marraige
-
నీ కష్టం పగోడికి క్కూడా రాకూడదు మచ్చా... వైరల్ వీడియో
సాధారణంగా పెళ్లి కాని ప్రసాదులు ఏం చేస్తారు? పెళ్లిళ్ల పేరయ్యలనో, పెళ్లిళ్లు కుదిర్చే వెబ్‌సైట్లనో ఆశ్రయిస్తారు. అదీ కాదంటే స్నేహితుల ద్వారానో తనకు కావాల్సిన అమ్మాయిని వెతుక్కుంటారు. కానీ ఒక యువకుడు వెరైటీగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. స్టోరీ ఏంటంటే... రైళ్లలో చాయ్, సమోసాలు, పల్లీలు వగైరాలు అమ్ముకోవడం చూస్తాం.కానీ ఒక మెట్రో ట్రైన్లో ఉన్నట్టుండి ఒక యువకుడు గట్టి, గట్టిగా అరుస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా అతను మాట్లాడుతున్నదేంటో అర్థమై పగలబడి నవ్వేశారు. అంతేకాదు అమ్మాయిలు కూడా ముసి ముసినవ్వులు కోవడం ఈ వీడియోలో చూడొచ్చు. "మీ రోజుకి అంతరాయం కలిగించినందుకు క్షమించండి. నేను డ్రగ్స్ వాడను నాకు పిల్లలు లేరు. కానీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఐ లవ్ అమెరికా, ప్లీజ్ నన్ను వరైనా నన్ను వివాహం చేసుకోండి. తద్వారా అమెరికాలో ఉండగలను. నాకు మంచి వంట వచ్చు. మంచిగా మాలిష్ చేయడం వచ్చు. డిస్కో సంగీతం వింటాను’’ ఇలా సాగుతుండి అతగాడి అభ్యర్థన. ‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు, నా డబ్బు కూడా మీకే ఇస్తాను. మంచి బట్టలు, బూట్లు కొనుగోలు చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చేశాడు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో.. ఆడా, మగా ఎవరైనా, నాకు ఆఫర్ చేయడానికి సమాన అవకాశాలు’’ అనడంతో అక్కడున్నవారంతా గొల్లుమన్నారు. దీంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు.‘‘హిల్లేరియస్, ఇతగాడు మంచి సేల్స్ మేన్, తనను తాను అమ్మేసుకుంటున్నాడు’’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. వీళ్లను చూసి ‘‘మీకు భలే హ్యాపీగా ఉండాది గదా’’ అని పుష్ప స్టైల్లో ఉడుక్కుంటున్నారట పెళ్లి కాని ప్రసాదులు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గెయెంకా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియో ప్రామాణికత, మూలంపై స్పష్టత లేదు. యూఎస్ లో పరిస్థితి ఇదీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. In trains in India, people sell chai, toys, combs, samosa, etc. But in USA ??? Watch & enjoy ................. ! 😄😜😃 pic.twitter.com/dfXcEOEbOh— Harsh Goenka (@hvgoenka) December 12, 2024 -
హిందూ సంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్,ఆంటోనీల పెళ్లి
హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు.గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. నూతన వధూవరులను వారందరూ ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్‌తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్‌లో బిజీ హీరోయిన్గా ఉన్న ఆమె కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బేబీ జాన్ మూవీతో ఆమె బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే విడుదలకానుంది.కీర్తి సురేష్ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ KA అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇచ్చారట.. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
వధువు బంగారు నగలు మాయం.. బ్యూటీషియన్‌పై కేసు
పామిడి: ఫంక్షన్ హాలులో వధువు బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. ప్రత్యామ్నాయ నగలు అలంకరించి పెళ్లి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేశారు. మూడు గంటల వ్యవధిలోనే బంగారును రికవరీ చేశారు. వధువును అలంకరించేందుకు వచ్చిన బ్యూటీషియనే దొంగ అని గుర్తించారు. వివరాల్లోకెళితే.... రామరాజుపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి కుమార్తె పెళ్లి పామిడిలోని కోగటం ఫంక్షన్‌హాలులో జరిగింది. గురువారం రాత్రి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం తలంబ్రాలు. వధువుకు సంబంధించిన 28 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. నగల మాయంపై పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను ఆరా తీస్తే బాధపడతారేమోనని వధువు కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ నగలతో అలంకరించి పెళ్లి ఘట్టం ముగించారు. తర్వాత స్తబ్దుగా ఉండిపోయిన వధువు తండ్రిని గమనించిన స్నేహితులు రెక్కల చిన్న నాగిరెడ్డి ఆధ్వర్యంలో రామరాజుపల్లికి చెందిన రామశేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన సీఐ యుగంధర్ తన సిబ్బందితో ఫంక్షన్ హాలుకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆధారాలు లభించలేదు. దీంతో పెళ్లి కుమార్తె గదిని పరిశీలించారు. అక్కడ పైకప్పు పీఓపీ కొంత గ్యాప్ కనిపించింది. అక్కడేముందని చూడగా రెండు ఖాళీ నగల బాక్సులు కిందపడ్డాయి. ఇక్కడే ఏదో జరిగిందని అర్థమైంది. గదిలో ఎవరెవరు ఉన్నారు. ఎవరెవరు వచ్చి వెళ్లారు అని సీఐ ఆరా తీశారు. మేకప్ చేయడం కోసం బెంగళూరు నుంచి వచ్చిన బ్యూటీషియన్ తీరుపై అనుమానం కలగడంతో.. ఆమెను తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకొచ్చింది. తానే నగలు తస్కరించానని, వాటిని వాష్‌రూమ్‌లో ఫ్లష్‌ట్యాంకులో దాచి పెట్టిన నగలను చూపించింది. అనంతరం బ్యూటీషియన్‌పై సీఐ కేసు నమోదు చేశారు. మూడు గంటల వ్యవధిలోనే బంగారు నగలను రికవరీ చేసిన సీఐకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా గుడికి వెళ్లిన నాగచైతన్య-శోభిత
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని అక్కినేని అభిమానులు, ఆత్మీయులు ఆశీర్వదించారు. పెళ్లి అయిన వెంటనే వారిద్దరూ మొదటగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.నూతన వధూవరులతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు అందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కొత్త దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో పాటు ఆలయ మహాద్వారం వద్ద వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదాలు వారికి అందించారు. పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా చై-శోభిత కనిపించడంతో అభిమానులు భారీగా గుమికూడారు. -
శోభిత-నాగ చైతన్య పెళ్లి : అప్పుడు అలా.. ఇపుడు ఇలా!
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్ల వేడుకతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లికి వధువు శోభితా ధూళిపాళ సింపుల్ మేకప్, టెంపుల్ జ్యుయల్లరీతో బంగారు రంగు కంజీవరం ప్యూర్ గోల్డ్ జరీ చీరలో అందంగా ముస్తాబైంది. వరుడు నాగచైతన్య టెంపుల్ బోర్డర్ఉన్న పంచె (మధుపర్కం) కట్టుకొని ఎలిగెంట్ లుక్‌లో అలరించాడు. అయితే కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, తన జీవితంలో కీలకమైన శుభకార్యానికి తాతగారి పంచెను కట్టుకున్నాడంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో తన పెళ్లికి తన తాత పంచెను ధరించాడుట. కుర్తా-పైజామాతో పాటు ముహూర్తం సమయానికి తనతాత టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంతగ అక్కినేని నాగేశ్వరావు తెల్లటి పంచెను ఎంచుకున్నాడట. అలా అక్కినేని కుటుంబ వారసత్వాన్ని పాటించాడు అంటున్నారు ఫ్యాన్స్. (మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం)తాజాగా సోషల్‌మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాతో చైతన్య మొదటి పెళ్లినాటి ఫోటోలు, సమంత ఎంగేజ్మెంట్కు, పెళ్లికి కట్టుకున్న చీర వివరాలు కూడా మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడు సమంతా అమ్మమ్మ చీరను మురిపెంగా కట్టుకుంటే, ఇపుడు చైతన్య తాత పంచెను కట్టుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కాగా నాగ చైతన్యతో పెళ్లి సందర్బంగా సమంత ‘చే’ అమ్మమ్మ చీరను ప్రత్యేకంగా రీడిజైన్ చేయించుకుంది. అలాగే చే, సామ్ లవ్ స్టోరీతో ఆధారంగా వారి ఎంగేజ్మెంట్ చీరను తీర్చిదిద్దుకున్న సంగతి తెలిసిందే. -
మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్-అదితీ
హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అవును మీరు సరిగానే విన్నారు. హీరోయిన్ అదితీతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఇతడు.. సెప్టెంబరులో ఈమెని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణలోని వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయం దీనికి వేదికైంది. ఇప్పుడు మరోసారి వివాహమాడాడు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)సెప్టెంబరులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అదితీ, సిద్ధార్థ్ తమ తమ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో తోటీ నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) -
బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు
పుట్టపర్తి టౌన్: అవ్వతాత చేస్తున్న బలవంతపు పెళ్లి ప్రయత్నాల నుంచి తనను కాపాడి ఉన్నత చదువులు అభ్యసించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రత్న వద్ద ఓ విద్యార్థిని మొరపెట్టుకుంది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్య వేదికలో ఎస్పీని కనగానపల్లికి చెందిన విద్యార్థిని సాయి కలసి వినతి పత్రాన్ని అందజేసింది. బాధితురాలు తెలిపిన మేరకు... కనగానపల్లికి చెందిన చెన్నప్నకు ముగ్గురు కుమార్తెలున్నారు. తండ్రి అవిటివాడు కావడంతో తాత పాపన్న, అవ్వ వెంకటలక్ష్మి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అక్కచెళ్లెళ్లు చదువులు కొనసాగించారు. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించిన సాయి... ఇంటర్లో 950 మార్కులతో టాపర్‌గా నిలిచింది. డిగ్రీ కళాశాలలో చేరాలని అనుకుంటుండగా అవ్వ, తాత, ఇతర కుటుంబసభ్యులు తన సర్టిఫికెట్లు లాక్కొని బలవంతంగా బంధువుల అబ్బాయితో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తల్లిదండ్రలు సైతం ఏమి చేయలేని అసహాయ స్థితిలో ఉన్నారు. సర్టిఫికెట్లు ఇప్పించి తన విద్యాభ్యాసానికి మార్గం సుగమమం చేయడంతో పాటు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఎస్పీని బాధితురాలు వేడుకుంది. స్పందించిన ఎస్పీ తక్షణమే సంబంధిత పీఎస్ సీఐతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వయిజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్!
అక్కినేని హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సందడి చేసింది.వచ్చేనెల డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. అయితే పెళ్లి వేదిక విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య- శోభిత పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనుందట. ఎందుకంటే అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్ కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగువారి సినీదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కూడా అక్కడే ఉంది. అందువల్లే పెళ్లి వేడుక అక్కడే నిర్వహిస్తే తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని కుటుంబసభ్యులు భావిస్తున్నారట. కాగా.. ఏఎన్నార్ శతజయంతి వేడుకలు కూడా అక్కడే నిర్వహించారు.పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ప్రత్యేకంగా వేదికను తయారు చేస్తున్నట్లు టాక్. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేలా వీరి వివాహా వేదికను అలంకరించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ విహహం అత్యంత వైభవంగా జరగనుంది. -
అనుష్క పెళ్లిపై రూమర్స్.. తొలిసారి స్పందించిన స్వీటి
నాలుగు పదుల వయసు దాటినా సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని హీరోయిన్ల శాతం చాలానే ఉంది. అలాంటి వారిలో త్రిష, అనుష్క పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. దీంతో సోషల్‌మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున పలు కథనాలు వస్తూనే ఉంటాయి. పెళ్లి వార్తలపై అనుష్క తాజాగా స్పందించారు. తెలుగులో కథానాయకిగా రంగప్రవేశం చేసిన బెంగళూరు బ్యూటీ ఈమె. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలతో జతకట్టి పాపులర్ అయ్యారు. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారారు. అలాంటిది సడన్‌గా సైజ్ జీరో చిత్రంలోని పాత్ర కోసం బరువు పెరిగి ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక కెరీర్ గాడి తప్పింది. చిన్న గ్యాప్ తరువాత తాజాగా ఘాడీ అనే వైవిధ్యభరిత కథా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తొలిసారిగా ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇకపోతే వ్యక్తిగతంగా అనుష్క చాలా వదంతులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా పెళ్లి విషయంలో పలు అసత్య ప్రచారానికి గురవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరితో ప్రేమను అంటగట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తాజాగా ఓ దుబామ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడానికి అనుష్క సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆపై ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్‌తో ఆమె పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. వీటిలో ఏ ఒక్క విషయాన్ని ఆమె ధ్రువపరచలేదన్నది గమనార్హం. ఈ వదంతులపై స్పందించిన అనుష్క తనకు పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంతో తాను ఎప్పుడూ బాధపడిందిలేదన్నారు. అయినా పెళ్లి పెళ్లి అంటున్న వారు.. ఎక్కడ, ఎవరితో జరిగిందో చెప్పడం లేదన్నారు. వివాహ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు. అది నేరం కాదని.. భావోద్వేగంతో కూడిన విషయం అని, ఇకనైనా అసత్య ప్రచా రం చేయొద్దని అన్నారు. ఆ టైం వస్తే అందరికీ తెలియజేస్తానని అనుష్క పేర్కొన్నారు. -
అఫీషియల్: నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి తేదీ ఖరారు
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత ధూళిపాళ్ల మెరిసింది. తమ కాబోయే కోడలిని మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున పరిచయం కూడా చేశారు.తాజాాగా వీరి పెళ్లి తేదీపై నాగార్జున కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై స్పందించారు. అదే రోజున వివాహం జరగనుందని అక్కినేని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నుంచి వీరి పెళ్లి తేదీపై నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కుతారా? లేదంటే కొత్త సంవత్సరంలో గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుందా? అని నెటిజన్స్‌తో పాటు అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. తాజాగా జరిగిన ఏఎన్నాఆర్ శతజయంతి వేడుకల్లో శోభిత కనిపించడంతో మరోసారి పెళ్లి తేదీపై మరోసారి ఆరా తీశారు.పెళ్లి తేదీపై రూమర్స్...గత కొద్ది రోజులుగా ఈ జంట ఈ ఏడాది డిసెంబర్లోనే పెళ్లికి సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. చై- శోభిత డిసెంబర్ మొదటి వారంలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలొచ్చాయి. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు టాలీవుడ్‌లోనూ టాక్ వినిపించింది. వచ్చే డిసెంబరు 4న వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అందరూ అనుకున్నట్లుగానే పెళ్లి తేదీ విషయంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చేసింది. (ఇది చదవండి: రామ్‌చరణ్,వెంకటేష్ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే: దర్శకుడు )మొదలైన పెళ్లి పనులు..ఇటీవల పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని శోభిత తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించింది. శోభిత ఇంట్లో తన తల్లి, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. టాలీవుడ్ సినీ ప్రియులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండేల్తో చైతూ బిజీ..కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకారుల బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
అక్కినేని ఇంట పెళ్లి సందడి.. నాగచైతన్య- శోభిత వివాహం అప్పుడేనా?
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ పెళ్లి పనులు మొదలైనట్లు శోభిత ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. పసుపు దంచడంతో చైతూ- శోభిత పెళ్లి సందడి మొదలెట్టారు. పెళ్లి పనుల్లో సంప్రదాయ దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అయితే పెళ్లి పనులు మొదలు కావడంతో అందరి దృష్టి వివాహం ఎప్పుడనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. ఈనెలలోనే ఉంటుందా? లేదంటే నవంబర్, డిసెంబర్లోనా అని అందరు తెగ ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా వీరి పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ఇది చదవండి: నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు)తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాబోయే జంట నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల తమ గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ని ఎంపిక చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే వీరి పెళ్లి తేదీ, వేదికపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. ఆ తర్వాతే చైతూ-శోభిత పెళ్లి తేదీలు, వేదికపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు
గొల్లపల్లి: ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. ఈ ఘటన గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మ్యాట్నీ మల్లేశం, లత దంపతుల కొడుకు శ్రీనివాస్.. మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన బాసవేని శంకరయ్య, సుశీల దంపతుల కుమారుడు (ట్రాన్స్‌జెండర్) అంజలి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం కొన్నాళ్లు గల్ఫ్ వెళ్లాడు. స్వగ్రామానికి రాగానే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులను ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజే చప్పుళ్ల మధ్య ట్రాన్స్జెండర్లు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. -
అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు.. తాళి కట్టించిన బంధువులు
గన్నవరంరూరల్: మండలంలోని సూరంపల్లి గ్రామంలో ఓ యువకుడిని శనివారం అర్ధరాత్రి గ్రామస్తులు బంధించిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన ఆ యువకుడు తల్లి లేని ఓ బాలికను ప్రేమ పేరిట వలలో వేసుకుని, రాత్రి వేళ ఇంటికి రాగా, బాలిక బంధువుల యువకుడిని నిలదీసి తాళ్లతో కట్టివేశారు. ఈ విషయం తెలిసి ఆ యువకుడి బంధువులు ఆ ప్రదేశానికి చేరుకోవటంతో అర్ధరాత్రి కలకలం రేగింది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావటంతో మరింత చర్చకు దారి తీసింది. అనంతరం గ్రామస్తులు ఆ జంటకు పెళ్లి చేశారు. గన్నవరం పోలీసులకు తెలియడంతో ఆదివారం వారిని స్టేషన్‌కు రప్పించారు. ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. బాలిక మైనర్ కావటంతో ప్రజ్వల హోమ్‌కు పంపినట్లు చెప్పారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట బాలిక, యువకుడిని హాజరుపరుస్తామన్నారు. -
పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్.. అదేంటంటే!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన పెళ్లాడారు. కర్ణాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల్లో బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు.రహస్య గోరఖ్‌తో పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్ చేశారు. మా జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. ఇవీ చూసిన అభిమానులు తమ హీరోకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. రాజావారు రాణిగారు సినిమాతో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ "క" లో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియావ్యాప్తంగా రిలీజ్ కానుంది. We Need all your blessings ❤️🙏 pic.twitter.com/3ibTFUuJp0— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 23, 2024 -
ప్యారిస్ ఒలింపిక్స్ : రొమాంటిక్ లవ్ ప్రపోజల్, వైరల్ వీడియో
సిటీ ఆఫ్ లవ్.. ప్యారిస్. తన ఇష్టసఖి మనసు గెల్చుకునేందుకు విశ్వక్రీడావేదికను ఎంచుకున్నాడు. ఈ రొమాంటిక్ స్టోరీ ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఈ చైనీస్ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యాకియోంగ్, జెంగ్ సివీ స్వర్ణం గెలిచి తమ కలను సాకారం చేసుకున్నారు. కానీ బోయ్ ఫ్రెండ్ డైమండ్ రింగ్‌ను సొంతం చేసుకుంటానని ఊహించలేదు..హువాంగ్. స్టోరీ ఏంటంటే..:తన లవ్ ప్రపోజల్‌కు ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది అనుకున్నాడో ఏమో గానీ చైనీస్ షట్లర్ లియు యుచెన్, తన ప్రేయసి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ మోకాళ్లపై వంగి ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ హువాంగ్ యాకియోంగ్కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. దీంతో సిగ్గుల మొగ్గ అవ్వడం ఆమె వంతైంది. సోషల్ మీడియాలో ఈ ప్రేమికులకు అభినందనలు వెల్లువెత్తాయి. లియు యుచెన్ ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలవలేదు కానీ ఒలింపిక్ బంగారు పతక విజేతను గెల్చుకున్నాడు అంటూ అభినందించారు. పురుషుల డబుల్స్‌లో టోక్యో-2020 రజత పతకాన్ని గెల్చుకున్నాడు లియు."I’ll love you forever! Will you marry me?""Yes! I do!" OMG!!! Romance at the Olympics!!!❤️❤️❤️Huang Yaqiong just had her "dream come true", winning a badminton mixed doubles gold medal🥇with her teammate Zheng SiweiThen her boyfriend Liu Yuchen proposed! 🎉🎉🎉 pic.twitter.com/JxMIipF7ij— Li Zexin (@XH_Lee23) August 2, 2024శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ బ్యాడ్మింటన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో- జియోంగ్ నా-యూన్ (21-8, 21-11)పై చైనాకు చెందిన జెంగ్ సివీ మరియు హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు.కాగా అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ స్టార్ పాబ్లో సిమోనెట్, మహిళల ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్ కామ్పోయ్ లవ్ స్టోరీ కూడా ప్యారిస్ ఒలింపిక్స్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లి ప్రతిపాదన తెచ్చేందుకు తొమ్మిదేళ్లు వెయిట్ చేసిన మరీ ఆమె మనసు దోచుకున్నాడు -
పెళ్లి గురించి ప్రశ్నించిన నెటిజన్.. హీరోయిన్ అదిరిపోయే రిప్లై!
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చియన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గతంలో ఎప్పుడు చూడని లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఇవాళ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎక్స్ వేదికగా అభిమానులతో ఆస్క్ మాళవిక అనే సెషన్ నిర్వహించారు. ఇందులో చాలామంది ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నించారు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఓ నెటిజన్ ఏకంగా మాళవిక పెళ్లి గురించి ఆరా తీశారు. మీరెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అంటూ పోస్ట్ చేశారు. దీనిపై మాళవిక స్పందిస్తూ.. నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు? అంటూ గట్టిగానే రిప్లై ఇచ్చేసింది. మరికొందరు తంగలాన్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. తంగలాన్ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. అ Why you in a rush to see me married? :( https://t.co/epaOAhywvs— Malavika Mohanan (@MalavikaM_) July 31, 2024 -
పెళ్లి వేడుకల్లో ప్రియుడితో కలిసి సందడి చేసిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న మూవీలో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ.తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసింది. బుధవారం జరిగిన శివశక్తి పూజకు హాజరైంది. జాన్వీ భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీరితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
మరోసారి ప్రభాస్ పెళ్లి టాపిక్.. శ్యామలా దేవి ఏమన్నారంటే?
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల మార్కును దాటేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమా త్వరలోనే వెయ్యి కోట్ల మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే ఈ సినిమాను మొదటి రోజే వీక్షించిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(కృష్ణం రాజు సతీమణి) ఆనందం వ్యక్తం చేసింది. బుజ్జి కారులో కూర్చుని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద సందడి చేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి శ్యామలా దేవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ప్రభాస్‌కు పెళ్లికాదని ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటలపై ఆమె స్పందించింది.శ్యామలా దేవి మాట్లాడుతూ..' గతంలో ప్రభాస్ సినిమాలు సక్సెస్ కావన్నారు. ఇప్పుడు కల్కి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభాస్ సినిమాలు ఆడవన్న వారి అంచనాలు కల్కితో తలకిందులయ్యాయి. ప్రభాస్ పెళ్లి కూడా అంతే. కోట్లాది అభిమానుల కోసం ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుంది. కానీ సరైన సమయం రావాలి కదా. ఇప్పటివరకు అన్ని అనుకున్నట్లే జరిగాయి. అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుంది' అని అన్నారు. కాగా.. గతంలోనూ ప్రభాస్ పెళ్లి రూమర్స్‌పై శ్యామలా దేవి స్పందించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు
రామడుగు(చొప్పదండి): అమ్మాయిది శ్రీలంక.. అబ్బాయిది రామడుగు మండలంలోని పందికుంటపల్లి. దేశాలు వేరైనప్పటికీ ప్రేమ అనే బంధం ఇరువురినీ ఒక్కటి చేసింది. పందికుంటపలి్లకి చెందిన కట్కం సురేందర్ ఉద్యోగం చేయడానికి లండన్ వెళ్లాడు. తాను పని చేస్తున్న ఆఫీస్‌లో శ్రీలంక దేశానికి చెందిన జానుషికతో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో తమ కుటుంబసభ్యులను పెళ్లికి ఒప్పించారు. బుధవారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఏడడుగులు వేశారు. వివాహానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మీనా
-
డబ్బుల కోసం ఇంత కక్కుర్తా? స్వయానా అన్ననే.. వైరల్ స్టోరీ
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటూ పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వం పోత్సాహం పథకం డబ్బుల కోసం కక్కుర్తి పడి, సొంత అన్నాచెలెళ్లే పెళ్లి తంతు ముగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సమూహిక్ వివాహ్ యోజన పథకం కింద నిర్వహించిన కమ్యూనిటీ వివాహ కార్యక్రమంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 2024, మార్చి 5న మహారాజ్‌గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతో పాటు రూ.51 నగదు అందించారు. అయితే మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక మహిళకు అప్పటికే పెళ్లయిపోయింది. కానీ భర్త దూరంగా ఉన్నాడు. దీంతో ప్రభుత్వ పథకం కోసం సొంత అన్నతో కలిసి పన్నాగం పన్నింది. ఏమాత్రం సంకోచం లేకుండా సోదరుడిని వివాహం చేసుకుంది. 'సప్తపది' (ఏడు సార్లు అగ్ని ప్రదక్షిణం) తో సహా అన్ని ఆచారాల్ని పాటించింది. అనంతరం బహుమతులు అందుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విస్తుపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చేరడంతో, పరిశీలించిన అధికారులు అప్పటికే ఆమెకు వివాహమైనట్లు గుర్తించారు. దీంతో లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అమిత్ మిశ్రా విచారణకు ఆదేశించారు. వారికిచ్చిన బహుమతులను కూడా వెనక్కి తీసుకున్నామనీ, ఈ పథకం కింద ఇచ్చే నగదు సహాయం నిలిపి వేస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా తెలిపారు. కాగా ఇటీవల యూపీలోని బల్లియా జిల్లాలో కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు, తమకు తామే దండలు వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
నిర్మాతను పెళ్లాడిన ప్రముఖ నటి.. ఫోటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ!
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదు. ఈ ఏడాదిని వివాహాల సంవత్సరంగా పేరు మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కొత్త ఏడాదిలో సినీ ప్రముఖులు చాలామంది పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడగా.. త్వరలోనే కృతి కర్బందా, మీరా చోప్రా కూడా వెడ్డింగ్‌కు సిద్ధమయ్యారు. తాజాగా మరో బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. నిర్మాతను పెళ్లాడిన ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం. ప్రముఖ నటి సుఖ్మణి సదానా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సన్నీ గిల్‌ను మార్చి 3, 2024 పెళ్లాడారు. అమృత్‌సర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు మూడూ రోజుల పాటు అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లయిన విషయాన్ని కాస్తా ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది ముద్దుగుమ్మ. తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితంలో అత్యంత అందమైన రోజు ఇది.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ నటి పోస్ట్ చేసింది. కాగా.. సుఖ్మణి సదానా సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో నటించింది. అంతే కాకుండా జోగి, రాకెట్రీ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. వీటితో పాటు తాండవ్, ఉడాన్ పటోలాస్, తనవ్, మన్మర్జియాన్ లాంటి షోలలో కూడా కనిపించారు. View this post on Instagram A post shared by Sukhmani Sadana (@sukhmanisadana) -
పెళ్లి ఇంట బాణసంచా మంట
నరసరావుపేట టౌన్: వివాహ వేడుక కోసం తెచ్చిన బాణ సంచా పేలి ఆటోతో పాటు రెండు వాహనాలు, పెళ్లి పందిరి దగ్ధమైన సంఘటన నరసరావుపేటలో జరిగింది. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయ డంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అరండల్ పేటలో ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. అరండల్ పేట అన్నపూర్ణమ్మ హాస్పటల్ వీధిలో వివాహ ఊరేగింపుగా వెళ్లేందుకు ఆటోలో బాణ సంచాను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. ఊరేగింపు మొదలవ్వగానే నిర్వాహకులు టపాసులు పేల్చారు. అందులోనుంచి చెలరేగిన నిప్పురవ్వలు ఆటోలో ఉన్న బాణ సంచాపై పడటంతో మంటలు చెలరేగాయి. ఒకేసారి బాణ సంచా అంతా పేలటంతో పెద్దస్థాయిలో శబ్ధం వచ్చింది. దీంతో స్థానికులు భయంతో పరుగు తీశారు. కొద్దిసేపటి తర్వాత అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేశారు. ఆటో నుంచి వచ్చిన మంటలు పక్కనే ఉన్న పెళ్లి పందిరికి అంటుకోవటంతో పందిరి పూర్తిగా దగ్ధమైంది. అదేవిధంగా సమీపంలోని స్కూటీ, తోపుడు బండి అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించటంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి, అగ్నిమాపక శాఖ, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, పరిస్థితిని సమీక్షించారు. -
పెళ్లి తర్వాత ఆ ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి: వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా మార్చిన 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు వరుణ్. అందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఉమెన్స్ కాలేజీలో సందడి చేశారు. ఈవెంట్లో పాల్గొన్న యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ తేజ్ బదులిస్తూ.. 'పెళ్లి తర్వాత ఫోన్‌కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని.. కానీ అవన్నీ ప్రేమతోనేనని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతే కాకుండా ఈ ఏడాది వాలెంటైన్ డే రోజు లావణ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినిలు వరుణ్‌తేజ్‌కు ప్రశ్నలు వేశారు. నా సినిమా స్క్రిప్టు ఎంపికలో పెద్దనాన్న చిరంజీవినే ఆదర్శంగా తీసుకుంటానని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆన్సరిచ్చారు. అంతే కాకుండా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ గురించి మాట్లాడుతూ.. 'దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. ఇలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడిగారు. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్‌ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతినిచ్చింది' అని అన్నారు. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. #TFNExclusive: Ace Producer #DilRaju & Groom @AshishVOffl along with their family members get papped as they jet off to Jaipur for the grand wedding ceremony!! 📸🤩#Ashish #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IQllj4yVCU — Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024