kate winslet
-
టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో థెరపీ! మహిళలకు మంచిదేనా..?
టైటానిక్ మూవీ నటి, ఆస్కార్ గ్రహిత కేట్ విన్స్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ వన్నే తరగని అందం, గ్లామర్‌తో యంగ్ హీరోయిన్లకు తీసుపోని విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటీవల ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే ఆ కార్యక్రమంలో ప్రేకక్షుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..టెస్టోస్టెరాన్ రీప్లెస్‌మెంట్ థెరపీ చేయించకున్నట్లు తెలిపింది. అసలేంటిది? ఇది మహిళలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటే.?. ఈ థెరపీ ఎందుకంటే..నిజానికి మూడు పదుల వయసు దాటేప్పటికీ కొందరిలో హర్మోన్ల అసమతుల్యత వల్ల లైంగిక కోరికలు తగ్గిపోతుంటాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానం, పనుల్లో ఉండే ఒత్తిడి తదితర వాటి వల్ల ఈ సమస్యను పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఎదర్కొంటుంటారు. ఇది వారి వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీయొచ్చు.పూర్తి దాంపత్య జీవితాన్ని అనుభవించక మునుపే చాలా తొందరగా ఈ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ప్రస్తుత జీవన విధానంలోని లోపాల కారణంగా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాన్ని మెరుగుపరుచుకునేందుకే ఈ టెస్టోస్టెరాన్ థెరపీ చేయించకుంటారు. ఇది కేవలం శారరీక ఆనందం కోసమే గాక, ఆరోగ్యపరంగానూ ఈ థెరపీ మహిళలకు అవసరం. ఎలా ప్రభావితం చేస్తుందంటే.. టెస్టోస్టెరాన్ అనేది ప్రతి ఒక్కిరిలో ఉండే లైంగిక హార్మోన్. అయితే పురుషలలో ఈ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ ఆండ్రోజెన్ మహిళల్లో కేవలం లైంగిక సామర్థ్యాన్నే గాక మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం చేస్తుంది. ఇది సంతానోత్పోత్తని నిర్ణయించడంలో, కొత్త రక్తకణాలు తయారు చేయడంలో, మానసిక ఆరోగ్యం, కండరాలు, ఎముకల పనీతీరు బలోపేతం చేయడంలోనే కీలకంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఈ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. మహిళలు కూడా దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. అది క్రమేణ వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎముకల సాంద్రత తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, మూడ్స్వింగ్ల నుంచి లైంగిక వాంఛలు తగ్గడం వరకు పలు ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే..?టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ (TRT) అనేది తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న వ్యక్తులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి రూపొందించబడిన వైద్య చికిత్స. దీన్ని తీసుకోవడం వల్ల మెరుగైన మానసిక స్థితి ఉంటుంది. ఆందోళన దూరం అవుతుంది. అలాగే ఎముకల సమస్యల నుంచి బయటపడతారు. కండరాలు బలోపేతం అవుతాయి కూడా. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షలోనే తీసుకోవాల్సి ఉంటుంది. (చదవండి: వాపింగ్ ఇంత ప్రమాకరమైనదా..? ఆ మహిళ ఊపిరితిత్తుల్లో ఏకంగా..!) -
భర్త ముందే శృంగారపు సన్నివేశంలో నటించా : హీరోయిన్
భారతీయ సినిమాల్లో శృంగారపు సన్నివేశాలకు హద్దు ఉంటుంది కానీ హాలీవుడ్లో అలా కాదు. తెరపై రొమాంటిక్ సీన్స్ చూపించాలని డిసైడ్ అయితే.. వాళ్లకంటే బోల్డ్‌గా మరెవరూ చూపించరు. అయితే ఆ సీన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్లు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ‘టైటానిక్’ హీరోయిన్ కేట్ విన్స్లేట్ కూడా అలాంటి సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట. భర్త ముందే బోల్డ్ సీన్స్‌లో నటించడం..ఇబ్బందిగా, విచిత్రంగా అనిపించిందట. ‘టైటానిక్’ సినిమా తర్వాత లియోనార్డో డికాప్రియో, కేట్ కలిసి ‘రెవల్యూషనరీ రోడ్’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకి కేట్ మాజీ భర్త సామ్ మెండిస్ దర్శకత్వం వహించారు. అందులో ఉన్న రొమాంటిక్ సీన్స్..అప్పట్లో సంచలనం సృష్టించాయి. భర్త డైరెక్షన్లో లియోనార్డో డికాప్రియోతో కలిసి కేట్ రొమాన్స్ చేసింది. తాజాగా కేట్ ఆ విషయం గురించి మాట్లాడుతూ.. ‘రివల్యూషనరీ రోడ్ మూవీ టైంలో రెండోసారి డికాప్రియోతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకి డైరెక్టర్ నా భర్తే కాబట్టి.. డికాప్రియోతో శృంగారపు సన్నివేశాలలో నటించేటప్పుడు ఓవైపు ఇబ్బందిగా, మరోవైపు విచిత్రంగా ఫీలయ్యాను’ అని కేట్ తెలిపింది. ఆ సినిమాకి కేట్ బెస్ట్ యాక్ట్రెస్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. -
ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్
సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్ స్క్రీన్ పై ‘టైటానిక్’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్ విన్ ్సలెట్ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది. ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్ ‘టైటానిక్’దే. కామెరూన్ తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్’ రానుంది. -
టైటానిక్ టూ అవతార్.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ..!
'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్' ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్-2’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్ వండర్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్బుతంగా ఆవిష్కరించిన కామెరూన్.. ఇప్పుడు నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. (ఇది చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత) అయితే ఈ చిత్రంలో టైటానిక్ భామ కేట్ విన్స్లెట్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జేమ్స్ కామెరూన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టైటానిక్ విడుదలైన 25 ఏళ్ల తర్వాత కేట్ విన్ స్లెట్, జేమ్స్ కామెరూన్ మళ్లీ అవతార్-2లో కలిసి పనిచేయడం గమనార్హం. అవతార్ మూవీతో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన జేమ్స్ కామెరూన్.. దాదాపు 13 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్లో పండోరలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూపించారు. సామ్ వర్తింగ్టన్, జో సాల్దానా.. జేక్, నేత్రి పాత్రలు పోషించగా.. ఈ అడ్వెంచర్‌లో టోనోవరీ భార్యగా రోనల్ పాత్రలో కేట్ విన్స్లెట్ నటించింది. టైటానిక్ భామ కేట్ విన్ స్లెట్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయని అనుకుంటున్నా. టైటానిక్ విడుదలై 25 ఏళ్లైంది. ఇది చాలా సుదీర్ఘ సమయం. అది నా జీవితకాలంలో సగభాగం కంటే ఎక్కువ. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను తల్లిని అయ్యా. జేమ్స్ కామెరూన్ కూడా పేరెంట్ అయ్యారు. మేమిద్దరం కళాకారులం. మేం ప్రయోగాత్మకంగా మరింత సాహసోపేతంగా ఉన్నాం. అదే మా ఇద్దరి మధ్య ప్రధాన వ్యత్యాసం. ఇద్దరి మధ్య సృజనాత్మకమైన తేడాలు చాలా ఉన్నాయి.' అని అన్నారు. -
అవతార్ 2: నేవీ నాయకి లుక్ వచ్చేసింది!
అవతార్.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఎంతగానో అలరించిందీ చిత్రం. దీంతో ఈ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతోంది అవతార్: ది వే ఆఫ్ వాటర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాలో నేవీ అధికారి రొనాల్గా నటించిన కేట్ విన్స్లెట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. భయమెరుగని నిజాయితీ గల నాయకిగా ఆమెను కీర్తించారు. అందుకు తగ్గట్టుగానే ఆమె లుక్ కూడా అదిరిపోయింది. ప్రముఖ ఎంపైర్ మ్యాగజైన్‌పై ఆమె ఫస్ట్ లుక్ ప్రచురితమైంది. ఇకపోతే విన్స్లెట్.. తన పాత్ర కోసం నీళ్లలో ఉన్నప్పుడు ఎక్కువ సేపు శ్వాస నిలుపుకోవడాన్ని ప్రాక్టీస్ చేసిందట. 20th సెంచరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో విన్స్లెట్తో పాటు సామ్ వార్తింగ్టన్, జియో సాల్డనా, సిగర్నీ వేవర్ సహా పలువురు నటిస్తున్న విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by 20th Century Studios (@20thcenturystudios) చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు.. -
‘టైటానిక్’ మూవీ హీరోయిన్‌తో పోల్చుకున్న యంగ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అంతేగాక సమాజంలో జరిగే పలు విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. ఇక తన సహా నటీనటులను ఎప్పుడు ఆటపట్టిస్తూ సరదగా ఉండే కార్తీక్ తాజాగా టైటానిక్ మూవీపై స్పందిస్తూ హీరోయిన్ కేట్ విన్స్లెట్తో తనని పోల్చుకున్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్ కేట్, హీరోని తన స్కెచ్ వేయమని కోరుతూ నగ్నంగా సోఫాలో వాలి ఫోజు ఇస్తుంది. ఈ సనివేశం అందరికి గుర్తుంది కదా. అచ్చం కేట్ లాగే కార్తీక్ కూడా ఫోజు ఇచ్చి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు ‘కార్తీక్ 1- 0 కేట్ విన్స్లెట్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఇక అతడి పోస్టుపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖుల కూడా స్పందించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ‘ఉఫ్’ అంటు కామెంట్ చేయగా.. సింగర్ జోనితా గాంధీ ‘ఇది ఏంటో అర్థం కానీ వ్యక్తిని నేను మాత్రమే అనుకుంటా’ అంటు కామెంట్ చేసింది. అది చూసిన కార్తీక్ ‘వెంటనే టైటానిక్ సినిమా చూడు’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే నెటిజన్లు కూడా ‘టైటానిక్ పార్ట్ 2’, ‘క్యాప్షన్ కింగ్’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
అవును.. నేను చనిపోయాననుకున్నా!
జెమ్స్ కామెరూన్ ‘అవతార్–2’ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా కోసమే కాదు షూటింగ్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు సినీ అభిమానులు. ఈ సినిమాలో టైటానిక్ ఫేమ్ కెట్ విన్స్లేట్ ‘రోనల్’ అనే కీలక పాత్ర పోషించింది. ఊపిరి బిగపట్టి నీటి అడుగు భాగంలో 7 నిమిషాల 14 సెకన్ల సీన్ ఒకటి చేసినప్పుడు కొన్ని నెలల క్రితం ఆ ఫోటోను సోషల్ మీడియాలో చూసి అభిమానులు ఆహా, ఓహో అన్నారు. ఈ సీన్‌కు సంబంధించి తన అనుభవాన్ని తాజాగా ‘అబ్జర్వర్’ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది కెట్ విన్స్లేట్. ‘మది స్తంభించిపోయింది. కనిపిస్తున్న నీటిబుడగలను చూడడం తప్ప ఏ ఆలోచనా లేదు. ఒక దశలో నేను చనిపోయానా? అవును... నేను చనిపోయాను...అనుకున్నాను’ అని చెప్పింది. భయం సంగతి ఏమిటో గానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా కోసం టామ్‌క్రూజ్ ఆరునిమిషాల అరసెకను పాటు ఊపిరిబిగపట్టిన రికార్డ్‌ను కెట్ విన్స్లేట్ బ్రేక్ చేసింది. చదవండి: వైరల్: టైటానిక్ మరో క్లైమాక్స్ సీన్ వీడియో! -
ఆస్కార్ నటి చేదు జ్ఞాపకాలు
పేరొస్తే పేరుతో పాటు కొన్ని నెత్తి మీదకు వస్తాయి. నువ్వెలా ఉండాలో అందరూ చెప్పేవాళ్లే అవుతారు. ‘నువ్వలా ఎందుకు ఉండవు?’ అని అందరూ అడిగేవాళ్లే అవుతారు. ముఖ్యంగా సినిమాల్లో పేరొచ్చిన వాళ్లకు ఈ ‘పేరు బరువు’ మోయలేనంతగా, వదిలించుకోవాలన్నంతగా ఉంటుంది. కేట్ విన్స్లెట్ కూడా కొన్నాళ్లు ఆ బరువును మోశారు. మీడియా ఆమెపై మోపిన బరువు అది! ‘‘మీడియా నా జీవితాన్ని నరకప్రాయం చేసింది. అస్సలు దయలేకుండా ప్రవర్తించింది. ఆఖరికి నా నీడను కూడా వెంటాడి, దాక్కోడానికి నాకొక చోటు లేకుండా చేసింది. నా నుంచి నేను పారిపోవాలన్నంతగా నన్ను వెంటాడింది’’ అని గురువారం ‘డబ్ల్యూ.టి.ఎఫ్.’ అనే అమెరికన్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన వాయిస్ ఇంటర్వ్యూలో చెప్పారు కేట్. టైటానిక్ చిత్రం తెచ్చిన పేరుతో మీడియా ధోరణి వల్ల తను దాదాపుగా ఒక దుర్భరమైన బతుకునే బతికినట్లు కేట్ చెప్పారు. సినిమాకు బ్రేక్ వస్తే ఎవరైనా సంతోషిస్తారు. కేట్ విన్స్లెట్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్య వచ్చిన బ్రేక్‌లో మీడియా కంటపడకుండా సంతోషమైన జీవితాన్ని వెతుక్కున్నారు. ఈ బ్రిటిష్ నటిని చెత్త చెత్త ప్రశ్నలు అడిగి, కల్పించిన ఆరోపణలు, విమర్శలతో వేధించింది బ్రిటన్ మీడియానే! బ్లాక్ బస్టర్ మూవీ ‘టైటానిక్’ 1997లో విడుదలైంది. అందులో హీరోయిన్ కేట్ విన్స్లెట్. ఫస్ట్ డే ఫస్ట్ షోతో ఆమెకు ఉత్తర అట్లాంటిక్ సముద్రమంత ఫాలోయింగ్ వచ్చేసింది. టైటానిక్‌లో ఉత్తమ నటిగా ఆస్కార్‌కు కూడా ఆమె నామినేట్ అయ్యారు. టైటానిక్‌కి ముందు ఐదు చిత్రాల్లో నటించారు కేట్. టైటానిక్ తర్వాత దాదాపు నలభై చిత్రాల్లో నటించారు. అయితే నేటికీ టైటానిక్కే ఆమె ఐడెంటిటీ. తన 21 ఏట జేమ్స్ కామెరూన్ చిత్రం టైటానిక్‌లో నటించిన కేట్ ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో జేమ్ కామెరూన్దే అయిన ‘అవతార్ 2’ లో నటిస్తున్నారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. విడుదలకు ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. కరోనా బ్రేక్ రాకపోయుంటే ఈ ఏడాది (2021) డిసెంబర్లో విడుదలకు రెడీ అవుతూ ఉండేది. అవతార్ 2 లో అండర్ వాటర్ సీన్ కోసం కేట్ ఏడున్నర నిముషాల పాటు నీటి అడుగున ఊపిరి బిగబట్టి ఉన్నారని 2019లో కామెరూన్ మెచ్చుకోలుగా చెప్పారు. అయితే మీడియా విసిగింపులతో తను చాలాసార్లు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం ఊపిరిని బిగబట్టి ఉన్నానని అంటారు కేట్! ∙∙ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఫలానా టార్చర్ అని మీడియా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కేట్. తనకు వ్యక్తిగత జీవితం లేకుండా చేశారని మాత్రం పలుమార్లు చెప్పారు. ఒక ఆస్కార్‌ను (‘ది రీడర్’ చిత్రంలో ఉత్తమ నటిగా), ఆరు ఆస్కార్ నామినేషన్లను గెలుచుకున్న కేట్.. టైటానిక్ చివరి సన్నివేశంలో హీరో డికాప్రియో ఇచ్చిన సపోర్ట్‌తో రాత్రంతా నీళ్లపై తేలుతూ ఎలాగైతే ప్రాణాలు కాపాడుకుంటుందో, మీడియా నుంచీ తనను తను అలాగే కాపాడుకుంటూ వచ్చింది. అయితే నిజ జీవితంలో తనే తన హీరో. ప్రస్తుతం భర్త, ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఉన్న కేట్కు టైటానిక్‌తో ఆమె సంపాదించిన పేరు ప్రతిష్టలు ఏమంత సంతోషాన్నివ్వలేదు. ‘‘ఆ సినిమా రిలీజ్ తర్వాత నేను ‘పర్సనల్ ఫిజికల్ స్క్రూటినీ’కి గురయ్యాను’’ అని పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు కేట్. ఆ ఫిజికల్ స్క్రూటినీకి కారణం టైటానిక్‌లో కొన్ని క్షణాల పాటు కేట్ కళాత్మకంగానే అయినా, ‘న్యూడ్’గా కనిపించడం. కేట్ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా చివరికి ఆ సీన్ దగ్గరికే వచ్చే ఆగేవి వాళ్ల ఆరాలు. కథలో భాగమైన ఆ ఇరవై ఏళ్ల అనాచ్ఛాదిత దేహాన్ని ప్రశ్నలతో ఆస్వాదించడం మొదలుపెట్టేవారు. ‘ఏంటమ్మాయ్.. బొత్తిగా సిగ్గు లేకుండా..’ అని విమర్శించిన ప్రేక్షకులూ ఉన్నారు. ‘సిగ్గు లేకుండా’ అనే మాట కేట్‌ని బాధించలేదు కానీ, నిర్భయంగా మీద చెయ్యి వేయడానికి చొరవ చూపిన వారిని దూరంగా ఉంచినందుకు అహం దెబ్బతిని తనపై వారు రాసిన సిగ్గు లేని రాతలు ఆమెను క్రుంగదీశాయి. ‘‘పేరు రావడానికి ప్రతిఫలం ఇదే కనుకైతే అసలు పేరు గురించి ఆలోచించి ఉండేదాన్నే కాదు’’అని కేట్ ఆవేదనగా అన్నారు. ఎప్పుడో పదిహేనేళ్ల వయసులో, తనకన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన నటుడు స్టీఫెన్ ట్రైడర్తో ఆమెకున్న రిలేషన్‌ని కూడా తవ్వి తీసేవారు. నివ్వెరపోయేవారు కేట్. స్టీఫెన్ ఆమె గురువు. ఆమె జీవితంపై అతడి ప్రభావం ఎంతగానో ఉంది. 1997లో స్టీఫెన్ బోన్ క్యాన్సర్‌తో మరణించారు. అతడి అంత్యక్రియలకు వెళ్లేందుకు ఆస్కార్ ఆహ్వానాన్ని కూడా పక్కన పెట్టేశారు కేట్. సరే, ఈ గతమంతా ఎలా ఉన్నా.. ‘అమోనైట్’ కేట్ తాజా చిత్రం. అందులో నాయిక పాత్ర. ఆ పాత్ర ఆస్కార్‌కు నామినేట్ అవొచ్చని, అయితే బాగుండునని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. -
‘టైటానిక్’ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది..
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన 'టైటానిక్' సినిమా అంటే ఇష్టం ఉండని వారుండరు. సాధారణంగా ఒక సినిమాను రెండు, మూడు లేదా పదిసార్లకు మించి చూడలేరు. ఒకవేళ చూసిన ఆ సినిమా బోర్ కొట్టేస్తుంది. అయితే ఎన్నిసార్లు చూసిన మళ్లీ చూడాలనిపించే చిత్రం టైటానిక్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. అద్బుతమైన రొమాంటిక్ క్లాసికల్ డ్రామాగా రియల్ సంఘటనగా ఆధారంగా ‘టైటానిక్’ను దర్శకుడు కామెరూన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో షిప్ మునిగిపోతున్న సమయంలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రముఖ హీరో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించారు. ఇక హీరోయిన్గా నటించిన కేట్ విన్స్లెట్ తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కాగా టైటానిక్ వచ్చి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా హీరోయిన్ కేట్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె టైటానిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌నే మలుపుతిప్పిన ఈ సినిమా అంటే అసలు ఇష్టం ఉండదని, ఇప్పుడు ఈ సినిమా చూడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతం కేట్ అవతార్ సీక్వెల్లో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. కాగా టైటానిక్ డైరెక్టర్ కామెరూన్ ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. -
టైటానిక్ చూడ్డం అంటే అసహ్యం: హీరోయిన్
‘టైటానిక్’ సినిమాలోని హీరోయిన్ పేరు మనకు తెలియకపోయినా ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తాము. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది. రొమాంటిక్ డ్రామాలలో కల్ట్ క్లాసిక్ మూవీ అది. ఇందులో నటించిన హీరోయిన్ కేట్ విన్స్లెట్కు ఈ సినిమాతో సూపర్ పాపులారిటీ వచ్చింది. ఆస్కార్‌కు నామినేట్ అయింది కూడా. అయితే తనకు ఎంతో పాపులారిటీ తెచ్చిన సినిమాను చూడటం అంటే అసహ్యం అంటోంది కేట్. ఈ సినిమాను ఇప్పుడు సిగ్గుపడకుండా చూడలేనని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ( గ్రామీ అవార్డ్స్ వాయిదా) కాగా, 1997లో రిలీజైన ఈ సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. రెనాల్డో డెకాప్రియో, కేట్ విన్స్లెట్లు ప్రధాన పాత్రల్లో నటించారు. 14 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ సినిమా 2 అవార్డులను సొంతం చేసుకుంది. ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అవతార్’ సీక్వెల్లో కేట్ నటిస్తున్నారు. -
ఏడు నిమిషాలు నీటిలోనే!
ప్రస్తుతం హాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘అవతార్’ సిరీస్ ఒకటి. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘టైటానిక్’ ఫేమ్ కేట్ విన్స్లెట్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా అరుదైన రికార్డు సృష్టించారు కేట్. ‘అవతార్’ సీక్వెల్స్ కథాంశం ప్రకారం అండర్ వాటర్ (నీటి లోపల) కూడా చిత్రీకరణ జరిపారు. ఇందులో భాగంగా కేట్ విన్స్లెట్ నీటి లోపల 7 నిమిషాల 14 సెకన్లు ఉన్న ఓ సన్నివేశంలో నటించారు. దీనికోసం సుమారు నాలుగువారాల పాటు శిక్షణ తీసుకున్నారు. ఈ సన్నివేశం కోసం ఏడు నిమిషాలు పాటు ఊపిరి ఆపుకున్నారామె. సినిమా చిత్రీకరణల్లో ఇదో రికార్డ్ అని హాలీవుడ్ అంటోంది. గతంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం టామ్ క్రూజ్ ఆరు నిమిషాల పాటు ఊపిరి ఆపుకుంటూ అండర్‌వాటర్ సీన్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు క్రూజ్ రికార్డ్‌ను కేట్ బద్దలు కొట్టేశారు. ‘ఈ రికార్డ్ బద్దలు కొట్టానని నాకు ఇటీవలే తెలిసింది’ అన్నారు కేట్ విన్స్లెట్. ‘అవతార్ 2’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. -
అతనికి అంత సీన్ లేదు!
2009... ‘ది రీడర్’ సినిమాకు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఉత్తమ నటిగా ఆస్కార్‌కు ఎంపికయింది. ఆస్కార్ అందుకునే రోజు స్పీచ్‌లో హార్వీ వెయిన్‌స్టీన్ గురించి మాట్లాడమని ఆమెపై అందరూ ఒత్తిడి తెచ్చారు. హార్వీ ఆ సినిమాకు ఫైనాన్స్ అందించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించాడు. అయితే, కేట్ మాత్రం అతని గురించి మాట్లాడనంటే మాట్లాడను అని చెప్పింది. నిజంగానే స్పీచ్‌లో హార్వీకి కేట్ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎనిమిదేళ్లు గడిచాయి. ఇప్పుడు హార్వీ వెయిన్‌స్టీన్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి.. ఎక్కడ చూసినా! కారణం, అవకాశాల కోసం తన వద్దకు వచ్చిన అమ్మాయిలపై హార్వీ లైంగిక దాడికి పాల్పడడమే! 2009లో ఆస్కార్ అవార్డు అందుకుంటూ తాను హార్వీ పేరు ఎందుకు ఎత్తలేదన్న విషయాన్ని కేట్ విన్స్లెట్ ఇప్పుడు బయటపెట్టింది. అందరూ కంప్లైంట్ చేస్తున్నట్లే హార్వీ లాంటి వాడిని భరించడం కష్టం అంది కేట్. కేట్ మొదటి సినిమా ‘హెవెన్లీ క్రియేచర్స్’కు హార్వీ ఓ నిర్మాత. ‘‘ఆ సినిమా అప్పట్నుంచి ఎప్పుడు నన్ను కలిసినా ‘నీకు మొదటి అవకాశం నేనే ఇచ్చా!’ అంటూండేవాడు. వాడు నాకు ఆఫర్ ఇవ్వడమేంటి? నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. అదే సినిమాకు మూడు సార్లు ఆడిషన్ ఇచ్చా. ఎప్పుడు కలిసినా రూడ్‌గా మాట్లాడేవాడు. అయితే నాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే సీన్ లేదతనికి. కావాలనే పట్టుబట్టి ఆస్కార్ వేడుకలో హార్వీ గురించి మాట్లాడలేదు..’’ అని చెప్పుకొచ్చింది కేట్. -
‘టైటానిక్’ రీ–యూనియన్
‘‘జేమ్స్ కేమరూన్ సినిమాలో మళ్లీ నటించే అవకాశం వస్తే మాత్రం ఈసారి ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతా!’’ 20 ఏళ్ల క్రితం, తన 22 ఏళ్ల వయసులో కేట్ విన్స్లెట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ‘టైటానిక్’ సినిమా బ్లాక్‌బస్టర్ అయిన సందర్భంగా అందులో నటించిన కేట్, ఆ సినిమా దర్శకుడు జేమ్స్ కేమరూన్‌తో సినిమా అంటే ఏ స్థాయిలో కష్టపడాలో చెబుతూ సరదాగా ఈ మాట అన్నారు. ‘టైటానిక్’ 1997లో విడుదలైతే.. ఈ ఇరవై ఏళ్లలో కేట్ విన్స్లెట్ చాలా సినిమాల్లో నటించి, తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు. మరోపక్క దర్శకులకే ఒక మార్గదర్శకుడు, వరల్డ్ పాపులర్ డైరెక్టర్‌గా ఎదిగిన జేమ్స్ కేమరూన్ మాత్రం ఈ ఇరవై ఏళ్లలో ఒకే ఒక్క సినిమా తీశారు. అదీ 2009లో వచ్చిన సినిమా వండర్ ‘అవతార్’. ‘అవతార్’ విడుదలైన ఇన్నేళ్లకు ఆ సినిమాకు నాలుగు సీక్వెల్స్ రెడీ చేస్తోన్న కేమరూన్ ప్రస్తుతం ‘అవతార్ 2’ పనులను మొదలుపెట్టేశారు. మరి రెమ్యునరేషన్ తన మార్కెట్ కంటే ఎక్కువే అడిగారో లేదో కానీ కేట్ విన్స్లెట్ ‘అవతార్ 2’లో నటిస్తున్నారు. అయితే ఇందులో ఆమెది కీ రోల్ మాత్రమే! కథను మలుపు తిప్పే పాత్రట. ఈ సినిమా కోసమే ప్రస్తుతం డైవింగ్ కూడా నేర్చుకుంటున్నారు కేట్! 2020 డిసెంబర్లో ‘అవతార్ 2’ విడుదల కానుంది. -
జాక్ చనిపోయి ఉండాల్సింది కాదు!
‘రోజ్... నువ్వు బతకాలి. నాకోసం నువ్వు బతకాలి’. ‘జాక్ నువ్వు లేకపోతే నేను బతకలేను. నాకు నువ్వు కావాలి’ ‘రోజ్.. నాకు నువ్వు బతకడమే కావాలి.. నన్ను వదిలెయ్. నా చేయి వదిలేయ్’. రోజ్ వదల్లేక వదల్లేక జాక్ చేతిని వదిలేస్తుంది. ‘టైటానిక్’ సినిమా చివర్లో గాఢ ప్రేమికులు జాక్–రోజ్ల సంఘర్షణ ఇది. బండరాయిని ఢీ కొని, ప్రమాదానికి గురైన టైటానిక్ ఓడ సాక్షిగా సముద్రంలోనే సమాధి అయినవాళ్లు, ప్రాణాలను కాపాడుకున్నవాళ్లూ ఉన్నారు. విరిగిపోయిన ఓ ముక్క మీద రోజ్ ఉంటుంది. జాక్ మునిగిపోతాడు. వాళ్ల ప్రేమ అలా విషాదంగా ముగిసిపోతుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘టైటానిక్’లో లియొనార్డో డికాప్రియో (జాక్), కేట్ విన్స్లెట్ (రోజ్) తమ నటనతో మైస్మరైజ్ చేశారు. సినిమా చూసిన వాళ్లందరూ దర్శకుడు జేమ్స్ కేమరూన్ కొంచెం కనికరించి, జాక్‌ని బతికించి ఉంటే బాగుండేదనుకున్నారు. కేట్ విన్స్లెట్ మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న కేట్ ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. ‘‘విరిగిన ముక్క మీద జాక్కి కూడా చోటు ఉంది. కానీ, జేమ్స్ కామెరూన్ అతన్ని చనిపోయినట్లు చూపించాలనుకున్నారేమో. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, సినిమా విడుదలైన 20 ఏళ్లకు జాక్ చేతిని రోజ్ వదలాల్సింది కాదు అనిపిస్తోంది’’ అన్నారు కేట్. అంత గాఢమైన ప్రేమకథలో నటించారు కాబట్టి.. ‘టైటానిక్’ తీస్తున్న సమయంలో ఒకరి పట్ల మరికొరికి ఆకర్షణ ఏదైనా ఉండేదా? అన్న ప్రశ్నకు –‘‘అదేంటో కానీ, మా మధ్య అలాంటిదేం జరగలేదు. అప్పుడు మేమిద్దరం చాలా చిన్నవాళ్లం. సినిమాలో గాఢమైన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి, మా మధ్య ఎట్రాక్షన్ మొదలై ఉంటుందని ఊహించారు. ఇప్పటికీ ఆ ఊహలోనే ఉన్నారు. బట్.. సారీ మా మధ్య అలాంటిదేం లేదు. 20 ఏళ్లుగా మేం మంచి స్నేహితులుగా ఉండిపోయాం’’ అన్నారు కేట్ విన్స్లెట్. -
20 ఏళ్ల తరువాత అవతార్ సీక్వల్ లో.!
టైటానిక్.. విడుదలైన ప్రతీచోటా సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హీరో హీరోయిన్లు గా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్ లెట్ లా జీవితాలను మార్చేసింది. అయితే సినిమా రిలీజ్ అయిన ఇరవైయ్యేళ్ల తరువాత మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది. అవతార్ సినిమాతో మరో భారీ విజయాన్ని సాధించిన కామరూన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కేట్ విన్స్ లెట్ మరోసారి కామరూన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాను 2020 డిసెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అవతార్ 2తో పాటు 3, 4, 5లను కూడా రూపొందిస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. రెండో భాగంలో నటించనున్న కేట్ విన్స్ లెట్ తరువాత సీక్వల్స్ లో నటిస్తుందీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. -
దేవుడిచ్చిన వరం: టైటానిక్ నటి
లాస్ ఏంజెలిస్: విఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ 1997లో తెరకెక్కించిన చిత్రం టైటానిక్. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అస్కార్ వేడుకల్లో అవార్డుల పంట పండించింది. ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లేట్లు జీవితాంతం టైటానిక్ విజయాన్ని మరిచిపోరు. రెండు దశాబ్దాలు గడిచినా కేట్, డికాప్రియోల రిలేషన్‌పై హాలీవుడ్లో వదంతులు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా నటుడు డికాప్రియోతో తన రిలేషన్‌ను షేర్ చేసుకున్నారు. 'టైటానిక్ మూవీ తర్వాత మా ఇద్దరికి చాలా గుర్తింపు దక్కింది. ఇప్పటికీ మా ఇద్దరినీ ప్రేక్షకులు గుర్తుంచుకోవడానికి కారణం టైటానిక్. ఆ మూవీ షూటింగ్లో ఏర్పడ్డ మా స్నేహబంధం నేటికీ కొనసాగుతోంది. మేం ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇంకా చెప్పాలంటే డికాప్రియో నాకు కుటుంబసభ్యుడు లాంటివారు. అతడితో స్నేహం దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. వాస్తవానికి మాపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి టైటానిక్ క్లైమాక్స్‌లో జరిగినదే నిజ జీవితంలోనూ జరిగిందంటూ' నటి కేట్ చమత్కరించారు. -
వార్ డ్రామాలో టైటానిక్ బ్యూటీ
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మరో చాలెంజింగ్ రోల్ లో నటించనుంది. టైటానిక్, హెవెన్లీ క్రీచర్స్, లిటిల్ చిల్డ్రన్, స్టీవ్ జాబ్స్ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న వార్ డ్రామాలో నటించేందుకు అంగీకరించింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ విలేఖరి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యుద్ధ సమయంలో సాహసోపేతంగా వ్యవహరించి నాజీల కాన్నన్ ట్రేషన్ క్యాంపులు, అక్కడ వారు విధించే శిక్షలకు సంబంధించిన ఫోటోలను సాధించిన అమెరికా ఫొటోగ్రాఫర్ లీ మిల్లర్ బయోపిక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిల్లర్ జీవితంపై రాసిన 'ద లైవ్స్ ఆఫ్ లీ మిల్లర్' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
చిన్నప్పుడు నన్ను డుంబు అనేవాళ్లు: నటి
న్యూయార్క్: తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత కేట్ విన్సెలెట్ పంచుకుంది. తాను చిన్నతనంలో ఎంతో బొద్దుగా ఉండేదాన్నని అందరూ తనను ఆటపట్టించేవారని చెప్పింది. తనను ఫాలో అవుతూ, తనలాగే హావభావాలు పలికిస్తూ ఏడిపించేవారని తెలిపింది. లండన్‌లోని వీ డే అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాలు చెప్పింది. ‘నేనెప్పుడూ నన్ను ఇతరులతో పోల్చుకునేదాన్ని. వాళ్లంతా నన్ను డుంబు అని పిలుస్తూ టీజ్ చేసే వాళ్లు. కప్‌బోర్డులో పెట్టి నావైపు చూస్తూ తెగ నవ్వుతుండేవారు. నేను బొద్దుగా ఉండి అందంగా కనిపించకపోయేదాన్ని. అయితే, చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఇష్టం. ఈ విషయంలో నేను చాలా లక్కీ అని చెబుతుండేదాన్ని. స్కూళ్లో ప్రదర్శనలకోసం ప్రతిసారి ఆడిషన్‌కు వెళ్లే దాన్ని. నాకెప్పుడు మంచి పాత్రలు రాలేదు. కానీ అలాంటి విషయాలు నేను పట్టించుకోలేదు. ముసలి, కప్ప, డార్క్ ఫెయిరీలాంటి పాత్రలు కూడా చాలా బాగా చేసేదాన్ని ఒకసారి కప్పడాన్స్ కూడా చేశాను. దానిని ఇప్పటికే నేను ఇష్టపడతాను. నాకు నటనంటే పిచ్చి. అది చిన్నదా పెద్దదా అనే విషయం మాత్రం అస్సలు చూడను. నేను గొప్పగా ఉండాలని అనుకుంటాను. అందుకే ప్రతిక్షణం నేర్చుకుంటూనే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు. -
పెళ్లి చేసుకో.. మంచి తండ్రివి అవుతావు!
20 ఏళ్ల అనుబంధం వాళ్లది. ఎప్పుడూ కలిసినా ఆత్మీయంగా హత్తుకునే చక్కని స్నేహబంధం వాళ్లది. 'టైటానిక్' చిత్రంతో వెండితెరపై మెరిసిన ఆ జంటే జాక్-రోజ్ అలియాస్ లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లేట్. 22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం లియో ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ శుభసందర్భంలో అందరూ ఆయనను అభినందనలతో ముంచెత్తగా.. ఆయన సన్నిహితురాలైన కేట్ మాత్రం అభినందనలతోపాటు కొన్ని ఆత్మీయమైన ముచ్చట్లూ పంచుకుంది. 'ఒంటరిగా ఇంకెంతకాలం జీవితాన్ని గడుపుతావు.. తొందరగా పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంభించు' అని ఆత్మీయురాలిగా సలహా ఇచ్చింది. లియో ఆస్కార్ గెలువడంతో తనకే ఆ పురస్కారం వచ్చినంత ఆనందంలో మునిగిపోయిన కేట్.. ఈ సందర్భంగా అతనికి వైవాహిక జీవితం గురించి సలహాలు కూడా ఇచ్చిందని ఆమె సన్నిహితులు 'హాలీవుడ్లైట్.కామ్'కు తెలిపారు. 'లియో తన కలను కూడా నెరవేరిస్తూ చూడాలని కేట్ కోరుకుంటోంది. అందుకే పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంభించమని అతనికి సూచించింది. పిల్లలకు లియో మంచి తండ్రి కాగలడు అన్న విషయంలో కేట్ కు ఎలాంటి సందేహం లేదు' అని ఆమె సన్నిహితులు తెలిపారు. తండ్రి బాధ్యత ఎంతో బావుంటుందని, ఆ పాత్రతో ఒక్కసారి ప్రేమలో పడితే, నువ్వు తప్పకుండా దానిని ఆస్వాదిస్తావని లియోకు కేట్ వివరించిందన్నారు. నిజానికి లియోనార్డో మంచి రసికుడు. ఆయనకు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఎవరైనా భార్యగా సరిపోతారో లేదో తాను వచ్చి చెక్ చేస్తానని ఆమె లియోతో జోక్ కూడా చేసిందని వారు వివరించారు. -
ఆ విషయంలో ఎప్పుడూ అవమానాలే!
కేట్ విన్స్లెట్ పేరు చె బితే ఎవరికైనా గుర్తొచ్చే సినిమా ‘టైటానిక్’. అప్పట్లో కుర్రకారు హృదయాలను మత్తెక్కించిన ఈ భామను చిన్నతనంలో ఎవరూ ఇష్టపడేవారు కాదట. దానికి కారణం పెద్దయ్యాక ఉన్నంత అందంగా కేట్ చిన్నప్పుడు ఉండకపోవడమే. ఇటీవల ఓ సందర్భంలో ఈ బ్యూటీయే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘నా అందం విషయంలో నాకెప్పుడూ అవమానాలు ఎదురయ్యేవి. నా టీనేజ్‌లో నా గురించి కనీసం ఒక్కరు కూడా పాజిటివ్‌గా మాట్లాడిన అనుభవం నాకు లేదు. కొంచెం వయసు పెరిగాక అందంగా తయారయ్యాను. అప్పట్నుంచీ నాకే విసుగు పుట్టేంత అభినందనలు వచ్చాయి. అయితే, ఆ అభినందనలు రాకముందు.. నాలో ఓ పట్టుదల ఉండేది. బాహ్య సౌందర్యం ప్రధానం కాదు.. ప్రతిభే ముఖ్యం అనుకున్నాను. అందుకే, ఏ రంగంలోకి అడుగుపెట్టినా ప్రతిభను నమ్ముకుని పైకి రావాలనుకున్నాను. నా ప్రతిభకు అందం కూడా తోడవ్వడంతో అందరి మెప్పు పొందగలిగాను’’ అన్నారు. -
మేం అన్నివేళలా అందంగా ఉండం
లాస్ ఏంజెల్స్: టైటానిక్ భామ కేట్ విన్స్లెట్ (40) అమ్మాయిలకు ఓ బ్రహ్మాండమైన సత్యం చెప్పింది. మెరిసే కళ్లతో, అద్భుతమైన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ యువతులకు ఆసక్తికరమైన సందేశాన్నిస్తోంది. వెండితెర మీద, అవార్డు ఫంక్షన్లలోను కళ్లు చెదిరే అందంతో అందరినీ ఆకట్టుకునే తమలాంటి సెలబ్రిటీలు.. ఎప్పుడూ అంత అందంగా ఉంటారన్న భ్రమలు పెట్టుకోవద్దని తెలిపింది. అవార్డు ఫంక్షన్లలోనూ, రెడ్ కార్పెట్ మీద అడుగులు వేసేటపుడు ఉన్న అందం.. అన్నివేళలా ఉండదని పేర్కొంది. వృత్తి నిర్వహణలో భాగంగా తాము అలా మెరవక తప్పదని, మిగతా సమయంలో అందరిలాగే సాధారణంగానే ఉంటామని, ఈ విషయాన్ని యువతులు గ్రహించాలని సూచించింది. ఈ విషయాన్ని ఈ తరం యువతులకు చెప్పడం చాలా ముఖ్యమైందిగా తాను భావిస్తున్నానంది. టైటానిక్ మూవీలో రోజ్గా అందరి మదిలో నిలిచిపోయిన ఈ భామ మరో విషయాన్నికూడా తన అభిమానులతో పంచుకుంది. తాను చిన్నపుడు చాలా బొద్దుగా ఉండేదాన్నిని, అందరూ తనను చూసి ఆట పట్టించేవారని తెలిపింది. హీరోయిన్ అయ్యే సమయానికి బరువు తగ్గించుకుని నాజూగ్గా తయారైనట్లు చెప్పింది. -
అదే మ్యాజిక్‌లా పనిచేసింది
హాలీవుడ్లో స్టార్‌గా ఎదగాలనుకుంటే ఆంగ్లం ధారాళంగా వస్తే చాలు అని అంటున్నారు కేట్ విన్స్లెట్. బ్రిటన్ నుంచి వచ్చి, హాలీవుడ్‌లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కేట్ ‘టైటానిక్’ అనే ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాలను దోచేసుకున్నారు. ఏ భాషా నటులకూ లేని సౌకర్యం ఇంగ్లిషు యాక్టర్స్‌కు ఉందటున్నారామె. ఇప్పటికే హాలీవుడ్‌ను ఏలుతున్న ప్రముఖ నటుల్లో చాలా మంది బ్రిటన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లే. ‘‘మొదట్లో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు నా ఇంగ్లీషు ఉచ్చారణ విని నేను అమెరికాకు చెందిన అమ్మాయినేమో అనుకున్నారు. చాలా ట్రైనింగ్ తీసుకుని వచ్చిన అమ్మాయిలా వాళ్లకు కనిపించాను. అదే నా కెరీర్ మీద మ్యాజిక్‌లా పనిచేసింది’’ అని కేట్ చెప్పుకొచ్చారు., -
తలుచుకుంటేనే రక్తం ఉడికిపోతోంది... - కేట్ విన్స్లెట్
వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్... ఇవి లేకుండా ఇప్పుడు ప్రపంచాన్ని ఊహించలేం. అంతలా మానవ జీవితాల్లోకి చొరబడిపోయిన సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో, అన్ని సైడ్ ఎఫెక్టులు కూడా గ్యారెంటీ. ఈ ఎఫెక్టులే తల్లిదండ్రుల పాలిట శాపంగా తయారయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ సామాజిక మాధ్యమాల దుష్ర్పభావం తమ పిల్లల మీద పడకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. హాలీవుడ్ తార కేట్ విన్స్లెట్ అయితే ఏకంగా ఇంట్లో నెట్‌ను నిషేధించారు. ఫోన్ కూడా అవసరం ఉన్నప్పుడే వాడాలని పిల్లలకు నిబంధన విధించారు. ‘‘సోషల్ మీడియా గురించి తలుచుకుంటే రక్తం ఉడికిపోతోంది. చాలా మంది సెల్ఫీలు, తాము దిగిన ఫొటోలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేసుకుంటారు. ఎదుటివాళ్ల కామెంట్స్ గురించి ఎదురుచూస్తూ, వాళ్లకు నచ్చేలా తమను తాము మలుచుకుంటారే గానీ తమకు నచ్చినట్టుగా మారరు. తినడం, తాగడం అన్నీ మర్చిపోయి సోషల్ మీడియాకి బానిసలవుతున్నారు. నా పిల్లల బాల్యాన్ని ఇలాంటి టెక్నాలజీతో చిదిమేయడం నాకు ఇష్టం లేదు. కష్టమైనా తప్పదు’’ అని చెప్పుకొచ్చారు. -
వార్ ఫొటోగ్రాఫర్‌గా!
‘టైటానిక్’ ఫేం కేట్ విన్స్లెట్ ప్రస్తుతం రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకునే పని మీద ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆ యుద్ధం కీలకాంశంగా రూపొందనున్న ఓ చిత్రంలో నటించనున్నారామె. ప్రఖ్యాత మోడల్, ఫొటో జర్నలిస్ట్ ఎలిజబెత్ లీ మిల్లర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ‘వోగ్’ మ్యాగజైన్ తరఫున వార్ ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు లీ మిల్లర్.యుద్ధానికి ముందు.. యుద్ధం తర్వాత నెలకొన్న మార్పుల తాలూకు ప్రభావం స్త్రీల పై ఎంత ఉంది? అనే విషయాన్ని కవర్ చేశారామె. అప్పట్లో తన కెమెరాలో ఆమె బంధించిన చిత్రాలు ఓ సెన్సేషన్. లీ మిల్లర్ చనిపోయి 38 ఏళ్లయ్యింది. ఇప్పుడామె జీవితం ఆధారంగా తీయనున్న చిత్రంలో టైటిల్ రోల్‌కు కేట్ విన్స్లెట్ అయితేనే బాగుంటుందని ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఆస్ట్రేలియన్ నిర్మాణ సంస్థ హాప్స్కాచ్ ఫ్యూచర్స్ భావించింది. లీ మిల్లర్ తనయుడు ఆంటోని పెన్రోజ్ కూడా తన తల్లి పాత్రకు కేట్ తప్ప వేరే ఎవరూ నప్పరని సదరు నిర్మాణ సంస్థతో అన్నారట. తల్లి జీవితంతో ఆయన రాసిన ‘ది లైవ్స్ ఆఫ్ లీ మిల్లర్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రదర్శకుణ్ణి ఎంపిక చేసే పని మీద ఉన్నారు. లీ మిల్లర్ చనిపోయేనాటికి కేట్ విన్స్లెట్ రెండేళ్ల చిన్నారి. సో.. ఆమె గురించి కేట్కి పూర్తి అవగాహన ఉండే అవకాశం లేదు. అందుకే, ఆంటోని పెన్రోజ్ రాసిన పుస్తకాన్ని చదువుతున్నారట. అలాగే, లీ మిల్లర్ ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ఆమె ఫొటోగ్రాఫ్స్, డైరీలు పరిశీలిస్తున్నారట. -
బాత్రూమ్లో ఆస్కార్... ఇదేం ఆనందం!
ఆ రోజు కేట్ విన్స్లెట్కి నిద్రపట్టలేదు. ఎందుకంటే, ఆ మర్నాడు ఆస్కార్ అవార్డ్ విజేతల ప్రకటన జరుగుతుంది. బంగారు బొమ్మ దక్కుతుందా? పదే పదే ప్రశ్నించుకున్నారు. రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. మర్నాడు ఎన్నో ఆశలతో అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లారు. బంగారు బొమ్మను దక్కించుకున్నారు. తెగ ఆనందపడ్డారు. అంతలోనే డీలా పడ్డారు. ఇంట్లో ఆస్కార్ ఎక్కడ పెట్టాలి? అని డైలమాలో పడ్డారు. హాలులోని షోకేస్‌లో పెడితే, వచ్చినవాళ్లంతా అవార్డును తాకుతారు. దొంగిలించే ఆస్కారం కూడా లేకపోలేదు. కష్టపడి తెచ్చుకున్న అవార్డును దొంగలపాలు చేయడమా? ఊహూ.. అయితే ఆస్కార్ అవార్డ్ పదిలంగా ఉండే చోటు ఏది? అని తీవ్రంగా ఆలోచించారు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అవార్డుని తీసుకెళ్లి బాత్రూమ్లో పెట్టేశారు. ఇదేం ఆనందం అనుకుంటున్నారా? బాత్రూమ్కు వెళ్లినవాళ్లు ముందు పని కానిస్తారు. ఏ పని చేసినా చేతులు తడి కావడం ఖాయం. ఆ తడి చేతులతో ఆస్కార్‌ని ముట్టుకోరు కదా. ఆ విధంగా ఇంట్లోవాళ్ల బారి నుంచి, ఇంటికొచ్చే అతిథుల బారి నుంచి కూడా ఆస్కార్‌ను కాపాడుకోవచ్చన్నది కేట్ విన్స్లెట్ ఆలోచన. ఇక, దొంగలొచ్చారనుకోండి.. బాత్రూమ్లో విలువైన వస్తువులు ఉంటాయనుకోరుగా.. సో.. ఆస్కార్ సేఫ్‌గా ఉంటుందనుకుని కేట్ మురిసిపోయారు. 2009లో ‘ది రీడర్’ చిత్రానికిగాను ఆస్కార్ గెల్చుకున్నప్పుడు తాను చేసిన ఈ తతంగాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేట్ విన్స్లెట్ గుర్తు చేసుకున్నారు.