Mitchell Marsh
-
IND Vs AUS: నితీశ్ రెడ్డి ధనాధన్.. బౌలింగ్‌లోనూ అదుర్స్! బ్యాటర్ ఫ్యూజులు ఔట్
టీమిండియా యువ క్రికెటర్, విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ టెస్టుల్లో తొలి వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి.. సత్తా చాటాడు. కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన నితీశ్.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో 21 ఏళ్ల నితీశ్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. ఈ ఏడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. మూడు మ్యాచ్‌లలో కలిపి 90 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, అనూహ్య రీతిలో నితీశ్ రెడ్డిని సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేశారు. ఇందుకు ప్రధాన కారణం నితీశ్‌కు ఉన్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలే! హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకే పరిమితం కావడంతో టెస్టుల్లో అతడి వారసుడి కోసం టీమిండియా ఎదురుచూస్తోంది.ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ కూడా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండరే అయినా.. ఆసీస్ టూర్‌కు మాత్రం బీసీసీఐ నితీశ్‌నే ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ శార్దూల్‌ను పక్కనపెట్టి.. ఈ యువ ఆటగాడికి పెద్దపీట వేసింది.అంతేకాదు... మెగా సిరీస్‌కు నితీశ్‌ను సన్నద్ధం చేసే క్రమంలో.. భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు ముందే అతడిని ఆస్ట్రేలియాకు పంపించింది. అయితే, ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో నితీశ్ ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు.ఆసీస్‌తో అనధికారిక సిరీస్‌లో 71 (0, 17, 16, 38) పరుగులు మాత్రమే చేయడంతో పాటు.. ఒకే ఒక్క వికెట్ తీశాడు నితీశ్. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టుల్లో అతడిని ఆడిస్తారా? లేదా? అన్న సందేహాల నడుమ.. మేనేజ్మెంట్ మాత్రం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచింది.ఈ క్రమంలో పెర్త్ వేదికగా తొలి టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి.. టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 59 బంతుల్లో 41 పరుగులతో భారత టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ ఆల్‌రౌండర్.. రెండో ఇన్నింగ్స్‌లో తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా నితీశ్ రెడ్డి టెస్టుల్లో వికెట్ల ఖాతా కూడా తెరిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకారిగా పరిణమించిన మిచెల్ మార్ష్(47)ను నితీశ్ తన బౌలింగ్ నైపుణ్యంతో బోల్తా కొట్టించాడు.అతడి బౌలింగ్‌లో మార్ష్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా.. బంతి తాకి స్టంప్స్ ఎగిరిపడ్డాయి. దీంతో మార్ష్ షాకింగ్ రియాక్షన్‌తో క్రీజును వీడాడు. ఈ క్రమంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా తొలి టెస్టులో టీమిండియా ఆసీస్‌కు 534 పరుగుల భారీ లక్ష్యం విధించింది. అయితే, ఆసీస్ 182 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.EDGE & GONE!Nitish Kumar Reddy gets the big fish #MitchellMarsh!#AUSvINDOnStar 👉 1st Test, Day 4, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/n4mKpojPhp— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
భారత్‌తో సిరీస్.. ఆ ఇద్దరు కీలకం: కమిన్స్
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత్‌తో స్వదేశంలో జరగనున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పేస్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిషెల్ మార్ష్ కీలకమవుతారని ఆ్రస్టేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వీరిద్దరూ అందుబాటులో ఉంటే ప్రధాన పేసర్లపై భారం తగ్గడంతో పాటు... బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ‘పేస్ ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల అదనపు ప్రయోజనమే. వేసవిలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో గ్రీన్, మార్ష్ కీలకం అవుతారు. గతంలో వారిని పెద్దగా వినియోగించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ బౌలర్‌గానే కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తగినంత అనుభవం కూడా సాధించాడు. వీరిద్దరి వల్ల జట్టు సమతుల్యం పెరుగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. నాథన్ లయన్ వంటి సీనియర్ స్పిన్నర్ ఉండటం మా అదృష్టం’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన గత రెండు బోర్డర్–గవాస్కర్ ట్రోఫీల్లో పరాజయం పాలైన ఆసీస్... ఈసారి సిరీస్ ఎలాగైనా సిరీస్ చేజిక్కించుకోవాలని ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. -
అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: ఆసీస్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా మరో ముందడుగు వేసింది. నమీబియాతో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని సూపర్-8 దశకు అర్హత సాధించింది. ప్రత్యర్థిని 72 పరుగులకే పరిమితం చేసి.. 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాపై జయభేరి మోగించి భారీ రన్‌రేటుతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ నమీబియాపై భారీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టులో కీలక సభ్యుడైన ఆడం జంపా ఈ మ్యాచ్‌లో ప్రధాన పాత్ర పోషించాడని ప్రశంసించాడు.అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం‘‘ఈరోజు మా బౌలింగ్ విభాగం అత్యద్భుతంగా రాణించింది. సమిష్టి కృషితో దక్కిన విజయం ఇది. సూపర్-8కు అర్హత సాధించడం ఎంత ముఖ్యమో మాకు తెలుసు.రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ప్రదర్శనతో వరుస గెలుపులు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాం. ఇక జంపా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.గత నాలుగైదేళ్లుగా మా జట్టులో అతడు అత్యంత ముఖ్యమైన సభ్యుడిగా ఎదిగాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించడం తన ప్రత్యేకత. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆడం జంపాను కొనియాడాడు.విండీస్‌లో బీచ్‌లు సూపర్ఇక వెస్టిండీస్ ఆతిథ్యం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ రోజులు అద్భుతంగా గడుస్తున్నాయి. చాలా బీచ్‌లు ఇక్కడున్నాయి. ఒక్కోసారి మాకు పెర్త్‌లో ఉన్న అనుభూతి కలుగుతోంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా అమెరికాతో కలిసి విండీస్ ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్-డి: ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా👉వేదిక: సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా👉టాస్: ఆస్ట్రేలియా.. తొలుత బౌలింగ్👉నమీబియా స్కోరు: 72 (17)👉టాప్ స్కోరర్: గెర్హార్డ్ ఎరాస్మస్(43 బంతుల్లో 36 పరుగులు)👉ఆస్ట్రేలియా స్కోరు: 74/1 (5.4)👉టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 రన్స్, నాటౌట్)👉ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా. సూపర్-8కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆడం జంపా(4/12).చదవండి: T20 WC 2024: గెలిచి నిలిచిన పాక్ View this post on Instagram A post shared by ICC (@icc) -
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్ వరల్డ్‌కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు! -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్‌కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
IPL 2024: కండల వీరుడిని ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ నుంచి అర్దంతరంగా వైదొలిగిన మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్, కండల వీరుడు గుల్బదిన్ నైబ్‌ను ఎంపిక చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నైబ్‌ను డీసీ మేనేజ్మెంట్ 50 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. త్వరలో నైబ్ జట్టుతో చేరతాడని డీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నైబ్కు ఇది తొలి ఐపీఎల్.ఆఫ్ఘనిస్తాన్ తరఫున 82 వన్డేలు, 62 టీ20లు ఆడిన నైబ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 99 వికెట్లు పడగొట్టి, 2038 పరుగులు చేశాడు. నైబ్ ఖాతాలో ఓ ఐదు వికెట్ల ఘనత, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 33 ఏళ్ల నైబ్ 2019లో ఆఫ్ఘన్ వన్డే జట్టుకు సారధిగా కూడా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నైబ్ విశేషంగా రాణించాడు. ఈ సిరీస్‌లో బంతితో పర్వాలేదనిపించిన నైబ్.. బ్యాటింగ్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.మార్ష్ విషయానికొస్తే.. ఈ ఐపీఎల్ సీజన్లో మార్ష్ తొలి నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత అతను గాయపడటంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ సీజన్లో మార్ష్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. డీసీ యాజమాన్యం మార్ష్‌ను ఈ ఏడాది వేలంలో 6.5 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.ఢిల్లీ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు..ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ఇందులో తప్పక గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఢిల్లీ ఏప్రిల్ 27న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 26) కేకేఆర్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. విధ్వంసకర ఆటగాడికి గాయం
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7 వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపనడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ గాయం కారణంగా ముంబైతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు. అయితే మార్ష్‌కు ఎటువంటి గాయమైందో, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని దాదా వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది సీజన్లో మార్ష్ ఇప్పటివరకు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 71 పరుగులు చేసిన మార్ష్.. అటు బౌలింగ్‌లో కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక అతడి స్ధానంలో మరో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఐపీఎల్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా ముంబైతో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కుల్దీప్ కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. -
ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్..?
ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 జట్టుకు సారధిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. మార్ష్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జార్జ్ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలెక్షన్ కమిటీలో మెంబర్ కూడా అయిన మెక్ డొనాల్డ్ మార్ష్ ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ పగ్గాలు చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాడు. టీ20 బాధ్యతలు వదులుకునేందుకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆసీస్ టీ20 జట్టు సారధిగా మార్ష్‌కు ఘనమైన రికార్డే ఉంది. మెక్ డొనాల్డ్ మార్ష్ వైపు మొగ్గు చూపేందుకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తుంది. 32 ఏళ్ల మార్ష్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన తొలి సిరీస్‌లోనే ఆస్ట్రేలియాను విజయపథాన నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2021-23 అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మార్ష్ నేతృత్వంలోని ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ సిరీస్‌లో మార్ష్ బ్యాటర్‌గా కూడా రాణించి (92 నాటౌట్, 79 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో విండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మార్ష్.. ఈ సిరీస్‌లోనూ ఆసీస్‌ను విజయపథాన నడిపించాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లోనూ మార్ష్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించాడు. ఈ సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మార్ష్‌కు ఉన్న ఈ ట్రాక్ రికార్డే ప్రస్తుతం అతన్ని ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ రేసులో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మార్ష్.. తన కెరీర్లో 54 టీ20లు ఆడి తొమ్మిది హాఫ్ సెంచరీల సాయంతో 1432 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న ఆడనుంది. దీనికి ముందు ఆసీస్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడటం లేదు. టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. -
శివాలెత్తిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్.. భారీ స్కోర్‌ను ఊదేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు.. ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. శివాలెత్తిన మార్ష్, డేవిడ్.. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్‌వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్.. చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్‌లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. -
NZ vs Aus: రచిన్ సుడిగాలి ఇన్నింగ్స్.. 19 బంతుల్లోనే!
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 32 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే 54 రన్స్ రచిన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి. కాగా రచిన్‌కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji — piyush (@piyushson17) February 21, 2024 చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ! A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA — BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024 -
విండీస్‌తో టీ20 సిరీస్.. ఆసీస్ ‘సంచలన’ బౌలర్ రీఎంట్రీ
Australia vs West Indies T20 Series 2024: వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా తదుపరి టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య హోబర్ట్ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 9) నుంచి ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానాన్ని సెన్సర్ జాన్సన్‌తో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ భాగం కానున్నాడని బుధవారం వెల్లడించింది. నాథన్ ఎల్లిస్‌ను తప్పించారు కాగా బిగ్ బాష్ లీగ్ 2023-24లో హోబర్ట్ హారికేన్స్కు ప్రాతినిథ్యం వహించిన నాథన్ ఎల్లిస్ మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి కారణంగా గత కొంతకాలంగా అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నాటికి ఎల్లిస్ కోలుకుంటాడని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి ప్రధాన జట్టులో చోటిచ్చింది. కానీ.. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని భావించి తాజాగా జట్టు నుంచి తప్పించింది. ఈ క్రమంలో స్పెన్సర్ జాన్సన్.. సొంతగడ్డపై విండీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ముంగిట నిలిచాడు. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. బీబీఎల్-2024లో సంచలన ప్రదర్శనతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడిన స్పెన్సర్ పొట్టి ఫార్మాట్లో కేవలం రెండు వికెట్లు తీశాడు. వన్డేల్లో ఇంకా ఖాతా తెరవనేలేదు. అయితే, బీబీఎల్ తాజా సీజన్లో మాత్రం దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ హీట్‌కు ఆడిన స్పెన్సర్ జాన్సన్.. ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ తరఫున 11 మ్యాచ్‌లలో 19 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్లో 4-0-26-4 గణాంకాలతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సంచలన బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను విండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్‌లో గనుక రాణిస్తే టీ20 వరల్డ్‌కప్-2024 రేసులో స్పెన్సర్ ముందుకు దూసుకురావడం ఖాయం. ఆస్ట్రేలియా టీ20 జట్టు మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. వెస్టిండీస్ టీ20 జట్టు రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో వైరల్ -
విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జనవరి 24) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు విశ్రాంతి కల్పించారు. కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ జట్టును మిచెల్ మార్ష్ ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్‌కు కమిన్స్‌తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్,స్టీవ్ స్మిత్ కూడా దూరంగా ఉండనున్నారు. సెలెక్టర్లు స్టార్క్, స్మిత్‌లకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ జట్టులో చోటు పదిలం చేసుకోగా.. ఇటీవలే ఆసుపత్రిపాలైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, పేసర్ నాథన్ ఇల్లిస్ తిరిగి జట్టులోకి వచ్చారు. బిగ్‌బాష్ లీగ్ 2023-24లో భీకర ఫామ్‌లో ఉండిన మ్యాట్ షార్ట్.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కాగా, విండీస్‌తో టీ20 సిరీస్ ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో హోబర్ట్, అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్‌లో ఆసీస్.. విండీస్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. టెస్ట్ సిరీస్ అనంతరం ఆసీస్-విండీస్‌లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడతాయి. వన్డే సిరీస్ మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా వేదికలుగా ఫిబ్రవరి 2, 4, 6 తేదీల్లో జరుగనుంది. వన్డే సిరీస్ కోసం ఆసీస్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌కు కూడా కమిన్స్ దూరంగా ఉండనుండగా.. అతని గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ వన్డే జట్లును ముందుండి నడిపించనున్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు.. మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా విండీస్‌తో సిరీస్‌కు ఆసీస్ వన్డే జట్టు.. స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా -
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్.. మార్ష్‌కు ప్రమోషన్! ఏకంగా రూ.6 కోట్లు
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా మార్ష్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మార్ష్‌కు ప్రమోషన్ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఏడాది గాను మార్స్‌కు టాప్ సెంట్రాల్ కాంట్రక్ట్ ఇచ్చి భారీగా అతడి జీతాన్ని పెంచాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మార్ష్ ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మిడిల్ టైర్లో ఉన్నాడు. అయితే టాప్ టైర్లో ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులకోవడంతో.. మార్ష్ ప్రమోషన్ దాదాపు ఖాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అతడు టాప్ టైర్ కాంట్రాక్ట్‌కు ప్రమోషన్ పొందితే.. అతడు 5 లక్షల యూఎస్ డాలర్ల నుంచి 8 లక్షల యూఎస్ డాలర్ల వరకు వార్షిక వేతనం పొందే అవకాశముంది. అంటే భారత కరెన్సీలో సూమారు రూ. 4 కోట్ల నుంచి 7 కోట్ల వరకు అందనుంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అత్యధిక వేతనాన్ని పొందుతున్నాడు. అతడికి జీతం రూపంలో క్రికెట్ ఆస్ట్రేలియా 2 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ.16 కోట్లు) చెల్లిస్తోంది. -
పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 360 పరుగుల తేడాతో ఘన విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్ మార్ష్ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్ లియోన్ 3, స్టార్క్, కమిన్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి (డిక్లేర్) 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఆమిర్ జమాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టిన మిచెల్ మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా గడ్డపై గడిచిన 24 ఏళ్లలో టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
పాక్‌తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. ఆసీస్ భారీ స్కోర్
పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్‌కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్‌తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. -
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడిపై కేసు నమోదు
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్‌పై భారత్‌లో కేసు నమోదైంది. ఆస్ట్రేలియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం మార్ష్ వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ అలీఘర్కు చెందిన ఆర్టిఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. మార్ష్ చర్య ప్రతిష్టాత్మకమైన ట్రోఫీకే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు అవమానం కలిగించిందని ఆరోపించాడు. కేశవ్ తన ఫిర్యాదు కాపీని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పంపించాడు. మార్ష్ భారత్‌లో ఏ క్రికెట్ మ్యాచ్ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలని అతను డిమాండ్ చేశాడు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ గేట్ పోలీసులు మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (నవంబర్ 19) జరిగిన వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరో సారి జగజ్జేతగా నిలిచింది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచామన్న గర్వంతో మార్ష్ వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. మార్ష్‌పై క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోశాడు. ఏమా ఖండకావరం అంటూ ధ్వజమెత్తారు. భారత అభిమానులయితే మార్ష్ ఓ రేంజ్లో ఏకి పారేశారు. -
CWC 2023 Final: మిచెల్ మార్ష్ అనుచిత ప్రవర్తన.. !
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో 140 కోట్ల భారతీయుల గుండెలను ముక్కలు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తక్కువ స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. ఆరంభంలో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna — Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023 అయితే హెడ్.. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు. మ్యాచ్ అనంతరం ఆసీస్ సంబురాలు మినహా నరేంద్ర మోదీ స్టేడియంలో నిశబ్దం ఆవహించింది. ఆసీస్ ఆటగాళ్లు తమ జీవితాల్లో అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. హెడ్, లబూషేన్, మ్యాక్స్‌వెల్, కమిన్స్ ఇలా.. ప్రతి ఒక్క ఆసీస్ ఆటగాడు విజయ గర్వంతో ఊగిపోయారు. అయితే ఒక్క ఆసీస్ ఆటగాడి విజయదరహాసం మాత్రం శృతి మించింది. 2015 ఎడిషన్ ఫైనల్లోనూ ఆసీస్ గెలుపులో భాగమైన మిచెల్ మార్ష్ భారత్‌పై విజయానంతరం వరల్డ్‌కప్ ట్రోఫీని అగౌరవపరిచాడు. జగజ్జేతగా నిలిచామన్న గర్వంతో అతను మితిమీరి ప్రవర్తించాడు. మ్యాచ్ అనంతరం బీర్ తాగుతూ వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. క్రికెట్ అభిమానులు మార్ష్ అనుచిత ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మతి తప్పినదా ఏంటి అంటూ తూర్పారబెడుతున్నారు. ప్రతి క్రికెటర్ ఎంతో అపురూపంగా భావించే వరల్డ్‌కప్ ట్రోఫీకి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఎంత గెలిస్తే మాత్రం ఇంత అహం పనికిరాదంటూ గడ్డి పెడుతున్నారు. -
మిచెల్ మార్ష్ వీరవిహారం
పుణే: ఐదు సార్లు విజేత ఆ్రస్టేలియా ప్రపంచకప్‌లో లీగ్ దశను ఘనంగా ముగించింది. ఆరంభంలో తడబడి రెండు మ్యాచ్‌లు ఓడినా...ఆ తర్వాత ప్రతీ మ్యాచ్‌కు తమ ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చింది. సెమీఫైనల్ స్థానం ఖాయమైన తర్వాతా అదే దూకుడును కనబర్చి ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహీద్ హ్రిదయ్ (79 బంతుల్లో 74; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజు్మల్ హొస్సేన్ (57 బంతుల్లో 45; 6 ఫోర్లు) రాణించగా...తన్జిద్ (36), లిటన్ దాస్ (36), మహ్ముదుల్లా (32), మెహదీ హసన్ మిరాజ్ (29) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 2 వికెట్లకు 307 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (132 బంతుల్లో 177 నాటౌట్; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, స్టీవ్ స్మిత్ (64 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 22.3 ఓవర్లలోనే అభేద్యంగా 175 పరుగులు జోడించారు. డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 53; 6 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ చేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జిద్ (సి) అండ్ (బి) అబాట్ 36; లిటన్ (సి) లబుషేన్ (బి) జంపా 36; నజు్మల్ రనౌట్ 45; తౌహిద్ (సి) లబుõÙన్ (బి) స్టొయినిస్ 74; మహ్ముదుల్లా రనౌట్ 32; ముషి్ఫకర్ (సి) కమిన్స్ (బి) జంపా 21; మెహిదీ హసన్ మిరాజ్ (సి) కమిన్స్ (బి) అబాట్ 29; నజుమ్ రనౌట్ 7; మెహదీ హసన్ నాటౌట్ 2; తస్కిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–76, 2–106, 3–170, 4–214, 5–251, 6–286, 7–303, 8–304. బౌలింగ్: హాజల్‌వుడ్ 7–1–21–0, కమిన్స్ 8–0–56–0, అబాట్ 10–0–61–2, మార్ష్ 4–0–48–0, జంపా 10–0–32–2, హెడ్ 6–0–33–0, స్టొయినిస్ 5–0–45–1. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) తస్కిన్ 10; వార్నర్ (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 53; మార్ష్ నాటౌట్ 177; స్మిత్ నాటౌట్ 63; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (44.4 ఓవర్లలో 2 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–12, 2–132. బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 10–0–61–1, మెహిదీ హసన్ 9–0–38–0, నజుమ్ అహ్మద్ 10–0–85–0, మెహిదీహసన్ మిరాజ్ 6–0–47–0, ముస్తఫిజుర్ 9.4–1–76–1. -
ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా నవంబర్ 7న వాంఖడే వేదికగా అఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్ అందింది. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు జట్టుతో చేరనున్నాడు. తన తాత మరణంతో పెర్త్‌కు వెళ్లిన మార్ష్.. ఆదివారం(నవంబర్ 5) జట్టుతో కలవనున్నాడు. కాగా మిచిల్ మార్ష్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే తన పేరిట ఓ సెంచరీ కూడా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ 121 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 225 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఆసీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన 0.970 రన్‌రేట్ కలిగి ఉంది. చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే -
ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. స్వదేశానికి పయనమైన స్టార్ ఓపెనర్
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో దూసుకుపోతున్న ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఓపెనింగ్ బ్యాటర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి పయనమయ్యాడు. వరల్డ్‌కప్‌లో ఆసీస్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ప్రపంచకప్ కోసం మార్ష్ తిరిగి భారత్‌కు రావడం అనుమానమేనని ఆసీస్ మీడియా వర్గాల సమాచారం. ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ క్రికెట్ వర్గాలు ఖంగుతిన్నాయి. అభిమానులు షాక్‌కు గురయ్యారు. వరల్డ్‌కప్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆసీస్ ఇన్ ఫామ్ ప్లేయర్ సేవలు కోల్పోవడాన్ని జీర్జించుకోలేకపోతుంది. మరోవైపు ఆసీస్ మరో స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలను సైతం కోల్పోనుంది. తలకు తీవ్ర గాయం కావడం చేత మ్యాక్సీ నవంబర్ 4న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంకానున్నాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి కింద పడిపోవడంతో మ్యాక్సీ తలకు తీవ్ర గాయమైంది. రోజుల వ్యవధిలో ఆసీస్ ఇద్దరు స్టార్ ఆల్‌రౌండర్ల సేవలను కోల్పోవడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మార్ష్, మ్యాక్సీ ఇద్దరు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు చెరో మ్యాచ్‌లో సెంచరీ (మార్ష్ పాక్‌పై, మ్యాక్సీ నెదర్లాండ్స్‌పై) చేయడంతో పాటు వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే, ఆసీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన 0.970 రన్‌రేట్ కలిగి ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో సౌతాఫ్రికా టేబుల్ టాపర్ కాగా.. భారత్ రెండో స్థానంలో.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. -
WC 2023: మీ నాన్న నేర్పించలేదా?: ఆసీస్ క్రికెటర్‌ను ప్రశ్నించిన గావస్కర్
ICC WC 2023- Aus Vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకపై విజయంతో హ్యాట్రిక్ ఓటమి ముప్పు నుంచి తప్పించుకుంది ఆస్ట్రేలియా. లక్నోలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లంకను ఓడించి.. తాజా ఎడిషన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆరంభంలో అదరగొట్టినా.. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో 209 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా(4 వికెట్లు) దాటికి లంక బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇలా క్రీజులోకి వచ్చి.. అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 51 బంతుల్లో 52 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ లబుషేన్ 40 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ అర్ధ శతకం(58) సాధించగా.. గ్లెన్ మాక్స్వెల్(31- నాటౌట్), మార్కస్ స్టొయినిస్(20-నాటౌట్) విజయలాంఛనం పూర్తి చేశారు. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూ తొలి విజయం అందుకోగా.. ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మీ నాన్న నీకు నేర్పించలేదా? అయితే, ఈ గెలుపుతో జంపాతో పాటు మార్ష్‌ది కూడా కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్ష్‌ను టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఫన్నీగా ట్రోల్ చేశాడు. ‘‘మీ నాన్న నీకెప్పుడూ ఇలా ఆడాలని నేర్పించలేదా’’ అంటూ డిఫెన్సివ్ షాట్ ఆడుతున్నట్లుగా ఫోజు పెట్టాడు. ఇందుకు స్పందించిన మార్ష్.. ‘‘మా నాన్న పూర్ స్ట్రైక్‌రేటును కప్పిపుచ్చేలా ఇలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా’’ అని అంతే సరదాగా బదులిచ్చాడు. జెఫ్ మార్ష్ తనయుడే మిచెల్ కాగా మిచెల్ మార్ష్ మరెవరో కాదు.. ఆసీస్ మాజీ బ్యాటర్ జెఫ్ మార్ష్ కుమారుడు. గావస్కర్‌కు సమకాలీనుడైన జెఫ్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో 117 మ్యాచ్‌లాడి.. 55.93 స్ట్రైక్‌రేటుతో 4357 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 50 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఇప్పటి వరకు 82 వన్డేల్లో 93.85 స్ట్రైక్‌రేటుతో 2290 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తండ్రి అలా.. కొడుకు ఇలా ఈ నేపథ్యంలో తండ్రీతనయులు స్ట్రైక్‌రేటును ఉద్దేశించి గావస్కర్ సరదాగా కామెంట్ చేయగా.. మార్ష్ బదులిచ్చిన తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. ఇక లంకపై విజయం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ఇంగ్లిస్ ఓ యోధుడని.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్నవాడని ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు మరింత గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షించాడు. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్! Sunil Gavaskar- "Did your father not teach you to bat like this (gestures playing a defensive shot)?" Mitch Marsh- "I am making up for his poor strike rate." pic.twitter.com/P4GuLGFCa6 — Rohit Yadav (@cricrohit) October 16, 2023 -
వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే మొదటిసారి.. బుమ్రా అరుదైన రికార్డు
వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆసీస్ ఓపెనర్‌ను డకౌట్ చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. కాగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్ గెలిచిన కంగారూ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మూడో ఓవర్ రెండో బంతికి బుమ్రా.. మిచెల్ మార్ష్‌ను అవుట్ చేశాడు. ఆఫ్‌సైడ్ దిశగా బుమ్రా విసిరిన షార్ట్‌లెంత్ బాల్ మార్ష్ బ్యాట్‌ను ముద్దాడి ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి చేతుల్లో పడింది. దీంతో టీమిండియాకు తొలి వికెట్ దక్కడంతో పాటు.. బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది. కాగా 1983 నుంచి ఇప్పటి వరకు.. 2007 వన్డే ప్రపంచకప్ మినహాయించి పటిష్ట టీమిండియా- ఆస్ట్రేలియా జట్లు ఈ ఐసీసీ టోర్నీల్లో కనీసం ఒక్కసారైన ముఖాముఖి పోటీపడ్డాయి. అయితే, ఏ భారత బౌలర్ కూడా ఈ మెగా ఈవెంట్లో ఆసీస్ ఓపెనర్‌ను డకౌట్ చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌తో బుమ్రా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మార్ష్ చేత సున్నా చుట్టించి ఈ ఘనత సాధించిన టీమిండియా తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కాగా కంగారూలతో మ్యాచ్‌లో బుమ్రా రెండు, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా మూడు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీయగా.. ఫాస్ట్‌బౌలర్లు మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కాయి. దీంతో 199 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడిన భారత్ విరాట్ కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో 41.2 ఓవర్లలో టార్గెట్ ఛేదించి ఆరు వికెట్ల తేడతో గెలుపొందింది. తద్వారా వన్డే వరల్డ్‌కప్-2023లో బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తగా ఐదు డకౌట్లు నమోదు కావడం గమనార్హం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మార్ష్, అలెక్స్ క్యారీ.. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి డ్రాప్ క్యాచ్‌పై స్పందించిన కమిన్స్.. మరో 50 పరుగులు చేసుంటే..!
చెన్నై వేదికగా టీమిండియాతో నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్లిష్టమైన దశ నుంచి అద్భుతంగా పురోగమనం సాధించి, ఆసీస్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గట్టెక్కించారు. ఫలితంగా భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) కోహ్లి క్యాచ్‌ను జారవిడిచిన మార్ష్.. ఓ దశలో భారత్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది. జట్టు స్కోర్ 20 పరుగుల వద్ద ఉండగా హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ కోహ్లి క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ లైఫ్ అనంతరం వెనుదిరిగి చూసుకోని కోహ్లి భారత్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఓ రకంగా చెప్పాలంటే కోహ్లి డ్రాప్ క్యాచే ఆసీస్ కొంపముంచింది. అయితే ఈ విషయాన్ని కమిన్స్ అంగీకరించలేదు. కోహ్లి క్యాచ్ డ్రాప్.. అప్పుడే మర్చిపోయా..! మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా కమిన్స్ మాట్లాడుతూ.. మార్ష్ కోహ్లి క్యాచ్ డ్రాప్ చేసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. క్రికెట్లో ఇది సర్వసాధారణం. అయితే స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఏ జట్టుకైనా 10/4 స్కోర్ డ్రీమ్ స్టార్ట్ అని చెప్పాలి. మేము ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాం. అయినా మా ఓటమికి ఇది కారణం కాదు. మేము అదనంగా మరో 50 పరుగులు చేసి ఉండాల్సింది. ఇలాంటి టఫ్ పిచ్‌పై 200 స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. క్రెడిట్ భారత స్పిన్నర్లకే. వారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఓడిపోయినందుకు బాధ లేదు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. రోహిత్ గెలిచి ఉన్నా ఇదే పని చేసేవాడు అని అన్నాడు. -
WC 2023: మినీ హార్ట్ ఎటాక్! భయపెట్టావు కదా కోహ్లి! మూల్యం చెల్లించకతప్పదు..
ICC Cricket World Cup 2023- India vs Australia- Virat Kohli: ఓపెనర్లు డకౌట్.. అందులోనూ ఓ గోల్డెన్ డక్.. నాలుగో స్థానంలో వచ్చిన బ్యాటర్ సైతం పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు! సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా దుస్థితి ఇది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్.. బౌలర్ల విజృంభణతో ప్రత్యర్థిని 199 పరుగులకే కట్టడి చేయగలిగింది. దీంతో స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఈజీగా ఊదేస్తుందంటూ అభిమానులు పండుగ చేసుకున్నారు. ముగ్గురు డకౌట్ కానీ ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. స్టార్క్ ఇషాన్‌ను పెవిలియన్‌కు పంపితే.. రోహిత్‌ను హాజిల్‌వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌ను సైతం పెవిలియన్ పంపాడు. కోహ్లి, రాహుల్‌పై భారం 2 పరుగులకే.. 3 వికెట్లు.. అసలు ఆడుతోంది టీమిండియానే అన్న అనుమానం.. ఇలాగైతే పరిస్థితి ఏంటన్న ఆందోళన.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పైనే భారమంతా! అద్భుత షాట్‌తో ఇలాంటి సమయంలో.. కోహ్లి కొన్ని అద్భుత షాట్లతో అలరించాడు. ఆరో ఓవర్ ఐదో బంతికి.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గ్లోరియస్ ఫోర్‌తో దుమ్ములేపాడు. తర్వాత మళ్లీ పదకొండో ఓవర్ వరకు టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. View this post on Instagram A post shared by ICC (@icc) మినీ హార్ట్ ఎటాక్ ఇదిలా ఉంటే.. డేంజరస్ బ్యాటర్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మిచెల్ మార్ష్ మిస్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇండియా ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేసిన హాజిల్‌వుడ్ కోహ్లికి షార్ట్‌బాల్‌ను సంధించాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మూల్యం చెల్లించకతప్పదు మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్ సహా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చారు. మార్ష్ బాల్‌ను క్యాచ్ చేసినట్లే చేసి.. పట్టుతప్పి బంతిని జారవిడిచాడు. దీంతో టీమిండియా శిబిరంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘‘ఈ క్యాచ్ డ్రాప్ చేసి మ్యాచ్‌ను కూడా ఆసీస్ డ్రాప్ చేసుకుంది. ఏదేమైనా మినీ హార్ట్‌టాక్ అనుకోండి. కింగ్ భయపెట్టేశావు పో! ఈ తప్పిదంతో ఆసీస్ భారీ మూల్యం చెల్లించకతప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: WC 2023: ఆనందం కాసేపే! నువ్వేం కెప్టెన్? గోల్డెన్ డక్ బాయ్.. నీకెందుకు? View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే?
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన అతడు.. నాలుగో బంతికే ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుడ్ లెంత్ డెలివరీతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ చేతిలో పడింది. ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా.. బాల్‌ను గిల్ ఒడిసిపట్టగానే.. భారత శిబిరంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది. ఆనందం కాసేపే.. ఇదిలా ఉంటే.. టీమిండియాకు ఆదిలోనే వికెట్ దక్కినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 37, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 98 పరుగులు స్కోరు చేసింది. కానీ.. మరుసటి రెండో బంతికే రవీంద్ర జడేజా వార్నర్(52)ను పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. షమీ ఎందుకు వెళ్లిపోయాడు? ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత మహ్మద్ షమీ మైదానం వీడాడు. మొహాలీలో ఎండ తీవ్రతకు తట్టుకోలేకే అతడు డ్రెస్సింగ్‌రూంకు వెళ్లిపోయినట్లు సమాచారం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతడు తిరిగి ఫీల్డ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: WC 2023: సంజూను మర్చిపోవాల్సిందే!.. కుండబద్దలు కొట్టిన ద్రవిడ్ Early success for #TeamIndia! A wicket for @MdShami11 as Shubman Gill takes the catch. Australia lose Mitchell Marsh. Live - https://t.co/F3rj8GI20u… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/cNcwJeQiXN — BCCI (@BCCI) September 22, 2023