Papireddy
-
ఇంటర్ పాసైతే.. ఇంజనీరింగ్‌కు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం, ఇంటర్ మార్కుల వెయిటేజీ లేకపోవడంతో.. ర్యాంకులు ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో.. ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో ప్రభుత్వం కాస్త ఉదార నిర్ణయం తీసుకుంది. ఇంటర్లో జనరల్ కేటగిరీకి 45 శాతం, రిజర్వుడ్‌కు 40 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్‌కు అర్హతగా పేర్కొనే నిబంధనను సడలించింది. కోవిడ్ పరిస్థితులు, ఇంటర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఎంసెట్ పాసైనవారు సులువుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందొచ్చు. ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు బుధవారం ఎంసెట్ ఫలితాల వెల్లడి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించామని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. మొత్తం 1,64,964 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,47,986 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం రాష్ట్రం లో మొత్తం లక్షకుపైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30వేల వరకు మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంసెట్‌కు హాజరైన నేపథ్యంలో.. సీట్ల కోసం డిమాండ్ ఉండొచ్చని అంచనా. -
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. 4, 5, 6, 9, 10వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ విద్యార్థుల కోసం టెస్ట్‌లు ఉంటాయి. ఈసారి హాల్‌టికెట్‌తో పాటు పరీక్షాకేంద్రం రూట్‌మ్యాప్ ఇచ్చారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులను గంటంపావు ముందు నుంచి పరీక్షాహాల్లోకి అనుమతిస్తారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి.. కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్ డిక్లరేషన్ ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు వంటివి ఉన్నవారికి ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. బాల్ పాయింట్ పెన్, హాల్‌టికెట్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. జర్కిన్లు వేసుకొని రాకూడదు. భౌతికదూరం ప్రకారం ఆన్ లైన్లో పరీక్ష ఉంటుంది. ఎంసెట్ మార్కులు 160 కాగా జనరల్ కేటగిరీ అభ్యర్థుల అర్హతకు 40 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కు ఉండదు. బాలికలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. పరీక్షాపత్రం ఇంగ్లిషు–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ, ఇంగ్లిష్‌లలో ఉంటుంది. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక కేటగిరీ భాషల్లో పరీక్షాపత్రం ఇస్తారు. -
మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్
సాక్షి, హైదరాబాద్: బీఈ/బీటెక్ ప్రవేశాలకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్లో కచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండాలన్న నిబంధనను తొలగించింది. వాటిని ఆప్షనల్‌గానే పేర్కొంది. నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని వెల్లడించింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి.. 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ (రివైజ్డ్) 2020–21లో బీఈ/ బీటెక్/ బీఆర్క్/ బీప్లానింగ్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్లడించింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులను విద్యార్థులు తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని స్పష్టం చేసింది. వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది. అందులో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ వంటి సబ్జెక్టులో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది. అంటే బీఈ/బీటెక్/బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ప్లానింగ్ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియట్లో (12వ తరగతి) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని పేర్కొంది. అయితే తాజాగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మన దగ్గర ఎంపీసీ విద్యార్థులే ఇంజనీరింగ్‌లో చేరుతారు. ఏఐసీటీఈ పేర్కొన్న పలు కాంబినేషన్ల సబ్జెక్టులు మన దగ్గర ఇంటర్మీడియట్లో లేవు. పైగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - పాపిరెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి అన్ని కోణాల్లో పరిశీలిస్తాం నిర్దేశిత సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే చాలని పేర్కొన్న ఏఐసీటీఈ నిబంధనను పరిశీలిస్తాం. ఈసారి సాధ్యం అవుతుందా లేదా అన్న దానిపై సబ్జెక్టు నిపుణులతో, యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విభాగం నిపుణులతో చర్చిస్తాం. అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అయితే అర్హతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు/ సంబంధిత బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పినందున ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలితో చర్చిస్తాం. మండలి సూచనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - ప్రొఫెసర్ గోవర్ధన్, ఎంసెట్ కన్వీనర్ -
టీఎస్ సీపీజీఈటీ-2020 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రొఫెసర్ పాపిరెడ్డి జనవరి 7వ తేదీన విడుదల చేశారు.ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్మిటీ డిసెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. 85270 మంది దరఖాస్తు చేసుకోగా.. 72467 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 70141 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాగా దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఇంకా పూర్తి వివరాలకు www.osmania.ac.in, www.tscpget.com, www.ouadmissions.com లో చూడొచ్చు. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల
-
టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి శనివారం విడుదల చేశారు. పరీక్ష రాసిన 63,857 మంది అభ్యర్థులకు గాను 59,113 మంది క్వాలిఫై అయినట్లు పాపిరెడ్డి తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు ర్యాంకు కార్డులను www.sakshieducation.com వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా మెడిసిన్ అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 79,978 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. గత నెల 28, 29వ తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 63,856 మంది హాజరయ్యారు. కాగా నవంబర్‌లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ లో టాప్ 10 రాంకులు వీరే.. 1. గుట్టి చైతన్య సింధు... తెనాలి 2. సాయి త్రిషా రెడ్డి... సంగారెడ్డి 3. తుమ్మల స్నేహిత....హైదరాబాద్. 4. దర్శి విష్ణు సాయి..... నెల్లూరు. 5. మల్లిడి రిషి..... ఖమ్మం 6. మల్లిక్ చిగురుపాటి... మేడ్చల్ 7. ఆవుల సుబాస్.... హైదరాబాద్. 8. గారపాటి గుణ చైతన్య... కర్నూల్ 9. జి.వినయ కుమార్... చిత్తూరు 10. కోటావెంకట్.... కృష్ణా జిల్లా -
ఫైనలియర్‌కే పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యావ్యవస్థ పవిత్ర తను కాపాడే ఉద్దేశంతో యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని.. మిగిలినవారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి వల్ల విద్యాసంస్థలు మూతబడి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి ఏం చేయాలనే అంశంపై గురువారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారం భించాలని సూచించారు. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుం దని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలల ఎప్పుడు పునఃప్రారంభించాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అనాథ ఆడపిల్లలు కస్తూర్బా పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్నారని.. తర్వాత వారి చదువుకు కావల్సిన ఏర్పాట్లు చేసే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని సీఎం స్పష్టంచేశారు. దీనిపై త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి... రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షలు, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ,ఏఐపీటీఈ వంటి సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాం. విద్యుత్ సమస్య పరిష్కారమైంది. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. వ్యవసాయ రంగం కుదుటపడుతోంది. భూకబ్జాలు లేవు. పేకాట క్లబ్బులు పోయాయి. గుడుంబా బట్టీలు ఆగిపోయాయి. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుతున్నాం. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్‌షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేయడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడింది. ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఓపీ పెరిగింది. వైద్యరంగంలో దోపిడీ ఆగింది. అదే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. దోపిడీ ఆగిపోతుంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తున్నవారిని ప్రోత్సహించాలి.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అధికారులు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు చెప్పారు. వారిద్దరూ తాము పనిచేస్తున్న చోట పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని తెలిపారు. దీంతో వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సదాశివయ్యకు సీఎం ఫోన్.. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, అక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన సదాశివయ్యతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ‘సదాశివయ్యగారూ.. మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని టీవీల్లో స్వయంగా చూశాను. మీ అంకితభావం గొప్పది. మీకు హదయ పూర్వక అభినందనలు. మీరు సంకల్పించినట్లుగానే జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. దానికి కావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మీలాంటి వాళ్లే సమాజానికి కావాలి. ఈ స్పూర్తిని కొనసాగించండి. పాలమూరు యూనివర్సిటీలో కూడా పెద్దఎత్తున మొక్కలు పెంచండి. మంచి ఉద్దేశంతో చేస్తున్న మీ సామాజిక కార్యక్రమాలను కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’అని సీఎం పేర్కొన్నారు. బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, దేవసేన పాల్గొన్నారు. -
పాస్, ఫెయిల్ లేదు.. డైరెక్ట్ ప్రమోట్
సాక్షి, హైదరాబాద్ : కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కరోనా లాక్డౌన్ ఎప్పటివరకు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మే 7 తర్వాతి పరిస్థితులను బట్టి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఒక వేళ మే నెల మొత్తం లాక్డౌన్ ఉంటే జూన్ మూడో, నాలుగో వారంలో పరీక్షలు నిర్వహిస్తాం. డిగ్రీ ఆ స్థాయి ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం కానీ, పాస్, ఫెయిల్ అనే మాట ఉండదు. డైరెక్ట్ ప్రమోట్ చేస్తాం. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల సిలబస్ కోసం కాలేజ్‌లతో మాట్లాడుతున్నాం. ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తాం. కామన్ టెస్ట్‌ల తర్వాత కొత్త విద్యా సంవత్సరం నెల, రెండు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంద’’ని తెలిపారు. -
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6వ తేదీ వరకు, రూ.1000 ఫైన్‌తో ఏప్రిల్ 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.5వేల ఫైన్‌తో ఏప్రిల్ 20 తేదీ వరకు, రూ.10వేల జరిమానాతో ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మే 4,5,6వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, మే9,11వ తేదీల్లో అగ్రికల్చర్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలుజరగనున్నాయి. -
సెట్ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్.. ఈ మూడు సెట్స్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం తెలిపారు. మే నెల 5, 6, 7 తేదీల్లో జరగాల్సిన ఎంసెట పరీక్షలు.. మే నెల 4, 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా మే 25 తేదీన జరగాల్సిన లాసెట్ పరీక్షను మే 27 వ తేదిన జరుగుతుందన్నారు. పీజీసెట్ పరీక్ష 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉండగా 28 నుంచి 31 వరకు జరుగుతాయని కొత్త షెడ్యూల్లో ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు పరీక్ష ఫీజులు ఈ ఏడాది పెంచటం లేదన్నారు. గురువారం నిర్వహించిన కన్వీనర్ సమావేశంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదని పాపిరెడ్డి చెప్పారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడం కోసం కన్వీనర్లకు పలు కీలక సూచనలు ఇచ్చామని ఆయన అన్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టం గురించి తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్( టీఎస్టీఎస్)తో మాట్లాడి అవగాహన చేసుకున్న తర్వాతనే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రంజాన్ పండుగ ఉండటం వల్ల పరీక్ష తేదీలను మార్చటం జరిగిందని పాపిరెడ్డి వెల్లడించారు. చదవండి: సెట్ కన్వీనర్లు ఖరారు -
ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 27 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీజుల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వీలైనంత త్వరగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంసెట్‌కు ఈనెల 24 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే అదే రోజునుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ఫీజుల వ్యవహారంలో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు రావడం, వాటిపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 27 నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయా లేదా అన్నది మరోసారి తెలియజేస్తామని మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27లోగా ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లి, కోర్టులో నిర్ణయం వెలువడితే యథావిధిగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. లేకపోతే కొంత ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. ఈలోగా కాలేజీల అనుబం«ధ గుర్తింపు వస్తుందని, ఫీజులపై స్పష్టత వస్తుందని వివరించారు. ఎంసెట్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్సైట్ (https://tseamcet.nic.in) ఈనెల నుంచి ఈనెల 24 నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే (లేటరల్ ఎంట్రీ) ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈ నెల 22 నుంచి ప్రారంభించేలా షెడ్యూల్ జారీ చేసింది. 24 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. అనుకున్న చోట వెరిఫికేషన్.. వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరింత సులభం కానుంది. ఇప్పటివరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు ఒక్కోసారి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి ఇబ్బందున్నింటికీ చెక్ పెట్టనుంది. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి, తమకు నచ్చిన తేదీల్లో, వీలైన సమయంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేనుంది. విద్యార్థులు తాము స్లాట్ బుక్ చేసుకున్న నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఫీజు చెల్లించి ఈ స్లాట్ బుక్ చేసుకుని, ఆయా హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. -
10లో 9 బాలురవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగం టాప్–10 ర్యాంకుల్లో 9 ర్యాంకులను బాలురే సాధించారు. ఇంజనీరింగ్‌లో టాప్ ర్యాంకును ఏపీకి చెందిన కురిశెట్టి రవి శ్రీతేజ కైవసం చేకున్నాడు. ఇంజనీరింగ్ టాప్ 10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులు సాధించగా మరో ఐదు ర్యాంకులను ఏపీ విద్యార్థులు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో భూపాలపల్లికి చెందిన ఎంపటి కుశ్వంత్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఈ విభాగంలోని టాప్–10 ర్యాంకులను సాధించిన వారిలో ఐదుగురు తెలంగాణ విద్యార్థులు ఉండగా ఏపీ నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ఆదివారం హైదరాబాద్ జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్యతో కలసి ఫలితాలను ఆయన విడుదల చేశారు. 82.47%.. 93.01%.. ఎంసెట్‌కు మొత్తంగా 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,42,210 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, 74,989 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు ఉన్నారు. అగ్రికల్చర్ పరీక్షలకు 1,31,209 మంది హాజరవగా అందులో 1,08,213 మంది (82.47 శాతం) అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు 68,550 మంది హాజరుకాగా, వారిలో 63,758 మంది (93.01 శాతం) అర్హత సాధించారు. విద్యార్థుల ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేశారు. ఈ పరీక్షలను ఆన్లైన్లో పలు దఫాలుగా నిర్వహించినందున నార్మలైజేషన్ చేసి విద్యార్థులకు ర్యాంకులను ఖరారు చేశారు. ఈ ఫలితాల్లో ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల్లో టాప్–10 ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లో టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలను కూడా ప్రకటించారు. 20 తరువాత కౌన్సెలింగ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 తరువాత ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈసారి జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్‌లో 90 వేల వరకే సీట్లు ఉంటాయని తెలిపారు. జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తమ వర్సిటీల పరిధిలో గతేడాది 86 వేల సీట్లు ఉండగా ఈసారి 77,500 వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎంసెట్ టాపర్ల అభిప్రాయాలు ఐఐటీలో సీటు సాధిస్తా.. నాకు ఇంటర్లో 985 మార్కులొచ్చాయి. క్రమపద్ధతిలో చదివినందుకు మంచి ర్యాంకు సాధించా. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 33వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ఐఐటీలో సీటు సాధిస్తా. – చంద్రశేఖర ఎస్ఎస్ హేతహవ్య, ఎంసెట్ రెండో ర్యాంకు కంప్యూటర్ ఇంజనీర్ అవుతా.. నాకు ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 28వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 117వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడం నా లక్ష్యం. – జి.ఆకాశ్‌రెడ్డి, మూడో ర్యాంకు రీసెర్చ్ అంటే ఇష్టం... మా నాన్న నాగవెంకట విశ్వనాథం ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో 10 పాయింట్లు సాధించా. ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 3వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో కూడా 3వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్డ్ ఫలితాల కోసం చూస్తున్నా. నాకు పరిశోధనలంటే ఇష్టం. – భాను దత్త, ఎంసెట్ ఐదో ర్యాంకు ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తా... నాన్న శ్రీనివాస్‌కుమార్ రైల్వేలో సీనియర్ టెక్నికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేయాలనే నా లక్ష్యం. ఇంటర్లో 984 మార్కులు వచ్చాయి. జేఈఈలో 248 ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. – బి.సాయివంశీ, ఎంసెట్ ఆరో ర్యాంకు సివిల్స్ సాధిస్తా... నా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో సివిల్స్‌లో మంచి ఉద్యోగం సంపాదించాలనేది నా లక్ష్యం. జేఈఈ మెయిన్స్‌లో 125వ ర్యాంకు సాధించా. – గౌరిపెద్ది హితేంద్ర కశ్యప్, 8వ ర్యాంకు కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నా... మా నాన్న వెంకట కిరణ్‌కుమార్ న్యూరో సర్జన్, అమ్మ నాగశ్రీదేవీ గృహిణి. పదో తరగతి, ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. ఏపీ ఎంసెట్‌లో 107, నీట్లో 1292 ర్యాంకు వచ్చింది. కార్డియాలజిస్ట్ కావాలనేదే నా లక్ష్యం. – ఎం. వెంకటసాయి అరుణ్ తేజ, మూడో ర్యాంకు న్యూరో సర్జన్ కావడమే జీవితాశయం మా నాన్న లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమ్మ లక్ష్మి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నీట్లో 55వ ర్యాంకు సాధించా. న్యూరో సర్జన్ కావాలనేది నా ఆశయం. – ఎంపటి కుశ్వంత్, ఫస్ట్ ర్యాంకు న్యూరో సర్జన్ అవుతా... మా నాన్న సూర్యభాస్కర రెడ్డి రైల్వే ఉద్యోగి. అమ్మ విజయశాంతి గృహిణి. పదో తరగతిలో 10 గ్రేడ్ పాయింట్లు, ఇంటర్‌లోనూ 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. నీట్లో జాతీయ స్థాయిలో 528 ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో రెండో ర్యాంకు వచ్చింది. న్యూరో సర్జన్ అవుతా. – దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెండో ర్యాంకు -
తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను రెండు గంటల ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి, గంటన్నర ముందునుంచి పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తారు. తెలంగాణలోని 83 కేంద్రాల్లో, ఏపీలోని 11 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో కి హాల్‌టికెట్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులైతే అటెస్ట్ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. -
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన టీఎస్ ఎంసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల కానుంది. 6వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 6 నుండి 9వ తేదీ వరకు దరఖాస్తులలో సవరణ చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదువేల రూపాయలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు, పదివేల రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ పరీక్ష మే 3 నుంచి మే 6 వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1వరకు పరీక్ష ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ మే 8వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా మధ్యాహ్నం 3గంటల నుంచి 6 గంటల పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. నిమిషం ఆలస్యం అయిన పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
బోధన నైపుణ్యాలు, ఆధునిక పరిజ్ఞానాల్లో సహకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. బోధన నైపుణ్యాల పెంపు, ఆధునిక పరిజ్ఞానంలో పరస్పర సహకారం, విద్యార్థులకు విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో తోడ్పాటును అందించేందుకు ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో (ఐఏ సీసీ) గురువారం ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసు కుంది. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ అమెరికా, తెలంగాణలోని వర్సిటీల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందన్నారు. అమెరికా వర్సిటీల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మంచి సిలబస్, విద్యార్థులకు ఉపయోగపడే అంశాలు, బోధనా పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానం వంటి అనేక అంశాలను విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, ఓయూ వీసీ ఎస్.రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాలరెడ్డి, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడారు. -
టీఎస్ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన టీఎస్ పీజీ ఈసెట్ 2018 ఫలితాలు వెలువడ్డాయి. ఉన్నత విద్య మండలి ఛైర్మన్ పాపిరెడ్డి పరీక్షా ఫలితాలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మొత్తం 25,100 మంది దరఖాస్తు చేసుకోగా, 22,461 మంది పరీక్షకు హాజరైయ్యారు. అందులో 20,131 మంది అర్హత సాధించారు. 89.62 శాతం మంది అర్హత సాధించగా అందులో యువకులు 45.56 శాతం, యువతులు 44.06 శాతంగా ఉన్నారు. -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐసెట్ 2018 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్‌లో 90.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. 55,191 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్ష రాయగా, 49,812 మంది అర్హత పొందారు. 15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఐసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు చైర్మన్ పాపిరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గత నెల 23, 24 న ఐసెట్‌ను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వచ్చే నెలనుంచి కాలేజీల విలీన పక్రియ
ఎంజీయూ(నల్లగొండ రూరల్) : వచ్చే నెల నుంచి రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాలల విలీన ప్రక్రియను చేపడతామని రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో నిర్వహించిన రీసెర్చ్ మెథడాలజీ మూడు రోజుల వర్క్ షాప్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1100 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయని, అడ్మిషన్లు లేని డిగ్రీ, పీజీ కాలేజీలు 55, 20 శాతం అడ్మిషన్లు ఉన్న కాలేజీలు150 ఉన్నాయన్నారు. దోస్త్ ఆన్లైన్ (డిగ్రీ అడ్మిషన్లు)అడ్మిషన్లు 4 లక్షల 10 వేల సీట్లు ఉండగా గత ఏడాది 1 లక్ష 80 వేల సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. 400 డిగ్రీ కాలేజీలు అదనంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒక మండలంలో 2, 3 డిగ్రీ కాలేజీల నుంచి పూర్తిస్థాయి అడ్మిషన్లు లేనపుడు వాటిని విలీనం చేయడం వల్లా క్వాలిటి విద్య పెరగడంతో పాటు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కొన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 200 కాలేజీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. 2018–19 కి విద్యార్థులు తరగతి గదుల్లో ఉండాలి.. ఉపాధ్యాయులు బోధించాలే... అనే నినాదంతో ముందుకు పోతామన్నారు. యూనివర్సిటీకి, పరిశ్రమల మధ్య అనుసంధానం ఏర్పడడంతో పాటు అధ్యాపకులకు నైపుణ్యం పెంచేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థికి ఉద్యోగం, ఉపాధి లభించే విధంగా నైపుణ్యాలను పెంచుతామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు బెస్ట్ రీసెర్చ్ అవార్డు ఇస్తామన్నారు. సీబీసీఎస్ విధానం విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. బయోమెట్రిక్ అన్ని కళాశాలల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరానికి చేరుకుంటారని అన్నారు. విద్యపై విద్యార్థులు దృష్టి సారించాలని, తరగతులకు రాకపోతే ఏమాత్రం ఫలితం ఉండదన్నారు. సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు నైపుణ్యం పెంచి ఉద్యోగం, ఉపాధి కల్పించే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతరం ప్రయత్నంతోనే విజయం సాధిస్తామన్నారు. ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. విద్యార్థికి నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవడానికి సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్‌గా రాలేకపోతే దూరవిద్య ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు చదువు పైనే దృష్టి ఉండాలన్నారు. రూరల్ ఎంగేజ్‌మెంట్‌ను రాష్ట్రంలోనే మొదటిసారిగా యూనివర్సిటీలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. పరిశోధన విధానంపై 23, 24, 25 తేదీల్లో 500 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్టార్ ఉమేశ్ కుమార్, రమేష్,రవి, లక్ష్మీ ప్రభా, సరిత, వసంత, తదితరులు పాల్గొన్నారు. అక్రమ నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక యూనివర్సిటీలో జరిగిన అక్రమ అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. నియామకాలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు వెల్లడించారు. -
మే 2 నుంచి 5 వరకు ఎంసెట్
సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ వృత్తి విద్య, సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. 2018–19 విద్యా సంవత్సరంలో అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఎంసెట్‌ను 2018 మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రెండు దఫాలుగా 25 వేల మంది చొప్పున రోజుకు 50 వేల మందికి ఎంసెట్ పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు చెప్పారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం దాదాపు 1.4 లక్షల మంది పరీక్షకు హాజరయ్యే అవకాశముందని, అగ్రికల్చర్ కోసం మరో 50 వేల మంది వరకు హాజరవుతారని వివరించారు. మిగతా సెట్స్ తేదీలను కూడా ప్రకటించారు. ప్రాక్టీస్ కోసం మాక్ టెస్టులు ప్రవేశ పరీక్షలను మొదటిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వ హిస్తున్నందున విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకా శాన్ని కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడ కుండా, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా.. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచే ఆన్లైన్లో మాక్ టెస్టులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇక ఆన్లైన్ ప్రవేశ పరీక్షలను టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారంతో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) నేతృత్వంలో నిర్వహించేలా ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. సెట్స్ కన్వీనర్లను ప్రకటించాక ఆయా సెట్స్ కమిటీలు పరీక్షల నిర్వహణకు టీసీఎస్‌తో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ సమయంలో సెట్స్ ఫీజులు ఖరారు కానున్నాయి. అయితే ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ, జీఎస్టీ నేపథ్యంలో.. ఫీజుల భారం కొంత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పాత కన్వీనర్లకే బాధ్యతలు! ఏయే యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఏయే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. సెట్స్ కన్వీనర్ల ఖరారుపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. కన్వీనర్‌గా నియామకం కోసం ముగ్గురితో కూడిన జాబితాలు ఇవ్వాలని ఆయా వర్సిటీలకు లేఖలు రాసింది. దీంతో ఒక్క ఐసెట్ మినహా మిగతా సెట్స్‌కు సంబంధించిన జాబితాలు ఇప్పటికే ఉన్నత విద్యా మండలికి చేరినట్లు తెలిసింది. అయితే గతంలో సెట్స్‌కు కన్వీనర్లుగా వ్యవహరించిన వారికే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన ఎంసెట్‌కు జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య, పీఈసెట్‌కు వి.సత్యనారాయణ, ఈసెట్‌కు గోవర్ధన్, ఎడ్‌సెట్‌కు మధుమతి, పీజీఈసెట్‌కు సమీనా ఫాతిమా, లాసెట్‌కు ద్వారకానాథ్ కన్వీనర్లుగా బాధ్యత అప్పగించే అవకాశ ముంది. లాసెట్, ఐసెట్ లను నిర్వహించిన కన్వీ నర్లు రిటైరైన నేపథ్యంలో కొత్తవారికి బాధ్యత అప్ప గించే అవకాశముంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని మండలి భావిస్తోంది. పేపర్ లీక్ సమస్యలకు చెక్ జాతీయ స్థాయి పరీక్షలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు తీసుకువచ్చినట్లు పాపిరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలను ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నందున రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విధానం వల్ల పేపర్ లీక్ వంటి ప్రధాన సమస్యలకు చెక్ పెట్టవచ్చన్నారు. -
టీఎస్ ఎంసెట్ కోడ్ విడుదల
-
టీఎస్ ఎంసెట్ కోడ్ విడుదల
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఎంసెట్ కోడ్ జె-1ను ఆయన విడుదల చేశారు.10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 41వేల 163 మంది హాజరుకానున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రి, ఫార్మసీ, వెటర్నరీ పరీక్షకు సుమారు 80వేల మంది హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు 246 పరీక్ష కేంద్రాలు, అగ్రి, ఫార్మాకు 154 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కనిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, హాల్‌టికెట్‌తోపాటు అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకుని వెంట తెచ్చుకోవాలని, పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని పాపిరెడ్డి సూచించారు. -
మే 18న ఐసెట్–2017
⇒ ఈ నెల 21న నోటిఫికేషన్ ⇒ ఏప్రిల్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ⇒ షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించే ఐసెట్–2017 మే 18న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి తెలిపారు. వరంగల్‌లోని కేయూలో మంగళవారం ఆయన ఐసెట్–2017 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఐసెట్–2017 నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేస్తారన్నారు. ఆన్లైన్లో దరఖాసులు స్వీకరిస్తామని, అయితే.. దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తారనే విషయాన్ని నోటిఫికేషన్లో వెల్లడిస్తామని, దరఖాస్తులను అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 6 వరకు ఉంటుందన్నారు. దరఖాస్తు ఫీజు రూ. 350, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉంటుందన్నారు. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 16 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 25 వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో మే 5 వరకు రూ.10వేల అపరాధ రుసుముతో ఈ ఏడాది మే 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. హాల్‌టికెట్ల డౌన్లోడ్ ఏప్రిల్ 24నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఐసెట్ –2017 పరీక్ష మే 18న నిర్వహించనున్నామన్నారు. పరీక్ష అనంతరం ప్రిలిమినరీ కీ మే 21న వెల్లడిస్తామన్నారు. కీ పై మే 27న అభ్యంతరాలను స్వీకరిస్తామని, మే 30న ఫైనల్ కీతో పాటు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఐసెట్‌కు 16 చోట్ల రీజినల్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ ఉన్నాయన్నారు. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ మాట్లాడుతూ ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించబోతుండటం ఇది ఆరవసారి అని అన్నారు. ఈఏడాది ఐసెట్‌కు గత ఏడాది కంటే సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.వి.రంగారావు పాల్గొన్నారు. -
అమ్మాయిలు అదుర్స్
⇒ ఎంసెట్-3 టాప్-10లో ఆరుగురు బాలికలే ⇒ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ⇒ 99.07 శాతం మందికి ర్యాంకులు ⇒ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులకు రేపు సాయంత్రం వరకు గడువు ⇒ రేపటి నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ⇒ బీఫార్మసీలో చేరిన వారికి ఈనెల 20 వరకు అవకాశం సాక్షి, హైదరాబాద్ వైద్య విద్యా కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్-3లో బాలికలు సత్తా చాటారు. టాప్-10లో ఆరుగురు బాలికలు ఉండగా నలుగురు బాలురు ఉన్నారు. ఈనెల 11న నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాలను గురువారం జేఎన్టీయూహెచ్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. మొత్తంగా ఎంసెట్-3లో 99.07% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈనెల 11న నిర్వహించిన ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 56,153 మంది విద్యార్థులకు అవకాశం కల్పించగా... 37,178 మంది పరీక్ష రాశారు. ఇందులో 36,834 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. 70 మంది ఇంటర్ ఫెయిల్ కావడం, 259 మందికి సంబంధించిన ఇంటర్ వివరాలు లభించకపోవడం, మరో 15 మంది ఎంసెట్‌లో అర్హత సాధించకపోవడంతో వారికి ర్యాంకులను ఇవ్వలేదు. ఈసారి ఎంసెట్ ఫలితాల విడుదల కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిగానీ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిగానీ హాజరుకాకపోవడం గమనార్హం. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో తక్కువ సమయంలో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించామని పాపిరెడ్డి పేర్కొన్నారు. కేవలం 40 రోజుల్లోనే నోటిఫికేషన్ మొదలుకుని కాన్ఫిడెన్షియల్ వర్క్, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిని పూర్తిచేసిన ఎంసెట్ కమిటీని అభినందించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇప్పటికే బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో చేరిన వారు ఈనెల 20వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీలు విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని.. వారి సర్టిఫికెట్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఫార ్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో చేరిన విద్యార్థులు వెళ్లిపోతే నష్టం వస్తుందని భావించవద్దని.. ఆయా కాలేజీలకు అలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని చెప్పారు. వేగంగా చేపట్టడం వల్లే తప్పులు. ఇక ఎంసెట్-2 లీకేజీలో ఆరోపణ లు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సంబంధించి కేసు ఫైనల్ కానందున వారిని పరీక్షలకు అనుమతించామని ఎంసెట్-3 కమిటీ చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఎంసెట్-3 పేపర్ రూపకల్పనను అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలో, జాగ్రత్తగా చేశామని... ఆ క్రమంలో 7 ప్రశ్నలకు జవాబుల ఆప్షన్లు రాలేదని, ఒకటి సిలబస్‌లో లేని ప్రశ్న వచ్చిందని తెలిపారు. వీటిపై నిపుణుల కమిటీ సిఫారసు మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక ఎంసెట్-3 ఫైనల్ కీని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. విద్యార్థులు గురువారం రాత్రి నుంచే ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఓఎంఆర్ జవాబు పత్రాలను శుక్రవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. వాటిలో ఏమైనా తేడాలుంటే నిర్ణీత ఫీజు చెల్లించి, ఈనెల 17 సాయంత్రం 5 గంటలలోగా వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఎంసెట్-3 టాపర్లు వీరే.. -
'ముందే సీట్లు అమ్ముకుంటే చర్యలు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. జులై 1 లోపే జేఎన్టీయూ నుంచి కాలేజీల లిస్ట్ వస్తుందని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆప్లియేషన్ లిస్ట్ వచ్చాకే 'బి' కేటగిరి సీట్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముందే ఇంజనీరింగ్ సీట్లు అమ్ముకుంటే ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పాపిరెడ్డి హెచ్చరించారు. -
22 నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
- అందుకు అనుగుణంగా చర్యలు - చేపట్టాలని కడియం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 22వ తేదీ నుంచే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జేఎన్టీయూహెచ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. విజిలెన్స్ విభాగం తనిఖీలు పూర్తి చేసి జేఎన్టీయూహెచ్ నివేదికలతో సరిపోల్చి అనుబంధ గుర్తింపు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని, నెలాఖరులో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని సూచించారు. ఇక మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశంపై వారం తర్వాత మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నట్లు తెలిసింది.