najeeb jung
-
'సీఏఏ దేశాన్ని ఏకాకిని చేయబోతోంది'
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై భారత మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏని భారత స్వయంకృత అపరాధంగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో సీఏఏపై నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. సీఏఏ భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశ ఆలోచనను మనం మార్చాలనుకుంటే దాని ఫలితంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా 2015కు ముందు దేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్లు, హిందువులు,సిక్కులు, జైనులు, పార్శీ మతస్తులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అయితే ఈ చట్టం వల్ల సంబంధిత దేశాల నుంచి వచ్చే ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని శివశంకర్ మీనన్ తెలిపారు.( ‘సీఏఏకు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వండి’) ఇదే సమావేశానికి హాజరైన ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మాట్లాడుతూ.. జామియా మిలీయా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడాన్ని తప్పుబట్టారు. సీఏఏపై సరైన సమాచారం ప్రజలకు చేరనందునే పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు సీఏఏపై పూర్తి అవగాహన కల్పిస్తే బాగుంటుందని నజీబ్‌జంగ్ వెల్లడించారు.(ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..) -
‘కేజ్రీవాల్ కు సొంత నిఘా సంస్థ’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాలనకు సంబంధించి షుంగ్లూ కమిటీ కొన్ని అవకతవకలను గుర్తించిందనీ, ఆయన నేరారోపణలు ఎదుర్కోవాల్సి రావొచ్చని ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సభ్యులు ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని జంగ్ అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి వ్యతిరేకంగా కేజ్రీవాల్ సొంతంగా మరో నిఘా సంస్థను రహస్యంగా ఏర్పాటు చేశారని జంగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ భార్యకు బంధువైన నికుంజ్ అగర్వాల్‌ను ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఓఎస్డీగా, సత్యేంద్ర కూతురు సౌమ్య జైన్‌ను మొహల్లా క్లినిక్స్ ప్రాజెక్టుకు సలహాదారుగా నియమించడం ఆశ్రిత పక్షపాతాన్ని తెలుపుతోందన్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
ఢిల్లీ కొత్త గవర్నర్ నియామకం!
-
ఢిల్లీ కొత్త గవర్నర్ నియామకం!
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర కొత్త లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా అనిల్ బైజల్ నియామకం కానున్నట్లు సమాచారం అందింది. లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజీబ్ జంగ్ ఈ నెల 22న పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం జంగ్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జంగ్ స్ధానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా జమ్మూ కశ్మీర్ గవర్నర్ పదవికి బైజల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో బైజల్ కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. గతంలోనే రెండుసార్లు పదవికి రాజీనామా చేయగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పదవిలో కొనసాగాలని కోరారని జంగ్ చెప్పిన విషయం తెలిసిందే. సొంత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
నజీబ్ జంగ్ (లెఫ్ట్‌నెంట్ గవర్నర్) రాయని డైరీ
మాధవ్ శింగరాజు మోదీజీని నేనెప్పుడూ అలా చూడలేదు. మోదీజీని అలా చూస్తున్నప్పుడు నేనెలా ఉన్నానో చూసుకునే అవకాశం కూడా నాకు లేదు. నేనున్నది ‘రాజ్ నివాస్’లో కాదు. ప్రధాని నివాసంలో! ఏ సమయంలోనైనా మోదీజీ ఒక్కరే అక్కడ స్వేచ్ఛగా అద్దం చూసుకోగలరు. కానీ ఆయనకు అద్దం చూసుకునే అవసరం ఉంటుందని నేను అనుకోను. తన ముఖం ఎప్పుడు ఎలా ఉండాలో మోదీజీకి క్లారిటీ ఉంటుంది. అద్దంలో చూసుకుని క్లారిటీ తెచ్చుకోవలసిన ముఖం కాదు మోదీజీది. అద్దానికే క్లారిటీ ఇవ్వగల ముఖం. ‘‘చెప్పండి నజీబ్ జీ. నేను హిందువు, మీరు ముస్లిం. అదేనా మీ ప్రాబ్లం?’’ అని అడిగారు మోదీజీ తన కళ్లలోని ఆర్ద్రత స్థాయిని ఏమాత్రం తగ్గనివ్వకుండా. ‘‘మోదీజీ.. అలా మాట్లాడకండి. నా మనసు చివుక్కుమంటుంది. మీరు హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిం’’ అన్నాను. ‘‘మరేంటి చెప్పండి నజీబ్ జీ. నేను ఎన్.డి.ఎ., మీరు యు.పి.ఎ. అదేనా మీ ప్రాబ్లం?’’ అని అడిగారు మోదీజీ అదే స్థాయి ఆర్ద్రతను కంటిన్యూ చేస్తూ! ‘‘అయ్యో మోదీజీ.. మీరలా అనకండి. నేను యు.పి.ఎ.మనిషినని మీరు అనుకుని ఉంటే.. ప్రధానిగా మీ ప్రమాణ స్వీకారం రోజే, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నా పదవీభ్రష్టత కూడా జరిగి ఉండేదని నాకు తెలుసు’’ అన్నాను. ‘‘ఇంకేంటి నజీబ్ జీ.. మీ ప్రాబ్లం! ఎందుకిలా చేశారు? పాత నోట్లేమైనా మీ దగ్గర మిగిలిపోయాయా.. ‘యా అల్లా.. డిసెంబర్ 31 దగ్గరపడుతోంది ఎలా..’ అని మీరు దిగులు చెందడానికి? చెప్పండి నజీబ్ జీ! మన కుర్రాళ్లు ఉన్నారు. క్యాష్ చేసి పెడతారు’’ అన్నారు మోదీజీ. ‘‘అయ్యో! అలాంటిదేమీ లేదు మోదీజీ. రిజర్వు బ్యాంకు గవర్నరే డబ్బుల్లేక ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని తిరుగుతుంటే, ఈ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎంత మోదీజీ’’ అన్నాను. ‘‘అయినా నాకు అంత డబ్బు అవసరం లేదు మోదీజీ. ఢిల్లీ గవర్నరుకు ఖర్చేముంటుంది చెప్పండి’’ అన్నాను. ‘‘మాణింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా డబ్బులు కావాలి కదా నజీబ్ జీ’’ అన్నారు మోదీజీ! నవ్వాను. ‘‘నేనెంత తింటాను మోదీజీ.. ఒక పరోటా, లైట్‌గా ఆలూ కర్రీ’’ అన్నాను. మోదీజీ నావైపు పరిశీలనగా చూశారు. ‘‘మరి.. పూరీ, సబ్జి?’’ అని అడిగారు! ఆ వెంటనే, ‘‘కేజ్రీవాల్‌కు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ అదే కదా నజీబ్ జీ’’ అని అన్నారు!! నాకు అర్థమైంది! మోదీజీలోని ఆ ఆర్ద్రత.. సడన్‌గా నేను రిజైన్ చేసి వచ్చేసినందుకు కాదన్నమాట! ‘‘కానీ మోదీజీ.. కేజ్రీవాల్ తన బ్రేక్‌ఫాస్ట్ తనే తెచ్చుకుని నాతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు’’ అన్నాను. ఆయన వినలేదు. ఆయన ఆర్ద్రతలోనూ మార్పు లేదు! -
'మోదీ రాజీనామా చేయొద్దన్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ శుక్రవారం రాజీనామా చేశారు. గవర్నర్ పదవికి జంగ్ రాజీనామా చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, గతంలోనే రెండుసార్లు పదవికి రాజీనామా చేయగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పదవిలో కొనసాగాలని కోరారని జంగ్ పేర్కొన్నారు. సొంత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నానని, తన మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. తన తల్లికి 95 ఏళ్లని.. ఆమెతో పాటు తనయులు వారి పిల్లలకు సమయం కేటాయించాలని అందుకే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గవర్నర్ పదవిలో ఉంటూ సెలవులు తీసుకోవడం సరికాదని అన్నారు. 2014 మేలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలుత రాజీనామా ప్రపోజల్ ను కేంద్రం ముందు ఉంచానని, ఆ తర్వాత 2016లో రెండో సారి రాజీనామాను ఆమోదించాలని కోరగా మోదీ తనను కొనసాగాలని కోరారని చెప్పారు. మంగళవారం రాజీనామా చేస్తానని మళ్లీ కోరగా మోదీ అందుకు అంగీకరించినట్లు చెప్పారు. -
నజీబ్ జంగ్‌ను కలిసిన కేజ్రీవాల్
-
కేజ్రీవాల్ - జంగ్ భాయీ భాయీ!
అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇంటికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. విషయం ఏమిటని అడిగితే.. తనను ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి పిలిచారని చెప్పారు. జంగ్ నివాసమైన రాజ్‌నివాస్‌కు కేజ్రీవాల్ స్వయంగా వెళ్లి.. ఆయనకు శుభాభినందనలు తెలిపారు. తాను ఎందుకు రాజీనామా చేశానన్న విషయాన్ని నజీబ్ జంగ్ చెప్పకపోయినా.. ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని కేజ్రీవాల్ ఈరోజు అన్నారు. నజీబ్‌జంగ్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయనకు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఏమాత్రం పడేది కాదు. ఇద్దరి మధ్య పరిస్థితి ఉప్పు-నిప్పు అన్నట్లు ఉండేది. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా నజీబ్ జంగ్ రాజీనామా చేయడంతో ఒకింత షాకైనా, ఆ నిర్ణయాన్ని కేజ్రీవాల్ స్వాగతించినట్లే కనిపించింది. ఢిల్లీ దేశ రాజధానే అయినా, దానికి పూర్తి రాష్ట్రహోదా లేదు. కొన్ని అంశాల్లో కేంద్ర హోం మంత్రిత్వశాఖదే అధికారం ఉంటుంది. ప్రధానంగా భూ వ్యవహారాలు, శాంతిభద్రతలలో కేంద్రానిదే పైచేయి. లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ పరిపాలనా బాధ్యతలను చూస్తుంటారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను నజీబ్ జంగ్ తిరస్కరించారు. ప్రభుత్వానికి ఆ అధికారం లేదని చెప్పారు. తన ప్రభుత్వాన్ని ఏపనీ చేయనివ్వకుండా జంగ్ అడ్డుకుంటున్నారని, కేంద్రమే అలా చేయిస్తోందని కేజ్రీవాల్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. కానీ అలాంటిది ఒక్కసారిగా ఆయన రాజీనామా చేసిన తర్వాత మాత్రం ఇప్పుడు ఇంటికి వెళ్లి టీ తాగి టిఫిన్ చేసి మరీ వచ్చారు!! -
కేజ్రీవాల్ -నజీబ్ జంగ్ భాయీ భాయీ!
-
సుప్రీం చురకలతో దిగొచ్చిన ఢిల్లీ సర్కార్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు చురకలతో దిగొచ్చిన ఢిల్లీ సర్కార్ దేశ రాజధానిని పట్టిపీడిస్తున్న డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధులపై పోరాటానికి సిద్ధమైంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్రజైన్లు అధికారులతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. విజృంభిస్తున్న ఈ వ్యాధుల నిర్మూలనపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. విస్తృతంగా ప్రబలుతున్న డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులను పట్టించుకోకుండా... ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. వ్యాధుల నివారణపై తగిన చర్యలు తీసుకోవాలని ఎల్జీకి, సీఎంకు ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో ఈ వ్యాధుల నిర్మూలనపై ప్రతీవారం ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష నిర్వహించాలని సత్యేంద్ర జైన్‌ను నజీబ్ జంగ్ ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో జంగ్ ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు చెప్పారు. ఎల్జీ నజీబ్ జంగ్ ఆదేశాలతో డివిజనల్ కమిషనర్ల చేత కూడా అన్ని ప్రాంతాల్లో సందర్శించి, వ్యాధులను అరికట్టే చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ కమిషనర్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గిందని ఆరోగ్య శాఖ అధికారులు ఎల్జీకి తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రతి నాలుగు బెడ్స్‌లో ఒకటి కచ్చితంగా జ్వరంతో బాధపడే వారికి కేటాయించే విధంగా ఆరోగ్య కార్యదర్శి చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా అనారోగ్యం ఉన్నట్టు గుర్తించినవారికి, గర్భవంతులైన మహిళలకు ఈ వ్యాధులను నిరోధించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టర్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ తాజా డేటా ప్రకారం ఇప్పటివరకు 2100 మంది ప్రజలకు డెంగ్యూ పాజిటివ్‌గా నమోదకాగ, చికెన్‌గున్యా కేసులు 6000లు క్రాస్ చేశాయి. -
నజీబ్ జంగ్ 420: స్వామి
న్యూఢిల్లీ: పదునైన విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ స్వామి ఈసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై విరుచుకుపడ్డారు. జంగ్ వంచకుడని, లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి ఉన్నత పదవికి ఆయన సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా అభిప్రాయం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి జంగ్ అనర్హుడు. కేజ్రీవాల్ మాదిరిగా ఆయన మరో 420. జంగ్ స్థానంలో సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరముంద’ని సుబ్రహ్మణ స్వామి ట్వీట్ చేశారు. ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన స్వామి ఇంతకుముందు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని, పార్టీ పెద్దల జోక్యంతో ఆయన వెనక్కు తగ్గారు. In my opinion, this LG of Delhi Mr. Jung is unsuited for this high post. He is another 420 like Kejri. We need a Sangh person in Delhi — Subramanian Swamy (@Swamy39) 30 August 2016 -
ఒక హత్య...అనేక ప్రశ్నలు
అవినీతిని అంతమొందిస్తామంటున్న పాలకుల డొల్లతనాన్ని వెల్లడించే సందర్భమిది. నేరం, రాజకీయం, వ్యాపారం ఎంతగా పెనవేసుకుపోయాయో రుజువు చేసే ఉదంతమిది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎం.ఎం. ఖాన్‌ను గత నెల 16న ‘గుర్తు తెలియని దుండగులు’ కాల్చి చంపారు. ఇప్పుడా ఉదంతం తిరుగుతున్న మలుపులు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎం.ఎం. ఖాన్‌కు నిజాయితీపరుడైన అధికారిగా పేరుప్రతిష్టలు న్నాయి. ముక్కుసూటిగా పోయే వ్యక్తి అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. అలాంటి అధికారిని ఎవరు పొట్టనబెట్టుకున్నారన్న అంశంపై దర్యాప్తు మొదలై ఆ ఉదంతం జరిగిన అయిదురోజుల తర్వాత నగరంలోని హోటల్ యజమాని రమేష్ కక్కడ్ అరెస్టయ్యాడు. మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగానే వెల్లడవుతున్న అంశాలు మన ప్రభుత్వాల, ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నించేవిగా ఉన్నాయి. నిజాయితీపరుడని భావించే ఖాన్‌పై...ఆయన హత్యకు ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు మూడు ఫిర్యాదులందితే ఆ మూడింటిలో ఒకటి నిందితుడైన హోటల్ యజమాని రాసింది. రెండో ఫిర్యాదు స్థానిక బీజేపీ ఎంపీ మహేష్ గిరినుంచి రాగా మూడోది ఎన్డీఎంసీ వైస్ చైర్మన్, బీజేపీ నేత కరణ్‌సింగ్ తన్వర్ రాశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఖాన్‌పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోమంటూ నజీబ్ ఎన్డీఎంసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో ఒక లేఖను ఖాన్ హత్యకు అయిదు రోజుల ముందు పంపగా... రెండోది ఖాన్ హత్య జరిగిన మర్నాడు పంపారు. హోటల్ యజమాని ఫిర్యాదు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే రూ. 140 కోట్ల లెసైన్స్ ఫీజు ఎగ్గొట్టిన కారణంగా నిరుడు ఫిబ్రవరిలో మూతబడ్డ హోటల్ విషయంలో జరుపుతున్న విచారణలో ఖాన్ తనకు అనుకూ లమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న నమ్మకం అతనికి లేదు. అందుకే ఆయన ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని జంగ్కు ఫిర్యాదు చేశాడు. చర్య తీసుకోమని కోరాడు. కానీ స్థానిక బీజేపీ ఎంపీ, ఎన్డీఎంసీ వైస్ చైర్మన్లు ఇదే కేసుపై లేఖలు రాయా ల్సిన అవసరమేమిటి? ఈ లేఖలు కూడా ఖాన్ ‘ఏకపక్షంగా... అన్యాయంగా’ వ్యవహరిస్తున్న తీరుపైనే ఫిర్యాదు చేశాయి. హోటల్ యాజమాన్యం ఈ వివాదం గురించి చెబుతున్నదేమిటో విని తుది నిర్ణయం తీసుకోమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖాన్ పట్టించుకోవడం లేదన్నాయి. వారు లేఖలు రాస్తే రాశారు... నిజా నిజాలేమిటో నిర్ధారించుకోకుండానే వాటిపై చర్య తీసుకోవాలని ఎన్డీఎంసీకి జంగ్ ఎలా సిఫార్సు చేస్తారు? సిఫార్సు చేస్తే చేశారు... కనీసం తనకొచ్చిన ఫిర్యాదుకు కేంద్రబిందువైన అధికారి ముందురోజే హత్యకు గురయ్యారన్న కనీస స్పృహ కూడా లేకుండా పోవడమేమిటి? జంగ్ రాసిన లేఖలు రెండూ ఖాన్ హత్యలో ఆయన ప్రమేయంపై అనుమా నాలు రేకెత్తిస్తున్నాయని, కనుక ఆయననూ... హోటల్ యజమానికి వకాల్తా తీసుకుని ఫిర్యాదులిచ్చిన ఇద్దరు నేతలనూ అరెస్టు చేయాలని ఢిల్లీ పాలకపక్షం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కోరుతోంది. జంగ్‌కూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కూ మధ్య సంబంధాలు మొదటినుంచీ అంతంతమాత్రమే గనుక ఆ డిమాండ్‌లోని అంతరార్ధం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ప్రజా ప్రతినిధులుగా ఉంటున్న వారు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఖాన్ గురించి ఫిర్యాదు వస్తే దాని ఆధారంగా తన కార్యాలయం ఒక లేఖ రూపొందించి నజీబ్ జంగ్కు పంపిందని, ఇంతకుమించి తనకేమీ తెలియదని ఎంపీ మహేష్ గిరి చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా తమకెన్నో లేఖలు వస్తుంటాయని, స్పందించాల్సిన బాధ్యత తమకున్నదని కూడా అంటున్నారు. ఈ జవాబు వింటే కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఉదంతం విషయంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యవహరించిన తీరు గుర్తుకొస్తుంది. విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేకులున్నారని తనకు ఫిర్యాదు అందితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాశానని ఆయన చేతులు దులుపుకుంటే... ఒక ప్రజా ప్రతినిధి నుంచి వచ్చిన లేఖను పరిశీలించి చర్య తీసుకోమని విశ్వవిద్యాలయాన్ని కోరామని ఆ శాఖ చెప్పింది. వచ్చిన ఫిర్యాదులోని నిజా నిజాలేమిటో ప్రాథమికంగా అయినా నిర్ధారించుకోలేని అశక్తులుగా తాము ఉన్నప్పుడు చర్య కోరుతూ లేఖలు రాసే బాధ్యతను నెత్తినేసుకోవడం సబబు కాదని వారికి ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యకరం. ఖాన్ హత్య విషయంలో తనపై ఆప్ చేస్తున్న ఆరోపణలను తోసి పుచ్చ డంతోపాటు ఈ విషాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ వాడు కుంటున్నదని నజీబ్ జంగ్ అంటున్నారు. పైగా ఖాన్‌ను అమరుడిగా గుర్తించి, ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సిఫార్సును తాను సత్వరం అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. చనిపోయాక నిర్వహించిన కర్మకాండలనూ, వారసులకు అందజేసిన డబ్బునూ ఏకరువు పెట్టి చిత్తశుద్ధిని చాటుకోవడానికి ప్రయత్నించడం కంటే ఈ ఉదంతంలో తాను వ్యవహరించిన తీరుపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటే సబబుగా ఉండేది. ఖాన్ విషయంలో వచ్చిన ఫిర్యాదులకు మూల కారణమైన హోటల్ కేసేమిటో ముందుగా తెలుసుకుని ఉంటే ఆయనకు చాలా విషయాలు అవగాహనకొచ్చేవి. ఇలాంటి కేసులో తన జోక్యం మంచిది కాదన్న సంగతి అర్ధమయ్యేది. నాలుగైదు రోజులు ఆగితే ఖాన్ నివేదిక వచ్చేది. దాన్ని పరిశీలించి లోటుపాట్లుంటే ఆయనను నిలదీయడానికి, అవసరమైతే ఆయనపై చర్య తీసుకోవడానికి ఎటూ నజీబ్ జంగ్కు అధికారం ఉంటుంది. ఆ పని చేయకుండా... తనకొచ్చిన ఫిర్యాదులపై అంత తొందరపాటును ప్రదర్శించడం దేనికి సంకేతం? సామాన్య పౌరులు చేసే ఫిర్యాదుల విషయంలో ఇంత వేగిరం చర్య తీసు కుంటున్నారా? ఇంత యాంత్రికంగానూ వ్యవహరిస్తున్నారా? దీన్ని పాలన అంటారా...అరాచకమంటారా? జంగ్ సంజాయిషీ ఇవ్వాలి. కనీసం ఈ ఉదంతం తర్వాతైనా తమ పోకడల్ని మార్చుకోవలసిన అవసరాన్ని ప్రజా ప్రతినిధులంతా గుర్తించాలి. -
ఆయనను డిస్మిస్ చేయాల్సిందే: స్వామి
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను వెంటనే డిస్మిస్ చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే మహేష్ గిరికి మద్దతుగా తాను వచ్చినట్లు చెప్పారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో ఎస్టేట్ అధికారిగా పనిచేసే ఎంఎం ఖాన్ మే 16న హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కాల్చిచంపారు. అయితే, ఈ హత్య వెనుక బీజేపీ ఎంపీ మహేష్ గిరి హస్తం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆరోపణలను రుజువు చేయాలని, లేకపోతే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ మహేష్ గిరి ఆదివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అవసరమైతే తనను ప్రశ్నించాలని, ఇంకా కావాలనుకుంటే అరెస్టు చేయాలని.. తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఢిల్లీ పోలీసు కమిషనర్ అలోక్ వర్మకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. -
పీఎంఓపై సీఎం విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర పాలన వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ జోక్యంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. జంగ్ మంచి వ్యక్తే కానీ, రాజకీయ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదేశాల మేరకు జంగ్ వ్యవహరిస్తున్నారని, ఆయన్ను పదవి నుంచి తొలగించినా ఉపయోగం ఉండదని విమర్శించారు. జంగ్‌ను తొలగించినా కొత్త ఎల్జీ కూడా పీఎంఓ ఆదేశాలనే పాటిస్తారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ పాలన వ్యవహారాల్లో పీఎంఓ జోక్యం చేసుకోకుంటే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ఇదిలావుండగా, జంగ్‌ను తొలగించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. -
ఆయన మంచోడే కానీ..
న్యూఢిల్లీ: రాష్ట్రంపై పెత్తనం విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్ తో ఏడాదిన్నరగా పోరాడుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా మాట మార్చేశారు. నిన్నమొన్నటివరకు ఎల్జేను తీవ్రస్థాయిలో దూషించిన కేజ్రీవాల్.. 'నజీబ్ జంగ్ చాలా మచివారు' అని కితాబిచ్చారు. 'నజీబ్ జంగ్ మంచోడే కానీ అతనికి ఆదేశాలిస్తున్న రాజకీయ గురువులే చెడ్డవాళ్లు. జంగ్ ను లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా అనిపిస్తుంది. అసలీ విషయంలో నజీబ్ జంగ్ చేసిన తప్పేంటి? కేంద్రం ఆదేశించినట్లు ఆయన నడుచుకుంటున్నారంతే. నజీబ్ ను తొలగించినంత మాత్రానేకాదు.. ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం ఆగితేనే ఢిల్లీ సమస్యలు పరిష్కారమవుతాయి' అని కేజ్రీవాల్ శనివారం ఉదయం ట్వీట్ చేశారు. కాగా, కేజ్రీ ట్వీట్ పై బీజేపీ భగ్గుమంది. 'ఢిల్లీ సీఎం గందరగోళం మనిషి. ఏ విషయాన్ని ఎలా చూడాలో ఆయనకు తెలియదు' అంటూ ఆ పార్టీ ఢిల్లీ నేత నళిన్ కోహ్లీ మరో ట్వీట్ లో విమర్శించారు. Congress n BJP both demanding Sh Najeeb Jung's removal? Strange. Is he at fault? No. He is doin what PMO is asking him to do(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015 Removing him will not help. His successor wud also do same if PMO kept interfering. Real solution is PMO shud stop interfering in Delhi(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015 Sh Najeeb Jung is a good man with bad political bosses — Arvind Kejriwal (@ArvindKejriwal) September 26, 2015 -
‘ఆమ్ ఆద్మీ’పై జంగ్ వెన్నుపోటు యుద్ధం
సందర్భం ఈ వైచిత్రిని చూడండి. కేజ్రీ వాల్, గృహ హింస బాధితు రాలైన లిపికా భారతి తర ఫున నిలిచి, ఆమెకు రక్షణ కల్పిం చమని పోలీసులకు విజ్ఞప్తి చేసి ఉన్నా, వారు... బాగానే ఉంది గానీ ముందు మాకు లెఫ్టినెం ట్ గవర్నర్ నుండి ఆదేశాలు రానివ్వండి అనేయగలరు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా వచ్చే ఏ వినతిని పోలీసులు అంగీకరించినా దాన్ని నజీబ్ జంగ్ తోసిపుచ్చుతారు. కేజ్రీవాల్, జంగ్ల పుణ్యమాని ఢిల్లీలో నేడు నెలకొన్న పరిస్థితి ఇది. తనకు అలాంటి అధికారాలున్నాయన్న పూర్తి స్పృహ లేనిదే ఏ సీఎం ఏమంత చెప్పుకోదగ్గ ఆత్మ విశ్వాసంతో పాలనా బాధ్యతలను నిర్వహించలేరు. పైన ఎల్లప్పుడూ కాపలా కాసే అధిపతి ఒకరు లేకుండానే ప్రభుత్వ యంత్రాంగానికి పర్యవేక్షకునిగా సీఎంకు ఏ పదవీ బాధ్యతలకు ఎవరైతే తగినవారనే విషయం తెలుస్తుంది. ఏదో ఒక కుంటిసాకుతోనో లేదా అసలే కారణమూ లేకుండానో జంగ్ రోజువారీ కార్యక్రమంగా ఆశ్చర్య చకితులను చేస్తున్నారు. కార్పొరేట్ కార్యాల యంలోని చిల్లర రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. జంగ్ తనకు సంక్రమించిన అధికారం కాక మరేమై నా కార ణాలతో అలా ప్రవర్తిస్తున్నారేమోగానీ ఆ విష యాన్ని ఆయన ఎన్నడూ వివరించలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా జంగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేశారు. ఇప్పటిలా అప్పుడు ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో వ్యతిరేకత లేదు. పరిపాలనలోని అన్ని విభాగాలను నియంత్రించలేకపోతున్నందుకు షీలా చిం తించేవారు. సవ్యమైన సమస్యలతోనే ఎవరైనా తన వద్ద కు వచ్చినా, పైన అధిపతినని విశ్వసించే లెఫ్టినెంట్ గవ ర్నర్ ఉండటంతో ఆమె వారిని తిప్పి పంపేసేవారు. రేప్ కేసులతో కఠినంగా వ్యవహరించాలనే దేశ వ్యాప్త చైతన్యాన్ని తగినంతగా రేకెత్తింపజేసిన సామూ హిక బస్సు రేప్ ఘటన తదుపరి షీలా దీక్షిత్ నిస్సహా యత మరింత తీవ్రమైంది, పైకి సైతం అది కనబడేది. ఆగ్రహంతో జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన ప్రజల వద్దకుపోయి తాను తగు చర్యలను తీసుకోగలనని, తీసు కుంటానని చెప్పడానికి సైతం ఆమె జంకారు. 1991లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీని శాసనసభ గల రాష్ట్రంగా మార్చినప్పుడు, ఇలాంటి సున్నితమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్టు లేదనిపిస్తోంది. ఆ పరిస్థితిని మొట్టమొదటిసారిగా సవా లు చేసినది కేజ్రీవాలే. దీక్షిత్లాగే ఆమెకు ముందటి బీజేపీ సీఎం సాహెబ్‌సింగ్ వర్మ కూడా స్వయంప్రతి పత్తిని వాంఛించారు. సౌత్‌బ్లాక్‌లో ఆయన ధర్నా సైతం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. వర్మ లేదా దీక్షిత్‌ల కు భిన్నంగా కే జ్రీవాల్‌కు స్వార్థ పరశక్తుల ప్రయోజనా లను పరిరక్షించడానికే ఉన్న అధికార యంత్రాంగానికి లేదా వంక రటింకర వ్యవసకు రుణపడి లేరు. ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. ఇప్ప టికైతే ఆయన వెనకడుగు వేసే లేదా తన ఖడ్గాన్ని ఒరలో పెట్టే యోచనలో ఉన్నట్టు కనబడదు. జంగ్‌ను ఆయన కేంద్రం తరఫున కయ్యానికి దిగుతున్న బంటుగానే భావిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని ఒక తిరుగుబాటుదారు అపార్థం గా భావించడం పొరపాటు. అదేమైనా ఉంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన పద్ధతికి సంబంధించినదే కావాలి. వాస్తవానికి దానికి పరిష్కారం అధికార నిర్మా ణానికి సంబంధించిన రాజ్యాంగ సంస్కరణే. అయినా కేజ్రీవాల్ దాన్ని సవాలు చేసే తెలివిని ప్రదర్శించారు. ఆయన మునిసిపాలిటీయే లేని మేయర్లాంటి ముఖ్య మంత్రిగా ఉండాలనుకోవడం లేదు. తమతమ రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఢిల్లీ గత సీఎంలంతా నిశ్శబ్దంగా ఆయన్ను ప్రశంసిస్తూ ఉండివుంటారు. దీక్షిత్‌లాంటి వాళ్లు, మరో మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ స్వయంప్రతిపత్తి ఆవశ్య కత గురించి మాత్రమే మాట్లాడారు. కేంద్రం మేలుకునే లా చేయలేదు. అయితే, కేజ్రీవాల్ తప్పుదోవపట్టి ఉంటే ఉండొచ్చే మో గానీ మామూలు రాజకీయవేత్తేమీ కాదు. అది తెలిసి కూడా ఆయనకు చిర్రెత్తించకుండానే జంగ్ తన విధులను నిర్వర్తింగలిగినా చేయలేదు. గత 49 రోజుల పాలనలో పోలీసుశాఖ కేజ్రీవాల్ నియంత్రణలో లేకు న్నా పోలీసులు లంచాల వసూలు మానేశారని ఢిల్లీ ప్రజలకు తెలుసు. కాబట్టే ఆయనకు తిరిగి అధికారం కట్టబెట్టారు. ఆయనను రెచ్చగొట్టాల్సిన అవసరం జంగ్కేమీ లేదు. చట్టంలో రాసి ఉన్నది, రాసి ఉన్న దాని స్ఫూర్తి అనే రెండు అంశాలున్నాయి. బదిలీల విషయాన్ని ఆయన కెమెరా వెలుగుల ముందుగాక కేజ్రీవాల్‌తో విడిగా మాట్లాడకుండా నిరో ధించిందేమిటి? ఇప్పుడు కేజ్రీవాల్‌పైకి విసురుతున్న నిబంధనలు వేటిలోనూ వారు కోరుకుంటున్న మార్పుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడకుండా అడ్డుకునేదేదీ లేదు. జంగ్ దెబ్బతీస్తున్నది తాను పరిరక్షించాల్సిన రాజ్యాంగాన్ని కాదు. వాస్తవానికి ఆయన సక్రమంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. గవ ర్నర్ అంటే విశ్వసనీయమైన పర్యవేక్షకుడేగానీ సీఈఓ కాదు. ముఖ్యమంత్రి ఆయన కంటే కిందివాడు కాడు. బీజేపీ ప్రభుత్వం తరపున పోరాడే బంటులా అనిపించేలా ఆయన ఒక్కసారైనా కనిపించలేదు. కానీ ఆయన సరిగ్గా ఆపార్టీ పాటకు అనుగుణంగా నాట్యం చేస్తున్నారు. ఢిల్లీలోని నాలుగు మునిసిపల్ కార్పొరేషన్ల కు 2017లో జరగనున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ అనుకుంటోంది. జంగ్, కేజ్రీవాల్ రోజువారీ పరిపాలనా విధులను సైతం నిర్వహించలేని విధంగా నిత్యమూ ఏదో ఒక సంఘర్షణలో తలమునకలై ఉండేట్టు చేస్తున్నారు. ఆయన ప్రవర్తనలోని ప్రతికూలా త్మక స్వభావమే చెప్పాల్సినదంతా చెబుతోంది. శుక్రవారం రాత్రి దాదాపు అన్ని ప్రధాన టీవీ చానళ్లు హఠాత్తుగా మేల్కొని బీజేపీ అధికారంలో ఉన్న తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో గత 12 రోజు లుగా చెత్తను ఎత్తిపారేయడం లేదని గుర్తించడం కాకతా ళీయమేమీ కాదు. ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందనే సాధారణ సందేశాన్ని అవి పంపాల నుకున్నాయి. కేజ్రీవాల్ పనిచేయడం అసాధ్యం చే యాల నే ఉద్దేశంతో అత్యంత శక్తివంతులైన ఒకరెవరో గానీ అద్భుతమైన ప్రజాసంబంధాలను స్వరపరచడమే ఏక కంఠంతో సాగిన ఆ బృందగానానికి అర్థం. - మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
'జీతాలు ఈరోజే చెల్లించండి'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలకు విముక్తి లభించింది. వారి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జతకట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శల దాడికి దిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చింది. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించకుండా ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలన్న వారి డిమాండ్ కు ప్రభుత్వం స్పందించి రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఆలోపే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం రోజే వారికి మొత్తం రూ.493 కోట్లు విడుదల చేయాల్సిందిగా నగర మేయర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి జీత భత్యాలు చెల్లించాలని కోరారు. ఈ నెల జూన్ 2 నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. -
కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు
ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ నియామక అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కే చెందుతాయని హైకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ ప్రభుత్వం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని పేర్కొంది. అయితే ఆ సూచనలు అమలు చేయాలా?వద్దా?అనేది లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడుతుందని తెలిపింది.ప్రభుత్వం చేసే సూచనలు తప్పకుండా లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షించిన తరువాతే అమలు చేయాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించాలని కేంద్రం భావిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆ వివాదం ముదిరిపాకాన పడి హైకోర్టు వరకూ వెళ్లింది. -
కేజ్రీవాల్ కు మమత మద్దతు?
కోల్ కతా: ఢిల్లీ ఏసీబీ విభాగం అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి పరోక్ష మద్దతు లభిస్తుందా? అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం పదేపదే జోక్యం చేసుకోవడం తగదన్న మమత వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎలాగైతే కేబినెట్ ఉంటుందో.. అలానే ప్రతీ రాష్ట్రానికి కూడా కొంతమంది సభ్యులతో కూడిన కేబినెట్ ఉంటుందని కేంద్రాన్ని విమర్శించారు. రాష్ట్ర కేబినెట్ కు కూడా అధికారాలు ఉంటాయన్న విషయాన్ని కేంద్రం గ్రహించాలని మమత ట్వీట్టర్లో హితబోధ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, భూమికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ పోలీసులు, కీలక అధికారుల నియామకం లాంటి అంశాల్లో వేలుపెట్టే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ ఏసీబీ విభాగం తప్పనిసరిగా కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచే ఆదేశాలు తీసుకుని, వాటిని పాటించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి స్సష్టం చేశారు. ఈ నేపథ్యంలో మమత చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. కాగా, ఆమె చేసిన ట్వీట్స్ ఢిల్లీ హైకోర్టు తీర్పుకు ముందు చేశారా? లేక తరువాత చేశారా?అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
ప్రభుత్వ సలహాతోనే వ్యవహరించండి: హైకోర్టు
ఇటు కేంద్ర ప్రభుత్వంతోను.. అటు కేంద్ర ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్‌తోను గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ ఏసీబీ విభాగం తప్పనిసరిగా కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచే ఆదేశాలు తీసుకుని, వాటిని పాటించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి వ్యాఖ్యానించారు. దీంతో కేజ్రీవాల్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, భూమికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ పోలీసులు, కీలక అధికారుల నియామకం లాంటి అంశాల్లో వేలుపెట్టే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని గతవారం కేంద్రం చెప్పింది. ఈ అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వం సలహాలను తీసుకోవాల్సిన అవసరం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని కూడా కేంద్రం తెలిపింది. అయితే.. అవినీతిపరులైన అధికారులను కాపాడేందుకే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. -
'ఎల్జీ' నచ్చకుంటే సామ్ సంగ్ ఉందిగా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) హస్తిన సీఎం, ఎల్జీ మధ్య 'పవర్ పోరు' రోజురోజుకు ముదురుతోంది. 'తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా' తరహాలో సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్ 'అధికారాల' యుద్ధం చేస్తున్నారు. నాది పైచేయి అంటే నాదే పైచేయి అనుకుంటూ కత్తులు నూరుకుంటున్నారు. నాకు ఎక్కువ అధికారం ఉందని సీఎం అంటే, నీకంటే నాకే అధికారం ఉందని ఎల్జీ వాదిస్తున్నారు. దీంతో 'పంచాయతి' దేశప్రథమ పౌరుడి దగ్గరికి వెళ్లింది. కూర్చుని మాట్లాడుకునే దానికి కారాలు-మిరియాలు నూరడం ఎందుకని కేంద్ర సర్కారు సన్నాయి నొక్కులు నొక్కింది. 'ఎల్జీ' బ్రాండ్ 'లైఫ్ ఈజ్ గుడ్'గా పాపులర్. కాని పాపం కేజ్రీవాల్ కు 'ఎల్జీ' అంటే లైఫ్ ఈజ్ బ్యాడ్ గా అయిపోయింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్‌ను జంగ్ నియమించటంతో ఆధిపత్య పోరుకు అంకురార్పణ జరిగింది. విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా ముద్రపడిన గామ్లిన్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడాన్ని 'ఆప్' సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. సీఎం ఆదేశాలను పట్టించుకోకుండా ఆమె బాధ్యతలు చేపట్టడంతో కేజ్రీవాల్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గవర్నర్ ఆదేశాలపై గామ్లిన్ నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరిందమ్ మజుందార్‌పై బదిలీ వేటు వేశారు. ఆయన ఆఫీసుకు తాళం వేసి సాగనంపారు. 'గామ్లిన్' వివాదంపై కేజ్రీవాల్, నజీబ్ లు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ఎల్జీకి సీఎం లేఖ రాయగా, తన అధికారాల గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన పనిలేదంటూ జంగ్ ప్రతిస్పందించారు. ఇద్దరూ విడివిడిగా రాష్ట్రపతి ప్రణబ ముఖర్జీ దర్శనం చేసుకుని వివాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఏకరువు పెట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారని 'సామాన్య' సీఎం ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ పని తమను చేసుకోనివ్వాలని, జంగ్ ను అడ్డం పెట్టుకుని ఆప్ సర్కారుకు 'జర్క్' ఇవ్వొద్దని సూచించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం, ఎల్జీలకు కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది. ఢిల్లీ సీఎం, ఎల్జీ ఆధిపత్య పోరుతో అధికారులు తల్లడిల్లుతున్నారు. హస్తినలో పనిచేయాలంటే హడలిపోతున్నారు. ఎవరి ఆదేశాలను పాటించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖకు మొరపెట్టుకుంటున్నారు. ఎంతకాలం ఈ బాధ మహాప్రభో అంటూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముందు అధికారులు వాపోయారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారులను ఉపముఖ్యమంత్రి ఊరడించారు. కేజ్రీవాల్, జంగ్ పోరు ఎంతవరకు వెళుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేజ్రీవాల్ కు 'ఎల్జీ'తో ఇబ్బంది ఉంటే ఏ 'సామ్ సంగ్'నో, 'సోని'నో చూసుకోవచ్చు కదా అనే కామెంట్ ఇంటర్నెట్ లో బాగా పాపులర్ అయింది. -
కేజ్రీవాల్ తో జంగ్ అమీతుమీ
న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో అమీతుమీ తేల్చుకునేందుకు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సిద్దమయ్యారు. అధికారుల నియామకం, బదిలీల విషయంలో తనకున్న రాజ్యాంగపరమైన హక్కుల గురించి తెలుపుతూ బుధవారం కేజ్రీవాల్ కు ఆయన లేఖ రాశారు. తాను జారీచేసిన ఆదేశాలను పాటించొద్దని అధికారులకు చెప్పగలరా అంటూ ఆప్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గత నాలుగు రోజులుగా కేజ్రీవాల్ సర్కారు చేసిన అధికారుల నియామకాలు, బదిలీలను లెప్టినెంట్ గవర్నర్ రద్దుచేశారు. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మరోవైపు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని స్వతంత్రంగా పనిచేసుకోనివ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి అంతకుముందు కేజ్రీవాల్ లేఖ రాశారు. -
రాష్ట్రపతి దగ్గరకు చేరిన పంచాయితీ
రాష్ట్రపతితో నజీబ్‌జంగ్, కేజ్రీవాల్ భేటీ ఒకరిపై ఒకరు ఆరోపణలు; రాజ్‌నాథ్‌తోనూ జంగ్ మంతనాలు అటార్నీ జనరల్ అభిప్రాయం కోరిన హోంశాఖ న్యూఢిల్లీ: ఢిల్లీ ‘లొల్లి’ రాష్ట్రపతి దగ్గరకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వాధినేతలు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్‌జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ల మధ్య ఐదు రోజులుగా సాగుతున్న ప్రత్యక్ష పోరు.. పరిష్కారం కోసం రాష్ట్రపతి కోర్టుకు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నజీబ్ జంగ్.. సాయంత్రం కేజ్రీవాల్ ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎవరి వాదనలు వారు వినిపించారు. కేజ్రీవాల్ రాష్ట్రపతిని కలవటానికి కొద్ది గంటలు ముందుగా ఎల్జీ.. ప్రణబ్‌ను కలసి జరుగుతున్న ఘర్షణ నేపథ్యాన్ని వివరించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శకుంతలా గామ్లిన్‌ను నియమించటం, తదనంతర పరిణామాలను చర్చించారు. అంతకుముందు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ 15 నిమిషాలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని బేఖాతరు చేసి తాను తీసుకున్న నిర్ణయాలను జంగ్ సమర్థించుకున్నట్లు సమాచారం. సాయంత్రం కేజ్రీవాల్.. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలసి రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎల్జీ బేఖాతరు చేస్తున్నారని ప్రణబ్‌కు ఫిర్యాదు చేశామని సమావేశం తర్వాత సిసోడియా విలేకరులకు తెలిపారు. తనను సంప్రదించకుండానే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని నియమించారని అన్నారు. కార్యదర్శుల నియామకాల్లోనూ ఎల్జీ జోక్యం మితిమీరిందని ఆయన ఆరోపించారు. ఎల్జీ తీసుకున్న ఏ నిర్ణయం కూడా రాజ్యాంగబద్ధం కాదని రాష్ట్రపతికి తెలిపినట్లు చెప్పారు. తన ఆదేశాలు వినకుంటే బదిలీ చేస్తానంటూ ఎల్జీ బెదిరిస్తున్నారని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో వ్యవహరించినట్లుగా ఎల్జీ వ్యవహరిస్తున్నారన్నారు. ఆప్ ఎజెండాలో పరిపాలన లేదు: జైట్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఆప్ సర్కారు ఘర్షణతో ఢిల్లీలో పరిపాలన స్తంభించిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆప్ రాజకీయ ఎజెండాలో పరిపాలన అన్నది లేదని విమర్శించారు. కొత్త పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు ప్రయోగం చేశారని.. కానీ అది భారీ మూల్యానికి దారి తీస్తోందని అన్నారు. గవర్నర్‌తో సంబంధం లేకుండానే నిర్ణయాలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ నుంచి కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ మౌఖికంగా, రాత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలు వచ్చినా, వాటిని వెంటనే అమలు చేయవద్దని ఆప్ సర్కారు ఉన్నతాధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ వైపు నుంచి వచ్చే ప్రతీ ఆదేశాన్నీ, తప్పనిసరిగా ముఖ్యమంత్రికి కానీ, సంబంధిత శాఖ మంత్రికి కానీ తెలియజేశాకే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జంగ్‌తో కేజ్రీవాల్ లడాయీ ఇంతటితో ఆగలేదు. సర్వీసుల ముఖ్య కార్యదర్శిగా తాను నియమించిన రాజేంద్రకుమార్ ద్వారా మరో ముఖ్యకార్యదర్శి నియామకపు ఉత్తర్వులను కేజ్రీవాల్ జారీ చేయించారు. సాధారణ పరిపాలనా విభాగపు ముఖ్యకార్యదర్శిగా అరవింద్ రేను నియమిస్తూ జీవో విడుదల చేశారు. అసలు రాజేంద్ర కుమార్ నియామకమే చెల్లదని ఎల్జీ వాదిస్తుంటే ఆయనతోనే మరో కార్యదర్శిని నియమింపజేయటం గమనార్హం. నేడు రాష్ట్రపతితో రాజ్‌నాథ్ భేటీ! ప్రతిష్టంభనను తొలగించటానికి బుధవారం రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రపతితో భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ పరిపాలనా నియంత్రణలో ఉండటంతో సమస్యకు పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత హోంమంత్రిపైనే ఉంది. కాగా, ఎల్జీ-నగర ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు, విధులపై అభిప్రాయం చెప్పాలని అటార్నీ జనరల్‌ను హోం శాఖ కోరింది. అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వంలో తనకున్న అధికారాలపై న్యాయనిపుణులతో జంగ్ సంప్రదింపులు జరిపారు. గత శుక్రవారం శకుంతలా గామ్లిన్‌ను తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా నియమించటంతో కేజ్రీవాల్‌కు, ఎల్జీకీ మధ్య ఘర్షణ నెలకొనడం తెలిసిందే. బెంబేలెత్తుతున్న ఐఏఎస్‌లు కేజ్రీవాల్, జంగ్ల ఘర్షణతో ఐఏఎస్‌లు బెంబేలెత్తుతున్నారు. దాదాపు 20 మంది కేంద్రపాలిత ప్రాంత కేడర్ ఐఏఎస్ అధికారులు తమను ఢిల్లీ నుంచి మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖను సంప్రదించినట్లు సమాచారం. అధికారికంగా ఎవరూ వెల్లడించకపోయినప్పటికీ, తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా గామ్లిన్‌ను నియమించినప్పటి నుంచీ ఐఏఎస్‌లు ఇద్దరు రాజ్యాంగాధిపతుల మధ్య నలిగిపోతున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో ఆప్ ప్రభుత్వం బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆప్ సర్కారుకు లాయర్ల సమర్థన ఎల్జీ నజీబ్ జంగ్, సీఎం కేజ్రీవాల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై సుప్రీం కోర్టు సీనియర్ లాయర్లు స్పందించారు. ప్రముఖ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ఇందిరా జైసింగ్‌లు ఈ విషయంపై మాట్లాడుతూ ఉన్నతాధికారుల నియామకాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వతంత్ర అధికారాలు లేవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరుండాలో ఎంచుకునే సంపూర్ణ హక్కులు ముఖ్యమంత్రికి ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని లెఫ్టినెంట్ గవర్నరే సృష్టించారని ఆయన విమర్శించారు. ప్రధాన కార్యదర్శి సెలవుపై వెళ్లి 40 గంటలైనా తాత్కాలిక ప్రధానకార్యదర్శిని నియమించలేదన్న కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ తానే నియామకానికి పూనుకోవటం సరి కాదని అన్నారు. -
రాజుకున్న ఆధిపత్య వివాదం
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు, ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సిఫారస్కు విరుద్ధంగా సీనియర్ బ్యూరోక్రాట్ శకుంతలా గామ్లిన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని కేజ్రీవాల్ ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ కేకే శర్మ వ్యక్తిగత పనిమీద సెలవులో అమెరికా వెళ్లడంతో వేరొకరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. తన పేరు ప్రకటించాన కొద్ది గంటలలోనే పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒత్తిడి చేస్తున్నట్లు ఆమె లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. గామ్లిన్ ప్రస్తుతం విద్యుత్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇది బిజినెస్ రూల్స్‌కు విరుద్ధం ఎన్నికైన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పరిగణనలోకి తీసుకోకుండా లెఫ్టినెంట్ గవర్నర్ బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను నజీబ్ జంగ్ ఖండించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రాకారం లెఫ్టినెంట్ గవర్నరే ఢిల్లీ సర్వోన్నత అధికారి అని పేర్కొన్నరు. ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన ఫైల్ మే 13 సాయంత్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేరింది. ఆయన వెంటనే దాన్ని క్లియర్ చేశారు. సీనియారిటీ, పనితీరు ప్రాతిపదికగా గామ్లిన్‌ను ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేసినట్లు గవర్నర్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన వ్యక్తి పేరు సర్వీసెస్ డిపార్ట్మెంట్ పంపిన లిస్టులో లేదని, ఆ అధికారి ఇంతకు ముందెన్నడూ ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేయలేదని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా ఆదేశాల జారీచేసే విశేష అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించలేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తి రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం ఆరోపించింది. -
నేడే ‘ఆమ్ ఆద్మీ’ ప్రమాణం
ఢిల్లీ 8వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రిగా సిసోడియా, మంత్రులుగా మరో ఐదుగురు! రాంలీలా మైదానంలో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(46) ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా నేడు(శనివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఉదయం 11 గంటలకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన సన్నిహితుడు మనీశ్ సిసోడియా, మంత్రులుగా సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమర్, గోపాల్ రాయ్, సందీప్ కుమార్, ఆసిమ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. వీరిలో చివరి నలుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. అలాగే, రామ్ నివాస్ గోయెల్‌ను స్పీకర్‌గా, వందన కుమారిని ఉపసభాపతిగా నియమించనున్నారని సమాచారం. 2013 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్.. జనలోక్‌పాల్ బిల్లును బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుకోవడానికి నిరసనగా సరిగ్గా సంవత్సరం క్రితం 2014, ఫిబ్రవరి 14న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం.. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం తెలిసిందే. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన ప్రమాణానికి రావాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ఇప్పటికే రేడియో ద్వారా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పలువురు వీఐపీలతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావచ్చని భావిస్తున్నారు. దాంతో దాదాపు 1200 మందితో ఢిల్లీ పోలీసులు వేదిక వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణం తన ప్రభుత్వ ప్రాథమ్యాలను కేజ్రీవాల్ తన ప్రసంగంలో వివరించనున్నారు. ఆప్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు సంబంధించి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాల్సిందిగా కేజ్రీవాల్ ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియాను ఆదేశించారు. విద్యుత్ చార్జీల్లో 50% తగ్గింపు, ఢిల్లీ నగరమంతటా ఉచిత వైఫై సదుపాయం, 10-15 లక్షల సీసీ టీవీల ఏర్పాటు, 2 లక్షల పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, 20 కొత్త కాలేజీల ఏర్పాటు, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు క్రమబద్ధీకరణ, ఢిల్లీ ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 30 వేల బెడ్స్, రానున్న ఐదేళ్లలో 8 లక్షల ఉద్యోగాల కల్పన.. మొదలైన హామీలను ఆప్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కేజ్రీవాల్ ఆహ్వానించగా, ఇతర కార్యక్రమాలను ముందే ఒప్పుకున్నందువల్ల హాజరు కాలేనని మోదీ చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్(హోం), వెంకయ్యనాయుడు(పట్టణాభివృద్ధి), ఢిల్లీలోని 7గురు ఎంపీలను కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేజ్రీవాల్ ఆహ్వానించారు. కాగా, గత నాలుగు రోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న కేజ్రీవాల్ ఇంకా పూర్తిగా తేరుకోలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నీరసంతో కనీసం కూర్చోవడానికి కూడా కేజ్రీవాల్ ఇబ్బంది పడుతుండటంతో శుక్రవారం నాటి కొన్ని కార్యక్రమాలను పార్టీ రద్దు చేసింది. డయాబెటిస్ పేషెంట్ కూడా అయిన కేజ్రీవాల్ చలికాలంలో తరచూ గొంతు ఇన్ఫెక్షన్కు గురవుతుంటారు. కీలక శాఖలు తన వద్దే.. ఆప్ వర్గాల సమాచారం మేరకు.. కీలకమైన హోం, విద్యుత్, ఆర్థిక శాఖలను కేజ్రీవాల్ తనవద్దే అట్టిపెట్టుకోనున్నారు. తన సన్నిహితుడు, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మనీశ్ సిసోడియాకు విద్య, పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖలను అప్పగించనున్నారు. వీరిద్దరు నిర్వహించనున్న శాఖలకు కేంద్రం ప్రత్యక్ష సహకారం అవసరం. గత ఆప్ ప్రభుత్వంలో ఆరోగ్యం, పరిశ్రమల శాఖను నిర్వహించిన సత్యేంద్ర జైన్‌కు ఈ సారీ అవే శాఖలు అప్పగించనున్నారు. ఆప్ సీనియర్ నేత గోపాల్రాయ్కి రవాణా, కార్మిక శాఖల బాధ్యతలు అప్పగించనున్నారు. సందీప్ కుమార్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ.. జితేంద్ర తోమర్‌కు న్యాయ శాఖ.. ఆసిమ్ అహ్మద్ ఖాన్‌కు ఆహార, పౌర సరఫరా, మైనారిటీ వ్యవహారాల శాఖ ఇవ్వనున్నారు. ఆప్ మీడియా కార్యదర్శి నాగేంద్ర శర్మను సీఎంకు మీడియా కార్యదర్శిగా నియమించనున్నారు. కేజ్రీవాల్‌ను సీఎంగా నియమించిన రాష్ట్రపతి ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించారు. అలాగే మరో ఆరుగురిని మంత్రులుగా నియమించినట్లు పేర్కొంటూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి కేజ్రీవాల్ సీఎంగా ఉంటారని అందులో తెలిపారు. సాధారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులను గవర్నర్ ఆహ్వానిస్తారు. అయితే ఢిల్లీకి పాక్షిక రాష్ట్ర హోదా ఉన్నందున సీఎంను రాష్ట్రపతే నియమిస్తారు. మరోవైపు కేజ్రీవాల్ శనివారం సీఎంగా ప్రమాణం చేయగానే ఢిల్లీ రాష్ట్రపతి పాలన ముగియనుంది. ఈ మేరకు 2014 ఫిబ్రవరి 16న రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. షీలా, అంబానీల కేసులను విచారిస్తాం కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ తదితరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తమ ప్రభుత్వం విచారణ జరుపుతుందని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా చెప్పారు. వారిపై గతంలో 49 రోజుల పాటు ఆప్ అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసులన్నింటిపై విచారణ జరుపుతామన్నారు. కేజీ బేసిన్లో ఉత్పత్తవుతున్న సహజవాయువు ధరను భారీగా పెంచే విషయంలో కుమ్మక్కయ్యారంటూ ముకేశ్, వీరప్ప మొయిలీలపై.. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా వీధి దీపాల కొనుగోలు కుంభకోణంలో షీలా దీక్షిత్‌పై నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే, ఢిల్లీలోని విద్యుత్ సరఫరా కంపెనీల అకౌంట్లను కాగ్‌తో ఆడిట్ చేయిస్తామని సిసోడియా వెల్లడించారు. ప్రతీ ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి సహా తమ మంత్రులెవరూ ఎర్ర బుగ్గ కార్లను ఉపయోగించబోరన్నారు. బిహార్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.