NOTA
-
నోటాకు బాగానే నొక్కారు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇష్టం లేకుంటే నోటాపై నొక్కి ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. ఈ ఎన్నికల్లో పలువురు ఓటర్లు నన్ ఆఫ్ ది అ»ౌ(నోటా)కు ఓటు వేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాకుండా కొంతమంది తెలిసో, తెలియకో ఈవీఎంలపై నోటా బటన్ నొక్కారు. దీంతో విజయవాడ పార్లమెంటరీ పరిధిలో భారీగానే నోటా ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పారీ్టల మినహా ఇతర రాజకీయ పారీ్టలు, స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్ల కంటే నోటాకు పడిన ఓట్లే అధికం కావడం విశేషం. దేశంలో 2013 నుంచి.. కేంద్ర ఎన్నికల సంఘం 2013 నుంచి నోటాను ప్రవేశపెట్టింది. అభ్యర్థులు నచ్చక చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పోలింగ్ శాతం తగ్గుతోంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల్లో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలనే లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నోటాను అమలులోకి తెచ్చింది. అభ్యర్థులు ఇష్టం లేకున్నా ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చి నోటాకు ఓటు వేయడం ద్వారా పోలింగ్ శాతం పెరుగుతోంది. జిల్లాలో నోటాకు పడిన ఓట్లు ఇలా 👉ఎన్టీఆర్ జిల్లాలో నోటాకు ఈసారి ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఈవీఎంలు, సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకుంటే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 7,719 ఓట్లు నోటాకు పడ్డాయి. వీటికంటే పార్లమెంటరీ స్థానానికి నోటా ఓట్లు అధికంగా పోలవడం విశేషం. పార్లమెంటరీ స్థానానికి 9,193 మంది నోటాకు ఓటు వేశారు. 👉విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 17 మంది పోటీ చేశారు. వీరిలో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు 14 తొమ్మిది మంది ఉండటం గమనార్హం. టీడీపీ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు మినహా మిగిలిన వారందరికీ నోటా కంటే తక్కువగానే ఓట్లు నమోదయ్యాయి. 👉 విజయవాడ ‘పశి్చమ’ నుంచి 15 మంది పోటీ చేశారు. వీరిలో వైఎస్సార్ సీపీ, బీజేపీ, సీపీఐ అభ్యర్థులు మినహా మిగిలిన 12 మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,236 కంటే తక్కువే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యరి్థకి కేవలం 39 ఓట్లు మాత్రమే వచ్చాయి. 👉 విజయవాడ ‘సెంట్రల్’ నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం, ఆంధ్రరాష్ట్ర ప్రజాశాంతి, బహుజన సమాజ్ పార్టీ మినహా మిగిలిన వారికి నోటా ఓట్లు 951 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. 15 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యరి్థకి అత్యంత తక్కువగా 37 ఓట్లు పోలయ్యాయి. 👉 విజయవాడ ‘తూర్పు’ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో వైఎస్సార్, టీడీపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్, ఆల్ ఇండియా జైహింద్ పార్టీ మినహా మిగిలిన 10 మంది అభ్యర్థుల కంటే నోటాకే అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 1,049 మంది ఓటు వేశారు. 👉 నందిగామ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ∙అభ్యర్థులు మినహా మిగిలిన ఐదుగురు అభ్యర్థులకు నోటా ఓట్లు 928 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యరి్థకి బహుజన సమాజ్‌వాదీ పార్టీ కంటే తక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. 👉జగ్గయ్యపేట నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పారీ్టల మినహా మిగిలిన పది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 773 కంటే అతి తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యరి్థకి 11 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. 👉మైలవరం నుంచి 12 మంది బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, ఒక స్వతంత్ర అభ్యర్థి మినహా మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,598 కంటే తక్కువగా పడటం గమనార్హం. 👉 తిరువూరు నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన తొమ్మిది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,184 కంటే తక్కువగా వచ్చాయి. -
లక్ష మందికిపైగా నోటాకే ఓటేశారు
సాక్షి, మంచిర్యాల డెస్క్: తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు 1,04,244 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో 1,583 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సరైనవారు లేరని ఓటర్లు భావించిస్తే.. నోటాకు ఓటువేసే అవకాశం ఎన్నికల సంఘం 2013 నుంచి కల్పించింది. ఈవీఎంలో అభ్యర్థుల గుర్తుల తర్వాత చివరిగా నోటా గుర్తు ఉంటుంది. చాలాచోట్ల రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా ఓట్లు సాధించడంలో నోటా కంటే వెనుకబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకు ఓట్లు పడగా నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. మల్కాజిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 13,206 ఓట్లు నోటాకు పడగా, అత్యల్పంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 2,933 ఓట్లు పడ్డాయి. పోస్టల్ ఓట్లలో కూడా మల్కాజిగిరిలో అత్యధికంగా 160 ఓట్లు వచ్చాయి. -
లోక్‌సభ ఎన్నికల్లో నోటా సంచలనం
ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ప్రతీ ఓటర్‌కు ఉంది. అలాగే.. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటా(None Of The Above)కు ఓటేయొచ్చు. ఇందుకోసమే 2013లో నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది.మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఏకంగా నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 9,90,698 ఓట్లు పోల్‌కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,72,798) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 20,104 ఓట్లతో నిలిచారు.విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ తమ ఓట్లను నోటాకే ఓటేయాలని ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ నామినేషన్ వేసిన అక్షయ్ కంటీ బామ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ పరిణామంపై ఇక్కడి నుంచి ఏడుసార్లు నెగ్గిన అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో అనివార్యంగా పోటీ నుంచి వైదొలగింది. అయితే బరిలో నిలిచిన వాళ్లకు మద్దతు ఇవ్వకుండా.. నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది కాంగ్రెస్. తద్వారా తమ పార్టీ అభ్యర్థిని లాక్కెల్లిన బీజేపీకి నోటా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది.నోటా చరిత్ర తిరగేస్తే..2019లో బీహార్ గోపాల్‌గంజ్(ఎస్సీ)లో 51,660 నోటా ఓట్లు పడ్డాయి. ఇది నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 5 శాతంఅక్కడ జేడీయూ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ 5,68,160 ఓట్లతో గెలుపొందారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నీలగిరిలో 46, 559 నోటా ఓట్లు పడ్డాయి. -
NOTA: నోటా.. కోరల్లేని పులి!
దశాబ్దం క్రితం దేశ ఎన్నికల్లో వినూత్న ప్రయోగానికి తెరలేచింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీల్లో ఎవరూ నచ్చకపోతే ఏం చేయాలనే ఓటర్ల సందిగ్దతకు తెరదించుతూ ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లో ప్రత్యామ్నాయం లభించింది. అదే ‘నోటా’. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పే బటన్. అయితే దీన్ని ఎంచుకుంటున్న ఓటర్ల సంఖ్య అంతంతే ఉంటోంది. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా నోటాకు వేసే ఓట్లతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇది కోరల్లేని పులిగా మారిందనేది విశ్లేషకుల వాదన. ఇండోర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని షాకివ్వడం, దాంతో నోటాకే ఓటేయాలని పార్టీ పిలుపునివ్వడం తెలిసిందే. దాంతో నోటా మరోసారి చర్చల్లోకి వచి్చంది... ప్రయోజనం.. ప్చ్! పారీ్టలు ఎన్నికల్లో నేరచరితులు, కళంకితులైన అభ్యర్థులను నిలబెట్టకుండా చూడటమే లక్ష్యంగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరీ్టస్ (పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పోటీలో ఉన్నవారెవరూ ఓటర్లకు నచ్చని పక్షంలో తాము ఎవరికీ ఓటువేయాలనుకోవడం లేదని చెప్పేందుకు బ్యాలెట్ పేపర్లు/ఈవీఎంలలో తగిన ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 సెపె్టంబర్లో కోర్టు తీర్పు వెలువరించింది. అలా ఈవీఎంలలోకి నోటా బటన్ వచ్చి చేరింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లోని 16 బటన్లలో చివరి ఆప్షన్‌గా నోటా ఉంటుంది. దీనికి కూడా ప్రత్యేకంగా ఇంటూ (గీ) మార్కు కూడా కేటాయించారు. 2013లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోటా గుర్తును తొలిసారి ప్రవేశపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దీనికి మరింత ప్రాచుర్యం లభించింది. గత ఐదేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి నోటాకు 1.29 కోట్ల ఓట్లొచ్చాయి. అయినా కళంకితులకు టికెట్లిచ్చే విషయంలో పారీ్టల తీరులో మార్పేమీ రాలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం నోటాకు ఎక్కువ ఓట్లు పడుతుండటం విశేషం!ఆ పవర్ ఇస్తేనే...ప్రస్తుత నిబంధనల ప్రకారం నోటాకు అభ్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లొచి్చనా ఎన్నికపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఆ ఓట్లన్నింటినీ పక్కనపెట్టి అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచి్చన వారే విజేత అవుతారు. అలా నోటా కేవలం అభ్యర్థులపై ఓటర్లు అసమ్మతిని వ్యక్తం చేసే ఆప్షన్‌గా మిగిలిపోతోంది. అలాగాక నోటాకే ఎక్కువ ఓట్లు పోౖలైతే తిరస్కరణకు గురైన అభ్యర్థులు మళ్లీ పోటీ చేయకుండా నిషేధించాలి. అప్పుడే పారీ్టలు నేరచరితులను పక్కన పెడతాయి’’ అని యాక్సిస్ ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. నోటాకు నిర్దిష్ట శాతానికి మించి ఓట్లు పోలైతే అభ్యర్థులను మార్చడం, మళ్లీ ఎన్నిక నిర్వహించడం వంటి మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 👉 ఏడీఆర్ డేటా ప్రకారం ఎన్నికల్లో నోటాకు 0.5 శాతం నుంచి 1.5 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. 👉 2019 లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు ఏకంగా 1.06 శాతం ఓట్లు రావడం విశేషం! 👉 లోక్‌సభ ఎన్నికల చరిత్రలో నోటాకు లక్షద్వీప్‌లో అతి తక్కువగా 100 ఓట్లే పడ్డాయి. 👉 బిహార్‌లోని గోపాల్‌గంజ్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో నోటాకు అత్యధికంగా 51,660 ఓట్లు వచ్చాయి. 👉 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు 1.98 శాతం ఓట్లు దక్కాయి. 👉 మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానంలో నోటాకు అత్యధికంగా 27,500 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లలో ఇవి ఏకంగా 13 తం! అక్కడ 67 శాతం ఓట్లతో గెలిచిన ధీరజ్ దేశ్‌ముఖ్ తర్వాత నోటాకే రెండో స్థానం దక్కడం విశేషం. 👉 ఇటీవలి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో నోటా మూడో స్థానంలో నిలిచింది! 👉 మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి! 👉 క్రిమినల్ కేసులున్న ముగ్గురికి మించి అభ్యర్థులు పోటీ చేసే రెడ్ అలర్ట్ నియోజకవర్గాల్లో 2018 నుంచి నోటాకు 27.77 లక్షల ఓట్లు పోలయ్యాయి. -
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
ఢిల్లీ: ఎన్నికల్లో కొంతమంది పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కాకుండా.. నోటా గుర్తుకు ఓటు వేస్తుంటారు. ఇటీవల ఇండోర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.ఇండోర్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు (సోమవారం) జరుగుతున్న నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.నిజానికి నోటా గుర్తుకు 99 శాతం మంది ఓటు వేసి, ఒక్కరు అక్కని పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేసినా.. ఆ అభ్యర్థే విజేతగా నిలుస్తారని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ పేర్కొన్నారు. అయితే ఒక నియోజక వర్గంలో నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు.. అక్కడి అభ్యర్థిని అక్కడి ప్రజలు ఎన్నుకోవడానికి సుముఖత చూపడం లేదని దానిపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. దీనివల్ల పార్లమెంటు, ఎన్నికల కమిషన్లపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. -
'నోటాకు ఓటు వేయండి': ఇండోర్ ఓటర్లకు కాంగ్రెస్ విజ్ఞప్తి
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఇండోర్ లోక్‌సభ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈయన ఇప్పుడు ఊహించని విధంగా, తన నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో వేరొక అభ్యర్థిని నియమించడానికి కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయింది.ఇండోర్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో సోమవారం జరగబోయే నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.నోటాకు ఓటు వేయాలని ప్రజలొక విజ్ఞప్తి చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సజ్జన్ వర్మ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఓటర్ల పరంగా మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ నియోజకవర్గాన్ని 35 ఏళ్లలో (1989 నుంచి) కాంగ్రెస్ గెలవలేదు, అయితే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోవడం ఇదే మొదటిసారి.इंदौर में लोकतंत्र की हत्या के खिलाफ गांधी प्रतिमा पर आयोजित प्रदर्शन में सम्मिलित हुआ। इंदौर का मतदाता पढ़ा लिखा और जागरूक है, नोटा के साथ अपना जवाब देगा।#Indore #NOTA pic.twitter.com/NMf5FbeIux— Sajjan Singh Verma (@sajjanvermaINC) May 11, 2024 -
ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం ‘నోటా’కే..
ఇండోర్ (మధ్యప్రదేశ్): లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.ఇండోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్‌ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.“గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్‌ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు. -
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే?: ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో నోటాకు(నన్ ఆఫ్ ది అబో) ఎక్కువ ఓట్లుపోలైతే ఆ ఎన్నికను రద్దు చేసి.. మళ్లీ ఎలక్షన్స్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదే విధంగా నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్ధులు మళ్లీ అదే నియోజకవర్గంలో అయిదేళ్ల వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశించాలని పిటిషన్ కోరింది.నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా పేర్కొంటూ సమర్థవంతమైన రిపోర్టింగ్/ ప్రచారాన్ని కల్పించేలా నిబంధనలను రూపొందించాలని కోరింది. వక్త, రచయిత శివ్ ఖేరా దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వాజ్యంపై సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ వాదిస్తూ.. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎలాంటి ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థి విజేతగా ప్రకటించిన సందర్భాన్ని ప్రస్తావించారు.సూరత్‌లో మరో అభ్యర్ధి లేనందున, అందరూ ఒకే అభ్యర్థి విజేతగా ప్రకటించారు. అయితే పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ, ఎన్నికల నిర్వహించాల్సి ఉండేదని తెలిపారు. ఓటరుకి అభ్యర్ధి నచ్చకపోతే నోటాకు ఓటేసేవాడని పేర్కొన్నారు. మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోటా ఉద్దేశ్యమని చెప్పారు. ఒక నియోజకవర్గంలో దాదాపు అన్ని అభ్యర్థులు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సందర్భాల్లో ఓటరు నోటాకు ఓటు వేసే అవకాశాలు ఉంటాయని, ఓటరు చేతిలో నోటా శక్తివంతమైన ఆయుధంగా పేర్కొన్నారు.నోటాను చెల్లుబాటు అయ్యే అభ్యర్థిగా పరిగణించడంలో భారత ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యంలో నాటా అవసరమని నొక్కి చెప్పారు. దీనిపై సీకజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదని పేర్కొంటూ.. పిటిషన్‌పై స్పందించాలంటూ ఈసీకి నోటీసులు జారీ చేసింది. -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు?
భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఓటర్లు ఏ అభ్యర్థినీ ఇష్టపడని పక్షంలో ఏమి చేయాలనే దానిపై గతంలో చర్చ జరిగింది. ఈ నేపధ్యంలోనే 2013 ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. 2013 తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారు. అయితే నోటాపై ఓటర్ల స్పందన ఎలా ఉందనే ప్రశ్న ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ అందరి మదిలో తలెత్తుతుంది. దీనిని తెలుసుకునేందుకు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో నోటా వినియోగం గురిచం పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు పూర్తియిన నాలుగు రాష్ట్రాల డేటాను అనుసరించి చూస్తే.. మూడు రాష్ట్రాల్లో, ఒక శాతం కంటే తక్కువ మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారని స్పష్టమైంది. మధ్యప్రదేశ్‌లో నమోదైన 77.15 శాతం ఓటింగ్‌లో 0.98 శాతం మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 1.26 శాతం మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో నోటా బటన్‌ను నొక్కారు. తెలంగాణలో 0.73 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. తెలంగాణలో 71.14 శాతం ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్‌లో 0.96 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఆ రాష్ట్రంలో 74.62 శాతం ఓటింగ్ జరిగింది. ‘నోటా’ ఆప్షన్ వినియోగం గురించి కన్స్యూమర్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘యాక్సిస్ మై ఇండియా’కు చెందిన ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ నోటా అనేది ఎన్నికల్లో .01 శాతం నుంచి గరిష్టంగా రెండు శాతం వరకు ఉపయోగితమవుతోంది. భారతదేశంలో అమలవుతున్న ‘ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్’ సూత్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈ విధానంలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అటువంటి పరిస్థితిలో ఓటర్లు.. ఎన్నికల్లో అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని భావించినప్పుడు వారు నోటాకు ఓటు వేయవచ్చు. అయితే నోటా ఆప్షన్‌ను ప్రజలు సక్రమంగా వినియోగించుకుంటేనే జనం నాడి తెలుస్తుందని, ప్రయోజనం ఉంటుందని, లేనిపక్షంలో అది లాంఛనప్రాయం అవుతుందని ప్రదీప్ గుప్తా అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్?.. అధిష్టానం నుంచి పిలుపు! -
పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు. ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్‌కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం. ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు! -
స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్) బటన్ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు. ఇలా ఈవీఎంల్లోకి.. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ రూపొందించింది. బోథ్: బోథ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్ నాయక్‌కు 677, ఆర్జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్‌కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్‌కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్ అయ్యాయి. ఇవి చదవండి: తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్.. -
నోటా.. తూటా..! అభ్యర్థులు నచ్చకపోతే దీనికే ఓటా..!?
సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కలి్పస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కలి్పంచింది. ఇందులో భాగంగా ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్)లో బరిలో ఉన్న అభ్యర్థుల గుర్తుతో పాటు నోటా ఆప్షన్‌ను ఏర్పాటు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో అభ్యర్థుల గుర్తుతో పాటు నోట అనే బటన్‌ను పొందుపర్చారు. ఆ బటన్ నొక్కితే ఓటు ఏ పారీ్టకి పడదు. కానీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లే లెక్క. గెలుపోటములపై ప్రభావం! నోటాకు పడే ఓట్లు తూటా కంటే బలమైనవిగా మారాయా..? అభ్యర్థుల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో పలు నియోజకవర్గాల్లో వెల్లడించిన ఫలితాల్లో నోటాకు పడే ఓట్లు గెలుపోటములను శాసించే శక్తిగా మారాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కేవలం 78 ఓట్లతో గెలుపొందారు. నోటాకు 1,139 ఓట్లు పోలయ్యాయి. నోటాకు బదులు అభ్యర్థులకు ఈ ఓట్లు పోలై ఉంటే గెలుపోటముల ఫలితం మరోలా ఉండేది. 2018 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు.. ► పరిగిలో మొత్తం 2,29,436 ఓట్లకు గాను 1,75,371 ఓట్లు అభ్యర్థులకు.. నోటాకు 1,381 పడ్డాయి. ఇక్కడ 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఆరుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► తాండూరు నియోజకవర్గంలో 2,01,917 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,56,436 ఓట్లు, నోటాకు 787 పోలయ్యాయి. 13 మంది పోటీ చేయగా ఏడుగురు అభ్యర్థులకు నోటాకు పడిన ఓట్ల కంటే తక్కువ పోలయ్యాయి. ► కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 2,01,941 ఓట్లకు గాను అభ్యర్థులకు 1,65,559, నోటాకు 1,472 పోలయ్యాయి. 15మంది అభ్యర్థులు పోటీ చేయగా పది మందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,07,222 ఓట్లు ఉండగా 1,53,722 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,531 పోలయ్యాయి. 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా లేడుగురికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ వచ్చాయి. ► చేవేళ్ల నియోజకవర్గంలో 2,24,230 ఓట్లకు గాను 1,77,197 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,469 పోలయ్యాయి. నియోజకవర్గం నుంచి పది మంది పోటీ చేయగా ఐదుగురు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ పోలయ్యాయి. -
ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే..? వేచుండాల్సిందే!
సాక్షి, మెదక్/సంగారెడ్డి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినా గతంలో ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేసేవారు. కొంత కాలంగా అభ్యర్థులపై తమ అయిష్టతను తెలియజేసేందుకు ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో ‘‘నోటా’’ ఆప్షన్‌ను జత చేసింది. దీంతో ఓటర్లు నోటా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. బీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉపేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, బీఎస్పీ నుంచి దూడ యాదేశ్వర్, జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఇతర పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచారు. వారిలో పద్మాదేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఉపేందర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కాగా బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య డిపాజిట్ కోల్పోయారు. ఇక మిగతా వారి సంగతి అంతంత మాత్రమే. ఈ ఎన్నికల్లో 899 పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 1,68,911 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 2263 మంది నోటాకు ఓటేసి అభ్యర్థులపై తమ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో వివిధ శాఖల ద్వారా అత్యవసర సేవలు అందించే అధికారులకు కేటాయించే 899 పోస్టల్ బ్యాలెట్లలో 49 ఓట్లు చెల్లకుండా పోగా, 3 ఓట్లు నోటాకు పడడం గమనార్హం. ఇప్పటికీ ‘‘నోటా’’ అనే మీట ఉందనే విషయం చాలా మంది ఓటర్లకు తెలియదు. అందువల్లే నోటాకు ఓట్లు తక్కువగా పడుతున్నాయని విద్యావంతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటును నోటాకు కాకుండా సరైన నాయకుడికి వేసి అభివృద్ధికి దోహద పడాలని మేధావులు సూచిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: మాటకు మాట! దూషణల పర్వంగా ప్రచారం!! -
నోటా (నన్ ఆఫ్ ది అబో) గురించి మీకు తెలుసా..!?
సాక్షి, మెదక్: నోటా (NOTA) ఈ పదం ఎక్కువగా ఎన్నికల సమయంలో వినపడుతూ ఉంటుంది. ఈవీఎం మిషన్లపై చివరగా ఉండే ఈ నోటా గురించి చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిసిన వారు కొందరు దీనిని ఉపయోగిస్తారు. రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి.. నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నాయి. ఓటు వేసేందుకు సరైన వారు ఒక్కరూ కనిపించడం లేదని అనుకునే వారి కోసం ఈ ‘నోటా’ మీటను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల్లో మనం ఓటు వేసేందుకు అర్హత లేతదని గుర్తిస్తే ఈవీఎంలపై ఉన్న నోటా బటన్‌ను నొక్కుతున్నారు. ఎన్నికల సంఘమైతే దానిని ప్రవేశపెట్టింది సరే.. మరి దానిని ఎవరైనా వినియోగిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానం వస్తుంది. దీనిని ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో నోటా బటన్‌ను నొక్కే వారి సంఖ్య ప్రతీ ఎన్నికల సమయంలో పెరుగుతూ వస్తుంది. నోటా (‘నన్ ఆఫ్ ది అబో) అంటే.. ‘పైన నిలబడిన వ్యక్తుల్లో ఎవరూ కాదు’ అని అర్థం. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఎవరూ నచ్చలేదని చెప్పేందుకు ఎన్నికల సంఘం దీనిని తీసుకొచ్చింది. పోలింగ్ శాతం పెంచడం, ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నోటాను ఎంచుకున్నారు. నోటా ప్రభావం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి నోటాకు పడుతున్న ఓట్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ఎంతలా అంటే.. పలుచోట్ల అభ్యర్థుల తలరాతను మార్చేంతలా ఉంది. గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం కంటే నోటాకు పోలైన ఓట్లే ఎక్కువ.. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మూడు వేలకు పైగానే ఓట్లు పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు సూచనతో.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకువచ్చింది. అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రీం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినప్పటికీ పలు సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో నోటాను అమల్లోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పును వెలువరించింది. ఎప్పటి నుంచో ఉన్న తిరస్కరణ ఓటు.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49(ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ అధికారి దగ్గర దీనికోసం 17–ఏ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని తెలుపుతూ సంతకం లేదా వేలి ముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో ఎన్నికల సంఘం నోటాను అమలు చేసింది. పెరుగుతున్న ఆదరణ.. 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించడంతో నోటాకు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు నోటా బటన్‌ను నొక్కేస్తున్నారు. 2014లో తొలిసారిగా నోటాను బ్యాలెట్ షీట్లో చేర్చారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు 14,899 ఓట్లు పోలైతే, 2018లో 20,739 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం విశేషం. సిద్దిపేట నియోజవర్గంలో ఏడుగురు అభ్యర్థులకు, మెదక్‌లో 8 మంది, నారాయణఖేడ్‌లో 6, అందోల్‌లో 5, నర్సాపూర్‌లో 3, జహీరాబాద్‌లో 10, సంగారెడ్డిలో 10, పటాన్చెరులో 11, దుబ్బాకలో 11, గజ్వేల్‌లో 9, హుస్నాబాద్ నియోజకవర్గంలో 11 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇవి చదవండి: 'కార్యకర్తలను కాపాడుకుంటా..' : మంత్రి హరీశ్‌రావు -
TS Election 2023: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. 'నోటా' కు ఎక్కువ ఓట్లు వస్తే..!?
సాక్షి, నల్గొండ: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి. మరి తమ నియోజకవర్గ పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవ్వరూ నచ్చకపోతే ఏం చేయాలి. ఎవరికో ఒకరి ఓటు వేయకుండా తమ నిరసనను వ్యక్తం చేయడం ఎలా..? దీనిపై 2003వ సంవత్సరంలోనే పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అనేక వాదోపవాదనలు జరిగిన తరువాత ‘నోటా’ (నన్ ఆఫ్ ద ఎబౌ)ను ఈవీఎంలలో చేర్చాలని సుప్రీం సూచించింది. 2014 ఎన్నికల నుంచి ఎన్నికల సంఘం ఈవీఎంలలో ‘నోటా’ను చేర్చింది. బరిలో ఉన్న వారెవ్వరూ నచ్చకపోతే నోటా మీట నొక్కవచ్చు. అయితే జిల్లాలో జరిగిన రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఎన్నికలో నోటాకు 1 శాతానికి మించి ఓట్లు పడకపోవడం గమనార్హం. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. 2014 నుంచి అమల్లోకి వచ్చిన నోటాకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 12 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో కేవలం 0.2 నుంచి 0.4 శాతమే. 2018 ఎన్నికల్లో 0.5 నుంచి 0.8 శాతం వరకు ఓట్లు వచ్చాయి. ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే దాని తర్వాత స్థానంలో నిలిచిన వారు గెలిచినట్లు ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెపుతున్నాయి. ఇతర దేశాల్లో ఇలా.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు నోటాను అమలు చేస్తున్నాయి. ► బెల్జియం, ప్రాన్స్, యూఎస్ఏలో ఈవీఎంల మీద నోటాను అమలు చేస్తున్నారు. ► కొలంబియా, స్పెయిన్, బ్రెజిల్, గీస్, పిన్లాండ్, స్వీడన్, ఉక్రెయిన్, చీలి వంటి దేశాలు ఓట్ ఆఫ్ రిజెక్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ► మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ 2008 నుంచి నోటాను అమలు చేస్తుండగా పాకిస్తాన్ 2013 నుంచి నోటాను అమలు చేస్తోంది. -
ఉప ఎన్నికలో నోటాకి సెకండ్ ప్లేస్
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్‌కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. అందులో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) వశం అయ్యాయి. ఇక మహారాష్ట్ర అంధేరీ(తూర్పు) నియోజకవర్గం నుంచి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి రుతుజా రమేష్ లాట్కే.. 66వేల ఓట్ల మార్జిన్‌తో ఘన విజయం సాధించారు. శివసేన ఎమ్మెల్యే రమేష్ లాట్కే ఈ మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ(తూర్పు) స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు మాత్రమే కాదు.. బీజేపీ సైతం ఇక్కడ తమ అభ్యర్థిని దింపకపోవడంతో.. రుతుజాకి బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో..ఈ ఉప ఎన్నికలో అంధేరీ ఓటర్లు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజాతో పాటు ఈ ఉప ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇలా.. అభ్యర్థుల(ప్రధాన పార్టీ అభ్యర్థులు కాదు) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోల్ కావడం గమనార్హం. అంటే రుతుజా తర్వాత నోటా ఓట్లే రెండు స్థానంలో నిలిచాయన్నమాట. రుతుజా లాట్కే.. గతంలో బృహణ్‌ముంబై మున్సిపల కార్పొరేషన్లో క్లర్క్‌గా పని చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఉప ఎన్నికల బరిలో దిగారు. త్వరలో ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో.. థాక్రే వర్గంలో ఈ విజయం జోష్‌ను నింపింది. మరోవైపు ప్రజలు తమవైపే ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. కారు హవాను తక్కువగా అంచనా వేశాం! -
హుజురాబాద్ ఉప ఎన్నిక: వజ్రం, రోటీమేకర్, నోటాకు భారీగానే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం వజ్రం: ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి మూడు ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. రోటీమేకర్: ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ 1,913తో ఐదోస్థానం సంపాదించారు. ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు? పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ హవా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను, 455 ఓట్లు టీఆర్ఎస్కు, 242 ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు 2 పోల్ కాగా.. 48 ఓట్లు చెల్లలేదు. -
నోటాపై మీ అభిప్రాయమేంటి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా నోటా అంశం వెలుగులోకి వస్తుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మనకు ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. చాలా సార్లు బరిలో నిలిచిన వారికంటే నోటాకే అధికంగా ఓట్లు వచ్చిన సందర్భాలున్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తే.. మరోసారి ఎన్నికలు జరిపి కొత్తవారిని ఎన్నుకోవాలని.. అప్పుడే నోటాకు విలువ ఉంటుందనే వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. నోటా విషయంలో అభిప్రాయం ఏంటో తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ ఎన్నికను రద్దు చేయాల్సిందిగా కోరుతూ.. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రమసుబ్రమణియన్తో కూడిన బెంచ్ సోమవారం ఈ పిల్‌ని విచారిందింది. ఈ నేపథ్యంలో నోటాపై అభిప్రాయాలను తెలియాజేయాల్సిందిగా బెంచ్.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని కోరింది. విచారణ సందర్బంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తుతం ఓటర్లకు కేవలం అభ్యర్థులను తిరస్కరించే అవకాశం మాత్రమే ఉందని.. కానీ దీన్ని కూడా ఓటుగా గుర్తించాలని కోరారు. ప్రసుత్తం నోటాకు 99 శాతం ఓట్లు వచ్చి.. అభ్యర్థికి ఒక్కశాతం ఓట్లు వచ్చినా అతడిని విజేతగా ప్రకటిస్తున్నారని.. దీన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. మరోసారి ఎన్నికలు జరిపి కొత్త వారిని ఎన్నుకోవాలని.. అప్పుడే నోటాకు ప్రయోజనం ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. నోటా నేపథ్యం... ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును నోటా వినియోగించుకున్నట్టే. ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది. చదవండి: ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ‘నోటా’కు ఆస్కారం లేదు -
‘గ్రేటర్’ తీర్పు: కారుకు బ్రేక్.. కమలానికి షాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆయా పార్టీల ఆధిక్యతలపై స్పష్టమైన ప్రభావం చూపింది. ఎక్కువ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ దాదాపు 17 చోట్ల స్వల్ప తేడాలతో విజయానికి దూరమైంది. బీజేపీ స్వల్ప తేడాతో ఓడిన స్థానాల్లోనూ నోటాకు ఎక్కువ ఓట్లు పడడం ఆ పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. ఇలా స్వల్ప తేడాతో ఓడిన స్థానాల్లో పరాజయానికి కారణాలపై ఆయా పార్టీలు విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. అయితే.. బీఎన్‌రెడ్డి నగర్లో 32 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ⇔ బంజారాహిల్స్ డివిజన్లో టీఆర్ఎస్కు 10,227, బీజేపీకి 9,446 ఓట్లు వచ్చాయి. నోటాకు 805 ఓట్లు వచ్చాయి. 126 చెల్లని ఓట్లు ఉన్నాయి. బీజేపీ 781 ఓట్లతో తేడాతో ఓడిపోయింది. ఇక్కడా నోటాకు 805 ఓట్లు రావడం బీజేపీ ఓటమిపై ప్రభావాన్ని చూపింది. ⇔ మచ్చబొల్లారం డివిజన్లో టీఆర్ఎస్కు 12,089, బీజేపీకి 12,055 ఓట్లు వచ్చాయి. కేవలం 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడా నోటాకు 302 ఓట్లు పడడం కూడా టీఆర్ఎస్కు కలిసివచ్చింది. బీజేపీ ఓటమి పాలైంది. అభ్యర్థి పరాజయం పొందగా.. అది కూడా డమ్మీ అభ్యర్థిగా నిలిచిన ఆమె కుమారుడికి 39 ఓట్లు పడడంతో ఆమె విజయం తారుమారైంది. ఈ విధంగానే చాలాచోట్ల నోటా, చెల్లనిఓట్లు అభ్యర్థులు పరాజయం పొందిన ఓట్లకు ఎక్కువగా, సమంగా ఉండడం కూడా ఆయా పార్టీ నేతలను మథనపడేలా చేశాయి. బీఎన్‌రెడ్డి నగర్, మల్కాజిగిరి, అడిక్‌మెట్, హస్తినాపురం, వినాయక్‌నగర్, రాంగోపాల్‌పేట, రాంనగర్, మూసాపేట, రామంతాపూర్, వనస్థలిపురం, జూబ్లీహిల్స్, మంగళ్‌హాట్, సైదాబాద్, గచ్చిబౌలి, అమీర్‌పేట, హబ్సిగూడ, కవాడిగూడలలో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. కొన్ని డివిజన్లలో ఇలా.. ⇔ మల్కాజిగిరి డివిజన్లో గెలిచిన బీజేపీ అభ్యర్థికి 8,361 ఓట్లు పోల్ కగా.. కేవలం 172 ఓట్ల తేడాతో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థికి 8,188 ఓట్లు పోలయ్యాయి. విచిత్రమేమిటంటే మెజారిటీ 172 ఓట్లను మించి ఇక్కడా నోటాకు 245 ఓట్లు పడడంతో టీఆర్ఎస్ అభ్యర్థికి భంగపాటుగా మారింది. ⇔ వినాయక్‌నగర్ డివిజన్లో బీజేపీకి 9,972 ఓట్లు, టీఆర్ఎస్కు 9,685 ఓట్లు పోలయ్యాయి. 287 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోగా ఆ అంకెకు సమానంగా అంటే 287 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇలా నోటా ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ⇔ వనస్థలిపురం డివిజన్లో బీజేపీ అభ్యర్థికి 9,214 ఓట్లు, టీఆర్ఎస్కు 8,513 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 1374, టీడీపీకి 772, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 119 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 259 ఓట్లు పడగా, చెల్లని ఓట్లు 269 ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 702 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ⇔ హస్తినాపురం డివిజన్లో బీజేపీకి 8036, టీఆర్ఎస్కు 7,757 ఓట్లు వచ్చాయి. కేవలం 279 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. నోటాకు 247 ఓట్లు పడగా, 458 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇటు నోటాకు ఓట్లు వేయకపోయినా, అటు చెల్లని ఓట్లు లేకుండా పరిగణనలోకి వచ్చి ఉంటే 279 ఓట్లు ఈజీగా తమ అభ్యర్థి ఖాతాలో చేరిపోయి ఉండేవని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ⇔ అడిక్‌మెట్ డివిజన్లో బీజేపీకి 7,830, టీఆర్ఎస్కు 7600 ఓట్లు వచ్చాయి. కేవలం 239 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పరాభవం పొందారు. గెలుపును ప్రభావితం చేసిన 239 ఓట్ల కన్నా ఎక్కువగా నోటాకు 265 ఓట్లు పోలవడంతో ఓడిన పార్టీ అభ్యర్థులు నైరాశ్యంలో మునిగిపోయారు. ⇔ రాంనగర్ డివిజన్లో బీజేపీకి 9,819, టీఆర్ఎస్కు 9291 ఓట్లు పోలయ్యాయి. 528 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడా నోటాకు 215, చెల్లని ఓట్లు 307 వరకు అంటే మొత్తం 522 ఓట్లు అభ్యర్థులకు పనికిరాకుండా పోయాయి. ⇔ సైదాబాద్ డివిజన్లో బీజేపీకి 10,621, టీఆర్ఎస్కి 9,710 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 188, చెల్లని ఓట్లు 370 ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 911 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడా స్థానిక సమస్యల బాగా ప్రభావితం చేశాయి ⇔ గచ్చిబౌలి డివిజన్లో బీజేపీకి 10,602, టీఆర్ఎస్కు 9,467 ఓట్లు వచ్చాయి. నోటాకు 207 ఓట్లు పడ్డాయి. 562 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సైతం టీఆర్ఎస్ అభ్యర్థి 1,135 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ⇔ రామంతాపూర్ డివిజన్లో బీజేపీకి 10,033, టీఆర్ఎస్కు 9,378 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 225 ఓట్లు వచ్చాయి, 310 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 705 ఓట్లతో పరాజయం పొందారు. ⇔ హబ్సిగూడ డివిజన్లో బీజేపీకి 10,803, టీఆర్ఎస్కు 9,4356 ఓట్లు వచ్చాయి. నోటాకు 218 ఓట్లు వచ్చాయి. 426 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి 1147 ఓట్లతో ఓడిపోయారు. ⇔ ఇక ఎంఐఎం విషయానికొస్తే అత్యల్ప మెజారిటీ (1583 ఓట్లు) గెలిచింది జంగమ్మేట్లోనే. ఇక్కడా ఎంఐఎంకు 10,629 ఓట్లు, బీజేపీకి 9046 ఓట్లు పడ్డాయి. మెజారిటీ 1583ఓట్లు ఎంఐఎంకు వచ్చాయి. నోటాకు 66, చెల్లని ఓట్లు 756 వచ్చాయి. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా బీజేపీ అభ్యర్థి రాణించడంతో మెజారిటీ తగ్గిందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంది. కారును ముంచిన వరద ప్రాంతాలివే.. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్‌తో పాటు శివారులోని చాలా ప్రాంతాలు జలమయ్యాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికార పార్టీ నేతలు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చైతన్యపురి, హబ్సిగూడ, రామంతాపూర్, చంపాపేట, నాగోలు, సరూర్‌నగర్, గడ్డి అన్నారం, హయత్‌నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్లలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. -
ఏడు లక్షల ఓట్లతో.. తేల్చిచెప్పారు!
పట్నా: టీ-20 మ్యాచ్‌లా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ సాధారణ మెజార్టీతో తిరిగి అధికారం నిలబెట్టుకుంది. బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో బిహారీలు పెద్ద ఎత్తున ‘నోటా’ వైపు మొగ్గుచూపారు. ఏడు లక్షలకు పైగా ఓటర్లు ‘నోటా’కు ఓకే చెప్పారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7,06,252 (1.7 శాతం) మంది ఓటర్లు ‘నోటా’కే జై కొట్టారు. బిహార్‌లో 7.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా కేవలం 4 కోట్ల మంది (57.09శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగినా ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు ‘నోటా’ కన్నా తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచారు. హోరాహొరీగా జరిగిన పోరులో చాలా చోట్ల అభ్యర్థుల గెలుపోటములపై ‘నోటా’తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. 2013 నుంచి నోటా ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈవీఎంలలో చివరన దీన్ని పొందుపరుస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే ‘నోటా’ గుర్తును ఎంచుకోవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా నోటా గుర్తుకి ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. (చదవండి: నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) -
ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ‘నోటా’కు ఆస్కారం లేదు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్న చోట ‘నోటా’కు ఏ మాత్రం అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని తెలిపింది. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ‘నోటా’ను ఉపయోగించుకోవచ్చునంది. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ‘నోటా’ను వినియోగించుకోవడానికి నిబంధనలు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన నిబంధనలు రూపొందించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న చోట నోటాను వినియోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీవీ భద్ర నాగశేషయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
స్థానికంలోనూ 'నోటా'
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటాకు చోటు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాలెట్ పత్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇది పెద్ద తలనొప్పేనని నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నోటాకు కొన్ని ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు రావడమే దీనికి కారణం. ఇప్పటివరకు ఈవీఎంలలో మాత్రమే నోటాకు చోటు ఉండేది. ఇప్పుడు బ్యాలెట్ పత్రాలలోనూ ఇది ప్రత్యక్షం కానుంది. అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తరువాత ఈ నోటా గుర్తు ఉంటుంది. పోటీ చేసే వారు ఎవరూ నచ్చకపోతే ఈ గుర్తుకుఓటు వేయొచ్చు. ఇప్పటివరకు గత్యంతరం లేక ఎవరో ఒకరి వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు నోటా ఉండడంతో దానిని ఉపయోగించుకోవడం వల్ల తమకు ఇబ్బందేనని నాయకులు చెబుతున్నారు. ఇది ఒక్కోసారి జయాపజయాలను నిర్దేశించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకంటే ఎక్కువగా ♦ గత సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లను పరిశీలిస్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఎక్కువ వచ్చాయి. దీంతో ఆ పార్టీల అభ్యర్థులు కంగుతిన్నారు. నియోజకవర్గాల వారీగా నోటాకు పోలైన ఓట్లు ఇలా.. ♦ కొవ్వూరులో 2165, నిడదవోలులో 1693, ఆచంటలో 1453, పాలకొల్లులో 1170, నరసాపురంలో 1143, భీమవరంలో 1492, ఉండిలో 1885, తణుకులో 1885, ఉంగుటూరులో 2321, దెందులూరులో 2546, ఏలూరులో 1524, గోపాలపురంలో 3998, పోలవరంలో 6004, చింతలపూడిలో 3477 ఓట్లు నోటాకు పోలయ్యాయి. -
తొలిసారి పంచాయతీ బరిలో నోటా
సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కులాల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేశారు. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించి తప్పొప్పులు సరిచేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలను పూర్తిచేసి అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకుని ఓటర్ల తుది జాబితాలను ప్రచురించారు. ఈసారి తొలిసారిగా స్థానిక ఎన్నికల్లో ‘నోటా’ విధానం ప్రవేశపెడుతుండటం మరింత ఆసక్తిని రేపుతోంది. నోటాకు అధిక ఓట్లు పోలయితే రీపోలింగ్ పెట్టాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో 909 గ్రామ పంచాయతీలుండగా 9,930 వార్డుల్లో 25,50,916 మంది ఓటర్లున్నారు. రెండు బ్యాలెట్లతో నిర్వహణ పంచాయతీ ఎన్నికలు రెండు బ్యాలెట్లతో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పాత పద్ధతిలోనే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పత్రాలు కొనుగోలు చేయాలని, ముద్రణకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో రెండు రంగుల బ్యాలెట్లు ఉంటాయి. సర్పంచ్‌కు గులాబీ రంగు బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుగు రంగు బ్యాలెట్ పత్రాలను కేటాయించారు. జిల్లా స్థాయి కమిటీ అనుమతితో ఎంపిక చేసిన కేంద్రంలో వచ్చేనెల బ్యాలెట్ ముద్రణ జరుగుతుంది. అభ్యర్థుల ఖర్చు పెంపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల దరావతు, ఎన్నికల వ్యయ పరిమితి పెరగనుంది. దరావతు 150 శాతం నుంచి 1000 శాతం పెంచేలా ప్రతిపాదనలు చేశారు. 10 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచ్‌కు రూ.20 వేలు, వార్డు సభ్యుడికి రూ.3 వేలు ఖర్చు చేయాల్సి వుండగా ప్రస్తుత సర్పంచ్ రూ.32 వేలు, వార్డుసభ్యుడు 4,800 వరకు ఖర్చు చేయవచ్చు. 10 వేల పైబడి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ రూ.40 వేలు, వార్డు సభ్యుడు రూ.5 వేలుగా ఉన్న ఎన్నికల వ్యయాన్ని ఇకపై సర్పంచ్‌కు రూ.64 వేలు, వార్డు సభ్యుడు రూ.8 వేలకు పెంచాలన్న ప్రతిపాదన ఉంది. రిజర్వేషన్లపై తర్జనభర్జన 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 39.99 శాతం, ఎస్సీలకు 18.30 శాతం, ఎస్టీలకు 8.50 శాతం కోటాను అమలు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి నూతన ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి వుంది. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల్లో 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. దీంతో పల్లెల్లో పార్టీ మరింత బలంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు పలికిన సర్పంచులు గెలవడంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ సారి క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కులాల వారీగా ఆర్థిక స్థోమతను బట్టి ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అభ్యంతరాలు పరిష్కరించాం జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వనరులు, వసతులు పరిశీలించి ఎంపిక పూర్తి చేశాం. పంచాయతీ కార్యాలయాల్లో తుది ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రకటించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల కులగణ అంతా పారదర్శకంగా చేశాం. ఆయా వర్గాలకు ఉన్న ఓట్ల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండడంతో చాలా జాగ్రత్తగా పూర్తిచేశాం. ప్రభుత్వం రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఎన్నికలు పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. – రోళ్లకంటి విక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు -
కాంగ్రెస్, బీజేపీ ఓట్లకన్నా నోటా ఓట్లే ఎక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్ర జాతీయ పార్టీలకు లభించిన ఓట్లకంటే నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ఓట్లే అధికంగా నమోదయ్యాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు నోటా స్థాయిలో కూడా ఓట్లు పడలేదు. లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.29 శాతం ఓట్లు రాగా, మరో జాతీయ పార్టీ బీజేపీకి 0.96 శాతం ఓట్లు లభించాయి. అదే లోక్‌సభ నియోజకవర్గాల్లో నోటాకు మాత్రం 1.49 శాతం ఓట్లు నమోదయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్లను పరిశీలించినా ఈ రెండు జాతీయ పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్థానాల్లో 1.17 శాతం ఓట్లు రాగా.. బీజేపీకి 0.84 శాతం ఓట్లు లభించాయి. నోటాకు మాత్రం 1.28 శాతం ఓట్లు నమోదయ్యాయి. మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చాలనే కుట్రతో బీఎస్పీ అభ్యర్థులను రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దింపారు. ఆ పార్టీకి కూడా నోటాకు వచ్చిన ఓట్ల శాతంలో సగం కూడా లేకపోవడం గమనార్హం. ఆ పార్టీకి రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో కేవలం 0.26 శాతం ఓట్లు, అసెంబ్లీ స్థానాల్లో 0.28 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. జాతీయ పార్టీలైన సీపీఎం, సీపీఐలకు సైతం నోటా ఓట్లలో సగం కూడా రాలేదు. ఆ రెండు పార్టీలు జనసేనతో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్థానాల్లో సీపీఐకి కేవలం 0.11 శాతం ఓట్లు రాగా, సీపీఎంకు 0.32 శాతం ఓట్లు వచ్చాయి. -
ముగ్గురి జాతకాన్ని మార్చిన నోటామీట!
సాక్షి, హైదరాబాద్: ‘నోటా’ముగ్గురు అభ్యర్థుల జాతకాన్ని తారుమారు చేసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ చెల్లని ఓటు మార్చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చనప్పుడు (నన్ ఆఫ్ ది అబోవ్) ఓటర్లు ‘నో’చెప్పే ఆయుధం నోటా. ఈ ఓటు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు చమటలు పట్టించింది. జహీరాబాద్, భువనగిరి, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో మెజార్టీకన్నా..నోటా మీటకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ స్వల్ప ఓట్ల తేడాతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై గెలుపొందారు. కేవలం 6,229 ఓట్లతో మదన్ మోహన్ ఓడిపోయారు. ఇక్కడ నోటాకు ఏకంగా 11,140 ఓట్లు పడ్డాయి.అలాగే, భువనగిరిలోను సేమ్ సీను చోటు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతి స్వల్ప అంటే 5,219 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను ఓడించారు. ఈ స్థానంలో నోటాకు 12,029 ఓట్లు వచ్చాయి. మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌లోను నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ఏకంగా 17,895 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎనుమల రేవంత్‌రెడ్డి 10,919 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డిని ఓడించారు. నోటాకు పోలయిన ఓట్లలో కొన్ని తమకు పడినా గెలిచే వాళ్లమన్న బెంగ పరాజితులకు పట్టుకుంది. స్వల్ప ఓట్లతో ఓడిపోవడం ఒక ఎత్తయితే.. మెజార్టీ ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో నోటాకు పడడం వారిని కుంగదీసింది. 2014 ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలలో ఈ ఆప్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇలా నోటా ఆయుధం ఎలా ఉంటుందో అభ్యర్థులకు తెలిసివచ్చింది. వరంగల్‌లో అత్యధికం.. ఇందూరులో అత్యల్పం వరంగల్ పార్లమెంటరీ స్థానంలో నోటాకు అనూహ్యరీతిలో ఓట్లు పోలయ్యాయి. ఏకంగా 18,801 ఓట్లు రావడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా లేకపోవడంతోనే తటస్థ ఓటర్లు నోటావైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. అలాగే, అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలోను నోటాకు గణనీయంగా ఓట్లు వచ్చాయి. 17,895 ఓట్లు రావడంతో ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసింది. ఇక దేశంలోనే అత్యధిక అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్‌లో మాత్రం ఓటర్లు పరిణితితో వ్యవహరించారు. అక్కడ రాష్ట్రంలోనే అత్యల్పంగా అంటే కేవలం 2,031 ఓట్లు మాత్రమే నోటాకు వచ్చాయి. ఈ సెగ్మెంట్లో 185 మంది పోటీపడ్డ సంగతి తెలిసిందే.