నెట్టింట వైరల్ అవుతుంటారు కూడా. పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీలో బూడిదరంగు మెక్‌డొనాల్డ్ ఆప్రాన్‌తో ఆకట్టుకున్నారు. విస్కాన్సిన్లో అతని ఫ్లోరోసెంట్-నారింజ ట్రాష్ ప్రజల సమస్యకు సత్వరమే స్పందించే వ్యక్తిగా ప్రతిబింబించింది. View this post on Instagram A post shared by President Donald J. Trump (@realdonaldtrump)ఈ ఇద్దరు నాయకుల వార్డ్రోబ్లు మాటలతో పనిలేకుండా వారేంటి అనేది ప్రజలకు పరోక్షంగా తెలియజేశాయి. తమదైన భావజాలం, ఆహార్యంతో ఓటర్లకు కనెక్ట్ అయ్యేలా ప్రయత్నం చేశారు ఇరువురు. మరి ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే..!(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!) -
‘ఉత్తరప్రదేశ్’లో గెలిస్తేనే అమెరికా అధ్యక్ష పదవి?
న్యూఢిల్లీ: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడల్లా అందరి దృష్టి ఉత్తరప్రదేశ్వైపు మళ్లుతుంది. దీనికి కారణం మన దేశంలో అత్యధికంగా లోక్‌సభ సీట్లు(80) ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రంలో మెరుగైన పరితీరు కనబరిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సులభమవుతుంది.మన ఉత్తరప్రదేశ్ మాదిరిగానే అమెరికాలోనూ అలాంటి ఒక రాష్ట్రం ఉంది. అక్కడున్న సీట్ల సంఖ్య ఆధారంగా దీనిని మన ఉత్తర ప్రదేశ్‌తో పోల్చవచ్చు. అదే కాలిఫోర్నియా రాష్ట్రం. ఇక్కడ గరిష్టంగా 54 ఎలక్ట్రోరల్ కాలేజీలున్నాయి. ఇక్కడే ట్రంప్ పార్టీ గెలుస్తుందా? లేదా కమలా హారిస్ గెలుస్తారా అనేది తేలిపోతుంది. అమెరికాలోని ఈ ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ సత్తా చాటుతుందో ఆ పార్టీకి చెందిన అభ్యర్థి అధ్యక్షుడయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.అమెరికాలో ఏడు స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది స్పష్టంగా ఎవరూ అంచనా వేయలేరు. ఈ జాబితాలో పెన్సెల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ కరోలినా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్లో తాజా సమాచారం ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. ఇది కూడా చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ లీడ్..నార్త్ కరోలినాలో గెలుపు -
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా.. రెండు స్టేట్స్లో గెలుపు
వాషింగ్టన్:అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ లీడ్‌లో ఉన్నారు. అయితే తుది ఫలితాన్ని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్,కమల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ స్టేట్లలో కీలకమైన నార్త్ కరోలినాతో పాటు జార్జియాలను ట్రంప్ కైవసం చేసుకున్నారు. ఇది కాకుండా విస్కాన్సిన్, అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్లలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. కీలక పెన్సిల్వేనియాలో మాత్రం కమల లీడ్‌లో ఉన్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. స్వింగ్ స్టేట్స్ కాకుండా ఎలక్టోరల్ ఓట్లు అధికంగా ఉన్న కాలిఫోర్నియా(54)ను కమల తన ఖాతాలో వేసుకోగా టెక్సాస్(40) ఓట్లను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.ఇదీ చదవండి: హారిస్, ట్రంప్ హోరాహోరీ