league match
-
T20 WC: పాక్‌పై గెలిచి సెమీస్‌కు న్యూజిలాండ్.. భారత్ ఇంటికి
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్‌కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. గెలిపించిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్‌పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్‌లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది. అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్‌ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. -
T20 World Cup 2022: దర్జాగా సెమీస్‌కు...
గత ఏడాది టి20 వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే ఇంటికొచ్చిన భారత్ ఈసారి టోర్నీలో లీగ్ టాపర్‌గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా చిన్న జట్లను తేలిగ్గా తీసుకోలేదు. పెద్ద జట్లతో గాభరా పడలేదు. ప్రతీ పోరు విలువైందన్నట్లుగానే ఆడింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్లు, బౌలర్లు చక్కగా రాణించారు. సమష్టి బాధ్యత కనబరిచారు. దీంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా మారింది. గురువారం అడిలైడ్‌లో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో రోహిత్ శర్మ బృందం సమరానికి సై అంటోంది. మెల్బోర్న్: సూర్యకుమార్ యాదవ్‌ను సహచరులంతా అతని పేరులోని మూడక్షరాలతో స్కై (ఎస్కేవై) అంటారు. ఈ ప్రపంచకప్‌లో అతను కూడా ఆ పేరుకు (ఆకాశం) తగ్గట్లే హద్దేలేని ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తున్నాడు. అభిమానుల్ని అలరిస్తున్నాడు. జింబాబ్వేతో పోరులో అయితే ‘సూపర్ సండే’ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్య (25 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపుల సునామీతో... ‘సూపర్ 12’ గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై జయభేరి మోగించి 8 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరిపించాడు. సీన్ విలియమ్స్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బర్ల్ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), రజా (24 బంతుల్లో 34; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. అశ్విన్ (3/22), షమీ (2/14), హార్దిక్ పాండ్యా (2/16) ప్రత్యర్థిని మూకుమ్మడిగా దెబ్బకొట్టారు. సూర్య ప్రతాపం... ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో ‘భారత 360’ సూర్య బ్యాటింగ్ ఓ లెవెల్లో వుంది. ఈ మ్యాచ్‌లో అది మరో స్థాయికి చేరింది. సూర్య 12 ఓవర్ ఆఖరిబంతికి క్రీజులోకి వచ్చాడు. అప్పుడు టీమిండియా స్కోరు (87/2) వందయినా కాలేదు. అతను రాగానే రాహుల్ అవుటయ్యాడు. అవకాశమిచ్చిన రిషభ్ పంత్ (3) చేజార్చుకున్నాడు. స్కోరు 101/4గా ఉన్న దశలో జింబాబ్వే సంచలనంపై ఆశలు పెట్టుకోకుండా సూర్యకుమార్ రెచ్చిపోయాడు. కొన్నిషాట్లయితే ఊహకే అందవు. ఆఫ్‌సైడ్‌కు దూరంగా వెళుతున్న బంతుల్ని ఆన్‌సైడ్‌లో సిక్సర్లుగా మలచడం అద్భుతం. 15 ఓవర్లలో 107/4గా ఉన్న స్కోరు అతని సునామీ ఇన్నింగ్స్‌తో 186/5గా మ్యాచ్ ఛేంజింగ్ ఫిగర్ అయ్యింది. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో సూర్య వరుసగా 2 బౌండరీలు కొడితే పాండ్యా మరో ఫోర్ కొట్టాడు. 17వ ఓవర్ వేసిన ఎన్గరవా ఆఫ్‌సైడ్‌లో వేసిన వైడ్ యార్కర్లను 4, 6గా కొట్టడం మ్యాచ్‌కే హైలైట్. చటారా ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బాదిన సిక్సర్, ఎన్‌గరవ ఆఖరి ఓవర్లో వరుసగా సూర్య 6, 2, 4, 6లతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో సూర్య (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. అంతకుముందు ఓపెనర్లలో రోహిత్ (15) విఫలమైనా... రాహుల్, కోహ్లి (25 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి స్కోరును నడిపించాడు. 34 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాహుల్ అర్ధశతకం సాధించాడు. మన పేస్‌కు విలవిల జింబాబ్వే బ్యాటర్లు లక్ష్యఛేదనను అటుంచి... అసలు క్రీజులో నిలిచేందుకే కష్టపడ్డారు. టాప్, మిడిలార్డర్ భారత పేస్ బౌలింగ్‌కు విలవిల్లాడింది. ఓపెనర్లు మదెవెర్ (0)ను భువీ, ఇర్విన్ (13)ను హార్దిక్, చకబ్వా (0)ను అర్‡్షదీప్, సీన్ విలియమ్స్ (11)ను షమీ... ఇలా వరుసలోని నలుగురు బ్యాటర్స్‌ను నలుగురు బౌలర్లు దెబ్బకొట్టడంతో జింబాబ్వే ఓటమివైపు నడిచింది. సికిందర్ రజా, రియాన్ బర్ల్ చేసిన పరుగులు జట్టు వంద దాటేందుకు ఉపయోగపడ్డాయి. ఆఖరి వరుస బ్యాటర్స్ అశ్విన్ ఉచ్చులో పడటంతో ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మసకద్జా (బి) సికందర్ 51; రోహిత్ (సి) మసకద్జా (బి) ముజరబాని 15; కోహ్లి (సి) బర్ల్ (బి) విలియమ్స్ 26; సూర్యకుమార్ (నాటౌట్) 61; పంత్ (సి) బర్ల్ (బి) విలియమ్స్ 3; పాండ్యా (సి) ముజరబాని (బి) ఎన్‌గరవ 18; అక్షర్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–87, 3–95, 4–101, 5–166. బౌలింగ్: ఎన్‌గరవ 4–1–44–1, చటార 4–0–34–0, ముజరబాని 4–0–50–1, మసకద్జా 2–0–12–0, బర్ల్ 1–0–14–0, సికందర్ రజా 3–0–18–1, సీన్ విలియమ్స్ 2–0–9–2. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెర్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 0; ఇర్విన్ (సి అండ్ బి) పాండ్యా 13; చకబ్వా (బి) అర్‡్షదీప్ 0; విలియమ్స్ (సి) భువనేశ్వర్ (బి) 11; సికందర్ (సి) సూర్య (బి) పాండ్యా 34; టోని (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 5; బర్ల్ (బి) అశ్విన్ 35; మసకద్జా (సి) రోహిత్ (బి) అశ్విన్ 1; ఎన్‌గరవ (బి) అశ్విన్ 1; చటార (సి అండ్ బి) అక్షర్ 4; ముజరబాని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–28, 4–31, 5–36, 6–96, 7–104, 8–106, 9–111, 10– 115. బౌలింగ్: భువనేశ్వర్ 3–1–11–1, అర్‡్షదీప్ 2–0–9–1, షమీ 2–0–14–2, పాండ్యా 3–0– 16–2, అశ్విన్ 4–0–22–3, అక్షర్ 3.2–0–40–1. 1: క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టి20ల్లో 1,000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్య 28 టి20 మ్యాచ్‌లు ఆడి 1,026 పరుగులు చేశాడు. 21:ఈ ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20ల్లో భారత్ సాధించిన విజయాలు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ (2021లో 20) పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. -
FIH Pro League: ‘షూటౌట్’లో బెల్జియంపై భారత్ విజయం
ఆంట్వర్ప్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ బెల్జియం జట్టుతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో గెలిచింది. ‘షూటౌట్’లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్, అభిషేక్, లలిత్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్... బెల్జియం తరఫున బొకార్డ్, టాన్‌గయ్, సిమోన్, ఆర్థర్ సఫలమయ్యారు. బెల్జియం ప్లేయర్ నికోలస్ కొట్టిన ఐదో షాట్‌ను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుకు న్నాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ప్రస్తుతం భారత్ 29 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. బెల్జియం మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1–2తో ఓడిపోయింది. -
ఆసీస్‌ను నిలువరించేనా?
ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు గెలుస్తూ, ఓడుతూ సాగిన పయనం ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో మిథాలీ బృందం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. నాలుగు మ్యాచ్‌లాడిన భారత్ రెండు గెలిచి మరో రెండు ఓడింది. ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే. ఇప్పుడు సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రతీ పోరు కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియాతో కఠిన సవాల్‌కు మిథాలీ సేన సిద్ధమైంది. అయితే నిలకడలేమి జట్టును ఆందోళన పరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ రంగాల్లో భారత్ స్థిరంగా రాణించాలి. అప్పుడే మిగతా మ్యాచ్‌ల్ని గెలవొచ్చు. సెమీస్ చేరొచ్చు. లేదంటే లీగ్ దశలోనే వెనుదిరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు 12 సార్లు తలపడ్డాయి. భారత్ 3 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓవరాల్‌గా ఈ రెండు జట్ల మధ్య 49 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 10 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. -
విజయంతో ముగించాలని...
ఢాకా: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను విజయంతో ముగించేందుకు డిఫెండింగ్ చాంపియన్ భారత హాకీ జట్టు సిద్ధమైంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన టీమిండియా నేడు జరిగే తన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. కొరియాతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన భారత్... అనంతరం బంగ్లాదేశ్‌పై 9–0తో, పాకిస్తాన్‌పై 3–1తో గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో చివరిసారిగా జపాన్‌తో తలపడిన భారత్ ఆ మ్యాచ్‌లో 5–3 గోల్స్‌తో విజయం సాధించింది. -
లీగ్‌ల కన్నా అంతర్జాతీయ క్రికెట్‌కే నా ఓటు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చాక లీగ్ క్రికెట్ స్థానంలో అంతర్జాతీయ క్రికెట్‌కే అధిక ప్రాధాన్యమివ్వాలని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సంప్రదాయిక టెస్టు క్రికెట్ ఫార్మాట్లో ఎటువంటి మార్పులు చేయకుండా ఐదు రోజుల మ్యాచ్‌లనే నిర్వహించాలని కోరాడు. ‘కరోనా మహమ్మారి కట్టడి తర్వాత అందరూ లీగ్ క్రికెట్ వైపు మొగ్గుచూపుతారేమో! అలా జరుగకూడదు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ లీగ్‌లకు కేటాయించొద్దు. ప్రపంచ క్రికెట్ గాడిలో పడేందుకు అందరూ అనుకుంటున్న దానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. సమీప భవిష్యత్‌లో ఏం జరుగనుందో ఎవరూ ఊహించలేరు’ అని అశ్విన్ పేర్కొన్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా 350 వికెట్లు దక్కించుకున్న బౌలర్‌గా ఘనత సాధించిన అశ్విన్... టెస్టుల్ని నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదన తనకు నచ్చలేదని చెప్పాడు. ‘సుదీర్ఘ ఫార్మాట్లో నేను సాధించాల్సింది ఇంకా ఉంది. నా శరీరం సహకరిస్తే మరిన్ని ఘనతల్ని అందుకోగలను. ఐసీసీ చెబుతోన్న నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనతో నేనైతే ఆనందంగా లేను. ఈ ఆలోచన మంచిదో, చెడ్డదో విశ్లేషించను గానీ ఒకరోజు ఆటపై కోత వేయడమంటే టెస్టు క్రికెట్ మజాను తగ్గించినట్లే అని నా ఉద్దేశం’ అని అశ్విన్ వివరించాడు. -
భారత్ హ్యాట్రిక్
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0తో జపాన్ను ఓడించి వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై 11–0తో... రెండో మ్యాచ్‌లో పాక్‌పై 4–1తో నెగ్గిన మన్‌ప్రీత్ సింగ్ బృందం మూడో మ్యాచ్‌లోనూ తమ జోరును ప్రదర్శించింది. ప్రతి క్వార్టర్లో గోల్ చేసి జపాన్ను హడలెత్తించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (4, 49, 57వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేయగా... హర్మన్‌ప్రీత్ సింగ్ (17, 21వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. గుర్జంత్ సింగ్ (8వ నిమిషంలో), ఆకాశ్‌దీప్ సింగ్ (36వ నిమిషంలో), సుమీత్ (42వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (45వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో భారత్ తరఫున హ్యాట్రిక్ చేసిన రెండో ప్లేయర్‌గా మన్దీప్ సింగ్ నిలిచాడు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ సింగ్ ఈ ఘనత సాధించాడు. తాజా విజయంతో భారత్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌తో ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడిన భారత్ 18 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని... ఒక మ్యాచ్‌లో ఓడింది. మంగళవారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. ఇటీవలే జకార్తా ఆసియా క్రీడల సెమీఫైనల్లో మలేసియా చేతిలో అనూహ్యంగా ఎదురైన ఓటమికి భారత్ భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి. -
నాకౌట్ ‘బాల్’ మారింది...
సాకర్ ప్రపంచకప్‌లో బంతి మారుతోంది. లీగ్ మ్యాచ్‌ల్లో ఉపయోగించిన బంతి స్థానంలో కొత్తగా ఎరుపు–తెలుపు బంతి రానుంది. ఇప్పటికైతే అడిడాస్ తయారు చేసిన ‘టెల్‌స్టార్ 18’ అనే బంతితో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. నాకౌట్ దశ నుంచి ఈ బంతికి బదులు ‘టెల్‌స్టార్ మెక్టా’ అనే బాల్‌ను వినియోగించనున్నారు. నాకౌట్‌కు చేరిన దేశాల జెండా రంగులు అందులో ప్రతిబింబించేలా టెల్‌స్టార్ మెక్టాను రూపొందించారు. మెక్టా అంటే ‘కల’ అని అర్థం. శనివారం నుంచి ఈ కల మన కళ్లముందు ఆడనుంది. -
భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఎవరో?
కొలంబో : ముక్కోణపు టి20 టోర్నమెంట్లో చివరి లీగ్ మ్యాచ్‌కు ఎప్పుడో కాని ప్రాధాన్యం ఉండదు. ‘నిదహస్ ట్రోఫీ’లో శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ ఆఖరి లీగ్ మ్యాచ్ మాత్రం ఆసక్తికరంగా మారింది. మూడు విజయాలతో భారత్ ఫైనల్‌కు చేరిపోవడం, మిగతా రెండు జట్ల ఖాతాలో ఒక్కొక్క గెలుపే ఉండటంతో ఈ పోరు ‘సెమీ ఫైనల్’ తరహాగా మారింది. దీంతో ఈసారి పైచేయి ఆతిథ్య శ్రీలంకదా? ఇప్పటికే ఒకసారి ఆ జట్టును ఓడించిన బంగ్లాదేశ్దా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ విజేత ఆదివారం జరిగే తుది సమరంలో టీమిండియాను ఎదుర్కోనుంది. ఆడుతున్నది స్వదేశంలో, పైగా స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నీ. ఈ కారణాల రీత్యా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో లంకపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. -
ఫైనల్లో ఇండియా రెడ్
దులీప్ ట్రోఫీ గ్రేటర్ నోయిడా: యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా రెడ్ జట్టు దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. బ్లూ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఆఖరి రోజు కూడా వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా నాలుగు రోజుల్లో కేవలం 78.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పారుుంట్ లభించింది. రెండు మ్యాచ్‌ల ద్వారా ఏడు పారుుంట్లు సాధించిన రెడ్ జట్టు ఫైనల్‌కు చేరగా... ఈ నెల 4 నుంచి ఇండియా బ్లూ, గ్రీన్ జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. -
అభిషేక్ సెంచరీ
► చీర్‌ఫుల్ చమ్స్ 318/5 ► ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: చీర్‌ఫుల్ చమ్స్ బ్యాట్స్‌మన్ అభిషేక్ (73 బంతుల్లో 104; 14 ఫోర్లు, 3 సక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో సోమవారం ఆక్స్ఫర్డ్ బ్లూస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చీర్‌ఫుల్ జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 51 ఓవర్లలో 5 వికెట్లకు 318 పరుగులు చేసింది. జయకిరణ్ (33), కార్తీక్ (68 బ్యాటింగ్) రాణించారు. అంతకు ముందు ఆక్స్ఫర్డ్ బ్లూస్ జట్టు 38,4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. డేవిస్ శామ్యూల్స్ (50) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. చీర్‌ఫుల్ జట్టు బౌలర్ విఘ్నేశ్ 5 వికెట్లతో ఆక్స్పర్డ్ జట్టును కట్టడి చేశాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు: హైదరాబాద్ టైటాన్స్: తొలి ఇన్నింగ్స్ 99 (సులేమాన్ 30; నర్సింహ 3/44, వీర 5/21); రెండో ఇన్నింగ్స్ 107/3 (సల్మాన్ 40); క్లాసిక్ తొలి ఇన్నింగ్స్: 64 (గౌరవ్ శర్మ 6/36). డబ్ల్యుఎంసీసీ: తొలి ఇన్నింగ్స్ 87 (నితిశ్ 4/12, అద్నాన్ 4/30); రెండో ఇన్నింగ్స్ 8/4 (అద్నాన్ 3/0); ఎలిగెంట్: 112 (అజయ్ సింగ్ 4/31). రాజు సీసీ: 188 (అక్షయ్ యాదవ్ 45; బాలరాజు 3/41, రేవంత్ 3/39); హైదరాబాద్ యూనియన్: 70/2. పాషా బీడీ: 413/9 డిక్లేర్డ్(ఫయాజ్ 152, నదీమ్ 115); ఎంసీసీ: 204 (సంతోష్ 81, రుద్ర 45, శ్రీనివాస్ 32); ఫాలో ఆన్: 132/4 (రుద్ర 64 నాటౌట్). -
ప్రిక్వార్టర్స్‌లో ఇటలీ
1-0తో స్వీడన్‌పై గెలుపు యూరో కప్ టౌలస్ (ఫ్రాన్స్): తొలి మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో బెల్జియంను బోల్తా కొట్టించిన ఇటలీ జట్టు... రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. ప్రత్యర్థులు అంచనాలకు మించి రాణించినా.. ఆఖరి నిమిషాల్లో అద్భుతం చేసింది. ఫలితంగా యూరో కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-ఇ లీగ్ మ్యాచ్‌లో ఇటలీ 1-0తో స్వీడన్‌పై గెలిచింది. దీంతో ఆరు పాయింట్లతో ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. స్టార్ స్ట్రయికర్ ఎడెర్ (88వ ని.) ఇటలీ తరఫున ఏకైక గోల్ సాధించాడు. సమఉజ్జీల సమరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు పరస్పరం దాడులు చేసుకున్నా తొలి అర్ధభాగంలో గోల్స్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో ఇటలీ త్రీ మెన్ డిఫెన్స్‌తో వ్యూహాత్మకంగా ఆడింది. స్వీడన్ కీలక ఆటగాడు ఇబ్రమోవిచ్ను అడుగడుగునా నిలువరిస్తూ మ్యాచ్‌లో ఉత్కంఠను పెంచింది. అయితే ఆట మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ఇటలీ తరఫున ఎడెర్ గోల్ చేసి జట్టును ప్రిక్వార్టర్స్‌కు చేర్చాడు. జర్మనీని నిలువరించిన పోలెండ్ పారిస్: ఆద్యంతం హోరాహోరీగా సాగిన జర్మనీ, పోలెండ్ గ్రూప్-సి మ్యాచ్ 0-0తో డ్రా అయ్యింది. ఈ టోర్నీలో గోల్స్ లేకుండా డ్రా అయిన తొలి మ్యాచ్ ఇదే. మ్యాచ్ మొత్తం అత్యం త పటిష్టమైన జర్మనీ అటాకింగ్‌కు పోలండ్ వ్యూహాత్మకంగా చెక్ పెట్టింది. క్రొయేషియా చేజేతులా... సెయింట్ ఎటెన్నా: గ్రూప్ ‘డి’లో భాగంగా చెక్ రిపబ్లిక్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను క్రొయేషియా జట్టు ‘డ్రా’తో ముగించింది. చివరి నిమిషాల్లో చెక్ రిపబ్లిక్ చెలరేగి స్కోరును సమం చేసింది. పెరిసిక్ (37వ ని.), రాకిటిక్ (59వ ని.) క్రొయేషియాకు గోల్స్ అందించారు. చెక్ తరఫున స్కోడా (76వ ని.), నిసిడ్ (90+4) గోల్స్ చేశారు. 86వ నిమిషంలో మైదానంలో కాస్త అలజడి చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఇంజ్యూరీ టైమ్‌లో లభించిన పెనాల్టీని నిసిడ్ (చెక్) గోల్‌గా మలిచి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాడు. -
భారత్‌కు తొలి పరాజయం
లండన్: చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున దేవేందర్ వాల్మీకి (30వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... బెల్జియం జట్టుకు అలెగ్జాండర్ హెండ్రిక్స్ (25వ నిమిషంలో), జెరోమ్ ట్రుయెన్స్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో జరిగిన తొలి మ్యాచ్‌ను 3-3తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌పై 2-1తో నెగ్గిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే నాలుగో మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఆడుతుంది. -
భారత్- జపాన్ మ్యాచ్ డ్రా
డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్లో భారత్, జపాన్ మహిళల హాకీ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1తో డ్రా గా ముగిసింది. భారత్ తరఫున పూనమ్ రాణి (7వ ని.) గోల్ చేయగా... హాజుకీ నగయ్ (19వ ని.) జపాన్‌కు గోల్‌ను అందించి స్కోరును సమం చేసింది. శుక్రవారం జరిగే చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి
డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్‌ను భారత మహిళల హాకీ జట్టు పరాజయంతో ఆరంభించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1-4తో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. భారత్ తరఫున అనురాధా దేవి తోక్చామ్ ఏకైక గోల్ సాధించగా... పిపా హెవార్డ్స్ (18, 47వ ని.), అనితా మెక్లారెన్ (51వ ని.), పెట్రియా వెబ్‌స్టెర్ (53వ ని.)లు కివీస్‌కు గోల్స్ అందించారు. ఉక్కపోత, వేడి వాతావరణం ఉన్నప్పటికీ భారత క్రీడాకారిణులు ఆరంభంలో అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే న్యూజిలాండ్ పదేపదే దాడులు చే స్తూ ఆరో నిమిషంలో రెండు పెనాల్టీ కార్నర్లను సా ధించింది. కానీ భారత డిఫెండర్లు, గోల్ కీపర్ సవితా అద్భుతంగా అడ్డుకట్ట వేశారు. రెండో క్వార్టర్స్‌లో మరింత అటాకింగ్‌కు దిగిన కివీస్ తొలి గోల్ సాధించింది. ఎండ్లు మారిన తర్వాత పుంజుకున్న భారత్ వరుసపెట్టి అవకాశాలను సృష్టించుకున్నా గోల్స్ మాత్రం చేయలేకపోయింది. నాలుగో క్వార్టర్స్‌లో కివీస్ ఏకంగా మూడు గోల్స్ చేసి గెలిచింది. -
భారత జట్లకు మిశ్రమ ఫలితాలు
తైపీ: ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో పురుషుల జట్టు తొలుత జపాన్ చేతిలో 1-2తో ఓడింది. రెండో మ్యాచ్‌లో 3-0తో మకావుపై నెగ్గింది. మరోవైపు మహిళల జట్టు 1-2 తేడాతో మలేసియా చేతిలో ఓటమి పాలైంది. -
కర్ణాటక, ముంబైలకు షాక్
* విజయ్ హజారే ట్రోఫీ రౌండప్ * క్వార్టర్స్‌లో పంజాబ్, ఢిల్లీ బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకకు.. విజయ్ హజారే ట్రోఫీలో షాక్ తగిలింది. గ్రూప్-బిలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా... నాకౌట్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 207 పరుగుల భారీ తేడాతో జమ్మూ అండ్ కాశ్మీర్‌పై నెగ్గింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 50 ఓవర్లలో 5 వికెట్లకు 349 పరుగులు చేసింది. సీఎం గౌతమ్ (109 నాటౌట్) సెంచరీ చేశాడు. కర్ణాటక కెప్టెన్ వినయ్ 20 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేయడం విశేషం. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ 27.3 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. ఈ గ్రూప్‌లో 20 పాయింట్లతో జార్ఖండ్, గుజరాత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. తమిళనాడు ముందంజ గ్రూప్-ఎలో తమిళనాడు, పంజాబ్ చెరో 20 పాయింట్లతో క్వార్టర్స్‌కు చేరాయి. రాజస్తాన్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తమిళనాడు 252 పరుగుల తేడాతో గెలిచింది. సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇదే గ్రూప్‌లో ముంబై తమ ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గెలిచినా 16 పాయింట్లతో నాకౌట్‌కు చేరలేకపోయింది. మరోవైపు గ్రూప్-సిలో ఆంధ్రతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ.. క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆంధ్ర 183 పరుగులకు ఆలౌటైతే.. ఢిల్లీ 184 పరుగులు సాధించింది. ఉన్ముక్త్ చంద్ (118 నాటౌట్) సెంచరీ చేశాడు. ఈ గ్రూప్‌లో విదర్భ, ఢిల్లీ 20 పాయింట్ల చొప్పున సాధించి క్వార్టర్స్‌కు చేరాయి. గ్రూప్-డిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లు నాకౌట్ బెర్త్‌లను సాధించాయి. రెండు జట్లు 16 పాయింట్ల చొప్పున సాధించి ముందుకు వెళ్లాయి. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ 41 పరుగులతో మధ్యప్రదేశ్‌పై నెగ్గింది. ముందుగా హిమాచల్ 295 పరుగులు చేసింది. రిషీ ధావన్ (117 నాటౌట్) సెంచరీ చేయగా, రాబిన్ బిస్త్ (84) రాణించాడు. తర్వాత మధ్యప్రదేశ్ 254 పరుగులకే పరిమితమైంది. -
ముంబై గరుడకు రెండో విజయం
లుధియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ముంబై గరుడ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు యోధాస్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై గరుడ 5-2 బౌట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు యోధాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ రెజ్లర్లు నర్సింగ్ యాదవ్, బజరంగ్ తమ బౌట్లలో గెలిచినా... మిగతా రెజ్లర్లు ఓటమి పాలవ్వడం బెంగళూరు విజయావకాశాలపై ప్రభావం చూపింది. పురుషుల 57 కేజీల బౌట్లో సందీప్ తోమర్ (బెంగళూరు) 0-5తో రాహుల్ అవారే చేతిలో... 125 కేజీల బౌట్లో దావిత్ (బెంగళూరు) 1-4తో లెవాన్ చేతిలో ఓడిపోగా... 61 కేజీల బౌట్లో బజరంగ్ (బెంగళూరు) 6-2తో అమిత్ ధన్కర్పై, 74 కేజీల బౌట్లో నర్సింగ్ యాదవ్ (బెంగళూరు) 6-0తో ప్రదీప్‌పై గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో రీతూ (ముంబై), 53 కేజీల విభాగంలో అడెకురోవ్ (ముంబై), 69 కేజీల విభాగంలో అడెలైన్ గ్రే (ముంబై) తమ ప్రత్యర్థులపై నెగ్గారు. -
కర్ణాటకకు షాక్
ముంబై: వరుసగా రెండేళ్ల పాటు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన కర్ణాటక ఈసారి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మహారాష్ట్రపై కనీసం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా నాకౌట్‌కు అర్హత సాధించే స్థితిలో... కర్ణాటక జట్టు 53 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గ్రూప్ ‘ఎ’లో 24 పాయింట్లతో ఐదోస్థానంలో నిలిచి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. ఈ గ్రూప్ నుంచి విదర్భ (29 పాయింట్లు), బెంగాల్ (28), అస్సాం (26) క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. హర్యానా గ్రూప్ ‘సి’కి పడిపోయింది. గ్రూప్ ‘బి’ టాపర్ ముంబై ఇక గ్రూప్ ‘బి’ నుంచి ముంబై జట్టు అగ్రస్థానం (35 పాయింట్లు)తో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పంజాబ్ (26), మధ్యప్రదేశ్ (24) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు చేరాయి. ఈ గ్రూప్‌లో గుజరాత్ కూడా మధ్యప్రదేశ్‌తో 24 పాయింట్లతో సమంగా నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా ఎంపీ ముందుకెళ్లింది. ఇదే గ్రూప్ నుంచి ఆంధ్ర జట్టు ఆఖరి స్థానంలో నిలవడం ద్వారా గ్రూప్ ‘సి’కి పడిపోయింది. వచ్చే ఏడాది ఆంధ్ర జట్టు హైదరాబాద్‌తో కలిసి గ్రూప్ ‘సి’లో మ్యాచ్‌లు ఆడుకుంటుంది. నాకౌట్‌కు సౌరాష్ట్ర, జార్ఖండ్ ఇక గ్రూప్ ‘సి’ నుంచి సౌరాష్ట్ర, జార్ఖండ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది గ్రూప్ ‘ఎ’... ‘బి’లలో ఆడేందుకు అర్హత సాధిం చాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జార్ఖండ్ 10 వికెట్లతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో 31 పాయింట్లతో సౌరాష్ట్ర (36) తర్వాత రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరింది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్ 8 మ్యాచ్‌ల ద్వారా 8 పాయింట్లు సాధించి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. -
ఫైనల్లో యువ భారత్
రాణించిన సుందర్, పంత్ * అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్‌కతా: వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్ యువ జట్టు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సుందర్ వాషింగ్టన్ (75 బంతుల్లో 50; 6 ఫోర్లు; 2/25) ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 222 పరుగులు చేసింది. హసన్ మిరాజ్ (90 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. సైఫ్ హసన్ (33), సైఫుద్దీన్ (30) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి నెగ్గింది. రిషబ్ పంత్ (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. అమన్‌దీప్ (41), ఇషాన్ కిషన్ (24), విరాట్ సింగ్ (21) తలా కొన్ని పరుగులు జత చేశారు. పంత్, ఇషాన్‌లు 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే బంగ్లా బౌలర్ల ధాటికి ఓ దశలో భారత్ 116 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ దశలో సుందర్, అమన్‌దీప్ ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. -
గాజి మాయాజాలం
* అఫ్ఘాన్‌పై బంగ్లా గెలుపు * అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్‌కతా: స్పిన్నర్ సలే అహ్మద్ షాన్ గాజి (7.4-2-10-6) మాయాజాలానికి అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో అఫ్ఘానిస్తాన్ విలవిలలాడింది. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌పై విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన అఫ్ఘానిస్తాన్ 30.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. హజ్రతుల్లా (32), ఇసానుల్లా (14) ఓ మాదిరిగా ఆడినా.. మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఆరో ఓవర్లోనే స్పిన్నర్‌ను తేవడంతో అఫ్ఘాన్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో 8 మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హసన్ మిరాజ్ 2, సయీద్ సర్కార్ ఒక్క వికెట్ తీశారు. తర్వాత బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 6 వికెట్లకు 89 పరుగులు చేసి నెగ్గింది. సైఫ్ హసన్ (32) టాప్ స్కోరర్. నజ్ముల్ హుస్సేన్ (19), జాకిర్ హసన్ (13) ఫర్వాలేదనిపించారు. జియావుర్, కరీమ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ ఖాతాలో ఐదు పాయింట్లు చేరాయి. సోమవారం విశ్రాంతి దినం తర్వాత మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. -
కోల్‌కతాకు మళ్లీ షాక్
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా జట్టుకు మళ్లీ చుక్కెదురైంది. ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా నార్త్ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 0-1 గోల్ తేడాతో ఓడిపోయింది. ఆట 77వ నిమిషంలో వెలెజ్ చేసిన గోల్‌తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన నార్త్ఈస్ట్ జట్టు చివరి నిమిషం వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గత శనివారం పుణే సిటీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా 0-1తో ఓడింది. గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ 2-1తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో పుణే జట్టు ఆడుతుంది. -
ఎదురులేని యు ముంబా
పుణే : ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినప్పటికీ.. ఆద్యంతం దూకుడుగా ఆడిన యు ముంబా జట్టు ప్రొ కబడ్డీ లీగ్-2లో 12వ విజయాన్ని సాధించింది. పుణేరి పల్టన్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 39-34 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే ఓడిన యు ముంబా ఈ మ్యాచ్‌లో అనూప్ కుమార్, షబీర్ బాపు, రిశాంక్, మోహిత్ చిల్లార్లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. రిజర్వ్‌లో ఉన్న ఆటగాళ్లను బరిలోకి దించింది. తొలి అర్ధభాగంలో ముంబాకు గట్టిపోటీనిచ్చిన పుణేరి స్కోరును 13-13తో సమం చేసింది. రెండో అర్ధభాగంలో ముంబా ఆటగాళ్లు జోరు పెంచారు. పవన్ కుమార్ రైడింగ్‌లో విజృంభించి నిలకడగా పాయింట్లు సాధించడంతో ముంబా జట్టు 36-23తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో పుణేరి తేరుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. ప్రస్తుతం యు ముంబా 60 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 45 పాయింట్లతో తెలుగు టైటాన్స్ రెండో స్థానంలో, 43 పాయింట్లతో బెంగళూరు బుల్స్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
ఆంధ్ర అలవోక విజయం
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో ఆంధ్ర సునాయాస విజయం సాధించింది. జార్ఖండ్‌తో ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. టోర్నీలో ఆంధ్రకిది రెండో విజయం కాగా, ఈ రెండూ సొంతగడ్డపైనే సాధించింది. చివరి రోజు 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసి గెలిచింది. శ్రీకర్ భరత్ (35 బంతుల్లో 25, 3 ఫోర్లు) నిష్ర్కమించగా, ప్రశాంత్ (27 బంతుల్లో 20 నాటౌట్, 3 ఫోర్లు), శ్రీరామ్ (1 నాటౌట్) అజేయంగా నిలిచారు. -
18 ఏళ్ల తర్వాత..
భువనేశ్వర్:హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బోణీ చేసింది. గ్రూప్ బి లో భాగంగా ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 3-2 తేడాతో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన భారత హాకీ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచ కప్ విజేత, ఒలింపిక్ కాంస్య పతక విజేత నెదర్లాండ్స్ ను మట్టికరిపించింది. పటిష్టమైన నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించింది. 1996 బార్సిలోనా ఒలింపిక్స్ లో నెదర్లాండ్స్ ను ఓడించిన భారత్ తరువాత ఆ జట్టుపై విజయాన్ని సాధించలేదు. ప్రస్తుత సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్.. నెదర్లాండ్స్ పై పోరాడి గెలిచి పరువు దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో జర్మనీ చేతిలో, రెండో మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పటిష్టమైన నెదర్లాండ్స్ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3-0తో అర్జెంటీనాపై, రెండో మ్యాచ్‌లో 4-1తో జర్మనీపై విజయం సాధించింది. అయితే లీగ్ మ్యాచ్‌లతో సంబంధం లేకుండా ఈ టోర్నీ బరిలో ఉన్న ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.గ్రూప్ ‘ఎ’లో టాప్‌గా నిలిచే అవకాశమున్న ఇంగ్లండ్‌తో సర్దార్ సింగ్ బృందం ఆడే అవకాశం ఉంది.