lokesh
-
లోకాయుక్త బిల్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. బిల్లులో సవరణలపై లోకేశ్ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక కమిటీలో సీఎం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమావేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా. బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు. మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయడంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే లోకాయుక్తను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజువాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్ ప్రివ్యూకు రద్దుఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్ గ్రాబింగ్ సవరణ బిల్లు, పీడీ యాక్ట్ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి. -
జెన్కోలో ‘రెడ్ బుక్’ రాజ్యం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో)లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత రెండు నెలల్లో 135 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.వీరిలో దాదాపు 90 శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గం వారే ఉండటం గమనార్హం. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లోకేశ్ రెడ్‌బుక్‌లో పేరుందని అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలు! వాస్తవానికి ఏపీజెన్కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నె శ్రీనివాసకుమార్‌కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్ (మినహాయింపు) ఉన్నప్పటికీ... ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తీరును తప్పుబట్టారు. యూనియన్ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని, తమ యూనియన్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. బదిలీలకు గడువు ముగిసిన తర్వాత...ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత... అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్కో యాజమాన్యం... రెండు నెలలుగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎనీ్టటీపీఎస్)తోపాటు విద్యుత్ సౌధ (జెన్కో ప్రధాన కార్యాలయం)లోను పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే రెండు కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రెండు నెలల్లో విద్యుత్ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఎన్టీపీఎస్‌లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా, వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్ యూనియన్ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇ చ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. -
నడిపేది..నడిపించేది లోకేష్.. ఇది వాస్తవం: విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి:నిజానికి,వాస్తవానికి చాలా తేడా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 9) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పకుండా ఉత్తిత్తి హామీలు, సూపర్ డూపర్ సిక్స్‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది ‘నిజం’. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అన్ని తానై నడిపేది, నడిపించేది లోకేష్ అన్నది ‘వాస్తవం’. నిజానికి-వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నటి గీతని అర్ధం చేసుకోవడం ‘ప్రజాధర్మం’ అని ట్వీట్ చేశారు.నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది! చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పకుండా ఉత్తిత్తి హామీలతో సూపర్ డూపర్ సిక్స్ తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది "నిజం".చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అన్ని తానై నడిపేది, నడిపించేది లోకేష్ అన్నది "వాస్తవం".నిజానికి - వాస్తవానికి మధ్య ఉన్న ఆ…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 9, 2024 ఇదీ చదవండి: పాషాణ ప్రభుత్వం.. దుర్మార్గ రాజ్యం -
నువ్వు ప్రశ్నించాల్సింది చంద్రబాబుని
-
‘సాక్షి’పై కేసు సరికాదు
ఇటీవల విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవినీతిని ఎండగట్టినందుకు సాక్షి ఎడిటర్‌పై కేసు నమోదు చేయడాన్ని పలు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఈకేసునుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతి/విశాఖ సిటీ కేసు ఉపసంహరించుకోవాలి: ఏపీయూడబ్ల్యూజేమీడియా కథనాలపై కేసు నమోదు చేయడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్దన్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాక్షి కథనాల్లో అవాస్తవాలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చని తెలిపారు. అలా కాకుండా ఎడిటర్ వర్ధెల్లి మురళిపై కేసు పెట్టడం సరైనచర్య కాదని పేర్కొన్నారు. కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కేసును వ్యతిరేకిస్తున్నాం: ఏపీడబ్ల్యూజేఎఫ్ పత్రికల్లో ప్రచురితమైన వార్తాకథనాలపై అనుమానాలు, తప్పులు, పొరపాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపే పద్ధతిని విస్మరించి పోలీసు కేసులు పెట్టే వైఖరిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) వ్యతిరేకిస్తోందని ఆ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు తెలిపారు. ఈ సంస్కృతిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళిపై పోలీసులు కేసు బనాయించటం సరికాదు. పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తా కథనాలకు సంపాదకుడిదే బాధ్యత అయినా పత్రిక ప్రధాన లక్ష్యం ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం. ఆ ప్రక్రియలో లోటుపాట్లుంటే సరిదిద్దే ప్రయత్నాలు జరగాలి. పోలీసు కేసులు పెట్టడం మీడియాను భయపెట్టే చర్యగా భావిస్తున్నాం. మీడియాను భయపెట్టేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలి. సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళిపై పెట్టిన కేసు ఆ కోవలోకే వస్తుంది. ఇటువంటి ధోరణులను పోలీసు యంత్రాంగం మానుకోవాలి..’ అని వారు చెప్పారు. ఈ కేసు సరికాదని ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్, కార్యదర్శి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసు అక్రమం: స్సామ్నా మీడియా స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తాజాగా జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంఘం (స్సామ్నా) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక వార్తా కథనం పేరుతో ‘సాక్షి’ ఎడిటర్ వి.మురళిపై విజయవాడలో పోలీస్ కేసు నమోదు చేయడం అక్రమమని స్సామ్నా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, సిహెచ్.రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక జర్నలిస్టుపై ఈ మాదిరిగానే నమోదు చేసిన కేసును ఇటీవల సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని కూటమి ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఆదిలోనే కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేసేది కాదన్నారు. గతంలోను చట్టాలు, జీవోలు, అధికార ఒత్తిళ్లతో కొన్ని చానళ్ల ప్రసారాలు నిలిపేయించడం, జర్నలిస్టులపై కేసులు బనాయించడం వంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ఇప్పటికైనా సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసును ఉపసంహరించాలని, చానళ్ల ప్రసారాల విషయంలో కేబుల్ టీవీ ఏజెన్సీలపై ఒత్తిళ్లను మానుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం సరికాదని, జర్నలిస్టులపై కేసుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని స్సామ్నా విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.వి.సుబ్బారావు, కార్యదర్శి ఎస్.గంగరాజు కోరారు. సాక్షి ఎడిటర్‌పై కేసు అన్యాయం: ఏపీడబ్ల్యూజేయూ సాక్షి ఎడిటర్ మురళిపై విజయవాడలో కేసు నమోదు చేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడబ్ల్యూజేయూ) విశాఖ జిల్లా యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ యూనిట్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, ఆర్.రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్తా కథనం పేరుతో సాక్షి ఎడిటర్ వి.మురళిపై కేసు నమోదు అక్రమమని పేర్కొన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇదేరీతిలో ఒక జర్నలిస్టుపై నమోదుచేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జర్నలిస్టు సంఘాలు అంగీకరించే పరిస్థితి లేదని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్‌పై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంయమనంతో వ్యవహరించాలి: జాతీయ జర్నలిస్టుల సంఘం పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలపై అనుమానాలు, తప్పులు, పొరపాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపే పద్ధతిని విస్మరించి.. పోలీసు కేసులు పెట్టే వైఖరి సరికాదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. సమాజంలో వైషమ్యాలు, అంతరాలు మరింతగా పెరిగేందుకు దోహదపడే చర్యలకు పాల్పడకుండా పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. -
లోకేష్ దందాలు కప్పిపుచ్చేందుకే.. చంద్రబాబుపై ఆర్కే రోజా ఫైర్
సాక్షి, అమరావతి: చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ‘‘ఆత్మస్తుతి పరనింద ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఈ విషయంలో మనా తనా అనే భేదం కూడా ఉండదు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కలెక్టర్లు ఎస్పీలు, ఉన్నతాధికారుల సమావేశంలో మాది పొలిటికల్ గవర్నెన్స్ మా వారు చెప్పిందే చేయండి అని చెప్పి విచ్చలవిడిగా దందాలకు, అరాచకాలకు ఆజ్యం పోశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి ఆ తప్పులు ఎమ్మెల్యేల మీద నెట్టుతున్నారు.’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.తన మీడియాతోనే తమ ఎమ్మెల్యేల మీద బురదజల్లి తప్పంతా వారిదే అన్నట్లు ప్రచారం చేయిస్తున్నారు. ఈ మాటున తన తప్పులు, వైఫల్యాలు, కుమారుడు లోకేష్ దందాలను చర్చకు రానివ్వడం లేదు. ఎమ్మెల్యేల అవినీతిపై ఉదయం కథనాలు, చర్చ చేస్తున్న సదరు మీడియానే సాయంత్రం ముఖ్యమంత్రి వీరుడు, శూరుడు అంటూ ఎంపిక చేసుకున్న వందిమాగాదులతో చిలకపలుకల మాటలతో రక్తికట్టిస్తున్నారు.’’ అంటూ ఆర్కే రోజా ఎండగట్టారు.‘‘అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం. అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఫల్యాలను, తన కుమారుడి దందాలను కప్పిపుచ్చుకోవడానికి తమ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా తన మీడియాతోనే ప్రచారం మొదలెట్టిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఏ కలెక్టర్ల, ఎస్పీల సమావేశంలో తమ టీడీపీ పార్టీ వారు చెప్పిందే చేయాలని చెప్పినట్లు, తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమేనని వైఎస్ జగన్లాగా చెప్పాలి’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.ఆత్మస్తుతి పరనింద ముఖ్యమంత్రి @ncbn గారికి మొదటి నుంచి ఉన్న అలవాటు ఈ విషయంలో మనా తనా అనే భేదం కూడా ఉండదు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కలెక్టర్లు ఎస్పీలు మరియు ఉన్నతాధికారుల సమావేశంలో `మాది పొలిటికల్ గవర్నెన్స్ మా వారు చెప్పిందే చేయండి` అని చెప్పి…— Roja Selvamani (@RojaSelvamaniRK) October 10, 2024 -
నిజం చెప్పేసిన లోకేష్ షాక్ లో చంద్రబాబు..
-
లోకేష్, పవన్ కలిసి . బాబును ఇరికించారు..!
-
హస్తినలో లోకేశ్ రహస్య పర్యటన!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా జన్‌పథ్–1లోని సీఎం (చంద్రబాబు) నివాసానికి చేరుకున్నారు. 3.30 గంటలకు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ లోకేశ్‌ను కలిశారు. అర్ధరాత్రి వరకూ భేటీలు కొనసాగడం.. ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చి0ది. కాగా, ఎన్డీఏ ప్రముఖులను కలిసేందుకు లోకేశ్ ఢిల్లీ వచ్చారని ఎల్లో మీడియా ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఎన్డీఏ ప్రముఖులు ఎవర్నీ కలవలేదు. అంతా రహస్యమే.. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆహా్వనిస్తారు. ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వీఐపీ ఫెసిలిటేషన్ చేస్తారు. లోకేశ్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కాగా, లోకేశ్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేర్వేరుగా భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి వరకు లోకేశ్ ఇక్కడే ఉండటంతో గురువారం అధికారికంగా ఎన్డీఏ నేతలను కలిసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా, రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ వేద్ ప్రకాష్ గోయల్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయినట్లు తెలిసింది. -
ఈ ‘బరితెగింపు’.. ఎల్లో మీడియాకు కనబడలేదా?
ఏమిటి ఈ బరి తెగింపు.. ఏమిటీ అరాచకం. చివరికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలిపెట్టరా! ఏపీలో జరుగుతున్న దుష్టపాలనకు ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున భాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం. అక్కడే ఉన్న పార్కు, లైబ్రరీ అంతా ఒక విజ్ఞాన సంపదగా ఉన్న టూరిస్టు స్పాట్‌పై గురువారం రాత్రి దాడి జరగడం అత్యంత శోచనీయం.ఏపీ సమాజంలో అశాంతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి మరింత ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు గవర్నర్ బంగళా, మరో వైపు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్న విజయవాడ స్వరాజ్మైదాన్లోని అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడికి సాహసించారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉందన్న అనుమానం సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడానికి జరిగిన యత్నం చూస్తే ఇది టీడీపీ అల్లరి మూకల పనేనన్న సంగతి అర్ధం అవుతుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల ప్రమేయంతోనే ఇలాంటి నీచమైన అకృత్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. అంబేద్కర్‌ను దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన పట్ల మానవ సమాజం ఎంత అభిమానంతో ఉండేదో తెలుస్తుంది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రావడం, దానిని ఎక్కడో మారుమూల కాకుండా విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి జగన్ ప్రభుత్వం సంకల్పించి పూర్తి చేసింది. వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి తరలిరాగా, విగ్రహం.. అంబేద్కర్ లైబ్రరీ, పార్కు మొదలైనవాటిని జగన్ ఆవిష్కరించారు.నిత్యం వేలాది మంది అక్కడకు వెళ్లి అనుభూతి పొందుతారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని, ఆయన పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని విజయవాడ వంటి సెంటర్లో కాకుండా, అమరావతిలో ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం చివరికి దానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన. జగన్ ప్రభుత్వం ఏదో కుగ్రామంలో కాకుండా, విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితంగా ఉంటుందని భావించింది. స్వరాజ్మైదాన్ను అటు అంబేద్కర్ కేంద్రంగాను, ఇటు పార్కు, వాకింగ్ ట్రాక్ మొదలైనవాటితో టూరిస్టు స్పాట్‌గా అభివృద్ది చేయాలని ప్లాన్ చేసి సుమారు రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసింది.సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ను అంతా చూసుకుంటారు. పేదల గుండెల్లో, ప్రత్యేకించి దళితుల హృదయాలలో ఆయన కొలువై ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. స్వరాజ్మైదాన్ను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చైనా మాల్గా మార్చాలని ప్రయత్నించింది. కాని విజయవాడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ముందుకు వెళ్లలేదు. జగన్ ప్రజలందరికి ఉపయోగపడేలా దానిని తీర్చిదిద్దారు. అంతే కాక అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రాజకీయం జరిగింది.తొలుత అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కోనసీమ జిల్లా అని పేరు పెట్టగా దళితవర్గాలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఆందోళనలకు దిగాయి. ఆ ఉద్యమంలో టీడీపీ, జనసేన వంటివి కూడా పాల్గొని దళితవర్గాలను రెచ్చగొట్టాయి. జగన్ ప్రభుత్వం అందరి అభిప్రాయాల మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జత చేసింది. అప్పుడు ఇదే టీడీపీ, జనసేన నేతలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించాయి. చివరికి అప్పటి మంత్రి, ఒక ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టి అరాచకానికి పాల్పడ్డాయి. టీడీపీ, జనసేనలు డబుల్‌గేమ్ ఆడినా జగన్ ప్రభుత్వం నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్లింది. దాని వల్ల వైఎస్సార్సీపీకి కొంత నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాతకాలంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టారు.విజయవాడకు ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నా విగ్రహం కనబడుతుంటుంది. అలాంటి టూరిస్ట్ స్పాట్ పై టీడీపీకి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా ఉంది. అంబేద్కర్ కేంద్ర సిబ్బంది నుంచి సెల్ పోన్లు లాక్కుని మరీ టీడీపీ కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. ఈ విగ్రహాన్ని ప్రారంబించిన జగన్ పేరు అక్కడ ఉండడం వారికి నచ్చలేదు. అంతే ఆ అక్షరాలను పీకేశారట. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమాచారం అంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం శోచనీయం. టీడీపీ గూండాలు హత్యలు, దాడులు, విద్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి-చూడనట్లు ఉండడం, పైగా వాటిని ప్రోత్సహించే విదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ రౌడీలకు అడ్డు, ఆపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.ఇక తెలుగుదేశం మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి. చివరికి ఆంద్రజ్యోతి మీడియా ఈ దాడిని సైతం సమర్ధించే రీతిలో కదనాలు ఇస్తోందంటే అది ఏ రకంగా తయారైంది అర్థం చేసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వారు ఎంత అరాచకం చేసినా కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. ఆయనకు పదవి రావడం పరమాన్నంగా మారింది. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. గతంలో ఎప్పుడూ ఇలా విగ్రహాలపై, శిలాఫలకాలపై ఏ రాజకీయ పార్టీ దాడి చేయలేదు. ఒక్కడైనా ఒకటి, అరా జరిగినా, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం, జగన్ పేరు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న శిలాఫలకాలను ద్వసం చేయడం వంటి అల్లర్లతో టీడీపీ అరాచక శక్తులు రెచ్చిపోయాయి.గుంటూరులో స్వయంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేనే గుణపం పట్టుకుని శిలాఫలకాన్ని కూల్చుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ ఆద్వర్యంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా టీడీపీ గూండాలు ద్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలు నీచంగా వ్యవహరిస్తుంటే నిరోధించవలసిన నాయకత్వం వారిని ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తూ వచ్చింది. టీడీపీ దళిత నేతలు సైతం నోరు విప్పడం లేదు. గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎవరైనా కొద్దిపాటి అపచారం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. అలా వార్తలు ఇవ్వడం తప్పు కాదు. ఏ నాయకుడి విగ్రహంపైన ఎవరూ దాడులు చేయకూడదు. కాని వైఎస్ విగ్రహాలను ద్వంసం చేసినా, చివరికి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రముఖంగా వార్త ఇవ్వలేదంటే వారు ఏ స్థాయికి దిగజారింది అర్ధం చేసుకోవచ్చు.టీడీపీ మీడియాలో ఈ ఘటనలు రిపోర్టు చేయకపోతే, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు, టీడీపీ మీడియా మాఫియా మాదిరి ప్రవర్తిస్తున్న తీరు ఏపీ బ్రాండే ఇమేజీని నాశనం చేస్తున్నాయి. చంద్రబాబు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోకపోతే మానే, ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు. ఇదంతా ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నలలో జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడితే, అప్పటి సీఎం పేరును, మంత్రుల పేర్లను ఫలకాల నుంచి తొలగించి ఆనందపడితే, భవిష్యత్తులో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు ఇదే పరిస్తితి వారికి ఎదురు కాదా అన్న ప్రశ్న వస్తుంది. కాని సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు అనుభవం అవుతున్నా, టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు
సీతారామాపురంలో సుబ్బరాయుడు హత్యను చూస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని స్పష్టంగా అర్థమవుతోంది. లా అండ్ ఆర్డర్ ఎలా ఉండకూడదో అన్నదానికి చరిత్రలో ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. పోలీసుల సమక్షంలోనే హత్య జరిగింది. హత్య జరుగుతుందనే విషయం ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు చెప్పినా అదనపు బలగాలు పంపలేదు. హత్యను ఎస్ఐ, కానిస్టేబుళ్లు నివారించలేకపోయారు. పథకం ప్రకారం పోలీసులు, రాజకీయ నేతలు కలిసి ఇలాంటి ఘటనలతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మండలానికి ఇద్దరిని చంపండని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చెప్పాడు. అయినా అతనిపై కేసులు లేవు. చంపిన వారితో పాటు వారి వెనుక ఉన్న వారిని కూడా కేసుల్లో చేర్చాలి. చంపిన వారికి మద్దతు ఇచ్చిన నారా లోకేశ్, చంద్రబాబు నాయుడులను కూడా ముద్దాయిలుగా చేస్తేనే లా అండ్ ఆర్డర్ బతుకుతుంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి ప్రతినిధి కర్నూలు : రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికార పార్టీ నేతలు ఎవరంతకు వారు రెడ్ బుక్ అమలు చేస్తూ స్వైర విహారం చేస్తున్నారని.. హత్యలు, దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ప్రజలు చైతన్యవంతులై వీటిని అరికట్టకపోతే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని, శాంతి భద్రతలు మరింతగా అదుపు తప్పక ముందే అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో టీడీపీ ప్రభుత్వం చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో అరగంటకుపైగా మాట్లాడి ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వారి వారి రెడ్‌బుక్‌లు తెరిచి ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నిస్తేజులుగా చేసి, వారి సమక్షంలోనే లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేసిన పరిస్థితి సీతారామాపురంలో సుబ్బరాయుడి హత్య, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూస్తే స్పష్టమవుతోందన్నారు. ‘సుబ్బరాయుడు కుటుంబం ఎన్నికల సమయంలో బూత్‌లో ఏజెంట్లుగా కూర్చున్నారు. వీరితో పాటు మరో మూడు కుటుంబాల వారు ఏజెంట్లుగా కూర్చున్నారు. దీంతో పెద్దిరెడ్డి, పల్లం శేఖర్, నారపురెడ్డి వీరందరిని చంపాలనే దారుణ రాజకీయాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైంది? సుబ్బరాయుడిని హత్య చేసేందుకు బయట నుంచి వచ్చిన వారితో పాటు 35–40 మంది రాడ్లు, రాళ్లు, కత్తులు, కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసేందుకు ఏకమయ్యారు. ఇది చూసి నారపురెడ్డి 9.30 గంటలకు ఎస్ఐకి ఫోన్ చేశాడు. ‘గ్రామంలో వాతావరణం సరిగా లేదు. బయట నుంచి వ్యక్తులు వచ్చారు. రాడ్లు, తుపాకులు, కత్తులు కన్పిస్తున్నాయి. ఏదో జరగబోతోంది. పోలీసులు త్వరగా రావాలి’ అని చెప్పాడు. కొద్దిసేపటికి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. ఎస్ఐ గ్రామంలోని పరిస్థితులన్నీ చూశారు. సీఐ, డీఎస్పీలకు ఫోన్ చేశారు. అయినా బందోబస్తు పంపలేదు. ఎస్ఐ, కానిస్టేబుళ్ల ముందు టీడీపీ నేతల స్వైర విహారం కన్పిస్తున్నా ఆపే ప్రయత్నం చేయలేదు. కత్తులు, కట్టెలు కన్పిస్తున్నా ఎస్ఐ, కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించారు. అదనపు బలగాలు రాలేదు’ అని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోలీసుల సమక్షంలోనే హత్య నంద్యాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సీతారామాపురం ఉంది. ఎస్పీ, డీఎస్పీ వచ్చేందుకు 10 నిమిషాలే పడుతుంది. సరైన సమయంలో పోలీసులను పంపి ఉంటే ఘటన జరిగేది కాదు. అదనపు బలగాలు రాకపోవడంతో ఎస్ఐ, కానిస్టేబుళ్లు చూస్తుండగానే అర్ధరాత్రి 12.20 గంటలకు సుబ్బరాయుడిని హతమార్చారు. మరో రెండు కుటుంబాలపై దాడి చేశారు. సుబ్బరాయుడు భార్యను నరికి గాయపరిచారు. ఇవన్నీ జరుగుతున్నా ఎస్ఐ, కానిస్టేబుళ్లు ఆపలేదు. లోకేశ్, చంద్రబాబునాయుడు అండదండలతోనే పోలీసులు ఎవ్వరూ గ్రామంలోకి రాకుండా పథకం వేసినట్లు అన్పిస్తోంది. నారపురెడ్డిని పోలీసు స్టేషన్‌కు వెళ్లిపో అని ఎస్ఐ చెప్పాడు. నారపురెడ్డి స్టేషన్‌కు వెళ్లిన తర్వాత హత్య జరిగింది. హత్య ఘటన తెలిసి 12.59కి పోలీసుస్టేషన్ నుంచి ఎస్పీకి నారపురెడ్డి ఫోన్ చేశాడు. ‘మా ఊళ్లో మనుషులను చంపారు. ఇప్పుడే తెలిసింది. మా ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ దృశ్యాలు మీకు పంపిస్తున్నా. చూడండి’ అని చెప్పినా అదనపు బలగాలు రాలేదు. చంపిన వారు దర్జాగా ఊరు వదిలే పరిస్థితి. వాళ్లను పట్టుకున్న నాథుడే లేడు. పట్టుకునేందుకు పోలీసులు రాలేదు. 1.08 గంటలకు మళ్లీ నారపురెడ్డి ఫోన్ చేశాడు. ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామని చెప్పారు. ఆపై 3.18 గంటలకు మళ్లీ ఫోన్ చేశాడు. ‘హంతకుల ముఠాలో రమణ అనే వ్యక్తిని అతి కష్టం మీద పట్టుకున్నాం. అతన్ని అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని అరెస్టు చేయండి’ అని చెప్పారు. చివరకు 3.28 గంటలకు ఎస్పీ నారపురెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణను నంద్యాల త్రీటౌన్‌లో అప్పగించాలని చెప్పారు. చివరకు పోలీసులు రమణను ఎస్పీ ఆఫీసులోపలికి తీసుకెళ్లారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ? » గ్రామంలో ఘటన జరుగుతుందని పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసుల సమక్షంలో హత్య జరుగుతున్నా ఎందుకు అదనపు బలగాలు రాలేదు? » హత్య చేసి పలువురిని గాయపరిచిన వారంతా గ్రామం వదిలిపోయేదాకా వారిని పట్టుకునే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదు? » ఈ హత్య వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరు ఆడిస్తున్నారు? » సీఐ, డీఎస్పీ, ఎస్పీ ఏ ఒక్కరూ అదనపు బలగాలు పంపించకుండా ఆపగలిగారంటే నాయకులు, పోలీసులు కలిసి ఏ స్థాయిలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా? » రాష్ట్రంలో ప్రతీ ఘటన ఇలాగే ఉంది. వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై నరికారు. ఇదే శ్రీశైలం నియోజకవర్గంలోని దాసు (హత్య ఫొటోలు చూపిస్తూ)ను చంపారు. దాసు కుమారుడు నా వద్దకు వచ్చి మా నాన్నను జూన్ 26న పట్టపగలే చంపారు అని చెప్పాడు. నాయకులు, పోలీసులు కలిసే ఘటనలు జరిగేలా చేస్తారు.. భయానక వాతావరణం సృష్టిస్తారు.. తప్పనిసరి కేసు పెట్టాల్సి వచ్చినపుడు చిన్న చిన్న ముద్దాయిలను చేర్చి కేసును ఆపేస్తున్నారు. చేయించిన వారు ఎవరు? ఎమ్మెల్యే పేరు ఎందుకు కేసుల్లో చేర్చడం లేదు? » సుబ్బరాయుడిని చంపిన శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి ఉండడా? హత్యకు ముందు.. ఆ తర్వాత అతను ఎవరితో మాట్లాడారో కాల్ డేటాను ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? కేసును ఎందుకు వారి వద్దకు పోకుండా ఆపుతున్నారు? ఎమ్మెల్యే బుడ్డాపై ఎందుకు కేసు పెట్టలేదు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. ఈ ఘటనలపై హైకోర్టుతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. కోర్టుల ద్వారా పికెటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు రక్షణ కలిగేలా చేస్తాం. అప్పడే కొద్దోగొప్పో ప్రజాస్వామ్యం బతుకుతుంది. హత్య చేసిన వారితో పాటు చేయించిన వారిని కూడా ముద్దాయిలుగా చేరుస్తూ జైల్లో పెట్టాలి. అప్పుడే రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి విజయోత్సవ సభ అని కౌంటింగ్ తర్వాత మీటింగ్ పెట్టారు. ఆయన ఎలా మాట్లాడారో చూడండి. (ఫోన్లో బుడ్డా మాట్లాడిన వీడియోను చూపుతూ) ‘మాంచి పట్టుడు కట్టెలు పెట్టుకోండి. మండలానికి ఇద్దరిని పీకండి. చేతకాకపోతే చెప్పండి. నేను మనుషులను పంపిస్తా. కండువా వేసుకుని మన పార్టీలో చేరితే మనకు అభ్యంతరం లేదు. లేదంటే తోలు తీయడమే’ అని ఆ పార్టీ వాళ్లను రెచ్చగొట్టారు. మండలానికి ఇద్దరిని చంపండి.. దాడులు చేయండి.. కేసులు, పోలీసులు నేను చూసుకుంటా.. అంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే మీటింగ్‌లు పెట్టి ఇంత దారుణంగా చంపమని చెబుతుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు? చంపిన వారిపై మాత్రమే కాదు.. వారికి రక్షణ ఇచ్చే వారిపై కూడా కేసులు పెడితేనే లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించకూడదనే.. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేసి.. వారి మనసులో స్థానం సంపాదించుకోవాలనే ఆలోచనే ప్రభుత్వంలో కన్పి0చడం లేదు. రెండు నెలలుగా రాష్ట్రంలో అరాచకం, మారణహోమం సృష్టించే పాలన నడుస్తోంది. ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు ఏం మాటలు చెప్పారో, ప్రజలను ఎలా మోసం చేస్తూ ఓట్లు వేయించుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో, ప్రశ్నించకూడదనే ఆలోచనతో భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు క్యాంపెయిన్ చేస్తూ చిన్న పిల్లలు కన్పిస్తే చాలు ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు’ అని చెప్పి ప్రలోభ పెట్టారు. అక్క చెల్లెమ్మలు కన్పిస్తే ‘ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు సంతోషమేనా?’ అని అడిగారు. నిరుద్యోగి కన్పిస్తే ‘రూ.3 వేల నిరుద్యోగ భృతి సంతోషమా?’ అని.. రైతులు కన్పిస్తే ‘మీకు రూ.20 వేలు సంతోషమా?’ అని అడిగారు. ఇలాంటి ఆలోచనలు, మాటలతో ఇంటింటికీ టీడీపీ శ్రేణులను పంపించి చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్నికల తర్వాత చిన్న పిల్లలను మోసం చేశారు. అదే జగనన్న ఉండి ఉంటే ఇప్పటికే రూ.15 వేలు అమ్మ ఒడి అంది ఉండేది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామం పెట్టారు. వ్యవసాయ సీజన్ మొదలైంది. రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తున్నారు. జగన్ ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము అందేది. ఆ సొమ్మూ పోయింది. చంద్రబాబు ఇస్తామన్న రూ.20 వేలు పోయింది. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానని చెప్పి అడ్డగోలుగా మోసం చేశాడు.జగనే ఉండి ఉంటే ఈ పథకాలు రావడంతో పాటు చదువుకుంటున్న పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద ఫీజులు కూడా కట్టేవాడు. ఇవి కూడా ఇవ్వకుండా, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేయకుండా చంద్రబాబు మోసం చేశాడు. ఇలా రైతులు, చిన్న పిల్లలు, అక్క చెల్లెమ్మలు అందరినీ మోసం చేశారు. ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు.. రోడ్డుపైకి రాకూడదు.. నిలదీయకూడదు.. అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు. దారి పొడవునా ఘన స్వాగతం ఉదయం 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఓర్వకల్లు మీదుగా హుస్సేనాపురం, తమ్మరాజుపల్లె, పాణ్యం డొంక, బలపనూరు, వెంకటేశ్వరపురం, టోల్గేట్, నంద్యాల బైపాస్, అయ్యలూరి మెట్ట, నందిపల్లె మీదుగా సీతారామాపురం చేరుకున్నారు. ఓర్వకల్లు నుంచి సీతారామాపురం చేరుకోవడానికి మామూలుగా గంట పడుతుంది. అలాంటిది అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తడంతో 5 గంటలకు పైగా పట్టింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ 3.20 గంటలకు సీతారామాపురం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, ఇసాక్, ఎమ్మెల్యే విరూపాక్షి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎంపీలు పోచా బ్రహా్మనందరెడ్డి, బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘గత ప్రభుత్వంలో వేసిన అభివృద్ధి శిలాఫలకాలను టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వంసం చేస్తున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎవరైతే శిలాఫలకాలను కూల్చివేస్తారో.. మళ్లీ వాళ్లేతోనే నిర్మింపజేస్తాం. టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలి. లేకపోతే ప్రజలకు అండగా నిలిచి.. పోరాటం చేస్తాం’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోందని.. లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాడని కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చడం కుదరదని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. మైసూర్ బోండాలో మైసూర్లాగా.. ఉచిత ఇసుకలో ఉచితం కన్పిస్తోంది. ఉచిత ఇసుక ఇస్తున్నట్లు చంద్రబాబు రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందో చంద్రబాబుకే తెలియాలి. టీడీపీ మూకలు మాత్రం ఇసుక రేవుల్లో పడి ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. రాష్ట్రంపై రూ.14 లక్షల కోట్ల అప్పు భారం ఉందంటూ రచ్చ చేసిన చంద్రబాబు.. గవర్నర్ ప్రసంగంలో మాత్రం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పించారు. ఇష్టారీతిన హామీలు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా అప్పుల గురించి? అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా నడుచుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు చెప్పడం ద్వారా చంద్రబాబు కూడా అవినీతికి వంతపాడుతున్నారు. దాడులు, అవినీతి, అక్రమాల్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు’ అని కాకాణి ధ్వజమెత్తారు. -
మీ గొంతు మూగబోయిందా లోకేశ్?
నెల్లూరు(టౌన్): ‘ఫీజు రీయింబర్స్మెంట్ గురించి యువగళంలో మాట్లాడిన మీ గొంతు మంత్రి పదవి రాగానే మూగబోయిందా లోకేశ్..’ అని ఏబీవీపీ నాయకులు ప్రశి్నంచారు. ‘యువగళంలో మాట్లాడిన నోరు మంత్రి పదవి రాగానే మూగబోయిందా..’ అనే బ్యానర్ చేతపట్టుకుని ఏబీవీపీ నాయకులు సోమవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనీ్వనర్ రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచి్చన వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని లోకేశ్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని చెప్పారు.ఫీజు రీయింబర్స్మెంట్ లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించాలని, లేకపోతే ఎక్కడికక్కడ ఆయన పర్యటనలను అడ్డుకుంటామని, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చి పక్కన పడేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సమీర్, సుమన్, రాబర్ట్, వినోద్, హేమంత్, సుకుమార్, నవీన్ పాల్గొన్నారు. -
‘సెల్ ఫోన్’తో సొల్లు కథ
మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతల పేకాట, కోడి పందేల కేంద్రాల వ్యవహారాన్ని మరుగున పరిచేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న విషయం విస్పష్టంగా బయటపడింది. చిన్న లాజిక్ మిస్సయిన టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. – సాక్షి ప్రతినిధి, బాపట్లనగరం మండలం వెలమవారిపాలెంలో ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పేకాట కేంద్రంలో రోజుకు కోట్లలో ఆట ఆడిస్తున్నారు. ఈ ఒక్క కేంద్రం నుంచే స్థానిక టీడీపీ నేతకు నెలకు రూ. 60 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీనిని స్థానిక పోలీసుల సహకారంతో నడిపిస్తున్నారు. ఈ కేంద్రాల బారిన పడి వందలాది మంది ఆరి్థకంగా చితికిపోతున్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్‌బాబు బయటపెట్డడంతో టీడీపీ నేతలు బహిరంగ సవాళ్లు విసిరారు. పోలీసులు అశోక్‌బాబును గృహ నిర్బంధం చేయగా, టీడీపీ నేత సాయిబాబు, ఆయన అనుచరులు భట్టిప్రోలులో టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరారు. వారిని నిలువరించే సందర్భంలోనే పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు.నగరం ఎస్సైని టీడీపీ కార్యకర్త చొక్కా పట్టుకొని నెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో ఉలిక్కిపడిన అధికార పార్టీ నేతలు దాని నుంచి తప్పించుకునేందుకు అది ఫేక్ అంటూ ఓ సెల్ ఫోన్ కథ అల్లారు. వాస్తవంగా ఈ ఘర్షణను వీడియో తీసింది టీడీపీ నేతలే. గొప్ప కోసం వారు సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్త నగరం ఎస్ఐ చొక్కా పట్టుకోవడం, వారిద్దరి పెనుగులాట వాటిలో స్పష్టంగా ఉంది.సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇతర టీడీపీ నేతలు మాత్రం ఆ వీడియోను ఎడిట్ చేసి, కొత్త కథ అల్లారు. సెల్ ఫోనుకిందపడితే టీడీపీ కార్యకర్త తీసి ఇవ్వబోయాడంటూ కట్టుకథ అల్లారు. కలెక్టర్ల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌ను చూపించి సాక్షి మీడియా, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. సెల్ కిందపడితే కిందికి వంగి తీసివ్వాలి తప్ప ఎస్సైతో పెనుగులాడాల్సిన అవసరం ఏముందన్న వాస్తవాన్ని వారు మరిచారు.పైగా, నలుగురు పోలీసుల మధ్య నుంచి టీడీపీ కార్యకర్త దూరి మరీ ఎస్సై చొక్కా పట్టుకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీటన్నింటినీ మరుగునపెట్టి, పేకాట, కోడిపందాల వ్యవహారాన్ని తొక్కి పెట్టేందుకే చంద్రబాబు, లోకేశ్ కొత్త డ్రామాకు తెరలేపినట్లు టీడీపీ వారి వీడియోలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. -
అబ్బో.. ఇదేనా బాబు.. మీ రెడ్ బుక్ బ్రాండ్ పాలన!
సాక్షి, గుంటూరు: బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగిందని సీఎం చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అబ్బో.. ఇదేనా మీ రెడ్ బుక్ బ్రాండ్ పాలన అని వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు ప్రస్తుత, గతంలో చేసిన అరాచక పాలనపై మండిపడుతున్నారు. ‘బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో శనివారం (ఆగష్టు 3,2024)తేదీన టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ నగరం ఎస్ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేశాడు. అక్రమ ఇసుక తవ్వకాన్ని అడ్డుకున్నారని(జులై 10 2015)తేదీన ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఇసుకలో వేసి కొట్టించాడు. విజయవాడ ట్రాన్స్‌పోర్టు కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మీదికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ(మార్చి 26 2017) తేదీన ఆయన సెక్యూరిటీ గార్డును తోసివేశాడు. నన్ను రామసుబ్బారెడ్డిని నలుగురు ఐఏఎస్‌ల సమక్ష్మ లో కూర్చోబెట్టి (అక్రమంగా ) సంపాదించిన దానిలో చెరి సగం పంచుకోమని చెప్పాడు మా పెద రా (నా) యుడు అని అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియో ఉంది. అమరావతి డిజైన్ల కోసం అని చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న జపాన్ మాకీ సంస్థ చైర్మన్ పుమిహికో అయితే.. ఏపీ కంటే బీహార్ నయం, ప్రతిదానికి లంచం ఇవ్వాలి అని విసిగి వేసారి లేఖ రాసి వెళ్లిపోలేదా? ’అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఎవరీ పాలన బ్రాండ్ ఏపీ ప్రతిష్ట దెబ్బతీసిందో తెలుసుకోవాలని, రాజకీయల కోసం అసత్య ఆరోపణలు చేయవద్దని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ పాలన ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేస్తున్నారు. -
టోఫెల్ శిక్షణ ఎత్తివేత
సాక్షి, అమరావతి: పాఠశాలల విద్యా బోధనలో కీలకమైన నూతన విద్యా సంవత్సరం (2024–25) కేలండర్‌ను నెలన్నర ఆలస్యంగా విడుదల చేశారు. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు తెరిచేందుకు కనీసం ఒక్క రోజు ముందైనా ఆ కేలండర్‌ను విడుదల చేయాలి. కానీ ఈసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసమని ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా బడులు తెరిచారు. అంతేకాకుండా విద్యార్థులకు బోధించాల్సిన రోజువారీ పాఠ్యాంశాలు, నిర్వహించాల్సిన పిరియడ్స్, పరీక్షలతో పాటు సెలవులు వంటి సమగ్ర సమాచారంతో కూడిన అకడమిక్ కేలండర్ ప్రకటన సైతం వాయిదా వేశారు. కేలండర్పై ఇంతకాలం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుడు కేలండర్ వైరల్ కావడం, అది వాస్తవమని ఉపాధ్యాయులు నమ్మడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఫార్మెటివ్ అసెస్మెంట్–1 ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్న అంశం ఉపాధ్యాయ గ్రూపుల్లో రావడంతో సిలబస్ పూర్తి చేసేందుకు ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు ప్రస్తుత విద్యా పాఠశాల అకడమిక్ కేలండర్‌ను సోమవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన టోఫెల్– ప్రైమరీ/జూనియర్ శిక్షణను ఈసారి తొలగించారు. కేజీబీవీల్లో ఖాళీలను భర్తీ చేయండి: లోకేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అకడమిక్ కేలండర్ విడుదల సందర్భంగా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు పూర్తిచేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. స్కూళ్లలో టాయిలెట్స్ మెరుగుపర్చాలని, అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. సీబీఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు.ఆటలకు గంట కేటాయింపు ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 88 వివిధ సెలవులు ఉన్నాయి. కేలండర్లో పేర్కొన్న విధంగా ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. పదో తరగతి వార్షిక పరీక్షలు సమ్మెటివ్ అసెస్మెంట్–2 (ఎస్ఏ) వచ్చే ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోధన, 4 నుంచి 5 గంటల వరకు ఆటలకు కేటాయించాలి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు అనంతరం గంట సమయాన్ని క్రీడలకు కేటాయిస్తారు.అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు » ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. » అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు, మైనార్టీ విద్యా సంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. » అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలలు వారానికి వరుసగా రెండు పిరియడ్స్‌ను సైన్స్ పిరియడ్స్‌కు కేటాయించాలి. » పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్లు బోధించాలి. » ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ప్రతి నెల మొదటి, రెండో శనివారం ‘నో బ్యాగ్ డే’ పాటించాలి. ఈ సమయంలో విద్యార్థులతో పేపర్ కటింగ్, క్లే మౌల్డింగ్, డ్రాయింగ్, సింగింగ్, గార్డెనింగ్ వంటి యాక్టివిటీస్ చేయించాలి. » ప్రాథమిక పాఠశాలల పిల్లలకు లాంగ్వేజ్ పిరియడ్స్‌లో మంచి చేతి రాతను ప్రాక్టీస్ చేయించాలి. వారానికి రెండు పిరియడ్స్‌ను గూగుల్ రీడ్ యాప్ ద్వారా వినడం, మాట్లాడడం కోసం ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్ నిర్వహించాలి. -
అరాచకం.. ఆటవికం.. ‘రెడ్’ రూల్!
సాక్షి, అమరావతి: ‘‘ఏపీ’’ అంటే ఈరోజు అరాచకం, ఆటవికం, రెడ్‌బుక్ పాలన అన్నట్లుగా కూటమి సర్కారు మార్చేసిందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దునుమాడారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుపై ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు నరమేధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధఃపాతాళానికి దిగజారినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌లు పెట్టారు. వీటి ద్వారా పోలీసులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? హత్యలు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడతాం..! పోలీసులు ప్రేక్షక పాత్ర వహించండని చెబుతున్నట్లే ఉంది! ఆయా ఘటనలపై కేసులు పెడితే తోలు తీస్తాం..! బాధితులపైనే తిరిగి కేసులు పెట్టండి అని అనడానికి ఇది నిదర్శనం కాదా?’ అని నిలదీశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెడ్‌బుక్ పేరిట హత్యలు..హత్యాచారాలు.. దాడులులోకేశ్ రెడ్‌బుక్‌ను చూసి గ్రామాల్లో టీడీపీ నాయకులు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. టీడీపీ విధ్వంసకాండపై మేం ఢిల్లీలో నిరసన తెలుపుతుంటే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సాంబిరెడ్డిపై దాడి చేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆయన చనిపోయాడని భావించి వదిలేశారు. రాజకీయంగా విభేదించారని ఇలా దాడులు చేస్తారా? ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని దాడులకు తెగబడటం «ధర్మమేనా? చంద్రబాబు ఇచ్చిన అలవిగాని హామీలపై ఎవరూ ప్రశ్నించకూడదు! ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే ఏం జరుగుతుందోనని భయం కల్పించేందుకే ఇలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు.పల్నాడులో పరాకాష్టకు సాధింపులువినుకొండలో రషీద్‌ను హత్య చేసిన నిందితుడు జిలాని స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తూ ఫోటోలు దిగాడు. ఎమ్యెల్యే, టీడీపీ నాయకులతో నిందితుడు అంటకాగినా కేసులో ఎక్కడా వారి పేర్లు లేవు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. పోలింగ్‌కు ముందు అక్కడ ఎస్పీగా ఉన్న రవిశంకర్‌రెడ్డి సమర్థంగా పని చేస్తుండటంతో ఆయన్ను బదిలీ చేయించి బిందుమాధవ్‌ను తెచ్చుకున్నారు. ఆయన చేసిన ఆకృత్యాలు తెలుసుకుని ఈసీ సస్పెండ్ చేసింది. అనంతరం వచ్చిన మలికాగార్గ్ టీడీపీ నాయకుల మాట వినడం లేదని శ్రీనివాస్‌ను ఎస్పీగా తెచ్చారు. ఆ తరువాత మూడో రోజే రషీద్‌ను నడి రోడ్డు మీదే దారుణంగా నరికేశారు. మహిళల భద్రత గాలికికేవలం గత 45 రోజుల వ్యవధిలో ఎనిమిది మంది మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నలుగురిపై అత్యాచారం, హత్యా ఘటనలు జరిగాయి. 12 మంది మహిళలు, చిన్నారి బాలికలపై అత్యంత దారుణమైన ఘటనలు కూడా వెలికి చూశాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు దిశ యాప్ రక్షణ కవచంలా నిలిచింది. 1.41 కోట్ల మంది ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉన్న మహిళలు, యువతులు ఫోన్‌ను షేక్ చేసినా.. ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా వెంటనే పోలీసులకు అలెర్ట్ వెళ్లేది. పోలీసులు తక్షణమే బాధిత మహిళకు ఫోన్ చేసేవారు. ఒకవేళ బాధితులు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేకుంటే పోలీసులే నేరుగా ఘటనా స్థలికి వెళ్లి రక్షించేవారు. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు ఉండేవారు. ప్రస్తుతం మహిళల భద్రత గురించి కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దిశ యాప్‌తో జగన్‌కు క్రెడిట్ వస్తోందనే దుగ్ధతో దాన్ని వదిలేశారు. దిశ పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లది ఇదే పరిస్థితి! చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని నేను పరామర్శించడం, రాష్ట్రంలోని అరాచక పరిస్థితులపై ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సీఎం రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిందలు మోపుతూ దుష్ప్రచారం చేశారు. హుటాహుటిన డీజీపీ, సీఐడీ ఏడీజీని చంద్రబాబు అక్కడికి హెలికాప్టర్లో పంపారు. ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు కాలిపోతే కలెక్టరేట్, సీసీఎల్ఏలో రికార్డులు ఉంటాయి కదా? చివరకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ఏదో జరిగిపోతున్నట్లు హైడ్రామా సృష్టించారు.పెద్దిరెడ్డిని ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఆయన కుమారుడు మిథున్‌ను మూడు సార్లు ఎంపీగా ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజాదరణ ఉన్న కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు నిందలు మోపుతున్నారు. మిథున్ కారును ధ్వంసం చేయడంతో పాటు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును కాల్చి వేసి రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు ఎందుకంత కోపం అంటే.. కాలేజీలో చదువుకునే సమయంలో ఆయన కొట్టాడట! ఆ కక్షతో పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రిగా పనిచేసినా ఆ శాఖపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తారు. మదనపల్లెలో అగ్నిప్రమాదం జరిగితే డీజీపీని ప్రత్యేక హెలికాప్టర్లో పంపిన చంద్రబాబు నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ముందుకు రారు. జూలై 7న బాలిక అదృశ్యమైతే 16న ఎస్పీ ప్రెస్‌మీట్ పెడతారు. దళితుడిని లాకప్ డెత్ చేశారు. కేసు విచారణ జరుగుతుండగానే ఎస్పీని బదిలీ చేశారు. -
ఈ ఏడాది డీఎస్సీ పోస్టుల భర్తీ లేనట్లే!?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్ర భుత్వం ఆడుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీచేస్తామని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు ఈ ఫైల్‌పైనే తొలి సంతకం చేసి అభ్యర్థులో ఆశలు కల్పించారు. దీంతో వీలైనంత త్వరగా పోస్టుల భర్తీ జరుగుతుందని వారంతా ఆశించారు. అదంతా హంబక్కేనని.. ప్ర కటించిన గడువులోగా పోస్టుల భర్తీ చేపట్టే యోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది. మంగళవారం అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనే చూస్తే ప్రభుత్వం ఉద్దేశం స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది విద్యా సంవ త్సరం ప్రారంభం అయ్యేనాటికి టీచర్ పోస్టు లు భర్తీ చేసేలా ప్రణాళికలున్నాయని ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వెల్లడించారు. లోకేశ్ ఏమన్నారంటే..‘నాడు–నేడు’పై విచారణ జరుగుతోంది..జగన్ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద రెండు దశల్లో 38 వేల పాఠశాలల్లో రూ.15 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారని.. అందులో రూ.9,425 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. నాడు–నేడు పనులపై విచారణ జరుగుతోందని నివేదిక అందాక, తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేట్ పాఠశా లలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషిచేస్తామ న్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను దత్తత తీసుకుంటామని ముందుకొస్తున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. 2018 గ్రూప్–1 రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో రూ.300 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. 781 కి.మీ.ల యూజీడీ పనులు పూర్తి.. గ్రేటర్ విశాఖ పరిధిలో 781 కి.మీ యూజీడీ పనులు పూర్తయినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో 19 ఎస్టీపీలు ఉన్నాయని, వీటిద్వారా 179 ఎంఎల్డీ శుద్ధిచేసిన నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే, అన్ని జిల్లాల్లో ఎస్టీపీల కోసం రూ.300 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.కేంద్ర నిధులు దుర్వినియోగం కాలేదు..రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం కాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.58,249 కోట్లు ఖర్చుచేశారన్నారు. -
రెడ్ బుక్ కాదది బ్లడ్ బుక్
సాక్షి, అమరావతి : ‘పోలింగ్, కౌంటింగ్ మధ్య రెడ్ బుక్ టీజర్ చూపించాం.. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత రెడ్ బుక్ ట్రైలర్ చూపించాం.. అంతటితో అయిపోలేదు.. అసలు రెడ్ బుక్ సినిమా ముందుంది’ అని టీడీపీ రౌడీ మూకలు బరి తెగిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అధికార గూండాగిరీకి పోలీసు శాఖ దాసోహమవడంతో టీడీపీ రెడ్‌బుక్ ఏకంగా బ్లడ్ బుక్‌గా రూపాంతరం చెంది విశృంఖలత్వం సృష్టిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో రక్తపుటేరులు పారిస్తూ టీడీపీ నేతల రక్తదాహం తీరుస్తోంది. అయినా సరే ఇది చాలదు.. అంతకు మించి అంటూ ప్రభుత్వ నేతే వ్యాఖ్యానించడంతో పచ్చ మూకలు మరింతగా మరణ మృదంగం మోగించేందుకు బరి తెగిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారం, ఆపై హత్యలు.. 16 అత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రం హడలెత్తిపోతోంది. అరాచకం రాజ్యం చేస్తుంటే రాక్షస గణం గంగవెర్రులెత్తిపోతూ సృష్టిస్తున్న విధ్వంసకాండకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలు మౌన సాక్షిగా మిగిలి పోతుండటం పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది.ఎదురు దాడి చేయండని మంత్రులకు ఆదేశంహత్యలు, హత్యాయత్నాలు, దాడులతో రాష్ట్రం అట్టుడుకుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం బాధ్యతాయుతంగా స్పందించనే లేదు. పోలీసు ఉన్నతాధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించ లేదు. పైగా విధ్వంసకాండను వెనకేసుకొచ్చే రీతిలో మంత్రి మండలి సమావేశంలో మాట్లాడటం విభ్రాంతి కలిగించింది. హత్యలు జరుగుతున్నా జరగలేదన్నట్టుగా మాట్లాడాలి కదా.. అని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయడం విస్మయ పరుస్తోంది. అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ఎందుకు ప్రశ్నించలేదని కూడా ఆయన మంత్రులను నిలదీశారు. వినుకొండలో వైఎస్సార్సీపీకి చెందిన రషీద్‌ను టీడీపీ వర్గీయుడు జిలానీ.. నడి వీధిలో దారుణంగా హత్య చేస్తే, అది అసలు రాజకీయ హత్యేకాదని వితండవాదం చేయడం టీడీపీకే చెల్లింది. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్న జిలానీ, అసలు తమ పార్టీకి చెందిన వ్యక్తే కాదని అడ్డగోలు వాదన చేయడం విడ్డూరం. అతను టీడీపీ ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆమెకు కేకు తినిపిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినా సరే తమ పార్టీ నేత కాదనడం కంటే బుకాయింపు ఇంకేముంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే హోమ్ మంత్రి అనిత ఆదివారం హడావిడిగా మీడియా సమావేశం నిర్వహించి, అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ప్రశ్నించడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం.దాడులు, విధ్వంసానికి చంద్రబాబు ‘పచ్చ’జెండాపచ్చ మూకలు 45 రోజులకుపైగా యథేచ్ఛగా సాగిస్తున్న విధ్వంసకాండతో చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందినట్టు లేదు. అందుకే ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు బాధితుల ఫిర్యాదులే స్వీకరించడం లేదు. హత్యలు, హత్యాయత్నాలు, విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టే ధైర్యం పోలీసులకు లేదన్నది సుస్పష్టం. తద్వారా దాడులు కొనసాగించండి.. మేమున్నాం.. అనే రీతిలో టీడీపీ గూండాలను ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. వినుకొండలో నడి వీధిలో హత్య చేసిన టీడీపీ వర్గీయుడు జిలానీని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని అరెస్ట్ చూపిస్తూ పోలీసులు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్ట లేదు! ప్రెస్ మీట్ పెడితే ఎందుకు హత్య చేశారని మీడియా ప్రతినిధులు అతన్ని, పోలీసులను అడుగుతారు. అప్పుడు రాజకీయ కక్షతోనే హత్య చేశాడనే విషయం చెప్పాల్సి వస్తుంది. అందుకే గోప్యంగా రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ గూండాలు 37 ప్రదేశాల్లో రాళ్ల దాడులతో బీభత్సం సృష్టించారు. ఆ దాడుల్లో పాల్గొన్న ఒక్క టీడీపీ నేత, కార్యకర్త మీద కూడా కేసు నమోదు చేయనే లేదు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా బాధితులైన ఎంపీ మిథున్‌రెడ్డి, రెడ్డెప్పపైనే అక్రమ కేసులు బనాయించడం గమనార్హం. తిరుపతి జిల్లాలో టీడీపీ రౌడీ మూకలు 40 చోట్ల దాడులకు పాల్పడ్డాయి. ఒక్క సంఘటనలో కూడా టీడీపీ వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా బాధితులైన 35 మంది వైఎస్సార్సీపీ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్, ఆయన బంధువులపై దాడి చేస్తే.. ఆ కేసులో వైఎస్సార్సీపీ వర్గీయులు 13 మందిని అరెస్ట్ చేశారు. నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వందల సంఖ్యలో దాడులకు తెగబడినా సరే వారిపై కేసులు నమోదు చేయనే లేదు. ఇటువంటి ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా వందల్లో ఉన్నాయి. తద్వారా రానున్న రోజుల్లో మరింత పెను విధ్వంసం సృష్టించేందుకు.. దాడులతో తెగబడేందుకు.. పచ్చ రౌడీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, సామాన్యుల ప్రాణాలకు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలే అండగా నిలబడాలని వారు కోరుతున్నారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
పులివెందుల: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్‌కంటే ఘోరంగా మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వారి రెడ్‌బుక్ రాజ్యాంగం మనిషి స్వేచ్ఛగా బతకాలన్న ప్రాథమిక హక్కును హరిస్తోందన్నారు. ఓవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, మరోవైపు అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం, హత్యలతో రాష్ట్రం అరాచకంగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలపై ఢిల్లీ స్థాయిలో గళమెత్తుతామని తెలిపారు. అవినాశ్ రెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ఇటీవల అధికార పార్టీ దాడిలో గాయపడిన అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని పరామర్శించి, వారిలో ధైర్యం కల్పించి, వైఎస్ జగన్ తరపున భరోసా ఇచ్చినట్లు చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని చెప్పామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నారన్నారు. వినుకొండలో వందల మంది చూస్తుండగా వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ చేతులు, తర నరకడం టీడీపీ నేతల అరాచకానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. వేంపల్లెలో వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిని 20 మంది టీడీపీ కార్యకర్తలు హాకీ స్టిక్స్‌తో విచక్షణా రహితంగా కొట్టారని, స్టిక్స్ విరిగిపోతే బండరాళ్లతో తలపై దాడి చేశారన్నారు. బుధవారం పుంగనూరులో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి పైనా రాళ్లతో దాడులు చేశారన్నారు. తాము గత ఐదేళ్లు ఇదే విధంగా ఆలోచించి ఉంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉండేవారా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నాయకత్వం ఏ రోజూ అరాచకాలను ప్రోత్సహించలేదని, ఎంతసేపూ కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించడంపైనే దృష్టి పెట్టిందని తెలిపారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్‌కు ఉన్న సెక్యూరిటీని 80 శాతం తొలగించారన్నారు. సెక్యూరిటీని తొలగించినా, ఇంకా ఏమి చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆపలేరని ఆయన తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ తర్వాత పులివెందులలో 70వేల టన్నుల ఇసుకను టీడీపీ వారు దోచేశారని చెప్పారు. మైన్స్, బార్ల పైనాపడిపోతున్నారని చెప్పారు. -
‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం!
మధ్య యుగాల్లో గజినీలు, ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణహోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన గుర్తుకు తెస్తోంది. ఆధునిక కాలంలో యూదు జాతి మొత్తాన్ని తుదముట్టించాలని జర్మన్ నాజీ నియంత హిట్లర్ చేసిన ఘోరకలిని తలపిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమూక మరణమృదంగం మోగిస్తోంది. ‘నారా’సుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. అధికారబలం ఉన్నవాడిదే అరాచకం... అన్న అడవినీతిని తలపిస్తూ యథేచ్చగా నరమేధం సాగిస్తోంది. హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పచ్చ ముఠాలు సభ్యులు రాష్ట్రంపై తెగబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను ముట్టడిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతున్నారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గోడు వెళ్లబోసుకునేందుకు ఏ వ్యవస్థా అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ ధర్మాన్ని కాలరాస్తోంది. టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకమే రాజ్యమేలుతోంది. – సాక్షి, అమరావతి నేడువరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గురువారం ఆయన సొంత నియోజకవర్గంలోనే హత్య చేసేందుకు టీడీపీ గూండాలు బరితెగించారు. పక్కా పన్నాగంతో కత్తులు, రాళ్లు చేతబట్టి మాటు వేశారు. మూకుమ్మడిగా దాడిచేశారు. టీడీపీ రౌడీమూకలను వారించబోయిన మాజీ ఎంపీ రెడ్డప్పను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎంపీ ప్రాణాలకే రక్షణలేని పరిస్థితి. నిన్నపల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగనరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ సామాన్యుడికి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి తాజా తార్కాణం ఈ దురాగతం. కక్ష కట్టి కత్తివేటు... హత్యలు31 హత్యాయత్నాలు 300టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాల గుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్‌రెడ్డి దారుణంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండువానిపాలెంలో సురేష్ అనే ఉన్మాది 9వ తరగతి చదువుతున్న బాలికను కత్తితో పొడిచి హత్యచేశాడు. అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం గోళపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత సతీష్... విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్... శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలోని ఓ దాబాలో రాంబాబు అనే వ్యక్తి...అనంతపురం జిల్లా కోమటికుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎరికలయ్య.. విశాఖపట్నంలోని అగనంపూడిలో కిరణ్ అనే యువకుడు... బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యాపారి... ఒంగోలులో ఓ యువకుడు... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టపల్లెలో హనిమిరెడ్డి, దాచేపల్లిలో గుమ్మడి నాగిరెడ్డి... ఇలా 40 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఐదు హత్యలు జరిగాయి. మరో 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి.భరించలేక.. బలవన్మరణాలు ఆత్మహత్యలు 35 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కాదు... చిరు వ్యాపారులు, చిన్నాచితక ఉద్యోగులు, సామాన్యులపై సైతం టీడీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఇక మా ప్రభుత్వం వచ్చింది.. మీరు తప్పుకోండి..’ అంటూ బెదిరిస్తున్నారు. తమకు ఎదురు చెబితే తప్పుడు కేసులు పెట్టి కుళ్ల»ొడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోతామని... పరువు పోతుందనే భయంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జడ ఆనంద్ పురుగులమందు తాగి చనిపోయాడు. పోలీసుల వేధింపులతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ నేతల వేధింపుల కారణంగా అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.చిన్నారులనేకనికరం లేకుండా.. లైంగిక దాడులు20టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లైంగికదాడులుఘోరంగా జరుగుతున్నాయి. చిన్నారులు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే 20 మందిపైలైంగికదాడులు జరిగాయి. వారిలో నలుగురిని దుండగులు చంపేశారు. చీరాలలో జూన్ 21వ తేదీన ఓ చేనేత కుటుంబానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా, ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పది రోజుల కిందట ఎనిమిదేళ్ల గిరిజన బాలికను దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అనంతపురం జిల్లా అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను జూన్ 24న అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసిలైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 20 మందిపై లైంగిక దాడులు జరిగాయి.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్లో జూన్ 17న ఓ మహిళపై దాడి చేసి ఒళ్లంతా కారం చల్లి ఆటోలోకి బలవంతంగా ఎక్కించి శ్రీకాకుళం పట్టణంలోకి తీసుకువెళ్లి నడివీధిలో వివస్త్రను చేసి ఊరేగించారు. అనకాపల్లి జిల్లా దర్మసాగరంలో టీడీపీ వర్గీయులు కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు అందరూ ఫిర్యాదులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
మెడికోలకు వెన్నుపోటు
సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దారుణం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లను అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లో జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ సీట్లను అందేలా చూస్తాను. – 2023 ఆగస్టు 16న మంగళగిరిలో నారా లోకేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం. – 2023 అక్టోబర్ 4వ తేదీన కృష్ణా జిల్లాపెడనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుంది. హామీలకు తిలోదకాలిచ్చే పరంపరలో భాగంగా తాజాగా యువతకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ఇ చ్చిన హామీకి తూట్లు పొడిచింది. నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దురదృష్టకరం అని గతంలో చిలక పలుకులు పలికారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గతంలో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయబోమంటూ శుక్రవారం హైకోర్టులో ప్రభుత్వం స్పష్టం చేయడం ద్వారా యువతను దగా చేసింది. దీంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూసుకోవాలనే కోరిక ఉండే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు వీరి మాయమాటలు నమ్మి మోసపోయారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా గత విద్యా సంవత్సరం నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆయా కళాశాలల్లో 50 శాతం సెల్ఫ్ ఫైనాన్స్ కోటాగా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో టీడీపీ, జనసేన పారీ్టలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను రద్దు చేయాలంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు అప్పట్లో నిరసనలు వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ జీవోలను రద్దు చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక మాట తప్పారు. ఇ చ్చిన హామీ నెరవేర్చాలి సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్ల విధానాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నారా లోకేశ్ సహా పలువురు ముఖ్య నాయకులు ఈ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. నీట్ మార్కుల ఆధారంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను కేటాయించాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు,రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
రాష్ట్రంలో అరాచక పాలన
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగా కక్ష సాధింపులు, అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వికృతానందంతోనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని చెప్పారు. ‘రెడ్ బుక్ పాలనని కాదు.. మేనిఫెస్టో అమలు చేయండి’ అంటూ హితవు పలికారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లోకేశ్ ఓ రెడ్‌బుక్‌లో కొందరి పేర్లు రాసి, వారిపై కేసులు పెట్టి తాట తీస్తానని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు దాన్ని అమలు చేయడంపైనే ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని అన్నారు. కీలకమైన పోస్టింగ్‌లు తెచ్చుకొన్న కొందరు పోలీసులు రెడ్ బుక్‌ను అమలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమని, సమాజానికి మంచిది కాదని, అ«ధికారుల వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తప్పులు చేసిన వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయని తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే సీఎం చంద్రబాబు అడ్డు చెప్పకపోగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు, లోకేశ్, రఘురామ.. ముగ్గురూ కలిసి జగన్‌ని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసు రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా, గత నెల రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచిత్రంగా జగన్‌పై కేసు నమోదు చేశారని అన్నారు. పోలీసు కస్టడీలో రఘురామను టార్చర్ చేయలేదని ఆనాడే వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. అప్పట్లో గుంటూరు కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా రఘురామ ఇప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. నాయకుల ఒత్తిడితో ఫాల్స్ కేసులు పెడితే ఆ పాపం ఊరికే పోదని, కబళించేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మేధావులు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైనా రెండు తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. పిన్నెల్లి ఎవరిపైనా దాడి చేయకపోయినా, అసత్య ఆరోపణలతో ఎన్నికలు జరిగిన 10 రోజుల తరవాత కేసులు నమోదు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోతే వెంటాడుతాంఇంట్లో ఎందరు పిల్లలున్నా అందరికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకంలో ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన టీడీపీ, ఇప్పుడు మాట తప్పి, తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామంటున్నారని అన్నారు. కుటుంబంలో అందరు పిల్లలకు ఆర్థిక సాయం చేసేలా వెంటనే జీవో మార్చాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనంపై విధివిధానాలు ఖరారు కాలేదని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు ఒకసారి ఆ జీవో చదువుకోవాలని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్‌లో ఇప్పటికే ఒకటి ఫెయిల్ అయిందని, మిగతా వాటిని అమలు చేయకపోతే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని వెంటాడుతామని ప్రకటించారు.జగన్ ప్రజల మనిషిమాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనిషి అని, ఆయన నిత్యం ప్రజలతోనే మమేకమై ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అని స్పష్టంచేశారు. నాడైనా, నేడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా వైఎస్ జగన్ ప్రజల మనిషి అని చెప్పారు. ఈ నెల 15 నుంచి జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తారంటూ ఈనాడులో ఒక బురద కథనం రాశారని ఆక్షేపించారు. నిత్యం జగన్‌పై విషం చిమ్ముతూ, చంద్రబాబును మోయడమే ఈనాడు లక్ష్యమని అన్నారు.ఏనాడూ దూరంగా లేరువాస్తవానికి జగన్ ఏనాడూ జనానికి దూరంగా లేరని రాంబాబు చెప్పారు. చంద్రబాబు ఇప్పటివరకు ఆయన జీవితంలో ఎంత మందిని కలిశారో, అంతకన్నా 10 రెట్లు ఎక్కువ మందిని జగన్ కలిశారని తెలిపారు. రోజూ ప్రజల మధ్య ఉంటూ అందరితో మమేకమయ్యే మనిషి జగన్ అని చెప్పారు.కోకొల్లలుగా ఘటనలు..వైఎస్ జగన్ పర్యటనల్లో బస్సులో వెళ్తుంటే, రోడ్డుపై ఎవరైనా కాగితం పట్టుకుని చెయ్యి పైకెత్తితే చాలు, వెంటనే బస్సును ఆపేసి వారిని కలుసుకుంటారని గుర్తు చేశారు. అలా ఎందరో బాధలను ఆయన తీర్చారని, దీనికి సంబంధించి ఎన్నెన్నో ఘటనలు ఉన్నాయని తెలిపారు. జగన్‌ని కలుసుకునేందుకు తాము జనాలను తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని, ప్రజలే జగన్‌ను కలుసుకొనేందుకు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు.ఇప్పుడూ కలుస్తున్నారువైఎస్ జగన్ ఇప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్‌లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అందరినీ కలుస్తున్నారని, ప్రతి ఒక్కరినీ ఓపికతో పలకరిస్తున్నారని, వారితో మాట్లాడుతున్నారని రాంబాబు వెల్లడించారు. నాయకులతో పాటు సామాన్యులను కూడా ఆయన కలుస్తున్నారని చెప్పారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న వైఎస్ జగన్‌పై పిచ్చి రాతలు రాసి, ఏదో ఒక విధంగా ఆయన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం మానుకోవాలని ఎల్లోమీడియాకు, ముఖ్యంగా ఈనాడు పత్రికకు రాంబాబు హితవు చెప్పారు. -
తక్షణమే తప్పుకోండి..
అనంతపురం/విశాఖ సిటీ/గుడుపల్లె (చిత్తూరు జిల్లా)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసింది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పీఏ నుంచి రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయా పదవులకు వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పారు. అధికారికం కాదులే అని ఆగినా..లోకేశ్ పీఏ పేరుతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోదని వీసీలు తొలుత భావించారు. అదే నిజమైతే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు కదా అని అనుకున్నారు. ఎవరో ప్రాంక్ కాల్చేసి ఉండవచ్చని వీసీలు మిన్నకుండిపోయారు. దీంతో నేరుగా వైస్‌ఛాన్సలర్ల వాట్సాప్ గ్రూపులో అధికారికంగా మెసేజ్ పెట్టారు. తక్షణమే వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని అందులో ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. జేఎన్టీయూ (ఏ), ఎస్కేయూ వీసీలు, రిజిస్ట్రార్లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో..» జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రమే తన పదవికి రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ ప్రొ. సి.శశిధర్ సైతం రిలీవ్ అయ్యారు. దీంతో ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణను నియమించిన వీసీ శ్రీనివాసరావు.. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. » అలాగే, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. హుస్సేన్‌రెడ్డి కూడా శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య మాత్రం పదవిలో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. » ద్రవిడ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కూడా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయాలని శుక్రవారం ఉదయం ఎవరో ఫోన్ ద్వారా ఆమెను ఒత్తిడి చేశారని సమాచారం. రాజీనామా చేయకపోతే వచ్చే సోమవారం ద్రవిడ వÆటీలో ఆందోళన చేస్తామని వీసీని హెచ్చరించారని తెలిసింది. దీంతో ఆమె శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా గవర్నరుకు పంపించారు. సాయంత్రమే ద్రవిడ వర్సిటీ వదిలి వెళ్లిపోయారు. » అలాగే, కృష్ణా యూనివర్శిటీ వీసీ జి. జ్ఞానమణి సైతం శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా..నిజానికి.. జేఎన్టీయూ (ఏ)లో అప్పటి వీసీ ప్రొ. శ్రీనివాస్‌కుమార్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమితులయ్యారు. 2019లో రాష్ర్టంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినా.. శ్రీనివాస్‌కుమార్‌ను వీసీగానే కొనసాగించారు. ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయ్‌భాస్కర్ కూడా 2015లో నియమితులైనా.. ఆరేళ్లపాటు చైర్మన్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగారు. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా వైస్ఛాన్సలర్లనే తప్పుకోమనే సంస్కృతికి తెరతీసింది. ప్రజా వ్యతిరేక పాలనను టీడీపీ ప్రభుత్వం తన మార్క్‌గా చూపించేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు భావిస్తున్నారు.పదవి కోసం వైఎస్సార్ విగ్రహం తాకట్టు..ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో జీవితాలకు బాటలు వేసిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ఈ ఏడాది ఆరంభంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడో రోజే విగ్రహాన్ని తొలగించాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విగ్రహం తొలగిస్తే మీరు పదవుల్లో కొనసాగుతారని వీసీ, రిజిస్ట్రార్లను హెచ్చరించారు. దీంతో వారు 24 గంటల్లో వైఎస్సార్ విగ్రహాన్ని అధికారికంగా తొలగించారు. అయినప్పటికీ వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లుచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జేఎన్టీయూ (ఏ)లో అధునాతనంగా నిర్మించిన ఆడిటోరియానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అక్కడే ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటుచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ర్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఎన్టీఆర్ విగ్రహం ఔన్నత్యాన్ని కాపాడారు. కానీ, టీడీపీ మాత్రం ఎస్కేయూలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.ఏయూ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొ. పీవీజీడీ ప్రసాదరెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు రిజిస్ట్రార్ స్టీఫెన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. వెంటనే ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ఏయూ అకడమిక్ డీన్‌గా ఉన్న ప్రొ.కిషోర్‌బాబును నియమించారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రసాదరెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసాదరెడ్డిపై రాజకీయ ఆరోపణలు ఎక్కుపెట్టగా.. మరోవైపు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి ఫోన్లుచేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. రాజీనామా చెయ్యకపోతే దాడులకు తెగబడతామని పార్టీ శ్రేణులు సైతం హెచ్చరించాయి. దీనిపై ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, ఏయూలోని వీసీ కార్యాలయం వద్ద నిత్యం నిరసనల పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడావుడి చేసూ్తనే ఉన్నారు. పలుమార్లు వీసీని అడ్డుకోడానికి ప్రయత్నించారు. -
లోకేశ్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అధీకృత అధికారుల నియామకం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో ఏ సంస్థలోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధీకృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో కొల్లి రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖను సవాల్ చేస్తూ టీడీపీ తరఫున నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ చీమలపాటి రవి విచారణ జరిపారు.న్యాయమూర్తి అసహనంలోకేశ్ తరఫు న్యాయవాది అఖిల్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యవహారంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం గతంలో చెప్పిందని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా?, తీసుకోబోతున్నారా?, అసలు ఈ వ్యవహారంలో ఏం చేయబోతున్నారో తెలియచేస్తూ కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఏం చెప్పాలో మీరే పేరాల వారీగా కౌంటర్ దాఖలు చేసి ఇవ్వండి. దాన్నే ప్రభుత్వం దాఖలు చేస్తుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏయే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలో కోర్టు ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు నిమిత్తం విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేశారు.